(అంతర్జాతీయ నర్సుల దినోత్సవం)
సేవమూర్తులకు వందనాలు..!!
మీ సేవ లకు శతకోటి వందనాలు
సేవలో మాతృమూర్తితో సమానులు
నాన్న వాళ్లు దగ్గర లేకున్నా
మీరు ఉన్నారన్న ధైర్యం ఇచ్చారు...
మీ సేవలు పరమ పవిత్రము
ప్రాణాలకు తెగించి పునర్జన్మ పోస్తారు
మీ మాటలు ఔషధాలతో సమానం
మీ సేవలకు రుణపడి ఉంది యావత్ ప్రపంచం..
అమ్మ లాలన చూపించారు
నాన్నల ధైర్యాన్ని నింపారు
వైద్యుడికి చేయూతనిచ్చారు
కంటికి రెప్పలా రోగిని కాపాడుతున్నారు..
సహనానికి మారుపేరుగా నిలిచి
సమయానికి ఔషధాలు అందించి
రోగికి మనోధైర్యాన్ని చెప్పి
కొండంత భరోసాగా నిలిచి కనిపించారు..
మానవ సేవకు నిజమైన ఆకారంతో
మరో వైద్యుడిలా దర్శనమిచ్చారు
సహనములో భూదేవిలా నిలిచి
మనిషిలో భగవంతుని రూపం చూశారు..
ధన్వంతరి వలె భూమిపై మొలచి
మానవజాతికి మహోపకారం చేస్తూ
దగ్గరుండి జీవిని బయటికి తీస్తూ
తల్లుల ప్రాణాలు కాపాడు తున్నారు..
నిత్య సేవలో మీ జీవితం సార్థకం
పరమ పవిత్రమైన వృత్తికి మీరే నిదర్శనం
రుణపడి ఉంది మానవజాతి మొత్తం
మీ సేవల మా జోహార్లు జోహార్లు...!!
కొప్పుల ప్రసాద్
నంద్యాల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి