ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
22, జులై 2025, మంగళవారం
ఉన్నదానితో
🐦🔥🐦🔥🐦🔥🐦🔥🐦🔥🐦🔥🐦🔥
*ఉన్నదానితో సంతృప్తి చెందకుండా*
ఒక సాధువు ఊళ్లు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు.
అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే.. నేలపై పడి ఉన్న నాణెం ఒకటి అతడి కంట పడింది. వంగి, చేతుల్లోకి తీసుకున్నాడు.
కానీ ఆ నాణెం వల్ల అతడికేం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడం కాదు, అవసరం లేదు. తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి. అవి చాలు.
ఆ నాణెం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు. అందువల్ల ఆ నాణేన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు.
దాని అవసరం ఉన్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు!
చివికిన బట్టలతో కొందరు ఎదురైనా వాళ్లూ సంతోషంగానే ఉన్నారు తప్ప, ఎవరినీ చెయ్యి చాచడం లేదు. సాధువుకు సంతోషం వేసింది.
ప్రజలు సంతృప్తిగా ఉండడం, అతడికి సంతోషాన్నిచ్చింది. ఆ రాత్రి అక్కడే ఒక చోట విశ్రమించాడు.
తెల్లారి సాధువు నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు, తన సైన్యంతో పక్కరాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు.
అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే, రాజు వారికి ఆగమని సైగ చేసి, రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు.
ఓ సాధు పుంగవా.. రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళుతున్నాను.
నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి’’ అని కోరాడు. సాధువు తనకు దొరికిన నాణేన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు.
రాజు ఆశ్చర్యపోయాడు. ‘ఏమిటి దీనర్థం’ అన్నట్లు సాధువు వైపు చూశాడు. సాధువు చిన్నగా నవ్వి, ‘ఓ మహారాజా.. ఈ నాణెం మీ రాజ్యంలోనే నాకు దొరికింది.
దీని అవసరం నాకు లేకపోవడంతో, అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను.
అలాంటి వాళ్లు ఒక్కరూ కనిపించలేదు. అంతా సంతృప్తిగా కనిపించారు.
ఉన్నదానితో సంతృప్తి చెందకుండా, ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే కనిపిస్తున్నారు. అందుకే ఈ నాణెం మీకు ఇచ్చాను’’ అని చెప్పాడు.
రాజు అంతరార్థం గ్రహించాడు. దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగాడు.
నిరంతరం.. లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉంటే, ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం.
*ఆ భాగ్యం లేని వాడు.. ఎంత ఉన్నా.. ఏమీ లేనివాడే!*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*సర్వేజనా సుఖినోభవంతు*
*లోకా సమస్త సుఖినోభవంతు*
*శుభం భూయాత్*
*ఓం శాంతి శాంతి శాంతిః*
🙏🙏🙏🙏🙏
కరివేన నిత్యాన్నదాన సత్రం satraalu
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
https://youtu.be/B6OYzjvhf14?si=sv7KPJSeWoezT5Ee
*అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం, ఈక్రింది సెల్ నెంబర్లను ప్రకటించారు 🙏*
1. *శ్రీశైలం* :-
8333907 784--8333907 787
2.*కర్నూలు* *సెంట్రల్* *ఆఫీస్* :-
8333907 783---8333907 80
3. *మహానంది* :-
8333907 802,---8333907 803
4.*త్రిపురాంతకం* :-
8333907 794,----8333907795
5. *_విజయవాడ_* *వృద్ధాశ్రమం* :-
8333907813,--8333907 807.
6.*కాణిపాకం* :-
8333907812,--8333907 813.
7. *భద్రాచలం* :-
8333907 796--8333907 797.
8. *యాదగిరిగుట్ట* :-
8333907 815,---8333907813.
9. *అలంపూర్* :-
8333907 805,---8333907806.
10. *అరుణాచలం* :-
8333907 816, 8333907 817.
*11,రామేశ్వరం* :-
8333997 793,--8333907 813
12. *షిర్డీ* :-
8333907 798,--8333907 800.
13. *కాశీ* :-
8333907 790,---8333907791.
14. *బృందావనం* ( *మధుర* ),
8333907 789,--8333907 813.
15. *నైమిశారణ్యం* :-
8333907 804,---833390 813.
16. *తిరుపతి* :-
8333907 807,---8333907810.
*అత్యవసర* *సేవల* *కొరకు* ,8333907813,---8333908808.
🚩లోకా సమస్తా సుఖినో భవంతు.
అదియే సత్యము...
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *సత్యస్య వచనం శ్రేయః*
*సత్యాదపి హితం వదేత్|*
*యద్భూతహిత మత్యన్తం*
*ఏతత్సత్యం మతం మమ||*
*--- _సుభాషితరత్నావళిః_ ---*
తా𝕝𝕝 సత్యము చెప్పుట శ్రేయస్కరము.... సర్వభూతహితముగా పలుకు సత్యము మంచిది.... ఎందుచేతననగా *దేనివలన సర్వభూతహితమగునో అదియే సత్యము....*
✍️VKS ©️ MSV🙏
కవితా రథి - దాశరథి.
అసలు సిసలు కవితా రథి - దాశరథి.
దాశరథి కృష్ణమాచార్యులు కేవలం సినీగేకవి మాత్రమే కాదు. ఒక అభ్యుదయ కవిగా, విప్లవ కవిగా నిజాంకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ వీరుడు.
22-7-1925 వరంగల్ జిల్లాలో వెంకటమ్మ, వెంకటాచార్యులకు జన్మించాడు. నిజాం నిరంకుశ పాలనలో విద్యాభ్యాసం చేశాడు. "మా నిజాం రాజు జన్మజన్మల బూజు" అంటూ అక్షరానికి ఉద్యమ స్వరూపం ఇచ్చిన వ్యక్తిత్వం ఆయనది. నిరంతరం తిమిరంతో సమరం చేస్తూ కాంతికిరణాలను ప్రసారంచేసే కవి సూర్యుడు. అగ్నిధార, రుద్రవీణ, మార్పు నా తీర్పు, తిమిరంతో సమరం వంటి ఆయన అనేక కవితా సంకలనాలు నాటికి నేటికి చెక్కుచెదరని సంపదులుగా తెలుగు నాట వెలసాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మొదటి ఆస్థాన కవిగా గౌరవం ఆయనకే దక్కింది.
'ఖుషి ఖుషిగా నవ్వుచు చలాకి మాటలు రువ్వుచు' సినీ రంగంలో ప్రవేశించి... 'గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుది' లాంటి హుషారు గొలిపే గీతాలతో జనాలను ఈలలు వేయించారు. 'నడిరేయి ఏ జాములో'' అంటూ 'వేయి వేణువులు మ్రోగే వేళ ననుపాలింపగా నడచీ వచ్చితివా' అని బుద్ధిమంతుడిలా భక్తి గీతాలు అందించారు. 'దివి నుండి భువికి దిగివచ్చి' 'నన్ను వదిలి నీవు పోలేవులే అన్న యుగళ గీతాలు నేటికీ మన మధ్య నుండి పోలేవులే. 'ఏ ధివిలో విరిసిన పారిజాతమో' అంటూ బాలు గారి గళాణినికి ఎంతో గుర్తింపు తెచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే 'మదిలో వీణలు మ్రోగే', 'నేనె రాధనోయి,' లాంటి వీనుల విందైన వీణ పాటలంటే దాశరథే అన్న ప్రత్యేక ముద్ర వేయించుకొన్నారు. 'తల నిండ పూదండ దాల్చిన రాణి,' అన్న లలిత గీతం ఘంటసాల గళం నుండి పరిమళాలు వెదజల్లింది.
అందుకే ఆ పేరులో
'దాశరథి' అంటే శ్రీరామచంద్రుడుగ
'దా' లేకుండా 'శరథి' అంటే సముద్రం లాంటివాడు, కవితలనె అమ్ముల పొది,
'శ' లేకుండా 'రథి' అంటే అతిరధి మహారధి, మార్గదర్శియని '
ర' కూడా లేకుండా 'థి'అంటే బుద్ధిశాలి, జ్ఞాని అని అర్థం.
ఇంతటి మహాకవిని ఆయన శత వసంతాల జన్మదినాన తలుచుకోవడం తెలుగు వారికి గర్వ కారణం.
💐 శుభదినం 💐
- కడియాల
హరిహరనాధుడు
హరిహరనాధుడు-తిక్కన.
శ్రీయనగౌరినాబరగు చెల్వకుఁజిత్తముబల్లవింప భ
ద్రాయతమూర్తియై హరిహరంబగురూపముఁదాల్చి విష్ణురూ
పాయనమశ్శివాయ యనిగొల్చెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చుపరరూపముగొల్తు నభీష్ఠ సిధ్ధికిన్!!
ఆం-మహాభారతం-విరాట ప్రారంభపద్యం!
తిక్కన శివకేశవాభేదవాది.తన సమకాలంలో విజృభించే శైవ వైష్ణవ మతముల ఘర్షణ నణగింపనెంచి యతడు హరిహరనాధుని నెలకొలిపి ,హరిహరాద్వైతమును ప్రచారమొనరించెను.తద్వారా చేతనైనంతమేరకు మతఘర్షణలనణగింపయత్నించెను.అతని ఫలించెనోలేదో తెలియదుగాని నాటి యతని సామాజిక సంస్కరణ దృష్టికిప్రతీకగా ఈపద్యము హరిహరాభేదసూచకమై ఆంధ్రవాఙ్మయము నలంకరింపజేసినది.
ఇందు శివకేశవాభేదము ప్రస్ఫుటముగా ప్రతిపాదింపబడినది.
స్వస్తి!🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
