11, జూన్ 2025, బుధవారం

వావిళ్ళ కుటుంభీకులు




 వావిళ్ళ కుటుంభీకులు కావేరి నది పరివాహిక ప్రాంతం నుండి 13 -14 శతాబ్దాలలో తెలుగు నేల పూడూరు నెల్లూరు జిల్లా , కాకరపర్రు పశ్చిమ గోదావరి జిల్లా , పేరూరు తూర్పు గోదావరి జిల్లా , దిమిలి విశాఖపట్నం జిల్లాకు వలస వచ్చిన వారు.


మనకు తెలిసిన ప్రముఖులు అవధానం పాపయ్య , (ఈస్ట్ ఇండియా కంపెనీ లో ప్రధాన పాత్ర ), చదలవాడ సీతారామ శాస్ట్రీ (పెద్ద బాల శిక్ష ), వేదం వెంకటరాయ శాస్ట్రీ , ఆదిభట్ల నారాయణ దాసు , కావ్యకంఠ గణపతి ముని , చిలకమర్తి లక్ష్మి నరసింహం , చెళ్ళపిళ్ళ వెంకట శాస్ట్రీ , అల్లాడి కుప్పుస్వామి , మామిడిపూడి వెంకట రంగయ్య , శ్రీ రంగం శ్రీనివాసరావు …..ఈ కుటుంభానికి చెందినవారు.


రామస్వామి శాస్త్రులు గారు తెలుగు సంస్కృత పండితులు. 1869 లో హిందూ బాషా సంజీవిని -సరస్వతీ నిలయం -ఆది సరస్వతీ నిలయం పేరున ముద్రణ సంస్థలు ప్రారంభించారు. తెలుగు సంస్కృతం లో ఏభై గ్రంధాలు ప్రచురించారు. 1891 లో మరణించారు.


వారి ఏకైక సంతతి వెంకటేశ్వర శాస్ట్రీ (1884 ) తెలుగు -ఆంగ్ల భాషలు చదువుకున్నారు. వారి హయాంలో వావిళ్ళ ప్రెస్ గా మార్పు చేసి గీత ప్రెస్ గోరఖ్ పూర్ , చౌఖంబా వారణాసి వారితో అనుసంధానించి గ్రంథ ప్రచురణ సలిపారు. కాలికో బౌండ్ లో రాయల్ , డెమీ ,క్రౌన్ సైజు లలో అప్పటి కాలములో తీసుకు వచ్చారు. ఫ్రెంచ్ పేరు De Lux పేరును ఉపయోగించారు.


తెలుగులో సంస్కృత బాషా గ్రంధాలు , సాంప్రదాయక సాహిత్యం , ఇతిహాసాలు , పురాణాలు , పరిశోధన గ్రంధాలు , విశ్లేషణలు , ముఖ్యముగా ప్రస్థానత్రయం ప్రచురణ చేశారు. సాధారణ తెలుగు భాషలో సంస్కృతము అందరు చదవగలిగిన సరళత్వం ఒక విశేషం. జాతీయ భావాలు కలిగిన వెంకటేశ్వర శాస్త్రులు బాల గంగాధర్ తిలక్ కు అనుయాయులు. బెంగాల్ విభజన పిమ్మట బంకిం చంద్ర ఛటర్జీ నవల ఆనంద్ మఠ్ తెలుగు అనువాదం ప్రచురించారు. సత్యమూర్తి -ప్రకాశం పంతులు గార్లకు స్వతంత్ర ఉద్యమం లో పలు మార్లు ఆర్ధిక సహాయం చేశారు.


త్రిలింగ వార పత్రిక (1916 ) లో ప్రారంభించి అక్కిరాజు ఉమాకాంతం గారిని ఎడిటర్ గా నియమించి జాతీయ వాదం ప్రచారం చేసి ఆంగ్లములో ఫెడరేటెడ్ ఇండియా 1927 లో వ్యాసా రావు గారిని ఎడిటర్ గా నియమించి నడిపించారు. సుబ్రమణ్య భారతి గారితో కలసి తమిళంలో బాల వినోదిని నెలవారీ పత్రిక నడిపించారు.


అప్పటి గొప్ప పత్రిక సంపాదకులు జి. సుభ్రమణ్య అయ్యర్ , CY చింతామణి లాంటి వారితో గౌరవ స్నేహ సంభందాలు ఉండేవి. ఆయన షష్ఠి పూర్తి వేడుక చాల ఘనంగా జరిపారు అందరు మిత్రులు కలసి.


తెల్లటి దోతీ , కోట్ , టర్బన్ , పై వస్త్రం దోతీ ధరించి మదన్ మోహన్ మాలవ్య ను గుర్తు చేసేవారు. ఆంధ్ర మహాసభ సిల్వర్ జూబిలీ 1938 సెషన్ కు స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా వ్యవరించారు . పచ్చయప్ప కాలేజీ ట్రస్ట్ బోర్డు మెంబెర్ గా ఉండేవారు. మద్రాస్ పోర్ట్ ట్రస్ట్ , కాస్మోపాలిటన్ క్లబ్ లతో అనుసంధానం ఉండేది.


సర్ శ్రీనివాస అయ్యంగార్ -గారితో స్నేహం ఉండేది.


శ్రీ నాధుని రచనల ప్రచురణలో అస్లిలం ఉందని( obscene)(పిఠాపురం రాజా , జయంతి రామయ్య మొదలగువారితో కోర్ట్ కేసు ఎదుర్కొన్నారు. వాత్స్యాయన కామ సూత్రాలు (పెద్దలకు మాత్రమే ) ప్రచురించి ప్రైవేట్ సర్క్యూలేషన్ కు విక్రయించారు.


1931 -1933 మధ్య కాలమున 18 మహాభారత సంపుటాలు ప్రచురించారు. అవి భండార్కర్ రీసెర్చ్ పూణే వారితో సమాన గుర్తింపు కలిగింది. కాశీ పండితులు శాస్త్ర ప్రచార భూషణ బిరుదు తో సత్కరించారు. 1955 న ఆంధ్ర విశ్వ విద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదు తో సత్కరించింది.


కానీ అయన వివాహజీవితం సుముఖం కానందువలన వారికి సంతానం కలుగ లేదు. అది అప్రస్తుతం. పక్షవాతము తో మంచానపడి 1942 -1956 తన 67 వ ఏట మరణించారు. వీలునామా ఏమి రాయనందున వారి ఆస్తి పాస్తులు , ప్రచురణ సంస్థ నిలిచి పోయింది.


వావిళ్ళ వెంకటేశ్వర్లు శాస్త్రులు ఒక గొప్ప ప్రచురణ సంస్థ నడిపించి , జాతీయ వాదిగా , పరోపకారి గా జీవించి ఒక గొప్ప ప్రచురణ కర్తగా చరిత్రలో నిలిచిపోయారు.


ప్రస్తుతం మద్రాస్ (చెన్నై )తంబుసెట్టి స్ట్రీట్ లో వారి బుక్ స్టాల్ నడుపబడుతుంది.

Panchang


 

సకల కలావిభూషితులు

 శు భో ద యం 🙏



"సకల కలావిభూషితులు శబ్దవిదుల్ నయతత్వబోధకుల్ ప్రకటకవీంద్రు లేనృపతి పజ్జను నిర్ధనులై చరింతు రా 

వికృతపుజాడ్య మా దొరది, విత్తములేకయ వారు పూజ్యు లం

ధకజన దూషితంబులు ఘనంబులు గావె అమూల్యరత్నముల్;

-సుభాషితత్రిశతి-నీతిశతకం.విద్యాపధ్ధతి-ఏనుగు లక్ష్మణకవి;


        నిరాశ్రయాః నశోభంతే పండితాః వనితాః లతాః"-అనిగదా మహనీయులమాట.ఎంతచదివినా ఉదరపోషణార్ధం ప్రభుసమాశ్రయణం చేయక తప్పదు.అలావిచ్చేసిన ఆపండితులను సమాదరించి పోషించటం ప్రభువులకర్తవ్యం. అలాకాక, సకలశాస్త్రకోవిదులైన పండితులు తనకడనున్నను వారి పోషణ విషయం శ్రధ్ధజూపకుండుట ఆప్రభుని దోషమగును.

ధనమున్నను లేకున్నను విద్యావంతులు పూజ్యులే! 

     గుడ్డివారు మెచ్చని మాత్రమున రత్నము రాయి కాదుగదా!దాని విలువ మారనిది.


విశేషాంశములు:

సరసుడైన విభుడు విజయనగర ప్రభువులు ఆనందగజపతులవలె విద్వత్కవుల పోషణనుపేక్షింపడు.

    అలట్లుగాక అల్పుడైన

గొబ్బూరి జగ్గరాజువలె కవులను పరాభవింపజూచిన ఫలితము ప్రమాదకరమగును.

     రత్నమురత్నమే రాయికాదని తాత్పర్యము.

                            స్వస్తి!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🕉️🕉️🕉️

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🪷బుధవారం 11 జూన్ 2025🪷*

``

          *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది…

``

     *వాల్మీకి రామాయణం*                 

             *65వ భాగం*

```

అప్పుడు దేవతలు నాగమాత అయిన సురసతో(సురస దక్షుని కుమార్తె) “చూశావా తల్లీ, హనుమ వచ్చేస్తున్నాడు. నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషంలో వెళ్ళి అడ్డంగా నిలబడి, మింగేస్తానని భయపెట్టి, ఆయన సామర్ధ్యాన్ని పరీక్ష చెయ్యి” అన్నారు.


అప్పుడు సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది, సముద్రం నుండి బయటకి వచ్చి హనుమంతుడితో “నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు. నేను నిన్ను తింటాను, కనుక నువ్వు నా నోట్లోకి దూరు” అంది.


అప్పుడు హనుమంతుడు సంతోషంగా రామ కథని సురసకి చెప్పి… “నేను సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని వెళుతున్నాను. ఒకసారి సీతమ్మ జాడ కనిపెట్టి, వెనక్కి వెళ్ళి రాముడికి ఆ విషయాన్ని చెప్పి నీ నోట్లోకి ప్రవేశిస్తాను. కాని ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లీ. నేను సత్యమే మాట్లాడుతున్నాను, మాట తప్పను” అన్నాడు.


అప్పుడా సురస “అలా కుదరదురా, నాకు బ్రహ్మగారి వరం ఉంది. నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే” అని తన నోరుని పెద్దగా తెరిచింది. 


అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరూ 100 యోజనములు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటన వేలంత చిన్నవాడిగా అయిపోయి ఆ సురస నోట్లోకి ప్రవేశించి బయటకి వచ్చి … “అమ్మా! నువ్వు చెప్పినట్టు

 నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను. సరిపోయింది కదా, ఇక నేను బయలుదేరతాను” అన్నాడు.


“ఎంత బుద్ధిబలంరా నీది, రాముడితో సీతమ్మని కలిపినవాడు హనుమ అన్న ప్రఖ్యాతిని నువ్వు పొందెదవుగాక” అని సురస హనుమంతుడిని ఆశీర్వచనం చేసింది.


అప్పుడు హనుమంతుడు సురసకి ఒక నమస్కారం చేసి ముందుకి వెళ్ళిపోయాడు. 


అలా వెళ్ళిపోతున్న హనుమంతుడిని ‘సింహిక’ అనే రాక్షసి సముద్రంలోనుంచి చూసింది. ఆ ‘సింహిక’ కామరూపి, ఆమెకి నీడని పట్టి లాగేసే శక్తి ఉంది. అప్పుడామె హనుమంతుడి నీడని పట్టి లాగడం మొదలుపెట్టింది. తన గమనం తగ్గుతోందని గమనించిన హనుమంతుడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెద్దగా చేశాడు. ఆ సింహిక కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది. మళ్ళి హనుమంతుడు చిన్నవాడిగా తన శరీరాన్ని మార్చి ఆ సింహిక నోటిద్వారా లోపలికి ప్రవేశించి ఆమె గుండెకాయని తెంపేసి బయటకి వచ్చేశాడు. గిలగిల తన్నుకొని 

ఆ సింహిక మరణించింది.


అలా ముందుకి వెళ్ళిన హనుమంతుడు లంకా పట్టణాన్ని చేరుకున్నాక తన శరీరాన్ని చిన్నదిగా చేసి లంబగిరి అనే పర్వతం మీద దిగాడు.```


         *రేపు…66వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

ఏరువాక పున్నమి

 జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. ఏరువాక పున్నమి. కృషిక పున్నమి. ఏరువాక పౌర్ణమి అనేక నామాలతో ఈ పండుగను ఈ ఉత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు. ఏరువాక అనగానే ప్రయాణం చేయడం అనే అర్థాన్ని మనకు స్ఫురిస్తాయి. ఏరు అంటే పంటపొలాలు, నాగలి అని అర్థం వుంది. నాగలితో కృషిక క్రియకు ఉపక్రమించడం ఏరువాక అని అర్థం. అంటే దుక్కి దున్నడం. ఈ రోజు వ్యవసాయదారులు తమ సంరక్షణలో వుండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజంపై పట్టుకొని ఇతర వ్యవసాయ పనిముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకి ఉపక్రమించడం ఈరోజు ఆరంభం చేస్తారు. కనుక దీనిని ఏరువాక పున్నమి అని పేరు. ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞము అని పేరు పెట్టింది విష్ణుపురాణము. "మంత్ర యజ్ఞా పరా విప్రాః" - అంటే బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయడంలో యజ్ఞం వలె ఆ దీక్షతో, లక్ష్యంతో వ్యవహరిస్తారు. అలాగే కర్షకులు సీతా యజ్ఞము - సీత అంటే నాగలి. నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు. ఇది వారికి యజ్ఞంతో సమానం. అని వివరిస్తుంది విష్ణుపురాణం.

విశ్వవ్యాపిత స్వరూపమంతా ఆకాశం. నిజానికి ఆకాశమంటే శూన్యం. ఏమీలేని ఆ శూన్యంలో నుంచి వెలుగుగా కనిపించే ఆ ప్రకాశంలోనుంచి వాయువు పుట్టింది. ఆ వాయువులోనుంచి అగ్నితత్త్వం పుట్టింది. ఆ అగ్నిలోనుంచే నీరు ప్రవహించింది. ఆ నీరు వర్ష రూపంలో ఈ భూమిపై పడిన సమయంలో అనేక ఓషధులు మొలకెత్తుతాయి. పాడిపంటలు, సస్యశ్యామలంగా ప్రకృతి అంతా పులకరిస్తుంది. కనుకనే ఏదో ఒకరూపంలో ఈ మాసంలో అమ్మవారిని(ప్రకృ తి), అయ్యవారిని(భూమి) అర్చించాలి.

వ్యవసాయాధారిత పండుగలలో ఇది ప్రధానమైనది. వైశాఖమాసంలో బలరామ జయంతిని చెప్పుకుంటాం. బలరాముడు వర్షాధార భూములన్నింటికీ నాయకుడుగా వ్యవహరించాడు. నాగలిని ఆయుధంగా ధరించాడు. బలరామక్షేత్రం అని మన ఆంధ్రప్రాంతానికి వున్న పేరు ఆయన నిజం చేశాడు. బలరాముడు కూడా ఈ పౌర్ణమిని ఆచరించినట్లుగా మనకు పురాణ కథలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమినాడు స్త్రీలందరూ కూడా వట సావిత్రీ వ్రతం అనే ఒక వ్రతాన్ని ఆచరించాలి. మర్రిచెట్టుకు చుట్టూ అయిదుసార్లు దారం చుట్టాలి. ప్రదక్షిణలు చేయాలి. పాలు పోయాలి. మర్రి వ్యాపించినట్లుగా శాఖోపశాఖలుగా ఊడలతో కలకాలం వంశం నిలవాలి అనే కోరిక ఈ నేపథ్యంలో వుంది. ప్రకృతిని కాపాడుకోవడమే. ప్రకృతి సంపదలను పరిరక్షించుకోవడమే ఇందులోని అంతరార్థం. ఒక వృక్షాన్ని సమూలంగా నాశనం చేయగలం కానీ ఒక పుష్పాన్ని వికసింపజేయగలమా? ఒక చెట్టుని కొట్టినంత సమయంలోనే ఒక చెట్టుని పాతి పెంచగలమా? కాలాధీనం ఈ ప్రపంచం. కాలానికి అధినేత పరమేశ్వరుడు. ఆయన సంకల్పాన్ని అనుసరించే ఈ కాలాలు ఏర్పడ్డాయి.

జ్యేష్ఠ మాసానికి శుక్రమాసము అని పేరు. ఈ పౌర్ణిమ పశువులకు, వ్యవసాయదారులకు ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు విశేషంగా చెప్పుకోవలసిన పండుగ. వ్యవసాయేతరులు కనీసంగా ఈ రోజు ఒక వృక్షాన్ని/మొక్కని పాతాలి. ఇది భవిష్యత్ తరాలకోసం అందించే ఫలవంతమైన పండుగ అన్న దీక్షను ప్రతిఒక్కరూ స్వీకరించాలి. ప్రకృతిని పరిరక్షించే నియమాలలో అందరం కూడా ఒక మొక్కని పాతుదాం, రక్షిద్దాం అనే నిర్ణయాన్ని తీసుకుందాం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్క నాటి సంరక్షించినట్లైతే ఈ ప్రకృతి తిరిగి పునరుద్ధరింపబడుతుంది. భూమి ఈశ్వరుని ప్రతీక. ప్రకృతి పార్వతికి ప్రతీక. గరిమనాభి (central point) గణపతికి ప్రతీక. ఈ భూమి యే ఆకర్షణ శక్తికి లోనై ఒక వలయాకారంగా సూర్యుని చుట్టూ కూడా పరిభ్రమిస్తూ వుంటుందో ఆ వలయానికి కుమారస్వామి ప్రతీక. ఇటువంటి నేపథ్యం కలిగిన సంస్కృతి సనాతన భారతీయ సంప్రదాయ జీవన ధార విశేషము, ఫలితాంశము కూడా. వీటన్నింటినీ కూడా మనం పరిశీలించి దృష్టిలో వుంచుకున్నట్లయితే ఏరువాక పున్నమి ప్రాశస్త్యం మనకర్థమౌతుంది. ఏవిధంగానైతే వృక్షం పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి చక్కటి పుష్పాలతో సువాసనలతో దేశమంతా తాను వున్నాను అంటూ తన అస్తిత్వాన్ని వ్యాపింపజేస్తుందో ఆవిధంగా పుణ్యకర్మలు చేయడం ద్వారా మన పేరు కీర్తిప్రతిష్ఠలు కూడా దూర తీరాలకు వ్యాపిస్తాయి. అందరూ మనలను జ్ఞాపకం వుంచుకునేలా వ్యవహరిమ్చాలి. ఈ వృక్షాలు మనకు ఏదైతే బోధ చేస్తున్నాయో ఆ మార్గాన్ని అనుసరిద్దాం. వృక్షాలు పుష్పిస్తాయి, ఫలిస్తాయి. కానీ అవి ఏవీ కూడా వాటి పండ్లని అవి తినవు కదా! ఆవులు పాలు ఇస్తాయి, కానీ అవి త్రాగవు కదా! ఆవిధంగానే మనిషి కూడా తన దేహాన్ని ఇతరులకోసం వినియోగించాలి. ఇది ఏరువాక పున్నమి మనకు చేసే బోధ. చెట్లను పాతుదాం. కనీసం ఒక మొక్కనైనా సంరక్షిద్దాం. ఈ పండుగను అందరం పాటిద్దాం. అందరమూ కలిసి నవ్య ప్రపంచాన్ని నిర్మిద్దాం.

ముత్తయిదువ

 తెలుసుకోండి...100625

తెలియజేయండి....


*ముత్తయిదువ*


*మొత్తం అయిదు అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువ అంటారు. అవి :

*1) కాళ్ళకి పట్టీలు, మెట్టెలు

*2) చేతులకి గాజులు

*3) మెడలో మంగళసూత్రం

*4) తలలో పువ్వులు

*5) నొసటన అంటే కనుబొమ్మల మధ్య సిందూరం లేక కుంకుమ


1) మొదటగా కాళ్ళకు పట్టీలు మెట్టెలు ఎందుకో చూద్దాం:


కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా లేదా టైబియా అని పిలవబడుతుంది...


ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్ గా విడిపోతుంది...


ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే, మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ అంతమవుతుంది.


అంటే వేళ్ళ చివరలో, ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈనాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది.


అంటే స్త్రీలలో వారు ధరించేటువంటి పట్టీలు ఇంకా కాలి మెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను, గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయి.


ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది.


గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల బిడ్డను మోయడానికి, సుఖప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది.


అలాగే మూత్రాశయ పనితీరు బాగుండటం వల్ల, ఎప్పటికప్పుడు దేహంలో నిల్వవుండకుండా మూత్రం మొత్తం బయటికి వెళ్లిపోతుంది. దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే tibia nerve అని గూగుల్లో వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.


 2) ఇక రెండవ అలంకార లక్షణం గాజులు...


గాజులు అంటే కేవలం మట్టి లేదా గాజు లేదా బంగారం గాజులు మాత్రమే ఈరోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు...


మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెర్వ్ అనే నరం నేరుగా గుండె యొక్క నరాల తోటి, అంటే గుండెస్పందనకి సంబంధించిన నరాల తోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. వైద్యులు నాడీ స్పందన కూడా దీని తోటే గమనిస్తూ ఉంటారు.


ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెజర్ అంటే రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. అంటే దీనిని మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వొచ్చింది.


అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి, గాజులు అనేవి మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు రాదా అని. పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల- ఒకరకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడంవల్ల వారిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండేది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది. అందువల్ల వారికి గాజులు అవసరం అనేది లేకుండా పోయింది.


అయితే వారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవారికి, వెండి లేదా బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియం ధరించమని చెప్పడం జరిగింది. ఈ లోహాలతో చేసినవి శరీరంలోని వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయి.


అందునా పొలం పనులు , కాయకష్టం చేసే వాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాలలా ధృఢంగా ఉన్నవాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది.


ఈ నరం, దాని యొక్క పనితీరు గురించి తెలియాలి అంటే గూగుల్లో Radial nerve అని వెతికితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది.


3) మూడవది మెడలో మంగళసూత్రం...


దీని చివరున్న బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడివల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది.


అయితే మళ్ళా మీకు ఒక అనుమానం రావచ్చు. మరి మగవాళ్ళ సంగతి అని ? మగవాళ్ళు రొమ్ము క్యాన్సర్ కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగివుంటారు కాబట్టి, మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువ- ఒకరకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు.


ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు రాపిడి అనేది ఉపయోగపడుతుంది.


ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపై నుంచి వచ్చేటటువంటి వేడినీరు ప్రవహించడం వల్ల చర్మవ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. క్యాన్సర్ కి ట్రీట్మెంట్గా బంగారం ఉపయోగపడుతుందని ఈమధ్యనే తెలిపిన పరిశోధన కూడా గమనించవచ్చు.


4) ఇక నాల్గవది తలలో పూవులు...


వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. కలయిక సమయంలో కూడా ఇవి భార్యాభర్తల మధ్య ఆకర్షణకు తోడ్పడుతాయి.


5) ఇక అయిదవది... చివరిది... నొసటన సిందూరం...


*పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమ రాయి నూరుకొని దానికి రేడియం పౌడర్ కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునే వారు.


ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞాచక్రం పై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరిగేది. ఇవే కాకుండా సైనస్ రాకుండా ముక్కపుల్లను, చెవిపోట్లు దరికి చేరకుండా చెవి పోగులనూ ధరించేవారు!


 సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు 

శైలజ వాస్తు జ్యోతిషాలయం 9059743812

తిరుమల సర్వస్వం -267*

 *తిరుమల సర్వస్వం -267*

 *శ్రీవారి సంవత్సర సేవలు - 4* 

 *సంప్రోక్షణలలో రకాలు* 


 సంప్రోక్షణలలో ముఖ్యంగా మూడు రకాలున్నాయి.


 గ్రహణ సందర్భాలలో, ఏదైన అశౌచం జరిగినప్పుడు దేవతామూర్తులను పవిత్రజలాలతో శుద్ధి చేస్తారు. దీన్ని *జలసంప్రోక్షణం* అంటారు.


 దేవతామూర్తులకు ఏదైనా అనుకోని అపరాధం జరిగితే *లఘుసంప్రోక్షణ* ద్వారా తగిన పరిహారం చేస్తారు. దాదాపు సంప్రోక్షణ క్రతువునంతా జరిపిస్తారు. కానీ సంప్రోక్షణా కార్యక్రమమంతా, సరళంగా, కేవలం ఒక్క రోజులో ముగిసిపోతుంది.


 మూడవది *మహాసంప్రోక్షణ.* పన్నెండేళ్ళ కొక్కసారి విష్ణువు అంశను పునఃప్రతిష్ఠించడం కోసం ఐదు రోజుల పాటు విస్తారంగా జరిపే వైదిక కార్యక్రమమే *మహాసంప్రోక్షణ.*


 *అన్ని విధులు అర్చకులవే..* 


 కాలక్రమంలో గర్భాలయానికి అవసరమైన మరమ్మత్తుల నిమిత్తం, ఇతర వృత్తులకు చెందిన కొందరు నిపుణులు గర్భాలయం లోనికి ప్రవేశించే లేదా మూలమూర్తిని స్పృశించే అవకాశం ఉంది. కానీ, ఆగమశాస్త్రాన్ననుసరించి, వైఖానస అర్చకులు తప్ప వేరెవరూ గర్భాలయంలో ప్రవేశించరాదు. అటువంటి సందర్భాలలో మిగిలిన దేవాలయాలలో మూలవిరాట్టు అంశను ఒక కలశం లోకి ఆవాహన చేసి, ఆ కలశాన్ని వేరే ప్రదేశానికి తరలించి, అవసరమైన నిపుణులను గర్భాలయం లోకి అనుమతిస్తారు. కానీ తిరుమల ఆలయంలో మాత్రం గర్భాలయ మరమ్మత్తులన్నీ వైఖానస అర్చకులే నిర్వహిస్తారు. అందుచేత, తిరుమల లోని వైఖానస అర్చకులకు సాధారణంగా అవసరమయ్యే అన్ని రంగాలలోనూ ప్రవేశం ఉంటుంది.


 *కళాపకర్షణ కళాన్యాసం*


 స్వామివారి అంశ - శిరస్సు, ఫాలభాగం, నాసిక, నోరు, కంఠం, భుజస్కంధాలు, హృదయం, నాభి, కటి, మోకాళ్ళు, పాదాలు వంటి పన్నెండు జీవస్థానాలలో నిక్షిప్తమై ఉంటుంది. ఒక్కో జీవశక్తికి నాలుగు కళలుంటాయి. ఆ విధంగా, మొత్తం 48 కళలను *'కుంభం'* లేదా *'కలశం'* అనే స్వర్ణపాత్ర లోనికి వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆవాహన చేస్తారు. ఈ ప్రక్రియనే *కళాపకర్షణ* గా పిలుస్తారు. ఉత్సవం చివరి దశలో అప్పటివరకు కలశంలో నిక్షిప్తమైన 48 కళలను మూలమూర్తి లోనికి తిరిగి ప్రవేశింపజేసే కార్యాన్ని *'కళాన్యాసం'* గా వ్యవహరిస్తారు. సూక్ష్మంగా చెప్పాలంటే..... *'బింబం' (మూలవిరాట్టు) లోని అంశను 'కుంభం' (కలశం) లోకి చేర్చడమే 'కళాపకర్షణ'.*



 *అష్టదిగ్బంధనం* 


 కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడు భూలోకంలో అవతరించియున్నాడు. ఈ యుగంలో స్వామివారి సంపూర్ణ కటాక్షం పొందాలంటే, స్వామివారి మూర్తి ఎల్లవేళలా తన దేవేరియైన భూదేవిని స్పర్శిస్తూ ఉండాలి. అందునిమిత్తం స్వామివారి పాదాలను మరియు శ్రీవారి పాదపీఠాన్ని ఒక ప్రత్యేకమైన లేపనంతో అనుసంధానిస్తారు. *మధూచిష్ట, లాక్ష, త్రిఫలం, కాసీనం, గుగ్గిలం, చూర్ణం, రక్తశిల, శంఖుచూర్ణం వంటి ప్రకృతిసిద్ధంగా లభ్యమయ్యే, జిగురుగుణం కలిగిన ఎనిమిది పదార్థాలకు, వెన్న, వేడినీటిని తగుపాళ్ళలో జోడించి రోలు, రోకలి, తిరగలి వంటి సాంప్రదాయ సాధనాల ద్వారా మిశ్రితం చేయబడగా వచ్చిన చిక్కటి పదార్థమే ఈ లేపనం.* ఏళ్ళ తరబడి జరిగిన అభిషేకాల వల్ల పాదపీఠం మరియు పాదాల మధ్యనున్న సన్నటి ఖాళీ ప్రదేశంలో పేరుకుపోయిన పూజావ్యర్థాలను తొలగించి, వాటి స్థానంలో ఈ లేపనాన్ని నింపుతారు. వీటిలోని ఒక్కో ద్రవ్యం ఒక్కో దిక్పాలకునికి ప్రీతికరమని ప్రతీతి. ఈ ద్రవ్యాలను వినియోగించడం ద్వారా ఆయా దిక్పాలకుల సహకారాన్ని పొందవచ్చని భావిస్తారు. ఈ మిశ్రమం సహజసిద్ధమైన కాంక్రీటులా పనిచేసి, మూలమూర్తి స్థిరంగా నిలద్రొక్కు కోవడానికి దోహద పడుతుంది. ఈ ప్రక్రియ జరుగుతున్నంత సేపు ఆగమబద్ధమైన క్రతువులెన్నో జరుగుతాయి.

ఈ క్రతువును దగ్గరుండి జరిపించడానికి నిష్ణాతులైన వైఖానస పండితులను సుదూరప్రాంతాల నుండి ప్రత్యేకంగా రప్పిస్తారు. అష్టదిక్పాలకులకు ప్రీతిపాత్రమైన అష్టద్రవ్యాల మిశ్రమంతో సమకూరే ఈ వైదిక కార్యక్రమమే *'అష్టదిగ్బంధనం'.*

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*


*404 వ రోజు*

*కర్ణుడు చేసిన నేరములు కృష్ణుడు గుర్తు చేయుట*


కర్ణుడు రథం దిగి " అర్జునా ! ప్రస్తుతం నేను విరధుడను. నా రధ చక్రం భూమిలోకి కుంగి పోయింది. నేను దానిని ఎత్తుకొన వలెను. భూమి మీద ఉన్న నా మీద రథం మీద నుండి నీవు బాణప్రయోగం చేయడం ధర్మము కాదు. కనుక రధచక్రం తీసేదాకా నా మీద బాణ ప్రయోగం చేయకుము. ఇది కేవలం నీకు యుద్ధ ధర్మం తెలియ జేయడానికి చెప్తున్నాను కాని నీకు కృష్ణుడికి భయపడి కాదు " అన్నాడు. కృష్ణుడికి సమయం చిక్కింది కర్ణుడిని చూసి నవ్వుతూ " అదేమిటి కర్ణా ! నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేయడం ఎప్పటి నుండి ? నీకు ఆపద కలిగింది కనుక ధర్మం గుర్తుకు వచ్చిందా ! అహంకారంతో విర్రవీగు సమయాన ధర్మం గుర్తుకు రాలేదా ! ధర్మమార్గాన పయనించే పాండవులకు జయం తధ్యం. అధర్మమార్గాన చరించే కౌరవులకు అపజయం అనివార్యం. నీవు నీ అనుంగు మిత్రునితో కలిసి చేసిన అకృత్యములు మరచినట్లు ఉంది. పాండవులను లక్క ఇంట్లో పెట్టి కాల్చిన సమయాన అతడిని ప్రేరేపించింది నీవు కాదా ! అప్పుడది నీకు అధర్మం అనిపించ లేదా ! నీకు ఇప్పుడు మాత్రం ధర్మం గుర్తుకు వచ్చిందా ! కపటజూదం ఆడించి నప్పుడు, ద్రౌపదిని అవమానాల పాలు చేసి అనరాని మాటలు అన్నప్పుడూ,


పాండవులను కించపరచినప్పుడూ గుర్తుకు రాని ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా ! పాండవులను అడవులలో ప్రంశాంతంగా బ్రతక నీయక ఘోషయాత్రకు సుయోధనుడిని పురికొల్పినప్పుడు గుర్తుకు రాని ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా ! అభిమన్యకుమారుని ఒంటరిని చేసి చుట్టుముట్టి పలువురు దాడి చేసి చంపినప్పుడు ధర్మం గుర్తుకు రాలేదా ! ఇవి అన్ని ప్రత్యక్షంగా చేసింది సుయోధనుడే అయినా పరోక్షంగా కారణం నీవు కాదా! " అన్నాడు. కృష్ణుడి ఒక్కొక్క మాట అర్జునుడికి ఆగ్రహం తెప్పించింది. దయాదాక్షిణ్యం లేక కర్ణుడి మీద శరములు గుప్పించాడు. కర్ణుడు కూడా నేల మీద ఉండే అర్జునుడు వేసే బాణములు ఎదుర్కొంటూ అర్జునుడి మీద బాణములు వేస్తున్నాడు. అర్జునుడు కర్ణుని పతాకం విరుగకొట్టాడు. కర్ణుడు మహా కోపంతో అర్జునుడి మీద కృష్ణుడి మీద పదునైన బాణములు వేస్తూ మధ్యమధ్యలో రథచక్రం తీయ ప్రయత్నించినా అది విఫలం అయింది. కృష్ణుడు అర్జునుడికి కర్ణుడిని సంహరించమని చెప్పాడు. అర్జునుడు అత్యంత శక్తివంతమైన మహాస్త్రాన్ని ఎక్కుపెట్టి మనసులో " నేనే కనుక తపస్సు చేయడంలో దానధర్మాలు చేయడంలో గురువులను సేవించడంలో లోపం లేక చరించిన వాడనై బ్రాహ్మణులను గురువులను తృప్తిపరచిన వాడినై అను నిత్యం పుణ్య కర్మలు ఆచరించే వాడినై ఉంటే ఈ అస్త్రం కర్ణుడిని సంహరించుగాక " అని సంకల్పించి గాండీవాన్ని ఆకర్ణాంతం లాగి అస్త్రప్రయోగం చేసాడు. ఆ దివ్యాస్త్రం నిప్పులు కక్కుతూ వచ్చి కర్ణుడి శిరస్సు ఖండించింది. కర్ణుడి శరీరం నుండి అందరూ చూస్తుండగా ఒక తేజం బయటకు వెడలి సూర్యునిలో కలిసి పోయింది. కర్ణుడి మరణంతో బ్రాహ్మణ శాపం అంతమై అప్పటి వరకు భూమిలో కూరుకు పోయి ఉన్న రథచక్రము భూమిలో నుండి పైకి లేచి భూమి మీద నిలబడింది. సూర్యుడు అస్తమించాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఏడవ అధ్యాయం

విజ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ 

జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు(9)


బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్ధ సనాతనమ్ 

బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ (10)


పార్థా.. నేలలోని సుగంధం, నిప్పులోని తేజస్సు, సర్వభూతాలలోని ఆయుస్సు, తపోధనులలోని తపస్సు నేనే. సమస్త జీవులకూ మూలకారణం నేనే అని తెలుసుకో. బుద్ధిమంతులలోని బుద్ధీ, తేజోవంతులలోని తేజస్సూ నేనే.

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *దేవో రుష్టే గురుస్త్రాతా*

 *గురు రుష్టే న కశ్చనః* ॥ 

       *గురుస్త్రాతా గురుస్త్రాతా*

 *గురుస్త్రాతా నసంశయః* ॥


*తా𝕝𝕝 విధికి కోపం వస్తే గురువు కాపాడుతాడు గురువుకు కోపం వస్థే ఎవరు కాపాడుతాడు.....నిస్సంశయంగా గురువే రక్షకుడు ఎంతైనా గురువు గురువే.*


 ✍️🌹💐🌸🙏

ఏరువాక పూర్ణిమ

 *ఏరువాక పూర్ణిమ శుభాకాంక్షలు..*


*ఏరువాక పౌర్ణమికి స్వాగతం..*


జేష్ఠ పౌర్ణమికి నేలపై పండుగే

ఏరువాక పున్నమి రైతన్నకు పర్వం

ఏరులు వాగులు ఏకమై ప్రవహిస్తే

రైతన్న ఇంట ధాన్యలక్ష్మిని ప్రతిష్టించును..


నింగిలోని మబ్బులు నేల దారి పట్టి

ఎండిపోయిన నదులు ఏరువాక మురిసే

తొలి కారు పంటకు స్వాగతాలు పలికే

తొలకరి చినుకులు నేలపై కల్లాపి చల్లెను..


నెర్రెలు వారి నేలమ్మ ఏడ్చి ఎండిపోయే

తొలకరి తోడుతో తనువంతా మురిసిపోయే

బుర బురా పొందిన మట్టి పరిమళం వెదజల్లే

మల్లెపూల సువాసనలు చిన్నబోయి ముడుచుకునె...


రైతన్న ఇల్లాలు పశువులు అలంకరించె

పాడిపంటలు గల దేశంలో క్షీరసాగరం వెలిసే

పచ్చగడ్డి దొరికి పశువుల పరవశించే

తొలకరి వర్షానికి మురిసి యద పొదుగు పెరిగే...


పుడమిపై ఏరు,వాగు ప్రవాహాలు సాగితే

రైతన్న కష్టము చెమట రూపంలో వచ్చే

చేతి అంటిన మట్టి పరిమళం విరజిమ్ముతుంటే

కష్టమంతా మరిచి బురదలో లీనమై పోయే


విత్తనాలు కొనేందుకు రైతన్న అగచాట్లు

పెట్టుబడుల కోసం అప్పులకు తిప్పలు

నకిలీ విత్తనాలతో నమ్మకపు మోసాలు

మొక్క వచ్చేవరకు నేలపైనే చూపులు..


కొప్పుల ప్రసాద్

నంద్యాల

9885066235

ఏరువాక పౌర్ణమి...

 #నేడు ఏరువాక పౌర్ణమి...


“ ఏరువాక సాగారో రన్నో చిన్ననా...

నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా...”


ఈ పాట తెలియని తెలుగు వారుండరు అంటే అతిశయోక్తి కాదు, కానీ ఈ పాటలో “ ఏరువాక” అనే పదానికి అర్ధం చాల మందికి తెలియకపోవచ్చు...


“ఏరు” అంటే... ఎద్దులను కట్టి దుక్కి దున్నుటకు సిద్దపరచిన నాగలి.


 “ ఏరువాక”... అంటే దుక్కి దున్నుట ప్రారంభం. అంటే వ్యవసాయ ప్రారంభం. పొలంలో పంట పండి చేతికి వస్తేనే కదా మన కష్టాలు తీరేది.


 ఎందుకంటే మనది వ్యవసాయ ప్రధానదేశం. అందుకే మన దేశంలో వ్యవసాయాన్ని ఓ పవిత్ర కార్యంలా, తపస్సులా చేస్తారు.. ఇక్కడి రైతాంగం.


 దేశాన్ని సస్యశ్యామలం చేసి, మానవాళి ఆకలి తీర్చే చల్లని తల్లి, భూమాత. 

అట్టి తల్లి గుండెలపై నాగలి గ్రుచ్చి, దుక్కి దున్నడం రైతన్నకి బాధాకరమైన విషయమే అయినా , బ్రతకాలంటే దుక్కి దున్నక తప్పదు కదా?


అందుకని, వ్యవసాయ ప్రారంభానికి ముందు, భూపూజ చేసి, ఆ తల్లి ఆశీస్సులందుకునేందుకు చేసే పండగే ఈ “ఏరువాక పున్నమి ” పండుగ....


తొలిసారిగా భూక్షేత్రం లో నాగలిని కదల్చడానికి ముందు భూ పూజ చేయాలనీ ఋగ్వేదం వివరిస్తుంది. 


ఆ భూపూజ కూడా, " జ్యేష్ట పౌర్ణమి" నాడు జరపాలని శాస్త్ర నిర్ణయం. అందుకే జ్యేష్ట పౌర్ణమిని “ ఏరువాక పున్నమి” పర్వదినంగా రైతాంగం జరుపుకుంటారు. 


నిజానికీ పండుగ రైతన్నల పండుగే అయినా, అందరి ఆకలి తీర్చే పండుగ కనుక “ ఏరువాక పున్నమి “ అందరికీ పండుగే. 


ప్రాచీన సాహిత్యంలో “ ఏరువాక పున్నమి “ని “వప్పమంగల దివసం” గా రైతాంగం జరుపుకునే వారిని, పాళీ, ప్రాకృత భాషలలోని జాతక కధల ద్వారా వెల్లడవుతుంది.


#పండుగ సందడి :


ఈ రోజు, ఎద్దులకు శుభ్రంగా స్నానం చేయించి, వాటి కొమ్ములకు వివిధ రంగులు పూసి మెడకు , కాళ్ళకు గంటలు కట్టి అలంకరిస్తారు. 


తరువాత , పొలం పనులకు ఉపయోగించే “ “ కాడి” నాగలిని కడిగి రంగులతో, రంగురంగుల పువ్వులతో అలంకరించి ఎడ్లకు నాగలికి , భూమాతకు పూజ చేసి, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి ఎడ్లలకు పొంగలిని ఆహారంగా పెడతారు. 


ఆ తర్వాత “ కాడి” నాగలిని భుజాన పెట్టుకుని మంగళ వాద్యాలతో ఊరేగింపుగా ఎద్దులను తీసుకుని పొలాలకు వెళ్లి భూమాత కు నమస్కరించి, 

భూమిని దున్నడం ప్రారంభిస్తారు. “ ఏరువాక పున్నమి” నాడు ఇలా చేయడం వల్ల ఆ సంవత్సర మంతా పంటలు సమృద్దిగా పండుతాయని కర్షకుల నమ్మకం. 


మరి కొన్ని ప్రాంతాలలో, ఊరు బయట, గోగునారతో చేసిన “ తోరం “ కడతారు. 

రైతులందరూ అక్కడికి చేరి “ చెర్నాకోల “ తో ఆ “ తోరాన్ని “ కొట్టి ఎవరికి దొరికిన నారను వారు తీసుకు వెళ్లి ఆ నారను నాగళ్లకు, ఎద్దుల మెడలోను కడతారు. 

ఇలా చేయడం వల్ల వ్యవసాయం, పశు సంపద వృద్ది చెందుతుందని రైతుల విశ్వాసం.


ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞము అని పేరు పెట్టింది విష్ణుపురాణము.


 "మంత్ర యజ్ఞా పరా విప్రాః" - అంటే బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయడంలో యజ్ఞం వలె ఆ దీక్షతో, లక్ష్యంతో వ్యవహరిస్తారు.


అలాగే కర్షకులు సీతా యజ్ఞము - సీత అంటే నాగలి. నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు.


ఇది వారికి యజ్ఞంతో సమానం. అని వివరిస్తుంది విష్ణుపురాణం.

విశ్వవ్యాపిత స్వరూపమంతా ఆకాశం. నిజానికి ఆకాశమంటే శూన్యం.


ఏమీలేని ఆ శూన్యంలో నుంచి వెలుగుగా కనిపించే ఆ ప్రకాశంలోనుంచి వాయువు పుట్టింది. 


ఆ వాయువులోనుంచి అగ్నితత్త్వం పుట్టింది. ఆ అగ్నిలోనుంచే నీరు ప్రవహించింది. ఆ నీరు వర్ష రూపంలో ఈ భూమిపై పడిన సమయంలో అనేక ఓషధులు మొలకెత్తుతాయి.


పాడిపంటలు, సస్యశ్యామలంగా ప్రకృతి అంతా పులకరిస్తుంది. కనుకనే ఏదో ఒకరూపంలో ఈ మాసంలో అమ్మవారిని(ప్రకృ తి), అయ్యవారిని(భూమి) అర్చించాలి.


వ్యవసాయాధారిత పండుగలలో ఇది ప్రధానమైనది. వైశాఖమాసంలో బలరామ జయంతిని చెప్పుకుంటాం. 


బలరాముడు వర్షాధార భూములన్నింటికీ నాయకుడుగా వ్యవహరించాడు. నాగలిని ఆయుధంగా ధరించాడు.


బలరామక్షేత్రం అని మన ఆంధ్రప్రాంతానికి వున్న పేరు ఆయన నిజం చేశాడు. బలరాముడు కూడా ఈ పౌర్ణమిని ఆచరించినట్లుగా మనకు పురాణ కథలు చెప్తున్నాయి.


ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమినాడు స్త్రీలందరూ కూడా వట సావిత్రీ వ్రతం అనే ఒక వ్రతాన్ని ఆచరించాలి.


మర్రిచెట్టుకు చుట్టూ అయిదుసార్లు దారం చుట్టాలి. ప్రదక్షిణలు చేయాలి. పాలు పోయాలి. మర్రి వ్యాపించినట్లుగా శాఖోపశాఖలుగా ఊడలతో కలకాలం వంశం నిలవాలి అనే కోరిక ఈ నేపథ్యంలో వుంది.


ప్రకృతిని కాపాడుకోవడమే. ప్రకృతి సంపదలను పరిరక్షించుకోవడమే ఇందులోని అంతరార్థం. 


ఒక వృక్షాన్ని సమూలంగా నాశనం చేయగలం కానీ ఒక పుష్పాన్ని వికసింపజేయగలమా?


ఒక చెట్టుని కొట్టినంత సమయంలోనే ఒక చెట్టుని పాతి పెంచగలమా? కాలాధీనం ఈ ప్రపంచం. 


కాలానికి అధినేత పరమేశ్వరుడు. ఆయన సంకల్పాన్ని అనుసరించే ఈ కాలాలు ఏర్పడ్డాయి.


జ్యేష్ఠ మాసానికి శుక్రమాసము అని పేరు. ఈ పౌర్ణిమ పశువులకు, వ్యవసాయదారులకు ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు విశేషంగా చెప్పుకోవలసిన పండుగ.


వ్యవసాయేతరులు కనీసంగా ఈ రోజు ఒక వృక్షాన్ని/మొక్కని పాతాలి. ఇది భవిష్యత్ తరాలకోసం అందించే ఫలవంతమైన పండుగ అన్న దీక్షను ప్రతిఒక్కరూ స్వీకరించాలి. 


ప్రకృతిని పరిరక్షించే నియమాలలో అందరం కూడా ఒక మొక్కని పాతుదాం, రక్షిద్దాం అనే నిర్ణయాన్ని తీసుకుందాం.


ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్క నాటి సంరక్షించినట్లైతే ఈ ప్రకృతి తిరిగి పునరుద్ధరింపబడుతుంది. 


భూమి ఈశ్వరుని ప్రతీక. ప్రకృతి పార్వతికి ప్రతీక. గరిమనాభి (central point) గణపతికి ప్రతీక. ఈ భూమి యే ఆకర్షణ శక్తికి లోనై ఒక వలయాకారంగా సూర్యుని చుట్టూ కూడా పరిభ్రమిస్తూ వుంటుందో 


ఆ వలయానికి కుమారస్వామి ప్రతీక. ఇటువంటి నేపథ్యం కలిగిన సంస్కృతి సనాతన భారతీయ సంప్రదాయ జీవన ధార విశేషము, ఫలితాంశము కూడా.


వీటన్నింటినీ కూడా మనం పరిశీలించి దృష్టిలో వుంచుకున్నట్లయితే ఏరువాక పున్నమి ప్రాశస్త్యం మనకర్థమౌతుంది.


ఏవిధంగానైతే వృక్షం పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి చక్కటి పుష్పాలతో సువాసనలతో దేశమంతా తాను వున్నాను అంటూ తన అస్తిత్వాన్ని వ్యాపింపజేస్తుందో 


ఆవిధంగా పుణ్యకర్మలు చేయడం ద్వారా మన పేరు కీర్తిప్రతిష్ఠలు కూడా దూర తీరాలకు వ్యాపిస్తాయి. అందరూ మనలను జ్ఞాపకం వుంచుకునేలా వ్యవహరిమ్చాలి. 


ఈ వృక్షాలు మనకు ఏదైతే బోధ చేస్తున్నాయో ఆ మార్గాన్ని అనుసరిద్దాం. వృక్షాలు పుష్పిస్తాయి, ఫలిస్తాయి. 


కానీ అవి ఏవీ కూడా వాటి పండ్లని అవి తినవు కదా! ఆవులు పాలు ఇస్తాయి, కానీ అవి త్రాగవు కదా! ఆవిధంగానే మనిషి కూడా తన దేహాన్ని ఇతరులకోసం వినియోగించాలి. 


ఇది ఏరువాక పున్నమి మనకు చేసే బోధ. చెట్లను పాతుదాం. కనీసం ఒక మొక్కనైనా సంరక్షిద్దాం. ఈ పండుగను అందరం పాటిద్దాం.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - శుక్ల పక్షం -‌ పూర్ణిమ - జేష్ఠ -‌‌ సౌమ్య వాసరే* (11.06.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*