28, ఆగస్టు 2025, గురువారం

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: పదకొండవ అధ్యాయం

విశ్వరూపసందర్శనయోగం:అర్జున ఉవాచ


నభఃస్పృశం దీప్తమనేకవర్ణం

వ్యాప్తాననం దీప్తవిశాలనేత్రమ్ 

దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా

ధృతిం న విందామి శమం చ విష్ణో (24)


దంష్ట్రాకరాలాని చ తే ముఖాని

దృష్ట్వైవ కాలానలసన్నిభాని 

దిశో న జానే న లభే చ శర్మ

ప్రసీద దేవేశ జగన్నివాస (25)


ఆకాశాన్ని అంటుతూ, అనేకరంగులతో ప్రకాశిస్తూ, నోళ్ళు విప్పి, ఉజ్జ్వల విశాల నేత్రాలతో వున్న నిన్ను చూసి ఎంతో భయపడిపోయిన నేను ధైర్యం, శాంతి పొందలేకపోతున్నాను. కోరలతో భయంకరంగా ప్రళయకాలంలోని అగ్నిలాగ కానవస్తున్న నీ ముఖాలు నాకు దిక్కుతోచకుండా చేశాయి. దేవేశా.. జగన్నివాసా.. దిగులు పడివున్న నన్ను అనుగ్రహించు.

చింత చిగురు...*

 ;

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀```ఆరోగ్య చింతలను తీర్చే…```



                *చింత చిగురు...*

                   ➖➖➖✍️

తింటే మీకే తెలుస్తుంది...,



```

సీజన్‌లో దొరికే చింత చిగురును ఆహారంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. 


ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింతచిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. 



*చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 

*దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పని చేస్తుంది. 

*ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చింతచిగురు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. 

*ఈ చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి, మంట, వాపు తగ్గుతాయి. 

*యాంటీ ఇన్‌ఫ్లేమటరీ గుణాలు చింత చిగురులో ఉండటమే ఇందుకు కారణం. 


*కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. 

*జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. ఈ చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. 

*ఇవి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పటిష్ఠపరుస్తాయి. 


*తరచూ చింత చిగురును తింటే ఎముకలు ధృడత్వాన్ని సంతరించుకుంటాయి. 

*థైరాయిడ్‌తో బాధపడేవారు చింత చిగురును తమ ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

*గుండె జబ్బులను చింత చిగురు దరిచేరనీయదు. 

*శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అవసరమైన పోషకాలను అందించడమే గాక, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. 

*చింత చిగురును పేస్ట్‌లా చేసి కీళ్ళపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

జగన్నాథ స్వామి ఆలయం

 🕉 మన గుడి : నెం 1217


⚜  ఒడిస్సా : పూరీ 


⚜  శ్రీ క్షేత్రం - జగన్నాథ స్వామి ఆలయం



💠 మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం , విశిష్టత , అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటారు. అలాంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిచెందిన పూరీ జగన్నాథ ఆలయం.



💠 జగన్నాథ ఆలయాన్ని శ్రీకృష్ణుడు తన సోదరుడు మరియు సోదరితో జగన్నాథుడిగా ప్రధాన దైవంగా నిర్మించినప్పుడు, పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి , పురుషోత్తమ క్షేత్ర , పురుషోత్తమ ధర్మ , నీలాచల , నీలాద్రి , శ్రీక్షేత్ర , శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.



🔆 స్థలపురాణo 


💠 కృష్ణుడి అవతారం అయిన జగన్నాథుడు.. ఒకనాడు ఒక అత్తిచెట్టు కింద ఇంద్రనీలం రూపంలో మెరుస్తూ ధర్మరాజుకు కనిపించాడు.

అది చూసిన అతను... ఒక విలువైన రాయి అని భావించి.. నేలమాళిగలో ఎవరికంటా పడకుండా నిక్షిప్తం చేశాడు.


💠 ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు అనే రాజు దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆశతో వెదకడం మొదలుపెడతాడు.

అయితే అది ఎక్కడుందో కనిపెట్టలేక భూమంతా తవ్వి వెదికాడు. 

అయినా అధి లభించకపోవడంతో నిరాశతో నీరసించిపోతాడు.

అక్కడే కొద్దిసేపటివరకు సేద తీర్చుకోవాలని నిద్రపోతాడు.


💠 ఇంద్రద్యుమ్నుడు నిద్రిస్తున్న సమయంలో అతని కలలోకి విష్ణువు కనిపించి నదీ తీరానికి ఒక కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా మలచమనీ ఆజ్ఞాపించాడట. 

కానీ అలా నదీతీరంలో 

లభ్యమైన దారువును విగ్రహాలుగా మలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదట. 


💠 అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ రాజువద్దకు మారువేషంలో వచ్చి ఆ కొయ్యను తాను విగ్రహాలుగా మలచగలనన్నాడట. 

కానీ తాను తలుపులు మూసుకుని ఈ పని చేస్తాననీ తన పనికి మధ్యలో ఆటంకం కలిగించకూడదనీ షరతు పెడతాడు. 


💠 కానీ పదిహేను రోజుల తర్వాత... ఉత్సుకతను ఆపుకోలేని రాజు తలుపులు “తెరిపించాడట. అప్పటికి విగ్రహాల నిర్మాణం పూర్తికాలేదు. 

అందువల్లే కృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలకు చేతులు వుండవు.


💠 దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారనీ ఇప్పటికీ జగన్నాధుడు అదే రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడనీ స్థలపురాణం


💠 విమల ఆలయం (బిమల ఆలయం) శక్తిపీఠాలలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది . 

ఇది ఆలయ సముదాయంలోని రోహిణి కుండ్ సమీపంలో ఉంది . జగన్నాథుడికి సమర్పించిన ఆహారాన్ని విమల దేవతకు సమర్పించే వరకు దానిని మహాప్రసాదంగా పరిగణించరు.


🔆 రథయాత్ర


💠 ద్వాపరయుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. 

ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరికొందరు చెబుతారు. 


💠 ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే... 

పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ జగన్నాథ బలభద్రుల కోసం ప్రధానాలయానికి 3 కి.మీ. దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. 


💠 రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిధ్యం ఇస్తారు. ఒకరకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాధుడి అతిథిగృహం అన్నమాట!


💠 ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు పూరీ జగన్నాథాలయం. 


💠 సుభద్రా బలభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. 

అందుకే జగన్నాథుడి రతయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.


💠 జగన్నాథుని కన్నుల పండువగా రథయాత్రను నిర్వహిస్తారు.

ఈ యాత్రను ఆషాడశుక్ల విదియనాడు ప్రారంభం అవుతుంది. అంటే జూన్ లేదా జూలై నెలల్లో జరుగుతుంది.


💠 శ్రీ జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 

బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. 

సుభద్ర రథాన్ని దర్పదళన అంటారు.


💠 ఇక్కడ భగవంతుడికి 56 రకాల ప్రసాదాలు కట్టెల పొయ్యి మీద వండి భగవంతుడికి ప్రతినిత్యం నివేదిస్తారు. 

ఆ ప్రసాదాలన్నీ నిలువునా పేర్చిన 6 కుండలలో వండుతారు, కట్టెల పొయ్యికి దగ్గరగా ఉండే కుండలో ఎంత నాణ్యతతో ప్రసాదం తయారు అవుతుందో చివరి కుండలో కూడా అంతే నాణ్యతతో ప్రసాదం తయారవడం ఇక్కడి భగవంతుడి లీలగా పరిగణిస్తారు.


💠 అలా నివేదించబడిన ప్రసాదాలను ఆనంద్ బజార్ అని ప్రదేశంలో భక్తుల కోసం సరసమైన ధరలకు విక్రయిస్తారు. 

అలా భగవంతుడికి నివేదించి భక్తులకు వితరణ చేసే ప్రసాదాన్ని " అబడా" అంటారు.

పూరీ క్షేత్రంలో భగవంతుడి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో దానికి సరి సమానంగా ఈ ప్రసాదం స్వీకారానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది.



💠 ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. 



రచన

©️ Santosh kumar

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శాంతి పర్వము ప్రథమాశ్వాసము*


*482 వ రోజు*


*సృంజయుడి వృత్తాంత*


తరువాత కథను నారదుడు చెప్పసాగాడు " ధర్మరాజా ! అలా నేను పర్వతుడితో కొంతకాలం సృంజయుడి ఇంట్లో ఉండి కొన్నిసంవత్సరాల అనంతరం తిరిగి స్వర్గలోకం పోవానని అనుకున్నాము. వెళ్ళే సమయాన మా పట్ల గౌరవాభిమానాలు చూపించిన సృంజయుడికి ఏదైనా మేలు చేయాలన్న తలంపుతో నేను అతడికి దేవతలకన్నా ఉన్నతుడైన కుమారుడు కలగాలని వరం ఇచ్చాను. పర్వతుడు సృంజయుడికి కలుగబోయే కుమారుడి వలన ఇంద్రుడికి ఏదైనా కీడు కలుగకలదన్న తలంపుతో " సృంజయా ! ఆ కుమారుడు అర్ధాయుష్కుడు కాగలడు " అన్నాడు. అమాటలకు నాకు కోపంవచ్చి " సృంజయా ! ఆ కుమారుడిని నీకు చేతనైనంత కాపాడుకో. నీ శక్తికి మించి నీకుమారుడికి మరణం సంభవించిన వెంటనే నన్ను తలచిన నేను వచ్చి అతడికి ప్రాణదానం చేస్తాను. అలాగే నేను నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. నీ కుమారుడి శరీరంలోని విసర్జితాలు అన్నీ స్వర్ణ మయం ఔతాయి. అందు వలన అతడు సువర్ణష్టీవి అని పిలువబడతాడు " అని అన్నాను. నా మాటలకు సృంజయుడు ఆనందపడ్డాడు. తరువాత మేము వెళ్ళి పోయాము. నా వరంవలన సృంజయుడికి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి మలమూత్రములు, శ్వేదం మిగిలిన విసర్జితాలన్నీ బంగారంగా మారసాగాయి. సృంజయుడి ఇల్లంతా బంగారంతో నిండిపోయింది. ఈ విషయాన్ని పసికట్టిన కొందరు దొంగలు సువర్ణష్టీవివిని అపహరించి తీసుకు వెళ్ళి అతడి నోట్లో గుడ్డలుకుక్కి సమీపంలోని అడవిలోకి తీసుకు వెళ్ళారు. అతడి శరీరమంతా శోధించి ఎక్కడా సువర్ణం లభ్యంకాక వారు సువర్ణష్టీవిని చంపి అక్కడే పారవేసి వెళ్ళారు. సృంజయుడు తన కుమారుడు కనిపించక అంతటా వెతికి చివరకు నారదుడిని తలచుకున్నాడు. నేను అతడి వద్దకు వెళ్ళి జరిగిన విషయం తెలుసుకుని సువర్ణష్టీవి మరణ వృత్తాంతం చెప్పాను. సృంజయుడు సువర్ణష్టీవి మరణానికి ఎంతో దుఃఖించాడు. నేను " సృంజయా ! నీ కుమారుడు యమలోకంలో ఉన్నాడు. నీ కుమారుడిని నేను తీసుకు వస్తాను " అని చెప్పి సువర్ణష్టీవిని పునరుజ్జీవితుడిని చేసాను. సృంజయుడు చాలా సంతోషించాడు. నాను సృంజయుడితో " సృంజయా ! ఇంద్రుడు నీ కుమారుడిని చంపడానికి ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు " అని చెప్పి వెళ్ళాను. దేవేంద్రుడికి సువర్ణష్టీవి వలన తనకు ఆపద కలుగకలదన్న భయం పట్టుకుంది. ఒకరోజు సృంజయుడు తన భార్యాబిడ్డలతో గంగా నదీతీరాన విహరిస్తున్న సమయంలో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వ్యాఘ్ర రూపంలో అతడి మీద ప్రయోగించాడు. వజ్రాయుధం తగిన సమయం చూసి వ్యాఘ్రరూపం ధరించి సువర్ణష్టీవిని చీల్చిచంపి మాయం అయింది. సువర్ణష్టీవి మరణానికి దుఃఖిస్తూ సృంజయుడు నన్ను తలచుకున్నాడు. నేను వెళ్ళి సువర్ణష్టీవిని సజీవుడిని చేసి తిరిగి వెళ్ళిపోయాను. సువర్ణష్టీవి దీర్ఘాయుష్కుడై వేలాది సంవత్సరములు రాజ్యపాలన చేసాడు.ధర్మరాజా ! నీవు కూడా నీ పట్టు వదిలి రాజ్యభారం వహించు.

*వ్యాసుడి హితవు*


నారదుడి మాటలు విన్న తరువాత కూడా ధర్మరాజు మౌనం వీడలేదు. అది చూసి వ్యాసుడు " ధర్మజా ! క్షత్రియులకు రాజ్యపాలన కంటే వేరే ధర్మంకలదా ! అందువలన వేదవిహితమైన విప్రకర్మలు ఆచరించబడతాయి. విప్రకర్మలు ఆచరించని ఎడల సమాజముకు నష్టం వాటిల్లగలదు. వేదవిహిత విప్రకర్మలు ఆచరించని ఎడల రాజుకు పాపంసంక్రమించి ఉత్తమలోక ప్రాప్తికి ఆటంకంకలుగుతుంది. కనుక ప్రజాపాలనయే నీధర్మం " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

పాదములతో తాకరాదు.*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝      *పాదాభ్యాం న స్పృశేత్*

          *అగ్నిం గురు బ్రాహ్మణమేవ చ|*

          *నైవ గాం న కుమారీం చ*

         *న వృద్ధం న శిశుం తథా||*


తా𝕝𝕝  *అగ్నిని, గురువును, బ్రాహ్మణుని, ఆవును, కన్యను,వృద్ధుని, శిశువును పాదములతో తాకరాదు.*


✍️🌸🌹💐🙏

గురువారం🪷* *🌹28 ఆగస్టు 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🪷గురువారం🪷* 

  *🌹28 ఆగస్టు 2025🌹* 

     *దృగ్గణిత పంచాంగం* 

                  

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*భాద్రపద మాసం - శుక్లపక్షం*


*తిథి  : పంచమి* సా 05.56 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం   : చిత్త* ఉ 08.43 వరకు ఉపరి *స్వాతి*


           *ఈనాటి పర్వం*

      *ఋషి పంచమి వ్రతం*


*యోగం : శుక్ల* మ 01.18 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : బాలువ* సా 05.56 *కౌలువ పూర్తిగా రాత్రంతా*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 12.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *రా 01.46 - 03.34*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం      : మ 03.00 - 04.48*

*దుర్ముహూర్తం  : ఉ 10.03 - 10.53 మ 03.03 - 03.53*

*రాహు కాలం   : మ 01.42 - 03.16*

గుళికకాళం       : *ఉ 09.01 - 10.35*

యమగండం     : *ఉ 05.54 - 07.27*

సూర్యరాశి : *సింహం*              

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 06.02* 

సూర్యాస్తమయం :*సా 06.33*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.54 - 08.24*

సంగవ కాలం         :     *08.24 - 10.53*

మధ్యాహ్న కాలం    :     *10.53 - 01.23*

అపరాహ్న కాలం    : *మ 01.23 - 03.53*


*ఆబ్ధికం తిధి         : భాద్రపద శుద్ధ పంచమి*

సాయంకాలం        :*సా 03.53 - 06.23*

ప్రదోష కాలం         :  *సా 06.23 - 08.41*

రాత్రి కాలం           :*రా 08.41 - 11.46*

నిశీధి కాలం          :*రా 11.46 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీదత్త నవరత్నమాలికా స్తోత్రం*


*ఏకవస్తుపరిబోధయితారం*

 *దత్తదేవమనిశం కలయామి*


         *జై దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

శ్రీమద్భాగవత కథలు*```

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🪷బుధవారం 27 ఆగస్టు 2025🪷*

                    4️⃣4️⃣

                *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


         *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


      *ఖగోళ విషయ విస్తారం*               

```

బ్రహ్మాండమధ్యంలో ఉన్న సూర్యుడు ముల్లోకాలను తన తేజస్సుతో నింపితపింపచేస్తూ, కాంతిమంతం చేస్తున్నాడు. సూర్యుడికి ఏడాది సాగే నడకలో ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువం అనే మూడు గమనాలున్నాయి. ఉత్తరాయణంలో మీదికి వెళ్తాడు. దక్షిణాయనంలో కిందకు వెళ్తాడు. ఉత్తరాయణంలో మెల్లగా నడుస్తాడు కాబట్టి పగళ్లు ఎక్కువ, రాత్రుళ్లు తక్కువ. దక్షిణాయనంలో వేగంగా నడుస్తాడు కాబట్టి పగళ్లు తక్కువ, రాత్రుళ్లు ఎక్కువ. విషువంలో సమానం. రాత్రింబగళ్లు ఎక్కువ - తక్కువలు ఉండవు. సూర్యుడు మేషరాశిలోను, తులారాశిలోను ప్రవేశించినప్పుడు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. మేషంలోకి వచ్చినప్పటి మర్నాటి నుండి రోజు-రోజుకు పగలెక్కువ, రాత్రి తక్కువ అవుతుంటుంది. సూర్యుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య రాశుల్లో ప్రవేశించేటప్పుడు నెలకు ఒక్కొక్క ఘడియ పగటిపూట పెరుగుదల, రాత్రిపూట తరుగుదల ఉంటాయి. అలాగే, సూర్యుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశుల్లోకి ప్రవేశించినప్పుడు నెలకు ఒక్కొక్క ఘడియ పగటిపూటలో తరుగుదల, రాత్రిపూటలో పెరుగుదల ఉంటాయి.


ఇలా దినాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం, పెరగడం, తరగడం ఏర్పడుతున్నాయి. సూర్యుడు తన రథం మీద మానసోత్తర పర్వతం చుట్టూ తిరగడానికి ఒక పగలు, ఒక రాత్రి పూర్తవుతాయి. ఆ పర్వతం చుట్టు కొలత తొమ్మిది కోట్ల ఏభై ఒక్క లక్షల యోజనాలు. మానసోత్తర పర్వతానికి తూర్పు దిక్కున ఇంద్రుడి పట్టణం ఉన్నది. దాని పేరు దేవధాని. దక్షిణ దిక్కున యముడి పట్టణం ఉన్నది. దాని పేరు సంయమని. పడమటి వైపు వరుణుడి పట్టణం నిమ్లోచని ఉన్నది. ఉత్తరం వైపున చంద్రుడి పట్టణం విభావరి ఉన్నది. జ్యోతిశ్చక్రం భ్రమించడం వల్ల భూమిలో సూర్యుడు కనిపించడం ఉదయం, ఆకాశంలో కనిపించడం మధ్యాహ్నం, భూమిలోకి చొచ్చినట్లు కనిపించడం అస్తమయం, దూరంగా ఉండడం రాత్రి. ఈ ఉదయాస్తమయాదులు జీవుల ప్రవృత్తి, నివృత్తులకు హేతువులై ఉంటాయి.


సూర్యుడు ఇంద్రపురం నుండి యమపురానికి వెళ్లేటప్పుడు పదిహేను గడియలలో రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్బె అయుదు వేల (2,37,75,000) యోజనాల దూరం దాటి వెళ్తాడు. యమపురి నుండి వరుణపురి, అట్నుంచి సోమపురి ఇలా పోతుంటాడు. ఇలా చంద్రగ్రహనక్షత్రాదులతో కూడి తిరుగుతూ వున్న సూర్యుడి రథచక్రానికి పన్నెండు అంచులు, ఆరు కమ్ములు, మూడు నాభులు ఉంటాయి. ఆ చక్రానికి సంవత్సరం అని పేరు. సూర్యుడి రథానికి ఒకటే చక్రం. ఈ ఏకచక్ర రథం ఒక్క ముహూర్త కాలంలో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వేల యోజనాల మేర సంచరిస్తుంది.


సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు మేరు శిఖరం మొదలు మానసోత్తర పర్వతం వరకు వ్యాపించి ఉంటుంది. దీని పొడవు ఒక కోటి ఏబై ఏడు లక్షల ఏభై వెల యోజనాలు. ఈ ఇరుసుకు గానుగ చక్రంలాగా, చక్రం అమర్చబడి, మానసోత్తర పర్వతం మీద సూర్యరథం తిరుగుతుంటుంది. ఇరుసు ఒకటి ఉత్తర ధ్రువం వైపు. ఇంకొకటి దక్షిణ ధ్రువం కింది దాకా ఉంటుంది. ఈ ఇరుసులు రెండింటి మీద ఈ చక్రం ధ్రువాలలో బిగించబడి ఉంటుంది. భూ పరిభ్రమణం వల్ల ఉత్తర-దక్షిణ ధ్రువాలలో గాలి సుడిగుండాలు ఏర్పడుతాయి. అవే తాళ్లుగా ఆ తాళ్లతో ఇరుసులు ద్రువాలకు బిగించబడి ఉంటాయి. అ రథంలో సారథి కూర్చోడానికి అనువైన చోటు ముప్పెఆరు లక్షల యోజనాల పొడవు, తొమ్మిది లక్షల యోజనాల వెడల్పు కలిగినది. ఆ రథానికి కాడి కూడా ముప్పైఆరు లక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంటుంది.


