10, సెప్టెంబర్ 2020, గురువారం

ముసలితనం

*వార్ధక్యం వయసా నాస్తి*
*మనసా నైవ తద్భవేత్‌*
*సంతతోద్యమ శీలస్య*
*నాస్తి వార్ధక్య పీడనమ్‌*

 ముసలితనం వయసులో లేదు. మనసులోనూ ఉండకూడదు. ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపు పీడ ఉండదని సుభాషితం._ *ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం,
దుఃఖం వల్ల వచ్చేది భావజం.*
వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే.
*కొంతమంది యాభయ్యవ పడిలోకి రాగానే వృద్ధులయ్యారంటారు.*
కొందరు అరవై సంవత్సరాలకు ముసలివారనిపించుకుంటారు.

 *70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు.* _కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది_.

*పని చేయడానికి బద్ధకించి పని సామర్థ్యాన్ని కోల్పోతే దాన్ని మించిన వార్ధక్యం మరొకటి లేదు.* అటువంటివారు సమాజ ప్రగతికే కాక సొంత ప్రగతికి కూడా శత్రువులే. అతి పిసినారితనం, స్వార్థం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం వంటి దురలవాట్లు శరీరంలో అనేక సామర్థ్యాలను బలహీన పరుస్తాయి. అకాల వార్ధక్యానికి దారి తీస్తాయి._ *ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. అటువంటి వృద్ధులు తమ కుటుంబాలకు సమాజానికి కూడా భారమే. మానసిక ఒత్తిడులు, కుంగుబాటు వల్ల వచ్చే ముసలితనం చెదపురుగు లాంటిది.* _మనిషి భవితను సమూలంగా తినేస్తుంది_.

*మానసిక వృద్ధాప్యం అంటే.. ‘నాకు ముసలితనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయకూడదు.* _‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం’ అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి.

*భారతీయ సంప్రదాయంలో జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారుగానీ వయో వార్ధక్యాన్ని కాదు.*
నిత్యవ్యాయామం,
యోగాభ్యాసం,
సద్గ్రంథ పఠనం,
సతతక్రియాశీలత,
మితాహారం,
హితాహారం,
ఇష్టదేవతా ఉపాసనం,
ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు._

గణపతి తాళం

వేదాల్లో చెప్పబడిన...గణపతి తాళం

ఈ స్తోత్రం పాడినా, విన్నా తక్షణ ఫలితమేమంటే  ఆ స్థలంలో ప్రతికూల ప్రకంపనల(negative vibrations)ను తొలగించి, శ్రేయస్సును, సంతోషాన్ని ఇస్తుందీ స్తోత్రం.

వికటోథ్కట సుందర తంధి ముఖం |
భుజ కేంద్రసుసర్ప గాధాభరణం ||

గజ నీల గజేంద్ర గణాధిపథిమ్ |
ప్రణతోస్మి వినాయక హాస్తి ముఖం ||

సుర సుర గణపతి సుంధర కేశం |
ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం ||

భవ భవ గణపతి పద్మ శరీరం |
జయ జయ గణపతి దివ్య నమస్తే ||

గజ ముఖ వక్త్రమ్ గిరిజా పుత్రం |
గణ గుణ మిత్రం గణపతి నిశప్రియం ||

కరద్రుత పరశుమ్ కంగణ పానిం కపలిత పద్మ రుచిం | సురపతి వంధ్యం సుందర డక్తం సుందరచిత మని మకుటం ||
ప్రాణమత దేహం ప్రకటిత కాలం షట్గిరి  తాళం ఇధం, తత్ షట్గిరి తాళం ఇధం తత్ షట్గిరి తాళం ఇధం |
లంభోధర వర కుంజా సురకృత కుంకుమ వర్ణ ధరం | శ్వేతస శృంకం మోధక హస్తం ప్రీతిన పనసఫలం ||
నయనత్రయ వర నాగ విభూషిత నా నా గణపతితం, తతం నయనత్రయ వర నాగ విభూషిత నా నా గణపతితం తతం నా నా గణపతితం, తతం నా నా గణపతితం, తతం నా నా గణపతితం ||

ధవలిథ జల ధర ధవలిథ చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయం, ధవలిథ జల ధర ధవలిథ చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయం ||

కట తట వికలిత మత జల జలజిత గణపతి వాధ్యమ్ ఇధం | కట తట వికలిత మత జల జలజిత గణపతి వాధ్యమ్ ఇధం తత్ తత్ గణపతి వాధ్యమ్ ఇధం, తత్ తత్ గణపతి వాధ్యమ్ ఇధం ||

థక తకిట థక తకిట థక తకిట తతోం, శశి కలిత శశి కలిత మౌళినం శులినమ్ |
థక తకిట థక తకిట థక తకిట తతోం, విమల శుభ  కమల జల పాధుకం పానీనం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట త తోం,  ప్రమధ గణ గుణ కచిత శోభనం శొభితం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట త తోం, మ్రిథుల భుజ సరసి జభి షానకం పోషణం |
థక తకిట థక తకిట థక తకిట తతోం, పనస ఫల కధలి ఫల మొధనం మోధకం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తతోం, ప్రమధ గురు శివ తనయ గణపతి తాళనం |
గణపతి తాళనం ! గణపతి తాళనం !!..

ఉపాసనలో అవరోధాలను

ఉపాసనలో అవరోధాలను అధిగమించటం ఎలా?

ఉపాసన (ఉప ఆసన) అంటే సమీపంలో కూర్చోవడం. దేని సమీపంలో కూర్చోవాలి? దేని సమీపంలో అఖండమైన ఆనందం కలుగుతుందో, ఏది జీవన లక్ష్యమో దాని సమీపంలో కూర్చోవాలి. విశ్వవ్యాపిత అనంత చైతన్యాన్ని అవిచ్ఛిన్నంగా భావన చేస్తూ ఆ చైతన్యంలో లయమయ్యే లక్ష్యంతో ధ్యానించడమే ఉపాసన. అనంతత్వాన్ని భావించలేని వారు పరిమితమైన మూర్తిని భావన చేస్తూ.. క్రమక్రమంగా ఉన్నతస్థాయికి చేరడం సాధనగా చెప్పబడుతుంది.

సాధన అంటే పూర్తిగా మనసును లక్ష్యంపై కేంద్రీకరించడం. పరిమితత్త్వంతో ఆరంభించినా, అనుభవాలను జ్ఞానంగా మలుచుకుంటూ, పరిమితులను చెరిపివేసుకుంటూ, స్థాయిని ఉన్నతీకరించుకుంటూ, ముందుకు సాగడమే ఉపాసన. ఈ సాధన చెప్పుకొన్నంత సులువు కాదు. సాధించలేనంత భయంకరమైనదీ కాదు.

వ్యాధిస్త్యాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతి ధర్మానా
లబ్ధ భూమికత్వ అనవస్థితత్వాని చిత్త విక్షేపాః యోగాంతరాయాః

అని.. సాధనలో పది అవరోధాలను పతంజలి యోగశాస్త్రం గుర్తించింది. ఆ పది అడ్డంకులూ ఏంటంటే.. వ్యాధి (శారీరక వ్యాధులు), స్త్యాన (నిర్లిప్తత, నిరాసక్తతలు ఆవహించడం), లక్ష్యాన్ని నిర్ణయించుకోలేని ‘సంశయం’, ప్రమాదం (మరచిపోవడం), ఆలస్యం (సాధనను వాయిదా వేయడం), అవిరతి (అమితమైన కోరికలను కలిగి ఉండడం), భ్రాంతి దర్శన (ఉపాస్య దైవంలో అనవసర వస్తువును దర్శించడం), అలబ్ధ భూమికత్వం  (ఎన్ని రోజులు సాధన చేసినా కనీస అభివృద్ధి లేదనుకోవడం), అనవస్థి తత్త్వం (ఒకసారి ఉపాసన, మరొకసారి యజ్ఞయాగాదులు, ఇంకోసారి వ్యవసాయ వాణిజ్యాదులలో మనసు నిలవడం), చిత్త విక్షేపం (ఆలోచనల వెంట మనసు పరిగెత్తడం). ఇవన్నీ యోగ సాధనలో, ఉపాసనలో అవరోధాలుగా చెప్పబడ్డాయి.


అవరోధాలను అధిగమించాలంటే వాటిని సమగ్రంగా అవగాహన చేసుకోవాలి. జీవిత లక్ష్యమెప్పుడూ ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండాలి. లక్ష్యం పట్ల, గురువు పట్ల. మార్గం పట్ల అచంచల విశ్వాసం.. ఓపిక, ఫలితం వచ్చేదాక విసుగులేని ఉత్సాహంతో కూడిన ప్రయత్నం.. అనుమానాలకు తావివ్వకుండా ప్రతిక్షణమూ అప్రమత్తంగా ఉండడం.. ఫలితాపేక్షలేని కర్మాచరణలు.. అవసరం. సాధనలో ఏర్పడే భ్రమలు సాధారణమే అనే జ్ఞానం వల్ల పురోగతి ఉంటుంది. ఉత్సాహంతో నిర్లిప్తతను అధిగమిస్తూ, విచక్షణాయుత సాహసంతో చేసే నిరంతర ప్రయత్నమే అవరోధాలను తొలగిస్తుంది.

ధ్యానంలో జరిగే పరిణామాలు సాధకునికి తెలియకపోవచ్చు. సంశయిస్తే సాధన మందగిస్తుంది. కాబట్టి, సమర్థుడైన గురువును ఆశ్రయించి ఆయన మార్గదర్శనంలో చేసే సాధన సత్ఫలితాన్నిస్తుంది. లక్ష్యసాధనలో ఏర్పడే అవరోధాలను గుర్తించి అధిగమిస్తే.. భౌతిక జీవితంలోనైనా ఆధ్యాత్మిక జీవితంలోనైనా విజయం సిద్ధిస్తుంది.

అధిక మాసం

🌅🌅🌅🌅🌅
🙏ఓం శ్రీ శివాయ నమస్తుభ్యం🙏

అధిక మాసం అనేది ఎందుకు, దాని వెనుకనున్న లెక్కలేంటి?

మౌలిక పదజాలం:
ముందుగా కొన్ని పదాలయొక్క అర్థాలను తెలుసుకోవాలి. ఒకటి-రెండు వాక్యాలలో విశదీకరించాలని – తేట తెల్లమైన పద్ధతిలో రాయడం జరిగింది. ఆసక్తి ఉంటే, ఒక్కో పదం వెనుకనున్న లోతైన అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేయగలరు. ఈ వ్యాసానికి మటుకు ఈ తేలికపాటి వివరణలు సరిపోతాయి.

సూర్య సిద్ధాంతం: ఇది మన సంస్కృతికి చెందిన ప్రామాణిక ఖగోళ-గణిత సంగ్రహం. నేటికీ ఈ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొనే – ఎందరో పండితులు – పంచాగాలను తయారు చేస్తుంటారు.
భూకేంద్ర గణన పద్ధతి: భూమిని స్థిరమైన కేంద్ర బిందువుగా భావించి వేసే లెక్కలు. నిజానికి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నా, లెక్కలు వేయడానికి భూమి చుట్టూ ఇతర గ్రహాలతో సహా సూర్యుడూ తిరుగుతున్నాడని పరిగణించడం (Geocentric model). సూర్యుడిని కేంద్ర బిందువుగా భావించి వేసే లెక్కలను Heliocentric approach అంటారు (సూర్యకేంద్ర గణన పద్ధతి).
సౌరమానం: భూకేంద్ర విధానంలో సూర్య గమనాన్ని కీలకంగా – కాలాన్ని లెక్కగట్టడాన్ని సౌరమాన పద్ధతి అని భావించవచ్చు.
చాంద్రమానం: చంద్ర గమనాన్ని కీలకంగా భావించి లెక్కలు గట్టడం.
పంజిక: మనకు తెలిసిన Calendarను పంజిక అనడం సబబు. Calendar, Ephemeris, పంచాంగం – ఈ మూడు పదాలను చాలా సంధర్భాలలో పర్యాయపదాలుగా వాడుతుంటారు. కానీ మూడిటికి తేడాలున్నాయి.
Ephemeris: గ్రహస్థాన పట్టిక. ఇది కేవలం గ్రహ స్థానాలను తెలిపే సాంకేతిక పట్టిక మాత్రమే.
పంచాంగం: Ephemeris ను అధారం చేసుకొని తిథి, వార, నక్షత్ర, కరణ, యోగాలను సూచించే సమగ్రమైన సాధనం (గ్రంథం).
నాక్షత్రికం: అంతరిక్షంలో ఉన్న తారలను చుక్కానిగా వాడుకొని వేసే లెక్కలు. (Sidereal)
కక్షీయ అవధి: భూమి సూర్యుని చుట్టూ, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నిజానికి చంద్రుడు భూమి చుట్టూ ఒక ప్రదక్షిణం చేయాలంటే 27+ రోజులు మాత్రమే తీసుకున్నా, సూర్యుని చుట్టూ భూమి తిరిగే కక్ష్యతో లెక్క కడితే 29+ రోజులు పడుతుంది. ఈ అంకెల్లో 27+ అనేవి నాక్షత్రిక (Sidereal) దినములయితే 29+ అనేది కక్షీయ అవధి. (Synodic period)
అధిక మాసం ఎందుకు?
భూమికి – సూర్యుడి చుట్టూ తిరగడానికి 365+ రోజుల సమయం పడుతుంది. సూర్య సిద్ధాంతపరంగా సరిగ్గా చెప్పాలంటే 365.258756 (365 రోజుల 6 గంటల 12 నిమిషాల 36+ సెకండ్లు). ఇది నాక్షత్రిక గణనము (Sidereal duration). నేటి ఆధునిక శాస్త్రీయ లెక్కలను బట్టి 365.256362 (365 రోజుల 6 గంటల 9 నిమిషాల 8+ సెకండ్లు) సమయం పడుతుంది. ఇది కూడా నాక్షత్రికమే.

సూర్య సిద్ధాంత పరంగా మరియూ నేటి ఆధునిక శాస్త్రపరంగాగానీ, రమారమిగా 29.53 రోజుల్లో చంద్రుడు భూమి చుట్టూ తిరగుతాడు (Synodic month). ఈ మాసాన్ని రెండు పక్షాలుగా; ఒక్కో పక్షం 15 తిథుల కిందా విభాగింపబడింది. ఒక్కో తిథి కనిష్టంగా 21+ గంటలనుండి గరిష్టంగా 26+ గంటల వ్యవధి కలిగి ఉండవచ్చు. ఈ లెక్కన 354+ రోజుల్లో పన్నెండు మాసాలు పూర్తి అవుతాయి.

చాంద్రమాన పద్ధతిలో అమావాస్య నుండి అమావాస్య మధ్యనున్న రోజులను గానీ పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు గల సమయాన్నిగానీ చాంద్రమాన మాసంగా పరిగణిస్తారు. చాంద్రమాన లెక్కలమీద ఆధారపడే దక్షిణ దేశస్తులు, అమావాస్యను ప్రతి మాసపు అవధిగా పరిగణిస్తే, ఉత్తర భారత దేశంలో పౌర్ణమిని లెక్కలో తీసుకుంటారు. అమావాస్యను పరిగణించే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, కర్ణాటక, మ.హారాష్ట్రలయితే పౌర్ణమిని వాడుకొనే రాష్ట్రాలొచ్చి బీహార్, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాంచల్, ఉత్తర్‌ప్రదేశ్‌ ఇత్యాది రాష్ట్రాలు. ఈ రెండు పద్ధతులలో శుక్ల పక్షాలు సరితూగుతాయిగానీ కృష్ణ పక్షాల మాసాలు మారతాయి. ఉదాహరణకు భాద్రపద శుద్ధ చవితి రెండు లెక్కలలో వినాయక చవితే కానీ శ్రీకృష్ణాష్టమి దక్షిన దేశంలో శ్రావణ బహుళ అష్టమికాగా ఉత్తరాదిలో భాద్రపద బహుళ అష్టమి అవుతుంది. ఇది పూర్తిగా అర్థం కాకపోయినా ఫరవాలేదుగానీ చాంద్రమాసం అంటే ఏమిటో తెలిస్తే సరిపోతుంది.

మన తెలుగువారు చాంద్రమాన అమావాస్యాంత (అమాంత) పద్ధతిని పాటిస్తారు. కానీ, గమనించి చూసినట్లయితే మనకూ కొన్ని సౌరమాన పండుగలుంటాయి. ఉదాహరణకు మకర సంక్రాంతి, ధనుర్మాసం ఇత్యాదులు. ప్రతి నెలలో వచ్చే మాస సంక్రాంతి, సంక్రాంతి పండుగగా జరుపుకునే మకర సంక్రాంతులు – సూర్య గమనంపై ఆధారపడి ఉంటాయి. అందుకే సాధారణంగా సంక్రాంతి పండుగ జనవరి 14, 15 తేదీలలో మాత్రమే వస్తూ ఉంటుంది. కాబట్టి 354+ రోజుల్లో పూర్తయ్యే చాంద్రమాన సంవత్సరానికి 365+ రోజులతో ఉన్న సౌరమాన సంవత్సరానికి సమన్వయాన్ని కొనసాగించాలి. లేకపోతే మాస ఋతువుల పొంతన దెబ్బ తింటుంది. రెండు సంవత్సర లెక్కలలో ఉన్న 11+ రోజుల తేడాను సరిదిద్దేదే ఈ అధిక మాసం అనే అమరిక.

అధిక మాసాన్ని ఎలా నిర్ణయిస్తారు?
ఏ చాంద్రమాన మాసంలో రవి వేరొక రాశియందు ప్రవేశించడం జరుగదో – దానిని అధిక మాసము అని భావిస్తారు. మారలేదన్నమాట. తేలికగా చెప్పాలంటే సౌర మాసం ఆదీ అంతముల మధ్యన సంభవించే చాంద్ర మాసం – అధిక మాసం.

అధిక మాసము

లెక్కలనుబట్టి ఏ రెండు అధికమాసంతో కూడిన సంవత్సరాల మధ్యనైనా ఉండే వ్యవధి 856, 886, 1034~ లేదా 1064 రోజులుగా తెలుస్తోంది. 2000 నుండి 2099 వరకు ఈ గ్రెగోరియన్ శతాబ్ధంలో సంభవించిన అధిక మాసాలను లెక్కగడితే ఈ నాలుగూ తెలిసాయి. ప్రతి రెండూ లేక మూడేళ్ళకొక అధిక మాసం సంభవిస్తుంటుంది.

అధిక మాసం ఎవరికి వర్తిస్తుంది?
పైన కొన్ని రాష్ట్రాలు పేర్లను తెలిపాను. అమావాస్యనుగానీ, పౌర్ణమినిగానీ అవధిగా – చాంద్రమాన పంచాగాలను ఉపయోగించే రాష్ట్రాలు అవి. కానీ కేరళ, తమిళ్‌నాడు, బెంగాల్ వంటి రాష్ట్రాలు సౌరమాన పంచాంగాలను వాడతారు. వారి మాసాలు సూర్యడి గమనంపై ఆధారపడి ఉంటాయి. మన చాంద్రాయణ మాసనామాలు – నక్షత్రాలను ఆధారం చేసుకొనుంటే (చైత్రమాసం = చిత్తా నక్షత్రం, వైశాఖ మాసం = విశాఖా నక్షత్రం…) వారి సౌరమాసనామాలు రాశులకనుగూణంగా పిలువబడతాయి (మేష మాసం, వృషభ మాసం…). అంచేత ఈ అధికమాసాలు వారికి వర్తించవు.

🏵క్షయ మాసము🏵
సౌరమాస పరిధిలో చాంద్రమాసం ఇమిడినపుడు అది అధికమాసం అని అర్థమవుతున్నది. కానీ దీనికి విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది. అంటే ఒక చాంద్రమాస పరిధిలో సౌరమాసం సంభవించడం. మరొక విధంగా చెప్పాలంటే అమావాస్య నుండి అమావాస్య వరకుగల సమయంలోపల, సూర్యుడు రెండు రాశులు దాటుతాడు. ఇది చాలా అరుదు. 141 ఏళ్ళకొకసారి సంభవిస్తుంటుంది. వెనువెంటనే 19 ఏళ్ళకు మరలా ఇటువంటిది జరిగి తిరిగి 141 ఏళ్ళ తరువాత మళ్ళీ జరుగుతుంది. దీనిని క్షయ మాసం అని పిలుస్తారు.

1823 సంవత్సరం తరువాత 141 ఏళ్ళు గడిచిన పిదప 1964 సంవత్సరంలో క్షయ మాసాలు సంభవించాయి. 1964 తరువాత మళ్ళీ కేవలం 19 ఏళ్ళ దాటగానే 1983 సంవత్సరంలో మరో క్షయ మాసం సంభవించింది. ఇక మనెవ్వరి జీవిత కాలాలలో మనము క్షయ మాసాన్ని చూడబోము. ఎందుకంటే తరువాయి క్షయ మాసం సంభవించబోయేది 141 ఏళ్ళ తరువాత 2124 సంవత్సరంలోనే.

ఈ శతాబ్ధపు అధిక మాసాలు
‌(ఈ గ్రెగోరియన్ శతాబ్ధంలోని అధిక మాసాలు).

సంవత్సరము మాసము
2001 వృష – ఆశ్వీయుజ మాసము
2004 తారణ – శ్రావణ మాసము
2007 సర్వజిత్తు – జ్యేష్ట మాసము
2010 వికృతి – వైశాఖ మాసము
2012 నందన – భాద్రపద మాసము
2015 మన్మథ – ఆషాడ మాసము
2018 విలంబి – జ్యేష్ట మాసము
2020 శార్వరి – ఆశ్వీయుజ మాసము
2023 శోభకృతు – శ్రావణ మాసము
2026 పరాభవ – జ్యేష్ట మాసము
2029 సాధారణ – చైత్ర మాసము
2031 విరోధికృతు – భాద్రపద మాసము
2034 ఆనంద – ఆషాడ మాసము
2037 పింగళ – జ్యేష్ట మాసము
2039 సిధ్ధార్థి – ఆశ్వీయుజ మాసము
2042 దుందుభి – శ్రావణ మాసము
2045 క్రోధన – జ్యేష్ట మాసము
2048 శుక్ల – చైత్ర మాసము
2050 ప్రమోదూత – భాద్రపద మాసము
2053 శ్రీముఖ – ఆషాడ మాసము
2056 ధాత – వైశాఖ మాసము
2058 బహుధాన్య – ఆశ్వీయుజ మాసము
2061 వృష – శ్రావణ మాసము
2064 తారణ – జ్యేష్ట మాసము
2067 సర్వధారి – చైత్ర మాసము
2069 విరోధి – శ్రావణ మాసము
2072 నందన – ఆషాడ మాసము
2075 మన్మథ – వైశాఖ మాసము
2077 హేవిలంబి – ఆశ్వీయుజ మాసము
2080 శార్వరి – శ్రావణ మాసము
2083 శోభకృతు – జ్యేష్ట మాసము
2086 ప్లవంగ – చైత్ర మాసము
2088 కీలక – శ్రావణ మాసము
2091 విరోధికృతు – ఆషాడ మాసము
2094 ఆనంద – వైశాఖ మాసము
2096 నల – భాద్రపద మాసము
2099 సిధ్ధార్థి – శ్రావణ మాసము

ఈసం. శ్రీ శార్వరి(2020-2021)
2020 సెప్టెంబర్ 18నుండి అక్టోబర్ 16వరకు అధిక ఆశ్వయుజ మాసము . ఈ తెలుగుమాసము నందు రవి సంక్రమణం (ఒక రాశి నుండి మరియొక రాశి కి మారటం) జరగదు.
   చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, మాఘ, ఫాల్గుణ మరియు ఆశ్వయుజ మాసము లకు మాత్రమే అధిక మాసము వచ్చును పై వాటిలో మొదటి 8మాసములకు మల మాసము లనియు ఆశ్వయుజ మాసము నకు పురుషోత్తమ మాసము అందురు కార్తీక, పుష్య, మార్గశిర మాసము లకు
ఎన్నడూ అధిక మాసము రాదు
       ఈ పురుషోత్తమ మాసము (అధిక ఆశ్వయుజ మాసము) గురించి "బృహన్నారదీయ పురాణము" నందు విశేషముగా చర్చించబడింది. అధిక ఆశ్వయుజ మాసము 83సంవత్సరములకు ఒకసారి, ఆ శతాబ్దంలో 5మార్లు వస్తుంది. లోగడ 1880సం:లో వచ్చింది తరువాత 1963,1982,2001లోవచ్చి, ఈ సంవత్సరం (2020) వచ్చింది ఇప్పటికీ 4సార్లు అయింది. ఈ శతాబ్దిలో (1963-2063) చివరిసారిగా 2039లో వస్తుంది మరలా 83సంవత్సరాలకు 2146లో వచ్చి2246లోగా 5సార్లు రాగలదు(2146, 2165,2184,2203,2022)
     ఈ పురుషోత్తమ మాసము ను ఉత్తర భారత దేశంలో చాలా శ్రధ్ధగా భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు వ్రతములు, ఉపవాసములు, పూజలు మొదలగు శుభకర్మలని విశేషముగా ఆచరిస్తారు ముఖ్యంగా శక్తిపీఠమైన ఉజ్జయినీ లో చాలా విశేషముగా జరుగుతాయి .

ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః |
లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం
తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా |
🙏🙏🙏
🌄🌄🌄🌄🌄

పాండవోద్యోగం-6


ఉత్పలమాల
నంద కుమార! యుద్ధమున నా రథమందు వసింపుమయ్య! మ/
ధ్యందినభానుమండల విధంబున నీదగుకల్మిఁజేసి నా/
స్యందన మొప్పుగాక! రిపు సంతతి తేజము దప్పు గాక నీ/
వెందును నా యుధ్ధమ్ము దరి
కేగమి కొప్పుదుఁగాక కేశవా!

*ప్రతిపదార్థం*
నందకుమారా= ఓ!శ్రీకృష్దా
యుద్ధమున = యుద్ధం జరిగే సమయంలో,

నా రథమందు= నాయొక్కరథములో,

వసింపుమయ్య! = ఆసీనుడవుకమ్ము.

మధ్యందిన=
మధ్యాహ్నసమయంలో
భానుమండల విధంబున= సూర్య మండలము వలె

 నీదగుకల్మిఁజేసి= నీ యొక్కచేరిక, సహాయము,వల్ల

నా స్యందనము= నా యొక్క రథము

ఒప్పు గాక= తేజోవంతమగుగాక!

రిపుసంతతి= శత్రు సమూహము యొక్క

తేజము= తేజస్సు

 తప్పుగాక= తగ్గిపోవుగాక! శక్తివిహీనులవుతారు.

  నీ వెందును
(నీవు +ఎందును) =
నీవు ఎప్పుడూ ఎక్కడా కూడా,

ఆయుధమ్ముదరికి= ఆయుధము చెంతకు,వద్దకు

ఏగమికి= వెళ్ళకుండా ఉండటానికి

ఒప్పదుగాక= అంగీకరిస్తున్నాను.

కేశవా= ఓ శ్రీకృష్ణా !

*తాత్పర్యం*
శ్రీకృష్ణ !
నీ సైన్య విభజనప్రకారమే, నేను నిన్ను కోరుకుంటున్నాను. యుద్ధసమయంలో నీవు నా రథములో ఆసీనుడవై ఉండు చాలు.
 మధ్యాహ్న కాల సూర్యమండలం వలె మీ సాయం చేత, నువ్వు నాతో కలిసి ఉండటంవల్ల,
నారథంధగధగ లాడుతూ
ప్రకాశిస్తుంది. శత్రువుల తేజస్సు
నీతేజస్సు ముందు వెలవెలబోతుంది. ప్రకాశం తగ్గిపోతుంది. *యుద్ధంలో నేను ఆయుధమును ధరించను* అన్న నీ మాటకు నేను ఒప్పుకుంటున్నాను. నీవు ఎప్పుడూ, ఎక్కడా ఆయుధము ధరించవలసిన అవసరంలేదు కృష్ణా.
.......... విశేషాంశాం....
శ్రీకృష్ణుడు రథం లో కూర్చుంటే చాలు..,,
మధ్యాహ్నపు
సమయంలో సూర్యుడునడినెత్తికి వచ్చినప్పుడు
ఆసూర్యుని మనం చూడలేము. ఆవిధంగానే
శ్రీకృష్ణుడు వచ్చితన రధంలో కూర్చుంటే, ఆ రథాన్ని శత్రువులు కనీసం తేరిపారా చూడనుకూడా
చూడలేరు.
 అంతా తేజస్సుతో ప్రకాశిస్తుంది
నా రథం.
దీనినే మధ్యందిన భానుమండల అని పోలికతెచ్చారు తిరుపతి వేంకట కవులు. . 💐🙏🏻💐

పెద్దవయసు - గౌరవం

💫💦💫💦

🌼

పెద్దతనం వచ్చింది అనగానే కొన్ని విషయాలు మనం వదిలి వేయాలి.
పట్టుకోవటం కష్టం కానీ వదిలివేయటంలో బాధ ఏమిటి చెప్పండి?
అలా అనుమానంగా చూడకండి... ఏమి వదిలివేయాలో చూద్దామా ..
"అమ్మాయి!! గ్యాసు కట్టేసావా!! గీజర్ ఆఫ్ చేశావా?? ఏ.సి. ఆన్ లో ఉన్నట్లుంది.. పాలు ఫ్రిజ్ లో పెట్టావా ? కరెంట్ బిల్లు కట్టారా !" లాంటి ఎంక్వయిరీలు వదిలి వేయండి !
"మా కొడుకు కోడలు పట్టించుకోరు" అని హైరానా పడకండి..

ఇలా పట్టించుకుంటూ.. 60..70 ఏళ్ళు గడిపారు, ఇంకా ఎంతకాలం ? వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం .. కష్టనష్టాలు కూడా వాళ్ళవే !! చూడండి అప్పుడు ఎంత ప్రశాంతంగా మీరు ఉండగలరో.. "నా అభిప్రాయం ఏమిటంటే" అని అనటం తగ్గించి..
"నీ ఇష్టం, నువ్వు చెప్పు" అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనివ్వండి!!

'నాకూ తెలుసు' తో పాటు 'నాకు మాత్రమే తెలుసు' అనే అహం తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ 'నాకంటే ఎక్కువ తెలుసు' కదా అనే నిజాన్ని గ్రహించి ఒప్పేసుకోండి.. మీ మంచికేనండీ నేను చెబుతున్నది ...

"మా కాలంలో",
"మా చిన్నప్పుడు" అంటూ వీలు చిక్కినప్పుడల్లా వారిని ఊదరకొట్టకండి. వారి ముఖాల్లో కనిపించే విసుగుని చూడనట్లు నటించకండి. మన పిల్లల కోసం వచ్చేవారితో మితంగా మాట్లాడండి. వాళ్ళు మనకోసం రాలేదు అని గుర్తుంచుకోండి. కాసేపు మాట్లాడాక లేచి గదిలోకి వెళ్ళిపోగలిగే మనోనిగ్రహం అలవాటు చేసుకోండి ..

పెద్దవారిని పలకరించే మర్యాదతో ఒక ప్రశ్న ఎవరైనా సహజంగా అడుగుతారు... "ఆరోగ్యం బాగుంది కదా" అని. దయచేసి వెంటనే స్పందించకండి...
మన బి.పి..... షుగర్.. కీళ్ళనొప్పులు .. నిద్ర పట్టకపోవటం,.. నీరసం వారికి అంత ముఖ్యమైన విషయం కాదని గుర్తుంచుకోవాలండీ బాబూ !!! మనకి తోచక కాలక్షేపానికి ఎంత ఆలోచించినా ఎదుటివాళ్ళకి దాంట్లో అంతే ఆసక్తి ఎందుకు ఉంటుందో..ఉండాలో చెప్పండి.. "బాబోయ్ !! ఎందుకు అడిగామా" అనే పశ్చాత్తాపం వారికి కలిగించకండి..

ఇంకొక విషయం...
ఎవరో పెద్దాయన అన్నాడు...
"మన అనుభవం తో వారిని తీర్చి దిద్దాలి కదా!" అని.
 కాలం మారింది... మారుతున్నది..
"రోట్లో కందిపచ్చడి రుబ్బటం.. తిరగలితో విసరటం.. కట్టెల పొయ్యి మీద వంట చేయటం, కవ్వంతో మజ్జిగ చిలకటంలో గల నా అనుభవం నేటి తరానికి ఎలా ఉపయోగపడుతుంది ?"

ఉద్యోగాలైనా అంతే ! పద్ధతులు మారుతున్నాయి.. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది.... విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సు లో సీటు ఎలా పట్టుకోవాలో చెప్పి ఏం ప్రయోజనం ??
*చివరగా పెద్దతనంలో మన పరువు కాపాడుకోవటం పూర్తిగా ... పూర్తిగా మన చేతుల్లోనే ఉందండీ !! అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా... మితభాషిగా వుంటూ... మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా... ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ... జిహ్వ చాపల్యం తగ్గించుకుని... అన్నింటికంటే ముఖ్యమైన విషయం "నన్ను ఎవరూ గౌరవించటం లేదు" అనే ఆత్మన్యూనతా భావం దరి చేరకుండా జాగ్రత్తపడాలి..*
భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము.. కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం.. పాజిటివ్ గా చూడండి... ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు... మొత్తం సంసారాన్ని లాగే బాధ్యత లేదు... పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది..

హాయిగా పూజలు చేసుకోవచ్చు..మనవళ్ళు,మనవరాళ్ళతో సంతోషంగా గడపొచ్చు.. భగవద్గీత, భాగవతం,ఖురాన్ , బైబిల్ లాంటివి చదువుకోచ్చు.. దైవదర్శనం చేసుకోవచ్చు.. సంగీతం వినడం ,చేతనైతే మీలోని భావాలకు అక్షరరూపం కల్పించడం..మెదడుకు మేత లాంటి పజిల్స్ పూరించడం..క్యారమ్ , టిటి లాంటి ఇండోర్ గేమ్స్ ఆడటం, వాకింగ్ లాంటి చిన్న చిన్న హాబీలు మనసు కి ఎంతో ఆహ్లాదాన్ని..ఉల్లాసాన్నిస్తాయి.. వాటికి సమయం కేటాయిస్తే శారీరకంగా కూడా ఉపయోగకరమేనని గ్రహించండి.

*ఒక మాటని రోజూ అనుకుందాం.. "I love myself... I respect my self " ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది..*

చివరగా............ మనం దిగవలసిన స్టేషన్ దగ్గరలోనే వుంది ... Platform అదిగో ..... సమయం దగ్గర పడింది. 
ఇక మనకి బోగీలో ఉన్నవారితో తగవులు... మనస్పర్థలు ఎత్తిపొడుపు మాటలు అవసరం అంటారా...
*మనం దిగుతుంటే వారి ముఖాల్లో 'హమ్మయ్య' అనే భావం కనిపించాలో లేక 'అయ్యో అప్పుడే స్టేషన్ వచ్చేసిందా' అనే భావం కనిపించేలా విచక్షణతో ప్రవర్తించే నిర్ణయం మన చేతిలోనే ఉంది ...*

పెద్దతనం మనకి వరంలాంటిది ... అది ముఖ్యంగా మన 'అహం' తగ్గించి, మనకి జీవితం అంటే ఏమిటో, మన నిజమైన విలువ ఏమిటో ‌సరియైన అవగాహన కల్పిస్తుంది ... కాబట్టి అందరూ వృద్ధాప్యాన్ని ఆనందంగా స్వాగతించాలి సుమండీ !!!
*నస అనిపించుకునే కంటే nice అనిపించుకోవడం మంచిది కదా!*
పెద్దవాళ్ళనుకునే చాదస్త మనస్తత్వం ఉంటే కాస్త పెద్ద మనసుతో ఆలోచించండి. ఇంటి వాతావరణాన్ని స్వర్గంలా ఆనందమయం చేయండి. చేస్తారుగా..చేయని వాళ్ళు ఇప్పటినుంచయినా ప్రారంభించండి. సహకరించి అభిమానం చూపే పెద్దవారిని ఇష్టపడని పిల్లలుండరు. వారిదీ మన రక్తమేగా. పెద్దలను గౌరవించే పిల్లలు భావితరాలకు మార్గదర్శకాలవుతారు. విష్ యూ గుడ్ లక్ .                               
- శింగనమల్ల కరుణాకర్
🙏💐💐💐🙏

*భాగవతామృతం*


నారదాగమనంబు

1-86-సీ.సీస పద్యము

తన చేతి వల్లకీతంత్రీ స్వనంబున;
సతత నారాయణశబ్ద మొప్ప
నానన సంభూత హరిగీతరవ సుధా;
ధారల యోగీంద్రతతులు సొక్కఁ
గపిల జటాభార కాంతిపుంజంబుల;
దిశలు ప్రభాత దీధితి వహింపఁ
దనులగ్న తులసికా దామగంధంబులు;
గగనాంతరాళంబు గప్పికొనఁగ
1-86.1-ఆ.
వచ్చె మింటనుండి వాసవీనందను
కడకు మాటలాడఁ గడఁకతోడ
భద్రవిమలకీర్తిపారగుఁ డారూఢ
నయవిశారదుండు నారదుండు.
తన = తన; చేతి = చేతిలో ఉండే; వల్లకీ = వీణ; తంత్రీ = తీగల; స్వనంబునన్ = శబ్దమువలన; సతత = ఎడతెగని; నారాయణ = నారాయణ యనే; శబ్దము = శబ్దము; ఒప్పన్ = అలంకరింపగా; ఆనన = నోటి నుంచి; సంభూత = వెలువడే; హరి = విష్ణువు యొక్క; గీత = పాటల; రవ = ధ్వని (యనే); సుధా = అమృత; ధారలన్ = ధారల వలన; యోగ = యోగులలో; ఇంద్ర = శ్రేష్ఠమైనవారి; తతులు = సమూహము; సొక్కన్ = పరవశించగ; కపిల = కపిల (రాగి) రంగుతో; జటా = జడల; భార = చుట్టల యొక్క; కాంతి = కాంతి; పుంజంబులన్ = సమూహములతో; దిశలు = దిక్కులు; ప్రభాత = ఉదయపు; దీధితి = వెలుగు; వహింపన్ = నింపుకొనగ; తను = శరీరమున; లగ్న = ధరింపబడిన; తులసికా = తులసి; దామ = దండ యొక్క; గంధంబులు = సువాసనలు; గగన = ఆకాశము; అంతరాళంబున్ = లోపలంతా; కప్పుకొనఁగ = వ్యాపించగ;
వచ్చెన్ = వచ్చెను; మింట = ఆకాశము; నుండి = నుండి; వాసవీనందను = వాసవి యొక్క {వాసవీనందనుడు - వాసవి యొక్క పుత్రుడు, వ్యాసుడు}; కడ = దగ్గర; కున్ = కు; మాటలాడన్ = మాట్లాడాలనే; గడఁక = ఉద్ధేశ్యము; తోడన్ = తో; భద్ర = క్షేమము; విమల = నిర్మలము యైన; కీర్తి = కీర్తి; పారగుఁడు = పొందినవాడు; ఆరూఢ = ప్రసిద్ధమైన; నయ = మేలైన; విశారదుండు = విద్వాంసుడు; నారదుండు = నారదుడు; కనియెన్ = చూసాడు; నారదుఁడు = నారదుడు.
ఆ సమయంలో తన చేతిలో ఉన్న మహతి అనే వీణ తీగలో నుంచి నారాయణనామం నిరంతరంగా ప్రతిధ్వనిస్తూ ఉండగా, నోటివెంట వెలుపడే హరినామ సంకీర్తనం అనే అమృతప్రవాహంలో మహాయోగులందరూ పరవశించిపోతు ఉండగా, బంగారు రంగు జటాజూట కాంతి సమూహాలకు దిక్కులన్నీ ప్రభాత కాంతులతో మెరుస్తుండగా, ఒంటినిండా ధరించిన తులసిమాలల సుగంధాలు ఆకాశం నిండా వ్యాపిస్తుండగా ముల్లోకాలలో అఖండమైన పేరు ప్రతిష్ఠలు గలవాడు, సకల శాస్ర్తపురాణ విశారదుడు ఐన నారదుడు వ్యాసుని దగ్గరకు ఆకాశ మార్గాన వచ్చాడు.
1-87-క.కంద పద్యము

కనియెన్ నారదుఁ డంతన్
వినయైక విలాసు నిగమ విభజన విద్యా
జనితోల్లాసున్ భవదుః
ఖనిరాసున్ గురుమనోవికాసున్ వ్యాసున్.
కనియెన్ = చూసాడు; నారదుఁడు = నారదుడు; అంతన్ = అంతట; వినయ = వినయముతో; ఏక = కూడిన; విలాసు = నడవడిక కలిగినవాడిని; నిగమ = వేదములను; విభజన = విభజించు; విద్యా = విద్యవలన; జనిత = పుట్టిన; ఉల్లాసున్ = ఉల్లాసము గలవాడిని; భవ = సంసారపు; దుఃఖ = దఃఖములను; నిరాసున్ = తిరస్కరించినవాడిని; గురు = అధికముగ; మనస్ = మనస్సు; వికాసున్ = వికసించినవాడిని; వ్యాసున్ = వ్యాసుని.
అలా వచ్చిన నారదమహర్షి వినయశీలుడూ, వేదాలను విభజించిన ఉల్లాసం కలవాడు, సంసార దుఃఖం లేనివాడూ, మనోవిజ్ఞానం పూర్తిగా కలిగినవాడూ అయిన వ్యాసమునీంద్రుణ్ణి చూసాడు.
1-88-వ.వచనము
ఇట్లు నిజాశ్రమంబునకు వచ్చిన నారదు నెఱింగి లేచి వ్యాసుండు విధివత్‌ క్రమంబునం బూజించిన నతండు లేనగవు నెగడెడి మొగంబుతోడ విపంచికా తంత్రి వ్రేల మీటుచు నిట్లనియె.
ఇట్లు = ఈవిధముగా; నిజ = తన; ఆశ్రమంబు = ఆశ్రమము; కున్ = కు; వచ్చిన = వచ్చినట్టి; నారదున్ = నారదుని; ఎఱింగి = గమనించి; లేచి = లేచి; వ్యాసుండు = వ్యాసుడు; విధివత్‌ క్రమంబునన్ = యధావిధిగా; పూజించినన్ = పూజించగా; అతండు = అతడు; లేనగవున్ = లేతనవ్వు; ఎగడెడి = మొలచు; మొగంబు = ముఖము; తోడన్ = తో; విపంచిక = వీణ; తంత్రి = తీగలు; వ్రేల = వేలుతో; మీటుచున్ = మీటుచు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.
ఈ విధంగా తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుడిని చూసి, లేచి వ్యాసుమహర్షి యథావిధిగా పూజించాడు. అప్పుడు నారదుడు మధుర మందహాస సుందర వదనారవిందంతో మహతీవిపంచిని మెల్లగా మీటుతూ ఇలా ప్రశ్నించాడు.
1-89-ఉ.ఉత్పలమాల

"ధాతవు, భారతశ్రుతివిధాతవు, వేదపదార్థజాతవి
జ్ఞాతవు, కామముఖ్యరిపుషట్కవిజేతవు, బ్రహ్మతత్త్వని
ర్ణేతవు, యోగినేతవు, వినీతుఁడ వీవు చలించి చెల్లరే!
కాతరుకైవడిన్ వగవఁ గారణ మేమి? పరాశరాత్మజా!"
ధాతవు = బ్రహ్మ దేవుడివి; భారత = భారతమనే; శ్రుతి = వేదము; విధాతవు = సృష్టించిన వాడివి; వేద = వేదము లందలి; పదార్థ = విషయముల నుండి; జాత = పుట్టిన; విజ్ఞాతవు = విజ్ఞానము కలవాడివి; కామ = కామము {అరిషడ్వర్గములు - 1కామము 2క్రోధము 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు; ముఖ్య = మొదలగు; రిపు = శత్రు; షట్క = షట్కమును (6); విజేతవు = జయించినవాడివి; బ్రహ్మ = బ్రహ్మజ్ఞానము యొక్క; తత్త్వ = స్వభావమును; నిర్ణేతవు = నిర్ణయించిన వాడవు; యోగి = యోగులలో; నేతవు = నాయకుడవు; వినీతుఁడవు = జితేంద్రియుడవు; ఈవు = నీవు; చలించి = చలించి పోయి; చెల్లరే = తగునా; కాతరు = దీనుని; కైవడిన్ = వలె; వగవన్ = దుఃఖ పడుటకు; కారణము = కారణము; ఏమి = ఏమిటి; పరాశరాత్మజా = వ్యాసా {పరాశరాత్మజుడు - పరాశరుని పుత్రుడు, వ్యాసుడు}.
“పరాశరుని పుత్రుడా! వ్యాసమునీంద్రా! నీవు బ్రహ్మదేవుడివి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాల్ని జయింనిన వాడివి. పరబ్రహ్మ తత్త్వాన్ని నిర్ణయించిన వాడివి, యోగులలో అగ్రేసరుడివి, వినయసంపన్నుడివి. ఇటువంటి నీవు ఈ విధంగా చలించిపోయి పిరికివాడి లాగ విచారించటం ఆశ్చర్యంగా ఉంది. కారణమేమిటయ్యా?”
1-90-వ.వచనము
అనినఁ బారాశర్యుం డిట్లనియె.
అనినన్ = అని పలికిన; పారాశర్యుండు = వ్యాసుడు {పారాశర్యుడు - పరాశరుని పుత్రుడు, వ్యాసుడు}; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.
అలా అడిగిన నారదమహర్షితో వ్యాసమహర్షి ఇలా అన్నాడు.
1-91-క.కంద పద్యము

"పుట్టితి వజు తనువునఁ జే
పట్టితివి పురాణపురుషు భజనము పదముల్
మెట్టితివి దిక్కులం దుది
ముట్టితివి మహాప్రబోధమున మునినాథా!
పుట్టితివి = జన్మించావు; అజు = బ్రహ్మయొక్క; తనువునన్ = శరీరము వలన; చేపట్టితివి = స్వీకరించావు; పురాణ = పూర్వముల కెల్ల పూర్వమైన; పురుషు = వ్యక్తి - భగవంతుని; భజనము = సంకీర్తనము; పదముల్ = దారులను; మెట్టితివి = దాటావు; దిక్కులన్ = దిక్కులను; తుది = సారాంశము; ముట్టితివి = దర్శించావు; మహా = ఉత్తమమైన; ప్రబోధమునన్ = జ్ఞానమున; ముని = మునులలో; నాథా = శ్రేష్ఠుడా.
“నారద మునీంద్రా! నీకు తెలియనిది ఏముంది. బ్రహ్మమానస పుత్రుడవు. శ్రీమన్నారాయణ సంకీర్తనాన్ని స్వీకరించావు. దశదిశలందు తిరిగావు. మహత్తరమైన తత్త్వజ్ఞానంలో అందెవేసిన చేయ్యి అనిపించుకొన్నావు.
1-92-వ.వచనము
అదియునుం గాక, నీవు సూర్యునిభంగి మూఁడు లోకములం జరింతువు; వాయువు పగిది నఖిలజనులలోన మెలంగుదువు; సర్వజ్ఞుండ వగుటం జేసి.
అదియునున్ = అంతే; కాక = కాకుండా; నీవు = నీవు; సూర్యుని = సూర్యుని; భంగిన్ = వలె; మూఁడు = మూడు; లోకములన్ = లోకములలోను; చరింతువు = తిరుగుతూ ఉంటావు; వాయువు = గాలి; పగిదిన్ = వలె; అఖిల = సమస్త; జనుల = మానవుల మనసుల; లోనన్ = లోను; మెలంగుదువు = మెలగుతూ ఉంటావు; సర్వజ్ఞుండవు = సర్వ జ్ఞానములు గలవాడివి; అగుటన్ = అగుట; చేసి = వలన.
అంతేకాకుండా. నీవు సూర్యభగవానుడిలా ముల్లోకాలలోను సంచరిస్తూ ఉంటావు. వాయుదేవుడిలాగా సర్వమానవుల మనస్సులలో మెలగుతూ ఉంటావు. సమస్తమూ తెలిసినవాడివి.
1-93-క.కంద పద్యము

నీ కెఱుఁగరాని ధర్మము
లోకములను లేదు బహువిలోకివి నీవున్
నా కొఱఁత యెట్టి దంతయు
నాకున్ వివరింపవయ్య నారద! కరుణన్."
నీకు = నీకు; ఎఱుఁగరాని = తెలియని; ధర్మము = ధర్మం; లోకములను = లోకాలలో; లేదు = లేదు; బహు = అనేక విషయాలు; విలోకివి = దర్శించిన వాడవు; నీవున్ = నీవు; నా = నాకు కలిగిన; కొఱఁతన్ = లోపము; ఎట్టిది = ఎటువంటిది; అది = అది; అంతయున్ = అంతా; నాకున్ = నాకు; వివరింపవయ్య = వివరముగాచెప్పుము; నారద = నారదుడా; కరుణన్ = కరుణతో.
నారదా! నీకు తెలియని ధర్మం ఏ లోకంలోను లేదు. అనేక విషయాలను అవలోచించినవాడివి. నాకు ప్రాప్తించిన కొరతకి కారణం ఏమిటో అదంతా దయతో నాకు వివరంగా చెప్పు."
1-94-వ.వచనము
అనిన నారదుం డిట్లనియె.
అనిన = అని పలికిన; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = అన్నాడు.
అని అడిగిన వ్యాసమునీంద్రుడితో నారదుడు ఇలా అన్నాడు.
1-95-ఉ.ఉత్పలమాల

"అంచితమైన ధర్మచయ మంతయుఁ జెప్పితి వందులోన నిం
చించుక గాని విష్ణు కథ లేర్పడఁ జెప్పవు; ధర్మముల్ ప్రపం
చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నినఁగాక నీకు నీ
కొంచెము వచ్చుటెల్ల హరిఁ గోరి నుతింపమి నార్యపూజితా!
అంచితము = పూజింప తగినవి; ఐన = అయినట్టి; ధర్మ = ధర్మముల; చయము = సమూహము; అంతయున్ = సమస్తమును; చెప్పితివి = వివరించితివి; అందున్ = వాని; లోనన్ = లో; ఇంచించుక = కొంచెములో కొంచెము; కాని = కూడ; విష్ణు = హరియొక్క; కథలు = కథలు; ఏర్పడన్ = తేటపడునట్లు; చెప్పవు = చెప్పవు; ధర్మముల్ = ధర్మములను; ప్రపంచించిన = వివరణములతో చెప్పిన; మెచ్చునే = మెచ్చుకొనునా; గుణ = గుణముల యొక్క; విశేషములు = విశిష్టతలు; ఎన్నినఁన్ = పొగడుటచే; కాక = కాకుండా; నీకున్ = నీకు; ఈ = ఈ; కొంచెము = లోటు / న్యూనత; వచ్చుట = కలుగుట; ఎల్లన్ = సమస్తమూ; హరిన్ = విష్ణుమూర్తిని; కోరి = కోరి; నుతింపమిన్ = స్తుతింపక పోవుటచేత; ఆర్య = ఆర్యులచే; పూజితా = పూజిపబడువాడా.
“ఆర్యులచే పూజితుడా! వ్యాసా! పవిత్రమైన అనేక ధర్మవిశేషాలను నీవు వెల్లడించావు. సరే కానీ, పొరపా టేమిటంటే దానిలో కొంచెం మాత్రమే విష్ణుకథలు చెప్పావు. చక్కగా సమగ్రంగా చెప్పలేదు. వాసుదేవుని గుణవిశేషాలు వర్ణించి చెప్తే సంతోషించినట్లు, ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా భగవంతుడు సంతోషించడు. నీ మనస్సుకు ఈ లోటు రావటానికి కారణం నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనం ప్రధానంగా చేయకపోవటమే.
1-96-మ.మత్తేభ విక్రీడితము

హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ
సురుచిభ్రాజితమైన మానస సరస్స్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ
హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు శ్రీ
కరమై యుండ; దయోగ్యదుర్మదనదత్కాకోల గర్తాకృతిన్.
హరి = శ్రీహరి; నామ = నామములను; స్తుతిసేయు = స్తుతించు; కావ్యము = కావ్యము; సువర్ణ = మంచిరంగుగల / బంగారు; అంభోజ = తామర పూవులు; హంస = హంసల; ఆవళీ = పంక్తులతో; సు = మంచి; రుచి = ప్రకాశముతో; భ్రాజితము = వెలుగుతున్నది; ఐన = అయినట్టి; మానస = మానస; సరస్ = సరోవరము; స్ఫూర్తిన్ = తీరుగ; వెలుంగొందు = ప్రకాశించును; శ్రీహరి = మహావిష్ణువు యొక్క; నామ = నామముల; స్తుతి = స్తుతించుట; లేని = లేనట్టి; కావ్యము = కావ్యము; విచిత్ర = విశేషముగ చిత్రింపబడిన; అర్థ = అర్థములు; ఆన్వితంబు = కూడుకొన్నది; అయ్యున్ = అయినప్పటికిని; శ్రీకరమై = శుభంకరమై; ఉండదు = ఉండదు; అయోగ్య = యోగ్యముకానిది; దుర్మద = దుర్గంధపూరితమైన; అదత్ = భయంకరమైన; కాకోల = విషపు; గర్త = గుంత; ఆకృతిన్ = రూపము గలదాని వలె.
పరాశర పుత్రా! వ్యాసా! హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో, కలహంస పంక్తులతో శోభాయమానమైన మానససరోవరం లాగ విరాజిల్లుతుంది. హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడినప్పటికీ దుర్గందాలతో, కాకోలవిషాలతో కూడిన బురదగుంట లాగ ఉంటుంది. అది శోభంకరం కాదు.
1-97-మ.మత్తేభ విక్రీడితము

అపశబ్దంబులఁ గూడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వపా
ప పరిత్యాగము సేయుఁ గావున హరిన్ భావించుచుం బాడుచున్
జపముల్ సేయుచు వీనులన్ వినుచు నశ్రాంతంబు గీర్తించుచుం
దపసుల్ సాధులు ధన్యులౌదురుగదా తత్త్వజ్ఞ! చింతింపుమా.
అపశబ్దంబులన్ = తప్పుమాటలతో; కూడియున్ = కలిసి ఉన్నప్పటికి; హరి = విష్ణుమూర్తి; చరిత్ర = చరిత్రల; ఆలాపముల్ = పలుకులు; సర్వ = సమస్త; పాప = పాపములను; పరిత్యాగమున్ = పూర్తిగ విడిచిపోవుటను; చేయున్ = చేయును; కావున = అందువలన; హరిన్ = విష్ణువుని; భావించుచున్ = ధ్యానము చేస్తూ; పాడుచున్ = (లీలలు) గానము చేస్తూ; జపముల్ = జపాలు; చేయుచున్ = చేయుస్తూ; వీనులన్ = చెవులారా; వినుచున్ = వింటూ; అశ్రాంతంబు = ఎడతెగకుండగ; కీర్తించుచున్ = పొగుడుతూ; తపసుల్ = తాపసులు; సాధులు = మంచివారు; ధన్యులు = సార్థకులు; ఔదురు = ఔతారు; కదా = కదా; తత్త్వజ్ఞ = తత్త్వజ్ఞానము గలవాడా; చింతింపుమా = ఆలోచించుకోవయ్యా.
తత్త్వవిశారదా! వ్యాస మునీంద్రా! పవిత్రమైన హరి చరిత్రలు కలిగిన కావ్యాలు తప్పులతో కూడుకొన్నప్పటికీ, సకల పాపాలను పటాపంచలు చేస్తాయి. అందువల్లనే సజ్జనులైన తపోధనులు శ్రీహరిని భావిస్తూ, శ్రీహరి లీలలు గానం చేస్తూ, నామం జపం చేస్తూ, కథలు చెవులారా ఆలకించుట చేస్తూ, ఎప్పుడూ ఆయననే కీర్తిస్తూ తమ జన్మలు సార్థకం చేసుకొంటారు కదా.
1-98-వ.వచనము
మునీంద్రా! నిర్గతకర్మంబై నిరుపాధికం బైన జ్ఞానంబు హరిభక్తి లేకున్న విశేషంబుగ శోభితంబు గాదు, ఫలంబు గోరక కర్మం బీశ్వరునకు సమర్పణంబు సేయకున్న నది ప్రశస్తంబై యుండదు; భక్తిహీనంబు లయిన జ్ఞాన వాచాకర్మ కౌశలంబులు నిరర్థంబులు; గావున,మహానుభావుండవు, యథార్థదర్శనుండవు, సకల దిగంత ధవళకీర్తివి, సత్యరతుండవు, ధృతవ్రతుండవు నగు నీవు నిఖిల బంధమోచనంబుకొఱకు వాసుదేవుని లీలావిశేషంబులు భక్తితోడ వర్ణింపుము; హరివర్ణనంబు సేయక ప్రకారాంతరంబున నర్థాంతరంబులు వీక్షించి తద్వివక్షాకృత రూప నామంబులంజేసి పృథగ్దర్శనుం డైనవాని మతి పెనుగాలిచేతం ద్రిప్పంబడి తప్పంజను నావ చందంబున నెలవు సేర నేరదు; కామ్యకర్మంబు లందు రాగంబు గల ప్రాకృతజనులకు నియమించిన ధర్మంబులు సెప్పి శాసకుండ వగు నీవు వగచుట తగ; దది యెట్టు లనిన, వార లదియే ధర్మం బని జుగుప్సితంబు లగు కామ్యకర్మంబులు సేయుచుఁ దత్త్వజ్ఞానంబు మఱతురు; గావున, బుద్ధి మోహంబు జనియింపక తత్వజ్ఞుండవై వ్యధా వియోగంబు సేయు" మని మఱియు నిట్లనియె.
మునీంద్రా = మునులలో శ్రేష్ఠుడా; నిర్గత = విడచిన; కర్మంబు = కర్మకలది; ఐ = అయి; నిరుపాధికంబు = ఉపాధి లేనిది; ఐన = అయినట్టి; జ్ఞానంబు = జ్ఞానము; హరి = హరి; భక్తి = భక్తి; లేకున్న = లేకపోయినచో; విశేషంబుగ = ప్రత్యేకముగా; శోభితంబు = ప్రకాశించునది; కాదు = కాదు; ఫలంబున్ = ఫలితమును; కోరక = ఆశించక; కర్మంబు = కర్మము; ఈశ్వరు = హరి; కున్ = కి; సమర్పణంబు = సమర్పించుట; చేయక = చేయక; ఉన్నన్ = పోయినచో; అది = అది; ప్రశస్తంబు = మంచిది; ఐ = అయి; ఉండదు = ఉండదు; భక్తి = భక్తి; హీనంబులు = లేనివి; అయిన = అయినట్టి; జ్ఞాన = జ్ఞానములోని; వాచా = వాక్కులోని; కర్మ = కర్మలోని; కౌశలంబులు = నేర్పరితనము; నిరర్థంబులు = ప్రయోజనం లేనివి; కావున = అందువలన; మహా = గొప్ప; అనుభావుండవు = అనుభవము పొందినవాడవు; యథార్థ = సత్యమును; దర్శనుండవు = దర్శించువాడవు; సకల = సమస్త; దిక్ = దిక్కుల; అంత = అంతట; ధవళ = మెరుస్తున్న, తెల్లని; కీర్తివి = కీర్తి గలవాడవు; సత్య = సత్యమునందు; రతుండవు = ఆసక్తి గలవాడవు; ధృత = ధరించిన; వ్రతుండవున్ = వ్రతముగల వాడవును; అగు = అయినట్టి; నీవు = నీవు; నిఖిల = సమస్త; బంధ = బంధముల; మోచనంబు = విముక్తి; కొఱకున్ = కోసము; వాసుదేవుని = భగవంతుని {వాసుదేవుడు - ఆత్మలో వసించే దేవుడు}; లీలా = లీలలయొక్క; విశేషంబులు = విశేషములు; భక్తి = భక్తి; తోడన్ = తో; వర్ణింపుము = వర్ణింపుము; హరి = హరియొక్క; వర్ణనంబు = వర్ణనము; చేయక = చేయకుండా; ప్రకార = విధములలో / విధానములలో; అంతరంబునన్ = బేధములతోను; అర్థ = అర్థములలో; అంతరంబులు = బేధములను; వీక్షించి = దర్శించి; తత్ = వాటిని; వివక్షా = చెప్పటంకోసం; కృత = చేసిన; రూప = రూపములును; నామంబులన్ = నామములును; చేసి = వలన; పృథక్ = పెక్కు విధములైన / మరలమరల; దర్శనుండు = దృష్టికలవాడు / చూచువాడు; ఐన = అయినట్టి; వాని = వానియొక్క; మతి = బుద్ధి; పెను = ప్రచండమైన (సుడి); గాలి = గాలివీచుట; చేతన్ = చేత; త్రిప్పంబడి = త్రిప్పబడుతూ; తప్పన్ = తప్పిపోయి; చను = వెళ్ళు; నావ = పడవ; చందంబున = వలె; నెలవు = రేవును; సేర = చేరుట; నేరదు = చేయలేదు; కామ్య = ఫలితమును ఆశించి చేయు; కర్మంబులు = కర్మలు; అందున్ = లో; రాగంబు = ఆసక్తి; కల = కలిగినట్టి; ప్రాకృత = అజ్ఞాన / పామర; జనులు = జనములు; కున్ = కు; నియమించిన = విధించిన; ధర్మంబులు = ధర్మములు; చెప్పి = చెప్పి; శాసకుండవు = శాసించినవాడవు; అగు = అయినట్టి; నీవు = నీవు; వగచుట = బాధపడుట; తగదు = తగదు; అది = అది; ఎట్టుల = ఏవిధముగా; అనినన్ = అన్నట్లైతే; వారలు = వారు; అదియే = అదే; ధర్మంబు = ధర్మము; అని = అనుకొని; జుగుప్సితంబులు = అసహ్యములు; అగు = అయినట్టి; కామ్య = ఫలితమును ఆశించి చేయు; కర్మంబులు = కర్మలు; చేయుచున్ = చేయుచు; తత్త్వజ్ఞానంబు = తత్త్వజ్ఞానమును; మఱతురు = మరచి పోవుదురు; కావున = అందువలన; బుద్ధిన్ = బుద్ధిలో; మోహంబున్ = మోహము; జనియింపక = పుట్టకుండగ; తత్త్వ = తత్త్వము యొక్క; అజ్ఞుండవు = జ్ఞానము కలవాడవు; ఐ = అయి; వ్యధా = దుఃఖము యొక్క; వియోగంబు = ఎడబాటును; చేయుము = చేయుము; అని = అని పలికి; మఱియున్ = ఇంకా; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = అన్నాడు.
వ్యాస మునివర్యా! కర్మవాసన లేనిది, ఆధారం లేనిది అయిన జ్ఞానం విష్ణుభక్తి లేకపోతే విశేషంగా ప్రకాశించదు. ఫలాపేక్షలేని నిష్కామకర్మమయినా భగవదర్పితం కాకపోతే అది ప్రశస్తం కాదు. జ్ఞానం కాని, వాక్కు కాని కర్మకాని అవి యెంత గొప్పవైనను భక్తిలేనినాడు నిరర్థకాలే. అందువల్ల వ్యాసమహర్షీ! నీవు మహానుభాపుడవు, సత్యదర్శనుడవు, దిగంత విశ్రాంతమైన కీర్తి కలవాడవు, సత్యనిష్ఠుడవు, నియమ పరాయణుడవు, మానవు లందరికీ భవబంధవిముక్తి కోసం భగవంతుడైన మాధవుని లీలలు భక్తితో విశేషంగా వర్ణించు. వాసుదేవుని వర్ణించని ఘట్టాలన్నిటిలో భావార్థ భేదాలు వెతుక్కుంటూ, ఆయా వివక్షల రూపాలు నామాలు పట్టుకు వేళ్ళాడేవాడి మనసు, ప్రచండమైన వాయువేగానికి ప్రవాహంలో పడి కొట్టుకుపోయే పడవలా రేవు చేరలేదు. కామ్యకర్మలందు ఆసక్తులైన మూఢమానవులకు నియతాలైన ధర్మాలు చెప్పి అనుశాసించటం నీవంటి వానికి తగదు. ఎందుకంటే వారు అదే ప్రధానమని భావించి కలుషితాలైన కామ్యకర్మలకు అలవాటు పడి పరమార్థాన్ని విస్మరిస్తారు. అందువల్ల బుద్ధి పెడదారి పట్టించకుండా వారికి భగవత్తత్త్వాన్ని అందించి వారి వ్యథలు తొలగించు” అని చెప్పి నారదుడు ఇంకా ఇలా పలికాడు.
1-99-చ.చంపకమాల

"ఎఱిఁగెడువాఁడు కర్మచయ మెల్లను మాని హరిస్వరూపమున్
నెఱయ నెఱింగి యవ్వలన నేరుపు జూపు గుణానురక్తుఁడై
తెఱకువ లేక క్రుమ్మరుచు దేహధనాద్యభిమాన యుక్తుఁడై
యెఱుఁగని వానికిం దెలియ నీశ్వరలీల లెఱుంగ చెప్పవే.
ఎఱిఁగెడు = ఎరుక; వాఁడు = కలవాఁడు; కర్మ = కర్మముల; చయము = సమూహము; ఎల్లను = సమస్తమును; మాని = మానేసి; హరి = హరియొక్క; స్వరూపమున్ = స్వరూపమును; నెఱయన్ = నిండుగ; ఎఱింగి = తెలిసికొని; ఆ = దాని; వలన్ = మూలమున; నేరుపు = నేర్పు; చూపు = చూపును; గుణ = గుణములందు; అనురక్తుఁడు = ఆసక్తి కలిగినవాడు; ఐ = అ/యి; తెఱకువ = వివేకము; లేక = లేకుండా; క్రుమ్మరుచున్ = తిరుగుచు; దేహ = దేహమును; ధన = ధనమును; ఆది = మొదలగు; అభిమాన = అభిమానము; యుక్తుఁడు = కూడినవాడు; ఐ = అయినప్పటికి; ఎఱుఁగని = తెలియని; వాని = వాని; కిన్ = కి; తెలియన్ = తెలియునట్లు; ఈశ్వర = ఈశ్వరుని; లీలలు = లీలలు; ఎఱుంగ = తెలియ; చెప్పవే = చెప్పుము.
“మునీంద్రా వ్యాసా ! కామ్యకర్మ లన్నింటినీ పరిత్యజించి ప్రాజ్ఞుడైనవాడు గోవిందుని గుణగణాలందు అనురక్తుడై, హరి స్వరూపాన్ని తెలిసికోవటం కోసం సమర్థమైన ప్రయత్నం చేస్తాడు. అజ్ఞుడైనవాడు వివేకహీనుడై దేహాభిమానం, ధనాభిమానం మొదలైనవి కలవాడై సంచరిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానులకి సైతం ఈశ్వరుని లీలావిలాసాలు తెలిసేటట్లుగా నీవు చెప్పాలి.
1-100-చ.చంపకమాల

తన కులధర్మమున్ విడిచి దానవవైరి పదారవిందముల్
పనివడి సేవసేసి పరిపాకము బొందక యెవ్వఁడేనిఁ జ
చ్చిన మఱు మేన నైన నది సిద్ధి వహించుఁ దదీయ సేవఁ బా
సినఁ గుల ధర్మగౌరవము సిద్ధి వహించునె యెన్ని మేనులన్.
తన = తనయొక్క; కుల = కులము యొక్క; ధర్మమున్ = ధర్మమును; విడిచి = విడిచిపెట్టి; దానవవైరి = విష్ణువు {దానవుల శత్రువు - హరి}; పద = పాదములనే; అరవిందముల్ = పద్మములను; పనిపడి = పనిగట్టుకు; సేవ = భక్తి; చేసి = చేసి; పరిపాకమున్ = సిద్దిని; పొందకన్ = పొందకుండగ; ఎవ్వఁడేనిన్ = ఎవడైనా; చచ్చిన = చనిపోయిన; మఱు = తరువాతి; మేనన్ = జన్మలో (శరీరంలో); ఐనన్ = అయినను; అది = అది; సిద్ధి = సిద్ధి; వహించున్ = పొందును; తదీయ = అతని; సేవన్ = భక్తిని; పాసినన్ = విడిచిన; కుల = కులము; ధర్మ = ధర్మము; గౌరవము = గౌరవము(లతో); సిద్ధి = సిద్ధి; వహించునె = పొందునా; ఎన్ని = ఎన్ని; మేనులన్ = జన్మలకైనా.
ఎవడైతే తన కులధర్మాలను వదలిపెట్టినా సరే, గోవింద పదారవిందాలను శ్రద్ధాభక్తులతో సేవిస్తూ కృతార్థుడు కాకుండానే మృతి పొందుతాడో, అట్టివానికి నష్టమేమీ కలుగదు. అతడు ఆ జన్మలో కాకపోయినా మరుజన్మలో నైనా తన సేవకు ఫలాన్ని పొందుతాడు. అలా కాకుండా విష్ణుసేవకి దూరమైనవాడు ఎట్టి కులధర్మాలను గౌరవించి ఆచరించినప్పటికీ వాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు కాలేడు.

1-101-వ.వచనము
అదిగావున నెఱుక గలవాఁడు హరిసేవకుం బ్రయత్నంబు సేయం దగు; గాలక్రమంబున సుఖదుఃఖంబులు ప్రాప్తంబు లయినను హరిసేవ విడువం దగదు; దానం జేసి యూర్థ్వంబున బ్రహ్మ పర్యంతంబు గ్రింద స్థావర పర్యంతంబుఁ దిరుగుచున్న జీవులకు నెయ్యది వొందరా దట్టి మేలు సిద్ధించుకొఱకు హరిసేవ సేయవలయు; హరిసేవకుం డగువాఁడు జననంబు నొందియు నన్యుని క్రియ సంసారంబునం జిక్కండు; క్రమ్మఱ హరిచరణ స్మరణంబుఁ జేయుచు భక్తి రసవశీకృతుం డయి విడువ నిచ్చగింపఁడు; మఱియును.
అది = అందు; కావునన్ = వలన; ఎఱుక = జ్ఞానము; కలవాఁడు = ఉన్నవాడు; హరి = హరి; సేవ = భక్తి; కున్ = కి; ప్రయత్నంబు = ప్రయత్నము; చేయన్ = చేయుట; తగున్ = తగును; కాలక్రమంబున = కాలక్రమములో; సుఖ = సుఖమును; దుఃఖములు = దుఃఖమును; ప్రాప్తంబులు = ప్రాప్తములు; అయినను = అయినప్పటికిని; హరి = విష్ణువు యొక్క; సేవ = భక్తి; విడువన్ = విడుచుట; తగదు = తగినదికాదు; దానన్ = దాని; చేసి = వలన; ఊర్థ్వంబునన్ = పైలోకములందు; బ్రహ్మ = బ్రహ్మము; పర్యంతంబున్ = వరకును; క్రింద = క్రింద; స్థావర = చైతన్యము (కదలిక) లేని జీవుల; పర్యంతంబున్ = వరకును; తిరుగుచున్న = చరించుచున్న; జీవులు = ప్రాణులు; కున్ = కును; ఎయ్యది = ఏదైతే; పొందన్ = పొందుటకు; రాదు = రాదో / కష్టసాధ్యమో; అట్టి = అటువంటి; మేలు = శుభములు; సిద్ధించు = కలుగుట; కొఱకున్ = కోసము; హరి = హరియొక్క; సేవన్ = సేవించుట; సేయవలయు = చేయవలయును; హరి = హరియొక్క; సేవకుండు = భక్తుడు; అగు = అయినట్టి; వాఁడు = వాడు; జననంబున్ = జన్మను; ఒందియున్ = పొందినప్పటికిని; అన్యుని = ఇతరుల; క్రియన్ = వలె; సంసారంబునన్ = సంసారములో; చిక్కండు = చిక్కుకొనడు; క్రమ్మఱన్ = తిరిగి; హరి = హరియొక్క; చరణ = పాదముల; స్మరణంబున్ = సంస్మరణము; చేయుచున్ = చేయుచు; భక్తి = భక్తి; రస = రసమునకు; వశీకృతుండు = పరవశుడు / లొంగిని వాడు; అయి = అయి; విడువన్ = విడుచుటకు; ఇచ్చగింపఁడు = ఇష్టపడడు; మఱియును = ఇంకనూ.
అందువల్ల సత్యం తెలుసుకున్నవాడు శ్రీహరి చరణ సేవాపరాయణుడు కావటానికి ప్రయత్నం చేయటం మంచిది. కాలానుసారంగా కష్ట సుఖాలు సంప్రాప్తమైనా, శ్రీహరి సేవను విడిచిపెట్టటం తగినపని కాదు. ఆ హరిసేవ వల్ల బ్రహ్మలోకం నుండి స్థావర పర్యంతం పరిభ్రమిస్తున్న జీవులకు పొందశక్యంకాని ఆనందం ఏదైతే ఉందో, అది తప్పకుండా సిద్థిస్తుంది. శ్రీహరి సేవాపరాయణు డైనవాడు నీచజన్మని పొందినప్పటికీ సంసారబంధాల్లో చిక్కుకోడు. పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తి పరవశుడై హరిచరణస్మరణం విడిచిపెట్టకుండా సాగిస్తూనే ఉంటాడు.
1-102-సీ.సీస పద్యము

విష్ణుండు విశ్వంబు, విష్ణునికంటెను;
వేఱేమియును లేదు విశ్వమునకు
భవవృద్ధిలయము లా పరమేశుచే నగు;
నీ వెఱుంగుదు గాదె నీ ముఖమున
నెఱిఁగింప బడ్డది యేక దేశమున నీ;
భువన భద్రమునకై పుట్టినట్టి
హరికళాజాతుండ వని విచారింపుము, ;
రమణతో హరిపరాక్రమము లెల్ల
1-102.1-ఆ.
వినుతిసేయు మీవు వినికియుఁ జదువును
దాన మతుల నయముఁ దపము ధృతియుఁ
గలిమి కెల్ల ఫలముగాదె పుణ్యశ్లోకుఁ
గమలనాభుఁ బొగడఁ గలిగెనేని.
విష్ణుండు = శ్రీహరే; విశ్వంబు = విశ్వము; విష్ణుని = హరి; కంటెను = కంటే; వేఱు = వేరైనది; ఏమియును = ఏమీకూడా; లేదు = లేదు; విశ్వము = విశ్వము; కున్ = కు; భవ = సృష్టి; వృద్ధి = స్థితి; లయములు = లయములు; ఆ = ఆ; పరమేశు = పరమమైన ఈశుని / భగవంతుని; చేన్ = చేతనే; అగున్ = అగును; నీవు = నీవు; ఎఱుంగుదు = తెలియుదువు; కాదె = కదా; నీ = నీ; ముఖమునన్ = నోటిద్వారానే; ఎఱిఁగింపబడ్డది = చెప్పబడినది; యేకదేశమునన్ = అంశముగ; ఈ = ఈ; భువన = లోకముల; భద్రమున = క్షేమము; కై = కొరకు; పుట్టినట్టి = అవతరించినట్టి; హరి = హరియొక్క; కళ = అంశతో; జాతుండవు = జన్మించినవాడవు; అని = అని; విచారింపుము = తెలిసికొనుము; రమణ = ప్రీతి; తోన్ = తో; హరి = హరియొక్క; పరాక్రమములు = సామర్థ్యములు; ఎల్లన్ = సమస్తము;
వినుతిసేయుము = కీర్తింపుము; ఈవు = నీవు; వినికియున్ = వినుటయు; చదువును = స్త్రోత్రమును; దానము = దానమును; అతుల = మిక్కిలి; నయమున్ = నీతియు; దపమున్ = తపస్సు; ధృతియున్ = ధైర్యమును; కలిమి = సంపద; కిన్ = కు; ఎల్లన్ = సమస్తమునకు; ఫలము = ఫలితము; కాదె = కాదా; పుణ్యశ్లోకున్ = భగవంతుని {పుణ్యశ్లోకుడు - పుణ్యాత్ములచే కీర్తింపబడువాడు, విష్ణువు}; కమలనాభున్ = భగవంతుని {కమల నాభుడు - కమలము నాభియందు కలవాడు}; పొగడన్ = కీర్తించుట; కలిగెనేని = (చేయ) కలిగితే / జరిగినచో;
ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటె ఇతరమైనది ఏదీ లేదు. ఈ విశ్వమంతా విష్ణుమయం. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి స్థితిసంహారాలు ఏర్పడుతుంటాయి. వ్యాస మహర్షీ! నీవు సర్వజ్ఞుడవు నీకు తెలియనిది ఏముంది. నీవే ఒక చోట ఈ విషయాన్ని చెప్పావు. ఈ విశ్వకల్యాణం కోసం మహావిష్ణువు అంశతో జన్నించానన్న మాట గుర్తు చేసుకో. అందువల్ల నీవు శ్రీహరి లీలావతారాలలోని విక్రమ విశేషాలను స్తుతించు మానవుని జ్ఞానానికీ, అధ్యయనానికీ, ఔదార్యానికీ, అనుష్ఠానానికీ, తపస్సుకూ, ధైర్యానికీ, సంపదకూ ప్రయోజనం పుణ్యశ్లోకుడైన పురుషోత్తముణ్ణి స్తుతించటమే.

**శివానందలహరి

**దశిక రాము**

**శివానందలహరి**

5 వ శ్లోకం

" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"
అవతారిక:
ఓరీ పిచ్చి వాడా! అల్పమైన ఫలితములను ఇచ్చే దేవతలతో నీకు
ఏమిపని ? వీళ్ళు ఎప్పుడో ఫలితములు ఇస్తారట. వాళ్ళిచ్చే ఫలితం
కూడా, మన కళ్ళకు కనపడదు. ఇంతకన్నా ఒక రాజును ఆశ్రయింౘవౘ్చును
కదా ! రాజులైతే ప్రత్యక్షంగా నే ఫలితములు ఇస్తారు. దేవతలను ఆశ్రయింౘడం
కంటే, రాజులను ఆశ్రయింౘడం మేలు అనే అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని
శంకరులు ఈ శ్లోకం వ్రాశారు. రాజులను కొలిచి వారిని మెప్పించగల నేర్పు
తనవద్ద లేదనీ ఈశ్వరుడేతన్ను కాపాడాలనీ, శంకరులు ఈ శ్లోకం లో
ప్రార్థించారు.

శ్లో:

**స్మృతౌ శాస్త్రే వైద్యే**

**శకున కవితా గాన ఫణితౌ**

**పురాణే మంత్రేవా**_

**స్తుతినటన హాస్యేష్వచతురః**

**కథంరాజ్నాం ప్రీతిర్భవతి మయి కో‌ హోం పశుపతే**

**పశుంమాం సర్వజ్ఞ!**

**ప్రథిత కృపయా పాలయ విభో !!**

పదవిభాగం:
స్మృతౌ , శాస్త్రే, వైద్యే _ శకునకవితాగానఫణితౌ _ పురాణే _ మంత్రే _
వా _ స్తుతి నటన హస్యేషు _ అచతురః _ కొంచెం _ రాజ్నాం _ ప్రీతిః _
భవతి _ మయి _ కః _ అహం _ పశుపతే _ పశుమ్ _ మామ్ _ సర్వజ్ఞ _
ప్రథితకృపయా _ పాలయ _ విభో.
తాత్పర్యం:
సర్వజ్ఞుడైన ఓ ఈశ్వరా! మనుస్మృతి వంటి స్మృతుల యందు గానీ,
తర్కవ్యాకరణములవంటి శాస్త్ర ములయందుగానీ, వైద్యము నందుగానీ,
శకునములు చెప్పుట యందుగానీ, కవిత్వమును అల్లుటయందుగానీ,
సంగీతమును పాడుటయందుగానీ,సభల్లో వాగ్వాదము చేసే వాచా
విష్కరణము నందుగానీ, పురాణకాలక్షేపము చేయుటయందు గానీ,
మంత్ర ప్రయోగమునందుగానీ, ఇతరులను స్తుతి చేయుటయందు గానీ,
నాట్యమునందుగానీ,హాస్య ప్రసంగము నందుగానీ నాకు నేర్పు లేదు.
అటువంటి నాయందు రాజులకు ప్రేమ ఎలా ఏర్పడుతుంది. వారిని
సంతోష పెట్టేందుకు అసలు నేను ఎవరిని ? నేను ఎంతటివాడను?
శ్రుతి, స్మృతి పురాణేతిహాసము లందు ప్రసిద్ధుడవైన ఓ ప్రభూ!
నేను పశువును, నీవు పశుపతివి. కాబట్టి నన్ను దయతో కాపాడు.
వివరణ:
శంకరులు కరుణాస్వరూపులు మనవంటి అల్పజ్నులకు భగవంతుని
ముందు నిలబడి ఎలా ప్రార్థన చేసికోవాలో కూడా తెలియదని , గుర్తించి
వారు ఈ స్తోత్రమును మనకందించారు. కాబట్టి " పశువు" నని మనం
భగవంతుని ముందు చెప్పుకోవాలని మనకు చెప్పడంకోసమే, వారు ఇలా
వ్రాశారని మనం గర్తింౘాలి.
అదీగాక రాజులు కొంచం గొప్పవాళ్ళైనప్పటికీ వాళ్ళు కూడా పశువులే కదా!
ఒకవైపు పాశాలను త్రెంౘుకోవాలని మనం అనుకుంటూ,మనకంటే పెద్ద
పశువులైన రాజులను మనం ఆశ్రయింౘడం అంటే పాశాలను మరింతగా
బంధింౘుకోవడమే కదా! కనుక, తనకు ఆ రాజులు ఇచ్చే ధనకనకాదులపై
ఆసక్తి లేదని శంకరులు చెప్పారు.
ధూర్జటి మహాకవి కూడా తన " కాళహస్తీశ్వర శతకము" లో ఇలానే
చెప్పారు. ౘూడండి___
" రాజుల్మత్తులు, వారిసేవ నరకప్రాయంబు,వారిచ్చు నం
భోజాక్షీ చతురంతయాన తురగీభూషాదు లాత్మవ్యధా
బీజంబుల్, తదపేక్ష ౘాలుఁ, బరితృప్తింబొందితిన్,జ్నానల
క్ష్మీ జాగృత్పరిణామమిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా !"
ఏ విద్యలలోనూ,నేర్పులేని తనను, రాజులు ఆదరింపరని, అన్నీతెలిసిన
ప్రభువైన ఈశ్వరుడే తనను రక్షింౘాలని, రక్షింౘమని, శంకరులు ఈశ్వరుణ్ణి
కోరారు.
🙏🙏🙏

**ధర్మము - సంస్కృతి**

త్వమేవాహమ్‌

*THVAMEVAAHAM త్వమేవాహమ్‌*

కన్నతల్లి కడుపులోంచి బయటపడి......
తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి......
పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు.......
ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా
సాగే ప్రస్థానం.......
పేరే......

             *నేను =I*

*ఈ "నేను"* ప్రాణశక్తి అయిన "ఊపిరి"కి మారుపేరు!

*ఊపిరి ఉన్నంతదాకా "నేను"* అనే భావన కొనసాగుతూనే ఉంటుంది....

*జననమరణాల మధ్యకాలంలో* సాగే జీవనస్రవంతిలో ...ఈ
*"నేను"* ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది...

*ఈ "నేను"* లోంచే
*నాది* అనే భావన పుడుతుంది!

*ఈ *నాది* లోంచే....

1.నా వాళ్ళు,
2.నా భార్య,
3.నా పిల్లలు,
4.నా కుటుంబం,
5.నా ఆస్తి,
6.నా ప్రతిభ,
7.నా ప్రజ్ఞ,
8.నా గొప్ప...

అనేవి పుట్టుకొచ్చి....

చివరికి ఈ *"నేను"* అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,
ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా ప్రజ్వరిల్లుతుంది.

              *EGO అహం*

అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ *”నేను"*, *”నేనే సర్వాంతర్యామిని* అని విర్రవీగుతుంది.

*నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.*

1. పంతాలతో
2. పట్టింపులతో,
3. పగలతో,
4. ప్రతీకారాలతో......

తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.

1 .బాల్య,
2.కౌమార,
3.యౌవన,
4.వార్ధక్య, 

దశలదాకా....విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన ఈ
*నేను* అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.

*వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.*

 *సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.*

 *సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన ఈ నేను* చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

*కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.*

 *మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.*

*మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.*

*1.నేనే* శాసన కర్తను,

 *2.నేనే* ఈ సమస్త భూమండలానికి అధిపతిని,

*3.నేనే* జగజ్జేతను...

అని మహోన్నతంగా భావించిన ఈ *నేను*
లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. - ఎప్పటిలా
రోజు మారుతుంది.

*ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన ఈ ‘నేను’* కథ అలా సమాప్తమవుతుంది.

*అందుకే ఊపిరి ఆగకముందే ఈ “నేను”*
గురించి తెలుసుకో అంటుంది “శ్రీమద్భగవద్గీత”
“SRIMADBHAGAVATH GEETHA”....

*చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం* మాత్రమే!

   *అది శాశ్వతం కానే కాదు*

ఈ *నేను* గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన
*”వైరాగ్యస్థితి”* అభిలాషికి సాధ్యమవుతుంది.

*వైరాగ్యం* అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు.
*దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం.తామరాకుమీద నీటి బొట్టులా జీవించ గలగడం*.

*స్వర్గ-నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.*

*మనిషి ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే-నరకం*

*అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం-స్వర్గం.*

*ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే-వేదాంతం*.

1. నిజాయితీగా,
2. నిస్వార్థంగా,
3.సద్ప్రవర్తనతో,
4. సచ్ఛీలతతో,
5.భగవత్‌ ధ్యానం

తో జీవించమనేదే
*వేదాంతసారం*.

*అహం బ్రహ్మాస్మి* అంటే
*అన్నీ నేనే* అనే స్థితి నుంచి
*త్వమేవాహమ్‌* అంటే *నువ్వేనేను* అని
భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే
*మానవ జన్మకు సార్థకత*

🌺🌹😌🙏🙏🙏😌🌹🌺

మానవ జన్మ

జై శ్రీరామ్.

మానవ జన్మ చాలా గొప్పనైనది ఈ జన్మ లొనే మనం పుణ్యాన్ని సమపార్జించుకొని ఉత్తమ జన్మలను కానీ తిరిగి జన్మ లేనటువంటి మోక్షసన్ని కానీ పొందుటము.
ఉడతా భక్తిగా మనం చిన్న ఉపకారం చేసినా రామచంద్రమూర్తి తలుచుకు తలుచుకొని వారిని ఉదరిస్తాడు మరి అలాంటిది తన బంటు అయిన హనుమంతుని దేవాలయానికి మనకి తోచిన సహాయం చేస్తే ఇక ఆ రామచంద్రమూర్తి రక్ష మనకు లభిస్తుంది.
మా పూర్వీకులు జొన్నలగడ్డ వంశానికి చెందినవారు గుంటూరు జిల్లా భర్తీపూడి లో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం నిర్మించారు.ఎంతో చక్కగా ఆలయంలో పూజలు అన్నీ నిర్వహిస్తూ వుంటారు.

ఇప్పుడు అందరి సంకల్పం అక్కడ స్వామి దేవాలయానికి ప్రహరీ గోడ నిర్మించాలని దానికి దాదాపు ఐదు లక్షల దాకా వ్యయం అవుతుంది.

మనమందరం స్వామి ప్రహరీ గోడకి సహాయం చేసమనుకోండి ఆ స్వామి మన ప్రహరీ గోడ చుట్టూ కాపలా వుండి మనకు రామరక్ష దొరికేట్టు చేస్తాడు.మనకి ఇప్పుడు కావాల్సింది అదే కదా!

మీరు ఎక్కువ ఏమి ఇవ్వక్కర్లేదు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 5 రూపాయలనుంచి మొదలు పెట్టి ఆ స్వామి మీ మనడులోకి దూరి ఎంత ఇప్పిస్తే అంత ఇవ్వండి చాలు భక్తిగా

మీరు క్రింద ఇస్తున్న అకౌంట్ నెంబర్ కి అయినా డబ్బు పంపచ్చు లేకపోతే మా గూగుల్ పే,మరియు ఫోన్ పే నంబర్లకు పంపచ్చు

మా ఫోన్ నెంబర్ 9948931150,అకౌంట్ హోల్డర్స్ నేమ్ జొన్నలగడ్డ జ్యోతి

సర్వేజనా సుఖినోభవంతు,

శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి
9948931150

కృష్ణనామ స్మరణం

కృష్ణనామ స్మరణం కలిదోష నాశనం

శ్రీకృష్ణ నామం ఎంతో మధురాతి మధురమైనది. కృష్ణనామాన్ని ఏ తీరుగా తలిచినప్పటికీ మన మనసులలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది. ‘కృష్ణా‘ అనే నామ సంకీర్తనం వల్ల కోటి చంద్రగ్రహణ, సూర్యగ్రహణ స్నానాలను చేయడంవల్ల కలిగే ఫలితం పొందుతారు. కృష్ణ నామం ఎన్ని పాతకాలను దహించగలదంటే అసలన్ని పాపాలను మానవులు ఎన్నటికీ చేయలేరు. పాప రూపాగ్నిలో దహనమై, చేసిన సత్కర్మలన్నీ శూన్యమైన వారికి కృష్ణనామం పరమ ఔషధం వంటిది. మృత్యు సమయంలోకూడా కృష్ణనామాన్ని స్మరిస్తే యమపురికి పోకుండా పరంధామానికి చేరుకుంటారట.
భగవానుని గుణకర్మ, నామైక దేశ సంకీర్తన మాత్రం చేతనే పాపాలన్నీ సంపూర్ణంగా నశించుతాయని చెప్పబడింది. ఒక జీవిత కాలంలో జరిగే పాపమంతటినీ కలిపినప్పటికీ, సామాగ్ని ముందు గడ్డిపోచతో సమం అని పురాణ వచనం. పాపక్షయానికై నామస్మరణం ఏ ఇతర సాధనాలతోను సముచ్చయంగా ఉండవలసిన అవసరం లేదు. భగవన్నామ సంకీర్తన సాధనేతర నిరపేక్షంగానే పాపక్షయానికి సాధనమని పండితార్ధం కదా! కలియుగంలో నామ సంకీర్తనమే ముక్తికి సాధనంగా చెప్పబడింది.
కలి వల్ల కలిగే దుష్ఫలితాలను పోగొట్టుకోవడం ఎట్లా అని ఒకసారి నారదుడు బ్రహ్మదేవుని అడుగగా ‘సత్య యుగంలో ధ్యానంవల్ల, త్రేతాయుగంలో యజ్ఞాలవల్ల, ద్వాపర యుగంలో పూజలు, వ్రతాలవల్ల పొందే ఫలితాలన్నీ కలియుగంలో కేవలం నామస్మరణ వలన పొందుతారని ‘హరే రామ హరే రామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’ అనే నామ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రంలోని రామ శబ్దం, హరి శబ్దం పరబ్రహ్మవాచకమైన శ్రీకృష్ణుణ్ణే సూచిస్తాయి.
‘కృష్ణః’ అంటే పాపాలు పోగొట్టేవాడు. ‘కృష్ణః’ అన పదంలోని ‘క’కారం బ్రహ్మవాచకం, ‘ఋ‘కారం అనంత వాచకం. ‘ష’ కారం శివ సూచకం, ‘ణ’ కారం ధర్మబోధకం. చివర ఉన్న ఆ కారం శే్వత ద్వీప వాసియైన విష్ణు వాచకం.విసర్గం నర నారాయణార్ధకం. కనుక కృష్ణుడు సమస్త దేవతల తేజోరాశి.
‘కృష్ణస్తు భగవాన్ స్వయమ్’ అని కృష్ణ భగవానుని నామాన్ని నిత్యం స్మరించినంత మాత్రానికే పదివేల యజ్ఞాలు, కోటి తీర్థ స్నాన పుణ్యం లభిస్తుందని వ్రతాల వలన కూడా నశించని పాపాలు కృష్ణ అని నామోచ్చరణ చేయడంతో తొలగిపోతాయని, ‘కృష్ణ’ అంటూ కీర్తించే వావరి శరీరం ఎన్నటికీ అపవిత్రం కాజాలదని, జన్మ జన్మల పాపాలన్నీ తొలగి కృష్ణునిపై మనసు లగ్నమవుతుంది. శ్రీకృష్ణ నామ మహిమ గురించి సాక్షాత్తు శ్రీమహా విష్ణువే బ్రహ్మకు చెప్పే సందర్భం స్కందపురాణంలో ఉంది. ‘నా కృష్ణ నామోచ్ఛారణ చేయడం వల్ల నాకెంతో ప్రీతికలగుతుందంటే, ఇతర నామాలు కోటిసార్లు చేసినా నాకు అంత సంతోషం కలగదు’ అన్నాడు.
నామ స్మరణకే ప్రభావమున్నదని గ్రహించి, శ్రీకృష్ణ నామమునే సదా స్మరించి నారదాదులు ఆయన కృపకు పాత్రులయ్యారు. కనుక కలియుగంలో జీవిస్తున్న మానవులందరికీ నామ మహిమను, లోక ధర్మాలని చెప్పిన కారణంగా శ్రీకృష్ణావతారము కలియుగ ప్రజలందరికీ గొప్పది. ఆచరణానికి అనువైనది. ‘్భక్త దుఃఖ కర్షిం కృష్ణః’ అంటే భక్తుల దుఃఖాన్ని పోగొట్టేవాడు శ్రీకృష్ణుడు అని అర్ధం.
మానవ జీవితంలోని పాపాల్ని పోగొట్టుకోడానికి శాస్త్రాలలో అనేక ప్రాయశ్చితాలు చెప్పారు. చాంద్రాయణాదివ్రతాలు ఎన్నో చేయాల్సి ఉంటుంది. కానీ ఎన్ని చేసినా ఆ పాపం పోదు. కానీ శ్రీకృష్ణ నామం జపిస్తే ‘క్షోభం’ వల్ల కలిగిన పాపం కూడా నశిస్తుంది. అందుకు కారణం శ్రీకృష్ణ నామంలో క్లేశఘ్ని-పాపఘ్ని అనే బలవత్తరమైన శక్తులుండడమే నని-ఈ జగత్తులో పరమాత్ముడు ఎన్ని రూపాలతో విరాజిల్లుతున్నాడో అన్ని నామాలతో ఆయన పేర్కొనబడుతుంటాడు. కృష్ణ నామం పాపాన్ని నాశనం చేసి, పుణ్యాన్ని ఉత్పాదించి, భక్తిని తత్త్వజ్ఞానాన్ని, భగవతృప్తిని కలిగిస్తుంది. కృష్ణనామం జపం చేసేవారికి విపత్తియే సంపత్తిగా పరిణమిస్తుంది.
పురుషోత్తముడు, స్థితప్రజ్ఞుడైన శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క మహోన్నతావతారం. పదారు కళల్లో మూర్త్భీవించిన పూర్ణావతారం. జీవులు తరించుటకు ఉపనిషత్సారమైన గీతామృతాన్ని పంచిపెట్టిన ప్రేమ మూర్తి. ద్వాపర యుగంలో రోహిణీ నక్షత్ర యుక్త శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా అవతరించాడు. అష్టమియొక్క అర్ధరాత్రి సమయంలో ఆకాశమందు అర్ధ చంద్రుడు ప్రకాశించగా, పృధ్వియందు పూర్ణ చంద్రుడు ఉదయించిననట్టు శరణాగత వత్సలుడు దేవకీదేవికి జననం. శ్రీకృష్ణావతారం సంపూర్ణావతారమనీ, శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడేనని భాగవతం మనకు వెల్లడిస్తోంది. ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మకు భక్తి ప్రపుల్లాత్ములమై ప్రణమిల్లి మన జీవితాలను ధన్యం చేసుకుందాం.
-‘రసస్రవంతి’, ‘కావ్యసుధ’(sekarana from Sunday, 4 June 2017 ANDHRA BOOMI TELUGU DAILY )

కలాష్టమి

*_ఈ రోజు కలాష్టమి_*



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



కలాష్టమి లేదా కాల అష్టమి భైరవుడికి అంకితం చేయబడిన హిందూ పండుగ మరియు ప్రతి హిందూ చంద్ర నెలలో 'కృష్ణ పక్ష అష్టమి తిథి' (చంద్రుని క్షీణిస్తున్న దశలో 8 వ రోజు) లో జరుపుకుంటారు.

'పూర్ణిమ' (పౌర్ణమి) తరువాత 'అష్టమి తిథి' (8 వ రోజు) లార్డ్ కల భైరవ ను ప్రతిపాదించడానికి అత్యంత అనువైన రోజుగా భావిస్తారు. ఈ రోజున , హిందూ భక్తులు భైరవుడిని ఆరాధిస్తారు మరియు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం చేస్తారు. సంవత్సరంలో మొత్తం 12 కలాష్టమి ఆచారాలు ఉన్నాయి.

వీటిలో , *'మార్గశిర్ష'* నెలలో పడేది చాలా ముఖ్యమైనది మరియు దీనిని *'కాలభైరవ జయంతి'* అని పిలుస్తారు. ఈ రోజులను ఆది లేదా మంగళవారం పడినప్పుడు కలాష్టమిని పవిత్రంగా భావిస్తారు , ఎందుకంటే ఈ రోజులు భైరవుడికి అంకితం చేయబడ్డాయి.

కలాష్టమిలో భైరవుడిని ఆరాధించే పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో పూర్తి ఉత్సాహంతో , భక్తితో జరుపుకుంటారు.


ఈ రోజు కలాష్టమి - 2020 సెప్టెంబర్ 10 గురువారం
అష్టమి తిథి సమయం : సెప్టెంబర్ 10 , 2:06 ఉదయం - సెప్టెంబర్ 11 , 3:35 ఉదయం


*కలాష్టమి సమయంలో ఆచారాలు:*


శివుని అనుచరులకు కలాష్టమి ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజు భక్తులు సూర్యోదయానికి ముందే లేచి ముందస్తు స్నానం చేయాలి. దైవిక ఆశీర్వాదాలను పొందటానికి మరియు వారి పాపాలకు క్షమాపణ కోరడానికి కాల భైరవ ప్రత్యేక పూజలు చేస్తారు.

భక్తులు సాయంత్రం లార్డ్ కాల భైరవ ఆలయాన్ని కూడా సందర్శించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కలాష్టమి శివుడి భీకర రూపం అని తేలింది. బ్రహ్మదేవుడి మండుతున్న కోపాన్ని , నిగ్రహాన్ని అంతం చేయడానికి ఆయన జన్మించాడు.

కలాష్టమిలో ఉదయం పూజారికి ప్రత్యేక పూజలు మరియు ఆచారాలు కూడా చేస్తారు.

భక్తులు రోజంతా కఠినమైన ఉపవాసం కూడా ఉంటారు. కొంతమంది భక్తులు రాత్రంతా జాగారం చేస్తారు. మరియు మహాకలేశ్వర్ కథలను వింటూ తమ సమయాన్ని గడుపుతారు. కలాష్టమి వ్రతం యొక్క పరిశీలకుడు శ్రేయస్సు మరియు ఆనందంతో ఆశీర్వదించబడ్డాడు మరియు అతని / ఆమె జీవితంలో అన్ని విజయాలను పొందుతాడు.

కాల భైరవ కథ మరియు శివునికి అంకితం చేసిన మంత్రాలను పఠించడం శుభంగా భావిస్తారు.

భగవంతుని భగవంతుడి వాహనంగా నల్ల కుక్కగా పరిగణించబడుతున్నందున కలాష్టమిలో కుక్కలను పోషించే ఆచారం కూడా ఉంది. కుక్కలకు పాలు , పెరుగు మరియు స్వీట్లు అందిస్తారు.

కాశీ వంటి హిందూ యాత్రికుల ప్రదేశాలలో బ్రాహ్మణులకు ఆహారాన్ని అందించడం చాలా బహుమతిగా పరిగణించబడుతుంది.

*కలాష్టమిలో ముఖ్యమైన సమయాలు*

అష్టమి తితి టైమింగ్ సెప్టెంబర్ 10, 2:06 AM - సెప్టెంబర్ 11, 3:35 ఉద

*కలాష్టమి యొక్క ప్రాముఖ్యత:*


కలాష్టమి గొప్పతనం *'ఆదిత్య పురాణం'* లో చెప్పబడింది. కలాష్టమిలో ఆరాధన యొక్క ప్రధాన దేవత కాల భైరవ , అతను శివుని యొక్క అభివ్యక్తి.

హిందీలో 'కాల్' అనే పదం 'సమయం' అని సూచిస్తుంది, అయితే 'భైరవ్' 'శివుని అభివ్యక్తి' ని సూచిస్తుంది. అందువల్ల కాల భైరవ ను 'టైమ్ గాడ్' అని కూడా పిలుస్తారు మరియు శివుని అనుచరులు పూర్తి భక్తితో పూజిస్తారు.

హిందూ ఇతిహాసాల ప్రకారం , ఒకసారి బ్రహ్మ , విష్ణువు మరియు మహేశ్వరుని మధ్య వాదన సమయంలో , శివుడు బ్రహ్మ ఆమోదించిన వ్యాఖ్యతో కోపంగా ఉన్నాడు. ఆ తర్వాత 'మహాకాలేశ్వర్' రూపాన్ని తీసుకొని బ్రహ్మ భగవానుడి 5 వ తలను కత్తిరించాడు.

అప్పటి నుండి , దేవతలు మరియు మానవులు శివుని యొక్క ఈ రూపాన్ని 'కల్ భైరవ్' గా ఆరాధిస్తారు. కలాష్టమిలో శివుడిని ఆరాధించే వారు శివుడు ఉదారంగా ఆశీర్వదిస్తారని నమ్ముతారు.

ఈ రోజున భైరవుడిని ఆరాధించడం ద్వారా ఒకరి జీవితంలోని అన్ని బాధలు , మరియు ప్రతికూల ప్రభావాలను తొలగిస్తుందనేది కూడా ఒక ప్రసిద్ధ నమ్మకం.

**కొల్హాపూర్ - శ్రీ మహా లక్ష్మీ అమ్మవారు**

*దశిక రాము**

**మన సంస్కృతి సాంప్రదాయాలు**




శ్రీ మహాలక్ష్మీ (అంబాబాయి) దేవాలయం భారతదేశం లోని
మహారాష్ట్ర రాష్ట్రనికి చెందిన కొల్హాపూర్ లో శక్తి పీఠం.
ఇది హిందూ పురాణాల ప్రకారం శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతోంది.

పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసముండే 108 శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.

7 వ శతాబ్దం లోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశ రాజైన కరన్దేవ్ తిరిగి చాలాకాలం తరువాత దీని నిర్మాణాన్ని చేపట్టారు.
ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి హేమండ్ పతి ప్రేరణతో చేయబడింది. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8 వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని నమ్మబడింది.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యకిరణాలు ప్రతిరోజూ దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది.నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు, భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్ కి తండోపతండాలుగా వస్తారు.

ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ, 40 కిలోగ్రాముల
వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మీ కొలువై ఉంటుంది. 3 అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మీ ప్రతిమను చెక్కడం జరిగింది. ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం చెక్కబడి ఉంది.
దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది. కిరీటంపై విష్ణువు తల్పం అయిన శేషనాగు యొక్క చిత్రం ఉంటుంది.
ఆమె నాలుగు చేతులలో గుర్తింపు కలిగిన నాలుగు వస్తువులు ఉంటాయి. కుడివైపు క్రింది చేతిలో మాలుంగ (సిట్రస్ జాతి ఫలం), ఎడమవైపు కింది చేతిలో పాత్ర ఉంటుంది. హిందూ పవిత్ర చిత్రాలలో ముఖం ఉత్తరవైపు లేదా తూర్పు వైపు చూసే విధంగా ఉంటుంది. ఈ దేవతా విగ్రహం పశ్చిమవైపు చూసే విధంగా ఉంటుంది.

చిన్న తెరిచిఉన్న కిటికీ పశ్చిమవైపు గోడకు ఉంటుంది. సూర్యాస్తమయం అయినపుడు సూర్యుని కిరణాలు ఈ కిటికీ గుండా ప్రతి సంవత్సరం 21 మార్చి మరియు 21 సెప్టెంబరు లలో మూడురోజులపాటు విగ్రహంపై పడతాయి.
ఆలయ పరిసరాల్లో నవగ్రహాల, సూర్యుని, మహిసాసుర మర్థని, విఠల్-రఖ్‌మయి, శివుడు, విష్ణువు, తుల్జా భవాని మరియు యితర విగ్రహాలు ఉంటాయి. వీటిలోకొన్ని విగ్రహాలు 11వ శతాబ్దానికి ముందువి కొన్ని కొత్తగా ప్రతిష్ఠించినవి. ఆలయం వద్ద మణికర్ణికా కుండం అనే కొలను ఉంది. ఆ కొలను ఒడ్దున విశ్వేశ్వర మహాదేవ్ విగ్రహం ఉంది.

అమ్మవారికి రోజూ అయిదు సార్లు అర్చన జరుగుతుంది .
ఉదయం అయిదు గంటలకు శ్రీ మహా లక్ష్మీ దేవికి సుప్రభాత సేవ చేస్తారు. కాకడ హారతి ఇస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు.
మధ్యాహ్నం, సాయంత్రాలలో పూజ, శేజ్ హారతి జరుపుతారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో, పౌర్ణమి నాడు, అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు.
🙏🙏🙏
సేకరణ

*ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏


*ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**

**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏 

కృష్ణనామ స్మరణం

కృష్ణనామ స్మరణం కలిదోష నాశనం

శ్రీకృష్ణ నామం ఎంతో మధురాతి మధురమైనది. కృష్ణనామాన్ని ఏ తీరుగా తలిచినప్పటికీ మన మనసులలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది. ‘కృష్ణా‘ అనే నామ సంకీర్తనం వల్ల కోటి చంద్రగ్రహణ, సూర్యగ్రహణ స్నానాలను చేయడంవల్ల కలిగే ఫలితం పొందుతారు. కృష్ణ నామం ఎన్ని పాతకాలను దహించగలదంటే అసలన్ని పాపాలను మానవులు ఎన్నటికీ చేయలేరు. పాప రూపాగ్నిలో దహనమై, చేసిన సత్కర్మలన్నీ శూన్యమైన వారికి కృష్ణనామం పరమ ఔషధం వంటిది. మృత్యు సమయంలోకూడా కృష్ణనామాన్ని స్మరిస్తే యమపురికి పోకుండా పరంధామానికి చేరుకుంటారట.
భగవానుని గుణకర్మ, నామైక దేశ సంకీర్తన మాత్రం చేతనే పాపాలన్నీ సంపూర్ణంగా నశించుతాయని చెప్పబడింది. ఒక జీవిత కాలంలో జరిగే పాపమంతటినీ కలిపినప్పటికీ, సామాగ్ని ముందు గడ్డిపోచతో సమం అని పురాణ వచనం. పాపక్షయానికై నామస్మరణం ఏ ఇతర సాధనాలతోను సముచ్చయంగా ఉండవలసిన అవసరం లేదు. భగవన్నామ సంకీర్తన సాధనేతర నిరపేక్షంగానే పాపక్షయానికి సాధనమని పండితార్ధం కదా! కలియుగంలో నామ సంకీర్తనమే ముక్తికి సాధనంగా చెప్పబడింది.
కలి వల్ల కలిగే దుష్ఫలితాలను పోగొట్టుకోవడం ఎట్లా అని ఒకసారి నారదుడు బ్రహ్మదేవుని అడుగగా ‘సత్య యుగంలో ధ్యానంవల్ల, త్రేతాయుగంలో యజ్ఞాలవల్ల, ద్వాపర యుగంలో పూజలు, వ్రతాలవల్ల పొందే ఫలితాలన్నీ కలియుగంలో కేవలం నామస్మరణ వలన పొందుతారని ‘హరే రామ హరే రామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’ అనే నామ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రంలోని రామ శబ్దం, హరి శబ్దం పరబ్రహ్మవాచకమైన శ్రీకృష్ణుణ్ణే సూచిస్తాయి.
‘కృష్ణః’ అంటే పాపాలు పోగొట్టేవాడు. ‘కృష్ణః’ అన పదంలోని ‘క’కారం బ్రహ్మవాచకం, ‘ఋ‘కారం అనంత వాచకం. ‘ష’ కారం శివ సూచకం, ‘ణ’ కారం ధర్మబోధకం. చివర ఉన్న ఆ కారం శే్వత ద్వీప వాసియైన విష్ణు వాచకం.విసర్గం నర నారాయణార్ధకం. కనుక కృష్ణుడు సమస్త దేవతల తేజోరాశి.
‘కృష్ణస్తు భగవాన్ స్వయమ్’ అని కృష్ణ భగవానుని నామాన్ని నిత్యం స్మరించినంత మాత్రానికే పదివేల యజ్ఞాలు, కోటి తీర్థ స్నాన పుణ్యం లభిస్తుందని వ్రతాల వలన కూడా నశించని పాపాలు కృష్ణ అని నామోచ్చరణ చేయడంతో తొలగిపోతాయని, ‘కృష్ణ’ అంటూ కీర్తించే వావరి శరీరం ఎన్నటికీ అపవిత్రం కాజాలదని, జన్మ జన్మల పాపాలన్నీ తొలగి కృష్ణునిపై మనసు లగ్నమవుతుంది. శ్రీకృష్ణ నామ మహిమ గురించి సాక్షాత్తు శ్రీమహా విష్ణువే బ్రహ్మకు చెప్పే సందర్భం స్కందపురాణంలో ఉంది. ‘నా కృష్ణ నామోచ్ఛారణ చేయడం వల్ల నాకెంతో ప్రీతికలగుతుందంటే, ఇతర నామాలు కోటిసార్లు చేసినా నాకు అంత సంతోషం కలగదు’ అన్నాడు.
నామ స్మరణకే ప్రభావమున్నదని గ్రహించి, శ్రీకృష్ణ నామమునే సదా స్మరించి నారదాదులు ఆయన కృపకు పాత్రులయ్యారు. కనుక కలియుగంలో జీవిస్తున్న మానవులందరికీ నామ మహిమను, లోక ధర్మాలని చెప్పిన కారణంగా శ్రీకృష్ణావతారము కలియుగ ప్రజలందరికీ గొప్పది. ఆచరణానికి అనువైనది. ‘్భక్త దుఃఖ కర్షిం కృష్ణః’ అంటే భక్తుల దుఃఖాన్ని పోగొట్టేవాడు శ్రీకృష్ణుడు అని అర్ధం.
మానవ జీవితంలోని పాపాల్ని పోగొట్టుకోడానికి శాస్త్రాలలో అనేక ప్రాయశ్చితాలు చెప్పారు. చాంద్రాయణాదివ్రతాలు ఎన్నో చేయాల్సి ఉంటుంది. కానీ ఎన్ని చేసినా ఆ పాపం పోదు. కానీ శ్రీకృష్ణ నామం జపిస్తే ‘క్షోభం’ వల్ల కలిగిన పాపం కూడా నశిస్తుంది. అందుకు కారణం శ్రీకృష్ణ నామంలో క్లేశఘ్ని-పాపఘ్ని అనే బలవత్తరమైన శక్తులుండడమే నని-ఈ జగత్తులో పరమాత్ముడు ఎన్ని రూపాలతో విరాజిల్లుతున్నాడో అన్ని నామాలతో ఆయన పేర్కొనబడుతుంటాడు. కృష్ణ నామం పాపాన్ని నాశనం చేసి, పుణ్యాన్ని ఉత్పాదించి, భక్తిని తత్త్వజ్ఞానాన్ని, భగవతృప్తిని కలిగిస్తుంది. కృష్ణనామం జపం చేసేవారికి విపత్తియే సంపత్తిగా పరిణమిస్తుంది.
పురుషోత్తముడు, స్థితప్రజ్ఞుడైన శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క మహోన్నతావతారం. పదారు కళల్లో మూర్త్భీవించిన పూర్ణావతారం. జీవులు తరించుటకు ఉపనిషత్సారమైన గీతామృతాన్ని పంచిపెట్టిన ప్రేమ మూర్తి. ద్వాపర యుగంలో రోహిణీ నక్షత్ర యుక్త శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా అవతరించాడు. అష్టమియొక్క అర్ధరాత్రి సమయంలో ఆకాశమందు అర్ధ చంద్రుడు ప్రకాశించగా, పృధ్వియందు పూర్ణ చంద్రుడు ఉదయించిననట్టు శరణాగత వత్సలుడు దేవకీదేవికి జననం. శ్రీకృష్ణావతారం సంపూర్ణావతారమనీ, శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడేనని భాగవతం మనకు వెల్లడిస్తోంది. ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మకు భక్తి ప్రపుల్లాత్ములమై ప్రణమిల్లి మన జీవితాలను ధన్యం చేసుకుందాం.
-‘రసస్రవంతి’, ‘కావ్యసుధ’(sekarana from Sunday, 4 June 2017 ANDHRA BOOMI TELUGU DAILY )

భారవి

*పెద్దలను అర్ధం చేసుకోకుండా‌ అపార్ధం చేసుకోకండి!*

*చిన్న‌ సంఘటన.*

పూర్వము *భారవి అనే కవి వుండేవాడు.* ఆయన చిన్నతనం లోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు.

భారవి తండ్రితో నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు. 

ఆయన మాత్రం వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో వ్రాస్తాడులే అనేవాడు.

*భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి.*

తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు.వూర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే తనేమో ఏమున్నది యింకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడుతారు.అని చాలా సార్లు చెప్పుకున్నాడు.

 *ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి తండ్రిమీద కసి పుట్టింది, ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు.*

 ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ వుంది.

 *భారవి, ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు.*

 అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు?వాడు చాలా బాధ పడుతున్నాడు.

*వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట!*

అప్పుడు *తండ్రి నవ్వి.... పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా?తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుఃక్షీణం అంటారు. అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది, వాడి అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇంకా యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంతవాడు లేడని విర్రవీగుతాడు, దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా? అన్నాడు.*

 అదివిని భారవికి బుర్ర తిరిగి పోయింది.

 *పశ్చాత్తాపంతో రగిలి పోయాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు.*

తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదయినా శిక్ష వేయమని బ్రతిమాలుకున్నాడు.

 *పశ్చాత్తాపం తో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు? అని తండ్రి చెప్తున్నా వినకుండా తనకు శిక్ష వేయమని పట్టు బట్టాడు.*

తండ్రి సరే అలాగయితే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా ఎందుకు, ఏమిటి, ఏ కారణాలు చెప్పకుండా అక్కడ‌వుండి రా! అన్నాడు.

*ఇంత చిన్న శిక్షనా? అన్నాడు భారవి.*

తండ్రి నవ్వి అది చాల్లే వెళ్ళుఅన్నాడు.

 *భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్పటికి యింకా భారవి భార్య కాపురానికి రాలేదు.*

 సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు.‌ వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు.

 *రోజుకో పిండివంట చేసి ఆదరించారు.నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు.*

 చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.

*అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు..*

దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు.

*అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు.భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్లిపోండని యెంతో చెప్పి చూసింది.*

 భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించే వాడు.

*ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి యింక నేను మావూరికి పోయివస్తానని బయల్దేరాడు.*

 ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.

*భార్యకు, అత్తామామలకూ విషయం వివరించి నాశిక్ష పూర్తి అయింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు.*

 ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.

 *భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.*

తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు.

*చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి!*

 అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!

 *తల్లిదండ్రులను ద్వేషించకండి! అంతకంటే పాపం ఇంకోటి వుండదు.*

473వ నామము

ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః 🙏
(శ్రీ లలితా సహస్ర నామములలో 473వ నామము.)

అరసి నిన్ను చుట్టి యమృతాది షోడశ

శక్తు లొప్ప వెలుఁగు శంభురాణి!

అభయమిమ్మని "యమృతాది మహాశక్తి

సంవృతా"! యన విని శరణమిమ్ము.

అమ్మకు పాదములకు ప్రణమిల్లుచు🙏
చింతా రామకృష్ణారావు.

అక్టోబర్ నెలలో

💐అక్టోబర్ నెలలో ముఖ్యమైనవిషయాలు

💐2020అక్టోబర్ 18 నుండి 2021 జనవరి 9 వరకు వివాహ,గృహప్రవేశం,ప్రతిష్ఠ,శంకుస్థాపన,ఉపనయనం, దేవాలయ శంకుస్థాపనకు శుభముహూర్తలు ఉన్నవి.
💐2021జనవరి 10 నుండి ఎప్రియల్ నెలాఖరువరకు శుభముహూర్తాలు లేవు
💐ఈరోజునుండి డిశంబర్ వరకు
ఎలాంటి గ్రహణాలు కానీ,మూఢమి కానిలేదు
💐సెప్టెంబర్18 అధిక అశ్విజమాసము ప్రారంభం
💐అక్టోబర్ 17 శనివారం నిజ అశ్విజమాసముప్రారంభం
💐అక్టోబర్ 17 శనివారం దేవినవరాత్రులు ప్రారంభం.
💐అక్టోబర్ 17 దేవినవరాత్రుల కలశస్థాపనకు ఉదయం 8-00నుండి 9-00లోపు బాగుంది లేదా ఉదయం10-30 నుండి 11-30లోపు బాగుంది.
💐అక్టోబర్ 20 లలితా పంచమి
💐అక్టోబర్ 21 సరస్వతి పూజ
💐అక్టోబర్ 24 దుర్గాష్టమి, మహార్ణవమి
💐అక్టోబర్ 25 విజయదశమి,ఆయుధపూజ,అపరాజితాదేవిపూజ,శమీ పూజ
💐గమనిక💐
చక్రాల రాఘవేంద్రశర్మ సిద్దాంతి గారిచే దేవినవరాత్రుల వైభవం ప్రతినిత్యం💐
💐
👍రచన

దైవజ్ఞ శ్రీ చక్రాల రాఘవేంద్ర శర్మ సిద్దాంతి
కావలి
సెల్ 9110577718

ఇల్లు ... అసెంబ్లీ

🤘🏻కొత్తగా కాపురానికి వచ్చిన కోడలితో..             
అత్త: చూడమ్మా ఈ ఇల్లు అసెంబ్లీ లాంటిది.. మీ మామగారు.. ముఖ్యమంత్రి .. ఆయన విదేశీ, రక్షణ వ్యవహారాలు చూసుకుంటారు..
నేను ఉపముఖ్యమంత్రి ని.. హోమ్ శాఖ, ఆహార భద్రత శాఖ, సాంస్కృతిక శాఖ వగైరా చూసుకుంటాను..
ఇక మావాడు.. అదే మీ ఆయన .. ఉద్యోగ భద్రత శాఖ, రవాణాశాఖ చూసుకుంటాడు..
ఇక నా కూతురు...అదే నీ ఆడపడుచు.. నిర్వహణా శాఖ, క్రీడలు వగైరా చూసుకుంటుంది.. మరి నీకు ఏ శాఖలు కావాలో చెప్పు.. నీకు గృహ నిర్వహణ, ఆరోగ్య పర్యవేక్షణ శాఖ లు ఇద్దామనుకుంటున్నాం ఏమంటావ్?? వినయంగా కోడలు : అయ్యో అంత పెద్ద పెద్ద శాఖలు నిర్వహించే వయసూ అనుభవమో నాకు లేవు అత్తయ్యా.. అవి కూడా మీరే వుంచుకొని నాకు ప్రతిపక్ష నాయకురాలి హోదా ఇవ్వండి చాలు.. walkout చెయ్యడానికి ఎవరూ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి.😝😉😜🤘🏻

*శ్రీమన్నారాయణీయం** 1-5-శ్లో.



నిర్వ్యాపారో౾పి నిష్కారణమజ। భజసే యత్క్రియామీక్షణాఖ్యాం
తేనైవోదేతి లీనా ప్రకృతిరసతి కల్పా౾పి కల్పాదికాలే।
తస్యాస్సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్త్వరూపం
సత్త్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవాకుంఠ వైకుంఠ రూపం||

భావము - వైకుంఠవాసా! నీవు జన్మరహితుడవు, క్రియారహితుడవు. అయినను 'ఈక్షణము' అను సంకల్పముతో సృష్టిక్రియను స్వీకరించితివి. కల్పాదికాలమున స్ధిరరూపములేక నీ యందే ఐక్యమై యున్న ప్రకృతిని ఆవిర్భవింపచేసి నీవు శుద్ధసత్వ రూపమును ధరించితివి.

వ్యాఖ్య. ఈక్షణ యస్య సః - నిర్మలమైన ఆశ్రితులయందు దృష్టి కలవాడు స్వామి అని అర్థం.

కళ్ళు చూడాల్సిన వస్తువుని చూడకుండా ప్రవర్థిస్తున్నాయి అంటే ఉన్న కళ్ళు వ్యర్థం అన్న మాట. 'శ్రీశుక మహర్షి అంటారు పరిక్షిత్తు తో. జగత్ కారణమైన శ్రీహరిని దర్శించ చేతకాని కళ్ళు, నెమలి కళ్ళకు ఎంత ప్రయోజనమో వాడి కళ్ళకూ అంతే ప్రయోజనం. శ్రీహరి కీర్థన వినడానికి పనికిరాని చెవులు, ఎలక గొయ్యలు లేవా, వాడి చెవులకూ అంతే ప్రయోజనం. హరినామ సంకీర్తనకు పనికిరాని నాల్క ఎంత, కప్పలకు లేవా బెక బెకలాడే నాల్కలు, వాడి నాల్కకు అంతే ప్రయోజనం. వాడిని చూడ నేర్చిన కన్ను కన్ను అంటారు శ్రీశుక మహర్షి. 'కృష్ణం లోకయం లోచన ద్వయ' అంతటా నిండి ఉన్న కృష్ణుడిని చూడచేతకాకపోతే నీవుండి ఏం ప్రయోజనమే నేత్రమా! అని అంటారు కులశేఖరాళ్వార్.

వాస్తవాన్ని చూడగలిగే నేత్రాలు మనకు కావాలి, అవి బయటి నేత్రాలు కావచ్చు, లోని నేత్రాలు కావచ్చు. మనస్సుని అంతఃచక్షువు అని అంటారు. దృతరాష్ట్రుడికి అంతఃచక్షువు ప్రసాదించి తన విశ్వరూపాన్ని చూపాడు శ్రీకృష్ణ పరమాత్మ. బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులకి లభించని భాగ్యం తనకి లభించింది అని తరించాడు. పరమాత్మని చూసిన కళ్ళతో లోకాన్ని చూడలేను అని చెప్పాడు. చూసినంతసేపు తరించాడు, తరువాత యుద్దాన్ని ఆపే ప్రయత్నం చెయ్యలేదు. బయటి నేత్రాలు ఎట్లాగూ లేవు, పరమాత్మ ఇచ్చిన లోని నేత్రాలని కూడా వాడుకోలేక పోయాడు. అందుకే రామానుజాచార్య స్వామి దృతరాష్ట్రుడిని సర్వాత్మనా అంధుడు అని చెబుతాడు.     

'అంత కాలేచ మామేవ స్మరాన్ ముక్తా కలేబరం ప్రయాతి సమప్స్థానం యాతి' శరీరంలోనుండి ప్రాణం పోతుంటే చివరి క్షణంలోనైనా నన్ను తలచుకో అని స్వామి భగవద్గీతలో చెప్పాడు. ప్రాణ ప్రయాణ స్థితిలో కూడా భగవంతుడు చూస్తాడు మనల్ని.

భీష్ముడు అట్లాంటిది పొందాడు. అంపశయ్యపై పడి ఉన్న భీష్ముడి వద్దకి శ్రీకృష్ణుడు పాండవులతో వచ్చే సరికి, 'హే భగవన్! నేనెంత అదృష్టవంతుడి నయ్యా. చివరి క్షణంలో నిన్ను తలచుకోవాలి అని శాస్త్రం చెబుతుంది. దేహ బాదలతో ఎంతమంది తలచు కోగలరు. కానీ నాపాలిట నిజం అయ్యింది. స్వామీ నేను చెప్పేవరకు కదలకు' అంటూ శ్రీకృష్ణుడిని ఆదేశించగలిగాడు భీష్ముడు. పరమాత్మ భక్తులపట్ల అలా లొంగి ప్రవర్తిస్తాడు.

శ్రీకృష్ణుడు చూస్తుండగానే ఇంద్రియాలను లోనికి తీసుకున్నాడు, మనస్సును ఆత్మపరం చేసాడు, ఆత్మని పరమాత్మ వైపు ఇలా దేహాన్ని వదిలాడు. తన భక్తుల విషయంలో స్వామి అట్లా చూసుకుంటాడు. 'నామే భక్త పణాస్యతి' నా భక్తులు నాకు కనిపించకపోవుట అనేది ఎప్పుడూ లేదు అని అంటాడు స్వామి, ఎందుకంటే ఆయన 'పుష్కరాక్షః', 'పుండరీకాక్షః', 'పద్మ నిభేక్షణః'. ఇవన్నీ ఆయన నామాలు.

ఈశ్లోకంలో ఉపాసనా పరుడైన భట్టతిరి శ్రీక్రృష్ణుడిని ప్రక్రృతిని స్రృజించి పాలించే వాడిగా తెలుసుకుని "హే భగవన్!(మమ్ములను) ఎప్పటికీ చూస్తూ ఉండు. మా క్లేషాలు తొలగించు. నీలాంటి అందమైన నేత్ర సౌందర్యం నాకూ ఇవ్వు. నీలా చూడవల్సిన దాన్ని చూసేట్టు చేయి" అని కోరుతున్నాడు.

స్వస్తి.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*



🙏🙏🙏

అన్నమయ్య సంకీర్తన


!! ఓం నమో వేంకటేసాయ !!
!! ఓం నమో శ్రీనివాసాయ !!

కొండవంటి దేవుఁడు నేఁ గొలిచే దేవుఁడు వీఁడే
నిండుకున్నాఁడు తలఁచు నెమ్మదినోమనసా             // పల్లవి //

నన్నుఁ బుట్టించే దేవుఁడు నాలోనున్నాఁడు దేవుఁడు
కన్నచోటులనే వుండే కాచే దేవుఁడు
వెన్నతోఁబెంచే దేవుఁడు వివేకమిచ్చే దేవుఁడు
యెన్నని పొగడవచ్చు యీతఁడే మా దేవుఁడు        // కొండ //

సిరులిచ్చిన దేవుఁడు సేవగొనేటి దేవుఁడు
గురుఁడై బోధించి చేకొన్న దేవుఁడు
మరిగించిన దేవుఁడు మాటలాడించే దేవుఁడు
ఇరవై మాయింటనున్నాఁ డీదేవుఁడు                    // కొండ //

దాపుదండైన దేవుఁడు దరిచేర్చిన దేవుఁడు
రూపు చూపె నిదివో బోరున దేవుఁడు
శ్రీపతియైన దేవుఁడు శ్రీవేంకటాద్రి దేవుఁడు
చేపట్టి మమ్మేలినాఁడు చేచేతనే దేవుఁడు             // కొండ //

శ్రీ తాళ్లపాక అన్నమయ్య
                                   . . . స్వామి

travelling

A man was travelling in a boat with his pig.

There was also a philosopher with other passengers in that boat.

The pig had never travelled in a boat before, so it was not feeling comfortable.

It was going up and down, not letting anyone sit in peace.

The boatman was troubled by this and was concerned that the boat would sink due to the panic of the passengers.

If the pig doesn't calm down it will drown the boat.

The man was upset about the situation, but could not find any way to calm the pig.

The philosopher watched all this and decided to help.

He said: " If you allow, I can make this pig as quiet as a house cat."

The man immediately agreed.

The philosopher, with the help of two passengers, picked up the pig and threw it into the river.

The pig started to swim desperately to stay afloat.

It was now dying and struggled for its life.

After some time, the philosopher dragged the pig back into the boat.

The pig was quiet and went and sat in a corner.

The man and all passengers were surprised at the changed behaviour of the pig.

The man asked the philosopher: "At first it was jumping up and down. Now it is sitting like a pet cat. Why?"

Philosopher said: "No one realises the misfortune of another without tasting trouble. When I threw this pig into the water, it understood the power of the water and the usefulness of the boat."

Pigs that are jumping up and down in India should be thrown in Syria, Iraq or Pakistan for 6 months, then on coming to India, they will automatically become calm as a pet cat and will lie in a corner.

Dedicated to all 'Indian' pigs Abusing 'India'

Jaihind 🇮🇳

పాండవోద్యోగం-6


ఉత్పలమాల
నంద కుమార! యుద్ధమున నా రథమందు వసింపుమయ్య! మ/
ధ్యందినభానుమండల విధంబున నీదగుకల్మిఁజేసి నా/
స్యందన మొప్పుగాక! రిపు సంతతి తేజము దప్పు గాక నీ/
వెందును నా యుధ్ధమ్ము దరి
కేగమి కొప్పుదుఁగాక కేశవా!

*ప్రతిపదార్థం*
నందకుమారా= ఓ!శ్రీకృష్దా
యుద్ధమున = యుద్ధం జరిగే సమయంలో,

నా రథమందు= నాయొక్కరథములో,

వసింపుమయ్య! = ఆసీనుడవుకమ్ము.

మధ్యందిన=
మధ్యాహ్నసమయంలో
భానుమండల విధంబున= సూర్య మండలము వలె

 నీదగుకల్మిఁజేసి= నీ యొక్కచేరిక, సహాయము,వల్ల

నా స్యందనము= నా యొక్క రథము

ఒప్పు గాక= తేజోవంతమగుగాక!

రిపుసంతతి= శత్రు సమూహము యొక్క

తేజము= తేజస్సు

 తప్పుగాక= తగ్గిపోవుగాక! శక్తివిహీనులవుతారు.

  నీ వెందును
(నీవు +ఎందును) =
నీవు ఎప్పుడూ ఎక్కడా కూడా,

ఆయుధమ్ముదరికి= ఆయుధము చెంతకు,వద్దకు

ఏగమికి= వెళ్ళకుండా ఉండటానికి

ఒప్పదుగాక= అంగీకరిస్తున్నాను.

కేశవా= ఓ శ్రీకృష్ణా !

*తాత్పర్యం*
శ్రీకృష్ణ !
నీ సైన్య విభజనప్రకారమే, నేను నిన్ను కోరుకుంటున్నాను. యుద్ధసమయంలో నీవు నా రథములో ఆసీనుడవై ఉండు చాలు.
 మధ్యాహ్న కాల సూర్యమండలం వలె మీ సాయం చేత, నువ్వు నాతో కలిసి ఉండటంవల్ల,
నారథంధగధగ లాడుతూ
ప్రకాశిస్తుంది. శత్రువుల తేజస్సు
నీతేజస్సు ముందు వెలవెలబోతుంది. ప్రకాశం తగ్గిపోతుంది. *యుద్ధంలో నేను ఆయుధమును ధరించను* అన్న నీ మాటకు నేను ఒప్పుకుంటున్నాను. నీవు ఎప్పుడూ, ఎక్కడా ఆయుధము ధరించవలసిన అవసరంలేదు కృష్ణా.
.......... విశేషాంశాం....
శ్రీకృష్ణుడు రథం లో కూర్చుంటే చాలు..,,
మధ్యాహ్నపు
సమయంలో సూర్యుడునడినెత్తికి వచ్చినప్పుడు
ఆసూర్యుని మనం చూడలేము. ఆవిధంగానే
శ్రీకృష్ణుడు వచ్చితన రధంలో కూర్చుంటే, ఆ రథాన్ని శత్రువులు కనీసం తేరిపారా చూడనుకూడా
చూడలేరు.
 అంతా తేజస్సుతో ప్రకాశిస్తుంది
నా రథం.
దీనినే మధ్యందిన భానుమండల అని పోలికతెచ్చారు తిరుపతి వేంకట కవులు. . 💐🙏🏻💐

*నేను శరీరం కాదు

💚💚💚💚💚💚💚💚💚


🙏 *నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి - పత్రీజీ🙏*

*ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస*

ధ్యానమే సర్వస్వం.
ధ్యానమే యోగం.
ధ్యానమే భక్తి.
ధ్యానమే ప్రపత్తి.
ధ్యానమే ఆరోగ్యం.
ధ్యానమే మోక్షం.
ధ్యానమే ధర్మం.
ధ్యానమే అర్ధం.
ధ్యానమే భోగం.
ధ్యానమే సర్వం.
ధ్యానమే సత్యం.
ధ్యానమే శివం.
ధ్యానమే సుందరం.

♻️ధ్యానం ద్వారా ప్రకృతిలోని శక్తిని గ్రహించాలి.కళ్ళు రెండూ మూసుకుని శ్వాసతో కలిస్తే ధ్యానం. కళ్ళు రెండూ తెరుచుకుని ప్రకృతితో కలిస్తే జీవనం.

♻️మన మనస్సు ‘జీరో’ అయితే మనం ‘హీరో’లు అవుతాం. మన మనస్సు ‘హీరో’ అయితే మనం ‘జీరో’ అవుతాం.

▪సన్మతిని సాధించిన వాళ్ళే “బుద్ధుళ్ళు”.
▪‘నాది’, ‘నేను’ అంటే .. “జీవుడు”.
▪ ‘నాది’, ‘నేను’ వదిలితే .. “దేవుడు”. ఇదే “బుద్ధత్వం”.

♻️ఈ భూమి పై జీవిస్తున్న ప్రతి జీవికూడా దైవత్వంతో నిండి ఉంది.ఆ సత్యాన్ని ధ్యాన సాధన ద్వారా అనుభవానికి తెచ్చుకోవాలి.

♻️ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ‘నేను శరీరం కాదు, శాశ్వతమైన, దివ్యమైన ఆత్మచైతన్యాన్ని’ అన్న సత్యం తెలుసుకుని ఎరుకతో జీవించాలి.

💚💚💚💚💚💚💚

చెడును చూసి

*చెడును చూసి మంచి నేర్చుకో*

ఒక ఆశ్రమంలో ఒక గురువు గారి దగ్గర అనేకమంది శిష్యులు పాఠాలు నేర్చుకొంటు ఉండే వారు.

 ఒకసారి ఆ ఆశ్రమంలో దొంగతనం జరుగుతుంది.

ఆ దొంగతనం చేసిన శిష్యుడెవరో అందరికీ తెలుసు.

దీంతో వాళ్ళందరూ వెళ్ళి గురువు గారికి ఫిర్యాదు చేశారు.

అయితే విషయం అంతా విన్న గురువు గారు ఆ శిష్యుడిని ఏమీ దండించలేదు.

అలా కొన్నాళ్ళు గడిచాయి.మళ్ళీ అదే శిష్యుడు దొంగతనం చేశాడు.

ఇది తెలిసిన మిగిలిన శిష్యులంతా కోపంతో గురువు దగ్గరకు వెళ్లి... "అతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొట్టండి. లేదా మేమే ఆశ్రమాన్ని వదలిపెట్టి వెళ్లపోతాం" అని అన్నారు.

అప్పుడు గురువు గారు శిష్యులందరినీ సమావేశపరచి... "మీరంతా ఎంతో మంచి శిష్యులు. ఈ లోకంలో మంచి ఏంటో, చెడు ఏంటో తెలుసుకున్నారు. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపేసినా వేరే ఆశ్రమంలో మీకు చోటు దొరుకుతుంది. మంచి విద్య లభిస్తుంది. కానీ దొంగతనం చేసిన విద్యార్థికి మంచి, చెడులు ఇంకా ఏంటో బోధపడలేదు" అని అన్నాడు.

*ఇంకా......*

ఒక గురువుగా నేను అతడికి మంచి చెడులు ఇంకా నేర్పాల్సి ఉంది. దొంగతనం చేసిన నేరానికిగానూ నేను అతడిని ఆశ్రమం నుంచి పంపించేస్తే ఇంకెవ్వరూ మరో ఆశ్రమంలోకి తీసుకోరు. విద్య నేర్పించరు. అప్పుడు అతడు ఇంకా దారి తప్పుతాడు, చెడు మార్గంలోకి పయనిస్తాడు. అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు ...

*అంతేగాకుండా.....*

తప్పుచేసిన శిష్యుడిని సరి చేయాల్సిన బాధ్యత గురువుగా తనమీద ఉంది కాబట్టి, అతడిని నా దగ్గరే ఉంచుకుంటాను. అది మీకు ఇష్టం లేకపోతే... అతడికి కోసం మిమ్మల్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.

దొంగతనం చేసిన శిష్యుడుకి గురువుగారు చెప్పిన మాటలకు కళ్లలో నీళ్ళు గిర్రున తిరిగాయి.

తనలోని అజ్ఞానాన్ని, చెడుబుద్ధిని ఆ క్షణమే వదిలించుకున్న అతడు ప్రశ్చాత్తాపంతో గురువు ముందు మోకరిల్లాడు.

జీవితంలో ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు పని చేయనని గురువుకు ప్రమాణం చేశాడు.

గురువుకు ఇచ్చిన మాట ప్రకారం తన జీవితంలో ఆ శిష్యుడు ఎప్పుడూ తప్పు పనులు చేయలేదు.

మంచిగా విద్యాభ్యాసం ముగించుకుని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి, గురువుకు తగ్గ శిష్యుడిగా పేరుగాంచాడు.

మనలో చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలు మ మాట సరిగా వినలేదని
బాధ పడుతుంటాం. వీరి అల్లరి భరించలేకున్నాం.తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తే గాని వీడికి
బుద్ధి రాదు, ఇలాంటి మాటలు అసహనంతో మాట్లాడుతూ వుంటాం. అన్నీ సరిగా తెలిసినవాడిని మనం దగ్గరుండి చూసుకోవలసిన అవసరం లేదు.

వాడిని వాడు ఉద్ధరించుకోగలడు. అందుకు మంచి ఉదాహరణ ఆదిశంకరాచార్యులు,
రామానచార్యులవారు,
రమణ మహర్షి మొదలైనవారు.

తండ్రి పక్కన ఉండి కూడా సక్రమంగా పెంచలేక పోయాడు అనేందుకు మంచి ఉదాహరణ.దృతరాష్ట్రుడి సంతానం దుర్యోధనుడు.

మనం పిల్లలతో ఏం మాట్లాడుతూ ఉంటే వాటినే వారు అలవాటు చేసుకుంటారు. మన మాటలైనా మన ప్రవర్తన అయినా మనం చేసే పనులు అయినా ఏమైనా సరే మనల్ని పిల్లలు అనుకరిస్తూ ఉంటారు.
కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించాలి.

అందుకే గురుకులంలో ని గురువులు చదువు వచ్చే వారికంటే చదువు రాని వారి పైనే శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు.
అందుకు మంచి ఉదాహరణ
పరమానందయ్య శిష్యులు.

మన శరీరంలో కూడా కోని అనవసరంగా పెరిగేవి వున్నాయి. ముఖ్యంగా
గోర్లు, వాటిని పెంచుకోవడం
ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి వాటిని కత్తెరిస్తువుంటాం.
అలాగే మనలో కానీ మన పిల్లల్లో కానీ పెరిగే చెడు ఆలోచనలను తొలగించే ప్రయత్నం చేయాలి అంతేకానీ

జీవితంలో మరి ఎప్పుడు వెనక్కి తీసుకోలేనంతా
పెద్ద శిక్షలు మనకు మనం కానీ అలాగే మన పిల్లలకు కాని
ఎప్పుడు వెయ్యకూడదు.


ఆలోచించాలి ఆచరించాలి నేర్పించాలి అప్పుడే మనం మార్గదర్శకులు అవుతాం, కొందరు జన్మతః తెలివైన వారుగా ఉంటారు, మరికొందరు అనుభవం చేత తెలివైన వారుగాను, జ్ఞానవంతులు గాను మారుతారు. మార్పు అన్నది తద్యం, అది ఎప్పుడు సంభవిస్తుంది అని చెప్పడం కష్టం.

అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలి, వచ్చిన తరవాత చేసి చూపించాలి.బోయవాడు వాల్మీకి గా మారినట్లు,గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లు, కష్టనష్టాల్లో ఉన్న మన జీవితం కూడా అందరికీ వెలుగును, ఆనందాన్ని పంచె గొప్ప మలుపు వున్న రోజును తీసుకోనివస్తుందని ఎదురు చూద్దాం.

