12, ఆగస్టు 2025, మంగళవారం

శ్రీమద్భాగవత కథలు*```

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🍁మంగళవారం 12 ఆగస్టు 2025🍁*


                      2️⃣9️⃣

                  *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


      *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``



*నారదుడు ప్రాచీనబర్హికి చెప్పిన పురంజనోపాఖ్యానం*

                 

```

ఒకనాడు, ఏదైనా గొప్ప మహత్కార్యం చేయాలన్న తలంపుతో వున్న మహారాజు ప్రాచీనబర్హి దగ్గరికి నారదుడు వచ్చాడు. వచ్చి, ఏ శుభాన్ని కోరి మహత్కార్యం చేయాలనుకుంటున్నాడని ప్రాచీనబర్హిని ప్రశ్నించాడు. మోక్షస్థితిని తెలుసుకోవడానికి తనకు జ్ఞానోపదేశం చేయమని నారదుడిని అడిగాడు ప్రాచీనబర్హి. సంసార చక్రంలో పరిభ్రమించే తన లాంటివాడు మోక్షపదాన్ని పొందలేడు అని కూడా అంటాడు. 


అప్పుడు నారదుడు, యజ్ఞాలలో ఆయన చంపిన జంతువులు వేలసంఖ్యలో వున్నాయనీ, అవన్నీ ఆయన కసాయితనాన్ని స్మరిస్తూ, ఆయన ఎప్పుడైతే పరలోకం చేరుతాడో అప్పుడు ఆయన్ను హింసించడానికి ఎదురుచూస్తున్నాయనీ, ఆ ఆపద నుండి దాటడానికి ఒక ఇతిహాసాన్ని చెప్తాననీ అంటూ పురంజనోపాఖ్యానం చెప్పాడు.


పూర్వకాలంలో పురంజనుడనే రాజుండేవాడు. అతడికి జ్ఞానంతో కూడిన ప్రవర్తన కల విజ్ఞాతుడనే స్నేహితుడున్నాడు. తనకు అనుకూలమైన పురం కొరకు స్నేహితుడితో కలిసి పురంజనుడు భూమండలమంతా తిరిగాడు. భోగవతి లాంటి ఒక పురాన్ని చూశాడు ఒకనాడు. అది గోపురాలతో, ప్రాకారాలతో, బురుజులతో, కందకాలతో... ఇలా రకరకాల సౌకర్యాలతో, సర్వలక్షణాలు కల నాగుల నివాస పట్టణమైన భోగవతి లాగా వున్నది. ఆ పురానికి వెలుపల అందమైన ఒక ఉద్యానవనం వున్నది. అందులో సరస్సులున్నాయి. ఆ ఉద్యానవనంలో పురంజనుడు ఒక అందమైన యువతిని అనుచరగణంతో సహా చూశాడు. ఆమె ఎవరని, ఆమె పేరేమిటని, తండ్రి ఎవరని, ఆమెను అనుసరిస్తున్న పదకొండు మంది సేవకులు ఎవరని, ఆమె ఈ వనంలోకి రావడానికి కారణం ఏమిటని, ఆమె ముందు నడుస్తున్న పాము ఎవరని ప్రశ్నించాడు పురంజనుడు. తనను ప్రేమించమని కూడా అడిగాడు.


తనకు తన తండ్రి ఎవరో, తన కులం ఏమిటో, పేరేమిటో, తానున్న ఈ పురం పేరేమిటో, దాన్ని నిర్మించిన వాడెవరో తెలియదనీ, తన వెంట వున్నవాళ్లు తన సఖులని, చెలికత్తెలని, ఆ పాము తను నిద్రించేటప్పుడు పురాన్ని పాలిస్తుందని అన్నది ఆ యువతి జవాబుగా. తన భాగ్యవశాన పురంజనుడు అక్కడికి వచ్చాడని, ఆ పురాన్ని స్వీకరించి పాలించమని, తాను సమకూర్చే కోరికలన్నిటినీ నూరేళ్లు అనుభవించమని అన్నది. పురంజనుడు లాంటివాడిని తనలాంటి కన్య తప్పక వరిస్తుందని చెప్పింది. ఆ పద్మాక్షిని పురంజనుడు తక్షణమే వరించాడు. ఆ పురంలోకి ప్రవేశించి ధన్యుడయ్యాడు. వంద సంవత్సరాలు సమస్త సౌఖ్యాలను అనుభవించాడు. ఆ పురానికి వున్న మొత్తం తొమ్మిది ద్వారాల అధిపతులకు, తూర్పున వున్న అయిదు ద్వారాల అధిపతులకు మహాధిపతి పురంజనుడే. ఆయా ద్వారాల ద్వారా రకరకాల విషయాలను పొందుతాడు.


అతడి నగరంలో నిర్వాక్కు, పేశస్కరుడు అనే ఇద్దరు గుడ్డివాళ్లున్నారు. వాళ్ల సాయంతో ఆయన గమనం, కరణం అనే పనుల్ని నెరవేర్చుకుంటాడు. అంతఃపురంలోకి వెళ్లేటప్పుడు విషచి అనే ఆమెతో కలిసి భార్యాపుత్రుల వల్ల కలిగే మోహప్రసాద హర్షాలను పొందుతాడు. ఇలా పురంజనుడు కామాసక్తుడై, 'బుద్ధ' అనే పట్టమహిషి వల్ల సంచించ బడ్డాడు. ఆమె పురంజనుడు ఏది చేస్తే అది చేస్తుంది. తింటే తింటుంది. తాగితే తాగుతుంది. నడిస్తే నడుస్తుంది. అలా పురంజనుడు తన నిజస్వరూపాన్ని ఎడబాసి, పట్టమహిషి వల్ల మోసపోయి, జ్ఞానం కోల్పోయి, 

ఆ పురంలో కాపురం వున్నాడు. అలా కొన్నాళ్లు గడిచాక ఒకనాడు ధనస్సు, బాణాలు ధరించి సైన్యంతో కలిసి వేగంగా బయల్దేరి, పురాన్ని వదిలి, పంచవ్రస్తం అనే అడవికి వెళ్లి, పట్టమహిషిని విడిచి, మదంతో సంచరించాడు. మృగాలను దయాహీనుడై వధించాడు. వేటాడింది తన ఆహారం కోసం కాదు. కేవలం వినోదం కోసం చేసిన రాక్షస క్రీడ. జ్ఞానియైన విద్వాంసుడు చేయతగని హింసను చేసి, నియమాన్ని ఉల్లంఘించి, దుస్సహంగా వేటాడి అలసిపోయి మందిరానికి వెళ్లాడు. బడలిక తీరేదాకా నిద్రపోయాడు పురంజనుడు.


మళ్లీ తన ప్రియురాలైన పట్టమహిషి మీద మనసుపడ్డాడు. భార్య కనిపించక పోయేసరికి అంతఃపుర స్త్రీలను ఆమె గురించి అడిగాడు. కిందపడి పొర్లాడుతూ, ప్రణయ కోపం నటిస్తూ పడుకున్న భార్యను చూపించారు వారు. ఆమెను దగ్గరికి తీసి ఓదార్చాడు. అనునయించాడు. ఆమె కోపాన్ని వీడి అలంకరించుకుని భర్తను చేరింది. ఇద్దరూ శృంగారంలో రాత్రిపగలు అనే తేడా లేకుండా, విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి గడిపి, ఆయువు క్షీణిస్తున్నదన్న సంగతి కూడా తెలుసుకోలేకపోయారు. పురంజనుడు ఒళ్లు మరిచిపోయి జీవితాన్ని గడిపాడు. అతడి నవయవ్వన కాలమంతా అరక్షణం లాగా గతించి పోయింది. పదకొండు వందలమంది కొడుకులను, నూటపదిమంది కూతుళ్లను కన్నారు. వారిద్దరు.. అతడి ఆయుష్షులో సగభాగం తరిగిపోయింది. కుమారులకు, కుమార్తెలకు వివాహం చేశాడు. వారికి ఒక్కొక్కరికి వందమంది చొప్పున కొడుకులు పుట్టి వంశాభివృద్ధి చెందింది.


ఆ తరువాత నిష్ఠగా యజ్ఞదీక్ష వహించి, అనేక యజ్ఞాలు చేశాడు పురంజనుడు. ప్రాచీనబర్హి లాగానే యజ్ఞాలకోసం వేలాది పశువులను చంపాడు. తనకు హితాన్ని కలిగించే కర్మల పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. అప్పుడు చండవేగుడు అనే గంధర్వ రాజు పురంజనుడి పురాన్ని చుట్టుముట్టాడు. అతడు ఏమీ చేయలేక చింతాక్రాంతుడై పోయాడు. ఇదిలా వుండగా కాలపుత్రిక అనే ఒక కన్య మైత్రేయుడు తనను వరించడానికి ఒప్పుకోకపోవడంతో కోపించి శపించింది. యవన దేశాధిపతైన భయుడు కూడా అమెను తిరస్కరించాడు. ఆమెకు భర్త ఎవరో చెప్తానని అంటూ, తమ్ముడు ప్రజారుడుతో కలిసి పురంజనుడి పురాన్ని ముట్టడించాడు. కాలకన్యక పురంజనుడి పురాన్ని అనుభవించింది.


పురంజనుడు ఇష్టం లేకపోయినా ఆ పురాన్ని విడిచి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. శక్తిహీనుడైపోయాడు. తన సంతానాన్ని తలచుకుని తపించాడు. తాను మరణిస్తే భార్య అనాధై తన కుమారులను ఎలా కాపాడుతుందో అని దుఃఖించాడు. అలా దుఃఖిస్తున్న పురంజనుడిని తీసుకుపోవడానికి భయుడు వచ్చాడు. అతడిని పశువును కొట్టినట్లు కొట్టి ఈడ్చుకుపోయాడు. అనుచరులంతా ఆయన వెంట వెళ్లారు. ఆయన వున్న పురం పంచభూతాలలో కలిసిపోయింది. చనిపోయి పరలోకం చేరిన పురంజనుడిని యజ్ఞపశువులు మహాకోపంతో వచ్చి గొడ్డళ్లతో నరికాయి. చాలాకాలం పరలోక బాధలు అనుభవించాడు. మరుజన్మలో విదర్భరాజు ఇంట్లో స్త్రీగా జన్మించాడు.


మలయకేతనుడనే పాండ్యరాజు విదర్భ రాకుమారిని వీర్యశుల్కంగా పొంది వివాహమాడాడు. వారిద్దరికి ఒక కూతురు. ఏడుగురు కొడుకులు జన్మించారు. కొడుకులు ద్రావిడ దేశాధిపతులయ్యారు. ఒక్కొక్కరికి కోటానుకోట్ల కొడుకులు పుట్టారు. మలయకేతుడి కుమార్తె అగస్త్యుడిని పెళ్లిచేసుకుంది. మలయకేతు భూమండలాన్ని తన కొడుకులకు ఇచ్చి భార్య వైదర్భి సమేతంగా కులపర్వతానికి వెళ్లి వెయ్యి దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. చివరకు ప్రాణాలు త్యజించాడు. వైదర్భి విలపించింది. సహగమనం చేయడానికి సిద్ధపడింది.


అప్పుడొక విజ్ఞానస్వరూపుడైన బ్రాహ్మణుడు వచ్చి, ఆమెతో, పూర్వ జన్మలో తామిద్దరం హంసలమని, స్నేహితులమని చెప్పాడు. భౌతిక సుఖాల పట్ల ఆసక్తికలిగి వైదర్భి కామినీ నిర్మితమై అయిదు ఆరామాలు, తొమ్మిది వాకిళ్లు, ఒకే పాలకుడు, మూడు చావళ్లు, ఆరు గుంపులు, అయిదు అంగళ్లు, పంచ ప్రకృతులు, స్త్రీయే నాయికగా కలిగిన ఒక పురాన్ని చూశావని చెప్పాడు. అలాంటి పురంలో ప్రవేశించినవాడు స్త్రీలమీద ఆధారపడే అజ్ఞాని అనీ, దాంట్లో వైదర్భి ప్రవేశించి, కామినికి చిక్కి, ఆమెతో ఆనందిస్తూ, ఈశ్వరుడిని విస్మరించి, చివరకు వైదర్శిగా పుట్టి దుఃఖాలను అనుభవిస్తున్నాడని చెప్పాడు. ఇలా చెప్పి ఆ బ్రాహ్మణుడు ఇదంతా తన మాయతో కలిపించబడిందని, తామిద్దరం పూర్వం హంసలమని, అతడి తేజోరూపాన్ని తెలుసుకోమని అన్నాడు.


ఇదంతా చెప్పిన నారదుడు పురంజనుడి కథ అనే మిషతో ఆధ్యాత్మ తత్త్వాన్ని ప్రాచీనబర్హికి తెలియచెప్పాను అని అన్నాడు. ప్రాచీనబర్హి దర్భలను భూమండలమంతా పరచి, అహంకారంతో, అవినయంతో ఎన్నో పశువులను చంపాడని, కానీ, కర్మస్వరూపాన్ని, విద్యాస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడని అదేంటో చెప్తాను వినమని అన్నాడు. 'ఆ సర్వేశ్వరుడి పట్ల మనస్సును లగ్నం చేసేది ఏదయితే వుందో అదే విద్య. ఆ పరమాత్మయే దేహధారులకు ఆత్మ. ఈశ్వరుడు. కాబట్టి క్షేమకరమైన ఆశ్రయం నారాయణుడి పాదమూలాలే. ఆ శ్రీమహావిష్ణువే ప్రియాతిప్రియమైన వాడు, సేవించతగ్గవాడు. ఆయనను ఆశ్రయించి సేవించే వారికి అణుమాత్రమైనా దుఃఖం కలగదు. ఆ భగవత్ స్వరూపాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు విద్వాంసుడు. అతడే గురువు. అతడే హరిస్వరూపం. కాబట్టి సకల జీవులకు ఆశ్రయమైన ఈశ్వరుడిని భజించు. సర్వ విధాలా విరక్తిని పొందు. మనస్సే జీవులందరికీ సంసార కారణం. అటువంటి కర్మ వశం వల్ల ఇంద్రియాలలో సంచరించడం జరుగుతుంది. దాన్నే అవిద్య అంటారు. అవిద్య వల్లే అనేక జన్మలు, కర్మ బంధాలు కలుగుతున్నాయి. కాబట్టి అలాంటి అవిద్య తొలగేందుకు లక్ష్మీపతిని భజించు. సృష్టిస్థితిలయకారకుడైన పరమేశ్వరుడిని, పద్మనేత్రుడిని, ఈశ్వరుడిని ధ్యానించు, సర్వజగత్తును భగత్ స్వరూపంగా అర్ధం చేసుకుని అతడి పాదపద్మాలను ఆరాధించు'.


ఈ విధంగా, జీవుడు ఈశ్వరుడిని చేరే మార్గాన్ని తెలిపి నారదుడు తన దారిన వెళ్లిపోయాడు. 


ఆ తరువాత ప్రాచీనబర్హి కొడుకులకు రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేసుకునేందుకు కపిల మహాముని ఆశ్రమానికి వెళ్లాడు. అవ్యయానందమైన విష్ణుపదాన్ని పొందాడు.


                  *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


           *రచన:శ్రీవనం* 

   *జ్వాలా నరసింహారావు*

  *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*                            

             🌷🙏🌷``


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

శ్రీమదాంధ్ర మహాభారతం* *ఆదిపర్వము*

 🔯🌹🌷🏹🕉️🏹🌷🌹🔯

*🕉️సోమవారం 11 ఆగస్టు 2025🕉️*


*శ్రీమదాంధ్ర మహాభారతం*

         *ఆదిపర్వము*

 *గ్రంథ ప్రారంభము (1 -4)*


ఆ మహా భారతమును ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రము అనియు, ఆధ్యాత్మవిదులు వేదాంత గ్రంధనుని, నీతి విచక్షణులు నీతి శాస్త్రమని, కవీంద్రులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ గ్రంధమని, ఐతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు అన్ని పురాణముల సముదాయమనీ, ప్రశంశించారు.


వ్యాసభారతంలో మొత్తం 100 సర్వములు ఉన్నవి. అవి


1. పౌష్యము 2. పౌలోమము, 3. ఆస్తీకము, 4. ఆదివంశావతారము,


5.సంభవసర్వము, 6.జరుగృహదాహము, 7. పండింబము, 8. బకవధ,


9.చైత్రరథము, 10.ద్రౌపదీస్వయంవరము, 11. వైవాహికము;


12. నిదురాగమనము, 13. రాజ్యార్థలాభము, 14, అర్జున తీర్ధయాత్ర,


15. సుభద్రా కల్యాణము,

 16.హరణ హారిక, 

 17. ఖాండవదహనము,


18.సయదర్శనము, 

19. సభాపర్వము, 

20, మంత్రపర్వము,


21.జరాసంధవధ, 22. దిగ్విజయము, 23. రాజసూయము,


24. బర్హ్యాభిహరణము, 25, శిశుపాలవధ, 26. ద్యూతము, 27. అనుద్యూతము,


28. ఆరణ్యము, 29 కిమ్మీరవధ, 30, కైరాతం, 31. ఇంద్రలోకాభిగమనము,


32. ధర్మజతీర్థయాత్ర, 33. జటాసుర వధ, 34. యక్షయుద్ధం, 35. అజగరము,


36.మార్కండేయోపాఖ్యానము, 37. సత్యా ద్రౌపదీసంవాదము,


38. ఘోషయాత్ర, 39.ప్రాయోపవేశము, 40.వ్రీహిద్రోణకాఖ్యానము,


41,ద్రౌపరీహరణము, 42. కుండలాహరణము, 43. ఆరణీయము,


44.పైరాటము, 45. కీచకవధ, 46. గోగ్రహణము, 47. అభిమన్యువివాహం,


48. ఉద్యోగము, 49.సంజయయానము, 50. ధృతరాష్ట్ర ప్రజాగరణము,


51. సానత్సుజాతము, 52. యానసంధి, 53. భగవద్యానము, 54, సేనానిర్యాత,


55. ఉలూకదూతాభిగమనము, 56. సమరథ, అతిరథ సంఖ్యానము,


57.కర్ణభీష్మ వివాదము, 58. అంబోపాఖ్యానము, 59. జంబూఖండవినిర్మాణము,


60.భూమి పర్వము, 61. భీష్మాభిషేకము, 62. భగవద్గీత, 63. భీష్మవధ,


64.ద్రోణాభిషేకము,65,సంశర్షిక వధ, 66. అభిమన్యు వధ,


67.ప్రతిజ్ఞాపర్వము, 68. జయద్రధ వధ, 69. ఘటోత్కవవధ, 70,ద్రోణ వధ,


71. నారాయణాస్త్ర ప్రయోగము, 72. కర్ణపర్వము, 73. శల్యపర్వము,


74.హ్రదప్రవేశము, 75. గదాయుద్ధము, 76. సారస్వతము, 77. సౌప్తికపర్వము,


78. వైషీకము, 79. జలప్రదానము, 80, స్త్రీపర్వము, 81. శ్రాద్ధ పర్వము,


82. రాజ్యాభిషేకము, 83. చార్వాక విగ్రహము, 84.గృహప్రవిభాగము,


85.శాంతిపర్వము, 86, రాజధర్మానుకీర్తనము, 87. ఆపద్ధర్మము,


88, మోక్షధర్మము, 89, అనుశాసనికము, 90. భీష్మస్వర్గారోహణము,


91.ఆశ్వమేధికము, 92లనుగీత, 93. ఆశ్రమవాసము,


94. పుత్రసందర్శనము, 95. నారదాగమనము, 96. మౌసలము,


97. మహాప్రస్థానికము, 98. స్వర్గారోహణము, 99, హరివంశము, 100.భవిష్యత్పర్వము,


18 సర్గల వివరాలు:


 * ఆది సర్గము: 18 సంపుటములు, 9,984 శ్లోకములు, 8 అశ్వాసములు, 2,084 పద్యగద్యములు.


 * సభాపర్వము: 9 సంపుటములు, 4,311 శ్లోకములు, 2 అశ్వాసములు, 618 పద్యగద్యములు.


 * అరణ్యపర్వము: 16 సంపుటములు, 13,664 శ్లోకములు, 7 అశ్వాసములు, 2,894 పద్యగద్యములు.


 * విరాటపర్వము: 4 సంపుటములు, 3,500 శ్లోకములు, 5 అశ్వాసములు, 1,624 పద్యగద్యములు.


 * ఉద్యోగపర్వము: 11 సంపుటములు, 6,998 శ్లోకములు, 4 అశ్వాసములు, 1,562 పద్యగద్యములు.


 * భీష్మపర్వము: 5 సంపుటములు, 5,884 శ్లోకములు, 3 అశ్వాసములు, 1,171 పద్యగద్యములు.


 * ద్రోణపర్వము: 8 సంపుటములు, 10,919 శ్లోకములు, 5 అశ్వాసములు, 1,860 పద్యగద్యములు.


 * కర్ణపర్వము: 1 సంపుటములు, 4,900 శ్లోకములు, 3 అశ్వాసములు, 1,124 పద్యగద్యములు.


 * శల్యపర్వము: 4 సంపుటములు, 3,220 శ్లోకములు, 2 అశ్వాసములు, 827 పద్యగద్యములు.


 * సౌప్తికపర్వము: 3 సంపుటములు, 2,874 శ్లోకములు, 2 అశ్వాసములు, 376 పద్యగద్యములు.


 * స్త్రీపర్వము: 5 సంపుటములు, 1,775 శ్లోకములు, 2 అశ్వాసములు, 376 పద్యగద్యములు.


 * శాంతిపర్వము: 4 సంపుటములు, 14,525 శ్లోకములు, 6 అశ్వాసములు, 3,093 పద్యగద్యములు.


 * అనుశాసనిక: 2 సంపుటములు, 12,000 శ్లోకములు, 5 అశ్వాసములు, 2,148 పద్యగద్యములు.


 * అశ్వమేధ: 2 సంపుటములు, 4,420 శ్లోకములు, 4 అశ్వాసములు, 976 పద్యగద్యములు.


 * ఆశ్రమవాస సర్గము: 3 సంపుటములు, 1,106 శ్లోకములు, 2 అశ్వాసములు, 362 పద్యగద్యములు.


 * మౌసల సర్గము: 1 సంపుటములు, 300 శ్లోకములు, 1 అశ్వాసము, 226 పద్యగద్యములు.


 * మహాప్రస్థానీక సర్గము: 1 సంపుటములు, 120 శ్లోకములు, 1 అశ్వాసము, 79 పద్యగద్యములు.


 * స్వర్గారోహణ సర్గము: 1 సంపుటములు, 200 శ్లోకములు, 1 అశ్వాసము, 97 పద్యగద్యములు.


 * హరి వంశపర్వము, భవిష్యపర్వము: -- సంపుటములు, -- శ్లోకములు, -- అశ్వాసములు, -- పద్యగద్యములు.


మొత్తం:

 * సంపుటములు: 100

 * శ్లోకములు: 1,00,500

 * అశ్వాసములు: 63

 * పద్యగద్యములు: 21,507


మహాభారతమును వ్యాసుడు మూడు సంవత్సరములు రచించాడు. ఈ మహా భారతమును స్వర్గలోకంలో చెప్పడానికి నారద మహా మునిని, పితృ లోకంలో చెప్పడానికి దేవలుడిని, గరుడ గంధర్వయక్షరాక్షస లోకములలో చెప్పడానికి తన కుమారుడైనశుక మహర్షిని, సర్పలోకములో చెప్పడానికి సుమంతుడిని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయనుడిని నియమించాడు. వ్యాసుడు.


సశేషం


తంగిరాల చంద్రశేఖర అవధాని, కపిలేశ్వరపురం


                 *సేకరణ* 

 *న్యాయపతి నరసింహారావు* 

🔯🌹🚩🏹🛕🏹🚩🌹🔯

అభిజ్ఞానశాకుంతలమ్

 🙏అభిజ్ఞానశాకుంతలమ్ నామౌచిత్యం 🙏

                  మొదటి భాగం 

( అందరు చదవడానికి వీలుగా కొన్ని భాగాలుగా అందిస్తాను. గ్రూపులో సభ్యులు ఒకరు( పేరు తెలియదు ) ఈ విషయం గురించి అడిగారు. )


సాహిత్య ప్రక్రియల్లో నాటకానికి విశిష్ట స్థానం ఉంది. అందుకే మహాకవి కాళిదాసు ‘నాటకాంతంహి సాహిత్యం’ అన్నారు. అనగా అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం అని అర్థం. నాటకం, బాణ, ప్రకరణ, ప్రహసన, డిమ, వ్యాయోగ, సమవాకార, వీథి, అంక, ఈహామృగ వంటి దశ రూపకాలలో నాటకం ఉత్తమమైనది.

.అభిజ్ఞానశాకుంతలము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకములన్నిటిలోనూ అత్యంత ప్రాచుర్యము నొందిన నాటకము. ఇందు ఏడు అంకములు గలవు. వసంత ఋతు వర్ణన చేయబడింది.శాకుంతలము ఒక గొప్ప శృంగార రస భరిత నాటకము

అభిజ్ఞానశాకుంతలమ్ అనేది సంస్కృతం పేరు. తెలుగులో అభిజ్ఞానశాకుంతలము అవుతుంది. దీనిని ఒక్క పదంగానే వ్రాయాలి. విడదీసి రెండు పదాలుగా (అభిజ్ఞాన శాకుంతలము అని వ్రాయకూడదు).

కవికుల గురువు కాళిదాసు తన నాటకానికి శాకుంతలం అని పేరు పెట్టవచ్చు కదా అభిజ్ఞానశాకుంతలమ్ అని ఎందుకు పేరు పెట్టినారు 

అభి అంటే మొగ్గు చూపడం అని అర్థం 

అభిమానం అంటే మానం మీద మొగ్గు చూపడం

అభిజ్ఞానం అంటే జ్ఞానం మీద మొగ్గు చూపడం


శకుంతలకు సంబంధించిన ఈ నాటకానికి కీలకమైన అంశం అంగుళీయము (అంగులీయకము / అంగుళీయకము) రూపంలో ఉన్న గుర్తింపు ముద్ర ద్వారా మరచిపోయినది గుర్తుకురావడం.


దుష్యంతమహారాజు దుర్వాసుని శాపంతో మరచిపోయిన శకుంతలను అంగుళీయము ద్వారా గుర్తుతెచ్చుకుంటాడు. అంగుళీయము ద్వారా గుర్తింపబడి స్వీకరింపబడిన శకుంతలకు సంబంధించిన (శంకుంతల వృత్తాంతాన్ని వర్ణించే) నాటకం కాబట్టి అభిజ్ఞానశాకుంతలమ్ అని పేరు పెట్టబడినది.

శాకుంతలం అంటే శకుంతలకు సంబంధించినది.

ఇది పాణిని రచించిన అష్టాధ్యాయి అనే సంస్కృత వ్యాకరణంలో "తస్యేదమ్"’ అనే సూత్రం ద్వారా ‘సంబంధించిన’ అనే అర్థాన్ని సూచించడానికి శ-మీద ఉన్న హ్రస్వ అకారమునకు దీర్ఘం వచ్చి శా .అయింది ఎలాగంటే, గంగ యొక్క పుత్రుడు గాంగేయుడు అయినట్లుగా.


‘జ్ఞాపకం’ అనే అర్థాన్నిసూచించే ‘జ్ఞా’ అనే ధాతువుకు ‘చెయ్యడం’ అనే అర్థంలో ‘అభి’ అనే ప్రత్యయం చేరి ‘అభిజ్ఞానం’ అనే పదం ఏర్పడింది. అభిజ్ఞాన ప్రధానమైన శకుంతల విషయకమైనది కథ కాబట్టి ‘అభిజ్ఞానశాకుంతలమ్’ అని పేరు పెట్టడం జరిగింది.

దేవలోకములో నర్తకి అయిన మేనక, విశ్వామిత్రుడు చేయుచున్న ఘోర తపస్సును భగ్నము చేయుటకు దేవేంద్రునిచే పంపబడి, ఆ కార్యము సాధించు క్రమములో విశ్వామిత్రుని వలన ఒక బాలికకు జన్మనిచ్చి, ఆ బాలికను అడవిలో వదలి దేవలోకమునకు వెడలిపోవును. ఆ బాలిక అడవిలోని ఆకులపై పడిన నీటి బిందువులను ఆహారముగా ఒక హంస ద్వారా గ్రహించి ప్రాణము నిలుపుకొనును. అటుపై, ఆ బాలికను మహర్షి కణ్వుడు మార్గమధ్యమున చూసి జాలితో పెంచుకొనుటకు తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళి, ఆమెకు శకుంతల అని నామకరణము చేయును. శాకుంతలములచే కాపాడబడి, పెంచబడినది కావున శకుంతల అయినది

.

భరతుడి జననానికి సంబంధించిన కథ అత్యంత ప్రాచుర్యం పొందింది.నాటక లక్షణాలలో ఇతివృత్తం ప్రసిద్ధమైయుండాలి. మహాభారతంలోని కథ. ఈ ఇతివృత్తం వ్యాసుడు మహాభారతంలో వ్రాయగా, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలములో మరింత విపులీకరించి దృశ్య కావ్యంగా రచించారు.

దుర్వాస శాప వృత్తాంతం ఎందుకు కల్పించాడో అనకూడదు. ఆయన ఋషి కనుక.ఎందుకు ప్రవేశ పెట్టేడో అనాలి. దానికి కారణం తెలుసుకునే ముందు 

మహాభారతంలోని కథను పరిశీలించాలి. కథ పరిశీలిద్దాం. చూడండి 


 విశ్వామిత్రుడు మేనక వల్ల జన్మించిన శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమములో పెరుగుచుండగా ఒకరోజు ఆ మార్గములో అప్పటి రాజు దుష్యంతుడు వెళ్తుండగా, దుష్యంతుడు శకుంతలని చూసి ఆకర్షితుడై ఆమెని గాంధర్వ వివాహం చేసుకొని ఆమెను రాజ్యానికి వెళ్ళి రాజ్యసంస్కారాలతో ఆహ్వానిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో శకుంతల భరతుడిని ప్రసవిస్తుంది. కణ్వ మహర్షి దివ్య దృష్టితో జరిగింది గ్రహించి శకుంతలని దుష్యంతుని రాజ్యానికి పంపుతాడు. మొదట శకుంతల తన భార్య కాదు భరతుడు తన కుమారుడు కాదు అని అన్న దుష్యంతుడు, ఆకాశవాణి పలుకులతో జరిగిన వృత్తంతం గుర్తు తెచ్చుకొని భరతుడిని కుమారుడిగా అంగీకరిస్తాడు.

మహాభారతంలోని ఆది పర్వము-చతుర్థాశ్వాసము

ఒక్కసారి పరిశీలిద్దాము.

కణ్వ మహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట 

అనఘుఁడు వంశకరు డై , పెనుపున నీ సుతుఁడు వాజపెయంబులు నూ

ఱొనరించు నని సరస్వతి, వినిచె మునులు వినఁగ నాకు వినువీది దెసన్. 


యీ నీ కొడుకు పుణ్యాత్ము ఢై వంశోద్దరకుడు అగునని, నూఱశ్వమేధాల్ని చేస్తాడనీ సరస్వతి మునుపు మునులందరూ వింటూండగా నాకు ఆకాశవాణి ద్వారా చెప్పినది.

గొప్ప గుణవంతుడు, కులాన్ని విస్తరించేవాడూ, బాలుడూ, ఉదారుడు, ధర్మప్రియుడు ఐన ఈ బాలుడిని ఆనాటి నీ సత్యవాక్యమును పాటించకుండా తప్పచూడటం , ఓ సారమతీ! నీకు చెల్లునా?

చ.

నుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత

వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.


తియ్యటి నీటితో నిండివున్న నూఱు నూతులకంటె ఒక దిగుడుబావి మేలు, అట్టి బావులు నూఱిటికంటె ఒక సత్క్రతువు మేలు, అట్టి నూఱు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు, అట్టి నూర్గురు కుమారులకంటె కూడా, ఓ సూనృతవ్రతుడ వైన రాజా ! ఒక సత్యమైన మాట మేలయ్యా. అని అంటూ ఇంకా సత్యాన్ని గురించిన గొప్పదనాన్ని ఇలా వర్ణన చేసి చెబుతుంది 

వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్నిఒకవేపు, సత్యవాక్యాన్ని ఇంకోవేపు త్రాసులో ఉంచి తూస్తే త్రాసు యొక్క ముల్లు సత్యం వైపే మొగ్గును చూపిస్తుంది సత్యము యొక్క భారాతిశయము చేత.

అన్ని తీర్థాలను సేవించగా వచ్చే ఫలితం, సర్వవేదాల్ని పొందుట కూడా సత్యముతో సరిగావు. అన్ని ధర్మాలలోకెల్లా సత్యమే పెద్ద అని ధర్మజ్ఞులైనవారు చెప్తారు, తెలుసుకో.

క్షత్త్రియు డైన విశ్వామిత్త్రునకు పవిత్రమైన మేనకకు పుట్టినదానను, అలాంటి దానిని - ఓ రాజా! అబద్ధమాడటానికి అంత ధర్మేతరనా? అని అంటపొడుస్తుంది.


అనిన శకుంతలపలుకులు అంగీకరించక దుష్యంతుం డిట్లనియెను 

ఏ నెట నీ వెటసుతుఁ డెట, యే నెన్నఁడుఁ దొల్లి చూచియెఱుఁగను నిన్నున్

మానిను లసత్యవచనలు, నా నిట్టు లసత్యభాషణం బుచితంబే. 


నే నెక్కడ? నీ వెక్కడ? సుతు డెక్కడ? నే నెప్పుడూ నిన్ను చూడనే లేదు. ఆడవారు అబద్ధాలాడేవారు అనేలా ఈ విధంగా నీ వబద్ధం చెప్పటం న్యాయమేనా?

క.

వనకన్యకయఁట నే నఁట; వనమున గాంధర్వమున వివాహంబఁట నం,

దనుఁ గనెనఁట మఱచితినఁట; వినఁగూడునె యిట్టి భంగి విపరీతోక్తుల్ --(పాఠాంతరము)


ఈవిడ వనకన్యక యట! నేనట వనంలో కలిసానట! గాంధర్వ వివాహం కూడా చేసుకొన్నానట!! కొడుకును కూడా కన్నానట! మఱచిపోయానట! ఇలాంటి విపరీతములైన మాటలు వినతగినవేనా?


పొడవుగా వయసులో ఉండి బలవంతు డైన వానిని నీ కొడుకని వ్యత్యాసముగ యిందరూ నవ్వేట్లుగా చూపించటానికి తీసుకువచ్చావా?


ఇటువంటి లోకవిరుద్ధమైన పలుకులకు మేమెలా అంగీకరిస్తాం. అందుచేత యుక్తంకాని పలుకులు పలుకక నీ ఆశ్రమమునకు పొమ్మనిన శకుంతల అత్యంత దుఃఖితయై

తడయక పుట్టిననాఁడ తల్లి చే దండ్రి చే విడువఁ

బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కొ

నుడువులు వేయు నిం కేల యిప్పాటినోములు దొల్లి

కడఁగి నోఁచితిని గా కేమి యనుచును గందె డెందమున. 


పుట్టినప్పుడే తల్లి చేతను తండ్రి చేతను విడిచిపెట్ట బడ్డాను. ఇప్పుడు భర్త చేతను కూడా విడిచిపెట్ట బడ్డానుకదా ఇంక వేయి మాటలనుకోనేల యీపాటి నోములే తొల్లిటి జన్మలో నోచుకొన్నానేమో లేకపొతే ఇలా గెందుకవుతుంది అంటూ ఆ మహా సాధ్వి హృదయంలో తల్లడిల్లిపోయింది.

ఈ మధ్యాక్కర పద్యాన్ని చదువుతున్నా వ్రాస్తున్నా కండ్లనుంచి ధారాపాతంగా ఆగకుండా కన్నీళ్ళు కారుతూనే ఉంటున్నాయి. ఆడకూతురికి ఎంత రాకూడని కష్టం. ఈ ఘట్టాన్ని ఇంత బాగా వ్రాసిన నన్నయ్య గారికి శత సహస్ర కోటి వందనాలందించకుండా వుండలేము కదా. నన్నయ్యగారు స్త్రీ మనస్సును ఆవాహన చేసుకొన్నవారై ఆమె దుఃఖాన్ని పూర్తిగా ఆవిష్కరించారు. ఇటువంచి రమ్యాతి రమ్యమైన కథలకోసం మనందరం భారతాన్ని పఠించాలి.

వ.

ఇట్లు దద్దయు దుఃఖించి విగతాశయై బోరనఁ దొరఁగు బాష్పజలంబు లందంద యొత్తికొనుచు నింక దైవంబ కాని యొండు శరణంబు లే దని యప్పరమపతివ్రత తనయుం దోడ్కొని క్రమ్మఱి పోవ నున్న యవసరంబున. 

చ.

గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు సే

కొని భరియింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్వి స

ద్వినుత మహాపతివ్రత వివేకముతో నని దివ్యవాణి దా

వినిచె ధరాధినాధునకు విస్మయమందఁగఁ దత్సభాసదుల్. 

ఆకాశవాణి భరతుడు శకుంతలకూ దుష్యంతునకు కలిగిన సంతానమని శకుంతల మహా సాధ్వి అని సభాసదులందరూ వినుచుండగా పలికి కథకు ముగింపును పలుకుతుంది. ఇది భారతములోని కథ. దీనిని యథాతథముగా నాటకంగా వ్రాస్తే నాటక లక్షణాలకు విరుద్ధం.నాయకుడు అసత్యవాది అవుతాడు. సత్యమునే నాయకుడు పలకాలి.

                        సశేషం

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