6, ఆగస్టు 2020, గురువారం

*నేటి చిట్టికథ*



మహాభారతం నుండి....

పంచ పాండవులలో ఒకరైన సహదేవుడు ఒకరోజు గుర్రాల సంతలో  ఒక అందమైన గుర్రాన్ని చూసాడు

ఎలాగైన సరే నేను ఈ గుర్రాన్ని కొనాలి అనుకొని గుర్రం యజమాని గారిని గుర్రం ధర ఎంత అని అడిగాడు.

గుర్రాన్ని నేను ఎవరకూ అమ్మను కానీ ఎవరైతే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెపుతారో వారికి నా గుర్రాన్ని ఉచితంగా ఇస్తాను అని చెప్పాడు  ఆ యజమాని.

 సహదేవుడు సరే నన్ను అడుగు ఎటువంటి ప్రశ్నలకైన నేను సమాధానం చెపుతాను అన్నాడు..

దానికి గుర్రం యొక్క యజమాని ఇలా అడగడం మొదలు పెట్టాడు..

మెదటి ప్రశ్న:

ఒక పెద్ద బావి ఉంది. ఆ పెద్ద బావి లోని నీరు ని తీసుకుని వెళ్లి ఏడు చిన్న బావులను పెద్ద బావి లోని నీటితో నింపవచ్చు కానీ ఆ ఏడు చిన్న బావులలోని నీటితో పెద్ద బావిని నింపలేము ఎందుకు అని అడిగాడు

సహదేవుడు  సమాధానం చెప్పలేకపోయాడు.

కొంచెం సమయం తరువాత నకులుడు సహదేవుడు నకులుడు వెతుక్కుంటూ వచ్చాడు

 సహదేవుడు ఆ గుర్రం మరియు గుర్రం యొక్క యజమాని గురించి నకులుడు కి వివరంగా చెప్పాడు.

సరే ఆ ప్రశ్నలు నన్ను అడుగు.. నేను సమాధానం ఇస్తాను అన్నాడు...

గుర్రం యొక్క యజమాని సరే అని ఇలా అడిగారు.

రెండోవ ప్రశ్న

మనము బట్టలు కుట్టటం కోసం ఉపయోగించే సూది రంధ్రం ద్వారా పెద్ద ఏనుగు ఇవతలి వైపు నుండి రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్లింది కానీ ఆ ఏనుగు తోక మాత్రం ఆ సూది రంధ్రంద్వారా వెళ్ల లేకపోయింది . అది ఏమిటి అని అడిగారు.

ఈ ప్రశ్నకు నకులుడు సమాధానం చెప్పలేకపోయాడు

 ఎంతసేపటికి తమ్ముళ్ళిద్దరూ రాజ్యానికి రాక పోయే సరికి  భీముడు తమ్ముళ్ళిద్దరను వెతుక్కుంటూ వెళ్ళాడు.

ఈ సారి నేను మీ ప్రశ్నలకు సమాధానాలు చెపుతాను అన్నాడు భీముడు.

గుర్రం యొక్క యజమాని ఇలా అడిగాడు

మూడవ ప్రశ్న

ఒక పొలంలో ధాన్యం బాగా పండింది. ఆ పొలం చుట్టూ పెద్ద పెద్ద గట్టులు ఉన్నాయి. ఆ ధాన్యం పంట కోసే సమయంలో ధాన్యం మాయమైంది. అది ఎలా అని అడిగారు. భీముడు కూడా సమాధానం చెప్పలేకపోయాడు.


అందరూ కలసి ధర్మరాజు ని అడిగారు..

అపుడు ధర్మరాజు .. మిమ్మల్ని ఆ ప్రశ్నలన్నీ అడిగింది కలిపురుషుడు. అతను కలికాలం లో జరిగే యధార్థ సంఘటనలను ప్రశ్నల రూపంలో మిమ్మల్ని అడిగారు.


మెదటి ప్రశ్నకు సమాధానం.

 పెద్ద బావి అనేది తల్లి తండ్రులు. ఏడు చిన్న బావులనేవి వారి పిల్లలు. తల్లి తండ్రులు ఎంత మంది పిల్లల కైనా ప్రేమ ఆప్యాయతలతో పెంచి పోషిస్తారు.
కానీ అదే తల్లి తండ్రులు వృద్ధులు అయినా తరువాత ఆ ఏడుగురు పిల్లలు తల్లి తండ్రులను భారంగా చూస్తారు.

రెండో వ ప్రశ్నకి సమాధానం.

 ఏనుగు అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు. ఏనుగు తోక అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు.
ఏనుగు రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్లిపోతుంది అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు చట్టానికి దొరక్కుండా రంధ్రం ద్వారా వెళ్లిపోతారు. కానీ చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు ఆ రంధ్రం దాటలేక ఆ ఏనుగు తోక లాగా ఇరుక్కు పోతారు.


మూడవ ప్రశ్నకు సమాధానం.

 ఇక్కడ ధాన్యం అంటే ప్రజలు. చుట్టూ ఉన్న పెద్ద పెద్ద గట్టులు అంటే అధికారులు. ఎంతమంది అధికారులు ఉన్న ప్రజలకు దక్కాల్సిన ఫలాలు అధికారులు స్వాహా చేస్తారు. ఆ విధంగా ధాన్యం మాయమైనట్లు ప్రజల ఫలాలు కూడా అధికారులు మాయం చేస్తారు.

 ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు మీకు కలిపురుషుడు ముందుగా తెలియ చేసారు అని ధర్మరాజు గారు తమ్ముళ్ళందరకూ వివరంగా చెప్పాడు.

కామెంట్‌లు లేవు: