5, జులై 2025, శనివారం

ఈ సంసారముచేత నిల్లొడలు

 శు భో ద యం🙏


శా.

ఈ సంసారముచేత నిల్లొడలు గుల్లేకాని లేదేమి మి/

థ్యా సౌఖ్యం బనిపించు దుఃఖమయజన్మానేక మూహింపఁగా/

సీ సీ పో యనుఁగాని వానిపయినే చిత్తంబు లగ్నం బగున్

భాసాభాసము నీదు చిన్మయ ప్రభావజ్యోతి విశ్వేశ్వరా!

62

    విశ్వనాధ-విశ్వేశ్వరశతకము.

     భావము: విశ్వేశ్వరా!


ఏమున్నదీ సంసారమున

ఇల్లూ ఒళ్ళూ గుల్లైపోవటంతప్ప. సౌఖ్యమేమున్నది.సుఖపడుచున్నామను భ్రమదక్కసుఖమన్నది పూజ్యము.

      అయినా నామనసటే మొగ్గుచున్నది.మరలమరల దానికొరకై వెంపరలాడుచున్నది.

   మాయ యనగా నిదేకదా?

     నీచిన్మయజ్యోతిప్రశాశముమాత్రము నామదిలో నప్పుడప్పుడు మినుకు మినుకు మనుట మాత్రము

యదార్ధము.

   ఈమాయను మాన్పి నీజ్ఞానజ్యోతిప్ప్రకాశమును

మదిలో సుస్థిరముగ వెలుగునట్లుచేయవయ్యా!

అంటారు.విశ్వనాధ!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: