6, జులై 2025, ఆదివారం

Panchang


 

విత్తమున్న వరకె

 విత్తమున్న వరకె విలువ ధనికునికి,

బలముయున్న వరకె బంధు సఖులు, 

పదవియున్న వరకె పరివారసేవలు,

సత్క్రియలు నిలుపును శాశ్వతముగ!

ఆదివారం🌞* *🌹06 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌞ఆదివారం🌞*

  *🌹06 జూలై 2025🌹*    

    *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - శుక్లపక్షం*


*తిథి  : ఏకాదశి* రా 09.14 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం   : విశాఖ* రా 10.42 వరకు ఉపరి *అనూరాధ*


         *ఈనాటి పర్వం*

  *సర్వేషాం శయనైకాదశి*  

      ( *తొలి ఏకాదశి* )


*యోగం : సాధ్య* రా 09.27 వరకు ఉపరి *శుభ*

*కరణం   : వణజి* ఉ 08.08 *భద్ర* రా 09.14 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.30 - 09.30 మ 02.00 - 04.30*

అమృత కాలం  : *మ 12.51 - 02.38*

అభిజిత్ కాలం  : *ప 11.46 - 12.38*

*వర్జ్యం          : రా 03.07 - 04.53*

*దుర్ముహూర్తం  : సా 05.00 - 05.52*

*రాహు కాలం   : సా 05.06 - 06.44*

గుళికకాళం       : *మ 03.28 - 05.06*

యమగండం     : *మ 12.12 - 01.50*

సూర్యరాశి : *మిధునం*   

చంద్రరాశి : *తుల/వృశ్చికం*

సూర్యోదయం ;*ఉ 05.47*

సూర్యాస్తమయం :*సా 06.55*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 05.40 - 08.17*

సంగవ కాలం         :      *08.17 - 10.54*

మధ్యాహ్న కాలం    :     *10.54 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 04.08*

*ఆబ్ధికం తిధి         : ఆషాఢ శుద్ధ ఏకాదశి*

సాయంకాలం        :*సా 04.08 - 06.44*

ప్రదోష కాలం         :  *సా 06.44 - 08.55*

రాత్రి కాలం           :*రా 08.55 - 11.50*

నిశీధి కాలం          :*రా 11.51 - 12.34*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.13 - 04.57*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


 *🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞* 


*ఓం సత్యతేజోజ్జ్వలజ్వాలామాలినే* 

*మణికుంభాయ హుం ఫట్ స్వాహా*

*ఓం స్థితిరూపకకారణాయ*  

*పూర్వాదిగ్భాగే మాం రక్షతు*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

తొలి ఏకాదశితో

 ఈ నాటి ఆషాఢ మాసపు తొలి ఏకాదశితో శ్రావణ మాసంలో మనం జరుపుకొను ఎన్నో పండుగల సంబరాలు ఆసన్నమయినట్టే.


సాధారణంగా ఏకాదశి పర్వదినాన్న పెక్కుమంది ఉపవాసాలు ఉంటారు. ఏకాదశి ఉపవాశమన్నది ధాన్యాలతో వండినవి ఆరగించడం నిషేధం అన్నట్టు. అంటే ధాన్యాలు కాకుండా మిగిలినవి ఏవైనా అంటే పచ్చి కూరగాయలు గాని పండ్లు గాని తినగలం. మరుసటిరోజు ద్వాదశి ఘడియలు ఆసన్నం కాగానే పారణ చేపట్టాలి. 


కాని పలువురు మరుసటి రోజు నిత్యపూజ నైవేద్యాలు అయిన తర్వాతనే భోజనానికి ఉపక్రమిస్తారు కదా. అలాంటి వారు ద్వాదశి పారణ ఎలా చేయాలి మరి. సరియైన సందేహమే. 


అలా నిత్యపూజ చేసిన తర్వాత మహా నైవేద్యం సమర్పించి గాని భుజించనివాళ్ళు ఈ ఏకాదశి పారణను ఎలా చేపట్టాలి అన్న విషయాన్ని ఎవరైనా తెలియజేయగలరు.

తొలి ఏకాదశి

 ప్రియ బంధువులందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు 💐💐🙏🏼. 

మనకు ఒక ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. దీనినే పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ నాటి నుంచి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అందుకే దీనిని శయనైకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం.

సమాజ సేవ

 *సమాజ సేవ - అభినందనలు*


సభ్యులకు నమస్కారములు.


వ్యక్తి జీవితమంటే *నిబంధిత* అభ్యసనము. సామాజిక జీవితమంటే *సంబంధిత* అభ్యసనము. సమాజ సేవను *సహజత్వంగా* ప్రతి ఒక్కరు అభ్యసించాలి, ఆచరించాలి. సమాజ సేవలో వ్యక్తితం, సంస్కృతి, ఇంగిత జ్ఞానం ప్రస్పుటమవుతుంది. 


సమాజ సేవ చేయడానికి అందరికీ అవకాశం ఉండవచ్చును లేదా ఉండక పోవచ్చును కారణాలు ఏవైనా. *కాని, సమాజ చేసే వారిని మాత్రం అందరూ అభినందించాలి*. ప్రశంస అనేది చాలా ముఖ్యం. మంచి వారిని, మంచి పనులు చేసే వారిని, ఉన్నతులను మనకంటే అధికులను ప్రశంసించుట, అభినందించుట. *సదరు ప్రశంసా వాక్కుల అర్థం భగవంతుడు మనుష్యులకు ఇచ్చిన వాక్కును పునీతము చేసుకొనుటయే* .


సదరు ప్రశంసలు సమాజ సేవ చేసే ఉన్నతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది, సమాజ కళ్యాణకారకమవుతుంది.


యువ సమాజ సేవకులకు ఈ ప్రశంసలు మరింత అవసరము. ఎదిగే క్రమంలో ప్రశంస, మెప్పుదల, మెచ్చుకోలు అనేవి ఎంతో శక్తిని, స్ఫూర్తిని ఇస్తాయి. యువతలోని శక్తి సామర్థ్యాలను, సృజనాత్మకతను, నైపుణ్యాలను వెలికితీసి సానబెట్టడానికి సదరు ప్రశంసలు ఎంతో దోహదం చేస్తాయి.


*ఎవరో మెచ్చాలని పూవు పూయదు, పరిమళించదు. పూవు పూయడం, సుగంధాలు వెదజల్లడం, దాని స్వభావం*. వృక్షం తన ఫలాలను తాను భుజించదు ఇతరులకు ఇస్తుంది. గోవు తన క్షీరాన్ని తాను త్రాగదు. ఇతరులకు సేవ చేయుటలోనే నిజమైన ఆనందమున్నది. *తనకోసమే తాను బ్రతకడం పశు పక్షాదుల కంటే హీనం*. 


ప్రకృతి తన సహజ పద్ధతుల్లో ముందుకు సాగుతుంది. ఈ ఉపమాన ఆధారంగా మనుష్యులు కూడా *మానవత్వాని ప్రదర్శిస్తూ సమాజ సేవ చేయాలి*.


ధన్యవాదములు

ఆవకాయ

 అందరికీ నమస్కారమండీ 🙏

 నా పేరు వసంత లక్ష్మి. మేము వైజాగ్ లో ఉంటాము. నేను కొన్ని రకాల పచ్చళ్ళు, పొడులు తయారు చేస్తున్నాను.

 . 

 ఆవకాయ

 మాగాయ 

 టమోటో ఊరగాయ  

 గోంగూర పచ్చడి

 నిమ్మకాయ

 దోసావకాయ 

 ఉసిరి ఆవకాయ 

 అల్లం పచ్చడి

 కరివేపాకు పచ్చడి.

 టమోటా పండు మిర్చి పచ్చడి 

 గోంగూర పండు మిర్చి పచ్చడి 

 పండుమిరపళ్ళ పచ్చడి 


 పొడులు:


 కందిపొడి

 శనగపొడి 

 నువ్వు పొడి 

 కరివేపాకు కారం పొడి 

 ఇడ్లీ కారప్పొడి 

 అవిసె గింజలు నువ్వు పప్పు కలిపిన కారప్పొడి 

 రసం పొడి

 సాంబార్ పొడి

 కూర కారం 

 వెల్లుల్లి కారం పొడి 


 ఇవి తయారు చేస్తున్నానండి. కావలసిన వాళ్లు సంప్రదించండి.

 సిరిపురపు వసంతలక్ష్మి

 ఫోన్ నెంబర్:9818828864.

సెక్టార్ -9,ఎంవీపీ కొలనీ,

 విశాఖపట్నం.




Namaskaram to all 🙏.

My name is Vasanta Lakshmi from Visakhapatnam. I prepare pickles and podis. They are:

Pickles and chutneys :

Mango Avakaya

Magaya

Tomato pickle 

Karivepaku pachhadi 

Lemon 

Gongura 

Dosavakaya 

Usiri Avakaya 

Allam pachhadi 

Red chilli pickle

Red chill gongura pickle

Tomato red chilli pickle


Podis :

Kandi podi 

Sanaga podi 

Idly karappodi 

Karivepaku karappodi 

Noopodi 

Avisaginjalu (flax seeds )

Noopappu kalipina 

karappodi 

Garlic karappodi 

Rasam powder 

Sambar powder 

Kura karam.

If you are interested in purchasing these products feel free to contact below number.

Thanks and regards 🙏.

S. Vasanta Lakshmi 

Ph. No: 9818828864

Sector-9, MVP colony,

Visakhapatnam.

తొలి ఏకాదశి*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀నేడు…


                  *తొలి ఏకాదశి*

                   ➖➖➖✍️```

   -యల్లాప్రగడ మల్లికార్జునరావు.



తొలి ఏకాదశిని సర్వపాపహారిగా పిలుస్తారు. విష్ణు ప్రీతికరమైన తొలి ఏకాదశి నాడు ఉపవాసం, తీర్థక్షేత్రాల సందర్శనం ముఖ్యవిధులు. శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే ఏకాదశి కనుక దీనినే "శయన ఏకాదశి" అంటారు. ఈ ఏకాదశి తరువాత దక్షిణాయనం ప్రారంభమవుతుంది. దాంతోపాటే మన పండుగలు వరస కడతాయి.


నెలలో పదకొండో రోజును, ఇరవై ఏడో రోజును కూడా "ఏకాదశి" అనే పిలుస్తారు.


పౌర్ణమికి ముందు ఒకటి, అమావాస్యకు ముందు ఒకటి వస్తుంటాయి. మొత్తంమీద ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. అధికమాసం ఉంటే ఈ సంఖ్య 26కు పెరుగుతుంది.


ఏకాదశి తిథి విష్ణువుకు ప్రీతికరమైంది. ఆషాఢ శుక్ల ఏకాదశి మరింత పవిత్రమైనది. దీనిని "శయనఏకాదశి" అని కూడా అంటారు. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తిక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రను చాలిస్తాడు. ఈ నాలుగు నెలలూ పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్షలు చేస్తుంటారు.```


*కాలగమనంలో మార్పు*``` 

తొలి ఏకాదశితో కాలగమన మార్పు సూచితమవుతుంది. ఆరోజునుంచి భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి. అంటే నిద్రా సమయాలు పెరుగుతాయి. దానికి అనుగుణంగా దైనందిన కార్యకలాపాలను నిర్వహించుకోవాలని చెప్పడానికే పెద్దలు ఇటువంటి పండుగను ఏర్పరచారు.


విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. విష్ణువు అనే పదానికి సందర్భానుసారంగా సూర్యుడు అని అర్థం కూడా చెబుతారు. సూర్యనారాయణుడు అనేది అందుకే. తొలి ఏకాదశిలో సూర్య ప్రస్తావన కనిపిస్తుంది. ఎలా అంటే... అప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, తొలి ఏకాదశి రోజు తరువాత నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే, అప్పటినుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇలా వాలటాన్నే నిద్రపోవడంగా భావించడం వల్ల ఆ భావనే ప్రచారంలోకి వచ్చినట్టు కనిపిస్తుంది.```


*పురాణ కథలు*```

భవిష్యోత్తరపురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఏకాదశి మహిమ గురించి వివరించాడు. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడైన మురాసురునితో యుద్ధం చేసే సమయంలో విష్ణువు శరీరం నుంచి ‘ఏకాదశి’ కన్య జన్మించింది. ఆమె అంటే, విష్ణువుకు ఎంతో ఇష్టమని పలు పురాణ కథలు పేర్కొంటున్నాయి. ఏకాదశీ వ్రతాన్ని ఆచరించిన రుక్మాంగదుడు మోక్షాన్ని పొందిన కథ పురాణ ప్రసిద్ధం. ముఖ్యంగా తొలి ఏకాదశినాడు సతీసక్కుబాయి మోక్షం పొందింది. 


షట్చక్రవర్తులలో ఒకడైన మాంధాత రాజ్యంలో ఒకసారి తీవ్ర కరవు వచ్చింది. దానితో, ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగీరసుడి సూచన మేరకు ‘శయనైకాదశి’ వ్రతాన్ని భక్తితో నిర్వర్తించాడు. 

ఆ వ్రతఫలంతో మంచి వర్షాలు కురిసి దేశం సుభిక్షమై కరవు తీరి ప్రజలు సుఖపడ్డారన్నది పురాణ గాథ.

```


*ఉపవాసం - ఆరోగ్యం*```

వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీన్ని ‘తొలి ఏకాదశి’ అని కొందరు పండితుల అభిప్రాయం. 


ఏకాదశి అంటే పదకొండు. 

అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని అంటారు. ఉపవాసం చేయడం వల్ల జీర్ణకోశం శుభ్రమై దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. కఠినమైన రోగాలనుంచి తట్టుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఉపవాస సమయంలో ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు.


తొలి ఏకాదశినాడు విష్ణుభక్తులు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. ఆ పేలపిండినే విష్ణువుకు నివేదించి, ఉపాహారంగా తీసుకుని, ఉపవాసం చేస్తారు. ఆలయాల్లో కూడా పేలపిండి ప్రసాదంగా పంచే ఆచారం ఉంది. తొలిఏకాదశి నాడు ఉపవాస జాగారాలతో విష్ణువును పూజించడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం.✍️```

*Courtesy: *భక్తి* మాసపత్రిక

*సేకరణ:* 🙏

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

శ్రీ గోండేశ్వర్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1164


⚜ మహారాష్ట్ర : సిన్నార్


⚜  శ్రీ గోండేశ్వర్ ఆలయం



💠 గోండేశ్వర ఆలయం  భారతదేశంలోని మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని సిన్నార్ అనే పట్టణంలో ఉన్న 11వ-12వ శతాబ్దాల నాటి హిందూ దేవాలయం. 


💠 ఇది పంచాయతన ప్రణాళికను కలిగి ఉంది; శివుడికి అంకితం చేయబడిన ప్రధాన మందిరం; మరియు సూర్య, విష్ణు, పార్వతి మరియు గణేశునికి అంకితం చేయబడిన నాలుగు అనుబంధ మందిరాలు ఉన్నాయి.


🔆 చరిత్ర 


💠 గోండేశ్వర ఆలయం సేయున (యాదవ) రాజవంశం పాలనలో నిర్మించబడింది మరియు ఇది 11వ లేదా 12వ శతాబ్దానికి చెందినదిగా చెప్పబడింది. 

సిన్నార్ వారి సామ్రాజ్య పూర్వ కాలంలో రాజవంశానికి బలమైన కోటగా ఉండేది మరియు ఆధునిక చరిత్రకారులు దీనిని యాదవ రాజు సేయునచంద్ర స్థాపించిన పట్టణం సేయునపురగా గుర్తిస్తారు.


💠 ఈ ఆలయ సముదాయం మొదట్లో ఒక గోడతో చుట్టుముట్టబడి ఉండేది, ఇప్పుడు అది చాలా వరకు నాశనం చేయబడింది. 

ప్రధాన మందిరం శివుడికి అంకితం చేయబడింది మరియు ఒక పెద్ద లింగం ఉంది. మందిరం మరియు దానికి ఎదురుగా ఉన్న నంది మంటపం ఒక ఎత్తైన స్తంభంపై ఉన్నాయి. 

మూడు వైపులా వరండాలు కలిగిన మండపం ఆలయ ప్రవేశ ద్వారంగా పనిచేస్తుంది. 


💠 ఈ మందిరంలో నాగర-శైలి శిఖరం (గోపురం) ఉంది, దీని ముగింపు ఇప్పుడు భద్రపరచబడలేదు. 

ఆలయ గోడలు పురాతన ఇతిహాసం రామాయణం నుండి దృశ్యాలను వర్ణిస్తాయి. 


💠 అనుబంధ మందిరాలు సూర్యుడు, విష్ణువు, పార్వతి మరియు గణేశునికి అంకితం చేయబడ్డాయి: వాటన్నింటికీ ఒక వాకిలి ఉంది. అవి ప్రణాళికలో దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి మరియు ఒక మండపం, ఒక అంతరాల మరియు గర్భగృహం (గర్భగుడి) ఉన్నాయి.


 రచన

©️ Santosh Kumar

18-38-గీతా మకరందము

 18-38-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII రాజససుఖమును వివరించుచున్నారు –


విషయేన్ద్రియసంయోగాత్ యత్తదగ్రేఽమృతోపమమ్ | 

పరిణామే విషమివ 

తత్సుఖం రాజసం స్మృతమ్ || 


తా:- ఏ సుఖము విషయేంద్రియ సంబంధమువలన మొదట అమృతమును బోలియు, పర్యవసానమందు (అనుభవానంతరమున) విషమువలెను నుండుచున్నదో అట్టి సుఖము రాజసమని చెప్పబడినది.


వ్యాఖ్య:- విషయసుఖము తాత్కాలికమైనది; క్షణికమైనది. ఇంద్రియములకు విషయములకు సంయోగము కలిగినపుడే ఆ సుఖ ముదయించును. మఱల వెంటనే పోవును. మఱియు ప్రారంభములో అమృతముపగిది సుఖముగా తోచినను, పర్యవసానమున విషమువలె దారుణ దుఃఖరూపముగ పరిణమించునని ఇచట తెలుపబడినది. దీనినిబట్టి రాజససుఖము ప్రారంభమున జీవులకు అమృతమువలె తోచుసుఖము అమృతము కాదనియు, పయోముఖవిషకుంభస్థవిషమే యనియు తెలియుచున్నది. విషరూపమగు ఆ అమృతము మహాప్రమాదకరమైనవస్తువు. ఏలయనిన ఆ అమృతములోన విషబీజములు కాపురముండును. ఆ సుఖమందు దుఃఖబీజములు నివసించును. కాబట్టి అట్టి అమృతమును విడనాడనిచో, దానిలో దాగియున్న విషబీజములనుగూడ స్వీకరించవలసివచ్చును. కావున ముముక్షువులు దృశ్యవిషయములద్వారా తమకేదైన సుఖము గలిగినపుడు అది దుఃఖగర్భితమని, చేపయొక్క ఎరలోపలనుండు గాలమువంటిదని నిశ్చయించి దానిని త్యజించివేయవలెను. ఆ సుఖము ఈ జీవితమునేకాక అనేక భావికాల జీవితములనుగూడ నాశనముచేయును. కనుకనే భగవానుడు కరుణించి సాధకులకిచట హెచ్చరికచేయుచున్నారు. ఆ దృశ్యసుఖములయొక్క అసలురంగును గీతాచార్యులు బయటపెట్టుచున్నారు. "మోసపోకుడు” అని సలహానిచ్చుచున్నారు. అజ్ఞాను లీసత్యము నెఱుగక తృణావృతకూపముల వలె కానవచ్చు శబ్దాదిదృశ్యవిషయములనే సేవించి అగాధసంసారకూపములో పడిపోవుచున్నారు.

భగవానుని ఈవాక్యములు జీవులకు అంధకారమునందు వెలుగునిచ్చుచున్నవి. జగత్తు యొక్క వాస్తవస్వరూపమును బోధించుచున్నవి. పైపై తళుకుబెళుకులకు మోసపోగూడదను విషయమును తెలియబఱచుచున్నవి. కావున ముముక్షువులు విషయసుఖమువలన కలుగు ఈ కీడును గుర్తెఱిగి, ఇంద్రియములకు మనస్సునకు ఆ యా విషయములతో నేమాత్రము సంయోగము కలుగకుండ చూచుచుండవలెను. ఒకవేళ జన్మాంతరసంస్కారప్రాబల్యముచే ఇంద్రియములు బయటకు విషయములపై పరుగెత్తినను, వానిని వివేకముతోనే వెనుకకు లాగి ప్రత్యాహరించి ఆత్మయందు నెలకొల్పవలెను.

ప్ర:- రాజససుఖముయొక్క లక్షణమేమి? 

ఉ:- మొదట అమృతమువలె మహాసుఖముగ కానుపించి, తుట్టతుదకు (అనుభవానంతరమున) విషమువలె దారుణ దుఃఖరూపముగ పరిణమించుటయే రాజససుఖలక్షణము.

తిరుమల సర్వస్వం -*

 *తిరుమల సర్వస్వం -*

చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-7


స్వర్ణయుగం

పధ్నాలుగువ శతాబ్దపు ప్రథమార్థంలో సంగమవంశానికి చెందిన మొదటి బుక్కరాయలుతో ప్రారంభమైన విజయనగర రాజుల పరిపాలనాకాలం దక్షిణ భారతదేశానికే కాదు, తిరుమల క్షేత్రానికీ స్వర్ణయుగమే!


ఒక మహాసామ్రాజ్యావిష్కారానికి నాందీసూచకంగా, విజయనగర రాజుల పరిపాలన ప్రారంభం లోనే తిరుమల ఆలయంలో ఓ మహత్తరమైన చారిత్రక సంఘటన చోటు చేసుకుంది. 1330 - 1340 సంవత్సరాల మధ్యకాలంలో, ఒకానొక వేడుక సందర్భంగా శ్రీరంగపట్టణ వాసులు రంగనాథస్వామి ఉత్సవమూర్తిని స్నానాభిషేకం నిమిత్తం కోలెరూన్‌ నది (కొల్లిడం అని కూడా పిలువబడే, కావేరీ నది యొక్క ఉపనది) వద్దకు తీసుకువచ్చారు. అంతలో, హఠాత్తుగా మొహమ్మద్ తుగ్లక్ కన్ననూర్ నుండి తన అశ్వికదళంతో కొలెరూన్ నది వైపుకు దూసుకు రావడం లోకాచార్యుడనే విష్ణుభక్తుడు గమనించాడు. ఏదో కీడును శంకించిన ఆ భక్తుడు, మరికొందరి భక్తుల సాయంతో రంగనాథుని మూర్తిని ఓ పల్లకిలో కెక్కించుకొని పుదుక్కొట్టై, మైసూరుల మీదుగా తిరుమల జేరుకొని ఆ మూర్తిని ఆలయంలో భద్రపరిచారు. దాదాపు 30 - 40 సంవత్సరాల పాటు ఈ మూర్తి, ఆలయం యొక్క సంపంగి ప్రాకారం లోని ఓ మంటపంలో పూజలందుకుంది. 1371 వ సంవత్సరంలో, విజయనగర రాజుల పరిపాలన వ్రేళ్ళూనుకొని, దక్షిణభారతదేశంలో శాంతిభద్రతలు వారి అదుపులోకి వచ్చి, తురుష్కుల దండయాత్రల భయం పూర్తిగా ఉపశమించిన తరువాత మాత్రమే ఆ మూర్తిని మరలా శ్రీరంగానికి భద్రంగా చేర్చారు.


విజయనగర రాజుల పరిపాలనాకాలం ముందు వరకూ, శ్రీమద్రామానుజుల వారు చేసిన ఏర్పాటు ప్రకారం - శ్రీవారి ఆలయంలో ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధగానం మాత్రమే జరిగేది. ప్రముఖ వైష్ణవాలయంలో నిత్యవేదపఠనం జరగవలసిన ఆవశ్యకత తన దృష్టికి రాగా - అప్పటి ప్రభువు రెండవ దేవరాయలు పేరు మీదుగా శ్రీనివాసపురం (దీన్నే సిత్తక్కుట్టై లేదా సిద్దకుట్టై అని కూడా పిలుస్తారు) అనే గ్రామ ఆదాయాన్ని తిరుమలలో శాశ్వత వేదపఠనం నిమిత్తం కేటాయించడం జరిగింది. అప్పుడు ప్రారంభమైన వేదపఠనం ఈనాటికీ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. విమాన ప్రాకారమార్గానికి ఉత్తరం వైపున, విమానవేంకటేశ్వరుడికి ఎదురుగా ఉదయం వేళల్లో శ్రవణానందకరంగా వేదపారాయణం జరుగుతుంది.


సంగమ వంశప్రభువు సాళువ నరసింగదేవ మహారాయల పాలనతో ఆలయ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఆరంభమైనట్లు చెప్పుకోవచ్చు. వారి కాలంలో కందాడై రామానుజ అయ్యంగార్ అనే ప్రముఖ శ్రీవైష్ణవ భక్తుని మార్గదర్శకత్వంలో - ఆలయ నిర్వహణ లోనూ, కైంకర్యాలలోనూ అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టబడ్డాయి. విజయనగర రాజుల దాన పరంపర అప్రతిహతంగా కొనసాగడంతో, అప్పటి వరకూ ఆలయంలో అరకొరగా ఉన్న శాసనాలు ఆ కాలం నుండి వెల్లువెత్తాయి.


రెండవ హరిహర రాయలు - 'మాశి' అనే తమిళమాసంలో శ్రీనివాసుని పేర ఒక ఉత్సవం నిర్మించే నిమిత్తం - పుంగోడు అనే గ్రామాన్ని ఒక శ్రీవైష్ణవ పీఠానికి దత్తం చేసి, ఆ గ్రామ వార్షికాదాయంలో కొంత భాగం పీఠాధిపతికి వచ్చే ఏర్పాటు చేశారు. అప్పటినుండి విజయనగర ప్రభువులు నిర్మించిన రామానుజ కూటాలు (అన్నదానకేంద్రాలు), పుష్పోద్యానవనాలు, దేవాలయ మంటపాలు, శిఖరాలకు; ప్రవేశ పెట్టిన సేవలకు, చేసిన దానాలకు అంతే లేదు.


14 వ శతాబ్దపు చరమాంకంలో, విరూపాక్షుని పాలనతో విజయనగర సామ్రాజ్య పాలనా పగ్గాలు సంగమ వంశీయుల నుండి సాళువ వంశం హస్తగతమయ్యాయి. వీరి హయాంలో - పవిత్రోత్సవం, అధ్యయనోత్సవం, కొడై తిరునాళ్ళు వంటి ఉత్సవాలు ప్రవేశ పెట్టబడ్డాయి. 1434 వ సంవత్సరంలో, తమిళ ఆదిమాసం నుండి ఆరు నెలల పాటు ఉదయపు నిత్యార్చనలో భాగంగా శ్రీవారి మూలమూర్తి ముఖారవిందానికి పునుగుపిల్లి తైలంతో లేపనం చేసే సాంప్రదాయం మొదలైంది. వీరి పాలనాకాలంలో చోటుచేసుకున్న మరో ముఖ్య ఘట్టం ఏమిటంటే - పసింది వెంకటత్తురైవర్ గారిచే, అష్టాదశ పురాణాలను ఆధారంగా చేసుకొని తిరువేంకట మహాత్మ్యం అనే పౌరాణిక గ్రంథ రచన. ఈ విషయాన్ని ఆవిర్భావ పరమార్థం అనే అధ్యాయంలో తెలుసుకుందాం.


1509 వ సం. లో మహారాజు వీరనరశింహుని మరణానంతరం సాళువ వంశ పాలన అంతమై తుళువ వంశరాజుల ఏలుబడి రావడంతో ఆలయ ప్రాభవం పతాకస్థాయికి చేరుకొంది. ఈ వంశ చక్రవర్తుల - ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు మరియు అచ్యుతదేవరాయలు - ద్వారా ఆలయానికి చేయబడిన సేవలు, ఇవ్వబడిన విరాళాలు; వారి తిరుమల యాత్రా విశేషాలు వేంకటేశుని సేవలో విజయనగర సామ్రాట్టులు అనే అధ్యాయంలో వివరంగా తెలుసుకుందాం. వీరి తరువాత అధికారం లోకి వచ్చిన తుళువ వంశరాజులు క్రమంగా బలహీన పడి, పాలనా వ్యవహారాలపై పట్టు కోల్పోసాగారు.


ప్రసిద్ధి చెందిన రాక్షసతంగడి యుద్ధానంతరం, 1575 వ సం. లో అళియరామరాయలి మరణం తరువాత తిరుమలరాజు విజయనగర సింహాసనాన్ని అధిష్టించడంతో అరవీడు వంశ రాజుల పాలన మొదలైంది. ఆ కాలంలో వెంకటపతిరాయలు తిరుమల క్షేత్రంలో పట్టాభిషిక్తుడై, చంద్రగిరిని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగిస్తూ, తరచూ తిరుమలేశుణ్ణి దర్శించుకునేవాడు. మట్ల కుమార అనంతరాజు అనే స్థానిక ప్రభువు అలిపిరి మెట్ల మార్గం లోని, నేడు కొత్తగోపురం గా పిలువబడే రెండవ గోపురాన్ని, అక్కడి నుంచి గాలిగోపురం వరకూ గల మెట్లమార్గాన్ని నిర్మించి చరిత్రపుటల కెక్కాడు. ఈనాటి కడప జిల్లా రాయచోటి ప్రాంతం లోని మట్లి అనే గ్రామం పేరును బట్టి, ఆ పాలకులు మట్ల వంశీయులుగా పిలువ బడ్డారు. 


1665 వ సం. లో గోల్కొండ, బిజాపూరు సుల్తానులు సంయుక్తంగా దండెత్తి రావడంతో అప్పటి అరవీడు వంశ ప్రభువు శ్రీరంగదేవ మహారాయ పరాజయం పాలయ్యాడు. అప్పటివరకూ హైందవరాజుల అధీనంలో ఉన్న విజయనగర సామ్రాజ్యం మహమ్మదీయ సుల్తానుల పరమైంది. 


ఆ విధంగా, 1359 వ సం. లో శ్రీ మంగిదేవ మహారాయలుతో మొదలైన విజయనగర రాజుల పాలన, దాదాపు 300 సం. ల పాటు అవిచ్ఛిన్నంగా సాగి, 1665 వ సం. లో శ్రీ రంగదేవ మహారాయల ఓటమితో అంతమైంది. దాంతో, తిరుమల చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*


*429 వ రోజు*

ఈ అకారణ కోపం వదిలి పెట్టు భీముడు తన ప్రతిజ్ఞా పాలన చెయ్యడం ఎలా అధర్మం ఔతుంది. అన్నయ్యా ! భీమసేనుడు సుయోధనుడు నిలబడి ఉన్నప్పుడు నాభి క్రింద కొట్ట లేదు అతడి క్రింద ఉండి సుయోధనుడు పైకి ఎగిరి గదతో భీముని చంపుటకు ప్రయత్నించే సమయంలోనే కదా తన ప్రతిజ్ఞా పాలన కొరకు పదమూడేళ్ళు వేచి ఉన్న భీముడు నాభిక్రింద కొట్టింది. అలా చెయ్యక పోతే భీమసేనుడు మరణించడా ! ఆపత్కాలంలో ప్రాణాపాయకాలంలో ధర్మాధర్మ విచక్షణ చేయడం కుదురుతుందా ! భీముని ప్రతిజ్ఞ తెలిసిన సుయోధనుడు తగిన జాగర్త ఎందుకు తీసుకో లేదు. అన్నయ్యా చిన్నతనం నుండి పాండవులను హతమార్చుటకు సుయోధనుడు చేసిన కుటిల ప్రయత్నాలు నీకు తెలియనివా ! కుటిలుడిని కుటిలోపాయంతో చంపడం అధర్మం కాదే ! మన చెల్లెలు కుమారుడైన అభిమన్యుడిని కుటిలోపాయంతో అధర్మంగా చంపిన సుయోధనుడిని చంపడంలో అధర్మం ఏమి ఉన్న దోషమేమి ! ధర్మానికి ధర్మం అధర్మానికి అధర్మం చెల్లుకు చెల్లు అధర్మాన్ని అధర్మం జయించింది " అన్నాడు. బలరాముడు " కృష్ణా ! నీ వాదనాపఠిమతో అధర్మాన్ని ధర్మం అని నిరూపించలేవు. నీ దృష్టిలో ఇలాంటి నీచమైన గెలుపు సాధించిన భీముడు నీకు ప్రశంశాపాత్రుడు ఔతాడేమో ! కాని యుద్ధనీతిని అక్షరాలా పాటించిన సుయోధనుడు ఉత్తమ లోకాలను పొందుతాడు " అని రథం ఎక్కి ద్వారకకు వెళ్ళి పోయాడు.


*చింతాక్రాంతుడైన ధర్మరాజును కృష్ణుడు ఓదార్చుట*


అప్పుడు శ్రీకృష్ణుడు చింతాక్రాంతుడైన ధర్మరాజు వంక చూసాడు. తల వంచుకుని చింతాక్రాంతుడై నిలబడి ఉన్న ధర్మరాజును చూసి కృష్ణుడు " ధర్మనందనా ! బంధునాశకుడు, పాపాత్ముడు అయిన సుయోధనుడు తాను చేసిన పాపకర్మల ఫలితం అనుభవిస్తున్నాడు. భీమసేనుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు ఇందుకు బాధపడ వలసిన పని ఏమి " అని పలికిన కృష్ణుడిని చూసి ధర్మరాజు " కృష్ణా ! భీమసేనుడు సుయోధనుడి తొడలు విరుగ కొట్టి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. కాని సుయోధనుడి తల తన్ని అవమానించడం న్యాయమా ! అసలే కురువంశ నాశనముకు నా మనస్సు విచలితమౌతుంది. భీముని చర్య నాకు అమిత దుఃఖం కలిగించింది. భీమసేనుడికి మేము పడిన కష్టాలు గుర్తుకు వచ్చి అలా చేసి ఉంటాడులే ! ఇప్పుడిక పాప పుణ్యాల ప్రసక్తి ఎందుకు " అన్నాడు. కృష్ణుడు " ధర్మనందనా ! కురువంశ వినాశకుడు అయిన సుయోధనుడు నేల కూలాడు. ఇప్పుడు నీవు సర్వంసహా కురు సామ్రాజ్యానికి నీవు చక్రవర్తివి. ఇక రాజ్యభారం వహించి ప్రజలను పాలించు " అన్నాడు. అప్పుడు ధర్మరాజు భీమసేనుడితో " నీ ధైర్యం, భుజబలం, శ్రీకృష్ణుడి సాయంతో సుయోధనుడిని నేల కూల్చిన నీకు నా అభినందనలు " అన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు.

*కృష్ణుడు ధర్మరాజును ఓదార్చుట*


బలరాముని మాటలకు చింతాక్రాంతుడై చూస్తున్న ధర్మరాజును చూసి కృష్ణుడు " ధర్మనందనా ! బంధునాశకుడు పాపాత్ముడు అయిన సుయోధనుడు తాను చేసిన పాప కర్మల ఫలితం అనుభవిస్తున్నాడు. భీమసేనుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. ఇందుకు చింత పడటం ఎందుకు " అన్నాడు. ధర్మరాజు " కృష్ణా ! భీమసేనుడు సుయోధనుడి తొడలు విరిచి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. అయినా సుయోధనుడి తల తన్నడం ఎందుకు. అసలే కురువంశ నాశనం అయినందుకు నా మనస్సు పరితాపం చెందుతున్న నాకు భీమసేనుడి చర్య అమిత బాధను కలిగించింది. భీమసేనుడికి తాను పడ్డ కష్టాలు గుర్తుకు వచ్చి అలా ప్రవర్తించి ఉంటాడులే. ఇక పాప పుణ్యాలను పోనీలే కృష్ణా ఆలోచించి ఏమి ప్రయోజనం " అన్నాడు. కృష్ణుడు " ధర్మ నందనా ! మీ అవమానాలకు కష్టాలన్నిటికీ కారకుడు కుల నాశకుడు, పాపాత్ముడు అయిన సుయోధనుడు నేలకొరిగాడు. ఇక ఈ సర్వం సహా సామ్రాజ్యానికి నీవే చక్రవర్తివి. ఇక రాజ్యభారం వహించి ప్రజలను పాలించు " అన్నాడు. అప్పుడు ధర్మరాజు " భీమసేనా ! నీ సాహసం ధైర్యం శ్రీకృష్ణుడి సహాయంతో సుయోధనుడిని నేల కూల్చావు. నీకు నా అభినందనలు " అన్నాడు. " అని సంజయుడు చెప్పాడు.



*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రమ కలిగించనిదే

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో||   *క్లేశస్యాఽఙ్గమదత్వా సుఖమేవ సుఖానిహ|* *లభ్యన్తేమధుభిన్మథనాయ*

*స్తైరాశ్లిష్యతి బాహుభిర్లక్ష్మీమ్॥*


*తా||  "ఈ ప్రపంచంలో శరీరానికి శ్రమ కలిగించనిదే తేలికగా సుఖాలు లభించవు.* *మధుసూదనుడైన శ్రీమహావిష్ణువు సైతం సముద్ర మథనముచే అలసిన భుజములతోనే లక్ష్మిని ఆలింగనం చేసుకున్నాడు*."


✍️🌹🌸💐🙏

చాదస్తం chadastam

 చాదస్తం’- ఒక పరిశీలన 

రచన :- 

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

9897959425

‘చాదస్తం మొగుడు చెపితే వినడు, కొడితే ఏడుస్తాడు’ అనే మాట మనం తరచుగా వింటుంటాం . ఈ చాదస్తం అనే మాట ఎక్కణ్ణుంచి వచ్చి ఉంటుంది అని ఆలోచిస్తే ఛాందసత్వమే చాదస్తంగా మారి ఉ౦టు౦దని భావించొచ్చు . ఛందస్సు అంటే వేదం . ఛాందసత్వం అంటే వేదంలో చెప్పింది చెప్పిన విధంగా తు.చ. తప్పకుండా ఆచరించడం.    

వేద౦లో ఒక మాటుంది అదే౦టంటే “ వేదం కృత్వా వేదిం కుర్యాత్” అని . వేద చేసిన వెంటనే వేదిని చెయ్యాలి అని ఆ వాక్యం చెపుతోంది . ఇంకో వాక్యం ఉంది అదే౦టంటే “క్షుతే చ ఆచమేత్” అని. దాని అర్థం ఏ౦టంటే తుమ్ము వస్తే ఆచమనం చెయ్యాలి . అని అర్థం. ఒక వ్యక్తి వేద చేశాడు ఇక వెంటనే వేది చెయ్యవలసి ఉంది . కాని ఈ లోపుగా అతనికి తుమ్ము వచ్చింది . ఇప్పుడు వేది చెయ్యాలా లేక తుమ్ము వచ్చింది కాబట్టి ఆచమనం చెయ్యాలా అనేది మీమాంస . మీమాంస అనే మాటకు విశేషంగా చర్చించడం అని అర్థం . ఇక్కడ ఇది తర్కశాస్త్రంలో లాగ బుద్ధిబలంతో చర్చించేది కాదు. వేదంలో ఇవన్నీ చర్చించడానికి మీమాంస అనే శాస్త్రం ఏర్పడింది . ఆద్యుడు జైమిని మహర్షి . ఆయన రచించిన మీమాంసా సూత్రాలతో బాటు మీమాంసాన్యాయప్రకాశిక మొదలైన ఎన్నో వందలాది గ్రంథాలున్నాయి. ఈ మీమాంసలో శ్రుతి, లింగ , వాక్య , ప్రకరణ , స్థాన , సమాఖ్యలనే ఐదు అంశాలున్నాయి . అవి ఒకదాని కంటే మరొకటి బలహీనమైనవి . శ్రుతి – లింగ- వాక్య- ప్రకరణ- స్థాన- సమాఖ్యానాం పార దౌర్బల్యమర్థ విప్రకర్షాత్ అని మీమాంసా నియమం . శ్రుతికి లింగానికి మధ్య వైరుధ్యం వస్తే శ్రుతి ప్రవర్తిస్తుంది . లింగానికి వాక్యానికి మధ్య వైరుధ్యం కలిగితే లింగం గొప్పదవుతు౦ది . వాక్యానికి , ప్రకరణానికి మధ్య భేదం వస్తే వాక్యం ప్రవర్తిస్తుంది . ప్రకరణానికి స్థానానికి మధ్య విభేదం వస్తే ప్రకరణం ప్రవర్తిస్తుంది . ఇక స్థానానికి సమాఖ్యకు మధ్య పోటీ ఏర్పడితే స్థానం గెలుస్తుంది. అన్నిటికంటే శ్రుతి బలవత్తమం , సమాఖ్య బలహీనతమం .

ఇక శ్రీ శంకరభగవత్పాదుల వారు కర్తుమకర్తు మన్యథా వా కర్తుం శక్యతే లౌకికం చ వైదికం చ కర్మ అనే వాక్యం ద్వారా లౌకిక కర్మలు ఒక విధంగా చెయ్యొచ్చు లేదా మరో విధంగా చెయ్యొచ్చు. లేదా అసలు చెయ్యకు౦డాను ఉండొచ్చు అన్నారు. యథా అశ్వేన గచ్ఛ తి; పద్భ్యాం గచ్ఛతి ; న వా గచ్ఛతి (ఒకడు గుర్రం ఎక్కి వెళ్ళవచ్చు, నడిచి వెళ్ళ వచ్చు లేదా అసలు వెళ్ళక పోవచ్చు. ఇక వైదిక కర్మల మాటకొస్తే అతిరాత్రే షోడశినం గృహ్ణాతి , నాతిరాత్రే షోడశినం గృహ్ణాతి ; ఉదితే జుహోతి ; అనుదితే జుహోతి అని లౌకిక వైదిక కర్మలు ఏ విధంగా నైనా చెయ్య వచ్చని తేల్చారు. ఇక మీమాంసా శాస్త్రంలో అన్ని నియమాలు ఏర్పరచడానికి గల కారణం ఒక వ్యక్తికి ఒక పద్ధతిని discipline అనుసరించడం అలవాటు చెయ్యడానికే నని మనం గ్రహించాలి. మొత్తం మీద వేదంలో చెప్పింది హేతుబద్ధంగా ఉన్నా లేక పోయినా చెప్పింది చెప్పినట్లుగా ఆచరి౦చె విధానాన్ని ఛాందసత్వం అంటారని అదే చాదస్తంగా మారిందని అనుకోవచ్చు.  

ఇక నేటి సమాజంలో కొంత మంది స్వార్థ పరులు “ ఈ విధంగా కొలిస్తేనే పుణ్యం వస్తుంది మరో విధంగా కొలిస్తే రాదు. ఈ పువ్వులతో పూజ చేస్తేనే ఫలితం మరో పువ్వులతో పూజిస్తే ఫలితం ఉండదని . ఈ దేవుని కంటే ఆ దేవుడు గొప్పవాడని చెబుతూ వాళ్ళ అజ్ఞానాన్ని పదిమందికీ ఉచితంగా పంచి పెడుతున్నారు. అవేమీ ఎవరు నమ్మకూడదు . ఒక మనిషికి ఇద్దరు త౦డ్రులు౦డడం ఎంత హాస్యాస్పదమో , ప్రపంచంలో ఇద్దరు దేవు ళ్ళు౦డడం కూడ అంతే హాస్యాస్పదం . -కాబట్టి ప్రతి చెత్త మాట వినకండి. ఒకవేళ విన్నా అది సమంజసమా కాదా అని పరి పరి విధాల ఆలోచించండి . మన భారతీయ సంస్కృతి దేన్నీ గ్రుడ్డిగా నమ్మమని చెప్ప లేదు . వేదం “ఆత్మా వా అరే ద్రష్టవ్య: శ్రోతవ్య: మంతవ్య: నిదిధ్యాసితవ్య:” అంది . ఇక్కడ మంతవ్య: అంటే ఆలోచించమని అర్థం . ఆలోచన లేకుండ ప్రవర్తి౦చకూడదు.

మొత్తం మీద మనం తెలుసు కోవలసినదేమిటంటే – పువ్వులు౦టే పూజ చేసుకోoడి . పువ్వుల్లేకపోతే మనస్సులో ధ్యానం చేసుకోండి . అదీ కుదరక పోతే ప్రశాంతంగా కూర్చో౦డి .

ఈ ప్రపంచంలో శ్రీ శంకర భగవత్పాదులు ఒక్కరే ఆత్మతత్త్వాన్ని దర్శించారు , మిగిలిన వాళ్ల౦దరూ ఉత్ప్రేక్షి౦చారు . వారు బోధించిన పూజా విధానాన్ని మించింది మరొకటి ఏదీ లేదు. దాన్ని అనుసరి౦చండి . నేను చెప్పానని కాదు , మీకు నచ్చితేనే.

ఆత్మా త్వం గిరిజా మతి: సహచరా: ప్రాణా: శరీరం గృహం

పూజా తే విషయోపభోగ రచనా నిద్రా సమాధిస్థితి:

సంచార: పదయో: ప్రదక్షిణవిధి: స్తోత్రాణి సర్వాన్ గిరో

యద్యత్కర్మ కరోమి తత్త దఖిలం శంభో ! తవారాధనం

ఓ భగవంతుడా! నువ్వే ఆత్మవు . పార్వతియే బుద్ధి . ప్రాణాలే నా సహచరులు. ఈ శరీరమే ఇల్లు. నేను చేసే ప్రతి పని నీకు పూజ. నా నిద్ర సమాధి . నేను లోకయాత్ర నిర్వహించడానికి ఎక్కడ తిరిగినా అది నీకు ప్రదక్షిణమే. నా పలుకులన్నీ నీకు స్తోత్రాలే. ఇక నేను చేసే ప్రతి కర్మాచరణ నీ ఆరాధనమే . ఈ భావనతో ప్రవర్తించేవాడు ఏ తప్పు చేయడు. కాబట్టి ఈ విధంగా ప్రతి వ్యక్తీ మీనమేషాలు లెక్క పెట్టకుండా భగవంతుని ఆరాధించడం తరణోపాయం, తరుణోపాయం కూడ.     

                                            <><><><><><><>

సుభాషితం

 "నేటి సుభాషితం"

(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)

నమోస్తు రామాయ సలక్ష్మణాయ 

దేవ్యై చ తస్యై జనకాత్మజాయై

నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో 

నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః 

(5.13.59)


అర్థం:

శ్రీ రామ లక్ష్మణులకు నమస్కారం.

జనకుని దివ్య కుమార్తె అయిన సీతా మాతకు; రుద్రుడు, ఇంద్రుడు, యముడు, వాయువులకు నా నమస్కారాలు. సూర్యుడు, చంద్రుడు, మరుత్తులకు నా నమస్కారాలు!


(ఈ ప్రార్థనతో హనుమంతుల వారు 'నిర్వేదం' నుంచి ఉపశమనం పొంది, నూతనోత్సాహం పొందారు. కావున మనం కూడా ప్రతి నిత్యం ఈ ప్రార్ధనా శ్లోకంతో ఉత్తేజితులం అవుదాం)


శ్రీ శంకరాచార్య కృత నారాయణ స్తోత్రంతో *'తొలి ఏకాదశి'* శుభాకాంక్షలు 


శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష 

ధర్మో రక్షతి రక్షితః


శుభ ఆదివారం

Panchaang