6, జులై 2025, ఆదివారం

సమాజ సేవ

 *సమాజ సేవ - అభినందనలు*


సభ్యులకు నమస్కారములు.


వ్యక్తి జీవితమంటే *నిబంధిత* అభ్యసనము. సామాజిక జీవితమంటే *సంబంధిత* అభ్యసనము. సమాజ సేవను *సహజత్వంగా* ప్రతి ఒక్కరు అభ్యసించాలి, ఆచరించాలి. సమాజ సేవలో వ్యక్తితం, సంస్కృతి, ఇంగిత జ్ఞానం ప్రస్పుటమవుతుంది. 


సమాజ సేవ చేయడానికి అందరికీ అవకాశం ఉండవచ్చును లేదా ఉండక పోవచ్చును కారణాలు ఏవైనా. *కాని, సమాజ చేసే వారిని మాత్రం అందరూ అభినందించాలి*. ప్రశంస అనేది చాలా ముఖ్యం. మంచి వారిని, మంచి పనులు చేసే వారిని, ఉన్నతులను మనకంటే అధికులను ప్రశంసించుట, అభినందించుట. *సదరు ప్రశంసా వాక్కుల అర్థం భగవంతుడు మనుష్యులకు ఇచ్చిన వాక్కును పునీతము చేసుకొనుటయే* .


సదరు ప్రశంసలు సమాజ సేవ చేసే ఉన్నతులకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది, సమాజ కళ్యాణకారకమవుతుంది.


యువ సమాజ సేవకులకు ఈ ప్రశంసలు మరింత అవసరము. ఎదిగే క్రమంలో ప్రశంస, మెప్పుదల, మెచ్చుకోలు అనేవి ఎంతో శక్తిని, స్ఫూర్తిని ఇస్తాయి. యువతలోని శక్తి సామర్థ్యాలను, సృజనాత్మకతను, నైపుణ్యాలను వెలికితీసి సానబెట్టడానికి సదరు ప్రశంసలు ఎంతో దోహదం చేస్తాయి.


*ఎవరో మెచ్చాలని పూవు పూయదు, పరిమళించదు. పూవు పూయడం, సుగంధాలు వెదజల్లడం, దాని స్వభావం*. వృక్షం తన ఫలాలను తాను భుజించదు ఇతరులకు ఇస్తుంది. గోవు తన క్షీరాన్ని తాను త్రాగదు. ఇతరులకు సేవ చేయుటలోనే నిజమైన ఆనందమున్నది. *తనకోసమే తాను బ్రతకడం పశు పక్షాదుల కంటే హీనం*. 


ప్రకృతి తన సహజ పద్ధతుల్లో ముందుకు సాగుతుంది. ఈ ఉపమాన ఆధారంగా మనుష్యులు కూడా *మానవత్వాని ప్రదర్శిస్తూ సమాజ సేవ చేయాలి*.


ధన్యవాదములు

కామెంట్‌లు లేవు: