శ్రీమాత్రేనమః
|చాతుర్మాస్యము |
నాలుగునెలలకాలము చేయు కృత్యము చాతుర్మాస్యము అని తెలుసు కొనవచ్చును. వైదిక యుగమునందు నాలుగు మాసాలకు ఒక ఋతువు చొప్పున మూడు ఋతువులే పరిగణించే వారని పురాసాహిత్యము ద్వారా తెలుస్తుంది. అవి 1- వర్ష ఋతువు 2- హేమంత ఋతువు 3- వసంత ఋతువు. సంవత్సరము వానకాలమునుండి ప్రారంభించబడుచుండెను.
అందులకే సంవత్సరానికి వర్షమని కూడా వ్యవహారములోనికి వచ్చింది. ప్రతి ఋతువు ఆరంభంలో ప్రత్యేక యజ్ఞాలు నిర్వహింపబడుచుండెను. ఫాల్గుణ పౌర్ణమి నాడు వైశ్వదేవయజ్ఞం. ఆషాఢ పౌర్ణమి నాడు వరుణ ప్రఘాసయజ్ఞం 3- కార్తీక పౌర్ణమి నాడు పాకమేoధ యజ్ఞము జరపాలని శతపథ బ్రహ్మణంలో చెప్పబడినది. క్రమంగా వర్ష ఋతువునే చాతుర్మాస్యంగా నడుపుట ప్రజల ఆచారంగా నెలకొని ఉంది.
ఆషాఢ శుక్ల ఏకాదశి ఈ చాతుర్మాస్యము ఆరంభించి కార్తీక శుక్ల ద్వాదశి తో పూర్తి చేయబడును. ఆషాఢ శుద్ధ ఏకాదశి ప్రథమ ఏకాదశి. దీనిని బట్టి వర్ష ఋతువు వర్ష ప్రారంభమని. పురాణములననుసరించి మహావిష్ణువు పాలసంద్రములో శేషపర్యంకంపై నిద్రిస్తాడని సంప్రదాయం. ఈ వ్రతాన్ని ఏకాదశి నుండికాని కటకసంక్రాంతి నుండి గాని , ఆషాఢ పౌర్ణమి నుండి గాని కొనసాగించ వచ్చును. ఇలా వ్రతమాచరించిన సంవత్సరంలో చేసిన పాపాలు తొలుగునని భారత యితిహాసము పేర్కొన్నది.
ఈ చాతుర్మాస్య విధానం గూర్చి స్కాందపురాణం , భవిష్య పురాణం మొదలగు పురాణాలు వివరంగాతెలిపినాయి. శ్రావణంలో కూరలను , భద్రపదమాసంలో పెరుగును , ఆశ్వయుజ మాసంలో పాలను , కార్తీక మాసంలో పప్పు పదార్థాలను భోజనం నుండి వదలి పెట్టాలి. చాతుర్మాస్యము అందరికీ నిత్యవ్రతం. నిమ్మ. రాజమాషాలు , ముల్లంగి , ఎర్రముల్లంగి , గుమ్మడి , చెరుకు వాడరాదు. అని స్కాంద పురాణం ఉవాచ. కొత్త ఉసిరిక చింత , గుమ్మడి మున్నగు వాటిని వదలి పెట్టాలి. పాత ఉసిరికను వెదకి సంపాదించి వాడాలి. దీనినిఅనుసరించి వర్షాకాలంలోఆపత్యాహారం నుండి ఆరోగ్య ఆహారం తీసుకొని ఆరోవ్య పరిరక్షణార్థం ఈవ్రత పరమార్థO Ani తెలుస్తుంది వర్షాకాలమంతా నేల బురదతో కూడియుండును. క్రీమీ కీటకాలకు బురద నెలవు. రోగాలు వ్యాపించడం సహజం కదా !
పైన తెలుపబడిన పదార్థాలన్నీ వర్జములే ఇవి త్రిదోష ప్రకోపాలు. బయట తిరుగకుండ తమ ఉనికి పట్టులోనే ఉండి మిత పధ్యాహారముతో కాలము గడుపుటయే శ్కరమని తెలుపుటకే ఈ వ్రతం నిర్ణయించ బడింది. ఈ క్రమం అందరు ఆశ్రమవాసులకునూ ముఖ్యమని పురాణాలు తెలుపుతున్నాయి. ప్రధానముగా సన్యాసులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
బుద్ధుడు చాతుర్మాస్యం ఆచరించినట్లు జాతక కథల్లో పేర్కొనబడింది. ఈ బౌద్దులు చాతుర్మాస్య ముగింపు కార్తీక మాసములో పున్నమినాడు. బ్రహ్మానందంగా ఉత్సాహం నిర్వహించు కొనేవారని బౌద్ధసాహిత్యం తెలుపుతుంది. వారణాసి ఆవ o తికా మొదలగు ప్రదేశాల్లో ఈ చాతుర్మాస్య ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేదివారని రాత్రులందు దీపాలను వెలిగించెడి వారు తమ కస్టాలు తొలగి ఆరోగ్యం చూడనందుకు యక్షుడై చిత్తుని పూజించేవారు.
అందమైన వస్త్రాలఅలంకారంతో రాజమార్గంలో సంచరించెడి వారు అనితెలుస్తూనేఉంది. జైనులుకూడా ఈ వ్రతాన్ని కొనసాగించేవారని జైన సాహిత్యంలో విపులముగా ఉంది.
సహజంగజైనులు అహింసావ్రత నిష్టులు. నేటికీ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఆషాఢం కార్తీకం ఫాల్గుణ మాసంలో అష్టాగ్నికి ఆనుపూజలు నిర్వహించేడి వారని జైనీయ సాహిత్యం తెలుపుతుంది ఈ చాతుర్మాస్య మును జైనులు స్నానోత్సవముగా మిగుల వైభవం గా కొనసాగించే వారని. దీనిని చాతుర్మాసీయ మజ్జణాదు ఉత్సవం అని నేటికిని వ్యవహరిస్తారు.
బాబుదేవీదాస్ రావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి