4, డిసెంబర్ 2025, గురువారం

మహనీయుని మాట*

 🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏


      🌺*శుభోదయం*🌺

     -------------------

🏵️ *మహనీయుని మాట*🏵️

        -------------------------

"చిన్న అడుగుతో మొదలైన ప్రయాణమే గొప్ప విజయాల దారిని చూపుతుంది.

ఆప్తులు లేకపోయినా నమ్మకం మనతో ఉంటుంది.

ప్రయత్నం ఆగకపోతే గమ్యం దూరం కాదు.

మీ దగ్గర ఉన్న మీ నమ్మకమే ఆయుధం."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌹

      ---------------------------

"ఎదుటివారిని అర్థం చేసుకోవడం దయ మొదటి మెట్టు. ఆ భావం లేకపోతే సహాయం కూడా నిరర్థకం." 


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻



🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🪴పంచాంగం🪴

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 04 - 12 - 2025,

వారం ... బృహస్పతివాసరే ( గురువారం )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

దక్షిణాయనం,

హేమంత ఋతువు,

మార్గశిర మాసం,

శుక్ల పక్షం,


తిథి : *చతుర్దశి* ఉ7.42 వరకు

                 తదుపరి *పూర్ణిమ* తె5.21 వరకు,

నక్షత్రం : *కృత్తిక* మ3.12 వరకు

యోగం : *శివం* మ1.22 వరకు

కరణం : *వణిజ* ఉ7.42 వరకు

                 తదుపరి *భద్ర* సా6.31 వరకు,

                  ఆ తదుపరి *బవ* తె5.21 వరకు,


వర్జ్యం : *తె6.06 నుండి*

దుర్ముహూర్తము : *ఉ9.59 - 10.43*

                               మరల *మ2.23 - 3.07*

అమృతకాలం : *మ12.58 - 2.27* 

రాహుకాలం : *మ1.30 - 3.00*

యమగండం : *ఉ6.00 - 7.30*

సూర్యరాశి : *వృశ్చికం*

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం : 6.19,

సూర్యాస్తమయం : 5.20,


               *_నేటి విశేషం_*


          *శ్రీ దత్త జయంతి*

మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజున దత్తాత్రేయస్వామి అవతరించారు♪. 

దత్తాత్రేయుని రూపం బహుచిత్రం♪. తత్త్వం అతి విచిత్రం♪. 

అనుగ్రహం అత్యంత ఆశ్చర్యకరం♪. లీలలు అత్యద్భుతం♪. 

_*మార్గశిర పూర్ణిమను ‘దత్త జయంతి’ గా జరుపుకుంటాం.*_


_*ఓంకార రూప దత్తాయ*_

_*భూమానంద ప్రదాయినే*_

_*భువన త్రాణ దక్షాయ*_

_*స్వతస్సిద్ధాయ తే నమః*_


 ‘ఓం' కారమే పరబ్రహ్మ స్వరూపం♪. అదే శ్రీ దత్తాత్రేయ స్వామి రూపం♪. అంతులేని ఆనందాన్ని ప్రసాదించేది, లోకాలను అన్నిటినీ కాపాడేది, తనంతట తానుగా ఉద్భవించిందైన శ్రీదత్తధ్యానం అందరినీ రక్షించుగాక!’ ‘ఓం, భూః భువః సువః’ అనే వేదమంత్ర వ్యాహృతులతో ఈ దత్త ధ్యానశ్లోకం ప్రారంభమవుతుంది♪. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో త్రిమూర్తి స్వరూపంగా అవతరించిన పరబ్రహ్మ స్వరూపమే ‘దత్తావతారం’♪.


మహాతపఃస్సంపన్నుడైన అత్రి మహర్షికి - పతివ్రతా శిరోమణి యైన అనసూయాదేవికి కలిగిన పుణ్యఫల సంతానమే ఈ స్వామి♪. 


 ‘సత్వరజోతమో’ గుణాలు లేనివాడు అత్రి మహర్షి♪. అనసూయా (న+అసూయ) లేని, మాయను వదిలిన తత్వం గలది అనసూయా మాత♪. కనుకే, త్రిగుణాతీతుడై మాయా రహితుడైన అవధూత స్వరూపంగా ‘దత్తాత్రేయుడు’ ఉద్భవించాడు♪. అత్రి తనయుడు కనుక ‘ఆత్రేయుడు’, తనకు తానుగా దత్తమైనాడు (తల్లి దండ్రులకు ఇవ్వబడినాడు) కనుక ‘దత్తుడు’♪. వెరసి ‘దత్తాత్రేయుడు’ అయ్యాడు♪.


_*ఆదౌబ్రహ్మ హరిర్మధ్యే హ్యంత్యేదేవస్సదాశివః*_

_*మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే ॥*_


మూడు ముఖాల్లో మొదటిది బ్రహ్మ, మధ్య విష్ణు, మూడవది శివ స్వరూపం♪. అన్నీ ఏకమైన సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపo♪. ఆరు చేతుల్లో శంఖo, చక్రo, త్రిశూలo, కమండలo, అక్ష (జప)మాల, డమరుకo ధరిస్తాడు♪. పక్కన వుండే నాలుగు శునకాలు చతుర్వేదాలకు ప్రతీకలు♪. స్వామిని ఆనుకొనే ఆవు ధర్మస్వరూపమైన కామధేనువు♪. ఔదుంబర (మేడి) వృక్షం కింద తపస్సు చేస్తుంటాడు♪. అందుకే, మనం మేడిచెట్టును పవిత్రంగా పూజిస్తారు♪.


_*🌼తాత్వికంగా స్వామి దిగంబరుడు.*_


 (దిక్కులే వస్ర్తాలుగా కలవాడు)♪. కేవల బ్రహ్మనిష్ఠతో దండక మండలాలను కూడా వదలిన శుద్ధ సాత్విక చైతన్యమూర్తియైన అవధూత♪. ఎవరినీ ఏదీ యాచించని నిత్య తృప్తితో, సంసారం జంజాటా లేవీ లేనివాడు♪. కనుకే, స్వామి అపార దయాగుణంతో _*‘ఆత్మవత్‌ సర్వభూతాని’*_ తనతో సమానంగా అందరినీ చూసే సమదృష్టి కలవాడు♪. అవధూత సంప్రదాయమైన _*‘బాలోన్మత్త పిశాచవత్‌'*_ అంటే, దేహసంబంధమైన వ్యామోహం ఏ మాత్రం లేకుండా ఒకసారి బాలునిగా, ఇంకోసారి పిచ్చివానిగా, మరోసారి దెయ్యం పట్టినవానిగా చిత్రవిచిత్ర రూపాల్లో దర్శనమిస్తూ సాధకుల మనో నిగ్రహాన్ని పరీక్షిస్తాడు♪. అందుకే, ‘దత్త దర్శనం’ అంత సులభం కాదు♪. 


కానీ, ఒకసారి ఆయన అనుగ్రహం లభిస్తే ఇక తిరుగుండదు♪. భక్తితో స్మరిస్తే చాలు, సంతృప్తి చెంది తన దివ్యానుగ్రహాన్ని కురిపిస్తాడు♪. _*‘స్మర్తృగామీ సనోవతు’.*_ - _*‘స్మరించగానే వచ్చి రక్షించేవాడు’*_ గా వినుతికెక్కాడు♪.


విష్ణుమూర్తి మిగతా అవతారాలు లక్ష్యం పూర్తవగానే సమాప్తి అయ్యాయి♪. కానీ, నారదుని తర్వాత ‘ఎప్పటికీ అవతార పరిసమాప్తి లేనిది’ ఈ దత్తాత్రేయ అవతారమే♪.


ఒకసారి బ్రహ్మదేవుడు మానవసృష్టికి ముందుగా తమస్సు, మోహం వంటి అవిద్యను సృష్టించాడట♪. అది తనను సృష్టించిన బ్రహ్మనే ఆవరించి కలవరపరచి వేదవిద్యను మరచిపోయేలా చేసింది♪. శ్రీ దత్తస్వామి అనుగ్రహం వల్లే బ్రహ్మదేవుడు తిరిగి వేదవిధాత అయ్యాడు♪. బ్రహ్మకే బ్రహ్మోపదేశం చేసినందున దత్తుడు ఆదిగురువు అయ్యాడు♪.


 _*🌼దత్త లీలలు!*_ 


జంభాసురుడనే రాక్షసవధకు ఇంద్రుడు దత్తాత్రేయస్వామి సహాయం తీసుకొని విజయం సాధించాడు♪. ఎన్నో పరీక్షలకు గురి చేసి కార్తవీర్యార్జునునికి వేయి చేతులను ప్రసాదించింది దత్తాత్రేయుడే♪. అదే కార్తవీర్యార్జునుని సంహరించిన పరశురాముని చేరదీసి అనుగ్రహించి, ‘త్రిపురా రహస్యం’ అనే జ్ఞానబోధ చేసిందీ దత్తాత్రేయుడే♪. 


పూర్వం ఆయువు అనే చంద్రవంశ రాజుకు సంతానం కలుగకపోతే సహ్యాద్రి పర్వత సానువులలో తపోదీక్షలో ఉన్న దత్తాత్రేయుని ఆశ్రయించాడు♪. అప్పుడు దత్తుడు భోగలంపటుడై, మద్యం సేవిస్తూ మగువలతో క్రీడిస్తున్నట్లుగా ఆయువుకు దర్శనమిచ్చాడు♪. ఇదంతా ‘మాయాలీల’ అని గ్రహించి స్వామి పాదాలను వదలకుండా ఆయువు వేడుకుంటాడు♪. ఎంతోసేపటికి అనుగ్రహించిన దత్తుడు అపార కరుణను కురిపించి ఇంద్రునితో సమానమైన ప్రతిభావంతుడైన కుమారుణ్ణి ప్రసాదిస్తాడు. అతడే కొంతకాలం ఇంద్రపదవిని అలంకరించిన 'నహుషుడు'♪.


 _*🌼జ్ఞానావతారం*_ 


విష్ణుమూర్తి అవతారాలలో దత్తాత్రేయునిది ‘జ్ఞానావతారం’♪. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి విజ్ఞానమయ రోచిస్సులను వెలిగించి మోక్షమార్గం చూపించే గురువాయన♪. తల్లిదండ్రులతోనూ ‘గురుదత్తా’ అని పిలిపించుకొని ఆదిగురువయ్యాడు♪. ‘దత్తాత్రేయుని’ గా శ్రీమన్నారాయణుడు ఆత్మవిద్యను బోధించడానికే ఈ భూమిపై అవతరించాడన్నది పురాణ సత్యం♪.


మహావిష్ణువు ఏకవింశతి (21) అవతారాలలో మొదటి అవతారం ‘సనక, సనంద, సనాతన, సనత్కుమారులు’ అనే మహర్షులుగా కఠోరమైన బ్రహ్మచర్యంతో సంచరించడం♪. రెండవదైన ‘భూయజ్ఞ వరాహ’ అవతారంతో భూమండలాన్ని ఉద్ధరించడం♪. మూడవ అవతారం నారదుడనే దేవర్షిగా జన్మించి, వైష్ణవ ధర్మాన్ని ప్రబోధించడం♪. నాలుగవ అవతారం నరనారాయణులుగా, ఐదవ అవతారం సాంఖ్యయోగ ద్రష్ట కపిల మహర్షిగా, ఆరో అవతారం అత్రి-అనసూయలకు దత్తాత్రేయునిగా జన్మించినట్లు ‘మహాభాగవతం’ చెబుతున్నది♪. దత్తాత్రేయుడు అలర్కుడు, ప్రహ్లాదుడు, విష్ణుదత్తుడు మొదలైనవారికి ఆత్మవిద్యను బోధించాడు.


             *_🪴శుభమస్తు🪴_*

🙏 సమస్త లోకాః సుఖినోభవంతు 🙏

కామెంట్‌లు లేవు: