20, జులై 2025, ఆదివారం

సత్యము చెప్పుట

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝 *సత్యస్య వచనం శ్రేయః*

             *సత్యాదపి హితం వదేత్|*

             *యద్భూతహిత మత్యన్తం*

             *ఏతత్సత్యం మతం మమ||*

 

      *--- _సుభాషితరత్నావళిః_ ---*


*తా𝕝𝕝 సత్యము చెప్పుట శ్రేయస్కరము.... సర్వభూతహితముగా పలుకు సత్యము మంచిది.... ఎందుచేతననగా దేనివలన సర్వభూతహితమగునో అదియే సత్యము....*


 ✍️🌹💐🌸🙏

పోతనామాత్య

 207e4;

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀6️⃣```ప్రతిరోజూ...

మహాకవి బమ్మెర పోతనామాత్య..

```

         *శ్రీమద్భాగవత కథలు*

                ➖➖➖✍️```

(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```

_________________________

*భాగవత జ్వాల*


*భక్తుల కథల ద్వారా..*

                   *భగవంతుని కథ*

```

భాగవతం భగవంతుడి కథ వలె కనిపించినా నిజానికి అది భక్తుల కథల సమాహారం. 

మహాభారతంలో కూడా శ్రీ కృష్ణ భక్తుల కథలు ఉన్నాయి. నిజానికి భీష్ముడు, అర్జునుడు, విదురుడు, ద్రౌపది అత్యున్నతమైన శ్రీ కృష్ణ భక్తులు. వారిలో ఒక్కరిని మాత్రం రక్షించలేకపోగా శిక్షించవలసి వస్తుంది. అది భీష్ముడు. దగ్గరుండి మరీ భీష్ముడిని సంహరింప చేస్తాడు శ్రీ కృష్ణుడు. అందుకు బాధ పడతాడు కూడా. మిగిలిన శిష్యుల రక్షణకే మిగతా కథ అంతా. 

భక్త శత్రువుల సంహార కథా విహారం. తన భక్తులను భగవంతుడు ఏ విధంగా కాపాడుకున్నాడు అని వివరించే ఉదాహరణాత్మక వివరణా సంపుటి భాగవతం. రెండింటికథాకథనాలు గమనిస్తే, భారతపు కొనసాగింపే భాగవతమా అనిపిస్తుంది.


అర్జునుడు పాండవ పుత్రులను చంపిన అశ్వత్థామను బంధించి తేవడం, తరువాత అతని శిరోమణిని గ్రహించి శిరోజాలను ఖండించి వదిలేయడం, శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో ఉత్తర గర్భస్థ శిశువు (పరీక్షిత్తు) ను రక్షించడం, కుంతీదేవి శ్రీకృష్ణుడిని స్తోత్రం చేయడం, ధర్మరాజు శ్రీకృష్ణుడితో కలిసి, మరణించడానికి సిద్ధంగా వున్న భీష్ముడి దగ్గరికి పోవడం, భీష్ముడు శ్రీకృష్ణుడిని స్తుతించడం, వాసుదేవుడిలో భీష్ముడు ఐక్యం కావడం, ఉత్తరకు పరీక్షిత్తు జన్మించడం. గాంధారీ-ధృతరాష్ట్రులు దేహత్యాగం చేసుకోవడం, ధర్మరాజు దుశ్శకునాలు చూసి విచారపడడం, అర్జునుడు ద్వారక నుండి వచ్చి శ్రీకృష్ణ నిర్మాణం గురించి ధర్మరాజుకు చెప్పడం, పరీక్షిత్తు పట్టాభిషేకం-పాండవుల స్వర్గారోహణం, పరీక్షిత్తు మహారాజుగా భూదేవి ధర్మదేవతల సంవాదం వినడం, కలిపురుషుడు ధర్మ దేవతను తన్నడం, పరీక్షిన్మహారాజు కలిని నిగ్రహించి ధర్మపాలన చేయడం, పరీక్షిత్తు శమీక మహర్షి మీద మృత సర్పాన్ని వేయడం, శమీక పుత్రుడు శృంగి పరీక్షిత్తును శపించడం, శుకుడు పరీక్షిత్తుకు ముక్తిమార్గాన్ని తెలియచేయడం, 'విరాట్పురుషుడైన శ్రీమన్నారాయణుడిలో పద్నాలుగు లోకాలలో జరిగిన-జరుగుతున్న-జరగబోతున్న సమస్త విషయాలు కనిపిస్తాయి. నేల, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, అహంకారం, మహత్తు అనే తత్త్వాలు ఈ విగ్రహం యొక్క అవరణాలు. ఇవి బ్రహ్మాండకోశమైన విరాట్ రూపుడి చుట్టూ పొరలు పొరలుగా చుట్టి ఉంటాయి. ఈ దేహంలో తేజరిల్లే ఆ విరాట్ స్వరూపుడే చిత్తం, ఏకాగ్రతకు చోటైన వాడు... అని చెప్పడం, శ్రీమన్నారాయణుడి లీలావతారాలు, పరీక్షిత్తు శుక మహర్షిని ప్రపంచోత్పత్తి, శ్రీవిష్ణువు వల్ల బ్రహ్మరుద్రాదిలోక ప్రపంచం ఉద్భవించడం వివరిస్తుందీ పురాణం. తరువాత భక్తుల కథలు ఉంటాయి.```


*సృష్టి రహస్యాలు:*```

మన ప్రపంచం ఈ భూమి ఏవిధంగా పుట్టాయి అనే ప్రశ్నకు సమాధానం భాగవతం. 

“విరాట్ పురుషుడి హృదయాకాశం నుండి ఓజస్సు, సహస్సు, బలం అనే ధర్మాలు పుట్టాయి. సూక్ష్మమైన క్రియాశక్తి వల్ల ప్రాణం పుట్టింది. జీవుడి వెన్నంటి ఆ ప్రాణాలు బయటకు పోతుంటాయి. ఆకలిమంటలు, ఓర్చుకోలేని దాహం కలుగుతాయి. నోటి నుండి దవడలు, నాలుక మొదలైనవి పుట్టాయి. ముఖం నుండి శోభిల్లి 'పలుకు' తన రూపాన్ని కోరుకుంటుంది. మాట్లాడాలనే సంకల్పం కలుగుతుంది. విరాట్ పురుషుడి ముఖం నుండి వాక్కు పుట్టింది. దీనికి దేవత అగ్ని. 

అగ్ని, వాక్కు (మాట) కలయిక వల్లే సంభాషణం వెలువడింది.


మహావాయువు వల్ల ముక్కు పుట్టింది. తేజస్సు నుండి రెండు కళ్ళు పుట్టాయి. సాక్షాత్తు భగవంతుడే చెవికి కారకుడయ్యాడు. దీని దేవత దిక్కులు. పుట్టుకలను కల్పించే పురుషుడి వల్ల చర్మం పుట్టింది. దాన్నుండి రోమాలు పుట్టాయి. వాయువు నుండి చేతులు పుట్టాయి. ఈశ్వరుడి శరీరం నుండి పాదాలు పుట్టాయి. వీటి దేవత విష్ణువు. భగవంతుడి వల్లే పురుషాంగం, స్త్రీ అంగం పుట్టాయి. స్త్రీ-పురుషుల కలయిక వల్ల సంతానం కలుగుతుంది. ఒక శరీరం నుండి మరో శరీరానికి చేరుకోవాలనుకున్నప్పుడు బొడ్డు అనే ద్వారం పుట్టింది. ప్రాణ- అపాన వాయువులను బంధించడానికి స్థానమయింది ఆ బొడ్డే. ఆ బంధం తొలగించడమే మరణం. అలాగే పేగులు, పొట్ట, నాడీ మండలం నిర్మితమయ్యాయి. కామానికీ, సంకల్పానికీ నెలవైన హృదయం పుట్టింది. ఆ తరువాత విరాట్ పురుషుడి తనువు నుండి సప్త ధాతువులు (త్వక్కు, చర్మం, మాంసం, రక్తం, మేధ, మజ్జ, ఎముకలు), ఏడు ప్రాణాలు (భూమి, నీరు, తేజస్సు వగైరా), ఇంద్రియాలు, అహం నుండి పుట్టిన స్వభావాలు, మనస్సు, మతి పుట్టాయి, ఇవన్నీ 

ఆ పరమేశ్వరుడి స్థూల శరీర భాగాలే! ఇలా ఆ విరాట్ పురుషుడి ఈశ్వర రూపానికి తుదీ-మొదలు ఉండదు”. ఎంత సరళంగా ఉందీ సృష్టి క్రమం? ఇదీ జ్వాలానరసింహారావు రచనా విశేషం.


బాలుడైన ధ్రువుడు తండ్రి అంకపీఠంపై తనకు స్థానం ఇవ్వడంలేదని బాధపడి ఏకాగ్రతతో హరి కోసం తపస్సు చేయడం శ్రీహరిని సాక్షాత్కరింపజేసుకోవడం అనే భక్త విజయం ముఖ్యమైన కథ. 

శ్రీ హరి వేదశాఖలను ఉద్దరించడంకోసం పరాశరుని కొడుకు వ్యాసుడుగా అవతరిస్తాడు. తరువాత కథల్లో శ్రీకృష్ణ నిర్మాణం, జగదుత్పత్తి లక్షణాల వివరణ, బ్రహ్మదేవుని జన్మ, బ్రహ్మకు నారాయణుడి ఉపదేశం, కాల నిర్ణయం, దితి కశ్యప సంవాదం. సనకసనందనాదుల శాపానికి గురై జయవిజయులు విష్ణువు శత్రువులుగా మూడు జన్మలు ఎత్తడం, హరి వారిని సంహరించడానికి నాలుగు వరాహ, నారసింహ, రామ, కృష్ణ - అవతారాలు ఎత్తడం, కపిలాచార్య అవతారం కథలు వివరిస్తారు. దక్షప్రజాపతి సంతాన కథలు, దక్షయజ్ఞధ్వంసం. ఒకటి తరువాత ఒక కథ వస్తూ ఉంటుంది. జడభరతుని కథ చాలా హృద్యంగా ఉంది.


'ఋగ్యజుస్సామాధర్వాది నాలుగు వేదాలు, ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వవేదం, అధర్వవేదం అనే నాలుగు ఉపవేదాలు, పద్దెనిమిది స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు పుట్టిన తీరుతెన్నులు ఎలాంటివి? కల్పాల నడుమ సంభవించే ప్రళయం, దాని రూపు, కల్పాంతంలో సంభవించే పెద్ద ముప్పు ఎలా ఉంటుంది? యాగాది సంబంధిత కర్మలు, నూతులు, కొలనులు, చెరువులు, గుళ్లు లాంటి వాటి నిర్మాణం, అన్నదానం, ఉపవనాల ఏర్పాటు, ధర్మశాస్త్రాలు వచించిన పనులు ఎలా చేయాలి? హోమాదుల ఆచరణ పద్ధతులు, ప్రాణుల పుట్టుక, ధర్మార్థకామాలనే మూడు పురుషార్థాలను అమలుపరిచే తీరు, దైవాన్ని, వేదధర్మాలను విశ్వసించనివారి జన్మలు, జీవాత్ముడిని కట్టి వుంచే విధం, ముక్తిని సాధించే తీరు, తన ఇచ్చానుసారం సంచరించే ఈశ్వరుడి విషయం, సర్వాధిపతిగా భగవానుడు జీవులతో వినోదించే విధానం.' వివరిస్తూ ఇదంతా భాగవతమే అంటాడు శుకుడు.


ఇక భాగవత సారం ఏమంటే: 'జీవికి శరీరంతో సంబంధం కలిగే అవకాశం ఎలా ఏర్పడుతుందనేది చాలా ముఖ్యంగా అవగాహన చేసుకోవాల్సిన అంశం. పరమేశ్వరుడి మాయ లేకపోతే ఆ బంధం ఏర్పడదు. జీవి విష్ణుమాయా మహిమవల్ల పంచ భూతాలతో కూడిన దేహసంబంధం కలవాడు అవుతాడు. ఆ మాయ వల్లే జీవి బాల్యం, కౌమారం, యవ్వనం అనే వయో వ్యవస్థలను పొందుతాడు. విష్ణుమాయా ప్రభావం వల్లే జీవి మానవుడిగానో, దేవతగానో ఆకారం పొందుతాడు. “నేను”, “ఇది నాది” అనే భావనలతో సంసార మాయకు కట్టుపడి పోతాడు. పరమాత్ముడి మాయే అన్నిటికీ మూలకారణం. ఇలా బంధితుడైన ప్రాణికి భగవంతుడి మీద భక్తి కలగడం వల్ల మోక్షం ఏవిధంగా కలుగుతుందనేది ప్రశ్నార్థకం. అదెలా అంటే, ఎప్పుడూ జీవిలో ప్రకృతినీ, పురుషుడినీ అధిగమించే “బ్రహ్మతత్త్వం” ఉంటుంది. బ్రహ్మ ధ్యానంలో జీవి శ్రద్ధ చూపినప్పుడు మోహం వీడిపోతుంది. “నేను”, “నాది” అనే సంసార బంధం వదిలిపోతుంది. దాంతో మోక్షాన్ని పొందుతాడు!.


భగవన్మాయ, జగత్తు నిర్మాణం, బ్రహ్మజన్మ వృత్తాంతం, కాలలక్షణ నిరూపణ, బ్రహ్మసృష్టి మహిమ, కపిలాచార్యుని తత్వజ్ఞానం, భక్తియోగం, పిండోత్పత్తి క్రమం గురించి వివరాలు విచిత్రంగా ఉంటాయి.


అజామిళుడి భక్తి కథ వివరించిన తరువాత దక్షప్రజాపతి జననం ఆ తరువాత సకల జీవరాశుల సృష్టి, పిదప శ్రీమన్నారాయణ కవచం ఏమిటో వివరించడం, వృత్రాసురుడి కథ, దేవాసుర సంగ్రామం, ఇంద్రుడితో పోరాటం, ఇంద్రుడి చేతిలో వృత్రాసురుడి వధ గురించి వ్రాస్తారు. వృత్రాసుడు పూర్వజన్మలో పరమ విష్ణు భక్తుడనే కథ చెబుతారు.


ఏడో స్కంధంలో అనేక అంశాలతోపాటు అతి ముఖ్యమైన ప్రహ్లాదుడి చరిత్ర, నృసింహావతారం, హిరణ్యకశిపుడి సంహారం గురించి ఉంటుంది. హిరణ్య కశిపుని వధ తరువాత అతనికి విష్ణువుమీద పగ ఎందుకు వచ్చిందో వివరిస్తారు. త్రిపురాసుర సంహారం కథ కూడా సప్తమ స్కంధంలోనే ఉంటుంది.


ఎనిమిదో స్కంధంలో గజేంద్ర మోక్షం, క్షీరసాగర మథనం, మత్స్య, కూర్మ, బలి చక్రవర్తి, వామనుడు దానం అడగడం, తరువాత, త్రివిక్రముడై బలిని పాతాళానికి తొక్కిన ఉదంతాలుంటాయి. విష్ణువు పాలకడలిని మథించడం, కూర్మాకృతిలో మందర పర్వతాన్ని కవ్వంగా మోయడం, మోహినీ అవతారం ఎత్తడం, దేవతలకు అమృతాన్ని పంచడం లాంటి భగత్కథా విశేషాలన్నీ వివరించారు. నవమ స్కంధంలో ప్రత్యేకంగా చదవాల్సినవి అంబరీషోపాఖ్యానం, శ్రీరామచరిత్ర, పరశురాముడి చరిత్ర, శకుంతల దుష్యంతుల కథ మొదలైన 35 అంశాలు. ఇక్ష్వాకుడు, మాంధాత, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడి కథలు, రంతిదేవుడి చరిత్ర, పాంచాల వంశాల వివరాలు ఉంటాయి.✍️

(సశేషం)

  🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏

రచన:శ్రీ వనం జ్వాలా నరసింహారావు ```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


పరమా:చార్య వైభవమ్…

 ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమా:చార్య వైభవమ్…

172a;207e2. నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌼P0272.పరమాచార్య పావన గాధలు…



        *ఔషధం - పరమ ఔషధం*

                 ➖➖➖✍️

```

ఒక రోజు పరమాచార్య స్వామి వారు వేకువజామున నదిలో స్నానం ఆచరించి మఠంకు తిరిగి వచ్చారు. ఆయన శరీరం అధిక ఉష్ణోగ్రతతో మండుతున్నట్టు అనిపించింది. ఆయనకి జ్వరం చాల అధికముగా ఉంది. 


వైద్యులు వచ్చి పరిశీలించి, “కొన్ని పాలు తీసుకొని మాత్ర వేసుకోమని” చెప్పి వెళ్లారు. 


ఆరోజు ఏకాదశి. అందువలన స్వామి వారు సంపూర్ణ ఉపవాసంలో ఉంటారు. నిర్జలోపవాసం కాబట్టి ఒక్క చుక్క నీటిని కూడా తీసుకోరు. ఇంకా పాలు గురించి ఏం చెప్పాలి? 


“పాలు కాని మాత్ర కాని నాకు అవసరం లేదు” అని మహాస్వామి వారు ఖచ్చితంగా చెప్పారు. 


శ్రీమఠం మేనేజర్ వచ్చి మహాస్వామి వారిని వేడుకున్నారు. చాలా ప్రాధేయపడ్డారు. “జ్వరంతో ఉన్నప్పుడు ఈ ఉపవాస దీక్ష ఉండవలసిన అవసరం లేదు. ఇది ఆహారం కాదు కేవలం ఔషదం మాత్రమే కనుక స్వీకరించవలసింది” అని వాదించారు. 


వారి వాదనలో చివరి మాట సరైనది అనిపించింది అందరికి.


పరమాచార్య స్వామి వారు తన దగ్గరలో ఉన్న శిష్యునితో చిన్నగా, బొంగురు గొంతుతో ఇలా చెప్పారు “వైద్యులు ఇచ్చినది ఔషధము. కాని నాకు నేనే పరమ ఔషధం ఇచ్చుకున్నాను”. 


మేనేజరు గారికి ఏమీ అర్ధం కాలేదు. వారి అయోమయ పరిస్థితి చూసి స్వామివారే మళ్ళా అర్థమయ్యేట్టు “వేదం ‘లంఖణం పరమఔషధం’ అని చెప్పింది కాబట్టి ఈ ఉపవాసమే అత్యంత పరమ ఔషధం” అని వివరించారు.


మరుసటి రోజు ఉదయం మహాస్వామి వారు రోజువారీ పద్ధతిలోనే వేకువఝామునే లేచి, చల్లటి నీటితో స్నానమాచరించి, వారి పద్ధతి ప్రకారం అనుష్టానము మరియు పూజ ముగించారు. వచ్చినంత త్వరగా జ్వరం తగ్గుముఖం పట్టి మాయమైపోయింది. 


పరమాచార్య స్వామి వారి శరీరం వారి ఆధీనంలో ఉండి వారి ఆజ్ఞకు కట్టుబడి ఉండేది. దీని నిరూపణకు వేల కొలది దృష్టాంతములు కలవు.✍️

      -అనువాదం: ఈశ్వర్ రెడ్డి, 

               శ్రీకాళహస్తి.```

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*

```

#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏

. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

            🌷🙏🌷


🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


సద్బోధన

 221a;207e1;

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀ఆ.స.168.

నేటి...


               *ఆచార్య సద్బోధన*

                  ➖➖➖✍️

```

కాలం, కర్మం కలిసి రాక వక్రిస్తే ధర్మరాజంతటి వాడు కూడా కావి గుడ్డలు కట్టుకొని కంకుభట్టనే పేరుతో విరాటరాజు పంచజేరి ఊడిగం చేయవలసి వచ్చింది.


ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలు అవుతాయని సామెత. 


కాలం కనుక అనుకూలించక పోతే ఎటువంటి దుర్దశ అయినా ప్రాప్తిస్తుంది. 


వివేకం కలిగి ప్రవర్తించాలి. అంతే కాని బేల మనస్సుతో ఏ అఘాయిత్యానికో పూనుకోకూడదు. కాలానుగుణంగా ప్రవర్తించాలి.


విధి చేష్టల వలన అప్పుడప్పుడు హైన్యదైన్యాలు తప్పవు. విధి చేష్టలకు తిరుగులేదు అనే భావం మనం కలిగి ఉండాలి. 


జీవితంలో సుఖదుఃఖాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపోతూంటాయి. ఎల్లకాలమూ సుఖమే ఉండదు. అలాగే ఎల్లకాలమూ దుఃఖమే ఉండదు.


కనుక సుఖం వచ్చినప్పుడు గర్వాన్నీ, దుఃఖం కలిగినప్పుడు విషాదాన్నీ ప్రకటించకుండా ప్రవర్తించాలి.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*

కవనమునన్ వికాసమునుc గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో*

 *కవనమునన్ వికాసమునుc గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో*

ఈ సమస్యకు నా పూరణ. 


స్తవములు రామచంద్రునికి సాగిలి మ్రొక్కుచు చెప్పు భావముల్


కవనము నార్ధ్ర యుక్తమయి కావ్యము నందున భక్తి పొంగగా


భవములు బాపు మార్గమును బాగుగ జూపిన మొల్లమాంబ! నీ


కవనమునన్ వికాసమునుc గన్నవి మల్లెలు మొల్ల లెన్నియో.


అల్వాల లక్ష్మణ మూర్తి.

నన్నయగారి నాటకీయత !

 నన్నయగారి  నాటకీయత ! 


             ఉ:  ధారుణి  రాజ్య సంపద  మదంబున  కోమలి కృష్ణఁ  జూచి ,రం


                    భోరు  నిజోరుదేశమున  నుండగఁ బల్చిన  నిద్దురాత్ము    దు


                    ర్వార  మదీయ  బాహు పరివర్తిత  చండ  గదాభిఘాత   భ


                    ఘ్నోరుతరోరుఁ జేసెద ,సుయోధను  నుగ్ర   రణాంతరంబునన్ !


                       ఆం:మ: భారతము--సభాపర్వము-- నన్నయ భట్టారకుఁడు.


                     ఇది నన్నయగారి పద్యరత్నం. మాయాజూదంలో  పాండవుల నోడించి  వారిధర్మపత్ని  పాంచాలి ని వస్త్రాపహరణోద్యోగమునపరాభవింప

ప్య

యత్నించు నపుడామె "నన్ను రక్షింపగలవారెవ్వరు సభలోలేరా" యనివిలపిం ప సాగినది. ఆయదనున  సుయోధనుడు తనయూరువుల

నధిష్ఠింపుమని ద్రౌపదికి సైగచేసెను. అదిజూచి  మహా కృధ్ధు డై  భీముడు పైవిధముగా  ప్రతిజ్ఙయొనరించెను. 


                    భావము: రాజ్య సంపద మదంతో  ఉచితానుచితములెరుంగక  అసహాయురాలగు  ద్రౌపదిని  తనతొడపై కూర్చుండుటకు ఆహ్వానించిన  దుర్మార్గుడైన యీదుర్యోధనుణ్ణి  రాబోయే  భారతయుద్దంలో ప్రచండమైన  నాగదాభిఘాతములతో

తొడలు  ముక్కలగునట్లుసేతునుగాక!  అని భీకరమైన  ప్రతిజ్ఙచేసెను.


                        పైపద్యము  వీర రౌద్ర  భయానక  రసములకు ప్రతీకయై  భీముని కోపావేగమునకు అద్దముపట్టినది.


                         నాటకము  దృశ్యప్రబంధము పాత్రచిత్రణము ,వాచకము  ఆహార్యము  అభినయములు  నాటకీయతలోని భాగములు. భీముని మహారౌద్రమూర్తిగా  చిత్రించి , ఆవెనుక  నాతనికి తగిన  మాటలను  ఆరభటీవృత్తిలో సమకూర్చి, గదత్రిప్పుట,మొన్నగు(కన్నులెర్రబడుట  కటములదరుట :మొ ) అభినయమును సమకూర్చి," దుర్వార మొదలుగా దీర్ఘసమాస ఘటనముచే రసానుకూలమును రాగానుకూలముగను (మారు నట్లు) రచించి  నాటకీయతకు ప్రాణముపోసెను. నిపుణుడైన నటునిచే

నీపద్యమును జదివించిన చక్కగా రంగస్ధలపద్యమువలె రాణింపక మానదు. 


                          ఈవిధముగ  యెడ నెడ  నన్నయగారుకూడ  తనభారతమున  నాటకీయతకు స్థానమును కల్పించి తన రచనా

సామర్ధ్యమును  అభివ్యక్త మొనరించెను.


                                                                     స్వస్తి!