*భజే శ్రీనివాసమ్.*
*(ఇరవై ఏడు నక్షత్రాల శ్రీనివాస దివ్య వైభవం)*
*రచన.*
*తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్త.*
🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤🟤
*హస్త -- 13*
హస్తా నక్షత్రానికి అధిపతి సూర్యభగవానుడు. సమస్త జీవకోటికిఆధారభూతుడైన సూర్యనారాయణుడు శ్రీమన్నారాయణుని స్వరూపమే.
పన్నెండు మాసాలలో పన్నెండు పేర్లతో సంచరిస్తూ ఉండే సూర్య భగవానుడుద్వాదశాత్ముడు అనబడుతున్నాడు. చైత్రమాసంలో ధాతగానూ,వైశాఖమాసంలో ఆర్యమునిగానూ, జ్యేష్ట మాసంలో మిత్రుడిగానూ,ఆషాఢమాసంలో వరుణునిగానూ, శ్రావణంలో ఇంద్రునిగానూ,భాద్రపదంలో వివస్వంతునిగానూ, ఆశ్వయుజ మాసంలో పూష అనే నామం తోనూ, కార్తీకంలో పర్జన్యునిగానూ, మార్గశిరంలోఅంశుమంతునిగానూ, పుష్యంలో భగునిగానూ, మాఘంలో త్వష్ట అనే పేరుతోనూ,
ఫాల్గుణంలో విష్ణువుగానూ ఆరాధించబడుతున్నాడు. ఈవిధంగా ప్రత్యక్ష భగవాను డైన సూర్యుడు నెలకొకరూపాన్ని ధరిస్తూ ఈ సకల జీవకోటికి
చైతన్యాన్ని ప్రసాదిస్తున్నాడు.
పూర్వకాలంలో ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీమన్నారాయణుల వారు నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరించాడు. సంహరించినఅనంతరం ఉగ్రరూపంతో వెలిగిపోతున్న శ్రీ నరసింహమూర్తిని ప్రహ్లాదుడు
అనేక విధాలుగా స్తుతించి శాంతపరిచాడు. అప్పుడా నరసింహ రూపమురెండు రూపాలుగా ఉద్భవించింది. నరరూపం నరుడుగానూ, సింహ
రూపం నారాయణునిగానూ ఆవిర్భవించింది.వీరే నర నారాయణులు.వీరిద్దరూ బదరీ వనంలో తపస్సు చేస్తుండగా వీరి తపస్సు భంగం చేయడానికి
ఇంద్రుడు అప్సరసలను పంపించాడు. వారెన్నో విధాల ఆటపాటలాడితమ అద్భుత సౌందర్యంతో నర నారాయణుల తపస్సును భంగం చేయాలని
ప్రయత్నించారు. ఎన్ని విధాల ఆటపాటలాడినప్పటికి వారి తపోభంగంచేయడం వీరి వల్ల కాలేదు. నారాయణుడు తన చేతిలో ఒక దర్భను తీసుకుని ఒకసారి తొడమీద వ్రాచాడు. వెంటనే నారాయణుని తొడనుంచి
అద్భుత సౌందర్యరాశి ఆవిర్భవించింది. ఊరువు నుండి జన్మించినది కాబట్టి ఊర్వశి అని పిలువబడింది. ఈ అద్భుత సౌందర్యరాశిని చూసిన
అప్సరసలు సిగ్గు పడి దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయారు.నారము అంటే నీరు. నీటి నుంచి ఉద్భవించినవాడు, నీటియందే
శేషతల్పసాయిగా ఉండేవాడు నారాయణుడు. సృష్టి ప్రారంభంలో
పరమపురుషుడైన శ్రీమన్నారాయణుడే ప్రాణులన్నింటిని సృష్టించాడు. ఆ స్వామి సంకల్పంచేతనే పంచభూతాలు, బ్రహ్మాది దేవతలు, సప్త ఋషులు,ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు వంటి వారందరూ ఆవిర్భవించారు.
ఆ శ్రీమన్నారాయణుని తేజస్సు మహాశక్తి వంతమైనది.
సూర్యునియందుండే తేజస్సుకు మూలకారకుడు ఈ పరబ్రహ్మ మూర్తియే. ఆ తేజస్సే విష్ణుస్వరూపమై భాసిల్లుతున్నది. తిరుమల బ్రహ్మోత్సవాలలో
శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అమితానందాన్నికలుగ జేస్తాడు. ఈ సృష్టికి కారణభూతుడైనవాడు, సర్వ శ్రేష్ఠుడు, సర్వాభీష్ట ప్రదాత, సకల పాపరహితుడు, సర్వ వ్యాపకుడు అయిన శ్రీమన్నారాయణుడు
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరునిగా వెలసి కలియుగంలో తనను నమ్మి కొలిచిన వారందరినీ అనుగ్రహిస్తున్నాడు. తిరుమలలో ఉన్న సమయంలో ఉదయాన్నే
లేచి కాలకృత్యాలను తీర్చుకుని సూర్యభగవానునికినమస్కరించిన వారికిఎటువంటి అనారోగ్యము దరిచేరదు. సర్వ సౌభాగ్యాలూ ఒనగూరుతాయి.ఈ సృష్టిలో జన్మించిన ప్రతి జీవికి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉంటాయి. అయితే మానవునికి ఒక్కనికే పదకొండవదైనమనస్సు కూడా ఉన్నది. ఈ మనో ఇంద్రియం వలననే మనో ఇంద్రియ
కారణము చేతనే మానవుడు ధర్మా ధర్మ విచక్షణ చేయగలుగు తాడు.విషయమే ఆకారంగా గలది మనస్సు. ఈ మనస్సును నిశ్చలం చేసుకుని ఏకాగ్రతతో శ్రీమన్నారాయణుని ధ్యానించినవారికి ఆత్మ సాక్షాత్కారంకలుగుతుంది.
మనస్సును వశంలో ఉంచుకుంటే రాగద్వేషాలకు, అహంకార మమకారాలకు అతీథంగా ఉండగలుగుతాము. విరాగి, జ్ఞాని అయినమానవుడు మాత్రమే మనస్సును తన ఆధీనంలో ఉంచుకొనగలుగుతాడు.
అప్పుడు అతడు పరబ్రహ్మను సాధించగలుగుతాడు. ఆ బ్రహ్మానందంఅనుభవించిన వారికి జరా మృత్యువులు ఉండవు. ఆకలి దప్పులు ఉండవు.
అతని ఆత్మ పరమాత్మలో విలీనమైపోతుంది. అతడు పూర్తిగా పరబ్రహ్మమూర్తిలో ఐక్యమొందుతాడు.దేవతలు అశరీరులు. వారికి శరీరం లేదు. అందువలన వారు కర్మలను ఆచరించలేరు. భూలోకంలో జన్మించిన ప్రాణులన్నింటిలో
మానవులకు మాత్రమే కర్మ చేసే వీలున్నది. పశుపక్ష్యాదులు, జంతు జాలము, తమయొక్క పూర్వజన్మ కర్మఫలాలన్నీ అనుభవించ వలసిందే తప్పపుణ్య కర్మలను ఆచరించి తమ జీవితం పాపరహితం చేసుకోలేరు. ఇందుకుకారణం వీటికి పదకొండవ ఇంద్రియమైన మనస్సు లేక పోవటమే.మానవుడు ఒక్కడే యుక్తాయుక్త విచక్షణ చేయగలుగుతాడు. తాను
పూర్వజన్మలో చేసిన కర్మఫలాలను అనుభవిస్తూ ఈ జన్మలో పుణ్యకార్యాలనుఆచరించి శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందగలిగే అదృష్టం ఒక్క
మానవులకే ఉన్నది.
ఈ చరాచర జగత్తంతా శ్రీమన్నారాయణునిచే ఉద్భవించింది.
అందువలననే అతడు సర్వభూతాలకు ఈశ్వరుడు. సర్వేశ్వరుడుఅనబడుతున్నాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలములన్నీ అతడే. అతడే
సత్యము, అతడే నిత్యము, ఆ శ్రీమన్నారాయణుని అర్చించిన వారికి సర్వదేవతలూ నమస్కరిస్తారు. సూర్యుని కుమారుడైన యమధర్మరాజు
కూడా అతనికి నమస్కరిస్తాడు.
కాబట్టి మానవులందరూ ఎల్లవేళలా ఆ శ్రీనివాసునే స్మరిస్తూ జీవించాలి. శ్రీనివాసుడు భక్త సులభుడు. అమిత దయగల వాడు. ఇంతటి మహోన్నతమైన టువంటి ఓ శ్రీనివాసా! నీవుండగా మాకు భయమేలనయ్యా!
నీకివే మా నమస్కారములు.
ఓ శ్రీనివాసా!
నీకివే మా నమస్కారములు.
ఓ శ్రీమన్నారాయణా!
నీకి ప్రణామములు.
ఓ జగద్రక్షకా! నీకివే మా నమస్కారములు.
*" శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్*
*శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ”*
🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి