24, నవంబర్ 2025, సోమవారం

మరణం చాలా సూక్ష్మమైనది.

  మరణం చాలా సూక్ష్మమైనది.

ఆత్మ ఈ శరీరంలోంచి వెళ్లిపోయే ముందే, స్మరణ చేత మరల ఉపాధిని వెతికేసుకుంటుంది. మనస్సుకి ఏదో సంస్కారం అలవాటవుతుంది.


అస్తమానూ ఈశ్వరుడి గురించి వినడం అలవాటనుకోండి, భగవంతుని గురించి చెప్పడం అలవాటనుకొండి, భాగవతం చదవడం అలవాటనుకోండి, వాడికి వెళ్ళిపోయేటపుడు కూడా సంస్కారం అక్కడే ఉంటుంది. కాబట్టి వాడు ఉత్తర జన్మలో ఒక మహాపండితుడుకి కొడుకుగా పుట్టి చిన్నతనం నుంచే అన్నీ నేర్చేసుకుని, పరవశించిపోయి, అపారమైన ఐశ్వర్యంతో తులతూగుతూ, పదిమందికి పెడుతూ తాను తింటూ, ఈశ్వరుడిని గురించి చెప్పుకుంటూ, సార్థకత పొంది, ఈశ్వరునిలో కలిసిపోతాడు.

🌹🌹🌹🌹🌹

శ్రీ సాలసర్ బాలాజీ ఆలయం

  🕉 మన గుడి : నెం 1305


⚜  రాజస్థాన్ : సుజన్‌గఢ్


⚜  శ్రీ సాలసర్ బాలాజీ ఆలయం 



💠 భారతదేశంలోని రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఉన్న సాలసర్ బాలాజీ ఆలయం, హనుమంతుని భక్తులకు గౌరవనీయమైన పుణ్యక్షేత్రం. 

ఈ ఆలయం గడ్డం మరియు మీసాలతో ఉన్న ప్రత్యేకమైన హనుమంతుడి విగ్రహానికి ప్రసిద్ధి చెందింది, ఇది ఒక ప్రత్యేకమైన తీర్థయాత్ర స్థలంగా మారింది.


🔆 చరిత్ర 


💠 రాజస్థాన్‌లోని అసోటా గ్రామంలో, శ్రావణ శుక్ల-నవమి, శనివారం, 1811లో ఒక జాట్ రైతు తన పొలాన్ని దున్నుతున్నాడు. 

అకస్మాత్తుగా, నాగలి 'థక్' అనే శబ్దంతో ఏదో రాతి వస్తువును ఢీకొట్టింది. అతను తవ్వి ఇసుకతో కప్పబడిన విగ్రహాన్ని కనుగొన్నాడు.


💠 అతని భార్య భోజనముతో వారి వద్దకు చేరుకుంది. అతను ఆమెకు విగ్రహాన్ని చూపించాడు. ఆమె తన చీర (దుస్తులు)తో విగ్రహాన్ని శుభ్రం చేసింది. అప్పుడు ఆ విగ్రహం బాలాజీ అంటే హనుమంతుడిలా కనిపించింది. వారు తల వంచి భక్తితో పూజించారు. 

అతని భోజనంలో, అతని భార్య బజ్రా యొక్క చుర్మను తయారు చేసింది. రైతు శ్రీ బాలాజీ మహారాజ్‌కు చుర్మను సమర్పించాడు. ఆ సమయం నుండి ఇప్పటి వరకు, శ్రీ బాలాజీ మహారాజ్‌కు చుర్మను సమర్పించడం ఒక ఆచారం.


💠 అసోటాకు చెందిన ఠాకూర్ కూడా ఈ వార్త విన్నాడు. కలలో బాలాజీ ఆ విగ్రహాన్ని చురు జిల్లాలోని సాలసర్‌కు పంపమని ఆదేశించాడు. 

అదే రాత్రి, హనుమంతుని భక్తుడు, సాలసర్‌కు చెందిన మోహన్ దాస్ కలలో హనుమంతుడిని లేదా బాలాజీని చూశాడు. అసోటాకు చెందిన ఠాకూర్ విగ్రహం గురించి బాలాజీ అతనికి చెప్పాడు. మోహన్ దాస్ వెంటన అసోటాకు చెందిన ఠాకూర్‌కు మసాజ్ పంపాడు.  

ఠాకూర్ ఆశ్చర్యపోయాడు: అసోటాకు రాకుండా మోహన్‌దాస్‌జీకి ఎలా తెలుసుకోగలిగాడు? 

ఖచ్చితంగా, ఇది బాలాజీ యొక్క అద్భుతం. ఆ విగ్రహాన్ని సాలాసర్‌కు పంపి అక్కడ స్థాపించారు. 

ఆ ప్రదేశం ఇప్పుడు సాలాసర్ ధామ్‌గా ప్రసిద్ధి చెందింది


💠 స్థానికులు సాలసర్ ధామ్ అని కూడా పిలిచే సాలసర్ బాలాజీ మందిర్, చైత్ర పూర్ణిమ మరియు అశ్వినీ పూర్ణిమ సమయంలో ప్రత్యేకంగా రద్దీగా ఉంటుంది. 

ఈ శుభ సందర్భాలలో నిర్వహించే జాతరలు దేవతకు నివాళులు అర్పించడానికి నలుమూలల నుండి జనాన్ని ఆకర్షిస్తాయి. 


💠 ఈ ఆలయం ఇటుకలు, సున్నం, సిమెంట్, మోర్టార్, రాయి మరియు పాలరాయితో నిర్మించబడింది. అయితే, గర్భగుడి, సభా మండపం మరియు ప్రసరణ మార్గం మొజాయిక్ పనులు మరియు బంగారం మరియు వెండి పూల నమూనాలతో అలంకరించబడ్డాయి.


💠 ప్రవేశ ద్వారం, తలుపులు మరియు ఆచారాలకు ఉపయోగించే పాత్రలు కూడా వెండితో తయారు చేయబడ్డాయి. 


🔆 ప్రసిద్ధ ఆచారాలు :


💠 ఆలయ నిర్మాణం సాంప్రదాయ మరియు ఆధునిక శైలుల సమ్మేళనం, సంక్లిష్టమైన శిల్పాలను కలిగి ఉంటుంది.

ఈ ఆలయంలో బాలాజీగా పూజించబడే హనుమ విగ్రహం ఉంది, దీనిని క్లిష్టమైన అలంకరణలు మరియు నైవేద్యాలతో అలంకరించారు. 


💠 ఈ ఆలయం హనుమాన్ జయంతితో సహా వివిధ పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది.


💠 రోజువారీ దర్శన సమయాలు ఉదయం 6:00 నుండి రాత్రి సాయంత్రం 9:00 వరకు


💠 ముఖ్యమైన ఆచారాలు మరియు కార్యక్రమాలు:

- మంగళ్ ఆరతి: ఉదయం 5:00 లేదా 5:30

- రాజ్‌భోగ్: ఉదయం 10:30

- ధూప్ మరియు మోహన్‌దాస్ జీల ఆరతి:

సాయంత్రం 6:00 - బాలాజీ ఆరతి: సాయంత్రం 7:10 లేదా 7:30

-శయన ఆరతి: రాత్రి 10:00


💠 హనుమాన్ జయంతి: 

గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు.

- చైత్ర పూర్ణిమ మరియు అశ్వినీ పూర్ణిమ లక్షలాది మంది భక్తులను ఆకర్షించే పెద్ద ఉత్సవాలు నిర్వహించబడతాయి



💠 సాలాసర్ బాలాజీ ఆలయం జైపూర్-బికనీర్ హైవేపై ఉంది, సికార్ నుండి దాదాపు 57 కి.మీ, లక్ష్మణ్‌గర్ నుండి 31 కి.మీ మరియు సుజన్‌గర్ నుండి 27 కి.మీ దూరంలో ఉంది.


- సమీప రైల్వే స్టేషన్: సుజన్‌గర్


రచన

©️ Santosh Kumar

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శాంతి పర్వము షష్టమాశ్వాసము*


*570 వ రోజు*


*ఆత్మ ఏకత్వము అనేకత్వము*


జనకుడు " మహర్షీ ! ఆత్మకు ఏకత్వము అనేకత్వము ఉన్నాయి కదా ! అలాగే విద్య అవిద్య ఉన్నాయి కదా ! నా బుద్ధిమాంధ్యము వలన నేను తెలుసుకొనజాలక ఉన్నాను కనుక క్షరము, అక్షరము, సాంఖ్యము, యోగము గురించి వివరించండి " అని అడిగాడు. వశిష్ఠుడు " జనకమహారాజా ! యోగమనగా ధ్యానము. అది రెండు విధములు. మొదటిది ప్రాణాయామము, రెండవది మానసిక ఏకాగ్రత. మొదటిది సగుణోపాసన రెండవది నిర్గుణోపాసన. ప్రాణాయామము మూత్రవిసర్జన సమయంలో భోజనము చేసిన తరువాత చెయ్యకూడాదు. యోగి మితాహారము తీసుకోవాలి. ఇంద్రియములను నిగ్రహించాలి. శబ్ధ, రస, రూప, గంధాదుల వంక మనసు మరల్చకూడదు. బుద్ధి మనసునందు నిలిపి మనసును ఆత్మ అందు నిలపాలి. కోరికలు విసర్జించి శిలాసదృశ్యముగా ఉండాలి. అలాంటి యోగి పగటికి రాత్రికి భేదము లేక నిరంతర ధ్యానములో మునిగి ఉంటాడు. గాలిలేని చోట వెలిగేదీపంలా నిశచలమనస్కుడై ఆనందం అనుభవిస్తాడు. దీనినే యోగము అంటారు. ప్రకృతివాదులైన సాంఖ్యులు ఈ ప్రకృతిని అవ్యక్తము అంటారు. ప్రకృతికి జన్మనిచ్చే ధర్మము ఉంది కనుక తానుగా బుద్ధి, అహంకారము, పంచభూతములు, విషయవాంఛలు, ఇంద్రియములుగా లోకమంతా విస్తరించి ఉంటుంది. దీనికి పురుషుడు అధిష్టానుడు. ఈ సృష్టి అనులోమానుపాతంగా జరుగుతూ ఉంటుంది. సంహారసమయంలో విలోమానుపాతంగా జరుగుతుంది. జననమరణ సమాయాలలో ప్రకృతి ప్రకోపిస్తుంది. ప్రకృతి, క్షేత్రము, అవ్యక్తము మూడూ ఒకటే. దానిని సత్వము అనికూడా అంటారు. జీవుడికి క్షేత్రము గురించి తెలుసు కనుక అతడిని క్షేత్రజ్ఞుడు అంటారు. జీవుడు ఈ అవ్యక్త పురములో ఉండడం వలన అతడిని పురుషుడు అంటారు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అన్నది తెలుసుకోవడమే జ్ఞానం. పురుషుడికి ఈ జ్ఞానము తెలుసు. ప్రకృతి సగుణాత్మకము పురుషుడు నిర్గుణుడు. 24 వికారములకు సాక్షిగా పురుషుడు నిలిచి ఉంటూ కైవల్యాం పొందుతాడు అదే పునరావృత్తి రహితమార్గము. ఈ సత్యము తెలిసిన వాడికి మరణం అంటే భయం ఉండదు.


*విద్య అవిద్య*


జనక మహారాజా ! నీకు సాంఖ్యమును యోగమును, అక్షరము గురించి వివరించాను. ఇంక విద్య అవిద్య గురించి వివరిస్తాను. విద్య అంటే 25 వ తత్వమైన అక్షర పరబ్రహ్మము. కర్మేంద్రియములకు జ్ఞేనేంద్రియములు, జ్ఞానేంద్రియాలకు మనసు, మనసుకు పంచభూతములు, పంచభూతములకు అహంకారం, అహంకాముకు బుద్ధి, బుద్ధికి అవ్యక్తము, అవ్యక్తముకు 25వ తత్వమైన అక్షర పరబ్రహ్మము వరుసగా విద్యగా పరిగణించబడతాయి. జనకమహారాజా ! నీకు క్షరముఅక్షరము గురించి ఇంతకు ముందు వివరించాను. కొందరు ప్రకృతిని క్షరమని, జీవుడిని అక్షరమని అనుకుంటారు. మరి కొంత మంది ప్రకృతి, జీవుడు కూడా క్షరమని అంటారు. మరి కొంతమంది జీవుడు, ప్రకృతి కూడా అక్షరని అంటారు. రెండింటికీ ఆది అంతము లేక పోవడము, ఈశ్వరతత్వం కలిగి ఉండటం వలన సారూప్యము ఏర్పడింది. జీవుడు, ప్రకృత్తి సహజములైన మహత్తు, అహంకారములతో చేరి, ప్రకృతి తానుగా తలుస్తాడు. అప్పుడు జీవుడు క్షరమౌతాడు. అదే జీవుడు ప్రకృతి వికారములకు లోబడక స్వతంత్రుడైతే అక్షరుడౌతాడు. జీవుడికి జ్ఞానప్రకాశం కలుగగానే ఈ విధంగా అనుకుంటాడు " ఇంత కాలము ప్రకృతి అనుకుంటున్నాను. ఈ ప్రకృతి తన వికృతులతో నన్ను భ్రమింప చేసింది. కాని నీరు నీటిలోని చేప వేరు అన్నట్లు ప్రకృతి వేరు, జీవుడు వేరు. నేను నిష్కళంకుడను, నాకు రూపము లేదు, నాకు ఈ ప్రకృతితో సంబంధం లేదు కనుక నేను దానికి దూరంగా ఉంటాను. అసలు ఈ తప్పు ప్రకృతిది కాదు నాదే, సంగమం అంటే ఏమిటో తెలియని వాడిని ప్రకృతితో ఎందుకు కలిసాను. నాకు ఇన్ని రూపములు సంభవించడానికి కారణం ఈ ప్రకృతే కారణం కదా ! ఈ ప్రకృతితో కలిసిన కారణంగా మమతా మమకారాలు చెలరేగి జన్మ వెంట జన్మ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ ప్రకృతిని వదిలి నిర్మలంగా ఉన్నాను. అహంకారం మమత కారణంగా ప్రకృతి ఇన్ని రూపాలు ధరించడానికి కారణం అయింది. నేను ఈ రెండింటిని వదిలితే ప్రకృతి నన్ను ఏమీ చెయ్య లేదు. సోమరితనం, చెడు అలవాట్లయందు ఆసక్తి ప్రకృతి లక్షణములు. అందుకే ఈ ప్రకృతిని వదిలి నిశ్చలానందాన్ని పొందాలి " ఇలా ఆలోచుస్తూ జీవుడు అక్షరత్వమును పొందుతాడు. ధర్మనందనా ! పూర్వము ఈ విద్యను బ్రహ్మ వశిష్టుడికి చెప్పాడు, వశిష్ఠుడు నారదునికి చెప్పాడు, నారదుడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాను. దీని వలన నీకు శాశ్వతానందం కలుగుతుంది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*


*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


  శ్లో𝕝𝕝  *సప్తదోషాః సదా రాజ్ఞా హాతవ్యా వ్యసనోదయాః।*

           *ప్రాయశో యైర్వినశ్యంతి కృతమూలా అపీశ్వరాః॥*  

           *స్త్రియో—క్షా మృగయా పానం వాక్పారుష్యం చ పంచమమ్।* 

           *మహచ్చ దండపారుష్యమ్ అర్థదూషణమేవ చ॥*


తా𝕝𝕝  *దుఃఖాల్ని కలిగించే స్త్రీలపై ఆసక్తి, జూదం, వేటాడటం, మద్యపానం, కఠినంగా మాట్లాడటం, చాలా కఠినంగా శిక్షించటం, డబ్బును అనవసరంగా ఖర్చు చెయ్యటం అనే ఏడు దోషాలనూ రాజు విడిచిపెట్టాలి.....బాగా స్థిరపడ్డ రాజులు కూడా తరచుగా వీటివల్ల నశిస్తారు...*.


*తెలుగు పద్యం:-*


*వెలది జూదంబు పానంబు వేటపలుకు*

*ప్రల్లదంబును దండంబు పరుసదనము।*

*సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ముసేత*

*యనెడు సప్త వ్యసనముల జనదు తగుల*॥


*తా* 𝕝𝕝 *పరస్త్రీ వ్యామోహం, జూదం, మద్యపాన సేవనం, వేట, పరుషంగా మాట్లాడటం, కఠినంగా దండించడం, వృధాగా సొమ్ములను ఖర్చుచేయడం.. ఇవే సప్త వ్యసనాలు అని పద్యం అర్థం....*


✍️VKS💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


  శ్లో𝕝𝕝  *సప్తదోషాః సదా రాజ్ఞా హాతవ్యా వ్యసనోదయాః।*

           *ప్రాయశో యైర్వినశ్యంతి కృతమూలా అపీశ్వరాః॥*  

           *స్త్రియో—క్షా మృగయా పానం వాక్పారుష్యం చ పంచమమ్।* 

           *మహచ్చ దండపారుష్యమ్ అర్థదూషణమేవ చ॥*


తా𝕝𝕝  *దుఃఖాల్ని కలిగించే స్త్రీలపై ఆసక్తి, జూదం, వేటాడటం, మద్యపానం, కఠినంగా మాట్లాడటం, చాలా కఠినంగా శిక్షించటం, డబ్బును అనవసరంగా ఖర్చు చెయ్యటం అనే ఏడు దోషాలనూ రాజు విడిచిపెట్టాలి.....బాగా స్థిరపడ్డ రాజులు కూడా తరచుగా వీటివల్ల నశిస్తారు...*.


*తెలుగు పద్యం:-*


*వెలది జూదంబు పానంబు వేటపలుకు*

*ప్రల్లదంబును దండంబు పరుసదనము।*

*సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ముసేత*

*యనెడు సప్త వ్యసనముల జనదు తగుల*॥


*తా* 𝕝𝕝 *పరస్త్రీ వ్యామోహం, జూదం, మద్యపాన సేవనం, వేట, పరుషంగా మాట్లాడటం, కఠినంగా దండించడం, వృధాగా సొమ్ములను ఖర్చుచేయడం.. ఇవే సప్త వ్యసనాలు అని పద్యం అర్థం....*


✍️💐🌸🌹🙏

దుష్టులు పలికే మాటలు

 దుర్జనైరుచ్యమానాని సస్మితాని ప్రియాణ్యపి | 

అకాలకుసుమానీవ భయం సన్జయన్తి మే ||



దుష్టులు పలికే మాటలు నవ్వుతో కూడి ,మధురంగా ​​ఉన్నా, అకాల సమయంలో వికసించే పువ్వుల వలె భయం వేస్తుంది.


....హితోపదేశ: .

ఇష్టమైన ఆహారం

 ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః 

యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు (7)


ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః 

రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః ఆహారాః సాత్త్వికప్రియాః (8)


అందరికీ ఇష్టమైన ఆహారం మూడు విధాలు. అలాగే యజ్ఞం, తపస్సు, దానం కూడా. వాటి తేడాలను తెలియజేస్తాను విను. సాత్వికులకు ప్రీతికలిగించే ఆహారపదార్థాలు ఇవి: ఆయుర్దాయం, బుద్ధిబలం, శరీరబలం, ఆరోగ్యం, సుఖం, సంతోషం—వీటిని వృద్ధిచేస్తూ రసమూ, చమురూ కలిగి, చాలాకాలం ఆకలిని అణచిపెట్టి, మనసుకు ఆహ్లాదం కలగజేసేవి.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

ఓటమి ఎదురైన ప్రతిసారి

 *నేటి సూక్తి*


*ఓటమి ఎదురైన ప్రతిసారి లక్ష్యం మార్చుకుంటూ పోతే ఎప్పటికీ విజయం రాకపోవచ్చు. కానీ ఒకే లక్ష్యం పెట్టుకుని పలు రకాలుగా ప్రయత్నిస్తే విజయం తప్పక లభిస్తుంది*

*క్రాంతి కిరణాలు* 


*కం. ఓడిన వేళల యందున*

*జాడలనే మార్చబోకు జయములు పోవున్* 

 *వీడక లక్ష్యము మదిలో* 

*చూడుము గెలుపొందు బాట శుభముల కొరకై*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

తేలిగ్గా తీసిపారేయకండి

  🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥 *మాటలే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు.. అదే దూరాన్ని దగ్గర చేయగలవు..మాటలే మనుషుల జీవితంలో అమృత్తాన్ని నింపగలవు.. విషాన్ని చిందించగలవు.. అందుకే మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి..మనిషి యొక్క మనసు చెడు మాటలతో నిండిపోయినప్పుడు మంచి మాటలు చెప్పేవారు మూర్కుల గాను.. చెడు మాటలు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనిపిస్తారు* 🔥 మాట నిచ్చెన లాంటిది.. ఎత్తుకు తీసుకెళ్లగలదు.. కిందకి పడేయగలదు.. మనకు సాధ్యమైనంత వరకు ఎదుటి వారితో మంచి సంభాషణ చేయటానికే ప్రయత్నం చేయాలి.. వినటం వినకపోవడం వారి ఆలోచన మీదే వదిలేయాలి.. మనం ఎంతటి ఆవేశంలో ఉన్న ఎదుటివారు బాధ పడేలా మాట్లాడకపోవడం అదే మనలోని విజ్ఞతకు నిదర్శనం.. మన సహనానికి కొలమానం🔥🔥మీ అల్లంరాజు భాస్కర శర్మ శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర. స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి. సలహాలు ఉచితం. 🙏🙏🙏

భగవంతుడి విభూతులే

 *"స్త్రీల గుణాలు అన్నీ భగవంతుడి విభూతులే !!!”*

                

*నారీణాం… కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమ..!!*


*'స్త్రీలలో కనిపించే ఈ ఏడు గుణాలు నా విభూతులే!’ అంటున్నాడు భగవానుడు.*


*దీనిని బట్టి ఈ ఏడు లక్షణాలు పురుషులలో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా శోభిస్తాయని కావచ్చు. లేదా ఈ ఏడు లక్షణాలు స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తాయని కావచ్చు. ఇవి స్త్రీలకు సహజ గుణాలు కూడా.*


*'స్త్రీ’ సృష్టిలో అందమైన దేవుడి వరం. స్త్రీ అంటేనే ప్రేమ, అనురాగం. తన జీవిత కాలంలో నిర్వహించే ప్రతి పాత్రను ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది. నాలుగు గోడల ఇంటిని స్వర్గం చేస్తుంది. ఏ పనిలోనైనా రాణించ గలిగే ధైర్యం, సత్తా ఉన్నది స్త్రీకి మాత్రమే! అని చాటిచెబుతుంది స్త్రీ.*


*అద్భుత మూర్తి స్త్రీ. స్త్రీశక్తిని, స్త్రీల గుణగణాలను పొగుడుతూ, ప్రతి వస్తువులోను ఒక్కొక్క విభూతిని చెప్పి, “స్త్రీలలో మాత్రం ఏడు విభూతులుగా నేనున్నాను” అని భగవంతుడు అనటంలో స్త్రీల యొక్క విశిష్ఠతను చాటుతుంది.*


*ఏమిటా ఏడు విభూతులు అంటే...*


*1. కీర్తి :*

*సత్కర్మలు, దానధర్మాలు, పూజాపునస్కారాలు, యజ్ఞయాగాదులు మొదలైన కర్మల ద్వారా, త్యాగ భావన ద్వారా కీర్తిని సంపాదించటం, భర్తకు అనుకూలంగా కుటుంబ నిర్వహణ గావించటం ఇవి స్త్రీ సహజగుణాలు.*


*2. శ్రీ :*

*శ్రీ అంటే సంపద. అంతేకాదు సంపదతోబాటు శరీర సౌందర్యాన్ని కాపాడుకుంటూ అందంగా అలంకరించుకోవటం కూడా స్త్రీ యొక్క సహజ గుణమే. శ్రీ అంటే లక్ష్మి.*


*3. వాక్కు :* 

*వాక్కు అంటే సరస్వతి. విద్య, బుద్ధి, జ్ఞానం సంపాదించటం, చల్లగా, తియ్యగా, మధురంగా మాట్లాడటం కూడా భగవంతుని విభూతియే.*


*4. స్మృతి :*

*జరిగిపోయిన విషయాలను గుర్తుపెట్టుకొనే జ్ఞాపకశక్తి, జ్ఞానాన్ని మరచిపోకుండా ఉండటం. సందర్భానికి తగినట్లు జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకోవటం స్మృతి. ఇదీ భగవంతుని విభూతియే.*


*5. మేధా :*

*ధారణాశక్తి. విన్న విషయాలను బుద్ధిలో నిలుపుకొనే శక్తి. జ్ఞాన విషయాలు, తత్త్వవిచారణ చేయటానికి కావలసిన మేధాశక్తి స్త్రీలలో అధికం. ఇదికూడా భగవంతుని విభూతియే.*


*6. ధృతి :*

*ధర్మకార్యాలలో, దైవకార్యాలలో ధైర్యంతో, పట్టుదలతో పాల్గొనటం, మోక్ష సిద్ధికొరకు పట్టుదల. ఇంద్రియ, మనస్సులను నిగ్రహించగల బలం. ఇది కూడా స్త్రీలలో అధికమే.*


*7. క్షమా :* 

*అత్తమామలను ఆదరించటంలోను, భర్తకు అనుకూలంగా నడుచుకోవటంలోను, పిల్లల పోషణలోను, బావలు, మరుదులు, తోటికోడళ్ళు మొదలైనవారితో నేర్పుతో వ్యవహరించటంలోను ఎంతో ఓర్పు ఉండాలి. ఇది కూడా స్త్రీ సహజగుణమే.*


*ఇవన్నీ స్త్రీలలో ఉంటే వాటిని భగవంతుని విభూతులుగా చూడాలి.*


*విశేషార్థం :*

*నార అంటే భగవత్‌ సంబంధమైన.. అని. భగవత్‌ కార్యాలలో, లేదా భగవత్‌ సంబంధమైన జ్ఞానంలో జీవించేవారు పురుషులైనా, స్త్రీలైనా పైన చెప్పిన సద్గుణాలు వారిలో ప్రకాశిస్తే అవి భగవత్‌ విభూతులే.*


*┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈*

     🙏🏻🙏🏻 🙏🏻సేకరణ🙏🙏🏻🙏🏻

హిందూ ధర్మం

  🌹హిందూ ధర్మం 🌹


మనం చూశాం కదా, మన సనాతన సంప్రదాయంలో వారాలకు నామాలను ఎలా నిర్ణయించారని. ఇప్పుడు ఒకసారి గ్రీకు, రోమన్ సంప్రదాయాలను పరికించి చూద్దాం. ఎందుకంటే ఈ రోజు మనం అనుసరిస్తున్న పాశ్చాత్య వారక్రమం కూడా మన జ్యోతిష్య శాస్త్ర లెక్కలతో సరిపోతున్నది. పైగా అది క్రైస్తవ సంప్రదాయానికి చెందినది కాదు, అసలు కొన్ని మతాలకు మనలా కాలగణన లేదు. ఈనాడు ప్రపంచం అనుసరిస్తున్న కాలగణనలో చాలా శాతం గ్రీకు, రోమన్ మూలాలు కలిగిందే. మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు? వారి మూలం ఎక్కడ ఉంది? వంటి అంశాలు పరిశీలిద్దాం.

పాశ్చాత్య క్యాలెండర్ మీద పరిశోధన చేసినవారి ప్రకారం వారాలకు రోమన్ దేవతల పేర్లను నిర్ణయించారు ఎందుకంటే ఇది రోమన్, గ్రీకు నాగరికతల నుంచి తీసుకున్న అంశం కనుక. దాన్ని జెర్మన్లు స్వీకరించి, అందులో కొన్ని అంశాలను మార్చి ఈ రోజు మనం పాటిస్తున్న ఆంగ్ల వారాల పేర్లు తీసుకువచ్చారు. ఒకసారి సారూప్యతలు (similarities) గమనించండి.


సన్‌డే అనే పదం dies solis అనే లాటిన్ పదం నుంచి వచ్చింది, దాని అర్దం సూర్యుని వారము అని. ఇది పేగన్లకు సెలవు దినము. (తమ మత ఆరాధన పద్ధతులకు, విశ్వాసాలకు భిన్నంగా ప్రకృతిని పూజించే సంప్రదాయం కలవారిని పేగన్‌ (Pagan) లుగా ముద్రవేసి, వారి మతం మార్చడమో లేదా పూర్తిగా ఆ నాగరికతను, జీవనవిధానాన్ని ఊచకోత కోసేవారు క్రైస్తవులు. అలా ప్రకృతిని ఆరాధించేవారిని పేగన్లు అనడం మొదలుపెట్టారు.) అలాగే ఇది వారి దేవునకు సంబంధించిన దినము.


మన్‌డే అనగా మూన్ (చంద్రునికి) కు చెందినది అని జెర్మన్ సంప్రదాయం చెప్తున్నది. ఇది dies lunae అనే లాటిన్ పదం అనువాదం. చంద్రుడిని దేవతగా పూజించే సంప్రదాయం అక్కడ కూడా ఉండేది.


Tuesday అనేది Týr అనే దేవతకు సంబంధించినది. ఈయన యుద్ధానికి సంబంధించిన దేవత అని రోమన్ల విశ్వాసం. ఈయన గురించి జెర్మన్ పేగనిజంలో కూడా వర్ణన ఉంది. మనకు ఇది మంగళవారం. మంగళుడంటే కుజుడు, ఆయన భూమిపుత్రుడు కూడా కనుక భౌమవారమని పేరు వచ్చింది. మన జ్యోతిష్యంలో కూడా కుజుడిని యుద్ధానికి, తగువులకు, రక్తానికి కారకుడిగా చెప్తాము.


Wednesday అనేది Wodan (Odin) కు సంబంధించినది. లాంటిన్ లో దీన్ని dies Mercurii అన్నారు. ఈ దేవతను ఇంగ్లాండులో కూడా 17 శత్బాదం వరకు పూజించేవారు. వీరు సోల్స్ (Souls) కి మరణం తర్వాత మార్గదర్శనం చేస్తారని భావిస్తారు. బుద్ధికి సంబంధించిన దేవతగా రోమన్ల విశ్వాసం. ఈయన కవితలు, సంగీతానికి సంబంధించిన దేవత. మన జ్యోతిష్యంలో ఇది బుధవారం. బుధుడు బాగుంటే విద్యలలో రాణిస్తారు. బుధుడి ధ్యానం చేత బుద్ధికి సంబంధించిన బాధలు తొలగుతాయని మనకు తెలిసిందే.


Thursday అనేది నోర్స్ దేవుడు Thor కు సంబంధించిన రోజట. లాంటిన్ లో దీన్ని dies Jovis అన్నారు. రోమన్లకు ముఖ్యమైన దేవుడు Jupiter, గురువుకు ప్రీతికరమైన రోజు. పురాతన రోమన్ల సంస్కృతిలో ఈయన దేవతలకు అధిపతి. మన జ్యోతిష్యంలో దేవ గురువు, బృహస్పతి.


Friday అనేది లాటిన్ పదం dies veneris అనువాదం. Venus అంటే శుక్రుడు. రోమన్లకు ఈయన ప్రేమ, అందం, శృంగారం, సంతానం, కోరికలకు చెందిన దేవత. మన జ్యోతిష్యంలో కూడా శుక్రుడిని పైన చెప్పుకున్న లక్షణాలకు అధిపతిగా చెప్తారు.


Saturday లో Saturn ఉంది. మూలాల్లోకి వెళ్ళకుండా చూసినా Saturn అంటే శని. మనకు శనివారమే వారికి Saturday. అయినా ఒకసారి పరిశీలిద్దాం. Saturday అనేది లాటిన్ పదం dies Saturni అనువాదం. రోమన్లకు ఈయన సృష్టి, ప్రళయం, సంపద, వ్యవసాయం, మోక్షానికి సంబంధించిన దేవత. మన జ్యోతిష్యంలో శని పూర్వ కర్మకు సూచిక. పుణ్య కర్మ ఉంటే ఆయన సంపదలను, సుఖాలను, అధికారాన్ని ఇస్తాడు, పాప కర్మ ఉంటే వాటిని నశింపజేస్తాడు.🌹🌹🌹

దేవున్ని చూసారా

  ఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి ఒక జర్నలిస్ట్ వెళ్ళింది, ఏదైనా సెన్సషనల్ న్యూస్ వేసి మంచిపేరు తెచ్చుకోవాలని ఆమె కోరిక. 

అక్కడే ఉన్న ఒక భక్తుడిని ఇలా అడిగింది.


జర్నలిస్ట్ :మీ వయసు ఎంతుంటుందండి.??


భక్తుడు :85 ఏళ్లు ఉంటాయండి


జర్నలిస్ట్ :ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు..??

 

భక్తుడు : నాకు బుద్ది వచ్చినప్పటి నుండి 


జర్నలిస్ట్ : మరి దేవున్ని చూసారా..?? 


భక్తుడు : లేదండి 


జర్నలిస్ట్ :మరి ఎందుకు అంత నమ్మకంగా ప్రతిసారి గుడికి వెళుతున్నారు..?? 


భక్తుడు :మీరెక్కడ నుండి వచ్చారు..?? 


జర్నలిస్ట్ :సిటీ నుండి 

భక్తుడు :అక్కడ ఎక్కువ కుక్కల్ని పెంచుకొంటారట కదా..??


జర్నలిస్ట్ :అవును, చాలా ఇళ్లల్లో పెంచుకొంటారు


భక్తుడు :మాది చిన్న పల్లెటూరండి, అక్కడ పంట చేల్లో దొంగలు పడకుండా కొంత మంది మామూలు కుక్కల్ని పెంచుకొంటారు.


జర్నలిస్ట్ :నేనడిగిన దానికి మీరు చెప్పేదానికి ఏమిటి సంబంధం? 


భక్తుడు :రాతిళ్ళు పంట చేల దగ్గర ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మొరుగుతుంది, అది చూసి చుట్టూ దూరంగా ఉన్న కుక్కలు కూడా మొరుగుతాయి, కానీ దొంగని చూసింది ఒక కుక్క మాత్రమే, కానీ మిగతా కుక్కలు దాని మీదున్న నమ్మకంతో నే మొరిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు. 

అలాగే వేల సంవత్సరాలనుండి ఎంతో మంది, ఋషులు, పుణ్యపురుషులు, రాజులు, తపస్సు తో దేవుడి నే చూసివచ్చిన వాళ్ళు ఇలా ఎంతో మంది హిందూ ధర్మం లో పురాణపురుషులు చెప్పారు దేవుడు ఉన్నాడని, దొంగ విషయంలో యోచనా శక్తి లేని కుక్కలే ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరిగాయి, అలాంటిది ఆలోచించే శక్తి, ఉన్న మనుషులం మనం 

దేవుడు విషయంలో మన పూర్వీకులనే నమ్మలేమా..!!

తప్పకుండా మంచిమనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకొంటాను. 


జర్నలిస్ట్ : క్షమించండి. మీ అనుభవం అంత, నా వయసు లేదు, తప్పు గా మాట్లాడిన జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను.


రాసిన వారికి..👏👏👏👏

కర్తవ్యం, బాధ్యత*

 318d5;2411e6;

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀తేడా ఏమిటి?


              *కర్తవ్యం, బాధ్యత*

                 ➖➖➖✍️

```

కర్తవ్యం, బాధ్యత

అనే రెండు మాటలూ మనకు ఒకేలా వినిపిస్తాయి. అర్థాలు ఒకేలా తోస్తాయి. వాస్తవానికి ఆ రెండూ వేరువేరు. 


విధి నిర్దేశించేవి కర్తవ్యాలు. 

కావాలని మనిషి నెత్తికెత్తుకొనేవి బాధ్యతలు. 


కాబట్టే కర్తవ్యాలకు ముగింపు(డిటాచ్ మెంటు)ఉంటుంది. బాధ్యతలకు కొనసాగింపు(అటాచ్మెంట్) ఉంటుంది. 


వివేక వంతులు కర్తవ్యాలను పూర్తి చేస్తారు.


తక్కినవారంతా జీవితాంతం బాధ్యతల్లో మునిగి తేలుతూ ఉంటారు. 


రామాయణంలోని ఇద్దరు మహర్షుల చర్యలను పరిశీ లిస్తే ఆ తేడా బాగా తెలుస్తుంది. 


రాముణ్ని ఓ ఇంటి వాణ్ని చేసింది- కన్నతండ్రి దశరథుడో, పిల్లనిచ్చిన జనకుడో కాదు. 


జాగ్రత్తగా గమనిస్తే దానికి కర్త విశ్వామిత్రుడు. అది ఆయనకు విధి నిర్దేశించిన కర్తవ్యం. ఆయన పుట్టుకకు లోకకల్యాణం, సీతారామకల్యాణం అనేవి రెండూ ప్రధాన లక్ష్యాలు.


వీటిలో మొదటిది- రాముడి అవతార పరమార్ధంతో ముడివడినది. 


రెండోది- ఆ పరమార్థం నెరవేరేందుకు కావలసిన శక్తిని సమకూర్చినది. ఆ శక్తి పేరు సీతమ్మ. 


విశ్వామిత్రుడు తొలుత తాటక వధతో తన కర్తవ్యానికి శ్రీకారం చుట్టాడు. రాక్షసులతో వైరానికి నాంది పలికాడు. యాగ సంరక్షణమనేది ఓ నెపం. అది ధనుర్వేదాన్ని కూలంకషంగా రాముడి వశం చేసేందుకు ఏర్పడిన సన్నివేశం. రావణ సంహారానికి అవసరమైన సాధన సంపత్తిని రాముడికి సమకూర్చే ప్రయత్నం అది. యాగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు.


మధ్యలో స్త్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలు రాముడికి బోధపడేందుకై అహల్యను పరిచయం చేశాడు. గృహస్థాశ్రమ స్వీకారానికి తగిన ముందస్తు అవగాహనను కల్పించాడు. ఇదంతా ఆ ముని కర్తవ్యం! సీతారామకల్యాణం పూర్తవగానే రంగంలోంచి ఆయన నిష్క్రమించాడు. వారి సంసారం ఏ విధంగా నడుస్తోందో, రాక్షస సంహారం ఎలా జరిగిందో విశ్వామిత్రుడికి అనవసరం.


అది రాముడి పని. రాక్షసుల రక్తాన్ని తోడేయడం, ఇక తానిచ్చిన అస్త్ర శస్త్రాలే చూసుకొంటాయి. పంట కోత పూర్తయ్యాక- ఇక కొడవలికి పనేమిటి? కర్తవ్యం ముగిసిందనే మాటకు, డిటాచ్ మెంట్ అనే భావానికి అసలైన అర్థం అదే!


రామరావణ సంగ్రామం మధ్యలో అగస్త్య మహర్షి ప్రవేశించాడు. రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. మూడుసార్లు పారాయణ చేయించాడు. 


వెంటనే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. తన ఉపదేశం ఫలించిందా లేదా, రాముడు తేరుకొని రావణాసురుణ్ని సంహరించాడా లేదా... వంటి సంశయాలు, కుతూహలాలు ఆ మహర్షికి లేనే లేవు. 


తాను నేర్పించిన గాండీవ పాండిత్యం ఎంత ఘనమైనదో విశ్వామిత్రుడికి తెలుసు. 

రాముడికి తాను ఉపదేశించిన మంత్ర శక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్త్యుడికి తెలుసు. 

అంతవరకే వారి పని!


కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షణం వేదిక దిగిపోయారిద్దరూ!


పిల్లలను పెంచి పెద్ద చేయడం, సంస్కారాన్ని అలవరచడం, విద్యాబుద్ధులు నేర్పించడం వరకు తల్లిదండ్రుల కర్తవ్యం. 


పెరిగి పెద్దయి వారివారి జీవితాల్లో స్థిర పడినా- ఇంకా వారి బాగోగులు తమవే అనుకోవడం ఓ బలహీనత. 


తాము బతికున్నంత వరకు తమదే బాధ్యత అనుకోవడం కర్తవ్యం కాదు. దాని కొనసాగింపు. 


కర్తవ్యాలు సంతృప్తికి, 

బాధ్యతలు అశాంతికి కారణాలవుతాయి!


ఆ తేడాను గుర్తించిన జీవితాలు సుఖశాంతులకు నోచుకుంటాయి!!✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మాటలే కదా

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥 *మాటలే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి.. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు.. అదే దూరాన్ని దగ్గర చేయగలవు..మాటలే మనుషుల జీవితంలో అమృత్తాన్ని నింపగలవు.. విషాన్ని చిందించగలవు.. అందుకే మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి..మనిషి యొక్క మనసు చెడు మాటలతో నిండిపోయినప్పుడు మంచి మాటలు చెప్పేవారు మూర్కుల గాను.. చెడు మాటలు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనిపిస్తారు* 🔥 మాట నిచ్చెన లాంటిది.. ఎత్తుకు తీసుకెళ్లగలదు.. కిందకి పడేయగలదు.. మనకు సాధ్యమైనంత వరకు ఎదుటి వారితో మంచి సంభాషణ చేయటానికే ప్రయత్నం చేయాలి.. వినటం వినకపోవడం వారి ఆలోచన మీదే వదిలేయాలి.. మనం ఎంతటి ఆవేశంలో ఉన్న ఎదుటివారు బాధ పడేలా మాట్లాడకపోవడం అదే మనలోని విజ్ఞతకు నిదర్శనం.. మన సహనానికి కొలమానం🔥🔥మీ అల్లంరాజు భాస్కర శర్మ శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర. స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి. సలహాలు ఉచితం. 

బ్రాహ్మణుడి పేరును

 రావణుడు సీతను అపహరించాల్సి వచ్చింది.

అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు.

హనుమంతుడు శ్రీరాముడి విషయం తెలుసుకోవాల్సి వచ్చింది.

ఆయన బ్రాహ్మణ వేషం ధరించాడు.

కాలనేమి హనుమంతుడిని మభ్యపెట్టాలనుకున్నాడు.

అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు.

కర్ణుడు పరశురాముడి నుంచి ధనుర్వేదం నేర్చుకోవాల్సి వచ్చింది.

అతడు తనను బ్రాహ్మణుడిగా చెప్పి మోసం చేశాడు.

శ్రీకృష్ణుడు కర్ణుడిని మోసం చేయవలసి వచ్చింది.

ఆయన బ్రాహ్మణ వేషం ధరించాడు.

భీముడు జరాసంధుడిని మాయోపాయంతో చంపాల్సి వచ్చింది.

అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు.

వరుణుడు రాజు హరిశ్చంద్రుడిని పరీక్షించాలనుకున్నాడు.

అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు.

విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని మోసం చేయవలసి వచ్చింది.

అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు.

ఇంద్రుడు కర్ణుడి కవచకుండలాలు తీసుకోవాలనుకున్నాడు.

అతడు బ్రాహ్మణ వేషం ధరించాడు.

భగవాన్ విష్ణువు మహాబలి చక్రవర్తిని మోసం చేయవలసి వచ్చింది.

ఆయన వామనుడై బ్రాహ్మణ బాలుడి వేషం ధరించాడు.

అశ్వినీకుమారులు చ్యవన మహర్షి భార్య సత్యవతిని పరీక్షించాలనుకున్నారు.

వారిద్దరూ బ్రాహ్మణ వేషం ధరించారు.

వనవాసంలో పాండవులు, కుంతీదేవి, ద్రౌపది – అనేకసార్లు బ్రాహ్మణ వేషం ధరించారు.

ఎవరైతే సామాజిక వ్యతిరేక, దేశవ్యతిరేక పాపం లేదా క్రూరమైన పని చేయాలనుకున్నారో...

వాళ్లందరూ బ్రాహ్మణ వేషమే ధరించారు.

ఎందుకు?

ఎందుకంటే బ్రాహ్మణుడు అంటేనే విశ్వాసం.

బ్రాహ్మణుడు అంటేనే నమ్మకం.

బ్రాహ్మణుడు అంటేనే సత్యం.

బ్రాహ్మణుడు అంటేనే ధర్మం.

బ్రాహ్మణుడు అంటే సర్వజన హితే రతుడు.

బ్రాహ్మణుడు అంటే అందరినీ సుఖంగా చూడాలనుకునేవాడు.

బ్రాహ్మణుడు అంటే అందరినీ కలుపుకుని సన్మార్గంలో నడిపేవాడు.

బ్రాహ్మణుడు అంటే దేశభక్తి, దూరదృష్టి, అధ్యయనం, సమర్పణ, జ్ఞానం, త్యాగం, తపస్సు, యజ్ఞం, వినయం, ఓర్పు, నిరపేక్షత, సంతృప్తి, సంయమం.

అందుకే...

బ్రాహ్మణుడి పేరును, బ్రాహ్మణుడి కీర్తిని దుర్వినియోగం చేసుకోవడం చాలా సులభం.

అతని వేషంతో, అతని పేరుతో ప్రజలను మోసం చేయడం సులభం.

అతని పేరుతో మోసం చేయడం సులభం.

ఇదే ఈ రోజు కూడా జరుగుతోంది...

ధన్యవాదాలు!!


                   *_🌻శుభమస్తు🌻_*

                              ఇట్లు

                                మీ

                         భవధీయుడు

                అవధానుల శ్రీనివాస శాస్త్రి 

                  ❀┉┅━❀🕉️❀┉┅━❀

           🙏సర్వే జనాః సుఖినోభవంతు🙏

          🙏లోకాస్సమస్తా సుఖినోభవంతు🙏

           🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