సూర్య రథానికి గాయత్రి మొదలైన ఏడు ఛందస్సులు (గాయత్రి, ఉష్ఠిక్, త్రిష్ణువ్, అనుష్టుప్, జగతి, పంక్తి, బృహతి) గుర్రాలై ఉంటాయి. సూర్యుడికి ముందు అరుణుడు రథసారథిగా ఉంటాడు. వాలఖిల్యుడు మొదలైన 60 వేలమంది ఋషిశ్రేష్ఠులు సూర్యుడి ముందర సౌరసూక్తాన్ని స్తుతిస్తూ ఉంటారు. ఈ ఋషులు బొటన వేలు పైభాగం ఎంత ఉంటుందో అంతే శరీరం కలవారై ఉంటారు. ఇంకా ఎందరో మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు, అప్సరసలు, పతంగులు మొదలైన వారంతా నెలనెలా వరుస క్రమంలో సూర్యుడిని సేవిస్తూ ఉంటారు. ఇంతమంది ఇలా సేవిస్తూ ఉంటే, సూర్యుడు తొంభై కోట్ల ఏభై ఒక్క లక్షల యోజనాల పరిమాణం ఉన్న భూమండలాన్ని అంతటినీ ఒక్క పగలు, రాత్రిలో సంచరించి వస్తూ ఉంటాడు. అంటే ఒక్క క్షణానికి రెండువేల యోజనాలు సంచరిస్తాడు.


మేరువుకు, ధ్రువానికి సూర్యుడు ప్రదక్షిణ చేయడం, రాశి చక్రం మీద సంచరించడం ఎలా కుదురుతుందన్న సందేహం కలగవచ్చు. అంటే, ఉత్తర ధ్రువం ఉండేది ఉత్తర దిశలో కదా. రాశి చక్రం ఉండేది భూమధ్య రేఖ మీద కదా, అలాంటప్పుడు, ఉత్తర ధ్రువానికి ప్రదక్షిణం, రాశి చక్రం మీద సంచరించడం ఏక కాలంలో ఎలా అన్నది అసలు సందేహం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒక్కటి ఉంది. అదే, సకలం భగవత్సృష్టి విలాసం అనే విషయం. ఇలాంటి సందేహాలను పూర్తిగా తీర్చగలగడం ఒక్క సర్వేశ్వరుడికే చేతనవుతుంది.


నక్షత్రాలతో, రాశులతో కూడిన కాలచక్రం ధ్రువానికి మేరువుకు ప్రదక్షిణం చేసేటప్పుడు, ఆ కాలచక్రం వెంట సంచరించే సూర్యాది గ్రహాలకు నక్షత్రాలతోను, రాశులతోను, ఉనికి ఉండడంతో చక్రగతి వల్ల, వాటంతట వాటికి ఉన్న గతుల వల్ల, రెండు గతులు ఉంటూ ఉంటాయి. ఆదిపురుషుడైన భగవానుడే, ఆ నారాయణుడే, లోకాలకు యోగ క్షేమాలను కూర్చడానికై సూర్యుడి రూపంలో మనకు దర్శనం ఇస్తున్నాడు. సూర్యుడు మూడు వేదాల స్వరూపం. నారాయణుడే సూర్యుడిగా ప్రకాశిస్తున్నాడు. ఆ పరమపురుషుడే తనను పన్నెండు విధాలుగా విభజించుకుని వసంతం మొదలైన ఆరు ఋతువులను ఆయా కాలాలలో జరిగే విశేషాల్ని బట్టి ఏర్పాటు చేశాడు. ఆ పరమ పురుషుడు జ్యోతిశ్చక్రం లోపల ప్రవర్తిస్తూ తనదైన తేజస్సుతో సకల జ్యోతిర్గణాలను దీపింప చేస్తున్నాడు. మేషాది పన్నెండు రాశులలోను ఒక్కో మాసం వంతున ఒక సంవత్సరం సంచరిస్తాడు. ఆయన గమనంలోని విశేషమైన కాలాన్ని అయనాలుగా, ఋతువులుగా, మాసాలుగా, పక్షాలుగా, తిథులుగా వ్యవహరిస్తారు. రాశులలో ఆరవ అంశం ఆయన సంచరించినప్పుడు దానిని ఋతువు (అంటే సంవత్సరంలో ఆరవ వంతు, రెండు మాసాల కాలం) అని అంటారు. కాలచక్రంలో సూర్యుడు సగభాగం, అంటే, ఆరు రాశులలో సంచరించే కాలాన్ని అయనం అంటారు.


                 *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


        *రచన: శ్రీ వనం* 

  *జ్వాలా నరసింహారావు*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷``


 *🚩జై శ్రీ కృష్ణ!   జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - వర్ష ఋతువు - భాద్రపద మాసం - శుక్ల పక్షం -‌ పంచమి -చిత్ర -‌‌ ‌గురు వాసరే* (28.08.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*