28, జులై 2025, సోమవారం

సోమవారం🕉️* *🌹28 జూలై 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     *🕉️సోమవారం🕉️*

 *🌹28 జూలై 2025🌹*        

   *దృగ్గణిత పంచాంగం*  

                

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - శుక్లపక్షం*


*తిథి  : చవితి* రా 11.24 వరకు ఉపరి *పంచమి*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం   : పుబ్బ* సా 05.35 ఉపరి *ఉత్తర ఫల్గుణి ( ఉత్తర )*

*యోగం : పరిఘ* రా 03.03 వరకు ఉపరి *శివ*

*కరణం  : వణజి* ఉ 10.57 *భద్ర* రా 11.24 ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 10.00 - 12.30 సా 05.00 - 06.30*           

అమృత కాలం  : *ఉ 10.52 - 12.33*

అభిజిత్ కాలం  : *ప 11.48 - 12.40*

*వర్జ్యం      : రా 01.21 - 03.04*

*దుర్ముహూర్తం  : మ 12.40 - 01.31 & 03.14 - 04.06*

*రాహు కాలం   : ఉ 07.24 - 09.00*

గుళికకాళం       : *మ 01.51 - 03.27*

యమగండం     : *ఉ 10.37 - 12.14*

సూర్యరాశి : *కర్కాటకం*

చంద్రరాశి : *సింహం/కన్య*

సూర్యోదయం :*ఉ 05.54*

సూర్యాస్తమయం :*సా 06.51*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.47 - 08.22*

సంగవ కాలం         :     *08.22 - 10.56*

మధ్యాహ్న కాలం    :     *10.56 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 04.06*

*ఆబ్ధికం తిధి         : శ్రావణ శుద్ధ చవితి*

సాయంకాలం        :*సా 04.06 - 06.41*

ప్రదోష కాలం         :  *సా 06.41 - 08.55*

రాత్రి కాలం           :*రా 08.55 - 11.52*

నిశీధి కాలం          :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.18 - 05.03*

****************************

         *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*నానీతా పద్మమాలా సరసి* 

*వికసితా గంధపుష్పైస్త్వదర్థం*

*క్షంతవ్యో మేఽపరాధః శివ*  

*శివ శివ శంభో శ్రీమహాదేవ శంభో*


     *🕉️ఓం నమః శివాయ🕉️*


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

శీర్షిక.... భోజన ప్రియులు

 శీర్షిక.... భోజన ప్రియులు 


తిండికి లేక కండలు కరిగిస్తూ 

ఒకవైపు 

కండలు పెంచుతూ తినడమె

పనిగా, అదేపనిగా బ్రేవో అని తేన్చేదాకా!


*తిండి కలిగితే కండ కలదోయ్*

ఆనాడు అన్నారు గురజాడ 

నేడు తిండితో కండలు కొండలుగా పెంచేస్తూ 

సిక్స్ ప్యాక్ బాడీలు పెంచుతూ 

ఊపిరితిత్తుల శ్వాసకు ఎసరు పెడుతున్నారు 

గుండె జబ్బులతో మజా మజాగా..


తినడం తాగడం తొంగోవడం 

పౌరాణిక చారిత్రక గాథల్లో 

ప్రసిద్ధి పొందారు తిండిబోతులు 

రుచులు మరిగిన వారలు 

బద్ధకంతో మొద్దు నిద్రతో కాలం వెళ్లబుచ్చేస్తారు

వృధాగా, బేఫికర్ గా 

తినడం లోనె ఆనందాన్ని అనుభవిస్తుంటారు 

అప్పనపు పప్పన్నం బ్రతుకులు..


అన్నమో రామచంద్రా! అల్లాడే ఆకలికి 

దొరకవు పట్టెడు మెతుకులు 

విందులు వినోదాలతో దర్జాలు చేస్తూ

పొట్ట పెంచుకుంటున్న ధనికులు అజీర్తి రోగాలకు 

శరీరాన్ని అనారోగ్యం పాల్జేస్తూ..


మితాహారం.. సమతుల ఆహారం 

ఆరోగ్యానికి చిట్కాలు 

హితసూత్రాలు ఇంటికీ--ఒంటికీ

వంటింటికీ..ఇంటావిడవికీ 

నిండా ఆయుష్ఫుతో నూరేళ్ళ పండుగ ప్రాణానికి..


నీతి ః--

*బతకడానికి తినండి.. తినటానికి బ్రతుకు వద్దండి*

ంంంంంంంంంంంంంంంంంం

ఇది నా స్వీయ కవిత 


ంంంంంంంంంంంంంంం

ఎవరి తప్పులు వారికి

 శు భో ద యం 🙏


ఎవరి తప్పులు వారికి తెలియవుగదా?


నరసింహ శతకం - శేషప్ప కవి   

      

పసరంబు ప0జైన పశులకాపరి తప్పు 

ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు 

భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు

తనయుండు దుష్టైన తండ్రి తప్పు 

సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు 

కూతురు చెడుగైన మాత తప్పు 

అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు 

దంతి దుష్టైన మావంతు తప్పు 

ఇట్టి తప్పు లెఱు౦గక నిచ్చవచ్చి

నటుల మెలగుదు రిప్పుడీ యవని జనులు 

భూషణవికాస! శ్రీ ధర్మపురనివాస! 

దుష్టసంహార! నరసింహ! దురితదూర!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷👌🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కోరికలకోసమే దేవుని పూజించడం

 కోరికలకోసమే దేవుని పూజించడం సరికాదు 


“ఎన్ని సౌకర్యాలు ఉన్నా మాకు అవసరం లేదు. భగవంతుని సాక్షాత్కారం కావాలనేది మన పూర్వీకుల ఆశయం. అలాగే వారు 24 గంటలూ భగవంతుని పాదాలనే ఆశ్రయించేవారు, ఆయననే ధ్యానించేవారు. ఈకాలంలోమనం కూడా ధ్యానం చేస్తాం. దేని మీద?

  *ద్యతం విద్మహర్నిజం*

 24 గంటలు, “డబ్బును ఎలా సంపాదించాలి? ఆ సంపాదించిన దాన్ని ఎలా రెట్టింపు చేయాలి? ” అనే డబ్బు గురించే నిత్యం ధ్యానం చేస్తున్నాము. ఈ కారణాల వల్ల మన పూర్వీకులు పొందిన ప్రయోజనాలను మనం పొందకుండా మనమే మన తృష్ణతో, ఆశతో అడ్డుకుంటున్నాము .

*దత్తత్కర్మ కృతం యదేవ I* *మునిపిష్ఠైర్పలైర్వఞ్చితః ॥*

 మన సాధనాలకూ వారి మార్గాలకూ ఎంత తేడా! కాబట్టి మనం వారి మార్గాన్ని అనుసరించాలి. మనసులోని కోరికల కోసం దేవుడిని పూజించడం సరికాదు. కోరికలను వదిలించుకోవడం ద్వారా మాత్రమే నిజమైన ఆనందం లభిస్తుంది. తలెత్తే కోరికలను పరిష్కరించే ప్రయత్నంలో మనం విజయం సాధించలేము. కోరికలు తరగనివి. అందుకు పశ్చాత్తాపం మాత్రమే మిగిలి ఉన్నది. కోరిక ఎవరికీ ఆనందాన్ని కలిగించదు.అనేది తెలిసిన రోజున మీలో నిజమైన భక్తి జనిస్తుంది.


*-జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

శ్రావణశ్రీలక్ష్ముల నోములు*

 *శ్రావణశ్రీలక్ష్ముల నోములు*


ఉ॥

శ్రావణలక్ష్మిపాదముల స్వచ్ఛమనమ్మును నిల్పి పూజలన్ 

పావనభక్తి సంచితపుపాపనివృత్తియవంగ వేడుచున్ 

నీవిఁక నాకు దిక్కు మరి నేఁ దలబెట్టను కిల్బిషమ్ములన్ 

కావవె యీయవే తిరముగాగ సుమంగళిభాగ్యమమ్మరో ! -1


కం॥

ఉత్తమగుణాఢ్యుడై వర

సత్తముడై మహితబుద్ధి సన్నుతమతియై 

చిత్తస్థిరత్వయుతుడై 

బత్తికి లోబడెడువాని భర్తగనిమ్మా! -2


కం॥

సుగుణోపేతులు కుదురగు 

నగణితధీశ్రీకుశలురు నమృతమూర్తుల్ 

పొగరెరుగని సంతానము 

తగ నీవిం జెలగు వారిఁ దయతో నిమ్మా! -3


కం॥

అని వేడంగవలయు శ్రా 

వణమాసపునోములందు మహిళామణులున్ 

మన గౌరియె శ్రీలక్ష్మియ 

మన భక్తియ పుష్పమౌను మంత్రము మాటౌన్ -4


కం॥

నోములు నోచెడి మహిళలు 

కామిత వరముల దలచుక కరుణను బ్రోవన్ 

లేమగు లక్ష్మినిఁ బూజల 

ధీమతులై గొల్వవలయుఁ దేజశ్శాలిన్ -5


కం౹

వరముల నిమ్మా కొమ్మా! 

