6, ఆగస్టు 2020, గురువారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం



అష్టమ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము

సముద్రమునుండి అమృతము ఉద్భవించుట - శ్రీమహావిష్ణువు మోహినిగ అవతరించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

నిఃసత్త్వా లోలుపా రాజన్ నిరుద్యోగా గతత్రపాః|

యదా చోపేక్షితా లక్ష్మ్యా బభూవుర్దైత్యదానవాః॥6614॥

మహారాజా! లక్ష్మీదేవి దైత్యులను, దానవులను ఉపేక్షించుటచే వారు బలహీనులై, భోగాసక్తులై ప్రయత్న శీలములను కోల్పోయి, సిగ్గు విడిచి, ప్రవర్తింపసాగిరి.

8.30 (ముప్పదియవ శ్లోకము)

అథాసీద్వారుణీ దేవీ కన్యా కమలలోచనా|

అసురా జగృహుస్తాం వై హరేరనుమతేన తే॥6615॥

అనంతరము సముద్రమథనము జరుగుచుండగ కమలలోచనయైన వారుణీ దేవి కన్యారూపమున ప్రకటమయ్యెను. భగవంతుని అనుమతితో అసురులు ఆమెను స్వీకరించిరి.

8.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

అథోదధేర్మథ్యమానాత్కాశ్యపైరమృతార్థిభిః|

ఉదతిష్ఠన్మహారాజ పురుషః పరమాద్భుతః॥6616॥

మహారాజా! పిదప అమృతమును అభిలషించుచు సురాసురులు సముద్రమును మథించుచుండగా, అందుండి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమాయెను.

8.32 (ముప్పది రెండవ శ్లోకము)

దీర్ఘపీవరదోర్దండః కంబుగ్రీవోఽరుణేక్షణః|

శ్యామలస్తరుణః స్రగ్వీ సర్వాభరణభూషితః॥6617॥

8.33 (ముప్పది మూడవ శ్లోకము)

పీతవాసా మహోరస్కః సుమృష్టమణికుండలః|

స్నిగ్ధకుంచితకేశాంతః సుభగః సింహవిక్రమః॥6618॥

అతని భుజములు దీర్ఘములై బలిష్ఠముగా నుండెను. ఆయన కంఠము శంఖమును బోలి సుందరముగా నుండెను. కన్నులు అరుణకాంతితో ఒప్పుచుండెను. ఆ పురుషుని శరీరము శ్యామలవర్ణముతో శోభిల్లుచుండెను. మెడలో వనమాల గలిగి, సర్వాంగముల యందు ఆభరణములతో అలంకృతుడై యుండెను. పీతాంబరధారియైన ఆ పురుషుని చెవులయందు మణికుండలములు విరాజిల్లుచుండెను. అతడు విశాల వక్షఃస్థలమును గలిగి, సింహవిక్రముడై తేజరిల్లుచుండెను. నుదుట మృదువైన ముంగురులు నిగనిగలాడుచుండగా అనుపమ సౌందర్యమూర్తియైన ఆ పురుషుడు దివ్య కాంతులతో విరాజిల్లు చుండెను.

8.34 (ముప్ఫది నాలుగవ శ్లోకము)

అమృతాపూర్ణకలశం బిభ్రద్వలయభూషితః|

స వై భగవతః సాక్షాద్విష్ణోరంశాంశసంభవః॥6619॥

ఆ మహాత్ముడు చేతులయందు కంకణములు గల్గి అమృతముతో నిండిన కలశమును పట్టుకొనియుండెను. అతడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు యొక్క అంశాంశావతారము.

8.35 (ముప్పది ఐదవ శ్లోకము)

ధన్వంతరిరితి ఖ్యాత ఆయుర్వేదదృగిజ్యభాక్|

తమాలోక్యాసురాః సర్వే కలశం చామృతాభృతమ్॥6620॥

8.36 (ముప్పది ఆరవ శ్లోకము)

లిప్సంతః సర్వవస్తూని కలశం తరసాహరన్|

నీయమానేఽసురైస్తస్మిన్ కలశేఽమృతభాజనే॥6621॥

8.37 (ముప్పది ఏడవ శ్లోకము)

విషణ్ణమనసో దేవా హరిం శరణమాయయుః|

ఇతి తద్దైన్యమాలోక్య భగవాన్ భృత్యకామకృత్|

మా ఖిద్యత మిథోఽర్థం వః సాధయిష్యే స్వమాయయా॥6622॥

అతడే ఆయుర్వేద ప్రవర్తకుడు, యజ్ఞ భోక్త, ధన్వంతరిగా విఖ్యాతుడు. దైత్యుల దృష్టి అతని చేతులయందున్న అమృతకలశముపై బడెను. వెంటనే వారు బలవంతముగా ఆ అమృత కలశమును లాగుకొనిరి. వారు మొదటినుండియు సముద్రమథనము ద్వారా లభించిన వస్తువులను అన్నింటిని తామే పొందవలెనని ఆరాతపడుచుండిరి. అసురులు ఆ అమృత కలశమును లాగుకొని పోవుచుండగా, దేవతల మనస్సులు విషాదభరితములయ్యెను. అంతటవారు శ్రీహరిని శరణు జొచ్చిరి. భక్తుల పాలిటి కల్పతరువైన భగవంతుడు వారి దైన్య స్థితిని గాంచి, వారితో ఇట్లనెను- దేవతలారా! మీరు ఖిన్నులు కావలదు. నేను నా మాయ ద్వారా అసురులమధ్య పరస్పరము కలహమును సృష్టించి, మీ మనోరథమును ఈడేర్తును

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

అతి లోభం- అనర్ధకం



      ఒక పల్లె లో ఒక ముసలి పిసినారి, అంటే డబ్బు దాచుకోవటం తప్ప ఖర్చు పెట్టుకోవటం ఇష్టం లేని వాడు, ఉండేవాడు. అతని ఇంటి వెనుక చిన్న తోట ఉండేది. తన దగ్గరున్న బంగారు నాణాలని ఆ తోటలో రాళ్ళకింద గుంత లో దాచి, దాని పైన రాళ్లు పెట్టేవాడు.

 కానీ ప్రతి రోజు పడుకోబోయే ముందు ఒకసారి రహస్యం గా ఆ బంగారు నాణాలని లెక్కబెట్టుకుని మళ్లీ అక్కడే పెట్టి దాచేవాడు.

ఒక రోజు ఈ పిసినారి రోజువారీ పనులన్నీ రహస్యం గా గమనిస్తున్న ఒక దొంగ, రోజు లాగే, బంగారు నాణాలు లెక్కబెట్టి లోపల దాచేవరకు చెట్టుపైన నిశ్శబ్దంగా ఉండి, అతను లోపలికి వెళ్ళాక , గప్చిప్ గా నాణాలని దొంగిలించాడు. మర్నాడు ముసలి వాడు చూసుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు.

ఇంటిపక్కవాళ్ళు వొచ్చి, ఏమి జరిగిందని అడిగి, తెలుసుకున్నారు. “ఎవరైనా ఇంటిలో సొమ్ము దాచుకుంటారు. నువ్వేమిటి బైట, అదికూడా భూమిలో పెట్టుకున్నావు? దానితో ఏదైనా కొనుక్కోవాలన్నా వీలుకాదు కదా?” అన్నారు.

దానికి ఆ పిసినారి, “కొనుక్కోడామా? నేను అస్సలు ఆ బంగారం వాడనే వాడను. అది దాచుకోడానికి మాత్రమే,” అన్నాడు. ఇది విన్న ఒక అతను ఒక రాయి ఆ కుంట లోకి విసిరి, “అలా అయితే, అదే నీ సొమ్మనుకో.

నువ్వు వాడనప్పుడు దానికి విలువేదీ? రాయైనా, బంగారమైన ఒకటేగా. నువ్వు వాడనప్పుడు రెండు విలువ లేనివే,” అంటూ వెళ్ళిపోయాడు.

నీతి : ఉపయోగించని సొమ్ము ఉన్నా, లేకున్నా ఒకటే.

ఉన్నదాంట్లో మనకు తగినంత వాడుకొని మిగతాది  ఇతరులకు సహాయం చేస్తూ ఆనందంగా ఉంటే అది  దైవకార్యం తో సమానం..

🌹🌹మానవ సేవే మాధవ సేవ 🌹 🌹

ధర్మో రక్షతి రక్షితః 🙏🏻🙏🏻🙏🏻
సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏🙏

అయోధ్యా పుర వర్ణన

వాల్మీకి రామాయణ కాలంనాటి అయోధ్యా పుర వర్ణన
వనం జ్వాలా నరసింహారావు

సరయూ నదీతీరంలో వున్న కోసల దేశంలో, ఎక్కడ చూసినా ధనధాన్యాలు రాసులు-రాసులుగా ఇంటింటా పడివుండి, ఒకరి ధనాన్ని, ధాన్యాన్ని మరొకరు ఆశించాల్సిన అవసరం లేనటువంటి స్థితిగతులుండేవి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఆ దేశంలో ప్రజలంతా దేహ పుష్టి కలిగి, సుఖసంతోషాలతో వుండేవారు. ధనధాన్యాది సంపదలతో మిక్కిలి భాగ్యవంతంగాను, మనువు స్వయంగా నిర్మించినందున అందంగా, రమ్యంగాను, పన్నెండామడల పొడవు, మూడామడల వెడల్పు, వంకర టింకర లేని వీధులతోను, ఇరు ప్రక్కల సువాసనలు వెదజల్లే పుష్పాలను రాలుస్తున్న చెట్లతోను, దారినపోయే వారి కళ్లల్లో దుమ్ము పడకుండా తడుపబడిన రాజవీధులతోను అలరారుతుండే అయోధ్యా నగరమనే మహా పట్టణం ఆ కోసల దేశంలో వుండేది. 

చక్కగా తీర్చి దిద్దిన వీధి వాకిళ్లతోను, తలుపులతోను, వాకిళ్లముందు మంగళకరమైన పచ్చని తోరణాలు కట్టేందుకవసరమైన స్తంబాలతోను, నగరం మధ్యలో విశాలమైన అంగడి వీధులతోను, శత్రువులను ఎదుర్కొనేందుకు కావాల్సిన రకరకాల ఆయుధ సామగ్రినుంచిన భవనాలతోను, శిల్ప కళాకారుల సమూహాలతోను, వందిమాగధులు, సూతుల జాతివారితోను, శ్రీమంతులైన పండితులతోను, ఎత్తైన మండపాల పై కట్టిన ధ్వజాలతోను, భయంకర శతఘ్నుల ఆయుధాలతోను, నాట్యమాడే స్త్రీ సమూహాలతోను, తియ్య మామిడి తోపులతోను, అందాలొలికే అయోధ్యా పురం "లక్ష్మీ పురం" నే మరిపించేదిగా వుండేది. 

"అయోధ్యా పురి" అనే ఆ స్త్రీ నడుముకు పెట్టుకున్న ఒడ్డాణంలా వున్న ప్రాకారం, అగడ్తలు, మితిమీరిన సంఖ్యలో వున్న గుర్రాలు, లొట్టిపిట్టలు, ఆవులు, ఎద్దులు, ఏనుగులు, అనుకూలురైన సామంత రాజులు, కప్పం కట్టే విరోధులైన విదేశీ రాజులు, కాపురాలు చేస్తున్న నానా దేశ వ్యాపారులు, విశేష ధనవంతులైన వైశ్యులు, నవరత్న ఖచితమైన రాజుల ఇళ్లు, చంద్రశాలలున్న అయోధ్యా నగరం స్వర్గ నగరమైన అమరావతిని పోలి వుంది. 

నవరత్నాలతో చెక్కబడి విమానాకారంలో కట్టిన ఇళ్లతోను, ఇంటినిండా ఆరోగ్యవంతులైన కొడుకులు, మనుమలు, మునిమనుమలు, మనుమరాళ్లు, వయో వృద్ధులతోను, ఎత్తుపల్లాలు లేకుండా భూమిపై కట్టిన గృహాల్లో పుష్కలంగా పండిన ఆహార పదార్థాల నిల్వలతోను, ఇంటింటా వున్న ఉత్తమ జాతి స్త్రీలతోను, నాలుగు దిక్కులా వ్యాపించిన రాచ బాటలతోను, వాటి మధ్యనే వున్న రాచగృహాలతోను నిండి వున్న అయోధ్యా నగరం జూదపు బీటలా వుండేది.(నగరం మధ్యన రాజగృహం, అందులో కట్టడాలు, గాలి వచ్చేందుకు విడిచిన ఆరుబయలు,నలుదిక్కుల రాచబాటలుండడమంటే చూసేవారికి జూదపు బీటలా వుంటుందని అర్థం). 

నగరంలోని నీళ్లు చెరకు పాలల్లా తియ్యగా, తేలిగ్గా, మంచి ముత్యాల్లా కనిపించే లావణ్యం లాంటి కాంతితో వున్నాయి. మద్దెలలు, వీణలు, ఉడకలు, పిల్లన గ్రోవులు, సుందరీమణుల కాలి అందియలు, వీటివల్ల కలిగే ధ్వనులు ఆహ్లాదకరంగా వుండేవి. ఎల్లప్పుడు ఆటపాటలతో, ఉత్సవాలతో, అలంకరించుకున్న స్త్రీలతో, ఆహ్లాద భరితంగా వుండేదా వూరు. ఘోర తపస్సు చేసి సిద్ధిపొందిన వారికి మాత్రమే లభించే స్వర్గంలోని విమానాకార ఇల్లు, అయోధ్యా నగర వాసులకు ఏ కష్టం లేకుండా దొరికాయి. 

ఆ నగరంలోని శూరులు అడవులకు వేటకు పోయేటప్పుడు, సింహాలను, అడవి పందులను, ఖడ్గ మృగాలను, ముఖాముఖి కలియబడి తమ భుజ బలంతో-శస్త్ర బలంతో, ఒకే ఒక్క వేటుతో చంపగలిగే గొప్పవారు. అయినప్పటికీ, ఆయుధం లేకుండా, సహాయం చేసేవారు లేకుండా, ఒంటరిగా చిక్కిన బలవంతుడైన శత్రువును కూడా క్షమించి విడిచిపెట్టగల దయా గుణమున్న శూరులు. భయంతో దాగిన వారినికూడా వదిలి పెట్తారు. 

అయోధ్యా పురంలోని బ్రాహ్మణులందరు అవిచ్ఛిన్నంగా అగ్నిహోత్రం కలిగుండే వారే. శమ దమాది గుణ సంపన్నులే. ఆరంగాలతో, నాలు వేదాలను అధ్యయనం చేసిన వారే. సత్య వాక్య నిరతులే. వేలకొలది దానాలు చేసిన వారే . గొప్ప మనసున్న వారే. వీరందరు సామాన్య ఋషులైనా, గృహస్తులైనా, నగర వాసులైనా, అడవుల్లో వుండే ఋషులకు సమానమైన వారు. 

భగవంతుడు అక్కడ పుట్టినందువల్లే, ఆ పుణ్య నగరం "అయోధ్య" గా కీర్తించబడింది. భగవంతుడైన విష్ణువు ఎక్కడుంటాడో, అదే పరమ పదం. ఆయన సేవే మోక్షం. అదే సర్వ కర్మలను ధ్వంసం చేస్తుంది. అయోధ్యలో మహా విష్ణువు పుట్టినందువల్లే మనుష్యులందరు ముక్తులయ్యారని శివుడు పార్వతికి చెప్పాడు.
అయోధ్యా నగరాన్ని దశరథ మహారాజు కీర్తివంతంగా పరిపాలించేవాడు. ఆయన ఇక్ష్వాకుల వంశంలోని రాజులందరిలోనూ అతిరథుడు, అగ్రగణ్యుడు. సమస్త ప్రజలను తనకనుకూలంగా మలచుకోగల నేర్పరి. మహర్షులతో సరిసమానమైన వాడు. 
రాజర్షులలో శ్రేష్టుడు. యావత్ ప్రపంచం కొనియాడదగిన శ్రీమంతుడు, కీర్తిమంతుడు. వైవస్వత మనువువలె పరాక్రమవంతుడై, జగజ్జనులను పాలిస్తూ, సత్యవంతుడై, ధర్మ-అర్థ-కామాలను రక్షించే విధానం తెలిసున్నవాడిలా, అయోధ్యా పురాన్ని పరిపాలించేవాడు దశరథ మహారాజు. 

అయోధ్యాపురంలోని బ్రాహ్మణులు బాహ్యేంద్రియాలను, అంతరేంద్రియాలను, జయించినవారు. పరులను వంచించాలనే దురాచారానికి దూరంగా వుంటారు. ఎటువంటి అనాచారానికి లోనుకాకుండా, సత్యాన్నే పలుకుతూ, భగవత్ కథలనే వల్లించి కాలయాపన చేస్తూ, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, నిర్మల బుద్ధితో వుంటారు. వేదాల్లో చెప్పిన కర్మ కార్యాలను నెరవేరుస్తూ, అడిగిన వారికి లేదనకుండా శక్తికొలది దాన ధర్మాలు చేస్తుంటారు. అక్కడి వారెవరికీ, ఇతరులను యాచించాల్సిన పనేలేదు. ఆరంగాల (శిక్ష-వ్యాకరణం-ఛందస్సు-నిరుక్తం-జ్యోతిష్యం-కల్పం) వేదాధ్యయనం చేయడం వారికి నిత్య కృత్యం. పెద్ద మనసుతో పుణ్య కార్యాలను చేస్తూ, దేవర్షులతో-మహర్షులతో సమానంగా, సూర్య చంద్రుల తేజస్సుతో-వర్ఛస్సుతో భగవధ్యానం చేస్తూ, సదాచార సంపన్నులై మెలగుతుండేవారు. 

అయోధ్యా వాసులందరూ సంతుష్టిగల మనసున్నవారే, ధర్మాన్నెరిగినవారే. శాస్త్ర సంబంధమైన ఆలోచనలు చెసే వారే. దేవుడిచ్చిన దాంతోనే సంతృప్తి చెందేవారు. త్యాగ బుద్ధిగలవారు. నిజాన్ని మాత్రమే చెప్పే గుణంగలవారు. తమకెంత అవసరమో అంత సంపాదన మాత్రమే చెసేవారు. అవసరాని సరిపోయే ఆవులను, గుర్రాలను, సిరి సంపదలను కలిగినవారు. కుటుంబం అంటే శాస్త్రాల్లో ఎటువంటి నిర్వచనం చెప్పబడిందో, దానికనుగుణంగానే, పదిమంది (తను-తన తల్లి, తండ్రి, భార్య-ఇద్దరు కొడుకులు-ఇద్దరు కోడళ్లు-ఒక కూతురు-ఒక అతిథి) కంటే తక్కువున్న ఇల్లు ఆనగరంలో లేదు. కొడుకులకు, భార్యకు కడుపునిండా భోజనం పెట్టకుండా బాధించేవారు కానీ, దాన ధర్మాలు అనుదినం చేయనివారు కానీ, ఆ నగరంలో కనిపించరు. అందమైన ఆ నగరంలో చెడ్డవారు కనిపించరు. పర స్త్రీలను ఆశించే వారు కానీ, భార్యతో కూడా నిషిద్ధ దినాలలో కామ క్రీడలు ఆడేవాడు కానీ, వేశ్యా లోలురు కానీ, చదువురాదననివారు కానీ, నాస్తికులు కానీ అయోధ్యలో లేనే లేరు.
అయోధ్యా వాసులందరూ ధర్మం, శీలం కలవారే. ప్రేమ స్వరూపులే. 
ఇంద్రియ నిగ్రహం కలవారే. మంచి స్వభావం వున్న వారే. 
దోషరహితమైన నడవడిక గల వారే. ఋషితుల్యులే. నిష్కళంకమైన మనసున్నవారే. ముత్యాల హారాలు ధరించి, చెవులకు కుండలాలను అలంకరించుకున్నవారే. అందచందాలున్న వారే. కురూపులు కాని వారే. మకుటాలు ధరించి, చందనం పూసుకుని, కొరత లేకుండా భోగ భాగ్యాలను అనుభవించే వారే. ఇష్టమైన ఆహారాన్ని తీసుకునే వారే. అన్న దాతలే. అవయవాలన్నిటినీ అలంకరించుకునే వారే. ఇంద్రియ నిగ్రహంతో పాటు, ఇంద్రియాలను జయించిన వారక్కడి జనులు. అందరూ సోమ యాగం చేసినవారే. అగ్నిహోత్రాలు కలవారే. వారి, వారి ఆచారం ప్రకారం వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారే. బ్రహ్మాన్ని ధ్యానిస్తూ, జప తపాలు చేసేవారే, దయాళులై, చక్కని నడవడి కలవారే. దశరథ మహారాజు పరిపాలన చేసే రోజుల్లో, అగ్నిహోత్రం లేనివాడు కానీ-సోమయాగం చేయని వాడు కానీ-అల్ప విద్య, అల్ప ధనం కలవాడు కానీ-వర్ణ సంకరులు కానీ-దొంగలు కానీ లేనే లేరు అయోధ్యా పురిలో.

తమ వర్ణానికి, ఆశ్రమానికి శాస్త్రోక్తమైన విహిత కర్మ ఏదో, దానినే బ్రాహ్మణులు శ్రద్ధతో ఆచరిస్తూ, విద్యా దానంలో-అధ్యయనంలో ఉత్తములై, వశ్యేంద్రులై, జితమనస్కులై, దానానికి పాత్రులై వుండేవారు. దశరథుడు పరిపాలన చేసే సమయంలో, చపలచిత్తులు, ఐహికాముష్మిక కార్య సాధనకు అవసరమైన దేహ బలం-మనో బలం లేనివారు, ఆరంగాలెరుగనివారు, అసత్యం పలికేవారు, ఈర్ష్య గలవారు, పాండిత్యం లేనివారు, చక్కదనం లేనివారు, పదివేలు తక్కువగా దానం చేసేవారు, దుఃఖించే వారు, రాజభక్తిలేని వారు, ఇతరులను పరవశులను చేయగల చక్కదనం లేని స్త్రీ-పురుషులు, స్త్రీలను స్త్రీలు-పురుషులను పురుషులు కూడా పరవశులు చేయగల చక్కదనం లేనివారు అయోధ్యా నగరంలో లేరు. అక్కడ నివసించే అన్ని వర్ణాలవారు దైవ పూజ చేయకుండా-అతిథిని ఆదరించకుండా, భోజనం చేయని దీక్షాపరులు. 

అయోధ్యా పురవాసులు శౌర్య పరాక్రమాలున్నవారు. సత్యమే ధనంగా కలవారు. ధనంలాగా సత్యాన్ని కాపాడుకునే శూద్రులు తాంత్రిక మంత్ర్రాలతో దేవ పూజ-హిరణ్య దానంతో అతిథి పూజ చేస్తారు. బ్రాహ్మణులు విద్యా శూరులు-వాద పరాక్రములు. బ్రాహ్మణులుపదేశించిన కార్యాలలో ఆసక్తి కలిగి క్షత్రియులు నడచుకునేవారు. వైశ్యులు రాజులకు అనుకూలంగా వుండేవారు. వంచన-దొంగతనం అనే వాటిని దరికి రానీయకుండా, శూద్రులందరు బ్రతుకు పాటుకై కుల విద్యలు నేర్చుకుని, కులవృత్తులలో నిమగ్నమై వుండేవారు. యుద్ధ భటులు కార్చిచ్చులాంటి దేహాలతో-తేజంతో, మందరం లాంటి ధైర్యంతో, ఇబ్బందులెన్ని ఎదురైనా, అప్పగించిన పనిని నెరవేరుస్తూ దేహ-మనో బలంతో ఉత్సాహంగా వుండేవారు.

వీరు-వారు అనే భేదం లేకుండా అయోధ్యా నగరంలోని ప్రజలందరు సద్గుణవంతులే. దేహ పుష్ఠికలవారే. అసత్యాలాడనివారే. రాజు మేలుకోరేవారే. అధికారులందరు రాజ్యంలో తాముచేయాల్సిన, చేయాలనుకున్న పనులను కార్యరూపంలో పెట్టి చూపించేవారే కాని, ముందుగానే రహస్యాలు వెల్లడించి కార్యభంగం చేయరు. ఇలా యావన్మంది తనను సేవిస్తుంటే, వేగులవారి ద్వారా లోకంలో జరుగుతున్న విషయాలను కళ్లార చూసినట్లు తెలుసుకుని, తదనుగుణంగా భవిష్యత్ కార్యక్రమాన్ని, మంత్రుల-పురోహితుల సూచనలతో-సలహాలతో రూపొందించే వాడు దశరథ మహారాజు. ఇలా పరిపాలన చేస్తూ, బాలసూర్యుడు కిరణాలతో ప్రకాశించే విధంగా, దశరథ మహారాజు కూడా ప్రకాశించేవాడు.

సూర్య బింబం కనిపించిన ఏడు నిమిషాల తర్వాత, సూర్య కిరణాలు భూమిని తాకుతాయి. సూర్య బింబం కంటే, సూర్య కిరణాల మూలంగానే, లోకానికి ప్రయోజనం చేకూరుతుంది. అదే విధంగా, రానున్న కాలంలో, అవతరించనున్న రామ-లక్ష్మణ-భరత-శత్రుఘ్నలు, దశరథుడికి సూర్య కిరణాల లాంటివారు. ఉదయాన ఎరుపు రంగులో వుండే సూర్యుడు దర్శనానికి పనికి రాడు. ఎండ వ్యాపించి-బింబం తెల్లగా మారిన తర్వాతే దర్శించడానికి యోగ్యుడు. అలాగే, రామాదుల వలనే దశరథుడు లోకమాన్యుడయ్యాడు. జాయానామ పూర్వుడు, స్వనామ పూర్వుడు, పుత్రనామ పూర్వుడు అనే మూడురకాల పురుషులుంటారు. మొదటి వాడికంటే రెండోవాడు-వాడికంటే మూడోవాడు శ్రేష్ఠుడు. దశరథుడు మూడో రకం వాడు.
ఇన్ని సద్గుణాలకు, సంపదలకు, సనాతన ధర్మానికి ఆలవాలమైనది కాబట్టే ఇన్ని వందల, వేల సంవత్సరాల తరువాత కూడా, యుగాలు మారినా అయోధ్య శోభ అలాగే నిత్యనూతనంగా వర్ధిల్లి, రామజన్మ భూమి తరతరాలకు ఆదర్శం కాబోతున్నది ఇవ్వాళా జరిగిన భూమి పూజ ద్వారా.

దీర్ఘాయుష్మాన్ భవ అంటే


చాలా సంవత్సరాల క్రితం మహాస్వామి వారి దర్శనానికి నలుగురైదుగురు పండితులు వచ్చారు. స్వామి వారికి సాష్టాంగం చేసి వారి ముందు కూర్చున్నారు. మహాస్వామి వారు భక్తులతో మట్లాడుతూ, ఆ కూర్చున్న పండితులనుద్దేశించి ఇలా అడిగారు.

భక్తులు నాకు నమస్కరిస్తే, నేను వారిని “నారాయణ నారాయణ” అని ఆశీర్వదిస్తాను. మరి మీరు గృహస్తులు ఏమని అశీర్వదిస్తారు?”

మేము ‘దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య’ అని అశీర్వదిస్తాము అదే సంప్రదాయము” అని అన్నారు.

అంటే ఏమిటి?” అని మహాస్వామి వారు ప్రశ్నించారు.

చాలాకాలం సౌఖ్యంగా ఉండు” అని దీని అర్థం.

మహాస్వామి వారు అక్కడ ఉన్న అందరు పండితులను అదే ప్రశ్న వేసారు. అందరూ అదే సమాధానం చెప్పారు. మహాస్వామి వారు కొద్ది సేపు మౌనంగా ఉండి, “మీరందరూ చెప్పిన అర్థం తప్పు” అన్నారు.

పండితులు ప్రశ్నార్థకంగా చూసారు. వాళ్ళందరూ పెద్ద విధ్వాంసులు. సంస్కృత వ్యాకరణాలలో శిరోమణులు. మంచి విద్వత్ కలిగిన వారు.

సంస్కృత వాక్యం “దీర్ఘాయుష్మాన్ భవ” అనునది చాలా సామాన్యము. సంస్కృత పరిజ్ఞానము ఏమి లేకపోయిననూ అర్థమగును. కానీ మహాస్వామి వారు ఆ అర్థము తప్పు అంటున్నారు అని పండితులు ఒకరి మొహాలు ఒకరు చూసుకునుచున్నారు.

వారి పరిస్థితి చూసి మహాస్వామి వారు ”నేను చెప్పనా దాని అర్థం” అని అన్నారు. పండితులంతా చెవులు రిక్కించారు.

”పంచాంగములోని (తిథి వార నక్షత్ర యోగ కరణ) పంచ అంగములలో ఉన్న 27 యోగములలో ఒకటి ఆయుష్మాన్ యోగము, 11 కరణములలో ఒకటి భవకరణము, వారములలో సౌమ్య వాసరము అంటే బుధవారము అని అర్థం. ఎప్పుడైతే ఇవి మూడు అంటే ‘ఆయుష్మాన్-యోగము’, ‘భవ-కరణము’, ‘సౌమ్యవాసరము-బుధవారము’ కలిసి వస్తాయో అది శ్లాగ్యము - అంటే చాలా శుభప్రదము మరియు యోగ కారకము. కావున ఇవి మూడు కలిసిన రోజున ఏమేమి మంచి ఫలములు సంభవమగునో అవి నీకు ప్రాప్తించుగాక” అని అర్థం.

ఈ మాటలు విన్న వెంటనే ఆ పండితులు ఆశ్చర్యపోయి, అందరూ మహాస్వామి వారికి సాష్టాంగం చేసి నమస్కరించారు.

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ శ్రీనువాసం గురుం ప్రణమామి ముదావహం*
****************

శ్రీరామనామ ము,కలికల్మషహరము.


శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి
(చందోలు)గారితండ్రివెంకటప్పయ్యశాస్త్రిగారుశ్రీరామకథామృతము,
వ్రాస్తూఅందులోరామనామ మహిమమునుఈవిధంగాకీర్తించారు.మత్తేభము.
కలి కాలుష్యమడంచు,త్రెంచువిపదాక్రాంతిన్,సమర్థించుని
ట్టలమౌసంపద,తెల్విబెంచు,ద్విష
దాడంబంబుమాయించు,మా
యలమంత్రంబులసంచు,మంచు
మిహిరుండట్లాహరించున్ విని
ర్మల ,మీరామపదం,బెదంజొనిపి
సంభావింపు డేవేళలన్.
********************

నేను =ప్రాణశక్తి

కన్నతల్లి కడుపులోంచి బయటపడి......
తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి......
పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు.......
ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా
సాగే ప్రస్థానం.......
పేరే......

             నేను =I

ఈ "నేను" ప్రాణశక్తి అయిన "ఊపిరి"కి మారుపేరు!

ఊపిరి ఉన్నంతదాకా "నేను" అనే భావన కొనసాగుతూనే ఉంటుంది....

జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ...ఈ
"నేను" ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది...

ఈ "నేను" లోంచే
నాది అనే భావన పుడుతుంది!

ఈ *నాది లోంచే....

1.నా వాళ్ళు,
2.నా భార్య,
3.నా పిల్లలు,
4.నా కుటుంబం,
5.నా ఆస్తి,
6.నా ప్రతిభ,
7.నా ప్రజ్ఞ,
8.నా గొప్ప...

అనేవి పుట్టుకొచ్చి....

చివరికి ఈ "నేను" అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,
ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి అహం గా ప్రజ్వరిల్లుతుంది.

              EGO అహం

అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ  ”నేను", ”నేనే సర్వాంతర్యామిని అని విర్రవీగుతుంది.

నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.

1. పంతాలతో
2. పట్టింపులతో,
3. పగలతో,
4. ప్రతీకారాలతో......

తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.

1 .బాల్య,
2.కౌమార,
3.యౌవన,
4.వార్ధక్య, 

దశలదాకా....విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన ఈ
నేను అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.

వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.

 సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.

 సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన ఈ  నేను చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.

 మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.

మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.

1.నేనే  శాసన కర్తను,

 2.నేనే ఈ సమస్త భూమండలానికి అధిపతిని,

3.నేనే జగజ్జేతను...

అని మహోన్నతంగా భావించిన ఈ నేను
లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. - ఎప్పటిలా
రోజు మారుతుంది.

ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన ఈ ‘నేను’ కథ అలా సమాప్తమవుతుంది.

అందుకే ఊపిరి ఆగకముందే ఈ “నేను”
గురించి తెలుసుకో అంటుంది “శ్రీమద్భగవద్గీత”
“SRIMADBHAGAVATH GEETHA”....

చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం మాత్రమే!

   అది శాశ్వతం కానే కాదు

ఈ నేను గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన
”వైరాగ్యస్థితి” అభిలాషికి సాధ్యమవుతుంది.

వైరాగ్యం అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు.
దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం.తామరాకుమీద నీటి బొట్టులా జీవించ గలగడం.

స్వర్గ-నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.

మనిషి ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే-నరకం

అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం-స్వర్గం.

ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే-వేదాంతం.

1. నిజాయితీగా,
2. నిస్వార్థంగా,
3.సద్ప్రవర్తనతో,
4. సచ్ఛీలతతో,
5.భగవత్‌ ధ్యానం

తో జీవించమనేదే
వేదాంతసారం.

అహం బ్రహ్మాస్మి అంటే
అన్నీ నేనే అనే స్థితి నుంచి
త్వమేవాహమ్‌ అంటే నువ్వేనేను అని
భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే
మానవ జన్మకు సార్థకత 

కాలసర్ప దోషం తొలగడానికి మనసా దేవి స్త్రోత్రం........!!

మానసాదేవి ద్వాదశనామ స్తోత్రమ్.....

ఈ శ్లోకం ఎవరు  రోజు చదువుతారో వారికి సర్ప భయం ఉండదు . కాలసర్ప దోషం భాధించదు .

శ్లోకం....

జరత్కారు  జగద్గౌరీ  మానసా  సిద్ధయోగినీ
వైష్ణవీ నాగభగినీ  శైవీ  నాగేశ్వరీ  తథా
జరత్కారుప్రియా  ఆస్తీకమాతా  విషహరేతి  చ
మహాజ్ఞానయుతా   చైవ  సా  దేవీ  విశ్వపూజితా
ద్వాదశైతాని   నామాని  పుజాకాలేతు యఃపఠేత్   
తస్య నాగభయం  నాస్తి  తస్య  వంశోద్భవస్య  చ 
మానసాదేవిమంత్రం.....

" ఓం  హ్రీం శ్రీం  క్లీం  ఐం మానసాదేవ్యై స్వాహా"

మానసాదేవి చరిత్ర .....

మానసాదేవి వాసుకి చెల్లెలు వాసుకి జనమే జయుడు  చేస్తున్న సర్పయాగంలో సర్పాలు మరణిస్తునపుడు,   మానసాదేవిని తన కుమారుడైన అస్తీకుని తో చెప్పి  నాగజాతిని కాపాడమని కోరతాడు. మానసాదేవి ఆదేశానుసారం అస్తీకుడు ఆ యాగాన్ని ఆపి సర్పజాతిని  కాపాడతాడు వారు అస్తీకుడు కృతజ్ఞతలు తెలుపుతారు. అప్పుడు అస్తీకుడు వాసుకి తొ నేను నా తల్లి తపస్సు వల్ల , అశీస్సులువల్ల ఈ పని సాధించాను అని చెబుతాడు. అప్పుడు ఇంద్రుడు అది నిజమని  పలికి. అమ్మ జరత్కారు ! నీవు  జగన్మాత అయిన లక్ష్మీదేవి అంశతో ఉదయించి, పూర్వ జన్మలో మమహాతపస్సు  చేశావు. హరిహరులు నీ  తపస్సు కు సంతోషించి "సిథేశ్వరి" గా నీకు వరములు ప్రసాదించారు . ఆనాడు  దేవతలకు నీవు ఎన్నో ఉపకారాలు చేశావు.నన్ను   కూడా    నీవు రక్షించావు .  నీ  భర్త  అయిన జరత్కారు మునీశ్వరుడిని (ఆయనలో నారాయణ అంశ వున్నది) యంతో భక్తితో    సేవించి  ఈ అస్తీకుడిని వరప్రసాదంగా కన్నావు .దేవతలయందు ఆర్తుల యందు, ధర్మరక్షనయందు మనసు పెట్టినమాతగా నిన్ను "మానసాదేవి " అని   పిలిచేవారము . ఆ పేరు ఇప్పుడు కూడా  సార్ధకమైనది. ఆపదలోవున్న నాగజతిని కాపాడి  నాగపూజ్యవే  కాదు లోకపూజ్యవు  కూడా  అయినావు. ఈ నాటినుండి నిన్ను పూజించేవారు సమస్త  కామ్యములను పొందుతారు . నీ నామములను ఎవరు పఠిస్తారో  వారికి సర్ప భయం  వుండదు  అంటూ  లొకపాలకుడైన ఇంద్రుడు మానసాదేవి నామములను స్తుతించాడు . నాగ ప్రముఖులందరూ    మానసాదేవిని భక్తితో  పూజించారు. గంగాతీరంలోని "మాయాపురి" దగ్గర వున్న కొండపైన అస్తీకుని ఆశ్రమంలో  మానసాదేవి అందరిచేత పూజలు  అందుకుంటున్నది. ఈ గుడి హరిద్వార్ దగ్గర వుంది .
                         
హరిద్వార్..మానస దేవి గురించి-:

త్రినేత్రుడైన పరమేశ్వరుని మానస పుత్రిక శ్రీ మాతా మానసదేవి. ఆమెను మనసారా పూజిస్తే భయంకరమైన కాల సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని బిల్వపర్వతంపై వెలసిన ఆమె యుగయుగాలుగా భక్తులను తన చల్లనిచూపులతో సంరక్షిస్తున్నారు.

 ఆమె దయ వుంటే చాలు ఏమైనా సాధించవచ్చని కోట్లాదిమంది భక్తుల నమ్మకం. సర్పాలకు మానవులు తెలిసిగానీ తెలియక గానీ చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పొగొడుతుంది. అందుకనే కాలసర్ప దోష నివారణకు ఆ మాతను ప్రార్థించాలి. అమ్మవారిని నిత్యం కొలిస్తే సకల సంపదలకు ఎటువంటి లోటు వుండదని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.

సర్పరక్షకురాలు
మాతా మానసదేవి అన్న వాసుకి. ఆమెను జరత్కారువు అనే మహర్షికిచ్చి వివాహం చేస్తారు. ఆమెకు మరోపేరు కూడా జరత్కారువు కావడం గమనార్హం.

ఈ దంపతులకు అస్తీకుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఒక రోజున జనమజేయ రాజు సర్పయాగం ప్రారంభిస్తాడు. తన తండ్రైన పరీక్షిత్తు మహారాజును తక్షకుడు అనే నాగు చంపడంతో ఆయన ఆగ్రహం చెంది ఈ యాగం నిర్వహిస్తాడు. రుత్వికుల మంత్ర పఠనంతో భూమండలం మీద వున్న వేలాది నాగులు వచ్చి యాగంలో పడిపోవడం ప్రారంభించాయి.

నాగులలో శ్రేష్టుడైన వాసుకి భీతిల్లితుండటంతో సోదరి మానసదేవి తన కుమారుడైన అస్తీకుడిని యజ్ఞం నిలిపివేసేందుకు పంపుతుంది. అస్తీకుని తల్లి నాగ స్త్రీ, తండ్రి బ్రాహ్మణ మహర్షి. ఒకే పేరుతో వున్న దంపతుల పిల్లలే యాగాన్ని నిలిపివేసేందుకు అర్హులు అని తెలియడంతో అస్తీకుడు ఆ కార్యాన్ని నెరవేర్చగలడని తల్లి భావించింది.

యాగ ప్రదేశానికి వెళ్లిన అస్తీకునికి జనమజేయుడు సాదరంగా స్వాగతం పలుకుతాడు. ఏం కావాలో కోరుకోమన్న రాజును ఆయన తక్షణమే యాగాన్ని నిలిపివేయమని విన్నవిస్తాడు. దీంతో మాటకు కట్టుబడిన జనమజేయుడు వెంటనే యాగాన్ని నిలిపివేయడంతో సర్పసంహారం నిలిచిపోయింది.

దీంతో నాగజాతి అస్తీకునికి కృతజ్ఞతలు తెలిపింది. అందరూ ఆయన తల్లి మానసదేవి సమక్షానికి చేరుకొని నాగులను కాపాడినందుకు భక్తితో ప్రణమిల్లారు. సర్పజాతిని సంరక్షించిన మాతా మానసాదేవి అంటే నాగులకు విశిష్టమైన గౌరవం. అందుకే ఆమెను పూజిస్తే అన్ని సర్పదోషాలు తొలగిపోతాయి.సంతానలేమికి కూడా కాలసర్పదోషం కారణమని చెబుతారు. అందుకనే ఆ మాతను పూజిస్తే సంతానఫలం కలుగుతుంది.

బిల్వ పర్వతంపై ఆలయం
హరిద్వార్‌లోని బిల్వపర్వతంపై అమ్మవారి ఆలయం వుంది. ఆలయాన్ని సిద్ధపీఠంగా వ్యవహరిస్తారు. సమీపంలోనే మాయాదేవి ఆలయం, చండీదేవి ఆలయాలు వున్నాయి. మూడు ఆలయాలు శక్తిపీఠాలు కావడం విశేషం. పర్వతంపై వున్న అమ్మవారి సన్నిధికి చేరుకోవాలంటే మెట్ల మార్గం లేదా రోప్‌వే వుంది. రోప్‌వేలో వెళ్లే సమయంలో గంగానది పరివాహక సుందరదృశ్యం మనకు అలౌకిక దివ్యానుభూతిని మిగుల్చుతుంది. సన్నిధానంలో మాత మానసదేవిని సందర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వున్న వృక్షానికి దారాలు కట్టి తమ కోరిక నెరవేర్చాలని వేడుకోవాలి. అమ్మవారి అభీష్టంతో కోరికలు నెరవేరిన అనంతరం తిరిగిఆలయాన్ని దర్శించుకోవాలి.

        ఓం శ్రీ మానసాదేవినమః

మహాయోగి శ్రీ త్రైలింగ స్వామి..!!

పుట్టింది తెలుగు దేశంలో అయినా,
ఆయన గడిపిన కాలమంతా కాశీలోనే.
ఆయన చూపించిన మహిమలు అపారం.
వారు పొందిన సిద్దులనేకం. వారి దివ్య విభూతి అనంతం.

ఆయనే త్రైలింగ స్వామి. అసలు పేరు శివరామయ్య.
విశాఖపట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామంలో జన్మించారు. సంపన్న బ్రాహ్మణ కుటుంబం.
తండ్రి నరసింహారావు, తల్లి విద్యావతి,

ఆయన జననం 19-12-1607.
తల్లి పూజ చేసుకొంటుంటే శివలింగం నుంచి వింత కాంతి ఈ బాలుడిమీద పడటం చూసి యోగ్యుడవుతాడు అనుకొన్నారు.
చిన్నప్పటి నుంచి ఐహిక వాంఛల మీద కోరిక లేదు.
నలభైఏళ్ళకు తండ్రి,యాభైరెండోఏట తల్లి చనిపోయారు.
స్మశానాన్నే ఇల్లుగా చేసుకొని ఆస్తినంతా సవతి తమ్ముడు శ్రీధరుడికి ఇచ్చేసి, అక్కడే ఇంకో ఇరవై ఏళ్ళు గడిపాడు.

స్వగ్రామం వదిలి పాటియాలా సంస్థానంలో బస్తర్ చేరాడు. అక్కడ భాగీరధి స్వామితో పుష్కర తీర్ధానికి వెళ్ళాడు. ఆయన దీక్షను ఇచ్చి గణపతి స్వామి అనే దీక్షా నామం ఇచ్చాడు.అప్పటికి అయ్యగారి వయస్సు డబ్భైఎనిమిది. గురు సమక్షంలో పదేళ్ళ సాధన చేసి, అద్భుత శక్తుల్ని సంపాదించుకొన్నాడు. గురువు మరణించిన తర్వాత
తీర్థ యాత్రలు చేస్తూ రామేశ్వరం చేరాడు.

అక్కడ స్వంత ఊరివారు కనిపించి ఇంటికి రమ్మని కోరినా వెళ్ళలేదు.రామేశ్వరంలో ఒక బ్రాహ్మణబాలుడు చనిపోతే శవాన్ని తీసుకొని వెళ్తూ తలిదండ్రులు విలపిస్తుంటే,
గుండె కరిగి కమండలం లోని నీరు వాడిమీద చల్లాడు. వెంటనే బాలుడు బ్రతికి అందర్నీ ఆశ్చర్యపరచాడు. ఆయన మహత్తు అందరికి తెలిసి సాక్షాత్తు శ్రీరామ లింగేశ్వరుడే గణపతి స్వామి అనుకొన్నారందరూ.
అక్కడి నుండి నేపాల్ చేరాడు.
అక్కడ అడవిలో తపస్సు చేస్తుంటే ఒక పులి వచ్చి ఆయనకు ఎదురుగుండా కదలకుండా కూచునిపోయింది.

రాజుగారి బంధువు ఈ దృశ్యాన్ని చూసి చకితుడైనాడు. పులిని చంపటానికి ప్రయత్నిస్తే వారించాడు.
ఆయన రాజుకు ఈ విషయం చెప్పాడు.
నేపాల్ రాజు వచ్చి సాష్టాంగ పడి అనేక కానుకలిస్తే, తీసుకోకుండా జంతుహింస చేయవద్దని హితవు చెప్పాడు స్వామి.అక్కడి నుంచి టిబెట్,తరువాత మానససరోవరం సందర్శించి, దారిలో ఎన్నో అద్భుతాలను చూపి, హిమాలయాలలో చాలాకాలం తపస్సు చేసి నర్మదా నదీ తీరంలో, మార్కండేయ ఆశ్రమంలో ‘ఖలీ బాబా” అనే అహోరాత్రాలు తపస్సు చేసే యోగిని దర్శించాడు.

ఒకరోజు తెల్లవారు జామున నర్మదా నదిలో పాలు ప్రవహిస్తున్నట్లు,ఈ స్వామి దాన్ని తాగుతున్నట్లు
ఖలీ బాబా చూశారు.గణపతిలోని మహిమేమిటో గ్రహించారు.విషయం తెలిస్తే ఆయన ఇక అక్కడ ఉండరు.

1733లో ప్రయాగ చేరారు. తపో నిష్టలో ఉండగా
ఒకసారి కుంభ వృష్టి కురుస్తోంటే శిష్యుడు రామ తరణ భట్టాచార్య ఆశ్రమంలోకి పోదామని చెప్పినా కదలలేదు. దూరంలో ఒక పడవ మునిగిపోతోందని దాన్ని రక్షించాలని సంజ్న చేశారు.అతడు అక్కడికి వెళ్ళే లోపున పడవ మునుగుతుంటే దిగంబర స్వామి అక్కడ పడవ మీద చేరి దాన్ని రక్షించాడు. శిష్యుడు ఆశ్చర్యం ప్రకటించగా ప్రతి వాడిలోను మహాశక్తులు అజ్ఞాతంగా ఉంటాయని
వాటిని గుర్తించే వారు తక్కువ అని తెలిపారు.

1737లో కాశీ చేరారు దిగంబర గణపతి స్వామి.
అప్పటికి ఆయనకు 130 ఏళ్ళు.
కాశీలో 150 యేళ్ళు గడిపారు.
ఆయనది 300 పౌన్ల బరువైన భారీ విగ్రహం.
గడ్డాలు, మీసాలు పెరిగి దీర్ఘ శరీరంతో దిశ మొలతో, మెడలో పెద్ద రుద్రాక్ష మాలతో, పెద్దబాన పొట్టతో
కాశీ నగర వీధుల్లో సంచరించేవాడు.
గంటలసేపు గంగాజలంపై పద్మాసనంలో తేలి ఉండేవాడు. అలాగే గంటలకాలం నదీగర్భంలో మునిగి ఉండేవాడు. అంటే కుంభకవిద్యలో అద్భుతమైన నేర్పు ఉండేదన్న మాట.కుష్టు రోగులకు సేవచేసి వారిని ఆదరించాడు.

వేద వ్యాస ఆశ్రమం చేరి, అక్కడ సీతానాథా బందోపాధ్యాయుని క్షయ వ్యాధి పోగొట్టి,
హనుమాన్ ఘాట్ చేరాడు.
ఒక మహారాష్ట్ర స్త్రీ రోజు విశ్వేశ్వరుడి అభిషేకం చేసి వస్తు ఈ దిగంబర స్వామిని రోజు చూస్తూ ఏవగించుకొనేది. ఆమె భర్తకు రాచ పుండు. ఆమెకు అందరు దిగంబర స్వామిని అర్ధించమని కోరారు. కానీ తాను తూలనాడిన ఆయన దగ్గరకు వెళ్ళటానికి సందేహించింది.
చివరికి వెళ్లి కాళ్ళమీద పడింది.
ఆయన ఇచ్చిన విభూతితో జబ్బు మాయమైంది.

కాశీ మహానగరంలో ఎందరో తెలుగువారు ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా ఉన్నారు.
వారు ఈ దిగంబర స్వామి తెలుగు వాడని గుర్తించారు. ఆయనకు "త్రైలింగ స్వామి” అనే పేరు పెట్టారు.
తెలుగు దేశం అంటే త్రిలింగ దేశమే కదా.
అప్పటి నుంచి ఆ పేరే స్థిరపడిపోయింది.

1800లో తన మకాంను దశాశ్వ మేధ ఘాట్ నుండి బిందు మాధవంకు మార్చారు.
ఎప్పుడూ మౌనమే, ధ్యానమే, తపస్సు, యోగ సమాధే. కనుకే ఆయన్ను “మౌన బాబా” అన్నారు.

కాశీరాజు వీరిని తన పడవలోకి ఆహ్వానిస్తే వెళ్ళారు. రాజు బ్రిటిష్ వారు బహుమతిగా ఇచ్చిన కత్తిని స్వామి చూడాలని ముచ్చటపడితే ఇచ్చారు.
అది పొరపాటున గంగలో జారిపడిపోయింది.
రాజుకు కోపం వచ్చి తిట్టాడు. స్వామి తన చెయ్యి గంగా నదిలో పెట్టి ఒకే రకంగా ఉండే రెండు కత్తులను తీసి అందులో రాజుదేదో గుర్తించి తీసుకోమన్నాడు.
రాజు గుర్తించలేకపోతే తానే గుర్తించి చెప్పి ఇచ్చాడు. రెండోదాన్ని గంగలోకి విసిరేశారు స్వామి..

దిగంబరంగా తిరగటం కొంతమందికినచ్చక కేసుపెట్టారు. కోర్టులో కేసు నడిచింది. ఆయన్ను బంధించి తీసుకొని రమ్మని మేజిస్ట్రేట్ ఆర్డర్ వేసాడు.
అలాగే గబ్బిట దుర్గాప్రసాద్ తెచ్చారు. ఈయన మహిమలను అధికారులు ఆయనకు వివరించారు. ఆయన తాను తినే మాంసం స్వామి తింటే శిక్షించను అన్నాడు. స్వామి సైగలతో తాను తినే దాన్ని మేజిస్ట్రేట్ తింటారా అని ప్రశ్నించాడు. వెంటనే తన చేతిలో మల విసర్జన చేసుకొని నోట్లో వేసుకొని తినేశారు. మతి పోయింది మేజిస్ట్రేట్ కు. అయితే సుగంధ పరిమళం
కోర్టు అంతా వ్యాపించింది. స్వామి మహిమ తెలిసి దిగంబరంగా తిరిగే హక్కు ఇచ్చాడు.

ఒకసారి ఒక ఆకతాయి..ఆయన బజారులో వెళ్తుంటే మర్మాంగాన్ని గుంజాడు. అది కొన్ని గజాలు సాగింది. వాడు భయపడి పారిపోయాడు.
దుండగులు కొందరు సున్నపు తేట ఇచ్చి పాలు అని చెప్పారు. శుభ్రంగా తాగేశాడు స్వామి.
వెంటనే మూత్రరూపంలో దాన్ని అంతట్ని విసర్జించాడు.

శ్రీరామ కృష్ణ పరమహంస 1868లో కాశీ వచ్చినప్పుడు తన మేనల్లుడు హృదయనాథ్తో కలిసి మౌనస్వామిని దర్శించారు. ఆయనకు బాబా నశ్యం వేసుకొనే కాయ కానుకగా ఇచ్చారు. స్వామిని “నడయాడే విశ్వనాథుడు” అని చెప్పారట పరమహంస.
ఇంకోసారి అర్ధమణుగు పాయసం వండించి తీసుకొని వెళ్లి స్వామికి అందించి తినిపించారట.
పరమహంస స్వామిని "ఈశ్వరుడు ఏకమా అనేకమా” అని ప్రశ్నిస్తే - సమాధి స్తితిలో ఏకం అనీ, వ్యావహారిక దృష్టిలో అనేకం అని సైగలతో చెప్పారు స్వామి. పరమహంస, స్వామిని తన ఆశ్రమానికి ఆహ్వానించి సత్కరించారు. ఇద్దరూ మహా పురుషులే. పరమహంసలే ఒకరి విషయం రెండో వారికి తెలుసు.
ఎన్నో అద్భుతాలు చేసిన రామకృష్ణులు స్వామిని అంతగా గౌరవించారంటే బాబా ఎంత మహిమాన్వితుడో తెలుస్తోంది.

ఒకసారి రాజఘాట్ నుండి విద్యానందస్వామి
అనే యతి వీరిని దర్శించటానికి కేదార్ ఘాట్లో ఉన్న మనస్వామి దగ్గరకు వచ్చారు.
ఇద్దరు గాఢంగా ఆలింగనం చేసుకొన్నారు.
కాసేపట్లో అందరు చూస్తుండగానే ఇద్దరు మాయమైనారు. అరగంట తర్వాత స్వామి తిరిగి వచ్చారు.
తాను ఆయన్ను రాజ ఘాట్లో దింపి వచ్చాను అని స్వామి అందరి సందేహాల్ని తీర్చారు.

పంచగంగా ఘట్టంలో చిన్న భూగృహం నిర్మింపజేసుకొని 32 ఏళ్ళు సేవ చేసి, ఆయన విగ్రహాన్ని చేయించాలని రెండునెలల గడువు కావాలని కోరితే,
మరణాన్ని వాయిదా వేసుకొని, భక్తుడైన మంగళదాస్ కోర్కె తీర్చి భూగృహం చేరి ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు యోగ సమాధిలో ఉండి, తానే బయటకు వచ్చి భక్తుల హారతులు అందుకొని యోగాసనంలో కూర్చుండి, బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించుకొని 26-12-1887న సర్వజిత్ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమవారం త్రైలింగ స్వామి తమ ఇహ జీవితాన్ని చాలించుకొన్నారు.

ఆయన శరీరాన్ని చెక్కపెట్టెలో పెట్టి ఆయన కోరిన విధంగానే తాళం వేసి అసి నది నుండి వరుణ నది దాక ఊరేగించి గంగా నదీ ప్రవాహంలో వదిలారు.
ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాశీ విశ్వేశ్వరునికి ఎలా నిత్యం అభిషేకం, పూజా జరుగుతాయో స్వామి విగ్రహానికి కూడా కేదార్ ఘాట్లోన మఠంలో జరగటం విశేషం. పతంజలి యోగంలో విభూతి పాదంలో చెప్పిన అణిమాది అష్ట సిద్ధులు, కుంభక యోగంలో త్రైలింగ స్వామి సిద్ధింప జేసుకున్నారు. ఆయన సంస్కృతంలో రాసిన “మహా వాక్య రత్నావళి”కి వ్యాఖ్యను బెంగాలిలో రాశారు. కాని మన తెలుగు వారి దృష్టి ఇంకా దానిపై పడకపోవటం విచారకరం అంటారు బాధతో బి. రామరాజు గారు. (ఆంధ్ర యోగులు రచయిత).

280 సంవత్సరాలు జీవించి, స్వచ్చంద మరణాన్ని పొంది, యోగ సిద్దులలో త్రివిక్రములై ఆశ్రిత జన కల్పవృక్షమై మౌన ముద్రాలన్కారులై తెలుగువారై ఉండి ఉత్తర దేశంలో, అందులోను కాశీ మహా క్షేత్రంలో బ్రహ్మ రధం పట్టించుకొన్న త్రిలింగ యోగి నామ ఉచ్చారణ చాలు మనం తరించటానికి.
(సేకరణ)

అరుణాచలం:


*అపనమ్మకముతో* ఏ *పనీ* మొదలు *పెట్టద్దు* ఎందుకంటే *నీ* మీద *నీకు* ఉన్న నమ్మకమే *నీ విజయానికి తొలిమెట్టు*.                                     

_*ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు చేదునియమాలు*_

1. ప్రకృతి యొక్క మొదటి నియమం ఒకవేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది. అదేవిధంగా మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడుఆలోచనలు చేరుకుంటాయి.

2. ప్రకృతి యొక్క రెండవ నియమం  ఎవరివద్ద ఏమిఉంటుందో వారు దానినే పంచుకోగలరు. సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు. దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు. జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు. భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు. భయస్తులు భయాన్నే పంచగలరు.

3. ప్రకృతి యొక్క మూడవనియమం మీకు మీజీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి. ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది. మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి. ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది. నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది. అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది. దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది. సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది.

_*విషయం చేదుగా ఉన్నా ఇది నిజం*_

*మహారాజ్ఞి మండోదరి*



*Part.7*

అని మండోదరితో ఆనాటితో తనకు బంధం తీరినదని పలికి వీరుడై రణరంగానికి బయలుదేరాడు. తనభర్తకు చేజేతుల చంపుకోవడానికి కులీనయైన ఏ స్త్రీ ఆశించదు. మరణమెప్పటికి తప్పదు కాబట్టి ఉత్తమలోకాలు చేరి సద్గతిని పొంది సుఖించాలని ఆమె కోరుకోవడంలో ఉపకారమే ఉన్నది. భారతీయ సతీధర్మాలను ఇలా ఆయా పాత్రల ముఖతః నిరూపించాడు కవి. పరోపకార శీలం, స్వార్ధరహిత్యం, ఆత్మ పరిశీలనం, సత్యస్ఫ్రకంగా పాత్రల మనోభావాలను చిత్రించుట అంత తేలికయైన పనికాదు. పాత్రలలోని త్యాగైక గుణసంపదకు వన్నెలు దిద్దడం మహా ప్రజ్ఞాశీలియైన కవికి మాత్రమే గలదనుట నిర్వివాదాంశం.

అలా రావణుడు రణభూమి చేరి ఆ దాశరథి చేత విహుతుడైనాడు. అది తెలిసి రావణాంతఃపుర స్త్రీలంతా విలపించారు. కులస్త్రీలను చెరపట్టిన పాపమేనని భావించారేగాని శ్రీరామాదులను దూషించినవారు లేరు. రావణుని స్వ్యం కృతాపరాధానికి నొచ్చుకుంటూ మండొదరి చేసిన విలాపాలు ధర్మ ప్రతిపాదికమైనవి. మరొక్కసారి వేంకటకవి ఆమెచేత దీర్ఘోపన్యాసం చేయించాడు. శ్రీరాముని దైవత్వాన్ని రావణునిలోని ఆసురీప్రవర్తనను మరల మరల చాటి చెప్పించాడు. పౌరుష ప్రత్తపోన్నతుడై సిద్ధ గంధర్వాది దేవతా గణాన్ని గడగడ వణికించిన తనభర్త శ్రీరాముని చేతిలో నిర్జింపబడుట సిగ్గుపడవలసిన విషయమని, అంతా దైవయోగమని విలపించినది. శ్రీమన్నారాయణుడే శ్రీరాముడని ఆ దంపతులు యుద్ధానికి ముందే తెలిసికున్నారు. అయినా తన భర్త ఔన్నత్యం మీద ఆమెకంత విశ్వాసం. తన భర్త గొప్పదనాన్ని శ్రీరముని దైవత్వాన్ని పదిమందిలో తెలియజెప్పడానికే కవి మండోదరికి ఆ అవకాశం కల్పించి ఉంటాడు. అన్నింటికంటే ముఖ్యంగా మండోదరిచేత సీతా శీలవృత్తాన్ని మరల ప్రకటింపచేస్తాడు.
మండోదరి మరల అంటున్నది. ఒక వ్యక్తి వినాశానికి ఆ వ్యక్తిలోని దోషాలేనని పలికినది. తన భర్త ముందు ఇంద్రియాలను గెలిచి తర్వాత ముజ్జగాలను గెలిచాడట. అంతా తపోబల సంపదగలవాడు తన భర్త అని ఆమె ఉద్దేశం. ఇంద్రియ విజయం వల్ల అతనికి అతని యింద్రియాలే చివరకు శత్రువులైనాయట. అంత మనో నిగ్రహ శక్తులున్న్వాడైనా చివరకు ఇంద్రియ లోలత్వం వల్లనే వినాశాన్ని కొనితెచ్చుకున్నాడత. చపలాత్ములైన పురుషులందరికి ఈమె ఎంతో చక్కటి సందేశాని అందించినది. రామునితో వైరం మాని సీతని ఇమ్మని పలికిన హిరం నీకు రుచించలేదు. ఇది విధిచోదితమని పలికిన మండోదరి సౌమ్యగుణ్శీల సంపద కొనియాడదగియున్నది. ఇంద్రియలోలురైన ప్రతివారికి రావణుడే ఉదాహరణ.

తన భర్త చేపట్టిన అకార్యాలపట్ల ఆమె యెంతగా కుమిలిపోయినదో ఆమె చేసిన హెచ్చరికల ద్వారా తెలుస్తున్నది. సమయం దొరికినప్పుడంత తన భర్తలోని దురాగతాలను అనుభావానికి వచ్చిన తత్ఫలితాలను ఆమె వివరణగా చెప్పడం భార్యమాటలలోని పరమార్ధాలు తెలిసికూడ, అహాన్ని విడిచి ప్రవర్తించకపోవడమే లంకకు చేటు తెచ్చినది. రావణాసురుడు సామాన్యుడు కాదుగదా! పోగాలం దాపురించిన వాళ్లు “కనరు, వినరు, మూర్కొనరని” సూరిగారన్నట్లు ఏ రకమైన వ్యసనపరుడైనా పడే కష్టాలు తెలిసి కూడ తాము చేపట్టిన మార్గాన్ని విడిచిపెట్టరు. వాళ్లలోని అహంకారం అలాంటిది. స్త్రీల మాటను మగవాళ్లు అసలు ఖాతరుచేయరు. చివరికి అందుకోవలసిన ఫలితాన్ని అందుకుని అలమటించడం అతి సామాన్య ధోరణి మగవాళ్లకు. సామాన్యులే అలాంటి బుద్ధితో ప్రవర్తిస్తే పదితలలవాడికి ఇంకెంత బింకం ఉండాలి మరి. ఏది ఏమైనా మండోదరి మాత్రం కడవరకు తనభర్తను బ్రతికించుకోవాలనే విశ్వప్రయత్నం చేసి ఎన్నో విషయాలు గుర్తింపచేస్తుంది. రావణుడు ఇంతవరకు చేసిన పనులకంటే సీతను కొనిరావడమే లంకకు చేటు కలిగించిన విషయమని హెచ్చరించినది.
ఇంకా ఇలా అంటుంది పుణ్యవతి అయిన మహారాజ్ఞిపై నీకు పుట్టిన మోహమే నీ పాలిట అగ్నిశిఖ. అంతేగాదు “నిన్ను, నన్ను, గులమును, నిఖిల సుతుల హితుల మంత్రుల నెల్ల” దహించినదనుటలో ఆ సాధ్వికి భర్త చేష్టలు ఎంత అనర్ధదాయక మైనవో వివరించింది. “అరుంధతి, రోహిణి కంటె విశిష్టమైనది, క్షమాగుణం గలది, సౌభాగ్యవతులకు నిదర్శనమైనది. వారాశి సుతకు దృష్టాంతభూమియై తేజరిల్లుచున్నది. పతిభక్తిగలది, పరమసాధ్వి, నబల, సర్వానవద్యాంగి, మహితశీల, మాన్యయైన సీతను మ్రుచ్చిలి దెచ్చి ఏం సుఖపడినావు బృహత్ఫలితాన్ని పొందావు. కులం నశించినది అని రావణుని బలహీనబుద్ధిని ఏకరువుపెట్టినది. స్వయకృత అపరాధిగ నిర్ణయించినది. ఆ సతిని చెరపట్టిననాడే దహించిపోవలసిన వాడివి కాని కాలకర్మాలు కూడిన నాడే పరిపక్వమైన ఫలితం అని సూచించినది. ఉత్తమసతుల చెఱబడితే కలిగే అనర్ధాన్ని కన్నుల గట్టించినది. ఆమె హృదయ ఔన్నత్యాన్ని కవి చక్కగ రూపించాడు. మండోదరి ఒకసారి సీతను గూర్చి నాకంటే ఆమె అంత అందగత్తియా? అని వితర్కించింది. ఆ మండోదరియే సీతాదేవి సౌశీల్యాన్ని ఎంతగా కొనియాడినదో చూశారుగా. అలాంటి బంగారు శలాక సీతమ్మ. అంటే అగ్నిశిఖవంటిదని గూడ నర్మగర్భంగా తెలియచేసింది. నువ్వు చేపట్టిననాడే నిన్ను దహించివుండేది కాని పతిపరాయణ సీత నీ కాలకర్మాలకై ఎదురుచూచింది అనడంలో శత్రు వర్గపు స్త్రీ అయివుండి గూడ అమలినమైన భావాలతో సీతను కొనియాడిన మండోదరి ప్రశంసనీయ. ఈ ధర్మాధర్మ ప్రకటనకు మండోదరియే దగినపాత్ర అని వేంకట కవి భావించడం ఎంతో సముచితంగా వున్నది. పుణ్య పాపాలను పరిశీలించి ఆయా కర్మలు ఫలితాలు ఎలావుంటాయో విభీషణుణ్ణి, రావణుణ్ణి ఉదాహరణగా నిరూపించిన నేర్పరి. శ్రీమద్రామాయణంలో పరనింద చేసిన పాత్ర సృష్టి మృగ్యం. ఒక సామాన్య స్త్రీ అయినచో జ్ఞాతుల, సహచరుల చేష్టలను దుయ్యబట్టి నిందోక్తులతో బాధపెట్టడం లోకసహజం. ఉత్తములెప్పుడు తమను తామే పరిశీలించుకుని పశ్చాత్తాపులౌతారు. వేరొకరైనచో తన మరది విభీషణుడు, అతని భార్య యింటి గుట్టునంతా రామునికి చెప్పి తన భర్త మరణానికి కారకులైనందుకు తీవ్రంగా నిరసించి, నిందించి, కఠినోక్తులతో హింసించేవారు. కాని అయోనిజయైన మండోదరి మనస్తత్వమే వేరు. ఆమె తన యింటిని, పరిసరాలను, తన కుటుంబసభ్యులనే గాక, భర్త రావణుని గూడ చక్కగా అవగాహన చేసుకున్న కుశాగ్రబుద్ధిగలది. అందుకే తన బంగారమే మంచిదైతే అన్న సామెతగా తప్పులన్ని తన భర్తలోనే చూడగలిగిన ఉదార స్వభావం గలది.

Srinuswami🙏
[05/08, 11:54 am] +91 99772 99911: *మహారాజ్ఞి మండోదరి*
*Part-8*

అంతే కాదు విభీషణుడు చేసిన హెచ్చరికలు, హితోక్తులు లెక్కచేయక చేటు తెచ్చుకున్నావని తన భర్తనే అంటుంది కాని విభీషణుని ఆమె ఏమీ అనలేదు. శుభాశుభకర్మలకు ఫలితం సుఖదుఃఖాలని అనుభవానికి రాగలవని తీర్మానించినది. మరది విభీషణుని మన్నించినది. ఉత్తమ సతీధర్మాలు తెలిసిన మగువ మండోదరి. వాల్మీకి వ్యాసాదులేగాక ఎందరో గొప్ప కవులు మాత్రమే స్త్రీల ఔన్నత్యానికి పెద్దపీట వేసారు. మగువని ఆదరించి గౌరవించిన వాడే సుఖశాంతులని మన దివ్యగ్రంధాల సూచనగా నిర్ధారించారు.

మండోదరి తాను ఐశ్వర్యోపేతను, అందగత్తెను అను సాభిప్రాయ వ్యక్తీకరణ కూడ చేసుకున్నది. లోకంలో ఇది కొందరిపట్ల సహజమేననవచ్చును. రూపవతులైన యువతులు రావణుని కెందరో ఇంటగలరనీ, మోహవివశుడై వాళ్ల అందాల్ని చూడక సీతను పెద్ద అందగత్తెగా భావించాడని తలంచినది. ఇది కూడ పరస్త్రీ వ్యామోహ బద్ధులైన పురుషులకొక చిన్న చురకవంటిది. పైన మాటల వలన మండోదరి తన ఆధిక్యతను చాటుకుంటుంది. ఇంతంటి అందగత్తె తన ఇంట్లోవున్నప్పటికీ రావణుని వక్రబుద్ధి ఏపాటిదో చూడండి అంటున్నాయేమో మాటలు. ఏది ఏమైనా వ్యసనం వినాశహేతువు అని హెచ్చరిస్తోంది.
అని పలికిన పలుకులలో ధర్మపత్నితో పరస్త్రీ తుల్యమైనది కాదనే బుద్ధి గరపడమే గాక సీతకంటె తానేమి తక్కువైనదిగాదని పరస్త్రీలోలుడైన పురుషునికి తన భార్య సౌందర్యం తెలుసుకునే శక్తి చాలదని అలాంటి బుద్ధిలోపమే తన భర్తకు గలదని తత్ఫలితాన్ని అందుకున్నాడని నిరూపించిన ఉత్తమ యిల్లాలు. ఆమెలోని అభిజాత్యం అలాంటిది. జానకి ఆనందంగ భర్తతో సుఖం అనుభవిస్తుంటే చెఱగొన్న ఫలితంగా తనకీ వైధవ్యం అని రోదించిందా సతి, భార్యాభర్తలకు ఎడబాటుచేసిన కర్మఫలమేనని ఆమె విశ్వాసం. “నారీ చౌర్యమిదంక్షుద్రం కృతం శౌటిర్యమానినా” అన్నట్లు అతని నీచ బుద్ధిని గర్హించినది. పతివ్రతాపహరణమే అతని పాలిట కాలసర్పమై విషజ్వాలలచే దహించినదని పలుమార్లు మండోదరి వాకొన్నది. ఉత్తమ సతీధర్మాలకు నిలయం ఆమె హృదయం. ఆమెచేత కవి మరొక సత్యాన్ని లోకాలకు చాటిచెప్పించాడు. గొప్ప ఐశ్వర్యంతో తలతూగి భర్తతో కలిసి, అనుపమ భోగసంపదలు అనుభవించి ఉద్యానవనాది వివిధ దేశాలు సందర్శించిన తాను నేడు భోగ సంత్యక్తయై కాంతి హీనమైన జీవితం గడపవలసి వచ్చినందుకు చింతించినది. “భూవిభుల భోగ భాగ్యములు నమ్మదగవు చపలము లరయ ..” అని రాజ భోగాలన్ని అశాశ్వతాలని గర్హించినది. ఆమెలోని సత్యసంధత అనుపమానమైనది. అందుకే రాక్షసేంద్రా! అకారణ మృత్యువు కలుగదు. నీకు కూడ మైథిలిని అపహరించిన కారణంగానే మరణం సంభవించినదని కార్యకారణ హేతువుతో తర్కించినది. రావణుని ప్రేరణచేసిన తన ఆడపడుచు శూర్పణఖను గాని, రావణ వధకు కారకుడైన విభీషణునిగాని ఒక్కమాట అని కష్టపెట్టలేదు. ఎంతకూ అతడి కర్మ ఫలమేనని పలుమార్లు నొక్కి చెప్పడంలో కవి ఉద్దేశం ఎంతటివాడికైన కర్మఫలం అనుభవించక తప్పదనే సత్యాన్ని మండోదరి ముఖతః పాఠకలోకానికి అందించాడు.

మండోదరి తన భర్త ఔన్నత్యాన్ని, ఐశ్వర్యాన్ని, అందాన్ని చూచి మిక్కిలి గర్వించినది. అతని ఠీవిని పదే పదే స్మరించుకున్నది. స్త్రీల మానసిక భావాలను నిసర్గ రమణీయంగా వర్ణించాడు.
అని తన గర్వానికి కారణం వివరించినది. విక్రమాధికుడు, అహవశూరుడు, ధీరుడు, శౌర్యగుణోన్నతుడు అయిన భర్తగల తనకు ఎలాంటి ఆపద రాబోదని విశ్వసించినందున, మానవుని చేతిలో మరణిస్తాడని ఊహించలేదని దుఃఖించినది. అయితే పాఠకులు ఒక్క విషయాని గుర్తుంచుకోవాలి. మండోదరి రావణుడు ఇద్దరు రామావతార రహస్యం తెలిసినవాళ్లుగ, రాముడు దైవస్వరూపుడే అని మనకి చెప్పిన వాళ్లు గదా! మరల రాముడనే మానవుడి చేతిలో మరణం అనడానికి కారణం, రామావతార రహస్యాని పాఠకులకు ఒక్కమారైనా తెలియ చెప్పాలనే కవి మదిలోని ఆరాటాన్ని అలా ప్రదర్శింపచేసి వుంటాడు. అంతే వైభవోపేతంగా అలరారే రావణుని శరీరం రాముని కార్ముక విముక్తమైన వాడియైన శరజాలంతో క్షతమై నెత్తుటిదోగి విఖండితమై కొండవలె పడి ఉన్నదని దుఃఖితయైన సుశీల ఈమె. మృత్యువుకే మృత్యువైన నీవెట్లు మృతుడవైనావని భర్త ప్రతాపాన్ని ప్రకటించింది.

శభ్దవైచిత్రితో, దత్తపదుల విన్యాసంతో రావణాసురుని దర్పాన్ని వర్ణించిన వేంకటకవి రచన పోతనామాత్యుని పద్యరచనా కౌశలానికి ధీటైనది. రావణాసురుని మదరూప, ఐశ్వర్యటోపాలన్నిటిని ఏకరువు పెట్టి భోరున విలపించిన పతిపరాయణ రావణుని గుణశీల వర్ణనం, పతి స్వరూప స్వభావాలను, పరాక్రమోన్నతులను లోకాలకు పదే పదే చాటినదీ మయుని పుత్రి. పతి యందలి ప్రగాఢ అనురాగమే ఆమెనట్లు పలికించినది. తన భర్తకు గల భక్తియుక్తులు, శక్తిసామర్ధ్యాలు, దయాదాక్షిణ్యాలు ప్రవచించిన మండోదరి ప్రేమమూర్తి, భర్తవియోగ దుఃఖితయైన మండోదరి స్త్రీ జనోచిత భావాలకి తార్కాణం.
ఇలాంటి ఉన్నతుడైన భర్తను పోగొట్టుకొని కఠినాత్మనై జీవించియున్నానని శోకించినది. ఒకపరి పుత్ర శోకంతో, మరల పతి మరణంతో తీరని వ్యధతో హతనైతినని, సమస్త బాంధవ విరహితనై దుఃఖించవలసిన దౌర్భాగ్యానికి పెద్దప్రొద్దు విలపించినది. తర్క వితర్కాలతో కూడిన పలుకులెన్నో వినిపించినా సీతాసతివంటి పరస్త్రీ అపహరణమే రావణుడు అంతం కావడానికి ప్రధానకారణమని పదే పదే నినదించినది ఆమె కంఠం. దునుజేంద్రా! ధర్మం తప్పి పతిశెవా పరాయణులైన, ధర్మనిరతులైన పుణ్యమూర్తులైన కులస్త్రీలను, సువ్రతల్ను చెరబట్టి వాళ్ల భర్తలను వధించావు. ఆ సతీమతల్లుల హృదయ ఘోష నీ పాలిట శాపమైనది. కలకంఠికంట ఒలికిన కన్నీళ్ళకు కారణమైన వాడు ఎంతటి మహోన్నతుడైన నశిస్తాడను సత్యం నీ పట్ల ఋజువైనది. లోకత్రయాన్ని యేలగలిగిన ప్రతాపశాలివైన నీకు పరదారాభిలాష పతనానికి కారణమని తోచకుండుట తాను చేసుకున్న దౌర్భాగ్యమేనని విచారించినది. భీరువుగా సీతను అపహరించిననాడే నీ సౌర్యం నశించినది అంటూ రావణ దురాగతాలను వినయంతో చాటిన బుద్ధిశాలిని సాధుశీల. రావణుని మూర్ఖత్వానికి నొచ్చుకున్నది. పరదారాభిలాషనే పురస్కరించుకుని విలపించినది. అంటే స్త్రీలోలుడైన వాని వంశానికి చీడ తప్పదని పదే పదే నినదించినది. ఆమె విలపించిన తీరు చిత్రంగా వుంటుంది. కదనరంగంలోని శరీరాన్ని చూచి మండోదరి “అసుర పుంగవ ప్రియురాలినట్లు నేడు కదనమేదిని గౌగిట గదియబట్టి నాదువదనంబు చూడవు, మోదమిడవు. నన్ను గడదానిగ జూడ న్యాయమగునె” అని పలవించినది. వీర స్వర్గమలంకరించిన భర్తను చూచి పరిపరివిధాలుగా దుఃఖించినది. అప్పుడు కూడ భార్యభర్తకు దూరంగా జీవించుట తగనిపని యని ఆమె ఉద్దేశం. ఆ మహాసాధ్విని చూచి సపత్నులు ఓదార్చుచు విభీషణుడు మండోదరి దుఃఖాన్ని ఉపశమింపచేసి నాడు ఊరట కలిగించాడు.
*కవి* యిలా యుద్ధకాండలో మండోదరి పాత్రచిత్రణచేసి జీవం పోశాడు. విద్యావినయ సంపదలు, సంస్కృతీ సంప్రదాయాలు, వినయాహంకారాలు అన్నింటిలో పరిపుష్టంగా తీర్చిదిద్ది ఆమెనొక మహోన్నత మహిళామణిగ సృజించిన కవి ప్రతిభ ప్రశంసావహమైనది. ఉజ్వలమణిదీపం, లోకధర్మప్రతిష్ఠాపనకే కవి మండోదరిని సృష్టించి ఉంటాడనే వ్యక్తిత్వం గలది. ఆమెను గూర్చి పలికిన ఈ క్రింది మాటలు ఇక్కడ ప్రస్తావించదగినివిగా భావిస్తాను.

“ఎంతో సారవంతమైన పాదులో పుట్టి అందంగా, ఏపుగా ఎదిగే తీవతోనల్లు కోటానికి మహోన్నతమూ, శఖోపశఖా విలసితము అయిన పెద్ద వృక్షము కొఱకు వెదకటం, అలాంటి వృక్షానికి అల్లుకొని ఎంతో ఎత్తు పెరగాలని, ఎన్నో పూలు పూయాలని, కాయలు కాయాలని కలలు కనడము, ఆ కొరిక నెరవేరగా నిలువెల్ల పులకరించి తన అదృష్టానికి తానే ఆశ్చర్యపడుటము, అపరిమిత ఆనందాన్ని అనుభవించడము లోక సహజం. కాని ఆ చెట్టుకొక వేరు పురుగుపుట్టి, చీడతగిలి, బలహీనమై, గాలిదెబ్బకు కొమ్మలు విరిగి, కూకటి వ్రేళ్లతో పెళ్లగిలిపోతే ఆతీవ కుప్పకూలి ప్రక్కన బడి ఎంత దుఃఖాన్ని అనుభవిస్తుందో ఎవరికి తెలుసు?” అనే మాటల వల్ల ఆమె ఆవేదన ఒకరికి చెప్పినా అర్ధంకాని అనంతమైనది. అనుభవించిన వాళ్ళకే తెలిసినది. అలాంటి బాధాపరితప్త మానసయైన మండోదరి పట్ల *కవి* చెప్పిన మాటలు సముచితంగా వున్నాయి.🙏🙏🙏🙏🙏
********************

*అయోధ్య,.

*అయోధ్య,... ఇతర నగరాల మాదిరిగా అదో భౌగోళిక ప్రాంతంగా మిగిలిపోలేదు.  దైవం నడయాడిన నేలగా ప్రణతులందుకుంది. ఒక్కసారైనా ఆ మట్టిని ముట్టుకోవాలని లక్షలాదిమందిని ఆరాటపడేలా చేసింది.*
 *ఎందుకంటే... అది తరగని ఆధ్యాత్మిక చింతనకు ఆయువుపట్టు. ధర్మవర్తనకు, ప్రజారంజకమైన పాలనకు దిక్సూచి. సనాతన భారతీయ సాంస్కృతిక హర్మ్యానికి హృదయపీఠి.*

 *అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయికా*

స్కాందపురాణం దేశంలోని ఏడు మోక్షపురాల్లో ఒకటిగా అయోధ్యను పేర్కొంది.
ఈ నగరం చేప ఆకారంలో ఉంటుందని కూడా ఈ పురాణం చెబుతుంది.
అగ్ని, బ్రహ్మపురాణాలు అయోధ్యను పాపాలను నాశనం చేసే నగరంగా కీర్తించాయి.
 యోగినీతంత్రంలో కూడా అయోధ్య ప్రస్తావన ఉంది.  అధర్వణ వేదం అయోధ్యను దేవనిర్మిత నగరంగా ప్రకటించింది. తులసీదాసు కూడా తన రామచరితమానస్‌లో అయోధ్య వైభవాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
 భాగవతంలో కూడా శుకమహర్షి రఘువంశాన్ని ప్రస్తావించి ప్రత్యేకంగా అయోధ్య గురించి వివరిస్తాడు.
 *అందరూ అనుకుంటున్నట్లు అయోధ్య కేవలం నగరం మాత్రమే కాదని, మానవ జీవ చైతన్యానికి ఇదో ప్రతీక అని అధర్వణవేదం చెబుతోంది.*

 *‘అష్టాచక్రా నవద్వారా దేవానాం పూరయోధ్యా  తస్యాగ్‌ం హిరణ్మయః స్వర్గలోకో జ్యోతిషావృత్తః...’* -

ఎనిమిది చక్రాలు, తొమ్మిది ద్వారాలు ఉండే మానవ శరీరం అయోధ్యకు ప్రతీక.
జనన, మరణ చక్రంలో శరీరం తిరుగుతూ ఉంటుంది.
 వీటితో మోక్షం కోసం యుద్ధం చేయడం సాధ్యం కాదు. ఫలితం ఉండదు.
శరీరం అనే పట్టణంలోని జ్యోతిర్మయకోశానికి స్వర్గం అనే పేరుంది.
అది జీవ చైతన్య స్వరూపమైన తేజస్సుతో నిండి ఉంటుంది.
ఈ పట్టణాన్ని బ్రహ్మ సంబంధమైనదిగా  తెలుసుకున్న వారికి బ్రహ్మదేవుడు ఆయువు, కీర్తి అనుగ్రహిస్తాడని అధర్వణ వేదమంత్రాలు చెబుతున్నాయి.
********************

*రామాయణ సంబంధ 112 పుస్తకాలు(PDF)

*రామాయణ సంబంధ 112 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో*
------------------------------------------------
112 పుస్తకాలు ఒకేచోట   https://www.freegurukul.org/blog/ramayanam-pdf

               (OR)

సంపూర్ణ వాల్మీకి రామాయణం(వచన) https://www.freegurukul.org/z/Ramayanam-1

వాల్మీకి సంపూర్ణ రామాయణం(పద్య+తాత్పర్యం) https://www.freegurukul.org/z/Ramayanam-2

వాల్మీకి రామాయణం-బాల,అయోధ్య,సుందర,ఉత్తర కాండ-అంతరార్ధం https://www.freegurukul.org/z/Ramayanam-3

చిత్ర రూపంలో సంపూర్ణ వాల్మీకి రామాయణం https://www.freegurukul.org/z/Ramayanam-4

రామ కథాసుధ-1,2 భాగాలు https://www.freegurukul.org/z/Ramayanam-5

రామచరిత మానసము https://www.freegurukul.org/z/Ramayanam-6

సుందర కాండ-పారాయణము https://www.freegurukul.org/z/Ramayanam-7

సంపూర్ణ ఆంధ్ర శ్రీ మద్రామాయణము https://www.freegurukul.org/z/Ramayanam-8

రామచరిత మానస్-తులసీ రామాయణం https://www.freegurukul.org/z/Ramayanam-9

రామాయణం https://www.freegurukul.org/z/Ramayanam-10

తులసీ రామాయణము https://www.freegurukul.org/z/Ramayanam-11

యోగ వాసిష్ఠ సారము https://www.freegurukul.org/z/Ramayanam-12

యోగ వాశిష్ఠ సంగ్రహము https://www.freegurukul.org/z/Ramayanam-13

రామాయణ రహస్య రత్నావళి https://www.freegurukul.org/z/Ramayanam-14

రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలు https://www.freegurukul.org/z/Ramayanam-15

బాలల బొమ్మల సంపూర్ణ రామాయణం https://www.freegurukul.org/z/Ramayanam-16

రామాయణం పాత్రల ఆదర్శం https://www.freegurukul.org/z/Ramayanam-17

రామాయణంలో విశిష్ట పాత్రలు https://www.freegurukul.org/z/Ramayanam-18

బాలానంద బొమ్మల రామాయణం https://www.freegurukul.org/z/Ramayanam-19

వాల్మీకి రామాయణం-సంబంధాలు https://www.freegurukul.org/z/Ramayanam-20

రామాయణ పరమార్ధం https://www.freegurukul.org/z/Ramayanam-21

శ్రీ రామాయణ రహస్యం https://www.freegurukul.org/z/Ramayanam-22

రామాయణ తరంగిణి-1 https://www.freegurukul.org/z/Ramayanam-23

రామాయణ తరంగిణి-2 https://www.freegurukul.org/z/Ramayanam-24

శ్రీరామాయణ కథా సుధ https://www.freegurukul.org/z/Ramayanam-25

వాల్మీకి రామాయణము-బాల కాండము https://www.freegurukul.org/z/Ramayanam-26

వాల్మీకి రామాయణము-అయోధ్య కాండము https://www.freegurukul.org/z/Ramayanam-27

చిత్రరూపంలో రామాయణం https://www.freegurukul.org/z/Ramayanam-28

వాల్మీకి రామాయణము-ఉత్తర కాండ https://www.freegurukul.org/z/Ramayanam-29

వాల్మీకి రామాయణము-అయోధ్య కాండ https://www.freegurukul.org/z/Ramayanam-30

వాల్మీకి రామాయణము-అరణ్య కాండము https://www.freegurukul.org/z/Ramayanam-31

వాల్మీకి రామాయణము-కిష్కింద కాండ https://www.freegurukul.org/z/Ramayanam-32

వాల్మీకి రామాయణము-యుద్ధ కాండ-2 వ భాగము https://www.freegurukul.org/z/Ramayanam-33

వాల్మీకి రామాయణము-ఉత్తర కాండ-2 వ భాగము https://www.freegurukul.org/z/Ramayanam-34

శత శ్లోకి వాల్మీకి రామాయణం https://www.freegurukul.org/z/Ramayanam-35

జాతి జీవనంపై  రామాయణ ప్రభావం https://www.freegurukul.org/z/Ramayanam-36

రామాయణమంటే https://www.freegurukul.org/z/Ramayanam-37

రామాయణ సారస్వత దర్శనము https://www.freegurukul.org/z/Ramayanam-38

అంతరార్ధ రామాయణము https://www.freegurukul.org/z/Ramayanam-39

రామాయణ విశేషాలు https://www.freegurukul.org/z/Ramayanam-40

శ్రీమద్వాల్మీకి రామాయణోపన్యాసములు https://www.freegurukul.org/z/Ramayanam-41

శ్రీరామ కథామృతము - సమగ్ర సమీక్ష https://www.freegurukul.org/z/Ramayanam-42

శ్రీరామ కథామృతము https://www.freegurukul.org/z/Ramayanam-43

జీవన చిత్రాలు-రామయణ పాత్రలు https://www.freegurukul.org/z/Ramayanam-44

రామాయణ పాత్రలు https://www.freegurukul.org/z/Ramayanam-45

లక్ష్మణుడు https://www.freegurukul.org/z/Ramayanam-46

లక్ష్మణుడు https://www.freegurukul.org/z/Ramayanam-47

భరతుడు https://www.freegurukul.org/z/Ramayanam-48

కళ్యాణ రాముడు https://www.freegurukul.org/z/Ramayanam-49

కాళిదాసు రామకథ https://www.freegurukul.org/z/Ramayanam-50

బాలానంద కుశలవుల కథ https://www.freegurukul.org/z/Ramayanam-51

రావణ రాజ్యము-రామ రాజ్యము https://www.freegurukul.org/z/Ramayanam-52

రామాయణోపన్యాస మంజరి https://www.freegurukul.org/z/Ramayanam-53

వాల్మీకి వచన రామాయణము-బాల కాండము https://www.freegurukul.org/z/Ramayanam-54

వాల్మీకి రామాయణోపన్యాసములు-బాల కాండము https://www.freegurukul.org/z/Ramayanam-55

వాల్మీకి రామాయణము-బాల కాండము https://www.freegurukul.org/z/Ramayanam-56

వాల్మీకి రామాయణము-అయోధ్య కాండము https://www.freegurukul.org/z/Ramayanam-57

వాల్మీకి రామాయణము-అయోధ్య కాండము https://www.freegurukul.org/z/Ramayanam-58

అయోధ్యకాండ లోని ఆణిముత్యాలు https://www.freegurukul.org/z/Ramayanam-59

శ్రీమద్రామాయణము-అరణ్య కాండ https://www.freegurukul.org/z/Ramayanam-60

వాల్మీకి రామాయణం-అరణ్య కాండ https://www.freegurukul.org/z/Ramayanam-61

వాల్మీకి వచన రామాయణము-కిష్కింద కాండము https://www.freegurukul.org/z/Ramayanam-62

సుగ్రీవ పట్టాభిషేకము https://www.freegurukul.org/z/Ramayanam-63

ఉపన్యాస రామాయణము-చిత్రకూట సమావేశము https://www.freegurukul.org/z/Ramayanam-64

సుందరకాండము https://www.freegurukul.org/z/Ramayanam-65

సుందరకాండ https://www.freegurukul.org/z/Ramayanam-66

వాల్మీకి వచన రామాయణము-సుందర కాండము https://www.freegurukul.org/z/Ramayanam-67

వాల్మీకి వచన రామాయణము-సుందర కాండము https://www.freegurukul.org/z/Ramayanam-68

సుందర కాండకథ https://www.freegurukul.org/z/Ramayanam-69

రామాయణాంతర్గత సుందరకాండము https://www.freegurukul.org/z/Ramayanam-70

సుందరకాండ https://www.freegurukul.org/z/Ramayanam-71

సుందరకాండము https://www.freegurukul.org/z/Ramayanam-72

సుందరకాండము https://www.freegurukul.org/z/Ramayanam-73

సుందర సందేశము https://www.freegurukul.org/z/Ramayanam-74

సుందరకాండ https://www.freegurukul.org/z/Ramayanam-75

రామాయణము-యుద్ధ కాండ-2 https://www.freegurukul.org/z/Ramayanam-76

రామాయణము-యుద్ధ కాండ-3 https://www.freegurukul.org/z/Ramayanam-77

వాల్మీకి రామాయణము-యుద్ధ కాండ-1 https://www.freegurukul.org/z/Ramayanam-78

రామాయణ సుధ-ఉత్తర కాండము https://www.freegurukul.org/z/Ramayanam-79

వాల్మీకి వచన రామాయణము-ఉత్తర కాండము https://www.freegurukul.org/z/Ramayanam-80

ఉత్తర రామాయణము https://www.freegurukul.org/z/Ramayanam-81

ఉత్తర రామాయణము https://www.freegurukul.org/z/Ramayanam-82

ఉత్తర రామాయణ కథలు https://www.freegurukul.org/z/Ramayanam-83

రామాయణ తరంగిణి-6 https://www.freegurukul.org/z/Ramayanam-84

రామాయణ తరంగిణి-7 https://www.freegurukul.org/z/Ramayanam-85

రామాయణ రత్నాకరము-1,2,3 https://www.freegurukul.org/z/Ramayanam-86

పాదుకా పట్టాభిషేకం https://www.freegurukul.org/z/Ramayanam-87

రామాయణ కల్పవృక్షం తెలుగుదనం https://www.freegurukul.org/z/Ramayanam-88

రామో విగ్రహవాన్ ధర్మః https://www.freegurukul.org/z/Ramayanam-89

రామ కథా రస వాహిని https://www.freegurukul.org/z/Ramayanam-90

సీతాదేవి వనవాసం https://www.freegurukul.org/z/Ramayanam-91

వాల్మీకీ రామాయణం శాపములు-వరములు https://www.freegurukul.org/z/Ramayanam-92

శ్రీరామ పధము https://www.freegurukul.org/z/Ramayanam-93

శ్రీరామనవమి https://www.freegurukul.org/z/Ramayanam-94

రామచరిత మానసము https://www.freegurukul.org/z/Ramayanam-95

రామచరిత మానసము -సుందరకాండ https://www.freegurukul.org/z/Ramayanam-96

తులసీ రామాయణము-యుద్ధ కాండము https://www.freegurukul.org/z/Ramayanam-97

శ్రీరామ పట్టాభిషేకము -శ్రీరామచరిత మానసము-ఉత్తరకాండ https://www.freegurukul.org/z/Ramayanam-98

వాల్మీకీయ జ్ఞాన వాసిష్ఠము https://www.freegurukul.org/z/Ramayanam-99

ఆంధ్ర వాసిష్ఠ రామాయణము-1 https://www.freegurukul.org/z/Ramayanam-100

ఆంధ్ర వాసిష్ఠ రామాయణము-3 https://www.freegurukul.org/z/Ramayanam-101

యోగ వాసిష్ఠము-ఉత్తరార్ధము https://www.freegurukul.org/z/Ramayanam-102

జటాయువు ధర్మబోధ https://www.freegurukul.org/z/Ramayanam-103

108 నామాల్లో సంపూర్ణ రామాయణం https://www.freegurukul.org/z/Ramayanam-104

వాల్మీకి సంపూర్ణ రామయణ కథామృతము https://www.freegurukul.org/z/Ramayanam-105

వాల్మీకి రామాయణము-బాల కాండ https://www.freegurukul.org/z/Ramayanam-106

వాల్మీకి రామాయణము-అరణ్య కాండము https://www.freegurukul.org/z/Ramayanam-107

వాల్మీకి రామాయణము-కిష్కింద కాండ https://www.freegurukul.org/z/Ramayanam-108

కిష్కింద కాండము https://www.freegurukul.org/z/Ramayanam-109

ఆధ్యాత్మ రామాయణము https://www.freegurukul.org/z/Ramayanam-110

శ్రీరాముని చరిత్రము https://www.freegurukul.org/z/Ramayanam-111

సీతారామాంజనేయ సంవాదము https://www.freegurukul.org/z/Ramayanam-112

రామాయణం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

మరింత సమాచారం కోసం:
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
Website: www.freegurukul.org
Android App: FreeGurukul  and  iOS App: Gurukul Education
Whatsapp: 9042020123(To get this type of messages, SAVE this number and send START message)

రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రం

రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రం - లాంటి మాటలు అభిషేక సందర్భాల్లో వింటూంటాం.🌹*


*అసలు వీటిలో తేడాలు ఏమిటి?*

*యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు.*
*దానిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రుద్రాభిషేకం అంటారు.*
*దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి.*

*ఈ 11 అనువాదాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు.*

*రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'.*

*11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం'. అంటే,*
*ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది.*

*ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం'.*
*దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది.*
*ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' !*
*హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'.*
*ఇవే ఆయా పేర్లలో ఉన్న విభిన్నార్థాలు.*
*!! ఓం నమః శివాయ..!!*
🌷🌷🌷🌷🌷

చెణుకులు


పెళ్లికాక ముందు లవర్ పక్కన కూర్చొని చెరువులో రాళ్లేస్తూ మాట్లాడేవాడు పెళ్లి చేసుకున్నాక బియ్యంలో రాళ్లు ఏరుతూ వాడిలో వాడే మాట్లాడుకుంటున్నాడు
వాడికి రాళ్లకి ఏంటో ఆ అవినాభావ సంబంధం  మళ్లీ వాడి దగ్గరికే
తిరిగొచ్చేసాయ్.
😊😊😊😊😊😊😊😊

భక్తుడు : దేవుడా అమ్మాయిలు అందరూ అందంగా, వినయంగా వుంటారు మరి భార్యలు అలా ఎందుకుండరు..?
దేవుడు : పిచ్చివాడా... అమ్మాయిలందరిని నేను సృష్టించాను, వాళ్ళని భార్యలుగా మీరు చేసుకున్నారు....
అది మీ ఖర్మ...
😊😊😊😊😊😊😊😊

Teacher:- ఓరేయి..Hospital..అంటే అర్దం...ఏమిటిరా.....
Student:- భూమి నుండి నరకానికి...వెళ్ళేటప్పుడు మద్యలో వచ్చే...Toll Plaza.సార్....
😊😊😊😊😊😊😊

బార్య : ఏమండీ ఫైర్ స్టేషన్లో మగవాళ్లు మాత్రమే పని చేస్తారు ఆడవాళ్లు ఎందుకు చేయరండి?
భర్త:  మీ ఆడవాళ్లుకు మంట పెట్టడమే తెలుసు ఆర్పడం తెలవదు కదే అందుకు..
😊😊😊😊😊😊😊😊😊

భార్యః’’ ఎక్కడికెళ్ళ్తున్నారు?’’
భర్తః ‘’ ఆత్మహత్య చేసుకోడానికి’’.
భార్యః ‘’ ఒక సంచీ కూడా పట్టుకెళ్ళకూడదూ?’’
భర్తః’’ అదెందుకు?’’
భార్యః ‘’ ఒకవేళ మీ నిర్ణయం మార్చుకుంటే వచ్చేప్పుడు ఒక కేజీ టమేటాలూ,అరకేజీ చింతపండూ తెస్తారని.’’
😊😊😊😊😊😊😊😊😊

టీచర్:,  పులికి,  మేకకు తేడా ఏంటి?
విద్యార్థి:,  మొదటిది క్రూర జంతువు,  రెండోది కూర  జంతువు
😊😊😊😊😊😊😊😊😊

టీచర్:  అరటిపండు గురించి రెండు వాక్యాలు చెప్పరా,,,, రవి
రవి:  ఒకటి... తింటే బలపడతాం, రెండు... తొక్కితే జారి పడతాం
😊😊😊😊😊😊😊😊😊

అమృతం తాగిన వాడిని " దేవుడు " అంటారు.
విషం తాగిన వాడిని " మహా దేవుడు " అంటారు.
విషం తాగి కూడా, అమృతం తాగినట్లు ఆనందం నటించే వాడినే " పతి దేవుడు " అంటారు..
😊😊😊😊😊😊😊😊😊

భర్త : ఏమిటే ఈ రోజు సాంబార్ లో రెండు రూపాయల కాయిన్లు వస్తున్నాయేంటి?
భార్య : మీరే కదండీ వారం రోజుల నుండి వంటలో చేంజ్ కావాలి, చేంజ్ కావాలి అంటున్నారు!
😊😊😊😊😊😊😊😊😊

 డాక్టరుః ‘’ ఆశ్చర్యంగా నీది, నీ భార్యదీ ఒక్టే బ్లడ్ గ్రూపు.’’
వ్యక్తిః ‘’ ఎక్పెట్ చేశా డాక్టర్, ఒకటా, రెండా—ఇరవై ఏళ్ళనుండి పీలుస్తూనే ఉందికదా నా రక్తం.
😊😊😊😊😊😊😊😊

పాప : నాన్న.. కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారా?
నాన్న : అవునమ్మా...
పాప : మరి వాళ్ళు వెల్లిపోవాలంటే..??
నాన్న : "మీ అమ్మ అరవాలి"..
😊😊😊😊😊😊😊

*కాసేపు కరోనా భయాన్ని ప్రక్కన పెట్టి నవ్వుకోండి*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము*

*సముద్రమునుండి అమృతము ఉద్భవించుట - శ్రీమహావిష్ణువు మోహినిగ అవతరించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*8.7 (ఏడవ శ్లోకము)*

*తతశ్చాప్సరసో జాతా నిష్కకంఠ్యః సువాససః|*

*రమణ్యః స్వర్గిణాం వల్గుగతిలీలావలోకనైః॥6592॥*

తరువాత అందుండి అప్సరసలు ప్రాదుర్భవించిరి. వారు మేలి వస్త్రములు కలిగి, కంఠములయందు సువర్ణాభరణములతో వెలుగొందుచుండిరి. వారు మనోహరమైన గమనములతో, విలాసవంతమైన చూపులతో దేవతలకును ఆకర్షించుచుండిరి.

*8.8 (ఎనిమిదవ శ్లోకము)*

*తతశ్చావిరభూత్సాక్షాచ్ఛ్రీ రమా భగవత్పరా|*

*రంజయంతీ దిశః కాంత్యా విద్యుత్సౌదామనీ యథా॥6593॥*

పిమ్మట, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే ఆవిర్భవించెను. ఆమె శ్రీహరియందు అనురాగము కల్గియుండెను. ఆ దేవి మెరుపుతీగవలె ధగధగలాడుచు తన దేహకాంతితో దశదిశలను వెలుగులతో నింపుచుండెను.

*8.9 (తొమ్మిదవ శ్లోకము)*

*తస్యాం చక్రుః స్పృహాం సర్వే ససురాసురమానవాః|*

*రూపౌదార్యవయోవర్ణమహిమాక్షిప్తచేతసః॥6594॥*

ఆమె తన సౌందర్యము, ఔదార్యము, తారుణ్యము, రూపసౌభాగ్యము మున్నగు వాని మహిమలచే అందరి చిత్తములను ఆకర్షించుచుండెను. దేవతలు, అసురులు, మానవులు అందరును ఆమెను గ్రహించుటకై వాంఛించుచుండిరి.

*8.10 (పదియవ శ్లోకము)*

*తస్యా ఆసనమానిన్యే మహేంద్రో మహదద్భుతమ్|*

*మూర్తిమత్యః సరిచ్ఛ్రేష్ఠా హేమకుంభైర్జలం శుచి॥6595॥*

ఇంద్రుడే స్వయముగా ఆమె ఆసీనురాలగుటకై ఒక అద్భుతమైన ఆసనమును తీసికొని వచ్చెను. పవిత్రమైన నదులు మూర్తీభవించిన బంగరు కలశములతో నిర్మలజలములను అభిషేకమునకు తీసికొని వచ్చెను.

*8.11 (పదకొండవ శ్లోకము)*

*ఆభిషేచనికా భూమిరాహరత్సకలౌషధీః|*

*గావః పంచ పవిత్రాణి వసంతో మధుమాధవౌ॥6596॥*

పృథ్వి అభిషేకమునకు యోగ్యమైన ఓషధులను అన్నింటిని ఇచ్చెను. గోవులు, పంచగవ్యములను, వసంత ఋతువు చైత్ర వైశాఖములయందు ఉత్పన్నమగు పూవులను, పండ్లను సమర్పించెను.

*8.12 (పండ్రెండవ శ్లోకము)*

*ఋషయః కల్పయాంచక్రురభిషేకం యథావిధి|*

*జగుర్భద్రాణి గంధర్వా నట్యశ్చ ననృతుర్జగుః॥6597॥*

ఈ పదార్థములతో ఋషులు విధ్యుక్తముగ ఆ లక్ష్మీ దేవికి అభిషేకమొనర్చిరి. గంధర్వులుమంగళ ప్రదమైన గీతములను ఆలపించిరి. నర్తకీమణులు నృత్యములనొనర్చుచు పాటలు పాడిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

దేశికుల స్తోత్రాలలో శ్రీరామ వైభవం.

దేశికుల వారు రచించిన  మొత్తం ఇరవై ఎనిమిది స్తోత్రాలలో  శ్రీ రామునిపై రెండుస్త్రోత్రాలు  ఉన్నాయి.  అందులో ఒకటి రఘువీర గద్య.    రెండవది పరమార్థ స్తుతి. 

వీటిలో మొదటిది గద్య రూపంలో ఉన్న గొప్ప లయాత్మకమైన రచన. ఈ గద్యను చక్కగా ఉచ్చైస్వరంతో పఠించినప్పుడు దానిలోని లయగతి అనుభవంలోకి వస్తుంది.ఇది సమస్త వాల్మీకి రామాయణమూ 94 కర్ణికలలో కుదించి చేసిన అద్భుత రచన. ఈ రచనలో  కవిదృష్టి అంతా భగవానుని గుణవైభవం మీదే నిలిచింది. రామాయణ కథాఘట్టాలకు , అవతార ప్రాశస్త్యానికి రెండవ స్థానమే దక్కింది.

పరమార్థస్తుతిలో పది శ్లోకాలున్నాయి. ఇవి రామాయణం లోని ఘటనాక్రమాన్ని అనుసరించి కూర్చబడ్డాయి. అయితే  వాటిలో నిగూఢార్థం ఇమిడి ఉంది. ఈస్తుతిని ప్రపన్నులు  ( శరణు కోరిన వారు) నిత్యం పఠించాలని, వారికి శ్రీరాముడు రక్షణ కల్పిస్తాడని  దేశికుల వారు స్వయంగా చెప్పారు.

పైన  చెప్పిన రెండు స్తోత్రాలలో ఒక్కొక్క శ్లోకాన్ని మచ్చుకు ఎంచుకొని  ఈక్రింద  వ్యాఖ్యానించడం జరిగింది.

రఘువీర గద్య. ( చివరి నుండి రెండవ గద్య)

దేవనాగరి లో శ్లోకం

బ్రహ్మకు తండ్రిగా, సంతానవంతుడైన ఈశ్వరునికి  తాతగా, కుటుంబానికి పెద్దగా  నిలచిన శ్రీరామునికి జయము.

రావణ వధానంతరం ఆకాశంలో సమావేశమైన దేవతలతో కూడిన బ్రహ్మ శ్రీరామునితో ఇలా అన్నారు.  “ అహంతే హృదయం రామ”( యుద్ధకాండ) నేను నీ హృదయాన్ని అని ఆమాటకు అర్థం.  ఉపనిషత్తులు  సుతుడు తండ్రికి హృదయమని చెపుతున్నాయి.

దేశికులవారు  పరమాత్మునికి  జీవాత్మ హృదయము, కుమారుడు అని చెపుతున్న, రహస్యత్రయసారంలోని ఉపోద్ఘాతాధికారంలో చెప్పిన వాక్యాలను ఉద్దేశించి ఆ మాటను ఉపయోగించారు.  సీతామాతతో కూడిన శ్రీరాముడు , చతుర్ముఖ బ్రహ్మకు తండ్రిగా, పంచముఖ ఈశ్వరునికి తాతగా, షణ్ముఖునికి , గజాననునికి ముత్తాతగా ఈ గద్య వర్ణిస్తోంది. దీనికి వ్యాఖ్యానం రచించిన శ్రీమదళగియసింగర్  ఇలా అన్నారు. “భగవద్కుటుంబానికి మూలపురుషుడైన శ్రీరామప్రభువు సులభంగా ప్రసన్నుడౌతూ ఉండగా, ఆయన వారసులను శరణు కోరవలసిన అవసరం ఏమిటి?”

2.పరమార్థస్తుతిలోని ఎనిమిదవ శ్లోకం  భగవంతుడైన శ్రీరాముని ఉద్దేశించి చెప్పినది. చాలా ఆసక్తిని కలిస్తూ ఉంటుంది.

దేవనాగరిలిపిలో శ్లోకం:

ఓ శౌర్య పరాక్రమ యోధాగ్రేసరా! నా చేయి ఎలా విడువగలవు? శరణు కోరిన వారిని రక్షిస్తానని ప్రతిన పూనావు కదా! శరణు కోరితే విభీషణునే కాదు రావణునైనా నీవు రక్షిస్తావు కదా!  అలా నీవు ప్రతిన పూనిన విషయం ఈ ప్రపంచానికంతా తెలుసు.

3. అభయప్రదాన సారంలో, దేశికులవారు అయోధ్యానగరాన్ని వీడి, అరణ్యవాసానికి బయలుదేరినప్పటి నుండి  శ్రీరామప్రభువు అంగీకరించిన శరణాగతుల జాబితాను పేర్కొన్నారు.

మొదటగా తనను అనుసరించటానికి లక్ష్మణస్వామిని అనుమతించారు. రాక్షసుల బారి నుండి కాపాడమని శరణు జొచ్చిన తాపసులకు అభయమిచ్చారు. బలవంతుడైన అన్నగారి బారి నుండి కాపాడమని శరణు కోరిన సుగ్రీవునికి అభయమిచ్చారు. నేరం చేసిన కాకాసురునికి కూడా అభయమిచ్చారు. చిరకు శరణు కోరిన విభీషణునికి కూడా అభయమిచ్చారు శ్రీరామచంద్రమూర్తి. దేశికులవారు శ్రీరామునికి తానిచ్చిన ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ, మనందరకూ ఆయనను శరణు వేడమని ప్రబోధిస్తున్నారు.

4. శరణాగతి దీపికలోని 45వ శ్లోకంలో దేశికులు భగవంతునికి ఇలాగే గుర్తుచేయటం కనిపిస్తుంది. “పూర్వావతారంలో శరణాగతుల పట్ల కారుణ్యం చూపటమే ప్రధాన కర్తవ్యమని చెప్పి ఉన్నావు. నన్ను, నా వంటి శరణార్థులను కాపాడమని కోరుతూ ఒకసారి మీ పూర్వావతార ప్రతిజ్ఞను గుర్తు చేయనా!” 

పరమార్థస్తుతిలోని ఆఖరు  శ్లోకంలో  దేశికులు శరణాగతి కోరేవారు  ఈ స్తుతిని పవిత్రభావంతో, శుచిమతితో పఠించాలని సూచించారు. స్తోత్రాన్ని పఠించే వేళ మనసులో అసూయాద్వేషాలు ఉండరాదని నిర్దేశించారు. సీతాదేవిని అపహరించటం వంటి  ఘోరాపరాధం చేసిన  రావణాసురునికే శరణు ఇవ్వగల వాగ్దానం చేసిన శ్రీరామచంద్రుడు  మనకు రక్షణను ఇవ్వటంలో ఎటువంటి సందేహమూ లేదు.

దేశికుల రచించిన అన్ని స్తోత్రాలలో శ్రీరామునికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష ప్రస్తావనలన్నో ఉన్నాయి. ఈ క్రింద వాటిలో కొన్నింటిని ప్రస్తావించడం జరిగింది.

దశావతారస్తోత్రం. (8) : ధనుష్కోవిదుడైన శ్రీరాముడు సముద్రాలను తన శరపాటవంతో శోషింప జేయగలడు. ప్రళయకాలాగ్నిని కూడా ఉపశమింప జేయగలడు. ధర్మం మూర్తీభవించినవాడు. ఒకసారి శరణు అన్నవారి రక్షణను ఎన్నటికీ విడువనివాడు అని పేర్కొన్నారు. అదే స్తోత్రంలోని 12వ శ్లోకంలో, శ్రీరాముని కారుణ్య కాకుత్స్థ అని సంబోధించారు.

 6. దేవనాయక పంచశతిలో (41)దేశికులు రాతిగా మారిన గౌతముని భార్య అహల్యను ఆ శాపం నుండి ఉద్ధరించిన శ్రీరామచరణాలను స్తుతించారు.

7.వరదరాజపంచశతి(25) లో  సముద్రానికి వారధి కట్టి , పది తలల రావణుని హతమార్చిన శ్రీరాముని వర్ణించారు. తాను నిర్మించిన వారధిని స్తుతించిన వారు అరిషడ్వర్గాల నుండి ముక్తి పొందుతారని శ్రీరాముడు స్వయంగా చెప్పారు. అలాగే వారు షడ్విధ దుఃఖాల నుండి ముక్తులౌతారని అన్నారు. అప్పుడు వారిక  ఐదు కర్మేంద్రియాలను, ఐదు జ్ఞానేంద్రియాలను ఆవరించి ఉన్న మనస్సును నియంత్రించగలరు. 

8. దయాశతకం (64-65)లోని ఈ రెండు పద్యాలలో శ్రీరాముని కరుణను పొందిన  వారి జాబితా ఉంది. సముద్రరాజు, పరశురాముడు, కాకాసురుడు, గుహుడు, సుగ్రీవుడు, శబరి ఆ జాబితాలోని వారు.

దయాశతకం(87)లో వరదరాజ పంచశతిలో పేర్కొన్న విషయాలనే మరల చెప్పారు. ఈ ప్రపంచానికంతటికీ దయాదేవి కరుణాభిక్షను ప్రసాదించిందని , కారుణ్యశిఖామణి అని చెపుతూ , ఆమె  భగవాన్‌ శ్రీరాముని చేత     సముద్రానికి వారధిని నిర్మింపజేసిందని, ఆ వారధి దర్శన మాత్రంగా , మానవులు చేసుకొన్న జన్మజన్మల పాపాల నుండి  ముక్తులౌతారని దేశికులవారు  పేర్కొన్నారు.

తుంగభద్ర పుష్కరాలు🌹*

*20 - 11 - 2020 నుండి డిసెంబర్  1 - 2020  వరకు తుంగభద్ర పుష్కరాలు  తుంగభద్రా నదీతీరంలో విశేష ఆలయాలు ఏవి?*

పన్నెండేళ్ళకోసారి వచ్చేది పుష్కరం. పవిత్ర తుంగభద్ర నదికి పుష్కరాలు శ్రీ శార్వరి నామ సంవత్సరంలో జరుగనున్నాయి. 2008 లో  ఈ నదికి పుష్కరాలు జరిగాయి. మళ్ళీ 12 ఏళ్ళతర్వాత 2020 నవంబరు 20 నుంచి డిసెంబరు ఒకటి వరకూ తుంగభద్రమ్మకు పుష్కరాలు జరుగనున్నాయి.

*తుంగభద్రమ్మ నడక ఇలా*

కర్నాటక ఎగువ భాగాన తుంగ , భద్ర నదుల సంగమమే తుంగభద్ర నది. రాష్ట్రంలో కౌతాళం మండలం మేళగనూరు వద్ద కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుంది. నదీ తీరంలో కొలువుదీరిన దేవతలను తాకుతూ సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది. 2008లో తుంగభద్ర నదికి పుష్కరాలు జరిగాయి. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో ప్రస్తుతానికి తుంగభద్ర జలాశయం నిండుగా ఉంది. కౌతాళం , కొసిగి , మంత్రాలయం , నందవరం , సి.బెళగళ్ , గూడూరు మండలాలతో పాటు కర్నూలు నగరం వరకు 107 కిలోమీటర్ల మేర తుంగభద్రమ్మ నదీతీర ప్రాంతంఉంది.

*పుష్కరాలు ఎప్పుడు వస్తాయి?*

ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించేటప్పుడు ప్రతీ నదికి పుష్కరాలు జరుపుతారు. అందుకే 12 నదులను పుష్కర నదులని , 12 రోజుల పాటు జరిగే ప్రక్రియను పుష్కరాలని జరుపుకుంటారు. నవగ్రహాల్లో ఒకటైన గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో తిరుగుతూ ఉంటుంది. చాంద్రమానం ప్రకారం నక్షత్రాలు 27 , తొమ్మిది పాదాలు కలిసి ఒక రాశి ఏర్పడతాయి. గురువు మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో బ్రహ్మ , బృహస్పతి , పుష్కరుడు , నదీ దేవతతో పాటు ముక్కోటి దేవతలు ఆ నదీజలంలో కొలువై ఉంటారని ప్రతీతి. ఇక శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి శక్తి ఉంటుంది.

*ప్రత్యేకత గల ఆలయాలు*

కర్నూలు జిల్లాలో తుంగభద్రానది ముందుగా మేళిగనూరు వద్ద రామలింగేశ్వరస్వామి ఆలయాలన్ని తాకి వస్తుంది. స్వామి ఆలయం నదీతీరంలో ఉంది. కోసిగిలో ఆర్డీ‌ఎస్ ఆనకట్ట , అనంతరం మంత్రాలయం మండలంలో రాంపురం రామలింగేశ్వర స్వామి ఆలయం , మాధవరం వద్ద నదిలోనే ఓ శివాలయం ఉంది. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి ఆలయాలను తాకుతూ , దిగువన గురజాల ఇసుక రామలింగేశ్వర స్వామి ఆలయం మీదుగా కర్నూలు చేరుకుంటుంది. నాగులదిన్నె సమీపంలో సాయిబాబా దేవాలయం ఉంది. తెలంగాణ , కర్నాటక రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి చేరుకుని పుణ్యస్నానాలు చేస్తారు. సి.బెళగల్ మండలం సంగాల వద్ద ఈశ్వరాలయం ప్రసిద్ధి.

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము*

*సముద్రమునుండి అమృతము ఉద్భవించుట - శ్రీమహావిష్ణువు మోహినిగ అవతరించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*8.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*ధర్మః క్వచిత్తత్ర న భూతసౌహృదం త్యాగః క్వచిత్తత్ర న ముక్తికారణమ్|*

*వీర్యం న పుంసోఽస్త్యజవేగనిష్కృతం న హి ద్వితీయో గుణసంగవర్జితః॥6606॥*

ఒకనియందు ధర్మబుద్ధి గలదు, కాని, వానికి భూతదయలేదు. మరొకనికి త్యాగము ఉండును. కాని, అది మోక్షహేతువు కాకుండెను. ఇంకొకడు బలసంపన్నుడే, కాని, అతడు మృత్యుముఖమునుండి తప్పించుకొనలేడు. గుణాతీతుడు అద్వైతస్థితిలో యున్నవాడితో, నాకేమి పని?

