8, జనవరి 2024, సోమవారం

Swim bud

 


కర్మ మరచిపోదు..

 🌹🌹🌹🌹🌹🌹

    *మనిషి నైజం*

🌹🌹🌹🌹🌹🌹


"ప్రార్ధన" చేస్తున్నప్పుడు దేవుడు వింటాడనే "నమ్మకం". 

"నిందలు" వేస్తున్నప్పుడు ఉండదు..


"పుణ్యకార్యం" చేస్తే దేవుడు చూస్తాడనే నమ్మకం. 

"పాపం" చేస్తున్నప్పుడు ఉండదు.. 


"దానం" చేస్తే దేవుడు సంతోషిస్తాడనే నమ్మకం. 

"దొంగతనం" చేస్తున్నప్పుడు ఉండదు..


"ప్రేమ" లో దేవుడున్నాడని నమ్మకం. 

 మనుషుల్ని "ద్వేషించడంలో ". ఉండదు..


ఇన్ని అసమానతలు ఉన్నా తనని తాను పర్పెక్ట్ అనుకోవడం ఇంకా మూర్ఖత్వం !


మనం చేసే పుణ్యాలను మనం మరచి పోయినా, దైవం మరచిపోదు..


మనం చేసే పాపాలను దైవం మరచి పోయినా, కర్మ మరచిపోదు..



🙏🙏🙏🙏🙏

ఉన్నరోజుల్లో అన్నమాట

 చిన్నప్పుడు , అంటే ఓ పెంకుటిల్లూ, పెరడూ, ముందు వాకిలీ, పెరట్లో ఓ పశువులపాకా, ఓ గడ్డిమేటూ , నీళ్ళకి ఓ నుయ్యీ లాటివి ఉన్నరోజుల్లో అన్నమాట, ఇంటికి ఎవరైనా చుట్టాలో, స్నేహితులో చెప్పాపెట్టకుండా వచ్చినా, సంతోషించే రోజులు. వచ్చీ రాగానే, కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళూ , తుడుచుకోడానికి ఓ తువ్వాలూ ఇచ్చి, త్రాగడానికి ఓ మరచెంబులో మంచినీళ్ళూ, ఓ స్థోమతని బట్టి, కంచుగ్లాసో, ఇత్తడి గ్లాసో ఇచ్చేవారు. భోజనాల వేళ అయితే, భోజనానికి లేవమనేవారు. ఇంత తక్కువ టైములో, ఆ వచ్చినవారికి, భోజనంలోకి ఏదో, ఓ కూరా, పచ్చడీ లేకుండా భోజనం ఎలా పెడతారూ? ఆ ఇంటి ఇల్లాలుకి ఏవిధమైన కంగారూ ఉండేది కాదు. ఈరోజుల్లోలాగ , అతిథులు రాగానే, బజారుకి వెళ్ళి కూరా, నారా తెచ్చుకోడం కాదుకదా, హాయిగా పెరట్లో కి వెళ్ళి, సరిపడే వంకాయలో, పొట్లకాయలో, బీరకాయలో కోయడం, పప్పులోకి ఏ నవనవలాడే ఏ బచ్చలాకులో, గోంగూరాకులో, తుంపడం. పోపులోకి మిరపకాయలూ, కొత్తిమీర కి ఆలోచించాల్సిన పనే ఉండేది కాదు.ఊరగాయలైతే చెప్పఖర్లేదు. చిత్రం ఏమిటంటే, పుష్కలంగా అన్నీ దొరుకుతూన్న రోజుల్లో, మనం, వాటిని అనుభవించడానికి , ప్రతీ రోజూ చిరాకు పడేవాళ్ళం. “ అబ్బ ప్రతీ రోజూ ఇవేనా.. “ అని. ఆరోజుల్లో ఉండీ అనుభవించలేదు, ఇప్పుడు అనుభవించాలన్న కోరిక ఉన్నా వీలు పడడం లేదు. అందుకేనేమో “ చేసికున్నవాడికి చేసుకున్నంతా.. “ అంటారు.

ఈ రోజుల్లోలాగ ఇళ్ళల్లో ఫ్రిజ్జిలూ, డీప్ ఫ్రిజ్జిలూ, మైక్రో వేవ్ లూ ఉండేవి కావు. గ్యాస్ పొయ్యి అంటే ఏమిటో తెలియని రోజులు. అయినా షడ్రసోపేతంగా భోజనం పెట్టేవారు. “ అన్నదాతా సుఖీభవా..” అని నోరారా, మనసారా దీవించే రోజులు. పెరట్లో ఉండే ఆ మొక్కలు పెంచడం కూడా ఓపధ్ధతిలో ఉండేది. స్నానాలు చేసేటప్పుడు వచ్చే నీళ్ళకి, ఓ బుల్లి కాలవలాటిదిచేసి, ఆ మొక్కలకి వెళ్ళేటట్టు చేసేవారు. ఆనపకాయ, గుమ్మడికాయలకైతే, ఏ పశువులపాక మీదకో పాకించేవారు. ఎరువులూ, పురుగుమందులూ అంటే ఏమిటో కూడా తెలియని రోజులు. ఓ దొండపాదో, బీరపాదో ఉందంటే , నాలుగు కర్రలతో, చక్కగా ఓ పందిరిలాటిది వేయడమూ, ఆ పాదుని దానిమీదకు పాకించడమూ. ఉదయానే లేచి, పళ్ళు తోముకోడానికి , బ్రష్షులూ, పేస్టులూ ఎక్కడ చూశామూ? మహా అయితే, నంజన్ గూడు వారి ఎర్ర పళ్ళపొడీ, లేకపోతే హాయిగా “కచిక”. ప్రయాణాల్లో అయితే ఓ వేప్పుల్లా. ఎప్పటికప్పుడు కల్తీలేని పాలూ, తాజా కూరగాయలూ, వీటితోనే రోగాలూ, రొచ్చులూ లేకుండా హాయిగా బతికేవారు. వీటికి సాయం, పచ్చదనంతో ఉండే చెట్ల గాలికూడా, ఆరోజుల్లో ఆరోగ్యానికి దోహదపడేది.. వర్షాలూ, టైముకే వచ్చేవి.

వేసవి కాలం వచ్చిందంటే, ఇంటి ముందర, కొబ్బరాకులతో ఓ పందిరీ, ఇంట్లో , అటక కింద ఓ సరంబీ, కిటికీలకి వట్టివేళ్ళ తడకల ముందు, ఈరోజుల్లో వచ్చే ఏసీ లు ఏ మూలకీ ? అభివృధ్ధి పేరు చెప్పి మనం ఎన్నో, ఎన్నెన్నో పోగొట్టుకున్నాము. అలాగని అభివృధ్ధి లేకుండా, ఎక్కడి గొంగళీ అక్కడే ఉండాలని కాదు. టెక్నాలజీ తోపాటు, దాన్ని సరైన మార్గంలో ఉపయోగించాల్సిన బాధ్యత కూడా ఉండాలి. ఈరోజుల్లో ప్రతీదానికీ ఓ ఆటోమేటిక్ సదుపాయం ఉంది. మంచిదే, కానీ, రోజులు గడిచేకొద్దీ, జనాలు వాటిమీదే పూర్తిగా ఆధారపడే రోజులొచ్చాయి. వారానికోసారి కూరలు తెచ్చేసికుని, వాటిని ఇంట్లో ఉండే, బుల్లి, చిన్న, డబుల్ డోర్, ట్రిపుల్ డోర్ ఫ్రిజ్జిల్లో ఉంచేసికుంటే పనైపోతుందనుకుంటారు. కానీ అవి పనిచేయడానికి ఎలెక్ట్రిసిటీ ఉండాలిగా. ఈరోజుల్లో ఎక్కడ చూసినా, లోడ్ షెడ్డింగులూ, అవీనూ. కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని రోజులు. మరి ఇంక, ఆ ఫ్రిజ్జిల్లో పెట్టిన కూరగాయలూ, పాలూ, పెరుగూ పాడైపోకుండా ఉండమంటే, ఎలా ఉంటాయీ ? తీరా ఏ కూరో చేద్దామని చూస్తే, అవి కాస్తా కుళ్ళిపోయో, బూజుపట్టో కనిపిస్తాయి. మన ఇళ్ళల్లో వచ్చే మంచినీళ్ళు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. దానితో ఇంట్లో ఓ వాటర్ ప్యూరిఫయరు తప్పకుండా ఉండాలే.

ఈ మధ్యన ఓ కొత్తరంధి మొదలయింది. అవేవో “ ఆర్గానిక్ కూరలు “ ట. కొనేవాళ్ళున్నారు కదా అని, ప్రతీదీ—కూరగాయల దగ్గరనుండి, పప్పులూ, ఉప్పులూ, చింతపండూ, బెల్లంతో సహా ప్రతీదానికీ ఓ లేబుల్ పెట్టేసి, అయిదారింతల ఖరీదు పెంచేయడం. వాడు లేబులంటే అంటించాడు కానీ, నిజంగా ఏ ఎరువూ వాడకుండా తయారుచేశాడని గ్యారెంటీ ఏమిటీ ? వాడు చెప్పాడు, అందరూ కార్లలో వచ్చో, ఆన్ లైన్ లోనో కొనుక్కుంటున్నారు, బస్ . పర్యావరణమూ అలాగే తయారయింది. ఊరికే, టీవీ ల్లోనూ, Social Media లోనూ ఊదరగొట్టడం తప్పించి, జరుగుతున్నదేమీ లేదు. అయినా అన్నీ బాగుండి, అందరూ ఆరోగ్యంగా ఉంటే, కోట్లు ఖర్చుపెట్టి తెరిచిన కార్పొరేట్ ఆసుపత్రులు బతకొద్దూ ?

Life goes on….

08-01-2024 / సోమవారం / రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*08-01-2024 / సోమవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


పితృ వర్గీయులతో  వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో ప్రతిష్టంభన కలుగుతాయి. రెండు రకములైన ఆలోచన వల్ల నష్టాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధువులతో అకారణ వివాదాలు తప్పవు. కొన్ని వ్యవహారాలు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు.

---------------------------------------

వృషభం


ఇతరుల పై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. సోదరులతో స్థిరాస్తి  ఒప్పందాలు వాయిదా వేస్తారు.

---------------------------------------

మిధునం



వ్యాపారాల్లో ఆశించిన విధంగా రాణిస్తాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు.  సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

---------------------------------------

కర్కాటకం


ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటా బయట అందరితో  సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో సన్నిహితులు సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది.

---------------------------------------

సింహం


చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

కన్య


ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధుమిత్రులు మీ మాటతో విబేదిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో  ఆలోచనలు నిలకడగా ఉండవు.

---------------------------------------

తుల


స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాలలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు.

---------------------------------------

వృశ్చికం


వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నిరుద్యోగులకు ఒక వార్త సంతోషాన్నిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------

ధనస్సు


బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

---------------------------------------

మకరం


దూరప్రయాణ సూచనలున్నవి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. నూతన ఋణప్రయత్నాలు కలసిరావు. చేపట్టిన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు.

---------------------------------------

కుంభం


వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

---------------------------------------

మీనం


వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వ్యాపారాలు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

పోతన సూక్తి సుధ


పోతన సూక్తి సుధ 


కలుగరే రాజన్యు లిలను నేలగ లేదె 

         ఘనతతో తిరుగరే  గర్వమునను !

వారేరి ! యిప్పుడీ వసుధలో నున్నారె !

         సిరి తోడ దివముకు  చేరి నారె!

నుర్వి పై వారల కున్నట్టి పేరది 

         నిలిచినే యశముతో నిఖిలమందు 

శిబిచక్రవర్త్యాది శ్రేష్టులౌ రాజులు 

         కోర్కెలన్ దీర్చరే కూర్మి జనుల

వారలను విస్మరించిరె వసుధ యందు  !

ఎన్ని వర్షంబు లేలిన న్నేమి ఫలము

యిహ పరమ్ములు లేకను నహము తోడ

బ్రతుకు నందున యశమును బడయకునికి.



: ఆంధ్రమహాభాగవతావతరణము 


ఘనత గాంచిన బమ్మెరగ్రామ మందు

గురుతి కెక్కిన కౌండిన్యగోత్ర మందు

సహజకవి పోతనార్యుండు జనన మందె 

భక్తవర్యుల పుణ్యంపు భాగ్యమునను    01


ఘనుడు 'భీమనమంత్రి'  తనయుడౌ 'యన్నయ్య'

        సజ్జనవినుతుండు సాత్వికుండు 

'గౌరమ్మ' యర్థాంగి కడు పతివ్రత భువిన్ 

        'సోమన్న' వారల సుప్రజుండు

సోమన్న మల్లమ్మ సుతునిగా 'యెల్లన్న'

      ప్రభవించె నందరు ప్రస్తుతించ

మాన్యు 'డెల్లన'కును  'మాచమ్మ' యందున 

        'కేసన' బుట్టెను వాసి గాను

ప్రీతితో  'లక్కమాంబ'ను పెండ్లి యాడ

కేసనకు పుత్రు లిర్వురు పుట్టి రరయ

ప్రథమ పుత్రుండు 'తిప్పన' పండితుండు

పుట్టె 'పోతన' రెండవ  పుత్రునిగను  02        


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

పోతన పాత్ర చిత్రణ

 శు భో ద యం🙏


పోతన పాత్ర చిత్రణ 


                    ఉ:  కాటుక కంటినీరు  చనుగట్ల పయింబడ  నేలయేడ్చెదో?


                          కైటభ దైత్య మర్దనుని  గాదిలి కోడల!  యోమదంబ! యో


                         హాటకగర్భురాణి!  నిను  నాకటికైఁ గొనిపోయి   యల్ల   క


                         ర్ణాట  కిరాట  కీచకులకమ్మ ;త్రిశుధ్ధిగ  నమ్ము; భారతీ!


                                        --    చాటువు ;


                 ఉ:  కోపము తోడ నీవు  దధి భాండము  భిన్నము  సేయుచున్నచో


                        గోపిక  త్రాటఁగట్టిన  వికుంచిత  సాంజన భాష్ప  తోయ   ధా


                        రా పరిపూర్ణ  వక్త్రముఁ  గరంబులఁ బ్రాముచు  వెచ్చనూర్చుచుం


                      బాపఁడవై  నటించుట  గృపాపర ! నామదిఁ   జోద్యమయ్యెడిన్ ;


                                        భాగ-ప్రథ-స్కం: 181 పద్యం: కుంతి కృష్ణుని స్తుతించుట;


                                          ఆంధ్ర సాహిత్య క్షేత్రాన్నలంకరించిన  కవితల్లజులలో  పాత్ర చిత్రణ విషయమున  కవులందరు నొకయెత్తు. బమ్మెరపోతన యొకయెత్తు. అతడుచిత్రించిన పాత్రలన్నియు  శబ్దచిత్రములే! కానీ,అందుకొన్ని నిశ్చలనములు, మరికొన్ని చలనములు.

ఆపాత్రలు పోతనగారితో మాటగలిపిమాటాడినవే! మనకుగూడ నట్టి మనః పరిణామము గల్గినచో నవిమనతోగూడ మాటాడగలవు.

"పాత్రకు తగిన యాకారము. ఆకారమునకు దగిన ఆహార్యము. ఆహార్యమునకుదగినఅలంకారములు.వానికితగినమాటలు .మాటలకు దగిన చక్కనిపదములబంధములు, పోతన పాత్రచిత్రణలోని విశేషములు.


                                        పైరెండుపద్యములలో  మొదటిది పోతన సరస్వతి నోదార్చుట. ధనముపై నాశతో భాగవత గ్రంధమును  నరాంకిత మొనరించునేమోనని యనుమానమంది చదువులతల్లి  దీనవదనయై  కన్నులనీరుగార దేవతార్చనా పీఠమున నున్నపోతనకన్నుల

కగుపించినదట! పోతనయామెరూపమును గాంచి నివ్వెరపోయెను,."  అమ్మా! సరస్వతీమాతా! కాటుక తో దిగజారు కన్నీరు వక్షోజములపై బడగా  నేలనమ్మా  విలపింతువు? ఓహో!  ధనాశతో నిన్నముకొందుననియా నీవిచారము. అటులెన్నటికి జరుగదు. త్రికరణ శధ్ధిగా జెప్పునామాటను నమ్ము. మనుట"-. ఇది నిశ్చలన చిత్రమే! ,ఆజగదంబ కన్నులనీరుగార్చుట. కన్నులకున్న కాటుక కరగి కన్నీట గలసి చనుగట్లపై బడుట. ఆహా! ఏమాచిత్రణము! మనోముకురమున గాంచగల్గినవాని జీవితము ధన్యము!!


                                   ఇఁక  రెండవ చిత్రము  చలనము. బాలకృష్ణుని కొంటేపనులను  దలచుకొని  కుంతి కృష్ణుని ప్రస్తుతించుచు నాడిన మాటలు. ఆమాటలవెనుక నార్తియున్నది. అభిమానమున్నది. భక్తియున్నది. ఆప్యాయతను రంగరించి చిత్రించిన యీచిత్రము అపూర్వము.


                                    "కృష్ణా! యేమి చెప్పనయ్యా నాటి ముచ్చటలు. బాల్యమున నీవొకనాడొకగోపిక యింటికేగి. దధి భాండమును కోపముతో  పగులగొడితివి. ఆగోపికయు కోపమున  నిన్ను త్రాటితోగట్టివేయుచో, మొగమొక వంకకు వంచి,కన్నుల కజ్జలశిక్తమై కన్నీరుగార

దానినంతయు  నిరుచేతులతో  మొగమంతయు పులుముకొనుచు  వేడినిట్టూర్పులను  విడచుచు బాలునివలె నటించుట     నేడుదలచికొనిన  నాకు చోద్యమనిపించునయ్యా! కొంటె కృష్ణయ్యా! యెంత దొంగ నటన! "భక్తిపాశములచే గట్టుబడు నీవు సామాన్యమగు త్రాట బంధింపఁబడుట  నటన గాకమరేమి? "- యనిమేనత్తమాటలు.


                                  త్రాటగట్టబడుట , సాంజన భాష్పతోయ సిక్తమైన  మోమును  చేతులతో  పులిమికొనుట. అప్పటి కృష్ణయ్య ఆ యాకారము. ఇవియన్నియు పోతన పాత్రచిత్రణము లోని మెళకువలు.చివరకు "అంతవాడ వింతవాడ వైతివే!! యని యాశ్చర్యమును ప్రకటించుట. యతని రచన లోని చమత్కారము. 


                                                                  ఇదండీ పోతన గారి పాత్ర చిత్రణలోని  గొప్పతనం!


                                                                                                   స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