17, జులై 2023, సోమవారం

శ్రీ శివడొల్ ఆలయం

 🕉 మన గుడి : 






⚜ అస్సాం : శివసాగర్


⚜ శ్రీ శివడొల్ ఆలయం


💠 శివ డోల్ లేదా శివ దౌల్ భారతదేశంలోని అస్సాంలోని శివసాగర్‌లో  ప్రముఖ శివాలయం. 

డాల్ అంటే అస్సామీలో ఆలయం.


💠 ఇది ఈ ప్రాంతంలోని అత్యంత ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి మరియు ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో భక్తులు మరియు పర్యాటకులు వస్తారు


💠 ఈ ఆలయం విశిష్టమైన వాస్తుశిల్పం మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది.


💠 భారతదేశంలోని దాదాపు అన్ని ఇతర శివలింగాలకు భిన్నంగా, భూమి నుండి పొడుచుకు వచ్చినట్లుగా, సహజంగా ఏర్పడే శివడోల్ లింగం భూమిలోకి తిరిగి ఉంటుంది.

అతి ఎత్తైన శివాలయము.


💠 పరశురాముడు రాజులనందరినీ 21 సార్లు వెంటాడి, వధించి, తన గండ్రగొడ్డలిని విడిపెట్టి, పాపపరిహారార్థము తపస్సు చేసిన స్థలము.

గౌహతి నుండి 16 కి.మీ. దూరంలో పరశురామ కుండములో పరశురాముడు తపస్సు చేసిన స్థలము కలదు.


⚜ చరిత్ర ⚜


💠 శివ డోల్ ఆలయం 18వ శతాబ్దంలో అహోం రాజు శివ సింఘా కాలంలో నిర్మించబడింది. అహోం రాజవంశం 1228 నుండి 1826 వరకు దాదాపు 6 శతాబ్దాల పాటు అస్సాంను పాలించింది. 

అహోం రాజులు కళ, సంస్కృతి మరియు మతానికి గొప్ప పోషకులు, మరియు వారు వారి పాలనలో ఈ ప్రాంతంలో అనేక దేవాలయాలు మరియు స్మారక కట్టడాలను నిర్మించారు.


💠 శివ డోల్ ఆలయ నిర్మాణాన్ని అహోం రాజు రాజేశ్వర్ సింఘా 1731 లో ప్రారంభించాడు మరియు అతని వారసుడు శివ సింఘ 1734 లో పూర్తి చేశాడు. 

ఇటుకలు, రాళ్లు మరియు సున్నo వంటి స్థానిక వస్తువులను ఉపయోగించి ఆలయాన్ని నిర్మించారు. మొత్తం నిర్మాణం మట్టి మరియు వరి పొట్టు బూడిద మిశ్రమంతో పెయింట్ చేయబడింది.


💠 శివ డోల్ దేవాలయం అహోం నిర్మాణ శైలికి సరైన ఉదాహరణ, ఇది హిందూ మరియు దేశీయ అస్సామీ శైలుల సమ్మేళనం.


💠 ఆలయానికి 3 ప్రవేశాలు ఉన్నాయి. తూర్పున ఒకటి, పశ్చిమాన ఒకటి మరియు ఉత్తరం వైపు ఒకటి. 

ప్రధాన ద్వారం తూర్పున ఉంది మరియు ఇది సరిహద్దు గోడతో చుట్టుముట్టబడిన విశాలమైన ప్రాంగణానికి దారి తీస్తుంది. ప్రాంగణంలో వివిధ దేవతల ఇతర చిన్న దేవాలయాలు ఉన్నాయి.


💠 ఆలయ మధ్య గర్భగుడిలో శివ లింగం  ఉంది. నల్లరాతితో చేసిన లింగం దాదాపు 10 అడుగుల ఎత్తు ఉంటుంది. 


💠 ఈ ఆలయం సందర్శకులు మరియు భక్తుల కోసం కఠినమైన నియమాలు మరియు నిబంధనలను అనుసరిస్తుంది.

 దేవాలయం యొక్క దుస్తుల కోడ్ సాంప్రదాయకంగా ఉంటుంది మరియు సందర్శకులు షార్ట్‌లు, స్లీవ్‌లెస్ షర్టులు లేదా ఏదైనా బహిర్గతం చేసే దుస్తులను ధరించడానికి అనుమతించబడరు.


💠 భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ముందు స్నానం చేసి, బయట పాదరక్షలను తీసివేయాలి. 


వారు  మౌనం పాటించాలి మరియు అత్యంత భక్తి మరియు చిత్తశుద్ధితో ప్రార్థనలు చేయాలి. ఆలయంలో నియమిత పూజారి ఉన్నారు, వారు శివునికి రోజువారీ ఆచారాలు మరియు పూజలు చేస్తారు.


💠 ఈ ఆలయంలో వేద మంత్రాల పఠనం, శ్లోకాల పఠనం మరియు గ్రంధాల పఠనం వంటి అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలు కూడా జరుగుతాయి.


💠 ఆలయంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి.

ఇది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. 

ఈ పండుగను గొప్ప వైభవంగా జరుపుకుంటారు మరియు దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ఈ సమయంలో ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.


💠 మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని పూలతో, దీపాలతో, రంగోలీలతో అందంగా అలంకరిస్తారు.

రోజంతా ప్రత్యేక పూజలు మరియు ఆచారాలు నిర్వహిస్తారు 


💠 మహాశివరాత్రి కాకుండా, ఈ ఆలయం శ్రావణ సోమవారం, నవరాత్రి మరియు దీపావళి వంటి ఇతర పండుగలను కూడా జరుపుకుంటుంది. 


💠 భక్తులు కార్తీక నెలలో ప్రతి సోమవారం ఉపవాసం మరియు ప్రార్థనలు చేస్తారు. నవరాత్రులు దుర్గామాత గౌరవార్థం జరుపుకునే తొమ్మిది రోజుల పండుగ, మరియు ఈ సమయంలో ఆలయం ప్రత్యేక పూజలు మరియు ఆచారాలను నిర్వహిస్తుంది.


💠 ఈ భారీ దేవాలయం చుట్టూ మరో రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి, అవి విష్ణు డోల్ మరియు దేవి డోల్.

విష్ణువు మరియు దుర్గాదేవి ఆలయాలు.


💠 200 ఏళ్ల చరిత్ర కలిగిన సిబ్‌సాగర్ ట్యాంక్ ఒడ్డున ఉన్న దీనిని శీతాకాలంలో వేల సంఖ్యలో వలస పక్షులు సందర్శిస్తాయి.


💠 7 అడుగుల ఎత్తైన బంగారు గోపురం, శివ డోల్ యొక్క పైభాగంలో లేదా శిఖరాగ్రంలో ఉంది, దీనిని కోలోసి అని పిలుస్తారు మరియు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది. 


💠 ఆలయంలోని అనేక గోడలు మరియు స్తంభాలు హిందూ దేవతల బొమ్మలు మరియు చిత్రాలతో చెక్కబడ్డాయి.


💠 అహోం రాజవంశం యొక్క ఈ పురాతన సృష్టి ప్రపంచం నలుమూలల నుండి ప్రయాణికులు మరియు పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా మారింది. 


💠 శివ డోల్ ఆలయం ప్రతి రోజు ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సందర్శకులకు తెరిచి ఉంటుంది


💠 జోరైట్ నుండి 56 కి.మీ. దూరంలో  శివసాగర్ సరస్సు ఒడ్డున శివడాల్  దేవాలయము కలదు.

మనుషుల గుణములను

 *1780*

*కం*

ధనమును ఘనకీర్తులెపుడు

గొనములు చెరచంగనెంచు కుటిలంబులిడున్.

ధనములు తస్కరణంబున

ఘనతలనపనిందలనిడి కడచురు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ధనములు,గొప్ప కీర్తులు మనుషుల గుణములను చెడగొట్టే తప్పుడు ఆలోచనలనిస్తాయి. ఇతరుల ధనములను దోపిడీ తోనూ,ఇతరులు సాధించిన గొప్ప కీర్తులను అపవాదులను ప్రచారం చేయుట ద్వారా నూ దూరం చేస్తారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ధర్మో రక్షతి రక్షితః

దేశం కోసం ధర్మం కోసం ..మీకు సమయముంటేనే ఇది చదవండి.
Yess  Really Proud to be Im A  Rss Swayam Sevak Since from last 42 years
మీకు తెలుసా ప్రపంచం తలోంచిన వేళ ముసలం ఏర్పదిండి.

తెల్లదొరలు /ఆంగ్లేయులు/బ్రిటిష్ వారు మనల్ని విడిచిన తదనంతరం..

స్వాతంత్ర భారత దేశంలో
పాకిస్తాన్ ఏర్పడింది

కాంగ్రెస్ పాలనలో
బంగ్లాదేశ్ ఏర్పడింది 

కాంగ్రెస్ పాలనలో
370 అమలు చేయబడింది

కాంగ్రెస్ పాలనలో
మైనారిటీ బిల్లు వచ్చింది

కాంగ్రెస్ పాలనలో 
ముస్లిం వ్యక్తిగత న్యాయబోర్డు సృష్టించబడింది

కాంగ్రెస్ పాలనలో
మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పడింది  

కాంగ్రెస్ పాలనలో
మైనారిటీ విశ్వవిద్యాలయం ఏర్పడింది 
కాంగ్రెస్ పాలనలో

హిందూ మెజారిటీ దేశం అయినప్పటికీ
మైనారిటీ సంతుష్టికరణ/ఓట్ల కోసం  కాంగ్రెస్ ఈ పనులన్నీ చేసింది.. ఇదే అన్ని పార్టీలు కొనసాగిస్తూ వచ్చాయి..

దేశ "విభజన" మత ప్రాతిపదికన జరిగినప్పటికీ కాంగ్రెస్ ఇవన్నీ చేసింది..

ఇదంతా కాంగ్రెస్ కోసం కాదు..

గజ్వా-ఏ-హింద్"
కొరకు మాత్రమే..

ఇస్లామిక్ దేశాన్ని"
నిశ్శబ్దంగా సృష్టించడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్...

కానీ "హిందువులకు" "రిజర్వేషన్లు "మాత్రమే ఇచ్చింది, 

తద్వారా "హిందూ సమాజం ఎల్లప్పుడూ
ఒకరితో ఒకరు పోరాడుతూ ఉన్నారు..

అందుకే 
"గజ్వా-ఎ-హింద్"  యొక్క కుట్రను,
భారత దేశ హిందూ ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు.

మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, తన పుస్తకం
"మై లైఫ్ స్టోరీ" లోని 456 వ పేజీలో ఇలా వ్రాశారు:

ఎందుకో తెలియదు కానీ - నెహ్రూ "హిందూ మతంమీద ఎల్లప్పుడు "పక్షపాతం" వహించారు.

హిందువులను
"రెండవ పౌరులుగా" మార్చడానికి 
"హిందూ కోడ్ బిల్లు" తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నం చేశారు. 

కానీ సర్దార్ పటేల్  నెహ్రూని హెచ్చరిస్తూ ఇలా అన్నారు:

"నేను జీవించి ఉన్నంత కాలం..
మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో, అప్పుడు నేను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాను..

ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లోకి హిందువులతో వస్తాను" అని.. 

పటేల్ బెదిరింపుతో నెహ్రూ భయపడ్డాడు. 

సర్దార్ పటేల్ గారి మరణం తరువాత పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు!

ఈ బిల్లుపై చర్చ సందర్భంగా, ఆచార్య జె.బి. కృపలానీ 

నెహ్రూ 'కమ్యూనిస్ట్ మరియు ముస్లిం చక్రవర్తి అని పిలిచారు! ఆయన ఇలా అన్నారు:

"మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జన్యువును ధరిస్తారు, లేదంటే మీరు  హిందువు కానే కాదు" అని.

నిజంగా 
ఇది లౌకిక దేశమైతే 

హిందూ కోడ్ బిల్లుకు బదులుగా 

అన్ని మతాలకు 
కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడేది.

కొన్నిసార్లు నేను ఇది పోస్ట్ చేయకూడదు అనిపిస్తుంది!

కానీ హిందువులు 
ఎప్పుడైతే దీనిని అధ్యయనం చేస్తారో, 

అప్పుడే హిందువులంతా, హిందూ ద్రోహుల యొక్క, ఛాతీపైకి ఎక్కుతారు.

నెహ్రూకి కొనసాగింపుగా 
హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.

అయినా కూడా హిందువులలో చైతన్యం లేదు, చలనం కలగడం లేదు..
ఏమీ జరగనట్టుగా బాధ్యతారాహిత్యంగా ఉన్నారు.
1947నుండి 70 ఏళ్లలో ఒక కుటుంబం
 హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది !

హిందువులకు అర్థం కాలేదు !

దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది 
ఎక్కడి నుండి శబ్దం రాలేదు !

సగం కాశ్మీర్ పోయింది ! 
శబ్దం లేదు! టిబెట్ పోయింది ! తిరుగుబాటు లేదు !

సింధు ఇవ్వబడింది!
సిల్లీగా సిమ్లా ఒప్పందం జరిగింది !
ఎవరూ పట్టించుకోలేదు !

తమ దేశంలోనే శరణార్థులుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవరికీ బాధ లేదు !

చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది !
మీడియా కిక్కురు మనలేదు!

తాష్కెంట్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చంపివేయబడింది ! 
కొవ్వొత్తి వెలిగించలేదు !

సిబిఐ విచారణను ఎవరూ డిమాండ్ చేయలేదు !

మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు.. కాదు కాదు.. చంపబడ్డారు ! 
ఎటువంటి తేడా లేదు.. 

అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరేసరి !

2జి స్పెక్ట్రం, 
బొగ్గు కుంభకోణం, 
CWG, 
అగస్టా,
వెస్ట్‌ల్యాండ్, 
బోఫర్స్,
వంటి భారీ కుంభకోణాలు జరిగాయి, శరీరం శబ్దం చేయలేదు!

కానీ.
గొడ్డు మాంసం, ఆగిన వెంటనే...
విపత్తు సంభవించింది !

జాతీయ గీతం తప్పనిసరి చేసిన వెంటనే..
అసంతృప్తి బయలుదేరింది.

వందేమాతరం, భారత్ మాతా కి జై అని చెప్పమని అడిగినప్పుడు..
వారి నాలుకలు కుట్టబడ్డాయి.

డీమానిటైజేషన్,
GST అమలు చేసినప్పుడు..

కోపం వారితో నృత్యం చేయించింది..

ఆధార్‌ను నిరాధార్‌గా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి !

రోహింగ్యాల వెలికితీత - ముస్లింల సమూహలలో
నొప్పిని కలిగిస్తోంది.

ఆలోచించండి.. 
కాంగ్రెస్ = ఖన్☪️ గ్రీకు✝️ = హిందుదేశ్ వినాశనం

హిందువులకు ఏమి చేసింది ??

చర్చి కిటికీ కి 
లేదా 
మసీదు పై రాళ్ళు పడితే..మీడియాలో వారాలపాటు చూపబడుతుంది
వందల గుళ్ళు కూలగొడితే ఎవ్వరూ కిమ్మనరు..
ఎంతో కొంత భాజపా కొట్లాడితే, అది మతతత్వం అంటారు.. 
ఇది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి !

ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్‌లో మొత్తం 50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి !

ఒకటి కాదు,  
రెండు కాదు,  
50 వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి!

దీని గురించి ఏ ఒక్క హిందువుకు తెలియనీయలేదు !

మొదట హిందువులను 
కాశ్మీర్ లోయ నుండి బలవంతంగా తరిమేసి, 
తరువాత హిందూ మతం యొక్క ప్రతి ఆనవాలును నిర్మూలించండి అని చెప్పబడింది !

మొత్తం కాశ్మీర్ లోయ నుండి హిందూ మతాన్ని సమూలంగా నాశనం చేయాలని చూసారు!

బీజేపి, LK Advani
భారతీయ జనతా పార్టీ

మోడీ ప్రభుత్వం రాకపోతే,
ఇది ఎవరికీ తెలిసేది కూడా కాదు !

వామపక్ష జర్నలిస్టులు, 
ముస్లిం మేధావుల, 
కాంగ్రెస్ మరియు దాని గూఢచారులు 
ఈ సమస్యను దేశం ముందు ఎందుకు పెట్టలేదు?
వీళ్లకు తోడుగా, ఇప్పుడు కార్పోరేట్ కంపెనీలు., బయస్డ్ మీడియా, సూడో సెక్యూలర్లు అందరూ హిందూ పండుగలను, సంప్రదాయాలను దేవుళ్లను సైతం వెక్కిరిస్తూ ఇతర మతాల జోలికి వెళ్లే ప్రయత్నం చేయరు..

ఇది కాంగ్రెస్ సాధించిన విజయం మరియు వామపక్ష జర్నలిస్టులు, ముస్లిం మేధావుల తెలివి !

      సాధారణ హిందువుకు ఈ చరిత్ర గురించి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు !

దేశ ప్రజలకు ఎలాంటి  అనుమానం రాకుండా....
           కాంగ్రెస్ దేశాన్ని ఎన్ని విధాలుగా మోసం చేయగలదో... అన్ని విధాలుగా ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పాటుపడింది!

మీడియాను చెప్పుచేతల్లో పెట్టుకుని,
ఎన్ని డ్రామాలు ఆడిందో...!

దీని గురించి ఆలోచించండి,
ఈ సందేశాన్ని 
మీకు సాద్యమైనంత వరకు మనకు అందుబాటులో ఉన్న అన్ని సోషల్ మీడియాలద్వారా
ప్రపంచానికి చటాండి. ఇతరులకు పంచమని 
ఒక అంతర్జాతీయ వాదిగా
ఆకండ విశ్వ సనాతన హైందవ హిందూ భారతీయ భగవత్ స్వారుపులైన  
భరతీయ జాతీయవాదులకు విజ్ఞప్తి చేస్తూ, 

భరత మాతముద్దు బిడ్డ..

దేశ చరిత్ర తెలుసుకో 
దేశ క్యాతి తెలుసుకో

నీ గొప్పదనం గూర్చి అప్పుడే నీకు
తెలుస్తుంది. 
నీకున్న ఔనత్యం యొక్క గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలిస్తేనే, మనలను ప్రపంచం గౌరవిస్తుందన్నది
జగమెరిగిన నగ్న సత్యం.. 

జై హింద్....!
జై భారత్...!!
జై శ్రీ రామ్...!!!

ధర్మో రక్షతి రక్షితః 

ఈ సారాంశం మొత్తం కొన్ని మాధ్యమాల నుండి మీకోసం....

కాపాడేవాడే గోపాలుడు

 🕉️ కాపాడేవాడే గోపాలుడు 🕉️


ఒక వూరిలో వూరి బయట ఒక గుడిసె లో తల్లీ కొడుకు నివసిస్తూ  వుండే వారు.కొడుకు పేరు రాము. వాళ్ళు చాలా బీదవాళ్ళు


తల్లి చాల మంది ఇళ్ళల్లో పాచిపని చేసి కొడుకు ను పోషిస్తూ వుండేది. వూరిలో  పిల్లలందరూ పక్క వూరికి వెళ్లి ఒక గురువు గారి దగ్గర చదువుకునే వారు. అది చూసి వాడు నేనూ వెళ్లి చదువుకుంటానని గొడవ చేశాడు. 


తల్లి ఆ గురువు గారి దగ్గరికి వెళ్లి కొడుకును చేర్పిస్తానని బతిమాలి ఆయనను ఒప్పించింది. గురువు గారి వూరికి వెళ్ళాలంటే అడవి దారి గుండా వెళ్ళాలి. మిగతా పిల్లలందరూ వారి వారి ఎడ్ల బండ్ల  లో వెళ్ళే వారు. రాముడు నడిచి వెళ్ళేవాడు.


వాడు వాళ్ళమ్మతో అమ్మా! నాకు అడివిలో వెళ్ళేటప్పుడు భయమేస్తుంది అన్నాడు. అప్పుడు వాడి అమ్మ వాడితో...

నాన్నా! 'గోపాలా గోపాలా అని  గట్టిగా పిలుస్తూ వెళ్ళు నీకు భయమెయ్యదు అని చెప్తుంది, మరుసటిరోజు  వాడు అలాగే గోపాలా గోపాలా అని అరుస్తూ వెళుతుంటే ఒక చిన్న గోవులు కాసుకునే పిల్లవాడు చేతిలో పిల్లనగ్రోవితో   వచ్చి పిలిచావా... అని అడిగాడు.     


వాడు వాళ్ళ అమ్మభయం వేయకుండా అలా పిలవమని  చెప్పిందని  చెప్పాడు. సరేలే నేను నిన్ను అడవి దాటిస్తాను అని రోజు వాడిని అడవి దాటించి వెళ్ళేవాడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. రాముడు చాలా శ్రద్ధగా చదువుకునే వాడు.


ఇలా  వుండగా ఒక రోజు గురువు గారింట్లో ఆయన కూతురి పెళ్లి జరుగుతూంది. పిల్లలందరూ వెళుతున్నారు. అందరూ ఏదో ఒక కానుక తీసుకొని వెళుతున్నారు. రాముడు అమ్మా! నేనేమి తీసుకెళ్ళాలి అని అడిగాడు. దానికి ఆ తల్లి మనం పేదవాళ్ళం నాయనా! మన దగ్గర ఏముందని వాళ్లకు  కానుక యివ్వగలము చెప్పు అని సర్దిచెప్పింది.


వాడు కూడా చేసేదేమీ లేక విచారంగా వెళ్ళిపోయాడు. రోజు లాగే గోపాలా గోపాలా అని పిలిచాడు. ఆ గొల్ల పిల్లవాడు పిల్లన గ్రోవి 

ఊదుకుంటూ వచ్చాడు. రాముడి ముఖం విచారంగా వుండడం చూసి ఎందుకు అలా వున్నావని అడిగాడు వాడు విషయం చెప్పగానే ఆ గొల్ల పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక చెంబు నిండుగా పాలు తీసుకొని వచ్చి వాళ్లకు పాయసానికి యివి ఉపయోగ పడతాయి తీసికెళ్ళు అని చెప్పాడు. వాడు జాగ్రత్తగా ఆ పాల చెంబు తీసుకొని గురువు గారింటికి వెళ్ళాడు.గురువు గారి భార్య తో అమ్మా నేను ఈ పాలు తెచ్చాను తీసుకోండి అని చెప్పాడు.ఆవిడ నిర్లక్షంగా ఒక నౌకర్ కి ఆ పాలు తీసుకొని వెళ్లి ఆ పాల గంగాళం లో పొయ్యమని చెప్పింది. వాడు పోసే సరికి మళ్ళీ చెంబు నిండా పాలు వున్నాయి అలాగ ఎన్ని సార్లు పోసినా మరీ చెంబు నిండా పాలు వుంటున్నాయి. గంగాళం నిండి పోయింది. వాడు గురువుగారి భార్యను పిలిచి చూపించాడు. ఈ విషయం పెళ్లి యింటికి వచ్చిన వాళ్ళందరికీ తెలిసి పోయింది అందరూ ఆశ్చర్య పోతున్నారు గురువు గారు రాముడిని పిలిచి ఈ పాలు ఎక్కడ తెచ్చావు అని అడిగాడు. రాముడు మొత్తం కథ అంతా అమాయకంగా   చెప్పాడు వాళ్ళ అమ్మ చెప్పడం తను. రోజూ తను గోపాలా అని పిలవగానే గొల్లవాడు వచ్చి తనను అడవి దాటించటం, పాలు యివ్వడం  అన్నీ చెప్పాడు. వాళ్ళెవ్వరూ నమ్మలేదు.వాడిని ఆ అడవి కి తీసుకెళ్ళి ఏదీ 

యిప్పుడు పిలువు వస్తాడేమో చూస్తాము. అని అన్నారు. వాడు గోపాలా గోపాలా అని ఎన్ని సార్లు పిలిచినా ఎవరూ రాలేదు.  అన్నీ ఇలా అబద్దాలు   చెప్తావా, అని గురువు గారు, మిగతా వాళ్ళందరూ వాడిని బాగా తిట్టారు   వాడికి దుఃఖ మొచ్చింది పెద్దగా ఏడువ సాగాడు ఎందుకు గోపాలా నీవు రావడం లేదు... రోజూ పిలవగానే వచ్చేవాడివి కదా! అని వెక్కి వెక్కి ఏడువ సాగాడు అప్పుడు ఆకాశవాణి వినిపించింది. 


నీవు అమాయకంగా మీ అమ్మ మాటను నమ్మి నన్ను పిలిచావు కనుక నేను వచ్చాను. నీలో ఏమాత్రం స్వార్థం లేదు, నీలోని అమాయకత్వం పిలగానే వస్తానని విశ్వాసం నన్ను రప్పించాయి, అంతే కాని అనుమానం, అపనమ్మకంతో ఉన్న ఈ స్వార్థ పరులకు కనిపించను. అందుకే రాలేదు. అని విని  పించింది. అందరూ ఆశ్చర్య పోయారు. అప్పటినుండి వూరివాళ్ళు, గురువుగారు, పిల్లలు రాముడి తల్లినీ, రాముడినీ తమ యిళ్ళకు దగ్గరనే ఒక ఇల్లు యిచ్చి వాళ్ళు జీవించడానికి తగినంత సహాయం చేసేవారు.  

" దేవుణ్ణి నిష్కల్మషంగా నమ్మితే సహాయం చేస్తాడు"

భారతీయ సంప్రదాయాల గురించి

 ఒక forward message Naku నచ్చింది ... ప్రయత్నం చేయొచ్చు కదా అనిపిస్తుంది👇 ఇప్పుడు అనేక రోజులు అంటే  ఫ్రెండ్షిప్ డే, హెల్త్ డే, వరల్డ్ క్యాన్సర్ డే... ఇలాంటివి ఉంటాయి కదా..........

🚩మన రాబోయే తరాలకి మన సనాతన ధర్మాన్ని అందించే విధంగా... భారతి రవిచంద్రన్...



👇👇👇👇👇👇


చాలా ముఖ్యమైన విషయం.మన భారత దేశం అంతటా 

share చేయాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇది:

------------------------------------------------------------------


ఈ day లను చూసిన తర్వాత నాకు కూడా ఒక కొత్త ఆలోచన వచ్చింది.ఈ day ల సంప్రదాయాన్ని continue చేస్తూ,మన పిల్లలకు మన భారతీయ సంప్రదాయాల గురించి అద్భుతంగా బోధించే ఆలోచన నాకు కలిగింది.అదేమిటంటే..


ప్రతి నెలా మాస శివరాత్రి అనే రోజు వస్తుంది.ఆ రోజును "Mahadev Day" గా పిలవాలి.అంతేకాకుండా ఆ రోజున మన పిల్లలకు శివ శ్లోకాలలో ఏదైనా ఒక శ్లోకం నేర్పించాలి.లింగాష్టకం లేదా శివ సహస్ర నామాలలో ఒక శ్లోకాన్ని నేర్పించాలి.


ఇక ప్రతి నెలా పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశీ రోజును 

"Narayan Day" గా పిలవాలి.ఆ రోజున మన పిల్లలకు విష్ణు సహస్ర నామాలలో ఒక శ్లోకం నేర్పిస్తూ ఉండాలి.


ఇక ప్రతి నెలా అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశీ రోజును 

"Vaasudev Day" గా పిలవాలి.ఆ రోజున మన పిల్లలకు

భగవద్గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని నేర్పిస్తూ ఉండాలి.


మనం జరుపుకునే ఈ "Valentine's day","Friendship day" వల్ల మనకు ఎంత ఉపయోగం కలుగుతుందో తెలియదు కానీ,

ఈ "Mahadev Day","Narayan Day","Vaasudev Day" వీటిని

జరుపుకోవడం వల్ల మన పిల్లల వ్యక్తిత్వం(charachter) ఎంతో బాగుపడుతుంది.మన వ్యక్తిత్వం కూడా బాగు పడుతుంది.మన సమాజం,మన దేశం బాగుపడుతుంది.


నా గురించి మీకు చెప్పనవసరం లేదు మిత్రులారా.కానీ మళ్ళీ ఒకసారి చెబుతాను.నేను శివ అంతర్యాగి.నా గురుదేవుల ఆశీర్వాదంతో 106 పాటు ఎంతో తపించి భగవద్గీతకు భాష్యాన్ని వ్రాసిన ఆధ్యాత్మిక సాధకుడికి.సరళమైన భాషలో అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా,ముఖ్యంగా హై స్కూల్, ఇంటర్మీడియేట్,డిగ్రీ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా భగవద్గీత లోని శ్లోకాలకు లోతైన వివరణ వ్రాశాను.


పది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడిని.18 గ్రామాలలో భగవద్గీత ప్రచారం,సనాతన ధర్మ ప్రచారం చేశాను.


నా ఆశయం ఒక్కటే.మన హిందువులకు మన ధర్మం గురించి బాగా తెలియజేయాలి.ఆచరింపజేయాలి.అలా చేయాలంటే మనం కొత్త

సంప్రదాయాన్ని మొదలు పెట్టాలి."Mahadev Day","Narayan Day","Vaasudev Day" వీటిని ప్రతి నెలా జరుపుకోవాలి.


మన వల్ల ఎక్కడౌతుంది అని అనుకోకండి.మనం ప్రయత్నం చెయ్యకుండా తప్పుకుంటున్నాం.మనం ముందు ఒక్క అడుగు వేద్దాం.ఒక గట్టి ప్రయత్నం చేద్దాం.మన ధర్మాలను మన పిల్లలకు

చిన్నతనం నుండే నేర్పిద్దాం.


నేను భగవద్గీత,విష్ణు,శివ సహస్రనామ online క్లాసులను ఉచితంగా చెబుతూ ఉంటాను.కాబట్టి ఈ కొత్త సంప్రదాయాన్ని ముందు నేనే మొదలు పెడతాను.మొదటి అడుగు నేనే వేస్తాను.

నాతో పాటు అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు comments లో "హర హర మహాదేవ","జై శ్రీరామ్" అని వ్రాయండి.


ఇక ఈ నెల నుండే "Mahadev Day","Narayan Day" "Vaasudev Day" జరుపుకోవడం మొదలుపెడదాం.ఈ విషయాన్ని రాష్ట్రం మొత్తం,దేశం మొత్తం share చేయండి.


హర హర మహాదేవ                 

🚩జై శ్రీరామ్🚩


(మీ శివ అంతర్యాగి)

పంచాంగం తేది;18.7.2023

 


🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏


🌹 శ్రీరస్తు శుభమస్తు

అవిఘ్నమస్తు 🌹


🌹పంచాంగం 🌹


తేది;18.7.2023

🌹మంగళవారం🌹

🌹భౌమ్యవాసరే🌹


🌹శ్రీ శోభకృత్ నామ

సంవత్సరం🌹

దక్షిణాయనం

వర్ష ఋతువు

అధిక శ్రావణ మాసం శుక్ల పక్షం

తిథి:పాడ్యమి రా11.58 వరకు

నక్షత్రం:పుష్యమి పూర్తి

యోగం:హర్షణం ఉ9.57 వరకు

కరణం:కింస్తుఘ్నం ఉ11.28 వరకు

తదుపరి బవ రా12.18 వరకు

వర్జ్యం:

మ1.31 - 3.17

దుర్ముహూర్తము:

ఉ8.13 - 9.04 & రా20.59_11.43

అమృతకాలం:

రా12.02 - 1.48

రాహుకాలం:

మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:

ఉ9.00 - 10.30

సూర్యరాశి:కర్కాటకం

చంద్రరాశి:కర్కాటకం

సూర్యోదయం:5.37 

సూర్యాస్తమయం:6.34


🌹 నేటి మాట 🌹


🌹అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు.🌹


🌹ధన్యవాదములు🌹


🌹B నాగరాజు🌹

వాట్సాప్ నెంబర్

9177654653 

కాంటాక్ట్ నెంబర్

9848850830


🌹హిందూ జనా సుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు.🌹


🌹ఓం శాంతి శాంతి శాంతి హి🌹


🐂 గో సేవ చేద్దాం గోపూజ చేద్దాం గోమాతను రక్షించుకుందాం🐂


🦚 జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ 🦚


🕉️ ఓం నమః శివాయ🕉️

లక్ష్మీదేవి

 



*లక్ష్మీదేవి అంటే ఒక్క ధనమే కాదు. మనిషికి వున్న ప్రతి నైవుణ్యమూ లక్ష్మీదేవే. ఆవిడ తలపై వుండకూడదు అంటే మనిషికున్న ధనంవల్లగానీ, నైపుణ్యం వల్లగానీ వచ్చే అహంకారం తలకెక్కకూడదు.*


*పూర్వం జంభాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు.*


*ఇంకే ముంది జంభాసురుడు దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్ర పదవి చేజిక్కించుకుని ఇంద్రుణ్ణి తరిమి కొట్టాడు. పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మ దేవుడూ, దేవతల గురువైన బృహస్పతి దగ్గరకెళ్ళి సమాలోచన చేశాడు.*


*వారు దగ్గరలో సహ్యాది పర్వతంపైన వున్న దత్తాత్రేయుని శరణు వేడమని, ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవరెవరూ లేరని సలహా ఇస్తారు.*


*ఇంద్రుడు వారి సలహా పై దత్తాత్రేయుని శరణువేడుతాడు. దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టనట్లు వుంటాడు. ఇంద్రుడు అతణ్ణి పరి పరివిధాల ప్రార్ధించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే, చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు.*


*ఇంద్రుని ప్రార్ధనలాలకించి, ఉపాయం చెబుతాడు. నువ్వు దేవతలతో సహా వెళ్ళి జంభాసురుడిని నా ఆశ్రమం దగ్గరకు తీసుకు రమ్మంటాడు. దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి జంభాసురునితో యుధ్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరకు తీసుకొస్తారు.*


*యుధ్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంభాసురుడు దత్తాత్రేయుని ప్రక్కన వున్న ఆయన భార్య అనఘా దేవిని చూస్తాడు. ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు. ఆమెను తనతో తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు.*


*అనఘా దేవి భర్త వంక చూస్తుంది. దత్తాత్రేయుడు వెళ్ళమని సైగ చేస్తాడు. అప్పుడు అనఘాదేవి జంభాసురుడికి ఒక షరతు విధిస్తుంది. నాకు నీ శిరస్సుపై నాట్యం చెయ్యాలని వుంది, అలా నాట్యం చెయ్యనిస్తే వస్తాను అని చెబుతుంది.*


*జంభాసురుడు అంత అద్భుత సౌందర్యరాశి తన శిరస్సుపై నాట్యం చెయ్యటానికి సంతోషంగా అంగీకరిస్తాడు. అనఘాదేవి జంభాసురుని శిరస్సుపై నాట్యం చేస్తుండగా ఆ తన్మయత్వంలో, ఆ మత్తులో జంభాసురుడి సైన్యాన్ని సురసేనలు దునుమాడుతాయి.*


*నాట్యమయినా ఆ పరాకులోనే వున్న జంభాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు. అనఘాదేవి సాక్షాత్తూ మహాలక్ష్మి స్వరూపం. మహలక్ష్మి తమదగ్గరవుందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ళ నెత్తికెక్కుతుందంటారు.*


*మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోనైనా వుండ వచ్చు, అందం, ఐశ్వర్యం, విద్య, ఏదైనా కళలో నైపుణ్యం, ఇలా లక్ష్మి తమ దగ్గర వున్నదని సంతోషించి, దానిని సద్వినియోగ పరచినంత మటుకూ పర్వాలేదు.*


*కానీ, ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకుని గర్వం బాగా తలకెక్కినప్పుడు, కన్నూ మిన్నూ గానక ప్రవర్తించినప్పుడు, మనిషి పతనానికి అది మొదలు.*


*తమంత వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో, వారి తలమీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవు తుంది. విపరీతమైన అహంకారం వున్నవారికి లక్ష్మి తలమీద నాట్యంచేసి అణచి వేస్తుంది.*


*🙏ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః🙏*

🪷🪷🪷 🍁🕉️🍁 🪷🪷🪷

ఓ హిందూ మేలుకో-2

 

హిందూ మేలుకో-2

రోజుల్లో మన సమాజంలో రోజు రోజుకు మన సాంప్రదాయాలమీద, మన ఆచారాల మీద ఆదరణ తక్కువ అవుతున్నదిదానికి కారణం ఏదయినా కావచ్చుముఖ్యంగా ప్రతి హిందువు తన ధర్మం ఏమిటి తన కర్తవ్యం ఏమిటి తన్ను తాను ఎలా ఉద్దరించుకోవాలి అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించి తన దైనందిక జీవితాన్ని కొనసాగిస్తే ప్రతిహిందువు ఒక చక్కని వ్యక్తిత్వం వున్న ఆదర్శమూర్తిగా నిలుస్తాడు మన హిందూ ధర్మాన్ని కలకాలం నిలపటానికి తోడ్పడుతాడు.  

ప్రతి హిందువు తాను తన ధర్మాన్ని ఆచరించి తన పిల్లలకు ధర్మం పట్ల అవగాహన కలిగే విధంగా పిల్లలను పెంచవలసిన అవసరం ఉన్నది. పిల్లలకు మాటలు వచ్చే వయసునుండి దైవభక్తిని ప్రేరేపించాలి. చిన్న వయసు పిల్లలను కూడా దేవాలయాలకు తీసుకొనిపోయి దైవదర్శనం చేయించాలి. గుడిలో తీర్థప్రసాదాలను తీసుకోవడం, శఠగోపురం పెట్టించుకోవటం, మొదలైనవి అలవాటు చేయాలి.దేవుడిని అనగా గుడిలో విగ్రహం చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరించడం అలాగే గుడిలో గంటను మ్రోగించటం పిల్లలతో చేయిస్తూ ఉంటే వారికి అది ఒక వేడుక లాగా అనిపించి తర్వాత కాలక్రమేణ ఒక చక్కటి అలవాటుగా మారుతుంది.
పెద్దలు కనిపించగానే తల్లిదండ్రులు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ పిల్లలు కూడా అలానే నమస్కరించటం నేర్పించాలి. నమస్కరించేటప్పుడు జై శ్రీరామ్ అనో లేక ఓం నమస్సివాయ అని సంబోధించడం ఒక మంచి సాంప్రదాయంగా చేసుకుంటే మంచిది.
ఎల్లప్పుడు మన హిందూ దేవీ దేవతల ఔన్నత్యాన్ని తెలిపే పురాణాలూ, రామాయణ, భారతాది ఇతిహాసాలు, భాగవతాది పురాణాలు వాటికి సంబందించిన గాధలు చదువుతూ పిల్లలకు చెబుతూ ఉండాలి. దానివలన పిల్లలకు బాల్యం నుండి మన హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు తెలుస్తాయి. మన ధర్మం యొక్క గొప్పతనాన్ని సదా పిల్లలకు తెలియజేయాలి
వేమన, సుమతి, కుమార, కాళహస్తీశ్వర, దాశరథి శతకం వంటివి సదా పిల్లలకు కంఠతా వచ్చే విధంగా నేర్పాలి. నీతి శతకాలు నేర్చిన బాలలు ఏది నీతి ఏది అవినీతి అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు.  తత్ ద్వారా చక్కటి క్రమశిక్షణ పరులుగా అవుతారు.  అవినీతిని ఎదుర్కొనే ధైర్యాన్ని చిన్నప్పటినుండి అలవరచాలి.
తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శవంతులు గా ఉండాలి.  ఎట్టిపరిస్థితుల్లోనూ చెడు వ్యసనాలకు తల్లిదండ్రులు లోను కాకూడదు. పిల్లలకు తల్లి మరియు తండ్రి ప్రేమలో లోపం లేకుండా పెంచాలి. పిల్లలు మా తల్లిదండ్రులు నాకు దొరకటం నా అదృష్టం అనే విధంగా మెలగాలి. చిన్నప్పటి నుండి వారి వారి వయస్సుకు తగినట్లుగా కుటుంబ బాధ్యతలు వారికి వప్ప చెప్పాలి.  అది ప్రేమతో చేయాలి. చిన్ననాటి నుండి కుటుంబ బాధ్యతలు తీసుకున్న పిల్లలు రేపు పెద్ద అయిన తరువాత చక్కటి పౌరులుగా ఎదుగుతారు. దేశ అభివృద్ధికి దోహద పాడుతారు.
 

మన ఆచారాలను పాటిద్దాము, మన ధర్మాన్ని కాపాడుదాము

జై హిందూ జై జై హిందూ 

ఆచంద్ర తారార్కం మన ధర్మం వెలసిల్లేలా మనమంతా కృషి చేద్దాం.  

మార్పు నానుండే మొదలు అని ప్రతివారం ఉద్యమిద్దాం

జై  శ్రీరామ్,జై శ్రీ కృష్ణ 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ

 

*మీ డబ్బు ఎక్కడకు పోతుంది?!*

 *మీ డబ్బు ఎక్కడకు పోతుంది?!*


*మనసుని కదిలించే కళ్లు చెదిరే నిజం, చదివిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు... మీ డబ్బు ఎక్కడకు పోతుంది?!*


    మన భారతదేశంలో మొత్తం 4120 మంది ఎమ్మెల్యేలు మరియు 462 ఎమ్మెల్సీలు అంటే మొత్తం 4,582 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.


     ఒక్కో ఎమ్మెల్యే జీతభత్యంతో కలిపి నెలకు 2 లక్షలు ఖర్చు చేస్తారు.వేరే పదాల్లో నెలకు 91 కోట్ల 64 లక్షల రూపాయలు. 


     దీని ప్రకారం సంవత్సరానికి సుమారు 1100 కోట్ల రూపాయలన్నమాట.


     భారతదేశంలో లోక్‌సభ మరియు రాజ్యసభతో కలిపి మొత్తం 776 మంది ఎంపీలు ఉన్నారు.


     ఈ ఎంపీలకు జీతం భత్యంతో కలిపి నెలకు 5 లక్షలు ఇస్తారు.అంటే మొత్తం ఎంపీల జీతం నెలకు 38 కోట్ల 80 లక్షలు. 


     ఇక ప్రతి సంవత్సరం ఈ MP లకు జీత భత్యం కింద రూ.465 కోట్ల 60 లక్షలు ఇస్తారు.


     అంటే భారతదేశంలోని ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ప్రతి సంవత్సరం 15 వేల కోట్ల 660 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.


     ఇది వారి ప్రాథమిక వేతనం మరియు భత్యానికి సంబంధించిన విషయం. వారి నివాసం, జీవనం, ఆహారం, ప్రయాణ భత్యం, చికిత్స,విదేశీ విహారయాత్రలు మొదలైన వాటి ఖర్చు కూడా దాదాపు అదే.


     అంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం దాదాపు 30 వేలకోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి.


     ఇప్పుడు వారి భద్రతలో మోహరించిన భద్రతా సిబ్బంది జీతాన్ని పరిగణించండి.


     ఒక ఎమ్మెల్యేకు ఇద్దరు అంగరక్షకులు మరియు ఒక సెక్షన్ హౌస్ గార్డు అంటే కనీసం 5 మంది పోలీసులు, అంటే మొత్తం 7 మంది పోలీసులు భద్రత కల్పిస్తారు.


     7 గురు పోలీసుల జీతం సుమారుగా (నెలకు రూ. 35,000 చొప్పున) రూ. 2 లక్షా 45 వేలు.


     దీని ప్రకారం 4582 మంది ఎమ్మెల్యేల భద్రతకు వార్షిక వ్యయం ఏడాదికి 9 వేలకోట్ల 62 కోట్ల 22 లక్షలు.


     అదే విధంగా ఎంపీల భద్రత కోసం ఏటా 164 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.


      జెడ్ కేటగిరీ భద్రతా నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రి భద్రత కోసం దాదాపు 16000 మంది సిబ్బందిని ప్రత్యేకంగా మోహరించారు.


     దీని కోసం మొత్తం వార్షిక వ్యయం రూ.776 కోట్లు ఖర్చు.


     ఇలా ప్రతి ఏటా దాదాపు 20 వేలకోట్ల రూపాయలు పాలక నేతల భద్రతకు వెచ్చిస్తున్నారు.


*అంటే ఏటా కనీసం 50 వేలకోట్ల రూపాయలు రాజకీయ నాయకుల కోసం ఖర్చు చేస్తున్నారు.*


     ఈ ఖర్చులలో గవర్నర్ ఖర్చులు, మాజీ నాయకులు, పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షుల పెన్షన్, వారి భద్రత మొదలైనవి ఉండవు.


     అది కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు దాదాపు 100 బిలియన్ రూపాయలు అవుతుంది.


     ఇప్పుడు ఆలోచించండి. మనం ప్రతి సంవత్సరం రాజకీయ నాయకుల కోసం 100 బిలియన్ రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాము, పేద ప్రజలకు ప్రతిఫలంగా ఏమి లభిస్తుంది?


ఇదా ప్రజాస్వామ్యం?


(ఈ 100 బిలియన్ రూపాయలను మన భారతీయుల నుండి మాత్రమే పన్నుగా వసూలు చేయబదుతుంది.)


     ఇక్కడ కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగింది.  భారతదేశంలో రెండు చట్టాలు చేయాలి.


     *మొదటిది :* ఎన్నికల ప్రచారంపై నిషేధం

నాయకులు టెలివిజన్ (TV) ద్వారా మాత్రమే ప్రచారం చేయాలి, ప్రచార ఖర్చు ఒకరికి 10 వెలు మాత్రమే.


     *రెండవది:*-  నాయకుల జీతాలు, ఉచితాలు, సబ్సిడీలు మరియు అలవెన్సులపై నిషేధం విధించాలి 

అప్పుడు కనబడుతుంది రాజకీయ నాయకుల్లో సేవ చేసే గుణం, దేశభక్తి ఎవరికి ఎంతుందో


     ప్రతి భారతీయుడు ఈ రాజకీయ నాయకుల అనవసర, అంతు లేని ఖర్చు, వ్యయానికి వ్యతిరేకంగా మాట్లాడాలి.


*ఈ సందేశాన్ని వీలైనన్ని ఎక్కువ Facebook మరియు WhatsApp సమూహాలకు ఫార్వార్డ్ చేయడం ద్వారా మీ దేశభక్తిని పరిచయం చేసుకోండి.*


     గౌరవనీయులైన ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి గరికి 

దయచేసి అన్ని *ప్లానింగ్స్* ఆపండి.


*ప్రతి పది కిలోమీటర్లకు పార్లమెంట్ హౌస్ లో లాంటి క్యాంటీన్ తెరవండి.*


తగాదాలన్నీ అయిపోతాయి.


*మీకు ₹29 /-కే ఫుల్ మీల్స్ లభిస్తుంది..*


80% ప్రజల కోసం, ఇంటిని నడిపే పోరాటం ముగుర్తుంది..


     సిలిండర్, రేషన్ తీసుకురావడం వుండదు.


     మరియు ఇంటి ఆడపడుచు కూడా సంతోషంగా ఉంది. చుట్టూ ఆనందం ఉంటుంది. అప్పుడు అందరి మద్దతు, అందరి అభివృద్ధి అంటాం.


     *అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు ₹1 కి కిలో గోధుమలు బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.*


    *మధ్యతరగతి ప్రజలు తమ సొంత మార్గంలో తమ ఇంటిని నడపాలని ప్రధాన మంత్రి గారు చెప్పనవసరం లేదు.*


     దయచేసి కష్టపడి సంపాదించిన ఈ సమాచారాన్ని దేశంలోని ప్రతి పౌరునికి అందించడానికి ప్రయత్నించండి.


     *ఇది అహంకారమా లేక మోసమా....లేక గుత్తాధి పత్యమా?*  


     భారతదేశంలో ఆహార పదార్థాలు అతి తక్కువ ధరకు లభించే ప్రదేశం ఒక్కటే. అదే ఢిల్లీ లో వున్న భారత పార్లమెంట్ లో ని క్యాంటీన్ లో


టీ = ₹ 1

sup = ₹ 5.50

పప్పు = ₹ 1.50

ఆహారం = ₹2.00

చపాతీ = ₹1.00

చికెన్ = ₹24.50

దోస = ₹4.00

బిర్యానీ=₹8.00

చేప = ₹13.00


     ఈ వస్తువులన్నీ భారత పార్లమెంటు క్యాంటీన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ  పార్లమెంటు సభ్యులకు, ఎంపీ, లకు, అందులో పనిచేసే వారికి మనమందరం కలిసి కష్టపడి సంపాదించిన డబ్బులతో వారికి మనం ఇస్తున్న దాన ధర్మం. 


     ఆలోచించండి మనం వేసిన ఓట్లతో గెలిచి, దర్జాలు అనుభవిస్తూ మనం పెట్టిన భిక్ష తిని, మనం ఇచ్చే ఆరోగ్యం పొంది, మనం ఇచ్చే కార్లలో తిరుగుతూ వారి కుటుంబాలతో జల్సాలు చేస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తూ మనకు మోసం చేస్తూ, మనకు ఇబ్బంది కలిగితే కంటి చూపుకు కూడా కనిపించని రాజకీయ నాయకుల జీవితం ఇది.


     *MP, MLA, MLC లు మరియు ఏ ఇతర ప్రజలు ఎన్నుకున్న నాయకులు పబ్లిక్ సర్వెంట్లు మాత్రమే* ఈ విషయం మెదడులో పెట్టుకుని నాయకులు పని ...కాదు...కాదు సేవ చేయాలి.


      రోజుకు 30 లేదా 32 రూపాయలు సంపాదించేవాడు భికారి, పేదవాడు కాదని వారు భావించడానికి కారణం ఇదే.


*ఎన్నో జోక్స్ ప్రతిరోజూ ఫార్వార్డ్ చేయ బడతాయి, మీ మొబైల్‌లో అన్ని నంబర్‌లను ఫార్వార్డ్ చేయండి మరియు భారతదేశ ప్రజలకు అవగాహన కల్పించండి.*


*మెరా భారత్ మహాన్ ఎవరి చేతుల్లో వుంది.*


 *సేకరణ: పవర్ ఆఫ్ RTI...                       Mrs.నిర్మలారవీంద్ర*

Advovate,


High Court of Telangana

కర్కాటక సంక్రమణం



*కర్కాటక సంక్రమణం & దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం - సా॥ 5.03 నుండి* 

శాస్త్ర ప్రకారం జనవరి 15 నుంచి జూలై 16 వరకు ఉత్తరాయణం , 

జూలై 17 నుంచి జనవరి 14 వరకు దక్షిణాయనం అని అంటారు...

దక్షిణాయనంలో పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు చేయడం , సాత్వికాహారం ఫలితాన్నిస్తాయి. 

సూర్య గమణాన్నిబట్టి మన భారతీయులు కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు...

భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని , దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు.


ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం...

కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది...

సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి 6 గంటల 49 నిముషములు పుణ్యకాలంగా, 2 గంటల 16 నిమిషములు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది. 

ఆ సమయంలో స్నాన , దాన , జపాదులేవైనా అధిక ఫలితాలనిస్తాయి...


*ఖగోళ శాస్త్రం ప్రకారం* సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ , దక్షిణాయనాలు, *'అయనం'* అంటే ప్రయాణం అని అర్ధం. 

దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. 

సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు, కానీ సూర్యోదయాన్ని గమనిస్తే , అది తూర్పు దిక్కున జరగదు.

సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే, అవి మార్చి 21 , సెప్టెంబరు 23.  మిగతా ఆరు నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా , మరో 6 నెలల ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది...


సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని *'ఉత్తరాయాణం'* అని , ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని *'దక్షిణాయనం'* అని అంటారు...

ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు...


ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే , దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం. 

ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు...

ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం, అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు. 

అందువల్ల ఇది ఉపాసన కాలం అయ్యింది, శ్రీహరి ఆషాడ శుద్ద ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు. 

ఈ సమయంలో యోగులు , మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు.


శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది, ఫలితంగా జీవులలో రోగనిరోధకశక్తి క్షీణించి రోగాల బారిన పడతారు. 

వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం , ఉపాసన , తరుచుగా ఉపవాసాలు , పూజలు , వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగనిరోధక శక్తిని పెంచి , ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. 

ఎలా చూసిన దక్షిణాయనంలో చేసే జప , దాన , పూజలు ఆరోగ్యాన్ని , అధ్యాత్మిక అనుభూతుని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి...


ముఖ్యంగా దక్షిణాయనంలోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు , విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు.

 ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన *మహలయ పక్షాలు* వస్తాయి...

 పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. 

శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతాన లేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు.

 బతికుండగా తల్లిదండ్రుల సేవ , మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి , ఎంతో ముఖ్యం , శుభప్రదం. పితృ రుణం తీర్చుకోవడానికి అది మార్గం. 

అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతా పూర్వక చర్య.


*చేయవలసినవి*


ధ్యానం , మంత్ర జపాలు , సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు , పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు , సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం , అవసరంలో ఉన్న వారికి దానం చేయడం , అన్నదానం , తిల (నువ్వుల ) దానం , వస్త్ర దానం , విష్ణు పూజ , విష్ణు సహస్రనామ పారాయణ , సూర్యరాధన , ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి , మనసుకు మేలు చేస్తాయని , పాపాలు తొలగిపోతాయని పెద్దలు సూచించారు, దక్షిణాయన పుణ్యకాలం లో ఏమి చెయ్యాలి ?


జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు.... అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి వుంటుంది.

 అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది. 

శనిగ్రహం 2 1/2 సం పడుతుంది. 

రాహు , కేతువులకి 1 1/2 సం , రవికి నెల రోజులు... ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొప్పున (మేషాది మీన రాశులు) పన్నెండు రాశులలోనూ పన్నెండు నెలలు సంచరిస్తే మనకి సంవత్సర కాలం పూర్త వుతుంది. 


సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో *‘మేష సంక్రమణం’* అని

సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో *‘వృషభ సంక్రమణం’* అని

సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో *‘మిథున సంక్రమణం’* అని

సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో *‘కర్కాటక సంక్రమణం’* అని


ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెపుతారు. సంక్రమణం అనే మాటకి *‘జరగటం’* , *‘ప్రవేశించటం’* అని చెప్పొచ్చు.


సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అని అర్ధం. ఇది జూలై 15 నుంచి 17 తేది వరకు జరుగుతూ వుంటుంది.

 సాధారణంగా జూలై 16వ తేదీనే !


ఈ కర్కాటక సంక్రమణాన్ని *‘దక్షిణాయన’* మని అంటుంటారు. *(మనకి సంవత్సరానికి అయనములు రెండు. ఒకటి ఉత్తరాయనం , రెండవది దక్షిణాయనం)* ఇక తర్వాత సూర్యుని సింహరాశి ప్రవేశం , తర్వాత కన్యా రాశి ప్రవేశం (వినాయక చవితి వస్తుంది), తులారాశి ప్రవేశం (దసరాలు). ఇలా పన్నెండు రాశులలోనూ సూర్యుడు ప్రవేశించే కాలాన్ని సంక్రమణంగా చెప్తాం, (మకర సంక్రమణం (సం క్రాంతి)... మకరరాశి ప్రవేశం !  కుంభరాశి ప్రవేశం (మహా శివరాత్రి) అయితే సూర్యుని మకర సంక్రమణ మే *‘ఉత్తరాయన పుణ్యకాలం’*.


ఏ తిథులతోను సంబంధం లేకుండాను , ఎవరినీ అడగక్కర్లేకుండాను సంవత్సరంలో వచ్చే పండుగలు ఉత్తరాయణ - దక్షిణాయన మనేవి. జనవరి 14 న వచ్చే ఉత్తరాయణాన్ని మకర సంక్రమణమనీ , జూలై 16 న వచ్చే దక్షిణాయనాన్ని కర్కాటక సంక్రమణమనీ, వ్యవహరిస్తారు. 

ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది.


సూర్యుడు ప్రతి నెలలోను ఒక రాశినుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. 

దీనికే *‘సంక్రమణం’* అని పేరు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటినుంచి మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు వుండే కాలం దక్షిణాయనం. 

ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు.  

దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా , దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు. అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు , దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు. 

దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడం , విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతోపాటు శ్రీ వరాహస్వామి వారిని పూజించడం శ్రేష్టమని చెప్తారు.


దక్షిణాయన ఆరంభ కాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా ఆ తర్వాత మాసాల్లో శ్రీకృష్ణాష్టమి , వినాయక చవితి , రాఖీపూర్ణిమ , ఆదిపరాశక్తి మహిమలనుచాటే దసరా , నరక బాధలు తొలగించిన దీపావళి , శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక , మార్గశిర మాసాలు , గోపికలు ఆనంద పారవశ్యాన్ని పొందే ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి.

 ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది.

 కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాపథంవైపు సూర్యుడు పయనమవుతాడు. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృ దేవతలకు ఉత్తమమైనవి.

 దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృదేవతలకు సకల నరకాలనుండి తొలగిస్తాయి.


దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ఠ , గృహ ప్రవేశం. , ఉపనయనం , వివాహ కార్యాల్లాంటి శుభ కార్యాలను చేయడం మంచిది కాదంటారు.

 కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్త మాతృకలు , భైరవ , వరాహ , నృసింహ , మహిషాసుర మర్దని , దుర్గ లాంటి దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది. 

కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు , జపతపాలు చేయడం ఎంతో మంచిది. ఆనాడు కులదైవాన్ని , లేదా శ్రీ మహా విష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు , పాపాలు వైదొలగుతాయి. 

వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.


సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించబడడమే కాకుండా దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుంది.

 ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి.

 అందుకే *మోక్షానికి ఉత్తరాయణం , ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు.* ఈరోజు పుణ్యనదీ స్నాన , దాన , జప , హోమం అక్షయ ఫలాన్ని ఇస్తుంది...

🌴🎋🌾🌞🌹🛕🌹🌞🌾🎋🌴

            *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*


                🌷 *సేకరణ*🌷

           🌹🌷🌞🌞🌷🌹

                   *న్యాయపతి*

               *నరసింహా రావు*



🙏🌴🌞🌹🌷🛕🌷🌹🌞🌴🙏

ఆయుష్మాన్‌ భవ💐

 💐ఆయుష్మాన్‌ భవ💐


   *పెద్దలు వస్తుండగా లేచి వెళ్ళి నమస్కరించడం మంచి సంప్రదాయం. దాన్ని అభ్యుత్థానమని, అభివాదనమని అంటారు. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయని స్మృతులు చెబుతున్నాయి. నమస్కారాల్లో సాష్టాంగ ప్రణామం ఉత్తమం. దానికే ప్రణతి అని పేరు. అంటే గొప్పదైన నమస్కారమని అర్థం.


సంప్రదాయం తెలిసిన పెద్దలకు నమస్కరించినప్పుడు ‘ఆయుష్మాన్‌ భవ’ అని దీవిస్తారు. చాలాసార్లు ఆ మాట విని ఉండటంవల్ల వారేదో అలవాటుగా ఆశీర్వదించారని మనం అనుకొంటాం. నిజానికది అద్భుతమైన ఆకాంక్ష. చాలా విలువైన దీవెన. ఆ ఆశీస్సులో రెండు గొప్ప పదాలున్నాయి. వాటిలో ఆయుష్మాన్‌ అనేది యోగాల్లో మూడోది. భవ అనేది కరణాల్లో మొదటిది.


మన అందరికీ పంచాంగం ద్వారా ఎన్నో విశేషాలు తెలుస్తున్నా- తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదూ దానిలో ప్రధానమైన అంగాలు. అవి వరసగా శ్రేయస్సు, ఆయువు, పాపవిముక్తి, రోగ నివారణ, కార్యసిద్ధికి సంబంధించినవి. ఆ అయిదింటి శుభ అశుభ ఫలితాలను పంచాగం వెల్లడిస్తుంది. నిత్యం పూజావిధిలో ఆ అయిదు అంగాలనూ సంకల్పంలో చెబుతారు.


తెలుగువారి పంచాంగాలకు చాంద్రమానం ఆధారం. చంద్రుడి నడకనే చాంద్రమానం అంటారు. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. అంటే పదహారు కళలున్నవాడు. వాటినే తిథులు అంటారు. పాడ్యమి మొదలు పున్నమి వరకు, తిరిగి పాడ్యమినుంచి అమావాస్య వరకు విదియ, తదియ, చవితి, పంచమి అంటూ పౌర్ణమి/అమావాస్యతో కలిసి శుక్లపక్షం, కృష్ణపక్షం అని నెలకు రెండు పక్షాలున్నాయి.


పంచాగంలో రెండో విభాగం- వారం. ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు వారాలవి. నక్షత్రం అనేది పంచాంగంలో మూడో విభాగం. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి... నుంచి రేవతి వరకు మొత్తం 27 నక్షత్రాలు. ఒకో నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున మొత్తం 108 పాదాల్లో సృష్టిలోని ప్రతి జీవీ ఇమిడిపోతుంది. పుట్టిన ప్రతి మనిషికీ ఒక్కో నక్షత్రం ఒక్కో పాదం స్థిరపడతాయి. అష్టోత్తరశత నామావళి సంప్రదాయానికి ఇదే పునాది. ఆ 108 నామాల్లో ఒకటి ప్రతి మనిషికీ అనువర్తిస్తుంది. ఉపాసకులకు అదే ఆధారం. తమ నక్షత్రానికి చెందిన పాదానికి, 108లో ఒక నామానికి సమన్వయం తెలుసుకొని, సంపుటీకరణ ప్రక్రియను ఉపాసకులు ఆచరిస్తారు.


పంచాంగంలో నాలుగోది యోగం. యోగాలూ ఇరవై ఏడే. విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్‌, సౌభాగ్య, శోభన నుంచి వైధృతి వరకు 27 యోగాల్లో కొన్ని శుభ ఫలితాలకు, మరికొన్ని అశుభ ఫలితాలకు కారణమవుతాయి. ఆయుష్మాన్‌ అనేది వీటిలో చాలా మంచి యోగం.


ఇక అయిదోది కరణం. ఇది పంచాంగంలో ఆఖరి భాగం. కరణాలు మొత్తం 11. భవ బాలవ కౌలవ తైతుల గరజ వనజ భద్ర శకుని చతుష్పాత్తు నాగవం కింస్తుఘ్నం... అనేవి వాటి పేర్లు. వీటిలో మొదటిదైన భవకరణం ఎంతో శుభప్రదం.

శుభ తిథులు, అశుభ తిథులు వాడే పంచాంగంలోని మిగిలిన వార నక్షత్ర యోగ కరణాల్లోను మంచివి, చెడ్డవి రెండూ ఉంటాయని పంచాంగకర్తలు చెబుతారు. మనిషికి యోగాల్లో ఆయుష్మాన్‌, కరణాల్లో భవ- మంచి ఫలితాలనిస్తాయి. ఆయుష్మాన్‌ భవ అని పెద్దలు దీవించడంలోని ఆంతర్యం ఏమంటే- శుభ యోగం, శుభ కరణం రెండూ కలిస్తే ఎంత గొప్ప స్థితి లభిస్తుందో, అంత ఉత్తమ స్థితి నీకు కలుగుగాక అని.

మన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో లోతైనవి, చాలా విలువైనవి. అందుకే పెళ్ళిళ్లు, శుభకార్యాల్లో వాటికి పట్టింపు ఎక్కువ.

ద్వాదశ జ్యోతిర్లింగముల వివరము

 🌹  ద్వాదశ జ్యోతిర్లింగముల వివరము 🌹




🌺1 . సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, అయన పేరు తోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతోజీవిస్తారు.


🌺2 . ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి  జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది.


🌺3 .  ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం.


🌺4 .  అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వారంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింటా కృతార్థత లభిస్తుంది.


🌺5    శ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుండి. కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ముని వాక్యం.


🌺6 .   ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలూ అంతరించి, శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువులు తప్పిపోతాయి.


🌺7 .   సర్వప్రపంచం చేతా సేవించబడుతూన్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన 

మాత్రం చేతేనే సమస్తమైన కర్మబంధాల నుంచీ విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మోక్షాన్నే పొందుతారు.


🌺8 .   మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలూ తీరుతాయి. అపవాదులు నశిస్తాయి.


🌺9 .  చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి.


🌺10 .   నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనార్చనాడుల వలన సమస్తమైన భవభయాలే కాకుండా, మహాపాతక ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి.


🌺11 .  శ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనూనే రాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం 

చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి.


🌺12    ‘ఘృష్ణేశ్వరుడు’. శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తుల ఇహపర భోగాలను అందజేస్తుంది.

ఆషాఢ అమావాస్య:

 శ్రీ గురుభ్యోనమః

ఆషాఢ అమావాస్య:

ఆషాఢ మాసపు అమావాస్య నక్షత్ర అమావాస్య, చుక్కల అమావాస్య. ఈ అమావాస్య నాడు దేవతలను ఒక్కసారి తలచినా, పూజించినా వేయి జన్మలు విడువకుండా అర్చించిన ఫలితం లభిస్తుంది. పితృశ్రాద్ధం, దానం, హోమం చేస్తే అక్షయ ఫలం లభిస్తుంది. 

          పితృదేవతలు సోమపథం అనే లోకంలో నివసిస్తుంటారు. వీరంతా మరీచి అనబడే ప్రజాపతి కుమారులు. వీరికి అగ్నిష్వాత్తులు అని పేరు. వీరి మానస పుత్రి పేరు అచ్ఛోద. ఈమె నదీ రూపంలో కూడా ప్రవహించేది. ఒకప్పుడు ఈమె వెయ్యి ఏళ్ళు స్త్రీ రూపంలో, తానే నదీ రూపంలో ప్రవహిస్తున్న తన తీరంలో తపస్సు చేసింది. పితృదేవతలు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలో కోరుకోమన్నారు. వారంతా మారు రూపాలలో, దివ్యరూపాలలో ఉన్నారు. అందులో ఒకాయన "మావసుడు". అచ్ఛోద ఆయనను తన తండ్రిగా గుర్తించలేక భర్తవు కమ్మని వరం కోరింది. తండ్రిని కామించిన దోషంతో ఆమె మానవ స్త్రీ అయిపోయింది. కాని మావసుడు మాత్రం ఆమెను ఏమాత్రం కామించలేదు. మావస్య కాలేదు కనుక ఆమెకు అమావాస్య అని పేరు వచ్చింది. అనగా మావసునికి ప్రియురాలు కానిది అని అర్థం. ఆమె తపస్సుకు మెచ్చిన పితృదేవతలు ఆమె పేరుతో అమావాస్యా తిథిని ఏర్పాటు చేసి ఆరోజు పితృ తర్పణాలు ఇచ్చే వారికి అనంత సుఖాలు ఇస్తామని వరాలిచ్చారు. అచ్ఛోద మానవ స్త్రీ అయిపోయి పితృదేవతలని కరుణించమని కోరగా, వారు ఇరువది ఎనిమిదవ ద్వాపరంలో చేప కడుపు నుండి పుట్టి మత్స్యగంధిగా, సత్యవతిగా పరాశరుడు వల్ల కృష్ణ ద్వైపాయన మునిని పుత్రునిగా పొంది, కన్యగానే ఉంటావనీ, శంతన పత్నివౌతావనీ, ఆపై వ్యాసుని వల్ల తరిస్తావని వరమిచ్చారు. ఆమెయే సత్యవతిగా జన్మించింది. 

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు గురుదేవుల కుమార్తె, కవయిత్రి శ్రీమతి శ్రీ విద్య గారు రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం )

శ్రావణం* వచ్చేసింది

 *శ్రావణం* వచ్చేసింది మన పండగలు మొదలైనాయి. మన హిందువులందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మనము మన పండగలు లేకపోతే మిగతా వాళ్ళు ఉపాధి లేకుండా ఉంటారు వాళ్లని ఆర్థికపరంగా తక్కువ చేయాలంటే దయచేసి హిందువుల దగ్గరే కొనండి. అవి పాలు ఐనా, పూలు ఐనా,  ఆఖరికి నీళ్లు ఐనా.  ఏ దుకాణానికి వెళ్లిన మన దేవుడు ఫోటోలు ఉన్నాయా అని చూసి హిందువుల దగ్గరే కొనండి. అప్పుడు మనం ఏంటో మన విలువెంటో కాస్త  తెలుస్తుంది. ఈ విషయంలో అందరూ ఒకటి అందరిలోనూ దేవుడు ఉన్నాడు అని మాత్రం చూడకండి.

 ఆఖరికి ఆ కృష్ణుడు కూడా భగవద్గీత అర్జునుడికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే యుద్ధక్షేత్రంలో అర్జునుడికి వాళ్ళందరినీ ధర్మం మార్గం తప్పిన వాళ్లని వాళ్ల మీద ధర్మం కోసం యుద్ధం చేయాలని ఉపదేశించడమే భగవద్గీత.

 అంతేగాని మన ధర్మాన్ని కూలగొట్టే వాడిని కూడా మనిషిగా చూడడం వాళ్ళల్లో దేవుడిని చూడమని ఆయన కూడా చెప్పలేదు.

దయచేసి హిందువులారా తినే అన్నము లో ఇంకొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుని తిని ఇకనైనా మేలుకోండి.

ఒక *ఫ్రాన్స్* ఎలా అయిపోయిందో చూడండి.

 అంతదాకా ఎందుకు మన  భారతదేశం లోనే *వెస్ట్ బెంగాల్* లో ఏం నడుస్తోంది *కేరళ* లో ఏం జరుగుతోంది. మనం ఉన్న ఇంటి దగ్గరికి కూడా రావచ్చు దయచేసి ఇప్పుడైనా మేలుకోండి ఈ విషయం నేను చెప్పడం వల్ల కఠినంగానే ఉంటుంది. నా మనసు కఠినమనే అనుకుంటారు. అయినా నేను హిందువు అనుకోడానికి ఒక హిందూ ధర్మం నిలబడడానికి కఠినంగా రాక్షసుడు అన్న పేరు వచ్చిన నాకు దానివల్ల వచ్చే నష్టమేమీ లేదు.

మీరు మారండి.

మన *హిందూ సమాజాన్ని* కాపాడoడి.


*జై హింద్*

షట్సంపత్తి

 ||షట్సంపత్తి అనగానేమి...?||


చదవండి జ్ఞానయోగమునకున్న ప్రధాన అర్హత ఇది


షట్సంపత్తి అనగా ఆరు సంపత్తులు అవి ఏంటంటే!!? 


1. శమము - "విషయాల మిధ్యాత్వాన్ని, అనిత్యతను మళ్ళి మళ్ళి గుర్తించి విరక్తమయిన మనసు, సదా శాంతంగా లక్ష్యం వైపు నియమితమయి ఉండడమే శమం అనబడుతుంది."


2. దమము - "కర్మేంద్రియాలనూ జ్ఞానేంద్రియాలనూ వాటికి సంబంధించిన భోగవస్తువుల ఆకర్షణ నుండి సదా మళ్ళించి నియమిస్తూ ఉండడమే దమము అనబడుతుంది."


3. తితిక్ష - "దుఃఖానుభవాలను, బాధలను, తప్పించుకోవాలనే కోరికకూడా లేకుండా ప్రతీకార వాంఛ లేకుండా శాంతంగా సహనంతో అనుభవించడాన్ని తితిక్ష అంటారు."


4. ఉపరతి - "బాహ్యంగా వస్తువులున్నప్పటికీ ఇంద్రియాలలో సంచలనం గలగకుండా ఉండడమే ఉపరతి అనబడుతుంది."


5. శ్రద్ధ - "శాస్త్రపు వాచ్య, లక్ష్యార్ధాలనూ, గురు వాక్యాలనూ యధాతధంగా అర్ధంచేసుకోగల, వివేక విజ్ఞాన పూరిత ప్రశాంత మనఃస్థితి శ్రద్ధ అనబడుతుంది. ఈ శ్రద్ధ వలన మాత్రమే సత్యదర్శనం సంభవమవుతుంది."


6. సమాధానము - "సునిశితమూ, తీక్షణమూ వివేక విజ్ఞాన పూరితమూ అయిన బుద్దికి కూడా అందడానికి వీలులేని పరమ సత్యాన్ని సదా సమగ్రంగా, ఏకాగ్రంగా ధ్యానిస్తూ ఉండే మనసు సమాధానంలో ఉందని అంటారు."

చెప్పే నేర్పు

 *1779*

*కం*

చెప్పెడి గతి చెప్పినపుడు

నొప్పుదురెల్లరు హితములు నుపచయమొందున్.

నొప్పెడి చందము జెప్పగ

చప్పున నుపకారమైన సడలును సుజనా.

*భావం*:-- ఓ సుజనా! చెప్పే విధంగా చెబితే అందరూ సమ్మతించి మంచి వర్ధిల్లుతుంది. నొప్పి కలిగించే లా చెబితే ఉపకార మే అయినా చెడిపోతుంది.

*సందేశం*:-- చెప్పే నేర్పు మన మాటకి బలం చేకూర్చుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Photos