12, మే 2025, సోమవారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🕉️సోమవారం 12 మే 2025🕉️*


          *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది...

``


    *వాల్మీకి రామాయణం*

           *36వ భాగం*                 


భరతుడి సైన్యంలోని ఏనుగుల, గుర్రముల పద ఘట్టనలని విన్న రాముడు “ఇంతకుముందు ఎన్నడూ ఇలా లేదు, ఎక్కడ చూసినా జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి. ఎవరో ఒక రాజో, లేక ఒక రాజ ప్రతినిధో అరణ్యానికి వేటకి వచ్చినట్టు అనుమానంగా ఉంది” అని లక్ష్మణుడిని పిలిచి, ఒకసారి పరిశీలించి రమ్మన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు దగ్గరలో ఉన్న ఒక పుష్పించిన పెద్ద చెట్టు ఎక్కి తూర్పు దిక్కుకి చూశాడు. ఆ దిక్కున ఆయనకి ఏమీ కనపడలేదు. తరువాత ఉత్తర దిక్కుకి చూసేసరికి, కోవిదార వృక్షం ధ్వజంగా కలిగినటువంటి ఒక పెద్ద సైన్యం కనబడింది. అప్పుడు లక్ష్మణుడు రాముడితో....```


*అగ్నిం సమ్షమయతు ఆర్యహ్ సీతా చ భజతాం గుహాం।*

*సజ్యం కురుష్వ చాపం చ షరామ్హ్ చ కవచం తథా॥*

```

“అన్నయ్యా! వెంటనే మన దగ్గరున్న అగ్నిహోత్రాలన్నిటిని తగ్గించేసెయ్యి. లోపలున్న బాణాలు, ధనుస్సులు, అక్షయ బాణతూణీరాలు పట్టుకొని తొందరగా వస్తే మనం యుద్ధం చెయ్యాలి. ఎందుకంటే, నీకు రాజ్యం దక్కకుండా చేసి, అరణ్యాలకి పంపించడమే కాకుండా, శత్రుకంటకం లేకుండా చేసుకోవడానికని నిన్ను సంహరించడం కోసం భరతుడు అరణ్యానికి వచ్చాడు. ఇంతకన్నా మంచి అదును దొరకదు. ఇంతకాలం దాచుకున్న కోపాన్ని ఇప్పుడు బయట పెడతాను. ఉత్తరక్షణం భరతుడి తల, కైకేయి తల కత్తిరిస్తాను. నిన్ను సంహరించడానికి వస్తున్న ఆ సైన్యాన్ని నాశనం చేస్తాను. అందరినీ చంపాక, వాళ్ళ కళేబరాలని క్రూర మృగాలు తింటుంటే, చూసి నేను సంతోషిస్తాను” అన్నాడు.


లక్ష్మణుడి మాటలను విన్న రాముడు “లక్ష్మణా! ఎందుకు తీసుకురావాలి ధనస్సు. వాటితో భరతుడిని సంహరించాలా? తండ్రిగారి కోరిక ప్రకారం నేను అరణ్యాలకి వచ్చాను, నన్ను చూడడానికి భరతుడు వస్తున్నాడు. ఇప్పుడు నేను భరతుడికి ఎదురెళ్ళి యుద్ధం చెయ్యనా?”```


*ధర్మమర్థం చ కామం చ పృ్ఇథివీం చాపి లక్శణ |*

*ఇచ్చ్హామి భవతామర్థె ఎతత్ ప్రతిషృ్ఇణొమి తె ||*```


ధర్మము కాని, అర్థము కాని, కామము (కామము అనగా కోరిక) కాని, ఈ మూడిటిలో నేను ఏ ఒక్కదాన్ని అనుభవించాల్సి వచ్చినా, నా తోడపుట్టిన మిగిలిన తమ్ముళ్ళు అనుభవించని దానిని నేను అనుభవించను. వాళ్ళు ఆనందంగా ఉంటే, నేను ఆనందంగా ఉంటాను. అసలు ఎప్పుడైనా భరతుడు నీ పట్ల అపచారంతో, నువ్వు బాధ పడేటట్టు ప్రవర్తించాడా? మరి నీకు భరతుడి మీద ఎందుకు అనుమానము?” అని రాముడు చెప్పినా కాని, లక్ష్మణుడు ఆ చెట్టు మీద కూర్చుని భరతుడి మీద కోపంతో బుసలు కొడుతూ ఉండేసరికి- “నీకు రాజ్యం చెయ్యాలని ఉందేమో, నేను భరతుడితో చెప్పి రాజ్యాన్ని నీకు ఇమ్మంటాను, భరతుడు ఎటువంటి వాడో చూద్దువు కాని” అని రాముడు అన్నాడు.


ఈ మాటలకి సిగ్గుపడిన లక్ష్మణుడు “అన్నయ్యా! నిన్ను చూడడానికి దశరథ మహారాజు గారు వచ్చారేమో. వదిన ఇక్కడ అరణ్యాలలో బాధ పడుతోందని, తనని తీసుకెళ్ళడానికి నాన్నగారు వచ్చుంటారు” అన్నాడు.


అప్పటిదాకా కూర్చొని ఉన్న రాముడు ఒకసారి పైకిలేచి ఆ సైన్యం వైపు చూసి “నాన్నగారు అధిరోహించే టటువంటి శత్రుంజయం అనే భద్రగజం కనిపిస్తోంది, ఆ భద్రగజం మీద తెల్లటి గొడుగు నీడలో నాన్నగారు వస్తుంటారు, కాని ఇవ్వాళ ఆ గజం మీద తెల్లటి గొడుగు నాకు కనపడడం లేదు లక్ష్మణా, నా మనసు ఏదో పీడని శంకిస్తోంది” అన్నాడు.



ఇంతలో భరతుడు.. “ఏనాడు నేను సీతమ్మ పక్కన కూర్చున్న లక్ష్మణ సహితుడైన రాముడిని చూస్తానో, ఆనాటి వరకు నా మనస్సుకి శాంతి లేదు. ఏనాడైతే నేను సీతారాముల పాదములను నా తల మీద పెట్టుకుంటానో, అప్పుడు నా తల మీద పడినటువంటి వారి పద రజస్సు వలన నాకు శాంతి కలుగుతుంది. ఏనాడైతే సీతారాములు బంగారు ఆసనం మీద కూర్చొని ఉంటారో, ఏనాడైతే రాముడికి పట్టాభిషేకం జరుగుతుందో ఆనాటిదాకా నా మనస్సుకి శాంతి లేదు” అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు.```


*తం తు కృ్ఇష్ణ అజిన ధరం చీర వల్కల వాససం |*

*దదర్ష రామం ఆసీనం అభితహ్ పావక ఉపమం ||*

*సిమ్హ స్కంధం మహా బాహుం పుణ్డరీక నిభ ఈక్షణం |*

*పృఇథివ్యాహ్ సగర అంతాయా భర్తారం ధర్మ చారిణం ||*```


గొప్ప ధర్మం తెలిసినవాడు, సింహంలా నడవగలిగినవాడు, గొప్ప బాహువులు ఉన్నవాడు, సాగరము చేత పరివేష్టింపబడి నటువంటి సమస్త భూమండలాన్ని పరిపాలించగల సమర్ధత కలిగినవాడైన రాముడు, ఈనాడు నార చీర కట్టుకొని, ఒక ముని కూర్చున్నట్టు కృష్ణాజినాన్ని పైన ఉత్తరీయంగా వేసుకొని, వీరాసనం వేసుకొని కూర్చునేసరికి, చూసిన భరతుడి మనస్సు ఆగలేదు. నా వల్ల అన్నగారికి ఇన్ని కష్టాలు వచ్చాయని, పరిగెత్తుకుంటూ వస్తూ, “రామా” అని ఒకసారి పిలిచి, శోకభారంతో నేల మీద పడిపోయాడు.


అప్పుడు భరతుడు రాముడిని చూసేసరికి, ఆయన శరీరం అంతా మట్టితో కప్పబడి ఉంది. రాజభవనంలో చీని చీనాంబరాలు కట్టుకొని, అంగరాంగములు(గంధము మొదలైన పరిమళ భరితములు) పూసుకొని తిరగవలసిన వాడు, ఇలా మట్టితో కప్పబడడం చూసి భరతుడు కన్నీరు పెట్టుకున్నాడు.

ఆ అరణ్యంలోకి ఒకేసారి ఇంత గొప్ప సైన్యం వచ్చేసరికి, ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి గిరిజనులు అందరూ అక్కడికి చేరి “ఈ మధ్య పర్ణశాల కట్టుకొని ఉంటున్నాయన తమ్ముడంట ఈయన, ఆయన రాజు అంట, తండ్రి మాట కోసం అరణ్యానికి వచ్చాడంట రాజ్యం వద్దని, ఆ అన్నయ్యని తీసుకెళ్ళడానికి తమ్ముడు వచ్చాడంట, ఎక్కడైనా చూసామా ఈ విడ్డూరం, రాజ్యం నాకు వద్దంటే, నాకు వద్దని దెబ్బలాడుకుంటున్నారు, ఆహా, ఏమి అన్నదమ్ములయ్యా” అని ఆ గిరిజనులు మాట్లాడుకుంటున్నారు.


అప్పుడు రాముడు పరుగు పరుగున వచ్చి, భరతుడిని పైకి లేపి, స్వస్థత కలిగిన తరువాత తన వొళ్ళో కుర్చోపెట్టుకున్నాడు. తరువాత ఆయన భరతుడి గెడ్డం పట్టుకొని పైకి ఎత్తి “నాన్నా భరతా! ఈ వేషం ఏంటి. నార చీరలు కట్టుకున్నావు, తలకి జటలు వేశావు, కాంతి హీనుడవయిపోయి నల్లగా అయిపోయావు, చాలా దూరంలో ఉన్న మీ మేనమామ యుధాజిత్ గారి కైకేయ దేశం నుంచి ఎప్పుడు వచ్చావు. అసలు నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకి వస్తుంటే, దశరథుడు నిన్ను ఎలా విడిచిపెట్టాడు. నాకు ఎందుకో భయంగా ఉంది, దశరథ మహారాజు పరలోకగతుడు కాలేదు కదా, అందుకని నువ్వు రాలేదు కదా, చిన్నవాడిని చేసి రాజ్యాన్ని ఎవరూ తస్కరించలేదు కదా, నీకు ఎటువంటి ఆపద రాలేదు కదా.


పురోహితులని సరైన వాళ్ళని పెట్టుకున్నావా, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం వలనే ఈశ్వరుడి కృప లభించి, వేళకి వర్షాలు పడతాయి, ధనుర్వేదానికి సంబంధించి సరైన పురోహితుడిని ఏర్పాటు చేసుకున్నావా, ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అనైక్యత వస్తుంది, అలాగని తక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరియైన అభిప్రాయం బయటకి రాకపోవచ్చు, నువ్వు వాళ్ళ మీద గద్దిస్తే, వారు నిన్ను చూసి భయపడవచ్చు, అలాగని అందరినీ నీ దగ్గర చేర్చుకుంటే, వాళ్ళకి నీ మీద భయం లేకపోవచ్చు, అందుకని వారిని ఎప్పుడు నీ దగ్గరకి చేర్చుకోవాలో, ఎప్పుడు దూరం పెట్టాలో, ఈ రెండిటిలో సమతౌల్యాన్ని పాటిస్తున్నావా.


మంత్రులకు ఉపధ పరీక్షలు నిర్వహిస్తున్నావా (ఉపధ పరీక్షలు అంటే రహస్య పరీక్షలు. పూర్వకాలం రాజు ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చేముందు, రహస్యంగా తమ అంతఃపుర కాంతలకి కానుకలు ఇచ్చి, వాటిని ఎవరికీ తెలియకుండా, ఆ కాంత చేత మంత్రి పదవికి నిర్ణయింపబడ్డ వ్యక్తికి కానుకగా ఇప్పించేవారు. అంటే, ఆ కానుకలని చూసి, ఆ కాంతని చూసి మోహపడతాడేమోనని. ఇది ఒక పరీక్ష. అలాగే, విదేశ రాజుల గూఢచారులుగా వచ్చినట్టు ఈ దేశపు రాజే కొంతమందిని పంపి, నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు చెబితే నీకు డబ్బు ఇస్తా’మని చెప్పి కొంత లంచం ఇచ్చేవారు, అలా డబ్బుకి లొంగుతాడేమోనని పరీక్ష చేసేవారు. ఇలా అనేక పరీక్షలలో నెగ్గిన వారికే మంత్రి పదవి ఇచ్చేవారు), అలాగే రాజ్యంలో 18 మంది మీద ముగ్గురు గూఢచారులని పెట్టాలి (కోట రాజద్వారాన్ని కాపాడే బంట్రోతు నుంచి రాజ్య ప్రధాన కోశాధికారి దాకా ఆ 18 మందిలో ఉన్నారు), ఈ ముగ్గురు గూఢచారులకి తాము గూఢచారులమన్న విషయం ఒకరికొకరికి తెలియకూడదు, అలాగే యువరాజు మీద, ప్రధాన మంత్రి మీద, సేనాపతి మీద గూఢచారులని పెట్టకూడదు, విదేశ రాజ్యాలలో ముఖ్యమైన హోదాల్లో ఉన్నవారి దగ్గర గూఢచారులని పెట్టాలి, ఎప్పటికప్పుడు శత్రురాజుల కదలికలను తెలుసుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తగా చేస్తున్నావా భరతా” అని రాజ్య పరిపాలనకి సంబంధించిన పలు విషయాలను అడిగాడు రాముడు.```


*రామస్య వచనం ష్రుత్వా భరతహ్ ప్రత్యువాచ హ |*

*కిం మె ధర్మాద్విహీనస్య రాజధర్మహ్ కరిశ్యతి ||*```


రాముడి మాటలు విన్న భరతుడు 

“అన్నయ్యా! నువ్వు నాకు ఇవన్నీ చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాని, నాకు ఎందుకు అన్నయ్యా ఈ ధర్మాలన్నీ, ఈ ధర్మాలన్నీ రాజుకి కావాలి, నేను రాజుని కాను, ఎప్పటికీ రాజుని కాను. కాని అన్నయ్యా, మన వంశంలో ఉన్న సంప్రదాయం ప్రకారం, ఎవరు పెద్ద కొడుకుగా జన్మిస్తాడో, వాడు మాత్రమే పట్టాభిషేకం చేయించుకోవాలి. నాకు ఈ ధర్మం ఒక్కటే తెలుసు. నాకన్నా పెద్దవాడివి నువ్వు ఉండగా, నేను రాజధర్మాలు తెలుసుకోవలసిన అవసరం లేదు. అందుకని నేను ఎప్పుడూ ఆ రాజధర్మాల్ని తెలుసుకోలేదు. నీ దగ్గరికి ఒకరు వచ్చి అడిగితేనే నువ్వు కాదనలేవు, అలాంటిది రాజ్యం అంతా వచ్చి నిన్ను అడుగుతోంది పట్టాభిషేకం చేసుకోమని, నువ్వు వాళ్ళ కోరిక తీర్చకుండా ఎలా ఉండగలవు. అందుకని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకో. నేను లేనప్పుడు మా అమ్మ దశరథ మహారాజుని రెండు కోరికలని అడిగింది. సత్యానికి కట్టుబడి దశరథుడు ఆ రెండు కోరికలని తీరుస్తాను అన్నాడు. అందుకని నువ్వు అరణ్యాలకి వెళ్ళావు. కాని నేను ఆ రాజ్యాన్ని తీసుకోలేదు. అదే సమయంలో మా అమ్మ విధవ అయ్యింది. ఇవ్వాళ నాన్నగారు లేరు అన్నయ్యా, నువ్వు వెళ్ళిపోవడం చేత ఇంత ఉపద్రవం వచ్చింది” అన్నాడు.


ఈ మాట విన్న రాముడు, కూర్చున్న చోటనుంచే కింద నేల మీద పడి మూర్చపోయి, అది మట్టి అని కూడా చూడకుండా తండ్రిని తలుచుకొని ఆ మట్టిలో దొర్లుతూ ఏడుస్తున్నాడు. రాజ్యం పోయినప్పుడు కాని, అరణ్యాలకి వెళ్ళమన్నప్పుడు కాని ఏడవని రాముడు, ఇలా నేల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే సీతమ్మ, లక్ష్మణుడు గబగబా ఆయన దగ్గరికి వచ్చారు.```


*సీతె మృ్ఇతస్తె ష్వషురహ్ పిత్రా హీనొ.అసి లక్శ్మణ |*

*భరతొ కుహ్ఖమాచశ్టె స్వర్గతం పృ్ఇథివీపతిం ||*

*సీతా పురస్తాద్ర్వజతు త్వమెనామభితొ వ్రజ |*

*అహం పష్చాద్గమిశ్యామి గతి ర్హ్యెశా సుదారుణా ||*```


వాళ్ళని చూసిన రాముడు… 

“భరతుడు ఇప్పుడే వచ్చి ఒక మాట చెప్పాడు. సీతా! మీ మామగారు మరణించారు. లక్ష్మణా, నీకు తండ్రిగారు మరణించారు. జీవితంలో ఎన్నడూ నడవకూడని నడక నడుద్దాము సీతా, బయలదేరు” అన్నాడు.

(రాముడిని కన్న తండ్రిలా, ఎల్ల వేళలా కాపాడుకోడానికి లక్ష్మణుడు ఉన్నాడు, అందుకని లక్ష్మణుడితో నీ తండ్రి చనిపోయాడు అని చెప్పాడు. అలాగే, ఇంటి యజమాని మొదట నడవాలి, ఆయన వెనకాల స్త్రీ నడవాలి. ఇంటి యజమాని చనిపోతే, ఆయనకి ధర్మోదకాలు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు స్త్రీ ముందు నడుస్తుంది, అలాంటి నడకని దారుణమైన నడక అంటారు.) అప్పుడు రాముడు మందాకినీ నదిలో స్నానం చేసి, దక్షిణ దిక్కుకి తిరిగి దశరథుడికి జలతర్పణలు సమర్పించాడు. తరువాత లక్ష్మణుడిని పిలిచి, పర్ణశాలలో ఉన్నటువంటి గార కాయలని బద్దలు కొట్టి, ఉండ చేసి, రేగు పిండితో కలిపి తీసుకురమ్మన్నాడు. అలాగే దర్భల యొక్క కొసలు దక్షిణ దిక్కుకి ఉండేటట్టు పరవమని, వాటి మీద పిడచలు పెట్టాడు (తాను ఏది తింటున్నాడో, అదే పితృదేవతలకి తద్దినం నాడు పెట్టాలి).


అలా దశరథుడికి తద్దినం పెట్టాక, నలుగురూ వచ్చి కూర్చున్నారు. అప్పుడు భరతుడు “అన్నయ్యా! నేను ఎప్పుడూ రాజ్యం కోరుకోలేదు. మా అమ్మ అడిగిందన్న మాట నాకు తెలీదు. నాకు ఈ రాజ్యం అక్కర్లేదు. ఈ రాజ్యాన్ని నువ్వు మాత్రమే భరించగలవు, నేను భరించలేను, అందుకనే ఇంతమంది పౌరులు, జానపదులు మొదలైన వారు వచ్చారు. కనుక, దయచేసి ఈ రాజ్యాన్ని స్వీకరించు” అన్నాడు. 


“మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించాల్సిన వాడు మన తండ్రిగారు. ఆయన నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు, నిన్ను రాజ్యం తీసుకోమన్నారు. నీకు ఇచ్చినది నువ్వు తీసుకో, నాకు ఇచ్చినది నేను తీసుకుంటాను. అంతేకాని తండ్రిగారు ఇచ్చినదాన్ని తారుమారు చేసే అధికారం మనకి లేదు” అని రాముడు అన్నాడు. 


ఆ రోజు రాత్రికి అందరూ పడుకున్నారు, మరునాడు ఉదయం లేచి అందరూ నిశబ్దంగా కూర్చొని ఉన్నారు. ఈలోగా వశిష్ఠుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయిలతో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు (రాముడిని చేరుకోవాలనే తొందరలో, భరతుడు మిగతా పరివార జనులకంటే ముందు వచ్చాడు). అప్పుడు కౌసల్య ఆ మందాకినీ నది ఒడ్డున ఉన్నటువంటి గార పిండి, రేగు పిండి ముద్దలని చూసి, రాముడు వీటిని తద్దినంలో పెట్టాడంటే, రాముడు ఇవ్వాళ వీటిని తిని బతుకుతున్నాడని బాధపడింది.


అందరూ అక్కడికి చేరుకున్నాక, భరతుడు లేచి “అన్నయ్యా! ఏ రాజ్యాన్ని మా అమ్మ నాకు ఇవ్వాలనుకుందో, ఆ రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను. గాడిద, గుర్రం నాలుగు కాళ్ళ జంతువులు, ఒకే అరణ్యంలో ఉంటాయి. అలా ఉన్నంతమాత్రాన గుర్రం నడక గాడిదకి వస్తుందా. మనిద్దరమూ దశరథ మహారాజు కుమారులమే, కాని రాజ్య నిర్వహణలో నీకున్న శక్తి నాకు ఎలా వస్తుంది. అందుకని ఈ రాజ్యభారాన్ని నువ్వే స్వీకరించు” అన్నాడు.


అప్పుడు రాముడు “ఒక మహాసముద్రంలో రెండు పుల్లలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. అవి కొంత కాలం కలిసి నీళల్లో తేలుతూ వెళతాయి. అవే పుల్లలు ఆ ప్రవాహంలో ఏదో ఒక రోజు విడిపోక తప్పదు. మన జీవితాలు కూడా అంతే. మనం ఎందులో నుంచి ఒకడిగా వచ్చామో, మళ్ళి అందులోకి ఒక్కడిగానే వెళ్ళిపోతాము. తోడుగా వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. ఇది తెలుసు కాబట్టే దశరథ మహారాజు యజ్ఞయాగాది క్రతువులు చేసి పుణ్యాన్ని మూటకట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు. తండ్రిగారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు, దాని ప్రకారం ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకోవాలి” అన్నాడు.


అప్పుడు భరతుడు “అన్నయ్యా! నేను నా తల్లిని చంపుదాము అని అనుకున్నాను. అమ్మని చంపితే నువ్వు నాతో మాట్లాడవని నేను చంపలేదు. సభాముఖంగా నాన్నగారిని నేను ఎప్పుడూ నిందించలేదు. మరణకాలం దగ్గర పడిపోతుంటే బుద్ధి విపరీతత్వాన్ని పొందుతుంది, బహుశా దశరథ మహారాజుకి కూడా అలా విపరీత బుద్ధి పుట్టడం వల్ల ఆయన ఒక పొరపాటు పని చేశారు. ఇక్ష్వాకు వంశం యొక్క సంప్రదాయం ప్రకారం పెద్దవాడు పరిపాలించవలసిన రాజ్యాన్ని ధర్మం తప్పి నాకు ఇచ్చారు. ఒకవేళ తండ్రిగారు ఏదన్నా చెయ్యరాని పని చేస్తే, కుమారుడు దానిని దిద్దాలి. అందుకని నువ్వు ఆ పొరపాటుని దిద్దాలి. అలాగే క్షత్రియుడికి రాజ్యపాలనం చెయ్యవలసిన ధర్మం ఉంది, కాని నువ్వు రాజ్యపాలనం మానేసి తాపసి వృత్తిని అవలంబించావు” అన్నాడు. 


రామభరతుల మధ్య జరుగుతున్న ఈ ధర్మ సంభాషణని వినడానికి దేవతలు, మహర్షులు మొదలైన వారు వచ్చి నిలబడ్డారు.


ఈ మాటలు విన్న రాముడు…

“దశరథ మహారాజు కైకేయిని వివాహం చేసుకునే ముందు, మీ తాతగారైన కైకేయ రాజుకి ఒక మాట ఇచ్చారు. కైకేయి కడుపున ఎవరు పుడతారో వాళ్ళకి రాజ్యం ఇస్తానని నాన్నగారు ప్రమాణం చేశారు. ఈ విషయం వశిష్ఠుడికి, సుమంత్రుడికి తెలుసు. ఈ విషయం తెలిసిన కైకేయ రాజు, వశిష్ఠుడు, సుమంత్రుడు ఊరుకున్నారు. మీ అమ్మ రెండు వరాలు అడిగింది, మళ్ళి ఆ రెండు వరాలకి దశరథుడు బద్ధుడయ్యాడు. అందుకని ఎటునుంచి చూసినా రాజ్యం నీకే వస్తుంది, తండ్రిగారు చేసిన దానిలో పొరపాటు ఉంటే నేను దిద్దాలి, కాని అందులో పొరపాటు లేదు. మనం పుట్టక ముందే నాన్నగారు రాజ్యాన్ని నీకు ఇచ్చారు. కనుక నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలి.```


*త్వం రాజా భవ భరత స్వయం నరాణాం |*

*వన్యానాం అహం అపి రాజ రాణ్ మృ్ఇగాణాం ||*```


“నువ్వు అయోధ్యా పట్టణానికి వెళ్ళిపో, నరులకందరికి నువ్వు రాజుగా ఉండి శ్వేత ఛత్రం కింద కూర్చొని పరిపాలన చెయ్యి. నేను అరణ్యాలకి వెళ్ళి చెట్టుకింద కూర్చొని మృగాలని నేను పరిపాలిస్తాను. అందుకని, భరతా నువ్వు వెళ్ళిపో” అన్నాడు.


*రేపు...37వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

తొలి తెలుగు వాగ్గేయకారుడు

 *🙏నేడు తొలి తెలుగు వాగ్గేయకారుడు...!!*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య జయంతి


🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺


🌸వ్యక్తిత్వ వికాస ప్రకాశకుడిలా అన్నమయ్య


🌿తెలుగు సాహితీ చరిత్రలో తనకంటూ ఒక చరిత్ర లిఖించుకుని తొలి తెలుగు వాగ్గేయకారుడిగా, పదకవితా పితామహుడు అన్నమయ్య జయంతి నేడు. 


🌸ఆయన పూర్తి పేరు తాళ్ళపాక అన్నమాచార్యులు.


🌿ఆయన రాసిన సంకీర్తనలు, సాహితీ చరిత్ర ఆధారంగా లభించిన వివరాల ప్రకారం అన్నమయ్య 1408 వ సంవత్సరంలో  వైశాఖ పూర్ణిమా నాడు జన్మించాడు. 


🌸కడప జిల్లా ప్రస్తుత రాజంపేట నియోజకవర్గం తాళ్ళపాక గ్రామంలో నివసించే నారాయణసూరి,


🌿 లక్కమాంబ దంపతులకు జన్మించిన వరప్రసాదంగా అన్నమయ్యను అభివర్ణిస్తారు.


🌸32 వేలకు పైగా సంకీర్తనలు వ్రాసి తెలుగు భాషలోని మాధుర్యాన్ని, భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం వంటి 


🌿నవరసాలను తన పాటలలో, పద్యాలలో పొందుపరచిన గొప్ప పదకవితా పితామహుడాయన. 


🌸ఆయన రాసిన 32 వేలకు పైచిలుకు సంకీర్తనలలో చాలావరకూ  అందుబాటులో లేవు. 


🌿కేవలం  15 వేల సంకీర్తనలు మాత్రమే మిగిలాయి. ఆయన రాయలసీమకు చెందిన వ్యక్తి కావడంతో రచనల్లో ఎక్కువగా కడప, రాయలసీమ యాసే తాండవించేది.


🌸అన్నమయ్య భక్తుడే కాదు.. చైతన్యపరుడు కూడా,..


🌿అన్నమాచార్యులను అంతా వైష్ణవ భక్తుడిగానే చూశారు. వేంకటేశ్వర స్వామిపై ఆయన రాసిన సంకీర్తనలే అందుకు కారణం. 


🌸కానీ, ఆయన వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించిన ఓ గొప్ప గురువు. 


🌿ఒక మనిషి జీవితం ఎలా ఉండాలో,  ఒక మనిషి ఎలా మెలగాలో చాటి చెప్తూ ఆయన రాసిన కీర్తనలు, 


🌸రచనలు ఎన్నో ఉన్నాయి. వ్యక్తిత్వ వికాసానికి సరియైన మార్గదర్శి.


🌿అంతెందుకు బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మమొక్కటే…”అంటూ ఆయన రాసిన గొప్ప సంకీర్తన అర్ధం మనుషులంతా సమానమేనని’ చెప్పే ప్రయత్నం. 


🌸ఇందులో సామాజిక కోణం దాగి ఉంది. ఊరూరా తిరుగుతూ ఆయన చేసిన కవితలలో జీవన అర్థం, సామాజిక పరమార్థం దాగి ఉన్నాయి.


🌿“మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు సహజి వలె నుండి ఏమి సాధింపలేడు!”


🌸అంటూ అన్నమయ్య రాసిన సంకీర్తన నేటికీ ప్రతి మనిషిలోనూ ఓ కొత్త ఉత్తేజం నింపుతుంది. 


🌿ఈ కీర్తన ద్వారా “ఈ లోకంలో మనిషన్నవాడు ఉద్యోగి కావాలి”  అని చెప్పుకొచ్చాడు అన్నమయ్య.


🌸 “ఉద్యోగి”అంటే  “ఉద్యోగం చేసేవాడు” అని అర్ధం కాదు. ఆయన భావంలో “ఉద్యోగి”అంటే “ఉద్యమించే వాడు” అని అర్థం. కార్యసిద్ది కోసం ప్రయత్నించేవాడు, 


🌿ఆ క్రమంలో ఎదురయ్యే కష్టాలకు కృంగిపోకుండా పాటుపడే వాడు అని అర్ధం.


🌸“వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ

జాడతో నూరకుండితే జడుడౌను!

ఓడక తపసియైతే ఉన్నతోన్నతుడౌ

కూడక సోమరి ఐతే గుణహీనుడౌను!”


🌿అన్నమయ్య చేతి నుండి జాలు వారిన ఈ శ్లోకం భావం - 


🌸“శ్రద్ధతో చేస్తేనే కార్యాలు పూర్తవుతాయని, మొక్కుబడిగా ప్రయత్నిస్తే ఫలితం ఉండదని..”


🌿శ్రద్ధగా చదివితే వేదశాస్త్ర పారంగతుడివి అవుతావు, నామమాత్రంగా చదివితే మూర్ఖుడిగా మిగులుతావు”అంటున్నాడు అన్నమయ్య. 


🌸తపస్సు సాధించాలంటే మనలోని శక్తియుక్తులన్నీ “కూడబెట్టి” పరిశ్రమించాలి. సోమరులకి దక్కేది కాదిది. అందుకే “సోమరిగా ఉంటే గుణహీనుడివి అవుతావు”

అని పలికాడు అన్నమయ్య. 


🌿అనాడే చదువు విలువ ఏమిటో, మనిషిలో ఎంతటి మార్పును తీసుకు వస్తుందో తన పదకవితలతో చక్కగా చెప్పాడు అన్నమయ్య.


🌸మరి అన్నమయ్య చెప్పేది నిజమేగా మొక్కుబడిగా చదివితే ఏం ప్రయోజనం? శ్రద్దగా చదివితేనే జ్ఞాన గుణ సంపన్నులం కాగలం. 


🌿ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో కష్టనష్టాలకు క్రుంగిపోకూడదు అని అన్నమయ్య ఆనాడే వ్యక్తి వికాసానికి దోహదం చేసే ఎన్నో సంకీర్తనలు వ్రాశాడు.


🌸అన్నమయ్య రాసిన సంకీర్తనలలో ఎక్కువ శృంగారం గురించే ఉండటం విశేషం. 


🌿అంటే ఆయన శ్రీ మహావిష్ణువు భక్తుడిగానే కాకుండా.., ఒక మనిషి జీవితంలో వచ్చే నవరసాల భావో ద్వేగాలను కూడా తన రచనలలో ఆనాడే పరిచయం చేశాడు.


🌸అన్నమయ్య కీర్తనలను వెంకటేశ్వరస్వామి ముద్రతో రచించి ఆ స్వామికే అంకితంచేసిన ధన్యజీవి!


🌿 అందుకే వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే అన్నమయ్యను స్మరించినట్లే. అన్నమయ్యను స్మరిస్తే స్వామిని స్మరించినట్లే!


🌸తరాలు మారినా.. యుగాలు మారినా.. వేంకటేశ్వర స్వామి ఉన్నంత కాలం అన్నమయ్య స్థానం పదిలం"..🚩👏🥭🥭


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

కుచేలోపాఖ్యానం🙏 రెండవ భాగం

 .🙏       శ్రీ మహాభాగవతము 

కుచేలోపాఖ్యానం🙏

రెండవ భాగం 

  "హలధరు డమర్త్య చరితుం

డలఘు భుజాబలుఁ డొనర్చు నద్భుత కర్మం

బులు పెక్కు నాల్గు మోములు

గల మేటియు లెక్క పెట్టఁ గలఁడె నరేంద్రా! "


ఓ మహారాజా! పరీక్షిత్తు! హాలాయుధుడూ, దివ్యచారిత్రుడూ, భుజబల సంపన్నుడూ అయిన బలరాముడి అద్భుత కార్యాలను పొగడడానికి నాలుగు ముఖాలు గల బ్రహ్మదేవుడి కైనా సాధ్యంకాదు.”



అనిన మునీంద్రుఁ గన్గొని ధరాధిపుఁ డిట్లను "పద్మపత్త్రలో

చనుని యనంత వీర్యగుణ సంపద వేమఱు విన్న నైననుం

దనియదు చిత్త మచ్యుతకథావిభవం బొకమాటు వీనులన్

వినిన మనోజపుష్ప శరవిద్ధుఁడు నైన విరామ మొందునే?


భావము:- అలా చెప్పిన శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు “అంబుజాక్షుని అనంత గుణ సంపదలను గురించీ, పరాక్రమ ప్రాశస్త్యాలను గురించీ, ఎన్ని మార్లు విన్నా తనివితీరదు. ఒక్కసారి విష్ణు కథా వైభవాన్ని వింటే చాలు, ఎంత మన్మథ వికార పీడితు డైనా సరే మరీ మరీ వినకుండా ఉండ లేడు.



హరిభజియించుహస్తములుహస్తము; లచ్యుతుఁగోరి మ్రొక్కు త

చ్ఛిరము శిరంబు; చక్రధరుఁ జేరిన చిత్తము చిత్త; మిందిరా

వరుఁగను దృష్టి దృష్టి; మురవైరి నుతించిన వాణి వాణి; య

క్షరుకథ లాను కర్ణములు కర్ణములై విలసిల్లుఁబో భువిన్.


