ఉ॥
గ్రీష్మము హెచ్చుగా ప్రబల ప్రీతిని జెందెనొ మేఘమాలికల్
శ్లేష్మము హెచ్చుగా ప్రబల జీవుల దేహములందు చెచ్చెరన్
రశ్మిని నడ్డుకొంచు భువి వ్రాలి ప్రచండసమీరముల్ సనన్
యుష్మదు లస్మదుల్ గనక నుప్పెన వంటి మహోగ్రవర్ష మిచ్చెడిన్
*~శ్రీశర్మద*
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
ఉ॥
గ్రీష్మము హెచ్చుగా ప్రబల ప్రీతిని జెందెనొ మేఘమాలికల్
శ్లేష్మము హెచ్చుగా ప్రబల జీవుల దేహములందు చెచ్చెరన్
రశ్మిని నడ్డుకొంచు భువి వ్రాలి ప్రచండసమీరముల్ సనన్
యుష్మదు లస్మదుల్ గనక నుప్పెన వంటి మహోగ్రవర్ష మిచ్చెడిన్
*~శ్రీశర్మద*
*ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమి వస్తుంది...?*
రోజూ ఉదయమే చాలామంది పూజ కోసమని ప్రక్కవాళ్ళ దొడ్లోనో పూలు కోసేస్తూ కనపడుతుంటారు. కొంతమంది ఐతే వాకింగ్ కి అని వెడుతూ కూడా ఒక కవరు పట్టికెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నా... లేదా వీళ్ళకేసి చూస్తున్నా.. వీళ్ళు వాళ్ళ కేసి చాలా సీరియస్ గా పాపాత్ములని చూసినట్టు చూస్తూ చాలా బిల్డప్ ఇస్తుంటారు. ఇవన్నీ రోజూ మనకి కనపడే దృశ్యాలే...
మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీనిగురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???
నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసేసే అధికారం లేదు. దేముని పూజకోసమని మొక్కని ప్రార్దించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహాపాపం...
ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా మళ్ళీజన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు(ట). కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడుకూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళిపోతుంది.. ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడపురాణం లో గరుడునికి చెప్పారు.
తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతిగాను; పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగువానిని అపహరించినవాడు మేక జన్మముగాను పుట్టుచుందురు...
మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి, లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ ఏకైక లక్ష్యం ముక్తిని పొందడమే.. ఇక జన్మలనేవే లేనివిధంగా ఆ భగవంతునిలో ఐక్యమైపోడమే.. అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు..
మరి ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజవల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సివస్తొందే.. ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాతగానీ మనిషిగా పుట్టే అవకాశమే రాదే.. మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా... ఒక్కసారి ఆలోచించండి
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో|| *ప్రభుర్వివేకీ ధనవాంశ్చ దాతా విద్వాన్ విరాగీ ప్రమదా సుశీలా।*
*తురఙ్గమః శస్త్రనిపాతధీరః భూమణ్డలస్యాభరణాని పఞ్చ॥*
తా|| *తెలివైన రాజు, దానగుణంకల ధనవంతుడు, పేరుప్రతిష్టలయందు కోరిక లేనట్టి విద్వాంసుడు, సత్ప్రవర్తనగల స్త్రీ, శత్రుసమూహమునందు ధైర్యంగా నిలిచే గుఱ్ఱం* - ఈ అయిదుగురు భూమికి ఆభరణములు."
✍️VKS ©️ MSV🙏
పూర్వ జన్మ కర్మ ఫలితాన్ని తొలగించుకోవచ్చా? యోగ వాసిష్ఠ గ్రంథం ఏమని చెబుతున్నది?
జవాబు
వాల్మీకి రచించిన యోగ వాసిష్ఠగ్రంథం ఈ విషయంలో మనకు చక్కటి హామీ ఇచ్చింది.
యోగ వాసిష్ఠములోని ఈ రెండు శ్లోకాలు మానవ ప్రయత్నం (పురుషార్థం) మరియు విధి ( పూర్వ జన్మ కర్మ ) మధ్య ఉన్న సంబంధాన్ని చాలా స్పష్టంగా వివరిస్తాయి.
శ్లోకం 02-05-05:
ద్వౌ హుడావివ యుధ్యేతే పురుషార్థౌ సమాసమౌ |
ప్రాక్తనశ్చైహికశ్చైవ శామ్యత్యత్రాల్పవీర్యవాన్ ||
"రెండు పొట్టేళ్లు ఒకదానితో ఒకటి తలపడినట్లు, ప్రాక్తనం (గత కర్మల ఫలితం లేదా విధి) మరియు ఐహికం (ప్రస్తుత మానవ ప్రయత్నం) అనే రెండు పురుషార్థాలు సమానంగా పోరాడుతాయి" అని చెబుతుంది.
ఈ రెండింటిలో ఏది బలహీనంగా ఉంటుందో అది శమిస్తుంది, అంటే ఓడిపోతుంది.
మన జీవితంలో జరిగే పుణ్య సంఘటనలు గత కర్మల ప్రభావం రెండూ ఒకదానితో ఒకటి నిరంతరం ప్రభావితం చేసుకుంటూ పొట్టేళ్లలా పోరాడుతుంటాయి.
ఈ పోరాటంలో, ఏది తక్కువ శక్తివంతంగా ఉంటుందో, అది పైచేయి సాధించలేదు.
అంటే, మనం బలహీనమైన పుణ్య ప్రయత్నం చేస్తే, విధి ప్రభావం ఎక్కువ అవుతుంది;
అదే మనం దృఢమైన ప్రయత్నం చేస్తే, విధి ప్రభావం తగ్గవచ్చు.
ఇంకొకటి ఎదుటి పొట్టేలు చచ్చేదాక రెండవ పొట్టేలు పోరాటం మానదు. పారిపోదు.
ఇది మన పుణ్య కార్యక్రమాలకు స్ఫూర్తిదాయకం.
శ్లోకం 02-05-06:
అతః పురుషయత్నేన యతితవ్యం యథా తథా |
పుంసా తన్త్రేణ సద్యోగాద్యేనాశ్వద్యతనో జయేత్ ||
"కాబట్టి, మనిషి తన ప్రయత్నంతో ఎలాగైనా సరే, పూర్తి శక్తితో పుణ్య కార్యక్రమాలు చేస్తూ కష్టపడాలి" . "తంత్రం ద్వారా మంచి యోగంతో, ఈనాటి ప్రయత్నం (ప్రస్తుత పురుషార్థం) త్వరగా విజయం సాధించాలి" అని చెబుతుంది.
మనిషి కేవలం ప్రయత్నం చేస్తే సరిపోదు, సరైన పద్ధతిలో, సరైన వ్యూహంతో, పూర్తి శక్తితో ప్రయత్నం చేయాలి.
అప్పుడే ప్రస్తుత ప్రయత్నం గత కర్మల ప్రభావంపై పైచేయి సాధించి, త్వరగా విజయం పొందగలదు.
మనం చేసే ప్రయత్నం ఎంత పటిష్టంగా ఉంటే, మన భవిష్యత్తును మనం అంతగా తీర్చిదిద్దుకోగలం అనే సందేశాన్ని ఈ శ్లోకం ఇస్తుంది.
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం - నవమి - ఉత్తరాఫల్గుని - సౌమ్య వాసరే* (04.06.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
18-04-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - ఇట్లు కర్మను గూర్చి భిన్నమతములను దెలిపి శ్రీకృష్ణమూర్తి అవ్విషయమున తన నిశ్చయమును తెలియజేయుచున్నారు–
నిశ్చయం శృణు వేు తత్ర
త్యాగే భరత సత్తమ! |
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధస్సమ్ప్రకీర్తితః ||
తాత్పర్యము:- భరతకులోత్తముడవును, పురుషశ్రేష్ఠుడవునగు ఓ అర్జునా! అట్టి కర్మత్యాగవిషయమున నా యొక్క నిశ్చయమేదియో చెప్పెదను వినుము. త్యాగము మూడువిధములుగా చెప్పబడియున్నది కదా!
వ్యాఖ్య:- (1) కర్మలను బొత్తిగా వదలివేయవలెను. (2) తపోయజ్ఞదానాది కర్మలను మాత్రము వదలరాదు - అను రెండు వాదములను జెప్పి భగవానుడు ఆ విషయమున తన తీర్పును చెప్పుచున్నాడు -
"నిశ్చయం శృణు మే' - అని చెప్పినందువలన భగవానుడు తాను పూర్ణముగ స్థిరపఱచుకొని, నిశ్చయించుకొనినదానినే వచించుచున్నారని అర్థము. ఆహా! ఇట్టి భగవన్నిశ్చయమందు జనుల కేల విశ్వాసము యుండరాదు?! సామాన్యులు ప్రకృతికి, మాయకు లోబడినవారుకావున వారి నిశ్చయములం దేవేని లోపములుండవచ్చును. కాని ప్రకృతికి అతీతుడై మాయాదోషములేని (చైతన్యరూపుడగు) పరమాత్మయొక్క భావములు అతినిర్దుష్టములై యుండును. అట్టి మహనీయుడు " నా నిశ్చయము వినుడు' అని చెప్పినపుడు ఇక జీవులు ఎన్ని చెవులతో దానిని వినవలయునో యోచించుకొనుడు! కావున భగవాను డిపుడు చెప్పబోవు త్యాగము మున్నగువానిని గూర్చిన ఉదాత్తభావములను, నిశ్చయములను కడు జాగరూకతతో విని తదనురీతి యనుష్ఠించి తరించవలెను.
ప్రశ్న:- త్యాగ మెన్నివిధములని భగవానుడు తెలియజేసిరి?
ఉత్తరము: - మూడు విధములని.
*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*397 వ రోజు*
*భీమసేనుని మనోగతము*
అప్పటికి వారు రణరంగం సమీపించారు. యుద్ధం ఘోరంగా జరుగుతుంది. ఇరుపక్షముల వారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. కర్ణుడి కుమారులలో ఒకడు ఉత్తమౌజుడి చేతిలో మరణించాడు. అది చూసిన కర్ణుడు ఉత్తమౌజుని రధాశ్వములను, కేతనమును నరికాడు. ఉత్తమౌజుడు కత్తి తీసుకొని తనకు అడ్డంగా వచ్చిన కృపాచార్యుడి రధాశ్వములను నరికి వెంటనే శిఖండి రధము ఎక్కాడు. ఇంతలో అశ్వత్థామ కృపాచార్యుని తన రధము మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. భీమసేనుడి పరాక్రమానికి తట్టుకోలేక కౌరవ సేనలు పారిపోసాగాయి. అది చూసి భీముడు తన సారధి విశోకుడితో " విశోకా ! అన్న ధర్మజుడు రణభూమి నుండి తొలగి పోయాడు. అన్న క్షేమం కనుగొనుటకు వెళ్ళిన అర్జునుడు కూడా రాలేదు. వారిరువురికి ఏమి జరిగిందో తెలియరాలేదు. వారికి కీడు కలిగిన ఈ యుద్ధముతో ప్రయోజనమేముంది. అయినా నేను శత్రు వినాశనం చేయక తప్పదు. అది సరే మనకు సరిపడా బాణములు ఉన్నాయి కదా! విశోకా అటు చూడు ఆ కేతనమును చూసి అందు ఉన్న రథికులను పోల్చగలవా ! " అన్నాడు. బదులుగా విశోకుడు " భీమసేనా ! మనకు అస్త్రశస్త్రల గురించి చింత లేదు. అవి విస్తారంగా ఉన్నాయి. మన వెనుక వచ్చు బండిలో ఆయుధములు ఇసుమంతైనా తరగ లేదు. నీ చేత గద ఉండగా నీకు ఈ ఆయుధములతో పని లేదు కదా ! నీ చేతి గద చాలదా శత్రు నిర్మూలనకు " అన్నాడు. ఆ మాటలకు భీముడు సంతోషించాడు. అంతలో విశోకుడు " భీమసేనా ! అటు చూడు నీ తమ్ముడు అర్జునుడు ఏనుగుల సమూహాన్ని తరుముతున్నాడు " అన్నాడు. అది విని భీముడు సంతోషంతో ఉప్పొంగి పోయి " విశొకా ! మన రథమును అర్జునుడి వద్దకు పోనిమ్ము " అన్నాడు. వెంటనే విశోకుడు రధమును అర్జునుడి వైపు పోనిచ్చాడు. రణరంగ ప్రవేశం చేసిన అర్జునుడు కౌరవసేనలను దునుమాడి తన పరాక్రమంతో వాటిని తరముతున్నాడు. మరొక వైపు భీముడు కూడా శత్రు సైన్యములను దునుమాడుతున్నాడు. అది చూసి సుయోధనుడు " భీముడు చస్తే కాని పాండవసేన పారిపోదు. ముందు వీడిని చుట్టుముట్టి చంపండి " అన్నాడు. కౌరవసేనలోని ప్రముఖవీరులు భీముని చుట్టుముట్టి ఎదుర్కొన్నారు. భీముడు విచక్షణారహితంగా శత్రుసేనను చంపుతున్నాడు. శకుని భీముని ఎదుర్కొని అతడి వక్షస్థలానికి గురిపెట్టి బాణంతో కొట్టాడు. భీముడు శకుని విల్లు విరిచాడు. శకుని వేరొక విల్లందుకుని భీముని సారధిని, రధాశ్వములను పదునారు బాణములతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. భీముడు కోపించి శక్తి ఆయుధమును శకుని మీద ప్రయోగించాడు. శకుని లాఘవంగా శక్తి ఆయుధమును పట్టుకుని తిరిగి భీముని మీదకు విసిరాడు. అది భీముని చేతిని గాయపరిచింది. అది చూసి కౌరవసేనలు ఆనందించాయి. వెంటనే భీముడు విల్లందుకుని శకుని శరీరం అంతా శరములతో నింపాడు. శకుని రధము మీద కూలిపోయి మూర్ఛిల్లాడు. అది చూసిన సుయోధనుడు శకునిని తన రధము మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
శ్రీమాత్రేనమః
|చాతుర్మాస్యము |
నాలుగునెలలకాలము చేయు కృత్యము చాతుర్మాస్యము అని తెలుసు కొనవచ్చును. వైదిక యుగమునందు నాలుగు మాసాలకు ఒక ఋతువు చొప్పున మూడు ఋతువులే పరిగణించే వారని పురాసాహిత్యము ద్వారా తెలుస్తుంది. అవి 1- వర్ష ఋతువు 2- హేమంత ఋతువు 3- వసంత ఋతువు. సంవత్సరము వానకాలమునుండి ప్రారంభించబడుచుండెను.
అందులకే సంవత్సరానికి వర్షమని కూడా వ్యవహారములోనికి వచ్చింది. ప్రతి ఋతువు ఆరంభంలో ప్రత్యేక యజ్ఞాలు నిర్వహింపబడుచుండెను. ఫాల్గుణ పౌర్ణమి నాడు వైశ్వదేవయజ్ఞం. ఆషాఢ పౌర్ణమి నాడు వరుణ ప్రఘాసయజ్ఞం 3- కార్తీక పౌర్ణమి నాడు పాకమేoధ యజ్ఞము జరపాలని శతపథ బ్రహ్మణంలో చెప్పబడినది. క్రమంగా వర్ష ఋతువునే చాతుర్మాస్యంగా నడుపుట ప్రజల ఆచారంగా నెలకొని ఉంది.
ఆషాఢ శుక్ల ఏకాదశి ఈ చాతుర్మాస్యము ఆరంభించి కార్తీక శుక్ల ద్వాదశి తో పూర్తి చేయబడును. ఆషాఢ శుద్ధ ఏకాదశి ప్రథమ ఏకాదశి. దీనిని బట్టి వర్ష ఋతువు వర్ష ప్రారంభమని. పురాణములననుసరించి మహావిష్ణువు పాలసంద్రములో శేషపర్యంకంపై నిద్రిస్తాడని సంప్రదాయం. ఈ వ్రతాన్ని ఏకాదశి నుండికాని కటకసంక్రాంతి నుండి గాని , ఆషాఢ పౌర్ణమి నుండి గాని కొనసాగించ వచ్చును. ఇలా వ్రతమాచరించిన సంవత్సరంలో చేసిన పాపాలు తొలుగునని భారత యితిహాసము పేర్కొన్నది.
ఈ చాతుర్మాస్య విధానం గూర్చి స్కాందపురాణం , భవిష్య పురాణం మొదలగు పురాణాలు వివరంగాతెలిపినాయి. శ్రావణంలో కూరలను , భద్రపదమాసంలో పెరుగును , ఆశ్వయుజ మాసంలో పాలను , కార్తీక మాసంలో పప్పు పదార్థాలను భోజనం నుండి వదలి పెట్టాలి. చాతుర్మాస్యము అందరికీ నిత్యవ్రతం. నిమ్మ. రాజమాషాలు , ముల్లంగి , ఎర్రముల్లంగి , గుమ్మడి , చెరుకు వాడరాదు. అని స్కాంద పురాణం ఉవాచ. కొత్త ఉసిరిక చింత , గుమ్మడి మున్నగు వాటిని వదలి పెట్టాలి. పాత ఉసిరికను వెదకి సంపాదించి వాడాలి. దీనినిఅనుసరించి వర్షాకాలంలోఆపత్యాహారం నుండి ఆరోగ్య ఆహారం తీసుకొని ఆరోవ్య పరిరక్షణార్థం ఈవ్రత పరమార్థO Ani తెలుస్తుంది వర్షాకాలమంతా నేల బురదతో కూడియుండును. క్రీమీ కీటకాలకు బురద నెలవు. రోగాలు వ్యాపించడం సహజం కదా !
పైన తెలుపబడిన పదార్థాలన్నీ వర్జములే ఇవి త్రిదోష ప్రకోపాలు. బయట తిరుగకుండ తమ ఉనికి పట్టులోనే ఉండి మిత పధ్యాహారముతో కాలము గడుపుటయే శ్కరమని తెలుపుటకే ఈ వ్రతం నిర్ణయించ బడింది. ఈ క్రమం అందరు ఆశ్రమవాసులకునూ ముఖ్యమని పురాణాలు తెలుపుతున్నాయి. ప్రధానముగా సన్యాసులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
బుద్ధుడు చాతుర్మాస్యం ఆచరించినట్లు జాతక కథల్లో పేర్కొనబడింది. ఈ బౌద్దులు చాతుర్మాస్య ముగింపు కార్తీక మాసములో పున్నమినాడు. బ్రహ్మానందంగా ఉత్సాహం నిర్వహించు కొనేవారని బౌద్ధసాహిత్యం తెలుపుతుంది. వారణాసి ఆవ o తికా మొదలగు ప్రదేశాల్లో ఈ చాతుర్మాస్య ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేదివారని రాత్రులందు దీపాలను వెలిగించెడి వారు తమ కస్టాలు తొలగి ఆరోగ్యం చూడనందుకు యక్షుడై చిత్తుని పూజించేవారు.
అందమైన వస్త్రాలఅలంకారంతో రాజమార్గంలో సంచరించెడి వారు అనితెలుస్తూనేఉంది. జైనులుకూడా ఈ వ్రతాన్ని కొనసాగించేవారని జైన సాహిత్యంలో విపులముగా ఉంది.
సహజంగజైనులు అహింసావ్రత నిష్టులు. నేటికీ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఆషాఢం కార్తీకం ఫాల్గుణ మాసంలో అష్టాగ్నికి ఆనుపూజలు నిర్వహించేడి వారని జైనీయ సాహిత్యం తెలుపుతుంది ఈ చాతుర్మాస్య మును జైనులు స్నానోత్సవముగా మిగుల వైభవం గా కొనసాగించే వారని. దీనిని చాతుర్మాసీయ మజ్జణాదు ఉత్సవం అని నేటికిని వ్యవహరిస్తారు.
బాబుదేవీదాస్ రావు.
అది 1998వ సంవత్సరం బీజేపీ ప్రధాని వాజ్ పేయిని గద్దెదించాలని కాంగ్రెస్, CPMలు చేతులు కలిపి, లోక్ సభలో ఉంచిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్, CPI (M) పార్టీల నాయకులు కలిసి కూర్చుని, బీజేపీ కూటమిపై దాడి చేస్తున్నారు. ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు బల్లలు చరుస్తూ, పరస్పరం అభినందించుకుంటు ఉన్నారు. అదే బీజేపీ నాయకుడు కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడితే మాత్రం CPM నాయకులు తీవ్రంగా ప్రతిదాడి చేస్తున్నారు.
సరిగ్గా అప్పుడే రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ బీజేపీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ ఇలా అన్నాడు... "స్పీకర్ సార్, కాంగ్రెస్ పార్టీపై ఒక గొప్పసంస్థ తమ పుస్తకంలో ఏమి చెప్పిందో మీకు చదివి వినిపిస్తాను" అంటూ ఒక పుస్తకాన్ని తీసి ఇలా చదవడం మొదలుపెట్టాడు....
"కాంగ్రెస్ పార్టీ అవినీతికి ఫౌంటైన్ హెడ్ లాంటిది. (కాంగ్రెస్+ సిపీఎం బెంచీల నుండి పెద్దగా అరవడం మొదలైంది). బ్రిటీష్ వాళ్ళు వదిలిన కాంగ్రెస్ పార్టీ అవినీతిలో గత 50 ఏళ్ళుగా, కొత్త రికార్డులు నెలకొల్పింది. ముంద్రా స్కామ్, చౌరత్ లాటరీ స్కామ్, బోఫోర్స్ స్కామ్, సుఖ్రం స్కామ్, హర్షద్ మెహతా స్కామ్, JMM ముడుపుల స్కామ్, హవాలా స్కామ్ వంటి స్కామ్స్ లో కాంగ్రెస్ మంత్రులు చిక్కుకున్నారు. భారత ప్రజాస్వామ్యంలోని ప్రతి సంస్థను అవినీతి కాంగ్రెస్ దుర్వినియోగం చేసింది"
ఆ స్పీచ్ ని తట్టుకోలేని కాంగ్రెస్, సిపిఎం పార్టీలు సభలో ఒక్కసారిగా లేచి "స్పీకర్ సర్, ఊరు పేరు లేని పుస్తకాలలోని అసత్యాలని ఫెర్నాండేజ్ గారు చదవడానికి మేం ఒప్పుకోము" అంటూ గోల చేశారు.
జార్జి ఫెర్నాండెజ్ మాట్లాడుతూ "దయచేసి నన్ను చదవనీయండి. పుస్తకం పేరును చివర్లో నేనే చెప్తాను" అంటూ, మళ్ళీ చదవ సాగాడు.
"సెక్యులరిజం ముసుగులో కాంగ్రెస్ పార్టీ వివిధ సమయాల్లో దేశంలో అల్లర్లు సృష్టించింది. తమ గూండాలతో ఢిల్లీలో 3000 సిక్కుల్ని ఊచకోత కోయించింది. ఇలాంటి హానికరమైన కాంగ్రెసుని భూమి నుండి తుడిచిపెట్టడం ముఖ్యం". ఇక తట్టుకోలేని కాంగ్రెస్, సిపిఎంలు ఫెర్నాండేజ్ పై అరుస్తూ, ఆ పుస్తకం పేరు చెప్పకుండా, చదవనీయమని పట్టుబట్టారు.
అప్పుడు పెర్నాండెజ్ గారు "సరే, స్పీకర్ సర్! గౌరవ CPM సభ్యులు ఇంతగా పట్టుబట్టారు కాబట్టి, చెబుతున్నాను...
ఈ పుస్తకం మరేదో కాదు, లోక్‌సభ ఎలక్షన్స్ ముందు ఇదే CPM వాళ్ళు జారీచేసిన CPI(M) మేనిఫెస్టో". అంతే సభలో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్. కమ్యూనిస్టులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఫెర్నాండేజ్ గారు అందుకుంటూ, "ఏం జరిగింది, ఎందుకీ నిశ్శబ్దం...?? మీరేగా పుస్తకం పేరు చెప్పమన్నారు, పేరు వినగానే, మీ గొంతులు మూగ పోయాయెందుకు....?? సిగ్గు పోయిందా మీకు....?? మీ సొంత మానిఫెస్టోని మీరే చదవలేదా...?? చదివినా, మీ భావజాలం మీకే నచ్చలేదా...?? ఇలాంటి భావజాలం గల మీరు, మళ్ళీ అదే కాంగ్రెసుతో సెక్యూలరిజం పేరుతో, చేతులు కలిపినందుకు మీరంతా సిగ్గుతో చచ్చిపోవాలి. ఆ పార్టీ అవినీతిలో ఉన్న అన్ని రికార్డులు చేరిపేసింది. ఇకనైనా మీరు ఆలోచించి, మీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని నేను కోరుతున్నాను. ఒకవేళ మీరు మీ మార్గాన్ని చక్కదిద్దుకోకపోతే, మీ పార్టీ ఓ గత చరిత్రగా మిగిలిపోతుంది" ...... అంటూ ముగించారు.
⛔ ఆయన చెప్పినట్లుగానే తర్వాతి కాలంలో నిజంగానే కమ్యూనిస్టులు చాలా రాష్ట్రాల్లో అంతమవడం మనం చూశాం.
ఈ రోజు జాతీయవాది, దేశ భక్తుడు, మాజీ భారత రక్షణ శాఖ మంత్రి కీర్తిశేషులు జార్జి ఫెర్నాండెజ్ గారి పుట్టినరోజు సందర్భంగా నివాళులు 🙏🙏💐.....
(సేకరణ)