4, డిసెంబర్ 2025, గురువారం

ఆక్రోట్లు (వాల్ నట్స్)*

 



               *ఆక్రోట్లు (వాల్ నట్స్)*

                     ➖➖➖✍️



*ఆల్ఫా లినోలిక్ ఆమ్లం అధికంగా ఉన్న గింజలు అక్రోట్లు మాత్రమే!* 


*ఇవి స్ర్తీ, పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచుతుంది.* 


*అక్రోట్లలోని మెలటోనిన్ నిద్రపట్టేలా చేస్తుంది.* 


*ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు రోగనిరోధకశక్తినీ, తెలివితేటల్నీ, జ్ఞాపకశక్తినీ పెంపొందిస్తాయి. డిప్రెషన్నీ నిరోధిస్తాయి. అందుకే ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయనీ, గర్భిణులు రోజూ కాసిని అక్రోట్లను తినడం వల్ల పిల్లల మెదడు పనితీరు కూడా బాగుంటుందనీ హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన పోషక నిపుణుల పరిశీలనలో తేలింది.* 


*వీటిల్లోని బయోటిన్ (B7) జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.* 


*ఇంకా ఫైటోస్టెరాల్స్ ఒత్తిడినీ, ప్రొస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్నీ అడ్డుకుంటాయి.*


**వందగ్రాముల అక్రోట్లలో..*

*శక్తి: 654 కేలరీలు,*

*ప్రొటీన్లు: 15.2 గ్రాములు,*

*పిండిపదార్థాలు: 13.7 గ్రాములు,*

*కొవ్వులు: 65.21 గ్రాములు,*

*శాచ్యురేటెడ్: 6.1 గ్రాములు,*

*మోనో అన్‌శాచ్యురేటెడ్: 8.9 గ్రాములు,*

*పాలీఅన్ శాచ్యురేటెడ్: 47.1 గ్రాములు,*

*కాల్షియం: 98 మిల్లీగ్రాములు,*

*కాపర్: 1.59 మిల్లీగ్రాములు,*

*ఐరన్: 2.91 మిల్లీగ్రాములు,*

*మెగ్నీషియం: 158 మిల్లీగ్రాములు,*

*పొటాషియం: 441 మిల్లీగ్రాములు,*

*విటమిన్ ఇ: 0.7 మిల్లీగ్రాములు,*

-సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

కామెంట్‌లు లేవు: