25, ఏప్రిల్ 2025, శుక్రవారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🏹🚩🌷🌹

*🍁శనివారం 26 ఏప్రిల్ 2025*

             *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది...


       *వాల్మీకి రామాయణం*

             *20 వ భాగం*

               

మరుసటి రోజూ ఉదయాన్నే దశరథుడు జనక మహారాజుతో ఇలా అన్నాడు.. “మహానుభావుడైన విశ్వామిత్రుడి అనుమతితో నాకు ఎంతో కాలం పురోహితుడిగా ఉంటున్న, మా వంశాభివృధిని కోరుకునే వశిష్ఠ మహర్షి మా వంశం గురించి చెప్తారు” అన్నారు.


“అయోధ్య నగరాన్ని పరిపాలించిన దశరథ మహారాజుగారి పూర్వీకుల గురించి చెప్తాను” అని వశిష్ఠుడు చెప్పడం మొదలుపెట్టాడు...


“మొదట బ్రహ్మగారు జన్మించారు, ఆ బ్రహ్మ నుండి మరీచి జన్మించాడు, మరీచికి కాశ్యపుడు, ఆయనకిసూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువ, పృథువకి త్రిశంకువు, త్రిశంకువుకి ధుంధుమారుడు, ధుంధుమారుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి మరియు ప్రసేనజిత్ అని ఇద్దరు కుమారులు, పెద్దవాడైన ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసితుడు, ఈ అసితుడు వరకు రాజ్యపాలనం చేశారు, ఈ అసితుడు హైహయ, తాలజంఘా, శశబింద్వ అనే వంశాల వాళ్ళతో యుద్ధంలో ఓడిపోయాడు, తరువాత ఆయన హిమాలయ పర్వతాలకి తన ఇద్దరి భార్యలతో వెళ్ళిపోయాడు, ఇంతలో ఒక భార్య గర్భం దాల్చింది మరొక భార్యకి సంతానం కలగలేదు. వేరొక భార్యకి సంతానం కలుగుతుందని ఇంకొక భార్య ఆమెకి విష ప్రయోగం చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన చ్యవన మహర్షి ఒక భార్య కడుపులో ఉన్న పిండాన్ని సంహరించడానికి రెండవ భార్య విష ప్రయోగం చేసిందని చెప్పారు. విషప్రయోగం జరిగినా చావకుండా ఆ విషంతోనే జన్మించాడు కనుక ఆ పుట్టినవాడికి సగరుడు అని (గరము అంటె విషం) పేరు పెట్టారు. ఆ సగర చక్రవర్తి ఇద్దరి భార్యలలో ఒక భార్య కుమారులైన 60,000 మంది సగరులని కపిల మహర్షిభస్మం చేశారు. మరొక భార్య కుమారుడు అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడికి దిలీపుడు, దిలీపుడికి భగీరథుడు, భగీరథుడికి కాకుత్సుడు, కాకుత్సుడికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు (ఒకసారి ఈ ప్రవృద్ధుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠుడు ఆయనని శపించాడు, అప్పుడా రాజు తిరిగి వశిష్ఠుడిని శపిద్దామనుకుంటే ఆయన భార్య అడ్డుపడి కుల గురువుని శపించద్దు అనింది, కాని అప్పటికే తన కమండలంలోని నీళ్ళు చేతిలో పోసుకున్నాడు కనుక ఆ నీళ్ళని తిరిగి తన కాళ్ళ మీద పోసుకున్నాడు, అందుకని ఆయనని కల్మషపాదుడు అని పిలిచారు), ప్రవృద్ధుడికి శంఖణుడు,శంఖణుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకుడికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నభాగుడు, నభాగుడికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు. ఇది దశరథుడి వంశం, ఈ వంశంలోని రాజులు ఎన్నో వేల వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి, యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళారు” అని వశిష్ఠుడు చెప్పాడు.


ఇదంతా విన్న జనకుడు ఎంతో సంతోషించాడు. మా వంశం గురించి కూడా చెప్తానని జనకుడు చెప్పడం ప్రారంభించాడు… “మా వంశంలో మొదటివాడు నిమి చక్రవర్తి, నిమికి మిథి(ఈయన నిర్మించినదే మిథిలా నగరం), మిథికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతు, సుకేతుకి దేవరాతుడు, దేవరాతుడికి బృహద్రథుడు, బృహద్రథుడికి శూరుడు, మహావీరుడు అని ఇద్దరు కుమారులు, మహావీరుడికి సుధృతి, సుధృతికి ధృష్టకేతువు, ధృష్టకేతువుకి హర్యశ్వుడు, హర్యశ్వుడికి మరుడు, మరుడికి ప్రతీంధకుడు, ప్రతీంధకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢ, దేవమీఢకి విబుధుడు, విబుధుడికి మహీధ్రకుడు, మహీధ్రకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి జనకుడు మరియు కుశధ్వజుడు, జనకుడికి సీతమ్మ అయోనిజగా లభించింది, తరవాత ఊర్మిళ పుట్టింది” అని జనకుడు చెప్పుకున్నాడు.


సాంకాశ్యం అనే నగరాన్ని పరిపాలిస్తున్న తన తమ్ముడైన కుశధ్వజుడిని తీసుకురమ్మని జనకుడు ఆదేశించాడు. 


కుశధ్వజుడు వచ్చాక.......```


*వీర్య శుల్కాం మమ సుతాం సీతాం సుర సుత ఉపమాం।*

*ద్వితీయాం ఊర్మిలాం చైవ త్రిః వదామి న సంశయః॥*```


“నా ఇద్దరు కుమార్తెలైన సీతమ్మని, ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, అలాగే నా తమ్ముడి కుమార్తెలైన శ్రుతకీర్తిని శత్రుఘ్నుడికి, మాండవిని భరతుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను” అని జనకుడు దశరథుడితో అన్నాడు. 


దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. తరువాత దశరథుడిని తన ఇద్దరు కుమారులతో మిథిలా నగరంలో గోదానము, పితృకార్యము చెయ్యమన్నాడు.


నేటికి రెండు రోజుల తరువాత ఉత్తర ఫాల్గుణి నక్షత్రంతో కూడి భగుడు అధిష్టాన దేవతగా ఉండగా వివాహం చేద్దామని ఋషులు నిర్ణయించారు.


దశరథుడు గోదానము, పితృకార్యము మొదలైన కర్మలను పూర్తిచేసాడు. తరువాత ఆయన నాలుగు లక్షల గోవులు,(బంగారు కొమ్ములు కలిగినవి) ఒక్కో కుమారుడితో లక్ష గోవుల్ని దానం చేయించాడు. అలాగే బ్రాహ్మణులకి బంగారము, వెండి దానం చేశాడు. వశిష్ఠుడిని, విశ్వామిత్రుడిని పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేది సిద్ధం చెయ్యమన్నారు.


దశరథ మహారాజు కన్యాదానం పుచ్చుకోడానికి బయట ఉండి జనక మహారాజుకి కబురు చేశారు.


“మిమ్మల్ని అక్కడెవరన్నా ద్వారపాలకులు ఆపుతున్నారా, దశరథుడి ఇంటికి జనకుడి ఇంటికి తేడా లేదు, మీరు తిన్నగా వచ్చేయండ”ని జనకుడన్నాడు.


అగ్నివేది సిద్ధం చేశాక, అందులో అగ్నిహోత్రాన్ని నిక్షేపించారు, అక్షతలని సమాహొరణం చేయించారు, గంధ పుష్పాలని వేశారు. 


జనక మహారాజు ఆ అగ్నిహోత్రం దగ్గర నిలబడ్డారు, రాముడు కూడా వచ్చి ఆ అగ్నిహోత్రం దగ్గర నిలుచుని ఉండగా సీతమ్మని తీసుకొచ్చారు. అప్పుడు జనకుడు రాముడితో ఇలా అన్నాడు…

```

*ఇయం సీతా మమ సుతా సహ ధర్మ చరీ తవ।*

*ప్రతీచ్ఛ చ ఏనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా ।*

*పతివ్రతా మహభాగా ఛాయ ఇవ అనుగతా సదా ||*```


“రామయ్యా! నీకు సీత ఎవరో తెలీదు కదా, ఇదుగో ఈమే సీత, ఈమె నా కూతురు. నేను నీకు ఈమెని కామ పత్నిగా ఇవ్వడంలేదు, నీతోపాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను, అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా. ఆడపిల్ల తండ్రిని కదా, అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను, కాబట్టి నన్ను క్షమించు, ఈమెని నువ్వు పుచ్చుకో, నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో(సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహుర్తం! మనం జీలకర్ర-బెల్లం పెడతాం సుముహుర్తానికి), ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది, నా భర్త అని నీ కోసమే చేస్తుంది. రామా! మాది విదేహ వంశం, మాకు దేహమునందు భ్రాంతి ఉండదు, నా కూతురిని అలా పెంచాను. ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే, అది నీ వల్లే రామా, ఎందుకంటే నేను నేర్పినదాన్ని భర్త ఉద్ధరించాలి, ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది, ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది.[ఇదంతా పై శ్లోకం యొక్క రహస్యార్ధం].


*రేపు...21వ. భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

శనివారం🍁* *🌹26, ఏప్రిల్, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        *🍁శనివారం🍁*

  *🌹26, ఏప్రిల్, 2025🌹*      

    *దృగ్గణిత పంచాంగం* 


           *ఈనాటి పర్వం*    

     *🕉️మాస శివరాత్రి🕉️*

 

  *స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - కృష్ణపక్షం*


*తిథి : త్రయోదశి* ఉ 08.27 *చతుర్దశి* (27) తె 04.49 వరకు 

*వారం    : శనివారం* ( స్ధిరవాసరే )

*నక్షత్రం : ఉత్తరాభాద్ర* ఉ 06.27 వరకు ఉపరి *రేవతి* 

రా 03.39 తె వరకు ఆపైన *అశ్విని* 

*యోగం : వైధృతి* ఉ 08.42 *విష్కుంబ* రా 04.35 తె వరకు 

*కరణం : వణజి* ఉ 08.27 *భద్ర* సా 06.40 ఉపరి

*శకుని* తె 04.49 వరకు ఆపైన *చతుష్పాద*

 *సాధారణ శుభ సమయాలు*

                   *ఈరోజు లేవు*

అమృత కాలం : *రా 01.31 - 02.56*

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.31*

*వర్జ్యం : సా 05.03 - 06.28*

*దుర్ముహూర్తం : ఉ 05.45 - 07.27*

*రాహు కాలం : ఉ 08.55 - 10.30*

గుళికకాళం : *ఉ 05.45 - 07.20*

యమగండం : *మ 01.40 - 03.15*

సూర్యరాశి : *మేషం*  

చంద్రరాశి : *మీనం/మేషం*

సూర్యోదయాస్తమయాలు : ఉ 05.45 / సా 06.25 *విజయవాడ* 

సూర్యోదయాస్తమయాలు : *ఉ 05.53 - సా 06.35*  

*హైదరాబాద్*

*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 05.45 - 08.17*

సంగవకాలం         :*08.17 - 10.49*

మధ్యాహ్న కాలం  :     *10.49 - 01.21*

అపరాహ్న కాలం   : *మ 01.21 - 03.53*

*ఆబ్ధికం తిధి        : చైత్ర బహుళ చతుర్దశి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.25*

ప్రదోష కాలం         :  *సా 06.25 - 08.41*

రాత్రి కాలం : *రా 08.41 - 11.42*

నిశీధి కాలం          :*రా 11.42 - 12.28*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.14 - 04.59*

------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర స్వామి🙏*

      *🔯పంచక స్తోత్రం🔯*


*చన్ద్రసూర్యలోచనం మహేన్ద్రనీలసన్నిభమ్*

*నాగరాఙ్గిరీశ్వరం* 

*నమామి వేఙ్కటేశ్వరమ్ ॥*


*🙏ఓం నమో వెంకటేశాయ🙏*

******************************


_*🚩హనుమ ధ్యాన శ్లోకాలు🚩*_


*భజహనుమంతం* 

*మనసా స్మరామి* 

*నిజహనుమంతం*

 *శిరసానమామి*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

లక్ష్మీ_కటాక్షం_లభించాలంటే_ఇలా_చేయండి

 *లక్ష్మీ_కటాక్షం_లభించాలంటే_ఇలా_చేయండి*



ఉదయం నిద్రలేవగానే తమ అరచేతులను 

కళ్ళకు దగ్గరగా తెచ్చుకుని చూసి, 

ముఖం మీద రెండు అరచేతులను త్రిప్పుకోవాలి.


సూర్యోదయానికి పూర్వమే ఇళ్ళు శుభ్రం

చేసుకోవాలి.


సంధ్యాసమయానికి పూర్వమే ఇల్లాలు స్నానం చేసి ఇంట్లోని దేవీదేవతలకు ధూపదీప హారతులు ఇవ్వాలి.


ఇంట్లో ఉండే దేవీదేవతల ఫోటోలకు పటాలకు కుంకుమ, చందనం, పువ్వులతో అలంకరించాలి.


సంధ్యాసమయంలో ఇళ్ళు ఊడ్చకూడదు.


ఇళ్ళు శుభ్రం చేసుకోకుండా ఉదయం అల్పాహారం తినకూడదు.


ఎటువంటి పనికి బయటకు వెళ్ళవలసి వచ్చినా ఇంటిని శుభ్రపరచుకుని బయటకు వెళ్ళాలి.


పరగడుపున ఎటువంటి కార్యార్థం కోసం అయినా బయటకు వెళ్ళవలసి వస్తే...ఒక స్పూను 

తీయని పెరుగుని నోట్లో వేసుకుని వెళ్ళాలి.


గురువారం రోజున ముత్తైదువును ఇంటికి పిలిచి శుభకరమైనది ఎదో ఒకటి దానం చేయండి, 

దీన్ని తప్పక ప్రతి గురువారం అనుసరించండి.


ధన సంబంధమైన కార్యాలకు అన్నింటికీ సోమవారం లేదా బుధవారం ప్రాధాన్యత ఇవ్వండి.


తెల్లని వస్తువులు గురువారం దానం చేస్తే 

లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.


ఆర్థికపరమైన పనుల నిమిత్తం..

బయటకు వెళ్ళేముందు లక్ష్మీ సంబంధమైన యంత్రాలను కాని శ్రీ వినాయకుడిని కానీ దర్శించుకుని వెళ్ళాలి.


శ్రీమహాలక్ష్మీదేవికి తులసీ పత్రాన్ని, తులసి మంజరిని సమర్పించాలి.


సాధనా, పూజా, ప్రార్థనా సమయంలో 

ముఖం తూర్పువైపు లేదా పశ్చిమంవైపు 

ఉండేలా చూసుకోండి.


ప్రతి శనివారం ఇంట్లోని చెత్తను శుభ్రపరచుకోవాలి, సాలెగూళ్ళు, మట్టి, చెత్త విరిగిపోయిన వస్తువులను సర్థుకోవాలి.


సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు 

చిందర వందరగా పడేయకూడదు.


గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి 

ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు.


శుక్రవారంనాడు.. ఉదయాన్నే..ఇంటి సింహద్వారం గడపకు..(ఇంట్లోని గడపలకు కూడా)

తులసి కోటకు.. పసుపురాసి..బొట్లు పెడితే..

లక్ష్మీ అనుగ్రహముతో పాటు..

ఇంట్లోని పిల్లలు వృద్ధిలోకి వస్తారు..

చెప్పినమాట వింటారు.

కొడుకులున్నవారికి..అణుకువ ఉన్న కోడళ్ళు..

కూతుర్లున్నవారికి..కొడుకుల్లాంటి..అల్లుళ్లు వస్తారు.


పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి.🙏



🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹    


              *ఆహార ప్రభావం..!!*



*మనం "భుజించే" ఆహారమును అనుసరించే మన "ఆలోచనలు" చెలరేగుతాయి.* 


*దీనిని పురస్కరించుకుని భగవద్గీతలో పాత్రశుద్ధి, పాకశుద్ధి, పదార్థశుద్ధి, అని చెప్పబడింది.*


*పదార్థశుద్ధి అనగా కేవలం కల్తీలేని ఆహార పదార్ధమని  కాదు దాని అర్థం.*


*ఎటువంటి అధర్మ మార్గములో ఆర్జించిన ధనముతో సేకరించబడిన ఆహార పదార్థమో, అటువంటి భావతరంగాల ప్రభావం ఆ ఆహారం భుకించినవాని పైన ఉంటుంది.*


*ఎట్టి ఆహారమో "అట్టి భావాలు" కలుగుతాయి...!!*


*మహాభారత యుద్ధము నందు భీష్ముడు అంపశయ్యపైన ఉన్నాడు.* 


*పాండవులు ద్రౌపదిని వెంటబెట్టుకుని వెళ్లి, దుఃఖంతో దీన వదనులై భీష్ముని వద్ద చేతులు జోడించుకొని నిలబడి ఉన్నారు.* 


*భీష్ముడు వారిని ప్రేమతో చేర పిలిచి, ధర్మప్రబోధం చేయబోతుందగా "ద్రౌపది" ఫక్కున నవ్వింది.*


*సభ్యత, సంస్కారం, సచ్ఛీలతకు ప్రతీక అయిన ద్రౌపది అటువంటి పరిస్థితిలో నవ్వడం చూసి పాండవులు నిర్ఘాంతపోయి ఆమె వైపు కోపంతో చూశారు.* 


*అది గమనించిన మహాజ్ఞాని అయిన భీష్ముడు చిరునవ్వుతో ద్రౌపదిని దగ్గరకు పిలిచి, పాండవులను ఉద్దేశించి "మహాసాధ్వి" అయిన ద్రౌపది అకారణంగా పరిహసించదు.*


*ఆమె మనోభావాలు నాకు తెలుసు.* 


*దుర్మార్గులైన కౌరవులు అమానుషంగా ప్రవర్తించినప్పుడు చెప్పని ధర్మపన్నాలు, సహజ ధర్మవర్తనులైన తన భర్తలకు ఇప్పుడు బోధించడం హాస్యాస్పదమని తోచి నవ్వింది.* 


*అది సహజం, ఆమె ప్రవర్తనలో కించిత్తు దోషం లేదు.*


*ఆనాడు దుర్యోధనుని కొలువులో ఉండటం చేత, ఆ "దుష్టార్జనతో" సంపాదించిన ఆహారంతో నా రక్తం కలుషితమయ్యింది.*


*అప్పుడు ధర్మ బోధనలు చేసే అర్హత నాకు లేదు.* 


*ఈనాడు అర్జునుని శరాఘాతంతో నాలో ఉన్న "కలుషిత రక్తం స్రవించి" ఇప్పుడు నేను స్వతంత్రుడను, ధర్మబోధన చేసే అధికారాన్ని పొందాను అని పాండవులను సమాధానపరచి ప్రసన్నులను చేశాడు.*


*ఆధ్యాత్మిక సాధనలో ఈ "ఆహార నియమం" చాలా ప్రధానమైనది ప్రభావం కలదు.*


              *🪷శుభమస్తు.🪷*

  శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::


      107వ దివ్యదేశము 🕉


🙏 తిరుప్పార్ కడల్ ( పాల కడలి). 

క్షీరసాగరం/ పాల సముద్రం.. వైకుంఠం. 🙏


🔅 ప్రధాన దైవం:.క్షీరాబ్దినాథ పెరుమాళ్ (వ్యూహమూర్తి)

🔅 ప్రధాన దేవత: శ్రీ మహాలక్ష్మీ , 

క్షీరాబ్దిపుత్రి .

🔅 తీర్థం : అమృత తీర్థం

🔅 విమానం: అష్టాంగ విమానము

🔅 ప్రత్యక్షం: బ్రహ్మ రుద్రాదులకు ప్రత్యక్షము


🔔 స్థలపురాణం 🔔


" ఖ్యాతం క్షీరాబ్దినాథం కలశజలదిజా భూమి సంవాహితాంఘ్రిం

 తీర్థం దివ్యం సుదాఖ్యం కలశభవ దిశం వీక్షమాణం సురేడ్యమ్‌|

అష్టాంగాఖ్యే విమానే దవళమృదుతరే శేషభోగేశయానం

ప్రాదుర్బూతం విభూత్యై శ్రుతి విమలహృదాం విశ్వరూపం ప్రపద్యే "||


💠దేవతలకు, సనకసనందనాది యోగులకు మాత్రము దర్శింపవీలైనది


💠పాలకడలిలో ఉన్న పురుష స్వరూపం శుద్ద సత్త్వ రూపం - అది అవతారాలకు భీజం


💠యస్యావయావ సంస్థానైః కల్పితో లోక విస్తరః |

తద్వై భగవతో రూపమ్ విశుద్ధమ్ సత్త్వమ్ ఊర్జితమ్ ||


💠నాభి కమలం లోంచి చతుర్ముఖుడిని తీసుకువచ్చిన రూపం భగవంతుడి మొదటి రూపం.

 "విశుద్ధమ్ సత్త్వమ్ ఊర్జితమ్", అది కేవలం సత్త్వం తప్ప మరొకటి ఏదీ లేనిది. 

సృష్టి చేయాలంటే రజో గుణం  ఉండాలి. 

ఈ సృష్టి చేసే చతుర్ముఖాదులనందరినీ వెలికి తీసిన ఆ పాలకడలిలో ఉన్న స్వామి స్వరూపం ఏదైతే ఉందో అది ఏరకమైన రజో గుణం చేత కానీ, తమో గుణం చేత కానీ ధూషితమైనది కాదు. అది కేవలం విశుద్ధం. పరమ సత్త్వమైనది. 


💠మనలో కూడా సత్త్వం ఉంది కానీ అది రజస్సు తమస్సులచే ధూషితమైనది. దేవతలకీ సత్త్వం ఉంది కానీ వారి సత్త్వం కూడా రజస్సు తమస్సులచే ధూషితమైనది. రజస్సు తమస్సులతో కలిసినదే తప్ప విశుద్ద సత్త్వం కాదు.


💠 పాల కడలిలో పవళించి ఉన్న స్వామిది మాత్రమే విశుద్ద సత్త్వం. 

సహజమైన రూపంలోంచి వచ్చాడు కనుక అక్కడ ఎట్లాంటి దోషాలు ఉండవు. 

చాలా ఉత్కృష్టమైనది.


ఏతన్ నానావతారాణామ్ నిధానమ్ బీజమ్ అవ్యయమ్ |

యస్యాంశాంశేన సృజ్యంతే దేవ తిర్యన్ నరాదయః ||


💠ఈనాడు మనం వింటున్న దేవతా శరీరాలు కల వాళ్ళు ఎందరు ఉన్నా నర దేహాలు కల వాళ్ళు ఎవరున్నా తిర్యగాదులు ఎన్నున్నా స్థావరాదులు ఎన్నున్నా ఇవన్నీ కూడా ఆ పాలకడలిలో ఉన్న పురుష స్వరూపంలోంచి వచ్చినవే. 

అందులో ఉన్న జ్ఞానంలోంచి ఒక చిన్న అంశ.ఏయే అవతారాల గురించి వింటున్నామో అవన్నీ దాంట్లోచి వచ్చినవే. "నానావతారాణామ్ నిధానమ్", వీటన్నింటికీ కూడా ఆది కారణం ఆ పాలకడలిలో ఉండే స్వరూపం.

 "బీజమ్", అది భీజం. అందులోంచే అన్నీ బయటికి వస్తాయి. అట్లా బయటికి వస్తే అది తరుగుతుందా ? "అవ్యయమ్", అది ఎప్పుడూ తరిగిపోదు, అది మార్పు చెందకనే ఉంటుంది. ఇది భగవంతుడు మొట్ట మొదట ధరించిన స్వరూపం.   


💠ఈ దివ్య క్షేత్రం ఖగోళ ప్రపంచంలో ఉంది.

ఈ భూమిపై లేదు.


💠మానవ శరీరం తో దర్శించడం అసాధ్యం.

కేవలం పరమ భాగవతోతములు మాత్రమే మరణం తర్వాత దర్శించే వీలు ఉన్న దివ్యదేశం.


💠దీనికి విష్ణులోకం అని కూడా పేరు.   వైకుంఠంలో పాల సముద్రం మధ్యన ఆదిశేషునిపై విష్ణుమూర్తి లక్ష్మీ సమేతంగా ఉంటాడు. వైకుంఠం పైన ఉండేది  పరమపదం ( శ్రీమన్నారాయణ ప్రత్యక్ష చరణ సన్నిధి)   అది సమస్త లోకాల కంటే పైన ఉంటుంది, దానికి ఆవల మరింకేమీ లేదని శ్రీమద్రామానుజులు ప్రవచించారు. వైకుంఠానికి జయ విజయులు ద్వార పాలకులు. 


💠వైకుంఠం 2,62,00,000 యోజనాల దూరంలో, సత్యలోకానికి (బ్రహ్మలోకం) ఆవల మకరరాశిలో ఉంటుంది. 

విశ్వానికి దక్షిణాగ్రం విష్ణుమూర్తి నేత్రమనీ, అక్కడి నుండే విష్ణువు విశ్వాన్ని పాలిస్తూంటాడనీ ఒక భావన..


🙏 జై శ్రీమన్నారాయణ 🙏 *భారతీయం* 🔔


సింధు నది జలాల ఒప్పందం అంటే ఏమిటి? కేంద్రం నిర్ణయంతో పాకిస్తాన్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది?


కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పహల్గాం దాడి కారణంగా భారత్‌ పాకిస్తాన్‌తో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంటుంది.


అటారీ బార్డర్‌ కూడా మూసివేయనుంది. ఇక పాకిస్తాన్‌తో ఉన్న సింధు నది జలాల ఒప్పందంపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. కొన్ని ఏళ్ల క్రితం చేసుకున్న సింధూ నది జలాల ఒప్పందం కూడా సస్పెండ్ చేసింది. ఈ అగ్రిమెంటు నిలిపివేయడం వల్ల చిన్న సింధు నది, జీలం, బియాజ్, సట్లేజ్‌ నది నీళ్లు పాకిస్తాన్ కి నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిలియన్ల మంది ప్రజలు పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నదులు అక్కడి ప్రజలకు ప్రధాన వనరులు. వ్యవసాయం ఇతర అవసరాలను తీరుస్తాయి.


సింధూ నది అగ్రిమెంట్ ఏమిటి ?

సింధూ నది అగ్రిమెంటు 1960 సెప్టెంబర్ 19వ తేదీ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగింది. వరల్డ్ బ్యాంక్ సమక్షంలో ఇరుదేశాలు సంతకం చేశాయి. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య 1965, 1971, 1999 మధ్య యుద్ధం వచ్చినా కానీ ఈ నీటి జలాల పంపకంలో ఎలాంటి నిలుపుదల చేయలేదు. కానీ, తాజాగా పహల్గాం దాడి తర్వాత ఈ నీటిని నిలిపివేసింది భారత్. ఈ సింధు నది జలాల అగ్రిమెంటు కరాచీలో భారత ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు మార్షల్ అయుభ్‌ ఖాన్‌ మధ్యలో జరిగింది.


ఈ అగ్రిమెంటు ప్రకారం తూర్పు దిశగా వెళ్లే బియాస్, రవి, సట్‌లేజ్‌ ఇండియాలో ఉండే ఈ ఉపనదులన్నీ ఏడాదికి 41 బిలియన్ మెట్రిక్‌ క్యూబ్ ఇండియా ఉపయోగిస్తుంది. అయితే పశ్చిమ దిశగా వెళ్లే నదులు అయిన సింధు, చీనబ్‌, జీలం 99 బిలియన్ల మెట్రిక్‌ క్యూబ్స్ పాకిస్తాన్ వినియోగించుకుంటుంది. అంటే 30% నీటిని ఇండియా వినియోగిస్తే సింధూ నది వ్యవస్థలో పాకిస్తాన్ మాత్రం 70% నీటిని వినియోగిస్తుంది.జీల, చీనబ్‌ ఉపనదులపై భారత్‌ కిషన్‌ గంగా ప్రాజెక్టును కూడా నిర్మిస్తోంది.


భారతదేశం ప్రవాహాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. నీటి ప్రవాహం తగ్గడం వల్ల పంట వైఫల్యాలు, దిగుబడి తగ్గడం, ఆహార అభద్రత ఏర్పడవచ్చు. ముఖ్యంగా గోధుమ, వరి, పత్తి వంటి పంటలు పండవు. దీంతో ఆహార కొరత ఏర్పడుతుంది.


2019 పూల్వామా అటాక్‌ జరిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేదు అని చెప్పారు. ప్రస్తుతం మంగళవారం పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రమూక టీఆర్‌ఎఫ్‌కు లష్కరే తోయిబాకు సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈ నది జలాల ఒప్పందంతో పాటు పాకిస్తానీయులకు వీసా కూడా నిలుపుదల చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో 27 మంది టూరిస్టులు చనిపోయారు.




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

పునరపి జననం

 *పునరపి జననం పునరపి మరణం* 


*పునరపి జననీ జఠరే శయనం* 

*ఇహ సంసారే బహు దుస్తారే* 

*కృపయా పారే పాహి మురారే* 



*భజగోవిందంలో చెప్పిన ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే... "మళ్లీ మళ్లీ పుట్టడం, మళ్లీ మళ్లీ చావడం, మళ్లీ మళ్లీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం, ఈ అంతు లేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం ఎంతో కష్టమైన పని. కనుక ఓ కృష్ణా! దయచేసి మమ్ములను రక్షించు". మన వాసనలు, కర్మఫలాల కారణంగా ఏదో ఒక దేహాన్ని ధరించి జన్మ పొందుతాము. ఆ జన్మలో కొన్ని వాసనలు, కర్మఫలాలను ఖర్చు చేసుకుంటాము. మళ్లీ కొన్ని కర్మలు చేస్తూ కొత్తగా కొన్ని కర్మఫలాలను, వాసనలను ప్రోగు చేసుకుంటాము. మళ్లీ ఈ వాసనలు, కర్మఫలాల మూటను నెత్తిన పెట్టుకొని ఒక శరీరం నుండి మరో శరీరానికి ప్రయాణిస్తుంటాం. ఈ ప్రకారంగా అనేక జన్మలను మళ్లీ మళ్లీ ఎత్తుతూ ఉంటాం. ఈ జనన, మరణ చక్రంలో బంధింపబడతాం.*


*ఈ వాసనలు, కర్మఫలాలు ఉన్నంతకాలం ఈ జనన, మరణాలు తప్పవు. అసలు ఈ వాసనలు, కర్మఫలాలు ఎలా ప్రోగు పడతాయనేది ప్రశ్న. ప్రతి మానవుడూ ఏవో కర్మలను చేస్తుంటాడు. మమకారంతో, కోరికతో, రాగద్వేషాలతో కర్మలు చేసినప్పుడు చేసిన కర్మల కారణంగా కర్మఫలాలు, కోరికల కారణంగా వాసనలు చేరుకుంటాయి. ఈ కర్మఫలాలు, వాసనలు రాకుండా ఉండాలంటే కర్మలు చేయకుండా ఉంటే సరిపోతుంది. అయితే మానవుడు ఏ పనీ చేయకుండా ఉండడానికి బండరాయి కాదు కనుక పని చేయాల్సిందే. 'కుర్వన్నే వేహ కర్మాణి' అని ఈశావాస్యోపనిషత్లో చెప్పినట్లు 'ఇక్కడ కర్మలు చేస్తూ ఉండవలసిందే! 'నహికశ్చన్ క్షణమపి జాతుతిష్టత్య కర్మకృ త్' అని భగవద్గీతలో బోధించినట్లు 'కర్మలు చేయకుండా ఒక్కక్షణం కూడా ఉండే వీలు లేదు. అయితే ఎలా చేయాలి? కోరికలు లేకుండా... నేను చేస్తున్నాను అనే స్పృహ లేకుండా అనగా కర్తృత్వ బుద్ధి లేకుండా, కర్తవ్యతా భావంతో, భగవ దర్పణ బుద్ధితో, కర్మలతో ఎట్టి సంగభావమూ లేకుండా నిష్కామంగా చేయాలి. ఇలా చేసినప్పుడు కొత్త వాసనలు దరి చేరవు. కర్మఫలాలు కూడా అంటవు. అయితే ఇలా చెయ్యాలంటే మనం మన నిజస్వరూపం ఏమిటో తెలుసుకొని, మన స్వస్వరూపమైన ఆత్మలో నిలిచి, పరమాత్మలో మనస్సు నిల్పి నిర్లిప్తంగా చేయాలి. అలా చేసినప్పుడే ఇక పునర్జన్మ ఉండదు. అలా చేయనంత కాలం ఈ పుట్టడం, చావడం అనే చక్రబంధంలో ఇరుక్కుపోవాల్సిందే.*


*జనన, మరణాల వల్ల మనకు ఏమిటి నష్టం? పుట్టేటప్పుడు ఏడుపు, పెరిగేటప్పుడు ఏడుపు, రోగాలొస్తే ఏడుపు, ముసలితనం వస్తే ఏడుపు, కోరుకున్నట్లు జరగకపోతే ఏడుపు, నీది అనుకున్నది దూరమైతే ఏడుపు. చివరకు మరణించేటప్పుడు కూడా 'అయ్యో! అన్నింటినీ, అందర్నీ వదిలి పోతున్నానే అని ఏడుపు. ఆ అవ్యక్తలోకాల్లో ఎన్ని కష్టాలు పడాలో, ఎంత నరకం అనుభవించాలో అని ఏడుపు.*


*మళ్లీ పుట్టేటప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించాలి. అక్కడ తల్లి తీసుకున్న ఆహారంతో పెరగాలి. అక్కడ ఉండడానికి చాలా ఇరుకు, సూక్ష్మజీవులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జుగుప్సాకరమైన రక్తము, చీము, మాంసం మొదలైన పదార్థాలతో నివాసం. ఇక ఉండడం కూడా తల క్రిందకు మోకాళ్లకు ఆని ఉంటుంది. అంతా ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. అంతటి దుర్భరం, బాధాకరమైనది గర్భనరకం.*


*ఇట్టి బాధాకరమైన పరిస్థితి నుండి మనలను మనం ఉద్దరించుకోవాలంటే మనకు సాధ్యమేనా? మన శక్తి సరిపోతుందా? చాలదు. కనుక పరమాత్మను ఆశ్రయించాలి. 'ఓ ప్రభూ! ఇక నీవే నాకు దిక్కు అని శరణు కోరాలి. భగవంతునితో తాదాత్మ్యం చెందాలి. ఆయనను విడిచి ఒక్క క్షణమైనా ఉండరాదు. ఇలా భగవంతుని ఆశ్రయించి, జనన మరణ చక్రం నుండి విడుదల పొందితే జీవన్ముక్తులవుతాం.*


🌹🙏🌴🪔🪔🪔🌴🙏🌹

శ్రీ ఆది శంకరాచార్యులు వారు.

 🔔 *సత్సంగం* 🔔


శ్రీ ఆది శంకరాచార్యులు వారు.

        

శ్రీ ఆది శంకరాచార్యుల వారు , శిష్యులతో కాశి విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు.


గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట


“నేను 3 దోషములు/పాపములను చేశాను. నన్ను క్షమించు” అని ప్రాధేయ పడ్డారు.


ఇది విన్న శిష్యులు “ఆచార్యులవారు, ఏమి పాపమలు చేశారని ప్రాయశ్చిత్త పడుతున్నారు ?” అని అనుకున్నారు.


ఒక శిష్యుడు,ఏమిటి ఆ పాపము నేను తెలుసుకోవాలి అని ఆచార్యుల వారిని అడిగాడు. దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు.


1. “నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను. సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేస్వరుడిని చూడడానికి మటుకు కాశి నగరానికి వచ్చాను. అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను.


అది నేను చేసిన మొదటి దోషం. 


2. తైత్త్రియ ఉపనిషద్ లో “యతో వాచో నివర్తన్తే , అప్రాప్య మనసా సః ” భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు” ఇది తెలిసి కూడా శ్రీ కాశి విశ్వనాధ అష్టకం వ్రాశాను. ఇది నేను చేసిన రెండవ తప్పు. 


3. నిర్వాణ శతకం లో

“న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఃఖం. న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః

అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం“ అని వ్రాశాను. 


అర్థము :

నాకు పాప పుణ్యములు, సుఖ దుఃఖములు లేవు. మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము, భోజనము, భోక్త (భుజించేవాడు) నేను కాదు!నేను చిదానంద స్వరూపుడను, శివుడను, శివుడను!


ఇంత వ్రాసికుడా నేను తీర్థయాత్రలు చేస్తున్నాను అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. అందుకనే నేను చేసిన ఈ మూడు తప్పులని మన్నించమని ,ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను.


నీతి :


మన ఆలోచన, తీరు, మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి కథ మనకి తెలియజేస్తోంది.


*బయట ప్రపంచం మన పని తీరుని మట్టుకే చూస్తుంది. భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని , ఉద్దేశాన్ని కూడా చూస్తాడు.*


“మనస్ ఏకం , వచస్ ఏకం , కర్మణ్యేకం!”


ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధితో, ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము


https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

మేఘసందేశం కాళిదాసు 🙏 రెండవ భాగము

 🙏మేఘసందేశం కాళిదాసు 🙏

                       రెండవ భాగము 

నాయకులు నాలుగు రకాలు. వారినే చతుర్విధ నాయకులు అంటారు. ధీరోదాత్తుడు (వీరత్వం అధికంగా ఉండి ఆవేశం లేకుండా ఆలోచన కలవాడు ఉదా: శ్రీ రాముడు), ధీరోద్ధతుడు (వీరత్వం ఎక్కువగా ఉండి ఆలోచన ఏ మాత్రం లేనివాడు ఉదా: భీముడు), ధీర లలితుడు (వీరత్వం, లాలిత్యం సమపాళ్ళలో కలిసిన ప్రేమ స్వరూపుడు ఉదా: శ్రీ కృష్ణుడు), ధీర శాంతుడు (శాంతాన్ని అధికంగా కలిగిన వీరుడు ఉదా: గౌతమ బుద్ధుడు). కాళిదాసు తన రచనలలో నాయకుడిని ఎప్పుడూ ధీరోదాత్తునిగానే మలుచుకుంటాడు. శాకుంతలంలో అదే జరిగి అభిజ్ఞానశాకుంతలం అయ్యింది కదా! ఈ మేఘ సందేశంలో కూడా నాయకుడైన యక్షుని ధీరోదాత్తునిగానే చూపాడు (పూర్వ మేఘం, మూడవ శ్లోకంలో).


శృంగార నాయికలు ఎనిమిది రకాలు. వారినే అష్టవిధ శృంగార నాయికలు అంటారు. వారిలో నలుగురిని ఎన్నుకుని, ఒక్కొక్కరిగా ఈ కావ్యంలో పూర్వమేఘంలో పరిచయం చేశాడు కాళిదాసు. 


త్వా మారూఢం పవనపదవీ ముద్గృహీతాలకాన్తాః

ప్రేక్షిష్యన్తే పథికవనితాః ప్రత్యయాదాశ్వ సన్త్యః ।

కః సన్నద్ధే విరహవిధురా త్వయ్యుపేక్షేత జాయాం

న స్యాదన్యోఽప్యహమివ జనోయః పరాధీనవృత్తిః ॥


అంటూ ముందుగా పథికవనితాః అనగా ప్రోషిత భర్తృక గురించి చెప్పాడు. భర్త దూరంగా (పని మీద ఎక్కడికైనా వెళ్ళినా, దేశాంతరం వెళ్ళినా) ఉన్నప్పుడు తన గురించి ఆలోచిస్తూ విరహంతో ఉండే స్త్రీని ప్రోషిత భర్తృక అంటారు. మేఘుడు కామ ప్రకోపన చేసేవాడు. అసలే విరహంతో ఉండే స్త్రీలు నీ (మేఘుని) రాకతో, తమ భర్తతో కలవాలన్న కోరిక పెరిగి, భర్త కూడా అదే కాంక్షతో వస్తాడు అన్న ఆశతో తమ ఫాల భాగం మీద పడుతున్న ముంగురులను పైకి ఎత్తి నిన్ను చూస్తారు. అటువంటి స్త్రీని విడిచి అశక్తుడు, అస్వతంత్రుడు, పరాధీనుడు అయిన మగవాడు తప్ప మరెవ్వరూ ఉండలేరు అంటాడు. ప్రస్తుతం యక్షుని పరిస్థితి అదే కనుక ఆమెకు దూరంగా ఉన్నందుకు చింతిస్తూ మేఘుని వెళ్ళి తన క్షేమ సమాచారం తెలియ చేయమంటాడు. దీనికి సమర్ధింపుగా ఉత్తర మేఘంలో 21, 22, 23, 24, 25 శ్లోకాలలో యక్షుని భార్యలో ఉన్న ప్రోషిత భర్తృక లక్షణాలన్నీ విశదీకరిస్తాడు. కాళిదాసుకి ఈ ప్రోషిత భర్తృక అంటే ప్రత్యేక అభిమానం అనిపిస్తుంది. అభిజ్ఞాన శాకుంతలంలో కూడా శకుంతలని ప్రోషిత భర్తృక (దూర్వాస మహాముని శాపానికి కారణమయినప్పుడు) గానే చూపిస్తాడు.  


గచ్ఛన్తీనాం రమణవసతిం యోషితాం తత్రనక్తం

రుద్ధాలోకే నరపతి పథే సూచి భేద్యై, స్తమోభిః ।

సౌదామన్యా, కనక నికషస్నిగ్ధయా దర్శయోర్వీం

తోయోత్సర్గస్తనితముఖరో మాస్మభూర్విక్లవాస్తాః ॥


అంటూ రమణవసతిం గచ్ఛన్తీనాం అనగా అభిసారిక గురించి చెప్పాడు. అందంగా అలంకరించుకుని, ప్రియుని వద్దకు తాను వెళ్ళే స్త్రీని అభిసారిక అంటారు. ఉజ్జయనిలోని స్త్రీలను వర్ణిస్తూ చెప్పిన ఈ శ్లోకంలో అక్కడి అభిసారికలు (స్త్రీలు) రాత్రిపూట ప్రియుని ఆవాసానికి బయలుదేరతారు కనుక ఆ సమయంలో నువ్వు (మేఘుడు) మెఱుపులతో దారి చూపు కానీ ఉరుముతూ వాన పడి వారిని భయపెట్టకు. వారసలే మిక్కిలి భయస్తులు అని మేఘుడిని హెచ్చరిస్తూ స్త్రీలతో సున్నితత్వం వహించాలని చెప్తాడు. పూర్వ మేఘంలో ఉజ్జయినిలోని (కాళిదాసు నివాస స్థలం) అభిసారికలు ప్రియుని వద్దకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారో చెప్పిన కాళిదాసు ఉత్తర మేఘంలో (తొమ్మిదవ శ్లోకంలో) అలకాపురిలోని (యక్షుని నివాస స్థలం) అభిసారికలు తమ ప్రియుని వద్ద నుండీ వచ్చేటప్పుడు ఎలా ఉంటారో వివరిస్తాడు. దీని ద్వారా కాళిదాసు పురుషుల ఏక పత్నీత్వం, స్త్రీల పాతివ్రత్యం ఇష్టాధీనమే కానీ కృత్రిమం కాదు అని చెప్తున్నాడనిపిస్తుంది. మన నాయకుడయిన యక్షుడు ఏకపత్నీ వ్రతుడు, ముందుగా చెప్పుకున్నట్టు ధీరోదాత్తుడు కాకపోతే తన భార్యకి మేఘుడిని బ్రతిమాలుకుని మరీ సందేశం పంపవలసిన అవసరం లేదు కదా! అలా మన నాయకుని ధీరోదాత్త లక్షణం మళ్ళీ చూపాడు.


తస్మిన్కాలే నయన సలిలం యోషితాం ఖణ్డితానాం

శాన్తిం నేయం ప్రణయిభిరతో వర్త్మభానోస్త్య జాశు ।

ప్రాలేయాస్రం కమలవదనాత్సోఽపి హర్తుం నలిన్యాః

ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్ఫాభ్యసూయః 


అంటూ ఖణ్డితానాం అనగా ఖండిత నాయిక గురించి చెప్పాడు. రాత్రంతా పర స్త్రీతో గడిపి, తెల్లవారిన తరువాత రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన భర్తని చూచి దుఃఖించే స్త్రీని ఖండిత అంటారు. ఆ సమయంలో అనగా సూర్యోదయ సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన భర్తలు తమ భార్యల కన్నీరు తుడుస్తారు. ఈ శ్లోకంలో పద్మం అనే ఖండిత స్త్రీ ముఖము నుండీ కారే మంచు అనే కన్నీటిని తొలగించే భర్త (లేదా ప్రియుడు) సూర్యుడు అని వర్ణించాడు. అటువంటి సూర్యునికి నువ్వు (మేఘుడు) అడ్డు రాకుండా, తన కిరణాలు అనే చేతులతో మంచు అనే కన్నీటిని తుడవనివ్వు, ప్రేయసీ ప్రియుల మధ్యలో నువ్వెందుకు? అడ్డు తొలగు అంటూ హితోపదేశం చేస్తున్నాడు.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కుదిరిన సంధి:

 కుదిరిన సంధి: (సరదాగా చేసిన ఓ చిన్న ప్రయత్నం)


అతి+అంత, అత్యంత సుందరమైన రాజ్యం "యణా దేశం"! మహా+ఉన్నతమైన, మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు ఆ దేశపు మహారాజు "గుణ సంధుడు". దేశ+ఔన్నత్యం, దేశౌన్నత్యమే , ఏక +ఏక, ఏకైక లక్ష్యంగా తన రాజ్యాన్ని "వృద్ధి" చేశాడు అతడు. అటువంటి ఉన్నత సంస్కారం "కలవారి" ఇంట పుట్టినది, సౌందర్యంతో పాటు చక్కని గుణగణాలు "కలది" ఆ దేశపు యువరాణి "బహువ్రీహి" ! 


తన చుట్టూ "ఒకటి" కాదు, "రెండు" కాదు....అసంఖ్యాకమైన మిత్రులను ఏర్పరుచుకుని "ద్విగు మహారాజు" , పక్కనే ఉన్న "గసడదవా దేశాన్ని" రాజ్యము+చేయు, రాజ్యముసేయు చుండెను. ఆ దేశపు యువరాజు, అత్యంత పరాక్రమశాలి, చక్కటి శరీర+ఆకృతి, శరీరాకృతి కలిగి ఉండిన, సుందర+అతిసుందరుడు, సుందరాతిసుందరుడు అయిన "సవర్ణ దీర్ఘ సుందరుడు", యణా దేశపు యువరాణి బహువ్రీహిని ప్రేమించాడు. 


ఓ విహార యాత్రలో సవర్ణ దీర్ఘ సుందరుడిని చూసి, తాను కూడా అతడిని మోహించింది, బహువ్రీహి! అదే విషయాన్ని మొదట+మొదట, మొట్టమొదట తన తల్లి అయిన "ఆమ్రేడిత" తో చెప్పింది. తండ్రి గుణ సంధుడు కూడా సంతోషంగా ఇందుకు ఒప్పుకుని, వారిరువురికీ వివాహం చెయ్యడానికి నిశ్చయించుకుని, అదే విషయాన్ని ద్విగు మహారాజుకి వర్తమానం పంపాడు. ద్విగు మహారాజు కూడా ఆనందంగా ఇందుకు ఒప్పుకున్నాడు. 


వారిద్దరి వివాహం ఖరారైన నేపథ్యంలో , బహువ్రీహి ప్రధాన చెలికత్తె అయిన "ఉత్పలమాల" "భరనభభరవ... భళి భళి" అంటూ ఉత్సాహంతో ఎగిరి గంతేసింది. "తాన తానన తాన తానన తాన తానన తాన తా" అంటూ "రస(జజ)భరితంగా" యువరాణి గుణ గణాలను గానం చేసింది...."మత్తకోకిల" ! 


ఇదిలా ఉండగా....


వజ్రము+గనులు, వజ్రపుగనులు, మిక్కుటంగా కలిగి, ప్రపంచము+అంగడి, ప్రపంచపు అంగడిలో వ్యాపార లావాదేవీలను జరుపుతూ, మిక్కిలి సంపన్న దేశంగా వెలుగొందుతోంది "పుంప్వా దేశం". ఈ పై వివాహ విషయాన్ని వార్తాహరుల ద్వారా తెలుసుకుని గట్టిగా నిడు+ఊర్పు, నిట్టూర్చాడు ఆ దేశపు చక్రవర్తి, " ద్విరుక్త టకారుడు" ! ఇది ససేమిరా తనకు నచ్చలేదు. బహువ్రీహి పై తనకు ఎప్పటి నుండో మోజు ఉంది. సమయం కోసం వేచి చూస్తున్న ద్విరుక్త టకారునికి, ఇదే సరైన సమయం అని తోచి...అహంకార గర్వంతో, బహు వ్రీహి ని తనకు ఇచ్చి వివాహం చెయ్యమని, లేని పక్షాన "ద్వంద్వ"యుధ్ధానికి సిధ్ధం కమ్మని....తన వద్ద పనిచేసే అన్న-తమ్ముడు, అన్నదమ్ములు అయిన జయవిజయులను రాయబారానికి యణా దేశానికి పంపాడు. 


తాను ఒక్కడినే ద్విరుక్త టకారుని ఓడించడం కష్టమని, ద్వంద్వ యుద్దము లో ఓడిపోవడం ఖాయమని తలంచి యణా దేశపు రాజు గుణ సంధుడు, ద్విగు మహారాజు తో సమావేశం అయి పరిష్కారాన్ని కోరాడు. అందుకు ద్విగు మహారాజు ఒప్పుకుని, ఉత్తరాదిన ఉన్న తన మిత్రదేశాల రాజుల సహాయం కూడా కోర దలచి, అందరూ కలసి యుధ్దం చేస్తే ద్విరుక్త టకారుడిని జయించడం అంత కష్టమైన విషయం కాదని ఎంచి, ఉత్తర భారతానికి ప్రయాణం కట్టాడు ద్విగు మహారాజు. 


అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ, దారిలో వృద్ధురాలు, పేద+ఆలు, పేదరాలు అయిన "రుగాగమ" ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆమెకు అభయమొసగి, తిరిగి ప్రయాణం కొనసాగించి ఉత్తర భారతం చేరుకున్నాడు ద్విగు మహారాజు. 


"ఆ - ఈ - ఏ" అంటూ తన రాజ్యం లోనికి స్వాగతం పలికాడు "త్రిక సంధుడు" . విషయం విని తన మద్దతు ప్రకటించాడు. ఆ+కన్య, అక్కన్య వివాహం తమ చేతుల మీదుగా చేద్దాం అంటూ హామీ ఇచ్చాడు. 


సంధి కై ప్రయత్నించుదుము, సంధి కుదరని యెడల మనమెటుల ఊరడిల్లి+ ఉండు, ఊరడిల్లియుండగలము, కలసి పోరాడుదాం అంటూ "యడాగముడు" కూడా బదులిచ్చాడు. 


జగత్+నాటక, జగన్నాటక సూత్రధారి అయిన పరమాత్ముని అండ మనకి ఉండగా, ద్విరుక్త టకారుడిని దండించి తీరుదాం అని, పక్క దేశపు మహారాణి అయిన "అనునాసిక" తన మద్దతు తెల్పింది.


నా అంతః+ఆత్మ, అంతరాత్మ కూడా అదే చెబుతోంది అంటూ "విసర్గ" దేశపు పట్టపురాణి బదులు పలికింది. 


"అత్వ", "ఇత్వ", "ఉత్వ", "శ్చుత్వ", "జశ్త్వ" దేశాల రాజులు కూడా వంత పాడారు. 


అందరి మద్దతు కూడగట్టుకున్న ద్విగు మహారాజు మరియు గుణ సంధులు, ద్విరుక్త టకారుడు భయము+పడె, భయపడేలా, నివ్వెరము+పాటు, నివ్వెరపాటు కి లోనయ్యేలా "పడ్వాదు"లను రాయబారానికి పంపి, ముందుగా సంధి ప్రయత్నం చేశారు.


విషయాన్ని గ్రహించిన ద్విరుక్త టకారుడు.... అన్ని దేశాల రాజులు కలసి తనపై యుధ్దం ప్రకటిస్తే, తనకు ముప్పు తప్పదని తెలుసుకున్నాడు. అంత బలగం ముందు తానొక చిరు+ఎలుక, చిట్టెలుక అని తెలుసుకుని, తాను ప్రతిపాదించిన విషయాన్ని వెనక్కి తీసుకుని, సంధి కి ఒప్పుకున్నాడు! అంతే కాదు తన వాణిజ్యం కూడా దెబ్బ తింటుంది అని గ్రహించి, తనకున్న వజ్రపు గనులలో కొన్నిటిని సవర్ణ దీర్ఘ సంధుడు-బహువ్రీహిల పేరిట 

రాసిచ్చి, దగ్గరుండి వారిద్దరి వివాహాన్ని కూడా జరిపించాడు. 


అందరూ ఎంతో సంతోషించి, గట్టిగా చప్పట్లతో తమ హర్షధ్వానాలు తెలియజేశారు!! 


ఒరేయ్.... ! లే....ఏవిటా చప్పట్లు, నువ్వూనూ. తెలుగు పరీక్ష అనేసరికి ఎక్కడలేని కలవరింతలు, పలవరింతలూను. ముందుగానే కొంచెం చదువుకుని ఉండొచ్చుగా! తెల్లారి అయిదు కావస్తోంది...లే...లేచి కూచుని చదువుకో, తొమ్మిదింటికి పరీక్ష కి వెళ్ళాలి....! 


తల్లి కేకతో, ఆమె అటుగా వెళ్లిన తరువాత సందు చూసుకుని సంధులు పక్కన పెట్టి, తయారై పరీక్షల సందడి లో మునిగిపోయాడు తొమ్మిదో తరగతి చదువుతున్న సందేశ్! 


అమ్మ, నాన్నగార్ల ఆశీస్సులతో

అయ్యగారి కృష్ణకుమార్.

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం

జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః 

జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి (39)


అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి 

నాయం లోకో௨స్తి న పరో న సుఖం సంశయాత్మనః (40)


శ్రద్ధాసక్తులూ, ఇంద్రియనిగ్రహమూ కలిగినవాడు బ్రహ్మజ్ఞానం పొందుతాడు. జ్ఞానం కలిగిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అజ్ఞానం, అశ్రద్ధ, అనుమానం మనిషిని పాడుచేస్తాయి. అడుగడుగునా సందేహించేవాడికి ఇహలోకంలో కూడా సుఖశాంతులుండవు.

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

                    

శ్లో𝕝𝕝 *విపత్తిష్వవ్యథో దక్షో నిత్యముత్థానవాన్నరః|*

         *అప్రమత్తో వినీతాత్మా నిత్యం భద్రాణి పశ్యతి||*


తా𝕝𝕝 " *ఆపత్కాలంలో క్రుంగిపోనివాడికి, కార్యనిర్వహణలో నేర్పు కలవాడికి, అప్రమత్తంగా మెలిగేవాడికి, వినయవిధేయతలు కలవాడికి ఎల్లప్పుడు శుభాలే చేకూరతాయి* "


 ✍️🌸💐🌹🙏

⚜ శ్రీ చింతమన్ గణేష్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1091


⚜ మధ్యప్రదేశ్  : ఉజ్జయిని


⚜  శ్రీ చింతమన్ గణేష్ ఆలయం



💠 సనాతన ధర్మంలో జ్యోతిష్యానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 

జ్యోతిష్కుల ప్రకారం, జాతకచక్రంలోని గ్రహాలను రెండు వర్గాలుగా విభజించారు. 

చంద్రుడు, బుధుడు, గురువు మరియు శుక్రుడు శుభ గ్రహాలుగా భావిస్తారు. అయితే, కుజుడు , రాహువు, కేతువు మరియు శని గ్రహాలను అశుభ గ్రహాల వర్గంలో ఉంచారు. 

శుభ గ్రహం ఉంటే ఆ వ్యక్తికి త్వరలో వివాహం జరుగుతుంది. 

అదే సమయంలో, అశుభ గ్రహాల వల్ల వివాహానికి ఆటంకాలు కలుగుతాయి. 


💠 జాతకంలో అనేక రకాల దోషాలు ఉంటాయి. ఈ లోపాల వల్ల వివాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. 

కాబట్టి, నిపుణులైన పండితుడి సలహా తీసుకొని సమస్యను సరిదిద్దుకోండి. కానీ దేశంలో ఇలాంటి దేవాలయాలు చాలా ఉన్నాయని మీకు తెలుసా, అక్కడ దేవత దర్శనం ద్వారా వివాహ అడ్డంకులు తొలగిపోతాయి.

ఈ ఆలయాలలో ఒకటి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. 


💠 హిందూ విశ్వాసాల ప్రకారం ఆలయ దైవం గణేశుడిని ప్రారంభాలకు అధిపతిగా భావిస్తారు. 

భగవంతుడిని చింతహరన్ అని పిలుస్తారు, దీని అర్థం అన్ని చింతలు మరియు ఉద్రిక్తతలను తొలగించేవాడు. 


💠 భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న అతిపెద్ద గణేశ దేవాలయం. 

 ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన గణేశ విగ్రహం స్వయంభూ అని భావించబడుతుంది.  

ఈ ప్రదేశం గణేశుడి ఇద్దరు భార్యలు, రిద్ధి మరియు సిద్ధిలచే పూజించబడుతుంది, వీటిని భగవంతునికి ఇరువైపులా ఉంచారు. ఆలయం దాని సమీపంలో విష్ణువు విగ్రహాన్ని కూడా కలిగి ఉంది. 

