మర్మశాస్త్ర విజ్ఞానం - వివరణ .
మానవ శరీరం నందు ప్రాణాధారములు అగు కొన్ని ముఖ్యస్థానములు కలవు. వీటినే మర్మస్థానములు అని అంటారు. ఈ మర్మస్థానముల గురించి తెలుసుకొనుట వైద్యులకు , వైద్యేతరలకు కూడా చాలా అవసరం . విద్రది వంటి శారీరక వ్రణములు మరియు కొన్నిరకాల వ్యాధులు ముందు ఈ మర్మస్థానములకు కొంతదూరమున పుట్టి అవి మర్మస్థానములకు చేరగానే ప్రాణములు హరించుచున్నవి. శస్త్రాల వలన తగిలిన దెబ్బలు , అనుకోకుండా మర్మస్థానముల యందు దెబ్బలు తగలడం వలన నేత్రములు , చెవులు , ముక్కు మొదలగు జ్ఞానేంద్రియములు చెడి గుడ్డితనం , చెముడు మొదలగునవి కలుగుట , హస్తములు , పాదములు మొదలగు కర్మేంద్రియాలు చెడి సొట్ట , కుంటి మొదలగు దుష్ఫలితాలు కలుగుట , తీవ్రవేదన కలుగుట , కొన్ని అసాధ్యవ్యాధులు సంభవించి చివరకి ప్రాణములు పోవుట సంభవించును .
. వైద్యుడు ప్రధానంగా మర్మవిజ్ఞానం కలిగి ఉండవలెను . ప్రమాదకరమగు వ్యాధి మర్మస్థానము నందు జనించినదా ? లేక మర్మస్థానమునకు చేరనున్నదా ? ప్రాణములు హరించుటకు ఎంత వ్యవధి ఇంకనూ ఉన్నది ? అని తెలుసుకుని శీఘ్రముగా ఫలితాలను ఇచ్చు ఔషధాలను ఉపయోగించి వ్యాధి మర్మప్రదేశమునకు చేరక మునుపే చికిత్స చేసి రోగిని మృత్యువు దరిచేరకుండా కాపాడవచ్చు . కావున వైద్యుడు తప్పకుండా మర్మవిజ్ఞానం తెలుసుకుని ఉండవలెను
. ఈ మర్మవిజ్ఞానం ప్రధానంగా శస్త్రచికిత్సకు అవసరము . శస్త్రచికిత్స చేయునపుడు మర్మస్థానములను గుర్తెరిగి చేయవలెను . లేనిచో యావజ్జీవితము అంగవైకల్యము లేదా కొద్దిరోజులకు ప్రాణములను హరించు వ్యాధులు , అసాధ్యవ్యాధులు చివరికి మరణమును కలిగించును. ఇవి వెంటనే జరగకపోవటం చేత మరియు మర్మవిజ్ఞానం లేకపోవుట చేత ఈ శస్త్రకర్మ వలన లేక దెబ్బతగులుట వలన లేక పుండు పుట్టుట వలన మరణం సంభవించింది అని వైద్యులు గాని రోగులు గాని భావిస్తారు. నిజానికి అది మర్మస్థాన సంబంధ మరణం అని గుర్తించరు .
. మర్మశాస్త్ర ప్రకారం అకస్మాత్తుగా హస్తపాదములందున్న , అంగుష్ట మధ్యముల యందలి క్షిప మర్మములకు , అరికాలు , అరచేయి మధ్యమము నందు ఉండు తల , హృదయ మర్మములకు దెబ్బ తగిలిన యెడల ఈ 8 మర్మలును కొంతకాలం పిదప ప్రాణాలను హరించును . 15 నుంచి 30 రోజులలో దెబ్బ యొక్క తీవ్రతనుబట్టి ప్రాణాలను తప్పక తీయును . కావున తెలిసిన వైద్యుడు వెంటనే చేతి మర్మకు దెబ్బ తగిలిన మణిబంధము వద్ద , పాదములోని మర్మలకు దెబ్బ తగిలిన చీలమండ వద్దను హస్తపాదములను తీయవలెను అలా చేసిన మాత్రమే కనీసం ప్రాణం అయినను దక్కును .
. మర్మలకు దెబ్బతగలని యెడల ఎంత పెద్దపెద్ద దెబ్బలు పాదములు , తొడలు , భుజములు , పొట్ట , శిరస్సు వంటి వాటికి తగిలినను ప్రాణాపాయం ఉండదు. కాని మర్మకు దెబ్బ తగిలినను దెబ్బ పైకి కనపడనంతటి చిన్నది అయినను ప్రాణములను తీయును . కావున మర్మల పైన దెబ్బ తగలకుండా జాగ్రత్త వహించవలెను . చికిత్స చేయు వైద్యుడు మర్మలకు సన్నిహితముగా ఉండు వ్యాధులను గుర్తించి రోగులను కాపాడవలెను .
. శరీరంలో మొత్తం 107 మర్మలు ఉండును. వీటి గురించి మరొక పోస్టు నందు వివరిస్తాను. నా తరువాతి పోస్టు నందు ఆయుర్వేదం నందు గల "శిరావేధ " అనే ఒక గొప్ప చికిత్స గురించి వివరిస్తాను ఇది ప్రపంచములో ఏ వైద్యవిధానములో లేదు . ఈ వైద్యవిధానము గురించి అత్యంత విలువైన , అరుదైన సమాచారం మీకు సంపూర్ణముగా వివరిస్తాను.
మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
. కాళహస్తి వేంకటేశ్వరరావు
. అనువంశిక ఆయుర్వేద వైద్యులు
. 9885030034