31, ఆగస్టు 2020, సోమవారం

శివామృతలహరి శతకం

.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||
తలవంచన్ బనిలేదు నేనొకరికిన్ తథ్యమ్ముగా తత్కృపా
కలనన్ నీకును తల్లి శాంభవికి దక్కన్ ; దీటులేనట్టి మీ
చలువన్ జెప్పెద సాంప్రదాయికములై జానోందు శాస్త్రార్థముల్
జిలుగుందెల్గున ' జీవభాష యగుటన్ శ్రీ సిద్ధలింగేశ్వరా

*సంస్కృతము దేవభాష అయితే తెలుగు జీవభాష

భావం ; (నేను అర్థం చేసుకున్నది, పండితులు సవరించ గలరు.)

తండ్రీ శివా, నీ కృప వలన, అమ్మ శాంభవి కృప వలన నేను మీకు తప్ప వేరొక కి తలవంచి జీవించాల్సిన పనిలేదు.
అపారమైనటువంటి మీ మహత్యాలను వర్ణించే శాస్త్రా ర్థాలను, జీవ భాష అయిన చక్కటి తెలుగు లో అందరికీ అర్థమయ్యే రీతిలో నేను చెప్తానయ్యా శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

కామెంట్‌లు లేవు: