13, ఆగస్టు 2025, బుధవారం

శ్రీమద్భాగవత కథలు*```

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🪷బుధవారం 13 ఆగస్టు 2025🪷*


                       3️⃣0️⃣

                  *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


      *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


        *పంచమ స్కంధం*              

```

శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు. వాస్తవానికి పంచమ స్కంధాన్ని పోతన శిష్యుడు గంగానార్యుడు తెనిగించాడు. డాక్టర్ టి రాజగోపాలబాలం గారు అనువదించారు. ఇది రెండు అశ్వాసాలుగా రాయబడింది ప్రథమాశ్వాసం, ద్వితీయాశ్వాసం పంచమ స్కంధం ప్రథమాశ్వాసంలో ప్రియవ్రతుడి చరిత్ర దగ్గరనుంచి, భరతుడి బోధతో రహగణుడి సంశయ నివృత్తి వరకు 12 అంశాలు: 


ద్వితీయాశ్వాసంలో మహారాజు సుమతి వంశ క్రమం దగ్గరనుండి నరలోక విషయాల వరకు మొత్తం ఆరు అంశాలు ఉన్నాయి. 

క్లుప్తంగా ఆ మొత్తం 18 అంశాల వివరాలు:


ప్రథమాశ్వాసం: ప్రియవ్రతుడి చరిత్ర, ప్రియవ్రతుడి సుజ్ఞాన దీక్ష, బ్రహ్మ దర్శనం, అగ్నిధారల జననం, ఉత్తమ తామస రైవత మనువుల జన్మం, ప్రియవ్రతుడు వనాలకు పోవడం, అగ్నీధ్రుడి కథ. అగ్నీధ్రుడు అప్సర స్త్రీని చేపట్టడం వర్షాధిపతుల పుట్టుక, అగ్నీధ్రుడు అడవికి వెళ్ళడం, నాభి ప్రముఖుల రాజ్యం, నాభి యజ్ఞం, ఋషభావతార గాథ, ఋషభుడి కుమారుడైన భరతుడి పేరుమీద "భరత వర్షం" అనే పేరు ప్రసిద్దికెక్కడం, ఋషభుడి జన్మవృత్తాంతం, అతడి రాజ్యాభిషేకం, భరతుడి జననం, పుత్రులకు ఋషభుడి బోధ-కొడుకులకు సాటిలేని విజ్ఞానాన్ని ఉపదేశించడం. భరతుడి పట్టాభిషేకం, ఋషభుడి తపస్సు, భరతోపాఖ్యానం, భరతుడు అరణ్యానికి వెళ్ళడం, భరతుడు జింకపిల్లగా జన్మించడం, తిరిగి బ్రాహ్మణుడిగా పుట్టడం, కాళీబలికి భరతుడిని తీసుకునిపోవడం, బతికి బయటపడడం, భరతుడు పల్లకీ మోయడం, సింధురాజుకు బ్రాహ్మణుడికి (భరతుడు) జరిగిన సంవాదం, భరతుడు బోధతో రహగణుడి సంశయ నివృత్తి ఉన్నాయి.


ద్వితీయాశ్వాసం: భరతుడి కొడుకైన సుమతికి రాజ్యాభిషేకం, మహారాజు సుమతి వంశక్రమం. పాషండ దర్శనం, సుమతి పుత్రుల జన్మ వివరణ, మహాపురుషుడు గయుడి చరిత్ర, శుకయోగిభునైసర్గిక స్వరూపాన్ని వివరించడం. భూమండలం, ద్వీపాలు, వర్షాలు, నదులు, పర్వతాలు, అంతరిక్షం, ఖగోళ విషయ విస్తారం, సముద్రాలు, పాతాళ లోకాల వివరణ, దిక్కులు, నక్షత్రాలు, నరలోక విషయాలు ఉన్నాయి.


'అగ్నీధ్రాదుల జననం' అన్న అంశంలో అగ్నీధ్రాదుడి రథచక్ర తాకిడికి భూమిమీద ఎలా గోతులు ఏర్పడ్డాయో వివరించడం జరిగింది. అవే సప్త సముద్రాలయ్యాయి. ఆ సముద్రాల మధ్య భాగం ద్వీపాలయ్యాయి. ఆ సప్త ద్వీపాలు: జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, శాల్మలి ద్వీపం, కుశద్వీపం, క్రౌంచ ద్వీపం, శాక ద్వీపం, పుష్కర ద్వీపం. ఇక సప్త సముద్రాలు: లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, ఘృత (నేతి) సముద్రం, పాల సముద్రం, దధి (పెరుగు) సముద్రం,జల సముద్రం. సముద్రాలు ద్వీపాలకు అగడ్తలలాగా ఉన్నాయి. సముద్రాలు, ద్వీపాలు ఒకదానితో ఒకటి కలిసి పోకుండా. సరిహద్దులు పెట్టినట్లు వరస తప్పకుండా వేర్పడడం చూసి జీవులు విస్తుపోయాయని పేర్కొనడం జరిగింది.


ఈ విషయాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన విషయాలు పంచమ స్కందంలో ఉన్నాయి. ఇవన్నీ చదవగలగడం పూర్వజన్మ సుకృతం.


                  *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


          *రచన:శ్రీ వనం*

   *జ్వాలా నరసింహారావు*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷``


 *🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

బుధవారం🌷* *🪷13 ఆగస్టు 2025🪷*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌷బుధవారం🌷*

 *🪷13 ఆగస్టు 2025🪷*  

    *దృగ్గణిత పంచాంగం* 


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - కృష్ణపక్షం*


*తిథి  : చవితి* ఉ 06.35 *పంచమి* రా.తె 04.23 వరకు 

*వారం    : బుధవారం* ( సౌమ్యవాసరే )

*నక్షత్రం   : ఉత్తరాభాద్ర* ఉ 10.32 వరకు ఉపరి *రేవతి*

*యోగం : ధృతి* సా 04.05 వరకు ఉపరి *శూల*

*కరణం  : బాలువ* ఉ 06.35 *కౌలువ* సా 05.30 ఉపరి

*తైతుల* రా.తె 04.23 వరకు *ఆపైన గరజి* 


*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 09.00 - 10.00 సా 04.30 - 05.30*    

అమృత కాలం  : *ఉ 06.00 - 07.31*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*


*వర్జ్యం      : రా 09.49 - 11.19*

*దుర్ముహూర్తం  : ప 11.47 - 12.38*

*రాహు కాలం   : మ 12.12 - 01.47*

గుళికకాళం       : *ఉ 10.37 - 12.12*

యమగండం     : *ఉ 07.26 - 09.02*

సూర్యరాశి : *కర్కాటకం*  

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం :*ఉ 05.59*

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.51 - 08.23*

సంగవ కాలం         :     *08.23 - 10.56*

మధ్యాహ్న కాలం    :     *10.56 - 01.28*

అపరాహ్న కాలం    : *మ 01.28 - 04.01*


*ఆబ్ధికం తిధి         : శ్రావణ బహుళ పంచమి*

సాయంకాలం        :*సా 04.01 - 06.33*

ప్రదోష కాలం         :  *సా 06.33 - 08.49*

రాత్రి కాలం           :*రా 08.49 - 11.50*

నిశీధి కాలం          :*రా 11.50 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.06*

******************************

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌷శ్రీ సరస్వతీ కవచం🌷*


*ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై* 

*స్వాహేతి దంతపంక్తిం* 

*సదాఽవతు* 


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

శిరా వేధ పద్ధతి

 శిరా వేధ పద్ధతి  - ప్రాచీన చికిత్సా పద్దతి . 1

      

.        ఈ శిరావేధ చికిత్స మన ఆయుర్వేదము నందు తప్ప ఏ ఇతర వైద్యము నందు లేదు . ఈ శిరావేధ పద్దతి ద్వారా అసాధ్యవ్యాధులను పోగొట్టవచ్చు . ఇప్పుడు ఈ ప్రాచీన చికిత్స గురించి మీకు సంపూర్ణముగా వివరిస్తాను. 

              

. మానవ శరీరం నందు మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 700 శిరలు కలవు . ఈ శిరలు శరీరమంతటా వ్యాపించి చిన్నచిన్న నీటికాలువలు తోటలోని అన్ని చెట్లకు నీటిని ఎలా అందచేయునో అదేవిధముగా శరీరంలోని అన్ని భాగములకు మనము తినిన ఆహారపదార్ధము వలన జనించు రసాధి ధాతువులను అందచేసి శరీరంను పోషించుచున్నవి. శరీరంలో అవయవములు ముడుచుకొనుట , చాచుట వంటి కార్యక్రములకు తోడ్పడుచున్నవి. శరీరంలోని వాత,పిత్త,కఫములు రక్తమునందు చేరి శరీరము అంతటా ప్రసరించుచున్నవి. శరీరము నందలి వాతాదులు అధికంగా వహించు శిరలకు వెఱువేఱు రంగులు , పనులు ఉండును. హస్త, పాదముల యందు 400 శిరలు కలవు. ఉదరము నందు 136 , శిరస్సు నందు 164 ఇలా మొత్తం 700 శిరలు కలవు. వీటిలో హస్తము , పాదముల యందు 16 శిరలు , ఉదరము నందలి 32 శిరలు , మెడకు పైభాగము వేధింపతగినవిగా గుర్తించవలెను. ఇక్కడ వేధింపడం అనగా శిరకు రంధ్రం చేసి దుష్టరక్తం తీయటం ఇది చేయు పద్ధతిని తరువాత వివరిస్తాను . 

           

.      శిరావేధ చేయు వైద్యుడు మర్మలకు సన్నిహితముగా ఉండు శిరలను వేధించరాదు . శిరల గురించి వాటి స్థానము గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వైద్యుడు మాత్రమే చికిత్స చేయవలెను . మర్మలకు సన్నిహితముగా ఉన్న శిరలను వేధించిన కొత్తరోగములు వచ్చుట , అంగవైకల్యము సంప్రాప్తిచుట జరుగును . ఒక్కోసారి ప్రాణములు పోవటం కూడా జరుగును. సరిగ్గా చికిత్స చేసిన అసాధ్యరోగములు పోగొట్టవచ్చు . ఈ శిరావేధనము బాలలు , వృద్దులు , క్షీణించినవారు , తాత్కాలిక కారణాల వలన నీరసించినవారు మొదలగువారికి నిషిద్దం . ఒకవేళ పాముకాటుకు గురైన నిషేధింపబడిన వారికి కూడా శిరావేదన చికిత్స చేయవచ్చు . అలా చేసిన బ్రతకగలరు . ఇప్పుడు మీకు ఈ శిరావేదన పధ్ధతి గురించి సంపూర్ణముగా వివరిస్తాను. 

                     

.       శిరలను వేధించుటకు ముందుగా శిరస్సు , పాదములు , హస్తములు , ఉదరము , పార్శ్వములు మొదలగు స్థానములందలి శిరలు స్పష్టముగా కనపడేలా గుడ్డతో కట్టిన పిమ్మట వ్రీహిముఖము అను ఒక శస్త్రముతో ఆయాస్థానములు అనుసరించి యవగింజ ప్రమాణము , అర్ధయావగింజ అంత లోతుగా వేధించవలెను . వేధ చేయవలసిన కాలములను సరిగ్గా గుర్తించవలెను . వేధ చేసిన పిమ్మట సువిద్ద ,దుర్విద్ధ లక్షణములు , దుష్టరక్త స్వరూపము , మంచి రక్తస్వరూపము , రక్తము వేధన చేసినను రాకుండా ఉండటం , లేక అధికరక్తస్రావం అగుట , ఎట్టివారికి ఎంత రక్తము తీయవలెను ఇత్యాది లక్షణములను , విధులను బాగుగా గుర్తించి రక్తమోక్షణము చేయవలెను . 

                 

.          తరవాతి పోస్టు నందు ఏయే వ్యాధులకు ఎక్కడెక్కడ రక్తమోక్షణము చేయవలెనో వివరిస్తాను .  


. మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


గమనిక  -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

.        నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

.         ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

.    ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

.       కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

.               9885030034

అభిజ్ఞానశాకుంతలం

 🙏అభిజ్ఞానశాకుంతలం కవికుల గురువు కాళిదాసు🙏

ముందుగాఅభిజ్ఞానశాకుంతలం నాటకం బోధించిన మా గురువర్యులు బ్రహ్మశ్రీ కొంపెల్ల సత్యనారాయణ గారికి పాదాభివందనం.


కాళిదాసు రచనల్లో ఇది బాగుంది, ఇది బాలేదు అని చెప్పడానికేమీ లేదు (అలా చెప్పడానికి నాకున్న జ్ఞానం సరిపోదు) కానీ ఈ అభిజ్ఞాన శాకుంతలం నన్ను ఎక్కువగా ఆకర్షించింది. ఇది "శృంగార రస" ప్రధానమయిన నాటకం. ఈ కథ అందరికీ బాగా తెలిసినదే కనుక సూక్ష్మంగా చెప్పుకుంటే: హస్తినాపుర రాజయిన దుష్యంతుడు వేటకు వెళ్ళినపుడు కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతలని కలిసి, ప్రేమించి, గాంధర్వ వివాహం చేసుకుంటాడు. కొంతకాలం ఆమెతో ఉన్నాక రాజ్యానికి తిరిగివెళుతూ రాజముద్రికను గుర్తుగా ఇస్తాడు. భర్త గురించిన తలపులతో, విరహంలో ఉన్న సమయంలో ఆశ్రమానికి వచ్చిన దూర్వాస మునిని సరిగా ఆదరించక పోవడంతో ఎవరిగురించయితే ఆలోచిస్తూ నన్ను అశ్రద్ధ చేసావో వారు నిన్ను పూర్తిగా మర్చిపోతారనీ, ఏదయినా గుర్తు చూసినప్పుడే గుర్తువస్తావనీ శకుంతలని శపిస్తాడు. నిజానికి ఈ శాప విషయం కూడా ఆమె వినకుండా భర్త గురించే ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటుంది. ఇవన్నీ కణ్వ మహర్షి ఆశ్రమంలో లేని సమయములో జరిగినందున తిరిగివచ్చిన మహర్షి జరిగినదంతా తెలుసుకుని శకుంతలను అత్తవారింటికి పంపుతాడు. రాజు వద్దకు వెళ్తున్న శకుంతల నదిలో ఈ రాజముద్రికని కోల్పోవడం, రాజు ఈమెను గుర్తించక నిరాకరించడం, మేనక ఆమెను తీసుకెళ్ళిపోవడం, కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో చేరటం, ఇలా చాలా జరిగి ఒక చేపలవాని వలలో చిక్కిన ఈ రాజముద్రికని రాజు వద్దకు తీసుకెళ్లడం, అప్పుడంతా గుర్తువచ్చిన దుష్యంతుడు శకుంతలని తన వద్దకు తీసుకుని వచ్చి వారి కుమారుడైన భరతునికి పట్టాభిషేకం చేయటం జరుగుతాయి.ఇది సంక్షిప్త కథ


ఈ నాటకంలో నాకు శృంగారం కన్నా ధార్మిక సూత్రాలు ఎక్కువగా కనిపించాయి (పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు కదా!). ప్రతీ రచనా శ్రీకారానికి ప్రోద్బలం ఉంటుంది అన్నట్టుగా ఒక రోజున భోజమహారాజు కాళిదాసుని శాకుంతలాన్ని రచించమని అడుగగా ఈయన "శాకుంతలంలోని నాయకుడయిన దుష్యంతుడు ధీరోదాత్తుడు కానందున నేను వ్రాయను" అంటారు. ఇక్కడ మనకు కాళిదాసు రచనలో పాత్రలకి కూడా ఎంత చక్కని గుణాలని ఆపాదించాలని చూస్తాడో అనిపిస్తుంది. తన భార్యాబిడ్డల్ని ఎక్కడ లోకం అనుమానిస్తుందో, అవమాన భారం మొయ్యాల్సివస్తుందో అన్న భయంతో (లోకానికి వారు నిజంగా తనవారే అని అశరీరవాణితో చెప్పించడానికి అలా చేశాడు అని కొందరి సమర్ధన) తన వారు కాదని చెప్పిన దుష్యంతుడిని నాటకంలో నాయకుడిని చేయలేను. అయినా రాజు అడిగినందున ఆయన ముచ్చట తీర్చడానికి తను రాజీ పడలేక ఒక శాపం పొందినట్టు, ముద్రిక చూడటం వలన అంతా మళ్ళీ గుర్తుకు వచ్చినట్టు కల్పించి, నాయకుని లక్షణాలను ఆపాదించి, అభిజ్ఞాన శాకుంతలం అని నామకరణం చేశాడు. అభిజ్ఞానం అనగా ఒక గుర్తు (ఇక్కడ కథలో రాజ ముద్రికే గుర్తు). అందువలననే దీనిని కేవలం శాకుంతలం అని కాక అభిజ్ఞాన శాకుంతలం అనాలి.

ఈ నాటకంలో నాకు శృంగారం కన్నా ధార్మిక సూత్రాలు ఎక్కువగా కనిపించాయి (పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు కదా!). ప్రతీ రచనా శ్రీకారానికి ప్రోద్బలం ఉంటుంది అన్నట్టుగా ఒక రోజున భోజమహారాజు కాళిదాసుని శాకుంతలాన్ని రచించమని అడుగగా ఈయన "శాకుంతలంలోని నాయకుడయిన దుష్యంతుడు ధీరోదాత్తుడు కానందున నేను వ్రాయను" అంటారు. ఇక్కడ మనకు కాళిదాసు రచనలో పాత్రలకి కూడా ఎంత చక్కని గుణాలని ఆపాదించాలని చూస్తాడో అనిపిస్తుంది. తన భార్యాబిడ్డల్ని ఎక్కడ లోకం అనుమానిస్తుందో, అవమాన భారం మొయ్యాల్సివస్తుందో అన్న భయంతో (లోకానికి వారు నిజంగా తనవారే అని అశరీరవాణితో చెప్పించడానికి అలా చేశాడు అని కొందరి సమర్ధన) తన వారు కాదని చెప్పిన దుష్యంతుడిని నాటకంలో నాయకుడిని చేయలేను. అయినా రాజు అడిగినందున ఆయన ముచ్చట తీర్చడానికి తను రాజీ పడలేక ఒక శాపం పొందినట్టు, ముద్రిక చూడటం వలన అంతా మళ్ళీ గుర్తుకు వచ్చినట్టు కల్పించి, నాయకుని లక్షణాలను ఆపాదించి, అభిజ్ఞాన శాకుంతలం అని నామకరణం చేశాడు. అభిజ్ఞానం అనగా ఒక గుర్తు (ఇక్కడ కథలో రాజ ముద్రికే గుర్తు). అందువలననే దీనిని కేవలం శాకుంతలం అని కాక అభిజ్ఞానశాకుంతలం అనాలి


కాళిదాసు ప్రజ్ఞకు అభిజ్ఞాన శాకుంతలంలోని చతుర్దాకములోని శ్లోక చతుష్టయాన్ని ఉదాహరణకు చెప్పాలనుకుంటున్నాను

"కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు చ శకుంతలా

తస్యాంచ చతుర్ధ్వాంకః తస్మిన్ శ్లోక చతుష్టయం"

.

కావ్యాలకంటే నాటకాలు రమ్యంగా ఉంటాయి.

నాటకాలలో శాకుంతలం, అందులో మళ్ళీ నాల్గవ అంకము, 

అందులో కూడా శ్లోక చతుష్టయం 

అద్భుతమయినవి. శ్లోక చతుష్టయం అంటే నాలుగు శ్లోకాలు.

ఈ నాలుగూ కూడా కణ్వ మహర్షి చెప్పిన సందర్భంలోవే. 

ఏమిటా శ్లోకాలు? ఎందుకవి అంత గొప్పవి అంటే వాటిని చదవ వలసినదే:

.

పాతుం న ప్రధమం యవస్యతిజలా యుష్మాస్వపీ తేషుయా

నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహే నయా పల్లవం

ఆజ్యేవః కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః

సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం

.

మనిషికీ ప్రకృతికీ ఉండే బంధాన్ని ఎంత చక్కగా చెప్పాడో కదా కాళిదాసు! 

.

మొక్కలకి నీళ్ళు పోయకుండా తను మంచినీళ్ళు కూడా త్రాగేది కాదు, చిగురుటాకులను అలంకరించు కోవటం ఎంత ఇష్టమయినా సరే తుంచేది కాదు, తాను పెంచిన మొక్కకి పువ్వు పూస్తే పిల్లలు పుట్టినంత ఆనందించి ఉత్సవం చేసేది, 

అటువంటి శకుంతల అత్తవారింటికి వెళుతోంది కనుక మీరు అనుజ్ఞని ఇవ్వండి అంటాడు కణ్వ మహర్షి. ఈ శ్లోకంలో మొక్కలని సాటి మనిషిగా, అతిధిగా, సన్నిహితులుగా, బంధువులుగా చూపటం జరిగింది. 

వృక్షో రక్షతి రక్షితః అని మనం అనడమే తప్ప ఏనాడయినా 

ఇంత మమకారం చూపించామా? అనిపిస్తుంది నాకయితే.

.

యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట ముత్కంఠయా

కంఠస్థంబిత బాష్పవృత్తి కలుషశ్చింతా జడం దర్శనం

వైక్లవ్యం మమతావదీ దృశ మిదం స్నేహాదరణ్యౌ కసః పీడ్యంతే గృహిణః కథంనుతనయా విశ్లేష దుఃఖైర్నవైః

.

నా కూతురయిన శకుంతల అత్తవారింటికి వెళుతుంటే బాధతో కంఠం పట్టేసి నోట మాట రావటం లేదు, కంటిలో నీరు చేరి చూపు కనిపించటం లేదు, అంతా జడంగా, నిర్జీవంగా అనిపిస్తోంది. 

మునివృత్తిలో ఏ బంధాలూ లేకుండా ఉండే నాకే ఇంత బాధగా, మనసంతా ఏదోలా ఉంటే అదే గృహస్థులకి కూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు ఇంకెంత బాధాకరంగా ఉంటుందో కదా! అని ఆలోచిస్తాడు కణ్వ మహర్షి.

ఒక ప్రక్కన తను బాధపడుతూనే వేరే వారి పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన కూడా కణ్వ మహర్షిలో కలిగినట్టు చూపెడతాడు కాళిదాసు. ఒక తండ్రికి అత్యంత బాధ కలిగే సమయం ఇదే అంటారు అందుకేనేమో!

.

అస్మాన్ సాధు విచింత్య సంమ్యమధనాన్ ఉచ్ఛైః కులంచాత్మనః

త్వైయస్యాః కథమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్యించతాం

సామాన్య ప్రతిపత్తి పూర్వక మిదం దారేషు దృశ్యాత్వయా

భాగ్యా యత్త మతః పరం నఖలుత ద్వాత్యం వధూబంధుభిః

.

కూతురితో రాజయిన అల్లుడికి కణ్వ మహర్షి పంపే సందేశమే ఈ శ్లోకం. 

నేను సారెలు, కట్నకానుకలు ఇవ్వలేదు. ముని వృత్తిలో ఉన్న మాకు తపస్సు, నీతి నియమాలే ధనం. రాజువయిన నీకు ఇంతకన్నా గొప్ప ధనాన్ని (నీ తాహతుకు తగ్గట్టు) మేము ఇవ్వలేము. 

కావున అవేమీ ఇవ్వలేదని మా అమ్మాయిని సాధించకు, డబ్బు,నగలు లేవని తృణీకార భావంతో చూడకు. మీది పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా కాదు. స్నేహభావంతో, అనురాగంతో మీరిరువురూ గాంధర్వ వివాహం చేసుకున్నారు కనుక మా అమ్మాయి నచ్చలేదు అని ఏ నాడూ అనకు. 

నీకు చాలా మంది భార్యలున్నా (బహు భార్యత్వం ఆ కాలంలో సహజమే) వారితో సమానంగా చూడు. వారికన్నా బాగా చూసుకుంటాను అంటే అది శకుంతల భాగ్యం కానీ నేను మాత్రం వారికన్నా బాగా చూడమని చెప్పకూడదు అని ఈ శ్లోక సారాంశం. 

నన్నెంతగానో కదిల్చింది. ఎంత ముందుచూపు ఆ తండ్రికి? నీతి నియమాలు, సత్ప్రవర్తనకి మించిన ధనం ఉంటుందా? ఈ విషయం ఈ కాలం వారు గ్రహించి ఆచరిస్తే ఎంతో మంది స్త్రీలు కట్న పిశాచికి బలి కాకుండా ఉండేవారేమో కదా! అనిపించింది.

ఇక్కడ శ్లేష కూడా ఉంది.

అస్మాన్ సాధు విచింత్య 

మమ్ములను సాధువులని (తపస్సాలులమని ) తెలుసుకో.నీ దగ్గర ఎంత ధనమైన ఉండవచ్చు మాకు సంమ్యమధనాన్. తపస్ శక్తియే ధనం. మా తపోధనము ముందు నీ ఐహిక సంపదలు నిలవవు. ఈమె ఉన్నత వంశములో పుట్టినది..

.సా -- మాన్య ప్రతిపత్తి పూర్వక మిదం దారేషు దృశ్యాత్వయా ఆమెను మాన్య అంటే ఇతర స్త్రీ గా చూడవద్దు అని హెచ్చరించారు చాలా గొప్ప శ్లోకం కాళిదాసు దివ్య చరణాలకు నా నమస్కారాలు.

 

సుశ్రూషస్వ గురూన్ ప్రియసఖీ వృత్తిం సపత్నీజనే

భర్తుర్విప్ర కృతాపి రోషణతయా మాస్మం ప్రతీ పంగమః

భూయిష్ఠం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ

యాంత్యేవం గృహిణీ పదం యువతయో వామాః కులస్యాధయః

.

ఇంతకు ముందు చెప్పిన శ్లోకంలో అల్లుడు కూతురిని ఎలా చూసుకోవాలో చెప్పిన కణ్వ మహర్షి ఈ శ్లోకంలో ఆడపిల్ల అత్తవారింట ఎలా ఉండాలో చెప్పాడు. 

పెద్దలకి (అత్తమామలకీ, మొ..వారికి) సేవ చెయ్యి, సవతులతో స్నేహంగా ఉండు, భర్త కోపంలో ఒక మాట అన్నా రోషం తెచ్చుకోకుండా అతనితో సామరస్యంగా ఉండు, 

సేవకుల యందు దయకలిగి ఉండు వారిని ఏ నాడూ తక్కువగా చూడకు, భోగ భాగ్యాలున్నాయి అన్న ఉద్వేగంతో గర్వం దరిచేరకుండా చూసుకో. ఇలా ఉన్నప్పుడే యువతులు గృహిణీ స్థానం పొందుతారు లేదా చెడ్డ పేరు తీసుకువస్తారు అని చెప్తాడు. 

ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యం. తప్పక ప్రతీ ఒక్కరూ ఇవన్నీ పాటిస్తూ ఆచరణలో పెట్టగలిగితే (?) ఈ కాలంలో విడాకులు అనేవి ఉండేవి కావేమో! అనిపిస్తుంది.

ఈ నాలుగు శ్లోకాలూ అమోఘం. 

కాళిదాసు ఇవన్నీ ఈ కాలంలో పరిస్థితులు ఇలా ఉంటాయన్న ముందుచూపుతో ఇవన్నీ వ్రాశాడో, లేక మామూలుగానే వ్రాశాడో తెలియదు కానీ ప్రపంచం ఎంతగా మారిపోయినా ప్రతీ ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవలసిన మాటలు కదూ! 

అందుకేనేమో ఇవి శ్లోక చతుష్టయం అంటూ అంతటి గొప్ప స్థానాన్ని పొందాయి.

ఈ నాటకమంతటిలో నాకు కాళిదాసు జనాలకి ఎక్కువ ఉపదేశాలు చేశారనిపిస్తుంది. ఎన్నో ధర్మాలకి అక్షర రూపం ఈ నాటకం. ప్రతీ శ్లోకంలోనూ ఒక్కో ధర్మాన్ని చూడచ్చు. వాటిల్లో అన్నీ వ్రాయలేను కానీ కొన్ని ముఖ్యమయినవి, ఆలోచించ తగినవి (నా ఉద్దేశ్యంలో):


ప్రాణానామనిలేన వృత్తి రుచితా సత్కల్ప వృక్షేవనే

తోయే కాంచన పద్మరేణుకపిశే ధర్మాభిషేక క్రియా

ధ్యానం రత్న శిలాతలేషు విభుధస్త్రీ సన్నిధౌ సంమ్యమః

యత్కాంక్షంతి తపోభిరన్య మునయః తస్మిన్ తపస్యంత్యమీ


ఇది దుష్యంతుడు కశ్యప ప్రజాపతి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితిని వర్ణించిన సందర్భంలోనిది. అక్కడ ఉన్న జనాలు కల్పవృక్షం క్రింద కూర్చుని ప్రాణాయామం చేస్తున్నారు, ఆకాశగంగలో బంగారు తామరపూల మధ్యన స్నానం చేస్తున్నారు, రత్నాలతో చేసిన వేదిక పైన కూర్చుని తపస్సు చేస్తున్నారు, చుట్టూ అప్సరసలు తిరుగుతున్నా పట్టించుకోకుండా ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. అసలు సాధారణ మానవులు ఏవయితే కోరుకుంటారో వాటికి మించి ఉన్నా కూడా మోక్షం కోసం ఇవన్నీ చేస్తున్నారు. అంటే దీనిని బట్టీ కాళిదాసు ఈ భోగభాగ్యాలు శాశ్వతం కాదు ఆత్మసాక్షాత్కారం, మోక్షం మాత్రమే శాశ్వతం అని చెప్తున్నాడా (?) అనిపిస్తుంది. కానీ వారిలో వేటికీ చలించకుండా ఉన్న చిత్తశుద్ధి, చేస్తున్న పని మీద ఏకాగ్రత మనకు ఉంటే అబ్బో! ఎన్ని సాధించే వాళ్ళమో!   


తన వద్దకు వచ్చిన శకుంతలని నిరాకరించిన దుష్యంతునికి ఒక పాట వినిపిస్తుంది. దాని భావం "తుమ్మెదా! నువ్వు ఒక పువ్వు మీద వాలి మకరందాన్ని స్వీకరించావు, తరువాత దీనిని వదిలేసి ఇంకొక పువ్వు మీద వాలతావు" అని ఉంటుంది. అది వినేసరికి దుష్యంతునికి మనసులో అల్లకల్లోలం. మనసుకి బాగా పట్టేసినది ఏదయినా విన్నా, దాని గురించి ఏం తెలిసినా అదంతా గత జన్మ భావన అనుకోవటమే కాక మనసు చలించిపోయి ఉద్వేగానికి గురవుతారు. అందుకే ""భావస్థిరాణి జననాంతర సౌహృదాని"" అంటారు. ఇక్కడ దుష్యంతుని ఆ తుమ్మేదని నేనే ఎవరినో వదిలేసాను అన్న భావన గత జన్మలోదని భావించాడు కానీ ఈ జన్మలోదే అని శాప ప్రభావం చేత తెలుసుకోలేకపోయాడు. మనసుకి బాగా దగ్గరయినవి ఎన్నటికీ మర్చిపోలేము అన్న మాట మనందరికీ అనుభవమే కదా!


ఒక పౌర్ణమి తరువాతి రోజు సూర్యోదయాన్ని వర్ణిస్తూ ఒకరు (చంద్రుడు) అంతమవుతుంటే ఒకరు (సూర్యుడు) పుడుతున్నాడు అంటారు కాళిదాసు. ఇది మనందరం చూసే విషయమే కదా ఇందులో వింతేముంది అనుకోకండి. ఆలోచిస్తే ఒక మనిషి చనిపోతుంటే వేరొక మనిషి పుడుతున్నాడు అన్న అంతరార్థం ఉంది కదా. అది చెప్పేందుకే ఇలా చూపించాడా అనిపిస్తుంది.


వాస్తవానికి రాజయిన దుష్యంతునికి మునికుమార్తె శకుంతల మీద ప్రేమ భావం కలుగకూడదు. కానీ కలుగుతోంది అంటే ఇది నిజంగా తప్పు కాదు అనుకుంటాడు (నిజానికి ఈమె విశ్వామిత్రుని కుమార్తె కదా). సతాంహి సందేహ పదేషు వస్తుషు ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః అన్నట్టు సందేహంగా ఉన్నప్పుడు మనసు ఏది చెప్తే అదే చేయమని అంటాడు కాళిదాసు. సత్పురుషులకీ, గొప్పవారికి మనస్సే ప్రమాణం. అందుకే కదా మనస్సాక్షికి మాత్రమే భయపడాలి అంటారు.


అత్తవారింటికి వెళ్తున్న శకుంతల తండ్రయిన కణ్వ మహర్షిని మళ్ళీ పుట్టింటికి ఎప్పుడు రాను? అని అడుగుతుంది పుట్టింటి మీద మమకారంతో. అది విన్న ఆయన వానప్రస్థానికి రమ్మంటాడు. దీనిని బట్టీ పెళ్ళయిన ఆడపిల్ల అస్తమానూ పుట్టింటికి రాకూడదు అన్న విషయం చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది.


ఇలా చెప్పుకుంటూ పోతే నాటకమంతా చాలా చాలా ఆలోచనలను రేపింది. కాళిదాసు రచనలన్నింటిలోనూ అభిజ్ఞానశాకుంతలం ఎంతో కీర్తి సంపాదించుకుంది. వేరే భాషలలో కూడా ఎక్కువగా అమ్ముడయిన పుస్తకం ఇదే. ఎన్నో భాషలలోకి తర్జుమా చేసినా సంస్కృతంలో మాత్రమే చదవాలని కేవలం ఈ నాటకం ఆస్వాదించడం కోసమే కొంతమంది సంస్కృతం నేర్చుకున్నారు అంటే అతిశయోక్తి కాదు

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ.

Panchaag