4, డిసెంబర్ 2025, గురువారం

పంచాంగం

 


మార్గశిర పౌర్ణమి దత్త జయంతి

 *మార్గశిర పౌర్ణమి దత్త జయంతి 

పరమాత్మ ఒక్కో సమయంలో ఒక్కో అవతారంలో వచ్చి ప్రజల్ని ఉద్ధరిస్తాడు. ధర్మావతారాల్లో…రాముడిగా, కృష్ణుడిగా రాక్షస సంహారం ద్వారా ధర్మసంస్థాపన జరిపిన నారాయణుడే…దత్తాత్రేయుడి అవతారంలో సమర్థ గురువుగా జ్ఞానప్రబోధ చేశాడు .

దత్తాత్రేయుడు శ్రీమన్నారాయణుడి ఆరో అవతారమని భాగవతమూ, విష్ణుపురాణమూ ఘోషిస్తున్నాయి. అత్రి మహర్షి, అనసూయ దంపతుల తనయుడిగా జన్మించాడు బాలదత్తుడు. ఆ దంపతులు ఓంకారాన్ని ధ్యానిస్తూ మహాతపస్సు చేశారు. ఆ సాధనకు మెచ్చి ఓ దివ్య తేజస్సు ప్రత్యక్షమైంది. ఆ కాంతిపుంజంలో త్రిమూర్తులు దర్శనమిచ్చారు. ఆ ముగ్గురు మూర్తుల అంశగా దత్తుడు వారికి జన్మించాడు. అత్రి…అంటే త్రిగుణాతీత స్థితికి చేరుకున్నవాడని అర్థం. అతడి అర్ధాంగి అనసూయ…అసూయలేనిది. నిజానికి ఇవి పేర్లు కాదు…ఆ ఆలూమగల సుగుణాలు. ఆ సద్గుణ సంపన్నుల బిడ్డగా జన్మించాడు దత్తుడు. దత్తం..అంటే సమర్పించుకోవడం. దత్తుడు జ్ఞానబోధ కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు. అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడన్న పేరూ వచ్చింది.

దత్తుడిది జ్ఞానావతారం! పిచ్చివాడిలానో, వ్యసనపరుడిలానో కనిపించి…పైపై మెరుగులకు భ్రమపడిపోయే అజ్ఞానులకు బుద్ధిచెప్పిన ఉదంతాలు అనేకం. దేవతలకు కూడా చేతిలో కల్లుముంతతో, ఒడిలో ప్రియురాలితో దర్శనమిచ్చాడోసారి. అది సుర కాదు, బ్రహ్మజ్ఞానం. ఆమె శ్రీలక్ష్మి. దత్తుడు ఓపట్టాన అర్థం కాడు. దత్తతత్వాన్ని తెలుసుకోవాలంటే అహాన్ని వదిలిపెట్టాలి. శరణాగతి సూత్రాన్ని పాటించాలి.


అసుర సంహారం…


పూర్వం జంభాసురుడనే రాక్షసుడు ప్రజల్ని హింసించేవాడు. దీంతో దేవతలంతా…విష్ణు స్వరూపుడైన దత్తాత్రేయుడిని ప్రార్థించారు. ‘ఆ రాక్షసుడిని నా దగ్గరికి తీసుకురండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను’ అని మాటిచ్చాడు. దీంతో దేవతలు జంభాసురుడి మీద కయ్యానికి కాలుదువ్వుతున్నట్టు నటించారు. ఆ అసురుడికి కోపం తన్నుకొచ్చింది. ‘ఇంతకుముందే చావుదెబ్బ తీశాను. అంతలోనే ఇంత ధైర్యం ఏమిటి?’ అంటూ కోపంగా మళ్లీ రంగంలో దూకాడు. దేవతలు ఉద్దేశపూర్వకంగా వెన్నుచూపారు. జంభాసురుడు వాళ్లను తరుముతూ వెళ్లాడు. దత్తుడి సమక్షంలోకి వెళ్లగానే ఠక్కున మాయమైపోయింది దేవగణమంతా. ఎదురుగా…ఒడిలో అందాల రాశితో, మహాభోగిలా దర్శనమిచ్చాడు దత్తాత్రేయుడు. జంభాసురుడి కళ్లు ఆ సౌందర్యరాశి మీదికి మళ్లాయి. ఆమె శ్రీమహాలక్ష్మి అన్న ఇంగితం కూడా లేకుండా… బలవంతంగా తీసుకెళ్లి నెత్తిమీద పెట్టుకున్నాడు. సంపద నెత్తికెక్కిందంటే, పతనం మొదలైనట్టే. జంభాసురుడి బలం క్షీణించసాగింది. దేవతల పని సులువైపోయింది. అసుర సంహారం జరిగిపోయింది.

**ప్రహ్లాద వరదుడు…

అనేక సంవత్సరాల రాజ్యపాలన తర్వాత…జ్ఞానాన్వేషణలో ప్రహ్లాదుడు అరణ్యమార్గం పట్టాడు. అక్కడ, అజగరవృత్తిలో ఓ వ్యక్తి కనిపించాడు. అజగరం అంటే…కొండచిలువ! ఆ విషప్రాణికో ప్రత్యేకత ఉంది. కొండచిలువ ఆహారం కోసం వేటకు వెళ్లదు. తాను ఉన్నచోటికి ఆహారం వస్తే మాత్రం…గుటుక్కున మింగి కడుపు నింపుకుంటుంది. లేకపోతే ఉపవాసమే. సాధకులు కూడా…ఆహారపానీయాల విషయంలో ఇలాంటి నిర్మోహత్వాన్నే అనుసరిస్తారు. పిచ్చివాడిలా కనిపిస్తున్న ఆ మనిషే దత్తుడని ప్రహ్లాదుడు గ్రహించాడు. ‘జై గురుదత్తా…’ అంటూ పాదాల మీద పడ్డాడు. ఆ మహాగురువు కరుణించి జ్ఞానమార్గాన్ని బోధించాడు. వివిధ సందర్భాల్లో… కార్తవీర్యార్జునుడికీ, పరశురాముడికీ, యదువంశ మూలపురుషుడు యదువుకూ…ఇలా ఎంతోమందికి జ్ఞానాన్ని బోధించాడు దత్తగురుడు. యోగిరాజ వల్లభుడు, జ్ఞానసాగరుడు, సంస్కారహీన శివురూపుడు…ఇలా భిన్నరూపాలలో కనిపించి భక్తులకు దివ్యప్రబోధ చేశాడు. మహారాష్ట్రలోని మహుర్‌ సుప్రసిద్ధ దత్తక్షేత్రం. దత్తుడు కాశీలో స్నానంచేసి, కొల్హాపూర్‌లో భిక్ష స్వీకరించి, మహుర్‌లో నిద్రించేవాడని అంటారు. శ్రీపాద శ్రీవల్లభుడు (పిఠాపురం), నరసింహ సరస్వతి (మహారాష్ట్ర), అక్కల్‌కోట మహరాజ్‌ (అక్కల్‌),  దత్తుని అవతారాలని చెబుతారు. దత్తుడు స్మృతిగామి…తలచిన వెంటనే భక్తుల హృదయాల్లో ప్రత్యక్షమైపోతాడని సాధకుల విశ్వాసం.


మార్గశిర పౌర్ణమినాడు దత్తుడు ఉదయించాడు. అదే దత్తజయంతి. దత్తుడి రూపం అపురూపం. ఆరు చేతులూ, మూడు తలలూ, చేతిలో డమరుకమూ, త్రిశూలమూ…తదితర ఆయుధాలుంటాయి.చుట్టూ కుక్కలు ఉంటాయి. ఆ శునకాలు వేదానికి ప్రతీకలు. ఆయన వెనకాల కనిపించే గోవు…ఉపనిషత్తుల సారం. దత్తజయంతినాడు ఆస్తికులు…జపతపాలతో, పూజలతో గడుపుతారు. పగలంతా ఉపవాసం చేసి, సాయంత్రం భజనలూ సత్సంగాలూ నిర్వహించుకుంటారు. దత్తచరిత్ర, అవధూత గీత తదితర గ్రంథాల్ని పారాయణ చేస్తారు. ఒకానొక సమయంలో దత్త సంప్రదాయం తెలుగు గడ్డ మీద వెలుగులీనింది. దత్తుడి అవతారమని భావించే శ్రీపాద శ్రీవల్లభుడు ఆంధ్రదేశంలోని పిఠాపురంలో జన్మించాడు. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కురుపురంలో ఆశ్రమజీవితం గడిపాడు. అక్కడి కృష్ణాతీరంలో ఓ ఆలయాన్ని నిర్మించారు భక్తులు. నేపాల్‌ తదితర ప్రాంతాల్లోనూ దత్తక్షేత్రాలున్నాయి.

మహనీయుని మాట*

 🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏


      🌺*శుభోదయం*🌺

     -------------------

🏵️ *మహనీయుని మాట*🏵️

        -------------------------

"చిన్న అడుగుతో మొదలైన ప్రయాణమే గొప్ప విజయాల దారిని చూపుతుంది.

ఆప్తులు లేకపోయినా నమ్మకం మనతో ఉంటుంది.

ప్రయత్నం ఆగకపోతే గమ్యం దూరం కాదు.

మీ దగ్గర ఉన్న మీ నమ్మకమే ఆయుధం."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌹

      ---------------------------

"ఎదుటివారిని అర్థం చేసుకోవడం దయ మొదటి మెట్టు. ఆ భావం లేకపోతే సహాయం కూడా నిరర్థకం." 


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻



🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🪴పంచాంగం🪴

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 04 - 12 - 2025,

వారం ... బృహస్పతివాసరే ( గురువారం )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

దక్షిణాయనం,

హేమంత ఋతువు,

మార్గశిర మాసం,

శుక్ల పక్షం,


తిథి : *చతుర్దశి* ఉ7.42 వరకు

                 తదుపరి *పూర్ణిమ* తె5.21 వరకు,

నక్షత్రం : *కృత్తిక* మ3.12 వరకు

యోగం : *శివం* మ1.22 వరకు

కరణం : *వణిజ* ఉ7.42 వరకు

                 తదుపరి *భద్ర* సా6.31 వరకు,

                  ఆ తదుపరి *బవ* తె5.21 వరకు,


వర్జ్యం : *తె6.06 నుండి*

దుర్ముహూర్తము : *ఉ9.59 - 10.43*

                               మరల *మ2.23 - 3.07*

అమృతకాలం : *మ12.58 - 2.27* 

రాహుకాలం : *మ1.30 - 3.00*

యమగండం : *ఉ6.00 - 7.30*

సూర్యరాశి : *వృశ్చికం*

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం : 6.19,

సూర్యాస్తమయం : 5.20,


               *_నేటి విశేషం_*


          *శ్రీ దత్త జయంతి*

మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజున దత్తాత్రేయస్వామి అవతరించారు♪. 

దత్తాత్రేయుని రూపం బహుచిత్రం♪. తత్త్వం అతి విచిత్రం♪. 

అనుగ్రహం అత్యంత ఆశ్చర్యకరం♪. లీలలు అత్యద్భుతం♪. 

_*మార్గశిర పూర్ణిమను ‘దత్త జయంతి’ గా జరుపుకుంటాం.*_


_*ఓంకార రూప దత్తాయ*_

_*భూమానంద ప్రదాయినే*_

_*భువన త్రాణ దక్షాయ*_

_*స్వతస్సిద్ధాయ తే నమః*_


 ‘ఓం' కారమే పరబ్రహ్మ స్వరూపం♪. అదే శ్రీ దత్తాత్రేయ స్వామి రూపం♪. అంతులేని ఆనందాన్ని ప్రసాదించేది, లోకాలను అన్నిటినీ కాపాడేది, తనంతట తానుగా ఉద్భవించిందైన శ్రీదత్తధ్యానం అందరినీ రక్షించుగాక!’ ‘ఓం, భూః భువః సువః’ అనే వేదమంత్ర వ్యాహృతులతో ఈ దత్త ధ్యానశ్లోకం ప్రారంభమవుతుంది♪. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో త్రిమూర్తి స్వరూపంగా అవతరించిన పరబ్రహ్మ స్వరూపమే ‘దత్తావతారం’♪.


మహాతపఃస్సంపన్నుడైన అత్రి మహర్షికి - పతివ్రతా శిరోమణి యైన అనసూయాదేవికి కలిగిన పుణ్యఫల సంతానమే ఈ స్వామి♪. 


 ‘సత్వరజోతమో’ గుణాలు లేనివాడు అత్రి మహర్షి♪. అనసూయా (న+అసూయ) లేని, మాయను వదిలిన తత్వం గలది అనసూయా మాత♪. కనుకే, త్రిగుణాతీతుడై మాయా రహితుడైన అవధూత స్వరూపంగా ‘దత్తాత్రేయుడు’ ఉద్భవించాడు♪. అత్రి తనయుడు కనుక ‘ఆత్రేయుడు’, తనకు తానుగా దత్తమైనాడు (తల్లి దండ్రులకు ఇవ్వబడినాడు) కనుక ‘దత్తుడు’♪. వెరసి ‘దత్తాత్రేయుడు’ అయ్యాడు♪.


_*ఆదౌబ్రహ్మ హరిర్మధ్యే హ్యంత్యేదేవస్సదాశివః*_

_*మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే ॥*_


మూడు ముఖాల్లో మొదటిది బ్రహ్మ, మధ్య విష్ణు, మూడవది శివ స్వరూపం♪. అన్నీ ఏకమైన సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపo♪. ఆరు చేతుల్లో శంఖo, చక్రo, త్రిశూలo, కమండలo, అక్ష (జప)మాల, డమరుకo ధరిస్తాడు♪. పక్కన వుండే నాలుగు శునకాలు చతుర్వేదాలకు ప్రతీకలు♪. స్వామిని ఆనుకొనే ఆవు ధర్మస్వరూపమైన కామధేనువు♪. ఔదుంబర (మేడి) వృక్షం కింద తపస్సు చేస్తుంటాడు♪. అందుకే, మనం మేడిచెట్టును పవిత్రంగా పూజిస్తారు♪.


_*🌼తాత్వికంగా స్వామి దిగంబరుడు.*_


 (దిక్కులే వస్ర్తాలుగా కలవాడు)♪. కేవల బ్రహ్మనిష్ఠతో దండక మండలాలను కూడా వదలిన శుద్ధ సాత్విక చైతన్యమూర్తియైన అవధూత♪. ఎవరినీ ఏదీ యాచించని నిత్య తృప్తితో, సంసారం జంజాటా లేవీ లేనివాడు♪. కనుకే, స్వామి అపార దయాగుణంతో _*‘ఆత్మవత్‌ సర్వభూతాని’*_ తనతో సమానంగా అందరినీ చూసే సమదృష్టి కలవాడు♪. అవధూత సంప్రదాయమైన _*‘బాలోన్మత్త పిశాచవత్‌'*_ అంటే, దేహసంబంధమైన వ్యామోహం ఏ మాత్రం లేకుండా ఒకసారి బాలునిగా, ఇంకోసారి పిచ్చివానిగా, మరోసారి దెయ్యం పట్టినవానిగా చిత్రవిచిత్ర రూపాల్లో దర్శనమిస్తూ సాధకుల మనో నిగ్రహాన్ని పరీక్షిస్తాడు♪. అందుకే, ‘దత్త దర్శనం’ అంత సులభం కాదు♪. 


కానీ, ఒకసారి ఆయన అనుగ్రహం లభిస్తే ఇక తిరుగుండదు♪. భక్తితో స్మరిస్తే చాలు, సంతృప్తి చెంది తన దివ్యానుగ్రహాన్ని కురిపిస్తాడు♪. _*‘స్మర్తృగామీ సనోవతు’.*_ - _*‘స్మరించగానే వచ్చి రక్షించేవాడు’*_ గా వినుతికెక్కాడు♪.


విష్ణుమూర్తి మిగతా అవతారాలు లక్ష్యం పూర్తవగానే సమాప్తి అయ్యాయి♪. కానీ, నారదుని తర్వాత ‘ఎప్పటికీ అవతార పరిసమాప్తి లేనిది’ ఈ దత్తాత్రేయ అవతారమే♪.


ఒకసారి బ్రహ్మదేవుడు మానవసృష్టికి ముందుగా తమస్సు, మోహం వంటి అవిద్యను సృష్టించాడట♪. అది తనను సృష్టించిన బ్రహ్మనే ఆవరించి కలవరపరచి వేదవిద్యను మరచిపోయేలా చేసింది♪. శ్రీ దత్తస్వామి అనుగ్రహం వల్లే బ్రహ్మదేవుడు తిరిగి వేదవిధాత అయ్యాడు♪. బ్రహ్మకే బ్రహ్మోపదేశం చేసినందున దత్తుడు ఆదిగురువు అయ్యాడు♪.


 _*🌼దత్త లీలలు!*_ 


జంభాసురుడనే రాక్షసవధకు ఇంద్రుడు దత్తాత్రేయస్వామి సహాయం తీసుకొని విజయం సాధించాడు♪. ఎన్నో పరీక్షలకు గురి చేసి కార్తవీర్యార్జునునికి వేయి చేతులను ప్రసాదించింది దత్తాత్రేయుడే♪. అదే కార్తవీర్యార్జునుని సంహరించిన పరశురాముని చేరదీసి అనుగ్రహించి, ‘త్రిపురా రహస్యం’ అనే జ్ఞానబోధ చేసిందీ దత్తాత్రేయుడే♪. 


పూర్వం ఆయువు అనే చంద్రవంశ రాజుకు సంతానం కలుగకపోతే సహ్యాద్రి పర్వత సానువులలో తపోదీక్షలో ఉన్న దత్తాత్రేయుని ఆశ్రయించాడు♪. అప్పుడు దత్తుడు భోగలంపటుడై, మద్యం సేవిస్తూ మగువలతో క్రీడిస్తున్నట్లుగా ఆయువుకు దర్శనమిచ్చాడు♪. ఇదంతా ‘మాయాలీల’ అని గ్రహించి స్వామి పాదాలను వదలకుండా ఆయువు వేడుకుంటాడు♪. ఎంతోసేపటికి అనుగ్రహించిన దత్తుడు అపార కరుణను కురిపించి ఇంద్రునితో సమానమైన ప్రతిభావంతుడైన కుమారుణ్ణి ప్రసాదిస్తాడు. అతడే కొంతకాలం ఇంద్రపదవిని అలంకరించిన 'నహుషుడు'♪.


 _*🌼జ్ఞానావతారం*_ 


విష్ణుమూర్తి అవతారాలలో దత్తాత్రేయునిది ‘జ్ఞానావతారం’♪. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి విజ్ఞానమయ రోచిస్సులను వెలిగించి మోక్షమార్గం చూపించే గురువాయన♪. తల్లిదండ్రులతోనూ ‘గురుదత్తా’ అని పిలిపించుకొని ఆదిగురువయ్యాడు♪. ‘దత్తాత్రేయుని’ గా శ్రీమన్నారాయణుడు ఆత్మవిద్యను బోధించడానికే ఈ భూమిపై అవతరించాడన్నది పురాణ సత్యం♪.


మహావిష్ణువు ఏకవింశతి (21) అవతారాలలో మొదటి అవతారం ‘సనక, సనంద, సనాతన, సనత్కుమారులు’ అనే మహర్షులుగా కఠోరమైన బ్రహ్మచర్యంతో సంచరించడం♪. రెండవదైన ‘భూయజ్ఞ వరాహ’ అవతారంతో భూమండలాన్ని ఉద్ధరించడం♪. మూడవ అవతారం నారదుడనే దేవర్షిగా జన్మించి, వైష్ణవ ధర్మాన్ని ప్రబోధించడం♪. నాలుగవ అవతారం నరనారాయణులుగా, ఐదవ అవతారం సాంఖ్యయోగ ద్రష్ట కపిల మహర్షిగా, ఆరో అవతారం అత్రి-అనసూయలకు దత్తాత్రేయునిగా జన్మించినట్లు ‘మహాభాగవతం’ చెబుతున్నది♪. దత్తాత్రేయుడు అలర్కుడు, ప్రహ్లాదుడు, విష్ణుదత్తుడు మొదలైనవారికి ఆత్మవిద్యను బోధించాడు.


             *_🪴శుభమస్తు🪴_*

🙏 సమస్త లోకాః సుఖినోభవంతు 🙏

పాషాణ చతుర్దశి*

 

మార్గశిర శుద్ధ చతుర్దశి..```



            *పాషాణ చతుర్దశి*

                 ➖➖➖✍️


```

రామాయణం లో రాముడు సీతా లక్ష్మణ సమేతుడై బయలుదేరి మూడు దినములు జలాహారము, నాలుగవ దినమున ఫలాహారము గైకొని ఐదవనాడు చిత్రకూటము జేరి అందు బండ్రెండేండ్లు నివసించి పదు మూడవ సంవత్సరమున బంచవటియందు కాముకురాలగు శూర్పణఖను విరూపను గావించెను. 


పిదప రావణుడు వచ్చి సీతను గొనిపోవుచుండ నామె యింటలేని రామునికై ‘రామ రామ’ యని యేడ్చెను. 


అపుడు జటాయువు రావణుని కడ్డువెళ్ళి యాతడు రెక్కలు నరుక గ్రిందబడిపోయెను. 


సంపాతి వానరులకు సీతజాడ చెప్పెను. 


మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు హనుమంతుడు మహేంద్ర పర్వతమునుండి యెగిరి రాత్రికిరాత్రి లంకనుజేరి తెల్లవారుకట్ట సీతను గని సంచార ముడిగి విశ్రమించి, ద్వాదశినాడు శింశుపావృక్షము నెక్కినాటి రాత్రి చేతులు జోడించి సీతకు నమస్కరించి నమ్మకము కలుగునట్లు పలికి త్రయోదశినాడు అక్షకుమారుడు మున్నగు రాక్షసుల జంపి చతుర్దశి నాడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బద్ధుడైనట్లు నటించెను. 


రాక్షసు లానందించి యాతనితోకకు నూనెగుడ్డలు చుట్టి యంటింప దానితో నాతడు లంకాదహనము కావించెను.


ఈనాటి నుంచి చాంద్రాయణ వ్రతం చేస్తారు. ఈనాడు రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి గౌరీదేవిని ఆరాధించాలి.


చాంద్రాయణ వ్రతం. చంద్రకళల వృద్ధి క్షయాలను బట్టి ఆహారాన్ని పెంచడం, తగ్గించడం చేసే ఒక వ్రతం. 


పౌర్ణమినాడు ఈ వ్రతాన్ని ప్రారంభిస్తే రోజుకు ఒక ముద్ద వంతున తగ్గించడం, తరువాత అమావాస్య మొదలు ఒక్కొక ముద్దనూ పెంచుతూ సామాన్య భోజన స్థాయికి చేరడం పద్ధతి.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

సో .... హం ...*

 


            *సో .... హం ...*

                ➖➖➖✍️

```

ఏమిటి ఈ అక్షర ప్రాముఖ్యత....? ఏమిటి ఈ పవిత్రత .. అసలు సోహం అంటే…..


దీన్ని ‘హంస మంత్రం’ అంటారు. బ్రహ్మవైవర్త పురాణంలో హంస విశిష్టత గురించి బ్రహ్మ వివరిస్తాడు. వేదకాలంలో ‘హంస సోమరసం నుంచి జలాన్ని వేరుపరచగలదు’ అని చెపుతూ ఉండేవారు. పాలను, నీటిని వేరుచేసే శక్తిగల పక్షిగా హంసను గురించి చెపుతారు. మానస సరోవరంలో విహరించే పక్షిగా కుడా చెపుతూ ఉంటారు. దేవతలకు ఇష్టమైన పక్షిగా కుడా చెపుతారు. కారణం.. ‘పవిత్రత’ ‘శుద్ధత’ ‘నిష్కళంకన’

యతీశ్వరులను పరమ హంసలుగా చెపుతారు.


‘ఆనందాత్మను నేను’  

‘నేను పరబ్రహ్మమును’ 

‘అది నేనై ఉన్నాను’ ‘ఆ మహా చైతన్యం నేను’ అనే జ్ఞానం గలవారు పరమహంసలు.


‘సః అహం’..... కలిపితే ‘సోహం’ అవుతుంది. ‘పరమాత్మను నేను’ అని దీని అర్థం.


ఇది వేదాంతసారమైన మాటగా విఖ్యాతికెక్కింది.


ఉచ్ఛ్వాసం (గాలి పీల్చడం) చేసేటప్పుడు ‘సో’ అనే శబ్దం వస్తుంది. నిశ్వాసం (గాలి వదిలేటప్పుడు) ‘హం’ అనే శబ్దం వస్తుంది.


ఇది ప్రతి జీవీ తన ప్రయత్నం లేకుండానే చేసే జపం. దీన్ని ‘హంస మంత్రం’ అంటారు. ‘సోహం’ అనే మాటే ‘హంస’ అయినదని మన ఋషులు చెపుతూ ఉంటారు.


ఇక్కడ నీకు తెలిసినా తెలియక పోయినా ఊపిరి తీసుకుంటున్నావు అంటే నీవు ఎవరు?   

అవును అన్నా ఎవరు కాదన్నా 

సత్యం నీకు తెలిసినా తెలియక పోయినా నువ్వు బ్రహ్మ పదార్దానివే ..!


కాకపోతే అద్దానికి మసి అంటుకుంటే నీ అసలు రూపం నీకు స్పష్టంగా కనిపించక తికమక పడి ఏవో భిన్న ఆకారాలను ఊహించుకుంటు ఉంటావు ..

కొన్నింటిని చూసి ఏడుస్తావు మరికొన్ని చూస్తూ నవ్వేస్తావు ..


ఎప్పుడైతే ఆ అజ్ఞానం అనే మసిని జ్ఞానం అనే తుండుతో తుడిచి వేస్తావో, నువ్వు ఎవరు అనేది నీకు స్పష్టంగా తెలుస్తుంది.


‘సోహం’ అనే మాటే ‘హంస’ అయినదని విజ్ఞులు వివరిస్తారు.


‘పరమహంస’ అంటే ఎంతో పవిత్రులు. వారి ఆలోచనలో ఆచరణలో మాటలో మనసులో తనువూ తలపులు అన్ని పవిత్రం.


ఎక్కడ ఉన్నా... 

ఏమి చేస్తున్నా...

ఒకే ఒక్కటి ....

సోహం........

సోహం .........

సోహం .........✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఆక్రోట్లు (వాల్ నట్స్)*

 



               *ఆక్రోట్లు (వాల్ నట్స్)*

                     ➖➖➖✍️



*ఆల్ఫా లినోలిక్ ఆమ్లం అధికంగా ఉన్న గింజలు అక్రోట్లు మాత్రమే!* 


*ఇవి స్ర్తీ, పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచుతుంది.* 


*అక్రోట్లలోని మెలటోనిన్ నిద్రపట్టేలా చేస్తుంది.* 


*ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు రోగనిరోధకశక్తినీ, తెలివితేటల్నీ, జ్ఞాపకశక్తినీ పెంపొందిస్తాయి. డిప్రెషన్నీ నిరోధిస్తాయి. అందుకే ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయనీ, గర్భిణులు రోజూ కాసిని అక్రోట్లను తినడం వల్ల పిల్లల మెదడు పనితీరు కూడా బాగుంటుందనీ హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన పోషక నిపుణుల పరిశీలనలో తేలింది.* 


*వీటిల్లోని బయోటిన్ (B7) జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.* 


*ఇంకా ఫైటోస్టెరాల్స్ ఒత్తిడినీ, ప్రొస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్నీ అడ్డుకుంటాయి.*


**వందగ్రాముల అక్రోట్లలో..*

*శక్తి: 654 కేలరీలు,*

*ప్రొటీన్లు: 15.2 గ్రాములు,*

*పిండిపదార్థాలు: 13.7 గ్రాములు,*

*కొవ్వులు: 65.21 గ్రాములు,*

*శాచ్యురేటెడ్: 6.1 గ్రాములు,*

*మోనో అన్‌శాచ్యురేటెడ్: 8.9 గ్రాములు,*

*పాలీఅన్ శాచ్యురేటెడ్: 47.1 గ్రాములు,*

*కాల్షియం: 98 మిల్లీగ్రాములు,*

*కాపర్: 1.59 మిల్లీగ్రాములు,*

*ఐరన్: 2.91 మిల్లీగ్రాములు,*

*మెగ్నీషియం: 158 మిల్లీగ్రాములు,*

*పొటాషియం: 441 మిల్లీగ్రాములు,*

*విటమిన్ ఇ: 0.7 మిల్లీగ్రాములు,*

-సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

కోరల పౌర్ణమి*

  *              *కోరల పౌర్ణమి*

                ➖➖➖✍️


```

మన హిందూ సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్టే. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి* అంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కోరల పౌర్ణమిని జరుపుకుంటారు. *హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు, అందువల్ల అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును ఆరాధిస్తారు.


ఈ మార్గశిర పౌర్ణమిని ‘కోరల పున్నమి’ లేదా ‘నరక పౌర్ణమి’ అని పిలుస్తారు.


ఈ రోజు ‘కోరల’ అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది.


చిత్రగుప్తుడు చెల్లెలిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు. 


చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభం అయింది.


కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినప రొట్టె తయారుచేసి చిన్న ముక్కను కొరికి కుక్కలకు వేయాలి. కోరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్ర వ్రతం చేయాలనీ పురాణాలు చెపుతున్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

తిరుపతి రుయాలో రూ.50వేల ఇంజెక్షన్ ఫ్రీ 💉

  తిరుపతి రుయాలో రూ.50వేల ఇంజెక్షన్ ఫ్రీ 💉


బ్రెయిన్ స్ట్రోక్ అత్యంత ప్రమాదకరం. చికిత్సకు రూ.లక్షలు ఖర్చు చేయాలి. తిరుపతి రుయాలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మంగళ, శుక్రవారం న్యూరాలజీ OP ఇస్తారు. అత్యవసర వైద్యం 24గంటలు అందిస్తారు. చేయి, కాలు, మాట పడిపోవడం, మూతి వంకర పోవడం, కళ్లు కనిపించకపోవడం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. సకాలంలో గుర్తించి (6 గంటల లోపు) ఇక్కడికి తీసుకొస్తే రూ.50వేల విలువైన ఇంజెక్షన్ వేస్తారు. 90శాతం ప్రాణాపాయం తప్పుతుంది.


గమనిక 💉 ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరు షేర్ చేయండి లేదా మీ వాల్ పై పోస్ట్ చేయండి ధన్యవాదాలు 💉

04డిసెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

 *🌷బృహస్పతివాసరే🌷*

*🌹04డిసెంబర్2025🌹*

   *దృగ్గణిత పంచాంగం*                  


        *ఈనాటి పర్వం*

  *శ్రీ దత్తాత్రేయ జయంతి* 

   

         *స్వస్తి శ్రీ విశ్వావసు* 

         *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్ల పక్షం*


*తిథి  : చతుర్దశి* ‌ఉ 08.37 *పౌర్ణమి* రా.తె 04.43 వరకు

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : కృత్తిక* మ 02.54 వరకు ఉపరి *రోహిణి*

*యోగం : శివ* మ 12.34 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం  : వణజి* ఉ 08.37 *భద్ర* సా 06.40 ఉపరి 

*బవ* రా.తె 04.43 వరకు ఆపైన *బాలువ*


*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 11.00 - 12.00 సా 05.00 - 06.00* 

అమృత కాలం  : *మ 12.48 - 01.42*

అభిజిత్ కాలం  : *ప 11.35 - 12.20*

*వర్జ్యం    : (05) తె 04.49 - 06.12*

*దుర్ముహూర్తం  : ఉ 10.06 - 10.50 మ 02.34 - 03.19*

*రాహు కాలం   : మ 01.22 - 02.46*

గుళికకాళం      : *ఉ 09.10 - 10.34*

యమగండం    : *ఉ 06.22 - 07.46*

సూర్యరాశి : *వృశ్చికం*                            

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం :*ఉ 06.32*  

సూర్యాస్తమయం :*సా 05.41*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.21 - 08.36*

సంగవ కాలం         :     *08.36 - 10.50*

మధ్యాహ్న కాలం    :    *10.50 - 01.05*

అపరాహ్న కాలం    : *మ 01.05 - 03.19*

*ఆబ్ధికం తిధి         : మార్గశిర శుద్ధ పౌర్ణమి*

సాయంకాలం        :  *సా 03.19 - 05.33*

ప్రదోష కాలం         :  *సా 05.33 - 08.07*

రాత్రి కాలం           :*రా 08.07 - 11.32*

నిశీధి కాలం          :*రా 11.32 - 12.23*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.39 - 05.30*

******************************

        *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*#ఓం శ్రీ గురు దత్తాయ నమః*


*శత్రునాశకరం స్తోత్రం* 

*జ్ఞానవిజ్ఞానదాయకమ్ |*

*సర్వపాపం శమం యాతి* 

*దత్తాత్రేయ నమోఽస్తుతే ||*


  *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

సంపూర్ణ మహాభారతము*

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🪷బుధవారం 3 డిసెంబర్ 2025🪷*

``

             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                      6️⃣3️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


      *సంపూర్ణ మహాభారతము*          

                    *63 వ రోజు*

                   

                 *వికర్ణుడు*```


దుర్యోధనుని తమ్ముడు వికర్ణుడు “ఈ సభలో ఉన్న కురువృద్ధులు, గురువులు, పెద్దలు అందరూ మౌనంగా ఉన్నారు. మిగిలిన వారైనా ధర్మం చెప్పండి. ఆలోచించండి ఇక్కడ జరుగుతున్నది ధర్మమా?” అన్నాడు. 


ఎవరూ బదులు చెప్పక పోవడం చూసి వికర్ణుడు “నేను ఇక్కడ ధర్మనిర్ణయం చేస్తాను. జూదం, వేట, మద్యపానం,విషయాసక్తి దుర్వ్యసనాలు. వీటి వలన మానవులు ధర్మం తప్పి ప్రవర్తిస్తారు. అలాంటి వారు చేసే పనులు లెక్కలోకి రావు. ఒక జూదరి చేత పిలువబడిన వ్యసనపరుడైన మరో జూదరి ధర్మరాజు  పాండవుల ఉమ్మడి భార్య అయిన ద్రౌపదిని తను ముందు ఓడి తర్వాత ఫణంగా పెట్టి ఆడి ఓడడం ధర్మం కాదు. పైగా శకునియే ద్రౌపదిని పణంగా పెట్టే విషయాన్నీ ప్రస్తావించాడు. పైగా ఏకవస్త్రను సభకు తీసుకు రావడం అన్యాయం” అన్నాడు. 


కర్ణుడు వికర్ణుని చూసి “ఎందుకీ అధిక ప్రసంగం? చిన్నవాడివి ధర్మం గురించి నీకేమి తెలుసు. ఇంత మంది పెద్దలు ఉండగా ధర్మ నిర్ణయం చెయ్యడం నీకు తగదు. ద్రౌపది ధర్మరాజు ధనం. కనుక ధర్మ విజిత. లేకుంటే పాండవులు అంగీకరిస్తారా. పెక్కు మంది భర్తలు కలిగిన ద్రౌపది బంధకి. అలాంటి వారిని ఏకవస్త్రగానే కాదు. విగత వస్త్రగా తెచ్చినా అధర్మం కాదు" అన్నాడు. 


అపుడు దుర్యోధనుడు ఇలా అన్నాడు “కర్ణుడు బాగ చెప్పాడు. దుశ్శాశనా!  ద్రౌపది పాడవుల వస్త్రాలు తీసుకో" అన్నాడు. 


దుశ్శాసనుడు ఇది ధర్మం కాదు అని ఆలోచించక ద్రౌపది కట్టుకున్న చీరను లాగనారంభించాడుడు. 


ద్రౌపది శ్రీకృష్ణుడిని “గోవిందా! కృష్ణా! ద్వారకా వాసా! గోపీజనప్రియా! కేశవా! నన్ను ఉద్దరించవా!” అని మాటిమాటికి పిలుస్తూ ముఖాన్ని కప్పుకుని రోదించింది. 


శ్రీకృష్ణుడు అదృశ్యుడై వివిధ సుందర వస్త్రాలతో ద్రౌపదిని అచ్ఛాదించాడు. విచిత్రంగా ద్రౌపది నడుముకు ఉన్న చీర నడుము భాగాన్ని వదలలేదు. లాగుతుంటే అలాంటి వస్త్రాలు వస్తూనే ఉన్నాయి. లాగిన చీరలు గుట్టలుగా పడ్డాయి కాని ద్రౌపది నడుముకు చీర అలాగే ఉంది. దుశ్శాసనుడు ఇక చేతగాక అలసిపోయి సభామధ్యంలో సిగ్గుతో కూలబడ్డాడు. 

ఇది చూసి భీముడు ఆగ్రహంతో 

“కురువృద్ధులు, బంధువులు సభాసదులు చూస్తుండగా ద్రౌపదిని ఇలా అవమానించిన దుశ్శాశనుని సుయోధనుడు చూస్తుండగా యుద్ధ భూమిలో ఘోరంగా చంపి అతని రక్తం దోసిలి పట్టి తాగకుంటే నేను నా పితృ పితామహులకు పుట్టలేదు"అని  భీముడు భీకర ప్రతిజ్ఞ చేసాడు. 


సభలోని వారు “కుమారుడి మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు ద్రౌపది అడిగిన దానికి ఉపేక్షించాడు" అని అనుకున్నారు.```


               *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```

 

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

*సంపూర్ణ మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*షష్టాశ్వాసం ప్రధమ భాగం*


*580 వ రోజు*

*ఆశ్రమధర్మాల అవసరం*


శుకుడు " జనకమహారాజా ! మీరు చెప్పినది సాధారణ బ్రాహ్మణుడికి వర్తిస్తుంది. ప్రజ్ఞకలిగి జ్ఞానోదయమైన వాడికి ఈ మూడు ఆశ్రమములతో పని ఏమిటి ? జ్ఞానదృష్టితో బ్రహ్మపదము గురంచి ఎరిగిన వానికి ఈ మూడు ఆశ్రమధర్మాచరణ అవసరమా ! ఈ విషయమై వేదములు ఏమి వివరిస్తున్నాయి ! " అని అడిగాడు. జనకుడు " నీవన్నట్లు జ్ఞానము విజ్ఞానము మోక్షసాధనములు. వాట్ని గురుముఖతః నేర్చుకోవాలి. వాటి వలన ముక్తి పొంద వచ్చు. జీవుడు చివరిగా జ్ఞానవిజ్ఞానాలను కూడా వదిలి వేస్తాడు. పూర్వము ఋషులు, మనుజులు, ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులు కాకుండా సన్మార్గంలో నడవడానికే ఈ నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. ఈ నాలుగు ఆశ్రమాలు సక్రమంగా పాటించిన వాడు ముక్తి పొందడం తధ్యం. అలా కాకుండా పూర్వజన్మ పుణ్యము వలన జ్ఞానోదయమైన వాడు ఈ మూడు ఆశ్రమాలు వదిలి బ్రహ్మచర్యం వలన ముక్తిని పొంద వచ్చు. అతడు త్రిగుణాతీతుడై కలిగి బ్రహ్మచర్యంలో ముక్తి పొందకలిగిన వాడికి ఈ మూడు ఆశ్రమాలతో పని లేదు. మానవుడు ముక్తి పొందాలంటే సత్వమార్గము అవలంబించాలి. లేకున్న అది అసాధ్యము. ఈ విశ్వం తన అందు ఉన్నట్లు తాను విశ్వం అందు ఉన్నట్లు తలచిన వాడు ముక్తి పొందుతాడు. యయాతిమహారాజు " జ్యోతిస్వరూపుడైన పరమాత్మ మన ఆత్మలోనే ఉన్నాడు అని తెలుసుకుని ముక్తిని పొందాడు. ఇది తెలుసుకున్న మునులు తమవలన పరులకు పరుల వలన తమకు భయంలేకుండా బ్రతకగలడు. అప్పుడతడు ముక్తి పొందగలడు. నాకు అది కావాలి, ఇది వద్దు అని తలపక సకల ప్రాణుల అందు సమదృష్టి కలిగి, కోరికలను వదిలి పెట్టి, పరులకు కీడు తల పెట్టని మానవుడు ముక్తి పొందగలడు. దృశ్యములందు, శబ్ధములందు సమదృష్టి కలిగి విషయములలో లీనం కాకుండా, రాగద్వేషములు, సుఖ దుఃఖముల అందు ప్రభావితం కాకుండా జీవించ కలిగిన మానవుడు ముక్తిని పొందగలడు. ఇనుమును, బంగారమును, నిందను, స్తుతిని సమంగా భావించేవాడికి తాబేలు తన డిప్పలోకి తాను ముడుచుకున్నట్లు ఇంద్రియములను తనలోనికి లాగగలిగిన వాడికి ముక్తి తప్పక లభిస్తుంది. నేను చెప్పిన విషయాలు నీ తండ్రి దయవలన నీకు ప్రాప్తించాయి. నేను చెప్పినదాని కంటే నీకు తెలిసినది ఎక్కువ. బాల్యచాపల్యము వలన, నీ భావనలో సందేహములు, భయములు ఉండటం వలన నీవు సర్వజ్ఞుడన్న విషయము నీవు ఎరుగక ఉన్నావు. జ్ఞానము స్మగ్ర రూపం తాల్చినప్పుడే మోక్షము సిద్ధించగలదు. కనుక నీవు దృఢసంకల్పంతో పరిపూర్ణత సాధించు. నీకిక కొరత లేదు. మోక్షం తప్పక సిద్ధిస్తుంది. నీ సంశయములు వదిలి పెట్టు. పుట్టక ముందు నువ్వు ఎక్కడ ఉన్నావో అదే నీ శాశ్వత స్థానం " అని జనకుడు శుకుడికి జ్ఞానబోధ చేసాడు. జనకుడి జ్ఞాన బోధలతో శుకుడు సంశయములు తీరి తానెవరో తెలుసుకుని తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళాడు.

*షష్టాశ్వాసం ద్వితీయ భాగం*

సంశయరహితుడై శుకుడు వాయువేగ మనోవేగాలతో తండ్రి అయిన వ్యాసుని చేరడానికి హిమాలయాల వైపు బయలు దేరాడు. వ్యాసుడు తన శిష్యులైన సుమంతుడు, వైశంపాయనుడు, జైమిని, పైలుడు అనే వారితో వేదాధ్యాయనం చేయిస్తున్నాడు. శుకుని చూసిన వ్యాసుడు సంతోషించాడు. శుకుడు తండ్రి పాదములకు నమస్కరించి కూర్చున్నాడు. తనకు జనకుడికి జరిగిన సంభాషణ సారమును వివరించాడు. వ్యాసుడు శుకుని కూడా తన శిష్యులతో చేర్చి వేదాధ్యయనం చేస్తున్నాడు. ఒక రోజు వ్యాసుడి శిష్యులు వ్యాసుడితో " గురువర్యా ! వేదాధ్యయనంలో మేము అయిదుగురిమే ఈ లోకంలో అందరికన్నా మిన్నగా ముందుండాలి. మమ్మల్ని మించి ఇంకెవరికి వేదం చెప్పకూడదు. ఇలా మాకు వరం ప్రసాదించండి " అని కోరాడు. వ్యాసుడు " ఆసక్తి కలిగిన బ్రాహ్మణ కుమారులకు వేదవిద్య నేర్పిన వాడికి బ్రహ్మపదము కరతలామలకము. ఈ మాట మీరు వినలేదా ! ప్రతివాడు కష్టములు అనుభవించిన తరువాత సుఖము అనుభవిస్తాడు. మానవుడు ఎన్నటికీ స్వార్ధపూరితుడు కాకూడదు. కనుక ఇటువంటి కోరిక మీకు ధర్మంకాదు " అన్నాడు. ఆ మాటలు విన్న శిష్యులు ఒకరిని ఒకరు చూసుకుని " గురువర్యా ! మీరు మమ్ము ఇక్కడే ఉంచితే అది ఎలా సాధ్యం ఔతుంది. మేము పర్వతశిఖరం దిగి ఆసక్తులైన వారిని వెతికి పట్టుకుని వారితో వేదాధ్యయనం చేయించమంటారా ! వారితో యజ్ఞయాగములు చేయించమంటారా " అని అడిగారు. వ్యాసుడు " శిష్యులారా ! మీరు ఇది చెప్పడానికి ఇంత డొంక తిరుగుడుగా మాట్లాడడం అవసరమా ! మీరు పర్వతశిఖరములు దిగి జనావాసాలకు వెళ్ళి విద్యాదానం చేస్తానంటే నేను కాదనగలనా ! " అని వాత్సల్యంగా అన్నాడు. శిష్యులు వ్యాసుడి కాళ్ళ మీద సాంష్టాంగ పడ్డారు. వ్యాసుడు వారిని లేవనెత్తి దీవించి " ఈ మూడు లోకాలలో మీకు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి. మీరు జాగ్రత్తగా ఉంటూ వేదములను ప్రచారం చెయ్యండి " అన్నాడు. వ్యాసుడి నలుగురు శిష్యులు వెళ్ళగానే వ్యాసుడు తన కుమారుడితో ఆశ్రమంలో ఒంటరిగా మిగిలి పోయాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ కిరాడు దేవాలయాలు

  🕉 మన గుడి : నెం 1315


⚜  రాజస్థాన్ : బార్మర్ జిల్లా


⚜  శ్రీ కిరాడు దేవాలయాలు 



💠 కిరాడు దేవాలయాలు భారతదేశంలోని రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఉన్న శిథిలమైన దేవాలయాల సమూహం.


💠 కిరాడు పట్టణం థార్ ఎడారిలో ఉంది, ఇది రాజస్థాన్‌లోని బార్మర్ సమీపంలోని కిరాడు దేవాలయాల సమూహం రాతితో చెక్కబడిన భారతీయ కళకు ఒక ఉదాహరణ.


💠 11వ శతాబ్దంలో నిర్మించిన అనేక దేవాలయాలలో, కొన్ని మాత్రమే పరిపూర్ణ స్థితిలో ఉన్నాయి, కొన్ని దెబ్బతిన్నాయి - అయినప్పటికీ చాలా అందంగా ఉన్నాయి. 


💠 ఈ ఆలయం పూర్తిగా ఇంటర్‌లాక్ చేయబడిన ఎర్రటి-పసుపు ఇసుకరాయి బ్లాకులను ఉపయోగించి తయారు చేయబడింది మరియు దానిని కలపడానికి ఎటువంటి మోర్టార్, సున్నం లేదా ఇతర అంటుకునే పదార్థాలను ఉపయోగించదు. 


💠 11వ మరియు 12వ శతాబ్దాలలో పర్మార్, సోలంకి మరియు చౌహాన్ రాజవంశాలు వరుసగా పరిపాలించడంతో కిరాడు ఒక సంపన్న పట్టణం. 


💠 ఈ దేవాలయాలు గర్భగృహం లేదా గర్భగుడి, అంతరాలయము, మహామండప్ మరియు ద్వారమండప్‌లతో మారు-గుర్జర్ శైలిలో నిర్మించబడ్డాయి. 


💠 కిరాడు వద్ద కనీసం 5 దేవాలయాల శిథిలాలు ఉన్నాయి. వీటిలో, శివుడికి అంకితం చేయబడిన సోమేశ్వర ఆలయం ఉత్తమంగా సంరక్షించబడిన నిర్మాణం. 


💠 11-12వ శతాబ్దంలో చౌలుక్య (సోలంకి) చక్రవర్తుల సామంతులు ఈ దేవాలయాలను నిర్మించారని ఎపిగ్రాఫిక్ ఆధారాలు సూచిస్తున్నాయి.


💠 కిరాడు (కిరాడ్‌కోట్) చరిత్ర 6వ శతాబ్దం నాటిది, ఆ సమయంలో రాజ్‌పుత్‌లకు చెందిన కిరాడ్ వంశం వారు పాలించారు. 

వారు శివుని సంపన్న భక్తుల సమూహం. 

నేడు మనం చూసే దేవాలయాలను పర్మార్ రాజవంశానికి చెందిన రాజు సోమేశ్వర్ నిర్మించారు. 

అతను 12వ శతాబ్దంలో కిరాడును పరిపాలించాడు. 


💠 ఈ ప్రదేశంలో శివుడు మరియు విష్ణువుకు అంకితం చేయబడిన 108 దేవాలయాలు ఉన్నాయని నమ్ముతారు. 

అతని పాలనలో తురుష్కులు (తుర్కిస్తాన్ ప్రజలు) అతని రాజ్యాన్ని ఆక్రమించి దేవాలయాలకు భారీ నష్టం కలిగించారు. 

ఆ 108 దేవాలయాలలో 5 మాత్రమే మిగిలి ఉన్నాయి.


💠 కిరాడు ఆలయంలో 5 ఆలయాలు ఉండేవి, కానీ నేడు రెండు ఆలయాలు మాత్రమే పరిపూర్ణ స్థితిలో ఉన్నాయి. పురాతన కాలంలో కిరాడును హత్మా అని పిలిచేవారు. 


💠 1161 నాటి శాసనం ప్రకారం, ఈ గ్రామాన్ని పరమారాలు పాలించారు మరియు ఈ గ్రామానికి పరమారాల రాజధాని అయిన కీర్త్‌కుప్ అని పేరు పెట్టారు.


💠 రాత్రి సమయంలో కిరాడు ఆలయాన్ని సందర్శించడం నిషేధించబడింది. 

చాలా మంది నియమాలను ఉల్లంఘిస్తున్నారు. 

రాత్రి సమయంలో ఈ ఆలయానికి వెళ్ళారాదు అని చెప్పబడింది. 

రాత్రి సమయంలో ఈ ఆలయానికి వెళ్ళిన వ్యక్తి తిరిగి రాలేదని మరియు కిరాడు యొక్క ఇతర విగ్రహాల మాదిరిగా విగ్రహ రూపాన్ని తీసుకుంటాడని చెబుతారు.


💠 కిరాడు ఆలయం ఒక ఋషిచే శపించబడిందని మరియు గత కొన్ని దశాబ్దాలుగా ఈ కోట నిర్జనంగా ఉందని నమ్ముతారు. 

ఈ కోటలోకి ప్రవేశించడం మరణాన్ని ఆస్వాదించినట్లే.


💠 రాత్రి సమయంలో కిరాడు ఆలయానికి ఎవరు వెళితే వారు రాతి విగ్రహంగా మారతారు, కానీ అందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు, కానీ ప్రజల నమ్మకం ప్రకారం, ఇది నిజం.


💠 కిరాడు వద్ద కనీసం ఐదు దేవాలయాల అవశేషాలు కనుగొనబడ్డాయి. వీటిలో, రహదారికి దగ్గరగా ఉన్న సోమేశ్వర ఆలయం అత్యంత పూర్తి స్థితిలో ఉంది. 

శిఖరం కూలిపోయినప్పటికీ మరియు మండపం దాని పైకప్పులో ఎక్కువ భాగం కనిపించకపోయినా, దాని మనుగడలో ఉన్న భాగాలు అసలు ఆలయ రూపకల్పనను పునర్నిర్మించడానికి సరిపోతాయి. గోడలు మరియు స్తంభాలు శిల్పాలతో బాగా అలంకరించబడ్డాయి, వీటిలో జంతువులు మరియు మానవుల బొమ్మలు ఉన్నాయి, ఇవి ఎక్కువగా స్థానంలో ఉన్నాయి. 

మండప స్తంభాలు అష్టభుజి ఆకారాన్ని ఏర్పరుస్తాయి.


💠 కళా చరిత్రకారుడు పెర్సీ బ్రౌన్ నిర్మాణ శైలిని " సోలంకి మోడ్" అని పిలిచాడు. 

నేడు ఈ శైలిని తరచుగా మారు-గుర్జార నిర్మాణం అని పిలుస్తారు .


💠 విష్ణు ఆలయం సమూహం యొక్క మరొక చివరలో ఉంది, మండపం యొక్క అత్యంత చెక్కబడిన స్తంభాలు మాత్రమే ఇప్పటికీ ఉన్నాయి; మిచెల్ దీనిని ఒక శతాబ్దం ముందే కాలమానం చేశాడు.

 ఈ రెండింటి మధ్య మూడు శివాలయాలు వైవిధ్యమైన స్థితిలో ఉన్నాయి , ఎక్కువగా అభయారణ్యాలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరియు ఒక మెట్ల బావి ఉన్నాయి.


💠 బార్మర్ నుండి దాదాపు 35 కి.మీ మరియు జైసల్మేర్ నుండి 157 కి.మీ దూరంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

గురువారం,డిసెంబరు.4,2025

  *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


గురువారం,డిసెంబరు.4,2025

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

మార్గశిర మాసం - శుక్ల పక్షం

తిథి:చతుర్దశి ఉ7.42 

తదుపరి పూర్ణిమ తె5.21 వరకు

నక్షత్రం:కృత్తిక మ3.12 వరకు

యోగం:శివం మ1.22 వరకు

కరణం:వణిజ ఉ7.42 తదుపరి భద్ర సా6.31 తదుపరి బవ తె5.21 వరకు

వర్జ్యం:తె6.06 నుండి

దుర్ముహూర్తము:ఉ9.59 - 10.43

మరల మ2.23 - 3.07

అమృతకాలం:మ12.58 - 2.27

రాహుకాలం:మ1.30 - 3.00

కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి: వృషభం

సూర్యోదయం: 6.19 సూర్యాస్తమయం: 5.20   

*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

సుభాషితమ్

  💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


    శ్లో𝕝𝕝    *గుణైస్సర్వఙ్ఞతుల్యోఽపి*

              *సీదత్యేకో నిరాశ్రయః|*

              *అనర్ఘమపి మాణిక్యం*

              *హేమమాశ్రిత్య శోభతే||*


తా𝕝𝕝 *సద్గుణములు కలవాడై సర్వఙ్ఞుడు కావచ్చుగాక!*

*ఏ ఆశ్రయమూ లేకపోతే ఏకాకిగా బాధలను అనుభవిస్తాడు*....

*విలువైన రత్నమే అయినా స్వర్ణాన్ని ఆశ్రయిస్తుంది....*

*విద్యావంతుడు తగిన ఆశ్రయం దొరికితేనే రాణిస్తాడు*.... *బంగారంలో పొదిగితేనే రత్నం శోభిస్తుంది.  ..*


✍️🌹💐🌸🙏

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత: పదునేడవ అధ్యాయము

శ్రద్ధాత్రయ విభాగయోగము:శ్రీ భగవానువాచ


యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే

కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే (27)


అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ 

అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ (28)


పార్థా.. యజ్ఞం, తపస్సు, దానాలలోని నిష్ఠకు కూడా సత్ శబ్దం సంకేతం. ఈశ్వరుడి ప్రీతికిచేసే కర్మలన్నిటినీ సత్ అనే చెబుతారు. హోమం, దానం, తపస్సు, ఇతర కర్మలు—వీటిని అశ్రద్ధగా ఆచరిస్తే అసత్ అంటారు. వాటివల్ల ఇహలోకంలోకాని, పరలోకంలోకాని ఫలితమేమీ వుండదు.


శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని శ్రద్ధాత్రయ విభాగయోగము అనే పదునేడవ అధ్యాయం సమాప్తం..🙏


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

ప్రాతకాలస్మరమి

  🙏  ప్రాతకాలస్మరమి దీపం జ్యోతి  నమోస్తుతే .....!!




శుభం కరోతి కళ్యాణం 

            ఆరోగ్యం ధన సంపద

శత్రు బుద్ధి వినాశాయ 


          దీప జ్యోతిర్ నమోస్తుతే 

       దీప-జ్యోతి: పరబ్రహ్మ               

           దీప జ్యోతి జనార్ధనః,

  దీపో హారతి మే పాపం 

          దీప-జ్యోతిర్-నమోస్తుతే

ఏ దీపజ్యోతి ఐతే శుభం,మంచి,ఆరోగ్యం ధనసంపదలు మీకు ప్రసాదిస్తుందో,చెడు తలపులను తొలగిస్తుంది,ఆ దీప జోయతికికి ప్రణమిల్లుతున్నాను ..


🙏🪔🪔🙏🪔🪔🙏🪔🪔🙏

సుభాషితమ్

  💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


    శ్లో𝕝𝕝    *గుణైస్సర్వఙ్ఞతుల్యోఽపి*

              *సీదత్యేకో నిరాశ్రయః|*

              *అనర్ఘమపి మాణిక్యం*

              *హేమమాశ్రిత్య శోభతే||*


తా𝕝𝕝 *సద్గుణములు కలవాడై సర్వఙ్ఞుడు కావచ్చుగాక!*

*ఏ ఆశ్రయమూ లేకపోతే ఏకాకిగా బాధలను అనుభవిస్తాడు*....

*విలువైన రత్నమే అయినా స్వర్ణాన్ని ఆశ్రయిస్తుంది....*

*విద్యావంతుడు తగిన ఆశ్రయం దొరికితేనే రాణిస్తాడు*.... *బంగారంలో పొదిగితేనే రత్నం శోభిస్తుంది.  ..*


✍️🌹💐🌸🙏

నేటి సూక్తి*

  *నేటి సూక్తి* 


*కష్టం వచ్చినప్పుడు అవకాశం కోసం చూడండి, కానీ అందివచ్చిన అవకాశాల్లో కష్టాన్ని చూడకండి.*


*క్రాంతి కిరణాలు* 


*కం. అవకాశముకై చూచుట*

*యవసరమే కష్ట మందు ననుకూలముకై* 

*యవకాశము దొరికినపుడ*

*నవసరమే కష్టములను నందగ చూడన్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

*శ్రీ పోతన భాగవత మధురిమలు*

  *శ్రీ పోతన భాగవత మధురిమలు* 


(2-207-క.)

శశ్వత్ప్రశాంతు నభయుని

విశ్వాత్ముఁ బ్రబోధమాత్రు విభు సంశుద్ధున్

శాశ్వతు సము సదసత్పరు

నీశ్వరుఁ జిత్తమున నిలుపు మెపుడు మునీంద్రా!


*భావము:-* నారదమునీశ్వర! ఎల్లవేళల మిక్కిలి శాంతుడై వుండేవాడు, భయరహితుడు, విశ్వమయుడు, కేవల జ్ఞానస్వరూపుడు, సర్వేశ్వరుడు, శుద్ధాత్ముడు, శాశ్వతుడు, సముడు, సత్తు అసత్తులకు అతీతుడు అయినట్టి పరమేశ్వరుణ్ణి సదా నీ హృదయంలో ప్రతిష్ఠించుకో.


జగద్గురు శ్రీ శంకరాచార్య కృత *'మోహ ముద్గరం'* తో శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం* 

ధర్మో రక్షతి రక్షితః

వాడుక వీడిన వస్తువు

  *2114*

*కం*

వాడుక వీడిన వస్తువు

పాడగు రీతిన పుడమిన పనులకు తనువున్

వాడక పోవుట చేతనె

పాడగు రోగముల నొంది పదపడి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! వాడు క లేని వస్తువు పాడైపోయే విధంగా నే పనులకు వాడని శరీరం కూడా రోగముల బారిన పడి పాడైపోతుంది.

*సందేశం*:-- ఈ కాలం మనుషులు చాలా పనులకు పనివారి నే వినియోగించుకునే అలవాటు పడి మెల్లమెల్లగా పనుల అలవాటు తగ్గి చిత్రవిచిత్రమైన రోగాల నొంది నిరంతరం బాధపడుతూ ఉన్నారు. పనులను స్వంతంగా చేసుకోవడం అలవాటు తప్పని వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

*11 విశ్వ రూప దర్శన యోగము*

 *11 విశ్వ రూప దర్శన యోగము*


11.18

*త్వమక్షరం పరమం వేదితవ్యం*

*త్వమస్య విశ్వస్య పరం నిధానమ్*

*త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా*

*సనాతనస్త్వం పురుషో మతో మే ।। 18 ।।*

त्वमक्षरं परमं वेदितव्यं

त्वमस्य विश्वस्य परं निधानम्।

त्वमव्ययः शाश्वतधर्मगोप्ता

सनातनस्त्वं पुरुषो मतो मे ॥18॥


త్వమ్ — నీవు; అక్షరం — వినాశనములేని; పరమం — సర్వోన్నతమైన వాడివి; వేదితవ్యం — తెలుసుకోవలసిన వాడవు; త్వమ్ — నీవు; అస్య — ఈ యొక్క; విశ్వస్య — సృష్టికి; పరం — సర్వోన్నత; నిధానమ్ — ఆధారము; త్వం — నీవు; అవ్యయః — నిత్యశాశ్వతమైన; శాశ్వత-ధర్మ-గోప్తా — సనాతనమైన ధర్మమును పరిరక్షించేవాడవు; సనాతనః — సనాతమైన; త్వం — నీవు; పురుషః — దివ్య పురుషుడవు; మతః మే — నా యొక్క అభిప్రాయము.


*BG 11.18: నీవే అనశ్వరమైన పరమేశ్వరుడవు అని, వేదములచే ప్రతిపాదింపబడిన పరమ సత్యము అని తెలుసుకున్నాను. నీవే సమస్త సృష్టికి ఆధారము; నీవే సనాతన ధర్మమునకు నిత్య రక్షకుడవు; నీవే నిత్య శాశ్వతమైన సర్వోత్కృష్ట భగవంతుడవు.*


*వ్యాఖ్యానం*


పరమేశ్వరునిగా శ్రీ కృష్ణుడి సార్వభౌమాధికారాన్ని తను గుర్తిస్తున్నట్టుగా అర్జునుడు ప్రకటిస్తున్నాడు; ఆయనే సమస్త సృష్టికి ఆధారము, అన్నీ వేద శాస్త్రముల ద్వారా తెలుసుకోవలసినది ఆయననే. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:


సర్వే వేదా యత్ పదమామనంతి (1.2.15)


"సర్వ వేద మంత్రముల యొక్క ప్రధాన లక్ష్యము మనలను భగవంతుని దిశగా తీస్కువేళ్లటమే. వేద శాస్త్ర అధ్యయన లక్ష్యము, ఉద్దేశ్యము ఆయనే."


శ్రీమద్ భాగవతము ఈ విధముగా పేర్కొంటున్నది.


వాసుదేవ-పరా వేదా వాసుదేవ-పరా మఖాః (1.2.28)


"వైదిక జ్ఞానమును సంపాదించుకునే దాని యొక్క లక్ష్యము భగవంతుడిని చేరుకోవటమే. సర్వ యజ్ఞములు కూడా ఆయన ప్రీతి కోసమే." తన ఎదుటే నిల్చొని ఉన్న భగవంతుని సాకార స్వరూపమే, సమస్త వేదముల యొక్క విషయంగా ఉన్న పరమ సత్యమని అర్జునుడు తన యొక్క విజ్ఞానమును, శ్రీ కృష్ణుడిని స్తుతిస్తూ తెలియపరచాడు.