5, జులై 2025, శనివారం

తెలుగు అక్షరాలు

 🔴తెలుగు అక్షరాలు.🔴

🚩🚩ఉత్పత్తి స్థానములు

ఉత్పత్తి స్థానములు

కంఠ్యములు : కంఠము నుండి పుట్టినవి - అ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ.

తాలవ్యములు : దవడల నుండి పుట్టినవి - ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ.

మూర్ధన్యములు : అంగిలి పైభాగము నుండి పుట్టినవి - ఋ, ౠ, ట, ఠ, డ, ఢ, ణ, ష, ఱ, ర.

దంత్యములు : దంతముల నుండి పుట్టినవి - త, థ, ద, ధ, న, ౘ, ౙ, ర, ల, స.

ఓష్ఠ్యములు : పెదవుల|పెదవి నుండి పుట్టినవి - ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ.

నాసిక్యములు (అనునాసికములు) : నాసిక నుండి పుట్టినవి - ఙ, ఞ, ణ, న, మ.

కంఠతాలవ్యములు : కంఠము, తాలువుల నుండి పుట్టినవి - ఎ, ఏ, ఐ.

కంఠోష్ఠ్యములు : కంఠము, పెదవుల నుండి పుట్టినవి - ఒ, ఓ, ఔ.

దంత్యోష్ఠ్యములు : దంతము, పెదవుల నుండి పుట్టినవి - వ.

ఆధునిక భాషలో వాడుకలో ఉన్న వర్ణమాల

అచ్చులు (12) : అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ,

పూర్ణ బిందువు (1) : అం ( అంగడి)

నకారపొల్లు (1) : క్ (రవినాయక్)

హల్లులు (34) :

క వర్గము - క, ఖ, గ, ఘ

చ వర్గము - చ, ఛ, జ, ఝ

ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ

త వర్గము - త, థ, ద, ధ, న

ప వర్గము - ప, ఫ, బ, భ, మ

య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, ఱ

గుణింతాలు

తెలుగులో, ఒక్కొక్క అక్షరానికి గుణింతాలు ఉన్నాయి."క" అక్షరానికి గుణింతాలు: క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః

అచ్చులు హల్లులతో కలియునప్పుడు అచ్చులకు వచ్చే రూపభేదములు, వాటి నామములు

అచ్చులు ఆకారము( లేక ) గుర్తు నామములు గుణింతము చదువుట నేర్చుకొనుట

అ ✓ అకారము క్+అ=క కకార అకరముల క

ఆ ా ఆకారము క్+ఆ=కా కకార ఆకరముల కా

ఇ ి ఇకారము క్+ఇ=కి కకార ఇకరముల కి

ఈ ీ ఈకారము క్+ఈ=కీ కకార ఈకరముల కీ

ఉ ు ఉకారము క్+ఉ=కు కకార ఉకరముల కు

ఊ ూ ఊకారము క్+ఊ=కూ కకార ఊకరముల కూ

ఋ ృ ఋకారము క్+ఋ=కృ కకార ఋకరముల కృ

ౠ ౄ ౠకారము క్+ౠ=కౄ కకార ౠకరముల కౄ

ఎ ె ఎకారము క్+ఎ=కె కకార ఎకరముల కె

ఏ ే ఏకారము క్+ఏ=కే కకార ఏకరముల కే

ఐ ై ఐకారము క్+ఐ=కై కకార ఐకరముల కై

ఒ ొ ఒకారము క్+ఒ=కొ కకార ఒకరముల కొ

ఓ ో ఓకారము క్+ఓ=కో కకార ఓకరముల కో

ఔ ౌ ఔకారము క్+ఔ=కౌ కకార ఔకరముల కౌ

అం ం పూర్ణానుస్వారము క్+ం=కం కకార పూర్ణానుస్వారము కం

అః ః విసర్గ క్+ః=కః కకార విసర్గ కః

పైన చెప్పిన విధముగా ఈ క్రింది గుణింతములను చదివినచో తెలుగును చక్కగా చదువుట, వ్రాయుట వచ్చును.

గుణింతం

అచ్చులు అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః

అకారముల

గుర్తు

✓ ా ి ీ ు ూ ృ ౄ ె ే ై ొ ో ౌ ం ః

అకారముల

ఉచ్చారణ

అ కారము ఆ కారము ఇ కారము ఈ కారము ఉ కారము ఊ కారము ఋ కారము ౠ కారము ఎ కారము ఏ కారము ఐ కారము ఒ కారము ఓ కారము ఔ కారము పూర్ణాను స్వారము విసర్గం

క గుణింతము క కా కి కీ కు కూ కృ కౄ కె కే కై కొ కో కౌ కం కః

ఖ గుణింతము ఖ ఖా ఖి ఖీ ఖు ఖూ ఖృ ఖౄ ఖె ఖే ఖై ఖొ ఖో ఖౌ ఖం ఖః

గ గుణింతము గ గా గి గీ గు గూ గృ గౄ గె గే గై గొ గో గౌ గం గః

ఘ గుణింతము ఘ ఘా ఘి ఘీ ఘు ఘూ ఘృ ఘౄ ఘె ఘే ఘై ఘొ ఘో ఘౌ ఘం ఘః

చ గుణింతము చ చా చి చీ చు చూ చృ చౄ చె చే చై చొ చో చౌ చం చః

ఛ గుణింతము ఛ ఛా ఛి ఛీ ఛు ఛూ ఛృ ఛౄ ఛె ఛే ఛై ఛొ ఛో ఛౌ ఛం ఛః

జ గుణింతము జ జా జి జీ జు జూ జృ జౄ జె జే జై జొ జో జౌ జం జః

ఝ గుణింతము ఝ ఝా ఝి ఝీ ఝు ఝూ ఝృ ఝౄ ఝె ఝే ఝై ఝొ ఝో ఝౌ ఝం ఝః

ట గుణింతము ట టా టి టీ టు టూ టృ టౄ టె టే టై టొ టో టౌ టం టః

ఠ గుణింతము ఠ ఠా ఠి ఠీ ఠు ఠూ ఠృ ఠౄ ఠె ఠే ఠై ఠొ ఠో ఠౌ ఠం ఠః

డ గుణింతము డ డా డి డీ డు డూ డృ డౄ డె డే డై డొ డో డౌ డం డః

ఢ గుణింతము ఢ ఢా ఢి ఢీ ఢు ఢూ ఢృ ఢౄ ఢె ఢే ఢై ఢొ ఢో ఢౌ ఢం ఢః

ణ గుణింతము ణ ణా ణి ణీ ణు ణూ ణృ ణౄ ణె ణే ణై ణొ ణో ణౌ ణం ణః

త గుణింతము త తా తి తీ తు తూ తృ తౄ తె తే తై తొ తో తౌ తం తః

థ గుణింతము థ థా థి థీ థు థూ థృ థౄ థె థే థై థొ థో థౌ థం థః

ద గుణింతము ద దా ది దీ దు దూ దృ దౄ దె దే దై దొ దో దౌ దం దః

ధ గుణింతము ధ ధా ధి ధీ ధు ధూ ధృ ధౄ ధె ధే ధై ధొ ధో ధౌ ధం ధః

న గుణింతము న నా ని నీ ను నూ నృ నౄ నె నే నై నొ నో నౌ నం నః

ప గుణింతము ప పా పి పీ పు పూ పృ పౄ పె పే పై పొ పో పౌ పం పః

ఫ గుణింతము ఫ ఫా ఫి ఫీ ఫు ఫూ ఫృ ఫౄ ఫె ఫే ఫై ఫొ ఫో ఫౌ ఫం ఫః

బ గుణింతము బ బా బి బీ బు బూ బృ బౄ బె బే బై బొ బో బౌ బం బః

భ గుణింతము భ భా భి భీ భు భూ భృ భౄ భె భే భై భొ భో భౌ భం భః

మ గుణింతము మ మా మి మీ ము మూ మృ మౄ మె మే మై మొ మో మౌ మం మః

య గుణింతము య యా యి యీ యు యూ యృ యౄ యె యే యై యొ యో యౌ యం యః

ర గుణింతము ర రా రి రీ రు రూ రృ రౄ రె రే రై రొ రో రౌ రం రః

ల గుణింతము ల లా లి లీ లు లూ లృ లౄ లె లే లై లొ లో లౌ లం లః

వ గుణింతము వ వా వి వీ వు వూ వృ వౄ వె వే వై వొ వో వౌ వం వః

శ గుణింతము శ శా శి శీ శు శూ శృ శౄ శె శే శై శొ శో శౌ శం శః

ష గుణింతము ష షా షి షీ షు షూ షృ షౄ షె షే షై షొ షో షౌ షం షః

స గుణింతము స సా సి సీ సు సూ సృ సౄ సె సే సై సొ సో సౌ సం సః

హ గుణింతము హ హా హి హీ హు హూ హృ హౄ హె హే హై హొ హో హౌ హం హః

ళ గుణింతము ళ ళా ళి ళీ ళు ళూ ళృ ళౄ ళె ళే ళై ళొ ళో ళౌ ళం ళః

క్ష గుణింతము క్ష క్షా క్షి క్షీ క్షు క్షూ క్షృ క్షౄ క్షె క్షే క్షై క్షొ క్షో క్షౌ క్షం క్షః

ఱ గుణింతము ఱ ఱా ఱి ఱీ ఱు ఱూ ఱృ ఱౄ ఱె ఱే ఱై ఱొ ఱో ఱౌ ఱం ఱః

ఒత్తులు

ఒక హల్లుకి ఇంకొక హల్లు చేరినప్పుడు తరువాతి హల్లు చాలా సార్లు తలకట్టులేని రూపమును లేక వేరొక రూపములో కనబడుతుంది. ఉదాహరణకు హల్లుకు అదే హల్లు చేరినప్పుడు కనబడే విధం చూడండి

క్క, ఖ్ఖ, గ్గ, ఘ్ఘ, ఙ్ఙ

చ్చ, ఛ్ఛ, జ్జ, ఝ్ఝ, ఞ్ఞ

ట్ట, ఠ్ఠ, డ్డ, ఢ్ఢ, ణ్ణ

త్త, థ్థ, ద్ద, ధ్ధ, న్న

ప్ప, ఫ్ఫ, బ్బ, భ్భ, మ్మ

య్య, ర్ర, ల్ల, వ్వ, శ్శ, ష్ష, స్స, హ్హ, ళ్ళ, ఱ్ఱ.

అఖండము

క కు షవత్తు చేర్చినప్పుడు మామూలు ష వత్తు బదులు వేరే రూపం (క్ష) వస్తుంది.

*భ భా భి భీ భు భూ....?*

 *భ భా భి భీ భు భూ....?*

ధారానగరం లో భుక్కుండుడు అనే ఓ గజ దొంగ వుండే వాడు. నగరంలో దొంగతనాలు చేసి చేసి వేరే రాజ్యానికి వెళ్లి పోయి మరీ సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి మరీ దొంగతనాలు చేసేవాడు. కానీ వాడు ధనవంతుల ఇళ్ళలోనే దొంగతనం చేసే వాడు. ఆ సొమ్ములో చాలా భాగం బీదలకు పంచె వాడు. పైగా అంతో ఇంతో సంస్కృత పాండిత్యం వున్నవాడు కూడా. రాజ సైనికులు ఎంత ప్రయత్నించినా అతనిని పట్టుకొన లేక పోయే వారు. ఒకసారి ఒకరింటికి కన్నం వేస్తూ దొరికి పోయాడు. భటులు వాడిని రాజ సభ లో ప్రవేశ పెట్టినారు యిన్ని సంవత్సరాలుగా దొంగతనాలు చేసిన భుక్కుండుడికి మరణ శిక్ష విధించాలి అని మంత్రి, యితర సభ్యులు రాజును కోరారు. తనకు రాజు మరణ శిక్ష వేస్తాదేమో నని వాడికి భయం వేసింది. యుక్తిగా ఈ శ్లోకం చెప్పాడు.*


  *"భట్టిర్నష్టః, భారవి శ్చాపి నష్టః*

*భిక్షుర్నష్ట:. భీమసేనోపి నష్టః*

*భుక్కుండో హం భూపతి: త్వం రాజన్*

*భబ్భావళ్యామ్ అంతక: సం నివిష్ట:*

 

అర్థము:-- *రాజా! నన్ను శిక్షించండి. కానీ నాకు ఒక్కటే భయం. మీరు గమనించారో లేదో భట్టి చనిపోయాడు, భారవి కవి కీర్తి శేషుడయ్యాడు, ఆ వెనకే భిక్షుకవి కూడా మరణించాడు, ఇటీవలే భీమకవి కూడా కాల ధర్మం చెందాడు, మరి నేను భుక్కుండుడిని. ఈ యమధర్మ రాజు 'భ' గుణింతాన్నే పట్టుకొని భట్టినీ, భారవిని, భిక్షు కవినీ, భీమ కవినీ తీసుకెళ్ళి పోయాడు. తర్వాత వాడిని నేను భుక్కుండుడిని. నన్ను తీసుకొని పొతే భ భా భి భీ భు తర్వాత భూపతివి నీవు, నీ పేరులో కూడా 'భ' కారం వుంది నా తర్వాత నీ వంతే నేమోనని, యింత మంచి రాజు మరణిస్తే ప్రజలకు గతి ఏమి? అని నేను భయ పడుతున్నాను. (పైన చెప్పిన కవులంతా భోజుడి ఆస్థానం లోని కవులే) అన్నాడు.*


*రాజ దండన పొంద బోతూ కూడా ఇలా చమత్కారంగా శ్లోకం చెప్పడం రాజుకు నచ్చింది, నవ్వు వచ్చింది. నవ్వు ఆపుకుంటూ సరే!భుక్కుండా ఈ సారికి నిన్ను వదిలేస్తున్నాను. అని వాడికి కావలిసి నంత ధనం యిచ్చి యిక ముందు దొంగతనాలు చేయ కుండా మంచిగా బ్రతుకు అని మందలించి వదిలేశాడు.*


*(భబ్భావళి అంటే 'భ' గుణింతం అంతక= యమ ధర్మరాజు సంవిష్ట: అంటే దృష్టి పెట్టిన వాడు)* .   


*భలే బావుంది కదూ!*

ఈ సంసారముచేత నిల్లొడలు

 శు భో ద యం🙏


శా.

ఈ సంసారముచేత నిల్లొడలు గుల్లేకాని లేదేమి మి/

థ్యా సౌఖ్యం బనిపించు దుఃఖమయజన్మానేక మూహింపఁగా/

సీ సీ పో యనుఁగాని వానిపయినే చిత్తంబు లగ్నం బగున్

భాసాభాసము నీదు చిన్మయ ప్రభావజ్యోతి విశ్వేశ్వరా!

62

    విశ్వనాధ-విశ్వేశ్వరశతకము.

     భావము: విశ్వేశ్వరా!


ఏమున్నదీ సంసారమున

ఇల్లూ ఒళ్ళూ గుల్లైపోవటంతప్ప. సౌఖ్యమేమున్నది.సుఖపడుచున్నామను భ్రమదక్కసుఖమన్నది పూజ్యము.

      అయినా నామనసటే మొగ్గుచున్నది.మరలమరల దానికొరకై వెంపరలాడుచున్నది.

   మాయ యనగా నిదేకదా?

     నీచిన్మయజ్యోతిప్రశాశముమాత్రము నామదిలో నప్పుడప్పుడు మినుకు మినుకు మనుట మాత్రము

యదార్ధము.

   ఈమాయను మాన్పి నీజ్ఞానజ్యోతిప్ప్రకాశమును

మదిలో సుస్థిరముగ వెలుగునట్లుచేయవయ్యా!

అంటారు.విశ్వనాధ!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

తొలి ఏకాదశి

 *రేపు తొలి ఏకాదశి (శయనైకాదశి)*



తొలి ఏకాదశి - ఏం చేయాలి..?


  తిథుల్లో ఏకాదశి మంచిది. అందులో తొలి ఏకాదశి మరింతా పవిత్రమైంది. ఆషాఢమాసం పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని, తొలి ఏకాదశి పర్వదినంలా జరుపుకుంటారు. తొలి ఏకాదశిని ఆషాఢ ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. చాతుర్మాస్య వ్రతం ఈ రోజే మొదలవుతుంది. విష్ణుమూర్తి తన లోక పాలకత్వానికి కొద్దిగా విశ్రాంతినిస్తూ ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు శేషువు పైన శయనించుటకు ప్రారంభించిన రోజు కనుక తొలి ఏకాదశి అని శయనైక ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశిని పద్మఏకాదశి గా కూడా పిలుస్తారు. విష్ణుమూర్తిని కొలిచే వైష్ణవులకు తొలి ఏకాదశి ప్రీతికరమైన రోజు.


ప్రత్యక్షనారాయణుడు తన మార్గాన్ని దక్షిణాయనములోనికి మార్చుకునేది ఆషాడమాసంలోనే. ఈ పండుగ దాదాపు దక్షిణాయనం ప్రారంభమైన తరువాత మొదటి పండుగని తొలి ఏకాదశిగా ప్రజలు జరుపుకుంటారు. ఈ పండుగ పూర్వ కాలంలో ఏరువాక వేడుకల్లో భాగంగా చేసేవారు.


దశమి నాడు ముక్కోటి దేవతలు విష్ణువును పూజించి సేవిస్తారు. ఆయన ఈరోజున యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. ఆదిశేషువు పైన తన యోగనిద్రకు ఉపక్రమిస్తాడు అందువలన శేషశయన ఏకాదశి అని పిలుస్తారు. అందువలన దశమి నాటి రాత్రి నుంచి ముక్కోటి దేవతలు అయినను అర్చిస్తారు.


విష్ణుమూర్తి క్షీర సాగరంలో శేషతల్పం మీద హాయిగా పడుకుని తొలి ఏకాదశినాడు నిద్రకు ఉపక్రమించాడట. అలా పడుకున్న విష్ణుమూర్తి నాలుగు నెలల తర్వాత అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు మేల్కొన్నాడట. అందుకే ఈ నాలుగు మాసములను చాతుర్మాసాలు అంటారు.


 విష్ణువు లోక పాలకుడు. ప్రజల చైతన్యానికి ప్రతిక. మరి విష్ణువు యోగ నిద్ర అంటే. ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన. దాంతో ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి.


భవిష్యోత్తరపురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. సూర్యవంశంలో ప్రఖ్యాతరాజు మాంధాత. అతనికి ధర్మము తప్పడు, సత్యసంధుడు అనే పేరుంది. అతడు పాలించే రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచనపై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు. దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణ గాథ.


ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగ నిద్ర అంటే, భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. ఏకాదశి అంటే 11. అయిదు జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని విశ్వాసం.


ఆధ్యాత్మిక గురువులు, పీఠాధీపతులు తదితరులు అందరు తమ పయనములను అన్నింటిని నిలిపి ఆషాడం నుంచి 4 మాసముల కాలం పాటు ఎక్కడకు కదలకుండా ఒకే ప్రదేశములో వుండి తమ శిష్య బృందానికి అనుగ్రహభాషణలు ఇస్తారు. అందువలన ఈ దీక్ష కాలమును 'చాతుర్మాస్య దీక్ష'గా పిలుస్తారు. ఈ దీక్షా కాలంలో తొలి ఏకాదశి గా కూడా గుర్తింపు. ఏకాదశి వ్రతం ఆచరించే వారితో పాటు అందరికి ఉపవాసం శ్రేష్టం.


ఏం చేయాలి..?

ప్రతి మాసంము వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుంది.


ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి.


ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ విష్ణుమూర్తి 4 మాసముల పాటు క్షీరసముద్రంలో శేషశాయియై నిద్రిస్తూ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడని పురాణాల కథ. అంటే వ్రతం తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చేస్తారు. ఇంకొక పౌరాణిక గాథలో విష్ణుమూర్తి ఈ రోజు నుంచి కూడా పాతాళలోకంలో బలిచక్రవర్తి ద్వారం వద్ద ఉండి కార్తీక శుద్ధ ఏకాదశికి తిరిగి వస్తాడని అంటారు.


అయితే క్షీర సముద్రంలో విష్ణుమూర్తి శయనించుట వల్ల హరిశయనైకాదశి అనే పేరు కూడా ఉంది. అలాగే శయనైకాదశి అని కూడా అంటుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ తొలి ఏకాదశి అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు.


తినగూడని, విసర్జించవలసిన పదార్థాలు

గుడం (బెల్లం), తైలం (నూనెలు), కాల్చినవి, మాంసాహారం, కొత్త ఉసిరి, చింతపండు, పుచ్చకాయ, గుమ్మడికాయ, తేనె, పొట్లకాయ, ఉలవలు, తెల్ల ఆవాలు, మినుములు, మంచంపై పడుకొనుట, బయట భుజించుట తగవు. ఈ 4 నెలలు ఇవన్నీ పనికి రానివిగా గుర్తించాలి. బుద్ధుడు చాతుర్మాస్య వ్రతమాచరించినట్లు జాతక కథలలో చాల చోట్ల చెప్పబడింది. ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి చతుర్మాస్య వ్రతాకల్పం ప్రారంభించాలని భగవంతుడు యుధిష్ఠరునకు చెప్పినట్లు పురాణాల్లో ఉంది.


ఈ 4 మాసముల పాటు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ గడపాలి. విష్ణువును నివేదన చేసిన తర్వాతే ఆహారం తీసుకోవాలి యతులకు ఇది చాలా ముఖ్యమైన వ్రతం. గృహస్థులు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు.

వివాహప్రక్రియలో

 🙏హిందూ వివాహప్రక్రియలో ముఖ్య ఘట్టాలు 🙏

                     మొదటి భాగం 


ముందు హిందువుగా పుట్టడం ఒక అదృష్టమయితే బ్రాహ్మణునిగా జన్మించడం, వేదాధ్యయనం చేసి పురోహితుడు కావడం జన్మాన్తర సుకృతం అనే చెప్పాలి. వివాహ వ్యవస్థలోని సంప్రదాయాలు వ్రాస్తున్నాను. కొంతమంది బ్రాహ్మణులకు కొన్ని మినహాయింపు ఉండవచ్చు. అలాగే వధూవరుల వస్త్రధారణలోనూ, భాషికములువిషయాలలోనూ. అలాగే గోదావరి జిల్లాల్లో తెలుపు తలంబ్రాలు, మిగిలిన ప్రాంతాల వారు పసుపు తలంబ్రాలు ఉపయోగిస్తారు. ఇవి ప్రాంతీయ ఆచారాలు అనుకోండి. ఋగ్వేద సంప్రదాయంలో అయితే ముందు తలంబ్రాలు తరువాత తాళిగట్టుట జరుగును.


సోమ: ప్రధమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర:

తృతీయో అగ్నిష్టేపతి స్తురీయ స్తే మనుష్య జా:


ఈ మంత్రములో పతి శబ్దం వాడబడినది. ఇక్కడ పతి అంటే ప్రజాపతి అని అర్ధం. ప్రజా అంటే సంతానం. పతి అంటే సంరక్షకుడు ప్రజాపతి అంటే సంతాన సంరక్షకుడు అని అర్ధం చెప్పుకోవాలి.

ఇక్కడ కొందరు విపరీతార్ధము చెప్పి ప్రక్కదోవ పట్టిస్తున్నారు. అది మహాపచారం.

ప్రతి వధువు ఐదు సంవత్సరాలవరకు చంద్రుని సంరక్షణలో ఉండి ముఖకాంతిని పొందుతుంది. ఆపై చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించి పది సంవత్సరాలవరకు శరీరక సౌందర్యం ఇచ్చి సంరక్షణ చేస్తాడు. ఆ తరువాత గంధర్వుని సాక్షిగా అగ్ని దేవుడు స్వీకరించి మానసిక శరీరక వికాసం నిచ్చి ఆమెను భర్తకు అప్పగిస్తాడు. వరుడు అగ్ని సాక్షిగా స్వీకరిస్తాడు. అందుకే అగ్ని సాక్షిగా వివాహం అంటాము.

ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆవేదన కలుగుతోంది. నా ఆందోళన తెల్పి తరువాత విషయంలోకి వెడతాను.

ఈ రోజుల్లో ఎవరు పురోహితుల మంత్రాలు వినడం లేదు. వారిని గౌరవించడం లేదు. చాలా నీచానికి దిగజారి ఫొటోస్ కు అడ్డువస్తున్నారు అంటూ పురోహితులను విసుక్కుంటున్నారు. ఇది ఎంత దారుణమో ఈ విషయలో బ్రాహ్మణులు అతీతులు కారు. ఈ జాడ్యం అందరిలోనూ ఉంది.ఆలోచించండి.ముందు బ్రాహ్మణుల్లో మార్పు వచ్చి సంస్కరింపబడాలి. తరువాత మిగిలిన వారికి చెప్పవచ్చు.. ఈ మధ్య కొత్తగా ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రారంభించారు. హిందూ సంస్కృతిని ఎటువైపు తీసుకొని వెడుతున్నారు.

వివాహ ఘట్టాలను చదివి తెలుకుంటే దంపతుల మధ్య ప్రమాదకరమైన అభిప్రాయభేదాలు ఉండవు.

విడాకులు అనే మాట ఉండదు. నా మాట నిజం నమ్మండి.ఇక విషయంలోకి వెడదాము. 

 ముఖ్య ఘట్టలాను పరిశీలిద్దాం.

వివాహము మహా పవిత్రమైన విషయం.


మంగళ స్నానములు:- కొందరు ముత్తైదువులు సిరిసంపదలతో సంతానసౌభాగ్యాలతో సంతోషంగా వుండమని ఆశ్వీరదిస్తూ, వధూవరులకు మంగళం కోరుకుంటూ వారిని పవిత్రీకరిస్తూ మంగళ స్నానములు ఆచరిస్తారు. 

మంగళాష్టకాలు:- నూతనవధూవరులకు మంగళం కలగాలని లక్ష్మీనారాయణులను, పార్వతీపరమేశ్వరులను, సీతారాములను, రుక్మిణీకృష్ణులు మొదలగువారిని ప్రార్ధిస్తూ, దంపతులు కాబోతున్న వీరికి ఆయురారోగ్య భోగభాగ్యాలను సత్సంతాన్ని ప్రసాదించి అనుగ్రహించమని ఎనిమిది మంగళ శ్లోకములను చదువుతారు.

బాషికం:- మానవుని శరీరంనందు ఇడ పింగళ సుషుమ్న అనే ప్రధాన నాడులుంటాయి. ఇవన్నీ కలిసేస్థానం భ్రూమద్యం. భౌతికమైన ఉపద్రవాలనుండి రక్షణకోసం, ఇతరత్రా దృష్టిదోషం పడకుండా వధూవరులకు ఈ స్థానంలో భాషికధారణ చేస్తారు. 

(బ్రాహ్మణులలో కొందరికి ఈ సంప్రదాయం లేదు) 

కాళ్ళు కడగడం:- కళ్యాణవేదికపై వధువు, వధువుతల్లితండ్రులు తూర్పుముఖముగా, వరుడు పశ్చిమముఖముగా కూర్చోగా వీరి నడుమ అడ్డుగా తెల్లటి తెరను (ఆ తెరపై స్వస్తిక్ గుర్తువుంటే మరీమంచిది) వధువుతరుపువారు ముగ్గురు ఓప్రక్కన, వరుడుతరుపువారు ఇద్దరు మరోప్రక్కన పట్టుకుంటారు.కన్యాదాత, అతనిభార్య వరుడును శ్రీనారాయణస్వరూపముగా భావించి, అల్లుని కాలుకడిగి పూజించి కన్యాదానం చేస్తారు. కన్యాదాత పెండ్లికుమారుని కాళ్ళు కడిగినప్పుడు అంతా భగవన్మయంగా భావిస్తూ శ్రీనారాయణుని పాదాలను కడుగుతున్న భావనతో ముందుగా కుడిపాదంను, తర్వాత ఎడమపాదంను ఆపై రెండు పాదములను కడగాలి.

కన్యాదానం:- అన్నిదానంలోనూ గొప్పదానం కన్యాదానం. కన్యాదానం చేయబోయేముందు కన్యాదాత ఇలా అంటారు -


'కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్యుతామ్ దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయా "


భావం:- బ్రహ్మలోకప్రాప్తికోసం నేను సువర్ణసంపదగల స్వర్ణాభరణభూషితమైన ఈ కన్యను నారాయణస్వరూపుడవైన నీకు దానం చేయబోతున్నాను.

విశ్వంభర స్సర్వభూతా స్సాక్షిణ్యః సర్వదేవతాః కన్యా మిమాం ప్రదాస్యామి పితృణాం తారణాయ వై 

భావం:- భగవంతుడు, పంచభూతాలు, సకలదేవతలు సాక్షులుగా నా పితృదేవతలు తరించడానికి ఈ కన్యను దానం చేయబోతున్నాను

.

కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయత్కోహం ప్రయచ్చామి ధర్మకామార్ధసిద్ధయే


భావం : సర్వాలంకారశోభిత, సాధ్వి, సుశీలయిన ఈ అమ్మాయిని ధర్మార్ధకామాలనే పురుషార్ధాలు సిద్ధించడానికి నియమపూర్వకంగా ఈ బుద్ధిమంతునికి దానం చేస్తున్నాను.

నాతిచరామి:- వదువుతండ్రి కన్యాదానం చేస్తూ, వరునిని ఇలా మాటివ్వమని అడుగుతాడు - "నాయనా! అల్లారుముద్దుగా పెంచిన నా కుమార్తెను నీ చేతిలో పెడుతున్నాను. నీవు ఈమెను (స్నేహేన పాలయ) స్నేహంతో చూసుకోవాలి. జీవితంలో మీరిద్దరూ కలిసిమెలిసి ఎన్నో మంచిపనులు చేయాలి. సిరిసంపదలను అనుభవించాలి. సత్సంతాన్ని కనాలి. ధర్మార్ధకామాలనే పురుషార్ధాలను సంపాదించడంలో నీకు అర్ధాంగి అయిన నా కూతురును అతిక్రమించి వెళ్ళకు. అలా అతిక్రమించి వెళ్లనని నాకు మాట ఇవ్వు అని అడగగా (ఈమెను అతిక్రమించనని మాట ఇస్తున్నాను) "నాతిచరామి" అని మూడుసార్లు అల్లుడు అంటాడు. 

సమీక్షణం:- వధూవరుల చేతిలో జీలకర్రబెల్లమును మెత్తగా నూరి ఉండచేసి సిద్ధంగా వుంచుతారు. మంగళవాద్యాలు మ్రోగుతుండగా వేదమంత్రాలు పురోహితులు పఠిస్తుండగా దైవజ్ఞులు నిర్ణయించిన శుభముహుర్తాన వరుడు ఇష్టదైవమును ధ్యానిస్తూ వధువు నడినెత్తిన బ్రహ్మరంద్రంపైన, వధువుకూడా అదే సమయమున తన ఇష్టదైవంను ధ్యానిస్తూ వరుని నడినెత్తిన బ్రహ్మరంద్రంపై పెట్టగ నెమ్మదిగా తెరతొలగిస్తున్న ఆ సుమూహర్త సమయమున వధూవరులు ఒకరి కనుబొమ్మల మద్యభాగాన్ని ఒకరు చూసుకోవడమే సమీక్షణం. జీలకర్రబెల్లమును ఒకరితలపై ఒకరుపెట్టుకోవడంద్వారా ఒకరుమస్తాకాన్ని ఒకరు స్పృశిస్తారు. తద్వారా హస్తమస్తక సంయోగామన్న యోగక్రియ సిద్ధిస్తుంది. జీలకర్రబెల్లం ఈ రెండింటి సంయోగంవలన ఒక ధనసంజ్ఞక విద్యుత్తుశక్తి జనిస్తుంది. హస్తమస్తకసంయోగం వలన ఒకరిలోని విద్యుత్తు ఒకరిలోనికి ప్రసరించి ఇరువురి మనస్సులను ఏకంచేస్తుంది. అందుకే ఆ శుభసమయమున ఒకరి కనుబొమ్మల మద్యభాగాన్ని ఒకరు చూసుకోవడంవలన వధూవరులకిద్దరకు ఒకరిపై ఒకరికి స్థిరమైన దృష్టి కేంద్రీకరణ జరిగి ఏకత్వభావన జీవితాంతం దృఢపడివుంటుందన్నది వేదప్రమాణం. శుభక్షణాల్లో కలిసిన అనురాగామయమైన ఆ దృష్టి వారిమధ్య మానసిక అనుబంధాన్ని క్షణక్షణమునకు పెంచి చక్కటి అన్యోన్య దాంపత్యానికి నాంది కాబట్టి ఆ సమయంలో ఒకరినొకరు చూసుకోవడంలో ఏమరిపాటు పనికిరాదు. ఈ ముఖ్యవిషయంను, దీనియొక్క అద్భుతఫలితంను పెద్దలు వధూవరులకు ముందుగానే తెలిపి వారిని సంసిద్ధులు చేయవలెను 

                        సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)


అతిథిః కిల పూజార్హః 

ప్రాకృతోపి విజానతా.

ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్

(5.1.120)


*అర్థం:* 

ధర్మాన్ని పాటించేవారు, సామాన్యుడు అతిథిగా వచ్చినా పూజించాలి. (హనుమంతుల వారి వంటి) మహాపురుషులు అతిథిగా వస్తే వేరే చెప్పాలా.

_(అతిధి ఎంత పేదవాడైనా ఆదరించడం మన ధర్మం)_


శ్రీ తూము నరసింహ దాసు గారి కీర్తనతో శుభోదయం 


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష* 

ధర్మో రక్షతి రక్షితః 


శుభ శనివారం

భూమండలంలో

 *ఓం నమో భగవతే వాసుదేవాయ* 


*భవ బంధాలకు కారణం భ్రమలే! లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా భ్రమ చెందడం వలన మానవుడు తరతరాలుగా బంధాలలో చిక్కుకుని అసంఖ్యాకములైన జన్మలెత్తుచున్నాడు. సుఖానుభవం గల జీవితం భ్రమే.దుఃఖానుభవం గల జీవితం భ్రమే. మనసు ఉన్నంత వరకు కర్మలు ఉంటాయి.కర్మలు ఉన్నంత వరకు సుఖఃదుఃఖాలు ఉంటాయి.జీవి లేనివాటి, కానివాటి, రానివాటి కోసం నిరంతరం పరుగులు తీస్తూ ఉంటున్నాడు. ఈ పందెంలో గెలవడం కోసం ఎన్నో అడ్డదారులు తొక్కడం అలవాటు చేసుకున్నాడు. ఇవి తప్ప ఇంకా వీటి కన్నా గొప్పది వేరే ఏదైనా ఉందా! అని కనీస అలోచన చేయడం లేదు.ఒకవేళ చేసినా కూడా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ప్రయత్నం చేసినా, మధ్యలోనే వదిలేస్తున్నాడు. జన్మ జన్మలు ఇదే తంతు జీవితాన్ని నడిపిస్తున్నాడు. ఇంకా ఎక్కడ ఉద్దరించబడతాడు. ఎన్ని విద్యలు నేర్చిన, ఎంత ధనము, బలము ఉండినా దేవుణ్ణి తెలుసుకోకుంటే జన్మ దండగే! ఆయనను తెలుసుకునే నిమిత్తమే జన్మ. ఆయనను చక్కగా తెలుసుకుంటిమా, ఇక మరల జన్మ మరి ఉండదు. భగవంతునికి ఏది ఇవ్వాలో అది తెలుసుకొని ఇవ్వాలి.ఇంక నీవేమి ఇచ్చిన,ఏమి చేసినా తీసుకొడు,చివరికి వాసన కూడా చూడడు.నీవు ఇవ్వాల్సినది నీ మనసు. నీ మనసు ఇస్తే తప్ప ఇంకేమి తీసుకొడు. మనం ఇది తప్ప ఏదైనా చేస్తాం అంటాము. కాని దైవం ఈ భూమండలంలో నీవు ఏది ఇచ్చిన తాకను కూడా తాకడు*


               *నమస్కారం*

సిద్ధమైన అలంకారాలు

 కోకిలానాం స్వరో రూపం 

పాతివ్రత్యం తు యోషితామ్౹

విద్యా రూపం విరూపాణాం

క్షమా రూపం తపస్వినామ్॥


కోకిలానాం-కోకిలలకు,

స్వర: -కంఠ స్వరమే, 

రూపం-అందము. 

యోషితాం తు-స్త్రీలకైతే, 

పాతివ్రత్యం-పతి నియమమే,

(రూపం-సౌందర్యము).

విరూపాణాం-అందంగా లేనివారికి(కురూపులకు),

విద్యా-జ్ఞానదాయకమైన విద్యయే, 

రూపం-అందము. 

తపస్వినాం-మునులకు/కష్ట పడి పని చేసే వారికి, 

క్షమా-ఓర్పే, 

రూపం-శోభస్కరము॥


ఈలోకంలో కోకిలలకి వాటి కంఠ స్వరమును,స్త్రీలకుపాతివ్రత్యమును,కురూపులకు విద్యయును, కష్ట పడి పనిచేసే వారికి సహనమును అనేవి సహజ సిద్ధమైన అలంకారాలు॥

5-7-25/శనివారం/రెంటాల

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఎనిమిదవ అధ్యాయం

అక్షరపరబ్రహ్మయోగం:శ్రీ భగవానువాచ:


శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే 

ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః (26)


నైతే సృతీ పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన 

తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున (27)


పార్థా... శుక్ల, కృష్ణ అనే రెండింటినీ జగత్తులో శాశ్వతమార్గాలుగా భావిస్తున్నారు. శుక్లమార్గంలో పయనించినవాడికి జన్మరాహిత్యమూ, కృష్ణమార్గంలో పోయినవాడికి పునర్జన్మమూ కలుగుతాయి. ఈ రెండుమార్గాలూ తెలిసిన యోగి ఎవడూ మోహంలో పడడు. అందువల్ల నీవు నిరంతరం ధ్యానయోగంలో వుండు.

శ్రీ మహాలక్ష్మి ఆలయం

 🕉 మన గుడి : నెం 1163


⚜ మహారాష్ట్ర : కొల్హాపూర్


⚜  శ్రీ మహాలక్ష్మి ఆలయం



💠 కొల్హాపుర మహాలక్ష్మి దేవిని అనేక సమాజాలు "అంబాబాయి" అని కూడా పిలుస్తారు మరియు అందువల్ల ఈ ఆలయాన్ని శ్రీ కొల్లూరు అంబాబాయి ఆలయం అని కూడా పిలుస్తారు.

51 శక్తి పీఠాలలో మహాలక్ష్మి ఆలయం 18వ స్థానాన్ని పొందింది. 


💠 పురాణ ఇతిహాసాల ప్రకారం,  సతీదేవి తండ్రి దక్షుడు, శివుడిని అవమానించే ప్రయత్నంలో ఒక యజ్ఞం చేశాడు.

ఆ దక్షయజ్ఞ్యానికి తన భర్త అయిన శివుడిని పిలవకుండా అవమానించి, పిలవని పేరంటానికి వచ్చిన తనని కూడా నిండు సభలో అవమానించాడు అని తీవ్ర మనస్థాపానికి గురైన సతీదేవి తన తండ్రి సమక్షంలో తనను తాను కాల్చుకుంది. 


💠 తరువాత, ఈ సంఘటనతో తీవ్ర బాధ మరియు దుఃఖంతో, శివుడు యజ్ఞ వేడుకను నాశనం చేసి దక్షుడిని చంపాడు.  విధ్వంసం సృష్టించిన తర్వాత, శివుడు చివరికి సతి యొక్క కాలిపోయిన శవాన్ని కనుగొని దానిని తనతో తీసుకెళ్లి విశ్వంలో సంచరించడం ప్రారంభించాడు. 


💠 శివుని దుఃఖాన్ని శాంతింపజేయడానికి, విష్ణువు సతి శవాన్ని నరికి, దాని భాగాలు శివుడు సంచరించిన ప్రదేశాలపై పడ్డాయని చెబుతారు.

పురాణాల ప్రకారం, సతి కళ్ళు నేడు ఆలయం ఉన్న ప్రదేశంలో పడ్డాయి.


💠 మరొక పురాణం ప్రకారం బ్రహ్మకు ముగ్గురు కుమారులు - గై, లవన్ మరియు కొల్హాసురుడు ఉన్నారని కథ చెబుతుంది. 

గయలో గే మరణించగా, లోనార్ సరస్సు సమీపంలోని విదర్భలో లవన్ మరణించాడు. అయితే, కొల్హాసురుడు కేశి అనే రాక్షసుడిని నాశనం చేయడానికి రక్షాలయ (కొల్హాపూర్) వెళ్ళాడు. కొల్హాసురుడు ఈ యుద్ధంలో గెలిచి ఆ ప్రాంతాన్ని పాలించాడు.


💠 అయితే, అతని నలుగురు కుమారులు ప్రజలను నాశనం చేసి, వారిని హింసించారు, దీని ఫలితంగా ప్రతీకారంగా శంకరుడు వారిని చంపాడు. తన కుమారుల మరణ వార్త విన్న తరువాత, అడవిలో సన్యాసిగా నివసిస్తున్న కొల్హాసురుడు తిరిగి వచ్చాడు. 

అతను మహాలక్ష్మి దేవిని ప్రార్థించి, ఆమెను 100 సంవత్సరాలు తన ప్రాంతాన్ని విడిచిపెట్టమని కోరాడు. ఆమె అతనికి ఈ వరం ఇచ్చి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టింది. 


💠 ఆ 100 సంవత్సరాలలో, కొల్హాసురుడు తన కుమారుల చర్యలను పునరావృతం చేశాడు, ఇది ప్రజలకు బాధ కలిగించింది. కొల్హాసురుడి కష్టాలను అంతం చేయమని దేవతలందరూ మహాలక్ష్మి దేవిని వేడుకున్నారు.


💠 100 సంవత్సరాలు గడిచిన తర్వాత, దేవతలకు మరియు కొల్హాసురుడికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. 

కొల్హాసురుడి పోరాట నైపుణ్యాలకు ముగ్ధుడైన శంకరుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. 

18 చేతులతో ఉన్న మహాలక్ష్మి అవతారంలో కొల్హాసురుడిని చంపాలని కోరుకున్నాడు. 


💠 ఈ కోరిక నెరవేరిన తర్వాత, కొల్హాసురుడు మూడు మరణ కోరికలను కోరాడు. 

మొదట, రక్షాలయ ప్రాంతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడు. రెండవది, కొల్హాపూర్ పవిత్ర స్థలంగా మారాలి. చివరగా, అతనికి ప్రతి సంవత్సరం గుమ్మడికాయను సమర్పించాలి.

దీని ప్రకారం, కొల్హాపూర్‌కు అతని పేరు పెట్టారు మరియు ఇది పవిత్ర ప్రదేశాలలో ఒకటి. 


💠 ప్రతి సంవత్సరం

అశ్వినీ శుద్ధ పంచమి నాడు, గుమ్మడికాయను సమర్పిస్తారు. గుమ్మడికాయ కొల్హాసురుడిని సూచిస్తుంది.


💠 కోలాపూర్ శక్తిపీఠం అయినప్పుడు  దీనిని మహాలక్ష్మి ఆలయం  అని ఎందుకు పిలుస్తారు.


💠 మహారాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే, ఛత్రపతి శివాజీ ఇద్దరు కుమారుల కుటుంబాలు విడిపోయి మరాఠా వంశంలో రెండు వేర్వేరు శాఖలను ఏర్పరచాయి. 

దీనికి ముందు, తుల్జాపూర్ యొక్క తుల్జాభవానీ (శక్తి పీఠాలలో ఒకటి కూడా) భోసలేస్ కుటుంబ దేవత. ఛత్రపతి శంభాజీ కుమారుడు షాహు సతారా పాలకుడు అయిన తరువాత మరియు తుల్జాపూర్ సతారా రాజ్యంలో భాగమైంది;  తారాబాయి కుటుంబం (ఛత్రపతి రాజారాం భార్య మరియు కొల్హాపూర్ రాజ్య పాలకుడు) వారి స్వంత కుటుంబ దేవతను కనుగొనవలసి వచ్చింది. కాబట్టి వారు కొల్హాపూర్ గ్రామ దేవతతో వెళ్లాలని నిర్ణయించుకున్నారు.


💠 బీజాపూర్ ఆదిల్ షాహి మరియు మొఘలుల దాడి కారణంగా ఆ సమయంలో అంబాబాయి విగ్రహాన్ని భద్రంగా ఉంచారు.

 తారాబాయి విగ్రహాన్ని సురక్షితమైన స్థలం నుండి బయటకు తీసుకువచ్చి ఆలయంలో మహాలక్ష్మిగా ప్రతిష్టించింది. అలా దీనిని మహాలక్ష్మి అని పిలవడం ప్రారంభించారు.


💠 ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , సూర్యకిరణాలు ప్రతిరోజూ దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది.


💠 నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు , భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్ కి తండోపతండాలుగా వస్తారు


💠 ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ , 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మీ కొలువై ఉంటుంది.

 3 అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మీ ప్రతిమను చెక్కడం జరిగింది.


💠 అమ్మవారికి రోజూ అయిదు సార్లు అర్చన జరుగుతుంది. ఉదయం అయిదు గంటలకు శ్రీ మహాలక్ష్మీ దేవికి సుప్రభాత సేవ చేస్తారు. 

కాకడ హారతి ఇస్తారు. 

ఉదయం ఎనిమిది గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రాలలో పూజ, శేజ్ హారతి జరుపుతారు.


రచన

©️ Santosh Kumar

18-37-గీతా మకరందము

 గీతామకరందము:

18-37-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అll సాత్త్వికసుఖముయొక్క లక్షణమును వచించుచున్నారు –


యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ | 

తత్సుఖం సాత్త్వికం ప్రోక్తం 

ఆత్మబుద్ధి ప్రసాదజమ్ || 


తా:- ఏ సుఖము ప్రారంభమునందు విషమువలెను, పర్యవసానమందు అమృతమును బోలినదిగను నుండునో, తన బుద్ధి యొక్క నిర్మలత్వముచే గలుగునట్టి ఆ సుఖము సాత్త్వికమని చెప్పబడినది.


వ్యాఖ్య: - అధ్యాత్మక్షేత్రమున సాధకునకు అభ్యాసకాలమందు ప్రారంభమున బ్రహ్మనిష్ఠ, ధ్యాన, వైరాగ్యాదులు ఒకింత కష్టముగా తోచవచ్చును. కాని అభ్యాసము, సాధన పూర్తియగుకాలమున అమృతతుల్యముగ నుండును. ఆత్మసుఖము నవి కలుగచేయును - అని యిచట వచింపబడినది. కావున సాధనదశలోగాని, అభ్యాసకాలములో గాని ఎవరికైనను కష్టముకలిగినచో, విసుగు జనించినచో, అధైర్యపడక, అది వాస్తవమగు బాధ కాదనియు, పరిణామమున అనంతానందము కలుగుననియు నిశ్చయించి సాధనను విడనాడక ధైర్యముతో కొనసాగించవలెను. కనుకనే "విషమివ' అని చెప్పిరేకాని "విషమ్” అని చెప్పలేదు. అనగా ఆ ప్రారంభకష్టము విషమువలె తోచునేగాని వాస్తవముగ విషముకాదని భావము. ఇచట ప్రయోగించిన ‘ఇవ' అను పదమునందు గొప్ప అర్థముకలదు. ‘బాధవలె తోచునేకాని బాధకాద’ని ఆ పదమువలన స్పష్టమగుచున్నది. ఆ తాత్కాలిక బాధకైనను కారణము జన్మార్జితములైన పాపవాసనలకును, ఆధునిక పుణ్యవాసనలకును, మధ్యగలుగు సంఘర్షణమే యగును. పుణ్యవాసనలు బలమై, పాపవాసనలను తొలగద్రోయునపుడు అవి వెడలి పోవుచు పోవుచు జీవుని గిల్లిపోవును. ఆ నొప్పియే ఈ 'విషమివ' అనుదాని యర్థము. అదియే జీవుని ప్రారంభబాధ. వాస్తవముగ అది బాధకాదు. అనుపమ సుఖమునకు నాందియే యగును.

     ఒకానొక రోగమునకు "వేపఉండ" అను మందు ఇచ్చుదురు. అది చేదుగా నున్నను ఆరోగ్యమును గలుగజేయును. ఔషధము సేవించునపుడు అప్రీతిగానున్నను - బలవంతముగా నైనను సేవించవలసినదే ఆరోగ్యముకొఱకు. ఒక ఱాయి దేవవిగ్రహముగా మారుటకు మొదట ఉలిదెబ్బలు తినునట్లును; బంగారము శిరోభూషణముగా మారుటకు స్వర్ణకారుని సుత్తిదెబ్బలు తినునట్లును - అనంతమగు బ్రహ్మానందము ననుభవించుటకు ముందు జీవుడొకింత త్యాగము చేయవలసియుండును. అట్లు అల్పసుఖమును వదలునప్పుడు ఒకింత దుఃఖము కలుగవచ్చును. అనేక జన్మలనుండి ఆ విషయసుఖములను బంధువులు జీవుని హృదయగేహములో నివసించుచున్నారు. వారు పోవునపుడు బంధువియోగమందువలె తాత్కాలిక ఆవేదన కొంతకలుగును. అంతమాత్రముతో సాధకుడు బెదరిపోరాదు. కొంత ఓపికబట్టి సాధనను విడువక కొనసాగించినచో ఆ కష్టకాలము తొలగిపోయి సుఖకాల మేతెంచును.

ఒక విద్యార్థిదశలో రేయింబవళ్లు కష్టపడి చదువును. తదుపరి ఉద్యోగకాలమందు సుఖించును. అట్లే అధ్యాత్మరంగమున ఇంద్రియాదులను నిగ్రహించునపుడు, అంతర్యుద్ధఫలితముగ కొంత ప్రయాస కలిగినపుడు దానిని సహించుకొని ముందునకు సాగిపోవలెను. అంతియేకాని భయపడి సాధనను విరమించరాదు. కనుకనే భగవానుడిచట సాత్త్వికసుఖముయొక్క నిజస్థితిని తెలుపుచున్నారు. విషరూపదుఃఖములో అమృతరూప సుఖముయొక్క బీజములున్నవని సెలవిచ్చిరి. తాత్కాలికకష్టరూపమగు ఆ విషము నెట్లైనను దిగమ్రింగివేసినచో వానిలోనగల అమృతబీజము లపుడు మొలకెత్తును. ఇది విషమువలె నున్నదికదాయని పారవేసినచో దానిలోని అమృతబీజములనుగూడ జనులు పోగొట్టుకొనినవారగుదురు. కాబట్టి సాధకు లివ్విషయమున కడు జాగరూకులై యుండి భగవానుని ఈ అమూల్యోపదేశము జ్ఞప్తియందుంచుకొని అనంతాత్మసుఖము తమకై వేచియున్నదని భావించి, కష్టసహిష్ణువులై, త్యాగశీలురై, సాధనను విడువకుండ చేయుచునే యుండవలెను. కనుకనే ‘కశ్చిద్ధీరః’ - ఏ ఒకానొక ధీరుడో (అన్నికష్టముల నోర్చుకొని) ప్రత్యగాత్మను చూడగలడని ఉపనిషత్తులలో చెప్పబడినది. శ్రీ బుద్ధదేవుడు, శ్రీ రామకృష్ణపరమహంస మున్నగువారి సాధనకాలజీవితములను చూచినచో ఈ సత్యము బోధపడగలదు.


     మఱియు 'అమృతోపమమ్'- అమృతమునుబోలి అని యిచట చెప్పుటయు చాల సమంజసముగా నున్నది. ఏలయనిన, ఆత్మసుఖము, దైవసుఖము దేవతల అమృతమును పోలినదేకాని, జడమగు ఆ దేవతల అమృతముకాదు. దానికంటె ఎన్నికోట్ల రెట్లో అధికశక్తివంతమైనదది. దేవతల యొద్దగల అమృతము స్థూలదేహమునకు కొంతకాలము మృతిలేకుండ నివారించును. కాని ఈ ఆత్మసుఖరూపమగు అమృతము

శాశ్వతముగ జననమరణ సంసారప్రవాహమునుండి జీవుని తప్పించివేయును.


"ఆత్మబుద్ధి ప్రసాదజమ్”- ఆ సాత్త్వికసుఖము (ఆత్మసుఖము) యెట్లు కలుగగలదు? బుద్ధి నిర్మలముగానున్నచో, విషయదోషము లెవ్వియు లేకయుండినచో, నిర్మలదర్పణమున ప్రతిబింబమువలె ఆత్మసుఖము అందు గోచరింపగలదు. అనుభూతము కాగలదు. కాబట్టి సుఖము నపేక్షించువారు మొట్టమొదట తమబుద్ధిని నిర్మలముగా నొనర్చుకొనవలెను.


 "మోక్షమెచటనున్నది? సుఖమెచటనున్నది?”- అని కొందరు ప్రశ్నించుదురు. దానికి భగవాను డిచట సమాధాన మొుసంగిరి. మోక్షము, దైవసుఖము ఆకాశములో లేదు. పాతాళములో లేదు. నిర్మలమగు తన బుద్ధియందే కలదు. ఈ యర్థమునే శ్రీ వసిష్ఠమహర్షియు శ్రీరామచంద్రున కిట్లు బోధించిరి -

న మోక్షో నభసః పృష్ఠే 

పాతాలే న చ భూతలే 

మోక్షో హి చేతో విమలం సమ్యగ్జ్ఞానవిబోధితం (శ్రీ వసిష్ఠగీత).


ప్ర:- సాత్త్వికసుఖముయొక్క లక్షణమేమి?

ఉ:- ప్రారంభములో (అభ్యాసకాలములో) విషమువలె కష్టముగతోచి తుదకు అమృతమువలె సుఖదాయకముగ నుండునది సాత్త్వికసుఖము.

ప్ర :- అట్టి సాత్త్వికసుఖము జీవున కెట్లు కలుగును?

ఉ :ー నిర్మలబుద్ధినుండి ఆ సుఖము జనించును. కావున సుఖాభిలాషి బుద్ధిని నిర్మలమొనర్చుకొనవలయును.

ప్ర:- కాబట్టి జీవుని కర్తవ్యమేమి?

ఉ:- ఆధ్యాత్మికసాధనలు గావించునపుడు కలుగు కష్టములకు జంకక భగవంతునిపై పూర్ణ విశ్వాసముంచి, సాధనను ధైర్యముతో కొనసాగించి, బుద్ధియందు విషయదోషమెద్దియు లేకుండ అద్దానిని సునిర్మలముగా గావించవలెను. అత్తఱి మహత్తరమగు ఆత్మసుఖ మాతనికి అనుభూతము కాగలదు. అదియే మోక్షము.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*



*428 వ రోజు*


*భీమసేనుడిని ధర్మరాజు మందలించుట*


యుద్ధ పరిమాణాన్ని చూసి ధర్మరాజు ఆవేశపడి అవేదనగా " భీమసేనా ! ఆగు ఏమిటీ పిచ్చితనం. ఈ పిచ్చి ప్రేలాపన ఏమిటి. ఆ తల తన్నడం ఏమిటి ! ఇది అధర్మం అన్యాయం చూడ్డానికే సిగ్గు, అసహ్యం వేస్తుంది. యుద్ధంలో సకల సైన్యాలనూ, బంధు మిత్రులనూ పోగొట్టుకుని నా మాట మన్నించి నీతో గదా యుద్ధానికి సిద్ధమై వీరోచితంగా పోరాడి నేలకూలిన సుయోధనుడి తలను తన్నడం న్యాయమా ! ధర్మమా ! లోకం హర్షిస్తుందా ఇంత వరకు భీమసేనుడు ధర్మం తప్పడని పేరు పొందావు. నేడు గర్వంతో విర్రవీగుతున్నావు నీకు ఇందు కలిగిన ప్రయోజనం ఏమిటి ! నీకిది అపకీర్తి కాదా ! " అని భీమసేనుని మందలించి " సుయోధనా ! విధి వక్రించి మన మధ్య వైరం ఏర్పడింది. ఒకరిని ఒకరు ద్వేషించుకుని సర్వం పోగొట్టుకుని ఈ స్థితికి వచ్చాము. బాల్యం నుండి నీకు అలవడిన లోభం, మదం, మాత్సర్యం, అధర్మం నిన్నీ పరిస్థితికి చేర్చాయి. నీ వలన మన ఇద్దరి బంధుమిత్రులు నశించారు. ధృతరాష్ట్రుడి కోడళ్ళందరకూ వైధవ్యం ప్రాప్తించింది. ఇందుకు నువ్వే కారణమని లోకం నిందిస్తుంది " అని సుయోధనుడిని ఓదార్చాడు " అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు.


*బలరాముని ఆవేశం*


సంజయుడు చెప్పిన దృష్టాంతం విని ధృతరాష్ట్రుడు " సంజయా ! భీమసేనుడు అధర్మంగా నా కొడుకు తొడలు విరుగ కొట్టి పడత్రోయటం చూసిన బలరాముడు తన శిష్యుడైనన భీమసేనుని ఏమీ అనలేదా ! " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! భీమసేనుడు సుయోధనుడిని తొడలు విరిచి పడ గొట్టగానే బలరాముడు కోపంతో పైకి లేచి అక్కడి మహారాజులను చూసి " చూసారా ! ఈ భీమసేనుడి ఆగడం. ఈ అధర్మ యుద్ధం ఎక్కడైనా చూసారా ! గదాయుద్ధంలో నాభికి దిగువన కొట్టడం అధర్మం కాదా ! భీముడు ఇలా సుయోధనుడిని నాభి క్రింద కొట్టి కూల్చడం న్యాయమా ! " అని హలాయుధం పట్టుకుని భీమసేనుడి వైపు పోసాగాడు.


*శ్రీకృష్ణుడు బలరాముని ఆపుట*


అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముని వద్దకు వెళ్ళి ఆయనను రెండు చేతులతో పట్టి వారించి " అన్నయ్యా ! తాను తనమిత్రులు వృద్ధిలోకి రావడం శతృవు అభివృద్ధిని నిరోధించడం మానవ లక్షణం. మిత్రునికి ద్రోహం జరుగుతున్నప్పుడు ఆదుకొనడం ధర్మం పాండవులు మనకు బంధువులు, మిత్రులు, విశేషించి మనకు మేనత్త కొడుకులు. అర్జునుడు మన చెల్లెలు సుభద్రకు భర్త. వారంతా అధర్మపరులైన కౌరవుల చేత అవమానించబడి ఇడుముల పాలయ్యారు. కనుక పాడవులను ఆదుకోవడం అభివృద్ధికి తోడ్పాటు అందించడం మన ధర్మం కాదా ! క్షత్రియులకు ప్రతిజ్ఞ చేయుట ధర్మం భీముడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుట అధర్మం ఎలా ఔతుంది. అన్నయ్యా ! సుయోధనుడి తొడలను భీమసేనుడు తన గదతో భగ్నపరచగలడు అని మైత్రేయ మహర్షి చెప్ప లేదా ! మహా ముని శాపం అసత్యం ఔతుందా ! ఇందు భీమసేనుడి దోషం ఏముంది కనుక నీ అకారణ కోపం ఉపశమింప చేసి శాంతింపుము " అని బలరాముని అనునయించాడు. కాని బలరాముని కోపం తగ్గ లేదు. " కృష్ణా ! ధర్మార్ధ కామ మోక్షములు ఒక దానికి ఒకటి అనుసంధానింపబడి ఉన్నాయి. అవి ఒక దానిని ఒకటి నాశనం చేసుకోవచ్చా ! పురుషార్ధములలో ధర్మాన్ని పక్కన పెట్టి మిగిలిన పురుషార్ధములను పొందు వాడు నిందితుడు కాదా ! నీవు భీముని ప్రతిజ్ఞ, ముని శాపం అంటున్నావు. వాటిని నెరవేర్చుట కొరకు ధర్మం తప్పి ప్రవఎర్తించుట న్యాయమా ! ఏది ఏమైనా భీముడు గదాయుద్ధంలో ధర్మం తప్పి ప్రవర్తించాడనడం కాదన లేని సత్యం " అని చెప్పాడు. కృష్ణుడు " అన్నయ్యా ! ఈ లోకం నిన్ను లవలేశం అయినా దోషం లేని వాడు, ధర్మ నిరతుడు, చక్కని నడవడి కల వాడుగా కీర్తిస్తుంది.


.

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

విదురనీతిః

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝 *దేవతానాం చ సఙ్కల్పం*

           *అనుభావం చ ధీమతామ్।*

           *వినయం కృతవిద్యానాం*

           *వినాశం పాపకర్మణామ్॥*


                 *విదురనీతిః*


తా𝕝𝕝 *"దేవతల సంకల్పము, బుద్ధిమంతుల ప్రభావము, విద్వాంసుల అణుకువ, పాపాత్ముల వినాశం - ఈ నాలుగూ సద్యః ఫలితాన్ని ఇస్తాయి."*


 ✍️💐🌸🌹🙏

విమానం

 విమానం 

రైట్ బ్రదర్ లు 

కనిపెట్టారు 

అని చెప్పిన వాడు.. 


నీకు అంతకు ముందే 

పుష్పకవిమానం 

వుందని చెప్పలేదు..

 

టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టిందని 

పండగ చేసినవాడు.. 


101 మంది కౌరవులు 

టెస్ట్ ట్యూబ్ బేబీ లే 

అని చెప్పలేదు.. 


3d house అని మురిసిపోయే,, 

నీతో తరాల క్రితం మయసభ 

వుందని చెప్పలేదు..


చదువు విజ్ఞానం అని 

గొప్పలు పోయె నీకు.. 


మొట్టమొదటి విశ్వ విద్యాలయం  

భారతదేశం లోదే అని తెలియదు.. 


ఆదిమానవుడి గీతలు 

ఆశ్చర్యంగా చూసే నీకు.. 


అంతకు మునుపే తాళపత్ర 

గ్రంథాలను రాశారు అని తెలియదు.. 


లేజర్ సర్జరీ అని 

డప్పు కొట్టుకొనే నీకు.. 


సుశ్రుడు చేసిన 

వైద్యం తెలియదు..


గండు చీమల తో చరకుడు 

చేసిన శస్త్ర చికిత్స లు తెలియదు.. 


ఎందుకంటే.. 


ఇలాంటి ఎన్నో నీకు 

తెలియకుండా చేశారు.. 


నీ దేశపు గర్వాన్ని 

నీ చేతితోనే తుడిపించారు.. 


ఓ మేధావి‌.. 


నీకు నిజంగా స్పృహ వుంటే,, 

ఒక్కటే తెలుసుకో..


ఆ బ్రిటీష్ వారి పూర్వీకులు 

గాడిదల మీద తిరగటం 

కూడా రాక మునుపే.. 


నీ తాత ముత్తాతలు 

గుర్రాలు ఉన్న రథం 

మీద బంగారు నగలు 

ధరించి తిరిగే వారు.. 


వారికి స్నానం తెలియక తోలు 

చుట్టుకు తిరగక ముందే..  


నీ తాత ముత్తాతలు 

సుగంధ ద్రవ్యాల తో 

స్నానాలు చేసేవారు...


జై హింద్ 🫡 జై శ్రీరామ్ 🚩

తొలి ఏకాదశి

 *హిందూ మతంలో తొలి ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. విశ్వ సృష్టికర్త అయిన శ్రీ మహా విష్ణువు క్షీరసాగరం లో నాలుగు నెలలు యోగ నిద్రలోకి వెళ్ళే పవిత్ర దినం.*


*పంచాంగం ప్రకారం ఈ ఏడాది తొలి ఏకాదశి జూలై 6, 2025, ఆదివారం వచ్చింది. చాతుర్మాసం ప్రారంభం అయిన ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు వివాహం, గృహప్రవేశం సహా ఏ ఇతర శుభ కార్యాలు నిర్వహించరు. ఈ పవిత్ర సందర్భంగా పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. తెలిసి తెలియక చేసే పనుల వలన పాపానికి గురవుతాడు. జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. కనుక ఈ రోజు తొలి ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం.*


*తొలి ఏకాదశి నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.*


*అన్నం, మాంసాహారం తినకండి. తొలి ఏకాదశి రోజున అన్నం తినడం పూర్తిగా నిషిద్ధం. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున అన్నం తినడం వల్ల తదుపరి జన్మలో ఒక క్రిమిగా* *జన్మిస్తారు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, మద్యం వంటి తామస ఆహారాన్ని తినకూడదు. ఈ ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడింది. కనుక సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.*


*తులసి దళాలను కోయవద్దు ఏకాదశి నాడు తులసి ఆకులు కోయడం అశుభకార్యంగా భావిస్తారు. తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. అందుకనే తులసిని విష్ణు ప్రియ అని కూడా పిలుస్తారు. ఈ రోజున తులసి మొక్కను తాకడం లేదా దాని దళాలను కోయవద్దు. విష్ణు పూజకు తులసి దళాలను అవసరమైతే... వాటిని ఒక రోజు ముందుగానే కోయాలి.*


*జుట్టు, గోర్లు కత్తిరించడం, షేవింగ్ చేయడం తొలి ఏకాదశి రోజున జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, గడ్డం చేసుకోవడం నిషిద్ధం. తొలి ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం నెలకొంటుంది. అశుభ ఫలితాలు వస్తాయి.*


*గొడవ పడడం, దుర్భాషను ఉపయోగించడం ఈ పవిత్ర రోజున పొరపాటున కూడా ఇతరులతో కొట్లాకు వెళ్ళవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. దుర్భాషని ఉపయోగించవద్దు. మనస్సు, మాట, చర్యలో స్వచ్ఛతను కాపాడుకోవడం ముఖ్యం. ఈ రోజు శాంతం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. కోపాన్ని నియంత్రించుకోండి.*


*పగలు నిద్రపోవద్దు:* 


*ఏకాదశి నాడు పగలు నిద్రపోవడం నిషిద్ధమని భావిస్తారు. ఈ రోజున విష్ణువును పూజించడంతో పాటు భజనలు, కీర్తనలు పాడటంలో సమయం గడపాలి. వీలైతే రాత్రి నిద్రపోకుండా జాగరణ చేస్తూ దేవుడిని స్మరించుకోండి.*


*ఇతరులను అవమానించవద్దు, లేదా చెడుగా భావించవద్దు తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఇతరులను అవమానించడం లేదా వారి గురించి చెడుగా ఆలోచించవద్దు. మనస్సులో ఇతరుల పట్ల ద్వేషం లేదా ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. దానధర్మాలు చేయండి. అందరి పట్ల దయతో ఉండండి.*


*దానం ఇస్తే నిరాకరించవద్దు :*


*ఈ రోజున చేసే దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా మీకు దానం ఇస్తుంటే... దానిని సంతోషంగా స్వీకరించండి. దానం స్వీకరించడానికి నిరాకరించడం వల్ల పాపం కలుగుతుంది. అదే సమయంలో మీ సామర్థ్యం మేరకు దానం చేయండి.*


*తొలి ఏకాదశి నాడు ఏమి చేయాలంటే :*


*తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. తరువాత విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్టించి ఆయనను పూజించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసి “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని జపించండి. పండ్లు, పువ్వులు, స్వీట్లు, పంచామృతాన్ని అందించండి. బ్రాహ్మణులకు, పేదలకు దానం చేయండి. ఏకాదశి ఉపవాసం ఉండి సాత్విక ఆహారం తీసుకోండి. ఏకాదశి రోజున సానుకూల ఆలోచనలను మనస్సులో ఉంచుకుని ఆధ్యాత్మిక పనిలో నిమగ్నమై ఉండండి.*


*తొలి ఏకాదశి ప్రాముఖ్యత :* 


*తొలి ఏకాదశిని ‘దేవశయన ఏకాదశి’ , ‘పద్మ ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఈ రోజున, విష్ణువు క్షీర సాగరంలో యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు.కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) వరకు యోగ నిద్రలో ఉంటాడు.ఈ కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ సమయం ఆధ్యాత్మిక సాధన, నిగ్రహం సమయం. ఈ కాలంలో వివాహం, గృహప్రవేశం వంటి శుభ కార్యాలు నిషిద్ధంగా భావిస్తారు.*

వానల్లో ఈవీ

 చూపున్న మాట 

వానల్లో ఈవీ.. జాగ్రత్తలు ఇవీ..


తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణహిత విద్యుత్తు వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతోంది. డీజిల్, పెట్రోల్‌ వాహనాలతో పోల్చితే ప్రయాణ ఖర్చు తక్కువ అవుతుండడంతో ప్రజలు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఇది మంచి పరిణామమే అయినా కొన్నిచోట్ల బ్యాటరీలు పేలిపోవడం, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి నిర్వహణపై అవగాహన లేకనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నది నిపుణుల మాట. వర్షాకాలంలో మరింత అప్రమత్తత అవసరమని వారు సూచిస్తున్నారు.


100 శాతం... వద్దు! 

వానల్లో ఈవీ.. జాగ్రత్తలు ఇవీ..


    బ్యాటరీలు ఫుల్‌ఛార్జ్‌ కావాలని రాత్రంతా ఛార్జింగ్‌ పెట్టేసి వదిలేస్తుంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఛార్జింగ్‌ 20 నుంచి 80 శాతం వరకే ఉండేలా చూసుకుంటే వాటి మన్నిక బాగుంటుంది. 

    దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వెంటనే ఛార్జింగ్‌ చేస్తుంటారు. వాహనం అప్పటికే వేడెక్కి ఉంటుంది. మళ్లీ ఛార్జింగ్‌ పెట్టడం వల్ల మరింత వేడెక్కుతుంది. ఇలా ఒత్తిడి పెరిగి, పేలిపోయే అవకాశం ఉంది. 

    ప్రయాణం చేసి వచ్చినప్పుడు వాహనానికి గాలి తగిలేలా చూసుకుంటే మంచిది. బండి కడిగితే పూర్తిగా ఆరిపోయాకే ఛార్జింగ్‌ పెట్టాలి. 


సర్వీసింగ్‌ ఎప్పుడు?


    వాహనంలో బ్యాటరీ పేలిపోయే ముందు కొన్ని సంకేతాలు ఇస్తుంది. బండి బాగా వేడెక్కుతుంది. లోపలి నుంచి పొగ వస్తుంటే ఛార్జింగ్‌ ఆపేసి బండిని చల్లని ప్రదేశంలో ఉంచాలి. 

    బ్యాటరీ ఛార్జింగ్‌ అవుతున్నప్పుడు కొద్దిగా వేడెక్కు తుంది. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే చల్లబడుతుంది. అలా జరగకుంటే వెంటనే డీలర్‌ని సంప్రదించాలి. 

    వాహనం సరిగ్గానే నడుస్తున్నా.. ప్రతి మూడు నెలలకోసారి తనిఖీ చేయించాలి.. ఆరు నెలలకోసారి వైరింగ్, బ్యాటరీ పనితీరును పూర్తిగా తనిఖీ చేయించాలి. 

    వర్షాకాలంలో ముసురు, గాల్లోని తేమ వల్ల ఎలక్ట్రికల్‌ కనెక్టర్లు, వైర్లు, రంగు లేని చోట వాహనం తుప్పు పడుతుంటుంది. 

    వాటర్‌ ప్రూఫ్‌ ఉన్నా.. నీటిలో ఉన్నప్పుడు అరగంట వరకే అది రక్షణ ఇస్తుంది. అంతకంటే ఎక్కువ సమయం వాహనం నీటిలో ఉంటే బ్యాటరీలోకి నీరు చేరుతుంది

చెట్టుకు ప్రదక్షణ

 చెట్టుకు ప్రదక్షణ చేయడం వల్ల ఫలితం ::


ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క దేవతాశక్తి ఉంటుంది. ఈ సృష్టిలో మొత్తము 7 కోట్ల రకాల వృక్షజాతులు, 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రములన్నియు స్వర ప్రధానములు. ఉచ్చారణ, అక్షరదోషాలు లేకుండా చెయ్యాలి.* 


భూలోకంలో ఉన్న మానవుల యొక్క ముఖ యంత్రములలోని లోపాల వల్ల కొంతమంది మంత్రఉచ్చారణ సరిగ్గా చేయలేరు అందుకని అమ్మవారు ఈ 7 కోట్ల మంత్రములను 7 కోట్ల వృక్షజాతులుగా సృష్టించింది.*


*వృక్షములన్నియు అమ్మవారి సృష్టిలో భాగమే. అమ్మవారి స్వరూపమే. అందువలనే అమ్మ వారిని వన దుర్గ స్వరూపంగా పూజిస్తారు.*

 

*మంత్రఅనుష్ఠాన ఫలితమును చెట్టుకు ప్రదక్షిణ చేయడం ద్వారా పొందవచ్చును.* *రావిచెట్టుకు ఒకసారి ప్రదక్షిణ చేస్తే "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రమును 108 సార్లు జపం చేసిన ఫలితం పొందుతారు. అదే 3 సార్లు ప్రదక్షిణ చేస్తే 1008 సార్లు అష్టాక్షరీమంత్రజపం చేసిన ఫలితం పొందుతారు.*


*మఱ్ఱిచెట్టుకు ప్రదక్షిణ చేస్తే "ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ స్వాహా" అనే కృష్ణమంత్రం జపం చేసిన ఫలితం వస్తుంది.*


*ఇంటిలో తులసి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంట్లో లక్ష్మి దేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది .*


*ఇంటిలో కడిమి చెట్టు (కదంబవృక్షం) పెట్టుకొని దానికి ప్రదక్షిణ చేస్తే నిత్యం లలితాసహస్రనామం, బాలామంత్రం, పంచదశీ మహామంత్రం, షోడశాక్షరీ మంత్రం జపం చేసిన ఫలితం పొందవచ్చు.*


*మేడిచెట్టుకు (ఔదుంబర వృక్షము) ప్రదక్షిణ చేస్తే అమ్మవారి యొక్క నవార్ణ మంత్రమును మరియు శ్రీ దత్త మూల మంత్రమును నిత్యం అనుష్ఠానం చేసిన ఫలితం పొందుతారు.*


*బిళ్వ వృక్షానికి ప్రదక్షిణ చేస్తే 1000 సార్లు పంచాక్షరీ మంత్రజపం చేసిన ఫలితం లభిస్తుంది.*


*జిల్లేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సూర్యభగవానుడిని అనుష్ఠానం చేసిన ఫలితం పొందవచ్చు.*


🕉️ ఓం నమశ్శివాయ ||


|| నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర ||


🔱 జై మహాకాల్ ||


🔱 జై మహాకాళి ||


🔯 ఓం శ్రీ మాత్రే నమః ||🙏🙏🙏

పంచాంగం 05.07.2025

 ఈ రోజు పంచాంగం 05.07.2025

Saturday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్ల పక్ష దశమి తిథి స్థిర వాసర స్వాతి నక్షత్రం సిద్ధ యోగః గరజి కరణం


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు. 




నమస్కారః , శుభోదయం