15, సెప్టెంబర్ 2025, సోమవారం

శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి జయంతి

 ✒️💐తెలుగు కవి, అవధాని, నాటకకర్త. తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో ఒకరు శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి జయంతి సందర్భంగా💐✒️


*జెండాపై కపిరాజు….బావ ఎప్పుడు వచ్చితీవు… అదిగో ద్వారక… అయినను పోయి రావలె హస్తినకు… వంటి నాటక పద్యాలు వినని తెలుగువారు ఉండరు.* తిరుపతి వేంకట కవుల కలంనుంచి జాలువారిన పాండవోద్యోగ విజయాలు నాటకంలోనివి అవి. తెలుగుభాష పదభూయిష్ఠమై నారికేళప్రాయంగా ఉన్న రోజుల్లో అలతి, అలతి పదాలతో పద్యాలు చెప్పి, రచనలుచేసి సామాన్యులకూ తెలుగు భాషా సాహిత్యం పట్ల మోజుపెంచిన కవితామూర్తులు వీరు........


*ఉత్తమమైన కవిత్వం అలవడితే సామ్రాజ్యాలను ఆశించవలసిన పనిలేదని సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. సాహిత్యం ఒక విశాల సామ్రాజ్యం. దానికి అధినేత మహాకవి. భారతీయ వాంగ్మయంలో ఎందరో సాహితీ సామ్రాజ్య చక్రవర్తులు ఉన్నారు. తెలుగు కవిత్వాన్ని ఊరూరా, వాడవాడలా ఊరేగించి తెలుగు పద్యానికి పట్టాభిషేకం చేయించిన జంట కవిరాజులు- తిరుపతి వేంకట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకట కవి. చెళ్లపిళ్లవారు తిరుపతి శాస్త్రి కన్నా వయసులో ఏడాది పెద్ద అయినా వారు పరమపదించిన తరవాత మూడు దశాబ్దాలు జీవించారు.*


*#ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తొలి ఆస్థానకవి.*


‘కవనార్థంబుదయించితిన్, సుకవితా కార్యంబు నా వృత్తి’ అని చెప్పుకున్నాడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి. చెప్పినట్లుగానే తెలుగునాట కవితా కల్యాణం చేయించి, జీవితాన్ని తరింపజేసుకున్న మహాకవి చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి.

ఈయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తొలి ఆస్థానకవి. 1949లో, సాక్షాత్తు ప్రభుత్వ యంత్రాంగం మద్రాస్‌ నుండి తరలి విజయవాడ వచ్చి, ఈ పదవిని అందించింది. అంతటి ఘన చరిత్ర చెళ్లపిళ్లది.


400 లకుపైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన చెళ్లపిళ్ల సత్యం గారి ముత్తాతగారే చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి.


ఆ కాలంలోనూ చెళ్లపిళ్లవారి రచనా వ్యాసంగం తిరుపతి వేంకటీయంగానే సాగింది. అవధానాల రూపంలో ఈ జంట కవులు పద్యకవిత్వాన్ని ప్రదర్శనాత్మకమైన కళగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.


*#కవులకు మీసాలెందుకని......*


తిరుపతి వేంకట కవులు మీసాలు పెంచారు. అదీగాక, కవులకు మీసాలెందుకని ఎవరో అధిక్షేపించినపుడు, సంస్కృతంలోనూ, తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, మీసాలు ఎందుకు పెంచారో, వారి పద్యంలోనే విందాం!


దోసమటం బెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ,

మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా

రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ

మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.


*#అష్టావధాన, శతావధానాలు:*


తెలుగు నేలపై సంచారం చేస్తూ అష్టావధాన, శతావధానాలు నిర్వహించారు. తెలుగునాట వీరు దర్శించని రాజాస్థానాలు లేవు. కాలుమోపని నగరాలు, గ్రామాలు లేవు. ఈ కవుల ‘పాండవోద్యోగ విజయాలు’ నాటకం పేరు చెప్పగానే తెలుగువారు ఆత్మీయంగా పులకరిస్తారు. ఈ నాటక పద్యాలు పండిత, పామరుల నాలుకపై నర్తిస్తాయి. వీరిద్దరూ చర్ల బ్రహ్మయ్య శాస్త్రి శిష్యులు. వీరు మహాకవులు, బహు గ్రంథకర్తలు, శాస్త్రద్రష్టలు,తాత్త్వికులు, లోకజ్ఞులు.


*#బాల్యం-ఉద్యోగం:*


వేంకటశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా కడియంలో 8-8-1870న జన్మించారు. తల్లిదండ్రులు చంద్రమ్మ, కామయ్యలు. వీరికి తల్లిదండ్రులు పెట్టిన మొదటి పేరు వేంకటాచలం. బాల్యంలో బడికి వెళ్లకుండా తోటి పిల్లలతో గోళీలు, కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ విచ్చలవిడిగా తిరిగినా, కాలక్రమంలో బుద్ధి కలిగి ఏళ్లలో నేర్వదగిన విద్య నెలల్లో ఆర్జించారు. ‘శాస్త్రి సామాన్యం ఎత్తు, చామనఛాయ, బహు చురుకైన మొహం, పిల్ల జుట్టు, కంచు గంట లాంటి గొంతుక, పండిత శాలువా పైనవేసుకొని, పంచ ధరించేవారు. చేతనున్న బంగారు కడియం కవితా దిగ్విజయాన్ని సూచిస్తుంది. తిరుపతి శాస్త్రి గారిది కవితాధారణ అయితే, చెళ్లపిళ్లవారిని లౌక్య ప్రజ్ఞకు ప్రసిద్ధులుగా చెబుతారు. తిరుపతి శాస్త్రి గారిది సంస్కృత ప్రకర్ష అని, వేంకట శాస్త్రి గారి కవిత్వంలో తెనుగుదనం జాస్తి అని వారిని బాగా తెలిసినవారు చెబుతారు.


 వేంకట కవి బందరు హిందూ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో వీరిని సత్కరించింది.


*#కంచు కంఠం:*


‘కవనార్థంబుదయించితిన్‌ సుకవితా కావ్యంబె నా వృత్తి’ అని చెప్పుకొన్నారు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి. పద్య పఠనంలో ఆయనది ఒక కొత్త తీరు. ఆయనలా పద్యాలు చదవాలని ఎందరో ప్రయత్నించినా, ఆ కంచు కంఠం అందరికీ రాదు కదా. ప్రతి విషయంలో తనదొక ప్రత్యేకత అన్నట్టు వేంకటశాస్త్రి వ్యవహరించేవారు.


చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అనంత ప్రతిభామూర్తి. అద్భుతమైన ధారణ ఈయన సొత్తు. పద్య పఠనం పరమాద్భుతం. సంగీతజ్ఞానం కూడా మెండుగా ఉండేది. పద్యం ఎత్తుకోగానే అనేక రాగాలు అవలీలగా వచ్చి చేరేవి. శ్రీ రాగంలో ఎక్కువగా పాడేవారని చెబుతారు. ఉపన్యాసాలు సురగంగా ప్రవాహాలు. సందర్భోచితమైన శ్లోకాలు, పద్యాలు, పిట్టకథలు, సామెతలతో చెళ్లపిళ్ల ప్రసంగం చేస్తుంటే.. ప్రేక్షకులు మంత్రముగ్ధులై పరవశించేవారు.


*#శతకంల రచన:*


 ఆయన కామేశ్వరి శతకం, ఆరోగ్య కామేశ్వరి శతకం రచించారు. తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు కామేశ్వరీ దేవిని ప్రార్థిస్తూ వీరు రాసిన ఆరోగ్య కామేశ్వరి శతకంలో స్వవిషయాలు, తిరుపతి కవి గురించిన పద్యాలు ఉన్నాయి. అనంతర కాలంలో వెలువడిన ఆరోగ్య శతకాలకు వీరి శతకం మార్గదర్శనమైంది. తాను వ్రణంతో బాధపడుతున్నప్పుడు శారీరక బాధను, మానసిక వేదనను కామేశ్వరి శతకంలో దేవికి విన్నవించుకున్నారు.


*#గొప్ప వక్త.:*


వేంకటశాస్త్రి గొప్ప వక్త. అమిత భాషి. యౌవనంలో ఆయన ఉపన్యాస వాణి మేజువాణి. షష్టిపూర్తి తరవాతా వారి కంఠంలో ఝంకారం, మాధుర్యం తగ్గలేదు. ఆయనది శాఖాచంక్రమణం. అనేక విషయాల్లోకి చొచ్చుకుపోయేవారు. పద్యాలను, పిట్ట కథలను, సంఘటనలను, గానాన్ని, హాస్యాన్ని మేళవించి పంచామృతంగా ఉపన్యాసం అందించేవారు. ఏం మాట్లాడినా అది ధ్వని కావ్యం.

‘మంచి కవిత్వం అంటే ఏమిటి’ అనే అంశంపై  విశాఖపట్నంలో రాజా విక్రమదేవ వర్మ ఇంట్లో, చెళ్లపిళ్ల 5 గంటలపాటు అనర్గళమైన ప్రసంగం చేశారు. ఆద్యంతం నాటకీయ ఫక్కీలో సాగిన ఆ ప్రసంగం అనన్య సామాన్యం. దీనికి ప్రత్యక్ష సాక్షి శ్రీశ్రీ. అద్భుతమైన ప్రసంగాన్ని అందించడంతో పాటు, విక్రమదేవ వర్మ నుండి చెళ్లపిళ్ల మూడువేల రూపాయలు కూడా అందుకున్నారు. ఆ రోజుల్లో మూడువేలంటే, ఈరోజుల్లో లక్షలు. 


*#శిష్యగణం:*


వేంకట కవికి గణనీయమైన గొప్ప శిష్యగణం ఉంది. ఆయన బందరు పర్రల్లో కవుల్ని సృష్టించారని ఆ రోజుల్లో చెప్పుకొనేవారు. పింగళి, కాటూరి, వేటూరి శివరామశాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ వంటి వీరి శిష్యులు విద్వత్‌ కవులుగా వాసికెక్కారు. పింగళి, కాటూరి కవులు తమ సౌందరనంద కావ్యాన్ని చెళ్లపిళ్ల వారి షష్టిపూర్తి సందర్భంలో సమర్పిస్తూ వారిని ‘అద్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాత’గా సంభావించారు.


శాస్త్రి గ్రాంథిక భాషా కవిత్వంలో పుట్టి పెరిగినా, చివరి దశలో వ్యావహారిక భాషను ఆదరించారు. వచనంలోనూ అమూల్యమైన రచన చేశారు. కృష్ణా పత్రికలో ప్రచురితమైన వారి కథలు, గాథలు మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. అవి తెలుగు భాషా సాహిత్యాలకు విజ్ఞాన సర్వస్వాలు. వ్యావహారిక భాషా సౌందర్యానికి తరగని గనులు. 


*#అమ్మా! సరస్వతీదేవీ, కేవలం నీ దయవలనే.....*


అమ్మా! సరస్వతీదేవీ, కేవలం నీ దయవలనే మేము ఎన్నో సన్మానాలు అందుకొన్నాము అని చెప్పిన ఈ క్రింది పద్యాన్ని తిలకించండి, వారి వినయ విధేయతలు, కూడా ద్యోతకమవుతాయి.


ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము, స

న్మానము లందినాము, బహుమానములన్ గ్రహియించినార, మె

వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయంబొనర్చి ప్ర

జ్ఞా నిధులంచు బేరు గొనినాము, నీ వలనన్ సరస్వతీ!


*#కాశీయాత్ర:*


వారి ‘కాశీయాత్ర’ యాత్రా సాహిత్యంలో విశిష్టమైనది. ఆధునిక, సాంఘిక చరిత్రకు విలువైన ఆధార గ్రంథం. ఆనాటి ఉత్తర హిందూస్థానం విశేషాలు, నాటి సామాజిక పరిస్థితులు ఈ గ్రంథంలో చూడవచ్చు. 


*#మానవతావాది:*


చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు గొప్ప మానవతావాది. వీరు కవికోకిల శ్రీ జాషువా గారి పాదాలు కడిగి, వారికి కాలికి గండపెండేరం తొడిగి, ఇలా అన్నారు--- "ఈ మహాకవి పాదాలు తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను"


*#పాండవ ఉద్యోగ విజయాలు:*


పాండవ ఉద్యోగ విజయాలు అజరామరమైన ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎందరో పద్యనటులు తెలుగునేలపై పుట్టుకువచ్చారు. ఎందరో కళాకారులకు అన్నం పెట్టి, అనంతమైన ఖ్యాతిని అందించిన ఆధునిక పద్యనాటక రాజాలు ఈ పాండవ ఉద్యోగ విజయాలు. సంప్రదాయ పద్య కవిత్వ ప్రక్రియలోనే, భారత కథలను వాడుకభాషలో రాసి, వాడుకభాషను శిఖరంపై  కూర్చోపెట్టిన ఘనత వీరిదే

సాహితీవేత్త మోదుగుల రవికృష్ణ ఈ నాటకాల విజయాన్ని గురించి చెప్తూ “పాండవోద్యోగ విజయాల ప్రదర్శన జరగని ఊరు ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కాదని” పేర్కొన్నారు. వాటిలో వారు రాసిన పద్యాలు జాతీయాలుగా నిలిచిపోయాయి. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో “అయినను పోయి రావలె హస్తినకు” వంటివి ప్రముఖ ప్రయోగాలుగా, నిలిచిపోయాయి.


#వారి నాటకాల ద్వారా అనేక మంది నటులు ప్రఖ్యాతమైన పేరు తెచ్చుకున్నారు. వారిలో ముఖ్యులు, బందా, అద్దంకి, సి.యస్.ఆర్. రఘురామయ్య, పీసపాటి, షణ్ముఖి, ఏ. వి. సుబ్బారావు, మాధవపెద్ది మున్నగు వారు. ప్రస్తుతం గుమ్మడి గోపాలకృష్ణగారు, ఎ.వెంకటేశ్వరరావు గారు మొదలైన వారు వీరి నాటకాన్ని తన చక్కని గాత్రంతో, హావ భావాలతో అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు.

80వ పడిలో 1950 ఫిబ్రవరి15న శివైక్యం  పొందారు వేంకటశాస్త్రి.

*బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు, అలుగుటయే యెరుంగని... లాంటి పద్యాలు తెలుగు వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తునే ఉంటాయి.*

🙏🙏🏵️🌷🌸🙏🙏

Collected by 

Dr.A.Srinivasa Reddy

9912731022

Zphs Munugodu Amaravathi mandal Palanadu district.

పోతన పాత్ర చిత్రణ



పోతన పాత్ర చిత్రణ 


                    ఉ: కాటుక కంటినీరు చనుగట్ల పయింబడ నేలయేడ్చెదో?


                          కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! యోమదంబ! యో


                         హాటకగర్భురాణి! నిను నాకటికైఁ గొనిపోయి యల్ల క


                         ర్ణాట కిరాట కీచకులకమ్మ ;త్రిశుధ్ధిగ నమ్ము; భారతీ!


                                        -- చాటువు ;


                 ఉ: కోపము తోడ నీవు దధి భాండము భిన్నము సేయుచున్నచో


                        గోపిక త్రాటఁగట్టిన వికుంచిత సాంజన భాష్ప తోయ ధా


                        రా పరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చనూర్చుచుం


                      బాపఁడవై నటించుట గృపాపర ! నామదిఁ జోద్యమయ్యెడిన్ ;


                                        భాగ-ప్రథ-స్కం: 181 పద్యం: కుంతి కృష్ణుని స్తుతించుట;


                                          ఆంధ్ర సాహిత్య క్షేత్రాన్నలంకరించిన కవితల్లజులలో పాత్ర చిత్రణ విషయమున కవులందరు నొకయెత్తు. బమ్మెరపోతన యొకయెత్తు. అతడుచిత్రించిన పాత్రలన్నియు శబ్దచిత్రములే! కానీ,అందుకొన్ని నిశ్చలనములు, మరికొన్ని చలనములు.

ఆపాత్రలు పోతనగారితో మాటగలిపిమాటాడినవే! మనకుగూడ నట్టి మనః పరిణామము గల్గినచో నవిమనతోగూడ మాటాడగలవు.

"పాత్రకు తగిన యాకారము. ఆకారమునకు దగిన ఆహార్యము. ఆహార్యమునకుదగినఅలంకారములు.వానికితగినమాటలు .మాటలకు దగిన చక్కనిపదములబంధములు, పోతన పాత్రచిత్రణలోని విశేషములు.


                                        పైరెండుపద్యములలో మొదటిది పోతన సరస్వతి నోదార్చుట. ధనముపై నాశతో భాగవత గ్రంధమును నరాంకిత మొనరించునేమోనని యనుమానమంది చదువులతల్లి దీనవదనయై కన్నులనీరుగార దేవతార్చనా పీఠమున నున్నపోతనకన్నుల

కగుపించినదట! పోతనయామెరూపమును గాంచి నివ్వెరపోయెను,." అమ్మా! సరస్వతీమాతా! కాటుక తో దిగజారు కన్నీరు వక్షోజములపై బడగా నేలనమ్మా విలపింతువు? ఓహో! ధనాశతో నిన్నముకొందుననియా నీవిచారము. అటులెన్నటికి జరుగదు. త్రికరణ శధ్ధిగా జెప్పునామాటను నమ్ము. మనుట"-. ఇది నిశ్చలన చిత్రమే! ,ఆజగదంబ కన్నులనీరుగార్చుట. కన్నులకున్న కాటుక కరగి కన్నీట గలసి చనుగట్లపై బడుట. ఆహా! ఏమాచిత్రణము! మనోముకురమున గాంచగల్గినవాని జీవితము ధన్యము!!


                                   ఇఁక రెండవ చిత్రము చలనము. బాలకృష్ణుని కొంటేపనులను దలచుకొని కుంతి కృష్ణుని ప్రస్తుతించుచు నాడిన మాటలు. ఆమాటలవెనుక నార్తియున్నది. అభిమానమున్నది. భక్తియున్నది. ఆప్యాయతను రంగరించి చిత్రించిన యీచిత్రము అపూర్వము.


                                    "కృష్ణా! యేమి చెప్పనయ్యా నాటి ముచ్చటలు. బాల్యమున నీవొకనాడొకగోపిక యింటికేగి. దధి భాండమును కోపముతో పగులగొడితివి. ఆగోపికయు కోపమున నిన్ను త్రాటితోగట్టివేయుచో, మొగమొక వంకకు వంచి,కన్నుల కజ్జలశిక్తమై కన్నీరుగార

దానినంతయు నిరుచేతులతో మొగమంతయు పులుముకొనుచు వేడినిట్టూర్పులను విడచుచు బాలునివలె నటించుట నేడుదలచికొనిన నాకు చోద్యమనిపించునయ్యా! కొంటె కృష్ణయ్యా! యెంత దొంగ నటన! "భక్తిపాశములచే గట్టుబడు నీవు సామాన్యమగు త్రాట బంధింపఁబడుట నటన గాకమరేమి? "- యనిమేనత్తమాటలు.


                                  త్రాటగట్టబడుట , సాంజన భాష్పతోయ సిక్తమైన మోమును చేతులతో పులిమికొనుట. అప్పటి కృష్ణయ్య ఆ యాకారము. ఇవియన్నియు పోతన పాత్రచిత్రణము లోని మెళకువలు.చివరకు "అంతవాడ వింతవాడ వైతివే!! యని యాశ్చర్యమును ప్రకటించుట. యతని రచన లోని చమత్కారము. 


                                                                  ఇదండీ పోతన గారి పాత్ర చిత్రణలోని గొప్పతనం!


                                                                                                   స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷💄💄🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అర్చకుని తపస్సు

 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹


అర్చకశ్య తపోయోగాత్, 

అర్చకస్యాతి శ్యాయనాత్,

అభి రూప్యాచ్చ బింబానాం, 

దేవ సాన్నిధ్య మృచ్ఛతి.


తాత్పర్యము: అర్చకుని తపస్సు, యోగము, వినయము, భక్తి ప్రపత్తులు, ఆచారము, మంత్ర సౌష్టవముల వలన దేవతా విగ్రహములు దైవ సాన్నిధ్య శక్తిని కలిగి లోకానుగ్రహము కలిగించగలవు.... మనుస్మృతి ..  


విశ్లేషణ: ఈ శ్లోకం శ్రీశైలక్షేత్రం లోని శిఖరేశ్వర ఆలయం వద్ద కనపడుతుంది. మనుస్మృతి లోనిదని తెలుస్తోంది. అర్చకునికి ఉండవలసిన లక్షణాలేవో ఈ శ్లోకంలో తెలుస్తుంది.


అర్చకుడు తపస్సు చేయాలి. తపస్సు అంటే తపించడం, వేగిపోవడం. ఏ స్వామిని అర్చిస్తున్నారో ఆ స్వామి సేవలో పూర్తిగా లీనమై ఉండాలి. ఆ స్వామికి ఏమి కావాలి, ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే నిరంతర తపస్సులో ఉండాలి. 

యోగం లేకపోతే ఇవేవీ సాధ్యపడవు. 

ఆ యోగం పొందడానికి నిరంతరం కృషి చేయాలి. భగవంతుని పట్ల, భాగవతుల పట్ల వినయము కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉండాలి. 

భక్తి లేని పూజ పత్రి చేటు అని తెలుసు కదా. 

ప్రపత్తి కలిగివుండాలి. 

ప్రపత్తి అంటే శరణాగతి. 

ఏ స్వామిని సేవిస్తున్నారో ఆ స్వామిపట్ల 'అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ' అన్న భావాన్ని త్రికరణ శుద్ధిగాకలిగి ఉండాలి. ఆచారము పాటించాలి. శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రంలో 'ఆచార ప్రభవో ధర్మః' అన్నారు. సదాచారము నుండే ధర్మము ప్రభవిస్తుంది అని చెప్పారు. కనుక ధర్మాన్ని నిలబెట్టాలంటే ఆచారమును పాటించడం తప్పనిసరి. మంత్రాన్ని స్పష్ఠంగా ఉచ్చరించాలి. ఉచ్చారణ దోషాలుంటే ప్రకంపనలలో తేడా వచ్చి ఆ మంత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. అప్పుడు ఆ మంత్రం సరిగా పనిచేయదు. ఈ లక్షణాలన్నీ అర్చకునిలో ఉన్నప్పుడు, ఆ అర్చకుడు అర్చన చేసే బింబములో, అంటే విగ్రహములో దైవసాన్నిధ్యం చేకూరుతుంది. అంటే, అర్చకుడి వలననే విగ్రహానికి ఆ ప్రత్యేకశక్తి వచ్చి చేరుతుంది. అందుకే కొన్ని ఆలయాలలో నిజమైన దైవసాన్నిధ్య అనుభూతి కలుగుతుంది. అందుకే, దైవం తరువాత ఆ స్థానం ఆలయాల్లో అర్చకునిదే.


                     🙏🙏

సోమవారం🕉️* *🌹15సెప్టెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     *🕉️సోమవారం🕉️*

*🌹15సెప్టెంబర్2025🌹*   

   *దృగ్గణిత పంచాంగం*                     


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*భాద్రపద మాసం - కృష్ణపక్షం*


*తిథి  : నవమి* రా 01.31 వరకు ఉపరి *దశమి*

*వారం    : సోమవారం* ( ఇందువాసరే )

*నక్షత్రం   : మృగశిర* ఉ 07.31 వరకు ఉపరి *ఆరుద్ర*

*యోగం : వ్యతీపాత* రా 02.34 వరకు ఉపరి *వరీయాన్*

*కరణం  : తైతుల* మ 02.15 *గరజి* రా 01.31 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*