*8.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*క్వచిచ్చిరాయుర్న హి శీలమంగలం క్వచిత్తదప్యస్తి న వేద్యమాయుషః|*

*యత్రోభయం కుత్ర చ సోఽప్యమంగలః సుమంగలః కశ్చ న కాంక్షతే హి మామ్॥6607॥*

ఒకడు దీర్ఘాయుష్మంతుడే కాని, వాని సౌశీల్యము శుభప్రదమైనది కాదు. ఒక్కొక్కరియందు ఆ శీలము కూడా ఉంటుంది కాని, వాని ఆయుఃప్రమాణము ఎంతయో తెలియదు. ఈ రెండునూ ఉన్నవాడు అమంగళవేషధారియై యున్నాడు. సకల సద్గుణ సంపన్నుడైనవాడు, నన్ను కోరుటయే లేదు.

*8.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*ఏవం విమృశ్యావ్యభిచారిసద్గుణైర్వరం  నిజైకాశ్రయతాగుణాశ్రయమ్|*

*వవ్రే వరం సర్వగుణైరపేక్షితం  రమా ముకుందం నిరపేక్షమీప్సితమ్॥6608॥*

ఇట్లు తర్కించి, చివరకు లక్ష్మీదేవి తాను చిరకాలమునుండి కోరుకొనుచున్న శ్రీహరినే వరించెను. ఏలయన, అతని యందు సకలసద్గుణములను స్థిరముగా భాసిల్లుచుండెను. ప్రాకృతగుణములు అతనిని ఏ మాత్రమూ స్పృశింపవు. అనగా అతడు త్రిగుణాతీతుడు. అణిమాది సిద్ధులు అతనిని కోరుకొనుచున్నను అతడు వాటిని అపేక్షింపడు. వాస్తవముగా లక్ష్మీదేవికి ఏకైక ఆశ్రయుడు ఆ శ్రీహరియే. కనుక ఆమె ఆయననే వరించెను.

*8.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*తస్యాంసదేశ ఉశతీం నవకంజమాలాం థ మాద్యన్మధువ్రతవరూథగిరోపఘుష్టామ్|*

*తస్థౌ నిధాయ నికటే తదురః స్వధామ  సవ్రీడహాసవికసన్నయనేన యాతా॥6609॥*

లక్ష్మీదేవీ నవవికసిత పద్మమాలను ఆయన మెడలో వేసెను. ఆ మాలచుట్టును మత్తిల్లిన మధుపములు ఝంకారము చేయుచుండెను. ఆ దేవి సిగ్గుతో దరహాసము చేయుచు ప్రేమతో నిండిన చూపులతో తన నివాసస్థానమగు శ్రీహరియొక్క వక్షఃస్థలమును చూచుచు ఆయన సమీపమున నిలబడెను.

*8.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*తస్యాః శ్రియస్త్రిజగతో జనకో జనన్యా వక్షో నివాసమకరోత్పరమం విభూతేః|*

*శ్రీః స్వాః ప్రజాః సకరుణేన నిరీక్షణేన యత్ర స్థితైధయత సాధిపతీంస్త్రిలోకాన్॥6610॥*

జగన్నాథుడైన శ్రీమహావిష్ణువు, జగజ్జనని, సకల సంపదలకు అధిష్ఠాత్రియైన లక్ష్మీదేవికి తన వక్షఃస్థలమే శాశ్వత నివాసస్థానముగా చేసెను. లక్ష్మీ దేవియు అచట విరాజిల్లుచు వాత్సల్యపూర్ణములైన కృపాదృష్టులతో ముల్లోకములను, లోకపాలురను, తన ప్రియమైన ప్రజలను సంపన్నులను గావించెను.

*8.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*శంఖతూర్యమృదంగానాం వాదిత్రాణాం పృథుః స్వనః|*

*దేవానుగానాం సస్త్రీణాం నృత్యతాం గాయతామభూత్॥6611॥*

ఆ సమయమున శంఖారావములు, తూర్యనాదములు, వీణా వేణు మృదంగధ్వనులు మ్రోగెను. గంధర్వులు, అప్సరసలు గానము చేయుచు నృత్యముల నొనర్చిరి.

*8.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*బ్రహ్మరుద్రాంగిరోముఖ్యాః సర్వే విశ్వసృజో విభుమ్|*

*ఈడిరేఽవితథైర్మంత్రైస్తల్లింగైః పుష్పవర్షిణః॥6612॥*

బ్రహ్మదేవుడు, పరమశివుడు, అంగిరసుడు మొదలగు ప్రజాపతులు, పుష్పములను వర్షించుచు భగవానుని గుణములను, స్వరూపమును, లీలలను వర్ణించునట్టి మంత్రముల ద్వారా ఆ స్వామిని ప్రస్తుతించిరి.

*8.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*శ్రియా విలోకితా దేవాః సప్రజాపతయః ప్రజాః|*

*శీలాదిగుణసంపన్నా లేభిరే నిర్వృతిం పరామ్॥6613॥*

దేవతలు, ప్రజాపతులు, ప్రజలు, మొదలగువారందరును లక్ష్మీదేవి కృపాదృష్టిచే సచ్ఛీలము మున్నగు ఉత్తమ గుణములతో పరమానంద భరితులైరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

శబ్ద రూపమైన శక్తి

శబ్ద రూపమైన శక్తికి భాషాపరంగానే లక్షణము తెలియును. భాషను ఎవరూ కనిపెట్టలేదు. శక్తి దాని లక్షణమునుబట్టి దానిని గుర్తించి వాడుకలోనికి ప్రవేశపెట్టారు. ఉదాహరణకు: లం, లంబ, విలంబ, ప్రలంబ, ల అనగా పృధివి అని షోడసి  మంత్రం నుండి ల అక్షరం మునకు పూర్ణ శక్తి చేరిన పృధివి యెక్క లక్ణణముగా ప్రకృతి యని తెలిసినది. విలంబ వి అనే అక్షరముమ చేరి అమితమైన లేక అనగా విశేషమైన అనగా వక నిర్ధిష్టమైన  పదార్ధ లక్షణముగా కాంతి ధాతు పరంగా మారినదని తెలియును. అట్లు మారిన పదార్ధశక్తియైన జీవుడు నారాయణ స్వరూపమైన నీటి తత్వం ప్ర  అనే అక్షరం చేరి ప్రలంబ గా మారినదని శాస్త్రీయంగా పుట్టుక అనగా సమస్త  జీవ  చైతన్య లక్షణముగా తెలిసినది అదియే ఆత్మ యని ఉపనిషత్ సారమైన ప్ర ఙ్ఞానం బ్రహ్మ. ఉపనిషత్ సారమే యీ సమస్త జగత్తుయని ప్రత్యక్ష ప్రమాణంగా తెలియుచున్నది. ఉప నిత్తు మనకు సమీపంలో అనగా ఎంత సమీపంలో అనగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసముల అంత సమీపమున. దానినినప్రాణాయామం ద్వారా చైతన్యపరచుటే గాయత్రీ మంత్ర సాధన యని యిది యే ప్రలంబ ముష్ఠకంచ ఏవ మత్స్యః కూర్మో వరాహకం, సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తధా....సృష్టి చిగిర్చి మార్పుచెందుటకు మూల కారణమని విశ్వమంతా అనగా వామనుని వలె మనకు మహర్షులు  దర్శించి తెలిపారు. అదే మన పోతన భాగవతం ద్వారా తెలిపి యుంటిరి. వేద సారమే భాగవతం. మరుగున పడిన వేద సార విజ్ఞానం సమస్తం భాగవత రూపంలో మనకు అదించియున్నారు. యిప్పుడు కూడా యిది సూక్మంగా తెలియ వలెనన్న సమస్త భాషా పరంగా లేక సాధన అనగా యితిహాస పద్య పఠణ రూపంలో తెలియును. పద్యంలో యున్న అర్ధమును మనసులో సాధన చేయుటయే ఙ్ఞానం.

భక్తుడు-బిచ్చగాడు



👉ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు.
చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.
రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.
ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే.
ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది......

బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు.
చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది.
తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.
తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు.
భక్తుడు సరేనన్నాడు.
ఆ ఘడియ రానే వచ్చింది.
బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. .....
భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు.
ఆశ్చర్యం ......! దాని నుండి నిధి బయటపడింది.
వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి.
అవన్నీ అతడి సొంతమయ్యాయి.....

మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు.
అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు.
కానీ, ఒక సందేహం అతడిని పీడించింది.

నిధి మీదే కూచున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడి గానే ఉండిపోయాను.

దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు. ఏమిటయ్యా ఇది!
అని దేవుణ్ణి ప్రశ్నించాడు. ......
అతడికి దేవుడు సమాధానం చెబుతూ.....నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూచుని, భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు.
అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది.
అతడు రోజూ భగవత్సేవ చేస్తూ, నీకు యదా శక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు.
నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.
అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి అన్నాడు దేవుడు.
వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి, గుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి.
తప్పక అంతర్ముఖుడు కావాలి!
🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲

నిజమైన ధనవంతుడు

         ఒకసారి రవీంద్రనాథ్ టాగూర్ జపాన్ కు వెళ్ళాడు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకం పై ఓ పది రోజుల పాటు రోజూ సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ప్రసంగించేవాడు. ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు. ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు. రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు. ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజా పూలమాలతో సత్కరించేవాడు. ఆయన ప్రవర్తన చాలా సాదాసీదా గా ఉండేది. రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు. ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్లమాలిన అభిమానం.

రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది గౌరవభావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు. ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలా మంది వినేవారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది. ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపనీ మహర్షి దగ్గరికీ, శ్రీరామచంద్రుడు తమ కుల గురువైన వశిష్ఠముని దగ్గరికీ వెళ్ళారు.

ఆ ముసలాయన ప్రతి రోజూ రవీంద్రుల ముందు మోకరిల్లేవాడు. ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తరువాత చాలామంది బంగారు నాణేలు, ధనం, పండ్లు, పూలు ఆయనకు సమర్పించారు. ఆ ముసలాయన మాత్రం చాలా మర్యాద పూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు.

రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతుష్టులై ఉన్నాడు కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించాడు. ఆ ముసలాయన మనస్సు ఆనందంతో పులకించిపోయింది.

టాగూర్ తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు. “ఈ పెద్దాయన చూస్తే ఉద్విగ్న మనస్కుడిలాగా ఉన్నాడు. మన రాక కోసం ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది. అలాగే వారి పిల్లలకు కూడా 200 యెన్ లు ఇవ్వండి.”

ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా మూడు ముప్పావు అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో టాగూర్ ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు. అంతకు మునుపు టాగూర్ నాలుగు గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు. ఆయన రవీంద్రుని ఆ కార్లో ఎక్కించుకుని ఓ కొండ లాంటి ప్రదేశం పై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్ళాడు. వెళ్ళగానే వాచ్‌మాన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేశాడు. లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు ఆయన్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు. బంగారు పాత్రల్లో సుమారు రెండు వందల రకాల వంటలు రుచి చూపించారు. ఆయన కుటుంబమంతా టాగూర్ కు పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు.

రవీంద్రుల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధుడితో “మీరు నన్ను ఎక్కడికి తీసుకు వచ్చారు? దయచేసి మీ ఇంటికి తీసుకు వెళ్ళండి. ఈ భవనానికి ఎందుకు తీసుకువచ్చారు?” అన్నాడు.

అప్పుడాయన “ఓ ఋషి వర్యా! ఇదే నా ఇల్లు. ఈ కార్లు, ఈ బంగళా అన్నీ నావే. నీ ముందు మోకరిల్లిన వారు అంతా నా భార్యా, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాండ్రు. నాకు రెండు కార్మాగారాలున్నాయి.”

“ఓ అయితే మీరు ఇంత ధనవంతులై ఉండి కూడా నా దగ్గరకు వచ్చేటపుడు అతి సాధారణంగా వచ్చేవారు. ఎందుకో తెలుసుకోవచ్చా?” అనడిగాడు రవీంద్రుడు.

“స్వామీ! భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు. నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవడం కేవలం మూర్ఖత్వం. ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము. మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందే ఎవరికీ తెలియదు. అలాగే ఎల్లప్పుడూ తన సంపాదనలు కాపాడుకోవడానికి ఆలోచిస్తుండేవాడు తన గురించి తాను ఆలోచించడానికి సమయం ఉండదు. ఈ ప్రపంచం దాటితే ఆ సంపదలకు విలువ ఉండదు.”

“అమూల్యమైన ఆత్మాజ్ఞానంతో పోలిస్తే ఈ సంపదలంతా చాలా చిన్నవి. ఈ సంపదలు నాకు కష్టాలు కొనితెచ్చిపెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్నిస్తున్నది. నా జీవితమంతా మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. ఇప్పటి దాకా సిరిసంపదలే ధ్యేయంగా బతికాను. అవేవీ నాకు సంతోషాన్నివ్వలేదు. మీరు చెప్పిన ప్రతి మాటా నా అజ్ఞాన పొరలను తొలగించాయి.నేను మామూలు దుస్తులు వేసుకుని మీ దగ్గరకు రావడానికి కారణం, జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను ఓ యాచకుణ్ణి మాత్రమే అని సూచించడానికే. మీ సమక్షంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.”

ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కాబట్టి ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది, సత్పురుషుల బోధనలు ఎక్కడ గౌరవించబడతాయో అక్కడ సిరిసంపదలకు విలువ లేదు.

రవీంద్రుల వారు సంతోషంగా “ఓ మిత్రమా! నీకు సిరిసంపదల కన్నా ఆత్మసాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువ. నీవు నిజంగా ధనవంతుడవే. నీ లాంటి శిష్యుని కలుసుకున్నందుకు నాకు ఈ రోజు చాలా సంతృప్తిగా ఉంది. నా బోధనలకు సార్థకత చేకూరింది.”

“నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు భౌతిక మైన సుఖ సంపదల కోసం అడుగుతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసేవారు. కానీ మీరు తెలివైన వారు. మీరు అడగకపోయినా భగవంతుడు మీకు అన్నీ ఇస్తున్నాడు. మీ జ్ఞాన తృష్ణను తీర్చడానికే నన్ను ఆ భగవంతుడు ఇక్కడికి పంపినట్లున్నాడు.” అని ఆయన దగ్గర సెలవు తీసుకున్నారు.
**********************

*మన్వంతరములు*

హిందూపురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినములో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నాము. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడింది.

భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరం లోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.

*మన్వంతరముల పేర్లు*

1) స్వాయంభువ మన్వంతరము
2) స్వారోచిష మన్వంతరము
3) ఉత్తమ మన్వంతరము
4) తామస మన్వంతరము
5) రైవత మన్వంతరము
6) చాక్షుష మన్వంతరము
7) వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము
8) సూర్య సావర్ణిక మనవు మన్వంతరము
9) దక్షసావర్ణి మన్వంతరము
10) బ్రహ్మసావర్ణి మన్వంతరము
11) ధర్మసావర్ణి మన్వంతరము
12) భద్రసావర్ణి మన్వంతరము
13) దేవసావర్ణి మన్వంతరము
14) ఇంద్రసావర్ణి మన్వంతరము

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
***********************

రామాయణమ్ .22


.
గౌతమ మహర్షి ఆతిధ్యం స్వీకరించిన పిదప విశ్వామిత్ర మహర్షి ఈశాన్యదిక్కుగా ప్రయాణమయినాడు.
 అన్నదమ్ములిరువురూ ఆయనను అనుసరించినారు.
.
జనకుడి యజ్ఞ శాల ప్రవేశించారు మహర్షి!.
.
మహాత్ముడు అయిన విశ్వామిత్ర మహర్షి రాక తెలిసికొని జనకమహారాజు తన పురోహితుడైన శతానందులవారిని వెంట నిడుకొని అతిశీఘ్రముగా ఆయన వద్దకు చేరి అర్ఘ్యపాద్యాదులొసగి ఆ మహానుభావుని తగురీతిని సత్కరించి అంజలి ఘటించి నిలుచున్నాడు.
.
జనకుడిని యజ్ఞము ఏవిధముగా జరుగుతున్నదో అడిగి తెలుసుకున్నారు మహర్షి.
.
అప్పుడు జనకుడి మదిలో ఒక ఉత్సాహమేర్పడి ,
మహర్షివెంట ఉన్న ధనుర్ధారులైన రాకుమారులెవరో తెలుసుకోవాలని కోరిక కలిగింది.
.
మహర్షీ వీరిరువురూ ఎవరు?
పద్మపత్రాల వంటి కన్నులు,
అశ్వినీ దేవతల సౌందర్యం,
దేవతాసమానపరాక్రమము,
గజ సింహ సమానమయిన నడక ,
చూడగానే దేవతలవలే కనపడే ఈ బాలురెవ్వరు?
 ఎవరివారు? నీతో కాలి నడకనే ఇచ్చటికి వచ్చినారెందుకు?
.
 జనకుడి ప్రశ్నల పరంపరకు చిరునవ్వుతో మహర్షి ఇలా సమాధాన మిచ్చారు.
.
వీరు అయోధ్యా పురాధీశుడు దశరధమహారాజు కుమారులు రామలక్ష్మణులు! ..... అని చెప్పి!.
.
తాటకద్రుంచి వైచి యతిదర్పితుడైన సుబాహుసాయకోత్పాటితు చేసి
గీటడిచి ధర్మ మెలర్పన్ అహల్య శాపముచ్ఛాటన
మొందజేసి కడు సమ్మద మారగ నీగృహంబునం
జాటగనున్న శంకరుని చాపము జూడగ వచ్చిరి ఏర్పడన్
.
తాటకను చంపినవారు వీరే ,
సుబాహుడిని మృత్యువు కౌగిటిలోకి తోసినది వీరే ,
అహల్య శాపవిమోచనము గావించినవారు వీరే !
నీ ఇంట వున్న శివధనుస్సును చూడటానికి ఇప్పుడు ఇక్జడికి వచ్చారు.
.
ఇది వింటున్న శతానందులవారు ఆనందంతో ఎగిరి గంతువేసి ఏమిటి మహర్షీ? మా అమ్మ అహల్యకు శాపవిమోచనమయినదా ? అని ఆత్రుతతో ప్రశ్నించాడు.
.
శతానందులవారు అహల్యాగౌతముల కుమారుడు.
.
N.B..
పై పద్యం భాస్కర రామాయణంలోనిది
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
**********************

*వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం*



*ప్రథమ స్కంధము-రెండవ అధ్యాయము*

*భగవత్తత్త్వము మరియు భక్తియుత సేవ*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*2.1 (మొదటి శ్లోకము)*

*వ్యాస ఉవాచ*

*ఇతి సంప్రశ్నసంహృష్టో విప్రాణాం రౌమహర్షిణిః|*

*ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తుముపచక్రమే॥*

రోమహర్షణుని సుతుడైన ఉగ్రశ్రవుడు (సూతగోస్వామి) బ్రాహ్మణుల ఉత్తమ ప్రశ్నలచే పూర్ణసంతుష్టి నొందినవాడై వారికి కృతజ్ఞతలు తెలిపే ప్రత్యుత్తరము నొసగ ఉద్యుక్తుడయ్యెను.

*2.2 (రెండవ శ్లోకము)*

*సూత ఉవాచ*

*యం ప్రవ్రజన్తమను పేతమ పేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ|*

*పుత్రేతి తన్మయతయా తరవోఽభినేదుస్తం సర్వభూతహృదయం మునిమానతోఽస్మి॥*

శ్రీల సూతగోస్వామి పలికెను: సర్వుల హృదయములలోనికి చేరగలిగిన మహామునియైన శుకదేవగోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. ఉపనయస సంస్కారమును గాని లేదా ఉన్నత కులస్థులు పాటించునటువంటి పవిత్రీకరణవిధానములను గాని అనుసరింపక  సన్న్యాసమును స్వీకరించుటకై  అతడు గృహమును వీడినప్పుడు తండ్రియైన వ్యాసదేవుఢు "హా! పుత్రా!" అని విరహకాతరుడై పలికియుండెను. అదే విరహభావములో మునిగిన వృక్షములు అంతట ఆ బాధాతప్తుడైన తండ్రికి ప్రతిధ్వానముతో ప్రత్యుత్తర మిచ్చినవి.

*2.3 (మూడవ శ్లోకము)*

*యః స్వానుభావమఖిల శ్రుతిసారమేకమధ్యాత్మ దీపమతితితీర్హతాం తమోఽన్ధమ్|*

*సంసారిణాం కరుణయాహ పురాణగుహ్యం*
*తం వ్యాస సూనుముపయామి గురుం మునీనామ్॥*

వ్యాసదేవుని తనయుడును, మునులందరికి గురువర్యుడును అగు శ్రీశుకదేవగోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. అంధకారబంధురమైన సంసారమును తరించుటకు తీవ్రయత్నము సలిపెడి సంసారుల యెడ స్వయముగా అనుభూతమొనర్చుకొనిన పిమ్మట పలికియుండెను.

*2.4 (నాల్గవ శ్లోకము)*

*నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్|*

*దేవీం సరస్వతీం వ్యాసం తతో జయమూదీరయేత్॥*

జయమును సాధించుటకు ఏకైక మార్గమైన శ్రీమద్భాగవతమును పఠించుటకు మొదట దేవదేవుడైన నరనారాయణ ఋషికి, చదువుల తల్లి సరస్వతీదేవికి, గ్రంథకర్తయైన శ్రీల వ్యాసదేవునికి ప్రతియొక్కరు గౌరవపూర్వక వందనముల నర్పించవలెను.

*2.5 (ఐదవ శ్లోకము)*

*మునయః సాధు పృష్టోఽహం భవద్భిర్లోకమంగళమ్|*

*యత్కృతః కృష్ణసంప్రశ్నో యేనాత్మా సుప్రసీదతి॥*

ఓ మునులారా! యోగ్యములైన ప్రశ్నలు నన్ను అడిగారు. కృష్ణపరములుగా నుండి జగన్మంగళమునకు సంబంధించినవి కనుక శ్రేష్ఠములై యున్నవి. అటువంటి ప్రశ్నలే వాస్తవమునకు ఆత్మను సంపూర్ణముగా సుప్రసన్నము చేయసమర్ధమైనది.


*2.6 (ఆరవ శ్లోకము)*

*స వై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే|*

*అ హైతుక్యప్రతిహతా యయాత్మా సుప్రసీదతి॥*

అధోక్షజుడైన శ్రీకృష్ణభగవానుని యెడ ప్రేమపూర్వకమైన భక్తియుత సేవను కలిగింపజేయునదే మానవుల పరమధర్మమై యున్నది. ఆత్మ యొక్క పూర్ణసంతృప్తి కొరకు అట్టి భక్తియుతసేవ నిర్హేతుకము మరియు అవరోధరహితముగా ఉంటుంది.


*2.7 (ఏడవ శ్లోకము)*

*వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః|*

*జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకమ్॥*

దేవదేవుడైన శ్రీకృష్ణునకు భక్తియుతసేవ చేయుటద్వారా మనుష్యుడు తొందరగా నిర్హేతుకమైన జ్ఞానమును, జగమునుండి వైరాగ్యము పొందుచున్నాడు.

*2.8 (ఎనిమిదవ శ్లోకము)*

*ధర్మః స్వనుష్ఠితః పుంసాం విష్వక్సేనకథాసు యః|*

*నోత్సాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలమ్॥*

తన నిజస్థితి ననుసరించి మనుజుడు చేయు విద్యుక్తధర్మ నిర్వహణము దేవదేవుని కథలయందు అతనికి అనురక్తిని కలిగించనిచో అది కేవలము శ్రమ మాత్రమే అవుతుంది.

*2.9 (తొమ్మిదవ శ్లోకము)*

*ధర్మస్య హ్యాపవర్గస్య నార్థోఽర్థాయోపకల్పతే|*

*నార్థస్య ధర్మైకాస్తస్య కామో లాభాయ హి స్మృతః॥*

విద్యుక్తధర్మములన్నియును నిశ్చయముగా చరమమైన మోక్షము కొరకే ఉద్దేశింపబడినవి. వాటినెన్నడును భౌతికలాభము కొరకై నిర్వహింపరాదు. అంతమాత్రమే కాకుండా మహామునుల నిర్ణయము ప్రకారము పరమధర్మమునందు విముక్తుడైనవాడు. భౌతికలాభము నెప్పుడును ఇంద్రియభోగమునకై వినియోగింపరాదు.

*2.10 (పదవ శ్లోకము)*

*కామస్య నేంద్రియప్రీతిర్లాభో జీవేత యావతా|*

*జీవస్య తత్త్వజిజ్ఞాసా నార్థో యశ్చేహ కర్మభిః॥*

జీవితములో కోరికలెన్నడును ఇంద్రియభోగముల కోసం కేంద్రీకృతమై ఉండరాదు. మానవుడు పరతత్త్వమును గూర్చి విచారణము సలుపుటకే ఉద్దేశింపబడి ఉన్నందున కేవలము ఆరోగ్యప్రదమైన జీవనము కోసం కోరికలను కలిగి ఉండవలెను. అంతకు మించి కర్మల లక్ష్యము వేరొకటి కాకూడదు.

*2.11 (పదకొండవ శ్లోకము)*

*వదన్తి తత్తత్త్వవిదస్తత్వం యజ్ జ్ఞానమద్వయమ్|*

*బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే॥*

పరతత్త్వము తెలిసిన తత్త్వవిదులు అట్టి అద్యయతత్త్వమును బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడని పిలుతురు.

*2.12 (పన్నెండవ శ్లోకము)*

*తచ్ఛ్రద్దధానా మునయో జ్ఞానవైరాగ్యయుక్తయా|*

*పశ్యన్త్యాత్మని చాత్మానం భక్త్యా శ్రుతగృహీతయా॥*

జిజ్ఞాసువైనవాడు లేదా ముని జ్ఞానవైరాగ్యయుక్తుడై వేదాంతశృతి ద్వారా తాను శ్రవణము చేసియున్న విధముగా భక్తియుతసేవను గావించుచు పరతత్త్వమును అనుభూతమొనర్చుకొనగలుగును.

*2.13 (పదమూడవ శ్లోకము)*

*అతః పుంభిర్ధ్విజశ్రేష్ఠా వర్ణాశ్రమవిభాగశః |*

*స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి ర్హరితోషణమ్॥*

ఓ ద్విజశ్రేష్ఠులారా! కనుకనే శ్రీకృష్ణభగవానునికి ముదమును గూర్చుటయే వర్ణాశ్రమపద్ధతి ననుసరించి మనుజుడు తన స్వధర్మమునకు నిర్దేశింపబడిన కర్మలను ఒనరింఛుట ద్వారా సాధించెడి అత్యున్నత పూర్ణత్వమని నిర్ణయింపబడినది.

*2.14 (పదునాల్గవ  శ్లోకము)*

*తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతిః*

*శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా॥*
కనుక ప్రతియొక్కరును ఏకైకలక్ష్యముతో సాత్వతాంపతియైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన శ్రవణము, కీర్తనము, స్మరణము, పూజనములందు ఎల్లప్పుడు నియిక్తులు కావలెను.


*2.15 (పదిహేనవ శ్లోకము)*

*యదనుధ్యాసినా యుక్తాః కర్మగ్రంథినిబంధనమ్|*

*ఛిన్దన్తి కోవిదాస్తస్య కో న కుర్యాత్కథారితమ్॥*

బుద్ధిమంతులైనవారు శ్రీకృష్ణుని  స్మరణమను దివ్యఖడ్గమును చేబూని కర్మగ్రంథిని త్రెంపివేయుచున్నారు. కనుక ఎవరు  ఆ దేవదేవుని కథల యందు శ్రద్ధను కనబరచకుందురు? (శ్రద్ధ కనబరచుదురు అని అర్థము).

*2.16 (పదునారవ శ్లోకము)*

*శుశ్రూషోః శ్రద్దధానస్య వాసూదేవకథారుచిః|*

*స్యాన్మహత్సేవయా విప్రాః పుణ్యతీర్థనిషేవణాత్॥*

ఓ విప్రులారా! సర్వపాపదూరులైనటువంటి మహాభక్తులకు సేవను గూర్చుట ద్వారా గొప్ప సేవ ఒనరింపబడుచున్నది. అట్టి సేవ ద్వారా మనుజునికి వాసుదేవుని కథలను శ్రవణము చేయుట యందు రుచి ఉత్పన్నమగుచున్నది.


*2.17 (పదిహేడవ శ్లోకము)*

*శృణ్వతాం స్వకథాః కృష్ణః  పుణ్యశ్రవణ కీర్తనః|*

*హృద్యస్తఃస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతామ్॥*

పరమాత్మగా సర్వజీవ హృదయములలో నిలిచినవాడును, శ్రద్ధావంతులైన భక్తుల శ్రేయోభిలాషియును అగు శ్రీకృష్ణభగవానుడు చక్కగా శ్రవణకీర్తనములు జరిగినపుడు పుణ్యప్రదములైన తన దివ్యలీలాకథల యెడ శ్రవణోత్సాహమును పెంపొందించుకొనిన భక్తుని హృదయము నుండి భౌతికసుఖాభాలాషను తొలగించివేయుచున్నాడు.


*2.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*నష్ట ప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా|*

*భగవత్యుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ॥*

నిత్యము తానొనరించునటువంటి శ్రీమద్భాగవతోపదేశముల శ్రవణము,శుద్ధభక్తుల సేవనము ద్వారా హృదయమునందలి అభద్రములన్నియును దాదాపు సంపూర్ణముగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణభగవానుని యెడ అకుంఠితమైన ప్రేమయుతసేవ స్థాపితము కాగలదు.

*2.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*తదా రజస్తమోభావాః కామలోభాదయశ్చ యే|*

*చేత ఏతైరనావిద్ధం స్థితం సత్త్వే ప్రసీదతి॥*

నిక్షేపరహితమైన ప్రేమయుతసేవ హృదయమునందు సుస్థిరమైనంతనే రజస్తమోగుణ ఫలములైన కామక్రోధ లోభములు హృదయమునుంఢి అదృశ్యమగును. అంతట భక్తుడు సత్త్వగుణమునందు స్థితిని పొంది సంపూర్ణముగా ప్రసన్నుడగును.

*2.20 (ఇరువదవ శ్లోకం)*

*ఏవం ప్రసన్నమనసో భగవద్భక్తి యోగతః*

*భగవత్తత్త్వవిజ్ఞానం ముక్తసంగస్య జాయతే*

ఈ విధముగా శుద్ధసత్త్వము నందు స్థితుడై శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ ద్వారా ప్రసన్నమైన మనస్సును పొందెడి మనుజుడు సమస్త   భౌతికసంగత్వము నుండి ముక్తినొందిన స్థితిలో వాస్తవమైన భగవత్తత్త్వ విజ్ఞానమును పొందగలడు.

*2.21 (ఇరవై ఒకటవ శ్లోకము)*

*భిద్యతే హృదయగ్రంథిశ్ఛిద్యన్తే  సర్వసంశయాః|*

*క్షీయన్తే దాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే॥*

ఈ విధముగా హృదయగ్రంథి త్రెంపివేయబడి సర్వసంశయములు సమూలముగా నశించును. అటుపిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్యకర్మపరంపర పరిసమాప్తి నొందును.

*2.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*అతో వై కవయో నిత్యం భక్తిం పరమయా ముదా|*

*వాసుదేవే భగవతి కుర్వన్త్యాత్మప్రసాదనీమ్॥*

కనుకనే అనంతకాలము నుండి పరమభక్తులైనవారు ఆత్మకు ప్రసన్నతను గూర్చునదైనందున దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుతసేవను నిశ్చయముగా అత్యంత ముదముతో గావించుచున్నారు.

*2.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్గుణాస్తైర్ యుక్తః పరః పురుష ఏక ఇహాస్య ధత్తే|*

*స్థిత్యాదయే హరివిరించిహరేతి సంజ్ఞాః*
*శ్రేయాంపి తత్ర ఖలు సత్త్వతనోర్నృణాం స్యుః॥*

దివ్యుడైన పరమపురుషుడు ప్రకృతి త్రిగుణములైన సత్త్వగుణము, రజోగుణము, తమోగుణములతో పరోక్షముగా సంగత్వమును కలిగియున్నాడు. భౌతికజగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకు ఆతడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులనెడి గుణావతారములను స్వీకరించుచున్నాడు. ఈ మూడింటిలో సత్త్వగుణరూపమైన విష్ణువు నుండి సమస్త మానవులు పరమశ్రేయమును పొందగలరు.

*2.24 (ఇరువది నాల్గవ శ్లోకము)*

*పార్థివాద్దారుణో ధూమస్తస్మాదగ్నిస్త్రయీమయః|*

*తామసస్తు రజస్తస్మాత్సత్త్వం యద్బ్రహ్మదర్శనమ్॥*

దారువు భూమి యొక్క రూపాంతరమైనను, ధూమము దారువు కన్నను శ్రేష్ఠమైనది. కాని యజ్ఞము ద్వారా ఉన్నతజ్ఞాన సముపార్జనము జరుగును గనుక అగ్నియనునది ధూమము కన్నను శ్రేష్ఠమైనది. అదేవిధముగా రజోగుణము తమోగుణము కన్నను శ్రేష్ఠమైనను,సత్త్వగుణముచే పరతత్త్వానుభవమును పొందు స్థితికి మనుజుడు చేరును గనుక సత్త్వగుణము రజోగుణము కన్నను శ్రేష్ఠమై యున్నది.


*2.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*భేజిరే మునయోఽథాగ్రే భగవన్తమధోక్షజమ్|*

*సత్త్వం విశుద్ధం క్షేమాయ కల్పన్తే యేఽను తానిహ॥*

ప్రకృతి త్రిగుణములకు పరుడైనందునే అధోక్షజుడైన శ్రీకృష్ణుని పూర్వము మహామునులు  భక్తియుతసేవతో అర్చించిరి. భౌతికబంధముల నుండి ముక్తిని పొంది దివ్యలాభమును పొందు నుద్దేశ్యముతోనే వారు ఆ దేవదేవుని ఆరాధించిరి. అట్టి ప్రామాణికుల ననుసరించువారు కూడ భౌతికజగము నుండి ముక్తిని పొందుటకు అర్హులగుచున్నారు.

*2.26 (ఇరువదిఆరవ శ్లోకము)*

*ముముక్షవో ఘోరరూపాన్ హిత్వా భూతపతీనథ|*

*నారాయణకలాః శాన్తా భజన్తి హ్యనసూయవః॥*

ముక్తిని పొందుట యందు శ్రద్ధావంతులైనవారు నిశ్చయముగా అసూయరహితులై సర్వులను గౌరవింతురు. అయినను వారు ఘోరములైన వివిధ దేవతారూపములను నిరసించి విష్ణువు మరియు అతని ప్రధానాంశముల శాంతరూపములనే అర్చింతురు.

*2.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*రజస్తమఃప్రకృతయః సమశీలా భజన్తి వై|*

*పితృభూతప్రజేశాదీన్ శ్రియైశ్వర్యప్రజేస్సవః॥*

రజోగుణమునందు మరియు తమోగుణమునందు స్థితిని కలిగినవారు స్త్రీసాంగత్యము, ఐశ్వర్యము, అధికారము, సంతానమాది భౌతికలాభమును పొందగోరినవారై నందున పితృదేవతలను, ఇతర జీవులను, లోకపాలనా వ్యవహారములను గాంచెడి దేవతలను అర్చింతురు.

*2.28 (ఇరువది ఎనిమిదివ      శ్లోకము)*

*వాసుదేవపరా వేదా వాసుదేవపరా మఖాః|*

*వాసుదేవపరా యోగా వాసుదేవపరాః క్రియాః॥*

*2.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*వాసుదేవపరం జ్ఞానం వాసుదేవపరం తపః*

*వాసుదేవపరో ధర్మో వాసుదేవపరా గతిః॥*

శాస్త్రములందలి జ్ఞానము యొక్క పరమలక్ష్యము శ్రీకృష్ణభగవానుడై యున్నాడు. యజ్ఞాచరణ ప్రయోజనము ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తిపరచుటయే. ఆ ఆదిదేవుని అనుభూతమొనర్చుకొనుటకే యోగము ఉద్దేశింపబడినది. కామ్యకర్మఫలము లన్నియును అంత్యమున అతని చేతనే అనుగ్రహింపబడుచున్నవి. దివ్యజ్ఞానమనగా అతడే. సర్వవిధములైన తీవ్ర తపస్సులు అతనిని తెలిసికొనుట కొరకే నిర్వహింపబడును. ఆ ఆదిదేవుడైన శ్రీకృష్ణునికి భక్తియుతసేవను గూర్చుటయే పరమధర్మమై యున్నది. దేవదేవుడైన అతడే మానవజన్మ యొక్క పరమగతియై యున్నాడు.


*2.30 (ముప్పదవ శ్లోకము)*

*స ఏవేదం ససర్జాగ్రే భగవానాత్మ  మాయయా*

*సదసద్రూపయా చాసౌ గుణమయాగుణో విభుః॥*

సృష్ట్యారంభమున దేవదేవుడైన వాసుదేవుడు తన దివ్యమైన ఆధ్యాత్మికస్థితి యందు నిలిచియుండి ఆంతరంగికశక్తి ద్వారా సథ్, అసత్తులను సృష్టించెను.

*2.31 (ముప్పది ఒకటవ శ్లోకం)*

*తయో విలసితేష్వేషు గుణేషు గుణవానివ|*

*అన్తఃప్రవిష్ట  ఆభాతి విజ్ఞానేన విజృంభితః॥*

భౌతిక జగమును సృష్టించిన పిమ్మట భగవానూడైన వాసుదేవుడు తన విస్తారము ద్వారా దాని యందు ప్రవేశించును. ప్రకృతిజన్య త్రిగుణములను గూడియున్నను, సాధారణ వ్యక్తజీవులలో ఒకనిగా గోచరించినను ఆ దేవదేవుడు సదా తన దివ్యస్థితిని గూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగియుండును.

*2.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*యథా హ్యవహితో వహ్నిర్దారుష్వేకః స్వయోనిషు|*

*నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్*

అగ్ని దారువు నందంతటను వ్యాపించినట్లుగా దేవదేవుడైన వాసుదేవుడు పరమాత్మునిగా సమస్తము నందును వ్యాపించి యుండును. కనకనే అద్వితీయుడైనను ఆ భగవానుడు బహురూపునిగా గోచరించును.

*2.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*అసౌ గుణమయైర్భా వైర్భూతసూక్ష్మేంద్రియాత్మభిః|*

*స్వనిర్మి తేషు నిర్విష్టో భుంక్తే భూతేషు తద్గుణాన్*

పరమాత్ముడు భౌతికప్రకృతి యొక్క త్రిగుణములచే ప్రభావితులైన జీవుల దేహములందు ప్రవేశించి, వారు తమ సూక్ష్మ మనస్సు ద్వారా త్రిగుణ ప్రభావమును అనుభవించునట్లుగా చేయుచున్నాడు.


*2.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*భావయత్యేష సత్త్వేన లోకాన్ వై లోకభావనః|*

*లీలావతారానురతో దేవతిర్యఙ్నరాదిషు॥*

ఈ విధముగా జగన్నాథుడైన శ్రీకృష్ణుడు దేవతలు, మినవులు, జంతువులు మున్నగు జీవులతో నిండియున్న సర్వలోకములను     పోషించుచుండును. శుద్ధ సత్త్వమునందు స్థితులైనట్టి వారలను ఉద్ధరించుటకు అతడు అవతారములను దాల్చి పెక్కులీలలను గావించును.

*శ్రీమధ్భాగవతము నందలి "భగవత్తత్త్వము మరియు భక్తియుతసేవ" అను ప్రథమస్కంధములోని ద్వితీయాధ్యాయము సమాప్తము*

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
**********************