23, ఆగస్టు 2025, శనివారం

పోలాల అమావాస్య

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹 పోలాల అమావాస్య రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకొనే పెద్ద పండుగ. పోలాలమ్మ దేవత వ్రతం చాలా మంది ఆచరిస్తారు. అసలు పోలాల అమావాస్య అంటే ఏమిటి, ఆ వ్రతం చేస్తే వచ్చే ఫలితమేమిటో వివరంగా తెలియజేస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. శ్రావణ మాసంలో ఇది చివరి పండుగ. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

పోతన అక్షర చిత్రం! శ్రీమన్నారాయణుని వైభవం!

 శు భో ద యం 🙏


పోతన అక్షర చిత్రం!

శ్రీమన్నారాయణుని వైభవం!

   

       ఆంధ్రవాఙ్మయప్రపంచంలో విచిత్రాలేన్నో? అందులో ఇదియొకటి.

సహజ పాండిత్యమండితుడైన పోతన

మహాకవి భాగవతానువాదమున చిత్రించిన శబ్దచిత్రాలెన్నో? అవిగాక ఇదియొకటి.

          శ్రీమన్నారాయణుని మహిమాభిరామమైన విశ్వరూపసందర్శనా చిత్రమును ప్రదర్శంచినాడు.నారాయణ శతకమున సూక్ష్మముగాపరిశీలించిన నిది శ్రీమన్మారాయణసూక్త ప్రదర్శనమే!!

సకలభువన సమన్విత చరాచర ప్రకృతి 

యంతయు నతనిసామ్రాజ్యమే!గదా!

పరికింపుడు.


"ధరసింహాసనమై,నభంబుగొడుగై,తద్దేవతల్ భృత్యులై/

పరమామ్నాయములెల్ల వందిగణమై, బ్రహ్మాండమాకారమై/

సిరిభార్యామణియై, విరించికొడుకై,శ్రీగంగ సత్పుత్రియై/

వరుసన్నీఘనరాజసంబుదెలుపన్ వర్ధిల్లు నారాయణా!"

--నారాయణశతకం:బమ్మెఱపోతన;


     అత్యద్భుతమైన యీపద్యం శ్రీ మన్నారాయణుని యనంత వైభవానికి అద్దంపడుతోంది.

         చక్రవర్తిత్వసూచకంగా సింహాసనం, ఛత్రం. మహారాణి ,పరివారం, వందిమాగధులు,

భృత్యకోటి, మొదలైనవి రాజలాంఛనాలు. అవన్నీ ఈచిత్రంలో నారాయణునకు పొందుపరిచాడు కవి.

ఇగో ఇలాగ,


        "సర్వభూతధాత్రి ధరిత్రి సింహాసనము, నిర్గుణపరబ్రహ్మ స్వరూపమైన ఆకాశము ఛత్రము. , దేవతలందరూ సేవకులుకాగా, విరించి ముఖోధ్భూతములగుచున్న వేదములే వందిగణములు(పొగడువారు)కాగా, చరాచర ప్రపంచమంతయూ స్వరూపమైయొప్పారగా , సకలసంపదలకాణాచి శ్రీలక్ష్మి మహారాణియైసహపీఠమునలంకరింప సకలజీవులసృష్టికికారకుడగు విధాత పుత్రుడై విలసిల్లగా, పరమపునీత గంగ సత్పుత్రియై , యాతని ఘనమైన వైభవమును వెల్లడించుచుంగా శ్రీమన్నారాయణుడున్నాడట!. ఆహా ఏమావైభవము!!


              మహనీయమైన ఇట్టిచిత్రరాజమును చిత్రింపగలవారెవ్వరు?ఆఘనత పోతనకేదక్కినది.మిత్రులారా! మనలోచనములతోగాక ,ఆలోచనాలోచనాలతో నాలోకింపుడు.కవియూహకు అబ్బురపాటుకలుగకమానదు.అదే రసానందము.అదే రసౌవైసః అన్నవేదసిధ్ధాంతరహస్యము.

                                  స్వస్తి!


🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

విశ్వేశ్వరా

 శు భో ద యం 🙏


విశ్వేశ్వరా!!


శా.

నీ విన్నాణము చిత్రమే, మకుటరత్నీభూతజైవాతృకా!/

గ్రైవేయీకృతకాద్రవేయ! గళరుద్రాక్షీభవద్బాడబా!/

సేవాస్వీకృత భూత రాక్షస పిశాచీప్రేత! నేత్ర ప్రభా/

శ్రీవిన్యస్త కృశాను! పార్వతమృగాక్షీదార! విశ్వేశ్వరా!

23

     -కవిసామ్రాట్. విశ్వనాధసత్యనారాయణ.


        మనం నేడు విశ్వనాధ వారి విశ్వేశ్వర శతకంలోని ఈపద్యం పరిశీలిద్దాం

       చిత్రవిచిత్రమైన ఊహలకు వ్యంగ్య

మర్యాదలకు ఆటపట్టైన శతక మిది.

విశ్వప్రతిభకు ముకురాయమానం.

          

               "కిరీటంలో తురాయిగా చంద్రుని అలంకరించుకోవటం.కంఠ హారంగా వాసుకిని అలంకరించుకోవటం,

మెడలో రుద్రాక్షగా గరళాన్ని నిలుపుకోవటం, సేవక సముదాయంగా

భూతప్రేత పిశాచములను నియమించటం, తృతీయ నేత్రంగా ఫాలభాగాన అగ్నినిధరించటం, కోయపిల్ల పార్వతిని భార్యగా స్వీకరించటం, ఏవిటయ్యా?ఈతిక్కపనులు?

        అంటూ హేళన జోడించి వ్యంగ్యంగా విశ్వరుని మహిమలను నుతించటం ,విశ్వనాధకుదక్క ,మరెవరికి సాధ్యం?

    మహాకవీ! నీకూ, నీప్రతిభకూ,

శత సహస్ర వందనాలు!!


                       స్వస్తి !!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌟🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శనివారం 23 ఆగస్టు 2025🍁*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🍁శనివారం 23 ఆగస్టు 2025🍁*

                      4️⃣0️⃣

                  *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


         *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


        *పిండోత్పత్తి క్రమం*                

```

జీవుడికి పూర్వ జన్మలో చేసుకున్న కర్మానుసారం తిరిగి పునర్జన్మ ఇచ్చే మహానుభావుడు ఈశ్వరుడు మాత్రమే!! కాబట్టి జీవుడు దేహ సంబంధాన్ని పొందే క్రమంలో పురుషుడి వీర్యంగా మారి స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఒక్క రాత్రికి 'కలిల'మై (శుక్ర-శోణిత సంయోగం), అయిదు రాత్రులకు 'బుద్బుద' మై (బుడగ), పదవ దినానికి రేగు పండంత అయ్యి. ఆ పైన మాంస పిండమై, ఆపై గుడ్డు ఆకారాన్ని పొందుతాడు. ఆ మీద నెలకు శిరస్సు, రెండు నెలలకు కాళ్లు - చేతులు పుడతాయి. మూడు నెలలకు గోళ్లు, రోమాలు, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు కలుగుతాయి. నాల్గవ నెలకు రసం, రక్తం, మాంసం, మేధస్సు, ఆస్థి, మజ్జ అనే సప్త ధాతువులు ఏర్పడుతాయి. అయిదవ నెలకు ఆకలి దప్పికలు కలుగుతాయి. ఆరవ నెలలో మావి చేత కప్పబడి తల్లి కడుపులో కుడి భాగాన తిరుగుతూ, తల్లి తిన్న అన్నపానాదుల వల్ల తృప్తిని పొందుతాడు.


ఇక అక్కడి నుండి ధాతువులు (వాత, పిత్త, శ్లేష్మాలు) కలిగి, సూక్ష్మ జీవులతో నిండిన మలమూత్రాదుల గోతులలో తిరుగుతూ, క్రిములు పాకి భాద పెటుతుంటే మూర్చలో మునిగిపోతాడు. తల్లి తిన్న కారం, చేదు, ఉప్పు, పులుపు మొదలైన తీవ్రమైన రసాలతో బాధపడుతున్న శరీరావయవాలు కలవాడై మావితో కప్పబడి, బయటకు ప్రేగులతో కప్పబడి, మాతృగర్భంలో శిరస్సు వంచుకుని, వంగి పడుకుని ఉంటాడు. తన అవయవాలు కదల్చలేక పంజరంలో చిక్కుకున్న పక్షిలాగా ఉంటాడు. భగవంతుడు ఇచ్చిన జ్ఞానంతో పూర్వ జన్మలలో చేసిన పాపాలను తలచుకుని దీర్ఘమైన నిట్టూర్పులు విడుస్తూ, కొంచెం సుఖం కూడా లేకుండా ఉంటాడు.


ఏడవ నెలలో జ్ఞానం కలిగి, కదలికలు ప్రారంభమై, మలంలోని క్రిములతో కలసి ఒక్క దిక్కున ఉండకుండా, గర్భంలో సంచరిస్తూ, ప్రసూతి వాయువులకు కంపించిపోతూ ఉంటాడు. అప్పుడు దేహాత్మ దర్శనం కలిగి, తిరిగి గర్భవాస దుఃఖానికి చింతిస్తూ, బంధన రూపములైన సప్త ధాతువులతో బద్దుడై, రెండు చేతులు జోడించి, దీనవదనుడై, జీవుడు తాను ఎవ్వనిచే గర్భవాసవ క్లేశాన్ని అనుభవించడానికి నియమించబడ్డాడో ఆ సర్వేశ్వరుడిని స్తుతిస్తాడు. ఇలా స్తుతిస్తూ, స్వచ్చమైన జ్ఞానం కలవాడైన జీవుడు గర్భం నుండి బయటకు రాకుండా తొమ్మిది మాసాలు గడుపుతాడు. ఆ తరువాత పదవ మానం రాగానే జీవుడు అధోముఖుడై ఉచ్చ్వాస నిస్స్వాసాలు లేకుండా దుఃఖంతో బాధపడుతూ, జ్ఞానాన్ని కోల్పోయి, రక్తసిక్తమైన శరీరంతో క్రిమిలాగా నేలమీద పడి ఏడుస్తూ జ్ఞానహీనుడై జడుడి లాగా అయిపోతాడు. తన భావాన్ని అర్ధం చేసుకోలేని ఇతరుల వల్ల పెంచబడుతూ, తన కోరికలను చెప్పుకోలేక, అనేక పురుగులతో కూడిన ఒక పక్కమీద పడుకుంటాడు. అవయవాలలలో ఎక్కడ దురద వేసినా గోక్కోలేక, కూర్చోలేక, లేవలేక, నడవలేక, ఓపిక చాలక, జనాన్ని కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ ప్రకారం శైశవంలో ఆ అనుభవాలను పొందుతూ పెరుగుతుంటాడు జీవుడు.


                  *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


          *రచన: శ్రీ వనం*

    *జ్వాలా నరసింహారావు*

  *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷``


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

శనివారం🚩* *🌹23 ఆగస్టు 2025🌹*

*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐* 
       *🚩శనివారం🚩*
 *🌹23 ఆగస్టు 2025🌹*      
    *దృగ్గణిత పంచాంగం*                

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 
*దక్షిణాయనం - వర్షఋతౌః* 
*శ్రావణమాసం - కృష్ణపక్షం*

*తిథి  : అమావాస్య* ప 11.35 వరకు ఉపరి *భాద్రపద మాసం ప్రారంభం*
*వారం    : శనివారం* ( స్ధిరవాసరే )
*నక్షత్రం   : మఖ* రా 12.54 వరకు ఉపరి *పూర్వఫల్గుణి (పుబ్బ)*
*యోగం : పరిఘ* మ 01.20 వరకు ఉపరి *శివ*
*కరణం  : నాగ* ప 11.35 *కింస్తుఘ్న* రా 11.37 ఉపరి *బవ*

 *సాధారణ శుభ సమయాలు:*
       *— ఈరోజు లేవు-—*
అమృత కాలం  : *రా 10.27 - 12.05*
అభిజిత్ కాలం  : *ప 11.45 - 12.35*
*వర్జ్యం      : మ 12.35 - 02.14*
*దుర్ముహూర్తం  : ఉ 05.53 - 07.33*
*రాహు కాలం   : ఉ 09.01 - 10.36*
గుళికకాళం       : *ఉ 05.53 - 07.27*
యమగండం     : *మ 01.44 - 03.18*
సూర్యరాశి : *సింహం*                 
చంద్రరాశి : *సింహం*
సూర్యోదయం :*ఉ 06.01*
సూర్యాస్తమయం :*సా 06.37*
*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం          :  *ఉ 05.53 - 08.24*
సంగవ కాలం         :     *08.24 - 10.54*
మధ్యాహ్న కాలం    :     *10.54 - 01.25*
అపరాహ్న కాలం    : *మ 01.25 - 03.56*

*ఆబ్ధికం తిధి         : భాద్రపద శుద్ధ పాడ్యమి*
సాయంకాలం        :*సా 03.56 - 06.27*
ప్రదోష కాలం         :  *సా 06.27 - 08.44*
రాత్రి కాలం           :*రా 08.44 - 11.47*
నిశీధి కాలం          :*రా 11.47 - 12.33*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.07*
******************************
        *🌷ప్రతినిత్యం🌷*
        *_గోమాతను 🐄 పూజించండి_* 
        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

*🙏!!.శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి.!!🙏*

*స్వామిన్ సుశీల సుల* 
*భాశ్రిత పారిజాత*
*శ్రీవేంకటేశచరణౌ* 
*శరణం ప్రపద్యే ॥* 

*🌹ఓం నమో వేంకటేశాయ🌹*
*****************************

*🍁శ్రీఆంజనేయ స్తుతి🍁*

*నమో ఆంజనేయం* 
*నమో దివ్య కాయం*
*నమో వాయుపుత్రం* 
*నమో సూర్యమిత్రం*

             🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹

🚩🪷🌹🛕🌹🌷🪷🌷🚩
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><

          🌷 *సేకరణ*🌷
      🌹🌿🍁🍁🌿🌹
        *న్యాయపతి వేంకట*
       *లక్ష్మీ నరసింహా రావు*
      🌷🍃🍁🍁🍃🌷
 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

మేఘసందేశం కాళిదాసు 🙏 రెండవ భాగము

 🙏మేఘసందేశం కాళిదాసు 🙏

                       రెండవ భాగము 

నాయకులు నాలుగు రకాలు. వారినే చతుర్విధ నాయకులు అంటారు. ధీరోదాత్తుడు (వీరత్వం అధికంగా ఉండి ఆవేశం లేకుండా ఆలోచన కలవాడు ఉదా: శ్రీ రాముడు), ధీరోద్ధతుడు (వీరత్వం ఎక్కువగా ఉండి ఆలోచన ఏ మాత్రం లేనివాడు ఉదా: భీముడు), ధీర లలితుడు (వీరత్వం, లాలిత్యం సమపాళ్ళలో కలిసిన ప్రేమ స్వరూపుడు ఉదా: శ్రీ కృష్ణుడు), ధీర శాంతుడు (శాంతాన్ని అధికంగా కలిగిన వీరుడు ఉదా: గౌతమ బుద్ధుడు). కాళిదాసు తన రచనలలో నాయకుడిని ఎప్పుడూ ధీరోదాత్తునిగానే మలుచుకుంటాడు. శాకుంతలంలో అదే జరిగి అభిజ్ఞానశాకుంతలం అయ్యింది కదా! ఈ మేఘ సందేశంలో కూడా నాయకుడైన యక్షుని ధీరోదాత్తునిగానే చూపాడు (పూర్వ మేఘం, మూడవ శ్లోకంలో).


శృంగార నాయికలు ఎనిమిది రకాలు. వారినే అష్టవిధ శృంగార నాయికలు అంటారు. వారిలో నలుగురిని ఎన్నుకుని, ఒక్కొక్కరిగా ఈ కావ్యంలో పూర్వమేఘంలో పరిచయం చేశాడు కాళిదాసు. 


త్వా మారూఢం పవనపదవీ ముద్గృహీతాలకాన్తాః

ప్రేక్షిష్యన్తే పథికవనితాః ప్రత్యయాదాశ్వ సన్త్యః ।

కః సన్నద్ధే విరహవిధురా త్వయ్యుపేక్షేత జాయాం

న స్యాదన్యోఽప్యహమివ జనోయః పరాధీనవృత్తిః ॥


అంటూ ముందుగా పథికవనితాః అనగా ప్రోషిత భర్తృక గురించి చెప్పాడు. భర్త దూరంగా (పని మీద ఎక్కడికైనా వెళ్ళినా, దేశాంతరం వెళ్ళినా) ఉన్నప్పుడు తన గురించి ఆలోచిస్తూ విరహంతో ఉండే స్త్రీని ప్రోషిత భర్తృక అంటారు. మేఘుడు కామ ప్రకోపన చేసేవాడు. అసలే విరహంతో ఉండే స్త్రీలు నీ (మేఘుని) రాకతో, తమ భర్తతో కలవాలన్న కోరిక పెరిగి, భర్త కూడా అదే కాంక్షతో వస్తాడు అన్న ఆశతో తమ ఫాల భాగం మీద పడుతున్న ముంగురులను పైకి ఎత్తి నిన్ను చూస్తారు. అటువంటి స్త్రీని విడిచి అశక్తుడు, అస్వతంత్రుడు, పరాధీనుడు అయిన మగవాడు తప్ప మరెవ్వరూ ఉండలేరు అంటాడు. ప్రస్తుతం యక్షుని పరిస్థితి అదే కనుక ఆమెకు దూరంగా ఉన్నందుకు చింతిస్తూ మేఘుని వెళ్ళి తన క్షేమ సమాచారం తెలియ చేయమంటాడు. దీనికి సమర్ధింపుగా ఉత్తర మేఘంలో 21, 22, 23, 24, 25 శ్లోకాలలో యక్షుని భార్యలో ఉన్న ప్రోషిత భర్తృక లక్షణాలన్నీ విశదీకరిస్తాడు. కాళిదాసుకి ఈ ప్రోషిత భర్తృక అంటే ప్రత్యేక అభిమానం అనిపిస్తుంది. అభిజ్ఞాన శాకుంతలంలో కూడా శకుంతలని ప్రోషిత భర్తృక (దూర్వాస మహాముని శాపానికి కారణమయినప్పుడు) గానే చూపిస్తాడు.  


గచ్ఛన్తీనాం రమణవసతిం యోషితాం తత్రనక్తం

రుద్ధాలోకే నరపతి పథే సూచి భేద్యై, స్తమోభిః ।

సౌదామన్యా, కనక నికషస్నిగ్ధయా దర్శయోర్వీం

తోయోత్సర్గస్తనితముఖరో మాస్మభూర్విక్లవాస్తాః ॥


అంటూ రమణవసతిం గచ్ఛన్తీనాం అనగా అభిసారిక గురించి చెప్పాడు. అందంగా అలంకరించుకుని, ప్రియుని వద్దకు తాను వెళ్ళే స్త్రీని అభిసారిక అంటారు. ఉజ్జయనిలోని స్త్రీలను వర్ణిస్తూ చెప్పిన ఈ శ్లోకంలో అక్కడి అభిసారికలు (స్త్రీలు) రాత్రిపూట ప్రియుని ఆవాసానికి బయలుదేరతారు కనుక ఆ సమయంలో నువ్వు (మేఘుడు) మెఱుపులతో దారి చూపు కానీ ఉరుముతూ వాన పడి వారిని భయపెట్టకు. వారసలే మిక్కిలి భయస్తులు అని మేఘుడిని హెచ్చరిస్తూ స్త్రీలతో సున్నితత్వం వహించాలని చెప్తాడు. పూర్వ మేఘంలో ఉజ్జయినిలోని (కాళిదాసు నివాస స్థలం) అభిసారికలు ప్రియుని వద్దకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారో చెప్పిన కాళిదాసు ఉత్తర మేఘంలో (తొమ్మిదవ శ్లోకంలో) అలకాపురిలోని (యక్షుని నివాస స్థలం) అభిసారికలు తమ ప్రియుని వద్ద నుండీ వచ్చేటప్పుడు ఎలా ఉంటారో వివరిస్తాడు. దీని ద్వారా కాళిదాసు పురుషుల ఏక పత్నీత్వం, స్త్రీల పాతివ్రత్యం ఇష్టాధీనమే కానీ కృత్రిమం కాదు అని చెప్తున్నాడనిపిస్తుంది. మన నాయకుడయిన యక్షుడు ఏకపత్నీ వ్రతుడు, ముందుగా చెప్పుకున్నట్టు ధీరోదాత్తుడు కాకపోతే తన భార్యకి మేఘుడిని బ్రతిమాలుకుని మరీ సందేశం పంపవలసిన అవసరం లేదు కదా! అలా మన నాయకుని ధీరోదాత్త లక్షణం మళ్ళీ చూపాడు.


తస్మిన్కాలే నయన సలిలం యోషితాం ఖణ్డితానాం

శాన్తిం నేయం ప్రణయిభిరతో వర్త్మభానోస్త్య జాశు ।

ప్రాలేయాస్రం కమలవదనాత్సోఽపి హర్తుం నలిన్యాః

ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్ఫాభ్యసూయః 


అంటూ ఖణ్డితానాం అనగా ఖండిత నాయిక గురించి చెప్పాడు. రాత్రంతా పర స్త్రీతో గడిపి, తెల్లవారిన తరువాత రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన భర్తని చూచి దుఃఖించే స్త్రీని ఖండిత అంటారు. ఆ సమయంలో అనగా సూర్యోదయ సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన భర్తలు తమ భార్యల కన్నీరు తుడుస్తారు. ఈ శ్లోకంలో పద్మం అనే ఖండిత స్త్రీ ముఖము నుండీ కారే మంచు అనే కన్నీటిని తొలగించే భర్త (లేదా ప్రియుడు) సూర్యుడు అని వర్ణించాడు. అటువంటి సూర్యునికి నువ్వు (మేఘుడు) అడ్డు రాకుండా, తన కిరణాలు అనే చేతులతో మంచు అనే కన్నీటిని తుడవనివ్వు, ప్రేయసీ ప్రియుల మధ్యలో నువ్వెందుకు? అడ్డు తొలగు అంటూ హితోపదేశం చేస్తున్నాడు.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - వర్ష ఋతువు - శ్రావణ మాసం - కృష్ణ పక్షం -‌ చతుర్థశి - ఆశ్రేష -‌‌ భృగు వాసరే* (22.08.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*