సురవరుడౌ నీశుపత్ని! శోభితగౌరీ! 

యరమరికలు లేనట్టుల 

మురిపెముతో జూడు మనుచుఁ బూజలఁ జేయన్ -6


కం॥

కనికరమునుఁ జూపించును 

ననితర భక్తికి తనియుచు కామితమిచ్చున్ 

ఘనులగు భర్తల పుత్రుల 

పెనుసంతోషముల నిచ్చు వేలుపు తుదకున్ -7


కం॥

ఈ యింటికి నా యింటికి 

సాయంవేళల పడతులు సందడితోడన్ 

పాయక పేరంటములన్ 

వాయనముల నందఁ బోవ వారే లక్ష్ముల్ -8


తే.గీ.

పట్టుపరికిణీలనుగట్టి పైటవైచి 

పసుపు పాదాల మెడనిండ పసిడిఁబెట్టి 

వీథులందునఁ దిరుగాడు పేరటాళ్ళు 

భువిని శ్రీలక్ష్ము లనఁ జెల్లు ముదము గలుగ -9

*~శ్రీశర్మద*

శ్రీ దుర్గా బారి మందిర్

 🕉 మన గుడి : నెం 1185


⚜ నాగాలాండ్ : కోహిమా


⚜ శ్రీ దుర్గా బారి మందిర్ 


 

💠 కోహిమా నాగాలాండ్‌లోని ఒక సాంస్కృతిక నగరం. 

వివిధ నాగ సమాజాల సంస్కృతికి చెందిన ఆనవాళ్లను కోహిమాలో చూడవచ్చు. 

కోహిమా జాతిలో వివిధ తెగలు మరియు ఉప తెగలు ఉన్నాయి, వీరు పురాతన కాలం నుండి ఇక్కడ నివసిస్తున్నారు. కోహిమా ప్రజలు ప్రధానంగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు మరియు ఈ ప్రాంతంలో నివసించే ఇతర సమాజాలు హిందూ మతం మరియు ఇస్లాం రెండింటినీ అనుసరిస్తాయి.


💠 నాగ వారసత్వం చాలా గొప్పది మరియు ఇది వివిధ రకాల ఆచారాలు మరియు పండుగలను కలిగి ఉంటుంది, ఇది కోహిమాలో ఇప్పటికీ వారి అసలు సంప్రదాయాలు మరియు ఆచారాలను కాపాడుతుంది. 

నేటికీ, కోహిమా అంతటా చాలా సామాజిక-జాతి సమాజాలు కనిపిస్తాయి, అవి వాటి స్వంత సామాజిక మరియు సాంస్కృతిక గుర్తింపును కలిగి ఉన్నాయి.



💠 కోహిమాలోని దుర్గాబారి మందిరం అనేది నాగాలాండ్‌లో ఆధ్యాత్మికత మరియు సంస్కృతికి ఒక ఉత్కృష్టంగా నిలుస్తున్న ఒక గౌరవనీయమైన హిందూ దేవాలయం. 

ఈ ప్రశాంతమైన ఆలయం దుర్గాదేవికి అంకితం మరియు భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది. 


💠 పచ్చని కొండల నేపథ్యంలో ఉన్న ఈ ఆలయం ధ్యానం మరియు ప్రతిబింబానికి అనువైన ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది. సందర్శకులు దాని అద్భుతమైన వాస్తుశిల్పంతో మంత్రముగ్ధులవుతారు, ఇది అద్భుతమైన శిల్పాలు మరియు శక్తివంతమైన అలంకరణలను ప్రదర్శిస్తుంది, ఇది ఈ ప్రాంతం గొప్పది కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. 


💠 ఈ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు; ఇది ఒక సాంస్కృతిక కేంద్రం, ఇక్కడ వివిధ స్థానిక పండుగలను గొప్పగా జరుపుకుంటారు, నాగ ప్రజల శక్తివంతమైన సంప్రదాయాలను సంగ్రహావలోకనం చేస్తుంది. 


💠 దుర్గాబారి మందిరాన్ని సమీపించేటప్పుడు, ప్రకృతి యొక్క ప్రశాంతమైన శబ్దాలు మరియు గాలిలో వెదజల్లుతున్న ధూపం సువాసన మిమ్మల్ని స్వాగతిస్తుంది. 

ఆలయ ప్రాంగణం బాగా నిర్వహించబడుతుంది, సందర్శకులు అన్వేషించడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. 


💠 పవిత్ర స్థలం పట్ల గౌరవం చూపించడానికి సందర్శించేటప్పుడు నిరాడంబరంగా దుస్తులు ధరించడం మంచిది. 

ఆలయం సాపేక్షంగా నిశ్శబ్దంగా ఉంటుంది, ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయేలా చేస్తుంది. 


💠 కోహిమాలోని పచ్చదనం మరియు విశాల దృశ్యాలు మొత్తం అనుభవాన్ని మరింత పెంచుతాయి కాబట్టి, పరిసరాలను ఆస్వాదించడానికి కొంత సమయం కేటాయించండి. 

స్థానిక సంస్కృతిని లోతుగా అర్థం చేసుకునే వారికి, ఆలయ పూజారులు మరియు స్థానిక భక్తులతో నిమగ్నమవ్వడం ఇక్కడ నిర్వహించే ఆచారాలు మరియు వేడుకలు ప్రాముఖ్యత గురించి అంతర్దృష్టులను అందిస్తుంది. 

సమీప ప్రాంతాలను అన్వేషించడానికి ఈ ఆలయం ఒక సరైన ప్రారంభ స్థానం, ఇది కోహిమాలోని ఏ పర్యాటకుడైనా తప్పక సందర్శించాల్సిన ప్రదేశంగా మారుతుంది. 

 

💠 కోహిమాలో ఉన్న దుర్గా బారి మందిర్ దుర్గాదేవికి అంకితం చేయబడిన ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయంలో కాళి మాత మరియు శివుని విగ్రహాలు కూడా ఉన్నాయి.



💠 కోహిమాలోని హిందూ నివాసితుల ఉమ్మడి కల సాకారం కావడమే దుర్గాబారి కోహిమా.

 కోహిమాలో హిందూ సమాజం యొక్క ప్రార్థనా స్థలం మరియు సామాజిక-సాంస్కృతిక కార్యకలాపాలను నిర్మించడానికి ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉన్న మరియు పాల్గొన్న అనేక మంది ప్రముఖుల అవిశ్రాంత కృషి ఫలితం ఇది.


💠 గణేశ పూజ, దుర్గా పూజ, జగన్నాథ స్నానం, జగన్నాథ రథయాత్ర ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగల


💠 ఉదయం పూజ మరియు హారతి ఉదయం 07:30 నుండి ప్రారంభమవుతాయి.

ఉదయం 06:00 నుండి రాత్రి 09:00 వరకు



Rachana

©️ Santosh Kumar

18-61-గీతా మకరందము

 18-61-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII ఈశ్వరుడు తనమాయచే సమస్తభూతములను కీలుబొమ్మలను వలె త్రిప్పుచున్నారని తెలుపుచున్నారు – 


ఈశ్వరస్సర్వభూతానాం 

హృద్దేశేఽర్జున! తిష్ఠతి | 

భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా|| 


తా:- ఓ అర్జునా! జగన్నియామకుడు పరమేశ్వరుడు (అంతర్యామి) మాయచేత సమస్తప్రాణులను యంత్రము నారోహించినవారిని వలె(కీలుబొమ్మలను వలె) త్రిప్పుచు సమస్తప్రాణులయొక్క హృదయమున వెలయుచున్నాడు.


వ్యాఖ్య:- ఈశ్వరు డెచట నున్నారు? ఏమి చేయుచున్నారు? అను ప్రశ్నలకిచట సమాధానము చెప్పబడినది. ఈశ్వరుడు (భగవంతుడు) దూరముగనే యున్నాడని తలంచుట వెఱ్ఱి. వారు జీవులకు, అతిసమీపమున హృదయమందుగూడ (ఆత్మరూపమున) అధివసించుచున్నారు. కనుకనే "సర్వభూతానాం హృద్దేశే” - అని చెప్పబడినది. కావున భగవత్సాన్నిధ్యమును ఎల్లపుడు ననుభవించుచు, పాపాచరణములేక, భక్తియుతులై మెలగవలెను. జీవులుచేయు సమస్తకార్యములను, సంకల్పించు సమస్త సంకల్పములను ఈశ్వరుడు సాక్షిమాత్రుడై సదా వీక్షించుచునేయుండునని ఎవరును మఱవరాదు. ఈశ్వరుడనగా ప్రభువు, శాసకుడు, నియామకుడు. రాజు ప్రజలను శాసించునట్లు వారు సమస్తప్రాణికోట్లను శాసించుదురు. వారివారికి కర్మానుకూలముగ ఫలముల నొసంగుదురు. రాజాజ్ఞను మీరినచో జనులకెట్లు దండనము లభించునో అట్లే ఈశ్వరుని ఆజ్ఞయగు ధర్మము నుల్లంఘించినచో మనుజుడు వారిచే శిక్షితుడై, తన దుష్కర్మఫలితమగు ఫెూరదుఃఖము ననుభవించును. కావున హృదయమున, బాహ్యమున, సర్వత్ర ఈశ్వరసన్నిధిని సదా భావించుచు ధర్మమును, సత్యమును, ఎవరును ఉల్లంఘించరాదు


         భగవంతుడు ఏ ప్రదేశమందుండును? వైకుంఠమందా? కైలాసమందా? పాతాళమందా? ఇతరలోకమందా? వారెల్లెడల వసించుచుందురు. అతిసమీపమునగల హృదయప్రదేశమందును ఉందురు. కావున అట్టి పరమాత్మను సదా భక్తితో గొల్చుచుండవలెను. "సర్వభూతానామ్" అని చెప్పుటవలన ఏ ఒకానొక ప్రాణియందో కాదనియు సమస్త జీవకోట్లయందును భగవానుడు వెలయుచుండుననియు స్పష్టమగుచున్నది. కాబట్టి చీమయందును, దోమయందును, పశువునందును, చండాలునియందును కూడ వారు నివసించుచున్నారు. కాని ఎవని చిత్తము నిర్మలముగా నుండునో ఆతనియందు లెస్సగ భాసించుచు, వ్యక్తమగును.

యన్త్రారూఢాని - ఈశ్వరుడు మాయద్వారా సమస్తజీవులను సంసారరూపయంత్రమున త్రిప్పుచున్నాడు. యంత్రముయొక్క పెద్దచక్రములపై చిక్కుకొనిన చీమగాని పురుగుగాని, ఆ చక్రముతో బాటు తిరుగుచునేయుండును. అట్లే జీవులున్ను (ఈశ్వరునిచే మాయద్వారా త్రిప్పబడుచున్న) ఈ సంసారచక్రమున తగుల్కొని, ఆ చక్రముతో బాటు వివశులై తిరుగుచున్నారు. దానినుండి తప్పించుకొనుట కుపాయము రాబోవు శ్లోకమున తెలుపబడును. ఆ యంత్రమును త్రిప్పుచున్నవానిని (భగవంతుని) ఆశ్రయించుటయే ఆ యుపాయము.

'మాయయా" అని చెప్పుటవలన ఈశ్వరుడు ఈ సంసారచక్రమును త్రిప్పుచున్నప్పటికిని మాయద్వారా ఆ పరిభ్రమణమును గావించుటవలన వాస్తవముగ వారికేమియు కర్తృత్వము లేకయేయున్నది. వారు సాక్షిమాత్రులై వర్తించుచున్నారు.


ప్ర:- ఈశ్వరుడు ఎచట నివసించుచున్నాడు?

ఉ:- సమస్తప్రాణికోట్ల హృదయమందు.

ప్ర:- ఏమిచేయుచున్నాడు?

ఉ: - ఈ సంసారచక్రమున తగుల్కొనియుండు జీవులందఱిని త్రిప్పుచున్నాడు.

ప్ర:- దేనిద్వారా?

ఉ:- మాయాశక్తి చేత.

ప్ర:- ఏ ప్రకారముగ?

ఉ:- యంత్రమందు తగుల్కొనియుండు పురుగులవలె.

【 కనుక వివేకవంతుడు పరమాత్మను భక్తిశ్రద్ధలతో ఆశ్రయించి దుఃఖవిముక్తిని, పరమశాంతిని పొందవలసియున్నాడు】.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము*


*450 వ రోజు*

*ప్రధమాశ్వాసం*


వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన మహాభారతకథను సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు. మహాభారత కథను వింటున్న జనమేజయుడు వైశంపాయుడిని చూసి " మహాత్మా ! తన కుమారుడు సుయోధనుడు భీముని చేతిలో చనిపోయిన విషయం సంజయుడి ద్వారా తెలుసుకుని ధృతరాష్ట్రుడు ఏమి చేసాడు. హస్థినకు వెళ్ళిన రధికత్రయం ఎవరిని కలుసుకున్నారు. తరువాత ఎక్కడకు వెళ్ళారు. అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్ళిన పిదప కృపాచార్యుడు, కృతవర్మ ఎక్కడకు వెళ్ళారు. మహావిజయమును సాధించిన పిదప కుమారుల బంధువుల మరణాన్ని ధర్మరాజు ఎలా తట్టుకున్నాడు "అని ఆడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు.


*కుమారుల మరణానికి దుఃఖించిన దృతరాష్ట్రుడు*

తన నూరుగురు కుమారులు యుద్ధములో మరణించారు అని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు మొదలు నరికిన వృక్షంలాగా కూలి పోయాడు. భరించరాని దుఃఖంలో మునిగి పోయాడు. అతడి హృదయం కకావికలైంది. దుఃఖభారంతో తనలో తానే కుమిలి పోతున్న సంజయుడు " ధృతరాష్ట్ర మహారాజా ! ఏమిటీ వెర్రి. ఎవరి కొరకు దుఃఖ పడుతున్నావు ? నీశోకానికి అంతు లేదా ! దుఃఖాన్ని వదిలి నేను చెప్పేది విను. కురుక్షేత్ర సంగ్రామంలో 18 అక్షౌహినుల సైన్యం మరణించారు. నీ తాతలు, తాండ్రులు, అన్నలు, తమ్ములు, బంధువులు, మిత్రులు, మిత్ర రాజులు, సామంత రాజులు నీ కోసం మరణించారు కదా ! వారికిదహన సంస్కారాలు చేయాలి కదా ! పద యుద్ధభూమికి వెళదాము " అన్నాడు. కాని ధృతరాష్ట్రుడు కదలలేదు తల బాదుకుంటున్నాడు. " సంజయా ! నా కొడుకులంతా చచ్చారయ్యా ! నా వైభవమంతా నశించిందయ్యా ! అతిదీనంగా బ్రతుకుతున్న నాకు ఈ దేహం ఎందుకు. ఒకరి దయాభిక్ష మీద బ్రతకడానికా ! నాదీ ఒక బ్రతుకేనా ! బ్రతికి నేను సాధించేది ఏముంది?.


*ధృతరాష్ట్రుడి పశ్చాత్తాపము*


సంజయా ! కృష్ణుడు సంధి చేయడానికి వచ్చినప్పుడు నాకు ఎంతో నచ్చచెప్పాడు. భీష్ముడు, ద్రోణుడు నా హితవు కోరి చెప్పారు. పరశురాముడు లాంటి మహా మునులు ఎందరో బుద్ధిమతి చెప్పారు. నేను దుర్బుద్ధితో వారి మాటలు పెడచెవిన పెట్టాను. పాండవులకు రాజ్యభాగం ఇవ్వ నిరాకరించి ఫలితం అనుభవిస్తున్నాను. కొడుకులను పోగొట్టుకున్నాను. బంధుమిత్రులను పోగొట్టుకున్నాను. అందరూ మరణించారు. దహనక్రియలు చేయడానికి నేను మాత్రం బ్రతికి ఉన్నాను. సంజయా ! రాబోయే ఆపద తెలిసి కూడా పాండవులకు రాజ్యభాగం ఇవ్వ లేదు. కనుక నా అనే వారందరిని పోగొట్టుకున్నాను. సంజయా ! నేను ఇలా కావడానికి నా పూర్వజన్మ సుకృతం కాక వేరు కాదు. అయినా ధర్మరాజు ఉండగా దహనక్రియలు చేయడానికి నేను ఎందుకు ? నా కుమారులను చంపి తమ ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్న పాండవులు ఈ పని కూడా చేస్తారులే " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*