4, డిసెంబర్ 2025, గురువారం

*శ్రీ పోతన భాగవత మధురిమలు*

  *శ్రీ పోతన భాగవత మధురిమలు* 


(2-207-క.)

శశ్వత్ప్రశాంతు నభయుని

విశ్వాత్ముఁ బ్రబోధమాత్రు విభు సంశుద్ధున్

శాశ్వతు సము సదసత్పరు

నీశ్వరుఁ జిత్తమున నిలుపు మెపుడు మునీంద్రా!


*భావము:-* నారదమునీశ్వర! ఎల్లవేళల మిక్కిలి శాంతుడై వుండేవాడు, భయరహితుడు, విశ్వమయుడు, కేవల జ్ఞానస్వరూపుడు, సర్వేశ్వరుడు, శుద్ధాత్ముడు, శాశ్వతుడు, సముడు, సత్తు అసత్తులకు అతీతుడు అయినట్టి పరమేశ్వరుణ్ణి సదా నీ హృదయంలో ప్రతిష్ఠించుకో.


జగద్గురు శ్రీ శంకరాచార్య కృత *'మోహ ముద్గరం'* తో శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం* 

ధర్మో రక్షతి రక్షితః

కామెంట్‌లు లేవు: