4, డిసెంబర్ 2025, గురువారం

పాషాణ చతుర్దశి*

 

మార్గశిర శుద్ధ చతుర్దశి..```



            *పాషాణ చతుర్దశి*

                 ➖➖➖✍️


```

రామాయణం లో రాముడు సీతా లక్ష్మణ సమేతుడై బయలుదేరి మూడు దినములు జలాహారము, నాలుగవ దినమున ఫలాహారము గైకొని ఐదవనాడు చిత్రకూటము జేరి అందు బండ్రెండేండ్లు నివసించి పదు మూడవ సంవత్సరమున బంచవటియందు కాముకురాలగు శూర్పణఖను విరూపను గావించెను. 


పిదప రావణుడు వచ్చి సీతను గొనిపోవుచుండ నామె యింటలేని రామునికై ‘రామ రామ’ యని యేడ్చెను. 


అపుడు జటాయువు రావణుని కడ్డువెళ్ళి యాతడు రెక్కలు నరుక గ్రిందబడిపోయెను. 


సంపాతి వానరులకు సీతజాడ చెప్పెను. 


మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు హనుమంతుడు మహేంద్ర పర్వతమునుండి యెగిరి రాత్రికిరాత్రి లంకనుజేరి తెల్లవారుకట్ట సీతను గని సంచార ముడిగి విశ్రమించి, ద్వాదశినాడు శింశుపావృక్షము నెక్కినాటి రాత్రి చేతులు జోడించి సీతకు నమస్కరించి నమ్మకము కలుగునట్లు పలికి త్రయోదశినాడు అక్షకుమారుడు మున్నగు రాక్షసుల జంపి చతుర్దశి నాడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బద్ధుడైనట్లు నటించెను. 


రాక్షసు లానందించి యాతనితోకకు నూనెగుడ్డలు చుట్టి యంటింప దానితో నాతడు లంకాదహనము కావించెను.


ఈనాటి నుంచి చాంద్రాయణ వ్రతం చేస్తారు. ఈనాడు రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి గౌరీదేవిని ఆరాధించాలి.


చాంద్రాయణ వ్రతం. చంద్రకళల వృద్ధి క్షయాలను బట్టి ఆహారాన్ని పెంచడం, తగ్గించడం చేసే ఒక వ్రతం. 


పౌర్ణమినాడు ఈ వ్రతాన్ని ప్రారంభిస్తే రోజుకు ఒక ముద్ద వంతున తగ్గించడం, తరువాత అమావాస్య మొదలు ఒక్కొక ముద్దనూ పెంచుతూ సామాన్య భోజన స్థాయికి చేరడం పద్ధతి.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

కామెంట్‌లు లేవు: