11, ఫిబ్రవరి 2025, మంగళవారం

తీర్ధం..విభూతి..*

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*

*తీర్ధం..విభూతి..*

"స్వామీ దత్తాత్రేయా నాకీ బాధను తగ్గించు నాయనా..లేకపోతే నన్ను త్వరగా తీసుకుపో తండ్రీ!.." అంటూ ఆ వృద్ధురాలు శ్రీ స్వామివారి మందిరం లోని మంటపం లో పడుకొని మెలికలు తిరిగిపోతూ వేడుకుంటున్నది..సుమారు పది రోజుల నుంచీ కడుపులో నొప్పితో బాధపడుతోంది ఆవిడ..సుమారు డెబ్భై ఏళ్ల పైబడిన వయసు..వైద్యులకు చూపించాలని ఆమె కుమారుడు శతవిధాల ప్రయత్నం చేసాడు..ససేమిరా ఒప్పుకోలేదు ఈవిడ..తాను దత్తాత్రేయ స్వామినే నమ్ముకున్నానని..అక్కడికే తీసుకెళ్లమని కొడుకుతో తేల్చి చెప్పి..మొగలిచెర్ల కు వచ్చి..శ్రీ స్వామివారి మందిరం వద్ద ఉన్నది..ఆమె పేరు శకుంతలమ్మ..ఊరు కృష్ణారెడ్డిపల్లె..

మూడురోజులు గడిచాయి..రోజూ ఉదయాన్నే శ్రీ స్వామివారి కి అర్చక స్వాములు ప్రభాత పూజ హారతి పూర్తి చేసిన తరువాత..వరుస క్రమం లో వచ్చి శ్రీ స్వామివారి తీర్ధాన్ని తీసుకుంటుంది..ఆ తరువాత అక్కడే  పాదుకలు ఉంచిన చిన్న మంటపంలో ఉన్న పాత్ర నుంచి విభూతి తీసుకొని..తన కడుపు మీద రాసుకొని..మరికొంచెం విభూతిని నోట్లో వేసుకొని..తిరిగి వచ్చి మంటపం లో పడుకునేది..బాధ తీవ్రంగా వున్నప్పుడు..నొప్పి భరించలేక శ్రీ స్వామివారిని ప్రార్ధించేది..అంతేకానీ..మరే విధమైన వైద్యాన్ని ఒప్పుకోలేదు..నాలుగోరోజు కల్లా శకుంతలమ్మ కడుపులో నొప్పి కొద్దిగా తగ్గినట్టు అనిపించింది..

ఈ నాలుగురోజుల పాటు ఆవిడ పడుతున్న బాధను దగ్గరా వుండి గమనిస్తున్న నాకు.."ఎందుకు ఈవిడ ఇంత బాధపడుతూ మొండిగా ఇక్కడే ఉంది?..ముందుగా మానవప్రయత్నం చేయాలి కదా?..పూర్తిగా దైవమే వచ్చి ఆదుకోవాలని కోరుకోవడం మూర్ఖత్వం కదా?.." అని చాలాసార్లు అనిపించింది..ఆమాటే ఆవిడ కుమారుడి తో అన్నాను కూడా..అతను నా వైపు అదోలా చూసి.."అమ్మను డాక్టర్ల వద్ద చూపించాలని ఎన్నో సార్లు అనుకున్నాను..కానీ ఆవిడ ఒప్పుకోలేదు..నేను నిస్సహాయంగా ఉండిపోయాను.." అన్నాడు..

ఐదోరోజు కు ఆవిడ నొప్పి చాలాభాగం తగ్గిపోయింది..కేవలం శ్రీ స్వామివారి తీర్ధం..విభూతి మాత్రం తోనే తాను కోలుకున్నది..నాకు విపరీతమైన ఆశ్చర్యం వేసి.."అమ్మా..మీరు ఏ నమ్మకం తో ఇంత నొప్పి భరిస్తూ వుండగలిగారూ.." అని అడిగాను..

"నాయనా..నేను ఆ దత్తాత్రేయ స్వామిని పరిపూర్ణంగా నమ్మాను.. దానికీ కారణం ఉంది..నాకు ముప్పై ఏళ్ల వయసప్పుడు..స్వామిని మాలకొండలో మొదటిసారి చూసాను..అప్పుడు వీడికి మూడేళ్ల వయసు..ఆ తరువాత కూడా మా ఆయన నేనూ రెండు మూడుసార్లు స్వామివారిని దర్శించుకున్నాము..ఒక శనివారం నాడు స్వామివారు పార్వతీదేవి మఠం వద్ద కూర్చుని వున్నారు..మా దంపతులము స్వామికి నమస్కారం చేసి ఎదురుగా కూర్చున్నాము..స్వామివారు మమ్మల్ని ఆశీర్వదించారు..ఆరోజు నుంచీ స్వామివారంటే మాకు గురి కుదిరింది..ఒకసారి మేము మాలకొండ వెళ్ళి, పార్వతీదేవి మఠం వద్దకు వచ్చేసరికి  మా ఆయనకు కడుపులో నొప్పి వచ్చింది..బాగా బాధ పడ్డారు..శ్రీ స్వామివారు స్వయంగా అమ్మవారి ముందున్న తీర్ధం తీసి మాకు ఇచ్చారు..కొద్దిసేపటికే ఆయన కడుపులో నొప్పి తగ్గిపోయింది..అది నాకు మనసులో నాటుకుపోయింది..శ్రీ స్వామివారు ఇక్కడ సమాధి చెందిన తరువాత కూడా మేము చాలా సార్లు ఇక్కడికి వచ్చాము..నాకు కడుపులో నొప్పి రాగానే..మా వాడితో " నాకు ఏ వైద్యమూ వద్దు..నన్ను మొగలిచెర్ల లోని స్వామివారి మందిరానికి తీసుకెళ్లు" అని మొండికేశాను.. నా నమ్మకం స్వామి నిలబెట్టాడు..మూర్ఖత్వం అనుకుంటావో..మొండితనం అనుకుంటావో..లేదా స్వామి మహిమ అనుకుంటావో నీ ఇష్టం.." అన్నది..

మూర్ఖత్వం ఆవిడది కాదు..నాది అని నాకు ఆ క్షణంలో తెలిసివచ్చింది..కాకుంటే..ఇన్నాళ్లు శ్రీ స్వామివారి మందిరం లో వుంటూ..ఇటువంటి లీలలు ఎన్నో చూస్తూ కూడా అలా అనుమానం పడటం మూర్ఖత్వం కాక మరేమిటి?..

సర్వం..

శ్రీ దత్తకృప!.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

నక్షత్రాల శ్రీనివాస దివ్య వైభవం

 *భజే శ్రీనివాసమ్.*

*(ఇరవై ఏడు నక్షత్రాల శ్రీనివాస దివ్య వైభవం)*

*రచన.*

*తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్త.*

🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤

*హస్త -- 13*

హస్తా నక్షత్రానికి అధిపతి సూర్యభగవానుడు. సమస్త జీవకోటికిఆధారభూతుడైన సూర్యనారాయణుడు శ్రీమన్నారాయణుని స్వరూపమే.

పన్నెండు మాసాలలో పన్నెండు పేర్లతో సంచరిస్తూ ఉండే సూర్య భగవానుడుద్వాదశాత్ముడు అనబడుతున్నాడు. చైత్రమాసంలో ధాతగానూ,వైశాఖమాసంలో ఆర్యమునిగానూ, జ్యేష్ట మాసంలో మిత్రుడిగానూ,ఆషాఢమాసంలో వరుణునిగానూ, శ్రావణంలో ఇంద్రునిగానూ,భాద్రపదంలో వివస్వంతునిగానూ, ఆశ్వయుజ మాసంలో పూష అనే నామం తోనూ, కార్తీకంలో పర్జన్యునిగానూ, మార్గశిరంలోఅంశుమంతునిగానూ, పుష్యంలో భగునిగానూ, మాఘంలో త్వష్ట అనే పేరుతోనూ,

ఫాల్గుణంలో విష్ణువుగానూ ఆరాధించబడుతున్నాడు. ఈవిధంగా ప్రత్యక్ష భగవాను డైన సూర్యుడు నెలకొకరూపాన్ని ధరిస్తూ ఈ సకల జీవకోటికి

చైతన్యాన్ని ప్రసాదిస్తున్నాడు.

పూర్వకాలంలో ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీమన్నారాయణుల వారు  నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరించాడు. సంహరించినఅనంతరం ఉగ్రరూపంతో వెలిగిపోతున్న శ్రీ నరసింహమూర్తిని ప్రహ్లాదుడు

అనేక విధాలుగా స్తుతించి శాంతపరిచాడు. అప్పుడా నరసింహ రూపమురెండు రూపాలుగా ఉద్భవించింది. నరరూపం నరుడుగానూ, సింహ

రూపం నారాయణునిగానూ ఆవిర్భవించింది.వీరే నర నారాయణులు.వీరిద్దరూ బదరీ వనంలో తపస్సు చేస్తుండగా వీరి తపస్సు భంగం చేయడానికి

ఇంద్రుడు అప్సరసలను పంపించాడు. వారెన్నో విధాల ఆటపాటలాడితమ అద్భుత సౌందర్యంతో నర నారాయణుల తపస్సును భంగం చేయాలని

ప్రయత్నించారు. ఎన్ని విధాల ఆటపాటలాడినప్పటికి వారి తపోభంగంచేయడం వీరి వల్ల కాలేదు. నారాయణుడు తన చేతిలో ఒక దర్భను తీసుకుని ఒకసారి తొడమీద వ్రాచాడు. వెంటనే నారాయణుని తొడనుంచి

అద్భుత సౌందర్యరాశి ఆవిర్భవించింది. ఊరువు నుండి జన్మించినది కాబట్టి ఊర్వశి అని పిలువబడింది. ఈ అద్భుత సౌందర్యరాశిని చూసిన

అప్సరసలు సిగ్గు పడి దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయారు.నారము అంటే నీరు. నీటి నుంచి ఉద్భవించినవాడు, నీటియందే

శేషతల్పసాయిగా ఉండేవాడు నారాయణుడు. సృష్టి ప్రారంభంలో

పరమపురుషుడైన శ్రీమన్నారాయణుడే ప్రాణులన్నింటిని సృష్టించాడు. ఆ స్వామి సంకల్పంచేతనే పంచభూతాలు, బ్రహ్మాది దేవతలు, సప్త ఋషులు,ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు వంటి వారందరూ ఆవిర్భవించారు.

ఆ శ్రీమన్నారాయణుని తేజస్సు మహాశక్తి వంతమైనది.

సూర్యునియందుండే తేజస్సుకు మూలకారకుడు ఈ పరబ్రహ్మ మూర్తియే. ఆ తేజస్సే విష్ణుస్వరూపమై భాసిల్లుతున్నది. తిరుమల బ్రహ్మోత్సవాలలో

శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అమితానందాన్నికలుగ జేస్తాడు.  ఈ సృష్టికి కారణభూతుడైనవాడు, సర్వ శ్రేష్ఠుడు, సర్వాభీష్ట ప్రదాత, సకల పాపరహితుడు, సర్వ వ్యాపకుడు అయిన శ్రీమన్నారాయణుడు

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరునిగా వెలసి కలియుగంలో తనను నమ్మి కొలిచిన వారందరినీ అనుగ్రహిస్తున్నాడు. తిరుమలలో ఉన్న సమయంలో ఉదయాన్నే

లేచి కాలకృత్యాలను తీర్చుకుని సూర్యభగవానునికినమస్కరించిన వారికిఎటువంటి అనారోగ్యము దరిచేరదు. సర్వ సౌభాగ్యాలూ ఒనగూరుతాయి.ఈ సృష్టిలో జన్మించిన ప్రతి జీవికి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉంటాయి. అయితే మానవునికి ఒక్కనికే పదకొండవదైనమనస్సు కూడా ఉన్నది. ఈ మనో ఇంద్రియం వలననే మనో ఇంద్రియ

కారణము చేతనే మానవుడు ధర్మా ధర్మ విచక్షణ చేయగలుగు తాడు.విషయమే ఆకారంగా గలది మనస్సు. ఈ మనస్సును నిశ్చలం చేసుకుని ఏకాగ్రతతో శ్రీమన్నారాయణుని ధ్యానించినవారికి ఆత్మ సాక్షాత్కారంకలుగుతుంది.

మనస్సును వశంలో ఉంచుకుంటే రాగద్వేషాలకు, అహంకార మమకారాలకు అతీథంగా ఉండగలుగుతాము. విరాగి, జ్ఞాని అయినమానవుడు మాత్రమే మనస్సును తన ఆధీనంలో ఉంచుకొనగలుగుతాడు.

అప్పుడు అతడు పరబ్రహ్మను సాధించగలుగుతాడు. ఆ బ్రహ్మానందంఅనుభవించిన వారికి జరా మృత్యువులు ఉండవు. ఆకలి దప్పులు ఉండవు.

అతని ఆత్మ పరమాత్మలో విలీనమైపోతుంది. అతడు పూర్తిగా పరబ్రహ్మమూర్తిలో ఐక్యమొందుతాడు.దేవతలు అశరీరులు. వారికి శరీరం లేదు. అందువలన వారు కర్మలను ఆచరించలేరు. భూలోకంలో జన్మించిన ప్రాణులన్నింటిలో

మానవులకు మాత్రమే కర్మ చేసే వీలున్నది. పశుపక్ష్యాదులు, జంతు  జాలము, తమయొక్క పూర్వజన్మ కర్మఫలాలన్నీ అనుభవించ వలసిందే తప్పపుణ్య కర్మలను ఆచరించి తమ జీవితం పాపరహితం చేసుకోలేరు. ఇందుకుకారణం వీటికి పదకొండవ ఇంద్రియమైన మనస్సు లేక పోవటమే.మానవుడు ఒక్కడే యుక్తాయుక్త విచక్షణ చేయగలుగుతాడు. తాను

పూర్వజన్మలో చేసిన కర్మఫలాలను అనుభవిస్తూ ఈ జన్మలో పుణ్యకార్యాలనుఆచరించి శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందగలిగే అదృష్టం ఒక్క

మానవులకే ఉన్నది.

ఈ చరాచర జగత్తంతా శ్రీమన్నారాయణునిచే ఉద్భవించింది.

అందువలననే అతడు సర్వభూతాలకు ఈశ్వరుడు. సర్వేశ్వరుడుఅనబడుతున్నాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలములన్నీ అతడే. అతడే

సత్యము, అతడే నిత్యము, ఆ శ్రీమన్నారాయణుని అర్చించిన వారికి సర్వదేవతలూ నమస్కరిస్తారు. సూర్యుని కుమారుడైన యమధర్మరాజు

కూడా అతనికి నమస్కరిస్తాడు.

కాబట్టి మానవులందరూ ఎల్లవేళలా ఆ శ్రీనివాసునే స్మరిస్తూ జీవించాలి. శ్రీనివాసుడు భక్త సులభుడు. అమిత దయగల వాడు. ఇంతటి మహోన్నతమైన టువంటి ఓ శ్రీనివాసా! నీవుండగా మాకు భయమేలనయ్యా!

నీకివే మా నమస్కారములు.

ఓ శ్రీనివాసా! 

నీకివే మా నమస్కారములు.

ఓ శ్రీమన్నారాయణా!

నీకి ప్రణామములు.

 ఓ జగద్రక్షకా! నీకివే మా నమస్కారములు.

*" శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్*

*శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ”* 

🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

నక్షత్రాల శ్రీనివాస దివ్య వైభవం)*

 *భజే శ్రీనివాసమ్.*

*(ఇరవై ఏడు నక్షత్రాల శ్రీనివాస దివ్య వైభవం)*

*రచన.*

*తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్త.*

🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅

 *ఉత్తర ఫల్గుణి -- 12*

ఉత్తరా నక్షత్రానికి అధిపతి. ఉత్తర నక్షత్రానికి అధిపతి భృగుడు. ఉత్తర శ్రీమన్నారాయణుని ప్రియపత్ని లక్ష్మీదేవి నక్షత్రం.

దేవదానవులు క్షీర సాగర మధనం చేసినప్పుడు అందులోనుంచి

ముందుగా హాలాహలం పుట్టింది. దానిని శివుడు మింగి తన గళంలో వుంచుకున్నాడు. ఆ తరువాత కామధేనువు పుట్టింది. దీనిని బ్రహ్మ తీసుకున్నాడు. అటు తరువాత ఉచ్ఛైశ్రవము ఉద్భవించింది. దీనినిబలిచక్రవర్తి తీసుకున్నాడు. ఇంకా మధించగా ఐరావతం వచ్చింది. దీనిని

ఇంద్రుడు తీసుకున్నాడు. ఆ పిమ్మట వచ్చిన కౌస్తుభాన్ని శ్రీ మహావిష్ణువు ఇష్టపడి తీసుకున్నాడు. ఇంకా చిలుకుతుండగా పారిజాతము, కల్పవృక్షము,ఉద్భవించాయి. ఈ రెండింటినీ ఇంద్రుడు తీసుకున్నాడు.

అటు తరువాత క్షీర సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆ తల్లి సౌందర్యం ఇంతా, అంతా అని వర్ణించ అలవి కానిది. అద్భుతసౌందర్యరాశి అయిన శ్రీ మహాలక్ష్మిని చూసి దేవదానవు లందరికీ నోట  మాట రాలేదు. అక్కడ ఉన్న వారందరూ ఆ మనోహర మూర్తిని అనేక

విధాల సేవించారు. దేవేంద్రుడు ఆమెకు ఆసనం సమర్పించాడు.

సముద్రుడు అద్భుత వస్త్రాలను ఇచ్చాడు. వరణుడు వైజయంతీ మాలనుసమర్పించాడు. సరస్వతి ముత్యాల హారాన్ని బహూకరించింది.బ్రహ్మదేవుడు అద్భుతమైన పద్మాన్ని ఇచ్చాడు.

అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి తామర పూలమాలను చేతిలో తీసుకుని అద్భుత తేజస్సుతో వెలిగిపోతూ తన భర్త మెడలో ఈ మాలను వేసి

వరించాలని నడిచి రాసాగింది. అక్కడ ఉన్న వారందరూ ఈ అద్భుత సౌందర్యరాశి ఎవరి మెడలో ఈ మాలను అలంకరించి భర్తగా స్వీకరిస్తుందాఅని ఆత్రంగా చూడసాగారు. ఆమె ఒక్కొక్కరిని పరికించి చూస్తూ చివరికి

శ్రీ మహావిష్ణువు వద్దకు రాగానే అక్కడే ఆగి, ఇతడే తనకు భర్తగా నిర్ణయించుకుని ఆ స్వామి మెడలో మాలను వేసింది. శ్రీమన్నారాయణుడు

చిరునవ్వుతో శ్రీ మహాలక్ష్మిని భార్యగా స్వీకరించి తన హృదయంలో స్థానం

కలిపించాడు. అక్కడ వున్న వారందరూ ఎంతో సంతోషపడ్డారు. దేవదుందుభులు మ్రోగాయి. అందరూ శ్రీలక్ష్మీనారాయణులను ఎన్నోవిధాలస్తుతించారు.

ఆ విధంగా “శ్రీ”ని తన వక్షస్థలంలో ధరించిన శ్రీమన్నారాయణుడే

మన శ్రీనివాసుడు. వక్షస్థల మహాలక్ష్మితో తన భక్తులందరకూ అమితమైన ఆనందాన్ని కలుగజేసేది ఈ శ్రీనివాసుడు. ఒక్క క్షణం కూడా విడవకుండా

శ్రీమహాలక్ష్మి శ్రీమన్నారాయణుని హృదయంలో దివ్యంగా వసిస్తున్నది.అందుకే శ్రీమన్నారాయణుడు సర్వ ఐశ్వర్యాలకూ, సర్వ భోగాలకూ

నిలయమైన వాడైనాడు. లక్ష్మిని హృదయంలో ధరించిన శ్రీనివాసుడుకళ్యాణ నిధియై వెలుగొందుతున్నాడు. అందుకే ఆ స్వామిని అర్చించినవారికి

సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. అన్ని అవతారాలలోనూ శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణులవారితోనే

వెన్నంటి ఉన్నది.శ్రీ మన్నారాయణుడు దేవతా రూపం ధరించినప్పుడుదేవతగానూ, మానవ రూపం ధరించినప్పుడు మానవస్త్రీగానూ జన్మించి

ఎప్పుడూ సహచరిగా వున్నది. వారి అన్యోన్యత లోకాలన్నింటికీ ఆదర్శము,మహదానందము.

తిరుమలలో రోజూ జరిగే శ్రీ లక్ష్మీ శ్రీనివాసుల కళ్యాణం

జగత్కళ్యాణమే. ఆ దంపతులిద్దరూ పరస్పరమూ ఒకరిపైనొకరికి అత్యంత

అనురాగము కలవారు. శ్రీ మహాలక్ష్మిని హృదయంలో ధరించిన

శ్రీనివాసుడు పరమ దయాస్వరూపుడు. పరమానందపురుషుడు.

పురుషులలో ఉత్తముడు. అతని తేజస్సు వర్ణింపశక్యము కానిది. సూర్యుడు,చంద్రుడు, అగ్నిలోని తేజస్సంతా ఆ స్వామినుండే ఉద్భవించింది.

శ్రీమన్నారాయణునికి తనభక్తులంటే అలవిమాలిన ప్రేమ. అందువలననే ఎక్కడో వైకుంఠంలో ఉంటే కేవలం ఆ దేవతలకు మాత్రమేలభ్యమవుతానని గ్రహించి, ఈ భూలోకంలోని తన భక్తులందరినీ సంతోషపెట్టడానికి ఎన్నో అవతారాలలో ఆవిర్భ వించాడు. త్రేతాయుగంలో

శ్రీరామునిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా, జన్మించి తన భక్తులందరినీఎన్నో విధాల ఆదుకున్నాడు. ఎన్నో విధాల సంతోషపరిచాడు. ఇంతే

కాదు, ఈ కలియుగంలో ఎన్నో దేవాలయాలలో ఎన్నో అంశలతో

మనందరికి చేరువలో వుండి మనందరికీ ఎంతో సంతోషం కలిగిస్తున్నాడు.ఆ స్వామికి తన భక్తులంటే అలవిమాలిన ప్రేమ. తిరుమల తన దర్శనార్థం వచ్చేవారికి అన్ని సదుపాయాలు తానే కలిగిస్తున్నాడు.

వారందరూ తనను దర్శించడానికి ఆనంద నిలయంలోనికి రావడం చూసిఎంతో సంతోషపడి వారికి సర్వసౌభాగ్యాలూ, సర్వ ఐశ్వర్యాలూఅనుగ్రహిస్తాడు. ఆ అమృతమూర్తిని నమ్మి కొలచినవారిని ఏ లోటూ ఉండదు. ఎటువంటి ఆపదలూ దరిచేరవు. ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా,

విజయవంతంగా సాగుతుంది. ఆ స్వామిని నమ్మి, స్వామిపైనే పూర్తి భారం వేసేవారి జీవితం ఎల్లప్పుడూ సుఖప్రదంగా గడుస్తుంది. తననుఆశ్రయించిన వారికి సర్వ సంపదలనూ అనుగ్రహించే దివ్య మంగళ

స్వరూపుడు ఆ శ్రీనివాసుడు. తనను నమ్మినవారికి పూర్తిగా

వశమయ్యేవాడు. భక్తసులభుడు శ్రీమన్నారాయణుడే. అతడు భక్తుల హృదయాలలో ఎల్లప్పుడూ బందీగా సంతోషంగా నివసిస్తాడు.

ఓ శ్రీనివాసా! నీవు మాకు అండగా ఉండగా భయమేలనయ్యా!

నీకివే మా నమస్కారములు. శ్రీలక్ష్మీ శ్రీనివాసులారా! మీకివే మా నమస్కారములు! ఓ శ్రీనివాసా! సర్వకాల సర్వావస్థలయందు మా మనస్సు నీ అందే ఉండునటుల మమ్ము కరుణించవయ్యా ! నీకివే మానమస్కారములు. 

ఓ శ్రీనివాసా! 

నీకివే మా నమస్కారములు.

 ఓఅమృతమూర్తీ 

నీకివే మా ప్రణామములు. 

ఓ జగద్రక్షకా 

నీకివే మా నమస్కారములు.

ఓ శ్రీనివాసా!

 నీకివే మా నమస్కారములు.

 ఓ శ్రీమన్నారాయణా!

నీకివే ప్రణామములు. ఓ జగద్రక్షకా! 

నీకివే మా నమస్కారములు.

*" శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్*

*శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ”*

🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

సతీదేవి జన్మించిన రోజు

 మాఘ పూర్ణిమ ఈశ్వరుని అర్థాంగి సతీదేవి జన్మించిన రోజు. మాఘ పౌర్ణిమ సముద్ర స్నానానికి ఉత్తమమైన రోజు. సాధారణంగా కార్తీక పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణమి, మాఘ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమల్లో సముద్ర స్నానం ధర్మబద్ధమని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ నాలుగింటిలో మాఘ పౌర్ణిమ సముద్ర స్నానానికి మరింత విశేషం. 30 కుడుములను దానంగా ఇవ్వాలి లేదా నువ్వులు, బెల్లం కలిసి దంచి కట్టిన వుండలను దానంగా ఇవ్వడం చేయాలి. మాఘ మాసం పాపాలను తొలగించేది. ఇంకా పుణ్య ఫలాలను సంపాదించేందుకు మాఘ మాసం తోడ్పడుతుంది. పాపాలను, శాపాలను, దోషాలను ఈ మాఘ పౌర్ణమి రోజున చేసే సముద్ర స్నానం తొలగిస్తుంది. మాఘ పురాణం అనేది పద్మపురాణంలో వుంది. ఈ మాసం మాఘ పురాణం వినాలి. అందుకే సంకల్పంతో మాఘ స్నానం చేయాలి. భీష్మస్తుతి చదవాలి. మాఘ మాసంలోనే భీష్ముడు ఆత్మ సమర్పణ చేశారు.

అందుకే సముద్ర స్నానం చేసి, నువ్వులు, బియ్యం, బెల్లంను దానం చేయాలి. పౌర్ణమి రోజున చంద్రుని కారకంగా మనస్సు ఆహ్లాదకరంగా వుంటుంది. మనస్సు, శరీరం, వాక్కు చేసిన పాపాలను మాఘ సముద్ర స్నానం తొలగిస్తుంది. మాఘ పూర్ణిమ రోజున సముద్ర స్నానం చేసేటప్పుడు గోవింద నామ స్మరణ చేయడం ద్వారా పాపాలు హరించుకుపోతాయి. మహా కుంభమేళలో స్నానాలు చేయడం కూడా చేయొచ్చు. గంగాస్నానం విశేషమని పండితులు చెప్తున్నారు.

మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున నదీ, సముద్ర స్నానం కుదరకపోతే.. గృహంలోని నీటినే గంగా తీర్థంగా భావించి స్నానం చేయాలి. ”గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు” అంటూ చదువుకుంటూ ఆ నీటిని 12 సార్లు ఓం అని అభిమంత్రించి.. ఆ పిమ్మట గోవింద గోవింద అంటూ స్నానం ఆచరించడం ద్వారా దోషాలన్నీ తొలగిపోతాయి. ఇలా స్నానం చేయడం ద్వారా మనస్సు పరిశుధ్ధం అవుతుంది. ఇంకా భీష్మాచార్యుల వారికి తర్పణం విడిచిపెట్టాలి. ఇలా చేస్తే పాపాలు హరించుకుపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

భీష్మ నిర్యాణం తర్వాత వచ్చే పూర్ణిమ మాఘ పౌర్ణిమ కనుక ఆయనను స్మరించుకోవాలి. తర్పణం వదలాలి. తిలలు, చెప్పులు, గొడుగులు, బియ్యం, ఉండ్రాళ్లు దానం చేస్తారు. ఈ రోజున సువాసిని పూజ చేస్తే ఏడు జన్మల వరకు మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుంది. పసుపు, కుంకుమలు ఏడు జన్మల వరకు ధరించే అదృష్టం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఈ రోజున సత్య నారాయణ వ్రతం చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఎవరెవరికి ఏది వీలు ఉంటుందో ఆ పని చేయాలి. పైవేవీ అవకాశం లేకుంటే సూర్యోదయం కంటే ముందే స్నానం, ఇంట్లోదీపారాధన, పేదలకు ఆహారాన్ని, దుస్తులు దానం వంటివి చాతనైనంత చేయడంతోపాటు భక్తితో ఇష్టదేవతరాధన, ధ్యానం, శ్లోకాలు,విష్ణుసహస్రనామ పారాయణం లేదా శ్రవణం చేసినా విశేష ఫలితాలు లభిస్తాయి.🕉️🚩🕉️

Panchaag

గురువు -లక్షణాలు

 గురువు -లక్షణాలు 

ముందుగా గురువు అంటే ఏమిటి? గురువు లక్షణం, వైశిష్ట్యం తెలుసుకొని అప్పుడు గురుపాదుక మంత్రం గురించి చర్చిద్దాం.

గురు ప్రార్ధన 

సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం

అర్ధం 

ఎవరికైనా మొదటి గురువు సదా శివుడు మాత్రమే. అందుకే శివాయ గురవేనమః అన్నారు.గురువు అంటేనే సదాశివుడు. .సదాశివుడు మొదలుకొని వ్యాస, శంకరులు మధ్యవారు. వారి తరువాత మన గురువు వరకు ఉన్న గురు పరంపరకు అందరికి నమస్కారం చేద్దాము .

గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు

గురుర్దేవో మహేశ్వరః 

గురు సాక్షాత్ పరబ్రహ్మా 

తస్మై శ్రీ గురవే నమః"

గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపం గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అందుచేత శ్రీగురువునకు నమస్కారం.

గురువుయొక్క లక్షణం గురించి ఈ విధంగా చెప్పబడింది 

శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్

శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్

ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః

నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే.

అర్ధం 

 శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, (ఉన్నత వంశంలో పుట్టినవాడు) వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు.

" మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ" అని వేదం చెబుతోంది . తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. "గు" అంటే గుహ్యమైనది, తెలియనిది. "రు" అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది.అని మరొక అర్ధం

ప్రేమ, ఆప్యాతలకు చిహ్నంగాఒక రూపముగా నిలిచే వ్యక్తి గురువు.

న గురోరధికం నగురోరధికం

న గురోరధికం నగురోరధికం

శివ శాసనతః శివ శాసనతః

శివ శాసనతః శివ శాసనతః

గురువు కంటే అధికులు లేరు. గురు వాక్యం మనకు శివుని శాసనమే

బీజాక్షరాల పుట్టుక గురించి తెలుసుకుందాము

మొట్ట మొదటఆకాశం (శూన్యం) లోంచి శబ్దబ్రహ్మము పుట్టింది. ఆ శబ్దమే ఓంకారం. ఓంకారం లోంచి ప్రకంపనల వలన శూన్యమంతా ఆవరించిన శక్తిలో చలనం మొదలైంది. ఆ చలనం ఈ బ్రహ్మాండ విశ్వాన్ని, గ్రహ,నక్షత్రాల్ని సృష్టించింది.

శబ్దబ్రహ్మమే శక్తి యొక్క తొలి వ్యక్త రూపం. ఓంకారం లో అ ,ఉ, మ అనే అక్షరాలున్నాయి. అంటే మనం ఏ శబ్దం పలకాలన్నా నోరు తెరిచి (అ)అనాలి తరువాత నోరు మూయాల్సి ఉంటుంది (మ).(ఇక్కడ జాగ్రత్తగా అర్ధం చేసుకోండి.)

అంటే….లోకంలో ప్రతి శబ్దం అ--మ ల మధ్యే జనిస్తుంది.

ఇలా అన్ని శబ్దాలు ఓమ్ లోంచే పుడుతాయి కనుక ఓం మూల బీజం

ఇక్కడ నుండి అమ్మవారి మంత్రం చెప్పకూడదు కనుక ఇంతవరకు మాత్రమే ఇస్తున్నాను

ఆవు మీద వ్యాసం:

ఆవు మీద వ్యాసం:

అనగనగా ఒక చదువుకునే ఉత్తమ విద్యార్థి వున్నాడు. అతను పాఠశాలలో చదువుతున్నాడు. చిన్నవాడే కానీ అతనికి ఉండాల్సిన దానికన్నా తెలివితేటలూ ఎక్కువగా వున్నాయి. కొన్నిసందరాలలో మనకు తెలివి ఎక్కువైతే ఏమవుతుందో చెప్పటానికి ప్రయత్నం.

 తెలుగు మాస్టారు గారు పిల్లలకు వివిధ విషయాంశాలతో పాటు వ్యాస రచనకు సమందించిన విషయాలను కూడా పేర్కొన్నారు ఉదాఆవు, బడి, విమానం, రైలు, మొదలగునవి. అయితే మన ఆదర్శ విద్యార్థి వాటినన్నిటిని ఒక్కసారి చూసిన తరువాత  ఆవు తనకు నచ్చింది కాబట్టి దానిని ఎంపిక చేసుకొని దాన్ని చక్కగా చదివి గుర్తుపెట్టుకున్నాడు. మనసులో పరీక్షకు వెళ్లే ముందు తన ఇష్ట దైవాన్ని పరి పరి విధాలుగా ప్రార్ధించాడు కారణం తన పరీక్షలో వ్యాసం కేవలం ఆవు మాత్రమే రావాలి

కానీ మన విద్యార్థి మోర దేముడు ఆలకించ నట్లున్నాడు పరీక్షా పేపర్లో వ్యాసానికి సంబందించిన ప్రశ్న ఒకటి కాదు రెండు వచ్చాయి. అందులో ఒక్కటికూడా ఆవు లేదు అవి ఒకటి విమానం, రెండు రైలు. అరె చచ్చిందిరా గొర్రె అని మనస్సులో అనుకున్నాడు మన మహానుభావుడు అదికూడా రెండు ప్రశ్నలు తప్పనిసరి. ఇప్పుడు ఏమిచేయాలి, ఇప్పుడు ఏమిచేయాలి ఇదే సమస్య మెదడంతా తిరుగుతున్నది. మన విద్యార్థి ఓటమిని ఒప్పుకునే రకం కాదు ఎట్లాగయినా రెండు ప్రశ్నలకు సమాధానం వ్రాయాలి అదికూడా మంచిగా అని నిర్ణయించుకున్నాడు. అతను రెండు వ్యాసాలు ఎలా వ్రాశాడో చూద్దాం

1) విమానం: విమానం అనగానే తానూ విమానం శబ్దం విని ఆకాశంలో పోయే విమానం గుర్తుకు వచ్చింది. వెంటనే వ్రాయటం మొదలు పెట్టాడు.విమానం చాలా పెద్దగా ఉంటుంది. దానిలో చాలామంది ప్రయాణించ వచ్చు. అది గాలిలో ఎగురుతుంది. అంతమటుకు చక్కగా వ్రాసాడు. ఇక పైన పెన్ను నడవటంలేదు. ఒక్కనిమిషం అటు ఇటు చూసాడు ఎవరి పేపరు వాళ్ళు వ్రాసుకుంటున్నారు. మాస్టారు తననే చూసాడు రామా రావు సిట్రియేట్ అని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమి చేయాలి. మనసులో పరిపరి ఆలోచనలు ఎట్లాగైనా ప్రశ్నకు సమాధానం వ్రాయాలి అంతేకాదు ఇంకోటి అదే రైలు గూర్చి కూడా వ్రాయాలి. దేముడా నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు పెడతావు. దేముడిమీద కొంత సేపు భక్తి, కొంత సేపు తనకు అనుకూలించనందుకు కోపం. సమయం అయిపోతూవుందిఇంతలో ఇవ్వన్నీ తరువాత చూసుకోవచ్చు ముందు గండం గడవటం ఎట్లారా భగవంతుడా. ఇక ఆగలేదు అప్పుడు సమయస్పూర్తి చూపించాడు మన రామారావు.పెన్ను పట్టుకొని చక చకా వ్రాయటం మొదలు పెట్టాడు. అది చూసిన మాస్టారుకుడా మన రామా రావు ఇందాక పాపం సమాధానం కోసం ఆలోచించాడులే అని అనుకున్నారు. ఇంతకూ మన రామా రావు వ్రాసింది ఏమిటి చుడండి.

విమానం గాలిలో ఎగురుతుంది దగ్గర ఆగాడు ఇప్పుడు దాని తరువాత విమానానికి కిటికీలు ఉంటాయి కిటికీలనుండి చుస్తే క్రింద పచ్చిక బయళ్లు ఉంటాయి. అక్కడ బోలెడు ఆవులు ఉంటాయి

ఆవు తెల్లగా ఉండును, ఆవుకు ఒక తోక ఉండును, ఆవుకు రెండు కొమ్ములు ఉండును, ఆవును పెంచుకొందురు, మంచిగా సాగుతున్నది జవాబు, ఆవు పాలను ఇస్తుందిఆవుపాలు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలకు కూడా ఆవుపాలు  పడతారు. ఆవు పేడ వేస్తుంది. పేడతో పిడకలు తయారుచేస్తారు. పిడకలు పొయిలో ఉపయోగిస్తారు. సంక్రాంతి రోజుల్లో ఆడవారు ఆవు పేడతో గొబ్బెమ్మలను పెడతారు. సాగుతూనే వున్నది ఒక్కసారి ఫై నుండి క్రిందికి పేజీ చూసాడు తనను తానె నమ్మలేక పోయాడు పేజీ మొత్తం నిండింది అరె నేను చాలా పెద్ద వ్యాసం వ్రాసాను అని తనను తానె పొగుడుకున్నకు. పరీక్షల్లో మొదటి ర్యాంకు నాకు రావటం ఖాయం అని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఇక్కడితో కథ అయిపోలేదు ఇంకా రెండో వ్యాసం అదే రైలు వ్యాసం వ్రాయాలి అది యెట్లా వ్రాశాడో చూద్దాం.

ఇప్పుడు రామారావు మోహంలో ఎంతో దైర్యం, ఆత్మా విస్వాసం కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. పిల్లవాడికి తెలియని ప్రశ్న ఏది లేదు అని అందరు అనుకునేలా వుంది అతని ముఖ వర్చస్సు. ఇక రైలు వ్యాసం ఇలా సాగింది.

రైల్వే స్టేషనులో రేలు వచ్చి ఆగుతుంది వెంటనే అందరు రైలు ఎక్కుతారు అది చుకు చుకు అని బయలుదేరుతుంది. రైలుకి రెండువైపులా కిటికీలు ఉంటాయి. (భగవంతుడా రైలుకి కూడా  కిటికీలు పెట్టి నన్ను రక్షించావు అని మనసులో అనుకున్నాడు) కిటికీలలోనుంచి బయటకు చుస్తే పచ్చిక బయళ్లు ఉంటాయి. అక్కడ బోలెడు ఆవులు ఉంటాయి

ఆవు తెల్లగా ఉండును, ఆవుకు ఒక తోక ఉండును, ఆవుకు రెండు కొమ్ములు ఉండును, ఆవును పెంచుకొందురు, మంచిగా సాగుతున్నది జవాబు, ఆవు పాలను ఇస్తుందిఆవుపాలు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలకు కూడా ఆవుపాలు  పడతారు. ఆవు పేడ వేస్తుంది. పేడతో పిడకలు తయారుచేస్తారు. పిడకలు పొయిలో ఉపయోగిస్తారు. సంక్రాంతి రోజుల్లో ఆడవారు ఆవు పేడతో గొబ్బెమ్మలను పెడతారు. ఇలా సాగుతూనే వున్నది మన రామారావు జవాబు పత్రం మీద వ్యాసం. ఎట్టకేలకు రామారావు రెండు వ్యాసాలను తన సమయస్ఫూర్తితో సంపూర్ణంగా వ్రాసినట్లు ఆనందపడ్డాడు. ఇక విషయానికి వస్తే సాధక మిత్రమా ప్రతి సాధకుడు కూడా కధలోని రామారావు లాగానే ప్రవర్తించాలి అది యెట్లా అంటే తానూ తన మనస్సు, బుద్ది ఎల్లప్పుడూ పరమేశ్వరుని మీదనే లగ్నాత చెంది ఉండాలి ఏరకంగా అయితే రామారావు మనస్సు పూర్తిగా ఆవుతో జత చేయపడి తానూ వ్రాసే ప్రతి వ్యాసాన్ని ఆవుతో కలిపాడా అదే విధంగా మన మనస్సు బాహ్యంగా విషయాలమీద ఉన్నాకూడా చివరకు అది పరమేశ్వరునిమీదకు మాత్రమే మళ్ళాలి. ఆలా మనం మన మనస్సుకు శిక్షణ ఇస్తే తప్పకుండ నిత్యము పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులము అవుతాము తత్వారా మోక్ష మార్గము మనకు సుగమం అవుతుంది. కాబట్టి సాధక మిత్రమా విధంగా జీవనాన్ని గడుపుతే మోక్షార్థులము కాగలము

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ

_పానుగంటి లక్ష్మీ నరసింహారావు జయంతి

 🌹 *శుభోదయం...!*🌹

*_పానుగంటి లక్ష్మీ నరసింహారావు  జయంతి శుభాకాంక్షలు...!!!_*💐

*చాటువులు:*

*వేపారి కంటె సరసుడు*

*నేపాళపు మాత్రకంటే మేలౌ మందున్*

*వేపాకు కంటె చేదును*

*సాపాటున కంటే సుఖము నహి నహి మహిలోన్ !*

 *బచ్చుండవు నెర దాతల*

 *మ్రుచ్చుండవు శత్రువులకు మహిత జ్వాలా*

 *చిచ్చుండవు కవి వర్యుల*

*మెచ్చుండవు మేటి సుగుణ పుట్టీ ! సెట్టీ !*

         *~ పానుగంటి లక్ష్మీ నరసింహారావు*

      ( ఫిబ్రవరి 11,1865 - జనవరి 1, 1940)

*తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావును పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది.*

*_పానుగంటి లక్ష్మీ నరసింహారావు  జయంతి శుభాకాంక్షలు...!!!_*💐

 🎈🎊📚✍️📖🎉🎈

సామజవరగమన

 సామజవరగమన

సామజవరగమన..అంటే అర్ధం ఎంత మందికి తెలుసు, కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా , ఒక పాట హోరెత్తి పోయింది . అదే  సామజవరగమన చాలా మందికి ఈ పాట నోటికి కంఠస్తా వచ్చి ఉంటుంది , అలానే ఈ పాట చాలా మందికి బాగానే అర్థమయ్యి ఉంటుంది ... కానీ చాలా మందికి ""సామజవరగమన"  అంటే ఏంటో తెలీదు..

సామజవరగమన ' అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది... ' సామజ ' అనగా " ఏనుగు " అని ..' వరగమనా ' అనగా " చక్కని నడక " అని అర్థం ... అలానే సామవేదం అనగా సంగీతం! .. మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం!  " సామజవరగమన " అంటే ఏనుగు లా గంభీరంగా , హుందాగా , ఠీవిగా నడిచేవారు అని అర్థం ..

మరి అసలైన " సామజవరగమన " ఎవరు ... 

అసలైన " సామజవరగమన .." శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు ..".  వాల్మీకి తన రామాయణం లో 'అరణ్యవాసం'లో ఒకచోట రాముడిని "గజవిక్రాంతగమను"డంటారు ... అంటే ఏనుగులా హుందాగా నడిచే వాడు అని ... ఇదే అర్థం వచ్చేలా త్యాగరాజు  తన కీర్తనలో ' సామజవరగమన ' అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు ..

చాలా మంది " సామజవరగమన " అంటూ పాడేస్తున్నారు .... కానీ వారికి అసలు ఇది దేవుని కీర్తన అని కూడా తెలీదు .. దాని అర్థం ఏంటో తెలీదు ... వారికి చెప్పేందుకైనా సామజవరగమన  కీర్తన , దాని అర్థం ఒకసారి తెలుసుకుందాం ..

సామజవరగమనా ! సాధుహృత్సారసాబ్జపాల ! కాలాతీతవిఖ్యాత ! ॥ సామజ॥

సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల ! దయాలవాల ! మాంపాలయ ! ॥

వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా।

స్వీకృత యాదవకులమురళీ !

గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥

ఈ కీర్తన త్యాగ రాయ కీర్తనలన్నిటిలో ప్రసిద్ధి పొందినది .. ఈ కీర్తన లో ని ప్రతి పదం శ్రీ కృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది ... కీర్తన అర్థం ... ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో , మునులు మానవుల హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరీ!  నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చే కొనియాడ బడతావు .. సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది .. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే , గుణమునకు , దయకు ఉదాహరణ నీవే .. నన్ను కూడా నీవే నడిపించాలి...

సామవేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల , ప్రకాశిస్తూ .. గోవులని రక్షిస్తూ .. మురళి గానంతో  అందరిని ఆనంద పరుస్తూ ..ఈ త్యాగరాజ వందనములను అందుకో...

ఇదీ సామజవరగమన కు సంబంధించిన అసలు భావం!

ఓం నమః శివాయ

పోతన - భాగవతం 🙏 మూడవ భాగం

 🙏 పోతన - భాగవతం 🙏 

                       మూడవ భాగం 

శ్రీమహాభాగవత ప్రారంభంలో పోతన 'మహా నందాంగనా డింభకు'డైన శ్రీకృష్ణుని చరిత్రను "శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్" అని చెప్పుకొన్నాడు.మనం కూడా ఆ ప్రయత్నాన్నే కొనసాగిద్దాం.

"శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్‌ లోకర

క్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకున్‌ దానవో

ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాలసంభూతనా

నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్‌."

పోతన భాగవతాన్ని తెలుగులో వ్రాయటానికి కారణం ‘ శ్రీ కైవల్య పదం’ అనగా మోక్షాన్ని చేరటానికి వ్రాస్తున్నాను అంటాడు. కావ్య ప్రయోజనం ఇంతకంటే ఏముంటుంది. “పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట, పలికిన భవహరమగునట” ( పలికితే పాపాలు పోతాయిట ) కనుక భాగవతాన్ని మనకందించేడు పోతన. మరి శ్రీకైవల్య పదం చేరటానికి ఎవరిని ప్రార్థించాలి! “లోకాలని రక్షించేవాడు, భక్తులను పాలించేవాడు, దానవులను శిక్షించేవాడు, తన కేళీ (ఆట) లీలావిలాస దృష్టితో సమస్తలోకాలని సృజించే వాడు” అయిన శ్రీకృష్ణుని ప్రార్థించాలి అంటాడు. అలా సామాన్యంగా శ్రీకృష్ణుడు అని చెపితే ఎలా! అందుకే ‘ మహానందాంగనా డింభకున్’ అంటే మహానందుని యొక్క అంగన (భార్య) అయిన యశోదాదేవి కుమారుడట. ఈ పదంలో ఇంకో అందమైన అర్థం ఉంది మహా + ఆనంద= తలచి నంతనే గొప్ప ఆనందాన్ని కలిగించేవాడుట కృష్ణుడు. కృష్ అనగా అపరిమిత ణ అంటే ఆనందాన్ని అనే అర్థం కృష్ణ అనే పదం లోనే ఉంది. అది ‘ సహజ కవి, భక్త కవి’ అయిన పోతన కవితా చమత్కారం

సాధారణంగా నాటక లక్షణాలలో నాందీశ్లోకంగాని పద్యంగాని ఉంటుంది. పోతన గారు ఆ లక్షణాన్ని గ్రహించారు.

ఇది నాందీశ్లోకం వంటి పద్యం. ఆశీర్నమస్క్రియా వస్తునిర్దేశాలలోని ఒక లక్షణం నిక్షేపించడం దీని లక్ష్యం. "శ్రీవాణీగిరిజా శ్చిరాయ" అని నన్నయ అన్నాడు. "శ్రీయన గౌరి నాఁబరగు" అని తిక్కన అన్నాడు. "శ్రీకైవల్యపదంబు"ను పోతన్న ప్రస్తావించినాడు. ఈపద్యంలో నమస్క్రియతో పాటు వస్తునిర్దేశం కూడా ఉండటం విశేషం. భాగవత కథానాయకుడు నందనందనుడు. అత డవతార పురుషుడు. లోక రక్షణం ఆ అవతారానికి ప్రేరణం. అతడు గజేంద్రాది భక్తులను పాలించినవాడు. హిరణ్యకశిపు ప్రభృతి దానవుల ఉద్రేకాలను స్తంభింప జేసినవాడు. ఈ రెండు అంశాలు శ్రీమన్నారాయణుని శిష్టరక్షణకూ దుష్టశిక్షణకూ మూలకందాలు. భాగవత కథాచక్రం ఈ రెండు అంశాలచుట్టే చంక్రమించింది. ఈ రకంగా పోతన్న పై పద్యంలోని పాదచతుష్కంలో భాగవతంలోని పన్నెండు స్కంధాల పరమార్థాన్ని నిర్దేశించినాడు. మరొకవిశేషం ఈ పద్యంలోని నందాంగనా డింభకుడు కేవల స్థితికారుడే కాడు, సృష్టికారుడు కూడా. "కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు" అనే ప్రయోగంలో అది ధ్వనించింది. "దానవోద్రేకస్తంభకు" అనే మాటలో అతని లయ కారత్వం స్ఫురించింది. అంటే ఈ పద్యంలో నందింప బడిన పరమాత్ముడు త్రిగుణాత్ముడు. అయితే విశ్లేషించుకుంటే బోధపడే అర్థమిది. ఒక మహోర్మికలా ఉప్పొంగి వచ్చే మూర్తి మాత్రం సత్త్వానిది. కాష్ఠంకంటే ధూమం, ధూమంకంటే త్రయీమయమైన వహ్ని విశేషమైనది. అలాగే తమోగుణం కంటే రజోగుణం, రజోగుణంకంటే బ్రహ్మప్రకాశకమైన సత్త్వం విశిష్టమైనది. (ప్రథమ స్కంధం 59) అందుకే తొల్లిటి మునులు సత్త్వమయుడని భగవంతుడైన హరినే కొలిచినారు. ఆ భగవంతుని సత్త్వనిర్భర స్వరూపమే పైపద్యంలో ఉల్లేఖింపబడింది.

అవతారికలోని రచనాలక్ష్యాన్ని పరికించినా, నాందీపద్యాన్ని పరిశీలించినా పోతన్న ధ్యేయం కైవల్యమేనని బోధపడుతుంది. భవబంధరాహిత్యం, జన్మసాఫల్యం కైవల్యం వల్లనే సాధ్యం. ఆ కైవల్యం పోతన్న వాంఛించిన పరమపదం; పురాజన్మ తపఃఫలం. ఈ కైవల్యకాంక్ష ప్రవృత్తిలా భాసించే నివృత్తి; భాగవతంలోని ప్రధాన రసమైన భక్తికి ఆదిలోనే ఎత్తిన వైజయంతిక.

ఇంచుమించుగా సమకాలీనులైన శ్రీనాథ పోతనామాత్యుల వ్యక్తిత్వాల వాసి ఇక్కడే ఉంది. శ్రీనాథుడు శృంగారిగా ఎంత వ్యాపృతుడైనా 'ఈశ్వరార్చన కళాశీలుండ'ననే చెప్పుకున్నాడు. భోగినీదండకం వంటి పరమశృంగార కృతి రచించినా పోతన్న మహాభక్తుడుగానే పేరొందినాడు. కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం వంటి భక్తిప్రబంధాలు వ్రాసినా, నైషధంలోని రక్తివల్లనూ, చాటుపద్యాలలోని శృంగార ప్రసక్తివల్లనూ శ్రీనాథుడు శృంగారసనాథుడుగా స్థిరపడినాడు. రుక్మిణీకల్యాణం, రాసక్రీడాభివర్ణనం వంటి ఘట్టాలలో ఎంతటి శృంగార వర్ణనలు చేసినా పోతన్న తెలుగుల పుణ్యపేటిగానే కీర్తింప బడుతున్నాడు. ఇందుకు ఒకకారణం - కాలం గడిచినకొద్దీ వీరిచుట్టూ అల్లుకున్న కట్టుకథలు. మరొకకారణం - కావ్యావతారికల్లో వీరి వ్యక్తిత్వాలు వేసుకున్న ముద్రలు. శ్రీనాథుని కృతులన్నీ నరాంకితాలు. అతని జీవితంలోని ఉజ్జ్వల ఘట్టాలన్నీ రాచకొలువులకే సమర్పితాలు. పట్టెడు వరిమెతుకులు, గుక్కెడు మంచినీళ్ళు పుట్టని దుర్దశలో కూడా ఆ రాజస మూర్తి అటు కృష్ణుణ్ణో, ఇటు శివుణ్ణో దుయ్యబట్టినాడు. ఇరవై సంవత్సరాలు కొండవీటిలో విద్యాధికారిగా ఒక వెలుగు వెలిగి అంతటితో యశోభిలాష సన్నగిల్లక, ఎక్కడో కర్ణాటరాయల కొలువులో, నిక్కిపడే గౌడ డిండిమభట్టును ఉద్భట వివాదప్రౌఢితో ఓడించి, అతని కంచుఢక్కను పగులగొట్టించి, రాయల సభాగారంలో స్వర్ణస్నానం చేయించుకునే దాకా తృప్తిపడని మత్యహంకృతి అతనిది. దిక్కూమొక్కూ లేని అవసానదశలో దివిజకవివరుని గుండియలు దిగ్గురనేటట్టు కడ ఊపిర్లో గూడా కవిత లల్లగల్గిన ప్రౌఢవ్యక్తిత్వం అతనిది. మరి పోతన్న వ్యక్తిత్వం ఇందుకు భిన్నం. అతడు నరాధిపులను కొలువలేదు; సిరులకై ఉరుకులాడలేదు; అధికారాన్ని ఆశించలేదు; అహంకారాన్ని ప్రకటించలేదు. పూర్వకవులతోపాటు, వర్తమాన కవులతో పాటు భావికవులను గూడా బహూకరించిన వినయభూషణు డతడు. సమకాలీనకవులను సంభావించడమే ఒక విశేషం. పుట్టని కవులకు జేకొట్టడం పోతన్న సహనశీలానికి నిదర్శనం. సహనగుణం సత్త్వం పాదులో పుట్టేదే కదా! ఈ సత్త్వగుణాన్ని ఆధారంగా చేసుకునే పోతన్న నిరాడంబర వ్యక్తిత్వాన్ని గూర్చీ, నరాధిప పరాఙ్ముఖత్వాన్ని గూర్చీ కొన్ని చాటు కథలు ఆ నోటికానోటి కెక్కి నేటికీ తెలుగునాట వాడుకలో ఉన్నాయి. భాగవతాన్ని తన కంకిత మివ్వవలసిందని సర్వజ్ఞసింగ భూపాలుడు కోరడం, పోతన్న కాదనడం, భూపాలునికి కోపం వచ్చి దానిని నేలపాలు చేయడం - ఇదోకథ. శ్రీనాథుడూ పోతన్నా స్వయానా బావమరదులు.ఇది వాస్తవం కాదు. శ్రీనాథునకు పోతన అనే బావమరిది ఉన్నమాట నిజమే కానీ అతను దగ్గుపల్లి పోతన.దగ్గుపల్లిదుగ్గన సోదరుడు. అంతవరకూ ఎందుకు? శ్రీనాథుని తొంబై సంవత్సరాల వయస్సులో పోతన ఏడు ఎనిమిది ఏళ్ల బాలుడు. ఇది కాలాలను బట్టి చరిత్ర చెబుతున్న సాక్ష్యం. ప్రస్తుత విషయం చూడాలి.పోతన్న పొలం దున్నుతుంటే ఆ'నాథన్న' పల్లకిలో రావడం, అటు బోయీలు లేకుండా పల్లకి తేలిపోవడం, ఇటు ఎడ్లు లేకుండా నాగలి సాగిపోవడం - ఇది మరోకథ. ఇవే కాక 'కర్ణాటకిరాటకీచకు' లెవరో అతని కృతిని కాజేయాలని వస్తే ఆ తల్లి సరస్వతి 'కాటుక కంటి నీరు చనుకట్టు' మీద పడేటట్టు బావురు మనడం, "అమ్మా! ఏడువకమ్మా! నిన్ను ఎవరికీ అమ్మనమ్మా!" అని ఈ పరమభక్తుడు ఓదార్చడం - ఇదో పిట్టకథ. కృతిని ఇక్కడ 'ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి', అక్కడ 'కాలుచే సమ్మెటవ్రేటులం బడక' బమ్మెర పోతరాజు భాగవతాన్ని 'సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె'నని అవతారిక లోని మరోపద్యం ఇచ్చే సాక్ష్యం. పోతన్న పేరు చెప్పితేనే సగటు సాహితీ బంధువులకు ఈ పద్యమే గుర్తు కొస్తుంది. ఈ పద్యం పోతన్నది కాదంటే చాలా మందికి గుండెల్లో కలుక్కుమంటుంది. నిజానికి ఈ పద్య రచనలో ఏ కోశానా పోతన్న శైలీవాసన లేదు. 'సొమ్ములు కొన్ని పుచ్చుకొని', 'సొక్కి', 'శరీరము వాసి', 'కాలుచే సమ్మెటవ్రేటులు' 'సమ్మతి', 'ఇచ్చిచెప్పె' ఈ 'బమ్మెరపోతరా జొకఁడు' - ఇదీ ధోరణి. ఇవి పోతన్న పలుకులేనా? భావికవులను బహూకరించిన, భవబంధవిమోచనం ఆశించిన భక్తశిరోమణి మాటలేనా? కాదన వలసిన అవసరం లేకుండానే మరొక అంతస్సాక్ష్యం ఉంది. ఈ పద్యానికి ముందుమాట 'ఉభయ కావ్యకరణ దక్షుండనై' అన్నది. ఇది ఉత్తమపురుషంలో ఉంది. వెంటనే 'ఇమ్మనుజేశ్వరాధముల' పద్యంలో 'బమ్మెరపోతరాజొకఁడు' అంటూ ప్రథమ పురుషం దూకుడుంది. ఆ పద్యం తరువాత మరొక పద్యం. తరువాత 'అని మదీయ' అంటూ మళ్లీ ఉత్తమపురుషం దర్శనం ఇచ్చింది. పద్యశిల్పాన్నిబట్టే కాక అన్వయ దోషాన్ని బట్టి చూసినా ఇది పోతన్న పద్యం కాదనే అనిపిస్తుంది. అతని భక్తులో, అనురక్తులో తదనంతర కాలంలో ఈ పద్యాన్ని జొప్పించి ఉంటారు. ఎవరో ఎందుకు? అతని శిష్యుడు సింగయ్యే వ్రాసి ఉంటాడేమో? సింగయ్య భాగవతంలోని షష్ఠ స్కంధాన్ని రచించినాడు. పోతన్న పోతలోనే ఇతనూ ఒక అవతారిక సంతరించుకున్నాడు. పూర్వకవిస్తుతిలో శ్రీనాథునితోపాటు బమ్మెరపోతరాజును స్మరించినాడు. పోతరాజును స్తుతిస్తూ చెప్పిన పద్య మిది:

"ఎమ్మెలు సెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్‌

సొమ్ముగ వాక్యసంపదలు నూఱలు చేసినవాని భక్తిలో

నమ్మినవాని భాగవతనైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో

బమ్మెర పోతరాజు కవి పట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్‌."ఈ పద్యంలో ఒకటి రెండు అంశాలు గమనింపదగినవి ఉన్నాయి. 'ఇమ్మనురాజేశ్వరాధముల' పద్యంలో 'సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె' 'ఈబమ్మెర పోతరా జొకఁడు భాగవతంబు' అని ఉంది. 'ఎమ్మెలు సెప్పనేల' పద్యంలో 'పన్నగరాజశాయికిన్‌', 'సొమ్ముగ ... భాగవత నైష్ఠికుఁడై ... తగువాని ... బమ్మెర పోతరాజు.' అని ఉంది. ఆ పద్యంలో ప్రాసస్థానంలో 'సొమ్ములు' 'బమ్మెర' ఉన్నాయి. ఈ పద్యంలోనూ ఆ మాటలే ఉన్నాయి. అక్కడ 'జగద్ధితంబుగన్‌' అని ఉంటే ఇక్కడ 'జగమెన్నఁగ' అని ఉంది. 'సమ్మతి శ్రీహరి కిచ్చి' చెప్పడం అని అందులో ఉంటే ఆ స్వామికి 'సొమ్ముగ వాక్యసంపదలు నూఱలు' చేయడం ఇందులో ఉంది. ఈ రెండు పద్యాల్లోనూ పోతన్న భక్తి తత్పరతే ఉగ్గడింపబడింది. పైగా రెండుపద్యాల గతికూడా ఒకేస్థితిలో ఉంది. కనుకనే ఈ సింగయ్యే ఆ పద్యం రచించి పోతన్న అవతారికలో చేర్చి ఉంటాడేమో అనే సందేహం కలుగుతుంది. అలాకాదు. పోతన్న పద్యానికే సింగన్న పద్యం అనుకరణమేమో అని ఎవరైనా వాదించవచ్చు. . పద్యశిల్పంలో గానీ, పదప్రయోగంలో గానీ, భావశుద్ధిలోగానీ ఈ పద్యంలో పోతన్నముద్ర ఏమాత్రం లేకపోవడమే. ఇంకా 'హాలికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి' అంటూ ప్రాసస్థానంలో గుప్పించిన అనుప్రాస సౌరభం ఇందుకు సాక్ష్యం.

                 సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ 

             🙏భక్త కవి -- బమ్మెర పోతన🙏 

                       మూడవ భాగం 

అవతారిక దృష్ట్యానే కాక భాగవత కథల్లో ఉపాఖ్యానాల్లో పోతన్న మూలాతిరిక్తంగా పెంచిన పట్టులను బట్టీ, పేర్చిన పద్యాలను బట్టీ, అతని సత్త్వరమణీయమూర్తి సాక్షాత్కరిస్తుంది. గజేంద్రుని సంశయంలో, ప్రహ్లాదుని నిశ్చయంలో, గోపికల ఉద్వేగంలో, వామనుని ఉత్తేజంలో - ఇవేకాక నవవిధ భక్తిలతల బహుముఖ వికాసంలో, భక్తిరసతరంగితమైన పోతన్న చిత్తవృత్తి పలువిధాలా ప్రస్ఫుట మవుతుంది. వ్యాసభగవానుని భాగవత కోశాన్ని సైతం క్షణకాలం మరచిపోయి, ఆయా భాగవతుల శ్రవణకీర్తనలకు లోనై ఆ పాత్రలన్నీ తానై పరవశించి, పద్య సంఖ్యను పెంచి, ప్రతిభా శిఖరాలపై భాసించిన సన్నివేశాలు ఆంధ్ర భాగవతంలో కోకొల్లలు. - అవతారికలోనేకాక ఆంధ్ర భాగవతంలో గూడా అడుగడుగున పోతన్న సాత్త్విక చిత్తవృత్తి, భక్తిభావనా ప్రవృత్తి వేయిరేకులతో విప్పారినవని.

నవవిధ భక్తులను కథాత్మకంగా ప్రపంచించిన ప్రథమ గ్రంథం వ్యాసభాగవతం. ఆ భక్తిరస ఘట్టాలను ఇంతకు రెండింతలుగా విస్తరించి తొలిసారిగా మధుర భక్తికి పచ్చల తురాయిని కూర్చిన తెలుగు కావ్యం పోతన్న భాగవతం. ప్రహ్లాదుని నోట వ్యాసుఁడు పలికించిన భక్తిశాఖ లివి -

"శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనమ్‌"

దీనికి పోతన్న చేసిన తెలుగు సేత ఇది -

"తనుహృద్భాషల సఖ్యమున్‌ శ్రవణమున్‌ దాసత్వమున్‌ వందనా

ర్చనముల్‌ సేవయు నాత్మలో నెఱుకయున్‌ సంకీర్తనల్‌ చింతనం

బను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్‌ హరిన్‌ నమ్మి స

జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్‌ సత్యంబు దైత్యోత్తమా!"

ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీషుడు, కుచేలుడు, ధ్రువుడు, అక్రూరుడు, రుక్మిణి, గోపికలు - ఆయా భక్తిశాఖల విరబూసిన ప్రసూనాలు. ప్రహ్లాదుడూ, రుక్మిణీ, గోపికల వంటి పాత్రలలో పోతన్న పరమ భాగవత సత్త్వం, అరీణ భక్తితత్త్వం శబలసుందరంగా భాసిస్తాయి. ఇది చెప్పాలని ప్రహ్లాదుని ముఖతః ఎన్నెన్ని భంగులలో ఎన్నెన్ని ఫణుతులలో చెప్పించినాడు పోతన్న!

    "మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు"

అంటాడు. మరోసారి -

   "కంజాక్షునకు గాని కాయంబు కాయమే"

అంటాడు. ఇంకోసారి -

    "కమలాక్షు నర్చించు కరములు కరములు"

అంటూ లాటానుప్రాసల్లో ఉద్ఘాటిస్తాడు. ఆ 'అంబుజోదర దివ్యపాదారవిందాలు', ఆ 'చింతనామృతం', ఆ 'మత్తచిత్తం' ఎన్ని సార్లంటాడు! ఎన్ని తీర్లంటాడు! విసుగులే దా భక్తవరుని నోటికి. అది పునరుక్తిదోష మని అనిపించనే అనిపించదు పరవశించిన ఆలేఖినికి. ఇంతకూ పోతన్న రచించిన భక్తి పద్యాల్లో కోటికెక్కిన 'మందార మకరంద' పద్యం అటు వ్యాసునిదీ కాదు, ఇటు పోతన్నదీ కాదు. పాలకురికి సోమన్నది. సోమన్న పోతన్నకు పూర్వీకుడు. బమ్మెరకు సమీపంలో ఉన్న పాలకురికి వాస్తవ్యుడు. అతని చతుర్వేదసారంలోనూ, బసవ పురాణంలోనూ ఈ పద్యం పోలికలే ఉన్నాయి -

    'రాకామలజ్యోత్స్న ద్రావు చకోర - మాకాంక్ష సేయునే చీకటి ద్రావ' (బసవ పురాణం)

అని సోమన్న అంటే

    'పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం - బరుగునే సాంద్ర నీహారములకు'

అని పోతన్న అంటాడు.

    'విరిదమ్మి వాసన విహరించు తేటి - పరిగొని నుడియునే ప్రబ్బలి విరుల' (బసవ పురాణం)

అని సోమన్న అంటే

    'మందార మకరంద మాధుర్యమునఁ దేలు - మధుపంబు వోవునే మదనములకు'

అని పోతన్న అంటాడు. అయితే సోమన్నకు రాని కీర్తి ఈ పద్యంవల్ల పోతన్న కెందుకు వచ్చింది? అక్కడే ఉంది పోతన్న పోత. 'మందార' 'మకరంద' 'మాధుర్య' 'మధుప' 'మదనములు' - ఎన్నిమకారాల ప్రాకారాలు కట్టినాడు! పద్యాన్ని ఎంత ప్రాసాదరమ్యంగా నిలబెట్టినాడు! అక్షర రమ్యతలో నన్నయ్యను దాటి, ఆపై అంచులు ముట్టినాడు. తరువాతివాళ్ళెవరైనా ఈ శైలిని అనుకరిస్తే జారిపడిపోవడమో, నీరుగారిపోవడమో జరిగే అంత సొంతపుంత చేపట్టినాడు. మరి 'కమలాక్షు నర్చించు కరములు కరములు' కూడా పోతన్న కొత్తగా చెప్పింది కాదు. భీమఖండంలో

శ్రీభీమనాయక శివనామధేయంబుఁ జింతింపనేర్చిన జిహ్వజిహ్వ

దక్షవాటీపురాధ్యక్ష మోహనమూర్తిఁ జూడంగనేర్చిన చూపుచూపు

దక్షిణాంబుధితట స్థాయిపావనకీర్తి చే నింపనేర్చిన చెవులుచెవులు

తారకబ్రహ్మవిద్యాదాతయౌదల విరులు పూన్పఁగ నేర్చు కరముకరము

ధవళకరశేఖరునకుఁ బ్రదక్షిణంబు నర్థిఁ దిరుగంగ నేర్చిన యడుగు లడుగు

లంబికానాయకధ్యాన హర్షజలధి మధ్యమునఁ దేలియాడెడు మనసు మనసు

అని శ్రీనాథు డెన్నడో అన్నదే. కాని లోకానికి తెలిసింది '

కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;

సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;

విష్ణునాకర్ణించు వీనులు వీనులు; మధువైరిఁ దవిలిన మనము మనము;

భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;

తే. దేవదేవుని చింతించు దినము దినము;

చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;

కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు;

తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి

లోకాన్ని ఆకర్షించినది మాత్రం 

కమలాక్షు నర్చించు కరములు కరము'లే. ఈ ప్రాచుర్యానికి కారణం కూడా పోతన్న కూర్చిన పదబంధ తోరణమే.

నవవిధ భక్తుల్లో "శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం" - ఇవన్నీ ఒక పాదులో పుట్టిన మొలకలే. సఖ్యం మాత్రం వీటికంటే భిన్నతత్త్వం కలది. రుక్మిణికి శ్రీకృష్ణునిపట్ల గల రక్తికీ, భక్తికీ నేపథ్యం ఆత్మనివేదనం. అర్చన వందన స్మరణాదులు ఆ ఆత్మార్పణంలో నుంచి ఉదయించిన రేఖలు. కుచేలు డున్నాడు, అర్జును డున్నాడు. వీళ్ళది సఖ్య భక్తి

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

రక్తహీనత గురించి సంపూర్ణ వివరణ -

 రక్తహీనత గురించి సంపూర్ణ వివరణ  -

     మనుష్యునికి రక్తహీనత ఉన్నప్పుడు పూర్తి బలహీనం అవుతారు . ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువుగా ఉండును.  ఇప్పుడు దీని గురించి మీకు సంపూర్ణంగా వివరిస్తాను.

 *  ముఖం పాలిపోయినట్లు , త్వరగా అలసిపోవడం , చిరాకు , కోపం , అసహనం ఎక్కువుగా ఉంటుంది.

 *  ఆయాసం , ఙ్ఞాపకశక్తి తగ్గిపోవటం , మతిమరుపు ఎక్కువుగా ఉండును. నాలుక మంటగా ఉండును.

 *  ఐరన్ లోపించటం వలన వచ్చే రక్తహీనత ఎక్కువుగా ఉండును.

 *  సరైన ఆహారం తీసుకోకపోవటం , సరైన వ్యాయామం చేయకపోవటం వలన కూడా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవును .

 *  వ్యాధినిరోధక శక్తి తగ్గటం వలన అంటువ్యాధులు వీరికి త్వరగా వచ్చే అవకాశం కలదు. అందువలన ఆహారం నందు ఐరన్ ఎక్కువుగా ఉన్నవి తీసికొనవలెను.

 *  శరీరానికి కావలసిన ఐరన్ లభించుటకు పండ్లు , పుట్టగొడుగులు , ఆకుకూరలు , తీగకు కాసే కాయగూరలు , ఖర్జురము , తేనె , సోయాబీన్స్ , బీన్స్ సమృద్దిగా తీసుకోవాలి .

 *  వైట్ బ్రెడ్ , స్వీట్స్ , పంచదార , వేపుళ్లు , నిల్వపచ్చళ్ళు , మైదాపిండి మొదలగునవి వాడరాదు.

 *  కూరలలో నిమ్మకాయ పిండుకోవాలి. ఐరన్ శరీరం గ్రహించాలి అంటే C విటమిన్ అవసరం ఉంటుంది. ఐరన్ టాబ్లెట్స్ వాడటం కంటే ఆహారం ద్వారా సహజంగా ఐరన్ శరీరానికి అందించడం ఉత్తమం .

 *  తేనె వాడితే కొద్దిరోజుల్లొనే మార్పు వస్తుంది. ఖర్జురములో ఐరన్ బాగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజుకి 10 నుంచి 12 వరకు తినాలి.

 *  రక్తహీనత ఉండటం వలన మెడనొప్పి , తలనొప్పి వస్తుంది.

 *  మద్యపానం , ధూమపానం ఈ సమస్యను మరింతగా ఎక్కువుగా చేస్తాయి .

 రక్తహీనత కొరకు నేను ప్రయోగించిన అనుభవయోగం  -

        ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ నందు ఒక స్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి ఉదయం మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు ఇవ్వడం జరిగింది . ఆహారం తీసుకున్న గంటన్నర తరువాత ఒక ఆపిల్ పండు తినిపించడం చేశాను . కేవలం నలభై రోజులలోనే శరీరం నందు సంపూర్ణంగా రక్తం వృద్ది అయ్యినది.  దానిమ్మ జ్యూస్ కొరకు ఉపయోగించే కాయలు తియ్యగా పెద్ద సైజు తో ఉండేవి తీసుకోండి . దానిమ్మ జ్యూస్ తాగలేనివారు ఆపిల్ జ్యూస్ నందు కూడా గోధుమగడ్డి చూర్ణం కలుపుకుని తాగవచ్చు . 

మరిన్ని అనుభవపూర్వక, రహస్య ఆయుర్వేద ఔషధ యోగాలు గురించి మరింత వివరణాత్మక సమాచారం నా గ్రంధాల యందు వివరించాను. వాటిని క్షుణ్ణముగా చదవగలరు.

గమనిక  ~ 

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

          కాళహస్తి వేంకటేశ్వరరావు  

       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034