28, అక్టోబర్ 2021, గురువారం

శ్రీమద్భాగవతము

 *28.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2305(౨౩౦౫)*


*10.1-1444-*


*క. అంకిలి గలుగక మా కక*

*లంకేందుని పగిదిఁ గాంతిలలితంబగు న*

*ప్పంకజనయనుని నెమ్మొగ*

*మింక విలోకింపఁ గలదె యీ జన్మమునన్?"* 🌺



*_భావము: ఏ అవరోధము లేకుండా, మచ్చలేని చంద్రుడిలా ప్రకాశించే కమలనయనుడు, ఆ శ్రీకృష్ణుని ముఖపద్మమును దర్శించే భాగ్యము మాకు ఈ జన్మలో కలుగుతుందా??_* 🙏



*_Meaning: "Are we fortunate enough to have darshan of the spotless Lotus-eyed Sri Krishna without any obstacle or impediment in this birth?"_*🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం

 పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు. గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.


గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.


ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. వారి కథే- శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం. సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో, ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు. కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.


తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు. ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుంటుంది. రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు! తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.


ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- ‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది. నా కంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!


ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, వారి బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి.


*ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం- ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి? ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం. గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది.*


*లోకంలో ఇలాంటి కథలు ఒళ్లు మరిపించడమే కాదు, కళ్లు తెరుచుకొనేలా చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు.*


🙏దయచేసి ఇలాంటి నీతికధలను తప్పకుండ ముందుతరాలకు పంచండి

యోగీశ్వరుడైన "శ్రీకృష్ణుడు….

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*యోగీశ్వరుడైన "శ్రీకృష్ణుడు….”*


     *భగవద్గీత లో ఇలా అన్నాడు...*

                ➖➖➖✍️


         *పత్రం పుష్పం ఫలం తోయం*

         *యోమే భక్త్యా ప్రయచ్ఛతి*

         *తదహం భక్త్యుపహృతం*

         *అశ్నామి ప్రియతాత్మనః*


*"ఎవరైతే నాకు పత్రమైనను., పుష్పమైనను., ఫలమైనను., చివరకు ఉదకమైనను భక్తితో సమర్పిస్తారో..., వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తాను’ అది పై శ్లోకం తాత్పర్యం!*


*భగవంతుడికి మనం చేసే చిన్న పాటి సేవ కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.*


*ధూప, దీప, పుష్ప, గంధాలతో మనం పరమాత్మకు ప్రతిరోజూ చేసే పూజ కూడా ఎంతో గొప్ప భగవద్ అనుగ్రహాన్ని వర్షిస్తుంది.*


*తెలిసి చేసినా, తెలియక చేసినా సరే మనం చేసే చిన్నపాటి సేవకి పరమాత్మ విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు.*


*జగద్గురు శ్రీ ప్రభుపాదాచార్యుల వారిని ఒకసారి ఒక శిష్యుడు ఒక ప్రశ్న అడిగాడు....*


*“మీరు ప్రతిరోజూ కృష్ణుడి పాదాలమీద పువ్వుల తో పూజ చేస్తున్నారు కదా, ఒకరోజు తర్వాత వాడిపోతుంది. మరి ఆ పువ్వు పొందే ప్రయోజనం ఏమిటి?”*


*దానికి జగద్గురువులు ఇలా సమాధానం ఇచ్చారు...*


*“ఈ పువ్వు ఏ మొక్క నుంచి వచ్చిందో, ఆ మొక్కలోనున్న జీవుడు వచ్చే జన్మలో ఉత్కృష్టమైన మానవ జన్మని పొందుతుంది".*


*దీనికి పురాణంలో ఒక కథ కూడా ఉంది.*


*ఒక వూరిలో పాడుబడ్డ దేవాలయం మీద ఒక పక్షి ఎగురుతూ వెళ్ళింది. అది అలా ఎగిరి వెళ్లడంలో దాని రెక్కల నుంచి వచ్చిన గాలికి గోపురం మీద ఉన్న ధూళి తొలిగి శుభ్రపడింది.*


*తెలియక చేసినా కూడా అదొక గొప్ప భగవద్ సేవ. తర్వాతి జన్మలో ఆ పక్షి లోని జీవుడు ఒక రాజకుమారుడిగా జన్మించాడు.*


*ఎప్పుడో ఒక్కసారి చేస్తేనే పరమాత్మ అంత అనుగ్రహిస్తే, అదే మనం నిరంతరం శ్రీమన్నారాయణుడి పాద పద్మములను సేవిస్తే మనల్ని రక్షించడా స్వామి?*


*తప్పక అనుగ్రహిస్తాడు. జీవరాసులలో మానవజన్మ పరమోత్కృష్టమైన జన్మ. మోక్ష సాధనకి మానవ జన్మే చిట్టచివరి జన్మ అవుతుంది.*✍️


                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సూర్యకాంతం

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకొంది.

సినీమాలలో

మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియబరచిన మీదట 75 రూపాయలు చేశారు. తరువాత ధర్మాంగద (1949)లో ఆమెది మూగవేషం. ధర్మాంగద టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించు కొంది.

ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.

అసలు సంసారం చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాక ముందే ఇంకొక హీరోయిన్ ను పెట్టుకొని తీశేసారని తెలియడంతో, "ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను" అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి.నాగిరెడ్డి, చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు.

ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి - సూర్యకాంతం, రమణారెడ్డి - సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు - సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే అందులో సూర్యకాంతం వుందా? అని ప్రేక్షకులూ, తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా? అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ - ఎదురు చూసేవారు. చక్రపాణి (1954), దొంగరాముడు (1955), చిరంజీవులు (1956), తోడికోడళ్లు (1957), అత్తా ఒకింటి కోడలే (1958), ఇల్లరికం (1959), భార్యాభర్తలు (1961), గుండమ్మకథ (1962), కులగోత్రాలు (1962), దాగుడుమూతలు (1964), అత్తగారు-కొత్తకోడలు, మూహూర్తబలం (1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది.

సూర్యకాంతాన్ని హాస్యనటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.

వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాళి కానేకాదు - మామూలు మనిషే. ఏ సమావేశాలకో, సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్లినప్పుడు ఆటోగ్రాపులకోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరకి వెళ్లడానికి భయపడేవారు. ఐతే ఆమె నికార్సయిన మనిషి, కచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపునిండా తినేది, పదిమందికీ పెట్టేది. షూటింగ్‌కి వచ్చినప్పుడల్లా - తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి, కృష్ణకుమారి, జానకి వంటి నటీమణులకీ వుండేది. విశేష దినాలూ, పండగపబ్బాలూవస్తే సరేసరి!

షూటింగుల్లో జోకులు చెప్పడం, సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగులో బయట కేకలు వినిపిస్తున్నాయని ‘సైలెన్స్‌! అవుట్‌సైడ్‌’ అని ప్రొడక్షన్‌ మేనేజర్‌ గట్టిగా అరిచాడు. ఫ్లోర్‌లో వున్న సూర్యకాంతం ‘ఓ!’ అని అంతకన్నా గట్టిగా అరిచింది. ‘ఏమిటమ్మా?’ అని అడిగితే, ‘సైలెన్స్‌ అవుట్‌ సైడ్‌ - అని గదా అన్నారు!’ అందామె నవ్విస్తూ. అలాంటి అల్లరి వుండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్యను నానామాటలూ అని, నోటికొచ్చిన తిట్లు తిట్టాలి. షాట్‌ అయిపోయాక ఆయన కాళ్లమీద పడి ‘అపరాధం - క్షమించండి!’ అని వేడుకుంది. ‘పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావూ? లే!-’ అని నాగయ్య లేవనెత్తితే, కన్నీళ్లు తుడుచుకున్న భక్తీ, సెంటిమెంటూ ఆమెవి. దబాయింపూ, కచ్చితత్వమూ ఉన్న మనిషే అయినా, మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్లకి ఆర్థికసహాయం చేసేదిగాని అనవసరం అనిపిస్తే మాత్రం ‘పూచికపుల్ల’ కూడా విదిలించేది కాదు.

మొహమాటపడకుండా తనకి రావాల్సిన పారితోషకాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది. ఆమె అందర్నీ నమ్మేది కాదు. తన కారు రిపేరుకొస్తే ఎంత పెద్ద రిపేరైనా, మెకానిక్‌ ఇంటికొచ్చి తన కళ్లముందు చెయ్యవలసిందే - ఎంత ‘ఎక్స్‌ట్రా మనీ’ అయినా తీసుకోనీగాక! చివరి దశలో వేషాలు తగ్గిపోయినా, చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది. తన ఆరోగ్యం బాగులేకపోయినా, ‘నటిస్తాను’ అని ధైర్యంగా చెప్పేది.

17డిసెంబరు 1996న స్వర్గస్తులైనారు. 

 ప్రముఖ నటీమణి సూర్యకాంతంగారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ...💐💐💐🙏🙏🙏

మహాభారత కాలంలోనే ....

 🌹🌿🍃🍁🍁🍃🌿🌹


        మహాభారత కాలంలోనే ....

                                  టేప్ రికార్డర్...!

                       ➖➖➖✍️️


    *విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది?* 🌹🙏🙏🌹



       భీష్మపితామహుడు. 'విష్ణు సహస్ర నామం' పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు- కృష్ణుడు, ధర్మరాజుతో సహా, కాని ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన... విష్ణు సహస్రనామం ?


        అది 1940వ సంవత్సరం! శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా కంచి పరమచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఇంటర్‌వ్యూ చేయడానికి టేప్ రికార్డర్‌తో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ టేప్ రికార్డర్‌ చూసి స్వామి వారు... ఆ వ్యక్తిని, అక్కడున్న వారినందరినీ ఉద్దేశించి., "ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్‌ ఏది?" అని అడిగారు.


        ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు. మళ్ళీ స్వామివారు, "విష్ణు సహస్రనామం మనకెలా వచ్చింది?" అని అడిగారు.


ఒకరన్నారు, "భీష్ముడందించారన్నారు"


     స్వామివారు, "మరి భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు వ్రాసుకున్నారు?"


   మళ్ళీ నిశబ్దం!


          స్వామివారు చెప్పడం మొదలు పెట్టారు. " భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్తుతిస్తున్నప్పుడు, కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ అత్యంత శ్రద్ధగా వినడం మెదలుపెట్టారు. ఎవరూ వ్రాసుకోలేదు.

అప్పుడు యుధిష్టురుడన్నాడు.... "ఈ వేయి నామాలని మనమంతా విన్నాము కాని మనమెవరం వ్రాసుకోలేదు.ఇపుడు ఎలా కృష్ణా?" అని!


 "అవును కృష్ణా ఇప్పుడెలా! ఆ సహస్ర నామాలు మాకందరికీ కావాలి!" అని అందరూ కృష్ణుడిని వేడుకున్నారు.


     అపుడు శ్రీ కృష్ణుడన్నాడు. "అది... కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది" అని చెప్పాడు.


   "అదెలా" అని అందరూ అడిగారు.


    శ్రీ కృష్ణుడు చెప్పాడు, "మనందరిలో సహదేవుడొక్కడే సూత స్పటికం... వేసుకున్నాడు. ఈ స్పటికం మహేశ్వర స్వరూపం! దీని ప్రత్యేకతేంటంటే.... వాతావరణంలోని శబ్ద తరంగాలని గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ప్రార్ధిస్తే ఈ స్పటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి (రిప్లే) వ్యాస మహర్షితో వ్రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు.


      శ్రీ కృష్ణుడి ఆజ్ఞ మేరకు, ఆ సహస్ర నామ శబ్దతరంగాలు వచ్చిన చోట అనగా .... భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాసమహర్షి కూర్చుని, ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రీప్లే అవుతూంటే వ్యాస మహర్షి వ్రాసి పెట్టాడు!"


  ఆవిధంగా మనకు మొట్టమొదటి టేప్ రికర్డర్ శివస్వరూప స్పటికం ద్వారా మనకి విష్ణు సహస్రనామం అందిందని మహాస్వామి వారు సెలవిచ్చారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥




#KanchiParamacharyaVaibhavam

*# కంచి పరమాచర్య స్వామి వైభవం#*


                   🌷🙏🌷


   🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు*🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺

యాపిల్ తినడం వలన

 యాపిల్ తినడం వలన కలిగే ప్రయోజనాలు - 


    యాపిల్ లో మంచి విటమిన్స్ ఉన్నాయి . ఒక యాపిల్ లో ఒక మిల్లీగ్రాము ఇనుము. పద్నాలుగు మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ , పది మిల్లీగ్రాముల కాల్షియం మరియు A విటమిన్ కూడా ఉన్నది. ప్రతిరోజు ఒక యాపిల్ తినడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు. 


 * యాపిల్ రక్తక్షీణతని నివారిస్తుంది. రక్తక్షీణత కలవారు రోజుకి మూడు యాపిల్స్ తీసుకొవడం చాలా మంచిది.


 * మలబద్దకం నివారణ అవుతుంది. శరీరంకి కావలసినంత బలం ని ఇస్తుంది.


 * రక్త,బంక విరేచనాలు అవుతున్నవారు యాపిల్ జ్యూస్ తీసుకొవడం వలన అందులో ఉండే పిండిపదార్ధాలు విరేచనాలు లొని నీటిశాతాన్ని తగ్గించడం వలన విరేచనాలు తగ్గుతాయి . యాపిల్ ముక్కలని ఉడికించి తీసుకుంటే ఇంకా మంచిది. 


 * చంటిపిల్లలకు విరేచనాలు అవుతున్నప్పుడు ఒక చెంచా యాపిల్ జ్యూస్ ఇవ్వడం వలన విరేచనాలు కట్టుకుంటాయి.


 * యాపిల్ జ్యూస్ లో యాలుకలు , తేనే కూడా కలుపుకుని తీసుకుంటూ ఉంటే కడుపులో మంట ప్రేగుల్లో పూత , అజీర్తి , గ్యాస్ట్రబుల్ , పుల్లనితేపులు , గుండెల్లో మంట నివారించబడును. 


 * యాపిల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన మరియు పొటాషియం ఎక్కువుగా ఉండటం వలన బీపీ తో పాటు అన్ని హృదయవ్యాధులు , మూత్రపిండాల వ్యాధులు నివారించబడతాయి. మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు రోజు యాపిల్ జ్యూస్ తాగుతుంటే రాళ్లు కరిగిపోతాయి . 


 * తరచుగా యాపిల్ తింటూ ఉంటే తరచుగా వచ్చే జ్వరాలు అరికడతాయి.


 * పక్షవాతం , నాడీసంబంధ వ్యాధులు కలవారికి మెదడు వ్యాధులు కలవారికి యాపిల్ చాలా మేలు చేస్తుంది . 


 * రోజు యాపిల్ జ్యూస్ సేవించడం వలన కడుపులో మంట, మూత్రంలో మంట ఉండదు.


 * కామెర్ల వ్యాధి సోకినప్పుడు వీలయినంత ఎక్కువ యాపిల్ రసాన్ని తాగుతుంటే లివర్ ని సంరక్షిస్తుంది.


 * యాపిల్ కి కఫాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. జలుబు , దగ్గు , ఆయాసం వీటిని నివారిస్తుంది. 


 * యాపిల్ జ్యూస్ లైంగిక శక్తిని పెంచుతుంది . నీరసాన్ని , అలసటని రానివ్వదు.


 * యాపిల్ ముక్కలుగా కోసి ఉడికించి రోజు తింటూ ఉంటే బొల్లిమచ్చలు నివారణ అవుతాయి. శరీరం కాంతివంతం అవుతుంది. 


 * యాపిల్ చెట్టు యొక్క వ్రేళ్ళ రసాన్ని తాగితే కడుపులో ఏలికపాములు నివారణ అగును.


 

  గమనిక - 


       షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం యాపిల్ తీసుకోరాదు .


  

    

సంస్కృత మహాభాగవతం*

 *28.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పందొమ్మిదవ అధ్యాయము*


*జ్ఞాన-భక్తి-యమనియమాది సాధనముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*19.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*యదాత్మన్యర్పితం చిత్తం శాంతం సత్త్వోపబృంహితమ్|*


*ధర్మం జ్ఞానం సవైరాగ్యమైశ్వర్యం చాభిపద్యతే॥12985॥*


ఈ ధర్మములను పాటించువాని యొక్క చిత్తమునందు సత్త్వగుణము వృద్ధిచెందును. అప్పుడు అతడు ప్రశాంతచిత్తుడై తన ఆత్మను నాయందే లగ్నము చేయును. అంతట సాధకునకు భక్తి, ధర్మ, జ్ఞాన, వైరాగ్య - ఐశ్వర్యములు సహజముగా అబ్బును.


*19.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*యదర్పితం తద్వికల్పే ఇంద్రియైః పరిధావతి|*


*రజస్వలం చాసన్నిష్ఠం చిత్తం విద్ధి విపర్యయమ్॥12986॥*


మనస్సు సాంసారికమైన సంకల్ప - వికల్పములలో మునిగి, ఇంద్రియములను తనవెంట తీసికొని పరుగెత్తును. వెంటనే ఆ మనస్సునందు రజోగుణము వ్యాపించును. అప్పుడు చిత్తము అసత్పదార్థములను చింతించుటలో మునిగిపోవును. తత్పలితముగ అది తన స్వస్వరూపమునుండి తొలగిపోవును.


*19.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*ధర్మో మద్భక్తికృత్ప్రోక్తో జ్ఞానం చైకాత్మ్యదర్శనమ్|*


*గుణేష్వసంగో వైరాగ్యమైశ్వర్యం చాణిమాదయః॥12987॥*


ఉద్ధవా! నా యందు భక్తి కలుగుటయే ధర్మము. ఆత్మపరమాత్మల ఏకాత్మ (ఐక్యతా) భావము కలుగుటయే జ్ఞానము. విషయములయెడ అనాసక్తియే వైరాగ్యము, అణిమాది సిద్ధులే ఐశ్వర్యము.


*ఉద్ధవ ఉవాచ*


*19.28(ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*యమః కతి విధః ప్రోక్తో నియమో వాఽరికర్శన|*


*కః శమః కో దమః కృష్ణ కా తితిక్షా ధృతిః ప్రభో॥12988॥*


*19.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*కిం దానం కిం తపః శౌర్యం కిం సత్యమృతముచ్యతే|*


*కస్త్యాగః కిం ధనం చేష్టం కో యజ్ఞః కా చ దక్షిణా॥12989॥*


*ఉద్ధవుడు పలికెను* అరిసూదనా! కృష్ణా! యమ, నియమాదులు ఎన్నివిధములు? శమ, దమములు అనగా ఏమి? ప్రభూ! తితిక్ష అని దేనిని అందురు? ధృతి అని దేనికి పేరు? దానము, తపస్సు, శౌర్యము, సత్యము, ఋతము అంటే ఏమిటి? త్యాగము అనగా ఎట్టిది? అభీష్టమైన ధనమేది? యజ్ఞము అని దేనిని అందురు? దక్షిణ అని దేనికి పేరు?


*19.30 (ముప్పదియవ శ్లోకము)*


*పుంసః కింస్విద్బలం శ్రీమన్ భగో లాభశ్చ కేశవ|*


*కా విద్యా హ్రీః పరా కా శ్రీః కిం సుఖం దుఃఖమేవ చ॥12990॥*


పురుషునకు నిజమైన బలమేది? భగుమనగా నేమి? లాభమనగా ఎట్టిది? ఉత్తమ విద్య, లజ్జ, శ్రీ, సుఖదుఃఖములు అనగా ఏమి?


*19.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*కః పండితః కశ్చ మూర్ఖః కః పంథా ఉత్పథశ్చ కః|*


*కః స్వర్గో నరకః కః స్విత్కో బంధురుత కిం గృహమ్॥12991॥*


*19.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*క ఆఢ్యః కో దరిద్రో వా కృపణః కః క ఈశ్వరః|*


*ఏతాన్ ప్రశ్నాన్ మమ బ్రూహి విపరీతాంశ్చ సత్పతే॥12992॥*


ఎట్టివాడు పండితుడు? మూర్ఖుడు అనగా ఎవడు? సన్మార్గము అనగా ఎట్టిది? దుర్మార్గలక్షణమేమి? స్వర్గము, నరకము అని వేటిని అందురు? బంధుమిత్రులు అనగా ఎట్టివారు? గృహము అనగా ఏమి? ధనవంతుడు ఎవరు? నిర్ధనుడు ఎవరు? కృపణుడు ఎవరు? ఈశ్వరుడు అని ఎవరిని అందురు? దయామయా! నా ఈ ప్రశ్నలకు సమాధానమిమ్ము. అంతేగాదు, వాటికి విరుద్ధములైన భావములనుగూడ విశదీకరింపుము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పందొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*478వ నామ మంత్రము* 28.10.2021


*ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః* 


ఖట్వాంగము మొదలైన ఆయుధాలు ధరించి విశుద్ధిచక్రనిలయ అధిష్ఠాన దేవతయైన డాకినీ స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ఖట్వాంగాది ప్రహరణా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి వారి సాధనాపటిమను పెంపొందింపజేసి, సాధనయందు ఆత్మానందానుభూతిని అనుగ్రహించును.


*విశుద్ధిచక్రనిలయా* యను లలితా సహస్ర నామావళి యందలి నాలుగువందల డెబ్బదియైదవ (475వ) నామ మంత్రము నుండి నాలుగువందల ఎనుబది నాలుగవ (484వ) నామ మంత్రమువరకూ, విశుద్ధిచక్రము (పదహారు దళాల పద్మము) అధిష్ఠానదేవత యొక్క వర్ణము (శరీరవర్ణము), త్రిలోచనములు, ఆయుధములు, శిరస్సులు, పాయసాన్నము నందు ఇష్టము, చర్మధాతువునందుండునదనియు, పశులోకమునకు భయంకరియైన డాకినీశ్వరి యని చెప్పబడినది. అనగా డాకినీ ఈశ్వరిస్వరూపిణియైన పరమేశ్వరి యొక్క వివరములు చెప్పబడినవి. 


ఈ నామ మంత్రములో డాకినీ ఈశ్వరియొక్క ఆయుధములైన ఖట్వాంగము అనగా మంచంకోడు. ఇంకా చెప్పాలంటే ఖట్వాంగము అనగా కర్రపై బోర్లించబడిన మానవ కపాలము (పుర్రె). ఖట్వాంగాది అనగా ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, మహాచర్మము అను నాలుగు ఆయుధములను, నాలుగుచేతులందు ధరించియున్నదని అర్థము. అమ్మవారు సకలదేవతా స్వరూపిణి. మానవ శరీరమందు గల షట్చక్రములు మరియు సహస్రారముల (సప్తమ చక్రమునకు) అధిష్ఠానదేవతలు అయిన డాకినీ, రాకినీ, లాకినీ, కాకినీ, సాకినీ, హాకినీ, యాకినీ స్వరూపములలో విలసిల్లుచున్నది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీమద్భాగవతము

 *27.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2304(౨౩౦v)*


*10.1-1443-*


*శా. అన్నా! భద్రమె? తల్లిదండ్రుల మమున్ హర్షించి చింతించునే?*

*తన్నుం బాసిన గోపగోపికల మిత్రవ్రాతమున్ గోగణం*

*బు న్నిత్యంబు దలంచునే? వన నదీ భూముల్ ప్రసంగించునే?*

*వెన్నుం డెన్నఁడు వచ్చు నయ్య! యిట మా వ్రేపల్లెకు న్నుద్ధవా?* 🌺



*_భావము: అన్నా! ఉద్ధవా! శ్రీకృష్ణుడు ఆనందంగా మా గురించి, తల్లితండ్రులుగా, తలుచుకొంటూ ఉంటాడా? ఎడబాటు లో ఉన్న గోప గోపీజనములను, తోటిపిల్లలను, ఆలమందలను రోజూ ఎప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉంటాడా? ఈ బృందావనాన్ని, ఆ యమునానది గురించి ఎప్పుడన్నా ప్రస్తావిస్తాడా? అసలా వెన్నదొంగ ఈ మా వ్రేపల్లెకు ఎప్పుడన్నా వస్తాడా?"* 🙏



*_Meaning: “Hey Uddhava! Does Sri Krishna ever happily remember us as His parents? Does He recollect His association with the men, womenfolk and the herd of cows? Does He make a mention of this Brindavan and this River Yamuna at any point of time? Would He ever come back to Vrepalle?”_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

శ్రీమద్వాల్మీకి రామాయణం

 ॐ    శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 


(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం)

                ----------------------- 


          7. భౌతిక శాస్త్రాలు 


      ఐన్ స్టీన్, రూథర్ ఫర్డ్ వంటి  శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేసి కొత్తకొత్త విషయాలు కనుగొన్నారు. 

     తద్వారా తరువాతి తరాలు పరిశోధనలు కొనసాగించే విధంగా మార్గం చూపారు. 

     అనేకమంది శాస్త్రవేత్తలు నిరంతరమూ పరిశోధిస్తూ, క్షిపణులవంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని నిరంతరమూ అభివృద్ధి చేస్తున్నారు. 


      శ్రీమద్వాల్మీకి రామాయణంలో అభివృద్ధి చెందిన  భౌతిక విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానాన్ని అబ్బురపరచేదిగా మనం దర్శించగల్గుతాం. 


శస్త్ర - అస్త్ర పరిజ్ఞానం 


      విశ్వామిత్రుడు శ్రీరామునికి శస్త్రపరిజ్ఞానం అంతా అందించాడు. 

      ధర్మచక్ర, 

      కాలచక్ర, 

      విష్ణుచక్ర వంటి చక్రాలనీ, 


      శివుని శ్రేష్ఠమైన శూలాన్నీ, 


      మోదకి,శిఖరి అనే ప్రజ్జ్వరిల్లే రెండు గదలనీ, 

      శుష్కము - ఆర్ద్రము అనే రెండు పిడుగులనీ, రెండు శక్తులనీ, 

      కంకణమనే ముసలాన్నీ గ్రహింపమని 

  - శ్రీరామునికి విశ్వామిత్రుడు శస్త్రాలని అందించాడు. 

(గమనిక : శస్త్రము - పదునైన ఆయుధము)


      ఐంద్ర, బ్రహ్మాస్త్రాల వంటి మంత్రపూరితంగా విడిచే అస్త్రాలనీ కూడా విశ్వామిత్రుడు శ్రీరామునికి ఉపదేశించాడు. 

(గమనిక: అస్త్రము - మంత్రపూరితమైనది) 


అస్త్ర ఉపసంహారం 


    రెండవ ప్రపంచ యుద్ధంలో, హిరోషిమా నాగసాకి నగరాలపై అమెరికా ప్రయోగించిన అణుబాంబుల ప్రయోగ విషఫలితాలు అందఱికీ తెలిసినవే కదా!  

     అస్త్రాన్ని ప్రయోగిస్తే, దాన్ని తిరిగి ఉపసంహరించడం అనేది ఇప్పటివరకూ ఎవరూ కనుగొనలేక పోవడం గమనించవలసిన విషయం. 


      కానీ పైన పేర్కొన్న అస్త్రశస్త్రాలని స్వీకరించిన శ్రీరాముడు, వాటి ఉపసంహారం కూడా విశ్వామిత్రుని నుండి అడిగి తెలుసుకున్నాడు. 

      శ్రీరాముడు వాటి ప్రయోగాన్నీ, ఉపసంహారాన్నీ రెంటినీ అనేక సందర్భాలలో ధర్మబద్ధంగా ఉపయోగించాడు. 

      కాకాసురుని పై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, దాని ప్రాణాలు పోకుండా అవయవలోపంతో సరిపెట్టి కాపాడడం ప్రయోగ - ఉపసంహారాలకి గొప్ప ఉదాహరణ. 


ఆయుధాల ప్రయోగం - విరుగుడు


    అస్త్ర శస్త్రాలలో, ఒకరిచేత ప్రయోగింపబడినదానిని నిర్వీర్యంచేస్తూ, విరుగుడుగా ప్రత్యర్థిచేత మరొకటి విజయవంతంగా ప్రయోగించబడడం శ్రీమద్రామాయణంలో మనకి అనేకసార్లు కనిపిస్తుంది. 


    శక్తి అనే ఆయుధాన్ని రావణుడు ప్రయోగిస్తే, ఒక్కొక్కసారి 

  - దానంతటదే వెనుదిరగడం, 

  - విభీషణునిపై పడడాన్ని లక్ష్మణుడు ఎదుర్కొని నిర్వీర్యం చేయడం, 

  - లక్ష్మణుని శరీరంలోకి దిగి మూర్ఛిల్లితే, 

     రాముడు దానిని భౌతికంగా తొలగించగా, 

     సుషేణుని ఓషధి చికిత్సతో లక్ష్మణుడు పూర్తి స్వస్థత పొందడం కూడా గమనార్హం. 


      అస్త్ర - శస్త్రాల ద్వారా గొప్ప ఫలితాలు పొందడం, ఆనాటి భౌతిక శాస్త్ర విజ్ఞానం ఎంత ఆదర్శంగా నిలచిందో తెలుస్తుంది కదా!


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం