16, మే 2024, గురువారం

వైశాఖ పురాణం🚩*_ _*8

 🌹 *శుక్రవారం - మే 17, 2024*🌹

_*🚩వైశాఖ పురాణం🚩*_   

   _*8 వ అధ్యాయము*_

🕉️🪷🕉️🪷🕉️🪷🕉️🪷🕉️

      *పిశాచ మోక్షము*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

పూర్వము రేవానదీ తీరమున మా తండ్రిగారు మృతినంది పిశాచ రూపమునందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన, ఆకలి దప్పికలచేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రమేర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడ త్రాగగనే కాలకూట విషమువలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలయునను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగ నా ప్రదేశమునకు వచ్చితిని. నీడలేని బూరుగు చెట్టుపైనుండి ఆకలిదప్పికల బాధను భరింపలేక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధ ననుభవింపలేక అరచుచున్న ఆ పిశాచమును జూచి అబ్బురపడితిని. ఇదేమి యద్భుతమా యని అనుకొంటిని.


పిశాచరూపమున నున్న అతడు నన్ను జూచి చంపవచ్చెను. కాని నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమియు చేయజాలకపోయెను. నేనును వానిని జూచి జాలిపడి ఓయీ భయపడకుము. నీకు నావలన నేభయమును రాదు. నీవెవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము. నిన్నీ కష్టమునుండి విడిపింతునని పలికితిని. నేనతని పుత్రుడనని యతడు గుర్తింపలేదు. నేనును నా తండ్రియని గుర్తింప లేకపోతిని. అప్పుడా పిశాచ రూపమున నున్న యతడిట్లు పలికెను. నేను భూవరమను పట్టణమున వసించు మైత్రుడనువాడను. సంకృతి గోత్రమువాడను. అన్ని విద్యలను నేర్చినవాడను. అన్ని తీర్థములయందు స్నానము చేసినవాడను. సర్వదేవతలను సేవించినవాడను. కాని నేను వైశాఖమాసమున కూడ అన్నదానమెవరికిని చేయలేదు. లోభము కలిగియుంటిని అకాలమున వచ్చిన వారికిని భిక్షమునైన యీయలేదు. కావున నాకీ పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా యీ దురవస్థకు కారణము. శ్రుతదేవుడను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్దికలవాడు. వైశాఖమున గూడ అన్నదానము చేయకపోవుటచే నేనిట్లు పిశాచరూపము నందితిననియు, నేనిట్లు బాధపడుచున్నానియు వానికి చెప్పవలయును. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై యున్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై నున్నాడు. తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము. వైశాఖమాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణము నిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేనీ బాధనుండి విడిపోయి శ్రీమహావిష్ణు సాన్నిధ్యమునందుదును. కావున ఆ విధముగ చేయుమని వానికి చెప్పుము. నాయందు దయయుంచి నాకీ సాయమును చేయుము. నీకు సర్వశుభములు కలుగునని చెప్పుము. అనుచు నా పిశాచము పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చిరకాలముంటిని. నన్ను నేను నిందించుకొంటిని. కన్నెరు విడుచుచుంటిని. తండ్రీ నేనే శ్రుతదేవుడను. దైవికముగ నిచటకు వచ్చినవాడను. తండ్రీ! యెన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్థకములు. నీకీ బాధనుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలయునో చెప్పుమని ప్రార్థించితిని.


అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంత సేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరచుకొని యిట్లనెను. నాయనా! నీవు తలచిన యాత్రలను పూర్తిచేసికొని యింటికి పొమ్ము. సూర్యుడు మేషరాశియందుండగా, వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీమహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మనవంశము వారందరికిని ముక్తి కలుగును. కావున అట్లు చేయుమని చెప్పెను.


నేనును నా తండ్రి యాజ్ఞననుసరించి యాత్రలను చేసి నా యింటికి తిరిగి వచ్చితిని. మాధవునకు ప్రీతికరమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగ శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన యన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని. అందువలన నా తండ్రి పిశాచ రూపమునుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి యాశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి యచట శాశ్వత స్థితినందెను.


కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము. శాస్త్రములయందును యిదియే చెప్పబడినది. ధర్మయుక్తమైనది. సర్వధర్మసారమే అన్నదానము. మహారాజా! నీకింకేమి కావలయునో అడుగుము చెప్పెదనని శ్రుతదేవుడు  శ్రుతకీర్తి మహారాజునకు వివరించెను.


ఈ విషయమును నారదమహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను.


 _*వైశాఖ పురాణం ఎనిమిదవ*_ 

    *అధ్యాయం సంపూర్ణం*


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🪷🪷🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏

*మే 17, 2024*🪷 *ధృగ్గణిత పంచాంగం

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

      🌹 *శుక్రవారం*🌹

    🪷 *మే 17, 2024*🪷

     *ధృగ్గణిత పంచాంగం*                  

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంతఋతౌః*  

*వైశాఖమాసం - శుక్లపక్షం*

*తిథి : నవమి* ఉ 08.48 వరకు ఉపరి *దశమి*

వారం :*శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం   : పుబ్బ* *రా 09.18* వరకు ఉపరి *ఉత్తరఫల్గుణి* (ఉత్తర)

*యోగం : వ్యాఘాత* *ఉ 09.21* వరకు ఉపరి *హర్షణ* 

*కరణం : కౌలువ* ఉ 08.48 *తైతుల* రా 10.05 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.30 - 10.30 సా 04.30 - 06.00* 

అమృత కాలం :*మ 02.05 - 03.53*

అభిజిత్ కాలం :*ప 11.38 - 12.30*

*వర్జ్యం : ఈరోజు లేదు*

*దుర్ముహుర్తం : ఉ 08.11 - 09.03 మ 12.30 - 01.21*

*రాహు కాలం : ఉ 10.27 - 12.04*

గుళిక కాలం :*ఉ 07.13 - 08.50*

యమ గండం : *మ 03.18 - 04.55*

సూర్యరాశి : *వృషభం* 

చంద్రరాశి : *సింహం/కన్య*

సూర్యోదయం :*ఉ 05.36*        

సూర్యాస్తమయం :*సా 06.32*

*ప్రయాణశూల  :‌ పడమర* దిక్కుకు ప్రయాణం పనికిరాదు


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.36 - 08.11*

సంగవ కాలం :*08.11 - 10.46*

మధ్యాహ్న కాలం :*10.46 - 01.21*

అపరాహ్న కాలం :*మ 01.21 - 03.57*

*ఆబ్ధికం తిధి : వైశాఖ శుద్ధ దశమి*

సాయంకాలం :*సా 03.57 - 06.32*

ప్రదోష కాలం :*సా 06.32 - 08.45*

నిశీధి కాలం :*రా 11.42 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.52*

_________________________

      🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

          🪷 *ఓం*🪷 

    *శ్రీ మహాలక్ష్మీయై నమః*

🌴🪷🌹🛕🌹🌷🪷🌷🌴

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

Panchaag


 

Narayan




 

వైశాఖ పురాణం - 08

 VAISAKHA PURANAM -- 08


వైశాఖ పురాణం - 08

8వ అధ్యాయము - వైశాఖమాస దానములు


అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి యిట్లనెను. మహర్షీ! నేను చూచినది సత్పురుషుల చరిత్రవలె మహాశ్చర్యకరముగ నున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తినందిన ధర్మమును మరింత వివరముగ తెలిసికొన గోరుచున్నాను. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శ్రుతకీర్తిని మాటలను విని శ్రుత దేవమహాముని నాయనా నీవడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది. బాగు బాగు వినుమని యిట్లు వివరింపసాగెను.


రాజర్షీ శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్దికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగము నందాసక్తి కలుగును. నీవు యువకుడవు రాజాధిరాజువు. నీకిట్టి విష్ణుకధాసక్తి ధర్మజిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్దుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మసంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. యధోచితములగు శుద్ది, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృ శ్రాద్దము మానకుండుట, వైశాఖవ్రతాచరణము యివి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖమాస ధర్మముల నాచరింపనివానికి ముక్తి లేదు.


సర్వధర్మములయందును వైశాఖవ్రత ధర్మముత్తమము సాటిలేనిది. రాజులేని రాజ్యప్రజలవలె పెక్కు ధర్మములున్నవి. కాని అవి దుఃఖప్రదములు అనగా కష్టములను కలిగించును. సుఖసాధ్యములు కావు. వైశాఖధర్మములు సులభములు, సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో నున్న ప్రజలకువలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణములవారికి, అన్ని ఆశ్రమములవారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను యిచ్చుట, మార్గమున చెట్లనీడలో చలివేండ్రము నేర్పరచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకఱ్ఱలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగ మార్గముల యందు బావులు, దిగుడుబావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరకు గడల రసము, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడిపండ్ల రసము, దోసపండ్ల రసము దానముచేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకము(పానకము) పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము చైత్ర అమావాస్య నాడు వెదురుకొమ్మలదానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వవిధములగు ఫల పుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలెను.


ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలయును. శ్రీమహావిష్ణు పూజ తరువాత విష్ణుకథాశ్రవణము చేయవలయును. అభ్యంగస్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకఱ్ఱతో విసరుట, సుగంధ పుష్పములతో ప్రతి దినము విష్ణుపూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట ధూపదీపముల సేవ, గోవులకు ప్రతి దినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై జల్లుకొనుట, ముఖ్యకర్తవ్యములు. బెల్లము, శొంఠి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణీకులను ఆదరించి కుశలప్రశ్నలడిగి వలసిన ఆతిధ్యము నీయవలెను. ఇవి వైశాఖమాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో చిగుళ్లతో విష్ణుపూజ, విష్ణువును తలచుకొని పుష్పములను దానమిచ్చుట దధ్యన్ననివేదనము మున్నగునవి సర్వపాపములను హరించును. అఖండ పుణ్యమునిచ్చును.


పుష్పములతో శ్రీమహావిష్ణువు నర్చింపక, విష్ణుకథాశ్రవణము చేయక వ్యర్థముగ కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును, పుత్రలాభమును పొందదు. ఆమె కోరిక లేవియును తీరవు. శ్రీమహావిష్ణువు వివిధరూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖమాసమున సంచరించు సపరివారముగ మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతిగృహమున నివసించును. అట్తి పవిత్ర సమయమున వైశాఖ పూజాదికములను చేయని మూడుఢు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మనైదుమార్లు పొందును. ఇట్టి కష్టములు వలదనుకొన్న వారు యధాశక్తిగ వైశాఖవ్రతము నాచరించుచు ఆకలిగలవారి కన్నమును, దప్పిక కలవారికి జలమును యీయవలెను. జలము, అన్నము సర్వప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వప్రాణుల యందున్న సర్వాంతర్యామియగు శ్రీమహావిష్ణువు. సంతోషించి వరములనిచ్చును. శ్రేయస్సును సర్వసుఖ భోగములను, సంపదలను, కలిగించి ముక్తినిచ్చును. జల దానము చేయనివారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయనివారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమునందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా!.


వైశాఖ పురాణం 8వ అధ్యాయము సంపూర్ణం.

Gnyaanam






 

Omkareseara siva lingaalu


 

మీరు భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 


ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు. మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ 9848647145 కు వాట్సాప్ చేయండి. దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 


ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   


ఇట్లు 


మీ బ్లాగరు

శ్రీ చంద్రశేఖర విశ్వ మహా విద్యాలయం

 *శ్రీ చంద్రశేఖర విశ్వ మహా విద్యాలయం, కాంచీపురం*


*ఎంసెట్ లో ర్యాంక్ రాలేదు.. డోనేషన్లు కట్టలేము... మనేజ్మెంట్ కోటాలో సీటు తెచ్చుకోలేము... అత్యధిక ఫీజులు చెల్లించలేము... ఇంటర్ పాసాయినప్పటి భవిష్యత్ లో ఇంజనీరింగ్ సీటు పొందలేమేమో అని నిరాశకు గురౌతున్నారా?.... అటువంటి భాధ అవసరం లేదు... ఇంటర్ మార్క్స్ ఆధారంగా గొప్ప అద్భుతమైన గొప్ప పేరు గాంచిన యూనివర్సిటీ లో సీట్లు పొందండి. అత్యల్ప ఫీజులు, డోనేషన్లు లేవు, విద్యార్థులు అందరికీ గొప్ప గొప్ప కంపెనీలలో ప్లేస్మెంట్స్.................. మీకు ఆసక్తి ఉంటే 2-6-24, ఆదివారం విజయవాడలో స్పాట్ అడ్మిషన్లు కొరకు పేరు నమోదు చేసుకోండి. ఈ అవకాశం కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే.*


*ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పాసైన ప్రతీ విద్యార్థికి ఈ సమాచారం పంపించండి.*


*ఈ అవకాశం కేవలం 100 మందికి మాత్రమే.*


*ఇంటర్ లో మంచి మార్క్స్ వచ్చిన విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా ఇవ్వబడును, చక్కని వసతి సౌకర్యాలు గల హాస్టల్ వసతి కూడా అందుబాటులో కలదు.*


*పేర్లు నమోదు కొరకు చివరి తేదీ 25-4-2024.*


*మరిన్ని వివరాలకు*

*యామిజాల నరసింహ మూర్తి*

*చీఫ్ కో ఆర్డినేటర్*

*కంచికామకోటి ఘటికస్థానం*

*సెల్ 9912626900*

నీరు కొబ్బరికాయలో

 సుభాషితం:


అజగామ యథా లక్ష్మీ: - నారికేళ


ఫలాంబువత్1


నిర్జగామ యథా లక్ష్మీ: - గజభుక్త కపిత్థవత్11


తేటగీతి:


నీరు కొబ్బరికాయలో చేరునెట్లొ మన కెరుకలేక సిరియట్లె మనకు వచ్చు; మన కెరుక లేకయే పోవు మన ధనంబు పరగ కరి మింగిన వెలగపండు వోలె.


భావం: కొబ్బరికాయలో నీరు ఎలా


చేరుతుందో.. సిరి సంపదలు మనకు తెలియకుండానే అలా వస్తాయి. సిరి సంపదలు పోయేటప్పుడు కూడా అంతే. కరి మింగిన వెలగపండు చందంగా ఖాళీ అవుతాయి.


ఉదయం 6:37

వైశాఖ పురాణం🚩*_ _*7

 🌷 *గురువారం - మే 16, 2024*🌷

   _*🚩వైశాఖ పురాణం🚩*_

      _*7 వ అధ్యాయము*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

  *వైశాఖమాస దానములు*

☘☘☘☘☘☘☘☘☘

అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి యిట్లనెను. మహర్షీ ! నేను చూచినది సత్పురుషుల చరిత్రవలె మహాశ్చర్యకరముగ నున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తినందిన ధర్మమును మరింత వివరముగ తెలిసికొన గోరుచున్నాను. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శ్రుతకీర్తిని మాటలను విని శ్రుత దేవమహాముని నాయనా నీవడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది. బాగు బాగు వినుమని యిట్లు వివరింపసాగెను.


రాజర్షీ శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్దికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగము నందాసక్తి కలుగును. నీవు యువకుడవు రాజాధిరాజువు. నీకిట్టి విష్ణుకధాసక్తి ధర్మజిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్దుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మసంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. యధోచితములగు శుద్ది, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృ శ్రాద్దము మానకుండుట, వైశాఖవ్రతాచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖమాస ధర్మముల నాచరింపనివానికి ముక్తి లేదు.


సర్వధర్మములయందును వైశాఖవ్రత ధర్మముత్తమము సాటిలేనిది. రాజులేని రాజ్యప్రజలవలె పెక్కు ధర్మములున్నవి. కాని అవి దుఃఖప్రదములు అనగా కష్టములను కలిగించును. సుఖసాధ్యములు కావు. వైశాఖధర్మములు సులభములు , సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో నున్న ప్రజలకువలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణములవారికి , అన్ని ఆశ్రమములవారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట , మార్గమున చెట్లనీడలో చలివేండ్రము నేర్పరచుట , చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకఱ్ఱలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగ మార్గముల యందు బావులు, దిగుడుబావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరకు గడల రసము, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడిపండ్ల రసము, దోసపండ్ల రసము దానముచేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకము(పానకము) పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము వైశాఖ అమావాస్య నాడు వెదురుకొమ్మలదానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వవిధములగు ఫల పుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలెను.


ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలయును. శ్రీమహావిష్ణు పూజ తరువాత విష్ణుకథాశ్రవణము చేయవలయును. అభ్యంగస్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకఱ్ఱతో విసరుట, సుగంధ పుష్పములతో ప్రతి దినము విష్ణుపూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట ధూపదీపముల సేవ, గోవులకు ప్రతి దినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై జల్లుకొనుట, ముఖ్యకర్తవ్యములు. బెల్లము, శొంఠి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణీకులను ఆదరించి కుశలప్రశ్నలడిగి కావలసిన ఆతిధ్యము నీయవలెను. ఇవి వైశాఖమాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో చిగుళ్లతో విష్ణుపూజ  విష్ణువును తలచుకొని పుష్పములను దానమిచ్చుట దధ్యన్న నివేదనము మున్నగునవి సర్వపాపములను హరించును. అఖండ పుణ్యమునిచ్చును.


పుష్పములతో శ్రీమహావిష్ణువు నర్చింపక, విష్ణుకథాశ్రవణము చేయక వ్యర్థముగ కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును, పుత్రలాభమును పొందదు. ఆమె కోరిక లేవియును తీరవు. శ్రీమహావిష్ణువు వివిధరూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖమాసమున సంచరించు సపరివారముగ మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతిగృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాదికములను చేయని మూడుఢు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మనైదుమార్లు పొందును. ఇట్టి కష్టములు వలదనుకొన్న వారు యధాశక్తిగ వైశాఖవ్రతము నాచరించుచు ఆకలిగలవారి కన్నమును, దప్పిక కలవారికి జలమును ఈయవలెను. జలము, అన్నము సర్వప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వప్రాణుల యందున్న సర్వాంతర్యామియగు శ్రీమహావిష్ణువు. సంతోషించి వరములనిచ్చును. శ్రేయస్సును సర్వసుఖ భోగములను, సంపదలను, కలిగించి ముక్తినిచ్చును. జల దానము చేయనివారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయనివారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమునందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా !


   *వైశాఖ పురాణం ఏడవ*    

   *అధ్యాయం సంపూర్ణం*


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🌹🌹🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

మహాభాగవతం

 *16.5.2024 ప్రాతఃకాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది రెండవ అధ్యాయము*


*శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షకభటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*42.1 (ప్రథమ శ్లోకము)*


*అథ వ్రజన్ రాజపథేన మాధవః స్త్రియం గృహీతాంగవిలేపభాజనామ్|*


*విలోక్య కుబ్జాం యువతీం వరాననాం పప్రచ్ఛ యాంతీం ప్రహసన్ రసప్రదః॥9870॥*


*శ్రీశుకుడు చెప్పెను* పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు సుదాముని అనుగ్రహించిన పిమ్మట ఆత్మీయులతోగూడి రాజమార్గమున సాగిపోవుచుండెను. అప్పుడు ఆ స్వామి ఒకయువతిని జూచెను. ఆమె ముఖము సుందరముగా నుండెను. కాని, ఆమె గూని కలిగి యుండుటవలన *కుబ్జ* అను పేరుతో పిలువబడుచుండెను. ఆమె తన చేతులలో చందనాది అనులేపన ద్రవ్యములుగల పాత్రలను పట్టుకొని పోవుచుండెను. సకలప్రాణులపై కరుణరసమును ప్రసరింపచేయుచుండెడి ఆ కృష్ణప్రభువు ఆమెపై కృపజూపుటకై నవ్వుచు ఇట్లు ప్రశ్నించెను.


*42.2 (రెండవ శ్లోకము)*


*కా త్వం వరోర్వేతదు హానులేపనం కస్యాంగనే వా కథయస్వ సాధు నః|*


*దేహ్యావయోరంగవిలేపముత్తమం శ్రేయస్తతస్తే న చిరాద్భవిష్యతి॥9871॥*


"సుందరీ! నీవు ఎవరు? ఈ చందనానులేపనములను ఎవరి కొఱకు తీసికొని వెళ్ళుచున్నావు? యథార్థమును తెలుపుము. మేలైన ఈ అంగరాగములను మా ఇరువురికిని ఇమ్ము. ఇచ్చితివేని త్వరలోనే నీకు మిగుల శ్రేయస్సు కలుగును".


*సైరంధ్ర్యువాచ*


*42.3 (మూడవ శ్లోకము)*


*దాస్యస్మ్యహం సుందర కంససమ్మతా త్రివక్రనామా హ్యనులేపకర్మణి|*


*మద్భావితం భోజపతేరతిప్రియం వినా యువాం కోఽన్యతమస్తదర్హతి॥9872॥*


*అంతట కుబ్జ ఇట్లనెను* "సుందరా! నేను కంసుని దాసిని. నన్ను *త్రివక్ర* అని యందురు. నేను అనులేపనములను అలదుటకై నియమింపబడితిని. నేను సిద్ధపఱచిన చందనాది - అంగరాగద్రవములనిన కంసునకు మిక్కిలి ఇష్టము. అందువలన ఆ రాజు నన్ను ఎంతగానో ఆదరించును. ఈ అంగలేపనములను అలదుకొనుటకు నిజముగా మీరే అర్హులు".


*42.4 (నాలుగవ శ్లోకము)*


*రూపపేశలమాధుర్యహసితాలాపవీక్షితైః|*


*ధర్షితాత్మా దదౌ సాంద్రముభయోరనులేపనమ్॥9873॥*


శ్రీకృష్ణుని రూపవైభవమునకును, సౌకుమార్యమునకును, రసికత్వమునకును, సుందర మందహాసమునకును, మధురాలాపములకును, ఆకర్షణీయమైన చూపులకును ఆ కుబ్జ ముగ్ధురాలయ్యెను. వెంటనే ఆమె మనస్సు కృష్ణపరమయ్యెను. అంతట ఆమె చొక్కమైన (మనోహరమైన) ఆ అనులేపనములను ఆ ఉభయులకును సమర్పించెను.


*42.5 (ఐదవ శ్లోకము)*


*తతస్తావంగరాగేణ స్వవర్ణేతరశోభినా|*


*సంప్రాప్తపరభాగేన శుశుభాతేఽనురంజితౌ॥9874॥*


పిమ్మట వారు ఆ మైపూతలను నాభికి పైభాగమునగల వక్షస్థలాది అంగములయందు అలదుకొనిరి. శ్రీకృష్ణుడు శ్యామవర్ణశోభితమైన తన శరీరముపై పసుపుపచ్చని అంగరాగములను, బలరాముడు శ్వేతవర్ణరంజితమైన తన దేహముపై ఎర్రని అనులేపనములను పూసికొని తేజరిల్లిరి.


*42.6 (ఆరవ శ్లోకము)*


*ప్రసన్నో భగవాన్ కుబ్జాం త్రివక్రాం రుచిరాననామ్|*


*ఋజ్వీం కర్తుం మనశ్చక్రే దర్శయన్ దర్శనే ఫలమ్॥9875॥*

అనులేపనములను సమర్పించిన కుబ్జపై కృష్ణభగవానుడు ప్రసన్నుడయ్యెను. తనను దర్శించినందులకు ప్రత్యక్ష ఫలమును ప్రసాదించుటకై వంకరలు తిరిగియున్న (మువ్వంకలతోనున్న) ఆమె దేహమును చక్కజేయుటకై (సర్వాంగసుందరముగా చేయుటకై) ఆ ప్రభువు నిశ్చయించుకొనెను.


*42.7 (ఏడవ శ్లోకము)*


*పద్భ్యామాక్రమ్య ప్రపదే ద్వ్యంగుల్యుత్తానపాణినా|*


*ప్రగృహ్య చిబుకేఽధ్యాత్మముదనీనమదచ్యుతః॥9876॥*


*42.8 (ఎనిమిదవ శ్లోకము)*


*సా తదర్జుసమానాంగీ బృహచ్ఛ్రోణిపయోధరా|*


*ముకుందస్పర్శనాత్సద్యో బభూవ ప్రమదోత్తమా॥9877॥*


పిమ్మట ఆ స్వామి ఆమె యొక్క రెండు పాదాగ్రములను తన పాదములతో అదిమిపట్టి, ఆమె చిబుకము (గడ్డము) క్రింద తన రెండు వ్రేళ్ళను చేర్చి, మీదికెత్తెను. అట్లు ప్రేమను, ముక్తిని అనుగ్రహించే శ్రీకృష్ణభగవానుని కరస్పర్శతో పైకెత్తబడగనే వంకరలు అన్నియును తొలగిపోయి, అవయవములు పూర్తిగా చక్కబడి ఆమె ఒక యువతీ లలామగా రూపొందెను. అంతట ఆమె కటి సౌందర్యము ఇనుమడించెను. వక్షస్థల వైభవము ఇంపెసలారెను.


*42.9 (తొమ్మిదవ శ్లోకము)*


*తతో రూపగుణౌదార్యసంపన్నా ప్రాహ కేశవమ్|*


*ఉత్తరీయాంతమకృష్య స్మయంతీ జాతహృచ్ఛయా॥9878॥*


ఒక్క క్షణములో కుబ్జయొక్క రూపలావణ్యములు మిక్కిలి మనోహరములయ్యెను. నడకలలో, చూపులలో అందములు చిందెను. అంతట ఆ సుందరి శ్రీకృష్ణునిపై మఱులుగొని, ఆ స్వామియొక్క ఉత్తరీయాంచలమును పట్టుకొని లాగుచు దరహాసముతో ఇట్లనెను-


*42.10 (పదియవ శ్లోకము)*


*ఏహి వీర గృహం యామో న త్వాం త్యక్తుమిహోత్సహే|*


*త్వయోన్మథితచిత్తాయాః ప్రసీద పురుషర్షభ॥9879॥*


"మహావీరా! మా ఇంటికి వెళ్ళుదము రమ్ము. నిన్ను ఇచట విడిచి వెళ్ళుటకు నా మనస్సొప్పుటలేదు. నీవు నా చిత్తమును కలవరపెట్టితివి (నిన్ను దర్శించినంతగా నా మనస్సు వశము తప్పినది). పురుషోత్తమా! నన్ను అనుగ్రహింపుము".


*42.11 (పదకొండవ శ్లోకము)*


*ఏవం స్త్రియా యాచ్యమానః కృష్ణో రామస్య పశ్యతః|*


*ముఖం వీక్ష్యానుగానాం చ ప్రహసంస్తామువాచ హ॥9880॥*


బలరాముని సమక్షమున ఆ తరుణి తనను ఇట్లు అర్థించుచుండగా, శ్రీకృష్ణుడు తన అగ్రజుని, తన అనుయాయులు ముఖములను గాంచి, దరహాస మొనర్చుచు ఆమెతో ఇట్లువచించెను.


*42.12 (పండ్రెండవ శ్లోకము)*


*ఏష్యామి తే గృహం సుభ్రూః పుంసామాధివికర్శనమ్|*


*సాధితార్థోఽగృహాణాం నః పాంథానాం త్వం పరాయణమ్॥9881॥*


"సుందరవదనా! నేను వచ్చిన పని పూర్తియైన పిమ్మట నీ ఇంటికి తప్పక వచ్చెదను. నీ గృహము సాంసారిక బాధలను గుఱియైన పురుషులయొక్క మనస్తాపములను తొలగించునట్టిది. ఇండ్లు వాకిండ్లను వీడి వచ్చిన మావంటి బాటసారులకు మీ వదనమే ఆశ్రయమేగదా!


*42.13 (పదమూడవ శ్లోకము)*


*విసృజ్య మాధ్వ్యా వాణ్యా తాం వ్రజన్ మార్గే వణిక్పథైః|*


*నానోపాయనతాంబూలస్రగ్గంధైః సాగ్రజోఽర్చితః॥9882॥*


కృష్ణప్రభువు మృదుమధుర వచనములతో సమాధానపఱచి ఆమెను వీడ్కొనెను. పిదప ఆ స్వామి తన వారితోగూడి రాజమార్గమున వెళ్ళుచుండగా వ్యాపారులు వివిధములగు కానుకలను, చందన, తాంబూలములను, పూలమాలలను సమర్పించి, బలరామకృష్ణులను అర్చించిరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి నలుబది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 16.5.2024 గురువారం


*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*832వ నామ మంత్రము* 


*ఓం ప్రాణదాత్ర్యై నమః*


జీవులకు ప్రాణములను ఇచ్చి జీవింపజేయు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ప్రాణదాత్రీ* యను నాలుగు అక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం ప్రాణదాత్ర్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించు సాధకులకు ఆ జగన్మాత అకాలమృత్యువులనుండి, ఆకస్మిక ప్రమాదములనుండి కాపాడును. ఆయురారోగ్యములు ప్రసాదించును. భౌతిక జీవనమునందు శాంతిసౌఖ్యములు ప్రసాదించి అనంతమైన బ్రహ్మజ్ఞాన సాధన దిశగా అడుగులు వేయించును.


జీవుల శరీరంలో ప్రాణములుంటేనే ఇంద్రియవ్యాపారం కొనసాగుతుంది.   ఇంద్రియముల కదలికలు గోచరమవుతాయి. దేహంలోని ప్రాణం చూడడానికి గోచరించదు. ప్రాణం యొక్క ఉనికి ఇంద్రియముల  కదలికననుసరించియే తెలియుచుండును. గనుక ప్రాణము  అంటే ఇంద్రియములు అని కూడా ఇచ్చట చెప్పుకొనవచ్చును. ప్రాణములుఅనగా పంచ ప్రాణములు, ఇంకను పంచ ఉప ప్రాణములను జగన్మాత జీవులకు ఇచ్చును. అలాగే జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, మనసు (వెరసి పదకొండు ఇంద్రియములను) కూడా ఇచ్చును. శరీరం పుట్టిన తరువాత పదకొండు ఇంద్రియములు ఉంటాయి. మరి అవి అమ్మవారు ఇవ్వడమేమిటి? అనే ప్రశ్న ఉత్పన్నము కవచ్చును. ఇంద్రియములకు ఆయా పనితనములను ప్రసాదించునని భావించదగును. జీవుని పాత్ర తీరిపోగానే ప్రధాన ప్రాణము పయనమై పోవును. ఆ వెంట మిగిలిన ప్రాణములు కూడా తరలిపోవును. ప్రాణములు శరీరమును విడచిన వెంటనే ఇంద్రియములు కూడా చచ్చుబడిపోవును. అప్పుడు ఆ దేహాన్ని శవము అన్నారు. ఒక్క ప్రధాన ప్రాణమును అమ్మవారు జీవునికి పోయగానే మొత్తము ప్రాణములు, ఇంద్రియముల కార్యనిర్వాహకత్వము కూడా శరీరంలో స్థాపింపబడి పంచభూతాత్మకమైన ఆ శరీరము కదలును. లోకములో తనకున్న పాత్రనిర్వహణను కొనసాగించును. అందు చేతనే ప్రాణుల చేతనావస్థకు  వలసిన ప్రాణమును అమ్మవారు ప్రసాదించును గనుక ఆ తల్లి *ప్రాణదాత్రీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ప్రాణదాత్ర్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 16.5.2024 గురువారం


*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*372వ నామ మంత్రము* 


*ఓం భక్తమానస హంసికాయై నమః*


పరమ పవిత్రమైన మానస సరోవరమందున ఉండు హంసవలె భక్తుల మనస్సులనెడి మానససరోవరమందు వసించు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *భక్త మానస హంసికా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం భక్తమానస హంసికాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తుల హృదయములనే మానస సరోవరంలో ఆ తల్లి ఒక హంసవలె వసించుచూ, సర్వాభీష్టములను సిద్ధింపజేయును.


పవిత్ర హిమాలయ పర్వతములయందున్న మానస సరోవర జలములు అత్యంత నిర్మలమైనవి. పవిత్రమైనవి. అటువంటి నిర్మల జలములనే ఎల్లప్పుడూ కోరే హంసలు అచట విహరిస్తూ ఉంటాయి. అలాగే నిత్యము పరమేశ్వరీ నామస్మరణతో, భక్తిప్రపూరితమైన ధ్యానముతో ప్రవర్తించు భక్తుల హృదయములు మానససరోవరము వంటివి. పరమేశ్వరి అటువంటి భక్తహృదయాలలో తానొక హంసవలె విలసిల్లుతూ భక్తజనులకు కైవల్యసోపానములను సమీపింపజేయుచుండును గనుకనే ఆ పరమేశ్వరి *భక్తమానస హంసికా* యని అనబడినది.


*హంస* యనగా పరమాత్మ. *హంసిక* యనగా పరమేశ్వరి. నిరంతరము శ్రీమాత ధ్యానముతో ఆ జగన్మాతను స్మరించేవారు, ధ్యానించేవారు అయిన భక్తుల మనసులలో పరమేశ్వరి (హంసిక) ఉంటుంది. గనుక అమ్మవారు *భక్తమానస హంసికా* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం భక్తమానస హంసికాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

ధరణి లుబ్ధుని

 సుభాషితమ్


శ్లో॥ లుబ్ధమర్థేన గృహ్ణీయాత్ స్తబ్ధమంజలి కర్మణా* । 

     *మూర్ఖం ఛన్దోఽను వృత్తేన యథార్థత్వేన పండితమ్* 11


తా॥ ధనమునందాసక్తిగల లోభిని ధనముద్వారా, అహంకారిని నమస్కారము ద్వారా, మూర్ఖుని ఆతని కోరిక ననుసరించి పనిచేసియు, బుద్ధిమంతుడైన వానిని సత్యవచనముల ద్వారా వశపఱచుకొనవలెను.



తే.

ధరణి లుబ్ధుని కరయంగ ధనము నిచ్చి 

అహముతో నున్న వానికి నంజ లిడియు 

అనయముగ మూర్ఖు మాటల ననుసరించి

పలికి సత్యము నిరతమ్ము పండితుడిని 

జగతి మన్నింప వలయు తా సజ్జ నుండు


తెనుగు సేత :

✍️గోపాలుని మధుసూదన రావు 🙏

శంకర జయంతి ప్రత్యేకం భాగం 5/10

 ॐ     శంకర జయంతి ప్రత్యేకం      

          ( ఈ నెల 12వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి ) 


                             భాగం  5/10


శంకరుల అవతారం 


4.సాంఘిక దురాచారం - అస్పృశ్యత - ఏకాత్మతా వాద పరిష్కారం 


    అస్పృశ్యత అనే దురాచారాన్ని పారద్రోలాలనే విషయం మనం ఎంతోకాలంగా వింటున్నాము. అదొక నిరంతర నినాదంగా రాజకీయవాదుల మధ్య నలుగుతూ ఉంటుంది. 

    ఆ దురాచారం ఎప్పటికి అంతమవుతుందో, అసలు అంతమొందుతుందో లేదో అనే సందేహం కూడా కలుగుతుంది. 

    ఆదిశంకరులు ఈ దురాచారాన్ని రూపుమాపటానికి చేసిన విషయం ఈ కాలంలో ఎంత ఆవశ్యకమో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. 

    కాశీ నగరంలో శంకరులు - చండాలుని విషయంలో తాను అస్పృశ్యతను పాటిస్తున్నట్లు కనిపిస్తారు. కానీ అదే చండాలుని మాటలనే ఉపదేశంగా పొంది, ఆ చండాలునికి పాదాభివందనం చేసి, స్తోత్రం చేశారు. తద్వారా ఆ దురాచారాన్ని రూపుమాపడానికి తనతోనే నాంది పలికారు. 

    ఆయన చేసిన స్తోత్రమే "మనీషా పంచకమ్"గా ఎప్పటికీ చక్కని మార్గం బోధిస్తుంది. 


ఆ సంఘటన


    కాశీ నగరంలో శంకరులు వెడుతున్నప్పుడు, ఒక చండాలుడు ఎదురయ్యాడు. అప్పుడు శంకరుల అతనిని దూరంగా తొలగిపొమ్మన్నారు. 


దానికి చండాలుని ప్రశ్న 


   "ఆత్మ స్వరూపము అద్వితీయము, అనవద్యము, అఖండము, సత్యబోధము, సురూపమని వేదాంతాలు చెబుతున్నాయి కదా! 

    నీవు దూరంగా పొమ్మంటున్నది దేహాన్నా? దేహినా? 

    దేహాన్నే అంటే సమస్త దేహాలూ అన్నమయాలే. అన్న రక్త మాంసాది ధాతువులు కలవియే. 

    పదార్థము ఒకటే అయినప్పుడు, దేని నుంచి ఏది తొలగిపోవాలి? 

    దేహిని అంటే, సర్వసాక్షి అయిన దేహి అంతటా ఒక్కడే! భేదం లేదు. 

    భేదం లేనప్పుడు తప్పుకోమనే మాటకు అర్థంలేదు. 

    ప్రత్యగాత్మ విషయాన 'అతడు బ్రాహ్మణుడు', 'ఇతడు చండాలుడు' అనే విచారణ ఎల్లా పొసగుతుంది? 

    గంగ యందూ, కల్లు నందూ ప్రతిబింబించే సూర్యబింబానికి భేదమేమి ఉంటుంది?" 

    - అని ఒక చండాలుడు కూడా పలికే పరిస్థితి తెలుపబడింది. 


శ్రుతి చూపిన మార్గం 


"ఏకో దేవస్సర్వభూతేషు గూఢస్సర్వవ్యాపీ సర్వభూతాన్తరాత్మా" 

  - చైతన్య స్వరూపుడగు అన్తరాత్మ, 

    పిపీలికాది బ్రహ్మదేవుని వఱకు ఉండే సర్వదేహములందు ఏకరీతిగ ఉంటూ, 

    సర్వసాక్షియై ఉంటున్నాడు. 


శంకరుల స్పందన 


    పైవిషయాన్నే శంకరులు తీసుకొని, 

    జ్ఞానమార్గంలోని ఏకాత్మతావాదాన్ని తెలుసుకొంటే, 

    ఈ అస్పృశ్యత అనేభావనే కలగదని తెలుపుతూ, సందేశం ఇచ్చారు.  

    ఆ విధంగా తెలిపేవాడు ద్విజుడైనా - చండాలుడైనా తనకు వందనీయుడేనంటూ, 

    కేవలం వందనీయుడే కాదు గురువని ముమ్మాటికీ చెప్పగలనన్నారు. 

   "మనీషా పంచకమ్" అనే ఆశువుగా పలికిన స్తోత్రమ్ ద్వారా ఆ చండాలుని రూపంలో సర్వాత్మకుడైన విశ్వేశ్వరుని దర్శించారు. 


      వారు సాక్షాత్తూ శంకరులే! మనకు తెలుపటానికి ఆ రెండు రూపాలలో విచ్చేసిన స్వామియే! 


      అస్పృశ్యతను పారద్రోలటమే కాక, ప్రతి ఒక్కరూ తమతోపాటు అందరిలోనూ భగవద్దర్శనం పొందే అద్భుత మార్గాన్ని అందించారు. 


https://youtu.be/_bNXGUykMNI 


                కొనసాగింపు ...


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం -‌ అష్టమి / నవమి - మఘా -‌‌ గురు వాసరే* (16.05.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

నీకర్మ నీచేత

 నీకర్మ నీచేత ఆపని చేయిస్తుంది!


ధర్మరాజును జూదంవైపు నడిపించింది ఏది?

స్వభావరీత్యా మనిషి తనకు ఇష్టంలేని పనులు ఎందుకు చేస్తాడో భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం వివరించింది. 

ఒక పనిని ఆచరించడంగాని, నిరాకరించడంగాని మనిషి చేతిలో లేదని, ప్రకృతిశక్తి లేదా విధికి లోబడి తనకు తెలియకుండానే మనిషి దానికి పూనుకొంటాడని 60వ శ్లోకం చెబుతోంది.


ధర్మజుడు ధర్మాధర్మ విచక్షణ బాగా తెలిసిన ధర్మమూర్తి. పైగా యమధర్మరాజు అంశతో జన్మించినవాడు. అంతటి వివేకి- చెడ్డదని తెలిసీ, వ్యసనమని ఎరిగీ జూదం విషయంలో నిగ్రహం ఎలా కోల్పోయాడు? 

ఇదే సందేహం జనమేజయుడికీ వచ్చింది. వ్యాసమహర్షిని అడిగాడు. 


దానికి వ్యాసుడు “ప్రకృతి చేయిస్తుంది నాయనా! దానిముందు నీ నిగ్రహం చాలదు... ఇష్టంలేకపోయినా నీ స్వభావం, నీ కర్మ నీచేత ఆ పని చేయిస్తాయి!” అని బదులిచ్చాడు. 

జనమేజయుడికి సంతృప్తి కలగలేదు. కాని, మౌనం వహించాడు.

రాజు అసంతృప్తిని ఋషి గమనించాడు. మాట మారుస్తూ “ఓ రాజా! రేపు నీ దగ్గరకు కొన్ని గుర్రాలు అమ్మకానికి వస్తాయి. వాటిలో నల్లదాన్ని మాత్రం కొనవద్దు! కొన్నా, దానిమీద స్వారీ చెయ్యకు... చేసినా ఉత్తర దిక్కుకు మాత్రం పోనేవద్దు. పోయినా అక్కడుండే సుందరితో మాట కలపకు..! కలిపినా ఆమెను పెళ్ళి మాత్రం చేసుకోకు. చేసుకున్నా, ఆమె మాటకు లోబడి ఆమె ఆడించినట్టు ఆడకు... జాగ్రత్త!” అని హెచ్చరించాడు.


మర్నాడు కొందరు వర్తకులు మేలుజాతి అశ్వాలను అమ్మకానికి తెచ్చారు. వాటిలో నల్లగుర్రమే చాలా ఆకర్షణీయంగా ఉంది. ‘దీనివల్ల ఈ గుర్రపుశాలకే కాదు, ఈ రాజ్యానికే శోభ’ అనిపించింది రాజుకు. ఆయనకు వ్యాసమహర్షి మాట వెంటనే గుర్తుకొచ్చింది. ‘ఎక్కవద్దన్నాడు కాని కొనవద్దని చెప్పలేదుగా!’ అని సమాధానపడి పెద్ద ధరకు దాన్ని కొనేశాడు. 


రోజూ అశ్వశాలలో దాని సొగసు చూసి మురిసిపోయేవాడు. క్రమంగా ఇష్టం పెరిగిపోయింది. ‘ఉత్తర దిక్కుకు పోవద్దనే కదా మహర్షి హెచ్చరించింది... ఎక్కవద్దని కాదు..!’ అని సరిపెట్టుకొని తక్కిన మూడు దిక్కుల్లో హాయిగా స్వారీ చేయడం ఆరంభించాడు. 


కొన్నాళ్లు గడిచాయి. ‘ఉత్తర దిశగా పోదాం... అక్కడి సుందరితో మాట్లాడకుండా తిరిగొచ్చేస్తే ఫరవాలేదు’ అని నిశ్చయించాడు. ఉత్తరం వైపు గుర్రాన్ని నడిపించాడు.


అక్కడొక అందమైన యువతి కనిపించింది. ఆమెతో మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ఆ తరవాత ‘ఇంతటి సౌందర్యరాశిని సొంతం చేసుకోకుంటే ఈ జన్మ వృథా!’ అనిపించింది. ‘ఆమె ఏం చెప్పినా పట్టించుకోవద్దు... కేవలం పెళ్ళి మాత్రమే చేసుకొందాం... ఆమె చెప్పినట్లు మాత్రం చేయవద్దు’ అన్న గట్టి నిర్ణయంతో గాంధర్వ వివాహం చేసుకొన్నాడు. అంతఃపురానికి తీసుకొచ్చాడు. 


ఒకరోజు ఆ సుందరి ‘దేశంలోని సాధువులను పొలిమేరల్లోని మునులను పిలిచి సంతర్పణలు, సత్కారాలు చేయాలని ఉంది’ అని రాజును కోరింది.


అది భార్య తొలి కోరిక. పైగా చక్కని సత్కార్యం. కాదనడం దేనికనుకొన్నాడు జనమేజయుడు. అన్న సమారాధనకు భారీ ఏర్పాట్లు చేశాడు. వడ్డిస్తుండగా ఆమె లోకోత్తర సౌందర్యాన్ని గమనించిన ఒక యువసాధువు మోహపరవశుడై ఆమెను కామదృష్టితో పరికించాడు. 


ఆమె ఏడుస్తూ రాజుకు ఫిర్యాదు చేసింది. దాంతో రాజు పట్టరాని కోపంతో కత్తిదూసి ఆ సాధువు తల నరికేశాడు. 

మరుక్షణమే ‘అయ్యో బ్రహ్మహత్యాపాతకానికి ఒడిగట్టానే’ అంటూ వలవల ఏడ్చాడు.

వ్యాసమహర్షి నవ్వుతూ ప్రత్యక్షం అయ్యాడు. తన మాయను ఉపసంహరించాడు. 

జనమేజయుడికి కల చెదిరినట్లయింది. మబ్బు విడిపోయింది. ఈ కథలో గ్రహించడానికే తప్ప ఇక చెప్పడానికి ఏమీలేదు!

ఆచార్య సద్భోదన*

 *ఆచార్య సద్భోదన*

                  ➖➖➖✍️


*దుఃఖానికి మూలం స్వార్థమే...! విపరీతమైన కోరికలు, ఆశలు, వికారాలు మనిషిని మృగముగామార్చి, స్వార్థమనే అగ్నిలో దగ్ధం చేస్తుంది.*

```

ప్రేమా, ఔదార్యం, సహనం నిస్వార్ధాన్ని వృద్ధిచేస్తాయి. ఇంద్రియ సంయమనం పారమరమార్థిక చింతనకు పాదు చేస్తుంది.


సత్ సాంగత్యం ఆత్మ జ్ఞాన ప్రాప్తికై దోహదం చేస్తుంది. సత్ కర్మలతో హృదయాన్ని, శరీరాన్ని పునీతం చేసుకోవాలి. సృష్టి యందలి ప్రతీ అణువులో దైవాన్ని చూసే దృష్టిని అలవర్చుకోవాలి.


ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకోవాలి. చెట్టు, చెఱువు, గోవు, నదులు, మొదలైనవి పరులకోసమే జీవిస్తున్నాయి. వాటిలో ఇసుమంతయు స్వార్థం లేదు.


మనస్సు, బుద్ది, వాక్కు, లాంటి అనంతమైన శక్తి సామర్థ్యలను భగవంతుడు మనకు వరాలుగా నొసగాడు. అలాంటి మానవులమైన మనలో ఎంత నిస్వార్థమైన కార్యాచరణ ఉండాలి....?


ఉడుత, జఠాయువు వంటి ప్రాణులు సైతం రామునికి మహోపకారం చేస్తే, ప్రతిగా రాముడు చేసిన ధర్మవర్తనం మనకు తెలియనిదా...!


ఈ నిస్వార్థ గుణం పశు, పక్షాదుల నుండి నేర్చుకోవాలిసిన దౌర్భాగ్యస్థితి మనిషికి దాపురించింది అంటే... మానవ జాతి భవిత రేపు ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహిస్తే... మనిషి ఎంత స్వార్థ పరుడిగా మారిపోతున్నాడో అవగతమౌతుంది.


అవయవదానం,రక్తదానం,వస్త్రదానం, అన్నదానం వంటి దానగుణాలు అలవర్చుకొంటూ, మన పిల్లలకు చిన్ననాటినుండే పరులకు ఉపకారం చేసే సంస్కార భావాన్ని నేర్పించాలి.```


*పరోపకారః పుణ్యాయ పాపాయ పర పీడనమ్॥*```

పరులకు మేలుచేస్తే అది పుణ్యం, అపకారం చేస్తే అది పాపం... పరులకు మేలుచేయడం దేవుడెరుగు కానీ, అపకారం మాత్రం తలపెట్టవద్దు.```


*సొంత లాభం కొంతమానుక పొరుగు వాడికి తోడుపడవోయ్...* ```అన్న గురజాడ గారి సందేశం మనకు వెలుగు మేడ అని గ్రహించగలిగితే... అన్ని అనర్థాలకు మూలమైన స్వార్థాన్ని తరిమికొట్టగలం.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀 జై శ్రీ రామ్ 

కంచర్ల వెంకట రమణ 🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్

 


 నేను ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాను.  భారతదేశం సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్ ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది.  14567 (ఏ ఏరియా కోడ్ లేదా ఏదైనా ఉపసర్గ లేకుండా నంబర్‌ను *నేరుగా* డయల్ చేయండి).  నేను ఈ ఫోన్‌ని తనిఖీ చేసాను మరియు ఒక మహిళ ఇచ్చిన ప్రతిస్పందనతో నేను ఆశ్చర్యపోయాను.  ఈ కేంద్రం ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల మధ్య సీనియర్ సిటిజన్‌లకు అవసరమైన ఏదైనా సహాయం / మద్దతును అందిస్తుంది.  ఆపదలో ఉన్న సీనియర్ సిటిజన్‌ల కేసు, వైద్య సహాయం అవసరం లేదా వేధింపుల నుండి రక్షణ, సమీపంలోని టీకా కేంద్రాలు మొదలైన వాటి గురించి ప్రస్తావించవచ్చు. తక్షణ సహాయం కోసం వాగ్దానం చేయడంతో ఆందోళన వ్యక్తం చేసిన వ్యక్తి నన్ను బాగా ఆకట్టుకున్నాను.  సహాయం అవసరమైన వారికి సహాయం చేయడానికి మేము ఈ సమాచారాన్ని విస్తృతంగా పంచుకోవాలని మరియు పంపిణీ చేయాలని నేను సూచిస్తున్నాను.


 దయచేసి ఈ సేవ ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల మధ్య మాత్రమే అందుబాటులో ఉంటుందని మరియు ఈ సేవ హర్యానా మరియు పశ్చిమ బెంగాల్‌లో మినహా ప్రతి రాష్ట్రంలో అందుబాటులో ఉందని, ఇక్కడ ఇది ఇంకా ప్రారంభం కాలేదు కానీ త్వరలో అందుబాటులోకి వస్తుంది.  దయచేసి మీ సర్కిల్‌లోని సీనియర్ సిటిజన్‌లందరికీ (స్నేహితులు, బంధువులు, పొరుగువారు) ఈ సందేశాన్ని పంపిస్తారా?  ఇది భారత ప్రభుత్వం తీసుకున్న గొప్ప చొరవ మరియు సహాయం అవసరమైన సీనియర్ సిటిజన్‌లకు ఖచ్చితంగా ప్రయోజనాలను అందజేస్తుంది.

 

 చాలా సమాచారం, ఇది పని చేస్తోంది.  దయచేసి మీ అన్ని గ్రూప్‌లలో దీన్ని షేర్ చేయండి

విజయవాడ వారి క్యాటరింగ్

 విజయవాడ వారి బ్రాహ్మణ క్యాటరింగ్ 

మధువని క్యాటరింగ్& ఈవెంట్స్ విజయవాడ9182554800,

7396881404


మీ ఇంట జరిగే అన్ని రకాల శుభకార్యాలకి, గృహప్రవేశాలకి,పెళ్ళిళ్లకి, నోములకి, కిట్టీ పార్టీలకి,10 మంది నుంచి 500 మంది వరకు బ్రాహ్మణ భోజనం మీరు కోరిన విధంగా కేటరింగ్ పద్ధతిలో చేసి ఇస్తాం.                                                                                                     


మేము మీ ఇంట జరిగే శుభకార్యాలకి ఈవెంట్స్ కూడా చేస్తాము. మండపం డెకరేషన్, సన్నాయి మేళం, డిజె సౌండ్, యాంకర్, పురోహితులు, క్యాటరింగ్, రాయల్ ఎంట్రీ, మహేంది టాటూ స్టాల్స్, యాంకర్, అందుబాటు ధరలలో ఏర్పాటు చేయబడును


విజయవాడ మీదుగా (కారు, బస్సు) లేదా ఏ ఇతర వాహనాలపై ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉన్నవారు ఒకరోజు ముందుగా తెలియజేస్తే చక్కటి ఇంటి తరహా బ్రాహ్మణ భోజనం అందజేస్తాము 

                                        నలుగురికి ఉపయోగపడే పోస్ట్ దయచేసి మీ బంధువులకి,మిత్రులకి షేర్ చేయండి🙏🙏

T.T.D SEVA TICKETS AUGUST-2024*

 *T.T.D SEVA TICKETS AUGUST-2024*


*1.SRIVARI PAVITHROTSAVAM Tickets 15-8-2024 to 17-8-2024 will be available from 21-5-2024 10.00 AM*


*2.SRIVARI SEVA TICKETS ELECTRONIC DIP Registration will be available from 18-5-2024 10-00 AM to 20-5-2024 10-00 AM*


*3.SRIVARI ARJITHA SEVAS Tickets Kalyanam, Unjal Seva, Arjitha Brahmotsavam and SD Seva will be available from 21-5-2024 10-00 AM*


*4.ONLINE SEVA (VIRTUAL PARTICIPATION) & connected Dharshan for Kalyanam, Unjal, Arjitha Brahmotsavam & SD Sevas will be available from 21-5-2024 3-00 PM*


*5.ANGAPRADAKSHINAM Tokens will be available from 23-5-2024 10-00 AM.*


*6.DARSHAN & ACCOMMODATION quota to the SRIVANI TRUST DONORS will be available from 23-5-2024 11-00 AM.*


*7.SENIOR CITIZENS/PHYSICALLY CHALLENGED quota will be available from 23-5-2024 3-00 PM.*


*8.SPECIAL ENTRY DARSHAN (Rs.300) tickets will be available from 24-5-2024 10-00 AM*


*9.TIRUMALA & TIRUPATI ACCOMMODATION Quota will be available from 25-5-2024 3-00 PM*


*10.SRINIVASA DIVYANUGRAHA HOMAM Tickets JUNE 2024 will be available from 27-5-2024 10.00 AM.*


*For bookings pls use the TTD Official Web site only: ttdevasthanams.ap.gov.in*


By, *Pujari.RathnaPrabhakar,M.A., T.T.D.* 🙏

దక్షిణావర్తి శంఖం

 దక్షిణావర్తి శంఖం యొక్క ప్రత్యేకత - 1


       శంఖములలో రెండు రకాలు కలవు . అవి 


  * వామావర్తి శంఖము . 


  * దక్షిణావర్తి శంఖము . 


     పైన చెప్పిన రెండురకాల శంఖాలలో దక్షిణావర్తి శంఖం సులభముగా లభ్యం అగును. ఇది ఒక మంచి తాంత్రిక వస్తువు . దీనిని పూజలలో మహాలక్ష్మితో సమానంగా భావించెదరు . 


        తంత్రగ్రంధాల ప్రకారం వామావర్తి అంటే ఎడమ చేయి వైపు "కడుపు" కలది అనగా ఎడమచేయి వైపు తెరిచి ఉండేది అని దక్షిణావర్తి అంటే కుడివైపు తెరచి ఉండేదని అర్థం . 


          ఇప్పుడు శంఖాల గురించి కొంత వివరణ మీకు ఇస్తాను . శంఖం అనేది " ఘోoఘా " అనే సముద్రజాతికి చెందిన జంతువు . ఇది తెరుచుకొని ఉన్న భాగమే దీని కడుపు లేక నోరు . తలవలే ఉండి ఊదే భాగం దానియొక్క పృష్ఠభాగం అంటే వెనక భాగం లేక తోకభాగం . దీనికే గుండ్రని కన్నం చేసి నోటితో ఊదుతారు. 


        దక్షిణవర్తి శంఖం అనేది చాలా ప్రత్యేకమైన తాంత్రిక వస్తువు . సముద్రము నందు జన్మించడం మూలాన శ్రీ మహాలక్ష్మితో పోల్చబడిన వస్తువు . సమస్త సిరులు , భోగభాగ్యాలు ప్రసాదించును . శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వంటి వారు ఒక్క యుద్ధ సమయము నందు తప్ప మిగిలిన సమయాలలో పూజా మందిరము నందు ఉంచి పూజించేవారు . దీనిని లక్ష్మీదేవి సహోదరిగా చెప్పుదురు . ఇది అరుదుగా లభ్యం అగును . రామేశ్వరం , కన్యాకుమారి వంటి స్థలములలో తప్ప అన్య ప్రదేశాలలో దొరకదు . ఈ దక్షిణావర్తి శంఖం మోగదు . మోగేది దొరుకుట అదృష్టము మరియు కష్టం . దోషయుక్తం అనగా పగిలిన మరియు విరిగిన శంఖం ఇంటి యందు ఉంచరాదు . 


          తరవాతి పోస్టు నందు ఈ శంఖం పూజావిధానం సవివరంగా వివరిస్తాను . 


   

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 

ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు.  మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ 9848647145 కు వాట్సాప్ చేయండి.  దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 

ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   

ఇట్లు 

మీ బ్లాగరు

పంచాంగం 16.05.2024

 ఈ రోజు పంచాంగం 16.05.2024 Thursday.


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస శుక్ల పక్ష: అష్టమి తిధి బృహస్పతి వాసర: మఘ నక్షత్రం ధ్రువ యోగ: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


అష్టమి ఉదయం 06:23 వరకు.

మఘ సాయంత్రం 06:14 వరకు. 

సూర్యోదయం : 05:48

సూర్యాస్తమయం : 06:37


వర్జ్యం : తెల్లవారుఝామున 04:51 నుండి 06:38 వరకు తిరిగి రాత్రి 03:15 నుండి రేపు తెల్లవారుఝామున 05:04 వరకు.


దుర్ముహూర్తం : పగలు 10:04 నుండి 10:56 వరకు తిరిగి మధ్యాహ్నం 03:12 నుండి 04:03 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 03:34 నుండి 05:21 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

గోమయపు

 *సర్వేభ్యోభాగవతేభ్యోనమః*


 *ఎందరో ఎన్నోహోమాలు దైవానుగ్రహం,లోకకల్యాణం కొరకై చేస్తూ ఉంటారు. అటువంటి హోమగుండాల్లో ఆవునెయ్యి,హోమద్రవ్యాలతోబాటుగా యాగీయమైన(హోమాలకు ఉపయోగించడానికి నిర్దిష్టమైన) కట్టెలను మరియు గోమయపు పిడకలు,కట్టెలు మాత్రమే వాడవలెను. కానీ ఈనాడు నానారకాల కట్టెలనూ,రంపపుపొట్టు,చిత్రీ గుల్ల వంటి కట్టెలవ్యర్థాలనువినియోగిస్తున్నారు,వీటితోపాటు కొందరు పెట్రోలు, కిరోసిన్,ప్లాస్టిక్ వంటివాటిని కూడా వాడేస్తున్నారు.ఇటువంటి వస్తువులను హోమగుండాలలోగానీ,శవదహనాలలో గానీ మండించడం మహాపాపం. పర్యావరణానికికూడా ఎంతో హానికరం, తద్వారా మనకు సత్ఫలితాలు ఎలా రాగలుగుతాయి!!?? హిందూసనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కట్టుబడిఉన్న కమ్యూనిస్టులు,హేతువాదులు ఇటువంటి హోమాలవలన పర్యావరణం నాశనమైపోతోందంటూ సైంటిఫిక్ రీసెర్చిలతో దాడులుచేసే అవకాశం ఏర్పడుతుందికదా!! కొంత ఆలోచించండి. మనం సమర్పించే హోమద్రవ్యాలన్నీ ఆయాదేవతలకు చేరవేసేపని అగ్నిహోత్రునిది,ఆయన ఆహారంలో ప్రప్రధానమైనది ఆవునెయ్యి,ఇది ఈనాడు శుధ్ధమైనది దొరకడం చాలాకష్టం.తరువాత యాగీయమైన వస్తువులలో ప్రధానమైనది ఎండినగోమయం. గోమయపు కట్టెలు, పిడకలు మావద్ద అందుబాటులోఉన్నాయి.మా వాట్సాప్ నంబర్ 9492050200.*

భజగోవిందం

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|భజగోవిందం|¦¦|-_* ॐ卐 💎

   


శ్లో𝕝𝕝 *రథ్యా చర్పట విరచిత కంథః పుణ్యాపుణ్య వివర్జిత పంథః* |

*యోగి యోగనియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవదేవ* 22 


*భావం: దారిలో దొరికే గుడ్డ పీలికలతో తయారైన గోచిని ధరించిన వాడై; ఇది పుణ్యమని, అది పాపమని ఏ మాత్రం ఆలోచించక, నిరంతరం మనసుని యోగమునందే నిలిపిన యోగిపుంగవుడు ఈ లోకంలో బాలునిలాగ, పిచ్చివానిగా ప్రవర్తిస్తూ ఉంటాడు*. 


 ✍️🪷🌷🙏

సత్యవచనముల ద్వారా

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో॥ *లుబ్ధమర్థేన గృహ్ణీయాత్*

 *స్తబ్ధమంజలి కర్మణా* । 

     *మూర్ఖం ఛన్దోఽను వృత్తేన*

 *యథార్థత్వేన పండితమ్* 11


తా॥ *ధనమునందాసక్తిగల లోభిని ధనముద్వారా, అహంకారిని నమస్కారము ద్వారా, మూర్ఖుని ఆతని కోరిక ననుసరించి పనిచేసియు, బుద్ధిమంతుడైన వానిని సత్యవచనముల ద్వారా వశపఱచుకొనవలెను*


 ✍️🌸🪷🙏

రాశిఫలాలు

 *16-05-2024  

గురువారం, బృహష్పతి వాసరః

 రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం

చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

---------------------------------------

వృషభం

ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధు మిత్రుల రాకతో సందడి వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరస్థి వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లబ్ది పొందుతారు.

---------------------------------------

మిధునం

బంధువులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఋణ ప్రయత్నాలు కలసిరావు.

---------------------------------------

కర్కాటకం

దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ధన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------

సింహం

పాత మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన నూతన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

---------------------------------------

కన్య

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది. 

---------------------------------------

తుల

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్థులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

వృశ్చికం

దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి సమయానికి తగిన విశ్రాంతి ఉండదు. ప్రభుత్వ వ్యవహారాలలో విమర్శలు ఎదురవుతాయి.

---------------------------------------

ధనస్సు

ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. 

---------------------------------------

మకరం

సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. చాలకాలంగా పూర్తి కానీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కుంభం

నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు.

---------------------------------------

మీనం

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత మానసిక బాధ కలిగిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి.

•••••┉━•••••┉━

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

విశ్వాసం

  కుక్క చూపే విశ్వాసం కన్నా ఆవు 🐄 ఇంకా ఎక్కువ విశ్వాసం చూపిస్తుంది మేము 1976 నుండి 2006 వరకు ఆవులు ని పెంచాం మనం నమ్మం కానీ యజమాని ని వాసన చూసి ఏ రోగమో స్కాన్ చేసి ఏ మొక్కలు తిని పాలు ఇస్తే ఆ పాలు తాగితే యజమాని కి రోగం నయం అవుతుందో ఆ మొక్కల ను ఆహారం గా తిని వస్తుంది పైగా ఇంటికి కొత్త వారు వస్తే అరుపు ఒకలాగ ఇంటి సభ్యులు ఇంటికి వస్తే అరుపు మరొక లాగా తనకు సంపర్కం కావాలి అంటే అరుపు మరొక లాగా ఉంటాయి నాకు తెలుసు ఆ అరుపులలో తేడా మా తండ్రిగారు చనిపోయారు 1-1-2002 నాడు రోజూ ఎప్పుడు వలే ఆవులు ని మేత కోసం వదిలేశాం ఆవు వెళ్ళలేదు ఒక రకమైన బాధ తో కూడిన అరుపు తన బిడ్డ చనిపోతే ఏడుపు తో అరుస్తుంది అలా అరిచింది. క్షుద్ర దేవతలు లేదా భూత ప్రేత పిశాచాలు వస్తే ముందు నన్ను భుజించి అప్పుడు నా యజమాని వద్దకు వెళ్ళి తిను అంటుందిట ఆవు ఈ క్వాలిటీ కుక్క 🐕 కి ఎలా వస్తుంది ఆవు 🐄 షెల్టర్ లో కూర్చుని జప తపాలు చేస్తే ఫలితం ఎక్కువ కుక్క ని ముట్టుకుంటే స్నానం చేయకుండా జప తపాలు పనికిరావు ఇలా చెబుతూ పోతే ఇంక పుస్తకం అవుతుంది స్వస్తి

హృదయ విదారకర సంఘటన

 నిన్న రాష్ట్రం లో జరిగిన ఒక హృదయ విదారకర సంఘటన హృదయాన్ని కలచివేసింది.

మనస్సున్న ప్రతిఒక్కరిని కంట నీరు పెట్టించింది.


*ఆరు(6) నెలల వయస్సున్న పసికందు నిద్రపోతువుంటే,పక్కింటి వాళ్ళ పెంపుడు కుక్క,ఆ బిడ్డ ను పీకి,పీకి చంపివేసింది*


*తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి బిడ్డ రక్తపు మాంసపు ముద్దగ మారి,మరణించింది.*

*ఆ శునకాన్ని కొట్టి చంపేశారు*.


1) కుక్కల్ని పెంచేవారు,వాటిని తగు రీతిన తమ అదుపు,ఆజ్ఞ లో వుంచు కోవాలి.

2) కొంతమంది గొలుసు కట్టి ఉదయం పూట వాకింగ్ కి కుక్కని తీసుకు వస్తారు.రోడ్డు మీద నడిచే కొందరికి ప్రాణ సంకటం గా వుంటుంది.

3) మన కుక్క మనకి ముద్దు,పక్కవారికి ముద్దు కాదు.

4) పెంపుడు కుక్కలు కొంతమంది అపార్టుమెంటులో కూడా పెంచి అందరికీ ఇబ్బంది కలుగ చేస్తున్నారు.

5) మన పెంపుడు కుక్క మనల్ని ఏమి చేయదు,కాని పక్క వారిని తప్పకుండా కోపం గా చూస్తోంది.

6) ఎంతయినా జంతువు, జంతువే.


*కుక్కలంటే నాకు ఇష్టమే.నేను కుక్కని పెంచటానికి వ్యతిరేఖం కాదు.*


*జంతు ప్రేమికులు అందరికీ వందనాలు.*

 జంతువు కన్న సాటి మనిషి ముఖ్యం.

మనమందరం మనుషులం.

అందరికీ వందనాలు.....🙏🙏


*మూర్తి's కలం నుండి....✒️*...

(సీనియర్ ఫిజిక్స్ లెక్చరర్,కాలమిస్ట్)

గురువారం,మే16,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హo*


గురువారం,మే16,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - శుక్ల పక్షం

తిథి:అష్టమి ఉ7.20 వరకు

తదుపరి నవమి

వారం:గురువారం(బృహస్పతివాసరే )

నక్షత్రం:మఖ రా7.10 వరకు

యోగం:ధృవం ఉ9.41 వరకు

కరణం:బవ ఉ7.20 వరకు

తదుపరి బాలువ రా8.14 వరకు

వర్జ్యం:ఉ6.03 - 7.48 మరల తె3.59 - 5.44

దుర్ముహూర్తము:ఉ9.47 - 10.39

మరల మ2.55 - 3.46

అమృతకాలం:సా4.32 - 6.17

రాహుకాలం:మ1.30 -3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యరాశి: వృషభం

చంద్రరాశి: సింహం 

సూర్యోదయం:5.32 

సూర్యాస్తమయం:6.20


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

⚜ *శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 318*


⚜ *కర్నాటక :- *


*బగ్గవల్లి - చిక్కమగళూరు*


⚜ *శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం*


*ఉగ్రం వీరం మహావిష్ణుం* *జ్వలంతం సర్వతోముఖం*

*నృసింహం భీషణం భద్రం* *మృత్యుమృత్యుం నమామ్యహమ్ ॥*


💠 నరసింహుడిని ఆవాహన చేయడానికి ఉపయోగించే మంత్రాలలో పై మంత్రం ఒకటి.  కానీ అది ఉగ్రనరసింహుని ఉగ్రరూపం (అత్యంత ప్రజాదరణ పొందిన రూపం) ప్రస్తావిస్తుంది.  

శ్రీ నరసింహుడు ఇతర రూపాలలో కూడా పూజించబడతాడు.  (మొత్తం 9 రూపాలు).  వాటిలో ఒకటి యోగ నరసింహ. 

నరసింహుని యొక్క ప్రశాంతమైన మరియు ధ్యాన రూపం.  


💠 పురాణాల ప్రకారం, హిరణ్యకశిపుడనే రాక్షసుడిని సంహరించిన తర్వాత తనను తాను శాంతపరచుకోవడానికి నరసింహుడు ఈ భంగిమను తీసుకున్నాడు.

అటువంటి ధ్యాన భంగిమలో నరసింహ స్వామి విగ్రహం కల ఆలయం, కర్ణాటక

చిక్కమగులూరు జిల్లాలో కలదు.


💠 బగ్గవల్లిలోని యోగ నరసింహ దేవాలయం, హోయసల శకం నిర్మాణం 13వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడింది.

యోగ నరసింహ దేవాలయం 12వ శతాబ్దం చివరలో హోయసల నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఇది హోయసల రాజు బల్లాల-III కాలంలో నిర్మించబడింది.


💠 హోయసల కాలంలో అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి, ఆ కాలం నుండి కర్ణాటకలో 300 దేవాలయాలు ఉన్నాయని అంచనా వేయబడింది, అయితే 70 మాత్రమే డాక్యుమెంట్ చేయబడ్డాయి.  


💠 బగ్గవల్లిని మొదట భార్గవపుర అని శాసనాల్లో పిలుస్తారని, గతంలో ఈ గ్రామం అగ్రహారంగా ఉందని చెబుతారు.  

ఈ కట్టడం హొయసల రాజు బల్లాల-III కాలంలో నిర్మించబడింది.  (1239) మరియు ఇది ఈ గ్రామంలోని పురాతన దేవాలయం మరియు అత్యంత నిర్లక్ష్యం చేయబడిన ఆలయం.


💠 బగ్గవల్లి గంభీరమైన హోయసల దేవాలయం. ఇతర హోయసల నివాసాల మాదిరిగానే, ఆలయ వెలుపలి గోడలు విష్ణువు యొక్క చతుర్వింశతి రూపం, గణేశుడు, కైలాసాన్ని మోస్తున్న రావణుడు, గోవర్ధన గిరిని మోస్తున్న కృష్ణుడు, అష్ట దిక్పాలకులు మొదలైన గంభీరమైన శిల్పాలు. 

ఈ శిల్పాలు వాతావరణం లేదా కొన్ని తెలియని కారణాల వల్ల కొద్దిగా దెబ్బతిన్నాయి.


💠 ఈ ఆలయం యోగనరసింహ దేవాలయంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, ఇది త్రికూటాచల దేవాలయం.  

ప్రధాన గర్భగుడిలో కేశవుడు, పక్కనే ఉన్న గర్భాలయంలో శారదాంబ, నర్సింహస్వామి ఉంటారు.


💠 బగ్గవల్లి గ్రామంలోని యోగనరసింహ దేవాలయం దశాబ్దాలుగా సంరక్షణకు నోచుకోలేదు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న 'ముఖమంటప' రాళ్లు, అడుగుభాగంలో ఉన్న శిలాఫలకాలు దయనీయంగా ఉన్నాయి.

అలాగే ఆలయ గోడలపై ఉన్న విగ్రహాల మధ్య అంతరం కూడా పెరిగింది.

'శిఖర' దేవాలయం పగుళ్లు ఏర్పడింది. 

ప్రకృతి వైపరీత్యాల కారణంగా గోడపై రాతి పలకలు కూరుకుపోవడంతో ఆలయం శిథిలావస్థకు చేరుకుంది.

నిర్వహణ లేకపోవడంతో అందమైన చెక్కడాలు తమ మెరుపును కోల్పోయాయి. 


💠 యోగనరసింహ, శారదాంబ, చెన్నమల్లికార్జున స్వామి, గణపతి మరియు ఆంజనేయ దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు చెక్కడం యొక్క అత్యుత్తమ పనిని వర్ణిస్తాయి. ఈ దేవాలయం హోయసల నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. కానీ సమాచారం లేకపోవడంతో పర్యాటకులు ఎవరూ ఆలయానికి రావడం లేదు.


💠 దేవాలయం తూర్పు ముఖంగా ఉంది. 

ఈ ఆలయంలో గర్భగుడి, సుఖనాసి, నవరంగ మరియు ముఖ మండపం ఉన్నాయి. 

ముఖ మండపానికి తూర్పు, ఉత్తరం మరియు దక్షిణం వైపున మూడు ప్రవేశ మండపాలు ఉన్నాయి. ఈ ఆలయం త్రికూటాచల శైలిలో నిర్మించబడింది, ఇందులో మూడు గర్భాలయాలు ఉన్నాయి, ఒక్కొక్కటి ఉత్తరం, దక్షిణం మరియు పడమరలలో ఉన్నాయి. పశ్చిమాన ఉన్న ప్రధాన గర్భగుడి మాత్రమే సుఖనాసితో అందించబడింది, మిగిలినవి నేరుగా సాధారణ మండపం (నవరంగ)లోకి తెరవబడతాయి.


💠 ముఖ మండపం నవరంగాన్ని బయటి ప్రాంగణానికి కలుపుతుంది. ఈ ఆలయాన్ని యోగ నరసింహ దేవాలయంగా పిలుస్తున్నప్పటికీ, గర్భగుడిలో కేశవుడు ఉన్నాడు. 


💠 విగ్రహం దాదాపు 1.52 మీటర్ల ఎత్తు ఉంటుంది. గర్భగుడిపై షికార వేసారా శైలిని అనుసరిస్తుంది. 


💠 లక్ష్మీ నారాయణ సమేతంగా యోగ నరసింహుడు మిగిలిన రెండు క్షేత్రాలలో కొలువై ఉంటారు. ఆలయం వెలుపలి భాగం పౌరాణిక శిల్పాలు మరియు పూల మూలాంశాలతో అలంకరించబడి ఉంది . ఆలయ ప్రాంగణంలో షణ్ముఖ, గణేశ, శారదాంబ, చెన్న మల్లికార్జున స్వామి, ఆంజనేయ విగ్రహాలు దర్శనమిస్తాయి.


💠 నరసింహ జయంతి, కార్తీక దీపోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.


💠 శ్రీ యోగనరసింహ స్వామి 'కుజ దోషం' మరియు ఆరోగ్య రుగ్మతల నుండి ఉపశమనాన్ని ప్రసాదిస్తారని ప్రజలు నమ్ముతారు.


💠 ఈ ఆలయం అజ్జంపూర్ రైల్వే స్టేషన్ నుండి 8 కిమీ,శివమొగ్గ నుండి 62 కిమీ, బెంగళూరు నుండి 246 కిమీ మరియు బెంగళూరు విమానాశ్రయం నుండి 265 కిమీదూరంలో ఉంది. ఈ ఆలయం బీరూర్ నుండి అజ్జంపూర్ మార్గంలో ఉంది.

విరాళాలు

  విరాళాలు ఇవ్వగలరు 


రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ముఖ్యంగా అమెరికా నుంచి చూస్తున్న వారి సంఖ్య భారత దేశ వీక్షకులను మించి కొన్ని రోజులు వున్నాయి అంటే అతిశయోక్తి లేదు. బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు చూపే ఆదరణే ఈ బ్లాగు పురోగవృద్దికి పునాది. ఈ బ్లాగులో వివిధ అంశాలు మన హిందూ ధర్మానికి చెందినవి, విద్య వైజ్ఞానికమైనవి, రోజు పోస్టు చేస్తుంటే వాటిని మీరు తిలకిస్తున్నారు. ఈ బ్లాగులో సాహిత్య, సాంస్కృతిక, హిందుత్వ ముఖ్యంగా ఆధ్యాత్మికమైన విషయాలకు విశేష స్థానాన్ని కల్పిస్తున్నాము. ఈ బ్లాగును ఇంతకంటే మెరుగుగా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము. 


 


ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న ధనంతో కూడుకున్నదని మనకు తెలుసు " ధనమ్ములం మిదం జగత్" ఏ కొత్త గాడ్జెట్ కొనాలన్నా ఎంతో ఖరీదులో ఉంటున్నాయి. మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారక పొతే ఆధునికతలో వెనక పడి ఉంటాము అన్నది అక్షర సత్యం. కాబట్టి ప్రేక్షకులను కోరేది ఏమిటంటే మీరు మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చి ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే, పెటియం, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును. 


9848647145