ఇక్కడ, గణేశుడు మరియు విష్ణువును కలిసి గొప్ప భక్తితో పూజిస్తారు.


💠 ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం, రాముడు, లక్ష్మణుడు మరియు మాత సీత వారి వనవాస సమయంలో ఈ స్థలాన్ని సందర్శించారు. 

ఆ సమయంలో సీత తల్లికి చాలా దాహం వేసింది, మరియు ఈ ప్రాంతంలో నీరు అందుబాటులో లేదు. తన దాహం తీర్చుకోవడానికి, లక్ష్మణుడు తన విల్లు నుండి బాణం వేసి భూమి నుండి నీటిని బయటకు తెచ్చాడు. 

ఈ సంఘటన ఫలితంగా, ఇక్కడ ఒక మెట్ల బావి నిర్మించబడింది, ఇది ఇప్పటికీ ఆలయం ముందు చూడవచ్చు. 

ఈ మెట్ల బావి భక్తులకు భక్తి మరియు విశ్వాసానికి ముఖ్యమైన కేంద్రం, దీనిని పూజనీయమైనదిగా భావించి ప్రజలు దీనిని సందర్శిస్తారు.


💠 ఇక్కడ శ్రీరాముడు మరియు అతని సోదరులు వనవాస సమయంలో పూజలు చేశారు. 

ఈ ప్రదేశం చారిత్రక మరియు మతపరమైన దృక్కోణం నుండి చాలా ముఖ్యమైనది.


💠 ఈ ఆలయంలోని గణేష్ మూర్తిని విక్రమాదిత్యుడు స్థాపించాడని మరియు సుమారు 2000 సంవత్సరాల క్రితం ఉజ్జయని (అవంతిక) రాజు చింతామన్ గణేశుడిని పూజించేవాడని చెబుతారు.  


💠 ఒకరోజు గణేష్ రాజు కలలో కనిపించి, ఆలయానికి పశ్చిమాన ఉన్న ఒక నదిలో తామర రూపంలో కనిపిస్తాడని అతనికి సందేశం ఇచ్చాడు.  వినాయకుడు ఆ పువ్వును సేకరించి తనతో తీసుకురావాలని రాజుకు సూచించాడు మరియు రాజు సరిగ్గా అదే చేసాడు. 

అయితే, రాజు తిరిగి వస్తుండగా, సూర్యోదయానికి ముందే పువ్వును ఎక్కడికైనా తీసుకెళ్లమని రాజుకు సూచించిన ఒక దివ్యమైన స్వరం కనిపిస్తుంది.  సూర్యోదయం తర్వాత పుష్పం మూర్తిగా మారి అక్కడే ఉంటుంది. దారిలో రథ చక్రం బురదలో కూరుకుపోయి బయటకు తీయలేకపోయింది మరియు సూర్యోదయం అయిన వెంటనే, పుష్పం వినాయకుడి మూర్తిగా మారుతుంది, అది కూడా సగం భూమిలో పాతిపెట్టబడింది.  


💠 మూర్తిని బయటకు తీయడానికి ప్రయత్నాలు జరిగాయి, కానీ ప్రయత్నాలన్నీ సిరలో సాగాయి.  

ఇది గణేశుని కోరిక అని భావించిన రాజు చివరకు మూర్తిని అక్కడ వదిలివేయాలని నిర్ణయించుకున్నాడు మరియు అక్కడే ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. 


💠 ఈ ఆలయంలో గణేశుడి మూడు ప్రధాన రూపాలు ఉన్నాయి - చింతామణి గణేశుడు, ఇచ్ఛమాన గణేశుడు మరియు సిద్ధివినాయకుడు - వీరు భక్తుల చింతలు, కోరికలు మరియు సంకల్పాలన్నింటినీ నెరవేర్చేలా ఆశీర్వదిస్తారు. 


💠 ఈ ఆలయంలో గణేశుడిని సందర్శించిన వెంటనే పెళ్లికాని వారు వివాహం చేసుకుంటారు.


💠 శ్రీ చింతామన్ గణేష్ ఆలయంలో జాతర పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.

 ఇది చైత్ర మాసంలోని మొదటి బుధవారం నుండి ప్రారంభమవుతుంది. దీని తరువాత, ప్రతి బుధవారం జాతర జరుగుతుంది. 

ఈ శుభ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు గణేశుడి దర్శనం చేసుకోవడానికి వస్తారు. 

అలాగే, మకర సంక్రాంతి సందర్భంగా తిల్ మహోత్సవ్ జరుపుకుంటారు.


💠 చింతామణి గణేష్ ఆలయం దాని నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది, దాని మతపరమైన సంప్రదాయాలు మరియు చారిత్రక ప్రాముఖ్యత కూడా దీనిని ప్రత్యేకంగా చేస్తాయి. 


💠 చింతామణి గణేష్ ఆలయం ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుండి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

17-02-గీతా మకరందము

 17-02-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయ విభాగ యోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - అర్జునుని యా ప్రశ్నకు భగవానుడు సమాధాన మొసంగుచున్నారు- 


శ్రీ భగవానువాచ -


త్రివిధా భవతి శ్రద్ధా 

దేహినాం సా స్వభావజా | 

సాత్త్వికీ రాజసీ చైవ 

తామసీ చేతి తాం శృణు || 


తాత్పర్యము:- శ్రీ భగవంతుడు చెప్పెను - ప్రాణులయొక్క స్వభావముచే (పూర్వజన్మ సంస్కారముచే) గలిగిన

ఆ శ్రద్ధ సాత్త్వికమనియు, రాజసమనియు, తామసమనియు మూడు విధములుగా నగుచున్నది. దానిని గూర్చి వినుము.


వ్యాఖ్య:- "సా స్వభావజా" - అని చెప్పుటవలన పూర్వజన్మ సంస్కారమువలన, జన్మాంతర వాసనా ప్రాబల్యమువలన అట్టిశ్రద్ధ వారియందు స్వభావముగనే జనించునని భావము.

ప్రశ్న:- శ్రద్ధ యెన్ని విధములు? అవి యేవి?

ఉత్తరము: - మూడువిధములు - అవి క్రమముగ (1) సాత్త్వికశ్రద్ధ (2) రాజసిక శ్రద్ధ (3) తామసిక శ్రద్ధ అని చెప్పబడును.

ప్రశ్న:- అట్టి శ్రద్ధ జీవులకెట్లు జనించును?

ఉత్తరము:- స్వభావముగనే. అనగా జన్మాంతరసంస్కారప్రాబల్యమువలన, లేక ఇహజన్మప్రయత్నాతిశయమున సహజముగనే అది జనించునని భావము.

తిరుమల సర్వస్వం 219-*

 *తిరుమల సర్వస్వం 219-*



 *సామాజిక సేవా కార్యక్రమాలు-1*


 తిరుమల-తిరుపతి దేవస్థానం వారు దేశవ్యాప్తంగా అనేక సామాజిక సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. వాటన్నింటి కార్యకలాపాలు దాదాపు తిరుపతి కేంద్రంగా కొనసాగుతున్నాయి. వీటిలో చాలావరకు వైద్య, విద్యా రంగాలకు చెందినవే.


 ఈ సేవలన్నీ అణగారిన వర్గాల వారికి ఉచితంగానే అందజేయబడతాయి. మిగిలిన వారికి మాత్రం నామమాత్రపు రుసుము వసూలు చేయబడుతుంది.


 తి.తి.దే ఆధ్వర్యంలో నడుస్తున్న కొన్ని సామాజిక సేవా పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


 *శ్రీ బాలాజీ దివ్యాంగుల శస్త్రచికిత్స, పరిశోధన, పునరావాస ట్రస్టు (BIRRD)* 


 దీని ద్వారా పోలియో మెల్లిటస్, సెరిబ్రల్ పాల్సీ, కంజెనిటల్ ఎనామలీస్, వెన్నెముక గాయాలు వంటి వ్యాధులకు, అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తారు.


 *శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం (SVIMS)* 


 ఈ పథకం కింద 2007వ సంవత్సరంలో ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించబడింది. దీన్ని *'శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ'* గా పిలుస్తారు. కేంద్రప్రభుత్వ సంస్థ అయిన అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) తరహాలో దీనిని అభివృద్ధి పరిచే ఉద్దేశ్యంతో ప్రణాళికలు రచించారు. ఈ సంస్థ ప్రాంగణం నుంచి శ్రీ పద్మావతి మహిళా కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ విభాగం కూడా నడుపబడుతున్నాయి. ఇందులో కూడా పూర్తి ఉచితంగా, లేదా నామమాత్రపు రుసుముతో అత్యాధునిక వైద్యసేవలను అందిస్తారు.


 *శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్* 


 2010వ సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ ట్రస్టు ద్వారా నేత్ర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి పూర్తి ఉచిత వైద్యసహాయంతో పాటుగా, కావలసిన వైద్యపరికరాలను కూడా ఉచితంగా ఇస్తారు.


 *శ్రీవేంకటేశ్వరా ప్రాణదానం ట్రస్ట్* 


 దీని ద్వారా నిరుపేద వర్గాలకు చెందిన వారికి గుండె, మూత్రపిండాలు, కాలేయం, మెదడు సంబంధిత ప్రాణాంతక వ్యాధులకై ఉచితంగా చికిత్స చేస్తారు.


‌ *ఇతర వైద్య సేవలు* 


 తిరుమల యాత్రికులకు అత్యవసర వైద్య సేవలందించే నిమిత్తం అన్ని హంగులతో కూడుకున్న మరికొన్ని వైద్యశాలలను కూడా తి.తి.దే. నడుపుతోంది. వినికిడి సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు చేయూత నివ్వడం కోసం *'శ్రవణం'* అనే ప్రాజెక్టును తి.తి.దే. చేపట్టింది. కుష్టువ్యాధి గ్రస్తులకు వైద్యసహాయం అందించడానికి, *'శ్రీవేంకటేశ్వర పేదల గృహం'* అనే పేరుతో, ఒక ఆసుపత్రితో కూడుకున్న పునరావాస కేంద్రాన్ని కూడా నడుపుతోంది. అలాగే కొండ పైన, భక్తులకు అత్యవసర వైద్యసేవలు అందించడం కోసం *'అశ్విని'* అనే వైద్యశాలను నిర్వహిస్తోంది.


 ఇవన్నీ ఒక ఎత్తైతే, కరోనా కష్టకాలంలో తి.తి.దే. అందిస్తున్న వైద్యసేవలు చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇప్పుడు తి.తి.దే. చేపడుతున్న మరికొన్ని సేవలను పరికిద్దాం.


 *శ్రీవేంకటేశ్వర ట్రైనింగ్ సెంటర్ ఫర్ హాండికాప్డ్*


 ఈ కేంద్రం ద్వారా దివ్యాంగులకు, దృష్టిలోపం ఉన్నవారికి, బధిరులకు వృత్తివిద్యలలో శిక్షణనిచ్చి, వారికి ఉపాధి కల్పించబడుతుంది.


 *శ్రీవేంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం మరియు పరిశోధనా కేంద్రం* 


 1993వ సంవత్సరం లో స్థాపించబడిన ఈ కేంద్రంలో, లక్షకు పైగా పురాతన గ్రంథాలు, వ్రాతప్రతులు, తాళపత్రాలు, శిలాశాసనాలు భద్రపరిచారు. యుజిసీ ఈ పరిశోధనా కేంద్రానికి చరిత్రలో డాక్టరేట్ చేస్తున్న విద్యార్థులకు పరిశోధనా కేంద్రంగా గుర్తింపునిచ్చింది. ఈ కేంద్రంలో ఉన్న పత్రాలన్నింటినీ డిజిటలీకరించే ప్రక్రియ చేపట్టబడింది.


 *శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు* 


 దీని ద్వారా చేపట్టే ఉచిత అన్నదాన పథకం వివరాలను ఇంతకుముందే తెలుసుకున్నాం. ఒక రోజుకు సరిపడా ఉదయపు అల్పాహారం గానీ, మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం గానీ తమకు కావలసిన తిథిలో అందజేయడానికి సరిపడే మొత్తాన్ని ఈ ట్రస్ట్‌కు విరాళంగా అందించవచ్చు. ఆ రోజు ఉభయదాతలుగా వారి పేరును అన్నప్రసాద సముదాయంలో ప్రకటిస్తారు.


‌ *శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్ట్* 


 1963వ సంవత్సరంలో స్థాపించబడిన *'శ్రీవేంకటేశ్వర బాలమందిరం ట్రస్ట్',* పేరు మార్చుకుని, *'శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్ట్'* గా రూపాంతరం చెందింది. దీని ద్వారా అనాథలైన బాలబాలికలకు, నిరుపేద తల్లిదండ్రుల పిల్లలకు ఉచితంగా విద్యాదానం చేయబడుతుంది. ఎందరెందరో పేదవర్గాల పిల్లలు దీనిలో ప్రాథమిక విద్యనభ్యసించి, జీవితంలో ఉన్నతశిఖరాలకెదిగారు.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*357 వ రోజు*


*అశ్వత్థామకు తండ్రి మరణం ఎరిగించుట*


కౌరవ సైన్యము సైన్యాధ్యక్షుడి మరణంతో కలత చెంది ఉన్న తరుణంలో పాండవసేన విజృంభించి కౌరవసేనలను ఎదుర్కొని తరిమింది. పాండవ సేనల ధాటికి ఆగలేని కౌరవ సేనలు పారిపోసాగాయి. నీ కుమారులు వారిని వెంబడించారు. కృతవర్మ, కృపాచార్యుడు, కర్ణుడు, శకుని మొదలైన వారంతా వెనుతిరిగి చూస్తూ పోతూ పోతూ వారు " ఎంత ఘోరం జరిగింది. ఏమి చేయాలో తోచక ఉంది. ఈ నరమేధం ఇక ఆగదా " అనుకున్నారు. వేరొక చోట యుద్ధము చేస్తున్న అశ్వత్థామ కౌరవ యోధులు వెనుదిరుగుతూ తిరోగమించడం చూసి సుయోధనుడిని సమీపించి " సుయోధనా ! మన సైన్యాలకు ఏమైంది ఇలా వెనుకకు చూసుకుంటూ పరుగెడుతున్నారు? కృపాచార్యుడు, కర్ణుడు ఎందుకింత మ్లానవదనులై ఉన్నారు " అని అడిగాడు. సుయోధనుడు బదులు పలుక లేక పోయాడు. దుఃఖంతో మాట రాక అశ్వత్థామకు తండ్రి మరణం గురించి ఎలా చెప్పాలి అనుకుంటున్నాడు.

*కృపాచార్యుడు అశ్వత్థామకు తండ్రి మరణ వార్త ఎరిగించుట*

కృపాచార్యుడు అశ్వత్థామకు తండ్రి మరణ వార్తను ఇలా చెప్పాడు. " కుమారా ! నీ తండ్రి పాంచాలసేనలో చాలా పెద్ద మొత్తాన్ని చంపుతున్నాడు. పాండవులు ఎలాగైనా నీ తండ్రిని చంపాలనుకున్నారు. భీముడు నీ తండ్రి వద్దకు పోయి అశ్వత్థామ మరణించాడు అని అబద్ధం చెప్పాడు. నీ తండ్రి అతడి మాట నమ్మక యుద్ధం చేస్తూనే ఉన్నా సందేహం తీర్చుకోవడానికి ధర్మజుడు అబద్ధం చెప్పడని నమ్మకంతో అతడిని నిజం చెప్పమని అడిగాడు. అంతకు ముందే భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపడం వలన ధర్మరాజు కూడా అశ్వత్థామ చనిపోయునట్లు చెప్పాడు. ఆ మాట వినగానే నీ తండ్రి అస్త్రసన్యాసం చేసి యోగసమాధిలోకి వెళ్ళాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు నీ తండ్రి రధము మీదకు దూకి నీ తండ్రి తల తెగనరికాడు. అర్జునుడు ధర్మరాజు వద్దని అది ధర్మము కాదని ఎంత అరచినా వినలేదు. నీ తండ్రి మరణించగానే మాకు కాళ్ళు చేతులు ఆడలేదు. మనసైన్యాలు భయపడి పారిపోతున్నాయి. కాని నాకు ఇదంతా కృష్ణుడు ఆడించిన నాటకం అనిపిస్తుంది. లేకున్న భీముడికి ఇన్ని తెలివితేటలు లేవు. ధర్మరాజు ఇంతటి అధర్మానికి ఒడిగట్టడు " అన్నాడు.


*తండ్రి మరణానికి అశ్వత్థామ ప్రతి స్పందన*


కృపాచార్యుడు చెప్పినది ప్రశాంత చిత్తతంతో విన్న అశ్వత్థామ " మామా ! కృపాచార్యా ! జాతస్య మరణం ధృవం. పుట్టిన వానికి మరణం తప్పదు. పైగా యుద్ధం చేస్తుంటే మరణం వెన్నంటి ఉంటుంది. కాని లోకారాధ్యుడైన నా తండ్రిని నీరాయుధుడై యోగసమాధిలో ఉన్న సమయాన జుట్టు పట్టుకుని మెడ నరకడమే బాధాకరంగా అవమానకరంగా ఉంది. సుయోధనా నాకు నా తండ్రి ప్రసాదించిన దివ్యాస్త్రాలు, నా అస్త్ర విద్య నాతండ్రిని కాపాడు కోవడానికి పనికి రాలేదు. నా గురువు, నా దైవం , నా పితృదేవుడు అలా దిక్కు మాలిన చావు చస్తుంటే ఆపలేక పోయాను. సుయోధనా ! దీనికి కారణం ధర్మరాజు పేరుకు ధర్మరాజు చెప్పినది అసత్యం. అతడిని అంతమొందించిన కాని నా మనస్సు శాంతించదు. సుయోధనా నా తండ్రి కుమారుని కన్నది అవసానదశలో ఇలా అవమానం పొందడానికా ! ఇదిగో ఇదే నా ప్రతిజ్బ. దేవతలు అడ్డుపడినా సరే ఆ కృష్ణుడే అడ్డుపడినా నేను పాండవులను సంహరిస్తాను " అన్నాడు. సుయోధనా ! నా పరాక్రమం నేను చెప్పుకో కూడదు. నా తండ్రికి జరిగిన అవమానం తట్టుకోలేక ఇలా అన్నాను. ఇప్పుడు కాకున్న ఎప్పుడైనా ఎలాగైనా నేను పాండవులను వధించి తీరతాను " అన్నాడు. తిరిగి అశ్వత్థామ " సుయోధనా ! నా తండ్రి శ్రీమన్నారాయణుడిని ఆరాధించి నారాయణాస్త్రం పొందాడు. దానిని నా తండ్రి నాకు ప్రసాదించాడు. ఆ అస్త్రం వారు వీరు అన్న తేడా లేకుండా అందరిని హతమార్చి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. నేను ఇప్పుడు నారాయణాస్త్రం ప్రయోగించి శత్రువులను గెలుస్తాను " అన్నాడు. అది విన్న సుయోధనుడు ఆనంద పడి తన వారినందరిని సమాయత్త పరచి శంఖం పూరించాడు. అది చూసి ధర్మరాజాదులు యుద్ధానికి సమాయత్తమయ్యారు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

గౌరవమును ప్రాణములును

 *2092*

*కం*

గౌరవమును ప్రాణములును

నేరీతిగనరుగుదెంచ నిష్క్రమణంబున్

వేరుగ నుండవు పుడమిన

గౌరవ హీనమె మరణము కనుగొన సుజనా.

*భావం*:-- ఓ సుజనా! గౌరవమైనా ప్రాణాలైనా ఎలా వచ్చినప్పటికీ పోవడం లో మాత్రం వేర్వేరుగా ఉండవు. భూలోకంలో గౌరవం తగ్గడమంటే మరణం తో సమానం. (అయితే పోయిన గౌరవాన్ని తిరిగి పొందటం మృత్యుంజయకారకమవుతుంది.).

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

రామాయణం

 🌹🪷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌹శుక్రవారం 25 ఏప్రిల్ 2025🌹*

             *రామాయణం*

   

ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది.


       *వాల్మీకి రామాయణం*

            *19 వ  భాగం*

                  

“ఆ శివ ధనుస్సుని తెప్పిస్తే మాపిల్లలు ఒకసారి చూస్తారు” అని విశ్వామిత్రుడు అన్నాడు.


అప్పుడా ఎనిమిది చక్రాలు కలిగిన మంజూషని లాక్కొని వచ్చారు.


“ఒక మనిషి అసలు ఈ ధనుస్సుని పైకి ఎత్తి, వింటినారిని లాగి కట్టడం జరుగుతుందా, సరే ఏదో అడిగారు కాబట్టి ఆ ధనుస్సుని తీసుకొచ్చాము చూడండి,” అని జనకుడు అన్నాడు.


అప్పుడు విశ్వామిత్రుడు ఆ ధనుస్సుని ఒకసారి చూడమని రాముడితో చెప్పాడు.


అప్పుడు రాముడు ఆ మంజూషని తెరువగా అందులో పాము పడుకున్నట్టు ఆ ధనుస్సు ఉంది.


క్షత్రియుడైన రాముడు ఆ ధనుస్సుని చూడగానే చాలా ఉత్సాహపడి, ఈ ధనుస్సు ఎంతో బాగుంది, దీన్ని ముట్టుకుంటాను, తరువాత ఎక్కుపెడతాను” అని విశ్వామిత్రుడిని అడిగాడు.


ఆయన “అలాగే ఎక్కుపెట్టు!” అన్నాడు.```

*ఆరోపయత్ స ధర్మాత్మా స లీలం ఇవ తత్ ధనుః।*

*ఆరోపయిత్వా మౌర్వీం చ పూరయామాస వీర్యవాన్।*

*తత్ బభంజ ధనుర్ మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః॥*```


రాముడు ఆ ధనుస్సుని ఎంతో తేలికగా, కష్టం లేకుండా పైకి ఎత్తి, నారి కడదామని లాగేసరికి, వంగిన ఆ ధనుస్సు మధ్యలో “ఫడేల్” అని గట్టి శబ్దంతో విరిగిపోయింది.


పిడుగులు పడే శబ్దంతో ఆ శివ ధనుస్సు విరిగేసరికి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అక్కడున్న మిగతా వారందరూ మూర్చపోయారు.```


*భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథ ఆత్మజః।*

*అతి అద్భుతం అచింత్యం చ అతర్కితం ఇదం మయా॥*```


అప్పుడు జనకుడు “మహానుభావా  విశ్వామిత్రా! నీకు తెలుసు, అందుకే ఈ పిల్లలు ఇద్దరినీ తీసుకొచ్చావు, రాముడు దశరథాత్మజుడు,ఈసంఘటన అద్భుతం, ఊహించరానిది, ఎవరూ వాదించరానిది. సీతమ్మ మా వంశంలో జన్మించి, తగిన భర్తని పొంది మా వంశ గౌరవాన్ని నిలబెట్టింది”అన్నాడు.


అయితే ముందు కొంతమంది రాయబారులని దశరథ మహారాజుగారి దగ్గరికి పంపించి, రాముడు శివధనుర్భంగం చేసి సీతమ్మని వీర్య శుల్కగా గెలుచుకున్నాడన్న విషయం చెప్పండ”ని విశ్వామిత్రుడు జనకుడితో అన్నాడు. 


వెంటనే జనకుడు కొంతమంది పరివారాన్ని అయోధ్యకి పంపగా, వాళ్ళు గుర్రాల మీద అయోధ్యకి చేరుకోవడానికి 3 రోజులు పట్టింది.


అక్కడకి చేరుకున్నాక, మేము జనకుడి పలుకున వచ్చామని చెప్పి లోనికి వెళ్ళగా, వృద్ధుడైన దశరథుడు సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నట్లు కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళు జరిగినదంతా చెప్పారు. “మీ పెద్ద కుమారుడైన రాముడు విశ్వామిత్రుడితో మిథిలా నగరానికి వచ్చి జనకుడి దగ్గరున్న శివ ధనుస్సుని ఎక్కుపెట్టడమే కాకుండా, శివధనుర్భంగం కూడా చేశాడు. అందువలన ఆయన తన కుమార్తె అయిన సీతమ్మని నీ కుమారుడైన రాముడికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మీకు కూడా సమ్మతమైతే, మీ కుమారులను చూసుకోవడానికి  మా నగరానికి రావలసిందిగా జనకుడు ఆహ్వానం పంపాడ”ని ఆ రాయబారులు చెప్పారు.


వెంటనే దశరథుడు తన గురువులతో, పురోహితులతో సమావేశమై ‘జనకుడి నడవడి ఎటువంటిది’ అని అడిగాడు.


అప్పుడు వాళ్ళు, “మహానుభావా దశరథా! విదేహ వంశంలో పుట్టిన జనకుడంటే సామాన్యుడు కాదు, శరీరం మీద భ్రాంతి లేనివాడు, భగవంతుడిని నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు. తప్పకుండా మనం ఆ సంబంధం చేసుకోవచ్చు” అన్నారు.


వెంటనే దశరథుడు “మనం ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా రేపే బయలుదేరదా”మన్నాడు.


కోశాధికారులని పిలిచి… “రత్నాలు, వజ్రాలు, ధనపు మూటలు పట్టుకొని ముందు బయలుదేరండ”న్నాడు, “రథాలని, చతురంగ బలాలని సిద్ధం చెయ్యమ”న్నాడు, “పురోహితులు, మంత్రులు నాతో బయలుదేరండి, అందరం మిథిలా నగరాన్ని చేరుకుందామ”న్నాడు.


మరుసటి రోజున అందరూ బయలుదేరారు.


ఇక్ష్వాకువంశంలో ఉన్న ఆచారం ప్రకారం తన ముగ్గురు పత్నులని దశరథుడు తీసుకెళ్ళలేదు.


దశరథ మహారాజు తన పరివారంతో 

ఆ మిథిలా నగరాన్ని చేరుకోగానే, జనకుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి, “మీరు రావడం వల్ల నేను, నా రాజ్యము పవిత్రమయ్యాయి” అని లోపలికి రమ్మన్నాడు.


“నా కూతురైన సీతమ్మని వీర్య శుల్కగా ప్రకటించి, శివ ధనుస్సుని ఎక్కుపెట్టినవాడికి ఇస్తానన్నాను, నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు, అందువలన ‘నా కుమార్తెని నీ కుమారుడైన రాముడికి ఇవ్వాలి’ అని అనుకుంటున్నాను, కావున నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా స్వీకరించు” అన్నాడు.``` 


*ప్రతిగ్రహో దాతృ వశః శ్రుతం ఏతత్ మయా పురా।*

*యథా వక్ష్యసి ధర్మజ్ఞ తత్ కరిష్యామహే వయం॥*```


అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు “అయ్యయ్యో జనకా, అలా అంటావేంటి, అసలు ఇచ్చేవాడు ఉంటే కదా పుచ్చుకునేవాడు ఉండేది, పదే పదే నీ కోడలిని చేసుకో అని అంటావు. నీ కుమార్తెని నా ఇంటికి కోడలిగా ఇస్తానన్నావు, ఔదార్యం నీది, దాతవి నువ్వు,పుచ్చుకునేవాడిని నేను” అని అన్నాడు.


“ఈ పూటకి ప్రయాణం చేసి అలసిపోయాము, రేపు మాట్లాడుకుందామ”న్నారు.


దశరథుడితో పాటు వచ్చిన భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులతో కలిసారు. ఇన్ని రోజులు విశ్వామిత్రుడితో సాగిన ప్రయాణం గురించి వాళ్ళ నలుగురూ సంతోషంగా మాట్లాడుకున్నారు.


దశరథుడితో పాటు వశిష్ఠుడు, కాత్యాయనుడు, జాబాలి, మార్కండేయుడు, కాశ్యపుడు, వామనుడు మొదలైన వాళ్ళు, విశ్వామిత్రుడు, శతానందుడు మరియు మిగిలిన మహర్షులందరూ ఒకచోట చేరారు. ఇంతమంది గొప్పవాళ్ళతో ఆ రాత్రి మిథిలా నగరం వెలిగిపోయింది.


*రేపు… 20వ భాగం*


*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

శుక్రవారం🌹* *🪷25, ఏప్రిల్, 2025🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

         *🌹శుక్రవారం🌹*

  *🪷25, ఏప్రిల్, 2025🪷*     

     *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం -కృష్ణపక్షం*


*తిథి : ద్వాదశి* ప 11.44 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : శుక్రవారం* ( భృగువాసరే )

*నక్షత్రం : పూర్వాభాద్ర* ఉ 08.53 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*


*యోగం  : ఐంద్ర* మ 12.31 వరకు ఉపరి *వైధృతి*

*కరణం : తైతుల* ప 11.44 *గరజి* రా 10.09 ఉపరి *వణజి*


 *సాధారణ శుభ సమయాలు*

*ఉ 09.30 - 10.30 సా 04.00 - 05.30*

అమృత కాలం : *రా 02.08 - 03.35*

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.31*


*వర్జ్యం : సా 05.31 - 06.57*

*దుర్ముహూర్తం : ఉ 08.18 - 09.08 మ 12.31 - 01.21*

*రాహు కాలం : ఉ 10.31 - 12.05*

గుళికకాళం : *ఉ 07.21 - 08.56*

యమగండం : *మ 03.15 - 04.50*

సూర్యరాశి : *మేషం* 

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం :*ఉ 05.46* 

సూర్యాస్తమయం :*సా 06.25*

*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 05.46 - 08.18*

సంగవకాలం         :*08.18 - 10.50*

మధ్యాహ్న కాలం  :     *10.50 - 01.21*

అపరాహ్న కాలం   : *మ 01.21 - 03.53*


*ఆబ్ధికం తిధి        : చైత్ర బహుళ త్రయోదశి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.25*

ప్రదోష కాలం         :  *సా 06.25 - 08.41*

రాత్రి కాలం : *రా 08.41 - 11.42*

నిశీధి కాలం          :*రా 11.42 - 12.28*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.15 - 05.00*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం🪷*


*నమస్త్రైలోక్యజనని* 

*నమస్త్రైలోక్యపావని* 

*బ్రహ్మాదయోనమన్తిత్వాం జగదానందదాయిని*


*ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

 🌹🌷🌹🌷🌹🌷🌷🌹

విలువ తెలియని వారి చేతిలో

 🙏🕉️శ్రీ మాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥చదువు విలువ తెలియని వారి చేతిలో పుస్తకం వ్యర్థం.. మనసు విలువ తెలియని వారి చేతిలో జీవితం వ్యర్థం.. మనం ప్రశాంతంగా బ్రతకాలనుకుంటే చెవులతో విన్నధంతా నమ్మకూడదు.. ప్రతీ ఒక్కరిలో తప్పోప్పులు ఎంచకూడదు.. అవసరం లేనివి పోగు చేయకూడదు.. అనవసరంగా మాట్లాడకూడదు🔥నీలో ఎంత మంచి తనం ఉన్నా డబ్బు లేకపోతే నువ్వు కొందరికి నచ్చలేవు..అందుకే ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానం.. ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం.. ఎంత తక్కువగా ప్రేమ చింపిస్తామో అంత మనశాంతి.. ఎంత తక్కువగా ఆశ పడతామో అంత ప్రశాంతత.. ఎంత తక్కువగా మాట్లాడతామో అంత విలువ ఇదే జీవితం యొక్క రహస్యం🔥అబద్దాన్ని నమ్మడం చాలా తేలిక.. నిజాన్ని తెలుసుకోవడం చాలా కష్టం..అందుకే చాలా మంది తేలికైన అబద్ధాన్ని ఈజీగా నమ్మేస్తారు.. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్ధం అవుతుంది.. నమ్మకం లేకుంటే ప్రతీ మాట బూతు లా వినిపిస్తుంది.. నమ్మకమే అనుబందానికి ఆత్మ లాంటిది🔥🔥మీ అల్లంరాజు భాస్కరరావు . శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్యసలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా మందులు పంపబడును 9440893593.9182075510‌*🙏🙏🙏

బాలశంకరుని మేనిపై చిహ్నాలు`

 `బాలశంకరుని మేనిపై చిహ్నాలు`


శ్లో.  

*మూర్ధని హిమకరచిహ్నం నిటలే నయనాంక మంసయో శ్శూలం*  

       *వపుషి స్పటికాసువర్ణం ప్రాజ్ఞాస్తాం మేనిరే శంభుమ్*  


బాలశంకరుని తలపై చంద్రరేఖ, నుదిటిమీద మూడవకన్ను, భుజాలమీద శూలముల గుర్తులు, శరీరంమీద స్పటికం లాంటి తెల్లనికాంతులు వుండడం చూసి ఆ బాలుని దర్శించిన పండితులంతా అతడిని శంకరుని అవతరంగానే భావించారు. 

శ్లో.  

*నాగేనోరసి చామరేణ చరణే బాలేందునా ఫాలకే*

*పాణ్యోశ్చక్ర గదాధను ర్డమరుకై ర్మూర్ధ్ని త్రిశూలేనచ*  

       *తత్తస్యాద్భుత మాకలయ్య లలితం లేఖాకృతే లాంఛితం* 

       *చిత్రంగాత్రమమంస్త తత్ర జనతా నేత్రై ర్నిమేషోఘితైః* 


పైచెప్పిన గుర్తులేగాక, బాలశంకరునికి ఎదురురొమ్మున నాగరేఖ, పాదాలమీద చామరం, నొసటన చంద్రరేఖతో బాటు రెండుచేతులందూ చక్రము, గదా, ధనుస్సు, ఢమరుకం, తలపై త్రిశూలరేఖ, అర్ధశరీరభాగమున దేవీ స్వరూపం వుండడం గ్రహించిన జనులంతా ఆ బాలుడిని కళ్లప్పగించి చూస్తూ ఉండిపోతున్నారు.  


ఆ విధంగా బ్రహ్మసృష్టి కలుషితం అవుతున్న సమయంలో, ఎవ్వరూ మోక్షంపొందడానికి అర్హులుగా లేని దుర్భర తరుణంలో, అనేకమతాల ప్రభావంలో అయోమయంలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్న కాలంలో….


కరుణామయుడైన పరమశివుడు సాధువులను, ధర్మముల ను కాపాడడానికి అద్వైతజ్ఞానమును తిరిగి భూమండలం మీద ప్రకాశింప జేయడానికి, తానే స్వయంగా బాల శంకరుని రూపంలో తొలుత ఎనిమిది సంవత్సరాల ఆయుష్షుతో అవతరించాడు.    

కాబట్టి తరువాత ఆ ‘ బాలశంకరుడే ఆదిశంకరుడు ‘ గా రూపొంది తన జ్ఞానంతో మనలను కరుణించి ‘ జగద్గురువు ‘ అయినాడు అని చెప్పడంలో సందేహం ఏమి వున్నది.


*జయజయ శంకర హరహర శంకర హరహర శంకర జయజయ శంకర*.

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - ద్వాదశి - పూర్వాభాద్ర -‌‌ భృగు వాసరే* (24.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కులహితము కొరకు,

 శ్లో"త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్|

గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్|


భావము-కులహితము కొరకు,ఒకరిని త్యాగము చేయాలి....ఆ ఒకరెవరన్నది ఆలోచించాలి....(నేను,నాది,అహంభావం,అహంకారం)ఇవన్నీ ఓకరిలోనే వుంటాయి....వాటిని వదిలిపెడితే కులం బాగుపడుతుంది.....


గ్రామహితముకొరకు కులము వదిలి పెట్టాలి....


దేశ హితము క్షేమము కాంక్షించేవాడు గ్రామము వదిలి పెట్టాలి....


ఆత్మహితముకోరి,అనగా!(తననుతాను ఉద్ధరించుకొని ఆత్మఙ్ఞానము పొందుటకు)తనను తాను త్యాగము చేసుకోవాలి....పృథివిని వదలాలి,అని భావము....


ఇవి కారణ జన్ములకే సాధ్యము....సామాన్య మానవులకసాధ్యము....కాని తెలుసుకొని పరివర్తన చెందుట ఎంతోకొంత ముఖ్యము...