". *రాముడి వంశ వృక్షo

*ఈ వంశ పరంపర విన్నా చదివినా, పుణ్యం* ✡️

*1) బ్రహ్మ కొడుకు మరీచి*

*2) మరీచి కొడుకు కాశ్యపుడు.*

*3) కాశ్యపుడు కొడుకు సూర్యుడు.* 

*4) సూర్యుడు కొడుకు మనువు.* 

*5) మనువు కొడుకు ఇక్ష్వాకువు.* 

*6) ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.*

*7) కుక్షి కొడుకు వికుక్షి.*

*8) వికుక్షి కొడుకు బాణుడు.*

*9) బాణుడు కొడుకు అనరణ్యుడు.*

*10) అనరణ్యుడు కొడుకు పృధువు.* 

*11) పృధువు కొడుకు త్రిశంఖుడు.* 

*12) త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు. (లేదా యువనాశ్యుడు)*

*13) దుంధుమారుడు కొడుకు మాంధాత.*

*14) మాంధాత కొడుకు సుసంధి.* 

*15) సుసంధి కొడుకు ధృవసంధి.* 

*16) ధృవసంధి కొడుకు భరతుడు.* 

*17) భరతుడు కొడుకు అశితుడు.* 

*18) అశితుడు కొడుకు సగరుడు.* 

*19) సగరుడు కొడుకు అసమంజసుడు.*

*20) అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.*

*21) అంశుమంతుడు కొడుకు దిలీపుడు.*

*22) దిలీపుడు కొడుకు భగీరధుడు.*

*23) భగీరధుడు కొడుకు కకుత్సుడు.*

*24) కకుత్సుడు కొడుకు రఘువు.*

*25) రఘువు కొడుకు ప్రవుర్ధుడు.*

*26) ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.*

*27) శంఖనుడు కొడుకు సుదర్శనుడు.*

*28) సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.*

*29) అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.*

*30) శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.*

*31) మరువు కొడుకు ప్రశిష్యకుడు.*

*32) ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.*

*33) అంబరీశుడు కొడుకు నహుషుడు.*

*34) నహుషుడు కొడుకు యయాతి.*

*35) యయాతి కొడుకు నాభాగుడు.*

*36) నాభాగుడు కొడుకు అజుడు.*

*37) అజుడు కొడుకు ధశరథుడు.*

*38) ధశరథుడు కొడుకు రాముడు.*

*39) రాముడి కొడుకులు లవ కుశలు . .*

ఇది రాముడి వంశ వృక్షo...

🕉DR.C.KRISHNARAO

అష్టాంగాలు

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః

అష్టాంగాలు అంటే ఏమిటి.

1) "ఉరసా" అంటే తొడలు,

2) "శిరసా" అంటే తల,

3) "దృష్ట్యా" అనగా కళ్ళు,

4) "మనసా" అనగా హృదయం,

5) "వచసా" అనగా నోరు,

6) "పద్భ్యాం" అనగా పాదములు,

7) "కరాభ్యాం" అనగా చేతులు,

8) "కర్ణాభ్యాం" అంటే చెవులు.

ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.

మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి.

ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి.

1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతి నేలకు తగలాలి.

2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.

3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.

4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.

5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం. అంటే నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి.

అంటే "ఓం నమో నారాయణాయ " అని అంటూ నమస్కారం చేయాలి.

6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని శాస్త్రం చెబుతుంది.

పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చేయాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.
శ్రీ రామ శర్మ 9490944543
జై శ్రీ రామ విజయం జై శ్రీ రామ విజయం జై శ్రీ రామ విజయం

"కవి సామ్రాట్ "

*సెప్టెంబర్ 10, నేడు "కవి సామ్రాట్ " శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి*

*విశ్వనాథ సత్యనారాయణ* (1895-1976) "కవి సామ్రాట్" బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలిజ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు.

ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును.

*జీవిత విశేషాలు*

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు1895, సెప్టెంబరు 10న (మన్మథ నామ సంవత్సర భాద్రపద బహుళ షష్ఠి) కృష్ణా జిల్లా నందమూరు గ్రామం (నేటి ఉంగుటూరు మండలం)లో జన్మించాడు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. ఈయన భార్య వరలక్ష్మమ్మ. విద్యాభ్యాసము నందమూరు, ఇందుపల్లి, మరియు పెదపాడు గ్రామాల్లోను, పై చదువులు బందరు పట్టణంలోను సాగాయి. బందరు హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా లభించడం ఆయన అదృష్టం. బి.ఎ. తరువాత విశ్వనాథ బందరు హైస్కూలులోనే ఉపాధ్యాయునిగా చేరారు.

ఉద్యోగం చేస్తూనే మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. పట్టా సాధించారు. తరువాత మహాత్మా గాంధీ నడపుతున్న సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నాడు.తరువాతి కాలంలో ఈయన వివిధ కళాశాలల్లో అధ్యాపక పదవులు నిర్వహించాడు. బందరు నేషనల్ కాలేజి (1928), గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి (ఏసీ కాలేజీ) (1938 వరకు), విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.&‍ సి.వి.ఆర్. కాలేజి (1938-1959)(ఈ కళాశాల ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల గా మార్పు చెందింది), కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి (1959) మొదలైన కళాశాలల్లో ఆయన పని చేసాడు. 1957లో విశ్వనాథ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడుగానూ, 1958లో విధానమండలికి నామినేటెడ్ సభ్యుడుగానూ విధులు నిర్వర్తించారు.

1976 అక్టోబరు 18న (నల నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ దశమి) శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు పరమపదించారు.

*సాహితీ ప్రస్థానం*

1961 లో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాలుగా పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో తన సమయాన్ని సాహితీ వ్యాసాంగానికి కేటాయించాడు. 1916 లో "విశ్వేశ్వర శతకము" తో విశ్వనాథ రచనా ప్రస్థానము ప్రారంభమైనది. అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో ఆసమయంలోనే "ఆంధ్రపౌరుషము" రచించాడు. 1920నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

తరువాత విశ్వనాథ రచనా పరంపర పుంఖానుపుంఖాలుగా కొనసాగింది. మొత్తానికి 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 88 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శనా గ్రంధాలు, మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు - ఇలా తెలుగుభాషకు విశ్వనాథ వందల్లో రచనలందించాడు. ఆయన రచనలను కొన్ని ఇతర భాషలలోకి అనువదించారు. రేడియో కోసం నాటకాలు, ప్రసంగాలు రూపొందించాడు.

ప్రముఖ బెంగాలీకవి రవీంద్రనాధ టాగూరు వలె తన రచయితలను కొన్నైనా ఆంగ్లంలోకి తర్జుమా చేసుకొంటే ఆయన అంతర్జాతీయ ఖ్యాతినర్జించి ఉండేవాడని ఆయన అభిమానులు అంటుంటారు. అయితే విశ్వనాధ రచనలను విశ్లేషించే విమర్శకుడు ఆయన తాత్విక స్థాయిని అర్ధం చేసుకొంటే గాని సాధ్యం కాని విషయం

*ముఖ్య రచనలు*

విశ్వనాథ రచనల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి - ఆంధ్రపౌరుషము, రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు, విశ్వనాథ మధ్యాక్కఱలు, నన్నయ ప్రసన్నకథాకలితార్థయుక్తి వంటివి.

తెలుగు తనమన్నా, తెలుగు భాషన్నా విశ్వనాధకు ప్రత్యేక అభిమానం. ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి ఆయన మొదటి రచనలలోనివి. విశ్వనాధ రచనలలో అతని పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రిక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి.

తన రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (జ్ఞానపీఠ అవార్డు లభించినది) తనకు వ్యక్తిగతంగా ఎంతో తృప్తినిచ్చిందని చెప్పాడు. ఎందరో కవులు వ్రాసినా మళ్ళీ ఎందుకు వ్రాయాలంటే రోజూ తింటున్నామని అన్నం తినడం మానివేయడంలేదుగదా అన్నాడు.

తమిళనాడులోని మధురై ప్రాంతం నేపధ్యంలో వచ్చిన నవల "ఏకవీర"ను పుట్టపర్తి నారాయణాచార్యులు మళయాళంలోనికి, అంబటిపూటి హనుమయ్య తమిళంలోనికి అనువదించారు. ఏకవీర సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాకు సి.నారాయణరెడ్డి మాటలు, పాటలు సమకూర్చాడు. వేయిపడగలు నవలను మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు "సహస్రఫణ్" పేరుతో హిందీ లోకి అనువదించాడు.

 భారతీయ సంస్కృతి, ఆచారం, విశేషాలు, మధ్య తరగతి జీవన విధానాలు ఈ నవలలో విశేషంగా చూపబడ్డాయి. కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని పాటలు (ఆనాటి) యువతరాన్ని ఆకట్టుకొనే వ్యావహారిక భాషలో వ్రాశాడు. విశ్వనాధ నవలలలో పురాణవైర గ్రంధమాల క్రింద వచ్చిన 12 నవలలు మహాభారతానంతర పూర్వయుగ భారతదేశ చరిత్రను మరొకవిధంగా చూపుతాయి. అయితే వీటిలో

 ప్రతి నవలా ఉత్సుకతో నిండిన కధ, అనితరమైన ఆయన శైలి, విశేషమైన పాత్రలతో పాఠకులను ఆకట్టుకొంటాయి.

ఆంధ్రజాతి తన సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయనను "కవి సామ్రాట్" బిరుదుతో సత్కరించింది.
1964లో ఆంధ్రా యూనివర్సిటీ "కళాప్రపూర్ణ" తో సన్మానించింది.

1942 సంక్రాంతికి ఆయనకు గుడివాడలో "గజారోహణం" సన్మానం జరిగింది. 1956 లో షష్టి పూర్తి వేడుకలు కూడా గుడివాడలో ఘనంగా జరిగాయి.

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం డి.లిట్ పట్టాతో సన్మానించింది.
1962లో "విశ్వనాథ మధ్యాక్కఱలు" రచనకు కేంద్రసాహిత్య అకాడెమీ వారి బహుమతి లభించింది.

1970లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా గౌరవించింది.
1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం తో గౌరవించింది.జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత. 1971లో ఆయన "రామాయణ కల్పవృక్షము"నకు, జ్ఞానపీఠ పురస్కారాన్ని అందించినపుడు, సన్మాన పత్రంలో ఇలా వ్రాయబడింది

*రచనల జాబితా*

నవలా సాహిత్యం వేయిపడగలు
స్వర్గానికి నిచ్చెనలు
చెలియలికట్ట
ఏకవీర
తెఱచిరాజు
మాబాబు
జేబుదొంగలు
వీరవల్లడు
వల్లభమంత్రి
విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
పులుల సత్యాగ్రహము
దేవతల యుద్ధము
పునర్జన్మ
పరీక్ష
నందిగ్రామరాజ్యం
బాణావతి
అంతరాత్మ
గంగూలీ ప్రేమకధ
ఆఱునదులు
చందవోలు రాణి ప్రళయనాధుడు
హాహాహూహూ
మ్రోయు తుమ్మెద
సముద్రపు దిబ్బ
దమయంతీ స్వయంవరము
నీల పెండ్లి
శార్వరి నుండి శార్వరి దాక
కుణాలుని శాపము
ధర్మచక్రము
కడిమిచెట్టు
వీరపూజ
స్నేహఫలము
బద్దన్న సేనాని
దిండు క్రింది పోకచెక్క
చిట్లీచిట్లని గాజులు
సౌదామిని
లలితాపట్టణపు రాణి
దంతపు దువ్వెన
దూతమేఘము
కవలలు
యశోవతి పాతిపెట్టిన నాణెములు
సంజీవకరణి
మిహిరకులుడు
భ్రమరవాసిని
పురాణవైర గ్రంథమాల (పన్నెండు నవలలు)
భగవంతునిమీది పగ
నాస్తిక ధూమము
ధూమమరేఖ
నందో రాజా భవిష్యతి
చంద్రగుప్తుని స్వప్నము
అశ్వమేధము
అమృతవల్లి
పులిమ్రుగ్గు
నాగసేనుడు
హెలీనా
వేదవతి
నివేదిత
నేపాళరాజ చరిత్ర (ఆరు నవలలు - దిన్డు క్రిన్ది పోకఛెక్క, ఛిట్లి ఛిట్లని గాజులు, సౌదామిని, లలిత పట్ట్ణపు రాణి, దూతమేఘము)
కాశ్మీర రాజ చరిత్ర (ఆరు నవలలు - కవలలు, యశొవతి, పాతిపెట్టిన నాణీములు, సన్జీవ కరణి, మిహిర కులుడు, భ్రమర వాసిని)

*పద్య కావ్యాలు*

శ్రీమద్రామాయణ కల్పవృక్షము(6 కాండములు)
ఆంధ్రప్రశస్తి
ఆంధ్రపౌరుషము
విశ్వనాథ మధ్యాక్కఱలు
ఋతు సంహారము
శ్రీకుమారాభ్యుదయము
గిరికుమారుని ప్రేమగీతాలు
గోపాలోదాహరణము
గోపికాగీతలు
భ్రమరగీతలు ఝాన్సీరాణి
ప్రద్యుమ్నోదయము
రురుచరిత్రము
మాస్వామి
వరలక్ష్మీ త్రిశతి
దేవీ త్రిశతి (సంస్కృతం)
విశ్వనాథ పంచశతి
వేణీభంగము
శశిదూతము
శృంగారవీధి శ్రీకృష్ణ సంగీతము
నా రాముడు
శివార్పణము
ధర్మపత్ని
భ్రష్టయోగి (ఖండకావ్యము)
కేదారగౌళ (ఖండకావ్యము)
గోలోకవాసి
దమయంతీస్వయంవరం

*నాటకములు*
అమృతశర్మిష్ఠమ్ (సంస్కృతం)
గుప్తపాశుపతమ్ (సంస్కృతం)
గుప్తపాశుపతము
అంతా నాటకమే
అనార్కలీ కావ్యవేద హరిశ్చంద్ర
తల్లిలేని పిల్ల
త్రిశూలము
నర్తనశాల
ప్రవాహం లోపల - బయట
వేనరాజు
అశోకవనము
శివాజి - రోషనార
ధన్యకైలాసము

*నాటికల సంపుటి (16 నాటికలు)విమర్శలు*

అల్లసానివారి అల్లిక జిగిబిగి
ఒకనాడు నాచన సోమన్న
కావ్య పరీమళము
కావ్యానందము నన్నయగారి ప్రసన్న కథాకలితార్ధయుక్తి
విశ్వనాధ సాహిత్యోపన్యాసములు
శాకుంతలము యొక్క అభిజ్ఞానత
సాహిత్య సురభి నీతిగీత
సీతాయాశ్చరితమ్ మహత్
కల్పవృక్ష రహస్యములు
సాహితీ మీమాంస.

*ఇతరములు*
కిన్నెరసాని పాటలు
కోకిలమ్మ పెండ్లి
పాము పాట చిన్న కథలు
ఆత్మ కథ
విశ్వనాధ శారద (3 భాగాలు) యతిగీతము

*సేకరణ వికీ బుక్స్ నుండి*

సౌందర్య లహరి శ్లోకము - 5

*దశిక రాము**

సౌందర్య లహరి శ్లోకము - 5

( **శ్రీ శంకర భగవత్పాద విరచితము** )

(శ్రీ లలితాంబికాయైనమః)

**హరిస్త్వామారాధ్య**
**ప్రణతజనసౌభాగ్యజననీం**

**పురా నారీ భూత్వా**

**పురరిపుమపి క్షోభమనయత్।**

**స్మరోఽపి త్వాం నత్వా**

**రతినయనలేహ్యేన వపుషా**

**మునీనామప్యన్తః**

**ప్రభవతి హి మోహాయ మహతామ్** ॥ 5॥

అమ్మా! భక్తజనకల్పవల్లివగు నిన్ను ఆరాధించి, హరి పూర్వం స్త్రీ గా మారి త్రిపురాసురసంహారి అగు పరమేశ్వరునే కలతనొందించినాడు. మన్మధుడునూ నీకు నమస్కరించి రతీదేవి కన్నులకుమాత్రము అగపడు శరీరముతో మునులను సైతము మహామోహావేశులుగా చేయుచున్నాడు.

జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను సైతము కామముతో కలతనొందింపచేసిన శక్తిగలదిగా అమ్మవారు స్తుతించబడుతున్నది. మనకు ’కామమునకు వశమవడము’ అనేది కూడా అనుగ్రహమా ? అనే సందేహము కలుగవచ్చు.
భగవంతుడు మనపై కరుణకురిపించాలన్నా, మనము భగవంతుడికి శరణాగతి చేయాలన్నా, పుట్టుక, కష్టాలు అనేవి ఉండాలి.

బాధలూ, కష్టాలూ లేనప్పుడు మనం భగవంతుని స్మరిస్తామా ? (స్మరించము కదా) కష్టాలు ఎలా కలుగుతాయి ? కామక్రోధాలు మనలను పట్టి పీడించినప్పుడు. ఆ యాతన అనుభవించునప్పుడు మనం భగవంతుడిని స్మరిస్తాము, ప్రార్థిస్తాము. ఇలాంటప్పుడు, కామక్రోధాలు, ఈ జగత్సృష్టి అన్నీ అనుగ్రహమే అని గుర్తిస్తాము.

మరో జన్మలేకుండా ఉండాలని బాధపడటం మంచిదే. కానీ ఇంకా అనుభవించవలసిన కర్మ గుట్టలు గుట్టలుగా మిగిలి ఉన్నవాళ్ళు జన్మ వద్దనవచ్చునా ? ఆ కర్మ అనుభవించటానికి జన్మనెత్తవలసిందే, ధార్మికజీవనం గడపవలసిందే. కామమే లేకపోతే మనుష్యులు పుట్టి తమ కర్మభారం తగ్గించుకోవడమెలా ? మరలా జన్మనెత్తి, కర్మలను నాశనంచేసుకోవడం అనే అవకాశాన్ని వినియోగించుకోకుండా మరింత పాపం మూటగట్టుకుంటే అది ఎవరి తప్పు ? పుట్టుక అనునది మరుజన్మ లేకుండా చేసుకోవటానికి ఒక అవకాశం. ఈ నిజాన్ని గుర్తెరిగి మనం ప్రవర్తించాలి.

మరి జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను కలతనొందించటం ఎందుకు ? దానికి మనం అమ్మవారిని ఎందుకు స్తుతిస్తున్నాము ? వారు కలతనొందటముతో కథముగియలేదు. వారు మరలా పరిశుద్ధులయ్యారు. వారు ఒకానొక సమయములో కామమునకు వశపడినారంటే అది జగత్కళ్యాణము కొరకు. ’హరి, హరుల పుత్రునితో మాత్రమే మరణము’ అనే వరమున్న రాక్షసుని చంపుటకు అయ్యప్ప అవతరించాడు. వ్యాసులవారు ఘృతాచికి ఆకర్షింపబడకపోతే నైష్టిక బ్రహ్మచారి అయిన శుకమహర్షి ఉండేవారుకాదు.

నాణెమునకు రెండు పార్శ్వాలు ఉంటాయి. ఋషులను సైతం కామమోహితులుగా చేయగల శక్తి మన్మథుడికి అమ్మవారు ఇవ్వటము, నాణెమునకు ఒకవైపు. కొంతమందివైపు మన్మథుడిని వెళ్ళకుండా చేయటం నాణెమునకు రెండవవైపు. మన్మథుడు అమ్మవారికి సేవకుడు. మనంతటమనం కామమును జయించలేము. అమ్మవారి ఆజ్ఞతోనే అది సాధ్యమవుతుంది. మన్మథుని మనకు దూరంగా ఆమె ఉంచగలదు.

శంకరులు ఈ శ్లోకంలో అంతర్లీనంగా అమ్మవారి అనుగ్రహంతో మనం కామమును జయించగలమని ఉపదేశిస్తున్నారు.

🙏🙏🙏

**ధర్మము - సంస్కృతి**
🙏🙏🙏
https://chat.whatsapp.com/EYVSW5i6Q1O1973h8txkPS

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**

**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏

*ధార్మికగీత - 9*


                                        *****
               *శ్లో:- వర మేకో గుణీ పుత్రః* !
                      *న చ మూర్ఖ శతాన్యపి* ౹
                      *ఏకః చంద్ర స్తమో హన్తి* ౹
                      *న చ తారా గణో౽పి చ* ౹౹

ఒక్కడు జాలు యాత్మజుడు 
           నొప్పియు చక్కని సద్గుణంబులన్ ,
లెక్కకు వంద మూర్ఖ సుతు
           లేర్పడ నుండిన లాభ మేమగున్
చక్కని వెన్నెలిచ్చు నొక
           చంద్రుడు చాలు తమస్సు బాపగన్
రిక్క లనంత ముండినను
             రేయి తమంబును బార దోలునే !

గోపాలుని మధుసూదన రావు