1, సెప్టెంబర్ 2021, బుధవారం

సంస్కృత మహాభాగవతం*

 *1.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - నాలుగవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*4.11 (పదకొండవ శ్లోకము)*


*క్షుత్తృట్త్రికాలగుణమారుతజైహ్వశైశ్నానస్మానపారజలధీనతితీర్య కేచిత్|*


*క్రోధస్య యాంతి విఫలస్య వశం పదే గోర్మజ్జంతి దుశ్చరతపశ్చ వృథోత్సృజంతి॥12311॥*


కొందరు దుస్సహమైన ఆకలిదప్పులను, శీతోష్ణవర్షములను (తీవ్రమైన చలిని, వేడిని, వర్షములను), సుడిగాలులను సహింతురు. అట్లే జిహ్వోపభోగములను, జననేంద్రియ భోగములను సహింతురు. ఈ విధముగా తపశ్చర్యాది దీక్షలోనున్నవారు కష్టములనెడి ఎంతటి అగాధ సముద్రమునైనను ఇట్లే దాటిపోగలరు. కాని, వారు కోపమునకు వశులై గోష్పాదమంతటి మురుగుకాల్వలోబడి తమ తపస్సునంతటినీ నశింపజేసికొందురు. ఆ విధముగా వారి తీవ్ర తపశ్చర్యాదులన్నియును గంగపాలగును. అవి మోక్షమునకుగాని, భోగములకుగాని ఉపయోగపడక వృథాయగును. అట్టివారు రెంటికి చెడ్డ రేవడియగుదురు.


*4.12 (పండ్రెండవ శ్లోకము)*


*ఇతి ప్రగృణతాం తేషాం స్త్రియోఽత్యద్భుతదర్శనాః|*


*దర్శయామాస శుశ్రూషాం స్వర్చితాః కుర్వతీర్విభుః॥12312॥*


మన్మథుడు మొదలగువారు భగవంతుని ఇట్లు స్తుతించుచుండిరి. అప్పుడు మన్మథుడు, వసంతుడు, అప్సరసలు మొదలగువారిలో పొడసూపుచున్న రూపలావణ్యాది గర్వములను అణచుటకై శక్తిమంతుడైన శ్రీమన్నారాయణుడు తన యోగబలముచే పెక్కుమంది సుందరీమణులను చూపించెను. వారి లావణ్య సౌకుమార్యములు అత్యంత మనోజ్ఞములు. దర్శనీయములు. వారు ధరించిన వస్త్రాభరణములు, పుష్పమాలాదులు మిగుల మనోహరముగానుండెను. వారందఱును ఆ శ్రీహరికి శుశ్రూషలొనర్చుచుండిరి.


*4.13 (పదమూడవ శ్లోకము)*


*తే దేవానుచరా దృష్ట్వా స్త్రియః శ్రీరివ రూపిణీః|*


*గంధేన ముముహుస్తాసాం రూపౌదార్యహతశ్రియః॥12313॥*


లక్ష్మీదేవివలె తేజరిల్లుచున్న ఆ తరుణీమణుల అందచందముముందు మన్మథాదుల రూపసౌందర్య వైభవములు వెలవెలబోవుచుండెను. వారి దేహములనుండి వెలువడుచున్న పరిమళముల గుబాళింపులకు ఆ దేవానుచరులు పరవశించిపోయిరి.


*4.14 (పదునాలుగవ శ్లోకము)*


*తానాహ దేవదేవేశః ప్రణతాన్ ప్రహసన్నివ|*


*ఆసామేకతమాం వృఙ్ధ్వం సవర్ణాం స్వర్గభూషణామ్॥12314॥*


దేవదేవుడైన శ్రీహరి తనముందు వినమ్రులై ప్రణమిల్లుచున్న మదనాదులను జూచి నవ్వుచు ఇట్లనెను. 'వీరిలో అన్నివిధములుగా మీకు అనురూప వతియైన తరుణీమణిని మీరు ఎన్నుకొనుడు. ఆమె మీ స్వర్గవైభవములను (శోభలను) ఇనుమడింపజేయగలదు.


*4.15 (పదిహేనవ శ్లోకము)*


*ఓమిత్యాదేశమాదాయ నత్వా తం సురవందినః|*


*ఉర్వశీమప్సరఃశ్రేష్ఠాం పురస్కృత్య దివం యయుః॥12315॥*


*4.16 (పదహారవ శ్లోకము)*


*ఇంద్రాయానమ్య సదసి శృణ్వతాం త్రిదివౌకసామ్|*


*ఊచుర్నారాయణబలం శక్రస్తత్రాస విస్మితః॥12316॥*


అంతట ఇంద్రుని అనుచరులైన మన్మథాదులు శ్రీహరియొక్క ఆదేశమును తలదాల్చి, ఆ స్వామికి ప్రణమిల్లి, ఆ యువతులలో శ్రేష్ఠురాలైన *ఊర్వశి* అను అప్సరసను దీసికొని స్వర్గమునకు చేరిరి. పిదప వారు దేవేంద్రునకు నమస్కరించి, సభలోనున్న సకలదేవతల సమక్షమున 'శ్రీమన్నారాయణుని శక్తిసామర్థ్యములను గూర్చి వివరించిరి. అప్పుడు శచీపతి తన అపరాధమును తలచుకొని భయపడెను, సర్వేశ్వరుని మహిమకు విస్మితుడయ్యెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*403వ నామ మంత్రము* 1.9.2021


*ఓం మహాకామేశ నయన కుమూదాహ్లాద కౌముద్యై నమః*


మహాకామేశుని నేత్రములనెడి కలువలను వికసింపజేసే వెన్నెలవంటి ఆహ్లాద రూపిణి అయిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మహాకామేశ నయన కుమూదాహ్లాద కౌముదీ* యను పదహారక్షరముల(షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం మహాకామేశ నయన కుమూదాహ్లాద కౌముద్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి చిరునవ్వు వెన్నెలలు వారి జీవితాలలో ప్రసరించి జీవించినంతకాలము శాంతిసౌఖ్యమలు, సిరిసంపదలతో ఆనందముగా విలసిల్లుదురు.


