18, జులై 2020, శనివారం

విచిత్ర వినాయక దేవాలయము..

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే శ్రీ మహాదేవర్ అతిశయ (తెలుగులో అనూహ్యమైన) వినాయగర్ ఆలయం. 

ఈ ఆలయంలోని మూలవిరాట్టైన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. 

ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. 

దక్షిణాయన కాలం(జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. 

ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం.

అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. 

ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. 

కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది.

వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., 

వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. 

అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. 

సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. 

కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. 

అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వధా

అద్వైతతత్త్వము

భగవానుడు భారతయుద్ధంలో పార్థసారథియై అర్జునుని రథం తోలాడు. అర్జునుడు దయార్ద్రచిత్తుడై శోకగ్రస్తుడు కాగా భగవంతు డతణ్ణి ఈ చందంగా మందలించాడు.

క్లైబ్యం మాస్మ గమః పార్థ నై తత్త్వయ్యుపపద్యతే,
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్యోత్తిష్ఠ పరంతప.

పరంతప్సశత్రువులకు మంటెత్తించే శక్తిగల ఓ అర్జునా! క్లైబ్యం మాస్మ గమ్సఃమగటిమిని కోలుపోకు. గుండెలు జారిపోనీకు. కయ్యం పోవడానికి సిద్ధపడే వచ్చావ్. ఇపుడు వెనుదీయడ మెందుకు?

'యుద్ధం పాపం, కయ్యానికి నడుంకట్టిన నా గురువులు పెద్దలు అన్నలుతమ్ములు వీరి నందరిని నే నెట్లా చంపేది? కనుక యుద్ధం చేయను' అని అతడు దుఃఖముచేత వికలుడై రథమ్మీద కూలబడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పయిని చెప్పినట్టులుగా మందలించాడు.

ఇంకా ఈ రీతిగా బోధింపడానికి పూనుకొన్నాడు. నీవు భీష్ము డనిన్నీ ద్రోణు డనిన్నీ కర్ణు డనిన్నీ ఎవరిని అంటావో వారొకనా డుంటే మర్నాడు పోయేవారే. శరీరాలకు భీష్ముడు ద్రోణుడు అనే పేరు లేదు. ఆత్మ ఖండింపబడదు. అగ్ని ఆత్మను కాల్పలేదు, 'పావకః ఏనం న దహతి' నీరు దీనిని తడపలేదు, 'ఆపః ఏనం న క్లేదయంతి.' గాలి దానిని ఎండిపోయేట్లు శోషించేట్లు చేయలేదు. ''మారుతః న శోషయతి''

అచ్చేద్యోయమదాహ్యూయ మక్లేద్యోశోష్యేవ చ,
నిత్య స్సర్వగతఃస్థాణు రచలోయం సనాతనః.

దీనిని ఖండింపనూ మండింపనూ ఎండింపనూ తడిముద్దగాచేసి పారేయనూ వీలుకాదు. ఇది శాశ్వతమైనది. పాము కూసాన్ని వదిలిపెటుతుంది. ఇంకో కూసం వస్తుంది. ఆలాగే ఒక శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది. పోయేది శరీరమే. ఆత్మమాత్రం నిత్యం. ఆత్మ అనేది భీష్ముడు ద్రోణుడు అని నీవు చెప్పేవారి శరీరంలో ఉండి తెలిసికొనే చైతన్యమే. పోయేది వచ్చేది దేహమే. దేహం పోతే యేం? ఇంకో దేహం వస్తుంది. విదేహస్థితిలో ఉండేది ఆనందమే. అదిలేక ఆత్మ, 'అయం నిత్యః సర్వగతః స్థాణుః అచలః సనాతనః' అతడు నిత్యుడు, అనగా మూడు కాలాలలోనూ ఉండేవాడు. సర్వగత్సఃఎక్కడబడితే అక్కడ ఉండే వ్యాపకుడు. స్థాణ్సుఃస్థిరమయినవాడు, నిలుకడ అయినవాడు. అచల్సఃచలనము లేక కదలు లేనివాడు. సనాతన్సఃఎల్లయపుడును ఉండెడివాడు. అందుచేత ఈ భీష్మద్రోణాదులు నీ బాణాదులచే చచ్చిపోతారని అనుకొని గడబిడ పడకు. అని శ్రీకృష్ణుడు అర్జునునికి జ్ఞానోపదేశం చేశాడు.

అర్జునుని ప్రశ్న ఏమిటి? పూజింపదగిన భీష్మద్రోణాదులను నేను బాణాలచే ఎట్లా బాధిస్తాను? అన్నలూ బావమరదులూ ఆచార్యులున్నూ కదా నాకు శత్రువులు. వారిని చంపి జయము పొందితే కలిగే లాభం ఏమిటి? రాజ్యం ఒకటేకదా? కావలసినవారు చుట్టపక్కాలు గురువులు గురుపుత్రులు ఇందరూ చచ్చిపోతేగాని రానిరాజ్యం వస్తేనేం పోతేనేం? గురువులను చంపకుండా బిచ్చమెత్తి అయినా పొట్ట పూడ్చుకోవచ్చును. కాని 'నెత్తురుతో తడిపిన అర్థకామాదులను అనుభవించడం ఎట్లా? అని అర్జునుడు తన మనసులోని వ్యథను వెళ్ళబెట్టాడు. 'నెత్తుట తడిసిన' కూడు అంటానికి ఆంగ్లంలో 'బ్టడ్ స్టెయిన్ డ్' అని అంటారు. అర్జునుడు 'దేహమే ఆత్మ' అని అనుకొని ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు తగినచందంగా ప్రత్యుత్తరం చెప్పదలచి-ఓయీ! నీవు ద్రోణుడూ భీష్ముడూ అనేది వారి దేహాలనా లేక వారి ఆత్మలనా? శరీరం నాశనంకావచ్చు, పుట్టిన వస్తువేనాడో గిట్టవలసిందే. ఏదయినా విత్తునాటితే ఈనాడు మొలకెత్తి పెరిగి ఏనాడో మళ్ళా గిట్టవలసినదే. మనం చూస్తూండగానే ఎండి పడిపోతుంది. అలాగే శరీరం కూడా పడిపోతుంది. లోపల ఉండే ఆత్మ అవినాశి. దానికి చావు పుట్టుకలులేవు.

అవినాశి తు తద్విద్ధియేన సర్వమిదం తతమ్,
వినాశ మవ్యయస్యాస్య నకశ్చిత్కర్తు మర్హతి.
- గీత. 2-17

ఏ వస్తు వీ ప్రపంచ మంతా నిండి ఉందో ఆ వస్తువు నాశరహితమయిన దని తెలిసికో. మార్పు లేని వస్తువును నాశనం చేయడ మనేది కాని పని. దేనిచేత ఈ ప్రపంచమంతా నిండి తొణికిసలాడుతూందో దానికి నాశమనే మాటలేదు.

ఏ వస్తువు లోకమంతా నిండి ఉంది అని అంటే అంతటికీ అంతర్యామియైన వస్తు వీశ్వరుడే అని చెప్పవలసి వస్తుంది. ఆతడే నాశం లేనివాడు నిత్యుడు చావుపుట్టులు లేనివాడు. శరీరం లోపలా వెలుపలాఉండే దతడే. అతడే లోపల ఉండి 'నేను నేను' అని తోచే అహంభావంతో కూడియున్న వాడు. ఆయన తప్ప వేరే వస్తువు మరిలేదు. సర్వగతమయిన అట్టి వస్తువుకు నాశంలేదు. అందుచేత వారినీ వీరినీ నాశనం చేస్తున్నానే అనే సందేహం అక్కరలేదు. వీరి ఆత్మ అవినాశి. నశించేది దేహమే. ఆత్మ అన్ని శరీరాలలోనూ ఉండే వస్తువే. అదే యీ భీష్మ ద్రోణాదుల శరీరంలోనూ ఉంది. నీవు చంపేది వారి దేహాలను. వారి ఆత్మలను నీవు నాశనం చేయలేవు' ఈతత్త్వం నీవు తెలిసికో అని భగవానుడు అర్జునుడు ఉపదేశం చేశారు.

ఒక స్విచ్ నొక్కితే అన్ని దీపాలూ వెలుగుతై. ఆ దీపాలు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి' వీనికన్నిటికీ మూలమయిన శక్తి ఒక్కటి. ఒక దీపం పగిలిపోయినంతమాత్రాన మూలశక్తి మాయమవుతుందని ఎవరయినీ అనగలరా? ఇట్లే జ్ఞానమయంగా అన్ని చోటులా అఖండంగా వ్యాపించియున్న శక్తి శరీరాలనుండి బుద్ధిరూపంగా వ్యాపించి వుంది. మహామతుల ఆత్మ మహాత్మగా అల్పమతుల ఆత్మ అల్పాత్మగా అవుతూంది. అట్టి వస్తువు నీచే ఎట్లా చంపబడుతుంది. నేను చంపుతాను అని అనుకోవడము తప్పే. కనుక నీ ధర్మం చెయ్.

దేహినో స్మిన్ యథా దేహే కౌమారం ¸°వనం జరా,
తథా దేహాంతర ప్రాప్తిః ధీర స్తత్ర న ముహ్యతి.
- గీత. 2-13

జీవుడు వేరువేరుగా అన్ని శరీరాలలోనూ ఉన్నాడు. అంతటా వ్యాపకంగా ఏకశరీరంగా లేకపోయినా అనేక భేదాలుగా ఉన్న శరీరాలలో ఉన్నా, ఈ శరీరంలో కౌమారమూ ¸°వనమూ వార్ధకమూ అనే మార్పులు కలగడం లేదా? అలాగే చచ్చి మరొక శరీరం పొందడము గూడా ఒక మార్పే, శరీరం నశించినప్పుడు తాను నశించడం లేదని తెలిసికొన్న జ్ఞాని ఇదంతా చూచి భ్రమపొందడంలేదు.

జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ,
తస్మా దపరిహార్యేర్ధే న త్వం శోచితు మర్హసి.
- గీత. 2-27

పుట్టినవాడు గిట్టటం నిక్కం. అలాగే చచ్చినవాడున్నూ పుట్టటమున్నూ నిక్కమే. కనుక తప్పించుకోరాని విషయం పట్ల మనకు శోకం ఎందుకు? ఏ కారణంవల్ల నయినానేమి ఎన్నడూ వీరందరూ చచ్చిపోవలసినవారే, అందుచేత వారి కొరకు నీవు నీధర్మం ఎందుకు పోగొట్టుకోవాలి! అలాఐతే నీకు ధర్మచ్యుతి కలుగుతుంది. ధర్మయుద్ధానికి మించిందేదీ లేదు. నీవు చంపబడతావా వీరస్వర్గం సంపాదిస్తావు-'హతో వా స్వర్గం ప్రాప్యసి', జయం పొందుతావా రాజ్యమేలుతావ్. 'జిత్వా వాభోక్ష్యసే మహీమ్'. ఎట్లా అయినా శ్రేయమే. ఇట్లా కాక యుద్ధవిముఖుడవయితే ధర్మం నెరవేర్పలేక ధైర్యం చాలక పారిపోయాడనే వాదు నీ వెంటనే ఉంటుంది.

అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయామ్,
సంభావితస్య చాకీర్తిర్మరణా దతిరిచ్యతే.
- గీత. 2-34

అదియుగాక జను లందరూ నీ అపకీర్తిని చాలాకాలం ఘోషిస్తూనే ఉంటారు. ఎన్నిక అయినవానికి అపకీర్తి చావుకంటె ఎక్కువ శోకం కలిగిస్తుంది. పోనీ నీవు యుద్ధం చేయక పరుగెత్తిపోతే వీరి శరీరాలు శాశ్వతాలా? అట్టిది లేదే! కనుక శరీరాలనుగూర్చి నీవు చింతపడక కయ్యానికి నడుంకట్టు. శ్రీకృష్ణభగవాను లిట్లా-''తస్మాద్యుధ్యస్వ భారత'' కనుక యుద్ధం చెయ్! అని ముగించారు.

భగవంతు డొకపుడు అద్వైతసరళిలో మాటాడతారు. మరొకవుడు మీమాంసకుల రీతిగా చర్చ చేస్తారు. ఇట్లా ఇన్ని విధాలుగా చర్చ చేస్తే మనం దేన్ని పట్టుకోవాలి? వారే ఇలా ఇంకో శ్లోకం చెప్పారు -

యావా నర్థ ఉదపానే సర్వత స్సంప్ణుతోదకే,
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః

ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అని పరిశీలిస్తే మొదట మొదట మనకు ఏ అర్థమూ గోచరించదు. ఉదపాన మంటే తాగే నీరు. బావులలో గుంటలలో చెరువులలో మనకు తాగేనీళ్లు దొరకుతయ్. వీనివల్ల మనకు ఏప్రయోజనం కలుగుతుందో నీటి వెల్లువలు వచ్చినా ఆ ప్రయోజనమే కలుగుతుంది. మంచి బ్రాహ్మడికి ఎరుకవల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో అన్ని వేదాలవల్ల అంతే ప్రయోజనం కలుగుతుంది.

ఆదిశంకరు లవతరించి దిగ్విజయం చేసే కాలంలో శాంతమూ ఆనందమూ కలిగించే నిజతత్త్వం ఇలా అందరీకీ ఉపదేశించారు-'ఆత్మకంటె వేరయిన వస్తు వేదీ లేదు. ఆత్మకు భిన్నంగా ఇంకో వస్తువు ఉన్న దనే మిథ్యాజ్ఞానమే దుఃఖానికి కారణం. నేను వేరు ఆత్మ వేరు అనే తలపే అజ్ఞానం' అని.

వారి పరంపరనుండి వచ్చిన సదాశివబ్రహ్మేంద్రసరస్వతి ఆచార్యులవారు చెప్పిన అద్వైతతత్త్వమనే-'సర్వంబ్రహ్మమయ మ్మనిచెప్పారు. ''చూచే వస్తువు చూడబడే వస్తువూ'' ఈ రెండూ ఒకటే అని శంకరులు దిగ్విజయం చేశారు. శంకరులు కాశిలో ఉపదేశం చేస్తున్న కాలంలో వ్యాస భగవానులే ముసలివేషంలో వచ్చి వాదించి శంకరులవారి కీర్తిని నలుగురికీ తెలిసేటటులు చేశారని ఒక కథ. శంకరులను శంకరుల అవతార మనే చెపుతారు. ఆ రీతిగానే వ్యాసాచార్యులవారు మహావిష్ణువనియే ప్రతీతి - ''శంకర శ్శంకర స్సాక్షాత్.'' - 'వ్యాసాయ విష్ణురూపాయ'.

శంకరులు విద్యాభ్యాసకాలంలో శాస్త్రాల నన్నింటినీ ఎంత సూక్ష్మంగా విచారించారో ఆ సంగతి శంకరదిగ్విజయంలోని ఈ దిగువ ఉదాహరించిన శ్లోకం చెపుతుంది.

అన్వీక్షిక్త్యెక్షి తంత్రే
పరిచిత రతులా కాపిలే కాపి లేభే.
పీతం పాతంజలాంభః
పరమపి విదితం భాట్టఘట్టార్ధతత్త్వమ్.
యత్తైః సౌఖ్యం తదస్యాం
త రభవ దమలాద్వైతవిద్యానుఖేస్మిన్
కూపే యోర్థ స్ప తీ ర్థే
సుపయసి వితతే హంతనాంతర్భవేత్కిమ్?

అన్వీక్షికి అంటే దండనీతి. 'రాజు ఎట్లా పరిపాలించాలి' అనే యీలాటి విషయాలను చర్చ చేసే శాస్త్రం.

'అన్వీక్షికీ ఐక్షి' శంకరులవారు ఈ శాస్త్రం చూచినంత మాత్రాన తెలిసికొన్నారు. లోకమంతా ఆయనకడకు వచ్చి అణగిందని వారికి కలిగిన దండనీతిప్రావీణ్యం దీనివల్ల అవగతం అవుతుంది.

'తంత్రే పరిచితి రతులా కాపిలే కాపి లేభ్సేఅదేరీతిగా వారికి సాంఖ్యాది శాస్త్రాలలోనూ పరిచయం చాలా ఎక్కువ. మహాభాష్యంకూడా వారికి మంచినీళ్ళ ప్రాయం.'
పీతం పాతంజలాంభః. (మహాభాష్యము పాతంజలమే యోగదర్శనమూ పాతంజలమే.)

'పర మపి విదితం భాట్ట ఘట్టార్థతత్త్వమ్స్‌మీమాంసాశాస్త్రమంతా వారి కాకళింపు.

'యత్తైస్సౌఖ్యం తద స్యాంత రభవ దమలాద్వైత విద్యాసంఖేస్మిన్' చాలా ఏండ్లు శ్రమ చేసినా లభ్యం కాని శాస్త్రజ్ఞానం శంకరులకు సులభంగా లభించింది. అమలమయిన దద్వైతం. ఇన్ని శాస్త్రాలూ తత్త్వాలూ తెలిసికోవడంవల్ల కలిగే ఆనందమే. అద్వైతతత్త్వంద్వారా ఏర్పడే ఆనందసాగరంలో మునుకలు 'కూపే యో2ర్థః సతీర్థే సుపయసి వితతే హంత నావిర్భవేత్విమ్?' - ఒక బావివల్ల కలిగే ప్రయోజనం కావేరీజలంచేత కలగ దని చెప్పగలమా? బావి నీరూ దప్పి పోగొటుతుంది. అమృతంవంటి సెలయేటి నీరూ దప్పి పోగొటుతుంది. చిన్న బావివల్ల ఏ పనులు జరుగుతవో ప్రవాహజలంవల్ల అధిక తరంగా జరుగుతై. ఆ మహానదిలో ఈ చిన్న చిన్న వస్తువుల ప్రయోజనమంతా అణగిఉంది. నదులులేని ఊళ్ళలో బావులఉపయోగంమిక్కుటం. నదులు పారే తావులలో బావులు తవ్వేవారెవ రుంటారు? ఆలాగే సమస్తవస్తువులవల్ల కలిగే ఆనందం అమలమైన అద్వైతంలో ఇమిడిఉంది. పయి నుదాహరించిన శ్లోకం చదివి
ఈయావా నర్ధ ఉదపానే తావత స్సంప్లుతోదకే,
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజాసతః.

అనే గీతాశ్లోకం చదివితే సులభంగా అర్థం తెలుస్తుంది.

సాంఖ్య యోగం కర్మానుష్ఠానం మొదలయిన వాని వల్ల కలిగే ఫలితా లన్నీ అద్వైతజ్ఞానంవల్ల కలుగుతై.
బ్రాహ్మణుడు అంటే వేదం తెలిసికొన్నవాడు. వేదానికి కూడా బ్రహ్మమని పేరు. వేదాధ్యయనం చేసిన వాణ్ణి బ్రాహ్మణు డని సాధారణంగా అన్నా ఉపనిషత్తుల రీత్యా సాక్షాద్ బ్రహ్మస్వరూపం ఎల్లెడలా చూచి అనుభవంలోకి తెచ్చుకొన్నవానికే బ్రహ్మణు డని పేరు. ఇట్టి అఖండ బ్రహ్మాకారవృత్తితో ఉండేవానికి వేదాలవల్ల ఏమి ప్రమోజనం? ఖండఖండాలుగా ఇవన్నీ ఉన్నా కడపటి ఇవన్నీ బ్రహ్మజ్ఞానంలో కలిసిపోయేవే.

ఈలాగే శరీరం వస్తుంది. పోతుంది. ఆత్మ అవినాశి. ఇది అచలం. సనాతనం. పుట్టిన వస్తువెల్లా ఏనాడో ఓనాడు గిట్టవలసినవే. అందుచేత నశ్వరాలైన భీష్మద్రోణాదుల శరీరాలనే భీష్మద్రోణాదులనుకొనివారితో యుద్ధం చేయను అని అనడం అవివేకం. అందుచేత నీవు కలతపడక నీ ధర్మం నీవు నిర్వర్తించు! అని భగవంతుడు అర్జునునకు బోధచేస్తాడు. అంబికాకటాక్షంవల్ల మూకకవికిన్నీ ఇట్టి జ్ఞానం కలిగింది.

శివ శివ పశ్యంతి సమం
శ్రీ కామాక్షీ కటాక్షితాః పురుషా,
విపినం భువనం మిత్ర మమిత్రం
లోష్ఠం చ యువతి బింబోష్ఠమ్.

ఇటులు ఆ మూగవాని నోటినుండి వచ్చింది. 'పండితా స్సర్వత్ర సమదర్శనః' సమ మంటే ఇక్కడ సమత్వంకాదు. ఏకత్వం అని అర్థం. వివిధాలయిన రూపాలలో ఏకత్వం చూడడం సమదృష్టి కలవానికే సాధ్యం.

సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరమ్.
న హిన స్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్.
- గీత. 13-28

అంతటా సమానంగాఉండే ఈశ్వరుని చూస్తున్న వ్యక్తి తన్ను తాను హింసించుకోడు. అట్టివాడే సమదృష్టి కలవాడు.

చక్కెరతో ఎన్నో రకాల బొమ్మలను తయారుచేస్తారు. అవి అనేక ఆకారాలతో ఉన్నా అన్నీ చక్కెర-తయారీవే. చక్కెరకు తీపితప్ప వేరే రుచి ఏముంది? ఆలాగే అన్ని వస్తువులలోనూ ఉన్న పరమాత్మను చూచే వానికి ఆనందం తప్ప వేరే ఏముంది?

ఈ సమ్యగ్ దర్శనం కలుగవలెనంటే అంబికా కాటాక్షం-అమ్మ అనుగ్రహం ఉండాలి. ఆమెను మన మేమీ తిరిపె మెత్తకుండా వుంటే ఆమెయే తనకు తానుగా కటాక్షిస్తుంది. జ్ఞానాగ్ని ఏమాలిన్యాన్నయినా భస్మం చేస్తుంది. ఏ వస్తువు చూచినా సరే దానిలో పరమాత్మరూపం చూచేవానికి దుంఖమూలేదు, వినాశమూలేదు. అతనిలో అన్ని తత్త్వాలూ అడగిపోతై. ఆస్థితి శ్రీకామాక్షీకటాక్షమే.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి  ........కంచిపరమాచార్యవైభవం....

శ్రీ వామన మహా పురాణం - 18 వ అధ్యాయం

బ్రహ్మర్షే ! ఆశ్వయుజ మాసంలో జగన్నాధుని నాభి నుండి పద్మం పుట్టంగానే యితర దేవతలు నుంచి కూడా ఆయా పుష్పాదులుధ్భవించాయి. కామదేవుని కరాగ్రాన్నుంచి సుందరమైన కదంబం పుట్టింది. ఆమన కాపుష్పమంటే ఎంతో ప్రీతి. యక్షేశ్వరుడైన మణిభద్రు నుంచి వటవృక్షం పుట్టింది; ఆయనకా వృక్షమంటే ఎంతో ప్రేమ, పరమ శివుడు తన హృదయాన్నుంచి ఉద్భవించిన ఉమ్మెత్తను ఎప్పుడూ ప్రేమిస్తాడు. బ్రహ్మ శరీర మధ్య భాగాన్నుంచి అవతరించిన మరకతవర్ణపు ఖదిరవృక్షాన్ని విశ్వకర్మనుంచి పుట్టిన కంటకీవృక్షాన్ని ఆయాదేవతలు ప్రేమిస్తారు. పార్వతి ఆరచేతి నుంచి కుంద (మల్లె) పొద, గణాధిపుని చెంపల నుండి సింధువారకం, యముని దక్షిన పార్శ్వం నుండి పాలాశం, దక్షిణోత్తరాలనుండి నల్లమేడి, రుద్రునిదేహంనుండి క్షోభం కలిగించే వృషవిటపం కుమారస్వామినుండి బంధుజీవనం, సూర్యునినుండి ఆశ్వత్థ (రావి) చెట్టు, కాత్యాయనివల్ల జమ్మిచెట్టు, మహాలక్ష్మి చేతినుండి బిల్వ (మారేడు) వృక్షం ఉద్భవించాయి. నాగుల అధిపతినుంచి రెల్లుదుబ్బు, వాసుకి విశాలమైన తోకనుండి వీపునుండి తెల్ల, నల్లగరిక (దూర్వా), సాధ్యుల హృదయాలనుంచి హరిచందన వృక్షములు ఉద్భవించాయి. తమనుండి కలిగిన వృక్షాదులు ఆయా దేవతలకు ప్రీతిపాత్రాలయినాయి.

అలాంటి రమణీయమైన శుభ సమయాన, శుక్ల పక్ష ఏకాదశినాడు తమ కొరతలు తీరుటకై విష్ణుదేవుని పూజింపవలె. శరదృతువు ప్రవేశించే వరకు పుష్పపత్రఫల, గంధాదులతోను, వర్ణరస ముఖ్య ఓషదులతోను శ్రియఃపతిని చక్కగా పూజించాలి. నేయి తిలలు బియ్యం యవలు, బంగారం, వెండి మొదలయినవి, మణులు, ముత్యాలు పవడాలు, వివిధ వస్త్రాలు. తీపి పులుపు మొదలయిన షడ్రసోపేతాలయిన వస్తువులను ఆఖండాలుగా (తుంచకుండా) సేకరించి మహాత్ముడగు కేశవునకు నివేదనం చేయాలి. ఈ విధంగా సంవత్సరం పూర్తిఅయిన వెంటనే ఆ గృహంలో సర్వసమృద్ధులు వర్షిస్తాయి. నారదా! ఉపవాసంచేసి మరునాడుదయం జితేంద్రియుడై సంవత్సరకాలం నిర్విఘ్నంగా జరిగేందుకు ఈ చెప్పిన విధంగా స్నానం చేయాలి. సువాసనగల తెల్ల ఆవాలుగాని నువ్వులుగాని పిండిచేసి దేహానికి నలుగు పెట్టుకొని స్నానంచేయాలి. విష్ణుదేవుని నేతితో ఆభిషేకించాలి. నేతితోనే హోమంచేసి తన శక్తిననుసరించి ఘృతదానంచేయాలి. తదనంతరం పద్మ నాభుని కుసుమాలతో మొదట పాదాలను తర్వాత దేహమంతటను అర్చించాలి. రకరకాలయిన పరిమళ ధూపలువేయాలి. ఆ విధంగా ఆ సంవత్సరం పరమపవిత్ర మౌతుంది. ఆనంతరమాజగన్నాథుని స్వర్ణరత్నాలతోను చీని చీనాంబరాలతో నలంకరించి మిష్టాన్నం రుచ్యములైన చోష్యహవిష్యాదులు నైవేద్యం చేయాలి. మునిశ్రేష్ఠా! ఇలా సమర్పించిన తర్వాత నా జగత్పతిని ఈ విధంగా సమంత్రకంగా కీర్తించాలి.

''ఓ పద్మనాభ! పద్మావతీ! మహాద్యుతీ! నీకు నమస్కారము! వికసించిన తామర రేకుల వంటి కన్నుల వాడా! నీవేవిధంగా పరిపూర్ణుడవై సర్వత్రా నిండియున్నావో అలాగే నేను ఆచరించు ధర్మార్థ కామ మోక్షాలు, ఆఖండంగా పరిపూర్ణత్వాన్ని కలిగియుండునట్లు అనుగ్రహించుము కేశవా!''ఈ విధంగా ఉపవాసియై ఇంద్రియ నిగ్రహంతో ఆ సంవత్సర వ్రతం నిర్వహిస్తే గృహస్థు సర్వ విషయాలలోనూ పూర్ణత్వాన్ని సిద్ధింప చేసుకుంటాడు. ఈ విధంగా వ్రతమాచరించినచో దేవతలందరు సంతోషించెదరు. అలాంటి వ్రతం చేసినవానికి చతుర్విద పురుషార్థాలు పూర్ణంగా సిద్దిస్తాయి. వారణా ! అర్థార్థులైన వారలకు నిర్ణయించబడిన వ్రతాలను నీ కెరిగించితిని. ఇక సర్వమంగళకరమైన విష్నుపంజర స్తోత్రం వినిపించెదను.

శ్రీ విష్ణు పంజర స్తోత్రమ్‌ :

నమోనమస్తే గోవింద చక్రంగృహ్య సుదర్శనమ్‌ | ప్రాచ్యాంరక్షస్వమాంవిష్ణో త్వామహం శరణంగతః

గదాంకౌమోదకీంగృహ్య పద్మనాభామితద్యుతే | యామ్యాంరక్షస్వమాం విష్ణో త్వామహం శరణం గతః.

హలమాదాయసౌనందం నమస్తే పురుషోత్తమ | ప్రతీచ్యాంరక్షమే విష్ణో భవంతం శరణంగతః

ముసలంశాతనంగృమ్యపుండరీకాక్ష రక్షమామ్‌ | ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణంగతః

శార్జమాదాయచధనురస్త్రం నారాయణం హరే | నమస్తేరక్షరక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః

పాంచజన్యంమహాశంఖ మంతర్బోధ్యం చ పంకజమ్‌ | ప్రగృహ్యరక్షమాంవిష్ణో ఆగ్నేయ్యాం యజ్ఞసూకర.

చర్మసూర్యశతంగృహ్య ఖడ్గం చంద్రమసంతధా | నైర్‌ ఋత్యాంమాంచ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్‌.

వైజయంతీంప్రగృహ్యత్వం శ్రీవత్పం కంఠభూషణమ్‌ | వాయవ్యాంరక్షమాందేవ అశ్వశీర్ష నమోస్తుతే.

వైనతేయం సమారుహ్య అంతరిక్షేజనార్దన | మాంత్వరంరక్షాజిత్‌ సదా నమస్తే త్వపరాజిత.

విశాలాక్షంసమారుహ్య రక్ష మాంత్వం రసాతలే | ఆకూపార నమస్తుభ్యం మహామోహ నమోస్తుతే. 

కరశీర్సాంఘ్రిపర్వేషుతథా೭ష్టబాహుపంజరమ్‌ | కృత్వారక్షస్వమాందేవ నమస్తే పురుషోత్తమ.

ఏతదుక్తంభగవతావైష్ణవం పంజరం మహత్‌ | 
పురా రక్షార్థమీశేన కాత్యాయన్యా ద్విజోత్తమ. 

నాశయామాస సా యత్ర దానవం మహిషాసురమ్‌ |
 సమరం రక్తబీజం చ తథాన్యాన్‌ సురకంటకాన్‌.

గోవిందా ! నీకు నమస్కారం. నీకు శరణాగతుడను. సుదర్శన చక్రం ధరించి విష్ణో! నీవు నన్ను తూర్పన రక్షించుము. అమిత తేజస్వియైన పద్మనాభా! కౌమోదకి గదను ధరించి నన్ను దక్షిణ దిశన రక్షించుము. విష్ణో ! నీకు శరణాగతుడను. నీకు నమస్కారము. పురుషోత్తమా! నమస్కారము. సౌనందహలాన్ని ధరించిన విష్ణూ! పశ్చిమ దిక్కున నన్ను రక్షించుము. నీకు శరణాగతుడను ! పుండరీకాక్ష ! ఉత్తమమైన నీ ముసలాయుధంతో ఉత్తరాన నన్ను రక్షింపుము. జగన్నాథా ! నీకు శరణాగతుడును. ఓ రాక్షస నాశకా ! శార్‌ఙ్గ ధనస్సును నారాయనాస్త్రాన్ని ధరించి నన్ను ఈశాన్య దిశన రక్షింపుము. నీకు శరణాగతుడను. ఓ విష్ణూ యజ్ఞ పురుషా ! పాంచజన్య శంఖాన్ని అంతర్బోధ్య కమలాన్ని ధరించి నన్ను ఆగ్నేయ దిక్కున రక్షింపుము. ఓ నరసింహ ప్రభూ ! దివ్యమూర్తీః సూర్యశతమనే డాలును చంద్రమస ఖడ్గాన్ని ధరించి నైరృతి దిక్కున నన్ను రక్షింపుము. వైజయంతీమాలను శ్రీవత్సాంకాన్ని ధరించిన ఓ హయగ్రీవ ప్రభూ ! వాయవ్య దిశన నన్ను రక్షించుము. నీకు నమస్కారము. జనార్దనా! గరుడ వాహనారూఢుడవై నన్ను అంతరిక్షంలో రక్షింపుము. అజితా అపరాజితా! నీకు సదానమస్సులు! విశాలక్షాన్ని అధిరోహించిన నన్ను పాతాళంలో రక్షించుము! అకూపారా! మహామోహ! నీకు నమస్కారము! అష్టబాహు పంజర రూపాన నా శరీరంలోని చేతులు, తల, పాదాలు, మడమలు మొదలగు వానిని రక్షింపుము. పురుషోత్తమ దేవా! నీకు నమస్కారము! ఈ విధంగా ఈ విష్ణు పంజర స్తోత్రం పూర్వం శివుడు రక్ష కొరకై కాత్యాయనికి చెప్పాడు. ఓ బ్రహ్మణోత్తమా! దీని ప్రభావం వల్ల ఆ మహాదేవి మహిషాసురునీ, నమరుడు, రక్తబీజుడు తదితరు లెందరో దానవులను సుర కంటకులను నాశనం గావించింది.

నారదుడనెను -
దేవకంటకులైన మహిషదైత్యునీ నమర, రక్తబీజులను వధించిన ఆకాత్యాయని ఎవరు ? ఆ మహిషుడెవడు ? అతడు పుట్టిన వంశమేది? ఆనమర రక్తబీజులెవరి కుమారులు ? మహర్షే ! ఈ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పండి.

పులస్త్యుడిట్లనెయె -

ఓమునీ ! ప్రాచీనకాలాన జరిగిన పాపాపహారి అయిన కథ చెబుతున్నా వినుము. సమస్తమైన వరాలు ప్రసాదించ దుర్గయే యా కాత్యాయని. పురాసమయాన, జగత్తు నంతా సంక్షోభింపజేసే యిద్దరు రాక్షసులు, మహాబలశాలురు ఉండేవారు. వారు రంభుడు కరంభుడు. అపుత్రకులైన వారు పుత్రప్రాప్తి కొరకు పంచనదీ జలాలలో మునిగి చాలా ఏండ్లు తపస్సు చేశారు. వారిలో కరంభుడు జలమధ్మంలో, రంభుడు అగ్ని మద్యంలో ఉండి, మాలవట యక్షుని గూర్తి తపించారు. కరంభుడు నీటిలో మునిగిపోగా యింద్రుడు మకర రూపానవాని కాళ్ళు పట్టుకొన లాగికొని పోయి తన కోరిక మేరకు వధించెను. సోదరుని చావునకు కోపించి రంభుడు తన తల నరికి అగ్ని లోవేల్చ సంకల్పించెను. తన జుట్టు ఒక చేతపట్టుకొని రెండవ చేతితో మెరిసిపోతున్న ఖడ్గం గ్రహించి తల నరుకుకొనబోగా రంభుని అగ్ని వారించి యిట్లనెను - రాక్షసేశ్వరా ! తన్ను తాను చంపుకొనుట మంచిదికాదు. పరహత్యాపాతకం కంటే ఆత్మ హత్యాపాతకం భయంకరమైనది. దుస్తరమైనది. చచ్చిన వానినెవడూ పట్టించుకోడు. నీ కోరికయేదో చెప్పుము. నేను నెరవేర్చగలను. అప్పుడు రంభుడు - ''ఓ అగ్నీ! నాకు వరమివ్వదలచుచో నీకంటే తేజస్వి, దేవతల కజేయుడు, నరదైత్యుల కవధ్యుడు వాయువునకు వలె బలవంతుడు, కామరూపుడు సర్వాస్త్రకోవిదుడు, త్రిలోక విజయం సాధించ గలిగిన పుత్రుని దయచేయుమ'' నియెను. అందుకు అగ్ని ''తప్పకుండా లాగే జరుగగలదు. నీకు, ప్రియురాలైన వనితయందు అలాంటి పుత్రునికను''మని వచించెను.

ఇతి శ్రీ వామనమహాపురాణ అష్టాదశోధ్యాయః

అగ్నిదేవుని యాదేశాను సారం, అనేక మంది యక్షులతో పరివేష్టితుడైయున్న మాలవట యక్షుని చూచుటకై ఆదానవుడు వెళ్ళిపోయెను. ఆ ప్రదేశాన గజాశ్వ మహిషములు గోవులు మేకలచే పరివృతుడై యుండియు అనన్య చిత్తుడైన పద్మనిధి నివసించుచుండెను. వాటి మధ్య ఉన్నటు వంటి మూడేండ్ల వయస్సు గలిగి అందముగానున్న ఆడు మహిషాన్ని చూచి ఆదానవుడు మోహితుడాయెను. ఓ మునీ ! విధి విధానం వల్ల ఆ ఆడుమహిషం గూడ ఆరాక్షసునితో సంగమించుట కై త్వరగా ఆతనిని సమీపించగా వాడు దానితో రమించెను. వెంటనే అది గర్భం ధరించగా దానిని తీసికొని అతడు పాతాళంలో తన భవనానికి జేరెను. అతడు చేసిన అకార్యానికి తోడి రాక్షసులాతనిని బరిత్యజించగా అతడచ్చోటు వదలి తిరిగి మాలవటం చేరెను. ఆ మహిషి గూడ పతిని అనుగమించి ఆ యక్షమండలమునకు వెళ్ళెను. వారక్కడ ఉండగా నా నల్లని మహిషి ఒకనాడు చక్కని అందమైన దున్నపోతును ప్రసవించెను. అది కామరూపి. ఒకనాడా మనిషి ఋతుమతి అయి ఉండగా మరొక మహిషం (మగది) దానిని చూచి మోహంతో వెంబడించగా నాశ్యామ తన శీలమును రక్షించుకొనుట కై భర్తయైన రాక్షసుని సమీపించెను. మోర ఎత్తుకొని వెంటబడిన ఆ దున్నపోతు మీదకు ఆ రాక్షసుడు కత్తిదూసి లంఘించెను. అంతట నా దున్నపోతు తన కొమ్ములతో రాక్షసుని గుండెల్లో కుమ్మగా హృదయం చీలిపోయి వాడు మరణించెను. తన భర్త మరణించడంతో నా మహిషి యక్షులను శరణుజొచ్చెను. యక్షులచేత నివారింపబడిన ఆ దున్నపోతు మోహాతిరేకంతో చేయునది లేక సమీపంలో ఉన్న ఒక దివ్య సరస్సులోబడి చనిపోయి ఒక రాక్షసుని రూపం ధరించెను. ఆ బలపరాక్రమ సమన్వితుడైన రాక్షసుడే నమరుడుగా ఖ్యాతి చెందాడు. అతడు ఆ యక్షుల మరుగున జేరి అక్కడ నున్న జంతువుల నెల్లను బార ద్రోలెను. అంతట మాలవటాది యక్షులు చనిపోయిన రాక్షసుని చితిపై చేర్చగా నాశ్యామ మహిషి తనపతితో చితాగ్నిలో బడిపోయెను. అంతట నా చితాగ్ని మధ్యం నుండి రౌద్రాకారుడగు పురుషుడొకడు బయలుదేరి ఖడ్గపాణియై ఆ యక్షులనందరను వెళ్ళగొట్టెను. ఆ వీరుడు రంభనందనుడైన మహిషుని వదలి మిగిలిన మహిషములనన్నింటిని వధించెను. ఓ మహామునీ! ఆతడే రక్తబీజుడు. వాడు యింద్రరుద్ర సూర్య మరుత్తులతో సహా దేవతలనందరను జయించాడు. ఆ రాక్షస వీరులంతటి పరాక్రమవంతులు. అయితే వారందరిలోను మహిషాసురుడు గొప్పవాడు. శంబరుడు, తారకుడు మొదలయిన వారలనందరను జయించినాడు. వారందరు నాతనిని తమ ప్రభువుగా అభిషేకించారు. ఆతని ధాటికి నిలువలేక లోకపాలకులందరు సూర్యచంద్రాగ్నులతో సహా తమతమ స్థానాలు వదలి పారిపోయారు. ధర్మానికి స్థానం అంటూ లేకుండా పోయింది.

ఇది శ్రీ వామనమహాపురాణంలో పదునెనిమిదవ అధ్యాయం సమాప్తం.

జ్ఞానస్యాభరణం క్షమా

ఒకానొక  చక్రవర్తి  యుద్ధంలో గెలిచి వచ్చాడు. భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశయిల్లింది. 
తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, జ్ఞాని, గురువు అయిన మహా మంత్రే ఆయనకా సమయంలో చులకనగా కనిపించాడు. దీన్నే అంటారు కళ్లునెత్తికెక్కాయని.

 అతనిలో గర్వంతో బాటు అహంభావం కూడా పెరిగింది. మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మరచిపోయాడు.

'మంత్రివర్యా! మీరెంతో తెలివైనవారు, జ్ఞాన నిధి, గొప్ప వ్యూహ కర్తలు. ఈ తెలివి తేటలతో బాటు అందం కూడా ఉంటే ఎంత బాగుం డును' అన్నాడు. 

అసలతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే. కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు. 

తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి. ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు. తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తూలనాడలేదు. 

దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి 'ఎండ మండిపోతోంది. ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు' అన్నాడు. 

పరిచారకుడు స్వర్ణ పాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు. 

ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి. దాహం తీరి ఉండదు. మట్టి కుండలో నీరు తెచ్చి ఇవ్వు' అన్నాడు మంత్రి మళ్ళీ. 

పరిచారకుడు మట్టి కుండలోనుంచి తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు. 

వెంటనే ఆలోచించాడు...

 మంత్రి ఒక్క సారిగా నీటిని గురించి ప్రస్తావించడడం, పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర, మట్టి పాత్ర ల్లోని నీటిని తెప్పించడం ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు. వివేకవంతుడు కనుక వెంటనే అర్థమయింది. జ్ఞానోదయమయింది. 

వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి, 'గురు దేవా! మన్నించండి. గర్వాతిశయంతో కాని మాట అన్నాను. 
బంగారు పాత్ర విలువైనదే కావచ్చు. అందంగా ఉండవచ్చు. కాని దానికి నీటిని చల్ల పరిచే గుణం లేదు. మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు. అయినా నీటిని చల్లగా ఉంచు తుంది.
అందం కాదు!!! గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు బహు చక్కగా బోధించారు. నా అపరాధాన్ని మన్నించండి' అన్నాడు.

ఆ చక్రవర్తి మరెవరో కాదు మౌర్య వంశ వ్యవస్థాపకుడు మౌర్య చంద్ర గుప్తుడు. ఆ మహా మంత్రి మరెవరో కాదు. మహారాజనీతి వేత్త, చతురుడు, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరు గాంచిన చాణక్యుడు.

 నరస్యాభరణం రూపం
 రూపస్యాభరణం గుణమ్‌
 గుణస్యాభరణం జ్ఞానమ్‌
 జ్ఞానస్యాభరణం క్షమా

మానవులకు ఆభరణం రూపమని, రూపానికి ఆభరణం సుగుణమని, సుగుణానికి ఆభరణం జ్ఞానమని, జ్ఞానానికి ఆభరణం క్షమ అని దీని అర్థం.

పై శ్లోకంలో మనిషికి రూపం మంచి ఆభరణమని చెప్పినా గుణం, జ్ఞానం, క్షమ అనేవి రూపం కన్నా అతి ప్రధానమైనవని స్పష్టం చేయబడింది. 

అంటే మంచి అంద గాడైనా ఏ వ్యక్తి అయినా ఆ ఒక్క లక్షణం ద్వారా పూజ్యుడు కాడు. 

వినయం అనేది మనిషిలో ఎల్ల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ ఉండాలి. 

కొందరు ఓటమి చవి చూసి నప్పుడో, బాధలలో మునిగిపోయినప్పుడో తమ బాధలు వెళ్ళబుచ్చుకునేందుకు ఇతరుల ముందు వినయం ప్రదర్శిస్తారు. 

అయితే ఇలాంటి వ్యక్తులు గెలుపు సాధించి నపుడు, సంపదలు వచ్చినపుడు, మంచి పదవి ఉన్నపుడు గర్వాతిశయంతో ఇతరులను చిన్న చూపు చూస్తారు. కించ పరుస్తారు. మాటలతో ఎదుటివారిని చులకన చేస్తారు. 

అందంగా ఉండడం మంచిదే కాని తను అందంగా ఉన్నానని అందవిహీన మయిన పనులు చేయడం తగనిది. 

అన్నీ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నపుడు కూడా హద్దులెరిగి ప్రవర్తించాలన్నది దీని సారాంశం!!! 
సదా క్షేమ దాయకం కూడా!!!
^^^^^^^^^^^^^^^********

హిందూ ధర్మాన్ని కాపాడాలి
ఇది ఎవ్వరిని విమర్శించటానికి, లేక ఎవ్వరి మనస్సు నొప్పించటానికి కాదు.  కేవలం ఇప్పటి మన హైందవ ధర్మం యెక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వ్రాసింది.
ఇప్పుడు మన హిందూ ధర్మానికి మూడు విధాల గ్లానులు కలుగుతున్నాయి.
1) ఇతర మతస్తులు మన హిందువులపై మాయ మాటలు చెప్పి వారి మతంలోకి మార్చుకోటం అంటే మతమార్పిడి.
2) నాస్తిక వాదం
3) సాయి బాబా వాదం.
ఇప్పుడు ప్రతిది క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

1) మతమార్పిడి.: మన దేశంలో ముఖ్యంగా క్రైస్తవులు మన హిందువులలో మన ధర్మం మీద అవగాహన లేని గ్రామీణ ప్రజలని మభ్య పెట్టి కొంత ధనం, ద్రవ్యాలు ఇచ్చి మతమార్పిడి చేస్తున్నారు. మన ధర్మంలో కూడా కొంతమంది హిందూ ధర్మ ప్రచారకులు వాటిని ఆపటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతవరకు వారి ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి.  కానీ ఇంకా ఇంకా మన ధర్మం మీద ప్రతివారికి అవగాహన రావాలి అందరు ఒక ఉద్యమంగా మారి ఈ మాత మార్పిడులను అరికట్టాల్సిన అవసరం వుంది.
ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మేము ప్రార్ధన చేసి మీ రోగం తగ్గిస్తామని వారికి నమ్మబలికి కొన్నాళ్లకు వారిని తమ మతంలోకి మార్చుకుంటున్నారు. దీనిని మనమందరం అరికట్టాల్సిన అవసరం ఎంతయినా వుంది.

2) నాస్తిక వాదులు; మన హిందుత్వంలోనే జన్మించిన కొందరు హిందూ ధర్మం మీద అవగాహన లేక కొంతమంది చెప్పే వాటిని నమ్మి దేముడు లేడు అని ప్రచారం చేస్తున్నారు.  వారికి మన హిందూ ధర్మం మీద మన పురాతన జ్జ్ఞానంమీద అవగాహన కల్పిస్తే తప్పక వీరు హిందుత్వపు గొప్పతనం తెలుసుకోగలుగుతారు.

3) సాయి బాబా వాదం ఇది ముఖ్యంగా మన బ్రహ్మళ్లలో వుంది.  సాయి బాబా దేముడని సాక్షాత్తు దత్తాత్రయ అవతారం అని ప్రచారం చేస్తున్నారు.   మన ధర్మం ఎవరిని నీచంగా చూడామని, విమర్శించమని చెప్పదు. కానీ మన ఉనికికి ప్రమాదం ఏర్పడే టప్పుడు మనం మన జాగ్రత్తలో ఉండాలి మన వారికి సరైన మార్గంలో ఉంచాలిసిన అవసరం వుంది.
సాయి బాబా ఒక మంచి ఫకీర్ ఐ ఉండవచ్చు, కానీ అతను మొదటగా హిందువు కాదు, రెండు ఆయన ఒక పాడుబడ్డ మసీదులో నివాసం ఉన్నట్లు చెపుతున్నారు, మూడు తను ఎప్పుడు తన మత దేముడి స్మరణే చేసినట్లు చెపుతున్నారు.  మరి ఆయన మన హిందూ దేముడు యెట్లా అవుతారు.  ఆలోచించండి. జ్ఞానులు ఇతర మతాలలో కూడా వుంటారు.  వారిని మనం జ్ఞానులుగానే పరిగణించాలి కానీ దేముడి హోదా ఇవ్వకూడదు కదా.

తన తప్పశెక్తితో కొన్ని మహిమలు చూపి ఉండొచ్చు మనం కాదనం. కానీ ఇటీవల కాలంలో వున్న మహానుభావులు, శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, రమణ మహర్షిలను కూడా మనం యోగులుగా చూస్తున్నాం కానీ ఎవరికి దేముడి హోదా ఇవ్వలేదు కదా.  అంతేకాదు ఆది శంకరాచార్య, రామానుజచార్య, మద్వాచార్య లను మనం హిందూ ధర్మమును కాపాడటానికి వచ్చిన మహానుభావులుగా చూస్తున్నాము కానీ ఎవ్వరికీ మనం దేముడి హోదా ఇవ్వలేదు గమనించగలరు.  ఇంకా వెనకకి వెళ్ళితే, ఎందరో మహర్షులు, బ్రహ్మర్షులు, మన భారత గడ్డమీద జన్మించారు అది మనకు వారి జ్ఞాన సంపద వల్ల తెలుస్తున్నది. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశారు. ఎందరో ఋషులు వరాలు, శాపాలు ఇచ్చారని మనకు పురాణాలవల్ల తెలుస్తున్నది. మరి మనం ఎవ్వరికీ దేముడి హోదా ఇవ్వలేదు.  కాబట్టి మేధావులు ముఖ్యంగా సాయి బాబాను ఆరాధించే వారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను.
ధర్మాన్ని రక్షించండి అది మిమ్ములను మీ కుటుంబాన్ని రక్షిస్తుంది.
సార్వే జానా సుఖినోభవంతు
ఓం శాంతి శాంతి శాంతిః
మీ
భార్గవ శర్మ
**************
హిందువులకు దేముళ్ళు ఎందరు;
ఈ మధ్య నేను ఒక సరిస్తవాపాస్టర్ వీడియో చూసా అందులో ఆయన ఒక మాట అన్నాడు. బహు దేముళ్ళను కొలిచే వారికి నరకం వస్తుంది అని. అంతేకాదు హిందువులు బహు దేముళ్ళని సేవిస్తున్నారు కావట్టి వాళ్లు నరకం పొందుతారని వారి బైబులు చెపుతున్నాడని హిందువులని వాళ్ళ మతంలోకి మార్చుకొనే ప్రయత్నంలో భాగంగా ఆ ప్రసంగం. ఇటువంటి విమర్శలను మన హిందువులు అందరు ఎదుర్కొనే స్థాయికి మన జ్ఞానం పెంపొందించువాలి. అప్పుడే అటువంటి వాటినుండి మనలను మన ధర్మాన్ని కాపాడుకోగలం.
ఈ శ్లోకం గమనించండి
ఆకాశాత్ పతితం తోయం యధా గాస్చేతి సాగర
సర్వ దేవా నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి.
భావం ఆకాశం నుండి వచ్చిన నీరు ఏవిధంగా అయితే సముద్రాన్ని చేరుతుందో అదే విధంగా అన్ని దేవతలకు చేసిన నమస్కారం కేశవునికే చెందుతుంది అని అర్ధం.
దీనిని బట్టి మనకు రెండు విషయాలు తెలుస్తాయి అవి. 1) ఎంతమంది దేవతలకు నమస్కరించిన అందరు ఒక్కరే ఆ ఒక్కరు కేశవుడు మాత్రమే. కాబట్టి మనం ఏదేముడిని ఏ పేరుతొ కొలిచిన మన నమస్కారం మాత్రం ఆ దేవా దేవుడైన కేశవుడిని మాత్రమే చేరుతాయి అని అర్ధం. ఇప్పుడు చెప్పండి హిందువులకు దేముళ్ళు ఎందరు. ఉన్నది ఒక్కడే ఆ దేముడిని మనం వివిధ రూపాలతో వివిధ నామాలతో పూజిస్తున్నాం.
మీకు ఇంకా సరళంగా అర్ధం కావటానికి ఒక సాధారణ ఉపమానంతో చెప్పే ప్రయత్నం చేస్తాను.
మీకు తహసీల్దారు ఆఫీసు నుండి ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి మీరు ఏమి చేస్తారు మీరు మీ అర్జీని అక్కడి ఇన్వార్డ్ క్లర్కుకి ఇస్తారు, ఆ క్లర్కు మీ అర్జీని తీసుకుంటాడు. నిజానికి మీ అర్జిమీద తహసీల్దారుగారి పేరుమీదనే వుంది. ఆ క్లార్క్ రెండు మూడు రోజుల్లో కార్యాల ఇతర సిబ్బంది, వీ ఆర్ ఓ , ఆర్, ఓ. ల ఎండోస్మెంట్ తో తహసీల్దారు గారివద్దకు పంపుతారు. అవన్నీ మీకు తెలియకుండానే జరుగుతాయి. తరువాత మీరు వచ్చి ఔట్వేర్డ్ క్లర్కునుండి తహసీల్దారు గారి సంతకంతో మీకు మీ సర్టిఫికెట్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఇక్కడ మీకు తహసీల్దారుగారు మాత్రమే మీ పని చేయ సమర్ధుడు. కానీ మీరు అతనిని కనీసం కలవనుకుడా కాలవ లేదు. కానీ ఆయన ద్వారా మాత్రమే మీకు సర్టిఫికెట్ వచ్చింది.
మీరు ఆఫీసుకి వెళ్ళినప్పుడు అక్కడి ఇన్వార్డ్ కాలేర్క్ కు నమస్కరించారు కానీ తహసీల్దారిని చూడను కూడా చూడలేదు. మరల మీ సర్టిఫికెట్ పొందినప్పుడు కూడా మీకు అది ఇచ్చిన క్లర్కుకే నమస్కరించారు. అదే విధంగా మన హిందూ సాంప్రదాయంలో భగవంతుని కంట్రోల్లో వున్న అనేక శాఖలు వివిధ ఉద్యోగస్తులకు అంటే వివిధ దేవతలకు ఆయన అప్పచెప్పారు ఉదాహరణకు ధనము కావాలంటే లక్షి దేవికి, విద్య కావాలంటే సరస్వతికి, ధైర్యం కావాలంటే పార్వతి దేవికి తన శక్తిని ఇచ్చారు, ఇంకా ఉప శాఖలు కూడా ఉదాహరణకు ధనానికి ధన లక్ష్మి, ధాన్యానికి ధన్య లక్ష్మి, సౌభాగ్యానికి సౌభాగ్య లక్ష్మి అదే విధంగా మిగిలిన దేవతలకు కూడా.
ప్రతి పని చేయటానికి కార్యాలయంలో ఒక్కొక్క ఉద్యోగస్తుడు వున్నా అన్నీ కూడా ఆ ఆపేసారు పేరుమీదే జరుగుతాయి. అదేవిధంగా మనం ఏ దేముడిని కొలిచిన అన్ని ఆ పరమాత్మా పేరుమీదే.  అది తెలుకొని ఇతర మతస్తులు మన ధర్మాన్ని విమర్శిస్తున్నారు. మన వాళ్ళు వాళ్ళ మాటలు నమ్ముతున్నారు.
మిత్రులారా ఇప్పుడు కాదు ఎప్పటికి మన హిందూ ధర్మాన్ని విమర్శించే స్థాయికి ఇతర మతస్తులు ఎవ్వరు ఎదగ లేదు, ఎదగ లేరు ఎందుకంటె మన ధర్మం, మన జ్ఞానం అప్పరమైనది. మన దేశంలో దైవ సాక్షాత్కారం పొందిన మహానుభావులు ఎందరో వున్నారు. ఇప్పటిలో కొన్ని వందల సమత్సరాల్నుండి తప్పస్సు చేస్తున్న మహర్షులు ఎందరో మన హిమాలయాలలో వున్నారు ఇది సత్యం.
ఓ హిందూ మేలుకో నీ ధర్మాన్ని తెలుసుకో
సర్వ్ జన సుఖినోభవంతు
ఓం శాంతి శాంతి శాంతిః
మీ
భార్గవ శర్మ
*****************
ఈ పోస్టు పాతదే ఆయన స్ఫూర్తిదాయకం.
**************
ఆర్యా ఈ పోస్టుకు కర్తను నేను కాదు ఎక్కడినుంచో ఎత్తుకొచ్చి పెట్టాను.  మీ ప్రశంసలకు అర్హుడిని నేను కాదు.
****************
ఇక్కడ మనం ఒక విషయం గనించాలి మనకు వున్న శాస్త్రీయ పరిజ్ఞానంకు వైదిక్ పరిజ్ఞానంకు కొంత వ్యత్యాసం ఉంటుంది. దానికి కారణం నేను చెప్పలేను. ఉదాహరణకు చతుసాగర పర్యంతం అని మనం చెప్పుకుంటాము, కానీ మనం ఏడు సముద్రాలని  చదువుకున్నాం. మనం చదువుకున్న సముద్రాలు వేరు ఆ సాగరాలు వేరు. మన వైదిక్ జ్ఞానంమలో కొన్ని అంతరార్ధాలు ఉంటాయి అవి మన స్థూల దృష్టికి బోధ పడవు.
******************
మిత్రులకు విన్నపం. నేను తరచూ ఈ నంబరు కలపండి ఆ నంబరు కలపండి అనే రెక్యూస్తులు చూస్తూ ఇది వ్రాస్తున్నాను. దయచేసి మీ మిత్రులని కూడా ఈ గ్రూపులో చేర్చ దలుచుకుంటే మనకు గ్రూప్ ఇన్విటేషన్లు పంపుతున్నారు వాటిని మీ మిత్రులకు షేర్ చేయండి.  అక్కడ వారు క్లిక్ చేస్తే గ్రూపులోకి చేరుతారు. మనం అడ్మిన్ గారిని విసికించకుండా ఇది చేయటం మంచిది కదా. ఇప్పటికి సభ్యులు అడిగే పుస్తక భాండాగారాన్ని తెస్తూ వారు చాలా శ్రమిస్తున్నారు. గమనించగలరు
***************
మీ అభినందనల వర్షాన్ని నేను భరించలేకుండా వున్నాను. మీకు కృతఙ్ఞతలు.




పంచముఖ ఆంజనేయ స్వామి

పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణం లో వివరణ దొరుకుతుంది.

రామ రావణ యుద్దము నందు, రావణుడు మహీరావణుడి సాయం కోరుతాడు, పాతాళానికి అధిపతి మహీరావణుడు.

ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల సయన మందిరము ( తోకతో ఏర్పాటు చేసినది) నుండి రామ లక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు.

అది తెలుసుకొన్న ఆంజనేయుడు శ్రీ రామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు.

పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపలను ఒకేసారి విచ్చిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకొన్న పవనుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు.

అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగ, గరుడ, వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్చినం చేసి (ఆర్పి) శ్రీరామ లక్ష్మణులను కాపాడుకొంటాడు.

జై హనుమాన్

పంటి నొప్పి ప్రాణం లాగేస్తుంది.

40 ఏళ్ళు దాటిన వారికి సహజంగా వచ్చే సాధారణ ఆరోగ్య సమస్య పంటి నొప్పి. పంటినొప్పి అనుభవం లేని వారు వుండరంటే  అతిశయోక్తి కాదనుకుంటా.
మన ఇంట్లో దొరికే వాటితో ఈ బాధను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శీఘ్రముగా నివారించుకోవచ్చు.
ఇలా చేయండి.
కావలసినవి 2 వెల్లుల్లి పాయలు, కొంచం సైన్ధవ లవణం. లేని యెడల మామూలు ఉప్పు ఒక చిటికెడు.
ఇప్పుడు మీరు వెల్లుల్లిని ఉప్పును కలిపి ఒక చిన్న కల్వం లేదా రాయి మీద మెత్తగా నూరండి. ఆ నూరిన ముద్దను మీకు ఏ పన్ను బాదిస్తుందో ఆ పన్ను మీద పెట్టండి. బాగా నోట్లో ఉమ్మి ఊరుతుంది ఉమ్మివేయండి. కొంచం సేపు కాగానే నీటితో నోటిని శుభ్రం చేసుకోండి. ఇలా మీ నెప్పి తగ్గేదాకా చేయండి. కేవలం రెండు మూడు సార్లు చేస్తే చాలు మీ నొప్పి మాయం.
వెల్లుల్లి మంచి అంటి ఇన్ఫలమాటివ్, ఆంటీ బాక్టీరియల్  అంటే నెప్పి తీసే గుణం, పుండును మానిచే గుణం ఉందన్నమాట. ఈ విధంగా చేయండి నొప్పిని వదిలించుకోండి.


అతిధి దేవోభవ!

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి 🙏🙏

ఆతిథ్య వేళ అంటారు. ఎవరయినా మధ్యాహ్నం వేళలో భోజనానికి వస్తారు. గడపదాటి ఇంటి లోపలకు వచ్చిన అతిథిని ముందుగా ‘‘భోజనం చేసారా!’’ అని అడగాలి. ఆతిథ్య ప్రస్తావన వస్తే కాశీ పట్టణం పేరెత్తకుండా  మాట్లడటం కుదరదు. కాశీ పట్టణానికి ఓ లక్షణం ఉంది. మధ్యాహ్నం 12 గంటలవేళ ఎవరు అన్నం పెట్టినా అది అన్నపూర్ణమ్మ హస్తమే.
అందుకే ఆడవాళ్లు కాశీయాత్ర వెళ్ళినప్పుడు అక్కడ వడ్డన సేవ చేయాలని కోరుకుంటారు. అటువంటి కాశీపట్టణంలో అన్నం దొరకలేదని వ్యాసులవారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. శపించబోయారు. చేతిలోకి నీళ్ళు తీసుకున్నాడు..‘‘ధనము లేకుండెదరుగాక మూడుతరములందు, మూడు తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును మూడుతరములు లేకుండుగాక, పంచజనులకు కాశిపట్టణమందు.’’ అన్నాడు.   

ఇంతలో ఎదురుగుండా ఇంటిలోంచి గడియ తీసుకుని పట్టుచీర కట్టుకుని వచ్చింది ఓ తల్లి. అప్పటికీ లోపలినుంచి శివుడు....‘‘ధూర్తుడు, కాశీని శపిస్తాడట.. కాల్చేస్తా...!!!’ అంటున్నాడు. శివుడి ఆగ్రహానికి కారణం–‘కాశి’ పరమేశ్వరునికి భార్యలాంటిది. వెంటనే పార్వతీ దేవి అన్నది కదా...‘‘ఆగండాగండి. ఆకలిమీదున్న వాడిని కాల్చకూడదు. తప్పు. అతను అతిథి’’ అంటూ గభాల్న తలుపుతీసుకుని వచ్చింది. కోపంతో నీళ్ళుపట్టుకుని ఊగిపోతున్న వ్యాసుడిని పిలిచింది...‘‘వ్యాసా!  ఇలా రా! భిక్షలేదని కాశీ పట్టణంమీద ఇంత కోపించడమా.
నీ చిత్తశుద్ధి తెలుసుకుందామని పరమశివుడు పరీక్ష పెట్టాడు తప్ప కాశికాపట్టణంలో అన్నం దొరకకపోవడమా? భూమండలంలో ఎక్కడయినా అన్నం దొరకదేమో కానీ కాశీ పట్టణంలో అన్న దొరకకపోవడం అంటూ ఉండదు. ఎందుకంత తొందరపడుతున్నావు? వెళ్ళి స్నానం చేసి సంధ్యవార్చుకుని రా’’–అని వ్యాసుడిని, శిష్యులను పిలిచి కూర్చోబెట్టి మధుర మధురమైన వంటకాలను వడ్డించింది. పాయసం పాత్ర ఎడమచేతిలో పట్టుకుని బంగారు తెడ్డు కుడి చేత్తో పట్టుకుని అన్నపూర్ణమ్మ తల్లి ఎవడొస్తాడా వడ్డిద్దామని ఎదురు చూస్తుంటుంది కాశీలో. ఆడవారి సహకారం లేకుండా పురుషుడు ఎంత ధర్మాత్ముడయినా ఎవరికి అన్నం పెడతాడు? ఆతిథ్యమంటే ఆతిథ్యమే.
వ్యాసుడిని కూర్చోబెట్టి కడుపునిండా అన్నం పెట్టింది. అప్పుడొచ్చాడు పరమశివుడు. ‘‘ఎంత తప్పు చేసావు, కాశీని శపించడమా! వైరాగ్యం కొద్దీ కాశీకి రావాలే గానీ, భోగం కోరేవారు రాకూడదు. కాశీని వదిలి పెట్టి వెళ్ళిపో..’’ అన్నాడు. ఆతిథ్యమంటే అంత తప్పుచేసిన అతిథినికూడా కాశీ పట్టణంనుంచి పంపేముందు మధ్యాహ్నం అన్నం పెట్టి మరీ పంపించింది అన్నపూర్ణ. అదీ ఈ దేశం గొప్పతనం. ఇంటికి వచ్చిన అతిథిని పూజించి, ఆదరించి, తృప్తిగా అన్నంపెట్టి సత్కరించడం గృహస్థు ధర్మం. ఒక అతిథి ఇంటికొస్తే ఎలా గౌరవించాలి, ఎలా పూజించాలి, ఎలా సత్కరించాలన్నది మనకు మన పెద్దలు నేర్పారు.
సనాతన ధర్మం కేవలం మనం ఎలా బతకాలో నేర్పలేదు. నలుగురికోసం ఎంత ఉత్తమంగా బతికి, ఎంత ఉన్నతంగా ఎదగాలో నేర్పింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ అని మనం ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలు ముందుగా మనం పూర్తిగా జీర్ణించుకుని, మనసా వాచా కర్మణా అనుసరిస్తూ, మన పిల్లలకు ఆదర్శంగా నిలిస్తే– ఈ ధర్మాన్ని వారు మరో పదికాలాలపాటు పరిరక్షించగలుగుతారు.

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

ఏడు అద్భుతాలు .

మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ...  ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని  ఆశ్చర్యపోతుంటాం!! 

మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు .

🌷 *1* . *తల్లి* 

మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన...  👩‍🦱తల్లి మొదటి అద్భుతం. 

🌷 *2* . *తండ్రి* 

మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని  తన కన్నీళ్లను దాచేస్తాడు  
మన పెదవులపై  చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు 
దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ..😎 సంతోషాన్ని  మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం. 

🌷 *3* . *తోడబుట్టిన*  *వాళ్ళు* 

మన తప్పులను వెనుకెసుకురావాడానికి...  
మనతో పోట్లాడడానికి...  మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు... 
తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం 😥🥴☺

🌷 *4* . *స్నేహితులు*  

మన భావాలను పంచుకోడానికి..  
మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...
ఏది ఆశించకుండా..  మనకు దొరికిన స్నేహితులు  నాలుగో  అద్భుతం. 🌚🌝👨✈️🕺

 *🌷5* . *భార్య* / *భర్త* 

ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా  చేస్తుంది 
కలకాలం తోడు ఉంటూ...🌛 ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే...  ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది  🌜
భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే  ఐదో అద్భుతం మన సొంతం .

🌷 *6* . *పిల్లలు* 

మనలో స్వార్థం మొదలవుతుంది..  
మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది...  
వారి ఆలోచనలే  ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..  
వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ  ఉంటుంది.. 
వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు  అసలు ఉండరు...  🙏
పిల్లలు ఆరో అద్భుతం 

అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?

🌷 *7* . *మనవళ్ళు* *మనవరాళ్లు* 

వీరికోసం ఇంకా కొన్నిరోజులు  బతకాలనే  ఆశపుడుతుంది.. 
వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం 
మళ్ళీ పసిపిల్లలం...🏃🏃‍♀️👩🔧👨💼👨🎓👩🎓 అయిపోతాం  
వీరు మన జీవితానికి  దొరికిన.. ఏడో అద్భుతం 🌹🌺🌷🥀

🌹ఇలా అద్భుతాలన్నీ  మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం... 
కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు  మన సొంతం అవుతాయి  
చిన్న పలకరింపు  చాలు... మనల్ని ఆ అద్భుతంగా  చూడడానికి.  
అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి  మరో అద్భుతాన్ని  సృష్టించేద్దాం ...🙏

ఆత్మ శక్తి

చిత్ర నక్షత్ర పరిశీలన. సుభగ్ం  సుసం యువతిగ్ం రోచమానామ్. అని కలదు. మనిషికి యౌవన  అమృతత్వం. అట్టి యౌవనంగా మనం సాధించే కార్యం చేయుటకు అనువైన సమయం. అమ్మ స్త్రీ నిత్యయౌవని గాని అనంత ముగా ప్రకృతి అనంత ముగా తెలియును. నిత్యయౌవని అనగా సృష్టి సమస్తం అనంతం. అది కొలతకు అందనిది. ప్రకృతిని అమృతత్వం గానేభావన. మార్పు మనిషి జీవనమునకు ముఖ్యం. పరిశీలిస్తే మనం ప్రకృతి నుండి స్వీకరించేది బహుస్వల్పం. అనంతమైన విశ్వం నుండి చాలా స్వల్పమైన తత్వాన్ని గ్రహించునట్లు అనంతమని అమృతత్వమని తెలియుచున్నది. . తన్నః ప్రజాం వీరవతీగ్ం సనోతు. గోభిః నో అశ్వైః స్సమనక్తు యజ్ఞం. గో అనగా గోవులు, కిరణములు అని కూడా. కిరణ మునకు ప్రయాణ లక్షణము కలదని మనకు తెలియును. అట్టి చిత్ర కుజ లక్షణమే యౌవన లక్షణముగా వేదం వచించినది. చిత్ర నక్షత్ర కిరణ లక్షణము ప్రకృతి 🌿🍃సంబంధియైనది. అది వసంత లక్షణము అనగా కుజ సంభందమైనదిగా  కలిగియున్నది. అందువలననే చైత్రం నుండి సృష్టి ఆరంభ లక్షణము గల నక్షత్ర మాస నామం చైత్ర మాసం. కేతువు శక్తి అనగా అశ్వని యే అశ్వ లక్షణము గల ప్రకృతి కిరణ లక్షణము. అది మేషరాశి యందు అనగా మీన మేష సంధియందు సృష్టి ఆవిర్భావ మునకు మూలం. జల తత్వం నుండి సృష్టి ఆరంభం జనమునకు భూమి మాత్రమే ఉపాధి అటులనే జలము వలననే దేహమునకు కూడా ఉపాది అనగా మూలమని తెలియును. ససం యువతిగ్ం. చక్కని యువతీ యువకుల లక్షణములు సృష్టి తేజో వంతమునకు మూలము. యువక  యువతి యిందు క తి క పురుష తత్వం దానికి ప్రకృతి తి లో యీ అని అగ్ని తత్వం ప్రకృతి . నార్తపోల్లో యున్న అశ్వ శక్తి యే ప్రకృతి శక్తికి మూలమని అదియే ఆత్మ శక్తిగా మనకు తెలియును.

*అమ్మను విసిగించే చిన్నమ్మాయి! ( తెలుగుతల్లి కెనడా వారి బహుమతి పొందిన కథ)*

రోళ్ళు పగిలే రోహిణీకార్తి ఎండలు. మధ్యాహ్నసమయం. వీధులన్నీ నిర్మానుష్యం. ఇరుగూపొరుగూ... బుద్ధిగా తలుపులేసుకుని ఇళ్ళల్లో కునుకుతీస్తున్నారు. గాలిస్థంభించి..ఆకులు కూడా కదలకుండా... గాడుపులకు తలలు వాల్చేసాయి. నూతిగట్టు మీద దాహానికి అరుస్తున్న కాకి గొంతు తప్పా మారు శబ్దం లేదు.
 అరగంట క్రితమే.... భోంచేసి వంటిల్లు ఎత్తిపెట్టుకుని, అమ్మ    వసారాగదిలో కూర్చుని..పాత నోట్సుపుస్తకంలో మిగిలిపోయిన తెల్లకాయితాలతో చిత్తుపుస్తకాలు కుడుతున్న ఇద్దరు అబ్బాయిలనూ, అష్టా-చెమ్మా ఆడుతున్న ఆడపిల్లలనూ.. గట్టిగా కేకేసి... మధ్యగదిలోకొచ్చి పడుకోమని కేకేసింది. 

అదే అదునుగా... అక్కచేతిలో ఓడిపోతున్న చిన్నమ్మాయి... గవ్వలు విసిరేసి... ఆటంతా కలిపేసి లోపలికి చక్కాపోయింది.  మరి అప్పగారు ఊరుకుంటుందా? చెల్లెలిని తరిమి పట్టుకుని,  వీపు వంచి రెండు గుద్దులేసింది.

చిన్నమ్మాయికి… ప్రతిక్రియకు అవకాశమివ్వకుండానే... అమ్మ మధ్యలోకొచ్చి.. హాలులో తడిదుప్పట్లేసి.. పైన చాపలేసిన పక్కలమీదకు రెక్కలట్టుకుని లాక్కొచ్చి కుదేసింది. 

అన్నగార్లూ, అక్కయ్యా ఫక్కున నవ్వుతుంటే... మా పౌరుషం పొడుచుకొచ్చింది చిన్న దానికి!  చుట్టూకట్టిన వట్టిచాపలను నీళ్ళుచల్లి తడిపి... అమ్మా…. పిల్లలతో పాటూ నడుం వాల్చింది.

 ఫేనుకిందే పడుకున్న చిన్నమ్మాయిని కాళ్లుపట్టి లాగేసి ,దౌర్జన్యంగా మూలకు ఈడ్చేసి... పెద్దన్నయ్య ఆ స్థలంలో…పడుకుండి పోయాడు.  మూసుకున్న కళ్ళ వెనుక వాళ్ళందరి నవ్వులూ ఊహించుకుని చిన్నమ్మాయికి కోపం నషాళానికి అంటింది. 

 నిద్రపోనని భీష్మించుని కూర్చుంది.  అమ్మ కసిరి 
"అయితే వరండా లోకి ఫో" అని అరిచింది.

చిన్నమ్మాయికి ఇట్టిట్టే అలకలు కదా! పైగా అలకలన్నీ అమ్మమీదే! ఎవరి మీద చూపిస్తే ఎవరూరుకుంటారూ?  సరే చేసేది లేక కటకటాల గదిలో కొచ్చింది.  ఎండగాడుపు వెచ్చగా కొట్టింది మొహానికి. పదేళ్ళ వయసున్న లేతచెంపలు ఒక్కసారి భగ్గుమన్నాయి.  అమ్మాయి దుడుకుతనంలో అమ్మాయిలకెక్కువ అబ్బాయిలకు తక్కువ. 

కటకటటాల గదిలో వాళ్ళనాన్నగారు పిల్లలు  పుస్తకాలూ, బొమ్మలూ పెట్టుకోడానికి.. జరుపుకునే తలుపులుండే... చక్కని గూడులు కట్టించారు. చిన్నమ్మాయి శబ్దం చెయ్యకుండా... అక్కగూడు తెరిచిందా.... ఒక్కసారి మనసు భగ్గుమంది. 

తీరువుగా... ఒకపద్ధతిలో సర్దుకున్న పుస్తకాలో పక్క.... తన వాటాకి నాన్నగారు పంచిన పది అమరచిత్రకధలు, గుండ్రటి చాక్లేట్ డబ్బాలో... పూసల బొమ్మలు అల్లే సామాగ్రి..., రెండు అందమైన స్పాంజి గౌనులు వేసుకున్న అమ్మాయి బొమ్మలు...  పెద్దమ్మాయికి..... వాళ్ళ బాబాయిలూ, మేనత్తలూ హైదరాబాదు వెళ్ళినపుడు చార్మినారులో కొనిపెట్టిన రకరకాల పొళ్ళగాజులన్నీ గాజులమల్లారంలా.. ఒక సిల్కుతాడుతో కట్టి...., అలాగే భద్రంగా దాచుకున్న… నాన్నగారు కలకత్తానుండి తెచ్చిన అద్దాల సంచీ....సగం అల్లి ఉంచిన క్రోషియా టేబుల్ మాట్, నీడిల్స్........ ప్రతీది ఒక పద్ధతిలో ఉండవలసిన తీరులో.... ఉండవలసిన స్థలంలో సర్దుకుంది ఆ పెద్దపిల్ల! 

చిన్నమ్మాయి..  అక్కపుస్తకాల లాటులోంచి " నిద్రా సుందరి" అమరచిత్ర కధ లాగింది. చెదిరిపోయిన పుస్తకాలు లోపలికి తోసేసి..... పుస్తకాల గూడుమీద కట్టిన విశాలమైన  స్లాబుల మీద కూర్చుని చదువుకోడానికి ఉపక్రమించింది.

ఆ గచ్చుస్లాబుల వేడికి కింద కాలిపోతున్నా,  లెక్కచెయ్య కుండా చకచకా ఓ పావుగంటలో పుస్తకం చదివేసింది.  అక్కడే బల్లమీదకు గురిచూసి విసిరింది.  కుదురే లేని చిన్నపిల్లకు మళ్ళీ తోచడం మానేసింది! 

తన పుస్తకాల గూడు తెరిచింది.  కుక్కి కుక్కి తోసేసిన పుస్తకాలు, పెన్నిళ్ళ డబ్బాలు, డ్రాయింగ్ పుస్తకాలు,  మెడ్రాసునుండి మేమమావ తెచ్చిచ్చిన రబ్బరుబొమ్మ, దానికోసం టైలర్ అప్పారావుకు ఆవకాయ లంచం పెట్టి తెచ్చిన రరకాల గుడ్డముక్కలతో కుట్టిన గౌనులూ, పంజాబీ డ్రస్సులూ... గవ్వలు, చింతపిక్కలు, మగపిల్లలతో జట్టుకట్టి ఆడే ఏడుపెంకులాట పెంకులు, గెలుచుకున్న గోళీలూ, మందిరం కడదామని సేకరించిన ఇంజక్షన్ సీసాలూ, రెండు గోటీబిళ్ళలు, క్లాసులో ఫస్ట్ ఒస్తే ఇచ్చిన వెండికప్పు, ఇంట్లో వాళ్ళ  ప్రాణాలు తీసేలా... విసిగిస్తూ ... పీపీ అంటూ ఊదే బూరాలూ, అన్నీ ఒక్కసారి మీదపడ్డాయి. 

 విసుగ్గా అన్నీ లోపలికి మళ్ళీ యధావిధి కుక్కేసి, తవ్వకాల్లో దొరికిన ఓ డ్రాయింగుపుస్తకం, పెన్సిల్ పట్టుకుని  రెండుకొండలూ, మధ్యలో సూర్యుడూ, ఓ పెంకుటిల్లూ, వెనకో రెండు కొబ్బరిచెట్లూ, పారే యేరు, నాలుగు పద్మాలూ, పద్మాల సైజులోనే ఓ గూడుపడవ..... ఆకాశంలో ఎగిరే కొంగలబారూ…. చకచకా వేసి పడేసింది!  వేసిందే కానీ…చిన్నమ్మాయికి ఆ బొమ్మ తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. ఎందుకంటే ఆ డ్రాయింగ్ పుస్తకంలో ఉన్న పదిపేజీల్లో... ఎనిమిది పేజీల్లో ఇదే సీనరీ! 
మరో బొమ్మ వెయ్యడానికి రాని తన అశక్తతకు చింతిస్తూ, మళ్ళీ కటకటాలకు వేలాడుతూ.... బూరా తీసి ఊదుకోసాగింది.   కర్ణకఠోరమైన ఆ శబ్దానికి ఎవరయినా రాకపోరా అన్న ఆశతో!

వచ్చాడు! వాళ్ళ పెద్దన్నయ్య నిద్రకళ్ళతో! వస్తూనే రెండు జెల్లకాయలు పీకి, వేలూపుతూ బెదిరించి మళ్ళీ లోపలికి పోయాడు! చిన్నమ్మాయికి రోషం పొడుచుకుని వచ్చేసింది.  ఈ ఇంట్లో తనింక ఉండలేననుకుంది.  కటకటాల గడి కిర్రుమంటూ జరిపి, కాళ్ళకు చెప్పులేనా లేకుండా బయటకొచ్చింది! 

ఏమంత పెద్ధవీధి. అటో పది ఇటో పది ఇళ్లూ... వీధి చివరే కాలవగట్టు, గోదారిపాయ!
నేల నిప్పులగుండంలా ఉంది. అలాగే గెంతుకుంటూ, పరుగులు పెడుతూ స్నేహితురాలు,  ప్రేమ ఇంటిదాకా వచ్చి, కాళ్ళుకాలకుండా వాళ్ళ రాధామాధవాల గుబురు నీడలో నించుంది.”  ప్రేమా, రామక్రిష్ణా లేచి వున్నారేమో! తలుపు కొడదామా”! అనుకుంది." అమ్మో! అసలే వాళ్ళమ్మ టీచరు.  తను లేబర్ ఆఫీసరు గారి కూతురయినా ఆవిడకేం లెక్కా పత్రమా.  ఒక్క కసురుతో ఫొమ్మంటుంది" అని స్వగతంలో అనుకుని, రివ్వున ఆ ఎండలోనే… పరిగెట్టి.... కాలవగట్టు మీదున్న క్రిష్ణమందిరానికొచ్చి.... అక్కడ అరుగుమీద కూర్చుంది. 

క్రిష్ణమందిరం ముందు అప్పుడెప్పుడో…వసంతపున్నమికి వేసిన తాటాకుల చలవపందిరి కింద సేదగా కూర్చుంది చిన్నమ్మాయి.

 వేడిగా వస్తున్నా,  గాలి జోరుగా వంటికి తగిలి ప్రాణానికి బాగుంది.  ఆ వయసే అంతేమో! ఎండయినా కొండయినా… లెక్కలేని వయసు!  ఎండిపోయి...బీటలేసిన రేగడితో , మధ్యమధ్య మిగిలిన నీళ్ళ చెలమలతో.... గోదావరి కాలవ శిధిలాలయంలా ఉంది.  అదే గోదారి… కార్తీకమాసం..నిండుసంద్రంలా ఉంటే…తనని సాయం తీసుకుని గుడికొచ్చిన బామ్మ గట్టుమీంచి అరుస్తున్నా లెక్కచెయ్యకుండా కాలవలో బారలేస్తూ ఈత కొట్టడం గుర్తొచ్చి, నిట్టూర్చింది చిన్నమ్మాయి.
“ ఎంత బావుండేవి ఆ కార్తీకస్నానాలు, అట్లతద్దికి వెన్నెలలో కాలవగట్టున ఇసుకలో ఆడిన ఆటలు…. సుబ్బారాయుడి గుడిబయట రావిచెట్టుకు వేసిన తాడెత్తు ఉయ్యాలలు భయం లేకుండా ఆకాశం అందేలా ఊగడం…. మార్గశిరంలో షష్టితీర్ధాలూ….క్రిష్ణమందిరంలో భీష్మేకాదశకి ఎక్కడెక్కడి నుండో వచ్చే భజనబృందాలు….వసంతపంచమికి ఆ లోగిళ్ళంతా రంగురంగల ముగ్గులేసి, జెండాలు కట్టి… గులాలు చల్లుతూ రాధాక్రిష్ణుల పాటలన్నీ తాళాలూ, ఢోలక్ వాయిస్తూ పాడడం….. తనుపాడిన “ గోపాలా రాధాలోల! గిరిధరబాలా నందలాలా” పాటకు బహుమతి రావడం ఇవన్నీఎంత సంతోషమైన దినాలు…!”…. అనుకుంటూ …. ఆటపాటలకు ఆనకట్టేసిన వేసవిరోజుల్ని తిట్టుకుంది!  

కానీ ఇప్పుడా! ఏ హడావిడీ లేదు! అసలు లోకంలో జనాలే లేరా అన్నట్టుంది! కాలవకవతల సామర్లకోట రోడ్డుమీద ఒకటీ అరా సైకిళ్శ మీద కాకినాడ టౌనులోకి పోతున్న అరటిగెలల వాళ్ళూ, తాటిముంజులాళ్ళూ తప్పా పిట్ట లేరు. అంత శూన్యజగత్తులో.... తనొక్కతే మిగిలినట్టు చిన్నమ్మాయికి .... ఎక్కడలేని బెంగా వచ్చేసింది. 

    కాసేపటికి కాలవగట్టుమీద ఇద్దరు అమ్మిలు తట్టలు నెత్తిన పెట్టుకుని నడుచుకుంటూ... వచ్చారు. మందిరం అరుగుమీద కూలపడ్డారు. నెత్తిమీద చుట్టగుడ్డ విప్పి.... మొహాలకు పట్టిన చెమట్లు తుడుచుకున్నారు. 

ఒక తట్టలో ఎండుచేపలూ, రొయ్యిలూనంట... మరొక తట్టలో తాటిముంజెలు ! అప్రయత్నంగా ముక్కు మూసుకుంది చిన్నమ్మాయి. " బేపనోల్లా పాపా!".... అంటూ వాళ్లు నవ్వుతూ అడుగుతుంటే... పౌరుషంగా..." ఆ బ్రాహ్మణుల అమ్మాయినే! " అంటూ మరింత స్పష్టం చేసింది. 

        చిన్నమ్మాయి నిష్ట ఎంతోసేపు నిలబడలేదు. మెల్లగా ముక్కుమూసుకునే చేపల తట్టలోకి తొంగిచూసింది. దానిలో ఉన్న ఒక్కోజీవి పేరూ అడిగింది. ఓ పదినిమిషాలు.... మొత్తం మత్స్యజాతి వేట, గాలమెలా వేస్తారు? జాలంలో ఎలా పడతారూ. , ఎలా ఎండపెడతారూ, ఎలా బజారుకు చేరుస్తారు.... ఇత్యాది..జంతుశాస్త్ర.. ఆర్ధికశాస్త్ర విషయాలన్నీ చేపలమ్మాయితో… చర్చించింది!

 ఇంతలో... ముంజులమ్మాయి "తీసుకో పాపగారూ"...... అంటూ తాటాకుదొన్నెలో అందించిన లేతముంజుల్ని .... మురికిచేతుల్ని.... అమ్మ .. లోపల మల్లుగుడ్డేసి కుట్టిన తెల్లని గ్లాస్కో గౌనుకు ఓసారి తుడిచేసుకుని.... మనసారా తినేసింది! 

ఎండా కాస్త తగ్గుమొహం పట్టింది... చిన్నమ్మాయి వేసవి తాపమూ తగ్గింది. 

          ఇంటికి పోవడానికి లేచింది మెల్లగా. కొత్తమిత్రులకు టాటా చెప్పింది. ఎప్పుడయినా వాళ్ళింటికి రమ్మంది. " ఎందుకు పాపా! సేపలు కొంటావా? "... అంటూ మేలమాడింది చేపలమ్మి. "కాదులే మా అమ్మ ఊరగాయ పెడుతుంది. పాతచీరలు ఇమ్మంటాను! "....... అమ్మ అనుమతి లేనిదే వరాలిచ్చేసి... అటోకాలూ, ఇటోకాలూ ఊపుకుంటూ... పోయింది చిన్నమ్మాయి. 

         ఇంటికి చేరిందే కానీ..కావాలని కటకటాలు లోపలినుంచి గడీ పెట్టేసారు. " ఇప్పుడెలా?" ! 

చెక్కకుర్చీలో కూర్చుని వాళ్ళ బామ్మ... ఊదుకుంటూ... ఇత్తడి ఆపుకోరాలో టీ తాగుతోంది. ఆవిడ బయట నిలబడున్న చిన్నమ్మాయిని మహాకోపంగా చూస్తోంది. 

ఈలోపున అమ్మ వచ్చింది. ముసలమ్మ " దానికి తలుపుతీసేవంటే... నేను నూతిలో దూకుతా! మగరాయుడిలా ఊళ్ళుపట్టి తిరిగి పరువుతీస్తోంది".... అంటూ జారిపోతున్న ముసుగు సవరించుకుంది. 
చిన్నమ్మాయికి నోరెక్కువ! " దూకవే! బోడిముండా! పీడావదులుతుంది! " అని గొణిగింది. 
అంతే తలుపులు తెలుచుకోనూ, వీపు మీద అమ్మ దబదబా నాలుగు బాదనూ అయిపోయింది. 

      చిన్నమ్మాయి పెద్దగా ఇవన్నీ పట్టించుకోదు. కాగితం మంటలా ఒక్క ఏడుపు ఏడ్చి మర్చిపోతుంది. అమ్మది ఆల్సేషన్ ముక్కుకదా! చేపల వాసన పట్టేసింది. " ఈపిల్ల ఎక్కడ తిరిగొచ్చిందో...." అని తల పట్టుకుని..." ఫో! ఇంట్లోకి రాకు. సందులోంచి పోయి.. నూతిదగ్గర స్నానం చేసిరా! ".... అని తోసేసి తలుపులేసేసుకుంది. చిన్నమ్మాయికి మామ్మముందు తలకొట్టేసినట్టయింది.
 నూతిలో నీళ్ళు తోడుకుని నెత్తిమీంచి పోసేసుకుంది. చల్లనీళ్ళు ప్రాణాలకు హాయిగా ఉన్నాయి. అలా నీళ్ళలో నానుతూనే ఉన్న చిన్నమ్మాయిని దెబ్బలాడి వాళ్ళమ్మ.... తువ్వాలు విసిరి తుడుచుకోమంది. 
అలా పెరటిగుమ్మాన పడి లోపలికొచ్చిన చిన్నమ్మాయికి కళ్ళు మిలమిలా సంతోషంతో మెరిసిపోయాయి. 

        ఎప్పుడు కొందో ఏమో అమ్మ! ..... పెద్ద స్టీలు బేసిన్ నిండా కుప్పగా పోసిన పందిర మల్లెమొగ్గలు. సన్నగా, పొడవుగా... వాళ్ళ అక్కలా అందంగా! సుకుమారంగా! పక్కన అరటాకుల్లో చుట్టి ఉన్న కనకాంబరం మాలలు, మరువం, ధవనం కొమ్మలు!  తెల్ల దూరపుండ, సూదులూ, విస్తరాకులు కలిపికుట్టిన పెద్ద అట్ట! 

" ఓహ్! అమ్మా! మాకు జడలు కుడుతున్నావా ఈవేళ?!".... అంటూ బిగ్గరగా చిన్నమ్మాయి అరిచింది. 

" అవునే! అయితే ఏంటిటా?!"..... అంటూ తిప్పుకుంటూ…వాళ్ళక్క లోపలినుంచి వచ్చింది.
 ఆ మధ్య దాని ఫంక్షనుకు అమ్మమ్మ కొన్న కొత్త పట్టుపరికిణీ వేసుకుని, పౌడరూ, బొట్టూకాటుక పెట్టేసుకుని, ఎర్ర పొళ్శ నెక్లేస్ మెడలో తగిలించుకుని.. , దాని పొడవాటి ఒత్తు జుట్టంతా.... సాపుగా దువ్వేసుకుని రెడీగా ఉంది పెద్దమ్మాయి. 

చిన్నమ్మాయికి గాభరా వచ్చేసింది. తడితలను ఏదో మమ అన్నట్టు తుడిచేసుకుని….. ఆ తడిమీదే ఇంత పౌడరు కొట్టుకుని…ఎండకు బాగా పేలిపోయి, చమటలు పడుతున్న ఆ నుదుటిమీద పొడవుగా ఇంత తిలకం పుల్లతో పైకిలాగింది. “ అమ్మా! ఏం పట్టుపరికిణీ వేసుకోనే! …” అంటూ అరిచింది. అమ్మచెప్పినట్టే… అక్కకు మోకాళ్ళ కిందకు వచ్చేసిన ఎర్రంచు ఆకుపచ్చ లంగా వేసేసుకుని…. పువ్వులు పేరుస్తున్నఅమ్మ దగ్గరకు పరిగెట్టుకొచ్చింది. 

       మొహాన  తెల్లఅట్టల్లా కట్టేసిన పౌడరుతో… ముక్కుమీంచి కారిపోతున్న తిలకంతో… నీరుకారుతున్న పొట్టి జుట్టుతో నించున్న చిన్నమ్మాయిని చూసి అంతా పడీపడీ నవ్వారు. 

చిన్నమ్మాయి ఎక్కడ ఉక్రోషపడుతుందో అని అమ్మ భయపడిపోయీ…. చేతిలో పువ్వులు ఆపట్టాన బేసిన్ లో పడేసి… కూతురు తలంతా పొడిగా తుడిచింది. పౌడరు సరిచేసి… ముక్కుతుడిచిందా… చిన్నమ్మాయి ఎర్రని ముక్కుతో సత్యభామలా ఉందట అమ్మకళ్ళకు. ఆమాటే అంటుంటే…. “ కొండముచ్చు”లా ఉందని గేలిచేసారు మిగిలినవారు. 

            జడకుట్టించుకోడానికి పెద్దమ్మాయి కూర్చోగానే…. అమ్మ.. తనకు తల దువ్వి కుదురుగా పాయలు తీసి.. పైనుండి గట్టిగా బిగిస్తూ… నల్లని పొడావయిన కొరడాలాంటి జడల్లింది… మధ్యలోంచి సిల్కుకుచ్చెల బంగారం జడగంటలు కలుపుతూ… భలే అందమయిన జడవేసింది. ఆ తరవాత అబ్బాయలూ, చిన్నమ్మాయి.. మంచిపొడవైన సౌష్టవపు మొగ్గలు అందిస్తుంటే … చకచక అట్టకు వేసి కుట్టేస్తోంది.

 ప్రతి ఐదువరసల తరువాత.. ఇంట్లోపూసిన చిక్కని కాషాయపు మద్రాసు కనకాంబరాలూ, ధవనం కలిపి బద్దీలు వేసింది. అరగంటలో జడంతా కుట్టీ చివర… మల్లెల సరాలు కూర్చి వాటి చివర దేశవాళీ గులాబీలను వ్రేలాడతీసింది. అంత అందమయిన జడను చూసి…. అమ్మ నేర్పరితనానికి పిల్లల కళ్ళు ప్రశంసగా మెరిసాయి. 
      మగపిల్లలను వంటింట్లో కాసిని పకోడీలు వేసుకురమ్మని పంపి…. అమ్మ పెద్దమ్మాయి జడకు… చకచకా పూలజడ టాకాలు వేసేసింది. కట్టిపెట్టి ఉంచిన బొండుమల్లెల దండ, కనకాంబరాల దండా… జడపైన అర్ధచంద్రకృతిలో అమర్చి… పిన్నులు పెట్టింది. ఆ పైన అమ్మ పుట్టింటారు ఇచ్చిన తెల్లరాళ్ల సూర్య చంద్రులను తలకు అటూయిటూ పెట్టింది. మధ్యలో ముచ్చటయిన నాగరం పెట్టింది.

 పెద్దమ్మాయిని ముందుకు తిరగమని… చుబుకం పట్టుకుని… పొళ్ళ పాపిడిపిందె పెట్టింది. తన మామిడిపిందెల గొలుసు వేసింది. చెవులకు లోలాకుబుట్టలు పెట్టి… నాలుగు పేటల చెంపస్వరాలు పెట్టింది. 

పుల్లతో దిష్టితగలకుండా బుగ్గమీద చిన్ననల్ల అలుగుబొట్టు పెట్టింది. లేచి నిలబడమని… చంద్రకాంతరంగు పట్టుపరికిణీలో… కుందనబొమ్మలా మెరిసిపోతున్న పెద్దమ్మాయిని తనివితీరా చూసుకుంది. చిన్నమ్మాయికి కూడా అక్క తెగనచ్చేసింది. వెళ్ళి గాట్టిగా కావలించుకుంది. “ అబ్బా! బట్టలూ, జడ నలిపేయకే…” అంటూ మురిపెంగా విడిపించుకుంది పెద్దమ్మాయి. 

         ఇప్పుడు చిన్నమ్మాయి వంతు కదా! అన్నలిద్దరూ… పకోడీలూ, మైసూరుపాకూ ప్లేట్లలో సర్ది… అందరికీ తెచ్చారు.

 చిన్నమ్మాయి అల్లప్పచ్చడి కావాలంది. బామ్మ..” కుళ్ళుముండకి అల్లంపచ్చడి!” అంది. చిన్నమ్మాయి వెంటనే… “ బోడిముండకి దోసకాయపచ్చడి” అంది! అమ్మకు కోపం వచ్చింది. విసురుగా ముందుకు తోసింది. చిన్నమ్మాయి ముందుకు పడింది. 

కోపంతో చిన్నమ్మాయి పకోడీల ప్లేటు విసిరేసింది. పకోడీలు పూల బేసిన్ లో పడ్డాయి. అమ్మకు కోపం తారాస్థాయికి చేరుతోంది. అది గ్రహించి … పదిహేడేళ్ళ పెద్దబ్బాయి కలగచేసుకుని… అమ్మకన్నా ముందు చిన్నమ్మాయిని శాంతింప చెయ్యాలని గ్రహించి….” చాలు.దీన్ని ఎవ్వరూ ఏమీ అనడానికి వీల్లేదు. దీనిలా మీకెవరికయినా అన్ని పరిక్షల్లో నూటికి నూరొచ్చాయా? రాలేదు కదా! నోరుమూసుకోండి! “…. అని గద్దించాడు. 

       అమ్మ చిన్నదాన్ని ఒక్క గుంజుగుంజి…తన కెదురు కుదేసింది. పొద్దున్నే బళ్ళకు పంపుతూ… నాలుగేసి బారుజడలు వెయ్యలేక చిన్నపిల్లకు పొట్టిజుట్టు చేయించేసి… రెండు పోనీటెయిల్స్ వేసేది. ఈరోజూ అలాగే రెండు పోనీటెయిల్స్ వేసింది. వాటికి నల్లదారాలతో రెండు పెద్ద సవరాలు కట్టి జడలల్లింది. చకచకా పావుగంటలో మూడుగజాల మల్లెమాలలు సున్నితమైన వేళ్ళను వేగంగా నేర్పుగా తిప్పుతూ అల్లేసింది. వాటిని చిన్నమ్మాయి రెండుజడలకూ నిండుగా చుట్టేసింది. ఆ జడనుండి ఈ జడకు ఉయ్యాలలాగా మాల వేసింది. తలోజడలో తలో గులాబీ గుచ్చింది. 
      
కొయ్యగండ్లు వచ్చిన చెవికన్నాలకు ఆ పుల్లలే ఉంచేసింది. చిన్నమ్మాయికి దాని ఆంజనేయస్వామి బిళ్ళ బంగారుగొలుసు వేసింది. “ ఆ చార్మినార్ గాజులు వేసుకో ఫో!” అంది.

 ఈ తేడాలను చూస్తున్న  చిన్నమ్మాయి మనసు లావాలా కుతకుతలాడుతోంది.

 దానికి తగ్గట్టే… కాళ్ళకు దణ్ణం పెడుతుంటే… బామ్మ పెద్దమ్మాయికి పదిరూపాయిలూ.. ఈవిడికి ఐదే ఇచ్చింది. 
ఆ అవతారాలతో అప్పచెల్లెళ్ళిద్దరూ.. పేటంతా తిరిగారు. పెద్దలకు దణ్ణాలు పెట్టారు. 

అందరూ పెద్దమ్మాయి బుగ్గలు పుణికి, మెచ్చుకుని రూపాయో… రెండ్రూపాయలో చేతిలో పెట్టారు! … చిన్నమ్మాయి బుగ్గలు నొప్పెట్టేలా సాగదీసారు. ఆ రెండుజడల పూలజడను చూసి ముసిముసి నవ్వులు కూడా నవ్వుకున్నారు. 

తన పదేళ్ళ జీవితంలో ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదనుకుంది చిన్నమ్మాయి. 

        ఇంటికి వస్తూనే…. రాత్రివంటకి..కత్తిపీట ముందేసుకుని అరటికాయలు తరుగుతున్న అమ్మ ఎదురుగా నిలబడింది. 
అమ్మతలెత్తి చూసింది. 

చిన్నమ్మాయి మౌనంగా.. జడకు చుట్టిన పూలదండలు పరపరా కిందకు లాగింది. దారాలకు ఉరేసినట్టు మల్లెపూలన్నీ విగతగా నేలంతా రాలిపోయాయి!

కసిగా ఇంకా పీకింది! ఇంకా పీకింది. రెండు సవరాలు చేతికేచ్చేంత వరకూ పీక్కుంది! ఆ రెంటినీ పట్టుకుని అమ్మమీదకు విసిరేసింది. 

సన్నని బంగారుగొలుసు మెడనుకోసేలా లాక్కుంటూ ముక్కలు చేసి మూలకు విసిరింది. 

        అమ్మ నిశ్చేష్టే అయ్యింది.
 పిల్లలు బిత్తరపోయారు చెల్లిని చూసి! పక్కనే క్రిష్ణాజినంపై కూర్చుని రుద్రాక్షతావళం తిప్పుతూ… ధ్యానంచేస్తున్న బామ్మకోపం ముంచుకు రాగా,, అసంకల్పితంగానే… చిన్నమ్మాయి మీదకు రుద్రాక్ష తావళం గురిచూసి విసిరింది. 

పిల్ల కంటికి గట్టిగానే తగిలింది. ” అమ్మా! “ అని కన్ను ఒకచేత్తో… పట్టుకుని… చేతికందిన పూలబుట్ట బామ్మ మీదకు విసిరింది. 

అమ్మ భద్రకాళే అయ్యింది. కత్తిపీట పట్టుకుని ఒక్క ఉదుటున లేచి… చిన్నమ్మాయి కేసి రౌద్రంగా ఉరకపోయింది.

 చిన్నమ్మాయి భయంతో పెరట్లోకి పరిగెట్టి… ఉరుకుతూ,ఏడుపుతో  వెక్కుతూ.. పెరట్లో తాతలనాటి నుండీ ఉన్న పొడుగాటి  మావిడిచెట్టును కోతిలా… చకచకా ఎక్కేసింది…. ఓ పక్క పరికిణీ కాళ్ళలో అడ్డుపడుతున్నా! 

కొమ్మ మీంచి కొమ్మ అందుకుంటూ……చిటారి కొమ్మకు చేరి… ఓ పెద్ద కొమ్మమీద పొట్టఆన్చుకుని కరుచుకున్నట్టు కూర్చుంది. అమ్మకు గుండాగిపోయింది చిన్నదాని అఘాయిత్యానికి.

 “ ఎవరయినా చెట్టు ఎక్కేరా… దూకేస్తా!”… అంటూ చిన్నమ్మాయి కీచుగొంతుతో అరుస్తోంది. అమ్మ కూడా కుర్రాళ్ళను చెట్టు ఎక్కకుండా వారించింది. అక్క వచ్చి” దిగవే!.నా అమరచిత్రకధలన్నీనీకే ఇచ్చేస్తా”..నంటూ ఆశపెట్టింది. అయినా దిగలేదు. 

         ఈలోపున వాళ్ళ నాన్నగారు వచ్చిన అలికిడి అయింది. అమ్మ ఇంట్లో గొడవలేవీ నాన్నగారికి చెప్పి విసిగించదు. పూలజడేసుకున్న పెద్దపిల్లను చూసి నాన్నగారు చాలా ముచ్చటపడ్డారు. 

నిలువుటద్దంలో పూలజడ కనిపించేలా ఫోటోలు తీసారు. “ చిన్నదేది” అంటూ చుట్టూ కళ్ళతో వెతికారు. బామ్మగారు ఏదో మాయమాటలు చెప్పి…. మాట మరిపించారు. 

అంతే! ఒక్కసారి...నాన్నగారు ఆయన గదిలోకి వెళిపోతే… ఇహ అన్నీ అక్కడికే. ఇంగ్లీషు పుస్తకాలు చదువుకుంటూ ఉండిపోతారు. 

             వేసవి అవడం వల్ల…. రాత్రి ఎనిమిదింటికి చీకటయింది. 

చిన్నమ్మాయి కిందకొమ్మల మీదకొచ్చి… చెట్టుమీదకి వచ్చి చేరిన పక్షులను పలకరిస్తోంది. అవి నిద్రమత్తులో ఎగరనూ లేక గూళ్ళలో బజ్జునే…. ఏవో కువకువలతో జవాబులిస్తున్నాయి. 

ఎనిమిదింటికి… భోజనాలవేళ… చిన్నదాన్ని పిలుచురమ్మని పిల్లల్ని పంపింది అమ్మ. “ రానంది” చిన్నావిడ. అమ్మ బతిమాలద్దంది. 

భోజనాలయ్యాకా… అమ్మ మర్నాటికని గారెలపప్పు రుబ్బడానికొచ్చింది. ఇంటి చుట్టూ లైట్లేసింది. 

చిన్నమ్మాయి చెట్టుమీంచి అమ్మనే చూస్తోంది. అమ్మపిలిస్తే బావుండుననుకుంటోంది. 

        అమ్మ దీక్షగా పప్పురుబ్బుతోంది. చిన్నమ్మాయికి ఉదయం నుండి తిరిగిన తిరుగుడు తాలూకు అలసట, ఆకలి, దాహం, దుఃఖం, అవమానంతో ఏడుపు తన్నుకొస్తోంది. దాన్ని రోషం ఆపుతోంది. 

కాసేపటికి లైటులు ఆర్పకుండానే అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. 

తమ ఇంటివెనకనే ఉన్న నిర్మానుష్య పురాతన దేవాలయాన్ని చీకట్లో చూస్తుంటే చిన్నమ్మాయికి బెంబేలుగా ఉంది. 

గట్టిగా అరిచి నాన్నగారిని పిలిచి …. తనకు జరుగుతున్న అన్యాయాలూ… మిగిలినవారి దౌర్జన్యం చెబ్దామా అనుకుంటోంది. 
         ఇంతలో… వంటింటితలుపు తెరుచుకుంది. అమ్మ బయటకొచ్చింది. పెరటి వరండా మీద చాప పరిచింది. ఏవో గిన్నెలు సర్దింది. 

చెట్టుకిందకొచ్చింది. పిల్లకు కడుపులోంచి దుఃఖం, ఆనందం ముంచుకొచ్చాయి. “ దిగు” అంది అమ్మ.

 ఆ స్వరంలో కోపం లేదు. దయ, ప్రేమా, మార్ధవం తప్పా. మరింక బెట్టు చెయ్యలేకపోయింది చిన్నమ్మాయి. చకచకా దిగి అమ్మను చేరింది.

 అమ్మ గట్టిగా కావలించుకుంది. అమ్మ కళ్లలో నీళ్లు! నుదుట ముద్దుపెట్టుకుని… చిన్నమ్మాయిని నూతి దగ్గరకు తీసుకెళ్లి చల్లనీటితో చేతులు, మొహం  కడిగి.. తన మెత్తని చీరకొంగుతో తుడిచింది. 

వరండాలో వేసిన చాపమీద రెండు వెండికంచాలు పెట్టింది. ప్రశ్నార్ధకంగా చూసిన చిన్నమ్మాయితో…” రెండోది నాకే!” అంది.

 కూరన్నం, చారన్నం తినగానే… అమ్మ రెండుకంచాల్లో మల్లెపువ్వంటి అన్నం వేసి… కంచాల నిండుగా మీగడపాలు పోసింది. మరో గిన్నెనుండి ముక్కలపులుసులో పులుసుముక్కలన్నీ గరిటతో తీసి… ఇద్దరి కంచాల్లో వేసింది. 

ఇద్దరూ ఒకరి మొహాల్లోకి ఒకరు చూసుకుని ఫక్కున నవ్వుకున్నారు. అది వారిద్దరికే ప్రత్యేకమైన అభిరుచి! 

        అన్నాలు తినేసాకా… సామాన్లన్నీ నూతిచప్టా దగ్గర పడేసింది అమ్మ. 

తులసికోట గూటిలో ఉన్న దీపంలో నూనెపోసి… వత్తి ఎగదోసింది. 

చాపమీద కాళ్ళు కిందకు వేలాడేలా కూచుంది. చిన్నమ్మాయిని… చేతులు చాచి.. “ ఇలా రా!” అని పిలిచింది. ఒళ్ళోకి లాక్కుని… గట్టిగా కౌగిలించుకుని…. బుగ్గలంతా ముద్దుపెట్టుకుంది. 

పక్కనే కిటికీలో పెట్టిన బసంతమాలతి లోషన్ తీసి… చమటకాయలతో పేలిపోయిన నుదురూ, చెంపలూ, వీపుకు మృదువుగా రాసింది. 

ఆ పట్టుపరికిణీ తీసేసి, దండెం మీద ఆరేసున్న నూలు గౌను వేసింది. 

బాదం చెట్టు ఆకులు విసెనకర్రలు విసురుతూ వేసవితాపం తీరుస్తున్నాయి. అమ్మా- చిన్నమ్మాయి ఆ చుక్కల ఆకాశాన్ని చూస్తూ  బోలెడు కబుర్లు చెప్పుకున్నారు.

“ అన్నలూ, అక్కా మరో ఐదేళ్ళకు బయటకు వెళ్ళిపోతారుగా! మరి వాళ్ళకు కాస్త ఎక్కువ చూసి పంపాలి కదా నేను! ఆ తరవాత మనిద్దరమే మిగులుతాం. అప్పుడు అమ్మ అచ్చంగా నీదే! అన్నీ నీవే! మనిద్దరం కలిసి సినిమాలు చూడచ్చు, పుస్తకాలు చదవుకోచ్చు, మామయ్యల ఊర్లు వెళ్ళచ్చు, నువ్వు వేసవిసెలవల్లో రోజూ పూలజడ వేయించుకోచ్చు. నా నగలన్నీ నీకే కదా! చిన్నతల్లీ! నువ్వు మా అమ్మవురా! నా కోసమే మళ్ళీ పుట్టావు. నాలాగే… బోల్డంత బుర్రతో, అల్లరితో!” …. అంటూ అమ్మ చెప్తుంటే… నిద్రకూరుకుపోతున్న కళ్ళతో అమ్మ నడుం మీంచి తన ఎడమ కాలుతిప్పి….” అమ్మా! ఎందుకు నేను మీ అమ్మను?”… అని అడిగింది చిన్నమ్మాయి. “ మా అమ్మకు కూడా నీలాగే ఇట్టు కోపం. ఒకరోజు నేను విసికించానని … నా పదేళ్ళప్పుడు ఎత్తి వీధిలోకి విసిరేసింది!”….. అని పకపకా నవ్వింది అమ్మ. 

చిన్నమ్మాయికి నవ్వు రాలేదు. పదేళ్ళ అమ్మకు తన లేత చేతులతో నడుం రాయసాగింది! 

ఇలా పెళ్ళయే వరకూ అమ్మను దేనికో దానికి… అలకలతో, కోపాలతో విసికిస్తూ, సాధిస్తూనే ఉంది చిన్నమ్మాయి. పెళ్ళవడంతోనే అమ్మమీద అలకలూ, విసుకులూ ఆయనమీదకు మళ్ళినా అమ్మంత శాంతమూర్తే దొరికాడు చిన్నమ్మాయికి! 

అమ్మ చెప్పినట్టు అక్కా, అన్నలూ నిజంగానే వెళ్ళిపోయారు….. చాలా దూరం… అమెరికాకు! బామ్మా వెళ్ళిపోయింది! నాన్నగారూనూ! 

ఇప్పుడు చిన్నమ్మాయికి ఏభైయేళ్ళు. అమ్మకు ఎనభై అయిదు.

 అమ్మ మరుపులతో, అలకలతో, ముదిమి బాధలతో….తనతోనే ఉండిపోయిన  చిన్నమ్మాయిని విసికిస్తూనే ఉంటుంది. 

చేతిలో ఏముంటే అది మీదకు విసురుతుంది. అన్నం తిననంటుంది. మందులు ఉమ్మేస్తుంది.

 కానీ చిన్నమ్మాయికి అస్సలు కోపం రాదు.
నవ్వుతూ… ప్రేమగా… అమ్మతల తన బొజ్జకు ఆన్చుకుని… వీపంతా మోయిశ్చరైజర్ రాస్తుంది. డైపర్స్ మారుస్తుంది సహాయకురాలి సాయంతో.  

స్పాంజిబాత్ చేయించి… మెత్తని గుడ్డలతో తుడుస్తుంది. మల్లెపువ్వంటి పక్కేసి… మల్లెచెండులా పడుకోపెడుతుంది అమ్మను. 

       అయితే మొన్ననే ఈమధ్య …..చిన్నమ్మాయి మళ్ళీ అమ్మను తెగ విసికించింది… అమ్మను అంతిమయాత్రకు వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ… అమ్మ చల్లని చెయ్యిని పట్టుకుని వదలకుండా!! 

 *ధన్యవాదాలతో* 
 *శశికళా ఓలేటి* .