భావము:- హరిని పూజించే చేతులే చేతులు; అచ్యుతునికి నమస్కరించే శిరస్సే శిరస్సు; ఆ చక్రధారుని చూసే కన్నులే కన్నులు; ఆ లక్ష్మీపతిని పొగడే నోరే నోరు; ఆ శాశ్వతుని కథలను వినే చెవులే చెవులు.


హరిపాదతీర్థ సేవా

పరుఁడై విలసిల్లునట్టి భాగవతుని వి

స్ఫురితాంగము లంగము; లా

పరమేశ్వరు నెఱుఁగ నాకుఁ బలుకు మునీంద్రా! "


భావము:

ఓ మునీశ్వరా! శ్రీహరి పాదపద్మాలు అనే తీర్థాలను సేవించి ధన్యుడైన భాగవతుని అంగములే అంగములు. ఆ పరమాత్ముని తెలుసుకొనే మార్గం నాకు విశదీకరించి చెప్పవలసినది.”


అనుడు వేదవ్యాసతనయుఁ డా యభిమన్యు-

  తనయునిఁ జూచి యిట్లనియెఁ బ్రీతి

"జనవర! గోవింద సఖుఁడు కుచేలుండు-

  నా నొప్పు విప్రుండు మానధనుఁడు

విజ్ఞాని రాగాది విరహితస్వాంతుండు-

  శాంతుండు ధర్మవత్సలుఁడు ఘనుఁడు

విజితేంద్రియుఁడు బ్రహ్మవేత్త దారిద్య్రంబు-

  బాధింప నొరులఁ గార్పణ్యవృత్తి


నడుగఁ బోవక తనకుఁ దా నబ్బినట్టి

కాసు పదివేల నిష్కముల్‌ గాఁ దలంచి

యాత్మ మోదించి పుత్రదారాభిరక్ష

యొక విధంబున నడుపుచు నుండు; నంత


భావము:

ఇలా అడిగిన ఆ అభిమన్య పుత్రునితో, వేదవ్యాస మహర్షి పుత్రుడు శుకుడు సంతోషంతో ఇలా అన్నాడు. “ఓ మహారాజా! కుచేలుడు అని శ్రీకృష్ణునికి ఒక బాల్యమిత్రుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణోత్తముడు చాలా గొప్పవాడు, అభిమానధనుడు, విజ్ఞానవంతుడు, రాగద్వేషాలు లేనివాడు, పరమశాంతమూర్తి, ధర్మతత్పరుడు, జితేంద్రియుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. తన ఇంట దారిద్ర్యం దారుణంగా తాండవిస్తున్నా, ఎవరినీ దీనంగా యాచించి ఎరుగడు. తనంత తానుగా ప్రాప్తించిన కాసును కూడా పదివేలుగా భావించి, ఏదో ఒక విధంగా భార్యాపుత్రులను పోషిస్తూ వస్తున్నాడు. ఇలా ఉండగా....


లలితపతివ్రతా తిలకంబు వంశాభి-

  జాత్య తద్భార్య దుస్సహ దరిద్ర

పీడచేఁ గడు నొచ్చి పెదవులు దడుపుచు-

  శిశువు లాఁకటి చిచ్చుచేఁ గృశించి

మలమల మాఁడుచు మానసం బెరియంగఁ-

  బట్టెఁ డోరెము మాకుఁ బెట్టు మనుచుఁ

బత్త్రభాజనధృతపాణులై తనుఁ జేరి-

  వేఁడిన వీనులుసూఁడినట్ల


యైన నొకనాఁడు వగచి నిజాధినాథుఁ

జేరి యిట్లని పలికె "నో జీవితేశ!

తట్టుముట్టాడు నిట్టి పేదఱిక మిట్లు

నొంప దీని కుపాయ మూహింప వైతి. "


భావము:

కుచేలుని భార్య మహాపతివ్రత. చక్కటి వంశంలో పుట్టిని సాధ్వి. బిడ్డలు ఆకలి మంట చేత కృశించి ఎండిన పెదవులను నాలుకతో తడుపుకుంటూ చేతుల్లో ఆకులూ గిన్నెలూ పట్టుకుని తల్లి వద్దకు వచ్చి పట్టెడన్నం పెట్టమని అడుగుతుంటే, ఆమె మనసు క్షోభ భరించలేకపోతోంది. అందుకని, ఆమె భర్తతో “ప్రాణేశ్వరా! ఇలా తాండవిస్తూ ఉన్న పేదరికం బాగా బాధిస్తోంది కదా. దీని గురించి మీరు ఆలోచించడం లేదు.”


"బాలసఖుఁడైన యప్పద్మపత్త్రనేత్రుఁ

గాన నేఁగి దారిద్య్రాంధకార మగ్ను

లైన మము నుద్ధరింపుము; హరికృపా క

టాక్ష రవిదీప్తి వడసి మహాత్మ! నీవు.


వరదుఁడు, సాధుభక్తజనవత్సలుఁ, డార్తశరణ్యుఁ, డిందిరా

వరుఁడు, దయాపయోధి, భగవంతుఁడు, కృష్ణుఁడు దాఁ గుశస్థలీ

పురమున యాదవప్రకరముల్‌ భజియింపఁగ నున్నవాఁడు; నీ

వరిగిన నిన్నుఁ జూచి విభుఁ డప్పుడ యిచ్చు ననూన సంపదల్‌.

(ఇది చాలా మంచి పద్యం )


భావము:

శ్రీకృష్ణుడు ఆశ్రితులను రక్షించేవాడు; సజ్జనుల ఎడ, భక్తుల ఎడ వాత్సల్యము కలవాడు; దయాసాగరుడు; యాదవులు తనను సేవిస్తుండగా, ఆనర్తదేశములలో కోసలమున గల పట్టణమైన కుశస్థలీపురములో ఉన్నాడు కదా. ఒక్కసారి, ఆ శ్రీపతిని దర్శించండి. మిమ్మల్ని చూస్తే చాలు వెంటనే ప్రభువు మీకు అనంతమైన సంపదలు అనుగ్రహిస్తాడు.


కలలోనం దను మున్నెఱుంగని మహాకష్టాత్ముడై నట్టి దు

ర్బలుఁ డాపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు లుల్లంబులోఁ

దలఁపన్నంతన మెచ్చి యార్తిహరుఁడై తన్నైన నిచ్చున్; సుని

శ్చలభక్తిన్ భజియించు వారి కిడఁడే సంపద్విశేషోన్నతుల్‌? "

( ఇది కూడా అద్భుతమైన పద్యం )

భావము:

కలలోకూడా తన్నెన్నడూ స్మరించని పాపాత్ముడు అయినా, ఆపదలు చుట్టుముట్టి నప్పుడు, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ ఆశ్రిత రక్షకుడి పాదారవిందాలను మనసారా స్మరిస్తే చాలు. ఎలాంటి వాడిని అయినా కనికరిస్తాడు. అవసరమైతే తనను తానే అర్పించుకుంటాడు కదా. అంతటి మహానీయుడు నిరంతరం భక్తితో తనను సేవించే మీవంటి వారికి విశేషమైన సంపదలు ఇవ్వకుండా ఉంటాడా?”


అని చెప్పిన నమ్మానిని

సునయోక్తుల కలరి భూమిసురుఁ డా కృష్ణుం

గన నేఁగుట యిహపర సా

ధనమగు నని మదిఁ దలంచి తన సతితోడన్.


భావము:

ఇలా చెప్తున్న ఆ ఇల్లాలి మాటలకు కుచేలుడు సంతోషించాడు. శ్రీకృష్ణుడిని చూడడానికి వెళ్ళడం ఇహపర సాధనమని మనసులో అనుకుని, తన భార్యతో ఇలా అన్నాడు.


"నీవు సెప్పిన యట్ల రాజీవనేత్రు

పాదపద్మంబు లాశ్రయింపంగఁ జనుట

పరమశోభన మా చక్రపాణి కిపుడు

గాను కేమైనఁ గొంపోవఁ గలదె మనకు? "


భావము:

“నీ వన్నట్లు శ్రీకృష్ణుడిని ఆశ్రయించడం పరమ కల్యాణప్రదమే. కాని చక్రి దగ్గఱకు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళడానికి కానుక ఏదయినా మన వద్ద ఉందా.”


అనిన నయ్యింతి "యౌఁగాక" యనుచు విభుని

శిథిల వస్త్రంబు కొంగునఁ బృథుక తండు

లముల నొకకొన్ని ముడిచి నెయ్యమున ననుపఁ

జనియె గోవింద దర్శనోత్సాహి యగుచు.


భావము:

భర్త అభిప్రాయం అంగీకరించిన కుచేలుని భార్య “అలాగే” అంది. పిమ్మట అతని చినిగిన పైట కొంగులో కొన్ని అటుకులు ముడివేసి ప్రేమతో ప్రయాణానికి సిద్ధం చేసింది. కుచేలుడు గోవింద దర్శనం అవుతుందనే ఉత్సాహంతో బయలుదేరాడు.



నయిన నా భాగ్య; మతని దయార్ద్రదృష్టి

గాక తలపోయఁగా నొండు గలదె? యాతఁ

డేల నన్ను నుపేక్షించు? నేటిమాట?"

లనుచు నా ద్వారకాపుర మతఁడు సొచ్చి.


ఇట్లు ప్రవేశించి రాజమార్గంబునం జనిచని కక్ష్యాంతరంబులు గడచి చని ముందట.


భావము:

ఇలా అనుకుంటూ కుచేలుడు ద్వారకాపట్టణం రాజమార్గాన ముందుకు సాగిపోయి, కొన్ని ప్రాకారాలు దాటాక అక్కడ....



విశదమై యొప్పు షోడశసహస్రాంగనా-

  కలితవిలాస సంగతిఁ దనర్చి

మహనీయ తపనీయ మణిమయగోపుర-

  ప్రాసాద సౌధ హర్మ్యములు సూచి,

మనము బ్రహ్మానందమును బొందఁ గడు నుబ్బి-

  సంతోషబాష్పముల్‌ జడిగొనంగఁ

బ్రకటమై విలసిల్లు నొక వధూమణి మంది-

  రమున నింతులు చామరములు వీవఁ



దనరు మృదుహంసతూలికా తల్పమందుఁ

దానుఁ బ్రియయును బహు వినోదములఁ దనరి

మహితలావణ్య మన్మథమన్మథుండు

ననఁగఁ జూపట్టు పుండరీకాయతాక్షు.



ఇందీవరశ్యాము, వందితసుత్రాముఁ-

  గరుణాలవాలు, భాసుర కపోలుఁ,

గౌస్తుభాలంకారుఁ, గామితమందారు-

  సురుచిరలావణ్యు, సుర శరణ్యు

హర్యక్షనిభమధ్యు, నఖిలలోకారాధ్యు-

  ఘనచక్రహస్తు, జగత్ప్రశస్తు,

ఖగకులాధిపయానుఁ, గౌశేయపరిధానుఁ-

  బన్నగశయను, నబ్జాతనయను,


మకరకుండల సద్భూషు, మంజుభాషు

నిరుపమాకారు, దుగ్ధసాగరవిహారు,

భూరిగుణసాంద్రు, యదుకులాంభోధి చంద్రు,

విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు


నల్లకలువలవంటి శ్యామలవర్ణం వాడూ;

 దేవేంద్రునిచేత పొగడబడేవాడూ; కృపకు నిలయమైనవాడూ; ప్రకాశించే చెక్కిళ్ళు కలవాడూ; కౌస్తుభాన్ని ధరించిన వాడూ; ఆర్ధులకు కల్పవృక్షం వంటివాడూ; సౌందర్యమూర్తీ; దేవతలకు దిక్కయినవాడూ; సింహమధ్యముడూ; సకల లోకాల యందు పూజింపబడువాడూ; చక్రాయుధుడూ; జగత్తులో పేరెన్నిక గలవాడూ; గరుడవాహనుడూ; పీతాంబరధారీ; ఆదిశేషునిపై శయనించేవాడూ; అరవిందాక్షుడూ; మకరకుండల భూషణుడూ; మధుర భాషణుడూ; సాటిలేని మేటి సౌందర్యం కలవాడూ; పాలసముద్రంలో విహరించే వాడూ; సుగుణ సాంద్రుడూ; యాదవకుల మనే సాగరానికి చంద్రుడూ; సర్వ వ్యాపకుడూ; ప్రకాశ వంతుడూ; జయ శీలుడూ; సహన శీలుడు అయిన శ్రీకృష్ణుడు ఆయనకు కనిపించాడు,

                       సశేషం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సోమవారం🕉️* *🌹12 మే 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     *🕉️సోమవారం🕉️*

    *🌹12 మే 2025🌹*

    *దృగ్గణిత పంచాంగం*     

              

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖ మాసం - శుక్లపక్షం*


*తిథి      : పౌర్ణమి* రా 10.25 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*

*వారం    : సోమవారం* ( ఇందువాసరే )

*నక్షత్రం   : స్వాతి* ఉ 06.17 వరకు ఉపరి *విశాఖ* 


*యోగం : వరీయాన్* పూర్తిగా రోజంతా 

*కరణం   : భద్ర* ఉ 09.15 *బవ* రా 10.25 ఉపరి *బాలువ*


 *సాధారణ శుభ సమయాలు:* 

                *-ఈరోజు లేవు-*


అమృత కాలం  : *రా 11.18 - 01.05*

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*


*వర్జ్యం            : మ 12.33 - 02.21*

*దుర్ముహూర్తం  : మ 12.30 - 01.21 & 03.04 - 03.56*

*రాహు కాలం    : ఉ 07.14 - 08.51*

గుళికకాళం       : *మ 01.40 - 03.17*

యమగండం     : *ఉ 10.27 - 12.04*

సూర్యరాశి : *మేషం*

చంద్రరాశి : *తుల/వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 05.45*

సూర్యాస్తమయం :*సా 06.40*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.38 - 08.12*

సంగవకాలం         :*08.12 - 10.47*

మధ్యాహ్న కాలం    :     *10.47 - 01.21*

అపరాహ్న కాలం    : *మ 01.21 - 03.56*


*ఆబ్ధికం తిధి         : వైశాఖ పౌర్ణమి*

సాయంకాలం       :*సా 03.56 - 06.30*

ప్రదోష కాలం         :  *సా 06.30 - 08.43*

రాత్రి కాలం           :*రా 08.43 - 11.41*

నిశీధి కాలం          :*రా 11.41 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.53*

---------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*పరమేశ్వర !పరంధామ !పరమాత్మ !పరమ శివ*

*సర్వేశా, పరాత్పర, పార్వతీ పతి, జగన్నాధ, జగదీశ్వరా,*

*పశుపతి పాప హర పాలయమాం పరమేశ.!!*


🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

పంచాంగం 12.05.2025 Monday,

 ఈ రోజు పంచాంగం 12.05.2025 Monday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస శుక్ల పక్ష పౌర్ణమి తిథి ఇందు వాసర స్వాతి నక్షత్రం వరియాన్ యోగః: భద్ర తదుపరి బవ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.


నమస్కారః , శుభోదయం

సేవమూర్తులకు వందనాలు..!!

 (అంతర్జాతీయ నర్సుల దినోత్సవం)


సేవమూర్తులకు వందనాలు..!!


మీ సేవ లకు శతకోటి వందనాలు

సేవలో మాతృమూర్తితో సమానులు

నాన్న వాళ్లు దగ్గర లేకున్నా

మీరు ఉన్నారన్న ధైర్యం ఇచ్చారు...


మీ సేవలు పరమ పవిత్రము

ప్రాణాలకు తెగించి పునర్జన్మ పోస్తారు

మీ మాటలు ఔషధాలతో సమానం

మీ సేవలకు రుణపడి ఉంది యావత్ ప్రపంచం..


అమ్మ లాలన చూపించారు

నాన్నల ధైర్యాన్ని నింపారు

వైద్యుడికి చేయూతనిచ్చారు

కంటికి రెప్పలా రోగిని కాపాడుతున్నారు..


సహనానికి మారుపేరుగా నిలిచి

సమయానికి ఔషధాలు అందించి

రోగికి మనోధైర్యాన్ని చెప్పి

కొండంత భరోసాగా నిలిచి కనిపించారు..


మానవ సేవకు నిజమైన ఆకారంతో

మరో వైద్యుడిలా దర్శనమిచ్చారు

సహనములో భూదేవిలా నిలిచి

మనిషిలో భగవంతుని రూపం చూశారు..


ధన్వంతరి వలె భూమిపై మొలచి

మానవజాతికి మహోపకారం చేస్తూ

దగ్గరుండి జీవిని బయటికి తీస్తూ

 తల్లుల ప్రాణాలు కాపాడు తున్నారు..


నిత్య సేవలో మీ జీవితం సార్థకం

పరమ పవిత్రమైన వృత్తికి మీరే నిదర్శనం

రుణపడి ఉంది మానవజాతి మొత్తం

మీ సేవల మా జోహార్లు జోహార్లు...!!


కొప్పుల ప్రసాద్

నంద్యాల

17-08-గీతా మకరందము

 17-08-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయ విభాగ యోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - అందు సాత్త్వికాహారమునుగూర్చి వచించుచున్నారు–


ఆయుస్సత్త్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః | 

రస్యాస్స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాస్సాత్త్వికప్రియాః || 


తాత్పర్యము:- ఆయుస్సును, మనోబలమును, దేహబలమును, ఆరోగ్యమును, సౌఖ్యమును, ప్రీతిని బాగుగ వృద్ధినొందించునవియు, రసముగలవియు, చమురుగలవియు, దేహమందు చాలకాలము యుండునవియు, మనోహరములైనవియునగు ఆహారములు సత్త్వగుణముగలవారికి ఇష్టములైయుండును.


వ్యాఖ్య: - జనులయందు సత్త్వగుణ మభివృద్ధినొందునపుడు ఇట్టి యాహారము వారికి రుచించునని భావము. అనగా కారముతోను, పులుపుతోనుగూడినదియు, రాజసికమైనదియు లేక తామసికమైనదియు నగు ఆహారము వారికెన్నడును ప్రీతికరము కానేరదు. పైనదెల్పిన సాత్త్వికాహారమే వారికి ఇష్టముగనుండును. ధ్యానాదుల కిట్టి యాహారము మిక్కుటముగ అనుకూలించును. ఆహారవిషయము పరమార్థరంగమున ఎంతయో ముఖ్యమైనది. కనుకనే శ్రీకృష్ణమూర్తి గీతలో పెక్కుచోట్ల దానిని గుఱించి ప్రస్తావించుచువచ్చిరి. కావున ముముక్షువులు ఆహారసంయమము ఏదియో చిన్నవిషయమని తలంపక, బ్రహ్మమార్గమున కీలకస్థాన మాక్రమించియున్నదానినిగ అద్దానిని భావించి సాత్త్వికాహారమునే సేవించుచురావలెను.

ప్రశ్న:- సాత్త్వికాహార మెట్టిది?

ఉత్తరము:- (1) ఆయుస్సును, మనోబలమును, శరీరబలమును, ఆరోగ్యమును, సుఖమును, ప్రీతిని లెస్సగ అభివృద్ధినొందించునదియు (2) రసము గలదియు (3) చమురుతో గూడినదియు (4) దేహమునందు చాలకాల ముండునదియు, మనోహరమైనదియు సాత్త్వికాహార మనబడును. కావున విజ్ఞు లట్టి యాహారమునే సేవించవలయును.

తిరుమల సర్వస్వం 236-*

 *తిరుమల సర్వస్వం 236-*

*ద్వాదశ ఆళ్వారులు-1* 


  *విష్ణుభక్తిలో లీనమై, శ్రీవేంకటేశ్వరునితో సహా శ్రీమహావిష్ణువు యొక్క అవతారవిశేషాలన్నింటినీ పద్యరూపంలో వర్ణించి, భావితరాలకందజేసి, తాము తరించి భక్తజనులను తరింపజేసిన పన్నెండుమంది ఆళ్వారుల దివ్యచరిత్రలను తెలుసుకుందాం.*


 *ఆళ్వారులంటే?* 


 *'ఆళ్వారులు'* అనే తమిళ పదానికి *'విష్ణుభక్తిలో సంపూర్ణంగా మునిగినవారు'* అనే సమానార్థం ఉంది. వీరు నిరంతరం హరినామస్మరణలో లీనమై సార్థక నామధేయులయ్యారు. అదే విధంగా, *'ఆళ్వారులు'* అనే పదానికి *'రక్షించేవారు'* లేదా *'కాపాడేవారు'* అనే మరో అర్థం కూడా ఉంది. 


 ఈ దివ్యపురుషులు మనలో విష్ణుచింతనను వ్యాప్తి చేసి మనలను అరిషడ్వర్గాల నుండి రక్షించడం ద్వారా ఈ నామాంతరానికి కూడా సార్థకత చేకూర్చారు. ఈ పదానికి *'విజ్ఞాన నిక్షిప్తం'* అనే వేరొక అర్థం కూడా ఉంది. విష్ణుభక్తిని పెంపొందించి జనులలో జ్ఞానతృష్ణను రగిలింపజేయడం ద్వారా వీరు విజ్ఞానఖనులయ్యారు. వీరందరినీ సామూహికంగా *'ద్వాదశ సూరులు'* గా వ్యవహరిస్తారు. అంటే పన్నెండు మంది ఆళ్వారులూ, పన్నెండు సూర్యులతో సమానమన్నమాట. సూర్యనారాయణుని వలె వీరు కూడా శ్రీమహావిష్ణువుకు పరమభక్తులవ్వడం వల్లనూ; సూర్యుని వలె విజ్ఞానకాంతులతో, భక్తిభావమనే దివ్యతేజస్సుతో తేజరిల్లడం వల్లనూ వీరు 'ద్వాదశ సూరులు' గా వ్యవహరింప బడుతున్నారు.


 *ఆళ్వారుల ఆవిర్భావం* 


 *ఆళ్వారులందరూ కారణజన్ములే..* 


 శ్రీమహావిష్ణువు సంకల్పం తోనే వీరందరూ భూమిపై జన్మించారు. ఒకానొకప్పుడు మానవులు శ్రీమహావిష్ణువు ద్వారా ఒసంగబడిన కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను శ్రీహరిసేవకు, హరినామస్మరణకు ఉపయోగించకుండా; వాటిని ఐహికమైన భోగభాగ్యాల సాధనకూ వినియోగిస్తూ ప్రాపంచిక సుఖాలకై వెంపర్లాడసాగారు. ఈ విషయంపై కలత చెందిన శ్రీమహావిష్ణువు భూలోకవాసులను సన్మార్గం లోనికి మళ్ళించే నిమిత్తం తిరుమల, శ్రీరంగం, కంచి ఆదిగా గల 108 దివ్య వైష్ణవక్షేత్రాలలో స్వయంగా వెలిశాడు. అదే విధంగా తన భక్తితత్త్వాన్ని ప్రజలలో వ్యాపింపజేసి వారికి ముక్తిమార్గాన్ని ప్రసాదింపజేయడానికై తన పాంచజన్యశంఖాన్ని, సుదర్శనచక్రాన్ని, శ్రీవత్సచిహ్నాన్ని, కౌస్తుభమణిని, పరివారదేవతలను ద్రావిడదేశంలో సిద్ధపురుషులుగా వెలయింప జేశాడు. ఆ విధంగా శ్రీమహావిష్ణువు అంశతో భువిపై, ద్రావిడదేశంలో ఉద్భవించిన వారే ఆళ్వారులు. ద్రావిడదేశమనగా ఇంచుమించుగా ఈనాటి 'తమిళనాడు' రాష్ట్రమున్న ప్రాంతమన్నమాట.



 *అందరూ ద్రావిడదేశం లోనే ఎందుకు జన్మించారు?* 


 ఇది కేవలం కాకతాళీయమో, యాదృచ్ఛికమో కాదు. శ్రీహరి చిత్తసంకల్పం తోనే ఇలా జరిగింది. దానికి సంబంధించి, అత్యంతాసక్తికరమైన పౌరాణిక కథనం ఇలా ఉంది:


 ఒకానొకప్పుడు వేదభూమియైన భరతఖండానికి ఉత్తరదిక్కున ఉన్న హిమవత్పర్వత సానువుల్లోని కైలాసగిరిపై, ఆదిదంపతులైన శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. నభూతో నభవిష్యతి అన్న చందంగా జరిగిన ఆ వివాహ మహోత్సవాన్ని తిలకించటానికై దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషులతో పాటుగా సమస్త మానవాళి కైలాసగిరి కేతెంచారు. అంతటి జనసందోహం ఒకే దిక్కున కేంద్రీకృత మవ్వడంతో భూమాత సంతులనాన్ని కోల్పోయి ఉత్తరదిక్కుకు ఒరగడం ప్రారంభించింది. ఆ ఉత్పాతం ఒక మహాప్రళయానికి నాందిగా భావించిన ఆహ్వానితు లందరూ అపరిమితమైన ఆందోళనకు గురయ్యారు. రానున్న ప్రమాదాన్ని తృటిలో పసిగట్టిన, కుశాగ్రబుద్ధి కలిగిన, దేవతల శిల్పి 'విశ్వకర్మ' తరుణోపాయాన్ని సూచించాడు. వివాహానికి విచ్చేసిన అగస్త్యమహర్షి తన అపరిమితమైన తపోబలం వల్ల, ఆహ్వానితులందరి మొత్తం భారంలో సగభాగం కలిగి ఉంటాడని, ఆ మహాతపస్వి వివాహమంటపం నుండి వెడలి దక్షిణదిక్కుకు తరలిపోతే ధరాతలం తన సంతులనాన్ని తిరిగి పొందుతుందని పలికాడు. దాంతో, శివపార్వతుల కళ్యాణాన్ని కన్నులారా తిలకించే మహద్భాగ్యాన్ని కోల్పోబోవడం ద్వారా తీవ్రమైన మనస్తాపానికి, నిరుత్సాహానికి గురైన అగస్త్యమహర్షి తన ఈప్సితానికి (కోర్కెకు) భంగం కలిగించిన విశ్వకర్మను క్షణికావేశంలో శపిస్తాడు. నిస్వార్థబుద్ధితో, లోకకళ్యాణార్థం తరుణోపాయాన్ని సూచించిన, మహిమాన్వితుడైన విశ్వకర్మ కూడా అగస్త్యునికి ప్రతిశాపం ఇస్తాడు. దానిననుసరించి అగస్త్యమునిచే సృష్టించబడి; అప్పటివరకూ దైవ, పండితభాషగా వెలుగొందుతూ, సకల సాహిత్యాలకూ కాణాచిగా ఉన్న 'ద్రావిడభాష' తిరోగమనం పాలైంది.


 బ్రహ్మాది దేవతల వినతి మేరకు మహాప్రళయాన్ని నివారించడానికై, అగస్త్యమహర్షి అర్థాంగి లోపాముద్రా సమేతుడై కైలాసపర్వతాన్నుండి వెనుదిరిగి దక్షిణాన స్వర్ణముఖి నదీ తటాన ఉన్న తన స్వస్థలానికి తిరిగి వస్తాడు. తరువాతి కాలంలో అగస్త్యుడు పద్మావతీ పరిణయానంతరం నూతన దంపతులైన పద్మావతీ, శ్రీనివాసులకు ఆరుమాసాల పాటు, ఇప్పుడు సువర్ణముఖి నది ఒడ్డున 'ముక్కోటి' గా విలసిల్లుతున్న తన ఆశ్రమంలో, విడిది ఏర్పాటు చేయడం మనం ఇంతకుముందే తెలుసుకున్నాం.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వము ప్రథమాశ్వాసము*


*375 వ రోజు*


*దేవతలు బ్రహ్మదేవునితో చేరి ఈశ్వరుడిని వేడుకొనుట*


దేవతలు, మునులు, ఇంద్రుడు, బ్రహ్మదేవునితో చేరి శివుని వద్దకు చేరి " పరమేశ్వరా ! నీవు జ్ఞానమూర్తివి, సత్యస్వరూపుడవు నీకు తెలియనిది లేదు " అని స్తుతించగా ఈశ్వరుడు " సంతోషించి ఏమి కావాలి ? " అన్నాడు. బ్రహ్మ పరమేశ్వరునితో " పరమేశ్వరా ! నీవు నన్ను ప్రజాపతిగా చేసావు. ఆ అధికారమును వినియోగించి నేను ఈ ముగ్గురు రాక్షసులకు వరములు ప్రసాదించాను. వారు ఆ వరగర్వంతో మూడు పురములు నిర్మించుకుని ముల్లోకాలను గడగడలాడిస్తున్నారు. ఇంద్రునికి కూడా అతడిని గెలువ శక్యము కాలేదు. నీవుగాక వారిని సంహరించగల వారు లేరు. కనుక అందరమూ నిన్ను శరణు జొచ్చాము. ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములను కాపాడాలి " అని వేడుకున్నారు. ఈశ్వరుడు " బ్రహ్మదేవా ! నీను చెప్పినది నిజమే. వారు చంపదగిన వారే అయినా వారు మహాబలవంతులు నేను ఒక్కడినే వారిని జయించ లేను. కనుక నేను నా తేజస్సులో సగభాగము ఇస్తాను మీరంతా వారిని సంహరించండి " అన్నాడు. దేవతలు " పరమేశ్వరా ! ఆ మువ్వురి బలముకంటే మా బలము సగమే ఉంది కనుక మేము వారిని గెలువలేము. నీ మహా తేజస్సు మేము భరించరానిది. కనుక మా శక్తులను మీకు ధార పోస్తాము. కనుక నీవే వారిని సంహరించు " అన్నాడు. ఆ మాటలకు శివుడు " దేవతలారా ! నాకు మీరు రాక్షసులు సమానమే. అంతే కాదు నాకు సర్వప్రాణులు నాకు సమానమే. అందరికీ సమానంగా ఆనందం కలిగిస్తాను కనుక నాకు శివుడు అనే నామం వచ్చింది. దుష్టశిక్షణ శిష్టరక్షణ నా కర్తవ్యం. పరులను పీడించే దుర్జనులను సంహరించి ధర్మవర్తనులైన మిమ్ము రక్షిస్తాను. కనుక మీరంతా మీ తేజస్సు బుజ బలము నాకు చెందేలా చేయండి. నేను ఈ కార్యము నిర్వహించడానికి ముల్లోకములకు పశుత్వము నాకు పశుపతిత్వము కావాలి నేను ఈ కార్యము చేయడానికి నాకు పశుపతిత్వము కావాలి ఈ లోకాలకంత పశుత్వము కావాలి. అప్పుడు కాని పశువులను చంపిన పాపం నన్ను అంటదు. మీరందరూ కలిసి నాకు ఒక దివ్యరధమును, ఒక సారథిని, దివాశ్వములను, ఒక విల్లు, ఒక బాణం కావాలి. అప్పుడు నేను ఆ రాక్షసుల మూడు పురములను ఒక్కసారిగా నాశనం చేయగలను.


*పాశుపత వ్రతము*


శివుని మాటలు విన్న దేవతలు సంకోచిస్తూ తలలు వంచుకున్నారు. తమకు కూడా పశుత్వము వస్తుంది అని శకించారు. వారి అనుమానం అర్ధం చేసుకున్న శివుడు దేవతలారా ! మీరు భయపడ వద్దు. మీకు కలిగిన పశుత్వము నుండి బయటపడటానికి ఒక మార్గం ఉంది. మీరంతా పాశుపత వ్రతం ఆచరించి మీ పశుత్వము పోగొట్టుకొని మోక్షము పొంద వచ్చు. ఆ వ్రతము పన్నెండు సంవత్సరములు చేయవలెను. చేసే వారి నిష్టానుసారం ఒక సంవత్సరము కాని ఆరు నెలలు కాని, ఒక రుతువులో కాని, ఒక మాసముకాని, కనీసం పన్నెండు దినములలో కాని ఫలితం ఇస్తుంది. ఆ మాటలకు దేవతలు సమ్మతించి అన్ని లోకములకు పశుత్వము రావడానికి అంగీకరించి. శివునకు పశుపతిత్వము కలగడానికి ఒప్పుకుని అతడిని పశుపతిగా కీర్తించారు. దేవతలంతా తమ తేజస్సులో సగము శివునకు ధారపోసారు. ఆ తేజస్సును అందుకున్న పరమ శివుడు తేజోవంతుడయ్యాడు. ఇంద్రుడు దేవతలతో కూడి శివుడిని త్రిపురాసుర సంహారానికి అభిషేకించారు. దేవతలందరూ త్వష్ట ప్రజాపతిని చూసి శివుడికి మహోత్కృష్టమైన ఒక విల్లును, ఒక రథమును, అమ్మును, హయములను తయారు చేసి ఇమ్మని అడిగారు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత:  ఐదవ అధ్యాయం

కర్మసన్యాసయోగం: శ్రీ భగవానువాచ:


భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ 

సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి (29)


యజ్ఞాలకూ, తపస్సులకూ భోక్తననీ, సర్వలోకాలకూ ప్రభువుననీ, సమస్త ప్రాణులకూ మిత్రుడననీ నన్ను తెలుసుకున్నవాడు పరమశాంతి పొందుతాడు.


శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని కర్మసన్యాసయోగం .. అనే ఐదవ అధ్యాయం సమాప్తం..🙏

సజ్జనుడు కాడు

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *బోధితోఽపి బహుసూక్తి విస్తరైః*

          *కిం ఖలో జగతి సజ్జనో భవేత్|*

          *స్నాపితోఽపి బహుశో నదీజలైః* 

          *గర్దభః భవతి కిం హయః క్వచిత్||*


        *మధురకవి శ్రీ హనుమంతాచార్యులు*


తా𝕝𝕝 " *నీచుడికి ఎన్ని మంచిమాటలు చెప్పిననూ సజ్జనుడు కాడు.గాడిదను పుణ్యనదీజలాలతో స్నానం చేయించిననూ అది గుర్రము కాదు కదా".*


 ✍️💐🌹🌸🙏

వేరొకడు తట్టుకోలేడు

 🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝    *ఉత్తమః క్లేశవిక్షోభం*

*క్షమః సోఢుం న హీతరః|*

           *మణిరేవ మహాశాణ*

 *ఘర్షణం న తు మృత్కణః||*


*తా𝕝𝕝 కష్టాలవల్ల కలిగే క్షోభను ఉత్తముడు మాత్రమే తట్టుకోగలడు*.... *వేరొకడు తట్టుకోలేడు..... సాన మీద ఒరిపిడిని మాణిక్యమే సహించగలదు కానీ మట్టిపెడ్డ సహించగలదా....*


✍️🌹💐🌸🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - పూర్ణిమ - స్వాతి -‌‌ ఇందు వాసరే* (12.05.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*