కలువలకు చంద్రుడు, తామరలకు సూర్యుడు ఆనందమునిచ్చే మిత్రులు. కలువలకు సూర్యుడు, తామరలకు చంద్రుడు ఆహ్లాదము నీయరు. ఆహ్లాదము లేకుంటే ఆవేదనయే కదా! పరమేశ్వరుని కన్నులు అనెడి కలువపూలకు, ఆనందమును కలిగించు వెన్నెల వంటిది శ్రీమాత. కనుకనే అమ్మవారు *మహాకామేశ నయన కుమూదాహ్లాద కౌముదీ* యని అనబడినది.


భక్తుల మనస్సులు కలువలవంటివి. అట్టి భక్తుల మనస్సులనే కలువలను వికసింప జేసి ఆహ్లాదమునిచ్చే పరమేశ్వరి వెన్నెలవంటిది. అమ్మవారి కరుణాకటాక్షమలు శరదృతువునందలి వెన్నెలవంటివి. ఆ వెన్నెల చల్లగా ఉంటుంది. ఆహ్లాదమునిస్తుంది. భక్తులు ఆనందంతో పరవశించిపోతారు. 


సాధకుడు మూలాధారమునందు నిద్రాణములోనున్న కుండలినీ శక్తిస్వరూపిణియైన శ్రీమాతను మేల్కొలిపి, సుషుమ్నా నాడిగుండా పయనింపజేస్తూ, షట్చక్రములలో అనేకవిధములుగా అర్చించుతూ, మధ్యలో బ్రహ్మ,విష్ణు,రుద్ర గ్రంథులను ఛేదనముచేయిస్తూ సహస్రారము చేర్చుతాడు. అక్కడ ఆ కుండలినీ స్వరూపిణియైన పరమేశ్వరి చంద్రమండలంలోని పరమేశ్వరుని చేరుటతో, అంతులేని ఆనందమును పొంది, అమృత ధారలను సాధకునిపై కురుపిస్తుంది. ఆ అమృతధారలు సాధకుని డెబ్బదిరెండువేల నాడీమండలముపై పడగా, ఆ అమృత వృష్టికి సాధకుడు తడిసిముద్దయి ఆ అమృతవృష్టియొక్క చల్లదనమునకు ఎనలేని ఆనందమును పొందుతాడు. సాధకుడు ఒక కలువ వంటి వాడు. కుండలినీ శక్తి స్వరూపిణియైన పరమేశ్వరి సహస్రారంలో వెన్నెల వంటిది. ఆ అమృతధారలు వెన్నెల కిరణములవంటివి. 


పరమేశ్వరుని కన్నులనే కలువలకు పరమేశ్వరి స్వరూపము ఆహ్లాదమునిచ్చే (ఆనందమునిచ్చే) చల్లని వెన్నెలవంటిది యగుటచే అమ్మవారు *మహాకామేశ నయన కుమూదాహ్లాద కౌముదీ* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం మహాకామేశ నయన కుమూదాహ్లాద కౌముద్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*986వ నామ మంత్రము* 1.9.2021 


*ఓం త్రికోణగాయై నమః*

యోని చక్రమును పొందియున్న శ్రీమాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *త్రికోణగా* యను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం త్రికోణగాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకుడు, ఆ తల్లి కరుణచే నిర్మలమైన ధ్యాననిమగ్నతతో తన సాధనను మరింత దక్షతతో కొనసాగించి తరించును.


పరమేశ్వరి త్రికోణరూపిణి. త్రికోణము అనగా మూడు భుజములతో ఏర్పడినదని చాలా మందికి తెలుసు. ఆ మూడు భుజాలలో ఒకటి భూలోకము (భూః), రెండవది భువర్లోకము (భువః), మూడవది సువర్లోకము (సువః). అమ్మవారు ఈ మూడు వ్యాహృతులకు అధిపతి. గనుక ఆ పరమేశ్వరి *త్రికోణగా* యని అనబడినది. పరమేశ్వరుడు బిందుస్వరూపుడు అయితే, పరమేశ్వరి త్రికోణరూపిణి. సృష్టిచేయాలనే సంకల్పం పరమేశ్వరునికి రాగానే సత్త్వరజస్తమో గుణములు ముందుగా సృష్టింప బడినవి. ఈ గుణత్రయము త్రికోణములోని మూడుభుజములుగాను, అట్టి త్రికోణము మాయాశక్తిత్రికోణ మనియు, అట్టి మాయాశక్తి త్రికోణమే పరమేశ్వరి యగుటచే, అమ్మవారు *త్రికోణగా* యని అనబడినది. మాయాశక్తి స్వరూపిణియైన పరమేశ్వరి సత్త్వగుణమువలన అవ్యక్తముగాను, రజోగుణమువలన మహత్తత్త్వంగాను, తమోగుణము వలన అహంకారంగాను అగుచున్నది. అవ్యక్తము, మహత్తత్త్వము, అహంకార సంయుతమైన యోనిచక్రము (త్రికోణము) పరమేశ్వరి యగుటచే అమ్మవారు *త్రికోణగా* యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం త్రికోణగాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

 *31.08.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - నాలుగవ అధ్యాయము*


*భగవదవతారముల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*4.6 (ఆరవ శ్లోకము)*


*ధర్మస్య దక్షదుహితర్యజనిష్ట మూర్త్యాం నారాయణో నరఋషిప్రవరః ప్రశాంతః|*


*నైష్కర్మ్యలక్షణమువాచ చచార కర్మ యోఽద్యాపి చాస్త ఋషివర్యనిషేవితాంఘ్రిః॥12306॥*


దక్షుని యొక్క కూతురగు *మూర్తి* యను నామెయందు ధర్మునివలన *నరుడు, నారాయణుడు* అను పేర్లతో శ్రీహరి అవతరించెను. ఆ ఋషిప్రవరులు శాంతచిత్తులుగా ఖ్యాతి వహించిరి. పిమ్మట ఆ మూర్తిద్వయరూపమున శ్రీహరి సకలకర్మల నివృత్తి హేతుభూతాత్మకమైన ఆత్మజ్ఞానయోగమును నారదాదులకు ఉపదేశించుటయేగాక స్వయముగా అనుష్ఠించి లోకమునకు ఆరాధ్యుడయ్యెను. నేడును లోకకల్యాణమునకై బదరికాశ్రమమున నరనారాయణుల రూపములో ఆ స్వామి విరాజిల్లుచున్నాడు. నారదాది మహామునులు ఆ నరనారాయణుల పాదపద్మములను భక్తిశ్రద్ధలతో సేవించు చుందురు.


*4.7 (ఏడవ శ్లోకము)*


*ఇంద్రో విశంక్య మమ ధామ జిఘృక్షతీతి కామం న్యయుంక్త సగణం స బదర్యుపాఖ్యమ్|*


*గత్వాప్సరోగణవసంతసుమందవాతైః స్త్రీప్రేక్షణేషుభిరవిధ్యదతన్మహిజ్ఞః॥12307॥*


నరనారాయణులయొక్క తీవ్రమైన తపస్సునుజూచి, 'వీరు తమ తపశ్చర్యలద్వారా, నా స్వర్గమును ఆక్రమింతురేమో!' అని ఇంద్రుడు శంకించెను. పిమ్మట ఆ దేవేంద్రుడు వారి తపస్సులను భంగపరచు బాధ్యతను మన్ముథునకు అప్పగించెను. శ్రీమన్నారాయణుని మహిమను ఎరుంగక ఆ మన్మథుడు తన సేనయైన అప్సరసలను, వసంతుని, మందమారుతములను ఆ బదరికాశ్రమము కడకు తీసికొనవెళ్ళెను. అంతట దివ్యాంగనలు తమ క్రీగంటి చూపులనెడి బాణములతో ఆ తపోమూర్తులను ఆకర్షించుటకు ప్రయత్నించిరి (ఆ ఋషులను వ్యామోహపరచుటద్వారా వారి తపస్సులను భంగపరచుటకు యత్నించిరి.


*4.8 (ఎనిమిదవ శ్లోకము)*


*విజ్ఞాయ శక్రకృతమక్రమమాదిదేవః ప్రాహ ప్రహస్య గతవిస్మయ ఏజమానాన్|*


*మా భైష్ట భో మదన మారుత దేవవధ్వో గృహ్ణీత నో బలిమశూన్యమిమం కురుధ్వమ్॥12308॥*


అప్పుడు దేవాదిదేవుడైన శ్రీహరి 'ఇదియంతయును ఇంద్రుని యొక్క నిర్వాకమే' అని గ్రహించెను. ప్రభావశాలియైన శ్రీహరి తమను శపించునేమో? అను భయముతో మన్మథాదులు కంపింపసాగిరి. అంతట ఆ పరమాత్ముడు ఏమాత్రమూ ఆశ్చర్యపడక దరహాసమొనర్చుచు వారితో ఇట్లనెను - "మదనా! మారుతా! అప్సరసలారా! భయపడకుడు. మీరు ఈ ఆశ్రమమునకు వచ్చిన అతిథులు. కావున మా ఆతిథ్యమును స్వీకరింపుడు'


*4.9 (తొమ్మిదవ శ్లోకము)*


*ఇత్థం బ్రువత్యభయదే నరదేవ దేవాః సవ్రీడనమ్రశిరసః సఘృణం తమూచుః|*


*నైతద్విభో త్వయి పరేఽవికృతే విచిత్రం స్వారామధీరనికరానతపాదపద్మే॥12309॥*


నిమి (జనక) మహారాజా! అభయప్రదుడైన శ్రీహరి ఇట్లు పలుకగా మన్మథుడు మొదలగు దేవతలు తమ అపరాధమునకు సిగ్గుపడుచు వినమ్రతతో తలలు వంచుకొనిరి. ఎంతటి అపరాధమొనర్చినవారియెడలను తన పుత్రులుపైవలె కృపజూపునట్టి ఆ శ్రీహరితో వారు ఇట్లు విన్నవించుకొనిరి- "ప్రభూ! నీవు పరబ్రహ్మస్వరూపుడవు. కామక్రోధాది వికారరహితుడవు. ఆత్మజ్ఞానులు, జితేంద్రియులు ఐన ఋషిసత్తములు సైతము వినమ్రతతో నిరంతరము నీ పాదపద్మములను సేవించుచుందురు. అంతటి పరమాత్ముడవైన నీవు కృతాపరాధులమైన మమ్ము కనికరించుటలో ఆశ్చర్యములేదు.


*4.10 (పదియవ శ్లోకము)*


*త్వాం సేవతాం సురకృతా బహవోఽన్తరాయాః స్వౌకో విలంఘ్య పరమం వ్రజతాం పదం తే|*


*నాన్యస్య బర్హిషి బలీన్ దదతః స్వభాగాన్ ధత్తే పదం త్వమవితా యది విఘ్నమూర్ధ్ని॥12310॥*


దేవతలను ఆరాధించుచు యజ్ఞాదులయందు వారికి (దేవతలకు) హవిస్సులను (హవిర్భాగములను) అర్పించువారి సాధనలకు దేవతలు ఎన్నడును విఘ్నములను కలిగింపరు. కానీ, భక్తిప్రపత్తులతో నిన్ను సేవించువారు (నిష్ఠతో నిన్నుగూర్చి తపస్సు చేయువారు) దేవలోకమైన స్వర్గమును అతిక్రమించి నీ పరమపదమును చేరుదురను అసూయతో దేవతలు వారికార్యములకు (తపస్సులకు) విఘ్నములను కలిగించుచుందురు. కాని నీవు భక్తులను రక్షించువాడవు. వారి కార్యములకు ఎన్నడును విఘ్నములను రానీయవు. నీ రక్షణలో నున్నవారికి ఏమాత్రమూ అంతరాయములను కలుగనీయవు. అందువలన వారు నీ పరమపదమును చేరుదురు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

ఉత్తర , పడమర దిక్కులకు తల ఉంచి నిద్రించకూడదు

 ఉత్తర , పడమర దిక్కులకు తల ఉంచి నిద్రించకూడదు అన్నవిషయానికి సంపూర్ణ వివరణ -


        రాత్రి సమయంలో పడుకునేప్పుడు శిరస్సు తూర్పుదిశగా ఉంచవలెను అనియు మరియు దక్షిణ దిశకు ఒక మాదిరిగా కొంచం మంచిది అని పెద్దవారు చెప్తారు అదేవిధంగా మనపురాణాలలో కూడా వ్రాయబడి ఉన్నది. తూర్పుదిశకు శిరస్సు ఉంచి శయనించువాడు ఆరోగ్యవంతుడు అనియు మార్కండేయ పురాణమున చెప్పబడి ఉంది. దీనికి సంబంధించిన కొన్ని విషయాలను సంపూర్ణంగా వివరిస్తాను.


            భూమి ఒక పెద్ద అయస్కాంతం . మాములు అయస్కాంతం చుట్టూ అయస్కాంతక్షేత్రం ఎలా ఉండునో భూమికి కూడా చుట్టూ అయస్కాంతక్షేత్రం 66,000 మైళ్ళ వరకు వ్యాపించి ఉండును. ఈ విశ్వం అండాండం అనియు మనశరీరంను పిండాండం అని జ్ఞానులు పిలుస్తారు . విశ్వములోని అన్నింటి ప్రభావం , శక్తి మన శరీరంలో కూడా ఉన్నది. అందుకనే ఈ రెండింటి మధ్య "లయ" తప్పకుండా కాపాడగలుగు శక్తి ఉన్న చాలా మానసిక రుగ్మతులకు ఔషధం దొరుకును .


            ఉత్తరదిక్కుకు ఆకర్షణ ( అయస్కాంత) శక్తి ఉన్నది. దిక్సూచిని ఏ దిక్కుకి తిప్పినను దాని ముల్లు ఉత్తరదిక్కుకు తిరుగును. ఈ ఆకర్షణ శక్తి మానవుని శిరస్సు మూలకంగా శరీరంపైన తన ప్రభావమును చూపించును. అయస్కాంతపు ఉత్తర ధ్రువమునకు రోగనిరోధక శక్తి అనగా క్రిమిరోగాల వంటి వానిని నాశనం చేసి కాపాడగల శక్తి ఉన్నదని దక్షిణధ్రువమునకు శక్తిని ప్రసాదించగల గుణమున్నది మన పురాణాలలో ఉన్నది. మానవుని శరీరం ఒక విద్యుచ్ఛక్తి కేంద్రం . శరీరముకు కావలసినంత విద్యుత్తు మాత్రమే శరీరంలో ఎల్లప్పుడూ ఉండును. శరీరం తనకి కావలసిన ఎలెక్ట్రిసిటీని ఎల్లప్పుడూ ఉత్పన్నం చేసుకొనుచూ బయటకి విసర్జించుచూ ఉండును.


         వాత్సాయన మహర్షి ప్రకారం శరీరం నందలి 24 కేంద్రాలలో ఈ పని జరుగును. ఈ 24 కేంద్రాలలో బ్రహ్మాండం అతిముఖ్యమైన కేంద్రం . బ్రహ్మాండం అనగా శిరస్సు నందలి పైభాగం . దీనినే పుణికి అని బ్రహ్మకపాలం అని అందురు. ఇది శరీరంలో విద్యుచ్చక్తి ఉత్పత్తికి మరియు బయటకి విసర్జనకు రెండింటికి కేంద్రమై ఉన్నది. మానవ శరీరంలో ఉత్పత్తి అయిన విద్యుత్ వెంట్రుకల చివరనుంచి చేతి గోళ్ల చివర నుంచి చర్మరంధ్రాల ద్వారా అత్యంత సూక్ష్మంగా బయటకి విసర్జించబడును.


       దాదాపు 1300 గ్రాముల బరువుగల మనవుని మెదడు దాదాపు 20 వాట్స్ విద్యుత్ శక్తిని వెలువరించును. మానవ హృదయము నుండి వెలువడు విద్యుత్ శక్తిని " వెక్టార్ " ద్వారా కొలుస్తారు. ఈ విద్యుత్ శక్తిని ఊపిరిని తమ ఆధీనంలో ఉంచగలుగుట ద్వారా ఆయుర్వృద్దిని పొందవచ్చును. యోగులు ఈవిధంగా ఉచ్చ్వాస , నిచ్చ్వాసాలను తమ అదుపులో ఉంచి జీవశక్తిని దాని పరిమాణాన్ని ప్రభావితం చేయగలిగేవారు.


            శిరస్సును ఉత్తరదిక్కుకు ఉంచి నిద్రించిన ఉత్తరదిక్కు నందు ఉన్న ఆకర్షణశక్తి వలన శరీరం నందలి విద్యుత్ శక్తి కొంత కోల్పోవును . ప్రతిదినం ఇట్లు జరుగుచుండడం వలన క్రమేణా శరీరం తన శక్తిని వర్ఛస్సును కోల్పోవును . విద్యుత్ కిరణములు మన పాదముల నుండి ప్రవహించి శిరస్సు నుండి వెలువడును. విద్యుత్ శక్తి ప్రవహించుచోట చల్లదనమును , వెలువడుచోట ఉష్ణం కలుగునని శాస్త్రవేత్తలు నిర్ధారించెను . కావున శిరస్సు నుండి విద్యుత్ శక్తి వెలువడుటచే శిరస్సు అత్యుష్ణమ్ చెంది తలభారం , బాధ , అలసట , నిస్సారం మొదలగునవి కలుగును. కొన్ని శరీరభాగాలు తమ క్రియను కోల్పోయి పక్షవాతం , తిమ్మిరి , నడుమునొప్పి మొదలగు వాతవ్యాధులు కలుగును. నరముల సంబంధ వ్యాధులు జనియించుటకు వీలు కలుగును. కావున దక్షిణదిశకు శిరము ఉంచి శయనించిన యెడల విద్యుత్ శక్తి పాదముల గుండా వెలువడుట వలన నష్టమేమి సంభవించదు. పార్థివ విద్యుత్ దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రవహించును.


        ఇదేవిధముగా పడమట దిక్కు కూడా . ఇక్కడ సూర్యుడు అస్తమించుట చేత అతని ఆకర్షణశక్తి , మనుష్యుని నందలి విద్యుత్ శక్తిని ఆకర్షించును. సూర్యుడు ప్రపంచానికి కన్నువంటి వాడు. సర్వప్రాణులకు ఆధారభూతము , జగత్తును పోషించువాడు . సూర్యుని నుండి ప్రసరించు కిరణములు మనుష్యుని పై మంచి ప్రభావం చూపి దానితో శరీరం నందలి విద్యుత్ ని తన అధీనంలో ఉంచుకొనును. అందువలనే ఉత్తర దిశకు తల ఉంచి నిదురించిన ఎటువంటి పరిణామాలు కలుగునొ అటువంటి పరిణామాలే పడమర దిక్కుకి తల ఉంచి నిదురించిన కలుగును.


                        సమాప్తం 


           నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


      గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

భారతీయ ధర్మమే

 *భారతీయ ధర్మమే చాలా గొప్పది, భారతీయులు ప్రపంచములోనే చాలా గొప్పవారు. ఎలాగో మీరే చూడండి.*


1)సూర్యుడి నుంచి వెలువడుతున్న *ఓంకారమని* నాసా ఎందుకు పేర్కొన్నట్టు? 🚩


2) మన దేశీయ *గోమూత్రం* మీద అమెరికా 4 పేటెంట్లను పొంది క్యాన్సర్ ను నివారించే మందును కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తోంది. ఎందుకు!?🚩


3) న్యూజెర్సీ *"సిటాన్ హాలు"* యూనివర్సిటీలో *భగవద్గీత* తప్పనిసరిగా చదవాలన్న నియమం ఎందుకుంది?🚩


4) ముస్లిం దేశమైన ఇండోనేసియా తన దేశ విమానయాన సంస్థకు *"గరుడ ఇండోనేషియా ఎయిర్లైన్స్"* అని, జాతీయ ఎంబ్లెమ్ కు *"గరుడ పంచశిల"* అని విష్ణు వాహనమైన గరుత్మంతుని పేర్లేందుకు పెట్టుకుంది?🚩


5) ఇండోనేషియాలో అతిపెద్ద నోటైన ఇరవై వేల రూపయా మీద *వినాయకుడి బొమ్మ* ఉంటుందేం?🚩


6) అమెరికా మాజీ అధ్యక్షుడు *బారక్ ఒబామా* తన జేబులో ఎప్పుడూ *హనుమంతుడి* చిత్రపటాన్ని పెట్టుకొని ఉంటాడెందుకూ?🚩


7) *యోగ, ప్రాణాయామాలకు* ఈరోజు ప్రపంచంలో అంత గుర్తింపెందుకుంది? 🚩


8)వేల సంవత్సరాల క్రితమే భారతీయ యోగులు *భూమి గుండ్రంగా* ఉందని చెప్పారేం? 🚩


9) *'లుప్త', 'హంస'* అంటే సంస్కృతంలో కనుమరుగవుతున్న హంస. విమానం ఆకాశంలో పైపైకి ప్రయాణిస్తున్నకొద్దీ కనుమరుగవుతూ ఉంటుంది. ఈ అర్థం వచ్చేలా జర్మనీ విమానయాన సంస్థకు *'లుఫ్తాన్సా'* అని పేరెందుకు పెట్టారు?🚩


10) ఆఫ్ఘసిస్తాన్ లోని పర్వతాలను *"హిందూకుష్"* పర్వతాలని ఎందుకంటారు?🚩


11) వియత్నాంలో నాలుగు వేల సంవత్సరాల నాటి *శ్రీమహావిష్ణు విగ్రహం* ఎలా కనిపించింది?🚩


12) అమెరికా శాస్త్రవేత్త *డా. హోవార్డ్ స్టెయిన్గెరిల్* పరిశోధన చేసి *గాయత్రీ మంత్రం క్షణానికి 10 వేల ధ్వని తరంగాలను వెలువరిస్తుందని తేల్చారు.* దీనివల్ల ఈ మంత్రం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మంత్రమని తెలిసింది. ఎందుకు?🚩


13) స్వామి దయానంద సరస్వతి రాసిన *"సత్యార్థ ప్రకాశ్"* చదివి భాగపత్ (యూపీ)లోని బార్వాలా మసీదు ఇమాం 1983లో *"మహేంద్ర పాల్ ఆర్య"* పేరుతో హిందువుగా మారారెందుకు? అప్పటినుంచి వేలమంది ముస్లింలను హిందువులుగా మారుస్తూ.. డా. జకీర్ నాయక్ ను ఎన్నిసార్లు చర్చకు పిలిచినా ఆయన వచ్చే సాహసం చేయలేదేం?🚩


14) హిందువులు చేసే యజ్ఞం మూఢనమ్మకమే అయితే, యజ్ఞం చేస్తూండిన ఒక్క *"కుష్వాహా"* కుటుంబమే భోపాల్ గ్యాస్ ప్రమాదం బారిన పడకుండా ఎలా తప్పించుకుంది? 🚩


15) *ఆవు పేడతో చేసిన పిడకల మీద ఆవునెయ్యి వేసి కాలిస్తే ప్రతి 10 గ్రాములకి ఒక టన్ను ఆక్సిజన్ విడుదల అవుతుంది.* వాయువును శుద్ధి చేస్తుంది. మరి ఇదంతా ఏంటి?🚩


16) అమెరికా నటి, నిర్మాత *జూలియా రాబర్ట్స్* హిందూ ధర్మాన్ని స్వీకరించి రోజూ గుడికి వెళ్తుందెందుకు?🚩


17) రామాయణం మిథ్య అయితే, *ప్రపంచంలోని రాళ్ళలో* రామసేతువు నుంచి విడివడినవి మాత్రమే ఎందుకు *నీటిపై తేలుతున్నాయి?🚩*


18) మహాభారతం కల్పితమైతే, ఉత్తర భారతంలో *80 అడుగుల ఘటోత్కచుడి అస్థిపంజరం నేషనల్ జాగ్రఫిక్, భారత సైన్యం బృందానికి ఎలా కనిపించింది? 🚩*


19) *5000 సంవత్సరాల పురాతనమైనది,* మహాభారత కాలం నాటిది అయిన విమానం అమెరికా సైన్యానికి కాందహార్ (ఆఫ్ఘనిస్తాన్)లో ఎలా దొరికింది? 🚩


20) అలెగ్జాండర్ మనదేశం నుండి పిడికెడు మట్టి కూడా తీసుకెళ్లాడా?


*అందుకే, ప్రియమైన భారతీయులారా ఆత్మ బంధువులారా... భారతీయునిగా పుట్టినందుకు గర్వించండి. ✊*


*భారతీయునిగానే మరణించండి.*


మన భారతదేశ గొప్పతనాన్ని మనకన్నా విదేశీయులు బాగా గుర్తిస్తున్నారు. 


మనదేశం యొక్క గొప్పతనాన్ని పొగడకపోయినా కనీసం మనదేశాన్ని మనమే కించపరకాకుండా ఉంటే చాలు. మన తెలివితేటలు, మన శక్తియుక్తులు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన ముందు తరాలవారు తెలియచేశారు.


భారతీయులు ఎవరికీ తీసిపోరు, వారికి ఎవరూ సాటిరారు.


*పొగడరా నీతల్లి భూమిభారతిని,నిలపరా నీజాతి నిండు గౌరవమును.*


*భారతీయునిగా పుట్టినందుకు గర్వించు..

తర్పణాదులు

 💐💐పితృ తర్పణాదులు:💐💐


ఇది అతి ముఖ్యమైన విషయం. అందరూ పూర్తిగా చదివి, తగిన వారు, తెలుసుకోని ఆచరించండి


మానవ జన్మ పొందిన ప్రతి జీవికి ఋణత్రయ బంధం ముడిపడి వుంటుంది. భగవంతుడు మనకు ప్రసాదించిన బుద్ధి జ్ఞానాల ద్వారా మనం ఋణ త్రయ విముక్తి పొందటానికి చేయవలసిన కర్మను పూర్వులు నిర్దేశించారు. 


ఋణ త్రయాలు :


1.ఋషి ఋణము, 

2. దేవ ఋణము, 

3. పితృ ఋణము.


1 ఋషి ఋణము: 


ఋషుల వల్ల లభించిన జ్ఞానం బ్రహ్మ చర్య పాలన ద్వారా వేదాధ్యయనం, సంధ్యావందనం కర్మలను నిష్ణగా ఆచరించడం ద్వారా మానవులు ఋషి ఋణాన్ని తీర్చుకోగలుగుతారు.


2. దేవ ఋణము: 


దేవతలకు ఆహారాన్ని అందించడం ద్వారా ఇది తీరుతుంది. యజ్ఞ యాగాది కర్మల నాచరిస్తూ అందు సమర్పించే హవిస్సుల ద్వారా దేవతలకు ఆహారం అందుతుంది. దేవ ఋణ విముక్తికి తోడ్పడుతుంది.


3. పితృ ఋణం: 


మన శరీరాల జన్మ కారణమైన పితృ దేవతల అనుగ్రహాన్ని కూడా మానవులు తప్పని సరిగా పొందాలి. సత్సంతాన రూపంలో కొన్ని దేహాలు సృష్టించబడి సృష్టి కార్యవృద్ధి పొంది పిండోదక దానాలు జరిగితే పితృ దేవతలు తృప్తిపొంది వారు సంతానాన్ని ఆశీర్వదిస్తారు. అప్పుడు పితృ ఋణ విముక్తి కలుగుతుంది.

పితరులు గతించిన అనంతరం వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా వారు ప్రకృతిలో లయించి ఉంటారు. కాబట్టి ఆయా రూపాలలో వున్న పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు, దర్శశ్రాద్ధ తిల తర్పణ రూపంలో తృప్తిపరిస్తే వారివారి కుటుంబాలకు పితృదేవతల ఆశీస్సులు లభించి వారి కుటుంబాలు సుఖ శాంతులతో వర్ధిల్లుతాయి. కావున ప్రతి ఒక్కరు పితృ ఋణ విముక్తుల ఎలా కావాలో చెపుతూ పెద్దలు నిర్దేశించిన కర్మకాండలను విధిగా మనం ఆచరించాలి.


ప్రతి నెలా చేయాల్సిన తిల తర్పణం (దర్శ శ్రాద్ధం) మరియు సంవత్సర శ్రాద్ధ కర్మలు విధిగా చేయాలని పెద్దలు నిర్దేశించారు.


అలాగే, ప్రతిసంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణపక్షం ఆరంభమైన వెంటనే పితృదేవతలందరు భూలోకంలోని తమ తమ సంతతివారు మహాలయ శ్రాద్ధము లేదా తిల తర్పణం చేయుదురని ఆయన్నము లేదా తిలోదకములను తృప్తిగా గ్రహించాలని, భుజించాలని మిక్కిలి ఆశతో వారు భూలోకానికి వచ్చి కార్తీక శుక్ల పక్షం వరకు ఇక్కడ వసిస్తారు.

ఈ మహాలయ పక్షం మరియు ఆ పక్షములో నిర్వహించాల్సిన విధో విధానాలను ఆ సందర్భము వచ్చినపుడు సవివరంగా తెలుసుకుందాం.


1 తర్పణాలు ఎప్పుడాచరించాలి: 


దర్శ శ్రాద్ధమనబడే తిల తర్పణాలను ప్రతి నెలా అమావాస్య, సూర్య సంక్రమణము ఆరంభం నాడు, సూర్య చంద్ర గ్రహణ పుణ్య కాలమునందును, మహాలయ పక్షంలోను, ప్రత్యాబ్ధికములు (శ్రాద్ధములు) చేసిన మరుసటి దినము (పరేహణి) తర్పణం చేయుట ధర్మమని పెద్దలు ఆదేశించి వున్నారు.


2. ఎవరు తర్పణం చేయాలి:

 

I. తండ్రి గతించిన వారందరు తర్పణం చేయాలి. 

II. తండ్రి జీవించివున్నవారు తర్పణములు చేయకూడదు. III. తల్లి జీవించి వుండి, తండ్రి గతించినవారు ఆపై మూడు తరముల పితరులను స్మరిస్తూ తర్పణం చేయాలి.


3. తర్పణం ఎవరెవరికి చేయాలి: 


I.ఒక్క పరేహణి తర్పణం తప్ప మిగతా అన్ని కాలాలలోని తర్పణాలు పితృ మాతృ వర్గ ద్వయ పితరులకు (వారిని ఆహ్వానించి) తర్పణం చేయాలి. 

II. మాతృ/పితృ ప్రత్యాబ్దిక శ్రాద్ధము చేసిన మరుదినము ఉదయమే పితృ వర్గము వారిని మాత్రమే ఆహ్వానించి తర్పణము చేయవలయునని నిర్దేశించబడింది. 

III. మాతా మహులు (తల్లియొక్క తండ్రి) జీవించి వున్నచో మాతృవర్గము వారికి తర్పణము చేయవలసిన అవసరం లేదు.


వర్గద్వయమనగా పితృవర్గము (తండ్రి వైపు) వారు. మరియు మాతృవర్గము (తల్లియొక్క తండ్రివైపు) వారు.


పితృవర్గంలో (పురుషులు):


పితృ(తండ్రి), పితామహ (తాత), ప్రపితామహ (ముత్తాత) తాతకు తండ్రి ఇలా మూడు తరముల వారు. ఈ ముగ్గురిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా దర్భలపై/భుగ్నములపై ఆహ్వానించి తర్పణం చేయాలి.


పితృవర్గంలో (స్ర్తీలు):


మాతృ (తల్లి), పితామహి (తండ్రికి తల్లి), ప్రపితామహి (తండ్రి, తండ్రికి తల్లి) ఇలా మూడు తరాల వారు పై వరుసలో జీవించి వున్న వారిని వదిలి ఆపై తరము వారిని ఆహ్వానించాలి.


మాతృవర్గంలో (పురుషులు):


మాతామహుడు (తల్లికి తండ్రి), మాతుః పితామహుడు (తల్లి తండ్రికి తండ్రి), 

మాతుః ప్రపితామహూడు (తల్లి తాతకు తండ్రి) ఇవి మూడు తరాలు. 

ఈ మూడు తరాల వారిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా ఆహ్వానించి తర్పణం చేయాలి.


మాతృవర్గంలోని స్ర్తీలు: మాతా మహి (తల్లియొక్క తల్లి), 

మాతుః పితామహి 

(తల్లి తండ్రికి తల్లి), మాతుః ప్రపితామహి (తల్లి తండ్రి తండ్రికి తల్లి)

ఇవి మూడు తరాలు.


మానవుడు నేడు ప్రతీ పనికీ ద్రవ్య రూపంలో లాభాన్నే వెతుకుతున్నాడు. అలా ద్రవ్య-వస్తు రూపంలో పొందలేని అనేకాదులు భక్తి శ్రద్ధలతో ఈ కర్మ చేయడం వలన మనం పొందవచ్చును.


ప్రతి శ్రాద్ధ కర్మ, తర్పణంరోజున, గతించిన పితరులు, వసు రుద్ర ఆదిత్య స్వరూపులై ప్రకృతిలో అంతర్లీనమై వున్న పితృదేవులను ఆహ్వానించి, అర్చించి తిల తర్పణాదులు ఆచరించి, అనంతరం వారిని యధా స్థానానికి సాగనంపడం సదాచారం.


భారతీయ సంస్కృతి మనకు ప్రసాదించిన ఉత్కృష్టమైన ఈ కర్మకాండ ఎంతో అమూల్యమైనది. ఈ విధముగానైనా మనం, మన పిల్లలు తమ తమ, తండ్రి, తాత, ముత్తాతలను, ఆపై తరంవారు వారి భార్యల (సపత్నీకానాం) పేర్లు తెలుసుకుని గుర్తుంచుకునే అవకాశం కలుగుతుంది.


అట్లే తల్లివైపు మూడు తరాల స్ర్తీ పురుషుల పేర్లు గోత్రం కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగానైనా మన పూర్వులను స్మరించుకునే అవకాశం కలుగుతుంది.


మనంవారికేం చేయగలుగుతాం? మననుండి వారు ఆశించేదేమిటి? 

కేవలం భక్తితో వారిని స్మరిస్తూ ఆహ్వానించి తిల తర్పణం (నువ్వుల నీళ్లు దర్భలపై వదలడమే కదా! 

మనకీ జన్మకారుకులైన పితృదేవలతలకు కృతజ్ఞతలర్పించుకోవడం ( అంటే ఈ తర్పణాల ద్వారా) మన విద్యుక్త ధర్మం కదా! దీనిద్వారా మన కుటుంబంలో తండ్రి, తల్లివైపు మూడు తరాల వారిని తెలుసుకునే సదవకాశం కలుగుతుంది. ఈ ధర్మం లుప్తం కానంత కాలం నిరంతరం సాగే ప్రక్రియ.


తర్పణం చేయకుంటే ఏమవుతుంది: 


తర్పణం అనేది పితృదేవతలకు మన కృతజ్ఞతలు తెలుపుకునే మానసిక యజ్ఞంలాంటిది. లౌకికంగా ఆలోచిస్తే మనకు క్షణ కాలం బస్సులో సీటుఇచ్చిన వాడికి లేదా ఇంకా ఏదో చిన్న సహాయంచేసిన వారికి కృతజ్ఞతలు (ధాంక్స్ అని చెపుతాము) అంటూ కరిగిపోతూ చెబుతామే! 

మరి మనకు ఈ మానవ జన్మనిచ్చి, ఈ శరీర సృష్టికే కారణమై, మనకు జీవితాన్ని ప్రసాదించిన పితృదేవతలకు కృతజ్ఞతలు తెలుపకపోవడంలో ఎంత స్వార్ధమో, ఎంత మూర్ఖమో ఒక్క సారి అందరూ ఆలోచించండి.


కాబట్టి ప్రతి ఒక్కరు మన పూర్వులకై ఇలాంటి సత్కర్మలను ఆచరించి వారిని తృప్తిపరుస్తూ వారి ఋణాన్ని తీర్చుకుని వారి ఆశీస్సులు పొందడం సదా వాంఛనీయం, సర్వ శ్రేయస్కరం‌.


అన్ని అమావాస్యలు మరియు సంక్రమణ తర్పణాలు తప్పక చేయాలా: 


వీలైనంతవరకు అన్ని అమావాస్యలు (సంవత్సరంలో 12సార్లు) సౌరమానం ప్రకారం సంక్రమణ ఆరంభ దినాలు (సంవత్సరంలో 12 సంక్రమణాలు) మరియు గ్రహణాల, మహాలయ పక్షాల వంటి సందర్భాల్లో తర్పణాలు చేయాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. 


అలా వీలుకానిపక్షంలో అమావాస్య తర్పణలు తప్పక చేయాలి. సౌరమానులకు సంక్రమణాలు ప్రధానం. ఆమావాస్య తర్పణాలతో బాటు (ఉత్తరాయణ పుణ్యకాలం మకరం) సౌరమాన సంవత్సర ఆరంభంలో మేషం, దక్షిణాయన ఆరంభంలో కర్కాటకం మరియు తుల, సంక్రమణాలు, ఈ నాలుగు సంక్రమణాలలోనైనా తప్పక తర్పణం చేయాలి. 

మహాలయ పక్షాలలో విధిగా తర్పణం చేసి తీరాల్సిందే. ఇదంతా ఎంతో కష్టమనుకుని బాధపడుతూ చేయడం సరికాదు. మనసారా శ్రద్ధ, భక్తితో మన పితృదేవులకు కృతజ్ఞతలు తెలుపుకునే ఉత్తమ యజ్ఞంలా భావించి చేయాల్సిందే కానీ, ఏదో వంతుకు, నలుగురేమైనా అనుకుంటారేమో అని చేయాల్సింది కాదు. అందుకే ‘శ్రద్ధ యా దీయతే ఇతి శ్రాద్ధం’ అన్నారు పెద్దలు.


బ్రహ్మకపాలం, కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు మరియు పిండ ప్రదానాలు చేస్తే ఇక తర్వాత చేయనవసరం లేదా:


‘దేవ పితృ కార్యాభ్యాం నప్మ మది తవ్యం’ అంటుంది శాస్త్రం. 

అంటే ఆయా సందర్భాల్లో ఆచరించాల్సిన దేవ, పితృ కార్యాలను తప్పనిసరిగా విధిగా ఆచరించాలని దీని అర్ధం. అంతేకానీ బ్రహ్మకపాలం, కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు మరియు పిండ ప్రదానాలు చేస్తే ఇక తర్వాత చేయాల్సిన అవసరం లేదనేది ఎక్కడా చెప్పబడలేదు. ఈ వాదన సరైంది కాదు. ప్రతి అమావాస్య, సంక్రమణం ఇతర విశేష దినాలలో పితృదేవతలు మననుండి ఆశించేది కృతజ్ఞతలే కదా?

ఈ శ్రాద్ధ తర్పణాల ద్వారా పితృదేవులకు కృతజ్ఞతలందచేసుకోవడంలో బద్ధకించడం ఘోరమైన అపచారమే అవుతుంది. 

ఈ సదాచారాన్ని మనంపాటించకపోతే, మన పితృదేవతలను మనం మరిచిపోవడమే అవుతుంది. మనమే మన పూర్వులను మరిచిపోతే మన పిల్లలు, తర్వాతి వారు మన వంశం గురించి ఎలా తెలుసుకోగలుగుతారు?


కాబట్టి తీర్ధ విధులు (తీర్థ క్షేత్రాలలో కావించే శ్రాద్ద తర్పణాలు) వేరు, నిత్యాబ్ధీకాలు, తర్పణాలు వేరు. కావున ఈ కర్మలు ఆచరించడం భారమనుకోవడం భక్తి శ్రద్ధలు లేక విసుగుతో చేయడం క్షమించరాని అపచారమే తప్ప మానవ ధర్మమనిపించుకోదు.


తర్పణము చేయుటకు అశక్తులు మరియు అనర్హులకు ఏమిటి పరిష్కారం: 


ఒక వీధిలో ఒక చోట మంటపెట్టి అందులో గుప్పెడు మిరపకాయలు గనక వేస్తే దాని ఘాటు ఆ వీధిలోని వారందరికీ ఎలా చేరుతుందో అదే విధంగా ఆ వీధిలో ఏ కొందరో ధర్మకార్యాలు చేస్తుంటే దాని ప్రభావం, అస్సలు ఏమీ చెయ్యని వారికి కూడ అందుతుందనే వాస్తవం పై ఉదాహరణ వివరిస్తుంది. పూర్వం రాజుల కాలంలో ఋషులు యజ్ఞ యాగాదులు, జప తపాలు చేస్తూ వుంటే, అలా చేసే వారిని రాజులు ప్రోత్సహించి, పోషించేవారు.

ఆ రాజ్యంలో సుఖ శాంతులు విలసిల్లుతాయనేది ప్రత్యక్ష సత్యం.