అమృత కాలం  : *రా 09.05 - 10.38*

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.27*


*వర్జ్యం      : సా 03.39 - 05.12*

*దుర్ముహూర్తం  : మ 12.27 - 01.16 & 02.54 - 03.43*

*రాహు కాలం   : ఉ 07.27 - 08.59*

గుళికకాళం       : *మ 01.34 - 03.06*

యమగండం     : *ఉ 10.31 - 12.02*

సూర్యరాశి : *సింహం*       

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 06.04* 

సూర్యాస్తమయం :*సా 06.18* 

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.56 - 08.22*

సంగవ కాలం         :     *08.22 - 10.49*

మధ్యాహ్న కాలం    :     *10.49 - 01.16*

అపరాహ్న కాలం    : *మ 01.16 - 03.43*

*ఆబ్ధికం తిధి         : భాద్రపద బహుళ నవమి*

సాయంకాలం        :*సా 03.43 - 06.09*

ప్రదోష కాలం         :  *సా 06.09 - 08.31*

రాత్రి కాలం           :*రా 08.31 - 11.39*

నిశీధి కాలం          :*రా 11.39 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.09*

++++++++++++++++++++++++++

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*హవ్యం తే లక్షసంఖ్యైర్హుత* 

*వహవదనే నార్పితం* 

*బీజమంత్రైః ।*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

Panchaag



 

_ఒక_పద్యం

 _ఒక_పద్యం



"కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే? వారేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపైపేరైనం గలదే? శిబి ప్రముఖులున్‌ ప్రీతిన్‌ యశఃకాములైఈరే కోర్కెలు? వారలన్‌ మరచిరే ఇక్కాలమున్‌ భార్గవా!"


ఇది పోతన గారి పద్యం. వామనావతార ఘట్టంలోది. వామనుడు నిజానికి విష్ణువని, బలిని నాశనం చెయ్యటానికే వచ్చాడని గ్రహించిన శుక్రుడు వామనుడికి దానం ఇవ్వొద్దని బలిని హెచ్చరించినప్పుడు అతనన్న మాటలు ఇవి.పోతన భాగవతంలో రెండే పాత్రలు భగవంతుడు, కవి. మిగిలిన వాళ్ళంతా నిమిత్తమాత్రులు. అంచేత నిజానికి ఈ మాటలు బలి పేరుతో పోతన గారే అంటున్నవని అనుకోవటం తప్పుకాదు.ఇంతకు ముందు ఒక సంచికలో వేలూరి గారు “ఎవ్వనిచే జనించు…” పద్యం గురించి అన్నట్లు, ఇక్కడ కూడ కొంత విచిత్రమైన భాషా ప్రయోగం కనిపిస్తుంది. “కారే రాజులు?” అనటమే ఒక వింత వాడుక. ఆ రెండు పదాల్నే తీసుకుని అర్థాన్ని సాధించాలంటే కష్టం కూడా. ఎవరో ఏమిటో చెప్పకుండా “వాళ్ళెక్కడ?” అంటే ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది? కాని అలా సందర్భాన్ని వివరించకుండా పద్యాన్ని ఎత్తుకోవటంలో బలి ఎంత భావావేశంలో వున్నాడో, అతని మనసు కన్నా వేగంగా మాటలు ఎలా పరుగిడుతున్నాయో ఇక్కడ పోతన గారు చూపిస్తున్నారు. ఇలాటి సందర్భాలు మనందరికీ అనుభవంలో వున్నవే. మరో విధంగా కూడ ఈ పద్యం ఎత్తుగడని వివరించొచ్చు. “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” అన్న గ్రంథంలో వెల్చేరు నారాయణరావు గారు అన్నట్లు, తెలుగు భారత భాగవత పురాణాలు నిజానికి ఎవరికివారు చదివి ఆనందించటానికి ఉద్దేశించినవి కావు ఒక పౌరాణికుడు వీటిలోని పద్యాలను మధ్య మధ్యలో వాడుతూ తనదైన కథనంతో ప్రవచనం చేసే పద్ధతికి అనుకూలమైనవి. అంచేత, ఒక పౌరాణికుడు ప్రసంగిస్తూ, బహుశా రకరకాల దేశాల పేర్లు చెప్పి, యుగాల పేర్లు చెప్పి, “అప్పట్నుంచి ఇప్పటివరకు

ఎందరెందరో..” అని ముందు చేర్చి “కారే రాజులు?” అని పద్యాన్ని ఎత్తుకుంటే అప్పుడు సరిగ్గా సరిపోతుందన్న

మాట. ఇక ఈ పద్యంలో పోతన గారు అంటున్నది, “ఎందరో రాజులయ్యారు, వాళ్ళకి రాజ్యాలు కలిగాయి, కాని అందువల్ల జరిగిందల్లా వాళ్ళకు గర్వం పెరగటం త ప్ప మరేమీ కాదు” అని. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళు

ఏమయ్యారు? ఆ సంపదని మోసుకుపోలేదు కదా! పోనీ, భూమ్మీద వాళ్ళ పేరైనా నిలబడిందా? అదీ లేదు. వాళ్ళెవరో

ఎవరికీ పట్టదు. అదే శిబి లాటి దాతలు కీర్తి కోసం కోరికలు తీర్చారు. వాళ్ళ పేర్లు ఇప్పటివరకూ నిలిచాయి. కొంచెం లోతుగా చూస్తే ఇక్కడ కనిపించేది గర్వోన్నతులైన రాజులకు చివరికి ఏ గతి పడుతుందంటే వాళ్ళ సిరిని ఇంకా బలవంతులైన వాళ్ళు వచ్చి కొట్టుకుపోతారు; ఆ పనిలో వాళ్ళెలాగూ ఈ గర్వోన్నతుల్నీ వాళ్ళ వంశాల్నీ నాశనం చేస్తారు; అంచేత వాళ్ళ వంశాలు కూడ మిగలవు ఆ విధంగా వాళ్ళ పేర్లు కాలగర్భంలో కలిసిపోతాయి; అనేది. చారిత్రకంగా చూస్తే ఇది నిజమే మరి. రాజుల జీవితాలు దినదిన గండాలుగా వుండేవి. వృద్ధాప్యంలో సహజ మరణాల్తో పోయిన వాళ్ళు చాలా కొద్దిమందే! కనుక నిజంగా విష్ణువే తనని నాశనం చెl ు్యటానికి వచ్చినప్పుడు దానం చేసి పేరు నిలబెట్టుకోవటమో లేక ఆ గర్వోన్నత రాజుల దారిలో నడిచి వంశనాశనం చేసుకోవటమో ఈ రెండే మార్గాలున్నాయి బలికి (పోతన గారి దృష్టిలో). అంచేత దానం ఇవ్వటం అనే మార్గాన్ని ఎంచుకోవటంలో బలి చేస్తున్న త్యాగం పెద్దగా ఏమీ లేదు. అది అతనికీ తెలుసు. మరో విషయం ఈ పద్యం “పేరు నిలబడటం” అనేది గొప్ప లక్ష్యమని ప్రతిపాదిస్తుంది. ఇప్పటి పరిస్థితుల్లో ఇది చాదస్తంగా, మౌఢ్యంగా అనిపిస్తుంది కాని వందేళ్ళ క్రితం కూడ అభిమానధనం ముందు ధనానికి విలువ తక్కువగానే వుండేది. అందుకు ముఖ్యకారణం పటిష్టమైన కుటుంబ వ్యవస్థ. ఒక కుటుంబం మీద మచ్చ పడితే అది మాసిపోవటానికి ఏడు తరాలు పడుతుందని భావించే సమాజంలో ఏ విధమైన చెడ్డ పేరూ రాకుండా చూడటం ప్రతి వ్యక్తికీ బాధ్యతే. అలా చెయ్యకపోతే అతను తన వంశాన్ని ఎన్నో తరాల ముందు వరకు శాపగ్రస్తం చేసిన వాడౌతాడు. కుటుంబ వ్యవస్థ కూలిపోయి వ్యక్తులు సర్వస్వతంత్రులై, వాళ్ళ ప్రవర్తనకి వాళ్ళు వ్యక్తిగత బాధ్యతని వహించే ఈ నాటి పాశ్చాత్య,

పాశ్చాత్య ప్రభావిత, సమాజాల్లో అప్పటి విలువలు పనికిరావు కనుక ఈ పద్యం చెప్పే నీతి ఇప్పుడు మనకు

అంగీకారయోగ్యం కానక్కర లేదు. ఐనా చక్కటి పద్యానికి ఉన్న శక్తి, దాన్లోని విషయం మనకు నచ్చకపోయినా


పదే పదే మన చేత మననం చేయించటం!