15, ఆగస్టు 2020, శనివారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*




*అష్టమ స్కంధము - పండ్రెండవ అధ్యాయము*

*శ్రీమహావిష్ణువు యొక్క మోహినీరూపమును జూచి, పరమశివుడు మోహితుడగుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శ్రీబాదరాయణిరువాచ*

*12.1 (ప్రథమశ్లోకము)*

*వృషధ్వజో నిశమ్యేదం యోషిద్రూపేణ దానవాన్|*

*మోహయిత్వా సురగణాన్ హరిః సోమమపాయయత్॥6766॥*

*12.2 (ద్వితీయ శ్లోకము)*

*వృషమారుహ్య గిరిశః సర్వభూతగణైర్వృతః|*

*సహ దేవ్యా యయౌ ద్రష్టుం యత్రాస్తే మధుసూదనః॥6767॥*

*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! శ్రీహరి స్త్రీ రూపమును ధరించి,  అసురులను మోహింపజేసెననియు, దేవతలకు అమృతమును పంచియిచ్చెననియు పరమశివుడు వినెను. అంతట ఆయన పార్వతీదేవితో సహా వృషభమును అధిరోహించి, భూతగణములతో పరివృతుడై విష్ణులోకమునకు వెళ్ళెను.

*12.3 (మూడవ శ్లోకము)*

*సభాజితో భగవతా సాదరం సోమయా భవః|*

*సూపవిష్ట ఉవాచేదం ప్రతిపూజ్య స్మయన్ హరిమ్॥6768॥*

భగవంతుడైన శ్రీహరి సాదరముగా గౌరీశంకరులకు స్వాగత సత్కారములు నెరపెను. అప్పుడు పరమేశ్వరుడు దరహాసమొనర్చుచు గౌరవపూర్వకముగా  శ్రీహరితో ఇట్లు  వచించెను.

*శ్రీమహాదేవ ఉవాచ*

*12.4 (నాలుగవ శ్లోకము)*

*దేవదేవ జగద్వ్యాపిన్ జగదీశ జగన్మయ|*

*సర్వేషామపి భావానాం త్వమాత్మా హేతురీశ్వరః॥6769॥*

*శ్రీమహాదేవుడు ఇట్లనెను* దేవదేవా! నీవు సమస్త విశ్వమునందును వ్యాపించిన జగదధీశ్వరుడవు. జగత్స్వరూపుడవు, సమస్త చరాచర  ప్రాణములకు మూలకారణము నీవే. నీవు అందరికిని ప్రభుడవు, ఆత్మవు.

*12.5 (ఐదవ శ్లోకము)*

*ఆద్యంతావస్య యన్మధ్యమిదమన్యదహం బహిః|*

*యతోఽవ్యయస్య నైతాని తత్సత్యం బ్రహ్మ చిద్భవాన్॥6770॥*

ఈ జగత్తు యొక్క ఆది మధ్యాంతములు నీ వలననే జరుగుచున్నవి. కాని, నీవు ఆది మధ్యాంత రహితుడవు. శాశ్వతమైన నీ స్వరూపమునందు ద్రష్ట, దృశ్యము, భోక్త, భోగ్యము అను భేదభావములు లేవు. వాస్తవముగా నీవే సత్యము, చిన్మాత్ర పరబ్రహ్మవు.

*12.6 (ఆరవ శ్లోకము)*

*తవైవ చరణాంభోజం శ్రేయస్కామా నిరాశిషః|*

*విసృజ్యోభయతః సంగం మునయః సముపాసతే॥6771॥*

మోక్షకాములైన మహాత్ములు ఇహపరలోకములయందలి ఆసక్తిని, అన్ని కోరికలను పరిత్యజించి, నీ పాదారవిందములను ఆరాధింతురు.

*12.7 (ఏడవ శ్లోకము)*

*త్వం బ్రహ్మ పూర్ణమమృతం విగుణం విశోకమానందమాత్రమవికారమనన్యదన్యత్|*

*విశ్వస్య హేతురుదయస్థితిసంయమానామాత్మేశ్వరశ్చ తదపేక్షతయానపేక్షః॥6772॥*

నీవు అమృతస్వరూపుడవు. ప్రాకృతగుణరహితుడవు. హర్షశోకములు లేని వాడవు. స్వయముగా పరిపూర్ణుడవు. కేవలము ఆనందస్వరూపుడవు. జనన మరణాది వికారములు లేనివాడవు. నీకంటెను వేరైనది ఏదియును లేదు. కాని, నీవు అన్నింటికంటెను వేరైనవాడవు. ఈ విశ్వము యొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు పరమకారణుడవు. జీవుల శుభాశుభకర్మలకు ఫలములను ఇచ్చువాడవు నీవే. జీవుల అపేక్ష మేరకు ఈ మాటలే చెప్పబడును. కాని, నిజమునకు నీకు ఎట్టి అపేక్షలును లేవు.

*12.8 (ఎనిమిదవ శ్లోకము)*

*ఏకస్త్వమేవ సదసద్ద్వయమద్వయం చ స్వర్ణం కృతాకృతమివేహ న వస్తుభేదః|*

*అజ్ఞానతస్త్వయి జనైర్విహితో వికల్పో యస్మాద్గుణవ్యతికరో నిరుపాధికస్య॥6773॥*

స్వామీ! కార్యకారణములు, ద్వైతాద్వైతములును అన్నియు నీవే. ఆభరణముల రూపములలో ఉన్న బంగారమునకును, సహజ సువర్ణమునకును భేదము లేనట్లు భేదాభేదములు అన్నియును నీవే. నీ వాస్తవస్వరూపమును  ఎఱుగనివారు నీయందు వివిధ భేదభావములను, వికల్పములను కల్పింతురు. కారణ మేమనగ, నీయందు ఎట్టి ఉపాధులు లేకున్నను గుణములను ఆశ్రయించి, భేదములు ఉన్నట్లు ప్రతీతము అగుచుందువు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పండ్రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
**************

సర్వ శాస్త్రవేత్త –శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారు:

గురువులకు గురువు, సర్వ శాస్త్రవేత్త –శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారు:
--------------------------------------
ప్రముఖ సంస్కృత పండితులు.  సంఘ సంస్కర్త, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు.  రచయిత, సాహితీ కారులు.

దాదాపు అరవై డెబ్భై ఏళ్ళ క్రితం ఏ సంస్కృత పండితుడిని అడిగినా తాను  తాతా సుబ్బరాయ శాస్త్రి గారి శిష్యుడి నని కాలర్ –సారీ ఖండువా ఎగరేసి చెప్పేవారు.   అంతటి విఖ్యాతి వారిది. విజయనగరానికి సమీపం లో ఒంటి తాడి అగ్రహారం లో 25, జనవరి 1867 న తాతా సూర్యనారాయణావధాని, సోమి దేవమ్మ దంపతులకు సుబ్బరాయ శాస్త్రి గారు జన్మించారు.  కొడుకును శాస్త్ర పండితుడిని చేయాలనే బలీయమైన కోరిక ఉన్న వీరి తల్లిగారు కొడుకును చంకన ఎత్తుకొని దాదాపు రెండు కిలో మీటర్లు నడిచి విజయనగరం లో గురువు గారి వద్ద దింపి వచ్చేది.  అంత పట్టుదల చూపింది ఆ మహా ఇల్లాలు కుమారుని విద్యకోసం.  ఆ శ్రమ ఊరికే పోలేదు ఫలించింది.  తల్లి ఋణం తీర్చుకొన్నారు శాస్త్రి గారు.   పెరిగి పెద్ద వారైన శాస్త్రి గారు విజయనగరం లో బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద చేరి సంస్కృత సాహిత్యం అభ్యసించి ప్రావీణ్యం సాధించారు.

శాస్త్రి గారిది పాదరసం లాంటి చురుకైన బుద్ధి.  మేధావిగా పరిగణన చెందారు.  వీరి శ్రద్ధాసక్తులు, వినయం, మేధావితనం కర్ణాకర్ణీగా విన్న రుద్రాభట్ల రామశాస్త్రి, లక్ష్మణ శాస్త్రి సోదరులు సుబ్బరాయ శాస్త్రిగారిని ఆహ్వానించి, చేరదీసి, వ్యాకరణ అలంకార శాస్త్రాలు నేర్పి అసామాన్య పండితునిగా తీర్చి దిద్దారు. గొప్ప శిష్యునికోసం వెదికిన ఆ గురు సోదరులు ధన్యులు.   వారు నేర్పిన విద్య నేర్చి ఈ శిష్యుడూ గురువు గార్ల ఋణం తీర్చుకొన్నారు.

*బహు శాస్త్ర పరిజ్ఞానం* :
ధర్మ శాస్త్రం నేర్వాలన్న కోరిక కలిగి గుమ్మలూరు సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యులై ఆసాంతం అభ్యసించారు.  కొల్లూరు కామశాస్త్రి గారిని చేరి వేదాంతం అంతం చూశారు. సంగీతం మీద మోజు కలిగి కట్టు సూర్య నారాయణ గారి వద్ద సంగీత గుట్టు మట్టులన్నీ  గ్రహించారు.  ఇలా శాస్త్రి గారి బహుశాస్త్ర పరిజ్ఞానం దేశమంతా వ్యాపించి గొప్ప గుర్తింపు నిచ్చింది.  ఆంధ్ర దేశం లో ఏ శాస్త్రం లో ఏ రకమైన సందేహాలు వచ్చినా చివరికి వీరి దగ్గరకు రావాలిసిందే.  వీరి తీర్పే తుది తీర్పు, శిరోదార్యమూ అయింది.  అంతటి నిష్పాక్షపాతం గా శాస్త్రబద్ధం గా ధర్మ,  న్యాయబద్ధం గా వ్యవహరించే వారు.  గంభీర హృదయులు.  తొట్రుపాటు లేని ప్రశాంత మూర్తి శాస్త్రి గారు.

*సుదీర్ఘ విద్యాదానం –అరుదైన రికార్డు* :

ఆ నాటి మేటి పండితులలో సుబ్బరాయ శాస్త్రి గారు నాగరికులు అనిపించు కొన్నారు.  లౌకిక జ్ఞానంలోనూ అసాధారణ ప్రజ్ఞ ఉండేది.  వీటి వలననే విజయ నగర పురపాలక సంఘం లోను, సహకార సంఘం లోను సభ్యులై స్థానిక సంస్థలలో ప్రధాన సభ్యులుగా అనేక మార్లు ఎన్నుకోబడ్డారు.   అంతటి విశేష మైన మూర్తిమత్వం వారిది.  విజయనగరం రాజా వారి సంస్కృత కళాశాలలో శాస్త్రిగారు నలభై ఏళ్ళు సుదీర్ఘ కాలం ప్రధానాచార్యులుగా పని చేసి శాస్త్రాధ్యాపనం చేశారు.  ఒక రకంగా ఇదొక రికార్డే .

*గ్రంధ రచన లో మేటి:*

 భారత దేశం లో ఉత్తమ వ్యాకరణ గ్రంధంగా పరిగణింపబడుతున్న నాగశ భట్టు రచించిన ‘’శబ్దెందు శేఖరం‘’ ను ఉత్తర దేశ పండితులు ఖండించటం మొదలు పెట్టి గ్రంథాలు కూడా రాశారు.  శాస్త్రి గారు వారి వాదాలనన్నిటిని గడ్డి పోచల్లాగా తేలిగ్గా తీసి పారేసి, ఖండనలకు ప్రతి ఖండనలు చేసి నాగశ భట్టు హృదయాన్ని ఆవిష్కరిస్తూ ‘’ *గురు ప్రసాదం* " అనే మహా ఉద్గ్రంథం రాసి, నోరు మూయించారు.  ఈ గ్రంథాన్ని  ఆంధ్ర  విశ్వావిద్యాలయం గౌరవం గా ముద్రించి లోకానికి అందించింది.  దీనితో మారుమూల ప్రాంతాల వారికి కూడా శాస్త్రి గారి పాండితీ గరిమ తెలిసి శిష్యులై విద్య నేర్చుకొన్నారు.  అంతటి ప్రభావం చూపింది.  ఆ గురుప్రసాదం శిష్యుల పాలిటి వరమే అయింది.  శాస్త్రిగారు ఈ గ్రంధాన్ని ‘’స్వర సంధి" వరకు రాశారు.  శిష్యులు పేరి వెంకటేశ్వర శాస్త్రి ‘’గురు ప్రసాద శేషం ‘’ పేరిట ‘’కారకాంతం" వరకు రాసి పూర్తి చేశారు.  అంతటి గొప్ప శిష్యులను తయారు చేశారు తాతా వారు శాస్త్రి గారి అమోఘ పాండిత్యానికి వారసులుగా వీరు ఉన్నారు అనటానికి ఇది  ఒక ప్రత్యక్ష సాక్ష్యం.  దీనినీ ఆంధ్రా యూని వర్సిటీ యే ముద్రించింది. సుబ్బరాయ శాస్త్రి గారు, హరి శాస్త్రి రాసిన ‘’శ్శబ్ద రత్న‘’ వ్యాఖ్యను పరిశీలించి టీకా రాసి పరిష్కరిస్తే ఆంద్ర విశ్వ కళాపరిషత్ ప్రచురించింది .

*పురస్కార గౌరవ రికార్డ్:*

1912లో ‘’మహా మహోపాధ్యాయ" బిరుదం శాస్త్రి గారిని వరించింది.  ఆ బిరుదు పొందిన మొట్ట మొదటి వ్యక్తీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారే.  ఇదీ ఒక  రికార్డే.  ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇండియా వచ్చినప్పుడు శాస్త్రిగారిని సగౌరవం గా మద్రాస్ కు ఆహ్వానించి, తనపేరు చెక్కబడిన ‘’సువర్ణ కంకణాన్ని" స్వయం గా శాస్త్రిగారి చేతికి తొడిగి అలంకరించాడు.  ఇది ఒక భారతీయ అందునా ఆంధ్ర  దేశానికి చెందిన శాస్త్ర పండితునికి లభించిన అరుదైన గౌరవం.  ఇది మూడవ రికార్డు. విజయనగరం లోనే కాక ఉర్లాం, పిఠాపురం సంస్థాన పండిత పరీక్షలకు శాస్త్రి గారు ఎప్పుడూ ప్రధాన  పరీక్షకులుగా ఉండేవారు. ఇంతటి శాస్త్ర పండితునికి సంఘ సంస్కరణ పై మిక్కిలి అభిమానం ఉండటం ఆ రోజుల్లో ఆశ్చర్య పడే విషయం.  దురాచారాలను కాలాన్ని బట్టి మార్చుకొని సంస్కరించుకొని శాస్త్ర సమ్మతాలైన వానిని అనుసరించాలని ఎప్పుడూ ప్రబోధించేవారు.  మహాత్ముని ఖద్దరు వస్త్ర ధారణ, వీరిపై ప్రభావం చూపింది.  నిత్యం సన్నని పొందూరు ఖద్దరు వస్త్రాలే జీవితాంతం ధరించే వారు .

 *శాస్త్ర వాద తీర్పరి* :

ఆంధ్ర సాహిత్య పరిషత్తు సమావేశానికి ఒకసారి అధ్యక్ష స్థానంలో ఉండి ఆంధ్ర భాష ఔన్నత్యం కోసం మార్గ నిర్దేశం చేస్తూ చేసిన ప్రసంగం మహోపన్యాసం అనిపించింది.  రాజమండ్రి శ్రోత్రియ మహాసభ, విశాఖ జ్యోతిశ్శాస్త్ర సభలలో పండితులు చేసిన చర్చోప చర్చలకు శాస్త్రి గారినే ఉభయ పక్షాల వారు  "తీర్పరిగా" ఉండమని వేడుకోవటం, శాస్త్రి గారి సర్వతోముఖ ప్రతిభకు, నిష్పాక్షికతకు నిలువెత్తు నిదర్శనం.  శాస్త్రిగారు కాశీ, దర్భంగా, పుదుక్కోట వగైరా సంస్థానాల ను దర్శించి శాస్త్ర చర్చలు జరిపి పండితులను ఓడించి గెలిచి "జయపత్రాలు"  అందుకొన్నారు.  శాస్త్రవాదాల లో అగ్రగణ్యులని గుర్తింపు పొందిన కాశీ పండితుడైన ‘’జయ దేవ మిశ్రా పండితుడు" సుబ్బరాయ శాస్త్రి గారి పేరు విన్నంతనే, అమాంతం ‘’రెండు చేతులు జోడించి’’ నమస్కరించే వారట.  అంతటి మహోన్నత పండితులు మన సుబ్బరాయ శాస్త్రి గారు.

శాస్త్రి గారి 63 వ జన్మదినోత్సవం నాడు శిష్య, ప్రశిష్య బృందం  ఆత్మయ పండిత సాహితీ బృందం అందరూ కలిసి మహా వైభవంగా గురు పూజోత్సవం  జరిపి కృతజ్ఞతలు తెలియజేసుకొని ఘనంగా సన్మానించి గౌరవించి చిరకీర్తిని  ఆర్జించారు.

ఆయన వితంతు పునర్వివాహాలను సమర్థించారు. అంటరానితనాన్ని వ్యతిరేకించారు.

మహా మహోపాధ్యాయ గురువులు శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రిగారు 77 సంవత్సరాలు శాస్త్ర సింహులుగా, ఓటమి ఎరుగని పండితులుగా, బహు గ్రంధకర్తగా జీవించి 1944 లో కీర్తిశేషులు అయ్యారు.

రసజ్ఙభారతి సౌజన్యంతో-
చిర్రావూరి శివరామకృష్ణశర్మగారు.
*********************

*స్నేహం అనగా*

"దర్శనే స్పర్శనే వాపి
 భాషణే భావనే తథా
 యత్ర ద్రవత్యంతరంగం
స స్నేహః ఇది కథ్యతే"

***************************
తే.గీ.
ఎవ్వరిని చూడ,‍‌ తాకగ, నెంత సేపు
నెవ్వరిని గూడి పలుకగ నెంత సేపు
నెవ్వ రతని భావనసేయ నిబ్బడిల్లి
మనసు పులకించు నతడెపో  మంచి చెలుడు.
**************

*ఇడ్లీలు - బ్రహ్మానుభూతి*

తిరుచిరాపల్లి భిక్షందర్ దేవాలయలో ఉండే మా మావయ్య కీర్తిశేషులు శ్రీ సుందరేశ్వర అయ్యర్ ఒకసారి తిరువణ్ణామలై వెళ్లారు. దేవాలయంలో దర్శనం చేసుకుని రమణ మహర్షుల దర్శనం కోసం రమణాశ్రమానికి వెళ్లారు. బహుశా 1940 లేదా 1945 సమయం అప్పుడు అనుకుంటా. భగవాన్ రమణుల గురించి ఎంతో విన్నారు కానీ వారిని మొదటిసారిగా దర్శించుకోబోతున్నారు. భగవానులు అందరితో కలసి ఫలహారము, భోజనం చెయ్యడం చూసి ఆశ్చర్యపోయారు. రమణులు ఇడ్లీలు తినడం చూసి అమితాశ్చర్యానికి లోనయ్యారు.

భగవాన్ రమణులు భక్తులకు దర్శనం ఇవ్వడానికి హాలులోకి రాగానే, మా మావయ్య కూడా అందరితోపాటు కూర్చున్నారు. అప్పుడు మా మావయ్యకి ఒక ఒళ్ళు జలదరించే అద్భుతం జరిగింది. రమణుల కళ్ళు మా మావయ్య కళ్ళతో కలిశాయి. వెంటనే మా మావయ్య శరీరం తేలిక అయ్యింది. చాలా ఆనందం కలిగింది. వెంటనే బాహ్యస్మృతిని కోల్పోయారు. కొద్దిసేపటి తరువాత భగవాన్ రమణులు చూపు తిప్పుకోవడంతో మరలా స్మృతి కలిగింది. చుట్టూ ఏం జరుగుతోందో తెలియక, బాహ్యస్మృతి కోల్పోయి అలా ఎంతసేపు ఉన్నారో కూడా వారికి అర్థం కాలేదు. ఇదంతా వారికి చాలా గందరగోళంగా ఉంది. ఎవర్నైనా అడిగి తెలుసుకోవాలనుంది - కానీ ఎవరిని అడగాలి? చివరకు పరమాచార్య స్వామివారిని అడిగి నివృత్తి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

వెంటనే వెళ్ళి మహాస్వామి వారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారు విశ్రాంతిగా ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి, స్వామివారి పాదాలపై పడి తమ తాతగారి పేరు (శ్రీ నారాయణ అయ్యర్), తండ్రిగారి పేరు (శ్రీ గణపతి అయ్యర్), అమ్మగారి పేరు (శ్రీమతి ఈశ్వరి) చెప్పి, వారి మేనమామ గారైన శ్రీ పైంగానాడు పంచపకేశ అయ్యర్ (పరమాచార్య స్వామివారు మహేంద్రమంగళంలో చదువుకుంటున్నప్పుడు, స్వామివారికి ఋగ్వేదం బోధించినవారు) గారి పేరు చెప్పి, చివరగా తమ పేరు చెప్పి నమస్కరించారు. తరువాత వారికి కలిగిన అనుభవాన్ని చెప్పారు.

“ఇటీవలే తిరువణ్ణామలై వెళ్ళాను”

స్వామివారు చురునవ్వుతో, “స్వామీ దర్శనం చేసుకున్నావా?” అని అడిగారు.

మేమందరమూ “స్వామీ” అని కొలుచుకునే దేవుడు, భగవాన్ రమణులను “స్వామీ” అని సంబోధిస్తూ “స్వామీ” దర్శనం చేసుకున్నవా అని మా మావయ్యని అడిగారు!!!

“హా చేసుకున్నాను”

“ఏమి? ‘హా చేసుకున్నాను’ అని అంటున్నావు? ఏం జరిగింది?”
మా మావయ్య ఏదో చెప్పాలనుకుంటున్నారని, కానీ చెప్పడం సరియా? కాదా? అని శంసయిస్తున్నారని స్వామివారికి తెలుసు. అందుకనే చెప్పమని స్వామివారు ప్రోత్సహిస్తున్నారు.
మావయ్య : “లేదు... భగవానుల దర్శనం చేసుకున్నాను. దర్శనం బాగా జరిగింది. వారు అందరితో కూర్చుని భోజనం కూడా చేశారు. . .”

స్వామివారు : “అందరితోపాటు తిన్నారు . . .” ఎందుకు దీర్ఘం తీస్తున్నావు? ఎందుకంటే రమణులు ఇడ్లీలు కూడా తిన్నారని కదూ? అందుకేనా?

స్వామివారికి తెలియని విషయం ఏదైనా ఉందా? వారి సందేహాన్ని స్వామివారు గ్రహించారు.

మావయ్య : “అవును. అవును... తిన్నారు... ఇడ్లీలు తిన్నారు...!”

స్వామివారు : “కనుక నీకు అనిపించింది. ‘ఏమిటిది? కంచి మఠంలో స్వామివారు ఇడ్లీలు తినరు, కానీ ఇక్కడ రమణులు ఇడ్లీలను తింటున్నారు’ అవునా?”

మావయ్య : “అవును... స్వామీ”

స్వామివారు చిరునవ్వుతో చెప్పడం మొదలుపెట్టారు.

“రమణులు అన్నీ ఆశ్రమ పరిధులను దాటిపోయారు. వారికి మఠము, నియమము, పరిధి లేవు. కానీ ఇక్కడ అలా కాదు. ఈ మఠానికి సాంప్రదాయాలున్నాయి. నియమాలున్నాయి, హద్దులున్నాయి. మరియు నాకు వాటినాన్నిటిని పాటించి పాలించాలసిన బాధ్యత ఉంది. అందుకే ఇక్కడ ఇడ్లీలు తినరు (తమని చూపుతూ చిరునవ్వుతూ). అర్థమైందా?”

మావయ్య : “హా...” తలూపారు మా మావయ్య.

స్వామివారు : “సరే. అక్కడ ఇంకేం జరిగింది?”

మావయ్య : “మేము సాయంత్రం మహర్షుల దర్శనానికి వెళ్లాము. అప్పుడు నేను రమణుల వైపే తీక్షణంగా చూస్తున్నాను. హఠాత్తుగా వారు నావైపు చూశారు. వారి చూపు నా కళ్ళల్లోకి పడగానే, నాకు ఏదో జరిగింది. నా స్మృతిని కోల్పోయాను. నా శరీరం తేలికైపోయింది. చాలా అద్భుతమైన అనుభవం. అలా ఎంతసేపు ఉండిపోయానో నాకు తెలియలేదు. హఠాత్తుగా నాకు బాహ్యస్మృతి పొందగానే రమణులు వేరేవైపు చూస్తున్నారు...”

స్వామివారు : “అంటే, ఏం జరిగిందో నీకు తెలియదు అంటావు?”

మావయ్య : “అవును”

స్వామివారు : “అంతేకాక, ఎవరికైనా ఆ స్థితి శాశ్వతంగా ఉండిపోవాలని అనుకుంటున్నావు, కదూ?”

మావయ్య : “అవును”

స్వామివారు చిన్నగా నవ్వారు. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత నిదానంగా చెప్పనారంభించారు.

“రమణులు కొద్దిసేపు నీ మనస్సును లేకుండా చేశారు. మనస్సు లేకపోతే, మనస్సు లుప్తమయిపోతే, ఇక ఉండేది ఆనందం మాత్రమే. అటువంటి శాశ్వత ఆనందాన్ని నీకు కాస్త రుచి చూపించారు. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి వారి దర్శనం చేసుకో”

మా మావయ్య స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించి ఊరికి వెళ్ళిపోయారు. తరువాత, ఎన్నోసార్లు భగవాన్ రమణుల దర్శనం చేసుకున్నారు.

ఈ సంఘటనను మా మావయ్య ఎన్నోమార్లు చెబుతూ, ప్రతిసారీ ఆ బ్రహ్మానంద అనుభవాన్ని పొందేవారు.

--- విశి నాథన్

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
***************

విశిష్ట వ్యక్తులు

శ్రీ బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !!

వేదం 90% శాతం మంది భారతీయులకు అసలు ఆ పదం గాని, అవి ఎన్నో కూడా తెలియదు..మనం మరిచిపోయింది.. వేదాలనే కాదు.. ఒక మహా జాతి వైభావాన్ని..వేదాలు సమస్తం జ్ఞానానికి మూలం ఈ మాట నేను చెప్పటం లేదు.. విదేశీయులు చెప్తున్నారు.. జర్మనీ పార్లమెంట్ చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ చెప్తుంది..
శ్రీ బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !!
జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు" శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి"

ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా, నాలుగు రూపాల్లో అవగతమవుతుంది. ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ నాలుగు శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే. అంత అభినివేశం, ప్రతిభ ఉన్నవారుగా ఇరవయ్యో శతాబ్దంలో పేరుపొందిన వారు దండిభట్ల విశ్వనాథశాస్త్రి. అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్‌ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు!

రాజమహేంద్రవరం లో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన - ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట. తనకు తెలియదని ఆ రాయబారి అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిభట్ల విశ్వనాథశాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్పపేరు ప్రతిష్టలు రావడానికి కారణమేమిటో కూడా చెప్పారు.

తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది. జర్మనీలో కెయిజర్‌ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థికమాంద్యం నెలకొంది. ఆ యుద్ధంలో బందీలయిన వేలాదిమంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్‌. ఆయన ఆ అవమానాన్ని దిగమింగు కోలేకపోయారు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్నది ఆయన విశ్వాసం. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలని ఆయన నాజీ పార్టీ స్థాపించారు. జర్మనులను దేశభక్తితో ఉత్తేజితం చేశారు. వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు. అలాగే కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించారు.అప్పటికే సంస్కృత భాషాధ్యాయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకొన్నారు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయంలో మారణాయుధాల రహస్యాలున్నాయని ఆయన గ్రహించారు.

ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేశారు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాఞ్మయం నుంచి జర్మన్లు అబ్ధిపొందడానికి గట్టిచర్యలు హిట్లర్‌ తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాఞ్మయం నుంచి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్‌ ప్రతినిధులు ఆయనకోసం అన్వేషణ ప్రారంభించారు.

దండిభట్ల విశ్వనాథశాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ, తమ ఇంటికి వచ్చేవారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు కాదు. ఓ రోజు ఆయన విశాఖపట్నం సమీపానున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. కాలినడకన వెళ్తోన్న సమయంలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు. వాదోపవాదాలకు తావులేకుండా ఆయన్ని అక్కడినుంచి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు తీసుకువెళ్లారు. కతకత్తాలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. చివరకు ఆయన్ని జర్మనీ తీసుకెళ్లారు. దండిభట్ల జర్మనీ చేరుకొన్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తున్న తరుణం!

బాంబులు తయారుచేసి రాశులు పోస్తున్నారు. అయితే నిల్వచేసే సమయంలో ఏమాత్రం వత్తిడి కలిగినా అవి పేలిపోతుండడంతో విపరీతమైన నష్టం సంభవించింది. అలా పేలకుండా నిల్వఉంచే మార్గం వారికి తోచలేదు. దండిభట్ల విశ్వనాథశాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు. దాంతో దండిభట్ల పేరు మారు మోగింది. ఇక అప్పట్నించీ ఆయన పూజ్యపాదులయ్యారు.

తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనులకు పంచి పెట్టారు. ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తనవంతు సహకారం అందించారు. జర్మనీకి వెళ్లిపోయిన తర్వాత దండిభట్ల తిరిగి భారతదేశానికి రాలేక పోయారు.

దండిభట్ల జర్మనీకి వెళ్లిన చాలాకాలం వరకు కూడా వారి సతీమణికి మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా అందింది. అయితే చాలా కాలం తర్వాత నెలకు తొంభైరూపాయలు మాత్రమే వచ్చేవి. అంటే దండిభట్ల జీవించి ఉన్నంతకాలం ఆమెకు మూడువందల రూపాయలవంతున అంది, ఆయన మరణం తర్వాత కుటుంబపింఛనుగా తొంభై రూపాయల వంతున అందింది. మరి కొంత కాలానికి అదికూడా ఆగిపోయింది!

అంటే వారు అప్పటికే పరమపదించి ఉంటారని ఆయన మిత్రులు, శిష్యులు అభిప్రాయపడటం గమనార్హం.

దండిభట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం, రాష్ట్రం అన్నీ ఆయన్ని మరచి పోయాయి! అయితే జర్మనులు మాత్రం ఆయన్ని తమవాడుగా, మాననీయుడిగా, మహనీయుడిగా ఇప్పటికీ నిలుపుకోవడం విశేషం.

ఇప్పటికి జర్మనీలో విదేశాంగ శాఖ కార్యలయంలో, పార్లమెంట్ లో దండిభట్ల వారి చిత్రం ఉంటుంది..

అది మన జ్ఞాన సంపద, అది మన జాతి వైభవం.. అటువంటి వేదాలను, వేదా విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇప్పటికి.. గుర్తుపెట్టుకో భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యొతి..
ఇప్పుడు కూడా టాప్ అంతా విదేశంలొ
స్క్రాప్ అంతా మనదేశంలో..
పెరటిమొక్క వైద్యానికి పనికి రాదన్నట్టు మన సంస్కృతి, సాంప్రదాయ సిద్ధం గా ఉండే వేదాల విలువ పరాయి దేశం వాడు చెపితేగాని మనకు తెలియవు.. మన యోగా గురించి పాశ్చాత్యులు చెపితే గాని మనం నమ్మలేదు
మనకు వీపు ఉందనే విషయాన్ని మన వెనకవాడు చెపితేగాని మనం నమ్మే పరిస్థితి లో లేము..
మన భారతదేశ ఔన్నత్యం ను ప్రపంచానికి చాటిన ఈ మహానుభావుని గురించి చదువుతుంటే
ప్రతి భారతీయునికి ఛాతీ గర్వంతో ఓ ఇంచు పెరుగుతుంది.
(సేకరణ..)
టెలిగ్రామ్’ ద్వారా (గురుగీత) పొందాలనుకునేవారు:
HTTPS://T.ME/GURUGEETA
*****************

రామాయణమ్....31



సర్వలోకమనోహరుడైన రాముని వివాహక్రియ జరిపించండీ
ఓ ప్రభూ !ఓ మహర్షీ !
అని జనకమహారాజు వశిష్ట మహర్షిని కోరగా !
.
"రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం ప్రభో! "
.

సీతాకళ్యాణ వైభోగమే !రామ కళ్యాణ వైభోగమే!
.
అందుకు అంగీకరించిన వశిష్టమహర్షి విశ్వామిత్ర,శతానందులను ముందిడుకొని అగ్నివేదిక నిర్మించాడు.
.
తరువాత జనకమహారాజు తన కూతురు సీతను సర్వాలంకారభూషితను అగ్నిసాక్షిగా రాముని ఎదురుగా ఉంచి
.
ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా.
.
ఇదిగో! నా కుమార్తె అయిన సీత ! ఈమె నీకు సహధర్మచారిణి కాగలదు ఈమెను స్వీకరింపుము నీ చేయితో ఈమె చేయి పట్టుకొనుము (పాణిం గృహ్ణిష్వ పాణినా అనగా చేయిచేయికలుపుట ,ఇదీ మన సంప్రదాయము).
.
పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా!
ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మన్త్రపూతం జలం తదా .
.
మహాభాగ్యవంతురాలగు ఈమె నిన్ను ఎప్పుడూ నీడలా అనుసరిస్తుంది అని పలికి మంత్రపూతమైన జలము వదిలాడు జనకుడు.
.
అదేవిధంగా మిగిలిన మువ్వురు రాజకుమారులకు వివాహం జరిగింది !.
.
శ్రీ రామచంద్రుడి వివాహము ఘనంగా జరిగింది ఆ సమయంలో దేవతలు పుష్పవృష్టి కురిపించారు!
.
వివాహము అయిన తరువాత నలుగురుకొడుకులూ ముందుభార్యలతో వెడుతుండగా దశరధుడు వెనుకనుండి వారిని చూస్తూ మహదానంద పడ్డాడు.
.
సీతారాముల వివాహమయిన తరువాత అందరి వద్ద సెలవు తీసుకొని విశ్వామిత్ర మహర్షి హిమాలయాలకు వెళ్ళిపోయాడు.
.
N.B..
.
అసలు విశ్వామిత్ర మహర్షి పాత్రను ఎంత హఠాత్తుగా ప్రవేశపెట్టాడో అంతే హఠాత్తుగా ఉపసంహరించాడు వాల్మీకిమునీంద్రుడు !
ఆయన తన యాగ రక్షణ తాను చేసుకో గలడు తాటకి తాటతీయగలడు! .
కానీ !
రాబోయే రోజులలో ఎన్నో ఘనకార్యాలు చేయవలసి ఉన్న రాముడికి సకలశస్త్రాస్త్ర జ్ఞానమివ్వాలి రాముడికి గురువు అని అనిపించుకోవాలి ! అదీ ఆయన తపన ! నిజానికి విశ్వమిత్రుడికన్నా గొప్పగా యుద్ధవిద్యలు తెలిసిన వాడు ముల్లోకాలలో ఎవడూ లేడు ! మహావిష్ణువు ,మహాదేవుడు తప్ప!
.
రావణ వధ జరగాలంటే  రాముడిపెళ్ళి కావాలి ! ఇది చాలా ముఖ్యం .
అందుకే రెండు ముఖ్యమైన పనులను తానే స్వయంగా దగ్గరుండి నిర్వర్తించాడు మహర్షి !
.
అదీ విశ్వామిత్రుడు అంటే ! లోకకళ్యాణం కోసం తపించే మహానుభావుడు! అంతేగాని కోపిష్టి వాడు విశ్వామిత్రుడు కాడు!
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
**************

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*



*641వ నామ మంత్రము* 15.8.2020

*ఓం ధ్యానగమ్యాయై నమః*

ధ్యానముచే సాక్షాత్కారమునందగల పరమేశ్వరికి నమస్కారము.

ధ్యానమే లక్ష్యంగా గలిగిన భక్తునికి ప్రసన్నమయే తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ధ్యానగమ్యా* యను నాలుగక్షరముల (చతురాక్షరీ) నామ మంత్రమును *ఓం ధ్యానగమ్యాయై నమః*   అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని భక్తిప్రపత్తులతో ఉపాసించు భక్తులు అమ్మపై పరిపూర్ణ శరణాగతితో వర్తిస్తారు. అమ్మ కరుణచే తరిస్తారు.

జగన్మాత ధ్యానమునకు లక్ష్యమైనది. మహర్షులకు ధ్యానముచేత నిర్విషయ స్థితి యందు పొందబడునది.

*పూజకోటి సమంస్తోత్రం స్తోత్రకోటి సమో జపః*

*జపకోటి నమంధ్యానం ధ్యానకోటి సమో లయః*

కోటి పూజలకన్నా స్తోత్రం శ్రేష్ఠమైనది. కోటి స్తోత్రముల కన్నా జపము పవిత్రమైనది. కోటి జపముల కంటే ధ్యానము కోటి రెట్లు అధిక శ్రేష్ఠమైనది. ధ్యానము కన్నా లయము కోటి రెట్లు అధిక ఫలమిచ్చును. *ధ్యానం నిర్వివిషయం మనః* ధ్యానంచేత మనస్సు నిర్మలమగును. అట్టి నిర్మలమైన హృదయములో దేవి సాక్షాత్కరించును. *ధ్యానయోగేన యోగినాం* (గీత). ధ్యానమునందు  నిలచిన ధ్యేయం కళ్ళు మూసినా, తెరచినా, ఒకే స్థితిలో ఉండునది *ధ్యానగమ్యా* అనబడును. ధ్యాన-ధ్యాతృ-ధ్యేయము యొక్క త్రిపుటి ఏకమగుటయే  శ్రీమాత గమ్మమగును. గాన ఆ తల్లిని *ధ్యానగమ్యా* అని స్తుతించుచున్నాము.

ఆ జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ధ్యానగమ్యాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🔱నేడు శని (స్థిర) వారము🔱🔱🔱ఆ తిరుమలగిరి వాసుడైన శ్రీనివాసుని స్మరించు శుభదినము🌹🌹🌹శ్రీనివాసుని కరుణ అందరిపై ప్రసరించి అందరికీ శుభములు కలగుగాక🌻🌻🌻 ఓం నమో వేంకటేశాయ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*



*అష్టమ స్కంధము - పండ్రెండవ అధ్యాయము*

*శ్రీమహావిష్ణువు యొక్క మోహినీరూపమును జూచి, పరమశివుడు మోహితుడగుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శ్రీబాదరాయణిరువాచ*

*12.1 (ప్రథమశ్లోకము)*

*వృషధ్వజో నిశమ్యేదం యోషిద్రూపేణ దానవాన్|*

*మోహయిత్వా సురగణాన్ హరిః సోమమపాయయత్॥6766॥*

*12.2 (ద్వితీయ శ్లోకము)*

*వృషమారుహ్య గిరిశః సర్వభూతగణైర్వృతః|*

*సహ దేవ్యా యయౌ ద్రష్టుం యత్రాస్తే మధుసూదనః॥6767॥*

*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! శ్రీహరి స్త్రీ రూపమును ధరించి,  అసురులను మోహింపజేసెననియు, దేవతలకు అమృతమును పంచియిచ్చెననియు పరమశివుడు వినెను. అంతట ఆయన పార్వతీదేవితో సహా వృషభమును అధిరోహించి, భూతగణములతో పరివృతుడై విష్ణులోకమునకు వెళ్ళెను.

*12.3 (మూడవ శ్లోకము)*

*సభాజితో భగవతా సాదరం సోమయా భవః|*

*సూపవిష్ట ఉవాచేదం ప్రతిపూజ్య స్మయన్ హరిమ్॥6768॥*

భగవంతుడైన శ్రీహరి సాదరముగా గౌరీశంకరులకు స్వాగత సత్కారములు నెరపెను. అప్పుడు పరమేశ్వరుడు దరహాసమొనర్చుచు గౌరవపూర్వకముగా  శ్రీహరితో ఇట్లు  వచించెను.

*శ్రీమహాదేవ ఉవాచ*

*12.4 (నాలుగవ శ్లోకము)*

*దేవదేవ జగద్వ్యాపిన్ జగదీశ జగన్మయ|*

*సర్వేషామపి భావానాం త్వమాత్మా హేతురీశ్వరః॥6769॥*

*శ్రీమహాదేవుడు ఇట్లనెను* దేవదేవా! నీవు సమస్త విశ్వమునందును వ్యాపించిన జగదధీశ్వరుడవు. జగత్స్వరూపుడవు, సమస్త చరాచర  ప్రాణములకు మూలకారణము నీవే. నీవు అందరికిని ప్రభుడవు, ఆత్మవు.

*12.5 (ఐదవ శ్లోకము)*

*ఆద్యంతావస్య యన్మధ్యమిదమన్యదహం బహిః|*

*యతోఽవ్యయస్య నైతాని తత్సత్యం బ్రహ్మ చిద్భవాన్॥6770॥*

ఈ జగత్తు యొక్క ఆది మధ్యాంతములు నీ వలననే జరుగుచున్నవి. కాని, నీవు ఆది మధ్యాంత రహితుడవు. శాశ్వతమైన నీ స్వరూపమునందు ద్రష్ట, దృశ్యము, భోక్త, భోగ్యము అను భేదభావములు లేవు. వాస్తవముగా నీవే సత్యము, చిన్మాత్ర పరబ్రహ్మవు.

*12.6 (ఆరవ శ్లోకము)*

*తవైవ చరణాంభోజం శ్రేయస్కామా నిరాశిషః|*

*విసృజ్యోభయతః సంగం మునయః సముపాసతే॥6771॥*

మోక్షకాములైన మహాత్ములు ఇహపరలోకములయందలి ఆసక్తిని, అన్ని కోరికలను పరిత్యజించి, నీ పాదారవిందములను ఆరాధింతురు.

*12.7 (ఏడవ శ్లోకము)*

*త్వం బ్రహ్మ పూర్ణమమృతం విగుణం విశోకమానందమాత్రమవికారమనన్యదన్యత్|*

*విశ్వస్య హేతురుదయస్థితిసంయమానామాత్మేశ్వరశ్చ తదపేక్షతయానపేక్షః॥6772॥*

నీవు అమృతస్వరూపుడవు. ప్రాకృతగుణరహితుడవు. హర్షశోకములు లేని వాడవు. స్వయముగా పరిపూర్ణుడవు. కేవలము ఆనందస్వరూపుడవు. జనన మరణాది వికారములు లేనివాడవు. నీకంటెను వేరైనది ఏదియును లేదు. కాని, నీవు అన్నింటికంటెను వేరైనవాడవు. ఈ విశ్వము యొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు పరమకారణుడవు. జీవుల శుభాశుభకర్మలకు ఫలములను ఇచ్చువాడవు నీవే. జీవుల అపేక్ష మేరకు ఈ మాటలే చెప్పబడును. కాని, నిజమునకు నీకు ఎట్టి అపేక్షలును లేవు.

*12.8 (ఎనిమిదవ శ్లోకము)*

*ఏకస్త్వమేవ సదసద్ద్వయమద్వయం చ స్వర్ణం కృతాకృతమివేహ న వస్తుభేదః|*

*అజ్ఞానతస్త్వయి జనైర్విహితో వికల్పో యస్మాద్గుణవ్యతికరో నిరుపాధికస్య॥6773॥*

స్వామీ! కార్యకారణములు, ద్వైతాద్వైతములును అన్నియు నీవే. ఆభరణముల రూపములలో ఉన్న బంగారమునకును, సహజ సువర్ణమునకును భేదము లేనట్లు భేదాభేదములు అన్నియును నీవే. నీ వాస్తవస్వరూపమును  ఎఱుగనివారు నీయందు వివిధ భేదభావములను, వికల్పములను కల్పింతురు. కారణ మేమనగ, నీయందు ఎట్టి ఉపాధులు లేకున్నను గుణములను ఆశ్రయించి, భేదములు ఉన్నట్లు ప్రతీతము అగుచుందువు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పండ్రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
***************

నిత్య పూజ - నైవేద్యం



ప్రతి కుటుంబమూ భగవంతుని ఆరాధన తప్పక చెయ్యాలి. వీలు ఉన్నవారు సరియైన విధివిధానాలను అనుసరించి పెద్ద పెద్ద ఆరాధనలు చేస్తారు. మిగిలిన వారు కనీసంలో కనీసం రోజూ పది నిముషాలైనా ఈశ్వర పూజ చెయ్యాలి. కార్యాలయాలకు, ఉద్యోగాలకు వెళ్ళేవారు కనీసం ఈ లఘు పూజనైనా చేసి తీరాలి. ప్రతి గృహంలో తప్పక ఘంటానాదం వినబడాలి.

శివుడు, అంబిక, విష్ణు, వినాయక, సూర్యుడు ప్రతిమలను తప్పక ఆరాధించాలి. దీనినే ‘పంచాయతన పూజ’ అంటారు. సాంప్రదాయం ప్రకారం వీటిని కరచరణాదులతో అర్చించరు. ఈ ఐదుగురిని ప్రతిబింబించే ప్రకృతి ప్రసాదితములను వాడాలి. నర్మదా నది తీరంలోని ఓంకార కుండంనుండి శివస్వరూపమైన బాణ లింగం, సువర్ణముఖరి నది నుండి సంగ్రహించబడిన అంబిక రూపం, నేపాళంలోని గండకి నది నుండి విష్ణు స్వరూపమైన సాలిగ్రామం, తంజావూరు దగ్గరలోని వల్లంలొ లభించే సూర్య స్ఫటికం, గంగా నది ఉపనది అయిన సోనా నదివద్ద లభించే శోనభద్ర శిల వినాయక స్వరూపంగా మనదేశ ఐక్యతను చూపించే ఈ అయిదు రాళ్ళను పూజించాలి.

వీటికి కళ్ళు, ముక్కు, చెవులు మొదలగునవి ఉండవు. మూలలు లేకపోవడం వల్ల నీటితో శుభ్రపరచడానికి చాలా తేలిక. త్వరగా తేమ ఆరిపోతుంది. పెద్ద పూజగది కూడా అవసరం లేదు, ఒక చిన్న పెట్టె చాలు. ఈ పంచాయతన పూజను పునరుద్ధరించినవారు శంకర భగవత్పాదులు. షణ్మత స్థాపనాచార్యులై ఈ ఐదింటితో పాటు సుబ్రహ్మణ్య ఆరాధనను కూడా కలిపారు. ఈ ఐదు రాళ్ళతో పాటు చిన్న వేలాయుధాన్ని జతపరచాలి.

పూజ చెయ్యడానికి పెద్ద శ్రమ కూడా లేదు. నీకు ధృతి ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. ఇంటిలో పూజ చేసుకునేటప్పుడు దేవతామూర్తులకి వండిన అన్నాన్ని మహా నైవేద్యంగా సమర్పించాలి. పరమాత్మ ఈ విశ్వమునంతటిని మనకోసం సృష్టించాడు. మన ఇంద్రియములచేత ఆ సృష్టిలోని వాటిచేత సుఖమును పొందుతున్నాము. అటువంటి వాటిని మనం తీసుకునే ముందు వాటిని భగవంతునికి అర్పించి తీసుకోవాలి. మనం ఏదేని నైవేద్యం సమర్పించేటప్పుడు దాన్ని ఆయనకే ఇచ్చివేస్తున్నమా? కేవలం భగవంతుని ముందు ఉంచి మరలా మనం పుచ్చుకుంటున్నాం.

కొంతమంది హేళనగా అడుగుతారు, ఇవన్నీ భగవంతుడు తింటాడా అని? నివేదన అంటే నిజంగా భగవంతునికి తినిపించడమా? ఆయనకు తినవలసిన అవసరం లేదు. పూజవల్ల మన మనస్సు శుద్ధమవుతుంది. కాబట్టి దాని వల్ల లాభం మనకే భగవంతునికి కాదు. “నివేదయామి” అంటే “నేను నీకు తెలియబరుస్తున్నాను” అని అర్థం, “నీకు ఆహారం పెడుతున్నాను” అని కాదు. మనం భగవంతునితో అదే చెప్పుకోవాలి, “ఈశ్వరా! మీ దయ వల్ల మాకు ఈ ఆహారాన్ని ప్రసాదించావు” అని. అలా భగవంతునికి నివేదించిన దాన్ని ఆయనను స్మరిస్తూ మనం తినాలి.

ఆయన అనుగ్రహం లేకపోతే అసలు బియ్యం ఎలా పండుతుంది. మేధావులు పరిశోధనలు చేసి పెద్ద పెద్ద విషయాలు వ్రాయవచ్చు. కాని అవేవి ఒక గింజ ధాన్యాన్ని కూడా పండించలేవు. కృత్రిమ బియ్యం తయారుచేయాలన్నా భగవంతుడు సృష్టించిన వాటిని ఉపయోగించే తయారుచెయ్యాలి. మనిషి తయారుచేసే ప్రతి వస్తువు చివరకు భగవంతుని సృష్టి కిందకే వస్తుంది. మరి దాన్ని భగవంతునికి నివేదించకుండా మొదట మనం స్వికరిస్తే అది పెద్ద దొంగతనమే అవుతుంది.

--- “దయివతిన్ కురల్“ పరమాచార్య స్వామి వారి ఉపన్యాసముల సంగ్రహము

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

జీవితం గూర్చి తెలుసుకో


అమ్మ చేసిన రొట్టె *వృత్తము* 
సగానికి మడిచిన దోసె *అర్ధ వృత్తము*
మనం కూర్చునే స్టూల్ *చతురస్త్రం*
పడుకునే మంచం *దీర్ఘ చతురస్త్రం*
మనకిష్టమైన లడ్డూఒక  *గోళము*
సగం మన మిత్రునికిస్తే *అర్ధ గోళము*
మన తరగతి గది ఒక *ఘనం*
మనం కూర్చునే బెంచీ ఒక *దీర్ఘ ఘనం*
మన జెండా కర్ర ఒక *స్థూపం*
కొడవలి మలుపు ఒక *చాపం*
ధాన్యపు రాశి ఒక *శంఖువు*
రూపాయి రూపాయి కలిపితె *కూడిక*
కొనడానికి కొంత తీస్తే *తీసివేత*
తలా పది పంచితే *భాగహారం*
హెచ్చిస్తే *గుణకారం*
కూర్చుంటే *జడత్వం*
కదిలితే *చలనం*
పరిగెత్తితే *వేగం*
ఆగి ఆగి పరుగు తీస్తే *త్వరణం*
పడిపోతే *ఆకర్షణ*
విడిపోతే *వికర్షణ*
తన చుట్టూ తాను తిరిగితే *భ్రమణం*
గుడి చుట్టూ తిరిగితే *పరిభ్రమణం*
మాట్లాడడానికి *శక్తి*
పనిచేయడానికి *బలం*
గంటకు ఎంతపని చేస్తావో అది *సామర్థ్యం*
వింటున్నా మంటే *శబ్దం*
చూస్తున్నామంటే *వెలుగు*
రంగులన్ని *వర్ణ పటం*
ఆహారం అరగడం *జీవక్రియ*
అరిగిన ఆహారం శక్తిగా మారడం *రసాయన క్రియ*
ఉచ్వాస నిశ్వాస *శ్వాస క్రియ*
నేను చూశాను *భూతకాలం*
నేను చూస్తున్న *వర్ధమాన కాలం*
నేను చూడ బోతున్న *భవిష్యత్ కాలం*
నాకు తొంభై ఏళ్ళు ఇక *పోయే కాలం*
బతుకుల్లో లేనిది ఏముంది శాస్త్రాల్లో ..
సరిగా అర్థం చేసుకుంటే మన బతుకే ఒక శాస్త్రం...
మనిషిని, ఇతర ప్రాణుల్ని , ప్రకృతిని
గురించి తెలుసుకోవడం తప్ప..
భయమెందుకు నీకు ...
నీకంటే ప్రపంచంలో ఎవరు గొప్ప...
తెలుసుకో పదిలంగా
నేర్చుకో సులభంగా...!   *అదే మన తెలుగు భాష గొప్ప*.  భలే ఉంది కదా....
(ఎవరు రాశారో తెలియదు గాని అద్భుతం గా వుంది..ఆ రచయితకు వందనాలు.. సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న అజ్ఞాత రచయిత రచన మీ కోసం  పట్టుకొచ్చా.. చదవండి)

శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవం

*ఈ భూమండలంలో ఎక్కడ కనిపించని లక్ష కోట్లు విలువ చేసే శ్రీవారి వజ్రం ...

* శ్రీవారి మూలవిరాట్టు 110 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎందుకు ఉంటుంది .?

* మహా అద్భుతమైన శ్రీవేంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ ....

* శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడాని గల కారణం ..?

*పద్మావతీ వివాహానంతరం, స్వామివారు శేషాద్రికొండపై తొండమానుడు నిర్మించిన మందిరంలో కొలువున్నాడు. ఆనాటి నుండి బ్రహ్మదేవుడు ఉత్సవాలను ప్రారంభించాడు. శ్రీనివాసుని ఉత్సవాలకై బ్రహ్మదేవుడు ఉత్సవ శ్రీనివాసుడు, ఉగ్రశ్రీనివాసుడు, సర్వాధిక శ్రీనివాసుడు, శ్రీలేఖక శ్రీనివాసుడు అంటూ నాలుగు మూర్తులను వేద సంప్రదాయం ప్రకారం నిర్మించాడు. ఆ మూర్తులు ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా పూజలందు కుంటున్నాయి. ఇలా బ్రహ్మ ద్వారా ప్రారంభింపబడిన బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని వైభవం శోభాయమానమై
లోక కళ్యాణకారకమవుతోంది. నాడు బ్రహ్మాది దేవతలచే పూజింపబడిన వేంకటేశ్వర స్వామి, సప్తర్షులు, జగద్గురు ఆదిశంకరాచార్య, శ్రీరామానుజాచార్య,
శ్రీ కులశేఖరాళ్వారులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు, శ్రీకృష్ణ దేవరాయలు వంటివారి సేవలందుకున్నాడు. శ్రీ తిరుమల తిరుపతి మహాక్షేత్రంలో భక్తజన సంరక్షణార్థం శ్రీమన్నారాయణుడు అర్చావతారుడై వెలసి ఉన్నాడు.

వేంకటాద్రి సమమ్ స్థానమ్ బ్రహ్మాండే నాస్తి |
వెంకటేశ సమో దేవో న భూతో నభవిష్యతి ||
అని కంఠోక్తిగా చెప్పబడింది.

అనగా వేంకటాచలానికి తుల్యమైన దివ్యక్షేత్రం, ఈ బ్రహ్మండమంతటిలోనూ మరొకటి లేదు. అంటే బ్రహ్మాండం
అంతటిలోనూ మహోత్తమమైన దివ్యక్షేత్రం
శ్రీ వేంకటాచల క్షేత్రం తిరుమల.
శ్రీ వేంకటేశ్వరునితో సరితూగగల మరొక దైవం ఎవ్వరూ ఇంతకు పూర్వం లేరు. ఇకముందు భవిష్యత్తులో ఉండబోరు. భూత, భవిష్యత్, వర్తమానాలలో సరిసాటిలేని పరమదైవం
శ్రీ వేంకటేశ్వరుడు.
అలాంటి శేషాద్రివాసునికి జరిగే
బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎందుకు ఏర్పడిందనే విషయం తెలుసుకోవాలంటే
ఈ కథనం చదవాల్సిందే. పరమదైవమైన
శ్రీ వేంకటేశ్వరునికి చతుర్ముఖ బ్రహ్మ జరిపించిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. శ్రీనివాసుని ప్రీత్యర్థంగా, ఆయన కుమారుడైన బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు కావడం వల్ల, వీటికి బ్రహ్మోత్సవాలనే పేరు వచ్చింది.
నవ (తొమ్మిది)సంఖ్యకు- బ్రహ్మాభిదాఖ్య సంఖ్య అని ప్రసిద్ధి. ముందురోజున జరిగే అంకురారోపణం, ధ్వజారోహణం, చివరోజున జరిగే శ్రీ పుష్పయాగం- ఇవి మినహాయించగా మధ్యలో తొమ్మిది రోజులుగా జరిగే ఉత్సవాలు కనుక ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని నామాంకితం చేయబడిందని, ఆగమ శాస్త్ర ప్రమాణ వాక్యం.
ఈ బ్రహ్మోత్సవాలను శ్రీ వేంకటాచలేశ్వరుని అనుగ్రహం కోరి జరిపించడం వల్ల విధాతకు సకల మనోరథప్రాప్తి కలిగిందని కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, సూర్యుడు కన్యారాశిలో ఉన్న సమయంలో జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభ మవుతాయి. ఆ ప్రారంభ దినానికి ముందు రోజున మృత్తికా గ్రహణం, అంకురారోపణం, ధ్వజారోహణం జరుపబడతాయి. అదే రోజున
ప్రప్రథమంగా శ్రీ వేంకటేశ్వరుని సేనానాయకుడైన శ్రీ విష్వక్సేన భగవానుని యథావిధిగా పూజిస్తారు. విష్వక్సేనుల వారిని చతుర్వీథుల ఉత్సవం పేరిట ఊరేగించి, తీసుకుని వస్తారు. విష్వక్సేనుడు దేవాలయానికి తిరిగివచ్చిన తర్వాత యాగశాలలో, మృత్తికా గ్రహణం అంకురారోపణం చేస్తారు.
అలాగే ధ్వజరోహణం ఎలా చేస్తారంటే.. ఒక దృఢమైన నూతన వస్త్రంపైన శ్రీ వేంకటేశ్వరుని వాహనమైన గరుత్మంతుని చిత్రాన్ని లిఖిస్తారు. ఆ చిత్రించిన నూతన వస్త్రాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ధ్వజస్తంభ శిఖరాగ్రంపైన ఎగురవేస్తారు అర్చకులు. దీనినే ధ్వజారోహణం అంటారు. గరుత్మంతుడు తన ప్రభువైన శ్రీ వేంకటేశ్వరునికి జరగబోతున్న బ్రహ్మోత్సవాలకు
ఊర్ధ్వలోకాల్లోని సకల దేవతా గణాలను విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నట్లుగా, ఆ సమయంలో వేదపండితులు మంత్రపఠనం చేస్తారు. ఆ విధంగా శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

శ్రీవారి వజ్రం ......
శ్రీవారికి ధరించే స్వర్ణమాల 12 కిలోల బరువుతో కూడుకున్నది. దీనిని స్వామివారికి అలంకరించేందుకు ముగ్గురు పండితులు అవసరమట. ఆలయంలోని నీలపు వజ్రం ప్రపంచంలో ఎక్కడా లేదని పురోహితులు చెబుతున్నారు. దీని విలువ మాత్రమే రూ. లక్ష కోట్లు.

రాజేంద్ర చోళుడు, కృష్ణదేవరాయలు పలు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించారు. ఆజానుబాహుడైన శ్రీవారు విలువలేని ఆభరణాలు ధరించినా నిరాయుధపాణిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు.

శ్రీవారి మూలవిరాట్టు 110 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట....! శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మూలవిరాట్టు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందో తెలుసా? స్వామి వారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుంటుంది. తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తు కలది. తిరుమల కొండ ఎప్పుడూ శీతలముతో కూడిన ప్రదేశము. తెల్లవారు జామున 4.30 గంటలకు చల్లటి నీరు, పాలు, సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు. గురువారం అభిషేకానికి ముందు వెంకన్న ఆభరణాలను తీసేస్తారు. ఆ ఆభరణాలన్నీ వేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు. మూల విరాట్టు ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుండటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రతీ ఒక్కటీ అద్భుతమే.
హుండీ, అభిషేకాలు,పూజా గదులు ఇందులో ప్రత్యేకమైనవి. శ్రీవారి వంటపోటు చాలా పెద్దది. శ్రీవారి ప్రసాదం... పొంగలి, పెరుగన్నం, పులిహోర, పోలీ, అప్పం, వడ, జంతికలు, జిలేబి, లడ్డు, పాయసం, దోస, రవ్వ కేసరి, బాదం కేసరి, జీడిపప్పు కేసరిలను ప్రతిరోజూ తయారు చేస్తారు. అయితే శ్రీవారికి ప్రతిరోజూ కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం మినహా ఏదీ నైవేద్యంగా లోపలికి పోదు. స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన్నం మాత్రం భక్తునికి ప్రసాదంగా లభిస్తే అది మహా భాగ్యం అని పురోహితులు అంటున్నారు. ఇక స్వామి వారి వస్త్రాల సంగతికి వస్తే... స్వామివారికి ధరించే పీతాంబరం 21 అడుగుల పొడవు, ఆరు కిలోల బరువును కలిగివుంటుంది. శ్రీవారికి శుక్రవారం బిల్వదళాలతో అర్చన
చేస్తారు. పండగ నెల అంతటా బిల్వదళాలనే స్వామివారికి అర్పిస్తారు.

శివరాత్రి రోజు శ్రీవారి ఉత్సవమూర్తికి వజ్రంతో విభూది సమర్పించి, తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు.
తిరుమల సుప్రభాత సేవ .....తిరుమల
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో ప్రతిదినం 'సుప్రభాతం' అనబడే 'మేలుకొలుపు' సేవ తో ఆ రోజు నిర్వహించబోయే పూజా కార్యక్రమం ప్రారంభమై బంగారు వాకిలి ద్వారములు తెరుస్తారు. తిరుమల లో ప్రతిరోజు నేటికి ప్రప్రధమంగా శ్రీవారి దర్శన భాగ్యాన్ని పొందుతున్న వ్యక్తి 'సన్నిధి గొల్ల'. ఆదిలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిచే మొదటి దర్శన భాగ్యాన్ని వరం గా పొందిన ఆనాటి గోపాలకుని (యాదవుని) సంతతికి చెందిన వ్యక్తే ఈ గొల్ల.
తిరుమల స్వామి వారి సన్నిధి సేవతో సంబంధించిన వ్యక్తి కాబట్టి 'సన్నిధి గొల్ల' అని అంటారు. ప్రతి దినం బ్రహ్మ ముహూర్తంలో (తెల్లవారు జామున 2-30 నుండి 3-00 గంటల ప్రాంతం లో) సన్నిధి గొల్ల శుచిస్నాతుడై తిరునామాన్ని ధరించి గోవింద నామాన్ని పఠిస్తూ దివిటీ (కాగడ) పట్టుకొని తిరుమల ఉత్తర మాడవీధి లోని శ్రీవారి నిత్యసేవా కైంకర్యపరులైన శ్రీ వైఖానస
అర్చకుల తిరుమాళిగ (ఇంటికి) వెళ్ళి భక్తిపూర్వకంగా వారికి నమస్కరించి అర్చక స్వాములను ఆలయానికి ఆహ్వానిస్తాడు. శ్రీవారి అర్చకులు శుచిస్నాతులై, ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలను(12 నామాలు) ధరించి, సంధ్యానుష్టానాదులు పూర్తి చేసి ఆలయానికి
బయలుదేరుతారు.

శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు రాగానే అక్కడ ఉత్తరం వైపున వున్న చిన్న మంటపం(నగారా మంటపం లేదా నౌబత్ ఖానా) లో అర్చకుల రాకను తెలియజేయడానికన్నట్టు పెద్ద పలక గంటను మోగిస్తారు. అర్చకులు ఆలయంలోనికి ప్రవేశించి బంగారువాకిలి వద్ద వేచి వుంటారు. ఈ లోగా పెద్ద జీయంగార్, చిన్న జీయంగార్ స్వాములు, ఏకాంగి స్వామి, ఆలయ అధికారులు తలుపులు తెరువడానికి సిద్ధంగా వుంటారు. ఇంతలో సుప్రభాత సేవకు నిర్ణీత రుసుము చెల్లించిన భక్తులను 'వైకుంఠం క్యూ' ద్వారా ఆలయం లోనికి అనుమతిస్తారు. వీరంతా బంగారువాకిలి ముందు దక్షిణం వైపు పురుషులు - ఉత్తరం వైపు స్త్రీలు వరుసగా నిలిచి వుంటారు. ఇలా అందరూ సిద్ధంగా వుండగా సమయం 3 గంటలు కాగానే, అర్చకులు 'కుంచకోల' అనబడే తాళాలతో ' కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని బిగ్గరగా సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ బంగారువాకిలి ద్వారములను తెరుస్తారు. ముందుగా సన్నిధి గొల్ల, వెనుకనే వరుసగా అర్చకస్వాములు, జీయంగారు స్వాములు మరియూ ఏకాంగి మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర,వెన్న, తాంబూలం గల పళ్ళేన్ని తీసుకుని అందరూ లోనికి వెళతారు. బంగారువాకిలి ముందు నిలిచి వున్న వేదపారాయణదార్లు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు. ఇంతలో వీరితో పాటుగా తాళ్ళపాక అన్నమయ్య వంశీయులొకరు అన్నమయ్య కీర్తననొకదానిని ఆలపిస్తూవుండగా, అర్చకులు లోపలికి వెళ్ళిన వెంటనే శయన మండపంలో పాన్పు పై పవళించి వున్న భోగ శ్రీనివాసమూర్తి స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో గర్భగుడి లోనికి తీసుకుని వెళతారు. బంగారు వాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధి లో శ్రీవారి కి మొట్టమొదటి నివేదనగా పాలు (పచ్చి ఆవు పాలు) సమర్పిస్తారు. తర్వాత శ్రీవైఖానసులైన
అర్చకులు శ్రీవారి గడ్డం పై పచ్చకర్పూరపు చుక్క ని అందంగా అలంకరిస్తారు. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి ముందుగా బంగారు పంచ పాత్రలో రాత్రి ఏకాంత సేవానంతరం బ్రహ్మాది దేవతలర్చించిన తీర్ధాన్ని అర్చకులు స్వీకరించి తర్వాత జీయంగార్ స్వామికి తీర్థం, శఠారి ఇచ్చిన అనంతరం సుప్రభాతాన్ని పఠించిన వేదపారాయణదార్లు, మొదలైన వార్లు, భక్తులు లోనికి వచ్చి శ్రీవారి ని విశ్వరూప దర్శనం చేసుకుంటారు. సుప్రభాత సేవ ఆర్జిత సేవ అనగా నిర్ణీత రుసుము
చెల్లించి భక్తులు సేవలో పాల్గొనవచ్చు. ఈ సేవ కు రుసుము రూ. 120-00. సుమారు 1 సంవత్సరం ముందుగా అడ్వాన్స్ రిజర్వేషన్ చేస్కోవచ్చు. సిఫార్సు లేఖల ద్వారా ఒక రోజు ముందుగా కూడా ఈ   సేవ టికెట్లు పొందవచ్చు. ఈ సిఫార్సు లేఖలను తిరుమల జే.ఈ.ఓ వారి క్యాంపు కార్యాలయంలో సమర్పించి టిక్కెట్లు పొందవచ్చు. ఈ విధంగా ఖరీదు చేసే టిక్కెట్టు వెల 240-00 వుంటుంది. సంవత్సరంలో ఒక్క మార్గశిర
(డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు) మాసంలో మాత్రం ఈ సేవను నిర్వహించరు. సుప్రభాతం స్థానంలో ధనుర్మాసం 30 రోజుల పాటు 'తిరుప్పావై' (గోదాదేవి రచించిన భక్తి పాటలు) పఠిస్తారు. ఈ తిరుప్పావై ఆర్జిత సేవ కాదు, ఏకాంతంగా నిర్వహిస్తారు.

ఏడుకొండలవాడా..వేంకటరమణా..
                      గోవిందా.... గోవింద
                                     

                        🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏
*******************

శ్రీకృష్ణుని అష్టభార్యలు

కృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడు. అక్కడ పాండవుల చేత సేవింపబడుతున్నాడు. కుంతీదేవి కృష్ణపరమాత్మను ఎప్పుడూ కేవలం ఆమె దేహబంధువుగా చూడలేదు. ఆవిడ ఎప్పుడూ ఆయన యందు పరమాత్మ తత్త్వమును చూస్తూ కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉండేది. ఆయన కుంతీదేవి చేత, ధర్మరాజు చేత ఇతర పాండవ ప్రముఖుల చేత స్తుతింపబడ్డాడు. కృష్ణ పరమాత్మకు అర్జునునియందు ప్రీతి ఎక్కువ. ఆయన అర్జునునకు సారధ్యం చేస్తూ ఉంటాడు. దాని వెనక ఉన్న రహస్యం వేరు.
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః!
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ!
ఎక్కడయితే మన జీవన రథమును నడపడానికి చోదకునిగా, సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారో, అక్కడ మన వెనక కూర్చుని మన రథమును ఆయన నడిపిస్తున్నారని నమ్మి, ఆయనకు పగ్గములు అప్పజెప్పితే వారికి జీవితంలో విజయం తప్ప అపజయము ఉండదు. ఎప్పుడూ కృష్ణ పరమాత్మ అర్జునుని రథమునకు సారథ్యం చేస్తూ ఉంటారు.  మహానుభావుడు ఇంద్రప్రస్థమును చేరిన తరువాత ఒకరోజు అర్జునునితో కలిసి వేటకు బయలుదేరి వెళ్ళారు. అనేకమయిన మృగములను వేటాడి డస్సిపోయారు. దాహం వేసింది. ఇద్దరూ యమునా నదిలోని నీటిని దోసిళ్ళతో తీసుకుని త్రాగారు. ఇద్దరూ ఒడ్డున కూర్చున్నారు. వేటాడిన మృగములన్నింటిని ఇంద్రప్రస్థమునకు పంపించారు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా యమునా నదిలో నుండి ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ నిండు యౌవనంలో ఉన్నది. మహా సౌందర్యవతి. ఆవిడ ఒడ్డున తిరుగుతుంటే అర్జునుడు వెళ్లి పలకరించాడు. ‘అమ్మా నీవు చాలా అందగత్తెవి. మంచి యౌవనములో ఉన్నావు. నీ ప్రవర్తన చూస్తుంటే నీవు వివాహమునందు ఆసక్తిని కుదురుకున్న దానిలా ఉన్నావు. నీవు ఎవరిని వలచి ఈ ప్రాంతమునందు తిరుగుతున్నావో తెలియజేయవలసింది’ అని అడిగాడు. ఆవిడ ఒక చిత్రమయిన జవాబు చెప్పింది. ‘నేను సూర్య నారాయణ మూర్తి కుమార్తెను. నన్ను కాళింది అని పిలుస్తారు. నేను యమునానదిలో  ఉంటాను. నేను జన్మించినప్పుడు నాతండ్రి ఒకమాట చెప్పాడు. యమునానది ఒడ్డున ఒకరోజున కృష్ణ పరమాత్మ దాహం వేసి దాహార్తి తీర్చుకోవడానికి యమునలోని నీళ్ళు త్రాగుతారు. ఆనాడు నిన్ను చూస్తారు. చూసి నిన్ను పరిణయం చేసుకుంటారు’ అని మా తండ్రిగారు నాకు చెప్పి ఉన్నారు. నేను కృష్ణుడిని భర్తగా పొందడానికి ఈ ఒడ్డున తిరుగుతున్నాను’ అని చెప్పింది. అర్జునుడు కృష్ణ భగవానుని చూపించి ‘వారే కృష్ణ భగవానుడు’ అని ఆమెకు చెప్పి ఆమెను మొదట ఇంద్రప్రస్థమునకు పంపిస్తాడు. కృష్ణ పరమాత్మ ఆమెను ద్వారకకు తీసుకువెళ్ళి అక్కడ కాళిందిని వివాహం చేసుకున్నాడు. ఇప్పటికి కృష్ణుని భార్యలు నలుగురు అయ్యారు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది.
ఆతరువాత ఒకసారి కృష్ణ పరమాత్మ ఖాండవ వనమును దహించడం కోసం అర్జునుని తీసుకువెళ్ళారు. ఖాండవ వన దహనం అయిన తరువాత అగ్నిహోత్రుడు సంతోషించి గాండీవమును,  అక్షయ బాణ తూణీరములను అర్జునునకు బహూకరించాడు. కృష్ణుడు పక్కన లేకపోతే అర్జునుడికి శత్రు సంహారం చేయగలిగిన ఇంత సామగ్రి రావడం కూడా కష్టమే. కృష్ణుడు తాను శత్రు సంహారం చేశాడు. ఆర్జునుడిని శత్రు సంహారం చేయగల రీతిలో మలచుకున్నాడు. అదీ శ్రీకృష్ణుని గొప్పతనం. తదనంతరము నందు మయుడనే రాక్షసుడు ఖాండవవనం దహింప బడుతుంటే కృష్ణార్జునుల చేత రక్షింపబడ్డాడు. ఆయనే మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు.
అవంతీ రాజ్యమును విందానువిందులు అనబడే వారు పరిపాలిస్తూ ఉండేవారు. వీరి తల్లిగారి పేరు రాజాధిదేవి. ఆవిడ శ్రీకృష్ణుని మేనత్త. ఆవిడకి ఒక కుమార్తె ఉన్నది. ఆవిడ పేరు మిత్రవింద. మిత్రవిందను ఆమె సోదరులయిన విందానువిందులు దుర్యోధనునికిచ్చి వివాహం చేయాలని సంకల్పం చేశారు. వాళ్లకి కౌరవులంటే ప్రీతి. కృష్ణ పరమాత్మ తన మేనత్త కూతురయిన మిత్రవిందను వివాహం చేసుకోవాలన్న సంకల్పముతో ఆ స్వయంవర మంటపమును చేరుకొని, రాజులందరిని పరిమార్చి స్వయంవర మంటపంలో మిత్రవిందను భార్యగా స్వీకరించాడు.
కోసల రాజ్యమును నగ్నజిత్తు అనబడే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరు నాగ్నజితి. ఆయన ఒక చిత్రమయిన షరతు పెట్టాడు. ‘నా కుమార్తెను ఎవరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వారు నా దగ్గర వున్న ఏడుపొగరు మోతు ఎద్దుల పొగరు అణిచి గెలుస్తారో వానికి మాత్రమే నా కుమార్తె అయిన నాగ్నజితిని యిచ్చి వివాహం చేస్తాను’ అన్నాడు. కృష్ణ పరమాత్మ కోసల రాజ్యమును చేరుకొని ఆ ఏడు ఎద్దుల పొగరు అణిచి వాటిని ఓడించి వీర్య శుల్కంగా ప్రకటింపబడిన నాగ్నజితిని తన భార్యగా స్వీకరించారు.
కృష్ణ భగవానుడి వేరొక మేనత్త ఉన్నది. ఆవిడ పేరు శ్రుతకీర్తి. శ్రుతకీర్తికి ఒక కుమార్తె ఉన్నది. ఆమెపేరు భద్ర. ఆమెకు చిన్నతనం నుండి కృష్ణుడిని వివాహం చేసుకోవాలని కోరిక. కృష్ణ పరమాత్మ ఆ కన్యను వివాహం చేసుకున్నారు.
తదనంతరము మద్రరాజు కుమార్తెయిన లక్షణ అనబడే కన్యను వివాహం చేసుకున్నారు.
అలా భగవానుడికి ఎనమండుగురు భార్యలయ్యారు. అష్టభార్యలతో సర్వ సంపదలతో భగవానుడు తులతూగుతున్నాడు. ఎనమండుగురు భార్యలని చెప్పడం వెనక ఒక రహస్యం ఉన్నది. యథార్థమునకు కృష్ణ భగవానుడు అంతమంది స్త్రీలను వివాహం చేసుకుని దక్షిణ నాయకుడై వీళ్ళందరితో సరససల్లాపములతో కాలం గడపాలని వచ్చిన అవతారం కాదు. కృష్ణ పరమాత్మ అవతారమును అర్థం చేసుకోవడం చాలా కష్టం.
భార్య అనే శబ్దము చేత ఆరు లక్షణములను ఆవిష్కరిస్తారు. భార్య అనగానే ఆమె భర్తతో ఆరు రకములయిన సంబంధములను కలిగి ఉంటుందని మనము అర్థం చేసుకోవాలి. ఈ ఆరు లక్షణములు ఆమెకు వేరొక పురుషునితో ఉండవు. భార్య అనునది భర్తకి మాత్రమే చెందినది. ఈశ్వర చైతన్యం లేకపతే ఎనిమిది వస్తువులు జడం అయి ఉండిపోతాయి. ప్రకృతి ఎనిమిది రకములుగా భాసిస్తూ ఉంటుంది.
భూమిరాపోనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ!
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా!!
అవే పృథివి ఆపస్ తేజో వాయు ఆకాశములనబడే పంచభూతములు మరియు మనస్సు బుద్ధి అహంకారములు. మొత్తం ఎనిమిది. ఈ ఎనిమిదింటి సంఘాతమే ఈ శరీరము. ఈశ్వరుడు పురుషుడై జడమయిన ప్రకృతికి చైతన్యము కలిగిస్తాడు. ఈ ఎనిమిది ఈశ్వరుడు లోపల ఉన్నప్పుడు మాత్రమే కదులుతున్నాయి. ఈశ్వరుడు లేకపోతే శివము శవము అయిపోతుంది. ఈ ఎనిమిదింటిని కదుపుతున్నవాడు ఎవరో వాడు పురుషుడు.  కృష్ణుడు ఎనమండుగురినే చేసుకోవాలి. అందుకనే కృష్ణునికి భార్యలు ఎనిమిదిమంది. ఇదీ అందులో ఉన్న రహస్యం.
జ్ఞాన స్థాయిలో దర్శనం చేసిన వారికి మాత్రమే ఈ విషయం అవగాహన అవుతుంది.  భాగవతమును రెండుగా వినాలని చెపుతారు. అర్థమయిన చోట జ్ఞానిగా వినాలి. అర్థం కాని చోట భక్తునిగా వినాలి.
******************

Unknown facts about God Krishna


Astrospeak Team | Feb 5, 2018, 13:24 IST
The much-loved god, Krishna has made a great impression on mankind. From educating us on Dharma to enlightening us about the realities of life, Lord Krishna has always remained a source of knowledge and wisdom. And whether it's the legends from his childhood or that from Bhagavatam, he is known to be a divine individual that connects well with humankind. Most of us claim to be well-versed with him and his stories, but there are a fact or two that we may not be aware of. This blog brings some of those unknown things about Lord Krishna to add more to your knowledge of him.
The much-loved god, Krishna has made a great impression on mankind. From educating us on Dharma to enlightening us about the realities of life, Lord Krishna has always remained a source of knowledge and wisdom. And whether it's the legends from his childhood or that from Bhagavatam, he is known to be a divine individual that connects well with humankind. Most of us claim to be well-versed with him and his stories, but there are a fact or two that we may not be aware of. This blog brings some of those unknown things about Lord Krishna to add more to your knowledge of him.
1. The much-loved god, Krishna has made a great impression on mankind. From educating us on Dharma to enlightening us about the realities of life, Lord Krishna has always remained a source of knowledge and wisdom. And whether it's the legends from his childhood or that from Bhagavatam, he is known to be a divine individual that connects well with humankind. Most of us claim to be well-versed with him and his stories, but there are a fact or two that we may not be aware of. This blog brings some of those unknown things about Lord Krishna to add more to your knowledge of him.
2. The name of Lord Krishna is basically an adjective, which means ‘black’ or ‘dark,’ another popular meaning of the name is ‘all attractive.’
READ MORE FROM 
The last day for public feedback to the draft environment notification ended on August 11. Activists say if the bill is implemented, it may undo work done by the courts, burden them further

Can you get Covid-19 from a walk in the park when nobody else is around? If not, why are scientists calling it an ‘airborne disease’?

3. There are about 108 names of Lord Krishna and popular ones are, Govind, Devakinandan, Mohan, Gopal, Shyam, Ghanshyam, Hari, Baanke Bihari and Girdhari.
4. Once upon a time, Lord Krishna was against the orthodox form of worship of the Vedic Gods like Indra. According to Bhagavad Gita, Lord Krishna wanted villagers of Brindavan to worship the Govardhan Hill instead of Indra, as it will bring rain, which will help the agriculture. God Indra sent out a huge storm out of immense anger but Lord Krishna rescued the people by lifting the Govardhan Hill and using it as an umbrella to protect the villagers.
5. Lord Krishna had 8 wives including Rukmini, which together were called the Ashtabharya. It is believed that Lord Krishna abducted Rukmini, the Vidarbha Princess because she requested him to save her from marrying Shishupala. The name of other 7 wives of areLakhsmana, Bhadra, Satyabhama, Kalindi, Jambavati, Nagnajiti and Mitravinda.
6. Once, Lord Krishna took his Virat form to kill Shishupal. And, it is believed that even Dhritarashtra got his vision back during this time to be able to see this form of Krishna. During the crowing of Yudhishthira, Shishupal abused Lord Krishna for more than hundred times, but as he had promised Shishupal mother not to harm him, he forgave Shishupal. But, when the abuse crossed the number 100, he killed Shishupal. It is said that Shishupala and Dantavakra were the reincarnations of Vishnu’s gatekeepers Jaya and Vijaya, who were cursed to be born on Earth.
7. Gandhari cursed the Yadu Dynasty that they will perish after 36 years, and Lord Krishna said Tathastu (so be it). Gandhari was furious as she thought if Krishna wanted to solve this issue, he could have done so, but he didn’t. This is because Lord Krishna himself wanted this War to happen, as he felt that the entire kingdom had become sinful.
8. Krishna seems to be beyond the limits of nature or that of death or anything related to human life. He doesn’t seem to grow old in the history despite passing of several decades. Mahabharata many times showed that Lord Krishna is not subject to any limitations. This is proved in one such incident, where Duryodhana tries to arrest Krishna where his body bursts showing all creation within him.
9. Lord Krishna is also the part of Jain religion. He is referred as Vasudeva.
10. The Buddhist Jataka tales also mentions Lord Krishna. In the Vaibhav Jataka, he is showcased as the prince and legendary figure in India who cuts off his evil uncle Kansa’s head and kill all the kings to rule over Jambudvipa.
11. It is also believed that Lord Krishna was a “Manifestation of God”, or one of the prophets who has revealed the ‘Word of God’ to people on earth. Thus, it is said that he shares a powerful image with Abraham, Moses, Zoroaster, Buddha, Muhammad and Jesus.
12. It is said that Lord Krishna and Draupadi were brothers and sisters. And Draupadi was born to help Lord Krishna to destroy the sinful kings. It is believed that Draupadi is the incarnation of Goddess Parvati and Lord Krishna is the incarnation of Lord Vishnu, who is the brother of Goddess Parvati.
13. Lord Krishna granted Eklavya a wish after he sacrificed his thumb to Dronacharya. He was granted another incarnation as Dhrishtadyumna who stepped out of the yajna fire to kill Dronacharya.
14. Despite the popularity of Radha Krishna love tale, there are no signs of the existence of Radha in Shrimad Bhagavatam or Mahabharata or the Harivamsam, which is about the life of Lord Krishna only.
15. Krishna was related to the Pandavas. Kunti, the mother of the Pandavas was actually Vasudev's sister. Vasudev was Krishna's father.
16. When Krishna used to blow his conch, Panchjanya, it was the war cry for the Pandavas in Kurukshetra. Krishna's conch had powerful reverberations all over the world when blown. Krishna used to blow his conch to signal the start of the battle of Kurukshetra and also at the end to symbolise the victory of dharma.
17. With the growing bhakti movement, Krishna became a favourite subject of the arts. The songs of the Gita Govinda became popular across India and it added to the repository of both folk and classical singing. The classical Indian dances, especially Odissi and Manipuri, reveals a lot on the story. The 'Rasa Lila' dances performed in Vrindavan shares elements with Kathak,with some cycles, such as Krishnattam, traditionally restricted to the Guruvayur temple, the precursor of Kathakali.
18. Krishna killed Putana, who transformed herself as a nurse, and the tornado demon Trinavarta both sent by Kansa for Krishna's life. He won over the serpent Kaliya, who poisoned the waters of Yamuna river, leading to the death of so many cows. Hindu art depicts Krishna dancing on the multi-hooded Kaliya.
19. It is believed that there were a number of curses due to which Lord Krishna died. Gandhari’s curse on Krishna was that he and his clan will perish in 36 years. Whereas, Sage Durvasa, cursed Lord Krishna when he was angry at the fact that Krishna did not apply Kheer on his feet. He said Lord Krishna will die by his foot.
*****************

శ్రీ కేశవాష్టకం


1) నమో భగవతే కేశవాయ
   సకలనిగమాగమసంస్తుతవైభవాయ
   కౄరమధుకైటభాసురప్రాణహరణాయ
    పరమపావనసుపర్ణవాహనరూఢాయ ||

2) నమో భగవతే కేశవాయ
   రక్షాకరశంఖచక్రగదాపద్మశాఙ్గధరాయ
   శ్రీమహాలక్ష్మీహృదయాంబుజస్థితాయ
   పరాశరమైత్రేయాదిఋషిపూజితాయ ||

3) నమో భగవతే కేశవాయ
   ధర్మసంస్థాపననిర్వాహణాధ్యక్షాయ
   బ్రహ్మజ్ఞానానందదవేదపురుషాయ
   పావనగంగానదీజన్మస్థలాయ ||

4) నమో భగవతే కేశవాయ
   మరుద్గణాదిసంస్తుతపల్లవపదాయ 
   ఆదిశేషతల్పసుఖాసీనశయనాయ
   అష్టోత్తరశతదివ్యదేశసునివాసాయ ||

5) నమో భగవతే కేశవాయ
   నభోమండలవ్యాప్తచరకాంతివపుషాయ
   ప్రహ్లాదాదిభక్తమానసచరరాజహంసాయ
   హిరణ్యాక్షాదిదానవహరభక్తాళిరక్షకాయ ||

6) నమో భగవతే కేశవాయ
   అసమానబ్రహ్మతేజోమయవామనస్వరూపాయ 
   గోవర్ధనోద్ధరగోగోపబాలకసుసంరక్షకశ్రీగోవిందాయ
   రావణగర్వాపహారవిభీషణరాజ్యదరామచంద్రాయ ||

7) నమో భగవతే కేశవాయ
   ఏకవింశతిపర్యాయక్షత్రియకులనాశకశ్రీపరశురామాయ
   వేదవేదాంగవిభాజ్యపురాణరచనాప్రావీణ్యవేదవ్యాసాయ
   సంఖ్యాతత్త్వప్రబోధకపావనశ్రీకపిలమహర్షిస్వరూపాయ ||

8) నమో భగవతే కేశవాయ
   స్థావరజంగమాత్మకవిశ్వవ్యాప్తశరీరాయ
   త్రిభువనైకసమ్మోహనజగన్మోహినీస్వరూపాయ
   శుభపరంపరాప్రదాయకసాలగ్రామస్వరూపాయ ||


   సర్వం శ్రీకేశవస్వామిదివ్యచరణారవిందార్పణమస్తు
*******************