29, మే 2025, గురువారం

భగవద్గీత

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                    *భగవద్గీత*

                   ➖➖➖✍️```

       (సరళమైన తెలుగులో)```


*#రెండవ అధ్యాయము:* 

 ***సాంఖ్యయోగము.* 

————————————-

*21.వ శ్లోకము:*


*”వేదావినాశినం నిత్యం య ఏవమజమన్నయమ్l*

*కథం సః పురుషః పార్థ కం* *ఘాతయతి హన్తి కమ్||”*

```

“ఓ అర్జునా! ఎవరైతే ఈ ఆత్మను సత్యమైనదిగా, నాశనము లేనిదిగా, నిత్యమైనదిగా, జన్మలేనిదిగానూ, మార్పులేనిదిగానూ, మరణము లేనిదిగానూ తెలుసుకుంటాడో, అటువంటి వాడు ఎవరిని చంపిస్తాడు. ఎవరిని ఎందుకు చంపుతాడు? ఎలా చంపుతాడు. కాబట్టి ఎవరూ ఎవరినీ చంపరు, చంపించరు.”


ఇప్పటి దాకా ఆత్మ నిత్యము అది చావదు అని చెప్పిన కృష్ణుడు, ఇప్పుడు ఆత్మ ఎవరినీ చంపదు. ఎవరినీ చంపించదు అంటే ఎవరి చావుకూ కారణం కాదు అని అంటున్నాడు. అర్జునా! నీలో ఉన్న అత్మస్వరూపము, భీష్మద్రోణ, కృపాచార్యులలోనూ ఇతర రాజులు, సైనికులలోనూ ఉన్న ఆత్మస్వరూపాలను చంపదు. వారిలో ఉన్న ఆత్మలు చావడానికి నీలో ఉన్న ఆత్మ కారణం కూడా కాదు. నీవే అందరినీ చంపుతున్నాను అని అనుకోవడం నీ భ్రమ.


ఆత్మజ్ఞానం కలిగి ఉండటమే ఆధ్యాత్మికత, కాని మనలో ఉన్న నేను అనే అహంకారము, ఈ శరీరమే నేను అనే భ్రమను కలుగచేస్తుంది. నేనే ఈ శరీరము, అంతా నేనే చేస్తున్నాను అన్న భ్రమలో ఉన్నంత కాలము, ఆత్మతత్వము అర్థం కాదు. ఆత్మ అవినాశి అనీ, నిత్యం అని అవ్యయం అనీ తెలుసుకోవాలి.


మనం అందరం నేను నేను అంటున్నాము. నేను అంటేనే ఆత్మ. నా పేరు సుబ్బారావు. నాకు ఆకలి వేసింది. నాకు కోపం వచ్చింది. అంటే మనకు తెలియకుండానే 'నేను అంటే ఈ శరీరం కాదు. నాలో ఉన్న ఆత్మ స్వరూపము' అనే జ్ఞానం మనకు సహజంగానే ఉంది. కాని దానిని గురించి మనం ఆలోచించము. ఆచరించము మనం ఏది "నేను" అని అనుకుంటున్నామో ఆ "నేను" అనే దాని స్వభావం మనకు తెలియదు. అంటే నేను అంటే మనకు తెలుసు కాని దాని స్వభావం మాత్రం తెలియదు.


ఈ "నేను" అనే ఆలోచన జంతువులకు పక్షులకు లేదు. అవి "నేను" గురించి ఆలోచించవు. ఆహారం తినడం, ఎద వచ్చినప్పుడు కలవడం, నిద్రవస్తే నిద్రపోవడం వాటి సహజలక్షణం, వాటి నేచర్, వాటికి ఆలోచించే శక్తి లేదు. కాని మనకు ఆ శక్తిని ఇచ్చాడు భగవంతుడు. ఒక డిన్నర్ జరుగుతూ ఉంది. ఒక ఆవు ఒక పులి వచ్చాయి. అవి వాటి సహజమైన ఆహారం దగ్గరకు వెళతాయి అంటే ఆవు విజిటేరియన్, పులి నాన్ వెజిటెరియన్. కాని మానవుడు అటు ఇటు చూస్తాడు. తెలిసిన వాళ్లుంటే వెజ్ లేకపోతే నాన్ వెజ్ కు జంప్. 


అంటే జంతువులు తమ స్వభావాన్ని పట్టి పనులు చేస్తాయి. మనిషి ఆలోచించి చేస్తాడు. అవకాశాన్ని బట్టి చేస్తాడు.


ఈ "నేను" అనే అహంభావం మనిషిలో కలగడం వలన "నేను అందరి కంటే గొప్ప వాడిని, వాడు నా కంటే తక్కువ" అనే భావన కలుగుతుంది. జంతువులకు ఈ భావన కలుగదు. అవి తాము అన్నీ ఒకటే అనే భావనతో ఉంటాయి. కాబట్టి ప్రతిమనిషికి నేను అంటే ఏమిటో తెలుసు కాని దాని స్వభావం తెలియదు. ఈ శరీరమే నేను అనుకుంటూ ఉంటాడు. అలాగే మనకు నేను అంటే ఏమిటో తెలుసు. నేను అనే దాని స్వభావం మనకు తెలియదు కాబట్టి కనపడే ఈ శరీరమే నేను అనుకుంటున్నాము. మన కన్ఫ్యూజన్ అంతా ఇక్కడే ఉంది. నేనే ఈ శరీరం ఈ శరీరమే నేను అనుకోవడం, నేను స్వభావం గురించి తెలుసుకోక పోవడమే అసలు సమస్య కాబట్టి సాధకుడు తెలుసుకోవలసిందేమిటంటే "నేను 

ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుడను" అని తెలుసుకోవాలి. అప్పుడు ఆత్మ అవినాశి, అజం, సత్యం, అవ్యయం అని తెలుసుకునే అవకాశం ఉంది. లేకపోతే వీటి అర్థాలు తెలియవు.


కాబట్టి ఆత్మజ్ఞానం రెండు దశలుగా తెలుసుకోవాలి. ముందు ఆత్మ యొక్క స్వభావం తెలుసుకోవాలి. అదే మొదటి పాదంలో చెప్పారు. ఆత్మ అవినాశి, నిత్యం, అజం, అవ్యయం అని, ఇంక రెండవ దశ ఆ ఆత్మ నేనే, నేనే ఆత్మను అని తెలియాలి. కాబట్టి రెండు దశల్లో ఆత్మజ్ఞానం సంపాదించాలి. కాని మనం అంతా ఈ శ్లోకం చదివి ఆత్మ ఇలా ఉంటుంది అని తెలుసుకుంటాము. కనిపించని ఆత్మ కొరకు వెదుకుతుంటాము. ఆత్మ కొరకు శోధిస్తున్నాను అని చెప్పుకుంటాము. కానీ నేను ఆత్మను అని మాతం అంగీకరించరు. మనలో ఉన్న ఆత్మ కొరకు బయట ఎక్కడెక్కడో వెదుకుతుంటాము. అదే అజ్ఞానము. దానికి కావాల్సినవి శ్రవణం అంటే ఆత్మ గురించి శాస్త్రముల ద్వారా వినడం, తరువాతది మననం, విన్నదానిని మననం చేయడం. ఆత్మస్వరూపం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం. దాని గురించి ఏవైనా సందేహాలు ఉంటే గురువు ద్వారా నివృత్తి చేసుకోవడం. మూడవది నిధి ధ్యాస. అంటే ఆత్మ ఎవరో కాదు నేనే. నేనే ఆత్మను. నేను ఈ శరీరం కాదు అనే జ్ఞానం కలగడం. అప్పటిదాకా నేనే దేహము, ఈ దేహంతో అన్ని పనులు చేస్తున్నాను. అమ్మో! ఈదేహం మరణిస్తుంది అని భయపడ్డ వాడు, ఆత్మజ్ఞానం కలగగానే, మరణించేది నేను కాదు, నా శరీరం మాత్రమే. నేను ఆత్మస్వరూపుడను నాకు మరణంలేదు అని నిశ్చింతగా ఉంటాడు. పైగా మరణాన్ని ఆనందంగా ఆహ్వానిస్తాడు.


కాబట్టి అర్జునా! నీవు దేహానివి కాదు. వీళ్లందరూ దేహాలు కాదు ఆత్మస్వరూపులు. దేహాలు వేరు వీళ్లు వేరు. నీవు చంపితే దేహాలు పోతాయి కానీ వాళ్లు ఎక్కడకూ పోరు. నీవు చంపడం వాళ్లు చావడం అంతా నీ భ్రమ, మిథ్య. చంపేవాళ్లు లేరు. చంపించేవాళ్లు లేరు. ఆత్మస్వరూపము ఎవరినీ చంపదు, ఎవరినీ చంపించదు. అలా అనుకోవడం 

నీ అవివేకమమ” అని బోధించాడు కృష్ణుడు.✍️```

```(సశేషం)

   🙏యోగక్షేమం వహామ్యహం🙏

రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 

 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

           🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

తిరుమల సర్వస్వం 254*

 *తిరుమల సర్వస్వం 254*

*ద్వాదశ ఆళ్వారులు-18*


2  *విష్ణుసాయుజ్యం* 


 అప్పటికే చోరవిద్యలో ఆరితేరిన తిరుమంగై ఆళ్వార్ తన చోరవృత్తిని యథేచ్ఛగా కొనసాగించి, ఆ వచ్చిన సొమ్ముతో శ్రీరంగంలో అచ్చెరువొందే అనేక నిర్మాణాలను చేపట్టాడు. వాటిలో కొన్ని ఇప్పటికీ చూపరులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి. అత్యద్భుత కళాఖండాలు సృష్టించిన వేలాది శిల్పకారులకు కూలి డబ్బులు సైతం చెల్లించలేని దయనీయస్థితికి చేరుకున్న తిరుమంగై ఆళ్వార్ తన సర్వస్వాన్ని ధారపోసి, అన్నపానాదులు సైతం త్యజించి, తాను కలగన్న నిర్మాణాలన్నింటినీ పూర్తిచేసి, పరమ భాగవతోత్తముడు అనిపించుకున్నాడు. తదనంతరం చిరకాలం శ్రీరంగనాథుని కైంకర్యంలో తరించి, పెక్కు వైష్ణవక్షేత్రాలను సందర్శించుకొని మోక్షప్రాప్తి నొందాడు.


 *నామాంతరాలు* 


 విష్ణుభక్తి ప్రధానంగా కలిగినప్పటికీ, అనేక విద్యలలో ఆరితేరిన వాడవ్వటం వల్ల, తిరుమంగై ఆళ్వార్ కు అనేక నామాంతరా లున్నాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి యైన తిరుమంగై ఆళ్వార్, ఆ నామాలన్నింటికీ సార్థకత చేకూర్చాడు. అనన్య సామాన్యమైన కవితాసామర్థ్యం కలిగి యుండటం వల్ల 'చతుష్కవి శిఖామణి' గాను; రాజాస్థానంలో నున్నపుడు శత్రువులకు సింహస్వప్నంలా ఉండటం వల్ల 'పరకాలుని' గాను; వైష్ణవభక్తులకు తలమానికంగా భాసిల్లడం ద్వారా 'తిరుమంగై ఆళ్వార్ గాను ఖ్యాతి నొందాడు. వారి పండితీప్రకర్ష ద్వారా 'ఆశుచిత్రమధురవిస్తరకవితానిర్మాణదక్షులు' అనే బిరుదును కూడా స్వంతం చేసుకున్నారు.


 *సాహిత్యసాధన* 


 వీరు తమ రచనల్లో శ్రీవేంకటేశ్వరుణ్ణి భూమ్యాకాశలపై పాదాల నుంచిన త్రివిక్రమావతారునిగా, గజేంద్రమోక్షప్రదాతగా, అష్టదిక్కుల సంరక్షకునిగా, బదరికాశ్రమవాసిగా, సప్తలోక సంచాలకునిగా ఇంకా అనేక రకాలుగా అభివర్ణించాడు. 'ఓం నమో వేంకటేశాయ' అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించిన వారికి పునర్జన్మ రాహిత్యం సంప్రాప్తిస్తుందని కూడా వీరు తమ రచనల ద్వారా స్పష్ట పరిచారు. తిరువళుక్కూత్తిరుక్కై, తిరుక్కురుందాండకం, శిరియతిరుమడల్ అనే ఇతర గ్రంథాలను కూడా వీరు రచించారు.


 శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏడవరోజు ఉదయం 'సూర్యప్రభ వాహనోత్సవం' లో తిరుమంగై ఆళ్వార్ రచించిన 'పెరియ తిరుమొళి' లోని ఎనభై పాశురాలను; అదే రోజు రాత్రి జరిగే 'చంద్రప్రభ వాహనోత్సవం' లో 'పెరియ తిరుమొళి' లోని మరో నూటనలభై పాశురాలను పారాయణం చేస్తారు.

 *విప్రనారాయణుడు (తొండరడిప్పొడి ఆళ్వార్)* 


 తమిళదేశం లోని కుంభకోణం అనే పుణ్యక్షేత్రంలో శ్రీమహావిష్ణువు *'శారంగపాణి'* గా వెలశాడు. వీరు అతృప్తామృతునిగా వాసికెక్కారు. అతృప్తామృతమంటే 'ఎంత సేవించినా తృప్తి తీరని అమృతం'. అంటే, ఈ స్వామిని ఎంతసేపు కాంక్షించినప్పటికీ తనివి తీరదన్నమాట.


 *పుష్పకైంకర్యం* 


 ఆ కుంభకోణం క్షేత్రానికి కొద్ది దూరంలో గల మండంగుడి అనే చిన్న పట్టణంలో, ఒక విప్రోత్తమునికి కలిగిన బాలునికి *'విప్రనారాయణుని'* గా నామకరణం చేశారు. ధనుర్మాసపు జ్యేష్టానక్షత్రాన, 787 వ సంవత్సరంలో ఉద్భవించిన వీరు శ్రీమన్నారాయణుడు ధరించే, *'వైజయంతిమాల'* యని పేరొందిన పుష్పమాల యొక్క అంశగా భావింపబడుతారు. సద్ర్భాహ్మణ వంశ సంజాతుడవ్వడం వల్ల, పండితుడైన తండ్రిగారి పెంపకం వల్ల విప్రనిరాయణుడు అతి చిన్నవయసు లోనే వ్యాకరణ, తర్క, మీమాంసాది సర్వశాస్త్రాలను; వేదవేదాంగాలను అభ్యసించ గలిగాడు. దానితో బాటుగా, భగవద్భక్తిని కూడా అలవరచుకున్నాడు. యుక్తవయసు కొచ్చిన విప్రనారాయణునికి తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు ప్రారంభింపగా, తన భగవదారాధనకు సంసారజీవితం ఆటంకమవుతుందనే ఉద్దేశ్యంతో; యువకుడు వివాహ ప్రస్తావనను నిరాకరించి, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండదలిచాడు. ముక్తిబాటలో పయనిస్తూ శ్రీరంగనాథుని సందర్శనార్థం 'శ్రీరంగం' చేరుకున్న విప్రనారాయణుడు రంగనాథునికి నిత్యము పుష్పకైంకర్యం చేసే లక్ష్యంతో, మరో ఆళ్వార్ శ్రీవిష్ణుచిత్తుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని; ఆలయానికి సమీపంలో ఒక పుష్పవనాన్ని పెంచసాగాడు. మిక్కిలి శ్రద్ధతో సంరక్షించడం వల్ల అనతి కాలంలోనే ఆ పూదోట రంగురంగుల, పరిమళ భరిత పుష్పాలకు నెలవై, నందనవనాన్ని తలపించేంత సుందరంగా తయారై, చూపరులను ఆకట్టుకుంది. విప్రనారాయణుడు మధ్యాహ్న సమయంలో భిక్షాటనతో జీవితాన్ని గడుపుతూ; ఉదయం మరియు సాయంకాల సమయాలలో పూమాలలల్లి శ్రీరంగనాథునికి సమర్పించు కునేవాడు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

17-26-గీతా మకరందము

 17-26-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ర్పయుజ్యతే 

ప్రశస్తే కర్మణి తథా 

సచ్చబ్దః పార్థ యుజ్యతే.


తాత్పర్యము:- ఓ అర్జునా! " కలదు' అనెడి అర్థమందును, "మంచిది' అనెడి అర్థమందును 'సత్' అను ఈ

పరబ్రహ్మనామము ప్రయోగింపబడుచున్నది. అట్లే ఉత్తమమైన కర్మమునందును ఆ 'సత్' అను పదము వాడబడుచున్నది.


వ్యాఖ్య:- పరబ్రహ్మవాచకమగు "సత్' అను పదము "ఉనికి"ని, 'శ్రేష్టత్వము'ను రెండింటిని సూచించుచున్నది. ఆ రెండు అర్థములలోగూడ ఆ పదము ప్రయోగింపబడుచుండును. (దృష్టాంతమునకు సత్ + భావము = ఉనికి).


ప్రశ్న:- పరబ్రహ్మవాచకమగు 'సత్' అను పదము ఏ యర్థములందు వాడబడుచుండును?

ఉత్తరము:- (1) "కలదు అను అర్థమందును ("ఉనికి యనెడి అర్థమందు), (2) "మంచిది' అనెడి అర్థమందును అది వాడబడుచున్నది.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వం – తృతీయాశ్వాసం*


*391 వ రోజు*


*కర్ణ పర్వము తృతీయాశ్వాసం*


కర్ణుడు తన చేత చిక్కిన ధర్మరాజును వదిలి సుయోధనుడిని రక్షించడానికి వెళ్ళాడని తెలియగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! కర్ణుడు అలా బుద్ధి లేని పని ఎందుకు చేసాడు. చేత చిక్కిన ధర్మరాజును చంపక ఎందుకు వదిలాడు ? సుయోధనుడు అంత మాత్రం భీమునితో యుద్ధం చేయ లేడా ? కర్ణుడు మోసం చేసాడంటావా ? సరేలే తరువాత ఏమి జరిగిందో చెప్పు అన్నాడు.


*ధర్మరాజు శిబిరముకు వెళ్ళుట*


కర్ణుడి చేత విడువ బడిన ధర్మరాజు శిబిరానికి చేరి మెత్తటి శయ్య మీద పరుండి. తన శరీరానికి తగిలిన బాణములు తీయించు కుంటూ తనకు జరిగిన పరాభవానికి బాధపడ సాగాడు. ఇంతలో నకుల సహదేవులు లోనికి వచ్చారు. ధర్మరాజు వారిని వెంటనే భీమునకు సాయంగా వెళ్ళమని చెప్పాడు. నకుల సహదేవులు భీముడికి సాయంగా వెళ్ళారు. అర్జునుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అర్జునుడు వేస్తున్న తీవ్రమైన బాణములు ఎదుర్కొంటూ అశ్వత్థామ అర్జునుడి మీద గదను విసిరాడు. ఆ గదను ముక్కలు చేసి వెంటనే అర్జునుడు అశ్వత్థామ శరీరంలో పది వాడి అయిన బాణములు గుచ్చి అతడి సారధిని చంపాడు. ఆగ్రహించిన అశ్వత్థామ కృష్ణార్జునుల మీద బాణవర్షం కురిపించాడు. అర్జునుడు ఆ బాణములు మధ్యలో తుంచి అశ్వత్థామ రధాశ్వముల పగ్గములను తెంచాడు. పగ్గములు తెగిన అశ్వములు రధమును ఎటో లాక్కుని వెళ్ళాయి. అది చూసి పాండవ సేనలు జయజయ ధ్వానాలు చేసాయి. కౌరవసేన పారిపోయింది.


*కర్ణుడు భార్గవాస్త్రాన్ని ప్రయోగించుట*


కురుసేనల వెనుకడుగు చూసి సుయోధనుడు " కర్ణా ! నీవు యుద్ధరంగమున ఉండగా కురుసేనలకు ఈ దుర్గతి ప్రాప్తించింది. నీవు సరిగా యుద్ధము చేసిన పాండవులు నీకు లెక్క కాదు. నీ వివిధాస్త్రాలను ప్రయోగించి నీ పరాక్రమాన్ని చూపించు " అని పురికొల్పాడు. అప్పుడు కర్ణుడు " శల్యా ! చూసావుగా సుయోధనుడి మాటలు మన రథమును అర్జునుడి వద్దకు పోనిమ్ము. అర్జునుడిని వధించి ఈ సువిశాల సామ్రాజ్యానికి సుయోధనుడిని చక్రవర్తిని చేసి నా ప్రతాపం లోకానికి తెలియజేస్తాను " అని వెంటనే విల్లు ఎక్కు పెట్టి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రము నుండి వివిధ ఆకృతులలో ఆయుధాలు వచ్చి పాండవ సేనను నాశనం చేస్తోంది. రధములు విరుగుతున్నాయి. హయములు, ఏనుగులు గుట్టలుగా చచ్చి పడుతున్నాయి. రధములు విరుగుతున్నాయి. ఆ అస్త్రప్రభావానికి తాళ లేని పాండవసేనలు పరుగులు పెట్ట సాగాయి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమహాభాగవతావతరణము

 🌻శ్రీమహాభాగవతావతరణము 🌻


సీ.

నారాయణుని దివ్యనామాంకితమ్మునౌ 

       కావ్యమ్ము విరచించు కౌతుకమున

నొకనాటి పూర్ణచంద్రోదయోదీర్ణ సత్ 

       చంద్రగ్రహణ దివ్యసమయ మందు

సజ్జను లనుమతిన్ స్నానమ్ము పాటించ

       గంగలో నిష్ఠతో  క్రుంకు లిడియు 

వెడలివచ్చి యచటి  విమల సైకత తటిన్  

       జేరి సద్భక్తితో  కూరుచుండి

తే.

ధ్యాన యోగాన పరమేశు నాత్మ నెంచి 

యర నిమీలిత నయనాల నరయు చుండ

భక్తపోతన్న యెదుటను ప్రభల నొల్కు 

దివ్య తేజస్సు కన్పించె  దిశలు వెలుగ       19*


సీ.

మెరుపుతీగకు ప్రక్క మేఘమ్ము వోలెను

          నువిద  చెంగట నుండ నొప్పు వాడు

చంద్రమండల సుధాసారమ్ము వంటిదౌ

          చిరునవ్వు ముఖమందు చిందు వాడు

వల్లీయుత తమాల వసుధజ వోలెను

           బలు విల్లు మూపునన్ బరగు వాడు

నీలాద్రి శిఖరాన నిల్చు భానునిగను

            ఘన కిరీటము దల గల్గు వాడు

ఆ.

పుండరీకయుగము బోలు నేత్రమ్ముల 

వెడద యురము తోడ  వెలయు నట్టి

రాజముఖ్యు డొకడు  తేజోనిధీశుండు 

పోతనార్యు నెదుట పొలిచి నిలిచె          20*


క.

కనె పోతన యా పురుషుని

తనువంతయు పులకలెత్త తన్మయమతితో,

కను లెదుటను కన్పించిన

ఘను డంతట పల్కెనిట్లు గాంభీర్యముగన్     21*


✍️గోపాలుని మధుసూదనరావు🙏

కోసిన కొమ్మకే విరులు గుత్తులు విచ్చెను

 *కోసిన కొమ్మకే విరులు గుత్తులు విచ్చెను తక్షణమ్ముగన్*

ఈ సమస్యకు నా పూరణ. 



వాసన లీను మల్లెలను వాకిట నాటెను సుందరొక్కతిన్


దూసెను నాకులన్నిటిని తూకొని, రెమ్మలు కత్తిరించెనే


పోసెను నీరు చాలగను పుట్టెను లేత చిగుర్లు ముందుగాన్


కోసిన కొమ్మకే విరులు గుత్తులు విచ్చెను తక్షణమ్ముగన్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

అక్షరాంకగద్య

 శు భో ద యం 🙏


అక్షరాంకగద్య!


*ఆహా ఏమి రాశావయ్యా!!!!! ఏమి స్వామి నీ మహిమ?*

      (అక్షరాంక గద్య )

మల్లికార్జున పండితుడు శ్రీశైల మల్లన్నను అచ్చులు, హల్లులతో ఎలా స్తుతించాడో 

చూడండి. పాల్కురికి సోమన్న అద్భుతంగా వ్రాశారు. 

'అ'ఖిల లోకాధార 

'ఆ'నంద పూర

'ఇ'న చంద్ర శిఖి నేత్ర  

'ఈ'డితామల గాత్ర

'ఉ'రు లింగ నిజరూప

'ఊ'ర్జితా జలచాప

'ఌ'లిత తాండవకాండ 

'ౡ'నికృతా జాండ

'ఏ'కైక వర్యేశ 

'ఐ'క్య సౌఖ్యా వేశ

'ఓం' కార దివ్యాంగ   

'ఔ'న్నత్య గుణ సంగ

'అం'బికా హృదయేశ

'అః'స్తోక కలనాశ

'క'నద హీనాభరణ 

'ఖ'ల జలంధర హరణ

'గ'ల నాయక విధేయ 

'ఘ'న భక్తి విజేయ

'జ'శ్చూల కాలధర

'చ'రిత త్రిశూల ధర

'ఛ'ర్మ యాధ్వస్త 

'ఞ'న గుణ ధళ ధీర

'ట' త్రయాది విదూర 

'ఠ' ప్రభావాకార

'డ'మరుకాది విహార 

'ఢ' వ్రాత పరిహార

'ణ' ప్రవాగార 

'త'త్త్వ జోనేత

'థ'వి దూర జవ పక్ష 

'ద'వన పాలన దీక్ష

'ధ'రణీ థవోల్లీడ 

'నంది కేశారూఢ

'ప'ర్వతీశ్వర లింగ 

'బ'హుళ భూత విలాస

'భ'క్త్వ హృద్వ నహన 

'మం'త్రస్తుతోధార 

'య'క్ష రుద్రాకార

'ర'తిరాజ బిన హంస

'ల'లిత గంగోత్తంస 

'ళ'మా విదవ్రంశ 

'వ'రద శైల విహార 

'శ'ర సంభ వాస్ఫార

'ష'ట్తింశ తత్త్వగత  

'స'కల సురముని వినుత

'హ'రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ

'క్ష'ర రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర 

శ్రీ పర్వత లింగ 

నమస్తే నమస్తే నమస్తే నమః.

-పాల్కురికి సోమనాధుడు .

దేవాలయాలు_

 *_సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు_:* 


1. _నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం._

2. _కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం._ 

3. _బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం._

4. _అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం._

5. _మొగిలీశ్వర్._

6. _కోదండరామ దేవాలయం, కడప జిల్లా._

7._సూర్యనారాయణ దేవాలయం జోగుళాంబ అలంపూరు గద్వాల జిల్లా_


*_నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:_* 

1. _మహానంది_

2. _జంబుకేశ్వర్_ 

3. _బుగ్గరామలింగేశ్వర్_

4. _కర్ణాటక కమండల గణపతి._

5. _హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం._

6. _బెంగళూర్ మల్లేశ్వర్_ 

7. _రాజరాజేశ్వర్_ _బెల్లంపల్లి శివాలయం_

8. _సిద్ధగంగా_

9._అలంపురం_


*_నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు._* 

1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 

2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,  

3. మంజునాథ్.


*శ్వాస తీసుకునే* కాళహస్తీశ్వర్


*సముద్రమే వెనక్కివెళ్లే* 

1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 

2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.


*స్త్రీవలె నెలసరి* అయ్యే 

1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  

2. కేరళ దుర్గామాత.


*బహ్మ పేరు తో ఏకైక శివాలయాలు*

అలంపూరులో నవఁబహ్మేశ్వర ఆలయాలు

9 రూపాలలో శివలింగాలు ఉంటాయి   


*రంగులు మారే ఆలయం.* 

1. ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.

2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే శివాలయం పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం సోమేశ్వర స్వామి వారి ఆలయం.

పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.


*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు* 

 1. కాణిపాకం,  

2. యాగంటి బసవన్న,  

3. కాశీ తిలభండేశ్వర్,  

4. బెంగుళూరు బసవేశ్వర్

5. బిక్కవోలు లక్ష్మీగణపతి


*స్వయంభువుగా* 

సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.

*ఆరునెలలకు ఒకసారి తెరిచే* 

1. బదరీనాథ్,  

2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)

3. గుహ్యకాళీమందిరం. 


*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు* 

హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.


*12 ఏళ్లకు ఒకసారి*

పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.


*స్వయంగా ప్రసాదం తినే* 

1. కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.

2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం


*ఒంటి స్తంభంతో*

యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.


*రూపాలు మారే*

ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.


*నీటితో దీపం వెలిగించే* ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.


*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు* 

1. హేమాచల నరసింహ స్వామి.

2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి


*మనిషి వలె గుటకలు*  

వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.


*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.* 


*ఛాయా విశేషం* 

1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.

2. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.

3. బృహదీశ్వరాలయం


*నీటిలో తేలే* విష్ణువు _(వేల టన్నుల బరువుంటుంది ), నేపాల్_


*పూరీ* 

_పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం._


_ఇవి తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే._ *_ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు నిర్మాణం చేశారు (సృష్టి చేశారు)విశ్వకర్మ_ _పరమాత్మ వంశీయులైన విశ్వబ్రాహ్మణ_ _శిల్పాచార్యులు వారికి పాదాభివందనములు_*

Panchang



 

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🌷గురువారం 29 మే 2025🌷*


``

            *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది...

``

     *వాల్మీకి రామాయణం*

            *52వ భాగం*

                 

*సంభ్రమః త్యజతాం ఏష సర్వైః వాలి కృతే మహాన్ |*

*మలయోఽయం గిరివరో భయం న ఇహ అస్తి వాలినః ||*

```

అప్పుడు వాక్య కోవిదుడైన హనుమంతుడు సుగ్రీవుడితో… 

“సుగ్రీవా! ఎందుకయ్యా ఇలా శిఖరముల మీద ఎగురుతున్నావు, ఇక్కడికి వాలి రాడు కదా. వాలికి ఉన్న శాపం వలన ఈ పర్వతం మీదకి వస్తే మరణిస్తాడు. నీకు కనపడినవాడు వాలి కాదు, మరి ఎందుకీ గెంతులు. నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని అనుకొని గెంతులు వేశావు. ఏమిటయ్యా ఈ చపలత్వం. నడక చేత, అవయవముల కదలిక చేత, మాట చేత, అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్ధత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే, నువ్వు రేపు రాచపదవి ఎలా నిర్వహిస్తావు సుగ్రీవా?” అని అడిగాడు. 


అప్పుడు సుగ్రీవుడు… “హనుమా! నేను ఎందుకు భయపడుతున్నానో తెలుసా. రాజులైనవారు చాలా రహస్యంగ ప్రవర్తిస్తారు. వాలికి నేను శత్రువుని కనుక, నన్ను రాజ్యం నుండి బయటకి పంపాడు కనుక, తాను ఈ కొండమీదకి రాలేడు కనుక, నన్ను సంహరించడం కోసమని తనతో సమానమైన, బలవంతులైన ఇద్దరు క్షత్రియులని ముని కుమారులలా ఇక్కడికి పంపిస్తున్నాడు. అందుకే వాళ్ళు నిర్భయంగా చెట్ల వంక చూస్తూ వస్తున్నారు. వాళ్ళ చేతుల్లో కోదండాలు ఉన్నాయి, అందుకని నేను భయపడుతున్నాను. అంతగా చెబుతున్నావు కాబట్టి, హనుమా! నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఈ రూపాన్ని విడిచిపెట్టి వేరొక రూపాన్ని పొందు. ఆ రూపంతో ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళు, నా వైపుకి తిరిగి మాట్లాడు. వాళ్ళు నాయందు ప్రేమతో వస్తున్నారా, శత్రుత్వంతో వస్తున్నారా అన్న విషయాన్ని బాగా కనిపెట్టు. ప్రేమతో వస్తున్నవారైతే వాళ్ళని తీసుకురా, లేకపోతే మనం వేరే మార్గాన్ని ఆలోచిద్దాము. అందుకని నువ్వు తొందరగా వెళ్ళు!” అని సుగ్రీవుడు అన్నాడు.```


*కపి రూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః।*

*భిక్షు రూపం తతో భేజే శఠబుద్ధితయా కపిః॥*

```

అప్పుడు హనుమంతుడు తన కపి రూపాన్ని విడిచిపెట్టి, భిక్షు రూపాన్ని(సన్యాసి రూపాన్ని) పొంది, శఠ బుద్ధితో బయలుదేరి రాముడి దగ్గరికి వెళ్ళాడు. సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి… 

“మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు రాజర్షుల లాగ, తాపసుల లాగ ఉన్నారు. విశేషమైన కాంతితో ఉన్నారు. మీరు నడిచి వస్తుంటే, మిమ్మల్ని చూసి మృగాలన్నీ పారిపోతున్నాయి. మిమ్మల్ని చూసి ఇక్కడున్న సర్వ భూతములు భయపడుతున్నాయి. మీ యొక్క కాంతి చేత ఇక్కడున్న నదులలోని జలములు శోభిస్తున్నాయి. మీరు నడుస్తుంటే, సింహాలు నడుస్తున్నాయా? అన్నట్టుగా ఉంది. సింహాల యొక్క బలాన్ని అధిగమించిన స్వరూపంతో ఉన్నారు. మీ చేతులలో కోదండాలు, బాణాలు ఉన్నాయి. మిమ్మల్ని చూస్తుంటే ఎటువంటి శత్రువునైనా సంహరించగలిగిన పరాక్రమము చేత విరాజిల్లుతున్న వారిలా కనపడుతున్నారు. ఠీవిగా నడిచే ఎద్దుల్లా నడుస్తున్నారు. నడుస్తున్న పర్వతాల్లా ఉన్నారు. పద్మములవంటి కన్నులతో ఉన్నారు, జటామండలాలు కట్టుకొని ఉన్నారు. ఈ రూపములు ఒకదానితో ఒకటి సరిపోవడం లేదు. మీరు సూర్య-చంద్రుల్లా ఉన్నారు, విశాలమైన వక్షస్థలంతో ఉన్నారు. మనుష్యరూపంలో ఉన్న దేవతల్లా ఉన్నారు. పెద్ద భుజాలతో ఉన్నారు. మీ బాహువుల చేత ఈ సమస్త పృధ్వీ మండలాన్ని రక్షించగలిగిన వారిలా కనపడుతున్నారు. అటువంటి మీరు ఇలా ఎందుకు నడిచి వస్తున్నారు. దీనికి కారణం ఏమిటి. మీ మొలలకి చాలా పెద్ద కత్తులు కట్టి ఉన్నాయి. ఆ కత్తుల్ని చూస్తే భయం వేస్తుంది.


నేను సుగ్రీవుడి యొక్క సచివుడిని, నన్ను హనుమ అంటారు. అన్నగారైన వాలి చేత తరమబడినటువంటి మా రాజైన సుగ్రీవుడు రాజ్యాన్ని విడిచిపెట్టి ఋష్యమూక పర్వత శిఖరముల మీద నలుగురు మంత్రులతో కలిసి ఉంటున్నాడు. ఆయన ధర్మాత్ముడు, మీతో స్నేహం చెయ్యాలని అనుకుంటున్నాడు. అందుకని మీరు మా ప్రభువుతో ఎందుకు స్నేహం చెయ్యకూడదు! నేను ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడడంలేదు. మీరు మాట్లాడితే వినాలని ఉంది. మీరు మాట్లాడండి.” అని చెప్పి హనుమ నిలబడిపోయాడు.


రాముడిని చూడగానే సన్యాసి రూపంలో ఉన్న హనుమంతుడు ఆ సన్యాసి రూపాన్ని విడిచిపెట్టేసి తన నిజ స్వరూపానికి వచ్చేశాడు. ఎందుకంటే, ఆయనకి రాముడు 

శ్రీ మహా విష్ణువుగా దర్శనమిచ్చారు.


అప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు… “చూశావా లక్ష్మణా, హనుమ ఎలా మాట్లాడాడో. ఆయన మాటలు విన్నావా. ఇలాగ మాట్లాడేవాడు మంత్రిగా దొరికితే కార్యాలు ఎందుకు నెరవేరవు! ఇలా మాట్లాడేవాడు ఎదురుగా వచ్చి నిలబడితే, కత్తి పట్టి ప్రాణం తీసేద్దాము అనుకున్న వ్యక్తి కూడా కత్తిని ఒరలో పెట్టేస్తాడు. ఇటువంటి వ్యక్తి మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు. ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనికి ఉపనిషత్తుల అర్ధం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమ్మలు నిష్కారణంగా కదలడంలేదు, లలాటము కదలడం లేదు. వాక్యము లోపలినుంచి పైకి వచ్చేటప్పుడు గొణుగుతునట్టు లేదు, గట్టిగా లేదు. ఈయన మాటలు ప్రారంభించిన దగ్గరి నుంచి చివరి వరకూ ఒకే స్వరంతో పూర్తి చేస్తున్నారు. కాళ్ళు, చేతులు, శరీరాన్ని కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్ఛరించాలో, ఎంతవరకు ఉచ్ఛరించాలో అలా పలుకుతున్నారు. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి, మన దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు కనుక, మనం అనుకున్నటువంటి కోరిక సిద్ధించినట్లే. మనం ఎవరిమో, ఈ అరణ్యానికి ఎందుకు వచ్చామో హనుమకి చెప్పు లక్ష్మణా” అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు. “అయ్యా హనుమా! ఈయన దశరథుడి కుమారుడైన రాముడు. ఆ దశరథుడు పరమ ధర్మాత్ముడై రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన ఉన్నప్పుడు ఎవరూ ఆయనని ద్వేషించలేదు, ఆయనా ఎవరినీ ద్వేషించలేదు. చతుర్ముఖ బ్రహ్మగారు ఎలా అయితే అందరి చేత గౌరవింపబడతారో, అలా దశరథుడు లోకులందరి చేత గౌరవింపబడినవాడు. అటువంటి తండ్రి మాటకి కట్టుబడి రాముడు అరణ్యానికి వచ్చాడు. అప్పుడు ఎవరో ఒక రాక్షసుడు రాముడి భార్య అయిన సీతమ్మని అపహరించాడు. సీతమ్మని వెతికే ప్రయత్నంలో ఉండగా, మాకు కబంధుడనే రాక్షసుడు కనపడ్డాడు. ఆయనని సంహరించి, శరీరాన్ని దహిస్తే, ఆయన మళ్ళి ధనువు అనే శరీరాన్ని పొంది మమ్మల్ని సుగ్రీవుడితో స్నేహం చెయ్యమని చెప్పాడు. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. నేను లక్ష్మణుడిని, రాముడి తమ్ముడు అని లోకం అంటుంది, కాని రాముడి గుణములచేత తృప్తి పొందినవాడనై, ఆ గుణములచేత విశేషమైన ఆనందమును పొందినవాడనై రాముడికి దాసుడిని అనుకుంటాను. లోకంలో కష్టంలో ఉన్నవారందరూ రాముడికి శరణాగతి చేశారు, అటువంటి రాముడు ఈనాడు సుగ్రీవుడికి శరణాగతి చేస్తున్నాడు. అందుకని మేము సుగ్రీవుడిని మిత్రుడిగా పొందాలని అనుకుంటున్నాము” అన్నాడు.

```

*ఈదృశా బుద్ధి సంపన్నా జితక్రోధా జితేఇంద్రియాః।*

*ద్రష్టవ్యా వానరేఇంద్రేణ దిష్ట్యా దర్శనం ఆగతాః॥*

```

అప్పుడు హనుమంతుడు “జితేంద్రియులై, ధర్మాత్ములైన రామలక్ష్మణులని చూడడం మా సుగ్రీవుడికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. రండయ్యా మిమ్మల్ని తీసుకెళతాను” అని చెప్పి, రామలక్ష్మణులనిద్దరిని తన వీపు మీద కూర్చోబెట్టుకుని ఆ ఋష్యమూక పర్వత శిఖరముల మీదకి ఎక్కాడు.```


        *రేపు... 53వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

గురువారం🪷* *🌹29 మే 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

      *🪷గురువారం🪷*

    *🌹29 మే 2025🌹*

   *దృగ్గణిత పంచాంగం*                    


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం*


*తిథి  : తదియ* రా 11.18 వరకు ఉపరి *చవితి*

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం   : ఆరుద్ర* రా 10.38 వరకు ఉపరి *పునర్వసు*


*యోగం : శూల* మ 03.47 వరకు ఉపరి *గండ*

*కరణం   : తైతుల* మ 12.31 *గరజి* రా 11.18 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:* 

                *-ఈరోజు లేవు-*

అమృత కాలం  : *మ 01.24 - 02.53*

అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.31*


*వర్జ్యం            : ఉ 08.14 - 09.43*

*దుర్ముహూర్తం  : ఉ 09.55 - 10.47 మ 03.07 - 03.59*

*రాహు కాలం    : మ 01.43 - 03.20*

గుళికకాళం       : *ఉ 08.50 - 10.27*

యమగండం     : *ఉ 05.34 - 07.12*

సూర్యరాశి : *వృషభం* 

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 05.41*

సూర్యాస్తమయం :*సా 06.46*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.34 - 08.10*

సంగవకాలం         :*08.10 - 10.47*

మధ్యాహ్న కాలం    :     *10.47 - 01.23*

అపరాహ్న కాలం    : *మ 01.23 - 03.59*


*ఆబ్ధికం తిధి         : జ్యేష్ఠ శుద్ధ తదియ*

సాయంకాలం       :*సా 03.59 - 06.36*

ప్రదోష కాలం         :  *సా 06.36 - 08.47*

రాత్రి కాలం           :*రా 08.47 - 11.43*

నిశీధి కాలం          :*రా 11.43 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

--------------------------------------------------

       *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌷ఓం శ్రీ గురు దత్తాయ నమః🌷*


*షడ్భుజమూర్తే భవ శరణమ్ ।*

*షడ్యతివర భవ శరణమ్ ।*

*దణ్డకమణ్డలు గదాపద్మకర ।* 

*శఙ్ఖచక్రధర భవ శరణమ్ ॥*


*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

      *న్యాయపతి వేంకట*

    *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

 🌹🌷🌹🌷🌹🌷🌷🌹

సమస్త జ్వరాలు హరించుట కొరకు

 సమస్త జ్వరాలు హరించుట కొరకు పురాతన వైద్య ప్రక్రియ - 


       మొదట ఒక రోగిని నులకమంచం పైన పడుకోబెట్టాలి . మంచానికి నాలుగు వైపులా గాలి దూరకుండా బట్టలు కట్టాలి. తంగేడు అన్ని భాగాలు ( సమూలం ) బాగా నలుగగొట్టి ఒక వెడల్పాటి బేసిన్ లో వేసి నిండా నీరుపోసి బాగా మరిగించి ఆ బేసిన్ ని తీసుకొచ్చి మంచం క్రింద పెట్టాలి. దానిపైన పెట్టిన మూత తీయగానే వేడివేడి నీటిఆవిరి అడుగు నుండి నులకమంచం సందుల నుండి పైన పడుకున్న రోగి శరీరానికి తగులుతూ ఉండాలి. ఆ బేసిన్ ని క్రమంగా పాదాల దగ్గర నుండి కొంచం కొంచం జరుపుతూ తలవెనక వైపు కి లాగుతూ ఉండాలి. రోగిని కొద్దిసేపు వెల్లకిలా , కొద్దిసేపు బోర్లా ఇలా పడుకోబెడుతూ ఇలా మార్చి మార్చి చేస్తూ ఆవిరి రోగి శరీరం మొత్తానికి తగులుతూ ఉంటే తంగేడు ఆవిరికి శరీరం నుండి చెమట కారిపోయి అన్నిరకాల విషజ్వరాలు మటుమాయం అవుతాయి. 


          శరీరం బాగా నొప్పులతో కూడి ఉన్నప్పుడు కూడా ఈ పద్ధతిని ఆచరించడం వలన నొప్పుల నుంచి పూర్తి ఉపశమనం లభిస్తుంది.


   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

గుడికి వెళ్ళడం

 గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు.


ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ


ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.


అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది?


దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై


వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు


తెలుసుకోవడం చాలా అవసరం.


మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు


ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల


పరిగణనలోకి రావు. నియమాలను పాటించి,


నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత


ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా


పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు


మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని


సంతరించుకున్నాయి.


భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.


దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.


ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.


ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.


గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.


మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.


గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.


తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.


ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.


లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.


భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది. కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.🙏


సేకరణ C .Narendra Babu

అత్యంత పవిత్రమైనవి

 "ఉచ్చిష్టం శివనిర్మాల్యం 

వమనం శవకర్పటమ్!*

కాకవిష్ఠా సముత్పన్నః 

పంచైతేఽతి పవిత్రకాః!!"*


ఎంగిలి, శివ నిర్మాల్యం, వాంతి(కక్కినది),శవము పై కప్పిన బట్ట , కాకి రెట్ట నుండి పుట్టినది అత్యంత పవిత్రములు. సమన్వయం?                                                


1) ఉచ్చిష్టం(ఎంగిలి) అంటే దూడ తాగిన తరువాత పితికిన ఆవుపాలు. దూడ ఎంగిలి చేసినా అన్ని వైదిక, దైవిక కార్యక్రమాలకీ లౌకిక కార్యక్రమాలకీ అత్యంత శ్రేష్ఠం, పవిత్రం, పంచామ్రుతాలలో మొదటిగా వెలుగొందేది.


2) శివనిర్మాల్యం(శివార్చనానంతరం తీసిన ఆ పూజాద్రవ్యాలు), శివుని జటాజూటముల నుండి జాలువారే గంగ. శివుని అభిషేకించిన, పూజించిన ద్రవ్యములు శివ స్పర్శచెందినదేదైనా పవిత్రమే. విధిపూర్వకముగా గ్రహిస్తే అవి అత్యంత మహిమాన్వితములు.


3) వమనం(వాంతి లేక కక్కినది)అంటే రకరకాల పూలనుండి తేనెటీగలు మకరందం సేకరించి తేనెపట్టులో దాచడం. త్రాగిన తేనెను తేనెపట్టులో కక్కుట ద్వారా దాచినా అది వైదిక, అర్చనాది కార్యక్రమాలకు అత్యంత పవిత్రమైనదే. పంచామృతాలలో ఒకటి.


4)శవకర్పటం(శవంపై కప్పబడిన వస్త్రం)అంటే చనిపోయిన పట్టు పురుగు చుట్టూ ఉండే పట్టుగూడు నుండి తీసిన దారముతో నేసిన పట్టుపుట్టం. పట్టు దారం తీయడానికి పట్టుకాయలో దాగున్న పట్టుపురుగుని చంపి, అది చనిపోయిన తరువాత పట్టునూలు సేకరించినప్పటికీ పట్టువస్త్రం శుభకరమే.


5) కాకవిష్ఠాసముత్పన్నం(కాకి రెట్ట నుండి పుట్టినది)దేవాలయ, తటాక, నదీతీర, మైదాన, అరణ్యాలలోని రావి చెట్లు కాకి రెట్ట(విసర్జనం)ద్వారా స్వతస్సిద్ధంగా మొలకెత్తి పెరుగుతాయి. అయినాకూడా రావి పరమ పవిత్రం సాక్షాత్ విష్ణు స్వరూపం, త్రిమూర్తి స్వరూపం. యఙ్ఞ యాగాది క్రతువులలో సమిధగా సమర్పించుటకు అత్యంత అర్హమైనది. 


దోషములు కూడుకున్నవిగా కనపడ్డా ఈ ఐదు వస్తువులూ అత్యంత పవిత్రమైనవి.