ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
19, జూన్ 2025, గురువారం
భక్తుని సరైన వైఖరి
భక్తుని సరైన వైఖరి పూర్తి శరణాగతి అయి ఉండాలి.
ఒక భక్తుడు ప్రకటించినట్లుగా, "నా సొంతమని చెప్పుకోగలిగేది నా దగ్గర లేదు"...
నువ్వు నాకు ఇచ్చిన హృదయాన్ని నీకు తిరిగి అర్పిస్తున్నాను, "అన్నీ నీవే, నీది నీకు అర్పిస్తున్నాను."
ఈ ఆత్మ పూర్తి శరణాగతి అభివృద్ధి చెందనంత వరకు, మనిషి మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి ఉంటుంది.
పువ్వులు మరియు పండ్లు సమర్పించడంలో సంతృప్తి చెందకుండా, తన హృదయాన్ని దైవానికి అర్పించాలి.
*~బాబా~*
జీవితంలో నిత్య సత్యమైనాదానిని
*జీవితంలో నిత్య సత్యమైనాదానిని విశ్వసించాలి!!*
నిత్య జీవితంలో సత్యమైనది, మార్పు లేనిది, ఒక్క దైవం మాత్రమే, ఆ దైవాన్ని విశ్వసించాలి మనం!!...
పరిపూర్ణ మైన జీవితాన్ని గడపాలి అంటే, ముందు ఆయన గురించి అన్వేషించాలి,
మానవత్వం లో ఎంతో విచిత్రమైన శక్తి ఉన్నది,
భగవంతుని సృష్టి యే మహా విచిత్రమైనది.
ఒక మానవుని వలె మరొక మానవుడు లేడు.
ఒక వేలి ముద్ర వలె మరొక వేలి ముద్ర లేదు.
అంతా విచిత్రంగా ఉంటున్నది...
భగవంతుని సృష్టి ఒక మౌల్డ్ తో చేసేదికాదు, లేక ఒక రబ్బరు స్టాంపు తో చేసేదికాదు.
ఇది క్షణ క్షణంమునకూ మారేటి వంటిది.
విభిన్న మైన రూపనామములను ధరించేటటువంటిది,
కవలపిల్లలయందు కూడా, ఏదో వ్యత్యాసం ఉండే తీరుతుంది.
ఇంత విచిత్రమైనది భగవత్ సృష్టి.
మన హృదయంలో భగవంతుడు తప్ప మరొకడు ఉండకూడదు,
భార్యా భర్తల మధ్య, తల్లీ పిల్లల మధ్య, అన్న దమ్ములమధ్య ఉండేది దేహ సంబంధమే కానీ హృదయసంబంధముకాదు.
ఈసంబంధాలన్నీ మధ్యలో వచ్చి మధ్యలో పోయేవే!
నీవు పుట్టక ముందు, పుట్టిన తరువాత మరణించిన తరువాత కూడా నీ వెంట దేవుడే ఉంటున్నాడు.
ఇతడుసర్వవ్యాపి , ఆయన లేని స్థలం ఉండదు.
కనుక ఇట్టి నిత్య సత్యమైన దైవాన్ని విశ్వసించాలి, అప్పుడే మానవ జీవితానికి ఒక సార్థకం చేకూరుతుంది.
త్రిలోచన గౌరీ వ్రతం
*త్రిలోచన గౌరీ వ్రతం* 🙏🪴
సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ
*వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతి పత్తయే*
*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ॥*
అనే శ్లోకాన్ని తప్పనిసరిగా నేర్చుకుంటారు.
వాక్కు అర్థము ఈ రెండింటినీ విడదీయలేరు.
వీటికున్న సంబంధం అవినాభావమైనది. శివపార్వతులు కూడా ఈ వాక్కు అర్థము లాంటివారేనని ఈ శ్లోక అర్ధం.
అందుకే వీరిద్దరినీ ప్రకృతి పురుషులుగా వర్ణిస్తూ ఉంటారు.
ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా అది అయోమయానికి, అవ్యవస్థకు, అనాచారానికి దారి తీస్తుంది.
ప్రకృతి నుండి పురుషుడు విడిపోయాడనుకోండి శివం కాస్తా శవమవుతుంది.
ఈ విధంగా ప్రకృతి పురుషుల కేళి జరిగే ప్రదేశమే కైలాసం.
ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు మూర్తీభవించినట్టుగా ఉంటుంది, శివుడు చిన్మయ రూపంలో ఉంటాడు.
అంతే కాదు శివలింగం ఎంత తడిస్తే ఎంత చల్లబడితే ఎంత ఆరాధన చేస్తే లోకాలు అంత చల్లబడుతాయి.
కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు తీరుతూ ఉంటాయి.
ఈ పాపాలు ఎందుకు తీరాలనే ప్రశ్న చాలా మందికి కలుగుతుంది.
దీనికి సమాధానమే శంకరాచార్య విరిచిత...
*పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం*
*ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే॥* స్తోత్రం.
ఈ సంసార భ్రమణ పరితాపం వదిలి పోవటానికి రెండు జన్మల మధ్య పరితాపాన్ని త్యజించటానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు.
అంతే కాదు మానవ జననానికి కారణం కోరిక.
ఈ కోరికకు ఒక రూపం మన్మథుడు.
అలాంటి మన్మథుడిని తన మూడో కంటి చేత దహనం చేసినవాడు ఈశ్వరుడు.
అయితే ఈ చర్యలన్నింటిలోను అమ్మవారి ప్రమేయం కూడా ఉంటుంది.
అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రమే కాదు పార్వతీ దేవిది కూడా.
అందుకే ఆమెను త్రిలోచన అని కూడా పిలుస్తారు.
తన భక్తులకు శివుడు ఎలాంటి వరాలిస్తాడో అమ్మవారు కూడా అంతే దయతో భక్తులను కనికరిస్తుంది.
అమ్మను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే అందుకోసమే కార్తీక మాసంలో తిదియనాడు త్రిలోచనగౌరి వ్రతం చేస్తారు.
ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పూలతో పూజ చేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కొన్ని పద్దతులను పాటించాల్సి వస్తుంతుంది...
_"అవేమిటో గమనిద్దాం"_
🏮 ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు.
ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం.
అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉండాలి.
🏮 "మౌనం" మనస్సును శుద్ధి చేసేది కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి.
🏮 "స్నానం" దేహాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి ఉభయ సంధ్యలలో చన్నిటి స్నానం చేయాలి.
🏮 "ధ్యానం" బుద్దిని శుద్ధి చేస్తుంది కావున నిరంతరం మనం ఏపని చేస్తున్న ధ్యానస్థితిలో ఉంటూ విధ్యుత్ ధర్మాలను నేరవేర్చుకోవాలి...
🏮 "దానం" మనం ఈ భూమి మీదకు వచ్చేప్పుడు ఏమి తేలేదు, పోయేప్పుడు ఎవ్వరు ఏమి తీసుకుపోలేరు.
కావున దేని మీద నాది అని బ్రాంతి చెందక సాధ్యమైనంతలో నీకున్న సంపాదనలో ఎంతో కొంత సాటి జీవుల శ్రేయస్సుకోరకు సహాయ పడాగలగాలి.
🏮 "ఉపవాసం" ఉండాలి దీని వలన ఆరోగ్యాం శుద్ది అవుతుంది.
🏮 "క్షమాపణ" ఎవరైన తెలిసి తెలియక పొరపాటు చేస్తే క్షమించే గుణం ఉండాలి తద్వార మానవ సంబంధాలను బలపరుస్తుంది.
నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వంద మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి.
సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి.
ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి.
కరుగుతున్న కాలానికీ జరుగుతున్న సమయానికీ అంతరించే వయసుకీ మిగలిపోయే జ్ఞాపకమే "మంచితనం" అదే మనకు ఆభరణం.
మనిషిలో "అహం" తగ్గిన రోజు "ఆప్యాయత" అంటే అర్ధం అవుతుంది.
"గర్వం" పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది.
నాలో దైవత్వం ఉండాలని కోరుకోవాలి తప్ప నేనే దేవున్ని అనే గర్వం రానివ్వకుండా వ్యవహరించ గలిగితే ఈ వ్రత ఫలితం దక్కుతుంది.
నిజానికి ఈ పై సూత్రాలు పాటిస్తే ఏ వ్రతం చేయనక్కరలేదు.
సమస్త జీవులలో పరమాత్మను సందర్షించిననాడు నీలో పరమాత్మ అంతర్లీనమై ఉన్నాడని భావం ఆస్థితికి రావడానికి కృషి చేయాలి.
త్రిలోచనా అష్టమి
ఈరోజు *త్రిలోచనా అష్టమి*. శివపార్వతులను పూజించడానికి అనుకూలమైన రోజు. త్రిలోచన అంటే మూడు కన్నులు అని అర్థం. ముక్కంటి శివుడు కాబట్టి శివుణ్ణి ఆరాధించడానికి అనుకూలం అయిన రోజు. శివునిలో అర్ధభాగం పార్వతీ కాబట్టి,శివుని అంతర్ముఖ మూడవ కన్ను పార్వతీ దేవి అని నమ్మకం. దేశంలోని చాలా ప్రాంతాలలో జ్యేష్ఠ మాసంలో బహుళ పక్ష అష్టమి రోజున త్రిలోచన గౌరీ వ్రతం,త్రిలోచన పూజ జరుపుకుంటారు.నవమి రోజున కూడా త్రిలోచన నవమి పేరుతో రేపు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. త్రిలోచన గౌరీ వ్రతం లో మూడు ప్రధాన పూజలు ఆచరిస్తారు. అవి శివాభిషేకం,శివ పార్వతుల పూజ,ఉమా శివాగ్ని పూజ. దంపతులు తమ వైవాహిక,దాంపత్య జీవితం చక్కగా ఉండాలని ఈ రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
గురువారం రేవతీ నక్షత్రం కలయిక ఉండటం వలన *సర్వార్థ సిద్ది యోగం* ఈరోజు రాత్రి 11.17 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయం లో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, క్రొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం.
*ఆకాశంలో చంద్ర శని నెప్ట్యూన్ గ్రహాలు అత్యంత చేరువ గా* ఉదయం 06.41 కి చేరుతాయి. మీన రాశిలో ఇంచు మించు ఒకే ఉత్తర ఆరోహణ క్రమంలో ఈ మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ మూడు గ్రహాలు ఒకదానికి ఒకటి 2°58' డిగ్రీల కోణ స్థితి లో చేరువ అవుతాయి.
ఈ మూడు గ్రహాలు మన కంటికి ఈరోజు రాత్రి 12.56 కి 61° డిగ్రీల ఆగ్నేయ ఆకాశం లో కనిపించడం ప్రారంభం అయ్యి రేపు తెల్లవారి వెలుగు లో అంతర్ధానం అవుతాయి.
*చంద్ర శని గ్రహాల మధ్య సమాగమనం* ఈరోజు ఉదయం 09.27 కి జరుగుతుంది. మీన రాశిలో 0°07' డిగ్రీల ఉత్తర ఆరోహణ క్రమంలో ఈ రెండు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ సమయంలో శని గ్రహానికి ఉత్తర దిశలో 03°23' డిగ్రీల కోణ స్థితి లో చంద్ర గ్రహం చేరువ అవుతుంది.
ఈ రెండు గ్రహాలు మన కంటికి ఈరోజు రాత్రి 12.56 కి 61° డిగ్రీల ఆగ్నేయ ఆకాశం లో కనిపించడం ప్రారంభం అయ్యి రేపు తెల్లవారి వెలుగు లో అంతర్ధానం అవుతాయి.
...సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు...
సుభాషితమ్
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *లోభాత్క్రోధః ప్రభవతి*
*లోభాత్కామః ప్రవర్తతేl*
*లోభాన్మోహశ్చ మాయా చ*
*మానః స్తంభః పరాసుతాll*
*_మహాభారతం - శాంతి పర్వమ్_*
తా𝕝𝕝 *లోభం వలన కోపం కలుగుతుంది. లోభం వల్లనే కామం ఏర్పడుతుంది. ఈ లోభం వల్లనే మోహం, మాయ, అభిమానం, తీవ్రత, పరాధీనత మొదలైన దోషాలు సంభవిస్తాయి.*
✍️🌸🌹💐🙏
⚜ శ్రీ స్వయంభూ గణపతి దేవాలయం
🕉 మన గుడి : నెం 1147
⚜ మహారాష్ట్ర : గణపతిపూలే
⚜ శ్రీ స్వయంభూ గణపతి దేవాలయం
💠 ఆసియా ఖండం అంతటా మరియు ముఖ్యంగా దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో, లెక్కలేనన్ని గణేష్ ఆలయాలు కనిపిస్తాయి! గణపతిపులే వాటిలో ఒకటి!
💠 గణపతిపులే అనే పేరు "గణపతి" లేదా "గణాలు" (సైన్యం) మరియు 'పులే' అంటే ఇసుక దిబ్బల ప్రభువు నుండి వచ్చింది.
ఆ రోజుల్లో, ఈ గ్రామం జనసాంద్రత తక్కువగా ఉండేది.
గ్రామం యొక్క పశ్చిమ భాగం వాలుగా ఉండటం వలన ప్రజలు ఎక్కువగా గ్రామం యొక్క ఉత్తర భాగం చుట్టూ ఉండేవారు. సంరక్షకుడైన మంగళమూర్తి అరబైన్ సముద్రం వెంబడి భారతదేశ పశ్చిమ తీరానికి ఆనుకుని ఉన్న చిన్న గ్రామంలో ఉండటానికి ఇష్టపడ్డాడు
💠 స్థానిక జానపద కథల ప్రకారం, ఒక స్థానిక మహిళ చేసిన వ్యాఖ్యకు ఆగ్రహించిన హిందూ దేవుడు గణపతి, తన అసలు నివాసం అయిన గులే నుండి (పట్టణానికి కొన్ని కి.మీ. ముందు) పూలేకు వెళ్లాడు.
అందువలన, ఈ ప్రాంతానికి గణపతి-పూలే అని పేరు పెట్టారు.
🔆 స్థల పురాణం
💠 ఆలయాలు మరియు దేవతల గురించి వివిధ పురాణాలు ప్రబలంగా ఉన్నాయి. దాదాపు 500 సంవత్సరాల క్రితం, మొఘలుల పాలనలో, కొండ దిగువన ' కేవడ ' (పూల చెట్టు) అడవి ఉండేది, ప్రస్తుతం అక్కడ " స్వయంభూ " గణపతి ఉన్నాడు.
💠 ఇది భారతదేశంలోని ' అష్ట గణపతులలో ' (ఎనిమిది గణపతులు) ఒకటి మరియు దీనిని ' పశ్చిమ ద్వార దేవత ' (పశ్చిమ కాపలా దేవుడు) అని పిలుస్తారు.
🔅 ఆలయం ప్రాముఖ్యత
💠 ఇక్కడ బాలభట్జీ భిడే అనే బ్రాహ్మణుడు నివసించాడు.
ఒకసారి అతను ఒక పెద్ద వ్యక్తిగత విపత్తును ఎదుర్కొన్నాడు, కానీ దృఢ నిశ్చయం ఉన్న వ్యక్తి కావడంతో, తన సమస్య నుండి ఉపశమనం పొందే వరకు ఆహారం మరియు నీటిని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందువల్ల, అతను తపస్సు కోసం నెవాడా అడవిలో ఉండి తన సంరక్షక దేవత " మంగళమూర్తి " అయిన గణేశుడిని పూజించాడు.
💠 ఈ సమయంలో, భిడేకు కలలో ఒక దర్శనం వచ్చింది, అందులో గణేశుడు నా భక్తులందరి కష్టాలను తొలగించడానికి తన " నిరాకర " (శూన్య) రూపంలో ఆగర్గులే (గణేష్ గులే) వద్దకు వచ్చానని చెప్పాడు. కాబట్టి, మీరు ఇక్కడ పూజలు చేసి, ప్రసాదం పొందండి.
💠 అదే సమయంలో, ఆవులలో ఒకటైన భిడే పాలు ఇవ్వడం లేదు, అందుకే గోపకుడు దానిని జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం దేవుని విగ్రహం ఉంచిన ప్రదేశంలో ఆవు పొదుగు నుండి పాలు కారుతున్నట్లు చూసి అతను ఆశ్చర్యపోయాడు.
💠 ఆ గోపకుడు భిడేకి జరిగిన సంఘటన గురించి చెప్పాడు.
ఆ ప్రాంతాన్ని మొత్తం శుభ్రం చేస్తున్నప్పుడు, భిడే తన దర్శనంలో చూసిన గణేష్ విగ్రహాన్ని కనుగొన్నాడు. అందువల్ల, అతను అక్కడ ఒక గడ్డి కొండపై ఒక మందిరాన్ని నిర్మించి, తన మొదటి ఆచారాలను నిర్వహించడం ప్రారంభించాడు.
💠 గణపతిపులే మహారాష్ట్రలోని కొంకణ్ తీరంలో రత్నగిరి జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం.
గణపతిపులే వద్ద ఉన్న 400 సంవత్సరాల పురాతన గణపతి విగ్రహం మట్టి నుండి ఉద్భవించిందని చెబుతారు.
💠 తూర్పు వైపు ఉన్న ఇతర భారతీయ దేవాలయాలలోని దేవతలకు భిన్నంగా, పశ్చిమ ద్వారాలను కాపాడటానికి ఈ దేవత పశ్చిమ దిశగా ఉంటుంది.
ఈ ఆలయం కొండ దిగువన ఉంది మరియు యాత్రికులు గౌరవ చిహ్నంగా కొండ చుట్టూ తిరుగుతారు (ప్రదక్షిణ).
💠 ఈ ఆలయం మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి మరియు ఇది స్వయంభు (స్వయంగా ఉద్భవించే) ఆలయంగా పరిగణించబడుతుంది.
ఈ ఆలయం యొక్క గర్భగుడి సూర్యుని బంగారు కిరణాలతో ప్రకాశిస్తుంది, ఇది దాని ప్రత్యేకతను మరింత పెంచుతుంది.
💠 గణపతిపులే దాదాపు 100 ఇళ్లతో కూడిన చాలా చిన్న పట్టణం, మరియు కొంకణ్ తీరం వెంబడి అత్యంత అద్భుతమైన బీచ్‌లలో ఒకటి - శాంతి కోరుకునేవారు, బీచ్ ప్రేమికులు మరియు యాత్రికులను ఆకర్షించే ఒక అందమైన విహారయాత్ర.
💠 స్వయంభు (స్వయం-ఆవిర్భావం) గణేష్ ఆలయాన్ని ప్రతి సంవత్సరం వేలాది మంది తరచుగా సందర్శిస్తారు.
💠 గణపతిపులే ముంబై నుండి 350 కి.మీ దూరంలో ఉంది
Rachana
©️ Santosh Kumar
18-21-గీతా మకరందము
18-21-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అII రాజసజ్ఞానమును చెప్పుచున్నారు-
పృథక్త్వేన తు యజ్జ్ఞానం
నానా భావాన్పృథగ్విధాన్
వేత్తి సర్వేషు భూతేషు
తజ్జ్ఞానం విద్ధి రాజసమ్
తా:- ఏ జ్ఞానమువలన మనుజుడు సమస్తప్రాణులందును వేర్వేరువిధములుగ నున్న అనేక జీవులను వేర్వేరుగా నెరుంగుచున్నాడో, అట్టి జ్ఞానమును రాజసజ్ఞానమని తెలిసికొనుము.
వ్యాఖ్య:- ప్రపంచమునగల ప్రాణులలో "వీడువేఱు, వీడువేఱు - అని యీ ప్రకారముగ అనేకత్వమును జూచుట ఉత్తమజ్ఞానముకాదు. అది రాజసమేయగును. అట్టి జ్ఞానముకలవా రొకవ్యక్తిని చూచినపుడు ఆతని గుణమును పరికించుదురేకాని ఆత్మను కాదు. కనుకనే వారు వ్యక్తులలో భిన్నత్వమును జూచుదురు. ఇట్టి రాజసజ్ఞానమునే యిపుడు ప్రపంచమున పెక్కురు కలిగియుండుచున్నారు. ఏలయనగా వారు ప్రాణులలో భిన్నత్వమునే గాంచుచున్నారు. కావున అద్దానిని తొలగించుకొని అద్వైతభావమును, సమదృష్టిని అవలంబించవలెను (దిండ్లపై గలీబులపై దృష్టినుంచక లోనగలదూదిపైననే దృష్టిగలిగి యుండునట్లు).
ప్ర:- రాజసజ్ఞానముయొక్క లక్షణమేమి?
ఉ:- ప్రపంచములో అనేకత్వమునుజూచుట, సర్వజీవులందును " వీడు వేఱు, వీడు వేరు" అను భేదభావము గలిగియుండుట.
18-21-గీతా మకరందము
18-21-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అII రాజసజ్ఞానమును చెప్పుచున్నారు-
పృథక్త్వేన తు యజ్జ్ఞానం
నానా భావాన్పృథగ్విధాన్
వేత్తి సర్వేషు భూతేషు
తజ్జ్ఞానం విద్ధి రాజసమ్
తా:- ఏ జ్ఞానమువలన మనుజుడు సమస్తప్రాణులందును వేర్వేరువిధములుగ నున్న అనేక జీవులను వేర్వేరుగా నెరుంగుచున్నాడో, అట్టి జ్ఞానమును రాజసజ్ఞానమని తెలిసికొనుము.
వ్యాఖ్య:- ప్రపంచమునగల ప్రాణులలో "వీడువేఱు, వీడువేఱు - అని యీ ప్రకారముగ అనేకత్వమును జూచుట ఉత్తమజ్ఞానముకాదు. అది రాజసమేయగును. అట్టి జ్ఞానముకలవా రొకవ్యక్తిని చూచినపుడు ఆతని గుణమును పరికించుదురేకాని ఆత్మను కాదు. కనుకనే వారు వ్యక్తులలో భిన్నత్వమును జూచుదురు. ఇట్టి రాజసజ్ఞానమునే యిపుడు ప్రపంచమున పెక్కురు కలిగియుండుచున్నారు. ఏలయనగా వారు ప్రాణులలో భిన్నత్వమునే గాంచుచున్నారు. కావున అద్దానిని తొలగించుకొని అద్వైతభావమును, సమదృష్టిని అవలంబించవలెను (దిండ్లపై గలీబులపై దృష్టినుంచక లోనగలదూదిపైననే దృష్టిగలిగి యుండునట్లు).
ప్ర:- రాజసజ్ఞానముయొక్క లక్షణమేమి?
ఉ:- ప్రపంచములో అనేకత్వమునుజూచుట, సర్వజీవులందును " వీడు వేఱు, వీడు వేరు" అను భేదభావము గలిగియుండుట.
మహాభారతము
*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*శల్య పర్వము ప్రథమాశ్వాసము*
*412 వ రోజు*
*కురుపాండవ సమరం*
సుయోధనుడు ధృష్టద్యుమ్నుని ఎదుర్కొని వాడి అయిన అయిదు బాణములు ధృష్టద్యుమ్నుడి మీద వేసాడు. ధృష్టద్యుమ్నుడు ప్రతిగా సుయోధనుడి మీద డెబ్బై బాణాలను ప్రయోగించాడు. అది చూసిన సుయోధనుడి తమ్ములు అన్నకు సాయంగా వచ్చి ధృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నారు. ధృష్టద్యుమ్నుడు కోపించి వారి మీద వాడి అయిన బాణములు ప్రయోగించాడు. శిఖండి ప్రభద్రకులు కృపాచార్యుడు, కృతవర్మలను ఎదుర్కొన్నారు. శల్యుని నకులసహదేవ, భీమ, ధర్మరాజాదులు ఎదుర్కొని సమరం సాగిస్తున్నారు. పోరు ఘోరంగా సాగుతుంది. నకులుడు శల్యుని మీద పది బాణములు వేసాడు. శల్యుడు నకులుని మీద మూడు బాణములు ప్రయోగించి నకులుడి విల్లు విరిచాడు. అయిదుగురు యోధులూ శల్యుని ఎదుర్కొన్నారు. శల్యుడు జంకక వారందరిని తన బాణములతో నొప్పించాడు. సుయోధనుడు తన సైన్యముతో శల్యునికి సాయంగా వచ్చాడు. కృష్ణార్జునులు తమ సైన్యములను ఒక చోట సమీకరించారు. అర్జునుడు కృపాచార్యుని, సహదేవుడు శకునిని, ఉపపాండవులు కౌరవ పక్షాన పోరాడుతున్నమిత్రరాజుల్ను, శిఖండి అశ్వత్థామను, భీముడు సుయోధనుని, ధర్మరాజు నకులుడితో చేరి శల్యుని ఎదుర్కొన్నారు. ఇరు పక్షముల మధ్య ఘోరంగా పోరు సాగుతుంది. శల్యుడు అంతటా తానే అయి సమరం సాగిస్తున్నాడు. మధ్యాహ్న సూర్యుడికి ప్రతిబింబంలా వెలిగి పోతున్న శల్యుడి పరాక్రమానికి పాండవసేనలు ఆగ లేక వెనుకంజ వేస్తున్నాయి. అది చూసి ధర్మరాజు చేతులు ఊపుతూ సైన్యాలను ఉత్సాహపరచి తమ్ములను దగ్గరకు పిలిచి " మీరంతా మీమీ పరాక్రమానికి అనుగుణంగా భీష్మ, ద్రోణ, కర్ణాది యోధులను చంపారు. ఈ రోజు నేను మహా వీరుడైన శల్యుడిని చంపుతాను. ఎలాగంటే నారధముకు కుడి వైపున నకులుడు, సాత్యకి ఎడమ వైపున సహదేవుడు, ధృష్టద్యుమ్నుడు రక్షణగా ఉంటారు. వెనుక అర్జునుడు, ముందు భీముడు ఉంటారు. ఎందుకంటే శల్యుడికి రక్షణగా కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకుని నిలుస్తారు " అన్నాడు. ధర్మరాజు చెప్పినట్లే ధృష్టద్యుమ్నుడు, పాండవులు నిలిచారు. అది చూసిన సుయోధనుడు శల్యునికి రక్షణగా కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామ, శకునులను నిలిపాడు. ధర్మరాజు శల్యుని ఎదుర్కొన్నాడు పోరు ఘోరంగా సాగుతుంది.
*శల్యవధ*
అర్జునుడు కృపాచార్యుని, కృతవర్మను ఎదుర్కొన్నాడు. శల్యుని సైన్యం ధర్మరాజును చుట్టుముట్టింది. ధర్మరాజు కోపంతో విజృంభించాడు. రథములు విరుగుతున్నాయి. గజములు, హయములు కుప్పలుగా చచ్చి పడుతున్నాయి. రణరంగం అంతా బీభత్సంగా ఉంది. ధర్మరాజు శల్యుడు తమ శంఖములు పూరించి యుద్ధముకు తలపడ్డారు. ఒకరి మీద ఒకరు అస్త్రప్రయోగం చేసుకుని శరీరాలను రక్తసిక్తం చేసుకున్నారు. శల్యుడు ధర్మరాజు విల్లు విరిచాడు. ధర్మరాజు మరొక విల్లు తీసుకుని శల్యుడి విల్లు విరిచి ఎడతెరిపి లేకుండా మూడు వందల బాణములు వేసి శల్యుని హయములను చంపి, కేతనము విరిచాడు. శల్యుడు రథము మీద కూలబడ్డాడు. ఆది చూసిన ఆశ్వత్థామ శల్యుడిని తన రథము మీదకు ఎక్కించి తీసుకు వెళ్ళాడు. శల్యుడు పడిపోగానే ధర్మరాజు పొలికేకలు పెడుతూ విజృంభించాడు. కౌరవ సేనలను ఎదుర్కొని తరుముతున్నాడు. ఇంతలో శల్యుడు మూర్ఛ నుండి తేరుకుని మరి ఒక రథము మీద ఎక్కి ధర్మజుని ఎదుర్కొన్నాడు. తనను ఎదుర్కొన్న ధృష్టద్యుమ్న, నకుల సహదేవ, సాత్యకులను వాడి అయిన బాణములతో కొట్టి తప్పించి తిరిగి ధర్మరాజును ఎదుర్కొన్నాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
వ్యవసాయ ముహుర్తాలు -
ప్రాచీన జ్యోతిష్య గ్రంధాలలో వివరించిన వ్యవసాయ ముహుర్తాలు -
* శ్రవణ , ధనిష్ట, శతభిష , చిత్త, స్వాతి , విశాఖ , అనూరాధ , రేవతి , అశ్వని , పునర్వసు, మృగశిర, పుష్యమి నక్షత్రముల యందు తారాబలం చూసి డబ్బులు చెల్లించవలెను.
* మూల, అనూరాధ , రేవతి , స్వాతి , ఉత్తర, ఉత్తరాషాఢ , ఉత్తరాభాద్ర, పుష్యమి, శ్రవణం , విశాఖ ఈ నక్షత్రముల యందు విత్తనాలు విత్తుకొనవలెను.
* బుధవారం 3 భాగములు , మంగళవారం 8 భాగములు , అదివారం 10 భాగములు, సోమవారం 16 భాగములు , శనివారం 20 భాగములు ఆయా వారాలలో గింజల రాసిని కొలిచిన నశించును. కావున గురు, శుక్రవారములలో గింజల రాసిని కొలవవలెను.
* స్వాతి , పుష్యమి, అశ్విని, విశాఖ, శ్రవణము, ధనిష్ట , శతభిషము, పునర్వసు ఈ నక్షత్రముల యందు ఆది, సోమ , గురు, శుక్ర, శనివారముల యందు 5 , 8 , 9 ఈ స్థానములలో పాపగ్రహములు లేని లగ్నముల యందు వ్యవసాయ ఋణము చేసిన త్వరగా తీరిపోవును.
* నంద పూర్ణ తిధులు గల, గురుశుక్ర వారములు , మూల , మృగశిర, పుబ్బ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర , ఆశ్రేష , మఖ, రేవతి , విశాఖ , అనూరాధ , పునర్వసు నక్షత్రముల యందు భూములు కొనుగోలుచేయుట , అమ్ముట శుభకరం.
* రేవతి , ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాబాద్ర, రోహిణి , హస్త, పుష్యమి, మూల, మృగశిర, స్వాతి , జ్యేష్ఠ, అశ్విని నక్షత్రముల యందు , గురు,శుక్ర, సోమ , బుధవారముల యందు , కన్య , కర్కాటక , మిథున, మీన , మకర లగ్నముల యందు ఏరువాక , వృక్షచేధన , బీజాలను నాటుట కార్యక్రమాలు శుభప్రదం .
* నంద, భద్ర తిథుల యందు , సింహ, ధనుర్లగ్నముల యందు , భరణి, హస్త, చిత్త, స్వాతి , విశాఖ , అనూరాధ , మఖ, ఆశ్రేష , ఆర్ధ , అశ్విని , పూర్వత్రయ నక్షత్రముల యందు పశువులు పశుశాలలో ప్రవేశించుట శుభకరం.
* ఆది , సోమ , గురువారముల యందు ఆర్ద్ర , మృగశిర , మూల, పూర్వాభాద్ర, కృత్తికా నక్షత్రముల యందు పశువులును కట్టుట శుభకరం.
* భరణి, ఆశ్రేష , శ్రవణము, చిత్తా నక్షత్రముల యందు , శనివారం నాడు, అమావాస్య , అష్టమి,
షష్టి తిథుల యందు ఎద్దులు కట్టవలెను.
* భరణి, ఆరుద్ర, కృతిక, అనూరాధ , మూల, మఖ, పునర్వసు , చిత్త, మృగశిర ఈ నక్షత్రముల యందు , మంగళ , ఆది , శనివారముల యందు పశువులను కొనుటకు వెళ్లవలెను.
* స్వాతి , మూల, విశాఖ, రేవతి , శ్రవణము, జ్యేష్ట, ధనిష్ట ఈ నక్షత్రముల యందు పశువులను కొనుట శుభకరం.
* ధనిష్ట, జ్యేష్ట, మృగశిర, రేవతి , విశాఖ , ఆశ్రేష , మఖ, అశ్విని , పూర్వత్రయ ఈ నక్షత్రముల యందు పశువులను అమ్మినవారికి మరియు కొన్నవారికి శుభప్రదం.
* గురువారంతో కూడిన పుష్యమి నక్షత్రము నందు వృషభ లగ్నము నందైనను , వృషభాoశం యందైనను పశుశాల నిర్మించినచో మృగ, చోర బాధలు లేకుండా ఆ పశుశాల యందు ఉండు పశువులు సుఖంగా ఉంటాయి.
* అశ్విని, భరణి, రోహిణి , పునర్వసు , హస్త, విశాఖ , జ్యేష్ట, శతభిష , రేవతి ఈ నక్షత్రముల యందు , ఆది , గురువారముల యందు గిత్తలచే కొత్తగా దున్నించవచ్చు .
* 8 , 4 , 9 , 14 ఈ తిథుల యందు , శనివారం నందును, భరణి, రోహిణి , చిత్త, శ్రవణము , ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాడ, ఆశ్లేష ఈ నక్షత్రముల యందు దున్నపోతులచే దుక్కి దున్నించడం మంచిది .
* అశ్విని, రోహిణి , మఖ, ఉత్తరాత్రయ , హస్త, చిత్త , స్వాతి , అనూరాధ , మూల, ధనిష్ట, రేవతి ఈ నక్షత్రముల యందు ఆది , మంగళ , బుధ , శుక్ర వారముల యందు 2 , 3 , 5 , 7 , 10 , 11 తిథుల యందు కొత్తభూమిలో వ్యవసాయ పని ప్రారంభించుటకు శుభకరం.
* విత్తనములు చల్లుట ఆరంభించిన మేషలగ్నము నందు పశునాశనం , కర్కాటకం నందు, బహుఫలం , తుల యందు ప్రాణహాని, మకరం నందు సస్యహాని, సింహ లగ్నం అందు చోరభయం , కుంభం నందు అధిక భయం , కన్య , వృషభ , మీన , మిథున , వృశ్చిక , ధనుర్లగ్నముల యందు ధాన్యసమృద్ధి , శుభప్రదం కలుగును.
* ఆదివారము సింహ లగ్నం నందు సర్వబీజములు చల్లవచ్చు . సోమవారం మిథున లగ్నం నందు రాజనపు ధాన్యం విత్తనాలు చల్లవచ్చు. మంగళవారము మేష , వృశ్చిక లగ్నముల యందు కొర్ర ధాన్యములను , బుధవారం మిధున, కన్య లగ్నముల యందు పోక చెట్లు తోట స్థాపించవలెను.
* గురవారం , ధనుర్మాసముల యందు మామిడి మొదలగు ఫలవృక్షములు నాటవలెను. శుక్రవారమున , తుల , వృషభముల యందు మల్లె మొదలగు పూలచెట్లు నాటవలెను.
* శనివారమున మకర , కుంభముల యందు నువ్వులు మొదలగునవి చల్లవలెను.
* మూల, శ్రవణము, మృగశిర, పునర్వసు , ధనిష్ట , రేవతి , రోహిణి , అనూరాధ , స్వాతి , ఉత్తరత్రయ ఈ నక్షత్రముల యందును, కర్కాటక, ధనుస్సు, తుల, వృషభము, సింహము, వృశ్చికం, కుంభం ఈ లగ్నముల యందు , బుధ , గురు, శుక్రవారముల యందు సెనగ, గోధుమ, కంది విత్తనములు చల్లుట ఫలప్రదము.
* శుభతిథుల యందు బుధ , గురు, సోమవారముల యందు , రోహిణి , అశ్విని, పుష్యమి, పునర్వసు , హస్త, మూల, స్వాతి, శతభిషము , ఉత్తరాత్రయము , రేవతి నక్షత్రముల యందు , కన్య, కర్కాటక, వృషభ, మిథున, మీన , మకర లగ్నముల యందు సమస్త ఫల వృక్షములు నాటవచ్చు. వివిధ విత్తనములు నాటవచ్చు , పొలము దున్నవచ్చు, భూమి సంపూర్ణ ఫలప్రదం అగును.
* హస్త, చిత్త, విశాఖ , మూల, శతబిషం , స్వాతి , ఉత్తరాబాద్ర, ఉత్తరాషాడ, రోహిణి , జ్యేష్ట, అశ్విని, పునర్వసు , పుష్యమి, అనూరాధ , కృత్తిక , పుబ్బ, పూర్వాషాఢ , పూర్వాభాద్ర ఈ నక్షత్రముల యందు గురు, సోమ , బుధ , శుక్రవారముల యందు సమస్తమైన తోటలు వేయవచ్చు.
* పుష్యమి, అశ్విని, హస్త, మృగశిర, అనూరాధ , మూల ఈ నక్షత్రముల యందు చెరుకు తోటలు వేసిన ఫలవంతములు అగును.
* పుష్యమి, ఉత్తరాబాద్ర, మఖ, అశ్విని, రేవతి , అనూరాధ , ఉత్తర ఈ నక్షత్రముల యందు మేష, వృశ్చిక, వృషభ , కన్యా లగ్నముల యందు 3 , 5 , 7 , 15 తిథుల యందు , బుధ , గురు, శుక్ర వారముల యందు రేగు , అరటి, పనస , మామిడి తోటలు వేయవలెను .
* భరణి, శ్రవణము, స్వాతి , మఖ, మూల, రేవతి , ధనిష్ట, అశ్విని, ఈ నక్షత్రముల యందు వంగ నారు నాటినచో మంచిఫలితం కలుగును.
* హస్త, అశ్విని, పుష్య, ఉత్తర, ఉత్తరాషాడ , ఉత్తరాబాద్ర, రోహిణి , చిత్త, అనూరాధ , మృగశిర, రేవతి , స్వాతి , ధనిష్ట, మఖ, మూల ఈ నక్షత్రముల యందు అంట్లు కట్టినచో బాగుగా ఫలించును.
* స్వాతి , పుష్యమి, అశ్విని, శతబిషం , మూల, విశాఖ ఈ నక్షత్రముల యందు సమస్తమైన తీగలు పాదులు పెట్టిన బాగుగా కాయును .
* రేవతి , ఉత్తర, రోహిణి , పుష్య, హస్త, పునర్వసు, మూల, స్వాతి , శతబిషం , అశ్విని ఈ నక్షత్రముల యందు , సోమ , బుధ , గురు, శుక్రవారముల యందు , కన్య, కర్కాటక, మిథున,మీన , ధనస్సు , వృషభ లగ్నముల యందు , శుభ తిథుల యందు సమస్తమైన చెట్లు నాటవచ్చు. సమస్త బీజములు చల్లుటకు , పొలం దున్నుట ప్రారంభించుటకు శుభప్రదం .
* మృగశిర, పుష్యమి, ఆరుద్ర, అశ్విని, భరణి, స్వాతి ఈ నక్షత్రముల యందు , శుభతిథుల యందు , ఆది , మంగళ , గురువారం ల యందు పొగాకు తోటలు వేసిన చక్కగా ఫలించును.
* రేవతి , అశ్విని , అనూరాధ , స్వాతి , శతబిషం, పునర్వసు, జ్యేష్ట, శ్రవణం , పుష్యమి, మూల, హస్త, ఉత్తర, మృగశిర నక్షత్రముల యందు , ఆది , సోమ , బుధ , గురు , శుక్రవారముల యందు , సూర్యోదయ కాలం నందు , ఉల్లితోట, కంది తోటలు పైరు పెట్టుటకు మంచిది .
* పునర్వసు , భరణి, హస్త, పుష్యమి, స్వాతి , అశ్విని, రేవతి , మూల ఈ నక్షత్రముల యందు , 2 , 3 , 5 , 7 , 10 , 13 తిథుల యందు , సోమ , బుధ , గురు, శుక్రవారముల యందు , గురు, బుధులు కేంద్రముల యందు ఉండగా ప్రత్తిపైరు పెట్టుట మేలు .
* పుష్యమి, అశ్విని, హస్త, మృగశిర, అనూరాధ , మూల నక్షత్రముల యందు , బుధ , గురు, శుక్రవారముల యందు , స్థిరలగ్నముల యందు , శుభతిథుల యందు ఖర్జూర,పోక , కొబ్బరితోటలు వేసినచో ఫలప్రదం అగును.
* మూల, ఉత్తర, ఉత్తరాషాడ , ఉత్తరాబాద్ర, శ్రవణము,మృగశిర, పునర్వసు, ధనిష్ట, రేవతి , రోహిణి , అనూరాధ , స్వాతి ఈ నక్షత్రముల యందు , స్థిర లగ్నముల యందు బుధ , గురు, శుక్ర వారముల యందు చేనుకోసి కోసిన సస్యములను కుప్పలు వేయవచ్చు .
* కృత్తిక , మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, హస్త, మూల , శ్రవణము , ధనిష్ట ఈ నక్షత్రముల యందు కుప్పలు నూర్చుట మంచిది .
* చిత్త, రేవతి , మృగశిర, అనూరాధ , అశ్విని, పుష్యమి, హస్త ఈ నక్షత్రముల యందు , సోమ , గురు, శుక్రవారముల యందు , పూర్ణ తిథుల యందు , చంద్రతారాబల యుక్తమును చూచి కొత్తగింజలు ఇంటికి తెచ్చుకొనుట మంచిది .
* మఖ, పుబ్బ, అనూరాధ , జ్యేష్ట, మూల, రేవతి ఈ నక్షత్రముల యందు సింహ లగ్నము నందును ధాన్యము దంచుట ఫలప్రదము .
* రోహిణి , ధనిష్ట, శతబిషం, ఉత్తర, ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర ఈ నక్షత్రముల యందు ధాన్యం అమ్ముట మంచిది .
* మంగళ , శుక్రవారములు, పూర్ణిమ, అమావాస్య , నవమి, చవితి తిథులు , గ్రహాదినములు పనికిరావు . ఈ దినములలో కాయలు కోసిన పాదులు చెడిపోవును.
* అశ్విని, రేవతి , అనూరాధ , హస్త, పుష్యమి, మృగశిర ఈ నక్షత్రముల యందు గానుగ మొదలుపెట్టవచ్చును.
* 2 , 3 , 5 , 7 , 8 , 10 , 12 , 13 , 15 ఈ తిథుల యందు , గురు, శుక్రవారముల యందు, ఉత్తరత్రయ , పూర్వత్రయ, రోహిణి , మృగశిర, పుష్యమి, హస్త, చిత్త, అనూరాధ , రేవతి , అశ్విని నక్షత్రముల యందు , వృషభ, మిథున, సింహ, కన్య,ధనస్సు , కుంభ , మీన లగ్నముల యందు కొత్తగింజల రాశి కొలుచుటకు మంచిది .
* గురువారం , శుక్ర వారం నందు రాశి కొలుచుట మంచిది .
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
. కాళహస్తి వేంకటేశ్వరరావు
. అనువంశిక ఆయుర్వేద వైద్యులు
. 9885030034
రామాయణం
🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹
*🌷గురువారం 19 జూన్ 2025🌷*
``
*రామాయణం*
ఒకసారి చదివినంత
మాత్రాన మన సమస్త
పాపాలని తీసేస్తుంది.``
*వాల్మీకి రామాయణం*
*73వ భాగం*
```
సీతమ్మ తన జుట్టుని ఆ శింశుపావృక్షం యొక్క కొమ్మకి గట్టిగా బిగించి చనిపోదామని సిద్ధపడుతున్న తరుణం లో ఆమెకి శుభశకునములు కనపడ్డాయి.
సరోవరంలో నీటి పైభాగమునందు అరవిసిరిన తెల్ల పద్మమునకు నీటి లోపలికి కాడ ఉంటుంది. ఆ నీటిలోకి ఉండిపోయిన కాడ పక్కకి ఒక చేప వచ్చి నిలబడింది. ఆ చేప అక్కడినుంచి వెళ్ళిపోయేముందు తన తోకని కదిపి వెళ్ళిపోయింది. అప్పుడా తోక వెళ్ళి ఆ పద్మము యొక్క కాడకి తగలడం వలన ఆ కాడ కదిలింది, కాడతోపాటు పైన ఉన్న పువ్వు కూడా కదిలింది. ఆ పువ్వు ఎలా కదిలిందో సీతమ్మ కన్ను కూడా ఆ సమయంలో అలా అందంగా అటూ ఇటూ కదిలింది.
అప్పటిదాకా పైన ఉండి సీతమ్మని చూస్తున్న హనుమంతుడు అనుకున్నాడు… 'ఈశ్వరానుగ్రహం చేత నాకు సీతమ్మ దర్శనం అయ్యింది. రావణుడిని చూశాను, రావణుడు సీతమ్మతో మాట్లాడిన మాటలు విన్నాను, త్రిజటా స్వప్నం విన్నాను. సీతమ్మని జగన్మాతగా తెలుసుకున్నాను. నేను సీతమ్మని చూశాను అన్న విషయాన్ని ఇప్పుడే వెళ్ళి రాముడికి చెప్పలేను, ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఉరి పోసుకుంటోంది. నేను ఇప్పుడు సీతమ్మని ఓదార్చాలి. ఇప్పుడు నేను అమ్మని ఓదార్చి మాట్లాడకుండా వెళ్ళిపోతే, రేపుపొద్దున్న సీతమ్మ ఉరి పోసుకొని చనిపోయిందన్న విషయం రాముడికి తెలిస్తే ఆయన బాణముల చేత ఈ సమస్త బ్రహ్మాండములను క్షోభింప చేస్తాడు. నేను చాలా పండితుడని అనుకున్న వివేచనాశీలత లేని మంత్రి చేత, దూత చేత కార్యములు చెడిపోతాయి. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? నేను గట్టిగా మాట్లాడితే చుట్టూ ఉన్న ఈ రాక్షస స్త్రీలు నా మాటలని విని, నా మీదకి వస్తారు. అప్పుడు నాకు-వాళ్ళకి యుద్ధం జరుగుతుంది.
జయాపజయములను విధి నిర్ణయిస్తుంది. కాని రాముడు లంకా పట్టణాన్ని చేరేలోపల నేను చేసిన అల్లరి చేత సీతమ్మని రావణుడు వేరొకచోట దాచవచ్చు.
ఇప్పుడు నేను వానర భాషలో మాట్లాడితే సీతమ్మకి ఆ బాష అర్ధం కాదు. మనుష్య భాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తు పడతారు. వానరరూపంలో ఉన్న నేను మనుష్య భాషలో మాట్లాడితే, ఇది కచ్చితంగా రావణ మాయే అని భయపడి సీతమ్మ ఇంకా గట్టిగా ఉరి బిగించుకుంటుంది. నా కారణంగా సీతమ్మ ప్రాణాలను విడిచిపెడితే ఆ పాపం నాకు అంటుకుంటుంది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఏమి మాట్లాడి సీతమ్మని ఓదార్చాలి?” అని అనుకుంటూ, "సీతమ్మ ఉరి పోసుకోవడం మానేసి నా వైపు చూడాలంటే రామనామం ఒక్కటే మార్గము. సీతమ్మకి చాలా ఇష్టమైన రామ కథని చెబుతాను" అని అనుకొని హనుమంతుడు రామ కథ చెప్పడం ప్రారంభించాడు…
“పూర్వకాలం కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజు పరిపాలించేవాడు. విపరీతమైన ఐశ్వర్యాన్ని సంపాదించివాడు, ఇంద్రుడితో సమానమైనవాడు, ఇతరుల ధర్మాన్ని రక్షించే స్వభావం ఉన్నవాడైన దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తే పెద్ద కుమారుడిగా రాముడు జన్మించాడు. ఆ దశరథుడు చేసిన ప్రతిజ్ఞ నిలబడేటట్టు చెయ్యడం కోసమని,ఆయనని సత్యవాక్యమునందు నిలపడం కోసమని 14సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడానికి రాముడు వెళ్ళాడు. రాముడిని విడిచిపెట్టి ఉండలేక ఆయనని నిరంతరము అనుగమించేటటువంటి స్వభావము కలిగిన లక్ష్మణుడు రాముడి వెనకాల వెళ్ళాడు. పతిసేవ తప్ప వేరొకటి నాకు అవసరంలేదు అనే స్వభావం ఉన్న సీతమ్మ రాముడి వెనకాల వెళ్ళింది. అలా రాముడు లక్ష్మణుడితో, సీతమ్మతో దండకారణ్యంలో ఉండగా ఒకనాడు జనస్థానంలో 14,000 మంది రాక్షసులని సంహరించాడు. దానిచేత కినుక చెందిన పదితలల రావణుడు మాయ జింకని ప్రవేశపెట్టి రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని అపహరించాడు. తదనంతరం సీతమ్మని అన్వేషిస్తూ వెళ్ళిన శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి, వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఈనాడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడి చేత అన్ని దిక్కులకీ వానరములు పంపబడ్డాయి. దక్షిణ దిక్కుకి వచ్చిన వానరములలో ఒకడినైన హనుమ అనే పేరుగల నేను 100 యోజనముల సముద్రాన్ని దాటాను. సీతమ్మ ఎలాంటి కాంతితో, ఎలాంటి నగలతో, ఎలాంటి వస్త్రంతో ఉంటుందని రాముడు నాకు చెప్పాడో, అలాంటి సీతమ్మని ఈ శింశుపా వృక్షం మీదనుంచి ఇక్కడే కిందకి చూసి నేను ధన్యుడనయ్యాను" అని చెప్పి ఆగిపోయాడు.
ఇంతవరకూ వినపడని రామనామం వినపడేసరికి సీతమ్మ అప్రయత్నంగా తన మెడకి చుట్టుకున్న జుట్టుని విప్పేసింది.
ఆ కథని విన్న ఆనందంలో పరమ సంతోషంగా సీతమ్మ శింశుపా వృక్షం వైపు చూసింది. సీతమ్మ చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా, దగ్గర దగ్గరగా వచ్చి, కాళ్ళతో కొమ్మని పట్టుకొని, చేతులతో ఆకులని పక్కకి తొలగించి, తెల్లటి వస్త్రములను ధరించినవాడై, పింగళ వర్ణంతో, పచ్చటి నేత్రాలతో, పగడాల మూతిలాంటి మూతితో రామ కథ చెబుతున్న సుగ్రీవుడి సచివుడైన హనుమంతుడు సీతమ్మకి దగ్గరగా కనబడ్డాడు. అలా ఉన్న హనుమని చూడగానే సీతమ్మ స్పృహ కోల్పోయి నేలమీద పడిపోయింది.```
*రేపు…74వ భాగం*
*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*
*🙏జై జై శ్రీ రామ్.!🙏*
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏
నన్నయ రచనా వైశిష్ట్యం:
🙏 నన్నయ రచనా వైశిష్ట్యం: 🙏
ఆది కవి నన్నయ. రాజమహేంద్రపుర నివాసి. పద్య విద్యకు ఆద్యుడు వంటివాడు. ఎంతో ప్రసాద గుణ మాధుర్యంతో, చెవికి ఇంపైన పదాలతో ప్రశాంత గంభీరంగా సాగిపోయే ధారతో - తెలుగు పద్య సౌందర్యం వెలార్చింది ఆయన చేతిలోనే. అంత ప్రసన్నంగా, అంత సుభగంగా, అంత మార్ధవంతో నన్నయ తర్వాత పద్యం రాయలేదంటే అతిశయోక్తి లేదు. "విశ్వశ్రేయహ కావ్యం.."- కావ్యం విశ్వ శ్రేయము. రసాత్మకమైనదే వాక్యము. కవులు ఏవిధంగానైనా రసాన్ని సాధించవలసివుంది. నన్నయ ప్రారంభించిన మహాకావ్యం - పంచమవేదం. మహాభారతం - మనః ప్రీతం.
నన్నయ శైలి:
కథాగమన క్లిష్టత గాని, వక్రత గాని, అతి సంకుచిత తత్వము, అతి విస్తృతి గాని లేకుండా ప్రసన్నముగా, నిర్విఘ్నముగా నడుపగలిగాడు. ఈ ప్రజ్ఞ నన్నయకే సొంతం. ఒక్క శైలిలోనే కాదు. కథ నడుపుట లో కూడా నన్నయ శైలి భిన్నం. ఆది పర్వము నందలి శకుంతలోపాఖ్యానము, అరణ్య పర్వము నందలి లోపాఖ్యానమును పోల్చిన ఆ తారతమ్యము మనకర్ధమవగలదు.
నన్నయ భాష - ఆత్మీయత:
"ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని …." మొదలుపెట్టిన నన్నయ తన మహాభారతాన్ని ఎలా రాయాలనుకున్నాడో మనకి అక్కడే వివరించాడు. శబ్ద సంగ్రహమునే కాక, వాక్య రచనలో కూడా నన్నయ చాలావరకు సంస్కృత సాంప్రదాయమునే అనుసరిం చెను.
పద్య విశేషాలు:
ఆది, సభా, అరణ్య పర్వాల లో 3906 గద్య, పద్యాలు దాదాపు అన్నీ వృత్తాలు ఒకే ప్రసన్నతను వెలువరిస్తాయి. తిక్కన మాటల్లో నన్నయ" విద్యా దయితుండు…". నన్నయ పద్యాల్లోని ఆ ప్రసాద మాధుర్యాలకు కారణం ఎక్కువగా సంస్కృత పదాలు వాడటం అంటే కొంతవరకు నిజం. సంస్కృత పదాలు దట్టించి తెలుగు పద్యాలు వ్రాసిన వారు చాలామంది ఉన్నారు. కానీ నన్నయ ఏరుకున్న సంస్కృత పదాలు చాలా మృదువైనవి. ఒక్క పూలమాలలోని పూలన్నీ దారాన్ని లాగితే ఎలా విడి పోతాయో అలా ఉంటాయి నన్నయ పద్యాలు. ఉదా: జలధి, విలోల,వీచి, విలసిత, కల, కంచి, సమంచిత,అవనీ……
నన్నయ మాటల్లో అతని గురించి విశేషణాలు:
చాళుక్య రాజ్య వంశమునకు కుల బ్రాహ్మణుడు.
అవిరళ జప,హోమ తత్పరుడు.
నానా పురాణ విజ్ఞాన నిరతుడు.
ధర్మే తరము లైన వాక్యములు ముట్టని వాడు.కాలము: క్రీ. శ.1060 ప్రాంతం.కావ్య రచనలో సహాయమందించింది - నారాయణభట్టు - వీరిద్దరిదీ కృష్ణార్జున మైత్రి.
ఇతర కృతులుగా చెప్పబడేవి 1. చాముండికా విలాసం 2. ఇంద్ర విజయము.
సమకాలికులుగా చెప్పబడే వారు - 1. అధర్వణుడు 2. భీమకవి.
నన్నయ కవితా రీతులు:
నన్నయ్య ఆంధ్ర మహాభారతం ప్రారంభంలో అవతారికని రచించాడు. దాని నుంచి కృతి భర్త, కృతి కర్త ఇత్యాది విషయాలే కాకుండా తన భారత రచన ఏ యే విశేషాలతో సాగిందో ఈ క్రింది పద్యం ద్వారా వివరించాడు. (కుమా రాస్త్ర విద్యా ప్రదర్శన - షష్టా శ్వాసము - ఆదిపర్వము)
ఉ. సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకలితార్థయుక్తి లో
నారసిమేలునా, నితరు లక్షరరమ్యత నాదరింప నా నా రుచిరార్ధ సూక్తి నిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
భారత్ సంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్. (ఆది. 1-26)
పై పద్యంలో నన్నయ మూడు కవిత గుణాలను వ్యక్తీకరించాడు.
1. ప్రసన్న కథా కలితార్థ యుక్తి, 2. అక్షర రమ్యత 3. నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం
1. ప్రసన్న కథా కలితార్థ యుక్తి (ప్రసన్నత+అర్థ యుక్తి):
ప్రసన్నమైన కథలతో కూడిన అర్థ యుక్తి ప్రసన్న కథాకలితార్థయుక్తి. ప్రసన్నత అంటే నిర్మలత్వం. కథలో సువ్యక్త స్థితి కల్పించటం. కుమార్రాస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టం ఆంధ్ర మహాభారతంలో మూలానుసారంగానే జరిగింది. ప్రదర్శన ప్రారంభంలో.."సుతుల విద్య ప్రవీణత జూచు వేడ్క నెంతయును సంతసంబున గుంతిదేవిరాజా సన్నిధి గాంధార రాజుపుత్రికెలననుండె ను న్మీలిత నలిన నేత్ర" ప్రదర్శన సందర్భంలో కుంతీదేవి రాజకాంత ప్రేక్షక సమూహంలో గాంధారి పక్కన కూర్చుంది. ఆమెకి 'నలిని నేత్ర ' అనే ఒక విశేషణం వేసాడు నన్నయ. ఇది చాలా ప్రత్యేకంగా గమనించదగినది. నలిననేత్ర అంటే పద్మనయ అని అర్థం. నలిన నేత్రకి, నలినాప్తుడికి గల బంధుత్వం కుమార్రాస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టం సమాప్తమైనా అనిశ్చితంగా ఉండిపోయింది.
శా. సాలప్రాంశు నిజోజ్వలత్కవచు, శస్వత్కుండ లోద్భాసితు
న్బాలార్క ప్రతిమున్, శరాసనధరున్, బద్ధో గ్రనిస్త్రింశ్ర శౌ
ర్యా లంకారు, సువర్ణ వర్ణఘను, గర్ణాఖ్యున్, జగత్కర్ణ పూర్ణా లో లద్గణు జూచి చూపరు ప్రభూతాశ్చర్యులైరచ్చటన్.
అస్త్ర విద్యా ప్రదర్శనశాల ప్రధాన ద్వారం దగ్గర జబ్బ చరిచి నిలుచున్నప్పటి కర్ణుని మూర్తి వర్ణనం ఇది. ఈ పద్యంలో- - సాలప్రాంశు, బాలార్క, ప్రతిమ, సువర్ణ వర్ణు, జగత్కర్ణ పూర్ణాలో లద్గుణు అనే నాలుగు విశేషణాలు నన్నయ స్వతంత్రంగా ఉపయోగించినవే. కర్ణుడు కనిపించేసరికి ప్రేక్షకులంతా ఆశ్చర్యచకితులై పోయారు. ఎత్తయిన రూపం, మెరిసిపోతున్న కవచకుండలాలు, బంగారు మేనిచాయ, ధనస్సు ఖడ్గాలు పూని ఉండడం. తమ లాగా ప్రేక్షకుడులా కాక కురు వీరుడు అర్జునుడికి ప్రతి స్ఫర్థిగా జబ్బ చరచటం ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించేవే.
నన్నయ ఉపయోగించిన విశేషణాలతో- బాలార్క ప్రతిమ- అనేది కర్ణుడు జన్మవృత్తాంతం స్ఫురింప చేస్తుంది. సాల ప్రాంశువు అనే విశేషణం ముందు చెప్పి తర్వాత కవచ, కుండలాల ప్రసక్తి తేవడంతో కర్ణుడు కవచకుండలాలు కోల్పోయి వట్టి శరీరంతో సాలప్రాంశువు గా మిగులుతాడనే ఒక అర్థం స్ఫురిస్తుంది. 'శౌర్యలంకారు ' అనే విశేషణం తో కూడా గొప్పతనం కనిపించదు. శౌర్యమే అలంకారంగా కలిగినవాడని అర్థం. అలంకారం పైపై మెరుగులకు చెందినది. ఇతడి శౌర్యం కూడా అలాంటిదే అనే అంశం ద్యోతకమవుతుంది. అర్జునున్ని పరిచయం చేసే సందర్భంలో అన్ని విశేషణాలు చెప్పి 'పాండవ మద్యముండొప్పె' అనే మాట కూడా చెప్పి బద్ధ తూణీరుడు అనే మాట ఉపయోగించాడు. భవిష్యత్తులో అర్జునుడు అక్షయ తూణీరాలతో నిలుస్తాడనే సూచన గోచరిస్తుంది. ఈ విధంగా కథాంశం చెదిరిపోకుండా, అందచందాలతో చెక్కుచెదరకుండా కథ నడపడంలో ప్రసన్నత, అర్థయుక్తి అనే రెండు అంశాలను సమర్థవంతంగా నిర్వహించాడు.
2. అక్షర రమ్యత:
నన్నయ్య అక్షర రమ్యత పై పరిశోధన చేసిన పండితులు డా. వి. వి. ఎల్. నరసింహారావు. ఆయా సన్నివేశాలందు రసోచితములైన ఆయా శబ్దములు, ఆయా అక్షరములు వానంతట అవే కుదురుకొని ఆ మహా కవి జీవ లక్షణములైన యొకానొక రచనా మార్గమును స్పష్టము చేయును. నన్నయ గారి రచనలో ఈ అక్షర సంయోజనీయము హృదయాహ్లాదజనకముగా శ్రవణేంద్రియం తర్పణముగా సాగినది. ఈ లక్షణము తన కవితలో నిండారియున్నదని గుర్తించిన జ్ఞాని నన్నయ. నా కవిత యందు అక్షర రమ్యత పరమాదరనీయమని ఆయన విశ్వసించెను. అక్షర రమ్యత శబ్ద ప్రధానమైనది. శైలి రామణీయకత సంబంధమైనది. దీనినే అక్షర చంధో రమ్యతగా, కవిత గుణాల వల్ల ఏర్పడే రమ్యతగా, సంగీతము, పూర్వమీమాంశ తత్వ అక్షర సౌందర్యంగా పరిశోధకులు వివేచన చేసారు.
1. నిర్వచనము- అక్షరములు ధ్వనులకు సంకేతికములు. వివిధ ధ్వనులు గల అక్షరములచే శబ్దములు ఏర్పడుచున్నవి. ధ్వని మాట్లాడిన పిమ్మట నశించిపోవును. అక్షరమట్లు గాదు ఎన్నడూ నశించని పరమేశ్వరుడక్షర పద వాచ్యుడు. అక్షరమగు కవిత లోకోత్తరమైనది.
2. అక్షర ప్రయోగ రమ్యత
3. నాదము, రాగ రసములు - సంగీతము
4. అక్షర చంధో రమ్యత చంధస్సు
5. కావ్య గుణములు - అక్షర రమ్యత - గుణాదులు
6. పూర్వ మీమాంస తత్వము
7. మంత్రశాస్త్ర ప్రసస్తి
8. రసౌచితాక్షర బంధము - నౌ చిత్తము
కం. నీవ కడు నేర్పు కాడవు
గావలవదు, వీని గొన్ని గరచితి మేము
న్నీ విద్యలెల్ల జూపుదు
మే వీరుల సూచి మేలు మేలని పొగడన్.
నాటకీయమైన సంభాషణ ఇది. కర్ణుడి స్వభావాన్ని నిరూపించేది. కర్ణుడి స్వాతిశయం, అర్జునుడిపై స్పర్ధని వ్యక్తం చేస్తుంది.
చం. కురు కులజుండు పాండునకు గుంతికి బుత్రుండు ;రాజధర్మ బం
ధుర చరితుండు; నీ వితని తోడ రణంబొనరించెదేని వి
స్తరముగ నీదు వంశమును దల్లిని దండ్రిని జెప్పు; చెప్పిన
న్దొరయగుదేని నీకెదిరి దోర్బల శక్తి నితండు సూపెడిన్
ఆచార్య. సుబ్రహ్మణ్యం గారు ఈ పద్యాన్ని శబ్ధ శక్తి మూల ధ్వనికి అమూల్యమైన ఉదాహరణగా భావించారు. ఈ పద్యంలో కుల, రాజు, దొర శబ్ధాలు సాభిప్రాయ విశేషాలు. దొర శబ్ధం క్షత్రియుడు, రాజు అనే అర్థంలో ఉపయోగించబడింది. దీనిలో ధ్వని అంతా శబ్ధం మీదే ఆధారపడింది.
ప్రభువు అనే అర్థం వాచ్యంలో, సమానుడు అనే అర్థం వ్యంగం లోనూ స్ఫురిస్తుంది. భావి కథకు మూలమౌతుంది. కాబట్టి ఇది శబ్ద శక్తి మూల ధ్వని. చమత్కారమేమంటే పఠితకు కర్ణుడి తల్లి,దండ్రుల సంగతి తెలుసు. సన్నివేశంలో ఉన్న వారికి తెలియదు. కర్ణుని స్థితి పఠితలో సానుభూతిని రేకెత్తిస్తుంది. ఇది రస విషయకమైన రహస్యం అని వివరించారు. ( ఆంధ్ర మహాభారతం వ్యాఖ్యానం - తి.తి.దే.ప్రచురణ)
"వినుత ధనుర్విద్యా విదుఘను గర్ణు సహాయబడిసి కౌరవ విభుడర్జుని వలని భయము సెడి రొమ్ము న జేయుడి నిద్రవోయె ముదితాత్ముండై…"
దుర్యోధనుడు కర్ణున్ని సహాయంగా పొందాడు. తత్కారణంగా భయం చెడిన వాడయ్యాడు. ఇంక అదుపులో ఉండడనే భావం స్ఫురిస్తోంది. దుర్యోధనుడికి శత్రు భయం లేదు . గుండెపై చేయి వేసుకొని నిద్రపోయాడు. కానీ అర్జునుడున్నాడు. ఈ అర్జునుడితో వైరం దుర్యోధనుడికి బదులు కర్ణుడికి సంక్రమించింది. ఇంక కర్ణుడికి నిద్ర పడుతుందా అని వ్యంగమే.
ఈ విధంగా నన్నయ అక్షర రమ్యత లో భాగమైన భావ చిత్రణ, తదనుకూలమైన పదాల వినియోగం, సంభాషణాత్మక శైలి, వ్యంగ వైభవాలు అక్షర రమ్యత కి అర్థం పడుతున్నాయి.
3. నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం:
ఈ సూక్తి అనే పదం విషయంలో పండితులలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సూక్తి అంటే మంచి మాట అనే అర్థంలో గ్రహించారు. వృత్తాంతము, సమాచారము అనేవి నిఘంటుకార్థాలు. ఏదైనా ఒక విషయాన్ని చెప్పదలచినప్పుడు హృదయంగమంగా, సంక్షిప్తంగా చెప్పే విధానాన్ని సూక్తి అనాలి.
'సూక్తి ' అనేది విశేషణం. ఈకారాంత స్త్రీలింగ శబ్దం. 'శోభనాచ సా ఉక్తి శ్చ'- సూక్తి అని దీని వ్యుత్పత్తి. శోభన తత్వం అంటే సౌందర్యం. అది ఉక్తికి చెందినది. ఉక్తికి సంబంధించిన సౌందర్యం రెండు విధాలు. ఒకటి అంతరము, రెండు బాహిరము. 'కావ్య గ్రాహ్యమలంకారాత్ సౌందర్య మలంకారాహ" అని లాక్షణికోక్తి. కాబట్టి సూక్తి అనేది అలంకారానికి పర్యాయపదం అవు తోంది. శబ్ద సౌందర్యాన్ని అక్షర రమ్యతగా స్పష్టం చేసాడు. కాబట్టి ఇక్కడ కేవల అర్థాలంకార సౌందర్యాన్నే గ్రహించాలి. ఇతిహాసానికి కావ్యత్వాన్ని కల్పించిన నన్నయ నానా రుచిరార్ధసూక్తి నిధి అనే దళాన్ని కేవలం శిరోధార్యమయ్యే మంచి మాటలకే గాక అర్థాలంకార సౌందర్యాన్ని కూడా ఆపేక్షించి వాడాడు.
ఉ. హారి విచిత్ర హేమ కవచావృతుడున్నత చాపచారు దీ
ర్ఘోరు భుజండు, భాస్వదసితోత్పల వర్ణుడు, సేంద్ర చాప శం
పా రుచి మేఘమో యనగ, బాండవ మధ్యముడొప్పె బద్ధతూ
ణీరుడు రంగ మధ్యమున నిల్చె జనంబులు దన్ను జూడగన్.
అందమైన, విచిత్రమైన బంగారపు కవచం ధరించాడు ఆజానుబాహుడు. ఒక చేతిలో ఉన్నతమైన ధనస్సు ఉంది. మనిషి నల్ల కలువల రంగుతో కాంతులీను తున్నాడు. పసిడి రంగుతో కలిసిన మొత్తం రూపం హరివిల్లు తో మెరుపుతీగతో కూడిన నీలి మేఘంలా ఉన్నాడు అర్జునుడు. అర్జునున్ని ఇంద్రచాపంతో కలిసి ఉన్న మెఱుపు మేఘంలా ఉత్ప్రేక్షించాడు. ఈ ఉత్ప్రేక్ష కూడా ఇంద్ర తనయుడనే విషయాన్ని స్ఫురణకు తెచ్చేలా సార్థకంగా ఉంది.
కం. అనిన నిన తనయు పలుకులు
జనులకు విస్మయము, సవ్యసాచికి గోపం
బును సిగ్గును మరి దుర్యో
ధనునకు బ్రీతియును జేసెదత్ క్షణన మాత్త్రన్.
నువ్వు నేర్పరివి కాదు. మాకు ఆ విద్యలు తెలుసు. మేము నేర్చుకున్నాం. నువ్వు ప్రదర్శించిన విద్యలు వీరుల మెచ్చుకొనేలా మేమూ ప్రదర్శించగలం అని కర్ణుడు అన్నాడు.ఆ మాటలు అక్కడ ఉన్న ప్రేక్షకులకి ఆశ్చర్యాన్ని, అర్జునుడికి కోపాన్ని, సిగ్గుని దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించాయి. ఇదే ఉల్లేఖాలంకారం "బహుభిర్భుహుధోల్లే ఖాదేక స్యాల్లేఖ ఇష్యతే…" అని ఉల్లేఖం లో ఒక లక్షణం. అయితే ఈ అలంకార వైచిత్రి లో కూడా నన్నయ మూలానుసారమైంది కూడా గ్రహించే అలంకారిక రచన చేశాడు.
నన్నయ యతి విశేషణాలు:
1. పృథ్వీ వృత్తము - సంస్కృతమున 8వ అక్షరము తర్వాత యతి చెప్పబడినది. కన్నడమున నాగవర్మ కూడా అట్లే చెప్పినాడు. కానీ నన్నయ తెలుగులో వడి 11వ అక్షరము తర్వాత వుంచినాడు.
2. శిఖరిణి - సంస్కృతమునందు, కన్నడమునందు 6వ అక్షరము తర్వాత యతి ఉన్నది. కాని నన్నయ 12 వ అక్షరము తర్వాత వడి నిల్పినాడు.
3. పంచచామరమునకు - సంస్కృతమున 8 తర్వాత యతి, తెలుగున 9 తర్వాత పాటించారు.
4. తరళ వృత్తమునకు - కన్నడమున 8 వ అక్షరము తర్వాత, తెలుగు లో 11 వ అక్షరం తర్వాత వాడబడినది.
విశేషాంశాలు:
1. రచనా బంధురత:
నన్నయ విపుల శబ్దశాసనుడు. ఆనాడు దేశీయములైన శబ్దములను, సంస్కృత శబ్దములను ఏర్చి, కూర్చి నుడికారపు సొంపులు తీర్చిదిద్దిన శబ్ధశాసనుడు.
2. విశ్వ సాహిత్య ప్రపంచంలో శబ్ధా ర్థములకు, చంధస్సుకు భిన్నమైన నాదముచే కవితా శిల్పమును నిర్మించిన మహా కవులను వేళ్లపై లెక్కించవచ్చు. ఈ మహా కవులలో నన్నయ మేరుపూస.
3. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టం చదువుతుంటే కర్ణుడు రంగమాధ్యమాన్ని ప్రవేశించినట్టు కనబడదు. నాటకీయ శిల్పం ఆంధ్ర వాజ్మయంలో అడుగు పెట్టినట్టు తోస్తుంది.
4. నన్నయ మహాభారతాన్ని రచించే నాటికి సంస్కృత సాహిత్యంలో 'రీతి' సంప్రదాయం ప్రముఖంగా వ్యాప్తిలో ఉంది. అందువలన ఆయన తన భారత రచనలో దీనినే అనుసరించారు.
5. నన్నయ నాటికి కన్నడంలో మాత్రమే భారత రచన జరిగింది. అయితే పంపకవి రచించిన కన్నడ భారతం ఇతిహాసం కన్నా జైన పురాణ సాంప్రదాయానికి దగ్గరగా ఉంది. ఇది రాజ, రాజ నరేంద్రుని వంటి భారత కథాభిమానులకు నచ్చలేదు. అందువలననే భారతములోని మౌళిక తాత్వికతకు లోపం లేకుండా ఆ రచన చేయాలని నన్నయను కోరాడు.
6. నన్నయ సంస్కృత చంధో రీతులను ఎక్కువగా ఇష్టపడినట్టు భారతం చెబుతోంది.
7. తెలుగులో చంపూ రచనలకు మార్గదర్శనం చేసింది నన్నయ భారతమే.
8. విశ్వనాథ సత్యనారాయణ తన రామాయణ కల్పవృక్ష అవతారిక లో "ఋషి వంటి నన్నయ రెండవ వాల్మీకి" అని కొనియాడారు. ఇది అక్షర సత్యం.
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు - జేష్ఠ మాసం - కృష్ణ పక్షం - అష్టమి - ఉత్తరాభాద్ర - గురు వాసరే* (19.06.2025)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
----------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
