17, జూన్ 2023, శనివారం

ఊరగాయ ముక్క.

 ఊరగాయ ముక్క.

                

 #గురుకుల్ ఘోరండాకు చెందిన ఆచార్య ఒక్కరు జనసంఘ (పూర్వ బీజేపీ) టికెట్‌పై ఎంపీ అయ్యాడు,  అతను ప్రభుత్వ వసతి తీసుకోలేదు. ఢిల్లీ మార్కెట్‌లోని ఢీల్లీ -6 లోని సీతారామ్‌కు చెందిన ఆర్య సమాజ్ మందిరంలో నివసించారు. అక్కడ నుండి పార్లమెంటుకు నడచి వెళ్ళేవారు. తన జీతం మొత్తాన్ని రక్షణ శాఖకు విరాళంగా ఇచ్చారు.


ప్రతి ప్రశ్న జవాబు చెప్పడానికి ముందు పార్లమెంటులో #వేదమంత్రాన్ని పఠించే మొదటి ఎంపీ ఆయనే మాత్రమే. ఆ వేద మంత్రాలన్నీ పార్లమెంటు కార్యకలాపాల రికార్డులో చూడవచ్చు.  గోవు వధను ఆపాలని ఆయన ఒకసారి పార్లమెంటుకు ఘెరావ్ చేశారు.


ఒకసారి ఇందిరా జి ఆ స్వామి జిని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు ఒక సమావేశంలో పిలిచారు. అక్కడ భోజనం ప్రారంభించినప్పుడు, అందరూ బఫే కౌంటర్ వైపు నడవడం ప్రారంభించారు. స్వామి అక్కడికి వెళ్ళలేదు. అతను తన జేబులో నుండి రెండు  ఎండు రోటీలను తీసి బఫే కౌంటర్ నుండి నేల మీద కూర్చోవడం ప్రారంభించాడు.


ఇందిరా జి - "మీరు ఏమి చేస్తున్నారు మీకు ఇక్కడ ఆహారం రాలేదా? ఈ ఫైవ్ స్టార్ ఏర్పాట్లన్నీ ఎంపీల కోసం మాత్రమే చేయబడ్డాయి. మీరు ఇవి సేవించ కుండా ఇలాంటి ఆహారం తీసుకుంటున్నారు ..


దానికి అతను ఇలా అన్నాడు - "నేను సన్యాసిని  ఎవరో ఈ రోటీలను ఉదయం భిక్షలో ఇచ్చారు. ప్రభుత్వ డబ్బుతో రొట్టె ఎలా తినగలను."


ఇందిర కు కృతజ్ఞతలు తెలుపుతూ, హోటల్‌లోని  నుండి ఒక గ్లాసు నీరు మరియు మామిడి ఊరగాయ ముక్కను తీసుకున్నాడు. ఇందిరా జి నిరాకరించినప్పటికీ తాను తీసుకున్న వాటికి కూడా డబ్బు చెల్లించాడు!


ఈ గొప్ప పార్లమెంటు సభ్యుడు మరియు సన్యాసిని ఎవరో మీకు తెలుసా?


ఇది సన్యాసి స్వామి రామేశ్వరానంద్ జీ. హార్డ్కోర్ ఆర్య సమాజ్. గోవు అంటే ప్రాణం గోప్ప గోమాత  భక్తుడు. ప్రత్యేక వ్యక్తిత్వానికి కలవాడు..


స్వామీజీ హర్యానాలోని కర్నాల్ నుండి ఎంపి గా ఎన్నికయ్యారు..


ఇలాంటి గొప్ప వాళ్ళు భారతదేశంలో చాలా మంది ఉన్నారు, కాని మేము నెహ్రూ-గాంధీ తప్ప ఇలాంటి వారిని చూడలేకపోయాము. బహుశా మాకు ఎవరు కూడా బోధించబడలేదు.

మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే, అలాంటి వ్యక్తిత్వాలను కూడా మీరు తెలుసుకోవాలి.


ఇలాంటి యోగులు,మునులు నడిచిన దేశం నాది ...గొప్ప బిడ్డలను కన్నది నా తల్లి భారత మాత ....

మన దేశంలో ఇటువంటి మహాత్ములకు కొదవ లేదు

ఇటువంటి మహాత్ములను ఎన్నుకోండి

మనకోసం ప్రాణములు సైతం లెక్క చేయక మనలను మన ధర్మాన్ని రక్షిస్తారు


  నా భారతదేశం గొప్పది.


#వందేమాతరం 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🚩

#భారత్_మాతాకీ_జై_జై_హింద్. 🇮🇳 🚩

మండు వేసవి*

 *అహో! మండు వేసవి*


ఉ.

వేసవి దీర్ఘమయ్యె వినువీధుల చండపరాక్రమమ్ముతో 

దూసిన కాంతిఖడ్గమున దూకుడు జూపుచు భాస్కరుండు తా 

మీసము ద్రిప్పగా నడలు మేదిని యెల్లను తల్లడిల్లగా

నూసుల నుస్సురస్సురను నూర్పులె క్రాలెను మానవాళికిన్ 1


చ.

పవళులు దీర్ఘమయ్యె నిశిభామలు సన్నవడెన్ మహోష్ణతన్ 

ధవళత సూర్యతేజమున దర్పము జూపుచు హుంకరించగా 

సవతులు కాంతి యుష్ణములు సఖ్యత గూడక పోరుసల్పుచున్ 

నవనవలాడు భూసతిని నాశము జేయుచు వేధసేసెడిన్ 2


ఉ.

వేసవితాపమున్ వడలి పీడితుడైన నిశాచరుండు తా 

దూషిత తేజుడై నిలువ తోరపువెన్నెల లుప్తమైసనన్ 

ఊసుల డోలలూగెడి నవోఢల మోముల కల్వదేనెలన్ 

ప్రాశన జేయు భర్తృమధుపమ్ములు జిక్కెను మోడ్చుబూవులన్ 3


ఉ.

జాజులు మల్లెలున్ విరిసి సందడి జేయగ నింతికొప్పులన్ 

మోజులు మొల్కలెత్తినను మోహముతో దరిజేర రారుగా 

రాజసమొల్కు భర్తలు విరాగులవోలె దహించు వేడిమిన్ 

తేజము వీడు వీరులయి దీనవిలోకనపూరనేత్రులై 4


ఉ.

వేసవి సాగదీయబడి వృష్టినొసంగెడి కాలమాగెనో...

వేసవి వేడిమెక్కువయి వృష్టినొసంగెడి నీర మింకెనో...

వేసవిగాడ్పులుల్లముల భీతిజనింపగ ధాటి జూపెనో...

వేసవి పేరు జెప్పగనె భీతివడంకెను భూతజాలముల్ 5


చ.

శిశిరమునందు రాలు ఛదశీకరబృందమువోలె రాలుచున్ 

విసవిస పోవుచున్నయవి వేసవి వేడికి ప్రాణికోటులున్ 

పశుపతి యుగ్రుడై నిలువ భాసిలు నేత్రము పోల్కి సూర్యుడున్ 

శషభిష జేయుచుండె భువిసత్తను మృగ్యము జేయజూడగన్ 6

(సత్త=ఉనికి;  ఈ పద్యములో *శషసప్రాస* గ్రహించబడినది)


కం.

ఎక్కడ ఋతుపవనమ్ముల

వెక్కడ దాగెనొ కదలక హృదయము మండన్ 

దిక్కులు మొయిలులు క్రమ్మగ 

నిక్కక రాగదె కురియగ నీరము భువిపై 7


కం.

కప్పలు బెకబెకలాడగ 

చప్పున వర్షమ్ము కురియ సాగుమ మొయిలీ! 

ఇప్పటికిప్పుడు వేసవి 

గొప్పను వీడుచు దొలగగ కూర్మిని రావే! 8

*శ్రీశర్మద* 

8333844664


గ్రీష్మభయంకరాకృతిని

ఊష్మప్రవృధ్ధని ఓర్వనిప్రజన్

భీష్మసమగ్రదాహబహు

శూష్మతరాకృతియొప్పెపద్యముల్!!🙏🙏

నడక ప్రదక్షిణం

 2.


                * నడక ప్రదక్షిణం*

                   ➖➖➖✍️


```పరమాచార్య స్వామివారి దర్శనానికి ఊబకాయంతో బాధపడుతున్న మహిళ ఒకరు వచ్చారు. ఆమె మహాస్వామివారికి నమస్కారం కూడా చెయ్యలేకపోతోంది. 

భక్తితో చేతులు కట్టుకుని నిలబడి 

ఇబ్బందిగా చూస్తోంది.


“నాకు మధుమేహం ఉంది. వైద్యులు నేను బరువు తగ్గాలని తెలిపారు. అందుకు రోజూ ఒక గంట సేపు నడవాలని సూచించారు. కాని నేను సరిగ్గా పది నిముషాలు కూడా నడవలేను.” అని స్వామివారికి విన్నవించుకుంది. “స్వామివారే నాకు ఏదైనా సులభమైన మార్గం చూపాలి.” అని ప్రార్థించింది.


“ఈ వైద్యులందరూ ఇంతే,   వైద్యశాస్త్ర పుస్తకాలలో వ్రాసినదాన్నే చెబుతూ ఉంటారు. దాని సాధ్యాసాధ్య విషయంపై ఏమాత్రం ఆలోచించరు.” అని అన్నారు స్వామివారు.


స్వామివారు ఏదో సులువైన ఉపాయం చెప్పబోతున్నారని ఆ భక్తురాలి మొహం వెలిగిపోయింది. కళ్ళల్లో ఆశ కనబడుతోంది.


“ఎటువంటి అనారోగ్య బాధలు లేకుండా ఆరోగ్యం బాగుండాలి అంటే, భగవంతుని అనుగ్రహం ఉండాలి . . .” ఏమి చెబుతారా అని ఆవిడ గుండె వేగం పెరిగింది.


“మీ ఇంటి దగ్గర ఏదైనా ఆలయం ఉందా?”


“ఉంది పెరియవా, పెద్ద శివాలయం ఒకటి ఉంది”


“మంచిది! ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం ఆరు ‘ప్రదక్షిణలు’ చెయ్యి. అలాగే రోజూ చీపురుతో ఒక వంద అడుగుల స్థలాన్ని శుభ్రం చెయ్యి”.


ఆమె చాలా ఆనందపడి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయింది. పక్కనే ఉన్న సహాయకుడు నవ్వును ఆపుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.


స్వామివారు చూసి, “నేను ఏమైనా తప్పు చెప్పానా?” అని అడిగారు.


“లేదు పెరియవా! వైద్యులు నడవమన్నారు, పరమాచార్యులు ప్రదక్షిణం చెయ్యమన్నారు” అని సమాధానం ఇచ్చాడు.


“ఓహ్! అంటే మేము ఇద్దరమూ ఇచ్చిన సూచన ‘అద్వైతం’, పేర్లు మాత్రమే ‘ద్వైతం’ అంటావు. అంతేనా?”9440652774.✍️```


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



వాల్మీకి రామాయణం:

 🍀32.

రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది...


            వాల్మీకి రామాయణం:

                  32 వ  భాగం:

                   ➖➖➖✍️


అప్పుడు దశరథుడు " కైకా! ఆమె జనకుని కూతురు, నాకు కోడలిగా వచ్చింది.    సీతమ్మని అరణ్యాలకి పంపమని నేను నీకు ఎన్నడూ వరం ఇవ్వలేదు. పతిని అనుగమించి ఆమె తన పాతివ్రత్యాన్ని చాటుకుంది" అని, తన కోశాధికారిని పిలిచి, 14 సంవత్సరాల పాటు సీతమ్మ కట్టుకున్న చీర కట్టకుండా ఉండడానికి ఎన్ని చీరలు కావాలో, అన్ని చీరలు తెప్పించాడు, అలాగే సీతమ్మ రోజూ పెట్టుకోడానికి నగలూ, రత్నములతో కూడిన ఆభరణములని తీసుకొచ్చి సీతమ్మకి ఇమ్మన్నాడు దశరథుడు.


“రామా! సీతమ్మకి ఆ నారచీర కట్టమాకు, ఆమె పట్టుచీర తోనే వస్తుంద”ని వశిష్ఠుడు అన్నాడు.


తరువాత వాళ్ళు దశరథుడికి, కౌసల్యకి నమస్కారములు చేసి వెళ్ళిపోతుండగా, "రామా" అని పిలిచి, మళ్ళి ఆ దశరథ మహారాజు మూర్చపోయాడు. 


కొంతసేపటికి దశరథుడు తేరుకొని 

"సుమంత్రా! రాజ్య సరిహద్దులు దాటే వరకు రాముడిని రథం మీద తీసుకువెళ్ళు" అని అన్నాడు. 

తరువాత కోశాధికారిని పిలిచి సీతమ్మ కట్టుకునే చీరలని, ఆభరణాలని రథంలో పెట్టమన్నాడు.


అప్పుడు కౌసల్య సీతమ్మని కౌగలించుకొని ఇలా అంది…   "అమ్మా సీతా, నీకు తెలియనటువంటివి కావు, అత్తగారిని కనుక ఆర్తితో చెప్తున్నాను. ఇవ్వాళ రాముడు యువరాజ పట్టాభిషేకం పొందవలసినవాడు, కాని నారచీర కట్టుకొని అరణ్యవాసానికి వెళుతున్నాడు. ఇలాంటి స్థితిని పొందాడు కదా అని రాముడిని తక్కువగా చూడమాకు. అలాగే కుల స్త్రీకి స్వర్గం కన్నా, ధనం కన్నా, ధాన్యం కన్నా పరమోత్కృష్టమైనవాడు భర్త ఒక్కడే."


అప్పుడు సీతమ్మ… "మీరు చెప్పిన విషయాలన్నీ నేను పుట్టింట్లో తెలుసుకునే   అత్తవారింటికి వచ్చాను. నేను మీ అబ్బాయిని ఎన్నడూ కష్టపెట్టను. అరణ్యవాస క్లేశం తెలియకుండా, ఆయనని ఆదమరపింపచేసి, ఆనందింపచేయడానికే నేను వారితో వెళుతున్నాను.


న అతంత్రీ వాద్యతే వీణా న అచక్రః వర్తతే రథః |

న అపతిః సుఖం ఏధతే యా స్యాత్ అపి శత ఆత్మజా ||


వీణో ఉండే తీగలు లేకపోతే అసలు వీణే లేదు, చక్రం లేకపోతే అసలు రథమే లేదు, నూరుగురు కుమారులు ఇచ్చే సుఖం కన్నా, భార్య భర్త దగ్గర పొందే సుఖం ముందు ఈ సుఖాలు సరిపోవు" అన్నది.


తరువాత లక్ష్మణుడు సుమిత్రకి ప్రదక్షిణ చేసి నమస్కారం చెయ్యగా, ఆవిడ ఇలా అంది… "నువ్వు అరణ్యవాసానికే జన్మించావు లక్ష్మణా, రాముడిని ప్రేమించేవాళ్ళు ఇంత మంది ఉన్నా, తమ తమ సంసారాలని వదిలి ఎవరూ రాలేదు. రాముడి కైంకర్యం చేసుకునే అదృష్టం నీకే దక్కింది. నువ్వు ఏమరపాటు లేకుండా సర్వకాలములయందు సీతారాములని రక్షిస్తూ ఉండు.


రామం దశరథం విద్ధి మాం విద్ధి జనక ఆత్మజాం |

అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం ||


లక్ష్మణా! నువ్వు రాముడిని నీ తండ్రి అనుకో, సీతమ్మని నీ తల్లి అనుకో, వాళ్ళిద్దరూ ఉన్న అడవి అయోధ్య అనుకొని సుఖంగా వెళ్ళిపో!" అంది.


రాముడు సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి ఆ రథాన్ని ఎక్కాడు. రాముడు వెళ్ళిపోతున్నాడని ఆ అయోధ్యా నగర వాసులందరూ ఏడుస్తున్నారు. యజ్ఞాలు చేస్తున్న వాళ్ళు ఆ యజ్ఞాన్ని మధ్యలోనే ఆపి వచ్చేసారు. ఆడవారు, పిలలు, వృద్ధులు 

'రామా! రామా!' అంటూ అరుస్తూ బాధపడుతున్నారు. ఏడుస్తున్న తమ పిల్లలకి పక్షులు ఆహారం తేవడం మరిచి, తమ గూళ్ళల్లో కన్నుల నీరు కారుస్తూ నిలబడ్డాయి. అశ్వశాలలోని గుర్రాలు, గజశాలలోని ఏనుగులు కన్నులెమ్మట వేడి నీరు కారుతుండగా, సకిలిస్తూ, గర్జన చేస్తూ అటూ ఇటూ ఉన్మాదంతో తిరిగాయి. సమస్త భూతములు ఒకరకమైన సంక్షోభానికి గురయ్యాయి. అలా ఆ రథం వెళుతుండగా, వెనకనుంచి కౌసల్యా దేవి గాలిలోకి చేతులూపుతూ, పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ, తన పవిటకొంగు జారిపోయినా పట్టించుకోకుండా, ఆమెని ఆపుదామని వచ్చిన వారిని తోసేస్తూ, ఆ రథం వెనుక పరుగుతీసింది. మరొకపక్క దశరథుడు ‘ఆగు ఆగు’ అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన తల్లిదండ్రులని అలా చూడలేక, రథం నడుపుతున్న సుమంత్రుడిని రాముడు తొందరగా నడపమన్నాడు.


"నేను చక్రవర్తిని ఆజ్ఞాపిస్తున్నాను, సుమంత్రా ఆపు, ఆ రథం నడపకు" అన్నాడు దశరథుడు. 


రెండు చక్రముల మధ్యలో పడ్డ ప్రాణి పరిస్తితి ఎలా ఉంటుందో, సుమంత్రుడి పరిస్తితి కూడా అలానే ఉంది.


అప్పుడు రాముడు… “సుమంత్రా! రేపు పొద్దున్న నువ్వు తిరిగొచ్చాక, రథం ఎందుకు ఆపలేదని దశరథుడు అడిగితే, నాకు చక్రాల సవ్వడిలో మీ మాటలు వినపడలేదని చెప్పు. కావున రథాన్ని కదుపు" అన్నాడు. అలా ఆ రథం ముందుకి సాగిపోయింది.


“మనమందరమూ రాముడి వెనకాలే వెళదాము, ఆయనతోనే ఉందాము, మనతోపాటు పిల్లలని, వృద్ధులని, మన ఆవులనీ తీసుకొని వెళదాము. మనమందరమూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వచ్చేస్తాడు, అలాగే ఆయన పత్నులు కూడా వస్తారు, తరువాత చతురంగ బలాలు కూడా వస్తాయి. మనమందరమూ అడవులకి వెళితే, అడవి అయోధ్య అవుతుంది. మనందరినీ చూసి బెదిరిన జంతువులు అయోధ్యకి వస్తాయి. అప్పుడు కైకమ్మ తన కుమారుడితో ఈ క్రూరమృగాలని పరిపాలించుకుంటుంది” అని అందరూ రాముడి వెంట బయలుదేరారు. 


కాని, రాముడి రథం యొక్క వేగాన్ని అందుకోలేక చాలా మంది వెనుదిరిగారు. తన వెనుక వృద్ధులైన బ్రాహ్మణులు పరుగులు తీస్తూ వస్తున్నారని తెలుసుకొని, రాముడు ఆ రథం నుండి దిగి, వాళ్ళతోపాటు నడవడం ప్రారంభించాడు. అలా అందరూ వెళుతూ వెళుతూ తమసా నదీతీరాన్ని చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. అందరూ అంత దూరం నడిచి రావడం వల్ల ఆదమరిచి నిద్రపోయారు.


రాముడు వెళ్ళినతరువాత స్పృహకోల్పోయిన దశరథుడు మెల్లగా తేరుకున్నాడు. సేవకులని పిలిచి తనని కౌసల్యా మందిరానికి తీసుకెళ్ళమన్నాడు. “సకల గుణములు కలిగిన కౌసల్య ఉండగా కామ మొహంతో కైకేయిని తెచ్చుకున్నాను, ఇవ్వాళ ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాను” అని ఏడ్చి ఏడ్చి ఏడిచేసరికి ఆయన కన్నులు కనపడడం మానేసాయి. అప్పుడాయన కౌసల్యతో ఇలా అన్నాడు "ఇక నేను ఎంతో సేపు బతకను, నేను చనిపోయేలోపల రాముడు ఎలాగు నన్ను ముట్టుకోలేడు, రాముడితో పాటే నా చూపు వెళ్ళిపోయింది, అందుకని రాముడి తల్లివైన నువ్వు నన్ను ఒకసారి ముట్టుకో, నువ్వు ముట్టుకుంటే రాముడు ముట్టుకున్నట్టు ఉంటుందేమో, ఒకసారి నన్ను ముట్టుకోవా కౌసల్యా" అన్నాడు.


"అవునులే, కన్న కొడుకుని అరణ్యాలకి పంపించావు, ఇవ్వాళ నన్ను ఇలాంటి దౌర్భాగ్యస్థితిలో పడేశావు, నీ వల్ల దేశం అంతా బాధపడుతోంది, ఇప్పటికైనా నీకు సంతోషంగా ఉందా రాజా" అని కౌసల్య అంది.


అప్పుడు దశరథుడు “పడిపోయిన గుర్రాన్ని ఎందుకు పొడుస్తావు కౌసల్య, నీ దగ్గర ఉపశాంతి పొందుదామని వచ్చాను. నువ్వు కూడా ఇంత మాట అన్నావా కౌసల్యా" అని మళ్ళి మూర్చపోయాడు.


అటుపక్క తెల్లవారుతుండగా రాముడు సుమంత్రుడిని పిలిచి 

"వీళ్ళందరూ వృద్ధులైన బ్రాహ్మణులు, నా మీద ఉన్న ప్రేమతో నా వెనకాల వచ్చారు. వీళ్ళు నాతో 14 సంవత్సరాలు వస్తే బాధ పడతారు. అందుచేత నేను కనపడకపోతే వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉండగానే మనం వెళ్లిపోవాలి. కాని, వీళ్ళు వెనక్కి వెళ్ళకుండా, రాముడు ఎటు వెళ్ళాడో గుర్తుపడదామని రథ చక్రాల వెనక వస్తారు. అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కుకి పోనివ్వు, ఉత్తర దిక్కున అయోధ్య ఉంది, అలా కొంతదూరం పోనిచ్చాక, రథాన్ని వెనక్కి తిప్పి గడ్డిమీద, పొదల మీద నుంచి పోనిచ్చి తమసా నదిని దాటించు. అప్పుడు వాళ్ళకి ఆ రథచక్రాల గుర్తులు కనపడకపోయేసరికి వాళ్ళందరూ అయోధ్యకి వెళతారు" అన్నాడు.


అలా తెల్లవారగానే నిశబ్దంగా ఉత్తర దిక్కుకి రథాన్ని పోనిచ్చి, మళ్ళి అదే గాడిలో వెనక్కి వచ్చి, తమసా నదిని దాటి ఆవలి వడ్డుకి చేరుకున్నారు. తెలవారగానే బ్రాహ్మణులందరూ నిద్ర లేచి "ఏడి రాముడు ఏడి రాముడు" అని, రాముడి రథచక్రాల గాడిని బట్టి వెళదామని అందరూ బయలుదేరారు. కొంతదూరం వెళ్ళాక రథ చక్రాలు ఆగిపోయాయి. ఇంక చేసేది ఏమి లేక బాధపడుతూ అయోధ్యకి వెళ్ళారు. 


రాముడు వెళ్లిపోయాడని ఆ అయోధ్యా పట్టణంలో అన్నం వండుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. ఏ ఇంటిముందు కూడా కళ్ళాపి జల్లలేదు. ఎవరూ ముగ్గు పెట్టలేదు. ఆ రాజ్యంలోని ఏ ఒక్క ప్రాణి కూడా ఆనందంగా లేదు. ఆ రాజ్యంలో సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి కైకేయి.


రాముడు ఆ తమసా నదిని దాటాక, ఒక్కొక్కరోజు వేదశృతి, గోమతి మొదలైన నగరాలని దాటి, కోసలరాజ్య సరిహద్దుకి చేరుకున్నారు. అక్కడికి వచ్చాక ఆ రథం దిగి అయోధ్యా నగరానికి ఒకసారి నమస్కారం చేసి ఇలా అన్నాడు....


ఆపృచ్ఛే త్వాం పురీశ్రేష్ఠే కాకుత్స్థపరిపాలితే |

దైవతాని చ యాని త్వాం పాలయంత్యావసంతి చ ||


ఓ అయోధ్యా! పూర్వం మా కాకుత్స వంశంలోని ఎందరో రాజులు నిన్ను పరిపాలించారు. ఇటువంటి అయోధ్యా నగరాన్ని విడిచి, ధర్మానికి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యాలకి వెళుతున్నాను. తిరిగి నేను ఈ అయోధ్య నగరంలో ప్రవేశించి, మా తల్లిదండ్రుల పాదములకు నమస్కరించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు" అని వేడుకున్నాడు.


తరువాత వాళ్ళు ఆ కోసల దేశ సరిహద్దుల్ని దాటి గంగా నదీ తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఒకఇంగుదీ(గార) వృక్షం యొక్క నీడలో అందరూ కూర్చున్నారు.


తత్ర రాజా గుహో నామ రామస్య ఆత్మ సమః సఖా |

నిషాద జాత్యో బలవాన్ స్థపతిః చ ఇతి విశ్రుతః ||


రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకొని ఆ ప్రాంతంలో(ఆ ప్రాంతాన్ని శృంగిబేరపురము అని పిలుస్తారు, ఆ ప్రాంతానికి నిషాదుడైన గుహుడు అధిపతి) ఉంటున్న, రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితుడైన(తమ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితులే) గుహుడు పరుగు పరుగున వచ్చి, రాముడిని గట్టిగా కౌగలించుకొని ఇలా అన్నాడు...

రామా! ఇది కూడా నీ రాజ్యమే, ఇది కూడా నీ అయోధ్య అనే అనుకో. నీకోసమని రకరకాల పదార్ధాలు, అన్నరాసులు తీసుకొచ్చాను, తీసుకో రామా" అన్నాడు.


గుహం ఏవ బ్రువాణం తం రాఘవః ప్రత్యువాచ హ |

అర్చితాః చైవ హృష్టాః చ భవతా సర్వథా వయం |

పద్భ్యాం అభిగమాచ్ చైవ స్నేహ సందర్శనేన చ ||


అప్పుడు రాముడు "గుహా! మా అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు. కాని నువ్వు నాకోసం పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రేమతో ఈ రాజ్యం కూడా అయోధ్యే అన్నావు కదా, అప్పుడే నా కడుపు నిండిపోయింది. మా నాన్నగారికి ఈ గుర్రాలంటే చాలా ప్రీతి, అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి అలసిపోయాయి, వాటికి కావలసిన గడ్డి, మొదలైనవి ఇవ్వు" అన్నాడు. ఆ రోజున గుర్రాలు సేద తీరాక, ఆ ఇంగుదీ వృక్షం కింద సీతారాములు పడుకున్నారు. అప్పుడు గుహుడు లక్ష్మణుడిని కూడా పడుకోమనగా....


కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా |

శక్యా నిద్రా మయా లబ్ధుం జీవితం వా సుఖాని వా ||

యో న దేవ అసురైః సర్వైః శక్యః ప్రసహితుం యుధి |

తం పశ్య సుఖ సంవిష్టం తృణేషు సహ సీతయా ||


“నాకు నిద్ర వస్తుందని ఎలా అనుకున్నావు, రాముడు నేల మీద పడుకొని ఉండగా నా జీవితానికి ఇక సుఖం లేదు. దేవతలు, రాక్షసులు కలిసి యుద్ధానికి వస్తే, వాళ్ళని నిగ్రహించగల మొనగాడు మా అన్నగారు, అలాంటి మా అన్నయ్య, సీతమ్మతో కలిసి ఇలా పడుకొని ఉంటె నేనెలా పడుకోగలను?" అన్నాడు లక్ష్మణుడు.


మరునాడు ఉదయం గుహుడు తీసుకొచ్చిన పడవ ఎక్కి సీతారామలక్ష్మణులు గంగని దాటడానికి సిద్ధపడుతున్నారు. 


అప్పుడు సుమంత్రుడు రాముడిని పిలిచి, 'నేను ఏమి చెయ్యను  అని అడుగగా, రాముడు ఇలా అన్నాడు..  "నువ్వు తిరిగి అయోధ్యకి వెళ్ళి మా తండ్రిగారికి, ముగ్గురు తల్లులకి 

నా నమస్కారములు చెప్పు, కౌసల్యని సర్వకాలములయందు దశరథుడిని సేవించమని చెప్పు. భరతుడిని కుశలమడిగానని చెప్పు, వృద్ధుడైన చక్రవర్తిని ఏ ఒక్క కారణం చేత బాధ పెట్టవద్దని చెప్పు, తండ్రి మనస్సుకి అనుగుణంగా పరిపాలించమని చెప్పు" అన్నాడు.


అప్పుడు సుమంత్రుడు "రామా! నేనూ మీతోనే వస్తాను, మీ సేవ చేసుకుంటాను, ఏ రథం మీద మిమ్మల్ని అరణ్యాలకి తీసుకువచ్చానో, ఆ రథం మీదే మిమ్మల్ని 14 సంవత్సరాల తరువాత అయోధ్యకి తీసుకువెళతాను" అన్నాడు.


“నువ్వు నాతో వచేస్తే కైకమ్మకి అనుమానం వస్తుంది. రాముడు అరణ్యవాసం చెయ్యకుండా రథం మీద తిరుగుతున్నాడనుకుంటుంది. అందుకని నువ్వు ఖాళీ రథంతో వెనక్కి వెళ్ళి, రాముడు గంగని దాటి అరణ్యాలకి వెళ్ళాడని చెప్పాలి, అప్పుడు ఆమె సంతోషిస్తుంది. అందుకని నువ్వు బయలుదేరాలి" అన్నాడు. 


వెంటనే సుమంత్రుడు అయోధ్యకి బయలుదేరాడు.


తత్ క్షీరం రాజ పుత్రాయ గుహః క్షిప్రం ఉపాహరత్ |

లక్ష్మణస్య ఆత్మనః చైవ రామః తేన అకరోజ్ జటాః ||


అప్పుడు రాముడు గుహుడిని పిలిచి "గుహా! ఇకనుంచి నేను ఒక తపస్వి ఎలా బతుకుతాడో అలా బతకాలి. అందుకని నువ్వు నాకోసం మర్రి పాలు తీసుకురా" అన్నాడు.


అప్పుడు రాముడు గుహుడిని ఆ మర్రిపాలని తన తల మీద, లక్ష్మణుడి తల మీద పొయ్యమన్నాడు. 


మర్రిపాలు పోశాక జిగురుతో ఉన్న ఆ జుట్టుని జటల కింద కట్టేసుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ రాముడి యొక్క ధర్మనిష్ఠకి ఆశ్చర్యపోయారు. 


అప్పుడు రాముడు “నేను ఈ 14 సంవత్సరాలు నా క్షాత్ర ధర్మాన్ని పాటిస్తూ, బ్రహ్మచర్యంతో కూడిన అరణ్యవాసాన్ని చేస్తాను" అన్నాడు.


తరువాత రాముడు లక్ష్మణుడిని పిలిచి "ముందు మీ వదినని పడవ ఎక్కించి నువ్వు ఎక్క" అని చెప్పి, వాళ్ళు పడవ ఎక్కాక ఆయన కూడా పడవ ఎక్కాడు. 


అలా సీతారామలక్ష్మణులు గంగని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళారు. అక్కడినుంచి అలా కొంత దూరం వెళ్ళాక చీకటి పడేసరికి వాళ్ళందరూ ఒక చెట్టు కింద విడిది చేశారు. అప్పుడు రామలక్ష్మణులు వెళ్ళి మూడు మృగాలని సంహరించి, వాటిని తీసుకొచ్చి అగ్నిలో బాగా కాల్చి, ఆ మాంసాన్ని ముగ్గురూ తిన్నారు. తరువాత అక్కడే పడి ఉన్న ఎండుటాకులమీద పడుకున్నారు.


అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి "లక్ష్మణా! నాకు ఒక ఆలోచన వచ్చింది. భరతుడు యువరాజ పట్టాభిషేకం చేసుకున్నాక కౌసల్యని, సుమిత్రని బంధిస్తాడు. అందుకని నువ్వు బయలుదేరి అయోధ్యకి వెళ్ళిపో" అన్నాడు.


రాముడి మాటలు విన్న లక్ష్మణుడు ఇలా చెప్పాడు "అన్నయ్యా తప్పకుండా వెళ్ళిపోతాను, కాని ఈ మాట నాకు చెప్పినట్టు, నిద్రపోతున్న సీతమ్మకి కూడా చెప్పవే. సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కనుక, ఆ విషయం నీకు తెలుసు కనుక సీతమ్మని వెనక్కి వెళ్ళి కౌసల్య సుమిత్ర దశరథుల సేవ చెయ్యమని నువ్వు ఆజ్ఞాపించవు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళి నేను ఉండగలనని అనుకుంటున్నావు, అందుకు నన్ను వెళ్ళిపోమంటున్నావు.


న చ సీతా త్వయా హీనా న చ అహం అపి రాఘవ |

ముహూర్తం అపి జీవావో జలాన్ మత్స్యావ్ ఇవ ఉద్ధృతౌ ||


నీటిలో ఉన్న చేప పిల్లని పైకి తీసి ఒడ్డున పారేస్తే, తన ఒంటికి తడి ఉన్నంతవరకు ప్రాణములతో ఉండి, ఆ ఒంటి తడి ఆరిపోగానే ఎలా ప్రాణములను వదులుతుందో, అలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ, నిన్ను చూస్తూ, నువ్వు ఎంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి, నువ్వు కనబడడం మానెయ్యగానే ఈ ప్రాణములను విదిచిపెట్టేస్తాను అన్నయ్యా" అన్నాడు.


“లక్ష్మణా! 14 సంవత్సరాల అరణ్యవాసంలో మళ్ళి నిన్ను ఈ మాట అడగను, నువ్వు నాతోనే ఉండు" అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు.


మరునాడు ఉదయం కొంతదూరం ప్రయాణించగా వాళ్ళకి అక్కడ ఒక ఆశ్రమం కనబడింది. అది భారద్వాజముని ఆశ్రమం. ఆ ఆశ్రమంలో భారద్వాజుడు శిష్యులకు వేద పాఠాలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఆయన త్రికాలవేది. రాముడు ఆశ్రమంలోనికి ప్రవేశించి, తనని తాను పరిచయం చేసుకొని, తరువాత తన పత్నిని, సోదరుడిని పరిచయం చేసి, భారద్వాజునికి నమస్కారం చేసి, కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ రాత్రి ఆశ్రమంలో గడిపాక, మరునాడు ఉదయం భారద్వాజుడు రాముడిని 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని తన ఆశ్రమంలోనే గడపమన్నాడు.


అప్పుడు రాముడు “మీ ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలోనే ఉంది, తాను ఇక్కడే ఉంటె జానపదులు తనని చూడడానికి వస్తుంటారు, నేను రాజ్యానికి దగ్గరలోనే ఉండిపోయానని కైకమ్మకి ఇబ్బందిగా ఉంటుంది, అందుకని నిర్జనమై, ఎవ్వరూలేని చోటుకి వెళ్ళిపోతాను. కావున క్రూరమృగముల వల్ల, రాక్షసుల వల్ల ప్రమాదం లేనటువంటి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని మీరు నిర్ణయిస్తే, మేము అక్కడ పర్ణశాల నిర్మించు కుంటాము" అన్నాడు.


భారద్వాజుడు ఇలా అన్నాడు… 

“ఇక్కడినుంచి బయలుదేరి యమునా నదిని దాటండి, దాటాక కొంచెం ముందుకి వెళితే మీకు ఒక గొప్ప మర్రి చెట్టు కనపడుతుంది, ఆ చెట్టుకి ఒకసారి నమస్కారం చేసి ముందుకి వెళితే నీలము అనే వనం కనపడుతుంది, ఆ వనంలో మోదుగ చెట్లు, రేగు చెట్లు ఎక్కువగా ఉంటాయి. అలా ఇంకొంచెం ముందుకి వెళితే ఎక్కడ చూసినా నీళ్ళు, చెట్లు కనబడతాయి, అక్కడనుంచి చూస్తే చిత్రకూటపర్వతాల శిఖరాలు కనపడతాయి. మీరందరూ ఆ చిత్రకూట పర్వతాల్ని చేరుకోండి, అక్కడ వాల్మీకి మహర్షిఆశ్రమం ఉంది, ఆ ఆశ్రమానికి పక్కన మీకు అనువైన స్థలంలో ఆశ్రమాన్ని నిర్మించుకోండి. ఆ ప్రదేశంలో ఏనుగులు, కొండముచ్చులు, కోతులు, బంగారు చుక్కలు గల జింకలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది. స్వచ్ఛమైన జలాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ అరణ్యాలకి నేను చాలా సార్లు వెళ్ళాను, అక్కడ కార్చిచ్చు పుట్టదు. కాబట్టి మీరు అక్కడ పర్ణశాల నిర్మించుకోండి" అని అన్నాడు.


భారద్వాజుడు చెప్పిన ప్రకారం పర్ణశాల నిర్మించుకోడానికి సీతారామలక్ష్మణులు ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు. 


లక్ష్మణుడు చక్కటి పర్ణశాలని నిర్మించాడు. ఆ పర్ణశాలలోవాస్తు హోమం చేసి గృహప్రవేశం చేశారు. తరువాత వాల్మీకి ఆశ్రమాన్ని సందర్శించారు. వాళ్ళ రాకతో వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు. అలా ఆ చిత్రకూట పర్వతాలమీద సీతరామలక్ష్మణులు హాయిగా కాలం గడపసాగారు.9440652774.✍️

రేపు... 33వ భాగం...

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

రావి చెట్టు(

 *రావి చెట్టు(అశ్వద్థవృక్ష)మహిమ*

               ➖➖➖✍️


*దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం) ఒకటి.*


*అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. అందువల్లనే ‘అశ్వత్థ నారాయణుడు’ అనే పేరు కూడా ఆయనకు ఉంది. *


*సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురా ణాలు చెబుతున్నాయి.*


*ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు.*


*కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు.*


*స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని దాని కొమ్మలకు గాని ఎర్రవస్త్త్రం గాని, ఎర్ర దారం గాని కట్టే ఆచారం ఉంది.*


*ఏ చెట్టును నరకడమైనా పాపమే కాగా   అశ్వత్థ వృక్షాన్ని  నరకడం మహాపాపమని ఒక పురాణ వచనం.*


*బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల వారు దానిని బోధి వృక్షమని, జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు.*


*రావి సమిధలతో హోమంచేస్తే సంతాన దోషాలు తొలగిపోతాయి. రావి చెక్కకాషాయాన్ని తేనెలో కలిపి తీసుకుంటే వాత రక్త దోషాలు తగ్గుతాయి.*


*నోటిపూత పోవును. రావి చెక్కకషాయాన్నిరోజు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కాలేయ సమస్యలు ఉండవు. వివిధ కఫ దోషాలను రూపుమాపును.*


*అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణము లో నారదుడు వివరించెను. అశ్వత్థమే నారాయణ స్వరూపము.*


*ఆ వృక్షం యొక్క మూలము – బ్రహ్మ, దాని మధ్య భాగమే – విష్ణువు, దాని చివరి భాగము – శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే.*


*ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కునగల కొమ్మలలో ఇంద్రాదిదేవతలు, సప్తసముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి. దాని వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మలు, నాలుగువేదాలు ఉంటాయి.*


*అశ్వత్థ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాధిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడు ఉంటారు.అశ్వత్థ వృక్షం మూలములో ‘అ’ కారము, మానులో ‘ఉ ‘ కారము, అది ఇచ్చే పళ్ళలో ‘మ’ కరము, వెరసి ఆ వృక్షమంతా ప్రణవస్వరూపమే. అశ్వత్థ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షము.* 


*ప్రదక్షణ మరియు పూజించు విధానము : *


*ముందుగా అశ్వత్థ వృక్షాన్ని దర్శించి దానిని చేతితోతాకి ఈ క్రింది అశ్వత్థ వృక్ష స్తోత్రమును పఠించాలి. *



*అశ్వత్ధవృక్ష స్తోత్రం....*


*మూలతో బ్రహ్మరూపాయ*

*మధ్యతో విష్ణురూపిణే*

*అగ్రత శ్శివరూపాయ*

*వృక్షరాజయతే నమః*


*అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ చైత్ర, ఆషాడ, పుష్య మాసాలలో చేయరాదు.* *గురు, శుక్ర మౌడ్యాలలో చేయరాదు. కృష్ణపక్షం లో అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ ప్రారంభించరాదు.*


*ఆది,సోమ,శుక్రవారాలలో, గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో, నిషిద్ధ సమయాల్లో, రాత్రి భోజనముచేసి యీ వృక్షాన్ని సేవించరాదు.*


*మౌనంగా లేదా గురునామము లేదా విష్ణుసహస్రనామమును చదువుతూ నెమ్మదిగా ప్రదక్షణలు చేయాలి. ప్రతి ప్రదక్షణానికి ముందు అలాగే చివర అశ్వత్థ వృక్షానికి నమస్కరించాలి.*



*అశ్వత్ధ వృక్ష పూజా ఫలము :*


*అశ్వత్ధ వృక్షానికి రెండు లక్షల ప్రదక్షణాలు చేస్తే సర్వపాపాలూ నశించి నాలుగుపురుషార్ధాలు సిద్ధిస్తాయి. బిడ్డలు కలగాలన్న సంకల్పముతో ప్రదక్షణలు చేస్తే తప్పక కలుగుతారు.*


*శనివారంనాడు అశ్వత్థ వృక్షాన్ని చేతితోతాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే మృత్యుభయం పోతుంది. అలాగే శనివారంనాడు అశ్వత్థ వృక్షాన్ని చేతితోతాకి ఈ క్రింది శనైశ్చర స్తోత్రమును పఠించిన శనిదోషం తొలగిపోతుంది.*


*అశ్వత్థ వృక్షం క్రింద చెప్పవలసిన శనైశ్చర స్తోత్రం:*


*కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రాంతకోయమః*

*శౌరీ శ్శనైశ్చరో మందః పిప్పిల దేవ సంస్తుతః*


*గురువారం, అమావాస్య కలసి వచ్చిన రోజున అశ్వత్థ వృక్షం క్రింద వేదవిప్రునికి భోజనము పెడితే కోటిమంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితముంటుంది.*


*గురువారం, అమావాస్య కలసి వచ్చిన రోజున అశ్వత్థ వృక్షనీడలో స్నాన మాచరించిన మహాపాపములు తొలగును.*


*అశ్వత్థ వృక్షం క్రింద చదివిన గాయత్రి మంత్రజపం నాలుగువేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది.* 


*అశ్వత్థ వృక్షాన్ని స్థాపిస్తే నలభై రెండు తరాలు వారికి స్వర్గం లభిస్తుంది.*9440652774.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

*నరక ద్వారాలు*

            *నరక ద్వారాలు*

                ➖➖➖✍️


*‘ఆత్మ వినాశనానికి దారితీసే నరక ద్వారాలు మూడున్నాయి. అవి కామం, క్రోధం, లోభం.*


*కాబట్టి, బుద్ధిమంతుడైన మనిషి వాటిని త్యజించాలి’ అని ఉపదేశించాడు గీతాచార్యుడు.*


*క్రోధం తమ జీవితాలనే నాశనం చేయగలదన్న సంగతి అందరికీ తెలుసు. ముఖ్యంగా, అసంబద్ధ రీతిలో పరిణమించిన క్రోధం విధ్వంసకారకమై అనేక చిక్కులనే తెచ్చిపెడుతుంది. క్రోధం అన్నది మన అంతర్గత వ్యవస్థలో విషాన్ని సృష్టించి మన శరీరం, మనసు, చైతన్యాన్ని సర్వనాశనం చేస్తుంది.*


*‘క్రోధానికి మూల కారణం కామం’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించాడు. ఇంద్రియ భోగాలను ఆస్వాదించే మన ప్రయత్నాలు చికాకు, అంతరాయాలతో కూడుకున్నప్పుడు క్రోధం ఏర్పడుతుంది. ఆత్మాభిమానం, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుందనే భయాందోళనలూ క్రోధ కారకాలవుతుంటాయి.*


*అంతర్జాతీయ హరే కృష్ణ ఉద్యమ సంస్థాపక ఆచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు, తమ శ్రీమద్భాగవత పురాణ భాష్య రచనల్లో ఈ విధంగా ప్రస్తావించారు.. ‘ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తిని పొందాలని భావించేవారు క్రోధానికి ఎన్నడూ వశులు కాకూడదు. ఎందుకంటే, క్రోధంతో ప్రేరేపితులైనవారు ఇతరుల భయానికి కారణమవుతారు’ అని స్పష్టం చేశారు.*


*క్రోధాన్ని నియంత్రించే మార్గాలున్నాయి. అందులో ఒకటి క్షమించటం. ‘క్రోధం నుంచి విముక్తి పొందాలంటే, క్షమించటం ఎలాగో తెలుసుకోవాలంటారు’ శ్రీల ప్రభుపాదులు.*


*మరొక సందర్భంలో ఆయన క్రోధాన్ని గురించి వివరిస్తూ, ‘శారీరక వేగంలో క్రోధం కూడా ఒకటి. ఉదాహరణకు, మనం ఎవరి కారణంగానైనా అవమానానికి గురైతే సహజంగానే కోపం వస్తుంది. అయితే, ఆ సందర్భంలో మనం ‘సర్లే! అతనేదో మూర్ఖంగా అలా మాట్లాడాడు. అతని వల్ల నా నిగ్రహాన్ని ఎందుకు కోల్పోవాలి?’ వంటి భావనతో క్రోధమనే వేగాన్ని నియంత్రించగలం’ అని తెలిపారు.*


*క్రోధాన్ని నియంత్రించే రెండో మార్గం కర్మ సిద్ధాంతం. ఏదైనా కార్యసాధనలో మన ప్రయత్నాలన్నీ చెల్లాచెదురైనప్పుడు గానీ, ఎవరైనా మనతో అమర్యాదగా నడుచుకున్నప్పుడు గానీ మన కర్మ ఫలాలను కూడా పరిగణించుకొని ఒకసారి ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన బాధలకు కారణం మన గత కర్మల ఫలితమేనని భావించినపుడు ఇతరులపై క్రోధాన్ని ప్రదర్శించం.*


*క్రోధాన్ని అదుపులో ఉంచుకోవాలంటే భగవద్గీత బోధనలను ఆచరించాలి. ప్రతి ఒక్కరూ మనసా, వాచా, కర్మణా సకలవిధాలా తపస్సును ఆచరించే విధానాన్ని అభ్యసించాలి.*


*ఇందుకు‘తపో దివ్యం’ ఒక మార్గం. ఒక మానవునిగా జీవిస్తూ, జీవితంలో ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలనుకుంటే శాస్త్ర ఆదేశాలను (భగవద్గీత) తప్పక ఆచరించాలి.*


*‘మన దైనందిన కార్యకలాపాల్లో ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. కాబట్టి, ప్రతి విషయాన్ని గంభీరంగా స్వీకరించినట్లయితే, అసలు జీవించటమే అత్యంత కష్టతరమైపోతుంది’ అంటారు ప్రభుపాదులవారు.*


*లోకంలో సమయ సందర్భోచితంగా క్రోధాన్ని ఉపయోగించే విధానాలూ లేకపోలేదు. అదే కర్తవ్య నిబద్ధతతో ధర్మావలంబనకు ఉపయుక్తమయ్యే క్రోధం. ఇందుకు హనుమంతుడినే ఒక గొప్ప నిదర్శనంగా వివరిస్తారు ప్రభుపాదుల వారు…*


*క్రోధాన్ని నిర్మూలించలేకున్నా, దాన్ని సరైన రీతిలో ఉపయోగించవచ్చు. క్రోధంతో హనుమంతుడు లంకా దహనమే గావించినా, శ్రీరాముడి పరమభక్తుడిగా ఆయన ఆరాధ్యనీయులే. అంటే, హనుమ తన క్రోధాన్ని సరైన రీతిలో ఉపయోగించారని అర్థం.*


*చివరగా, ‘మనసును శూన్యం గావించాలనే ప్రయత్నం కృత్రిమమైనది. అదెంతో సమయం నిలువదు. అలాకాక, నిత్యం శ్రీకృష్ణుడినే స్మరిస్తూ, ఆయనను మరింత గొప్పగా ఎలా సేవించాలన్న తలంపుతోనే మనసు సహజంగా నిలకడగా ఉంటుంది’ అంటారు ప్రభుపాదులు.* 9440652774 హరే కృష్ణ!✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

బతకడం

 


*బతకడం వేరు, జీవించడం వేరు.*

               ➖➖➖✍️


 *చాలా మంది బతికేస్తుంటారు , కొందరే జీవిస్తుంటారు!* 


*”ఈ వాన లో ఎక్కడికెళతారు ? మా ఇంట్లోనే వుండండి,” అని ఆ నిరుపేద ఒడిషా కూలీ అన్నపుడు సుధా మూర్తి గారు ఆగారు.*


*ఆమె పేద పిల్లలకు ఉచిత బడి స్థాపించే పని మీద అక్కడికెళ్ళారు.* 


*”ఆమె మన అతిథి. ఆమె టీ, కాఫీ తాగరట. పాలు ఇవ్వు!” అని ఆ కూలీ అంటే…*


 *”మన పాప కు ఆ ఒక్క గ్లాసు పాలే వున్నాయి. వాన పడుతోంది. ఆ పాలు ఆమెకిస్తే రాత్రంతా పాప ఏడుస్తుంటుంది!” అంది ఆమె.* 


*”అయినా పరవాలేదు, సగం పాలకు సగం నీళ్ళు కలిపి, చక్కెరతో ఇవ్వు!”అన్నాడు ఆయన.* 


*ఒరియా తెలిసిన సుధామూర్తి కి అది వినపడింది… “ఈ రోజు బుధవారం , నేను ఉపవాసం.    ఏమీ తీసుకోను.” అంది ఆమె.*


*”అందరూ సోమ , గురు , శుక్ర , శని వారాలు ఉపవాసం చేస్తారు. మీరు బుధవారం వుంటున్నారే ?" అని అతనంటే…*


 *”అవును,  నేను గౌతం బుద్ధుడి కోసం వుంటాను.”  అన్నారు ఆమె.*


*ఆ రాత్రే ఆమె నిర్ణయం తీసుకొన్నారు… ‘గుక్కెడు పాలు తాగలేని పసిపిల్లలు లక్షలమంది నాదేశం లో వుండగా, నేను పాలు తాగడమా? వద్దు!’ అని ఆనాటి నుండి ఆమె పాలు తాగడం మానేసారు.*


*TATA వారి TELCO లో భారతదేసపు మొట్టమొదటి మహిళా ఇంజినీర్ గా ఆమె ప్రవేశించినా, 2,21,501 మంది employees తో ఏటా 2.48 బిలియన్ US Dollars ఆదాయం కలిగిన Infosys నడిపే Infosys Foundation కు Chair Person అయినా,                          సుధా మూర్తి simplicity కి మారుపేరులా వుంటారు.* 


*అమె దగ్గర వున్నది కేవలం 8 చీరలు మాత్రమే అంటే మనలో చాలా మంది ఆశ్చర్యపోతారు.*


*చివరగా ఆమె చీర కొన్నది 1998 లోనే. ఒక మారు ప్రపంచ ప్రసిద్ధ London Heathrow Airport లో అక్కడి ఇంగ్లీష్ ఆమె సాధారణ దుస్తుల్లో వున్న సుధా మూర్తి ని చూసి  "ఇది ధనవంతులు ప్రయాణించే Business class నీలాంటి వారు అదిగో అక్కడ మామూలు ప్రజలు వెళ్ళే Economy class వుంది వెళ్ళు" అంటే, చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది సుధా మూర్తి.*


*కానీ అదే రోజు 24 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఒక UNO సదస్సులో President హోదాలో అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అవాక్కయింది ఆ ఇంగ్లీష్ వనిత.*


*”నిజంగా గొప్పవారికి తాము గొప్పవారనే విషయమే గుర్తుండదు , అదే వారి గొప్పతనం,” అంటాడు చైనా కు చెందిన ‘లా తజు ‘అనే ఒక ఫిలాసఫర్.*


*కేవలం 8 చీరలే కలిగిన సుధామూర్తి తన ఇంట్లో మాత్రం 20,000 పుస్తకాలు కలిగివున్నారు. తన ఆదాయాన్ని పేదల చదువుకు , అనాథలకు , ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు ఆమె.*


*ఖర్చు పెట్టడం వేరు, సరిగ్గా ఖర్చు పెట్టడం వేరు.*9440652774.


*బతకడం వేరు, జీవించడం వేరు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

మరణంలో స్మరణ మహిమ

 


                మరణంలో స్మరణ

                       మహిమ

                     ➖➖➖✍️


"పూర్వం ఒకప్పుడు మాధవపురం అనే ఊళ్ళో ఒక భక్తుడు నివసిస్తూ ఉండే వాడు. భగవంతుడి పాదారవింద స్మరణతప్ప అన్యమేదీ అతడు ఎరుగడు. అదే తన జీవిత లక్ష్యంగా జీవిస్తున్నాడు. ప్రతిరోజూ పూజా పునస్కారాలు, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన ఇంకా ఇతర సాధనానుష్టానాలచేత ముక్తి మార్గాన జీవిస్తుండేవాడు. ఇలా లౌకిక విషయాల్లో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసే అతణ్ణి పలువురు శిష్యులు ఆశ్రయించారు. వారంతా అతడివద్ద జ్ఞానోపదేశం పొంది,   భగవద్భక్తిని పెంపొందించుకొనసాగారు. ఆ శిష్యులకు అతడు మార్గగామియై జ్ఞానగురువుగా మసలుకోసాగాడు. ఆ గురువు తాను తలచినదే చెబుతూ, చెప్పినదే చేస్తూ త్రికరణ శుద్ధిగా, ఆదర్శప్రాయుడై వెలుగొందసాగాడు."


ఇలా ఉండగా ఆ భక్తుడికి వృద్ధాప్యం వచ్చింది. తన ఆయుష్షు ఇక పూర్తి అయ్యే తరుణం సమీపించినదని గ్రహించి, తన మరణం కాశీలో జరగాలని కోరుకొన్నాడు. శిష్యులు గురువుగారి కోరికను ఎరిగి ఆయన్ను కాశీ క్షేత్రానికి తీసు కొనిపోవడానికి నిశ్చయించు కొన్నారు. 


గురువుగారి దగ్గరకు వెళ్ళి...

“గురువర్యా! మీ ఇషప్రకారం కాశీక్షేత్రానికి మిమ్మల్ని తీసుకొని వెళతాము. దయచేసి అనుమతి ఇవ్వండి అని వేడుకొన్నారు".


వృద్ధుడైన ఆ గురువు, శిష్యుల మాటలకు సంతోషించి, అందుకు సమ్మతించాడు. అదే తమ భాగ్యంగా భావించి శిష్యులు పల్లకి ఏర్పాటు చేసి,దాన్లో చక్కని పరుపును, మెత్తను అమర్చి గురువుగారిని ఆసీనుణ్ణిచేసి, కాశీకి బయలుదేరారు. అలా ప్రయాణం చేసిన కొన్ని రోజుల తరువాత కాశీ పొలి మేరకు చేరుకొన్నారు.


ఇంతలో పల్లకిలో కూర్చున్న గురువుగారికి అంతిమ ఘడియ సమీపించింది. తనకు యమ దర్శనం అవడంచేత గురువు శిష్యులతో… “మనం ఎంతదూరం వచ్చాం? కాశీ క్షేత్రాన్ని చేరుకొన్నామా?” అంటూ ప్రశ్నించాడు.


అందుకు శిష్యులు, “స్వామీ! పల్లకి ఇప్పుడే కాశీ పొలిమేరలోని *మాలవాడ*' చేరింది. ఇక కాస్సేపట్లో కాశీ క్షేత్రంలో అడుగు పెట్టబోతున్నాం” అన్నారు.


 ఆ కాలంనాటికి అస్పృశ్యతా దురాచారం ఉండేది. ప్రాణాలు పోతున్న సమయంలో అతడి చెవికి 'మాలవాడ' అనే పదం మాత్రమే వినిపించింది.


 ఆ మాట వినపడగానే అతడి మనస్సులో తన పాండిత్యం, దైవభక్తి అన్నీ వైదొలగి మాలవాడ గురించిన తలంపులు మాత్రమే కలిగాయి. ఆ తలంపులలో ఉండగానే అతడి ప్రాణాలు పోయాయి.


*ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి అతడి మరుజన్మకు కారణమయ్యాయి.*


 అతడు మాలపల్లెలో ఒక నిమ్న కుటుంబంలో జన్మించాడు. అయితే పూర్వజన్మ వాసనలు అతడిలో నిలిచే ఉన్నాయి. పూర్వపుణ్యఫలం అతడికి ఉన్నది.


అతడి తండ్రి ఆ ఊరి కాపరిగా పనిచేసేవాడు. ప్రతిరాత్రీ ప్రతీయామంలో తప్పెట కొడుతూ దొంగలు రాకుండా 'పారాహుషార్' చెబుతూ ఆ రాజ్యంలో ఉద్యోగిగా ఉండేవాడు.


ఆ ఊరికి దొంగల భయం లేకుండా కావలి కాసేవాడు.


ఇలా ఉండగా మన గురువు ఇతడికి కొడుకుగా పుట్టినప్పటికీ పూర్వజన్మ వాసనచేత అందరి పిల్లలవలె కాకుండా మౌనంగా, ఎవరితోనూ కలవక ఏకాంతంగా ఉండేవాడు.


అసాధారణంగా తోచే ఈ పిల్లవాడి గుణాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి.


ఉలకని పలకని మౌనిగా ఉన్న జ్ఞానిని వారందరూ మూగవాడనీ, ఎందుకూపనికిరానిఅప్రయోజకుడనీ జమకట్టారు. తండ్రి బాధపడి అతణ్ణి ఎందులోనూ నిర్బంధించక వదలి పెట్టేశాడు.


*మన జ్ఞాని ఎందులోనూ చేరక, చేరితే మళ్ళా జన్మించాలనే భీతితో లౌకిక చింతన లేకకాలం  గడపసాగాడు.*


ఇలా ఉండగా ఒకసారి తండ్రి ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది.


అందుచేత రాజువద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు. ఇందుకు అనుమతించండి” అని వేడుకొన్నాడు. రాజు అందుకు సమ్మతించాడు.


ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకొన్నాడు. ఆ కాలంలో రాజులు మారు వేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది!


రాత్రి అయింది. అది మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకొని ఆ బాలుడు వీథి కాపలా కాయసాగాడు. రాజు అతణ్ణి వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు ఆ ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడ…


*కామం క్రోధంచ - లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః.*


మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త! - ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు; నిశ్చేష్టుడయ్యాడు.


'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు.

ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది. కనుక ఇతణ్ణి వెంబడించి, గమనిస్తూ ఉంటాను' అని రాజు భావించాడు. 


మళ్ళా రెండవ ఝాము వచ్చింది. అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు:


*జన్మదుఃఖం జరాదుఃఖం -జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః.*


"పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త - అని హెచ్చరిక."


ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు. తృతీయ యామం వచ్చింది:


*మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః*


'తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు (ఇదంతా మిథ్య అని అర్థం) జాగ్రత్త! జాగ్రత్త!' - అని చాటాడు.


 ఇది విన్నరాజు అచేతనుడయ్యాడు. అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో నాలుగవ యామం వచ్చింది. అప్పుడు ఆ బాలుడు…


 

*ఆశయా బధ్యతే లోకే - కర్మణాబహుచింతయా ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః.*


అని చాటింపు వేశాడు.


"ఆశాపాశంచేత కట్టువడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే! కాబట్టి జాగ్రత్త జాగ్రత్త - అని చాటాడు."


ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది. అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మగల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఈతణ్ణి తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికిపోయాడు.


మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు. అతడితో రాజు ఇలా అన్నాడు:


“ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాదు. అతడు పూర్వజన్మజ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చమని అతడిని అడుగు.”


తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు.


అప్పుడు రాజు : “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్నిచేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు.


తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతూన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు.


అప్పుడు ఆ జీవన్ముక్తుడు :  “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష విధిస్తారు?” అని అడిగాడు. అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు.


“అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. నా చేతులమీద, నా కత్తితో వారి తల తీస్తాను"- అంటూ తన కోరికను తెల్పాడు ఆ పసివాడు.


రాజు అమితాశ్చర్యపోయాడు. అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు.


ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించ సాగాడు. ఇలా కొంతకాలంగడిచింది.


దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించబోయాడు.


 “ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతూన్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు.


అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు…

“ఓ బ్రహ్మదేవా! ఏంచెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని ఇప్పుడు ఎందుచేతనో చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా! లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది. ఇదే నా విచారానికి కారణం.”


బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతూన్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. 


అప్పుడు అక్కడ జరుగుతూన్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది. అదేమంటే…

మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి. చూసేవారి మనస్సు భక్తిపరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి.ఆచోటుదేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది..


మరణశిక్ష విధింపబడి కొనిరాబడిన వారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి, వారి మనస్సుకు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు.


అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు.


*అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేక పోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.*


ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు.


"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు. అని బ్రహ్మ, జ్ఞానిని అడిగాడు. అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు…

"ఓబ్రహ్మదేవా మీకుతెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా? నా గత జన్మలో మరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు *మాలపల్లె* అనే పదం, ఆ తలంపులు నా చెవుల్లో పడటంచేత మాలపల్లెలో   మళ్ళా జన్మించాల్సి వచ్చింది.


 భగవానుడు గీతలో 'ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు కదా!


కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను. నా అనుభవం ఒక పాఠమైనది.”


అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకం చేరుకొన్నాడు.


*మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది*.


కాబట్టిఅంత్యకాలంలోభగవన్నామమే పరమ ఔషధంగా  పనిచేస్తున్నది.


*నామస్మరణే సులభోపాయం. ఆనామ స్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గంచూసుకొందుంగాక!*


పవిత్రాత్మ స్వరూపులారా!

శ్రీ భగవద్గీత లో శ్రీ కృష్ణ పరమాత్మ 8-6 శ్లోకంలో ఇలా …సెలవిచ్చారు :


శ్రీ భగవానువాచ :


*యం యం వాపి స్మరణ్ భావంత్యజ త్యంతే కళేబరం, తంతమే వైతి కవున్తేయ సదా తద్భావ భావి తః*! (08-06)


భావం : "అర్జునా! ఎవడు మరణకాలంలో ఏయే భావంతో వుంటూ దేహాన్ని వదులుతాడో, ఆభావం యొక్క స్మరణచేత కలిగిన సంస్కారం కలిగి ఉండడం చేత, ఆయా రూపాన్నే పొందుతున్నాడు."


భగవద్భక్తులైన వారంతా  వారి వారి జీవితాల్లో సదా దైవనామ స్మరణ ను అలవాటు చేసుకొని, అంత్యకాలంలో కూడా ఆ దైవ నామాన్ని తలుస్తూ, ఆదైవాన్నే పొందెదరుగాక!✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

థైరాయిడ్ వ్యాధి

 *మీలో ఎవరైనా థైరాయిడ్ వ్యాధి నీ పూర్తిగా నయం చేసుకోగలిగారా? ఐతే ఎలా?*థైరాయిడ్ రోగులు బాగా కష్టం కలిగించే పనులు చేయవచ్చా? అంటే ఎక్కువ అలసట కలిగించేవి చేయవచ్చా? చేయకూడదా?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*


           ఈ థైరాయిడ్ సమస్య అనేది చాలా మందిని అనారోగ్యానికి గురిచేస్తుంది. ఇది బయట పడేంతవరకు మనకు తెలియదు. ఇది బయట పడేటప్పటికే 50% కంటే వ్యాధి తీవ్రత ఎక్కువవుతుంది. గొంతులో ముదిరిపోయి ఉంటుంది. గొంతు భాగాన్ని విష్ణు గ్రంధి అంటారు. నాభి ని బ్రహ్మ గ్రంధి అంటారు. ఇప్పుడు అంత ప్లాస్టిక్ బ్రష్ లు, కెమికల్ పేస్ట్ లు వచ్చి తెలియకుండా మనలని ఇబ్బంది పెడుతున్నాయి. చక్కగా పొద్దున్నే లేచి వేప చెట్టు చిన్న కొమ్మతో (వేప పుల్ల) పళ్ళు తోముకోవడం వలన, వేప లో ఉన్నటువంటి ఔషధ గుణాలు మనకి లభిస్తాయి. ఇది థైరాయిడ్ సమస్యకు బాగా పనిచేస్తుంది.

ఈ థైరాయిడ్ సమస్య వలన అధిక బరువు, అధిక పొట్ట, స్త్రీలకు ఋతువు సరిగ్గా రాకపోవడం, కిడ్నీ లో రాళ్ళు చేరిపోవడం ఇలాంటి అనేక సమస్యలకు దారితీస్తుంది.


*ఔషధం వివరాలు:*


*వేప నూనెను* (వేప కాయల లోపల ఉన్న గింజలును దంచి తీసిన నూనె) ఆహారానికి గంట ముందు ఉదయం రాత్రి రెండు రెండు చుక్కలు ముక్కులో వేసుకోవాలి.


ఇలా వేసుకుంటే అది క్రమంగా గొంతులోకి జారీ, అందులో ఉన్నటువంటి అమృత తత్వము థైరాయిడ్ అనే రోగమును నాశనము చేయును.


*త్రిఫల చూర్ణం* (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ మూడింటిని ఒక్కోటి 100 గ్రాముల చొప్పున తీసుకుని, దేవదారు చెక్క పొడి 100 గ్రాములు, పిప్పళ్ల పొడి 100 గ్రాములు, అన్నిటిని ఒక సీసా లో కలిపి ఉంచ్చుకోవాలి) లేదా (ఆయుర్వేద కొట్టులలో దొరుకుతుంది) తెచ్చుకుని రోజు రాత్రిపూట గోరువెచ్చని నీటిలో ఒక చెంచా కలుపుకుని తీసుకోవాలి.


నువ్వులనూనెను గోరువెచ్చగా వెచ్చబెట్టి, గొంతు మీద భాగాన బాగా మర్దన చేసుకోవాలి.


ఈ మూడు పనులను చేయడం ద్వారా చాలా సులభంగా థైరాయిడ్ వ్యాధిని తగ్గించుకోవచ్చు.పూర్తి ఆరోగ్య వైద్య సలహాలు కోసం లింక్స్ రిపోర్ట్ పెట్టండి 👇


https://t.me/HelathTipsbyNaveen

*👉🏿మీకు థైరాయిడ్ ఉన్నది అనిపిస్తుంది అంటే   నిర్ధారించే 12 నిశ్శబ్ద సంకేతాల👇*


థైరాయిడ్ గ్రంథి అదనపు లేదా తక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు హైపర్ థైరాయిడిజం లేదా హైపో థైరాయిడిజం అని పిలువబడే థైరాయిడ్ రుగ్మతలు సంభవిస్తాయి. థైరాయిడ్ సమస్యల నిశ్శబ్ద సంకేతాల గురించిన వివరాలను ఈ ఆర్టికల్ వివరిస్తుంది.


థైరాయిడ్ గ్రంథి, టి4(థైరాక్సిన్), టి3(ట్రియోడోథైరోనిన్) మరియు శరీరంలో కాల్షియం నిల్వలను నియంత్రించడానికి సహాయపడే కాల్సిటోనిన్ అని పిలువబడే మరొక హార్మోన్ను కూడా ఉత్పత్తి చేస్తుంది.


ఈ హార్మోన్లు శరీరంలోని జీవక్రియలను ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి, థైరాయిడ్ గ్రంధిని ఉత్తేజపరిచే హార్మోన్లను పిట్యూటరీ గ్రంధి(మెదడు యొక్క బేస్ వద్ద ఉన్న చిన్న అవయవము) విడుదల చేస్తుంది.


*థైరాయిడ్ గురించి తక్కువగా తెలిసిన వాస్తవాలు:*


పిట్యుటరీ గ్రంథి, థైరాయిడ్ క్రియాశీల పనులలో ప్రధానపాత్ర పోషిస్తుంది. అడ్రినల్ గ్రంధికి సంబంధించిన కొన్ని పనులు కూడా థైరాయిడ్ హార్మోనుల ఉత్పత్తిలో ప్రధానపాత్ర పోషిస్తుంది.


*పురుషులకన్నా థైరాయిడ్ సమస్యలు మహిళలకు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.*


అయోడిన్, టి3 మరియు టి4 హార్మోన్ల ఉత్పత్తికి ప్రధాన అవసరంగా ఉంటుంది. అయోడిన్ లోపం థైరాయిడ్ సమస్యలకు దారితీస్తుంది.


థైరాయిడ్ గ్రంధిని ప్రభావితంచేసే కారకాలలో ప్రధానమైన కారకం ఒత్తిడి.


థైరాయిడ్ యొక్క అనేక అసాధారణతలు మెనోపాజ్ ముందు మరియు గర్భధారణ సమయంలో కనిపిస్తాయి. గర్భధారణ మీద ప్రధానంగా ప్రభావాలను కలిగి ఉంటాయి.


*థైరాయిడ్ డిజార్డర్స్ కారణాలు ఏమిటి?*


దీర్ఘకాలిక లింఫోసైటిక్ థైరాయిడైటిస్ లేదా ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ అని పిలువబడే ఈ సమస్యను హాషిమోటొ థైరాయిడైటిస్ అని కూడా వ్యవహరిస్తారు.


ఇది, హైపో థైరాయిడిజం యొక్క అతిసాధారణ కారకంగా ఉంది. అయోడిన్ తక్కువ మోతాదులో తీసుకుంటున్న ఎడల, అయోడిన్ లోపం కారణంగా హైపోథైరాయిడిజం సంభవిస్తుంది.


*ఆరోగ్యకరమైన థైరాయిడ్ గ్రంధి యొక్క విధులు ఏమిటి?*


1.ప్రోటీన్ సంశ్లేషణను ప్రేరేపిస్తుంది.


2.సాధారణ శరీర ఉష్ణోగ్రతని కాపాడుతుంది.


3.అన్ని కణాలలో బాడీ-మెటబాలిక్-రేట్(ప్రాథమిక జీవక్రియ రేటు) పెరుగడంలో సహాయపడుతుంది.


4.రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.


5.శక్తి ఉత్పత్తి కోసం గ్లూకోజ్ మరియు కొవ్వుల వినియోగాన్ని పెంచుతుంది.


6.శరీరం పెరుగుదలలో ప్రధానపాత్ర పోషిస్తుంది.


7.అడ్రినలిన్ మరియు నోరాడ్రెనలిన్ ప్రభావాలను పెంచుతుంది.


*థైరాయిడ్ సమస్య యొక్క ప్రధానమైన 12 నిశ్శబ్ద సంకేతాలునవీన్ రోయ్ సలహాలు :*


*1. విచారం మరియు డిప్రెస్డ్(తీవ్రమైన ఒత్తిడి) ఫీలింగ్*


థైరాయిడ్ యొక్క నిశ్శబ్ద సంకేతాలలో ఒకటి నెర్వస్ ఫీల్. ఎక్కువగా ఒత్తిడికి లోనైనభావన, విచారం ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. మెదడు తీవ్రమైన ఉద్దీపనకు లోనైన సమయంలో ముఖ్యంగా ఇలా జరుగుతుంది. ముఖ్యంగా మీకు నచ్చని అంశాలను ఎదుర్కొంటున్న సమయంలో ఆవేశానికి లోనవడం వంటి సమస్యలను ఎదుర్కోవడం తరచుగా జరుగుతుంది.


*2. మలబద్దకం*


తరచుగా మలబద్ధకాన్ని ఎదుర్కోవడం మరొక నిశ్శబ్ద సంకేతం. థైరాయిడ్ హార్మోన్లు మీ జీర్ణాశయాన్ని సరిగ్గా పనిచేసేలా సహాయపడుతాయి. థైరాయిడ్ గ్రంధి హార్మోనుల అసమతౌల్యం, మరియు జీర్ణక్రియలను అస్తవ్యస్త పోకడలకు గురిచేయవచ్చు. క్రమంగా జీర్ణాశయ పనితీరు మందగించి, మలబద్దక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి


*3. అతినిద్ర*


పగటిపూట అలసిపోవడము, తరచుగా నిద్రపోవడం అనేది థైరాయిడ్ సమస్య ప్రాధమిక గుర్తుగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథులు శరీరానికి శక్తిని అందించే థైరాయిడ్ హార్మోన్లను సరైన మోతాదులో ఉత్పత్తి చేయలేక పోయినప్పుడు, నిస్తేజానికి లోనవడం మూలంగా అతినిద్ర సమస్యలు కలుగుతుంటాయి.


*4. జుట్టు నష్టం మరియు పొడి చర్మం*


అధిక జుట్టు నష్టం, ముఖ్యంగా కనుబొమ్మల మీద ప్రభావం కలిగి ఉండడం, థైరాయిడ్ రుగ్మత యొక్క చిహ్నం. మితిమీరిన లేదా క్రియారహితమైన థైరాయిడ్ గ్రంధి మీ జుట్టు పెరుగుదల మీద తీవ్రప్రభావాన్ని చూపుతుంది. థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత, సాధారణంగా జుట్టు సన్నబడటానికి ప్రధాన కారకం.


*5. ఆకస్మికంగా బరువు పెరుగుట*


థైరాయిడ్ హార్మోన్ల కొరత జీవక్రియలను తగ్గించడమే కాకుండా, కాలరీలను తక్కువగా కరిగించేలా చేస్తుంది, క్రమంగా శరీరంలో కొవ్వు పేరుకుని పోవుట, ఊబకాయానికి గురికావడం వంటి సమస్యలు కలుగుతుంటాయి.


*6. లైంగిక అనాసక్తి*


ఒక క్రియారహిత థైరాయిడ్ గ్రంధి లైంగిక అసమర్థత వంటి సమస్యలకు ప్రధాన కారణంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలలో ఈ సమస్య అధికంగా కనిపిస్తూ ఉంటుంది.


*7. కండరాల నొప్పి లేదా కండరాలు గట్టి పడడం*


కండరాల నొప్పి లేదా కండరాల బలహీనత ఒక థైరాయిడ్ గ్రంధి హార్మోనుల అసమతౌల్యం మూలాన కూడా సంభవించవచ్చన్న విషయం అనేకమందికి అవగాహన లేదు. థైరాయిడ్ సమస్యలు ఉన్న ప్రజలు కండరాలు గడ్డిపడడం, తీవ్రమైన నొప్పులను ఎదుర్కోవడం వంటి సమస్యలకు గురవుతుంటారు.


8. *గుండె దడ*


థైరాయిడ్ హార్మోన్ల యొక్క అధిక ఉత్పత్తి గుండె దడ, ఛాతీ నొప్పి మరియు గుండె వైఫల్యానికి కూడా కారణమవుతుంది.


9. *నిష్క్రియాత్మకమైన మెదడు*


మెదడు పూర్తిగా నిస్తేజానికి గురైన అనుభూతికి అన్నివేళలా మెదడు కారణం కాకపోవచ్చు, ఒక్కోసారి ఇది థైరాయిడ్ సమస్య కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిష్క్రియాత్మక మెదడు నేస్తేజాన్ని, అలసటను, అతినిద్రను కలిగించడమే కాకుండా, ఆలోచనా శక్తి కూడా మందగించేలా చేస్తుంది


10. *అధిక రక్తపోటు*


అధిక రక్తపోటు, థైరాయిడ్ డిజార్డర్ యొక్క మరొక లక్షణంగా ఉంది. దీనికి కారణం ధైరాయిడ్ గ్రంధి హార్మోనుల అసమతౌల్యం, జీవక్రియల మీద ప్రభావం చూపడం కారణంగా జరుగుతుంది. క్రమంగా అవిశ్రాంతత, తీవ్రమైన చమట, నిస్సత్తువ వంటి లక్షణాలను ఎదుర్కొనవలసి ఉంటుంది.


11. *మెడ లేదా గొంతు అసౌకర్యం*


మెడ లేదా గొంతు అసౌకర్యం, ముఖ్యంగా వాపు, సున్నితత్వం, మెడభాగం గట్టిపడడం లేదా గొంతులో నిండిన అనుభూతికి లోనవడం మొదలైనవి లక్షణాలుగా కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంధి కణాలు క్రమంగా పెరగడం మూలంగా ఈ సమస్య కలుగుతుంది, క్రమంగా ఆహారం మింగడంలో కూడా సమస్యలను ఎదుర్కొనవలసి రావొచ్చు.


*12. రుచి కళికల పనితీరు మందగించుట, అసాధారణ ఆకలి*


థైరాయిడ్ గ్రంధి అధికంగా హార్మోనులను ఉత్పత్తి చేయడం మూలంగా,తీవ్రమైన ఆకలి సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

*ధన్యవాదములు🙏* 

🙏

ఆచార్య సద్బోధన:*

 


           *ఆచార్య సద్బోధన:*

                ➖➖➖✍️


```మనిషికి సద్గతి లేదా దుర్గతి కలగాలంటే అతని కర్మల వలనే!


ప్రార్ధన అనేది మన మనస్సును ప్రభావితం చేసి మంచి వైపునకు మరల్చడానికే తప్ప మనకు సద్గతిని ఇవ్వలేదు. 


లెక్కలేనన్ని పాపాలు చేసి..

'ఓ దేవుడా! నాకు సద్గతిని ప్రసాదించండి!' అని ప్రార్ధన చేస్తే సద్గతి కలుగుతుందా!?


కాదు! 


ప్రార్థనతో పాటు మంచి కర్మలు కూడా చేయాలి. అపుడే మానవ జన్మ కు సార్థకత చేకూరుతుంది.```✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

గంగను విడువరాదా

 శ్లోకం:☝️

  *అంబాకుప్యతి తాత మూర్ధ్ని*

*విలసద్గంగేయ ముత్సృజ్యతాం*

  *విద్వన్ షణ్ముఖ కాగతిః మయి*

*చిరా దస్యాస్థితాయా వద l*

  *కోపావేశవశాదశేషవదనైః*

*ప్రత్యుత్తరం దత్తవాన్*

  *అంబోధిః జలధిః పయోధిః*

*ఉదధి ర్వారాన్నిధి ర్వారిధిః ll*


భావం: "ఓ తండ్రీ! అమ్మ కోపిస్తుంది. మీ తలపైనున్న ఆ గంగను విడువరాదా!" అన్నాడు కుమారస్వామి. 'ఓ షణ్ముఖా! చిరకాలంగా నన్నాశ్రయించుకున్న ఆమెకి గతియేది?' అని ఈశ్వరుడు జవాబివ్వటంతో కోపావేశవశుడైన కుమారుని ఆరు ముఖాలనుంచీ యీ విధంగా జవాబు వచ్చింది. 'అంబోధిః జలధిః పయోధిః ఉదధిః వారాంనిధిః వారిధిః' అనగా "గంగకు సముద్రమే గతి" యన్నాడని భావం.

 .

            _*శుభోదయమ్*_


           _*సుభాషితములు*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*బీజం తు వర్ధతే శాన్త్యా*

*పతన్తి ధ్వనినా ద్రుమాఃl*

*వృద్ధిర్భవతి శాన్త్యా చ*

*వినాశః ధ్వనినా సహll*


తా𝕝𝕝 

విత్తనములు నిశ్శబ్దంగా మొలకెత్తుతాయి... అలాగే నిశ్శబ్దంగానే మహావృక్షములై ఎదుగుతాయి.... అవి వృక్షమై కాలాంతరంలో పడిపోయినప్పుడు పెద్దశబ్దంతో కూలిపోతాయి..


[ *వినయవిధేయతలే అభివృద్ధికి హేతువులు.....అవి లేనినాడు పతనం అనివార్యం‌* ]




*ఏకైకాగౌస్త్రయస్సింహాః పంచవ్యాఘ్రాఃప్రసూతిభిః|*

*అధర్మోనష్టసంతానో ధర్మఃసంతానవర్ధనః||*


తా𝕝𝕝 

ఆవు ఒకటే దూడని ఈనుతుంది, సింహాలు మూడు, పులులు ఐదేసి చొప్పునా పిల్లలను కనవచ్చుగాక , కానీ గోజాతి మాత్రమే అంతకంతకూ వృద్ధి చెందడం గమనించవచ్చు. ధర్మపరుల వంశం కూడా అలాగే వృద్ధిలోకి వస్తుంది. *అధర్మాన్ని ఆశించి బతికే వంశం అడుగంటక తప్పదు.*

శంకర నారాయణ డిక్షనరి* కథ

 *శంకర నారాయణ డిక్షనరి* కథ 


ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.

ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....

వాడి భాష మనకి రాదు...

వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు.

మనకి అది "గాడిద గుడ్డు" గా అర్థమైంది.

మనం "రాజమహేంద్రి" అన్నాం...

వాడికి "రాజమండ్రి"లా వినిపించింది.

మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు.

వ్యాపారం, పరిపాలన వాళ్ళ అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ళ ముందు) తయారు చేశాడు.

చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కానీ అందరికీ అంత దృశ్యం ఉండేది కాదు. వీళ్ళు ముక్కస్య ముక్కానువాదం చేసేవారు.

గుడిమెట్ల బంగారయ్య అంటే .....  Temple steps golden father అని..

పత్తికొండ నాగప్ప అంటే  cotton mountain cobra father అని 

తోటకూర అంటే Garden to come  అనీ చిత్ర విచిత్రంగా అను"వధించే" వారు.

అలాంటి సమయంలో తెల్లోడి భాషను తెల్లోడి కన్నా తేటతెల్లంగా నేర్చుకుని, ధారాళంగా మాట్లాడేయడం అంటే మాటలు కాదు. ఇంకా ఇంగ్లండుకు పోయి ఉన్నత విద్య నేర్చుకోవడం వంటివి అలవాటు కాలేదు. అలాంటి రోజుల్లో తెల్లోడే తెల్లబోయేలా ఇంగ్లీషు మాట్లాడే వాడికి బోలెడంత డిమాండ్ ఉండేది.

అలాంటి వాడే మన నాయకుడు. ఆయన పేరు పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి. సొంతూరు నెల్లూరు. కానీ మద్రాసులో స్థిరపడ్డారు. తండ్రి రామానుజం చెట్టి నుంచి ఇంగ్లీషు నేర్చుకున్నారు. తండ్రిలాగానే దుబాషీ అయ్యారు. తండ్రి గంజాంలో రస్సెల్ అనే తెల్లదొరకు దుబాషీగా పనిచేసేవాడు. ఈయన విజయనగరం మహారాజా, జయపురం మహారాజా, పిఠాపురం, కొచ్చి, నూజివీడు జమీందారీ కుటుంబాల పిల్లలకు ఇంగ్లీషు చదువులు చెప్పారు. ఆ తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్కల మేస్టారుగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో పరీక్షాధికారిగా కూడా పనిచేశారు. అంటే తన జీవిత కాలంలో ఆయన తమిళనాడు రాజధాని మద్రాసు, ఒరిస్సాలోని గంజాం, జయపురం, మన రాష్ట్రంలోని విజయనగరం, పిఠాపురం, నూజివీడు, నెల్లూరు, కేరళలోని కొచ్చి లను సందర్శించాడన్న మాట. ఆ రోజుల్లోనే ఆయన ఉద్యోగాల కోసం ఊరు వదలిన మహాసాహసి అంటే అడ్వెంచరర్ అన్న మాట.

రాచబిడ్డలకు చదువులు చెబుతున్నప్పుడే ఆయన వారి సౌలభ్యం కోసం ఇంగ్లీషు పదాలు, వాటి తెలుగు అర్థాల జాబితాను తయారు చేశారు. తరువాత దాన్నే వ్యవస్థీకరించి తెలుగువాడు తయారు చేసిన తొలి ఇంగ్లీషు తెలుగు డిక్షనరీని తయారు చేశారు. అంతే కాదు ... ఆయన తమిళ - ఇంగ్లీషు, ఇంగ్లీషు - తమిళ డిక్షనరీలను కూడా తయారు చేశారు. 1900 ప్రాంతంలో తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ కూడా తయారు చేశారు.

తన అవసరం కోసం ఇంగ్లీషు వాడు తయారు చేసినవి కాకుండా మన అవసరం కోసం మనవాడు తయారుచేసిన మొట్టమొదటి డిక్షనరీలు ఇవేనేమో!

ఆయన తయారుచేసిన తెలుగు డిక్షనరీ 1897లో ప్రచురితమైంది. దాని పేరే శంకరనారాయణ డిక్షనరీ. అప్పటి నుంచీ ఇంగ్లీషు నేర్చుకోవాలనుకున్న వారందరికీ శంకరనారాయణ డిక్షనరీయే ఆధారమైంది. అందరికీ ఆధునిక వేదమైంది. ఆయన బతికుండగానే అయిదు ముద్రణలకు నోచుకుంది. ప్రతి ముద్రణకీ కొత్త పదాలు జోడయ్యాయి. ఆయన 1924-25 ప్రాంతంలో చనిపోయారు. ఆ తరువాత 1927 లో గిడుగు సీతాపతి గారు, 1951 లో చిలుకూరి నారాయణ రావు గారు, తరువాత వేదం లక్ష్మీనారాయణ గారు కొత్తకొత్త పదాలను జోడించారు. 1953 లో నారాయణ అయ్యర్ దీనిని పరిష్కరించారు. ఇలా 1897 నుంచి 1953 వరకూ పదకొండు సార్లు పునర్ముద్రణ పొందింది ఈ డిక్షనరీ. కోస్తా జిల్లాల్లో ఇప్పటికీ ఈ డిక్షనరీయే ప్రామాణికం. తరతరాల విద్యార్థులకు ఇది హస్త భూషణంగా నిలిచింది. అనుమానం వస్తే చాలు ఆ పుస్తకం తీస్తారు. అంత ప్రజాదరణ ఉంది ఈ డిక్షనరీకి. 2004 అక్టోబర్లో విజయవాడకు చెందిన విక్టరీ పబ్లిషర్స్ దీన్ని మళ్లీ ముద్రించారు. ఆగస్టు 2005 నాటికి మలి ముద్రణ అవసరమైంది. మళ్లీ 2006, 2007లలో పునర్ముద్రించాల్సి వచ్చింది. ఈ నిఘంటువు ప్రజాదరణకు ఇదే నిదర్శనం.

కోస్తా, తమిళనాడుల్లో ఆంగ్ల భాష నేర్చుకోవడంలో ఆయన పాత్ర అనన్య సామాన్యం. ఆయన పేరుతోనే ఆయన వ్రాసిన డిక్షనరీ పేరొందింది. ఇప్పటికీ శంకరనారాయణ డిక్షనరీ అంటే ప్రామాణికమే.

పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి ఇప్పుడు లేరు. ఆయన పోయి దాదాపు తొంభై ఏళ్లు దాటింది. కానీ లక్షలాది మంది విద్యార్థులు ఆంగ్ల పదం విషయంలో అనుమానం రాగానే "శంకరనారాయణను తీసి చూడు" అనుకుంటూ అప్రయత్నంగానే ఆయనను తలచుకుంటూనే ఉంటారు.

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 93*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 93*


శకటాలుడు ఆ లేఖ చదవడం ముగించగానే.... 


"జయహో.... చంద్రగుప్త రాజేంద్రా.... జయహో.... జయహో...." 


"జయహో.... మౌర్య సామ్రాజ్యాధినేతా.... జయహో.... జయహో....." 


సభాసదుల నినాదాలతో సభాభవనం యావత్తు హోరెత్తిపోయింది. కొద్దిక్షణాలపాటు సభికుల ఉత్సాహాన్ని నినాదాల రూపంలో కొనసాగినిచ్చి, పరోక్షంగా వారందరి మద్దతునూ చంద్రునికి కూడబెట్టిన చాణక్యుడు చెయ్యెత్తి వారిని వారిస్తూ... 


"తమ ఉత్సాహపూరిత నినాదాలతోటే చంద్రగుప్త మౌర్యునికి తమ మద్దతు తెలిపిన సభాసదులకూ, యావత్తు మగధ రాజ్య ప్రజానీకానికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు... ఈ కథలో... కొంత భాగం మీలో చాలామందికి తెలుసు. మరి కొంత చాలామందికి తెలియదు... 'ధర్మో రక్షతి రక్షితః'... కానీ మగధలో నందుల దుష్టపాలనలో ధర్మం నశించింది. అది మీ అందరికీ తెలుసు. ఇచట మరల ధర్మ ప్రతిష్టాపన నిమిత్తమే... నందులను శిక్షించవలసి వచ్చింది. దుష్ట శిక్షణ సందర్భంలో వారిని అంటిపెట్టుకుని వున్న కొందరు శిష్టులు కూడా బలి అవుతారు. అది సహజం. నేపాళ ప్రభువు పర్వతకుడు, వారి సోదరుడు వైరోచనుడు మంచివారైనా దుష్టనందుల సావాసం చేసిన కారణంగా శిక్షించబడ్డారు... ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే....?  


'చాణక్యుడు ప్రతిజ్ఞ చేశాడు, దానికోసమే నందులను హతమార్చడానికి కుట్రచేశాడు' అని ఇంకా కొందరు భావిస్తున్నారు. కుట్రj చేసింది నేనా ? మహానందుల వారి మీద నవనందులా ? ఆనాడు ధర్మసంస్థాపనార్థం శ్రీ కృష్ణభగవానుడు కురుక్షేత్ర సంగ్రామాన్ని జరిపించాడు. నేను అంతటి వాడిని కాదు. ధర్మరక్షణకు కట్టుబడిన సామాన్య బ్రాహ్మణుడిని... ధర్మం మహానందుల వారి పక్షాన ఉంది. అందుకే ధర్మపరిరక్షణార్థం, మీ మహారాజుల వారి ఆశయాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను ప్రయత్నించాను తప్ప, నాకు విరోధులంటూ ఎవ్వరూ లేరు. నిజం నాకు తెలుసు. నా ఒక్కడికీ తెలిస్తే చాలదు. మగధ ప్రజలందరికీ తెలియాలి. యీ మహాసభలో సామంతరాజులున్నారు, సచివులున్నారు, పురప్రముఖులున్నారు, విదేశీ పర్యటకులున్నారు, చరిత్రకారులున్నారు. సత్యం ఏమిటో వారందరికీ తెలియాలి. అందరూ ఆమోదిస్తేనే... మగధ సామ్రాజ్యానికి చంద్రగుప్తుడే నిజమైన వారసుడని అందరూ అంగీకరిస్తేనే... అతడు సింహాసనాన్ని అధిష్టిస్తాడు... రండి... మహానందుల వారి లేఖానుసారం చంద్రగుప్తుని గుర్తింపు చిహ్నాలను పరీక్షించండి... ఇదిగో, మహానందుల వారి నామాంకితమైన రాజముద్రిక. దీన్ని పరిశీలించండి... నిజాన్ని నిగ్గు తేల్చండి... సందేహాలకు, సంశయాలకు తావులేకుండా సత్యాన్ని ప్రకటించండి...." అని ప్రకటించాడు చాణక్యుడు ఉద్విగ్న గంభీర స్వరంతో. 


చాణక్యుని ఆహ్వానాన్ని అనుసరించి కొందరు ప్రముఖులు ముందుకు వచ్చి మహానందుల వారి లేఖనుసారం చంద్రగుప్తుని గుర్తింపు చిహ్నాలనూ, రాజముద్రికనూ పరిశీలించి పరీక్షించి ఆమోద సూచకంగా తలలుపారు. 


"సత్యమేవ జయతే... ధర్మమేవ జయతే... మగధ సామ్రాజ్యానికి యీ చంద్రగుప్త మౌర్యుడే అసలైన వారసుడు. మగధ సింహాసనాన్ని అధిష్టించగల అర్హత మురాపుత్రుడు చంద్రగుప్తునికి మాత్రమే ఉన్నది" అంటూ ధర్మమూర్తుల ప్రకటన వెలువడగానే సభాస్థలియావత్తూ కరతాళధ్వనులతో దద్దరిల్లిపోయింది. 


"మీ అందరి ఆమోదంతో... మీ అందరి అభీష్టానుసారం... 'మురా - మహానందుల' వారి అనుంగుపుత్రుడు చంద్రగుప్తుడు మగధ రాజ్యాధీషుడుగా ఇప్పుడు పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు... నేటినుంచీ ఇది 'మౌర్య సామ్రాజ్యం'గా గుర్తింపు పొందనున్నది.... కుమారా ... చంద్రగుప్తా... ! రా... మౌర్య సింహాసనాన్ని అధిష్టించు..." అని ఆహ్వానించాడు చాణక్యుడు సభికుల హర్షాతిరేకాలు వెల్లువెత్తుతుండగా. 


రాజపురోహితులు వేదమంత్రాలు పఠిస్తూ 

పూర్ణ కలశంతో ముందు నడవగా, వైతాళికులు స్తోత్రపాఠాలతో గానం చేస్తుండగా, సుందరాంగనలు సుగంధపరిమళభరిత పుష్పాలను వెదజల్లుతుండగా, శకటాలుడు, భద్రభటుడు, బాగురాయణుడు, డింగరాత్తుడు తదితర మంత్రి, సేనానులు వెనకగా నడవగా... 


సభాసదుల యావన్మందీ మహోత్సాహంతో జయ జయ ధ్వనులు సలుపుతుండగా... 


చంద్రగుప్తుడు మందగమనంతో ముందుకు నడిచి, ముకుళిత హస్తద్వయంతో యావన్మందికీ వినయాంజలులు సమర్పించి... వేదమంత్రోచ్చాటనల నడుమ సింహాసనాన్ని అధిష్టించాడు. రాజపురోహితుడు మౌర్యుని శిరస్సుపై వజ్రవైడూర్య మణిమయ విరాజితమైన స్వర్ణమకుటాన్ని అలంకరించాడు. దివినుంచి దేవతలు సైతం పుష్ప వర్షం కురిపిస్తున్నారా అన్న చందాన నలువైపులనుంచీ చంద్రునిపై పుష్పవృష్టి కురిసింది. 


"జయహో... మౌర్య సామ్రాజ్యస్థాపనాధీశా... ! చంద్రగుప్త మౌర్య రాజేంద్రా... ! జయహో .... జయహో..." అంటూ దిక్కులు పిక్కటిల్లేలా జయజయధ్వనులు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ సభ ఆసాంతం వరకూ ...

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

రవీంద్రనాథ్ టాగూర్


ఒకసారి రవీంద్రనాథ్ టాగూర్ జపాన్ కు వెళ్ళాడు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకం పై ఓ పది రోజుల పాటు రోజూ సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ప్రసంగించేవాడు. ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు. ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు. రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు. ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజా పూలమాలతో సత్కరించేవాడు. ఆయన ప్రవర్తన చాలా సాదాసీదా గా ఉండేది. రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు. ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్లమాలిన అభిమానం.

రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది గౌరవభావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు. ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలా మంది వినేవారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది. ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపనీ మహర్షి దగ్గరికీ, శ్రీరామచంద్రుడు తమ కుల గురువైన వశిష్ఠముని దగ్గరికీ వెళ్ళారు.

ఆ ముసలాయన ప్రతి రోజూ రవీంద్రుల ముందు మోకరిల్లేవాడు. ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తరువాత చాలామంది బంగారు నాణేలు, ధనం, పండ్లు, పూలు ఆయనకు సమర్పించారు. ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాద పూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు.

రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నాడు కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించాడు. ఆ ముసలాయన మనస్సు ఆనందంతో పులకించిపోయింది.

టాగూర్ తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు. “ఈ పెద్దాయన చూస్తే ఉద్విగ్న మనస్కుడిలాగా ఉన్నాడు. మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది. అలాగే వారి పిల్లలకు కూడా 200 యెన్ లు ఇవ్వండి.”

ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా మూడు ముప్పావు అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో టాగూర్ ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు. అంతకు మునుపు టాగూర్ నాలుగు గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు. ఆయన రవీంద్రుని ఆ కార్లో ఎక్కించుకుని ఓ కొండ లాంటి ప్రదేశం పై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్ళాడు. వెళ్ళగానే వాచ్‌మాన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేశాడు. లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు. బంగారు పాత్రల్లో సుమారు రెండు వందల రకాల వంటలు రుచి చూపించారు. ఆయన కుటుంబమంతా టాగూర్ కు పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు.

రవీంద్రుల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధుడితో “మీరు నన్ను ఎక్కడికి తీసుకు వచ్చారు? దయచేసి మీ ఇంటికి తీసుకు వెళ్ళండి. ఈ భవనానికి ఎందుకు తీసుకువచ్చారు?” అన్నాడు.

అప్పుడాయన “ఓ ఋషి వర్యా! ఇదే నా ఇల్లు. ఈ కార్లు, ఈ బంగళా అన్నీ నావే. నీ ముందు మోకరిల్లిన వారు అంతా నా భార్యా, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాండ్రు. నాకు రెండు కార్మాగారాలున్నాయి.”

“ఓ అయితే మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరకు వచ్చేటపుడు అతి సాధారణంగా వచ్చేవారు. ఎందుకో తెలుసుకోవచ్చా?” అనడిగాడు రవీంద్రుడు.

“స్వామీ! భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం. ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందే ఎవరికీ తెలియదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలు కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు. ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ ఉండదు.”

“అమూల్యమైన ఆత్మాజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలంతా చాలా చిన్నవి. ఈ సంపదలు నాకు కష్టాలు కొనితెచ్చిపెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్నిస్తున్నది. నా జీవితమంతా మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. ఇప్పటి దాకా సిరిసంపదలే ధ్యేయంగా బతికాను. అవేవీ నాకు సంతోషాన్నివ్వలేదు. మీరు చెప్పిన ప్రతి మాటా నా అజ్ఞాన పొరలను తొలగించాయి.నేను మామూలు దుస్తులు వేసుకుని మీ దగ్గరకు రావడానికి కారణం, జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను ఓ యాచకుణ్ణి మాత్రమే అని సూచించడానికే. మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.”

ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కాబట్టి ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది, సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరిసంపదలకు విలువ లేదు.

రవీంద్రుల వారు సంతోషంగా “ఓ మిత్రమా! నీకు సిరిసంపదల కన్నా ఆత్మసాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువ. నీవు నిజంగా ధనవంతుడవే. నీ లాంటి శిష్యుని కలుసుకున్నందుకు నాకు ఈ రోజు చాలా సంతృప్తిగా ఉంది. నా బోధనలకు సార్థకత చేకూరింది.”

“నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతిక మైన సుఖ సంపదల కోసం అడుగుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసేవారు. కానీ మీరు తెలివైన వారు. మీరు అడగకపోయినా భగవంతుడు మీకు అన్నీ ఇస్తున్నాడు. మీ జ్ఞాన తృష్ణను తీర్చడానికే నన్ను ఆ భగవంతుడు ఇక్కడికి పంపినట్లున్నాడు.” అని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు.

ఈ రోజు పద్యము:

 193వ రోజు: (స్థిర  వారము) 17-06-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


ఆచార్యున కెదిరింపకు

బ్రోచిన దొర నిందసేయఁ బోకుము కార్యా 

లోచనము లొంటిఁజేయకు

మాచారము నిడువఁబోకుమయ్య కుమారా!


 ఓ కుమారా!  ఉపాధ్యాయుని ఎదిరింపవలదు. నిన్నుగాపాడిన వారిని తిట్టవద్దు. ఏదయినా ఆలోచనము చేయుటలో ఒంటరిగా జేయవద్దు. బమంచి నడవడిని వదిలిపెట్టవద్దు. 


ఈ రోజు పదము. 

గృహస్తుడు: అతిథేయుడు, ఇంటికాపు, గృహపతి, గృహస్థు, గృహి, యజమాని, వాస్తవ్యుడు, శ్రేష్ఠాశ్రముడు, సంసారి.

యీశ్వరుడు

 ఉ.

ఆతడనాది యీశ్వరుడు నద్రికనుంగుసుతాత్మసఖ్యుడున్ 

భీతిలజేయు చేదు దను బ్రీతిగ గ్రోలిన విశ్వత్రాతయున్ 

భూతివిభూతిభూషిత ప్రభూత్తముడున్ స్మరవైరి శాంతుడున్ 

దాతయు హర్తయౌ నతడు తా సతి గూడియు బ్రోచునెల్లెరన్ 

*శ్రీశర్మద*

భజగోవిందం

 ॐ                 भज गोविन्दं

                    భజగోవిందం 

                 (మోహముద్గరః) 

            BHAJA GOVNDAM   

 

      (श्रीमच्छंकरभगवतः कृतौ 

       శ్రీమచ్ఛంకరభగవత్పాద కృతం 

           BY SRI ADI SANKARA)


                           శ్లోకం :25/31

                   SLOKAM :25/31

                    


శ్రీ మేధాతిథి 


शत्रौ मित्रे पुत्रे बन्धौ,

मा कुरु यत्नं विग्रहसन्धौ।

सर्वस्मिन्नपि पश्यात्मानं,

सर्वत्रोत्सृज भेदाज्ञानम्॥२५॥ 

                    ॥भज गोविन्दं॥ 


శత్రౌ మిత్రే పుత్రే బంధౌ 

మా కురు యత్నం విగ్రహ సంధౌ |

సర్వస్మిన్నపి పశ్యాత్మానం 

సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం ||25|| 

                    ॥భజ గోవిందం॥ 


    శత్రువు గాని, మిత్రుడు గాని, పుత్రుడు గాని,  బంధువు గాని 

  - వీరిపట్ల శత్రుత్వమో, స్నేహమో చేసే యత్నం మానుకో. 

    అందరిలోను ఆత్మను చూస్తూ, భేదభావాన్ని అన్ని సందర్భాలలోనూ విడిచిపెట్టు. 


అనువాదం 


ఆత్మ కన్న నీవు వేరను అజ్ఞానమును 

విడిచి, సర్వమాత్మయను 

                   సత్య మెరిగి నీవు 

చరియింపుమీ నా వారు 

                    పెఱవారనియెడు 

వింగడము మరచి, 

   కయ్యము నెయ్యము విడిచి. 


    शत्रु, मित्र, पुत्र, बन्धु-बांधवों से प्रेम और द्वेष मत करो, 

    सबमें अपने आप को ही देखो, 

    इस प्रकार सर्वत्र ही भेद रूपी अज्ञान को त्याग दो॥२५॥ 


Try 

  - not to win the love of your friends, brothers, relatives and son(s) or 

  - to fight with your enemies. 

    See yourself in everyone and give up ignorance of duality everywhere. 


https://youtu.be/ImWKhB_PMiw 


                          కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం