28, జులై 2025, సోమవారం

శీర్షిక.... భోజన ప్రియులు

 శీర్షిక.... భోజన ప్రియులు 


తిండికి లేక కండలు కరిగిస్తూ 

ఒకవైపు 

కండలు పెంచుతూ తినడమె

పనిగా, అదేపనిగా బ్రేవో అని తేన్చేదాకా!


*తిండి కలిగితే కండ కలదోయ్*

ఆనాడు అన్నారు గురజాడ 

నేడు తిండితో కండలు కొండలుగా పెంచేస్తూ 

సిక్స్ ప్యాక్ బాడీలు పెంచుతూ 

ఊపిరితిత్తుల శ్వాసకు ఎసరు పెడుతున్నారు 

గుండె జబ్బులతో మజా మజాగా..


తినడం తాగడం తొంగోవడం 

పౌరాణిక చారిత్రక గాథల్లో 

ప్రసిద్ధి పొందారు తిండిబోతులు 

రుచులు మరిగిన వారలు 

బద్ధకంతో మొద్దు నిద్రతో కాలం వెళ్లబుచ్చేస్తారు

వృధాగా, బేఫికర్ గా 

తినడం లోనె ఆనందాన్ని అనుభవిస్తుంటారు 

అప్పనపు పప్పన్నం బ్రతుకులు..


అన్నమో రామచంద్రా! అల్లాడే ఆకలికి 

దొరకవు పట్టెడు మెతుకులు 

విందులు వినోదాలతో దర్జాలు చేస్తూ

పొట్ట పెంచుకుంటున్న ధనికులు అజీర్తి రోగాలకు 

శరీరాన్ని అనారోగ్యం పాల్జేస్తూ..


మితాహారం.. సమతుల ఆహారం 

ఆరోగ్యానికి చిట్కాలు 

హితసూత్రాలు ఇంటికీ--ఒంటికీ

వంటింటికీ..ఇంటావిడవికీ 

నిండా ఆయుష్ఫుతో నూరేళ్ళ పండుగ ప్రాణానికి..


నీతి ః--

*బతకడానికి తినండి.. తినటానికి బ్రతుకు వద్దండి*

ంంంంంంంంంంంంంంంంంం

ఇది నా స్వీయ కవిత 


ంంంంంంంంంంంంంంం

కామెంట్‌లు లేవు: