25, అక్టోబర్ 2023, బుధవారం

భక్తి - దాని ఆవశ్యకత

 భక్తి - దాని ఆవశ్యకత


మనమతంలో అద్వైతమనీ, ద్వైతమనీ, విశిష్టాద్వైతమనీ మూడు తెరగులు ఉన్నప్పటికీ, ఈ మూడుమార్గాలనూ అనుసరిస్తున్నా; భక్తియెడల, దానికిగల ప్రాముఖ్యమునెడల ఎవరికీ భేదాభిప్రాయం లేదు. వీరందరూ భక్తియొక్క ఆవశ్యకతను గుర్తించియే ఉన్నారు. ప్రపంచంలో ఎంతో వైవిధ్యంతో కూడిన ప్రాణికోటిలో ఒక్క మానవుడుమాత్రం నిలువుగా పెరుగుతున్నాడు. తక్కినవన్నీ అడ్డంగా పెరుగుతున్నవి. అందుచే మానవునికి భౌతికంగానేకాక, పారమార్ధికంగా కూడా ఎత్తుగా పెరుగవలసిన ఆవశ్యకత ఎంతైనాఉన్నది. అట్టిఔన్నత్యం వానికి ఒక్కజ్ఞానమూలంగానే కల్గుతున్నది. ఆ జ్ఞానమే వానికి శాంతినిస్తున్నది. మృగములకంటె మనిషి ఎన్నోవిధాల బాధపడుతున్నా, కష్టాలలో ఈదుతున్నా వానికి జ్ఞానమనే ఒక్క పవిత్రవస్తువు వుండటంవల్ల, తక్కిన జీవకోటికంటే వానికొక ఔన్నత్యం సహజంగా కల్గుతున్నది. మనము సత్యస్వరూపం తెలుసుకోవాలంటే దానికి సాధనం జ్ఞానమే. అందుచేత అందానికీ, శాంతికీ మూలకందం జ్ఞానమే. ఆనందకారకం జ్ఞానం. జ్ఞానమే ఆనందం. ఆనందమే పరమమంగళం. ఈ జ్ఞానానంద స్వరూపమే ఈశ్వరస్వరూపము, ఐశ్వర్యమూ, ఆయన పరమాత్ముడు. ఆయనలో విశిష్టమైన గుణాలు అన్నీ అణగిఉన్నవి. జలములకంతా జటధి ఎట్లు పరమావధియో, అట్లే పరిపూర్ణతకు ఈశ్వరుడొక్కడే నిధి. ఆయనకు ఇతరములేదు. ''ఏకమేవాద్వితీయం బ్రహ్మ'' అనుటయే అద్వైతం. ''ఇదమ్ సర్వమ్ పురుష ఏవ'' అని శ్రుతి చెప్పుచున్నది. శ్రీశంకరభగవత్పాదులవారు దీనినే యుక్తిచేతా, అనుభవంచేతా నిరూపించారు. 

ఐతే ఈఅద్వైత సత్యాన్ని మనం బుద్ధితో గ్రహిస్తేచాలదు. అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది అనుభవానికి రావాలంటే ఈశ్వరానుగ్రహం అవసరం. 'ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైతవాసనా' మొదట ఈశ్వరుడు వేరు, మనంవేరు అన్న ద్వైతభావనతో భజన ప్రారంభమవుతుంది. ఐనప్పటికీ సాధకుని మనోభావం - పరమాత్మ తనకు వెలిగా ఉన్నాడనికానీ, మరోప్రపంచంలో ఉన్నాడనికానీ ఉండదు. పరమాత్మ తనలో అంతర్యామిగా ఉన్నాడనీ, ప్రపంచంలో ప్రతిఅణువులోనూ ఆ పరమాత్మచైతన్యం ఉద్దీపితమై ఉంటున్నదనీ, ఆయన అణువులో అణువై, మేరువులో మేరువై ఉన్నాడనీ సాధకుని మనోభావానికి తట్టుతుంటుంది. గీతలో కృష్ణ పరమాత్మ ''భక్త్యా మా మభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్త్వతః'' అని సెలవిచ్చినారు. 


ఇందు 'భక్త్యా' అన్న పదప్రమోగంవల్ల జ్ఞానలక్షణమైన భక్తిచేతనే పరమాత్మ నిజతత్త్వం తెలుసుకోగలమని గ్రహించాలి. అందుచేత అన్ని మతాలవారూ, భక్తి ఆవశ్యకతను గుర్తించి ఈశ్వరానుగ్రహంకోసం పాటుపడితేకాని, పరమాత్మతత్త్వం అవగతంకాదు. అందుచేతనే ఆచార్యులందరూ 'భక్తి, భక్తి' అని బోధిస్తారు. భక్తియెడల భేదాభిప్రాయం ఎవరికీ లేదు. 

భక్తి మనకు శైశవంనుంచే అభ్యాసం కావాలి. విద్యాభ్యాసకాలంలో సారస్వత సముద్ర తరణానికి భక్తినావను వదలరాదు. బడికిపోయే పిల్లలు విద్యాభివృద్ధికోసం అనుదినమూ సరస్వతిని ఉపాసించడం మంచిది. ఒక పదినిమిషాలైనా సరస్వతిముందు మౌనంగా ధ్యానం చేయడం అత్యవసరం. ప్రతిదినమూ పాఠాలు చదువుకోడానికి ముందు ఈ ధ్యానం చేయడం మంచిది. ఏదో పదిశ్లోకాలు వల్లించినాము కదా. ఇక పూజ ఐనట్లే అన్న మనోభావం ఉండరాదు. ధ్యానంలో భావశుద్ధి ప్రధానం. భావము గాఢతయేప్రార్థన కీలకం. నిశ్చలమైన భక్తితో సరస్వతిముందు మౌనంగా కూర్చుండి పది నిమిషాలపాటు గురుధ్యానమూ, దైవతధ్యానమూ, ప్రగాఢమైనభావంతో చేయడమే ప్రార్థనారహస్యం. ఇట్టి అలవాటు ముదిరేకొద్దీ మనలో దైవికమైన భావాలుత్పన్నమై, దుష్టాలోచనలు మనోరంగంనుంచి క్రమక్రమంగా తొలగిపోతవి. అందుచే చిన్నపిల్లలు తమ పెద్దలనుండి ప్రార్థనారీతులను తెలిసికొని వైదిక సత్యాలను జీవితంలో నెలకొల్పుకోడానికి చిన్నతనంనుంచే ప్రయత్నించాలి. 


ఐతే మనకు భక్తి ఉన్నదా లేదా అనడానికి సాక్ష్యం దైవాజ్ఞలను మీరి నడవకుండా ఉండటం. 'వేదో నిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం' 'నాకు భక్తిఉన్నది. కాని నేను భగవదాజ్ఞాప్రకారం మాత్రం నడుచుకోవటంలేదు' అని అంటే అర్థంలేని మాట. నిజమైన భక్తికి చిహ్నం విహితకర్మానుష్ఠానం. వారి వారి కర్మలను వారు చక్కగా ఆచరించి పరమాత్మకు అర్పించడం అలవరచుకోవాలి. ప్రతియొక్కరూ నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడం విధి. వైష్ణవులు వీనిని ఎంతో అర్థవంతంగా ఆజ్ఞాకైంకర్యములని వ్యవహరిస్తూ ఉంటారు. వైదిక కర్మాచరణకంటే వేరు ఈశ్వరారాధనలేదు. అది వ్యక్తిపరంగా మోక్షాన్ని ఇచ్చి లోకానికంతా సౌఖ్యాన్ని కలుగజేస్తుంది. ఇట్లు మోక్షమార్గంలో కర్మ, భక్తి, జ్ఞానముల ఆవశ్యకతను మనం గుర్తించి, ''మోక్షకారణ సామగ్ర్యాం భక్తి రేవ గరీయసీ'' అన్న ఆచార్యుల వాక్యం స్మరిస్తూ, భక్తి ప్రాధాన్యం మనం మరువకుండా ఉందాము.                        


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।




#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Panchang


 

Bharatiya samskruti


 

Laguage in airports


 

Chalava pindi


 

Sahaara


 

Indian s in kuwait


 

Shops in Railway station


 

Egypt piramid


 

Mudu vishayaalu


 

Hyderabad to kashmir flight journey


 

Happy street in RAHMOUNDY


 

Baby train


 

Bharatiyats


 

Job interview


 

Okka paramaatma


 

Ammavaari puja in Bangkok


 

Driver life in kuwait


 

Vadapalli Sivaalayam


 

Jodan bitiyani

 


Bhagavat svarupam


 

Rob food supply in china restaurant


 

వృధ్ధాచలం(విరుదాచలం

#వృధ్ధాచలం(విరుదాచలం)

#కాశీకంటేపురాతనమైనపుణ్యక్షేత్రం


          తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెలుతామని ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలుకుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిదిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం.


          #వృద్దాచలాన్ని, వృద్ధకాశి అని కూడా పిలుస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. కాశీలో మరణిస్తే #మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం #వృద్ధకాశి అని పిలువబడే ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే, ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు. మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఈ దేవతను పూజిస్తారు


          కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న #వృధ్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు #తారకమంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు.


       అదే విధంగా పరమశివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిద్ధి ఈయన చిదంబరంలో, కాళీతో పోటిపడి నాట్యం చేస్తే ఈ విరుదాలచలం లేదా వృద్దాచలంలో తన సంతోషం కోసం నాట్యం చేశాడని చెబుతారు. అంతే స్వామి సంతోష తరంగాల్లో తేలిపోతూ నాట్యం చేసిన ప్రదేశం ఇదే.


#ఆనందతాండవం


చిదంబరంలో పరమశివుడు కాళీ మాతతో పోటీ పడి నృత్యం చేస్తే ఇక్కడ ఆనంద తాండవం చేశాడని చెబుతారు. 

అందువల్ల ఈ క్షేత్రంలో పుట్టినా, గిట్టినా, నివసించినా భగవంతుడిని ప్రార్థించినా మోక్షం లభిస్తుందని చెబుతారు.


        ‌శివుడు మొదట ఇక్కడ కొండరూపంలో వెలిశాడని చెబుతారు. 

అందువల్లే ఈ క్షేత్రాన్ని మొదట #పఝుమలై అని పిలచేవారు. 

అటు పై విరదాచలంగా ఖ్యాతి పొందింది.


స్వామివారిని సేవిస్తే


పూర్వం ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్టకష్టాలు పడేవారు. దీంతో స్థానికంగా ఉండే విభాసిత మహర్షి, స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పాడు.దీంతో ఆ ఊరిపెద్దలంతా కలిసి స్వామి వారికి దేవాలయం నిర్మించాలని తీర్మానించారు. అయితే ఆ సమయంలో వారి జీవనం ఎలా అన్న అనుమానం మొదలయ్యింది.దీనికి విభాసిత మహర్షి , వృద్దేశ్వర స్వామి వారిపై నమ్మకంతో పనిచేయండి చేసుకొన్నవారికి చేసుకొన్నంతంగా లాభం చేకూరుతుందని చెప్పారు. 

దీంతో ప్రజలు అయిష్టంగానే ఆ పనికి పూనుకొన్నారు.

ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసిన వారికి #విభాసిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు.


ఆశ్చర్యం ఆకులు నాణ్యాలుగా


ఎవరు ఎంత పని చేసారో అంతకు సమానంగా ఆ ఆకులు నాణ్యాలుగా మారేవి. అప్పటి నుంచే చేసిన వారికి

 " చేసినంత,చేసుకున్నవారికి చేసుకొన్నంత " అనే #నానుడి మొదలయ్యిందని చెబుతారు.


మణిముత్తా నదిలో వేసిన నాణేలు తిరువారూరు కొలనులో ...


ఒకసారి ఈ క్షేత్రం గుండా సుందరర్ అనే గాయకుడైన శివభక్తుడు ఈ దారి గుండా వెడుతూ ఇక్కడి స్వామివారిని స్తుతించాడు. 

దీంతో స్వామి వారు స్వయంగా 12 వేల బంగారు నాణ్యాలను అందజేస్తాడు.తాను తిరువారూర్ వెళ్లాల్సి ఉందని అయితే తోవలో దొంగల భయం ఉందని సుందరార్ భయపడుతాడు. 

ఇదే విషయాన్ని శివుడికి చెబుతాడు. దీంతో శివుడు తాను ఈ నాణ్యాలను ఇక్కడే ఉన్న మణిముత్తా నదిలో వేస్తానని నీవు తిరువారూర్ వెళ్లిన తర్వాత అక్కడి కొలనులో తీసుకోవచ్చని చెబుతాడు.ఇందుకు అంగీకరించిన సుందరార్ తిరువారూర్ వెళ్లి అక్కడ కొలనులో నుంచి 12వేల బంగారు నాణ్యాలను తీసుకొన్నాడని కథనం.అదే విధంగా ఆ నాణ్యాల నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటు పై ఆ భక్తాగ్రేసరుడికి ఇచ్చారని చెబుతారు.


5 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత


ఈ ఆలయంలో 5 అంకెకు విశిష్ట స్థానం ఉంది. 

ఈ ప్రాంగణంలో పూజలందుకొనే మూర్తులు 5 5. 

వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు. 

ఇక్కడ స్వామివారికి 5 పేర్లు ఉన్నాయి. అవి విరుధ గిరీశ్వరుడు, పఝమలైనాధార్, విరుద్ధాచలేశ్వర్, ముద్దుకుండ్రీశ్వరుడు, వృధ్ధ గిరీశ్వరుడు. 

ఆలయానికి 5 గోపురాలు ఉన్నాయి. 

అదే విధంగా 5 ప్రాకారాలు, 5 మండపాలు, 5 నందులు ఉన్నాయి. 

వేకువజాము నుంచి రాత్రిదాకా స్వామికి నిర్ణీత సమయంలో 5 సార్లు పూజలు చేస్తారు. 

ఇక్కడ 5 రథాలు ఉన్నాయి. 

ఇక్కడ స్వామివారు స్వయంభువుడు. ఇక్కడ శివుడిని ప్రార్థించిన వారికి మన:శ్శాంతి కలగడమే కాకుండా అన్ని రకాల శరీర రుగ్మతల నుంచి వెంటనే విముక్తి కలుగుతుందని చెబుతారు. 

ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే వివాహం, సంతానం కలగడం వంటి కోరికలు నెరవేరుతాయని చెబుతారు.


పాతాళ వినాయకుడు


శ్రీ కాళహస్తిలో ఉన్నట్లు ఇక్కడ విగ్నేశ్వరుడు భూతలం నుంచి కిందికి ఉన్న ఆలయంలో ఉంటాడు. ఈ ఆలయంలోని స్వామివారిని సందర్శించడానికి 18 మెట్లు దిగి కిందికి వెళ్లాల్సి ఉంటుంది. చనిపోయిన వారి చితా భస్మాన్ని ఇక్కడున్న మణిముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్లుగా మారి నది అడుగున చేరుతాయని చెబుతారు.


ఈ విరుదాచలంలోని నదిలో వేసిన నాణాలు తిరువారూరు కోవెల పుష్కరిణిలో తేలుతాయని చెబుతారు. ఈ విషయానికి సంబంధించి ఎన్ని పరిశోధనలు జరిగినా ఫలితం మాత్రం శూన్యం. అరుణాచలంలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు.


వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు :


ఇక్కడ వల్లీ దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి. అవి శ్రీ చక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారి చక్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువ శివాలయంలో చూస్తాం. అందులో ఇది ఒకటి. అందుకే ఇక్కడ స్వామివారికి విన్నించుకొన్న కోరికలు త్వరగా తీరుతాయని చెబతారు.


సుబ్రహ్మణ్యుడు ప్రతిష్ట చేసిన 28 శివలింగాలు


శైవ సిద్దాంతం ప్రకారం ఇక్కడ 28 ఆగమ శాఖలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ 28 సిద్ధాంతాలకు ప్రతీకగా 28 శివలింగాలను ఇక్కడ ప్రతిష్టించి పూజించాడని నమ్ముతారు.


ఈ సిద్ధాంతాల వల్లే ఈ ఆలయానికి ఆగమ ఆలయమని పేరు. ఈ విశేషం ఉన్న ఆలయం ఇదొక్కటే. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకూ అదే విధంగా సాయంకాలం 3.30 గంటల నుంచి 9 గంటల వరకూ భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది.


ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ


అరుణాచలం అంటే తిరువణ్ణామలైలో చేసినట్లుగానే 

ప్రతి పౌర్ణమికీ ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు.

దీని వల్ల వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.


చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలో కడలూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి.అన్ని, ప్రధాన నగరాలనుంచి విరుధ్ధాచలానికి trains వున్నాయి. లేదా చెన్నయ్ ఎగ్మూరు నుంచి వెళ్ళవచ్చు.చెన్నయ్ నుంచి బస్సులు ఉన్నాయి. లేదా కన్యకుమారి,మధురై,తిరుచ్చి వెళ్ళే బండ్లన్ని విరుధాచలంలో ఆగుతాయి.

                            #స్వస్తి

నూరేళ్ళ జీవిత కధ....

 నూరేళ్ళ జీవిత కధ...... 

తప్పకుండా చదవండీ....

🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜


ఒక చిలుక ఉండేది. చక్కగా పాడేది. స్వేచ్ఛగా ఎగిరేది. కానీ చదవలేకపోయేది. 


అది రాజు గారి తోటలోని చిలుక. ఒకరోజు అది రాజు గారి కంట్లో పడింది. 


వెంటనే మంత్రిని పిలిచి 'ఎడ్యుకేట్ ఇట్' అని ఆదేశించాడు. 


దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను రాజు గారి మేనల్లుడి మీద ఉంచాడు మంత్రి.


ఎలా ఆ చిలుకను ఎడ్యుకేట్ చేయటం?

విద్యావేత్త లు కూర్చుని తీవ్రంగా ఆలోచించారు.


చిలక్కి చదువు చెప్పాలంటే... 

మొదట అది కుదురుగా ఉండాలి. 

అంటే.... అది ఎగురకూడదు.

వెంటనే ఒక మంచి పంజరం చేయించారు. 

చిలుకను అందులో కూర్చోబెట్టారు. 


కోచింగ్ ఇవ్వటానికి ఒక పండితుడు వచ్చాడు. చిలుకను చూశాడు. 

' ఈ చిలక్కి ఒక పుస్తకం సరిపోదు' అన్నాడు.

గుట్టల కొద్దీ పుస్తకాలు వచ్చేశాయి గంటల కొద్దీ చదువు మొదలైంది.


పంజరం చూడ్డానికి వచ్చిన వాళ్లేవరూ ' అబ్బా... భలే చిలుక' అనటం లేదు. 

' అబ్బా... ఏం పంజరం!' అంటున్నారు. లేదంటే '

అబ్బా ... ఎంత చదువు!' అంటున్నారు. 


రాజు గారిని మెచ్చుకుంటున్నారు.

మంత్రిగారిని ప్రశంసిస్తున్నారు.

రాజుగారి మేనల్లుడిని, పంజరం తయారుచేసిన కంసాలిని, చదువు చెప్పటానికి వచ్చిన పండితుడిని ' ఆహా... ఓహో ' అని కీర్తిస్తున్నారు.


రాజు గారు మంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పారు... ఎన్ని లక్షల వరహాలు ఖర్చైన పర్వాలేదు. చిలక్కి బాగా చదువు రావాలని. మంచి మేనర్స్ కూడా రావాలని.


' అలాగే ' అని లక్షల వరహాలు దఫా దఫాలుగా కోశాగారం నుంచి తెప్పించారు మంత్రిగారు. సెమిస్టర్లు గడుస్తున్నాయి.


ఓ రోజు రాజుగారికి చిలకెలా చదువుతుందో చూడాలనిపించింది. వెంటనే ఏర్పాట్లు జరిగాయి.


 'చిలుకను చూడడానికి రాజుగారు వస్తున్నారహో ' అని తప్పెట్లు, తాళాలు ,పెద్ద పెద్ద శబ్దాలు చేసే బూరలతో ఒకటే హోరు. రాజు పరివారం అంతా రాజు కన్నా ముందే చిలుక దగ్గరికి చేరిపోయింది.


అయితే పంజరం లోని చిలుకను ఎవరు పట్టించు కోవటం లేదు. ఎవరూ దాని వైపు చూడటం లేదు.


పండితుడు ఒక్కడే చూస్తున్నాడు.ఆయనైనా చిలుక సరిగా చదువుతుందా లేదా అని చూస్తున్నాడు తప్ప , చిలకెలా ఉందో చూడటం లేదు. 


చిలుక బాగా నీరసించి పోయింది. 

మానసికంగా బాగా నలిగిపోయి ఉంది. 

ఆ రోజైతే .... రాజుగారి సందర్శన ధ్వనులకు చిలక సగం చచ్చిపోయింది. 


తర్వాత కొద్దిరోజులకే పూర్తి ప్రాణం విడిచింది ! 

ఆ సంగతి ఎవరికీ తెలీదు. 

తెలిసిన వాళ్ళు ఎవరికి చెప్పలేదు. 

ముఖ్యంగా రాజుగారికి చెప్పలేదు.


రాజుగారు మళ్ళీ మేనల్లుడిని పిలిచి,' చిలుక ఎలా చదువుతోంది? ' అని అడిగాడు.


' చిలుక స్టడీస్ కంప్లీట్ అయ్యాయి' అన్నాడు మేనల్లుడు.


రాజుగారు సంతోషించారు. తన కృషి ఫలించిందన్నమాట.


' ఇప్పటికి అల్లరి చిల్లర గానే ఎగురుతోందా?'


' ఎగరరదు'


' ఏ పాట పడితే ఆ పాట పాడుతోందా? '


'పాడదు'


' సరే, చిలుకను ఒకసారి నా దగ్గరికి తీసుకురా'

తీసుకొచ్చాడు మేనల్లుడు. చిలుక నోరు తెరవడం లేదు.ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.చిలుక కడుపు ఉబ్బెత్తుగా ఉంది. చిలుక అసలు కదలనే కదలటం లేదు.


" ఆ కడుపులోనిది ఏమిటి!" అని అడిగారు రాజు గారు.


' జ్ఞానం మామయ్య ' అని చెప్పాడు మేనల్లుడు.


' చిలుక చనిపోయినట్లు ఉంది కదా ' అన్నారు రాజుగారు.


చిలుక చదివిందా లేదా అన్నదే నా బాధ్యత. చచ్చిందా బతికిందా అని కాదు అన్నట్లు చూశాడు రాజుగారి మేనల్లుడు.

.....................

నూరేళ్ళ 

క్రితం విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ రాసిన చిలుక కథ ఇది. ఆలోచిస్తే ఇందులో చాలా అర్థం ఉంది.

Naraala balahinataku

Naraala Balaheenata 

ఆలోచనాలోచనాలు

 ///// ఆలోచనాలోచనాలు /////      ***** అవధాన మధురిమలు *****               శతావధాని శ్రీ పళ్ళె పూర్ణప్రజ్ఞాచార్యులు.               సమస్యాపూరణములు ;---    1* "" అత్తకోడండ్ర కేనాఁడు హత్తెఁజెలిమి."" పూరణము ;----"తే.గీ. చాల ధనమున్న వానికి చదువు నాస్తి / డంబుగల పండితునకొ! యన్నంబు సున్న / కారణంబేమియని యడుగంగ నేల / అత్త కోడండ్ర కేనాఁడు హత్తెఁ జెలిమి?                                2* "" రామరాజ్యాన నెపుడుఁబోరాటె ప్రజకు.""      పూరణము;--- "తే.గీ. నా వయిపుఁ జూచె రాముండు నన్నుఁ బిలిచె / నేనె రామున కిష్టుఁడ నేనె ప్రియుఁడ / నేనె నే నేనె నేనె నే నేనె యంచు / రామరాజ్యాన నెపుడుఁబోరాటె ప్రజకు."        3* ""కన్యనుగూడు భాగ్యమదిగల్గుట యెంతటి వారికో తుదిన్."" పూరణము;---- "ఉ. ధన్యులు గాంగతీరము సదా నిలయంబుగనుండువారు, సా / మాన్యులు గంగ గంగ యను మాత్రనఁ బాపవిముక్తులౌదురే / మాన్యఁ దలన్ ధరించె శశిమౌళి తథా విధ విష్ణుపాదజన్ / గన్యను గూడు భాగ్యమదిగల్గుట యెంతటి వారికో తుదిన్."     4*"" మేకను జూచి సింగమది మ్రింగునొ! యంచుఱికెన్ భయంబునన్."" పూరణము ;---- "ఉ. ఏక శతంబు వ్యాఘ్రముల నిర్వదియొక్క గజంబులన్ ద్రుటిన్ / వే కబళించితిన్ వ్రతము వీడను మ్రింగమి నొక్క సింగమున్ / బోకుమటంచుఁ బై దుముకుపోఁ యను గడ్డము మీసలున్న యా / మేకఁను జూచి సింగమది మ్రింగునొ! యంచుఱికెన్ భయంబునన్."                     5* "" కూతురు కోడలయ్యెఁదన కూర్మి సుతుండటు పెండ్లియాడగా! "" పూరణము;---" ఉ. చేతము పల్లవింప బుధశేఖరులెల్ల నుతింప రామ భూ / నేత పురారిచాపమును నిర్దళనంబొనరింప సీత హ / ర్షాతతయై వరించె, నపుడా రఘురాముని తండ్రి కల్ల క్ష్మా / కూఁతురు కోడలయ్యెఁదన కూర్మి సుతుండటు పెండ్లియాడగా."                    దత్తపదులు;----1* "" యతి చెడె-- మతి చెడె -- గతి చెడె -- రతి చెడె "" పదములను ప్రాస స్థానములో వుంచి అందమైన పద్యం.                " చం. యతి చెడె శిష్యురాలుగ ధనాంగన యోర్తుక చెంతఁజేరుటన్ / మతి చెడె నాలతాంగి యసమానసురూపనిరీక్షఁజేసి సత్ / గతి చెడె దాని దోస్తి పెరుగంగ గ్రమంబున బ్రహ్మ విద్యపై / రతి చెడె దుష్ట సంగతి విరాగిని రాగినిగా నొనర్చెడిన్."          2* "" క్షారము -- సారము -- వీరము -- క్షీరము "" అను పదములతో సాహితీపరమగు పదములు వచ్చునట్లు ఉత్పలమాలలో పద్యం.         " ఉ. కారము క్షారశబ్దమునఁ గల్గె నలంకృతులందు నొక్కటై / సారము రాజిలున్ నవరసంబులలోఁ గడు సుప్రసిద్ధమై / వీరము పొల్చుఁ బాకముల విశ్రుతమై సులభానుభావ్యమై / క్షీరము పేరుగన్న కవిసింహుల కబ్బములందుఁగన్పడున్."    3* "" మూలము -- కూలము -- వాలము -- కాలము "" పదములతో పద్యము.                             " కం. మూలము ముఖ్యము వ్యాఖ్యకు / కూలము ముఖ్యంబు నదులకున్ దీర్ఘంబౌ / వాలము ముఖ్యము కపులకుఁ / గాలము ముఖ్యంబు సర్వ కర్మంబులకున్."                    4*"" మంటిని -- కంటిని -- వింటిని -- అంటిని "" పదములతో "" భారతార్థములో"" పద్యం.      " ఉ. మంటిని రాజు లెల్లరును మన్ననఁజేయగ రాజరాజుగా / కంటిని రాయబారమునకై యిటు వచ్చిన నిన్ను నీనుడుల్ / వింటిని, వాడి సూదిమొన వెట్టిన యంతటి నేలనేని నీ / నంటిని నాలమె శరణమంటిని జెప్పుము వారి కచ్యుతా!"                      5* ""భీమ -- అర్జున -- నకుల -- సహదేవ "" పదములతో "" రామాయణార్థముతో"" పద్యం.                                   " తే. గీ. అహితగణభీమ బలుఁడు యశోర్జునుండు / వికరుణా మరలిపునాగ నకులనిభులు / కపులు సహదేవతాంశులు కదలిరాఁగ / యనియె రామచంద్రుఁడు రణోర్వి."       (డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యా సర్వస్వం సౌజన్యంతో)                        తేది 25--10--2023, బుధవారం, శుభోదయం.

శ్రీదేవీ భాగవతము

 శ్రీదేవీ భాగవతము



.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||




జనమేజయా! రావలసిన సందేహమే వచ్చింది. దీనికి జవాబు దొరుకుతుంది. ముందు కథ

విను. వీరిణీదక్షులను ప్రజాసృష్టి చెయ్యమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. ఆ దంపతులకు

అయిదువేలమంది సంతానం కలిగారు. ఈ అధిక సంతానాన్ని చూసి నారదుడు పరిహసించాడు.

వీరిణీదక్షులారా! భూగోళం ఏపాటి ఉందో తెలుసుకోకుండా మీరు ఇలా సంతానాన్ని వృద్ధి

పరిస్తే ఎలాగ? చివరికి నవ్వులపాలవుతారు గమనించండి. నా మాటవిని, ముందుగా పృథివీ ప్రమాణాన్ని

తెలుసుకోండి. అటుపైని సంతానోత్పత్తి చెయ్యండి. అందరూ హర్షిస్తారు. ఏ ఇబ్బందులూ ఉండవు.

లేకపోతే చిక్కునబడతారు సుమా!

భువః ప్రమాణమఙ్ఞాత్వా స్రష్టుకామాః ప్రజాః కథమ్ |

లోకానాం హాస్యతాం యూయం గమిష్యథ న సంశయః ॥

పృథివ్యా వై ప్రమాణం తు ఙ్ఞాత్వా కార్యస్సముద్యమః ।

కృతో ఽసౌసిద్ధిమాయాతి నాన్యథేతి వినిశ్చయః ॥

(1-21, 22)

నారదుడు ఇలా హెచ్చరించేసరికి దక్షసుతులు అవునుసుమా అనుకున్నారు. భూమండలం

ఎంత ఉందో తెలుసుకువద్దామని అందరూ తలొకవైపూ బయలుదేరారు. అయిదువేలమందీ వెళ్ళిపోయారు.

దక్షప్రజాపతికి బెంగ పట్టుకుంది. ఇల్లు బావురుమంటోంది. ఏమీ తోచడంలేదు. సరేనని మరికొందరు

పుత్రుల్ని సృష్టించాడు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై తామూ సంతానాన్ని ఉత్పత్తి చెయ్యడం ఆరంభించాడు.

అదొక ఉద్యమంగా సాగుతోంది.

వారదుడు మళ్ళీ వేళాకోళం చేశాడు. మీరంతా మూర్ఖుల్లాగా ఉన్నారు. చెబుతోంటే

వినిపించుకోరేమి? భూగోళం ఎంత ఉందో తెలుసుకోకుండా సంతానాన్ని ఉత్పత్తి చేస్తారేమిటి? అవి

విసుక్కున్నాడు. నిజమేకదా అని ఈ దక్ష సుతులుకూడా తమ అన్నయ్యల్లాగానే తలోదిక్కుకి వెళ్ళారు.

ఈసారి దక్షుడి పుత్రవిరహం కోపంగా పరిణమించింది. నారదుణ్ణి శపించాడు. వా పుత్రుల్ని

వాశనం చేశావు కనక నువ్వూ నాశనమైపో. దుర్బుద్ధితో ఇంతటి పాపకార్యం చేశావు కనక గర్భవాస

దుఃఖాన్ని అమభవించు. అదికూడా నాకు పుత్రవిరహాన్ని కలిగించావు కాబట్టి నాకే పుత్రుడుగా ఆవిర్భవించు

- అంటూ శాపం విసిరాడు దక్షప్రజాపతి.

బ్రహ్మదేవుడి ఉత్పంగంనుంచి అయోనిజుడై ఆవిర్భవించిన నారదుడు ఈ శాపం కారణంగా

గర్భవాపఠేశాన్ని అనుభవించి వీరిణీదక్షప్రజాపతులకు తనయుడుగా జన్మించాడు.

పంచాంగం బుధవారం, అక్టోబరు 25,

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

శుభోదయం,పంచాంగం   బుధవారం, అక్టోబరు 25, 2023*

 *శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

   *దక్షిణాయనం - శరదృతువు*

 *ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం*

తిథి : *ఏకాదశి* ఉ10.23 వరకు  

వారం  : *బుధవారం* (సౌమ్యవాసరే)

నక్షత్రం : *శతభిషం* మ12.27 వరకు

యోగం: *వృద్ధి* మ12.08 వరకు

కరణం : *భద్ర* ఉ10.23 వరకు

తదుపరి *బవ* రా9.32 వరకు

వర్జ్యం: *సా6.24 - 7.53*

దుర్ముహూర్తము : *ఉ11.21 - 12.08* 

అమృతకాలం  *ఉ7.14వరకు తె3.20 - 4.49*

రాహుకాలం       : *మ12.00 - 1.30*

యమగండ/కేతుకాలం*ఉ7.30 - 9.00*

సూర్యరాశి: *తుల* చంద్రరాశి: *కుంభం*

సూర్యోదయం: *5.59 సూర్యాస్తమయం: *5.31*

*సర్వేజనా సుఖినో భవంతు **

మహానీయుల మాట

 మహానీయుల మాట


జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువ బాధపడకు. ఎందుకంటే... చెట్టు ఆకులు రాలిన ప్రతీసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే. ఏంజరిగినా ఏదో ఒక మంచికోసమే.


ఓం  నమో భగవతే వాసుదేవాయ. 👏


R.V.రమణమూర్తి,

9951020883.

Tapassu


 

మామను

 ఉ:  మామను  సంహరించి , యొకమామను  గర్వమడంచి ,యన్నిశా


                 మామను  రాజుఁ  జేసి ,  యొకమామ తనూజున కాత్మ  బంధువై,


                మామకుఁ  గన్నులిచ్చి , సుతు మన్మధునింతికి   తానె  మామయై ,


                 మామకు  మామ యైన ,పరమాత్ముడు   మీకుఁ బ్రసన్నుఁడయ్యెడిన్;


ఎన్ని మామలో. ఏ మామ ఎవరో మరి.


దీని అర్ధం యెవరైనా చెప్పగలరా కామెంట్లొ పెట్టండి

అనుకూల నివేదిక.

 *అనుకూల నివేదిక..*


ఒక శనివారం నాటి సాయంత్రం వేళ..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి పల్లకీసేవ మరో పది నిమిషాలకు ప్రారంభం అవుతుందనగా..హడావిడిగా ఒక దంపతులు స్వామివారి మందిరం లోపలికి వచ్చారు.."స్వామివారి పల్లకీసేవ లో పాల్గొంటామండీ..మాకూ టికెట్ ఇవ్వండి.." అన్నారు..మా సిబ్బంది వారి పేర్లు నమోదు చేసుకొని టికెట్ ఇచ్చారు..ఆ దంపతులు గబ గబా కాళ్ళూ చేతులు కడుక్కొని..మంటపం లోపలికి వచ్చి స్వామివారి పల్లకీ వద్ద కూర్చున్నారు..స్వామివారి పల్లకీసేవ సుమారు రెండు గంటలపాటు జరుగుతుంది..పల్లకీసేవ పూర్తి అయిన తరువాత..భక్తులందరూ అన్నప్రసాదం కొరకు అన్నదాన సత్రం వద్దకు వెళ్లారు..ఈ దంపతులు మాత్రం స్వామివారి మంటపం లొనే కూర్చున్నారు.."మీరు భోజనం చేశారా?" అని మా సిబ్బంది వారిని అడిగారు.."లేదండీ..ఈరోజు శనివారం..మేము శనివారం రాత్రికి ఆహారం తీసుకోము.." అన్నారు..


ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం స్వామివారి సమాధికి అర్చకస్వాములు ఇచ్చే ప్రత్యేక హారతులు కళ్లకద్దుకొని..స్వామివారి సమాధి దర్శించుకున్నారు..మధ్యాహ్నం హారతులు అయిన తరువాత..అన్నదాన సత్రం వద్దకు వెళ్లి భోజనం చేసి..వెళ్లిపోయారు..సరిగ్గా మరో నాలుగు రోజుల తరువాత..గురువారం నాటి ఉదయం ఆ దంపతులు మళ్లీ స్వామివారి మందిరానికి వచ్చారు..స్వామివారి సమాధిని దర్శించి..తమ గోత్రనామాలతో అర్చన చేయించుకొన్నారు..ఆ తరువాత నా దగ్గరకు వచ్చారు.."ప్రసాద్ గారంటే మీరే కదా..?" అన్నారు.."అవును.." అన్నాను..నా ప్రక్కనే కూర్చున్నారు.."మేము పోయిన శనివారం నాడు ఇక్కడికి వచ్చామండీ..పల్లకీసేవ లో పూజ చేయించాము..ఆదివారం నాడు స్వామివారి సమాధి దర్శించుకున్నాము..ఒక సమస్య లో ఉన్నామండీ..బాగా మానసిక ఆందోళనగా ఉన్నది..ఏమి చేయాలో తోచటం లేదు..అందుకని మళ్లీ ఈరోజు ఈ స్వామివారి మందిరానికి వచ్చాము..నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను..ఇరవై ఎనిమిదేళ్ల సర్వీసు..ఒక్కసారి కూడా ఎవరితోనూ మాట పడలేదు..అటువంటిది గత ఆరునెలల క్రితం నా పై అధికారి తో విబేధాలు వచ్చాయి..నా మీద ఆరోపణలు చేసి..ఎంక్వయిరీ వేయించారు..ఇప్పుడు నన్ను వేధిస్తున్నారు..నేను ఏ తప్పూ చేయలేదు..కానీ వాళ్ళు నన్ను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి..ఉద్యోగం లోంచి తీసివేయాలని అనుకుంటున్నారు..పెద్దగా రాజకీయ పలుకుబడి లేనివాడిని..డబ్భులు లంచంగా ఇచ్చుకోలేను..అందుకని ఈ స్వామివారి పాదాలు పట్టుకుందామని వచ్చాను..స్వామివారిదే భారం అని అనుకున్నాము..నేను ఆందోళన చెందుతూ ఉంటే..తాను కూడా నాతో పాటు బాధపడుతూ ఉన్నది..వచ్చే వారంలో చివరి రిపోర్ట్ ఇస్తారు..అందుకని మళ్లీ వచ్చాము.." అన్నారు..


"శరణాగతి చెందితే స్వామివారు తప్పక కరుణిస్తారు.." అని చెప్పాను.."అదే నమ్మకం తో ఉన్నామండీ..." అన్నారు..ప్రక్కరోజు శుక్రవారంనాడు మళ్లీ ఒకసారి స్వామివారి సమాధి దర్శించుకున్నారు..ఆరోజు మధ్యాహ్నం వెళ్లిపోయారు..మరో వారం గడిచింది..ఆ తరువాత శనివారం మధ్యాహ్నం ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చారు.."ప్రసాద్ గారూ..పోయిన వారం నా మీద చివరి రిపోర్ట్ రాస్తామని చెప్పిన అధికారి బదిలీ అయ్యారండీ..కొత్తగా ఇంకా ఎవరూ రాలేదు..హఠాత్తుగా ఇలా ఎలా జరిగింది అని మా ఆఫీస్ వాళ్ళు అనుకుంటున్నారు..ప్రస్తుతానికి సమస్య వాయిదా పడింది..అది తీరిపోతే నాకు శాంతి గా వుంటుంది.." అన్నారు..ఆరెండురోజులు స్వామివారి మందిరం వద్దే వుండి..వెళ్లారు..ఆ తరువాత మూడు శని ఆది వారాలు ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చి..స్వామివారి సమాధి వద్ద వేడుకొని వెళ్లారు..మరో పదిరోజుల తరువాత..ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చారు..పల్లకీసేవ తరువాత..నా వద్దకు వచ్చి.."ప్రసాద్ గారూ..అన్నివిధాలా నాకు అనుకూలంగా రిపోర్ట్ రాసారండీ..బదిలీ అయిన ఆఫీసర్ స్తానం లో వచ్చిన ఆయన..అన్నివిధాలా విచారించి..నామీద ఆరోపణలు ఏవీ ఋజువు కాలేదని తన రిపోర్ట్ లో రాసి పంపారండీ..పైగా..మీకు అనుకూలంగా నివేదిక ఇచ్చాము అని నాతో చెప్పారు..ఎంతో ఆనందం వేసింది..ఎంతో మానసిక క్షోభ అనుభవించాము..స్వామివారి దయవల్ల అది తీరిపోయింది..మీరన్నది నిజమే.."శరణాగతి చెందితే..స్వామివారు కరుణిస్తారు.. అది సత్యం"..అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు..


"ఈ వయసులో ఆ దంపతుల మనోవేదన రూపుమాపారు..స్వామివారి కరుణ కు శరణాగతి చెందిన ప్రతి ఒక్కరూ పాత్రులే..!!"


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

*2 రాష్ట్రాలు. 2 GOలు

 *2 రాష్ట్రాలు. 2 GOలు. ఒకటే లక్ష్యం - ఆయుధ పూజ*


I.N.D.I కూటమి పార్టీల మధ్య వందల విభేదాలు ఉండవచ్చు, కానీ వారు ఈ భారతదేశ సంస్కృతిపై ద్వేషం లో మాత్రం పక్కాగా ఒక్క లాగే స్పందిస్తారు.


దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజ అంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో పూలు, కుంకుమ, పసుపు మరియు ఇతర పూజకు అవసరమైన వస్తువులను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం మరియు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ GO లు జారీ చేశాయి.


కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఉద్యోగులు ఆయుధ పూజను అంటే ప్రభుత్వ ఫైల్స్ లేదా డెస్క్ లు లేదా ప్రభుత్వ వాహనాలు వాటికి పూజలు చేస్తూ రావడం ఆచారంగా ఉంది. వీటిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ముఖ్యమైన సాంస్కృతిక ఆచారంపై ఇప్పుడు ఇండి కూటమి తమ కత్తి ఎక్కుపెట్టింది సెక్యులరిజం పేరుతో..


....చాడా శాస్త్రి....

ఆలోచనాలోచనాలు

 ///// ఆలోచనాలోచనాలు /////      ***** అవధాన మధురిమలు *****               శతావధాని శ్రీ పళ్ళె పూర్ణప్రజ్ఞాచార్యులు.               సమస్యాపూరణములు ;---    1* "" అత్తకోడండ్ర కేనాఁడు హత్తెఁజెలిమి."" పూరణము ;----"తే.గీ. చాల ధనమున్న వానికి చదువు నాస్తి / డంబుగల పండితునకొ! యన్నంబు సున్న / కారణంబేమియని యడుగంగ నేల / అత్త కోడండ్ర కేనాఁడు హత్తెఁ జెలిమి?                                2* "" రామరాజ్యాన నెపుడుఁబోరాటె ప్రజకు.""      పూరణము;--- "తే.గీ. నా వయిపుఁ జూచె రాముండు నన్నుఁ బిలిచె / నేనె రామున కిష్టుఁడ నేనె ప్రియుఁడ / నేనె నే నేనె నేనె నే నేనె యంచు / రామరాజ్యాన నెపుడుఁబోరాటె ప్రజకు."        3* ""కన్యనుగూడు భాగ్యమదిగల్గుట యెంతటి వారికో తుదిన్."" పూరణము;---- "ఉ. ధన్యులు గాంగతీరము సదా నిలయంబుగనుండువారు, సా / మాన్యులు గంగ గంగ యను మాత్రనఁ బాపవిముక్తులౌదురే / మాన్యఁ దలన్ ధరించె శశిమౌళి తథా విధ విష్ణుపాదజన్ / గన్యను గూడు భాగ్యమదిగల్గుట యెంతటి వారికో తుదిన్."     4*"" మేకను జూచి సింగమది మ్రింగునొ! యంచుఱికెన్ భయంబునన్."" పూరణము ;---- "ఉ. ఏక శతంబు వ్యాఘ్రముల నిర్వదియొక్క గజంబులన్ ద్రుటిన్ / వే కబళించితిన్ వ్రతము వీడను మ్రింగమి నొక్క సింగమున్ / బోకుమటంచుఁ బై దుముకుపోఁ యను గడ్డము మీసలున్న యా / మేకఁను జూచి సింగమది మ్రింగునొ! యంచుఱికెన్ భయంబునన్."                     5* "" కూతురు కోడలయ్యెఁదన కూర్మి సుతుండటు పెండ్లియాడగా! "" పూరణము;---" ఉ. చేతము పల్లవింప బుధశేఖరులెల్ల నుతింప రామ భూ / నేత పురారిచాపమును నిర్దళనంబొనరింప సీత హ / ర్షాతతయై వరించె, నపుడా రఘురాముని తండ్రి కల్ల క్ష్మా / కూఁతురు కోడలయ్యెఁదన కూర్మి సుతుండటు పెండ్లియాడగా."                    దత్తపదులు;----1* "" యతి చెడె-- మతి చెడె -- గతి చెడె -- రతి చెడె "" పదములను ప్రాస స్థానములో వుంచి అందమైన పద్యం.                " చం. యతి చెడె శిష్యురాలుగ ధనాంగన యోర్తుక చెంతఁజేరుటన్ / మతి చెడె నాలతాంగి యసమానసురూపనిరీక్షఁజేసి సత్ / గతి చెడె దాని దోస్తి పెరుగంగ గ్రమంబున బ్రహ్మ విద్యపై / రతి చెడె దుష్ట సంగతి విరాగిని రాగినిగా నొనర్చెడిన్."          2* "" క్షారము -- సారము -- వీరము -- క్షీరము "" అను పదములతో సాహితీపరమగు పదములు వచ్చునట్లు ఉత్పలమాలలో పద్యం.         " ఉ. కారము క్షారశబ్దమునఁ గల్గె నలంకృతులందు నొక్కటై / సారము రాజిలున్ నవరసంబులలోఁ గడు సుప్రసిద్ధమై / వీరము పొల్చుఁ బాకముల విశ్రుతమై సులభానుభావ్యమై / క్షీరము పేరుగన్న కవిసింహుల కబ్బములందుఁగన్పడున్."    3* "" మూలము -- కూలము -- వాలము -- కాలము "" పదములతో పద్యము.                             " కం. మూలము ముఖ్యము వ్యాఖ్యకు / కూలము ముఖ్యంబు నదులకున్ దీర్ఘంబౌ / వాలము ముఖ్యము కపులకుఁ / గాలము ముఖ్యంబు సర్వ కర్మంబులకున్."                    4*"" మంటిని -- కంటిని -- వింటిని -- అంటిని "" పదములతో "" భారతార్థములో"" పద్యం.      " ఉ. మంటిని రాజు లెల్లరును మన్ననఁజేయగ రాజరాజుగా / కంటిని రాయబారమునకై యిటు వచ్చిన నిన్ను నీనుడుల్ / వింటిని, వాడి సూదిమొన వెట్టిన యంతటి నేలనేని నీ / నంటిని నాలమె శరణమంటిని జెప్పుము వారి కచ్యుతా!"                      5* ""భీమ -- అర్జున -- నకుల -- సహదేవ "" పదములతో "" రామాయణార్థముతో"" పద్యం.                                   " తే. గీ. అహితగణభీమ బలుఁడు యశోర్జునుండు / వికరుణా మరలిపునాగ నకులనిభులు / కపులు సహదేవతాంశులు కదలిరాఁగ / యనియె రామచంద్రుఁడు రణోర్వి."       (డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యా సర్వస్వం సౌజన్యంతో)                        తేది 25--10--2023, బుధవారం, శుభోదయం.

పరనింద

 *పరనింద..!*

                                ఇతరుల్ని కించపరిస్తే కలిగే నష్టాన్ని ఒక సంస్కృత కవి  ఎంత చక్కగా వివరించాడో స్వయంగా చూడండి…*


*ఒకరోజు లక్ష్మిదేవి వైకుంఠం నుంచి బయలుదేరి     కైలాసంలో   ఉన్న  పార్వతి దేవి ఇంటికి వెళ్లింది. పార్వతి ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. లక్ష్మి ఆ పరిసరాలన్నీ పరికించింది. పార్వతికి లక్ష్మికున్నంత  ఐశ్వర్యం లేదు, డాబు లేదు. పరిసరాలన్నీ సామాన్యంగా ఉన్నాయి.* 


*లక్ష్మికి  అనుకోకుండా  పార్వతిని                  ఓ ఆట పట్టించాలనే ఆలోచన కల్గింది.     "భిక్షార్థీ స క్వ యాతః?” అని చిన్న ప్రశ్న వేసింది. *


*మీ ఆయన ఎక్కడికెళ్లాడమ్మా అంటే బాగుండేది..  కాని లక్ష్మి అలా అనలేదు.   ఆ ముష్టివాడు ఎక్కడికెళ్లాడమ్మా? అంది. *


*శివుడు ఆది భిక్షువు కదా! లక్ష్మి     ఆ విషయాన్ని ఎత్తిపొడుస్తూ వెటకారంగా మాట్లాడింది.*


*పార్వతికి    ఈ ప్రశ్న చాలా బాధ కల్గించింది.     ఏ ఆడదైనా తనను ఎన్నన్నా సహిస్తుంది గాని    తన భర్తను నిందిస్తే    ఏమాత్రం  సహించలేదు కదా!   కాని ఏంచేస్తుంది.   ఇంటికి వచ్చిన అతిథిని  మందలిస్తే  బాగుండదు. అలాగని సరిపెట్టుకుని  ఊరుకోనూలేదు.  ఏదో సమాధానం చెప్పాలి.  ఏంచెప్పాలి?  కొంచెం ఆలోచించింది…*

*"సుతను బలిమఖే !"  అంది.*

*'బలి చక్రవర్తి చేస్తున్న యాగం దగ్గరకు వెళ్లారమ్మా! అని సమాధానం.*


*ఆ సమాధానం వినేసరికి లక్ష్మికి తల తిరిగి పోయింది. బలి దగ్గరకు వెళ్లిన ముష్టివాడు  తన భర్త శ్రీమహావిష్ణువు.*


*వామనావతారంలో   ఆయన బలిచక్రవర్తిని మూడడుగులు నేల అడగడం లోకవిదితమే.   'మా ఆయనకన్నా మీ ఆయనే దారుణం' అనే భావం పార్వతి మాటల్లో తొంగి చూసింది.*


*లక్ష్మి  కొంతసేపటికి  ఎలాగో తేరుకుంది.   మళ్లీ   ఏదోవిధంగా పార్వతిని  ఉడికించాలని సమాయత్తమయింది.  రెండో ప్రశ్న వేసింది.*

*’తాండవం క్వాద్య భద్రే!’ అనడిగింది.* 


*అమ్మా! మీ ఆయన ఈ రోజు నాట్యం ఎక్కడ చేస్తాడు? అని దానర్థం.*   


*మీ ఆయన ఏ పని పాట లేకుండా దిగంబరంగా నాట్యం చేస్తుంటాడని  లక్ష్మి మాటల్లోని అంతరార్థం.*


*అప్పటికే ఆరితేరిన పార్వతి వెంటనే అందుకుంది…*

*మన్యే బృందావనాంతే అంది.* 

*బృందావనంలో అనుకుంటున్నానమ్మా! అని    ఆ మాటలకర్థం.*


*బృందావనంలో  నాట్యం  చేసే ప్రబుద్ధుడు కృష్ణుడు,  శివుడు కాదు.*  


*'మా  ఆయనే కాదు   మీఆయన కూడ నాట్యం చేస్తాడు.   ఎటొచ్చీ మా ఆయన ఒంటరిగా నాట్యం చేస్తాడు. అంతే గాని మీ ఆయన లాగ అందరి ఆడవాళ్లను వెంటేసుకుని నాట్యం చెయ్యడు'  అని సమాధానం.* 


*పార్వతి సమాధానం ఇంత పదునుగా  ఉంటుందని  లక్ష్మి ఊహించలేదు.  ఆమెకు మతిపోయినంతపనయింది. ఏలాగో కుడగట్టుకుంది…*


*ఈ సారి తనకు ఇబ్బంది లేనివిధంగా మాట్లాడాలనుకుంది…*

*’క్వను చ  మృగ శిశుః’ ? అని మరో ప్రశ్న వేసింది.*  


*మీ ఏనుగు మొగంవాడు ఎక్కడమ్మా?  అని అర్థం.* 


*లక్ష్మి  కొడుకు  మన్మథుడు  చాల అందగాడు.   పార్వతి కొడుకు వినాయకుడు ఎంత అందగాడో వివరించి చెప్పనవసరం లేదు. 'మా అబ్బాయి చాల అందగాడు  మీ అబ్బాయి మాత్రం కురూపి' అని లక్ష్మి ఆక్షేపణలోని  అభిప్రాయం.*  


*పార్వతి  చాలా  నొచ్చుకుంది.  కాకిపిల్ల  కాకికి  ముద్దన్నట్లు ఎవరిపిల్లలు వాళ్లకు ముద్దు.*

*పార్వతి  మెదడులో  ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది.   వెంటనే అంది…*

*'నైవ జానే వరాహం' అంది.*

*“ఇక్కడేదో పంది  తిరుగుతూ ఉంటే దానివెంట వెళ్లాడమ్మా! ఎక్కడున్నాడో తెలీదు!" అంది.* 


*’మా  అబ్బాయిది   ఏనుగు ముఖమేగాని మీ ఆయన పూర్తిగా వరాహావతారమే సుమా!’  అని పార్వతి  సమాధానం  లోని చమత్కారం.* 


*ఇది  లక్ష్మికి దిగ్భ్రాంతి కల్గించింది. కొంతసేపటికి  ఎలాగో తేరుకుంది…*


*ఈసారి  జాగ్రత్తగా  తనకు ఎదురుదెబ్బ తగలని విధంగ పార్వతికి దెబ్బకొట్టాలనుకుంది. అటు ఇటు కాసేపు చూసింది…*

*’బాలే!  కచ్చిన్న  దృష్టః  జరఠ వృషపతిః ?’ అనడిగింది.*  


*'మీ వాహనం  అదే   ఆ ముసలి ఎద్దు  ఎక్కడా  కనబడడం లేదేమిటమ్మా?’ అని ప్రశ్న.* 


*'మాది గరుడ వాహనం!  విమానాల్లో  వలే  ఆకాశంలో తిరుగుతాం.  మీరు నేల పై తిరుగుతారు. మీ వాహనం  ముసలి ఎద్దు.  అది కదల్లేదు మెదల్లేదు'  అని ఆక్షేపం.     మేం పై స్థాయి వాళ్లం,  మీరు నేలబారు మనుషులు అని వెక్కిరింపు.*


*ఆ వెక్కిరింపు అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు పార్వతి. అందుకే  వెంటనే అందుకుంది…*

*"గోప  ఏవాస్య  వేత్తా " అంది.* *'ఆవులసంగతి ఎద్దులసంగతి గోవుల్ని  కాసేవాణ్ణి  అడిగితే తెలుస్తుంది గాని నన్నడిగితే ఏం లాభమమ్మా?  పో! పోయి,  మీ ఆయన్నే అడుగు' అని చిన్న చురక అంటించింది.* 


*మా ఆయన నడిపే వాహనాన్ని మీఆయన మేపుతాడు.  మీకంటే మేమే  ఎక్కువ  అని పార్వతి మాటల్లోని ఆంతర్యం. ఈ సమాధానానికి లక్ష్మి పూర్తిగా అవాక్కయింది. తిన్నగా జారుకుంది.*


*నిజానికి ఇదంతా వారిద్దరి మధ్య వేళాకోళంగా జరిగిన సంభాషణ.* 


*ఇతరులను అవమానపరిస్తే అది మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనే సత్యాన్ని చెప్పడానికే    ఒక కవి  లక్ష్మీపార్వతులను పాత్రలుగా చేసుకుని ఈ సన్నివేశాన్ని కల్పించాడు.*


*ఇందులో నీతి ముఖ్యం గాని,  ప్రశ్నలు సమాధానాలు ముఖ్యం కాదు. ‘వారిరువురి మధ్య జరిగిన ఈ సరసమైన  సంభాషణ మనందరిని రక్షించుగాక!’ అని చమత్కరించాడో కవి. ఇంత సరసమైన భావాన్ని తనలో దాచుకున్న ఈ శ్లోకం చదవండి…*


*భిక్షార్థీ స క్వ యాతః? సుతను బలిమఖే తాండవం క్వాద్య భద్రే ?*

*మన్యే బృందావనాంతే క్వను చ మృగశిశుః? నైవ జానే వరాహం* 

*బాలే కచ్చిన్న దృష్ట: జరఠవృష పతిః? గోప ఏవాస్య వేత్తా*

*లీలాసంలాపఇత్థం జలనిధిహిమవత్కన్యయోః త్రాయతాం నః*.

అరటిపండు రేటు ఎంత?

 ఒక విద్యుత్ శాఖా కార్యాలయం (Electricity Board branch office) బయట ఒక అరటిపండ్ల వ్యాపారి అరటిపండ్లు అమ్ముకుంటున్నాడు...


EB officer :  అరటిపండు రేటు ఎంత?


🌼వ్యాపారి : సార్, 

ఈ అరటిపండ్లు మీరు ఎందుకు తీసుకుంటున్నారో తెలిస్తే గానీ రేటు చెప్పలేను...


🌼EB officer. : యేమి మాట్లాడుతున్నావ్ నీవు, 

నేనెందుకు తీసుకుంటే నీకెందుకు..? 


🌼వ్యాపారి : లేదు సార్, 

మీరు ఈ పండు గుడికి తీసుకెళ్ళేదానికి అయితే 

పండు పది రూపాయలు,


🌼పిల్లలకోసం తీసుకున్నట్లైతే ఒకటి ఇరవై రూపాయలు...


🌼తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడానికి అయితే ఇరవై అయిదు రూపాయలు.....


🌼మీరు తినడానికి తీసుకుంటే ముప్పై రూపాయలు మాత్రమే....


🌼EB officer : రేయ్, 

ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావ్... 

ఒకటే పండు ఎలా డిఫరెంట్ డిఫరెంట్ రేట్లకి అమ్మాలనుకుంటున్నావ్...


🌼వ్యాపారి : this is my tariff plan.

యేమయ్యా.... 

మీరు మాత్రం ఒకే కరెంట్, 

ఒకే transmission system పెట్టుకుని..... 

ఇంటికి సెపరేట్, 

షాప్ కి సెపరేట్, 

ఫ్యాక్టరీకి సెపరేట్ అని,

 వాటిలో మళ్ళీ వాడకాన్ని బట్టి సెపరేట్ రేట్.... 

అడిగితే tariff అని చెప్తారు

 .. మీకో రూలు మాకో రూలా..


This is my tariff plan..


Banana vendor rocked and 

EB officer shocked.

😛😜😴 

From collections

నవగ్రహా పురాణం🪐* . *64వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *64వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*చంద్రగ్రహ చరిత్ర - 2*


*"నిజమే అనుకో..."*


*"నారదా ! ఆ చంద్రుడు మా పుత్రికకు తగిన వరుడేనా ?"* ప్రసూతి దేవి అడిగింది. 


*"పుత్రికకు - కాదు , దేవీ ! పుత్రికలకు ! ఇది నా ఆలోచనా , నా ప్రతిపాదనా కావు. మన జనకపాదులు చతుర్ముఖుల సంకల్పం. ఆయన సంకల్పాన్ని సాక్షరమూ , సార్ధకమూ చేయడమే ఈ నారదుని పని !" నారదుడు నవ్వుతూ అన్నాడు. ఇక ఆ ఆత్రేయ చంద్రుడు మన కన్యలకు తగిన వరుడేనా అన్నది మీ సందేహం ! అంత అందగాడు కాకపోతే , ఆ తార అతగాడిని ఎందుకు నెత్తికెత్తుకుంటుంది ; అతగాడికి ఒక సుకుమారుణ్ణి కంటుంది ? మీ కన్యలు ఇరవై ఏడుగురూ చక్కని చుక్కలు ! ఈ చక్కని చుక్కల మధ్య ఆ చంద్రుడిని చూసి తీరాల్సిందే !"*


*"బాగుంది ! చంద్రుడి జననీ జనకులను గౌరవించడం మన విధి. అది ధర్మం. కూడా ! చంద్రుడిని మా అల్లుడిగా స్వీకరించడానికి అత్రీ అనసూయల అనుమతీ, అమోదం తీసుకుందాం !"* దక్ష ప్రజాపతి అన్నాడు.


*"శుభస్య శీఘ్రం , నారదుడు నవ్వుతూ అన్నాడు. "మీ దంపతులు బయలుదేరండి ! మీకు తోడుగా నేనూ వస్తాను !"*


అత్రి అనసూయా దంపతులు దక్ష దంపతులకూ , నారదుడికి స్వాగతం పలికి అతిధి సత్కారాలు అందించారు. అతిధ్యం స్వీకరించిన అనంతరం దక్షుడు అత్రితో తమ రాకకు కారణం వివరించాడు. అత్రి , అనసూయా ముఖాలు చూసుకున్నారు.


*"మా చంద్రుడు గురుపత్నీ గమనంతో ధర్మం తప్పి ప్రవర్తించాడు. తల్లిదండ్రులు తలలు వాల్చుకునేలా చేశాడు. వాని మూలంగా తారకు జన్మించిన బాలుడి పోషణ భారం , విద్యాబోధన బాధ్యతా నేను స్వీకరించి , తలకెత్తుకోవాల్సి వచ్చింది !"* అత్రి కంఠంలో ఆవేదన ధ్వనించింది.


*"ఆ గతాన్ని మరిచిపొండి , అత్రి మహర్షీ !"* నారదుడు నవ్వుతూ అన్నాడు. *"తారాచంద్రుల తనయుడిగా బుధుడు ఆవిర్భవించాల్సి ఉంది. అది జరిగింది ! దక్ష కన్యలను చంద్రుని పత్నులుగా స్వీకరించడం మంచిది !”*


*"బహువచనం ఉపయోగిస్తున్నావు నారదా ?"* అత్రి మహర్షి చిరునవ్వుతో అన్నాడు. 


*"బహువచనమే ! మన చంద్రుడికి బహుపత్నీ లాభం ఉందన్నారు చతుర్ముఖులు !! నారదుడు నవ్వుతూ అన్నాడు..*


*"ఆలోచిస్తుంటే మా చంద్రుడి గతాన్నీ , వర్తమానాన్నీ , భవిష్యత్తునూ నియంత్రిస్తోంది. ఆ చతుర్ముఖులేనేమో అనిపిస్తుంది , నారదా!"* అత్రి నవ్వుతూ అన్నాడు.


*"ఆ విషయంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. ఆ బ్రహ్మదేవుల అంశే కదా. నా గర్భాన చంద్రుడిగా జన్మించింది !"* అనసూయ నవ్వుతూ ప్రసూతితో అంది.


*"మా కన్యలను మీ దంపతుల కోడళ్ళుగా చేయమని నారదుడి ద్వారా ఆ చతుర్ముఖులు సూచించారు. అనసూయా !"* ప్రసూతి అంది. 


*"ఇరవై ఏడుగురు కన్యలు..."* అనసూయ సాలోచనగా అంది. *"మంచిదే చంద్రుడికి ఇంక పరసతుల గురించి ఆలోచించే తీరిక కూడా చిక్కదు. సతీ సైన్యం చుట్టు ముట్టి ఉంటుంది !"*


అనసూయ మాటలకు అందరూ నవ్వారు.


*"దక్షప్రజాపతీ ! మీ అభిప్రాయం , మా అభిప్రాయం ఒక్కటయ్యాయి. కళ్యాణం జరిపించండి !"* అత్రి నవ్వుతూ అన్నాడు.


*"శుభం !"* అన్నాడు నారదుడు.


అందరూ వివాహమహోత్సవం గురించి ఉత్సాహంగా చర్చించుకుంటూ ఉంటే , - దర్భలూ , సమిధలూ పట్టుకుని బుధుడు వచ్చాడు.


*"నాయనా , బుధా ! ఇలారా ! దక్షదంపతులకూ , నారద మహర్షికి ప్రణామాలు చేయి !"* అత్రి మహర్షి బుధుడితో అన్నాడు.


బుధుడు వినయంగా ముగ్గురికీ అభివాదం చేసి , ఆశీస్సులు అందుకున్నాడు.


*"బుధుణ్ణి చూస్తుంటే , ఈ వయసులో చంద్రుణ్ణి చూస్తున్నట్టే వుంది !"* నారదుడు నవ్వుతూ అన్నాడు. *"తార నిజమే చెప్పింది ! బుధుడు చంద్ర సుతుడే !"*


అత్రిమహర్షీ , దక్షప్రజాపతి నారదుడి సమక్షంలో ముహూర్త నిర్ణయం చేశారు.


దక్షపుత్రికలు అశ్విని , భరణి , కృత్తిక , శ్రీ పాణి , మృగశిర , ఆర్ద్ర , పునర్వసు , పుష్యమి , ఆశ్లేష , మఖ , పుబ్బ , ఉత్తర , హస్త , చిత్త , స్వాతి , విశాఖ , అనూరాధ , జ్యేష్ఠ , మూల , పూర్వాషాఢ , ఉత్తరాషాఢ , శ్రవణం , ధనిష్ఠ , శతభిషం , పూర్వాభాద్ర , ఉత్తరాభాద్ర , రేవతి - ఆ శుభ ముహూర్తాన చంద్రుడి పత్నులయ్యారు.


తల్లి ప్రసూతీదేవి పనువున ఇరవై ఏడుగురు వధువులూ వెలుగుతున్న జ్యోతులున్న బంగారు పళ్ళేలు పట్టుకుని , తమ వరుని చుట్టూ వలయాకారంగా నిలబడి హారతి ఇస్తున్నారు. ఆ జ్యోతుల కాంతిలో చంద్రుడు వెలిగిపోతున్నాడు. అందరికీ కన్నుల పండువ చేస్తూ.


*"చూశారా ! చక్కని చుక్కలలో చక్కని చంద్రుడు !"* నారదుడు నవ్వుతూ దక్ష దంపతులతో అన్నాడు.


చంద్రుడు చిరునవ్వులు చిందిస్తూ , తన భార్యా బృందాన్ని ఒకరి అనంతరం ఒకరిని చూస్తూ నెమ్మదిగా గుండ్రంగా తిరుగుతున్నాడు.


దీపకళికల కాంతులు ప్రతిఫలిస్తూ తళతళలాడుతున్న అతని కళ్ళు ఒక్కసారి మెరిశాయి. గుండ్రంగా తిరుగుతున్న చంద్రుడు ఆగిపోయాడు. మెరుస్తున్న అతని కళ్ళు ఎదురుగా ఉన్న ఒక వధువు మీద తాపడం అయిపోయాయి. ఆ నవ వధువు పేరు తనకు తెలుసు. అయస్కాంతంలా తనని లాగుతున్న ఆ నవ వధువు పేరు - రోహిణి.


అత్తవారింటి నుండి పత్నీ బృందంతో చంద్రుడు తన మందిర ప్రవేశం చేశాడు. 


నవ వధువులందరూ ఒకరిని మించి ఒకరు ఉత్సాహంగా ఉన్నారు. వరసగా ప్రథమ , ద్వితీయ , తృతీయ పత్నులైన అశ్వినీ , భరణి , కృత్తికా ఆహారం సిద్ధం చేశారు. కొత్త పెళ్ళికొడుకుతో , తమ గృహంలో మొట్టమొదటిసారిగా సహ పంక్తిలో భోజనం చేయబోతున్నందుకు వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది. తల్లి తమను సాగనంపే ముందు చెప్పిన మాటలు అందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తేలా చేస్తున్నాయి.


భోజన సమయానికి ముందే ఇరవై ఆరుగురు వధువులూ , చక్కగా అలంకరించుకుని. భోజనశాలలో నిరీక్షిస్తున్నారు. వాళ్ళలో రోహిణి మాత్రం లేదు.


*"చెల్లీ , మూలా ! ఆ రోహిణి మందిరంలో ఏ మూలలో ఉందో చూడవే !"* అశ్విని నవ్వుతూ అంది. అందరూ నవ్వారు.


*"అందరికీ లేని అలసట దానికే వచ్చినట్టుంది !"* అంది మూల వెళ్ళబోతూ.


ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా చంద్రుడూ , రోహిణీ ఇద్దరూ భోజనశాలకు వచ్చారు. చంద్రుడి చెయ్యి రోహిణి నడుం చుట్టూ ఒడ్డాణంలా చుట్టుకుని ఉంది. ఇద్దరూ నవ్వుకుంటున్నారు.


చంద్రుడు తన ఇతర పత్నుల్ని కన్నెత్తి చూడనేలేదు ! రోహిణి చూసింది , అయితే చూడనట్టు నటిస్తోంది. చంద్రుడు ఒక విస్తరి ముందు కూర్చున్నాడు. రోహిణి అతని పక్కనే కూర్చుంది.


*'తమలో ఎవరెవరు పంక్తిలో కూర్చోవాలి ?'* అంటూ ఆలోచిస్తున్న ఇరవై ఆరుగురు నవ వధువుల సందేహానికి చంద్రుడి మాట పరోక్షంగా సమాధానం చెప్పింది. *"ఎవరు వడ్డిస్తారు. మాకు ?”* దూరంగా నిలుచున్న అశ్వినీ బృందాన్ని కలయజూస్తూ అన్నాడు చంద్రుడు. *"మేం భోజనం చేసి , తోటలో తిరిగి వస్తాం ! ఈలోగా మీరందరూ ఆహారం తీసుకోండి !"*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 74*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 74*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


శ్రీరామకృష్ణుల  అంతిమ రోజులను సమీపిస్తున్నారని అందరికీ అర్థమయింది. అందరూ శ్రీరామకృష్ణుల సేవలో మనఃస్ఫూర్తిగా పాల్గొన్నారు.  నరేంద్రుడు వారినందరినీ సమైక్య పరచి, అందరూ కలసి అధ్యయనం, చర్చలు, పాటలు, ధ్యానం ఇత్యాది ఆధ్యాత్మిక సాధనలు అనుష్టించసాగారు. ఒక వైపు శ్రీరామకృష్ణుల నిస్వార్థ ప్రేమ, మరొక వైపు నరేంద్రుని సోదరప్రేమ అందరినీ అక్కడ కట్టిపడేసింది.


 కొందరి మనస్సుల్లో ఒక సంకోచం ఊగిసలాడింది శ్రీరామకృష్ణుల వ్యాధి ఒక అంటువ్యాధా? బహుశా అలా అయివుంటే తమకూ సంక్రమించవచ్చు కదా అని కొందరు భయపడ్డారు. ఇది గ్రహించిన నరేంద్రుడు ఒక రోజు అందరి సమక్షంలో, శ్రీరామకృష్ణులు త్రాగి మిగిల్చిన రవ్వపాయసం తీసుకొని త్రాగేశాడు. అందులో శ్రీరామకృష్ణుల లాలాజలం కలిసింది. ఇది చూసిన తరువాత యువకుల సందేహం తీరింది.


నరేంద్రుడూ, తక్కిన యువకులూ శ్రీరామకృష్ణుల వ్యాధిని వ్యాధిగానే పరిగణించారు. కాని గృహస్థ శిష్యులయిన గిరీశ్, రామచంద్రదత్తా ప్రభృతులు ఈ వ్యాధికి ఒక అమానుష రంగు పులిమారు. శ్రీరామకృష్ణులు ఒక అవతార పురుషుడు; ఆయన సంకల్ప మాత్రానే ఈ వ్యాధిని సంక్రమింపజేసుకొన్నారు. ఏదో ఒక రోజు హఠాత్తుగా తమ దివ్యశక్తిని ప్రదర్శించి వ్యాధిని నయం చేసుకొంటారని వారు విశ్వసించారు.


కాని ఈ వ్యాధిని నిమిత్తమాత్రంగా కనబరిచారు శ్రీరామకృష్ణులు. "నా వ్యాధి నిమిత్తమాత్రమే. ఈ వ్యాధి మీ అందరినీ ఐక్యం చేసింది" అన్నారాయన. ఆ వ్యాధి కారణంగానే భక్తులందరూ ఐక్యం కాగలిగారు; వారి మధ్య ఒక అనురాగబంధం పెంపొందింది; అది భవిష్యత్ సంఘానికి ఆధారభూతమయింది.


ఈ రోజుల్లోనే నరేంద్రుని కార్యం ప్రారంభమయిందని చెప్పవచ్చు. ఒక కొత్త యుగాన్ని సృష్టించడానికి శ్రీరామకృష్ణులు ఏతెంచారు. ఇందులో నూతన చింతనలు, కొత్త మార్గాలు రూపొందుతాయని నరేంద్రుడు గ్రహించాడు. కాని తక్కినవారు దానిని గ్రహించడం కాదు కదా, అలా యోచించడం కూడా చేయలేదు. అందువలన భక్తులలో పలువురు పాత మార్గాలలోనే వెళ్లడానికి ఉపక్రమించారు. వారిని దారిలోకి తీసుకు రావడం నరేంద్రుని ప్రధానమైన పని. 


శ్రీరామకృష్ణులు ఒక రోజు హఠాత్తుగా అతీంద్రియ శక్తితో తన వ్యాధిని నయం చేసుకొంటారని నమ్మిన వారికి నరేంద్రుడు నిజాన్ని స్పష్టంచేసి, "శ్రీరామకృష్ణుల శరీరమూ పంచభూతాత్మకమయి నది, ప్రకృతి నియమాలకు లోబడింది. ఒక రోజు అది నశించే తీరాలి. కనుక హఠాత్తుగా అతీంద్రియశక్తితో ఆయన వ్యాధి నయమవుతుందని ఆశించరాదు". అని స్పష్టంగా తెలియచేశాడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 64*

  🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 64*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*అవిశ్రాంతం పత్యు ర్గుణగణ కథామ్రేడనజపా*

*జపాపుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా |*

*యదగ్రాసీనాయాః స్ఫటికదృషదచ్ఛచ్ఛవిమయీ*

 *సరస్వత్యా మూర్తిః పరిణమతి మాణిక్యవపుషా ‖*


ఓ తల్లీ

అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా = ప్రశస్తి గాంచిన నీ జిహ్వ, నీ పతి అయిన సదాశివుని త్రిపుర విజయాదులనూ, ఆయన గుణగణాలనూ నిరంతరం వల్లించటమే జపముగా కలదై,


జపాపుష్పచ్ఛాయా తవ జనని జిహ్వా జయతి సా = ఎర్రమందార పువ్వు ఛాయకు దీటైన కాంతితో ప్రకాశిస్తున్నది.


యదగ్రాసీనాయాః స్ఫటికదృషదచ్ఛచ్ఛవిమయీ సరస్వత్యా మూర్తిః = స్పటిక మణుల తెల్లని కాంతులను వెదజల్లుతున్న శరీరంతో, నీ జిహ్వాగ్రములో సుఖాసీనయై నెలకొన్న సరస్వతీదేవి


పరిణమతి మాణిక్యవపుషా = నీ యెర్రని నాలుక కాంతి సోకి, తన స్వరూపం రక్తవంతమై, మాణిక్య వర్ణాన్ని పొందుతున్నట్లు కనబడుతున్నది.


సరస్వతీదేవి నీ జిహ్వాగ్రమందుండి, తన పద్మరాగ మాణిక్యవీణ పై వేద శాస్త్ర, ఆగమ రహస్యములను పలికిస్తున్నదని భావము.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

Jeevan mukthm


 

Balanitis


 

మొండి నడుము నొప్పి నివారణకు

 అతి భయంకరమైన , మొండి నడుము నొప్పి నివారణకు నేను ప్రయోగించిన ప్రాచీన యోగం - 


    ఎండు ఖర్జురాలు తీసుకుని ఒక వైపు నుంచి రంధ్రం చేసి లొపలి విత్తనము తీసివేసి లొపల ఖాళి ప్రదేశంలో తెల్ల గుగ్గిలం పొడి నింపి గోధుమ పిండి తడిపి ముద్దలా చేసి ఆ రంధ్రం మూసివేసి అదేవిధంగా  కాయ పైన కొంచం మందంగా తడి గొధుమ పిండితో పట్టులా వేసి కర్రబొగ్గుల నిప్పుల పైన వేసి కాల్చి బయటకి తీసి చల్లారిన తరువాత పైన మాడినటువంటి గొధుమ పిండిని తీసివేసి బాగా ఉడికిన ఖర్జురాల్ని బాగా నూరి శనగగింజలు అంత మాత్రలు చేసి రెండు పూటలా ఆహారానికి ముందు నీటితో ఇచ్చాను . 


      అలాగే నువ్వుల నూనె ఒక స్పూన్ తీసుకుని దానిలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి బాగా వ్రేలితో కలిపినప్పుడు తెల్లటి ద్రవం లా మారిన తరువాత ఆ ద్రవంతో పై నుంచి కిందికి ఒక పది నిమిషాలు మర్దన చేయించాను . 


       కేవలం 40 రోజుల్లొ మార్పు వచ్చింది.


 గమనిక  - 


      కొంతమంది తెల్ల గుగ్గిలం బదులు గవ్వపలుకు సాంబ్రాణి అని చెప్తున్నారు . దానిని ఈ యోగంలో ఉపయోగించటం వలన నొప్పి నివారణ కాదు. 


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

          9885030034  


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


        కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


           9885030034

మామ తో పద్యం

 Ch. Satyanarayana: మామ తో  పద్యం !

---------------------------- 

        

  ఉ:  మామను  సంహరించి , యొకమామను  గర్వమడంచి ,యన్నిశా


                 మామను  రాజుఁ  జేసి ,  యొకమామ తనూజున కాత్మ  బంధువై,


                మామకుఁ  గన్నులిచ్చి , సుతు మన్మధునింతికి   తానె  మామయై ,


                 మామకు  మామ యైన ,పరమాత్ముడు   మీకుఁ బ్రసన్నుఁడయ్యెడిన్;


                       చాటువు--- అజ్ఙాత కర్తృకము;


                          పద్యమంతా  మామలతో  నిండిపోయింది. శ్రీమన్మహా  విష్ణువే  యిన్ని  మామలకు మూలము. అదెలాగో  తెలిసికొందాము.


                 కృష్ణావతారంలో  దుష్టుఁడైన కంసుని  సమహరించాడు.  అదీ మామను సంహరించటం. ఇఁక రామావతారంలో  రావణ సంహారంకోసం  లంకకు వెళ్ళేప్రయత్నంలో  అడ్డుగా ఉన్న సముద్రునిపై  బాణంయెక్కుపెట్టి  బెదిరించాడు. సముద్రుడు పిల్లనిచ్చిన  మామగదా , పాపం ఆవిధంగా అల్లునిచేత భంగపడినాడు. ఒకమామను గర్వమడంచటం అదీ. చంద్రుడు  నిశామామ రాత్రికి ప్రభువు.

 (బావమరది) అతనిని  రాజుగా చేశాడట! చంద్రునకు రాజు అనేపేరుకూడా ఉంది.  పాండురాజు కుంతికి భర్త ఆవిధంగా ఆయన మామ  పాండుకుమారుడైన  అర్జునునితో   విడదీయలేని స్నేహం కృష్ణావతారంలో " ఒకమామతనూజున కాత్మ బం

[25/10, 5:20 am] Ch. Satyanarayana: అదీ.


                      మామకుఁగన్నులిచ్చి. రాయబారియై  ద్రుతరాష్ట్రుని  సభకు వచ్చినపుడు  సంధిమాటలు వినకపోగా దుర్యోధనాదులు

కృష్ణుని బంధింపఁ జూచారు. ఆసమయంలో కృష్ణుడు విశ్వరూపం ప్రదర్శించాడు.ద్రుతరాష్ట్రుని ప్రార్ధనమేరకు  అతనికి  కన్నులిచ్చి విశ్వరూపాన్ని చూచే భాగ్యాన్ని ప్రసాదించాడు.  అదీ మామకు కన్నులీయటం. విష్ణువు కుమారుడు మన్మధుడు, మన్మధుని భార్యరతి  ఆమెకు మామయైనాడట. అంతేగాదు  చివరి విచిత్రాన్ని  వినండి. గంగ విష్ణువుయొక్క పాదంనుండి పుట్టింది. కాబట్టి యామె విష్ణువు కుమార్తె. ఆమెను సముద్రున కిచ్చాడట. (గంగాప్రవాహము చివరకు సముద్రమున కలుస్తోంది)  అదిగో  ఆవిధంగా తనకు పిల్లనిచ్చిన  సముద్రునకు తనకుమార్తె గంగ నొసగి  మామగారికి  మామయైనాడట!  అట్టిహరి మీకు ప్రసన్నుడగుగాక! యని కవిగారి దీవెన!


                  కవిత్వం మంటే  యేమిటి?  ఉక్తిచాతుర్యమే!  ఆఉక్తి చాతుర్యమే  చమత్కారం.!


                             మాటల మాటున యీచాటు పద్యంలో  కవి మామతో యెంత చమత్కారం చేశాడో  చూశారుగా!!!


                               

                                                                        స్వస్తి!

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం  - ఏకాదశి -  శతభిషం -సౌమ్య వాసరే* (25.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/AfKkoVUwGvQ?si=WVkT0QTooU8nfkBv



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మోక్ష సాధన లో

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...  


*మోక్ష సాధన లో మొదటి మెట్టు..*


*(ఏడవ రోజు)*


శ్రీ స్వామి వారికి పదమూడు యేండ్లు వచ్చేసరికి కుటుంబసభ్యులకు ఆయన తత్వం అర్ధం కాసాగింది..ఈ బాలుడికి భక్తి మీద అనురక్తి వుందికానీ చదువు మీద ధ్యాస లేదని..ఆ వయసులోనే మాంసాహారం విడిచిపెట్టేసారు..కేవలం సాత్వికాహారం భుజించడం అలవాటు చేసుకున్నారు..కానీ..కాషాయం కట్టిన ప్రతి వారి దగ్గరా ఆధ్యాత్మిక బోధ చేయమని  అడగటం ప్రారంభించారు..అప్పుడు శ్రీ స్వామివారి పెద్దన్నయ్య గారు, దగ్గరకు పిలచి..కనపడ్డ ప్రతి వాడూ గురువు కాదనీ..ముందుగా దైవాన్ని ప్రార్ధించడం అలవాటు చేసుకోమని..మృదువుగా చెప్పారు..ఈ మాటలు శ్రీ స్వామివారి కి సూటిగా తగిలాయి..


ఎర్రబల్లె గ్రామం లోనే బాల్య వితంతువైన "యల్లకర లక్షమ్మ" అనే వృద్ధురాలు నిరంతర దైవ నామ స్మరణలో కాలం గడుపుతూ ఉండేది..ప్రతి నిత్యం నిష్ఠతో పూజ చేసేది..ఆధ్యాత్మిక గ్రంథాలలోని సారాన్ని గ్రహించిన లక్షమ్మ అహంకార రహితంగా  నిరాడంబరంగా జీవనం సాగించేది..ఆమె దృష్టిలో శ్రీ స్వామివారు పడ్డారు..మొదట కొంతకాలం పాటు శ్రద్ధగా ఈ బాలుడి గురించి పరిశీలించింది..ఆవిడకు ఈ బాలుడు సామాన్యుడు కాదనీ..సాక్షాత్తూ ఆ దత్తాత్రేయుడి అంశ ఇమిడినట్లుగా వున్న ఒకానొక దైవకళ ఇతనిలో ఉట్టిపడుతోందనీ గమనించింది..శ్రీ స్వామివారిని చేరదేసింది..శ్రీ స్వామివారికీ..తాను తల్లి ఒడిలోకి చేరినట్లు భావించారు..


మోక్ష సాధనకు ఆచరించవలసిన మార్గాలను లక్షమ్మ గారు శ్రద్ధతో శ్రీ స్వామివారికి బోధించింది..శ్రీ స్వామివారు తాను చెప్పిన విషయాలను ఆకళింపుచేసుకోవడమూ..ఒక్కమారు వినగానే హృదయస్తం చేసుకోవడమూ..తనకున్న అనుమానాలను వినయపూర్వకంగా అడిగి జవాబు తెలుసుకోవడమూ..చూసిన లక్షమ్మ గారికి..తన ఊహ సరైనదేనని..ఇక ఎక్కువ కాలం ఉపేక్షించుకుండా ఈ బాలుడిని సరైన ఆశ్రమం లో చేర్పించి..మరింతగా సాధన చేయిస్తే..అతను గురు స్థానం పొందుతాడనీ...అని నిర్ణయానికి వచ్చి..శ్రీ స్వామివారి కుటుంబ సభ్యులతో ఆమాటే చెప్పింది..


ఈ లోపల శ్రీ స్వామివారు రోజూ ధ్యానం చేయడం ప్రారంభించారు..తనకనువైన ప్రదేశం కనబడగానే..ధ్యానం లోకి వెళ్లిపోవడం మొదలెట్టారు..అది నిముషాలు కావొచ్చు..గంటలు కావొచ్చు..అలా నిశ్చలంగా కూర్చుండిపోయేవారు..ఎర్రబల్లె గ్రామస్థులలో కొందరు హేళన కూడా చేయసాగారు..శ్రీ స్వామివారు అవేమీ తనకు పట్టనట్టు వున్నా..కుటుంబసభ్యులకు మనస్తాపం కలుగుతుంది కదా..అప్పుడే లక్షమ్మ గారు, తన సలహాను శ్రీ స్వామివారి అన్నయ్యకు చెప్పారు..


చక్కటి రూపం తో ఉన్న తమ పిల్లవాడిని..సన్యాసిగా మార్చడం ఎవరికి ఇష్టం ఉంటుంది?..కానీ..ఈ బాలుడేమో అటు వ్యవసాయానికి..ఇటు చదువుకూ..రెండింటికీ పనికిరాకుండా పోతున్నాడు..సరే ఆఖరి ప్రయత్నంగా మెట్రీక్ పరీక్షకు కూర్చోబెడదామని..అది పాస్ అయితే..పై చదువులు చదివించి..తమ దారిలోకి తెచ్చుకుందామని అనుకుని..శ్రీ స్వామివారితో ఆమాటే చెప్పారు..తనకు ఈ లౌకిక చదువులమీద ఆసక్తి లేదనీ..తన మార్గం వేరనీ..తెగేసి చెప్పేసారు..లక్షమ్మ గారి సలహా ప్రకారం తానొక ఆశ్రమం లో చేరి..తన ఆధ్యాత్మిక సాధన ను మెరుగుపరచుకొని..మోక్ష మార్గాన్ని చూసుకుంటానని ఖరాఖండిగా తేల్చేసారు!..


ఇప్పటికిప్పుడు ఈ బాలుడిని అక్కున చేర్చుకునే ఆశ్రమం ఎక్కడ ఉంది?..ఈ ప్రశ్నకు కూడా లక్షమ్మ గారే జవాబు చూపించారు..శ్రీ కాళహస్తి సమీపంలోని "ఏర్పేడు" లోగల "వ్యాసాశ్రమం" లో చేర్చమని చెప్పారు..సరే నన్నారు..


వ్యాసాశ్రమంలో అడుగు పెట్టారు శ్రీ స్వామివారు..ఇంతకాలం ధ్యానం కోసం అటూ ఇటూ తిరిగిన శ్రీ స్వామివారికి..ఆ వ్యాసాశ్రమం తనకోసమే నిరీక్షిస్తున్నట్లు తోచింది..మనసులో తాను చేరవలసిన చోటుకే చేరాననే సంతోషం కలిగింది..ఇది తన ఆధ్యాత్మిక జీవన యానం లో మొదటి మజిలీ అని నిశ్చయనికొచ్చారు..తనకు ఈ మార్గం చూపిన లక్షమ్మ గారికి మనసారా నమస్కారం చేసుకున్నారు...


ఆశ్రమవాసం..ఆధ్యాత్మిక శిక్షణ!...రేపు...


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380. & 99089 73699).

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 *శ్లో"    చిత్రం వటరోర్మూలే వృద్ధా:*

*శిష్యా గురుర్ యువా !*

       *గురోస్తు మౌనం వ్యాఖ్యానం* 

*శిష్యాస్తు చిన్నసంశయా: !!*


_- *శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం - ధ్యాన శ్లోకము* _- 03


 *భా: ఆహా! ఎంత ఆశ్చర్యకరం! యువకుడైన గురువుచుట్టూ వృద్ధులైన శిష్యులు శ్రద్ధాభక్తులతో కూర్చొని ఉన్నారు. గురువు తన మౌనంతోనే వారి సర్వసందేహాలనూ నివారింపగలుగుతున్నారు.*


*శ్రీ దక్షిణామూర్తికి నమస్కృతులు*. 


🧘‍♂️🙏🪷 ✍️🙏

హిందువులు

 దయచేసి హిందువులు సన్నాసులు,చవటలు,దద్దమ్మలు,ఉత్త స్వార్థపరులు అనిపించుకోవద్దు. ఉద్యమించండి.లేకపోతే ఇప్పటవరకూ ఎలాగున్నా ఇప్పుడు అణగదొక్కబడడం ఖాయం. తస్మాత్ ఓహిందూ! జాగృత.

తెలంగాణ లో లక్షలాది రోహింగ్యాలకు రాష్ట్ర పౌరసత్వం ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వానికో,కర్ణాటక మొదలైన కాంగ్రెసు పాలిత రాష్ట్రాలలో ముస్లింలు, క్రైస్తవుల కు వరాలిస్తూ హిందువుల ను అణచివేస్తున్న కాంగ్రెస్ పార్టీ కో, ఆంధ్ర ప్రదేశ్ లో ముస్లిం ముల్లాలకూ,క్రైస్తవ పాస్టర్ లకూ గౌరవ వేతనాలరూపంలో హిందూ దేవాదాయాన్ని దోచిపెడుతున్న వైకాపాకో ఇస్లామిక్ బ్యాంకు పెడతానని మ్యానిఫెస్టో ప్రకటించి నలభై దేవాలయాలను,గోశాలలను కూల్చిన తెదేపా కో వోట్లు వేయకుండా గెలవదని నమ్మకం ఉన్నప్పటికీ *భాజపా* కే వోట్లు వేయాలని నిర్ణయించడమే కాక తప్పకుండా వోట్లు వేస్తే చాలు,అదే మహోద్యమమై హిందూస్థాన్ లో హిందువుల కు రక్షణ కల్పించగలదు. వరాలను భాజపా ఇతర పార్టీ లకంటే ఖచ్చితంగా ఎక్కువగా నే ఇస్తోంది, ఇస్తుంది అది గుర్తించడానికి ప్రయత్నాలు చేయండి., బాధ్యతాయుతంగా వోట్లు వేయండి, వేయించండి. జైహింద్

పని చేయకుండా

 శ్లోకం:☝️

    *ఆస్తే భగ ఆసీనస్య-*

*ఊర్ధ్వస్తిష్ఠతి తిష్ఠతః ।*

    *శేతే నిపద్యమానస్య*

*చరాతి చరతో భగశ్చరైవేతి ॥*


భావం: పని చేయకుండా కూర్చున్న వ్యక్తి యొక్క భాగ్యం కూడా కూర్చుండిపోతుంది. నిలబడి ఉన్న వ్యక్తి యొక్క భాగ్యం అలాగే నిలబడి ఉంటుంది. నిద్రిస్తున్న వ్యక్తి యొక్క భాగ్యం అలాగే నిద్రపోతుంది మరియు నడుస్తున్న వ్యక్తి యొక్క భాగ్యం కూడా నడవడం ప్రారంభిస్తుంది. అంటే, భాగ్యం, అదృష్టం పని ద్వారా మాత్రమే కలుగుతాయి.

పంచాంగం 25.10.2023

 ఈ రోజు పంచాంగం 25.10.2023  Wednesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష: ఏకాదశి తిధి సౌమ్య వాసర: శతాభిషా నక్షత్రం వృద్ధి యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి మధ్యాహ్నం 12:31 వరకు.

శతభిషం మధ్యాహ్నం 01:28 వరకు .

సూర్యోదయం : 06:15

సూర్యాస్తమయం : 05:44

వర్జ్యం : రాత్రి 07:20 నుండి 08:48 వరకు.

దుర్ముహూర్తం : పగలు 11:37 నుండి 12:22 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00  నుండి 01:30 వరకు 


యమగండం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.  



శుభోదయ:, నమస్కార:

పూజాకార్యక్రమాల సంకల్పము.

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు 

ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ. 25.10..2023

 బుధ వారం ( సౌమ్య వాసరే) 

*************

 గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ  సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

___________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

ఆశ్వయుజ మాసే శుక్ల పక్షే ఏకాదశ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

సౌమ్య వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు

 శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  ఆశ్వయుజ మాసే  శుక్ల పక్షే ఏకాదశ్యౌపరి ద్వాదశ్యాం

సౌమ్య వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.59

సూ.అ.5.31

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 


శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

ఆశ్వయుజ మాసం 

శుక్ల పక్షం ఏకాదశి ఉ. 10.24 వరకు.  

బుధ వారం. 

నక్షత్రం శతభిషం మ. 12.29 వరకు.


అమృతం ఉ. 7.16 వరకు. 

పునరమృతం తె.3.22 ల 4.51 వరకు. 

దుర్ముహూర్తం ప. 11.22 ల 12.08 వరకు.

వర్జ్యం రా.6.26 ల‌ 7.55 వరకు .

యోగం వృధ్ధి ప. 12.09 వరకు. 

కరణం భద్ర మ.10.24 వరకు.

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం మ.12.00 ల 1.30 వరకు. 

గుళిక కాలం ఉ. 10.30 ల 12.00  వరకు. 

యమగండ కాలం ఉ. 7.30 ల 9.00 వరకు. .

.***********

పుణ్యతిధి ఆశ్వయుజ శుధ్ధ ద్వాదశి. 

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

Sachivalayanagar,

Vanasthalipuram,

Rangareddy Dist, 500 070,

80195 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