1, మే 2024, బుధవారం

Panchaag


 

గురువు

 🌹గురువు🌹

మంజరీ ద్విపద:


బ్రహ్మవద్దను జేయు పాపమ్ము లన్ని  

హరియించు కొనవచ్చు హరికిచెప్పి 

హరివద్ద చేసిన యఖిల పాపముల

భవునకుదెల్పి తా బాయంగ వచ్చు 

శివునివద్దను తాను చేయు పాపములు 

గురువువద్దను జెప్పి మరువంగ వచ్చు 

గురువు వద్దను చేయు గురు పాప ములను 

పోగొట్టుకొనలేము పుడమి యె చ్చటను 

అంత శ్రేష్టుడనుచు యాగమ ములను 

బల్కిరిబుధవరుల్ ప్రస్పుటంబుగను  

గురువుచెప్పినమాట గురుతుగా నేర్వ 

బాధలేవియులేక బ్రతుకంగ వచ్చు 

గురువుకుద్రోహంబు కూడదుసేయ 


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

గురువెంత గొప్పవారో

 గురువెంత గొప్పవారో తెలుసా  

**************************

  బ్రహ్మ స్థానే కృతం పాపం


  విష్ణు స్థానే విన శృతి


 విష్ణు స్థానే కృతం పాపం


 శివ స్థానే విన శృతి శివ స్థానే కృతం పాపం


గురు స్థానే విన శృతి


గురుస్థానే కృతం పాపం


 నాస్తి స్థానే విన శ్యతి

**************************

బ్రహ్మ వద్ద చేసిన తప్పులు విష్ణువు వద్ద చెప్పిదిద్దు కొనవచ్చు*

**************************

విష్ణువు వద్ద చేసుకున్న తప్పులు శివుని వద్దచెప్పి దిద్దు కొనవచ్చు*

**************************

శివుని వద్ద చేసిన తప్పులు గురువు వద్ద చెప్పిదిద్దు కొనవచ్చు*

 ************************** గురువు వద్ద చేసిన తప్పులు వేరే ఎవరి వద్ద చెప్పిదిద్దు కొనలేము*

**************************

అంతటి గొప్ప వ్యక్తి గురువు అని మన వేదాలలో చెప్పబడింది కనుక గురువును గౌరవిద్దాం*

**************************

 గురువు గారు చెప్పిన మాటను పాటిద్దాం* గురు ద్రోహం చేయవద్దు, చేసి కర్మ కొని తెచ్చుకోకు, -----------***----------***-----------

సనాతన ధర్మం గొప్పతనాన్ని

 🪷🪷🪷🦜🪷🪷🪷


*ఒక ముసలి ఆవిడ ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది .*

*ఒక రోజు , ఆ గుడిలో నుంచి ఒక సాధువు గారు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు :- మీరు మంచి కుటుంబానికి చెందినవారు , మీ కొడుకు చాలా మంచివాడు కదా !*

*మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు ?*

*అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది :- బాబు , మీకు తెలుసు కదా ! నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు .*

*నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది . నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు .*

*వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు 💰 ఇచ్చి వెళ్ళాడు .*

*ఆ డబ్బు 💵 మొత్తం నా అవసరాలకు అయిపోయింది .*

*నేను కూడా ముసలిదానిని అయిపోయాను . కష్టం చేసి డబ్బు 💸💴 ను సంపాదించలేను .*

*అందుకే గుడి ముందు ఇలా బిక్షం అడుగుతున్నాను .*

*అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు :- " మీ కోసం మీ కొడుకు డబ్బు 💰 పంపించడం లేదా ? "*

*ఆ ముసలావిడ ఇలా చెప్పింది :- నా కొడుకు ప్రతి నెల 🗓 నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు . నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను .*

*సాధువు ఆమె ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించుకుంటారు .*

*మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల వున్న గోడ ను చూసి ఆశ్చర్యపోతారు .*

*ఆ గోడకు 8 చెక్ లు అతికించి వుంటాయి .*

*ఒక్కొక్క చెక్ విలువ ₹50,000 లు .*

*ఆ ముసలావిడకు చదువు రాదు .*

*అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద వుందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడ కు వాటి విలువ గురించి వివరిస్తారు .*

*మనం కూడా ఈ కథలో వున్న ముసలావిడ లాంటి వాళ్ళమే .*

*మనందరి దగ్గర కూడ భగవద్గీత గ్రంథం ఉంది .*

*కానీ , మనకు భగవద్గీత ఎంత విలువైన సంపదో అర్థం అవ్వలేదు .*

*మనకు భగవద్గీత విలువ తెలిసి వుంటే మనం దానిని ప్రతి రోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి వుండేవాళ్ళం .*

*మనం కూడా ఆ ముసలావిడ లాగానే భగవద్గీత ను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన అర్మారాలో భద్రంగా పెడుతున్నాం .*

*ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంసృతి ని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం*

*సనాతన ధర్మం భూమిపై అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత .*

*చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత .*

*ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త కొత్త విషయాలను ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత .*

*ఎన్నో వ్యాధులకు మందు రామాయణ మహా భారత భగవద్గీత లలో ఉన్నాయి*

*దేవుడు లేడు అని నమ్మే ఎంతో మంది నాస్తికులను సైతం గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత.*

*గొప్ప గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా(దైవ విధేయులుగా) మారుస్తున్న గ్రంథం భగవద్గీత .*

*ప్రపంచంలో కొన్ని కోట్లమంది హృదయాలలో కంఠస్థం చేయబడిన గ్రంథమ్ భగవద్గీత .*

*ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ , అత్యధికంగా పఠించబడుతున్న గ్రంథం భగవద్గీత.*

*ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగివున్న గ్రంథం భగవద్గీత .*

*దేవుడు మనందరికి పవిత్ర రామాయణ మహా భారతాలను భగవద్గీత చదివి , అర్థం చేసుకొని , దాని ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను !*

*ఈ మెసేజ్ ని అందరికి కూడా పంపించి మన భారతదేశ సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికి తెలియజేయండి*

హరేకృష్ణ🙏🙏🙏

A Collection from 

Admin 

Brahmana samaakhya

ప్రశ్న పత్రం సంఖ్య: 26

  ప్రశ్న పత్రం సంఖ్య: 26  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

ఇది మహిళలకు శ్రావణ మాసపు ప్రేత్యేకం 

 పూర్తిగా బంగారం కాబట్టి. 

క్రింది ప్రశ్నలకు జవాబులు   

  1)బంగారము ఏ రంగులో ఉంటుంది -  పసుపు రంగులో ఉంటుంది 

2) బంగారములో కల్తీ కలపటానికి కంసాలి ఏ లోహాన్ని వాడుతారు . సాధారణంగా రాగినికలుపుతారు 

3) బంగారం నాణ్యత ఏవిధంగా చెపుతారు. - నాణ్యత కరేట్లతో తెలుపుతారు. 

 4) ఈ రోజులలో కంసాలి వారు మజ్దురుతో పాటు ఎంతశాతం తరుగులక్రింద తీసుకుంటున్నారు. - సాధారణంగా 10 శాతం తరుగుల క్రింద తీసుకుంటున్నారు.  

 5) తక్కువ బరువు బంగారాన్ని ఈ గింజ ఎత్తు అని అంటారు అది ఏ గింజ - గురిగింజ 

6) KDM బంగారంలో బంగారం శాతం యెంత ఉంటుంది 92 శాతం బంగారం 8 శాతం కాడ్మియం ఉంటుంది. 

7) ఆర్నమెంట్ బంగారంలో రాగి శాతం యెంత ఉంటుంది - దాదాపు 9 శాతం రాగి ఉంటుంది. 

8) ఒక కారేట్కు ఎన్ని గ్రాములు - 200 మిల్లి గ్రాములు 

9) సేచ్ఛమైన బంగారాన్ని ఆభరణాలు చేయటానికి వాడరు ఎందుకంటె 

1) అది మెత్తగా ఉంటుంది  2) అది చాలా కఠినంగా ఉంటుంది 3) ఇవియేవి నాకు తెలియదు. జవాబు- 1  

10) కంసాలి బంగారాన్ని మీకు తెలియకుండా తీసుకోటానికి వాడే ద్రవ పదార్ధాన్ని ఏమంటారు. - ద్రావకం అంటారు . 

 11) మీరు ఆభరణం చేయటానికి కంసాలి ఇచ్చినప్పుడు వన్నె కన్నా మీ ఆభరణం వన్నె తక్కువగా ఉంటుంది కారణము ఏమిటి. - అందులో రాగి కలపటం వలన 

12) ఎన్ని క్యారట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా పేర్కొంటారు. -24 క్యారట్ల బంగారాన్ని  

 13) క్యారెట్ల సంఖ్య తగ్గినా కొద్దీ బంగారం -  నాణ్యత తగ్గుతుంది. 

14) పెద్ద పెద్ద బంగారం షాపులలో రాళ్లకు తూకం లేదు అని ప్రకటిస్తారు దాని అర్ధం ఏమిటి.  

సాదర్బంగా కొంతమంది రాళ్లు వున్నఆభరణాన్ని మొత్తం తూకం వేసి బంగారం ధర వసూలుచేస్తారు కానీ నిజానికి రాళ్లు బంగారంకన్నా తక్కువ ధర కలిగి ఉంటాయి.  రాళ్లను ప్రేత్యేకంగా తూకం వేసి వాటి ధరను వేరుగా తీసుకోవటాన్ని " రాళ్లకు తూకంలేదు" అని ప్రకటిస్తారు. 

15)  ONE GRAM GOLD ఆభరణాలు నిజంగా బంగారంతో చేసినవా? జవాబు: కాదు బంగారం పూత ఉంటుంది. 

16) ద్రవరాజాంలో కలిపే ఆమ్లములు (ACIDs) ఏవి వాటి నిష్పత్తి యెంత. - బంగారాన్ని కరిగించే ద్రావకానికి ద్రవరాజం అంటారు ఇది నైట్రిక్ ఆమ్లము మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లముల్ మిశ్రమము వీటిని 1:3 రేషియోలో కలుపుతారు.  ఇది ప్రమాదకరమైన ద్రవము. 

17)Hallmark gold అనగా ఏమిటీ Bureau of Indian Standards (BIS) వారిచే ఆమోదించబడినది అని అర్ధము. 

 18) బంగారం సాంద్రత యెంత ఉంటుంది - బంగారం సాంద్రత 19,300 kg/m

అందుకే దీనిని హెవీ మెటల్ అంటారు 

19) బంగారం సాంద్రత దానిలో కలిపే రాగి, వెండి, కాడ్మియం మొదలగు లోహాలకన్నా ఎక్కువా లేక తక్కువా - జవాబు తక్కువ 

 20) ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం ఎన్నవ స్థానంలో వుంది. - భారతదేశం 11 వ స్థానంలో వుంది. 

ఈ ప్రశ్నపత్రం మీకు విజ్ఞానదాయకంగా ఉంటే 

తెలపండి. ఇంకొక ప్రశ్న పత్రంతో మళ్ళి కలుద్దాం. 

చరకమహర్షి

 చరకమహర్షి గర్భము మరియు గర్భలక్షణాల గురించి ఇచ్చిన వివరణ - 


     ఆయుర్వేద వైద్యులలో అగ్రగణ్యుడు చరకుడు . ఈయన మానవాళికి అందించిన అత్యద్భుత గ్రంథం " చరకసంహిత " 


        ఈ గ్రంథం 7 స్థానములతో అత్యద్భుతంగా లిఖించబడినది.  అవి 


  *  నిదానస్థానం .


  *  విమానస్థానం .


  *  శారీరస్థానం 


  *  ఇంద్రియస్థానం .


  *  కల్పస్థానం .


  *  సిద్ధిస్థానం . 


  *  చికిత్సాస్థానం .


           సూత్రస్థానం అనునది కూడా వీటిలో కలిసే ఉంటుంది. ఇందులో మీకు ఈ రోజు శారీరస్థానం గురించి వివరిస్తాను . ఈ శారీరస్థానంలో గర్భం అది ఏర్పడేవిధానం గురించి చాలా అత్యద్బుతంగా చరకుడు వివరించాడు . 


 గర్బం ఏర్పడేవిధానం - 


     పరిశుభ్రమైన శుక్రం కలిగిన పురుషునకు  పరిశుద్ధముగా ఉన్నటువంటి స్త్రీ యొక్క ఆర్తవం ప్రశస్తమైన ఋతుకాలం నందు సంయోగం చెంది ఎప్పుడు జీవుడు మనోగమనం పొందునో అప్పుడు గర్బం ఏర్పడును . 


  పిండమునకు ఎవరివలన యే విధమైన అవయవములు సంప్రాప్తినించును - 


    గర్బము తల్లివలన ఏర్పడును . గర్భస్థశిశువుకు తల్లి వలన చర్మము , రక్తము , మాంసము , మేధస్సు , నాభి , హృదయము , క్లోమము , కాలేయము , ప్లీహము , మూత్రపిండాలు , వస్తి , పురీషాశయం , ఆమాశయం , పక్వాశయం , గుద ప్రదేశం యొక్క ఊర్ధ్వ, అదో భాగములు చిన్నప్రేగులు , పెద్దప్రేగులు .


       ఇవన్ని తల్లివలన గర్భస్థ పిండముకు సంక్రమించును. 


      గర్బము తండ్రివలన కలుగును. కేశములు , మీసములు , గోళ్లు , రోమములు  దంతములు , ఎముకలు , సిరలు , స్నాయువులు , ధమనులు , శుక్రము అనునవి తండ్రి వలన కలుగును.


 పిండము ఆడ, మగ అనేవి నిర్ణయం జరుగు విధము - 


     మగవాడి యొక్క శుక్రం , స్త్రీ యొక్క ఆర్తవం కలిసినప్పుడు స్త్రీ యొక్క ఆర్తవం అధికంగా ఉండి మగవాని యొక్క శుక్రం తక్కువుగా ఉన్నచో వారికి తప్పకుండా ఆడ సంతానమే జనియించును.. అదేవిధంగా మగవాని శుక్రం ఎక్కువుగా ఉండి స్త్రీ యొక్క ఆర్తవం తక్కువుగా ఉన్నచో వారికి జనియించు సంతానం మగబిడ్డ అగును. శుక్రశోణిత సంయోగం నందు ఒక భాగం నందు ఆర్తవం ఒక భాగం నందు శుక్రం అధికం ఉండునట్లు శుక్రశోణితం రెండు భాగాలుగా విభజింపబడినచో ఒక ఆడ ,ఒక మగ సంతానం కలుగును. శుక్రం ఎక్కువుగా గల శుక్రశోణితం రెండు భాగాలుగా విభజన చెందినచో ఆ స్త్రీకి ఇద్దరు పుత్రులు జనియించెదరు . కొంతమందికి ఈ శుక్రశోణితం అనేక భాగాలుగా విభజన చెందును. దీనివలన ఒకేసారి అనేక మంది సంతానం జనియించును . ఇది కర్మవశమున జరుగును. 


 లక్షణాలని బట్టి పిండము ఆడ లేదా మగ అని తెలుసుకొనుట  - 


 * నోట నీరుకారుట.


 * శరీరం బరువుగా ఉండటం.


 *  శరీరం కృశించుట .


 *  బడలిక.


 * ఉత్సాహం లేకుండా ఉండటం.


 * హృదయము నందు భాధ .


 * తృప్తిగా ఉండటం.


      పైన చెప్పినవన్నీ మంచి గర్భమును సూచించు లక్షణాలు. 


  * ఎడమవైపు గల అవయవాలతో పనులు ఎక్కువ చేయుట .


 * గర్బము పొడుగు పెరుగుట.


 * ఎడమస్థనము నందు పాలు ఎక్కువుగా ఉత్పత్తి అగుట. 


   ఈ పై లక్షణములు కలిగిన స్త్రీ తప్పక ఆడ శిశువుని ప్రసవించును. ఈ లక్షణములు కు వ్యతిరేక లక్షణములు కలిగియున్నచో  

మగశిశువు జనియించును . ఈ రెండు లక్షణములు కలిగియున్నచో నపుంసకుడు జనియించును . 


         గర్భము కలుగు సమయమున స్త్రీ తన మనస్సు నందు ఎట్టి రూపమును తలచునో అట్టి రూపము గల సంతానం జనియించును . పూర్వజన్మ కర్మ వలన కూడా రూపం సంప్రాప్తించును. 


    ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

జీవితాంతం

 *వంటిల్లనే చిన్న ప్రదేశంలో* 

*జీవితాంతం*

*వేల కిలోమీటర్లు* 

*నడవాలి విరామం లేదు..*

*కొన్ని నవ్వుల్ని బోనస్ గా కురిపించాలి!*


*వంటిల్లనే చిన్న లేబరేటరీకి* 

*జీవితాంతం  అంకితమవ్వాలి కృతజ్ఞలు కూడా ఉండవు..*

*కానీ, కొత్త రుచుల్ని క్రియేట్ చేసివ్వాలి*


*పుడమిపై పెద్ద కర్మాగారం వంటిల్లు..* 

*ప్రతి పడతీ పదవీవిరమణ లేని కార్మికురాలు..*

*మహిళలకు 'మే'డేలుండవు* 


*అందుకే కుటుంబ భారాన్ని మోసే ప్రతీ మహిళకు మే డే శుభాకాంక్షలు💐💐*

పుస్తక భాండాగారం

 *_ఈ మెసేజ్ save చేసి ఉంచుకోండి... ఎన్ని లక్షలు వెచ్చించినా ఇలాంటి సమాచారం మీకు లభించక పోవచ్చు..._*

*_ఇది అత్యంత విలువైన పుస్తక భాండాగారం..._* 


*_ఇందులో రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, అష్టాదశపురాణాలు, పిల్లల నీతి చంద్రికలు, పంచతంత్రం, బాలానందం, పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీ మజిలీ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, అందరికీ ఆయుర్వేదం...._*


*_ఈలాంటి ఎన్నో ఉపయోగ కర పుస్తకాలు ఉన్నాయి... ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఎంత సమయం వెచ్చించినా ఇంత విలువైన సమగ్రమైన సమాచారాన్ని ఒకే క్లిక్తో పొందలేరు..._* 


 భగవద్గీత... https://tinyurl.com/yrw54twr

మహా భారతము .. https://tinyurl.com/mynht85r

రామాయణము... https://tinyurl.com/cb8h94ss

భాగవతము ... https://tinyurl.com/r8uxjhbb

వేదములు ... https://tinyurl.com/y2haxbad

అష్టాదశ పురాణములు... https://tinyurl.com/4a69k9tk

పిల్లల నీతి కథలు... https://tinyurl.com/482ed93y

అందరికీ ఆయుర్వేదం... https://tinyurl.com/nnybunhe

🙏🙏🙏🙏

*_ఒకసారి చూడండి మీకు నచ్చిన పుస్తకాలు మీ మిత్రులతో తప్పనిసరిగా షేర్ చేసుకోండి...._*


*_కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏_*

_మే 1, 2024_

 ॐ 卐 ॐ  

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

       🌞 *_మే 1, 2024_* 🌝

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*వసంత ఋతువు*

*చైత్ర మాసం*

*కృష్ణ పక్షం*

🔔తిథి: *అష్టమి* రా12.56

🔯వారం: *సౌమ్యవాసరే*

(బుధవారం)

⭐నక్షత్రం: *శ్రవణం* రా12.29

✳️యోగం: *శుభం* సా5.43

🖐️కరణం: *బాలువ* మ1.53

*కౌలువ* రా12.56

😈వర్జ్యం: *ఉ.శే.వ 6.57 వరకు*

మర్నాడు *తె4.16 నుండి*

💀దుర్ముహూర్తము: *ఉ11.31-12.22*

🥛అమృతకాలం: *మ2.34-4.06*

👽రాహుకాలం: *మ12.00-1.30*

👺యమగండం: *ఉ7.30-9.00*

🌞సూర్యరాశి: *మేషం*

🌝చంద్రరాశి: *మకరం*

🌅సూర్యోదయం: *5.39*

🌄సూర్యాస్తమయం: *6.14* 🙏 *నర్మదా నదీ* 🙏

   💐 *పుష్కర ప్రారంభం* 💐

 *లోకాః సమస్తాః* *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

   ఇరగవరపు రాధాకృష్ణ

సంకల్పము

 *శుభోదయం*

*********

 సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ01.05.2024

బుధ వారం (సౌమ్య వాసరే) 

************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ చైత్ర మాసే కృష్ణ పక్షే అష్టమ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

సౌమ్య వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

చైత్ర మాసే  కృష్ణ పక్షే  అష్టమ్యాం

సౌమ్య వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.39

సూ.అ.6.15

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

చైత్ర మాసం 

కృష్ణ పక్షం అష్టమి రా. 1.02 వరకు. 

బుధ వారం. 

నక్షత్రం శ్రవణం

రా.12.34 వరకు. 

అమృతం మ. 2.38 ల 4.02 వరకు. 

దుర్ముహూర్తం ప. 11.32 ల 12.22 వరకు. 

వర్జ్యం  ఉ. 7.00 వరకు. 

వర్జ్యం తె. 4.21 ల మరునాడు ఉ.5.50 వరకు. 

యోగం శుభం సా. 5.46 వరకు.  

కరణం బాలవ మ.1.57 వరకు. 

కరణం  కౌలవ రా. 1.02 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ. 12.00 ల 1.30 వరకు. 

గుళిక కాలం.ప.10.30 ల 12.00 వరకు. 

యమగండ కాలం ఉ.7.30 ల 9.00 వరకు. 

****************

పుణ్యతిధి క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ   అష్టమి. 

 **************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు  జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

మమేతి న మమేతి

 👆శ్లోకం 


బంధం - మోక్షం


ద్వే పదే మోక్ష బంధస్య

మమేతి న మమేతి చ 

మమేతి బద్ధ్యతే జంతుః

న మమేతి విముచ్యతే


ముక్తికి గానీ, బంధానికి గానీ రెండు పదాలు కారణము..... *“మమ”* "ఇది నాది" అనుకుంటే అది *బంధం*.... *“న మమ ”* "ఇది నాది కాదు" అనుకుంటే *మోక్షం*..

పంచాంగం 01.05.2024 Wednesday

 ఈ రోజు పంచాంగం 01.05.2024 Wednesday 


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు చైత్ర మాస కృష్ణ పక్ష: అష్టమి తిధి సౌమ్య వాసర: శ్రవణా నక్షత్రం శుభ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


అష్టమి రా.తె 04:00వరకు.

శ్రవణం రాత్రి 03:09 వరకు. 

సూర్యోదయం : 05:54

సూర్యాస్తమయం : 06:33


వర్జ్యం : ఉదయం 07:58 నుండి 09:30 వరకు.


దుర్ముహూర్తం : పగలు 11:48 నుండి 12:39 వరకు.


అమృతఘడియలు : సాయంత్రం 05:10 నుండి 06:42 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5125* *శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం  -‌ అష్టమి - శ్రవణం -‌‌  సౌమ్య వాసరే* *01.05.2024.* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