28, మే 2025, బుధవారం

*తీర్థ యాత్ర

 🔔 *తీర్థ యాత్ర* 🔔


తిరుమల తిరుచానూరు శ్రీకాళహస్తి కాణిపాకం యాత్ర ఎలా చేయాలి..?!* కలియుగప్రత్యక్షదైవం అయిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే జన్మధన్యం అయినట్టే అని భావిస్తారు. అందుకే ఏడాదికి ఓసారి కొందరు, ఏడాదికి రెండుసార్లు మరికొందరు, వీలు కుదిరినప్పుడల్లా ఇంకొందరు స్వామి సన్నిధికి క్యూ కట్టేస్తారు.అయితే తిరుమల వెళ్లొచ్చేవారిలో ఓ సందేహం ఉంటుంది. అలాంటి వారికోసమే ఈ కథనం...


తిరుమల యాత్రాక్రమం ఏంటి?


ఎక్కడి నుంచి ప్రారంభించాలి?


ఏ క్షేత్రం మొదట దర్శించుకోవాలి?


కొండపైకి వెళ్లి స్వామిని చూసి కిందకు రావాలా?


తిరుమల చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూసేసి కొండెక్కాలా?


ఈ ప్రశ్నలకు సమాధానంగా..తిరుమల యాత్ర 7 స్టెప్స్ లో చేయాలని చెబుతారు ఆధ్యాత్మిక వేత్తలు. అవేంటో చూద్దాం...


 *కాణిపాకం* 


తిరుమల యాత్ర కాణిపాకం నుంచి ప్రారంభించాలి. ఏ కార్యక్రమం ప్రారంభించినా ముందుగా వినాయకుడిని తల్చుకుంటాం కదా. అలానే ముందుగా కాణిపాకం స్వామిని దర్శించుకోవాలంటారు. గణపతి ప్రార్థన చేస్తే లక్ష్మీదేవి వెంటనే కరుణిస్తుందంటారు ఆధ్యాత్మిక వేత్తలు


 *తిరుచానూరు* 


అయ్యవారి కన్నా ముందు అమ్మవారిని ప్రశన్నం చేసుకోవాలి. అందుకే శ్రీవారి దర్శనం కన్నా ముందు తిరుచానూరు వెళ్లి పద్మ సరోవరంలో స్నానం ఆచరించి..పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలి


 *కపిలతీర్థం* 


తిరుచానూరు నుంచి కపిలతీర్థం వెళ్లి అక్కడ స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటే గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయంటారు. అనంతరం అక్కడి నుంచి కొండెక్కాలి


 *తలనీలాలు* 


కొండపైకి వెళ్లాక ఇంకేముందు స్వామివారిని దర్శించుకుంటే చాలు అనుకోవద్దు..ముందుగా తలనీనాలు సమర్పించండి.


 *పుష్కరిణిలో స్నానం* 


స్వామివారి పుష్కరిణిలో స్నానమాచరించే భాగ్యాన్ని పొందమంటారు ఆధ్యాత్మిక వేత్తలు


 *వరాహస్వామి* 


 *వరాహస్వామి దర్శనం చేసుకోకుండా శ్రీనివాసుడి దర్శనం చేసుకోకూడదు.* 


వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్నచ

దర్శాత్ ప్రాగ్ వరాహస్య శ్రీనివాసో న తృప్యతి


వరాహస్వామి కన్నా ముందుగా వచ్చి శ్రీవారిని దర్శించుకుంటే దానికి ఫలితం ఉండదని ఈ శ్లోకం అర్థం.


తమిళులు వరాహస్వామిని జ్ఞానం ఇచ్చే స్వామిగా భావిస్తారు. శరీరంలో ఉన్న అన్నమయకోశం, విజ్ఞానమయకోశం, ఆనందమయకోశం అని ఉంటాయి. వరహాస్వామి దర్శనంతో జీవుడు విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశించి ఆ తర్వాత ఆనందకోశంలో ఉన్న స్వామిని దర్శించుకోవడం సాధ్యమవుతుందని అర్థం. అందుకే వరాహస్వామిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనానికి వెళ్లాలి. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా తిరుమల ఆలయంలోపలకు వెళితే ఓ స్తంభంపై వరాహస్వామి కనిపిస్తారు.


 *శ్రీవారి దర్శనం* 


వరాహస్వామివారిని దర్శించుకున్నాక శ్రీనివాసుడిని దర్శించుకోవాలి


 *శ్రీ కాళహస్తి* 


చివరగా కొండదిగి కిందకు వచ్చిన తర్వాత శ్రీకాళహస్తి దర్శనంతో తిరుమల యాత్ర ముగుస్తుంది. చివరిగా శ్రీ కాళహస్తి దర్శనం ఎందుకు అనే సందేహం వచ్చి ఉండొచ్చు. పురాణాల్లో దీనికి సంబంధించి ఏమీ లేదు. అయితే సాధారణంగా సర్పానికి సంబంధించిన పూజలు ఏమైనా చేసినప్పుడు గతంలో చేసిన దోషాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే శ్లోకం ఉంటుంది. ప్రాయశ్చిత్తం అంటే దోషంతో సమానం అని అందుకే ఆఖరిగా శ్రీ కాళహస్తి దర్శనం చేసుకోవాలని చెబుతారు. అయితే దీనికి ప్రామాణికం ఏమీ లేదు. ప్రచారం అంతే. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.!!

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

అధర్మాచరణ వలన

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *అధర్మేణైధతే తావత్*

           *తతో భద్రాణి పశ్యతి|*

           *తతః సపత్నాన్ జయతి*

           *సమూలస్తు వినశ్యతి||*


తా𝕝𝕝 *అధర్మంతో కొన్ని సార్లు వృద్ధిచెందువాడు మంచి సుఖములను చవిచూచును.... తన శత్రువులనూ గెలుచును.... అయితే ఆ అధర్మాచరణ వలన అనతికాలంలోనే సమూలముగా నాశనము కావడము తథ్యము*....

                     

 ✍️🌹💐🌸🙏

⚜ శ్రీ కులస్వామిని భవానీ వాఘజై ఆలయం

 🕉 మన గుడి : నెం 1124


⚜ మహారాష్ట్ర : తేరావ్ - చిప్లున్ 


⚜ శ్రీ కులస్వామిని భవానీ వాఘజై ఆలయం



💠 శ్రీ భవానీ వాఘ్‌జై ఆలయం, తేరావ్ అనేది భవానీ మరియు వాఘ్‌జై దేవతలకు అంకితం చేయబడిన దేవాలయం . 

ఇది తాలూకా చిప్లున్ , జిల్లా తేరావ్ గ్రామంలో ఉంది . రత్నగిరి , మహారాష్ట్ర అసలు ఆలయం సుమారు 1860లో నిర్మించబడింది.



💠 మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలయాన్ని మహారాష్ట్రలోని పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ప్రకటించింది. 


💠 ఈ ఆలయం 123 అడుగుల పొడవు, దక్షిణం వైపు 76 అడుగులు మరియు ఉత్తరం వైపు 36 అడుగులు వెడల్పు కలిగి ఉంది. పునాది ఎత్తు 4 అడుగులు, అంతర్గత ఎత్తు 22 అడుగులు. ఆలయంలో భవానీ, వాఘ్‌జై, కల్కై మరియు నవదుర్గ దేవతలతో పాటు శివశంకర్ కూడా ఉన్నారు. 


🔆 చరిత్ర


💠 శ్రీ భవానీ వాఘ్‌జై ఆలయాన్ని 350 సంవత్సరాల క్రితం పూర్వీకులు నిర్మించారు. దీనిని మొదట 1839 లో పునర్నిర్మించారు. సంవత్సరాలుగా, ఆలయం తీవ్ర శిథిలావస్థకు చేరుకుంది, దీని ఫలితంగా గ్రామస్తులు దాని స్థానంలో కొత్త ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. 


🔅2002లో, టెరవ్ కమ్యూనిటీ ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించింది మరియు శ్రీ కులస్వామిని భవానీ వాఘ్‌జై ట్రస్ట్ స్థాపించబడింది. 

ఈ గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆలయ పునర్నిర్మాణ ఖర్చులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 

నగరాల్లో పనిచేసే వారు తమ ఒక నెల జీతం, పదవీ విరమణ చేసిన వారు తమ ఒక నెల పెన్షన్‌ను, వ్యాపారవేత్తలు తమ ఒక నెల ఆదాయాన్ని, రైతులు మరియు కార్మికులు ఒక్కొక్కరు రూ. 1000 విరాళంగా అందించారు. 

భారతి మహారాజ్, ఆలండి ఆశీర్వాదంతో ఆలయ పునర్నిర్మాణం 14 మే 2003న ప్రారంభమైంది. 


💠 ఈ ఆలయం 123 అడుగుల పొడవు, దక్షిణం వైపు 76 అడుగులు మరియు ఉత్తరం వైపు 36 అడుగులు వెడల్పు కలిగి ఉంది. 

పునాది ఎత్తు 4 అడుగులు, అంతర్గత ఎత్తు 22 అడుగులు. 

ఆలయంలో 4 విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలలో శ్రీ భవానీ, శ్రీ శివశంకర్, నవదుర్గ, వాఘ్‌జై మరియు కల్కై వంటి వివిధ దేవతలు ఉన్నారు. 

ఈ నాలుగు విభాగాలలో దక్షిణ భారత శైలుల గోపురాలు జాగ్రత్తగా రూపొందించబడ్డాయి. 

ఒక గోపురంలో శ్రీ హనుమంతుడి చిన్న విగ్రహం ఉంది. 


💠 భవానీ దేవత విగ్రహం పైన ఉన్న గోపురం నేల నుండి 55 అడుగుల ఎత్తులో ఉంది. ఆలయంలో సుమారు 2000 మంది కూర్చోగల సామర్థ్యం ఉన్న పెద్ద హాలు ఉంది, 100 అడుగుల బాల్కనీ ఉంది. ఆలయం 40 అడుగుల రెండు పెద్ద ద్వారాలను కలిగి ఉంది. దాని చుట్టూ వివిధ అందమైన విగ్రహాలు కూడా ఉన్నాయి. 


💠 భవానీ దేవి ప్రధాన విగ్రహం 9 అడుగుల ఎత్తు మరియు నల్ల రాయితో తయారు చేయబడింది. 

ఆమె చేతిలో మహిషాసురుడిని చంపడాన్ని వర్ణించే వివిధ ఆయుధాలు ఉన్నాయి . 



💠 మహారాష్ట్రలో నవదుర్గగా ప్రసిద్ధి చెందిన పార్వతి దేవి తొమ్మిది రూపాల విగ్రహాలు ప్రతిష్టించబడిన ఏకైక ఆలయం ఇదే . 



💠 ఈ ఆలయంలో తూర్పు వైపున పెద్ద అర్ధ వృత్తాకార తోటతో 7 తోటలు ఉన్నాయి. ఆలయంలో పెద్ద చెట్లతో కూడిన పెద్ద అడవి కూడా ఉంది. 



💠 చిప్లున్ నగరానికి 8 కి.మీ దూరంలో కొండపై ఉంది.


రచన

©️ Santosh Kumar

17-24-గీతా మకరందము

 17-24-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః | 

ప్రవర్తన్తే విధానోక్తాః 

సతతం బ్రహ్మవాదినామ్ || 


తాత్పర్యము:- అందువలన, వేదములను బాగుగనెఱింగినవారియొక్క శాస్త్రోక్తములగు యజ్ఞదాన తపః క్రియలన్నియు ఎల్లప్పుడును "ఓమ్” అనిచెప్పిన పిమ్మటనే అనుష్టింప బడుచున్నవి.


వ్యాఖ్య:- ‘ఓమ్, తత్, సత్' అను మూడు పదములలోను మొదటిది యగు ‘ఓమ్’ అను పదముయొక్క మహిమను వెల్లడించుచున్నారు - పరబ్రహ్మముయొక్క వాచకము (నామము) అయి అతిపవిత్రమై, మహాశక్తివంతమై యలరుచుండుటచే వేదవేత్తలందఱును తాము ప్రారంభించు యజ్ఞదానతపస్సులను క్రియలన్నిటియొక్క ఆదియందు ఎల్లప్పుడును ‘ఓమ్' అను ఆ ఏకాక్షర ప్రణవమంత్రమును ఉచ్చరించుచున్నారు. అట్లుచ్చరించిన పిదపయే ఆ యా క్రియలను వారు ఉపక్రమించుదురు. (అట్లే ఆ యా క్రియలు సమాప్తమైన వెనుకను మఱల 'ఓమ్’ అని (ఆ ప్రణవమును) ఉచ్చరించుచుందురు). అట్లొనర్చుటవలన ఆ యా క్రియలలో ఏవైనలోపములు, దోషములు ఉన్నచో అన్నియు తన్మంత్ర ప్రభావమువలన భస్మీభూతములైపోవ ఆ కర్మలు పరిపూర్ణఫలముల నొసంగగలవు.


“సతతమ్” - (ఎల్లప్పుడును) అని చెప్పుటవలన అట్టి వేదవేత్తలు తామాచరించు ఆ యా యజ్ఞదానాది సత్క్రియల ప్రారంభమున ఎల్లప్పడును ఆ ప్రకారమే ప్రణవోచ్చారణము చేయుదురని స్పష్టమగుచున్నది. ఇంజనువలన రైలు పెట్టెలన్నియు కదలునట్లును, ఒకటి యను సంఖ్యచే ప్రక్కనగల పూర్ణానుస్వారములు (సున్నలు) అన్నియు శక్తివంతములగునట్లును, మొదటగల ఓంకారముచే తక్కిన మంత్రములు, క్రియలు అన్నియు చైతన్యవంతములు, ప్రతిభావంతములు అగును.


ప్రశ్న: -"ఓంకారము" యొక్క మహిమను తెలుపుడు?

ఉత్తరము: - వేదవేత్తలు తా మాచరించు యజ్ఞ దాన తపఃక్రియలకు మొదట ఎల్లప్పడును ఓంకారమును ఉచ్చరించియే పిమ్మట ఆ యా క్రియలను చేయుచుందురు.

తిరుమల సర్వస్వం -253*

 *తిరుమల సర్వస్వం -253*

*ద్వాదశ ఆళ్వారులు-17*


*తిరుమంగై ఆళ్వార్* 


 శ్రీమహావిష్ణువు చేబూని ఉండే *'శార్ఙ్గము'* అనే ధనుస్సు యొక్క అంశగా భావించబడే తిరుమంగై ఆళ్వార్ తమిళదేశం లోని 'కురయలూరు' అనే గ్రామంలో జన్మించారు. శ్రీమహావిష్ణువు కున్న సహస్రనామాలలో *'శార్ఙ్గపాణి'* యనే నామధేయం కూడా ఒకటి.


 776 వ సంవత్సరంలో, కార్తీకమాసపు కృత్తికానక్షత్రంలో జన్మించిన వీరు సేనాధిపతిగా, రాజప్రతినిథిగా, భాగవతోత్తమునిగా, చోరుశేఖరునిగా, కవిపుంగవునిగా అనేక పాత్రలు పోషించి; వైష్ణవదివ్యక్షేత్రాల నెన్నింటినో సందర్శించి విష్ణుసాయుజ్యం పొందారు. వారి జీవన గమనానికి సంబంధించిన ఆసక్తికరమైన గాథ అనేక దయనీయ మలుపులు తిరుగుతూ కరుణ, భక్తిరస ప్రధానాలుగా చదువరులలో ఉత్సుకత నింపుతుంది.


 *కంచి వరదుని కటాక్షం* 


 'నీలుడు' అనే కడజాతి వానికి జన్మించిన తిరుమంగై ఆళ్వార్ జన్మనామం కూడా 'నీలుడే'! బాల్యం నుండి కులవిద్యతో పాటుగా యుద్ధవిద్య లన్నింటిలో అత్యంత నైపుణ్యం సంపాదించడంతో అప్పటి చోళరాజు నీలుణ్ణి సైన్యాధిపతిగా, తన సామ్రాజ్యంలో కొంత భాగానికి రాజప్రతినిధిగా నియమించాడు. క్షాత్రవిద్యలతో పాటుగా భగవదారాధానలో కూడా అమితాసక్తిని ప్రదర్శించే నీలుడు ప్రజల నుండి పన్నుల ద్వారా సేకరించిన సొమ్మును ప్రభుత్వ కోశాగారంలో జమ చేయకుండా, భగవత్కైంకర్యాలకు వెచ్చించేవాడు. పన్నుబకాయిలు పేరుకు పోవడంతో, చోళప్రభువు నీలునిపై 'ప్రభుత్వనిధుల మళ్ళింపు' నేరం మోపి; అతనిని నిత్యపూజలకు నోచుకోని ఒక వైష్ణవాలయంలో బంధించాడు. అలా పెక్కుదినాలు ఆకలిదప్పులతో అలమటిస్తూ బందీగా ఉన్న నీలుడు తన అన్నపానాదుల కోసం, సౌకర్యం కోసం, స్వేచ్ఛ కోసం చింతించకుండా; భగవదార్చన చేయలేక పోయినందుకు కృంగిపోయాడు. త్వరలో తనను విడుదల చేయించి, తనచే నిత్యపూజ జరిపించుకొమ్మని పరమేశ్వరుణ్ణి వేడుకొన్నాడు. అతని త్యాగనిరతికి, నిస్వార్థచింతనకు, భక్తిశ్రద్ధలకు ముగ్ధుడైన కంచి వరదరాజస్వామి నీలునికి స్వప్నంలో సాక్షాత్కరించి ఒక గుప్తనిధి జాడ తెలియజేశాడు. నీలుడు చోళరాజు సమ్మతితో నిధిని తెగనమ్మగా సమకూడిన సొమ్ముతో పన్నుబకాయిలను జరిమానాతో సహా తీర్చివేసి, మిగిలిన రొక్కాన్ని భగవత్కైంకర్యానికై వినియోగించాడు. అంతే గాకుండా తన ఆధ్యాత్మిక చింతనకు అడ్డుగా నున్న రాచకొలువును విడనాడి, శ్రీహరిని కొలుచుకుంటూ కవితా వ్యాసంగంలో మునిగి పోయాడు. తన పాశురాల సంకలనమైన *'పెరియ తిరుమొళి'* లో శ్రీమన్నారాయణుని కథానాయకునిగా, తనను కథానాయకిగా ఊహించుకొని మధురభక్తిని ప్రకటించాడు.


 *మంత్రోపదేశం* 


 కాలాంతరాన, ఒకానొక సరోవరంలో జలకమాడుతున్న 'కుముదవల్లి' అనే గంధర్వకన్యను కాంచి మోహించిన నీలుడు ఆమె విధించిన మొదటి షరతు ప్రకారం పంచసంస్కారాలు గావించుకొని, శ్రీవైష్ణవునిగా పునర్జన్మ నెత్తి, ఆమెను శాస్త్రసమ్మతంగా పరిణయమాడాడు. ఆమె విధించిన రెండవ షరతును అనుసరించి ఒక సంవత్సరకాలం పాటు ప్రతినిత్యం వేయిమంది శ్రీవైష్ణవులకు అన్నసంతర్పణ కావించే మహత్కార్యానికి పూనుకున్నాడు. ప్రతిరోజూ వేయిమందికి అన్నదానమంటే అది మహారాజులకే గానీ, సామాన్యులకు సాధ్యపడే కార్యం కాదు. కొద్దికాలానికే నీలుని ఆర్థిక వనరులన్నీ అడుగంటి పోయాయి. అన్న సంతర్పణను కొనసాగించడం శక్తికి మించిన భారమైంది. రేయింబవళ్ళు కష్టించినప్పటికీ ప్రతిరోజు వేయిమందికి అన్నవితరణకు కావలసినంత పైకాన్ని కూడబెట్ట లేకపోయాడు. ఆరునూరైనా సరే, భాగవతుల విషయంలో సతీమణి కిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టు కోవలసిందే! ఎంతకూ తరుణోపాయం కానరాక పోవడంతో, నీలుడు భావసారూప్యత గలిగిన కొందరు వైష్ణవభక్తులను కూడదీసి, చోరబృందంగా ఏర్పడి, బందిపోటు తనాలకు పాల్పడసాగాడు. శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించిన నీలుని దృష్టిలో చోరవృత్తి నేరమే అయినప్పటికీ, దానికి పరిహారముంది. కానీ వాగ్దానభంగం మాత్రం ప్రాయశ్చిత్తం లేని నేరం. అది కుడా, భాగవతోత్తముల విషయంలో అనృతానికి (అసత్యం) పాల్పడడం మరింత మహాపరాధం. ఇలా తర్జన భర్జన పడిన అనంతరం అక్రమ మార్గాలలో ధనార్జన చేసినవారి నుండి మరియు నాస్తికుల నుండి ధనాన్ని దొంగిలించి, ఆ సొమ్ముతో శ్రీవైష్ణవులకు అన్నసంతర్పణను నిరాటంకంగా కొనసాగించాడు. 


 ఇలా కొంత తడవు జరిగిన తరువాత శ్రీరంగనాథుడు తిరుమంగళై ఆళ్వార్ భక్తిశ్రద్ధలను పరీక్షింప గోరాడు. శ్రీరంగనాథుడు ఒక పెళ్ళిబృందంలో వరుని రూపంలో ఊరేగుతూ తనను దోచుకోబోతున్న నీలునికి తారసపడి, స్వీయరక్షణకై అతనితో ముష్టియుద్ధం గావించాడు. తన ప్రాణాలకు తెగించి వీరోచితంగా పోరాడిన నీలుడు పెళ్ళిబృందం వారి ఆభరణాలను, ధనాన్ని దోచుకున్నాడు. కానీ వారి మానప్రాణాల కేమాత్రం హాని తలపెట్టలేదు. ఊరేగింపులో నున్న వైష్ణవుల జోలికి పోలేదు. అతని సాహసాన్ని, కార్యనిరతిని, వాగ్దానాన్ని నిలబెట్టు కోవడానికి ప్రదర్శించిన తెగువను, శ్రీవైష్ణవుల పట్ల అతనికున్న నిబద్ధతను చూచి ముచ్చట పడిన శ్రీరంగనాథుడు స్వయంగా ప్రత్యక్షమై నీలునికి *'నారాయణాక్షరి'* మంత్రోపదేశం కావించాడు. శ్రీరంగశాయిని కనులారా కాంక్షించిన తిరుమంగై ఆళ్వార్ భక్తిశ్రద్ధలు మరింతగా ఇనుమడించాయి.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వము ద్వితీయాశ్వాసముసమాప్తం*



*390 వ రోజు*

కర్ణుడు సుయోధనుడికి సాయం వచ్చాడు. కర్ణుడు తన శరములతో శిఖండి విల్లును, కేతనమును ఖండించాడు. శిఖండి అక్కడ నుండి పారిపోయాడు. దుశ్శాసనుడు ధృష్టద్యుమ్నుడు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధము చేస్తున్నారు. నకులుడు కర్ణుడి కుమారుడైన వృషసేనుడి సారథిని చంపాడు. వృషసేనుడి సైన్యము చెదిరి పోయింది. వృషసేనుడు వేరొక సారథిని తీసుకుని యుద్ధానికి వచ్చాడు. సహదేవుడు శకుని కుమారుడైన ఉలూకుడిని తీవ్రంగా గాయపరిచాడు. ఉలూకుడు ఆ దెబ్బకు పారిపోయాడు. సాత్యకి శకుని ఒకరితో ఒకరు తీవ్రంగా పోరుసల్పుతున్నారు. సాత్యకి శకుని రథాశ్వములను చంపగా శకుని రథము దిగి పారిపోయాడు. భీముడు సుయోధనుడిని సారథిని చంపి రథమును విరుగ కొట్టాడు. సుయోధనుడు మరొక రథము ఎక్కి అక్కడి నుండి తొలిగి పోయాడు. యుధామన్యుడు కృపాచార్యుని ఎదుర్కొని అతడి విల్లు విరిచాడు. కృపాచార్యుడు వేరొక విల్లు తీసుకుని యుధామన్యుడి సారథిని చంపి కేతనమును, విల్లును విరిచాడు. యుధామన్యుడు పారిపోయాడు. అశ్వత్థామ అర్జునుడిని ఎదుర్కొన్నాడు. కృష్ణార్జునుల మీద శరములు గుప్పించాడు.అర్జునుడు అశ్వత్థామ మీద అనేక దివ్యాస్త్రాలు సంధించాడు. ధర్మరాజు చిత్రసేనుడిని ఎదుర్కొని భీముడు, నకుల సహదేవులు, ధృష్టద్యుమ్నుడు సుయోధనుడిని అతడి పరివారాన్ని ఎదుర్కొన్నారు. అది చూసి కర్ణుడు సుయోధనుడికి సాయంగా వచ్చి ధర్మరాజు గుండెలకు గురిపెట్టి బాణము వేసాడు. ఆ దెబ్బకు ధర్మరాజు రథము మీద కూలబడి రథమును పక్కకు పోనిమ్మని చెప్పాడు. కౌరవులు ధర్మరాజును తరిమారు. కేకయ, పాంచాల యోధులు వచ్చి ధర్మరాజును రక్షించారు. భీముడు సుయోధనుడితో యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు కేకయ, పాంచాల సేనలను నుగ్గు చేసి ధర్మరాజును తరిమాడు. ధర్మరాజు వెను తిరిగి కర్ణుడి మీద శరవర్షం కురిపించి కర్ణుడి సారథిని హయములను చంపాడు. నకులుడు సహదేవుడు ధర్మరాజుకు సాయంగా వచ్చి కర్ణుడి మీద శరములు గుప్పించారు. కర్ణుడు విజృంభించి ధర్మరాజు తలపాగా కొట్టి అతడి సారథిని చంపాడు. ధర్మరాజు నకులుడి రథము ఎక్కాడు. ఇంతలో శల్యుడు కర్ణుడిని చూసి " కర్ణా ! ఏమిటీ పని నీపరాక్రమము అర్జునుడి మీద చూపాలి కాని ధర్మరాజు మీద కాదు. నీవు పొరపాటున ధర్మరాజును చంపితే అర్జునుడు నిన్ను వధించుట తధ్యం. కనుక ధర్మరాజును వదలి అర్జునుడితో యుద్ధము చెయ్యి. కర్ణా ! అటు చూడు నీ అనుంగు మిత్రుడు సుయోధనుడు భీమసేనుడి చేత చిక్కి నిరాయుధుడయ్యాడు. సుయోధనుడు భీముని చేతిలో మరణించిన నీ శ్రమ వృధా ! నీవు పాండవులను గెలిచినా ప్రయోజనము ఉండదు. కనుక సుయోధనుడిని రక్షించు " అన్నాడు. శల్యుని మాటలు విని కర్ణుడు ధర్మరాజును వదిలి సుయోధనుడి వైపు వెళ్ళాడు. కర్ణుడు తనను విడిచి వెళ్ళగానే ధర్మరాజు నకుల సహదేవులతో తన శిబిరానికి వెళ్ళాడు.

*కర్ణ పర్వము ద్వితీయాశ్వాసముసమాప్తం*


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

నేటి వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం -‌ ద్వితీయ - మృగశిర -‌‌ సౌమ్య వాసరే* (28.05.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

అడుగులకు మడుగులు:*

 *అడుగులకు మడుగులు:*


పూర్వం మహారాజులూ, మహారాణులూ బయల్దేరినప్పుడు వాళ్లవెనక కొంగులెత్తి పట్టుకోవడానికి సేవకులుండేవాళ్ళు. అలాగే ముందు గుడ్డలు పరిచేవాళ్ళు, కాళ్ళకు నేల తగిలి ఒత్తిడి కలిగి బాధ పడకుండా. పూర్వం రాజకుమార్తెలు ఏడు మల్లెపూల ఎత్తుండేవాళ్లని కాశీమజిలీల వంటి కథలు వర్ణిస్తాయి. అంత సుకుమారులకు నడుస్తున్నా ఇబ్బంది కలక్కుండా 'మడుగులు' పరిచేవాళ్ళు. మడుగు అంటే మడతపెట్టిన గుడ్డ. ఒంటిపొర గుడ్డలు పరిచినా కాళ్ళు కందిపోవచ్చు. కాబట్టి గుడ్డ మడతలు పరిచేవారన్నమాట. ఆ పరచటాన్ని కూడా మరింత సుకుమారంగా ఒత్తటమన్నారు. అడుగులకు మడుగులొత్తే పని సేవకులందరిలోనూ తక్కువరకం వాళ్ళ కర్తవ్యం. రాజులకు సరే. సామాన్యులక్కూడా ఇలాంటి సేవలు చేయటం దాస్య ప్రవృత్తికి చిహ్నం. అయితే సామాన్యుల భోగం కట్టుగుడ్డల్తో సమాప్తమవుతుంది. ఉత్తుత్తి సేవలు చేయించుకోవలసిందే వాళ్ళు. ఈ కాలంలో మడుగుల్లేకపోయినా అవి ఉంటే ఎలా సేవలు చేస్తారో అలా వంగి వంగి దణ్ణాలు పెడుతూ బతకటాన్ని అడుగులకు మడుగులొత్తటం అంటారు. అంటే - బానిసలా వ్యవహరించటం/ప్రవర్తించటం, రాజమర్యాదలు జరపటం, విపరీతంగా గౌరవించటం.