23, సెప్టెంబర్ 2025, మంగళవారం

ఏడువారాల నగల గురించి

 ఏడువారాల నగల గురించి సంపూర్ణ వివరణ -


 *  ఆదివారమునకు సూర్యుడు అధిపతి. అతని లోహము బంగారము , రత్నము మాణిక్యం. మాణిక్యమును శిరోభూషణములలో తప్పక పొదుగుదురు. తిరుపతి వేంకటేశ్వరునకు బొడ్డునందు మాణిక్యం ఉండును.

       

.  ఈనాడు రవ్వలు పొదగని శుద్ద స్వర్ణాభరణములు లేదా నిజమైన మాణిక్యములు దొరుకుట దుర్లభము కనుక లేత ఎరుపు గల రవ్వలు తాపడం చేసిన ఆభరణములు ధరింపవలెను.


 *  సోమవారమునకు చంద్రుడు అధిపతి. అతని లోహం వెండి , రత్నము ముత్యం కనుక సోమవారంనాడు చంద్రహారముతో పాటు ముత్యాలదండలు , శంఖం మరియు ముత్యపు చిప్పలతో చేసిన నగలు , వెండి తీగలతో అల్లిన తావళములు , వెండి దండ కడియములు , ముంజేతి కడియములు ధరించవలెను .

 

*  మంగళవారమునకు కుజుడు అధిపతి. అతని లోహం రాగి , రత్నము పగడము కనుక ఈనాడు పగడాల దండ , ముదురు ఎరుపురంగు గల రవ్వలు పొదిగిన తాటంకములు , పతకములు మెదలైనవి. రాగితీగలతో అల్లిన ఆభరణములు , రాగి కడియాలు ధరించవలెను .

 

*  బుధవారమునకు బుధుడు అధిపతి. అతని లోహము కంచు. రత్నము పచ్చ. పచ్చలలో ఆకుపచ్చ , చిలకపచ్చ అని రెండు రకములు కలవు. వానిలో దేనినైనా ధరించవచ్చు . పూర్వము పచ్చలదండలు ప్రసిద్ది. వెండిలేదా బంగారంతో వేపకాయ పూసలు చేయించుకుని వానిని పచ్చల నడుమ గ్రుచ్చుకొని ప్రతివారు ధరించేవారు.

              

. ఈనాడు కంచు పూసలు , కడియములు , ఉంగరములు లేదా పచ్చలు పొదిగిన పోగులు , పతకాలు , కడియాలు ధరించవచ్చు .


 *  గురువారమునకు బ్రహస్పతి అధిపతి. అతని లోహము ఇత్తడి , రత్నము పుష్యరాగం . గురువారం నాడు ఇత్తడి లేదా వన్నె తక్కువ బంగారంతో చేసిన కడియంలు , ఉంగరములు , పూసలు మొదలైన నగలు లేదా పుష్యరాగములు పొదిగిన ఆభరణములు ధరించవలెను .

 

*  శుక్రవారమునకు శుక్రుడు అధిపతి. ఇతని లోహం తగరం , రత్నం వజ్రం  . శుక్రవారం నాడు తగరముతో పూసలు , గజ్జెలు మొదలైనవి ధరించవలెను . వెండితో చేసినవి అయినను ధరించవచ్చు . ఆర్ధికంగా ఉన్నతస్థితిలో ఉన్నవారు వజ్రములు పొదిగిన ఆభరణములు ధరించవచ్చు .


 *  శనివారమునకు శనైచ్ఛరుడు అధిపతి. అతని లోహము ఇనుము , రత్నము నీలము . ఇనుమును ఆభరణాలకు ఉపయోగించరు కాని కొందరు కడియాల రూపములో ధరిస్తారు. నీలములలో రెండు రకములు కలవు. ఒకటి నీలం రెండొవది ఇంద్రనీలం . నీలము నలుపు రంగులో ఉండును. ఇంద్రనీలం బ్లూ రంగులో ఉండును. ఇందులో ఏదైనను ధరించవచ్చు . నీలాల ను చెవిపోగులలో , ముక్కెరలలో పొదుగుదురు .

          

.  స్త్రీలు ఆభరణములను ఈ విధముగా వారమును అనుసరించి గ్రహావివేకము కలిగి ఆయా లోహములతో చేసినవి గాని , ఆయా రత్నములు తాపడం చేసినవిగాని పుష్పములతో పాటు ధరించిన యెడల ఆయా గ్రహముల యొక్క క్రూరదృష్టి నుండి తొలగినవారై సుఖమును పొందుదురు.

                      

. గ్రహబలం చాలనప్పుడు ఆయా గ్రహములకు సంబంధించిన రత్నములను , లేదా జన్మరాశిని అనుసరించిన గ్రహములకు సంబంధించిన రత్నములను గాని ఉంగరము లేదా లాకెట్టుల యందు శాశ్వతముగా ధరించుట మంచిది . స్త్రీలకు ఎప్పుడైనను రంగురంగుల వస్త్రములు ఇష్టపడుచుందురు. కనుక వారు వారములను అనుసరించి ఆది , మంగళవారముల యందు ఎరుపు రంగు , సోమ , శుక్రవారముల యందు ఆకుపచ్చ రంగు , గురువారం నాడు పసుపురంగు , శనివారం నాడు నలుపు లేదా నీలపు రంగు గల చీరలను ధరించిన యెడల వారు ఆయా గ్రహములను ఆరాధించినట్టుగా అగును. ఆ రోజుల్లో చీర అంతయు ఆరంగు లేకున్నను దాని అంచు అయినను ఆ రంగు కలదిగా చూచుకొని ధరించుట మంచిది . అదేవిధముగా గృహము వాకిళ్ళలో కూడా వారమును అనుసరించి ఆయా రంగులతో ముగ్గులను వేయుచున్న ఆ గృహమునకు శోభ కలుగును.  


. సంపూర్ణం 



 మరింత విలువైన సమాచారం, సంపూర్ణ వివరణ మరియు అనేక రకాలైన వ్యాధులకు అతి సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 



గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?*

 *ఎవరీ..రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?*



బెంగుళూరు లోని ఓ ఇంటి ముందు

తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారి

శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు..కారులోంచి దిగారు.

లోపలికి వెళ్ళి చూస్తే..అంతా నిశ్శబ్దం.

మంచం మీద ఓ వృద్ధుడు నిస్తేజంగా

పడుకుని ఉన్నారు. చుట్టూ ఎవరెవరో వున్నారు.

ప్రసాద్ తాను వచ్చిన పని గురించి చెప్పారు.

అందులో ఓ వ్యక్తి ఆసక్తిగా ముందుకు వచ్చి..

నాన్నగారు వారం నుంచి కోమాలో వున్నారు,

అంటూ ప్రసాద్ గారిని మంచం దగ్గరకు

తీసుకుపోయి..ఆ వృద్ధుని చెవిలో

*నాన్నగారూ..నాన్నగారూ* అంటూ పిలిచాడు.

సమాధానం లేదు. ఈ సారి చెవి దగ్గరగా..

*మీ కోసం తిరుమల నుండి ప్రసాదం వచ్చింది*

అన్నాడు. అప్పుడు తెరుచుకున్నాయి..

ఆ వృద్ధుని కళ్ళు. అర్ధ నిమీలిత నేత్రాలతో

ఆయన ప్రసాద్ వంక, ఆయన చేతిలోని ప్రసాదం

వంక చూస్తున్నాడు. ప్రసాద్ వెళ్లి ఆయన మెడలో

శ్రీవారి డాలర్ హారం అలంకరించి, శాలువా కప్పి,

శ్రీవారి ప్రసాదాన్ని ఆయన చేతిలో ఉంచారు..


*మిమ్ము స్వామి వారి ఆస్థాన విద్వాంసునిగా*

*నియమిస్తున్నాము* అని నియామక పత్రాన్ని

ఆయనకు అందించారు. ఆ వృద్ధుని కళ్ళు

వాటి వంక చూశాయి..కళ్ళనుంచి

నీళ్లు కారుతున్నాయి.పెదాలు వణుకుతున్నాయి.

ఏవో మాటలు వినిపిస్తున్నాయి.

ఏదీ అర్ధం కావడం లేదు.

ఆఖరు మాట ఒక్కటే అందరికీ వినిపించింది..


*స్వామీ! ఇన్నాళ్లకు నా మీద దయకలిగిందా?*

అంటూ..తన చేతనున్న వాటిని తడుముకుంటూ..

అనిర్వచనీయ అనుభూతిని అనుభవిస్తూన్నాడు.

స్వామి వారి కరుణ లభించింది.ఇక తన

జీవితానికి విముక్తి లభించిందన్నట్లు మరో

పది నిముషాల తరువాత....

*రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి ప్రాణాలు*

*అనంత వాయువుల్లో కలిసిపోయాయి!*

*అందరికీ అదో అద్భుతం,అనిర్వచనీయం!*


*ఎవరీ...రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ?*


శ్రీనివాసునిపై అన్నమయ్య రాసిన కీర్తనలు

30 వేలకు పైగా ఉన్నాయి. అప్పటి పాలకులు

అన్నమయ్య కీర్తనలను తాళపత్రాలపై

చెక్కించారు. వాటిని స్వామి వారి ఆలయంలో

నిక్షిప్తం చేశారు. 20 శతాబ్దంలో ఆలయ

నిర్వహణప్పుడు..ఇవి బయటపడ్డాయి.

ఆ తాళపత్రాలను గ్రంధ రూపంలోకి తెచ్చి,..

"జో అచ్యుతానంద..జోజో ముకుందా"

అని మనం పాడుకోగలుగుతున్నామంటే..

ఆ కృషికి కారకులు.. *వేటూరి ప్రభాకర శాస్త్రి* 

*రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు!*


ఓ రోజు సంగీత సమావేశం ముగిశాక..

అన్నమాచార్య ప్రాజెక్ స్పెషల్ ఆఫీసర్

కామిశెట్టి శ్రీనివాసులు..ప్రసాద్ గారితో..

*సర్! రేపు మీరు బెంగుళూరు వెళుతున్నారు.*

*రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ గారు ప్రస్తుతం*

*అక్కడే ఉన్నారు. అన్నమయ్య కీర్తనలను*

*జనబాహుళ్యంలోకి తీసుకు రావడానికి*

*ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన*

*సమకాలికులకు అన్ని గుర్తింపులు లభించాయి.*

*కానీ రాళ్లపల్లి వారికి మాత్రం అన్యాయం జరిగింది.*

*ఆయనను మీరు కలిస్తే బాగుంటుంది!* అన్నారు.


పివిఆర్కే ప్రసాద్ చాలా సేపు ఆలోచించి

ఓ నిర్ణయానికి వచ్చారు. డిప్యూటీ ఈ.ఓ.ని పిలిచి..

*ఉదయానికల్లా..రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని*

*ఆస్థాన విద్వాంసునిగా నియామక పత్రం,*

*శ్రీవారి గోల్డ్ డాలర్,శాలువా, ప్రసాదం*

*అక్షింతలు వగైరా సిద్ధం చేయండి అన్నారు!*

డెప్యూటీ ఈ.ఓ.అవాక్కయ్యాడు.

*సర్! అలా నియమించే అధికారం మీ పరిధిలోనిది కాదు.బోర్డు ఓ కమిటీని* *నియమించి, ఆ కమిటీ ఎంపిక చేసిన వారిని మాత్రమే*

*బోర్డు నియమిస్తుంది. రూల్స్ కు విరుద్ధంగా అలా చేస్తే మీ మీద ఏ చర్యలైనా తీసుకునే అధికారం బోర్డుకు ఉంటుంది. అవసరమైతే*

*మిమ్ము ప్రభుత్వానికి సరెండర్ చేయొచ్చు*

అన్నాడు..


అయినా ప్రసాద్ గారు వినలేదు.

*వెంటనే నేను చెప్పినట్లు చేయండి!* అన్నారు!

అలాగే అన్నీ సిద్ధం అయిపోయాయి.

అవి తీసుకుని బెంగుళూరు బయలుదేరారు

పివిఆర్కే ప్రసాద్ గారు. బెంగుళూరులో ఆఖరు

క్షణాలలో..వాటిని రాళ్లపల్లి వారికి సమర్పించడం.

దాని కోసమే ఆయన ఎదురుచూస్తున్నట్లుగా..

ఆ శుభ సందేశం అందుకోగానే ఆయన

స్వర్గస్థులవడం జరిగిపోయాయి!


టిటిడి బోర్డు మీటింగ్ హాలు..వాతావరణం

సీరియస్ గా వుంది. జరిగిందంతా చెప్పి

ప్రసాద్ గారు నిశ్శబ్దంగా కూర్చున్నారు.

*ప్రసాద్ గారూ - మీరు చేసినది చాలా పెద్ద తప్పిదం. రూల్స్ కు విరుద్ధం* అన్నాడో సభ్యుడు.

*మీ మనసుకు ఏది తోస్తే అది చేసెయ్యడానికి ఇక బోర్డు ఎందుకు?* అన్నారు మరొకరు.

ఎవరికి తోచింది వారు మాట్లాడారు. చివరిలో

అందరూ చైర్మన్ నాగిరెడ్డిగారి వంక చూశారు.

ఆయన చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వారు!

*స్వామి వారికి బోర్డు చైర్మన్ నుండి..సాధారణ యాత్రికుడి వరకూ అందరూ *సమానం. ఆయన సమస్త జీవరాసులను సమానంగా ప్రేమిస్తాడు.*

*ఎవరిని ఎప్పుడు, ఎక్కడ ఆదుకోవాలో అప్పుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడు. ఆయన లీలలు అలా ఉంటాయి. రాళ్లపల్లి వారిని*

*జీవన చరమాంకంలో సంతోష పెట్టేందుకే ప్రసాద్*

*గారిని అలా తరుముతున్నట్లు బెంగుళూరు*

*పంపించాడేమో? అని నేను భావిస్తున్నాను.*


*ఈ రూల్సు అన్నీ ప్రసాద్ గారికి తెలియనివి కావు.*

*రాళ్లపల్లివారికి ఎప్పుడో జరగవలసిన సత్కారం*

*అప్పుడు జరగలేదు.ఇప్పుడు మనకు భగవంతుడు*

*కల్పించిన అవకాశంగా నేను భావిస్తున్నాను!*

*ప్రసాద్ గారి చర్యకు ఆమోదం తెలుపుతున్నాను!*

అన్నాడు. అంతా నిశ్శబ్దం. నాగిరెడ్డిగారి

తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.


ఎన్నో చిత్రాలలో..కథలను మలుపులు తిప్పి,

ఉత్కంఠ రేకెత్తించి, ముగింపులో ఓ సందేశంతో

ప్రేక్షకులను ఇంటికి పంపే విజయాధినేత

నాగిరెడ్డిగారు..ఈ సమస్యకు ఒక్క చిరునవ్వుతో

ముగించిన ఆయన స్థితప్రజ్ఞతకు మనసులోనే

కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ప్రసాద్ గారు!


*(నాహం కర్తా హరిః కర్తా నుంచీ...వేంకటేశ్వరార్పణమ్)*

కావమ్మ మొగుడు

 *_“కావమ్మ మొగుడు.. అంటే కామోసు అనుకున్నాను... 😁😁😁”_*

_(భలే సరదాగా ఉంటుంది.. చదవండి)_

*=================*


*దివంగత కొణిజేటి రోశయ్య శాసనసభలో గాని, మండలిలోగాని ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్న తనదైన హాస్యం జత చేసేవారు. ఒకసారి మండలిలో CM NTR ‌ గురించి మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తే నాకు కావమ్మ మొగుడు కథ గుర్తుకొస్తుంది అన్నారు. ఎన్‌టిఆర్‌ స్పందిస్తూ నాకు కథలంటే చాలా ఇష్టం చెప్పండి అన్నారు. రోశయ్య చెప్పిన కథ సంక్షిప్తంగా ఇదీ:*


*ఒక ఊళ్ళో వైశ్య దంపతులు తమ కూతురుకు 8 ఏళ్ళు రాగానే వివాహం చేసారు. తరువాత అల్లుడు వచ్చి మీ అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళటానికి 2-3 ఏళ్ళు పడుతుంది, నేను దేశాటనచేసి వ్యాపారంలో డబ్బు, అనుభవం సంపాదించుకొని వస్తానన్నాడు. అత్తమామలు సంతోషంగా సరేనన్నారు. రెండేళ్ళు నాలుగేళ్ళయినా అల్లుడి రాలేదు. అత్తమామలు ఆందోళన చెందారు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం అమ్మలక్కలు మంచినీళ్ళ కోసం బావి దగ్గరకెళ్ళారు. అక్కడ ఒక యువకుడు కాషాయ బట్టలు కట్టుకొని కనిపించాడు. అతనిని చూసి ఒక స్త్రీ కావమ్మ మొగుడులా ఉన్నాడంటే మిగిలిన వారు కూడా అవునని వెంటనే కావమ్మ తల్లిదండ్రులకు కబురు పంపించారు. వారు పరుగున వచ్చి, ఇంటికి తీసుకెళ్ళారు. స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి విందు భోజనంపెట్టి అమ్మాయితో శోభనం జరిపించారు. నెలరోజులు గడిచిన తరువాత అసలు భర్త వచ్చాడు. కంగుతిని ఎందుకు ఇలా చేశారని నిలదీశాడు. అత్తగారు వెళ్ళి ఆ దొంగవాడిని అదే మాట అడిగింది. అందుకు అతడు కావమ్మ మొగుడంటే కామోసు అనుకున్నాను. కాదంటే నా కాషాయ బట్టలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అన్నాడు.*


*రోశయ్య చెప్పిన కథ విని ఎన్‌టిఆర్‌ తో సహ సభ్యులందరూ నవ్వారు. తరువాత ఎన్‌టిఆర్‌ తేరుకుని నాకూ కావమ్మ మొగుడికీ సంబంధం ఏమిటి? అనడిగారు.*


*మీరు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు. సినిమాల్లో డబ్బు, కీర్తి అర్జించారు. 60 ఏళ్ళు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు. నటనలో ఉన్న అనుభవం పరిపాలనలో లేనందున అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి నెగిటివ్‌ గ్రోత్‌ రికార్డు అయ్యింది. ధరలు పెరుగుతున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి తగ్గింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితం ప్రజలపై పడటానికి సంవత్సరం పడుతుంది. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు– నాకేం తెలుసు మీరంతా ముఖ్యమంత్రి అంటే కామోసు అనుకున్నాను. కాదంటే చెప్పండి మళ్ళీ సినిమాల్లోకి పోతానంటారు... అని ముక్తాయించారు రోశయ్య.*


*ఎవరినైనా బోల్తా కొట్టించగల నేర్పరితనం రోశయ్యకు ఉంది.*


*పి.వి. నరసింహారావు, రోశయ్య నంద్యాలలో ఒక సభలో ప్రసంగించారు. సభానంతరం వెళ్ళుతున్నప్పుడు నరసింహారావు... ఏమయ్యా రోశయ్య! జనం నీప్రసంగం చప్పట్లు, ఈలలు వేస్తూ విన్నారు. కానీ నేను ప్రసంగిస్తుంటే స్తబ్ధుగా ఉండిపోయారు. ఏమిటి కారణం?. దీనికి రోశయ్య బదులిస్తూ... అయ్యా, మీ ప్రసంగం ఎంఎస్‌ సుబ్బలక్ష్మి పాట కచేరీలా ఉంటుంది. మరి నా ప్రసంగం ఎల్‌ఆర్‌ ఈశ్వరి పాటలాగా ఉంటుంది అని చెప్పి పీవీని నవ్వించారు.*


*అది ఆయన విలక్షణ వ్యక్తిత్వం.🤝*

*_{ఇదిసేకరణే : --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*