*2114*
*కం*
వాడుక వీడిన వస్తువు
పాడగు రీతిన పుడమిన పనులకు తనువున్
వాడక పోవుట చేతనె
పాడగు రోగముల నొంది పదపడి సుజనా.
*భావం*:-- ఓ సుజనా! వాడు క లేని వస్తువు పాడైపోయే విధంగా నే పనులకు వాడని శరీరం కూడా రోగముల బారిన పడి పాడైపోతుంది.
*సందేశం*:-- ఈ కాలం మనుషులు చాలా పనులకు పనివారి నే వినియోగించుకునే అలవాటు పడి మెల్లమెల్లగా పనుల అలవాటు తగ్గి చిత్రవిచిత్రమైన రోగాల నొంది నిరంతరం బాధపడుతూ ఉన్నారు. పనులను స్వంతంగా చేసుకోవడం అలవాటు తప్పని వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి