24, అక్టోబర్ 2025, శుక్రవారం

డమరుకధ్వనిహేల

 సీ॥

డమరుకధ్వనిహేల ఢక్కానినదమెంచ 

మాహేశ్వరునిసూత్రమమరె నచట 

గీర్వాణవాణికి గీసె హద్దుల నెమ్మి 

వ్యాకరణము పేర నమరి చెలగి 

కదలె కైలాసమ్ము కంపించె కాశ్యపి 

వడకె స్వర్గ మపుడు వాణి కులికె 

నంది బెదరి జూచె నాగులు చెదరెను 

శశిఖండ మల్లాడె స్వశిరమందు 

తే.గీ.

భవుడు తాండవమాడగా శివము గలిగె 

నిట్లు ముల్లోకములకెల్ల ఈతి దొలగె 

నట్లు నర్తించి వర్తిల్లు నభవు నెపుడు 

భక్తి నర్చింతు నను మెచ్చి ముక్తి నొసగ -2

⚜ శ్రీ బిజాసన్ మాత ఆలయం

 🕉 మన గుడి : నెం 1274


⚜  రాజస్థాన్ : ఇంద్రగఢ్


⚜  శ్రీ బిజాసన్ మాత ఆలయం



💠 బిజాసన్ మాతా ఆలయం ఇంద్రగఢ్ పట్టణంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం, ఇది భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని బుండి జిల్లాలోని సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఉంది. 


💠 ఈ ఆలయం  దుర్గాదేవికి మరొక పేరు అయిన బిజాసన్ మాతకు అంకితం చేయబడింది. 


💠 దుర్గాదేవి రక్తబీజ అనే రాక్షసుడిని శిరచ్ఛేదం చేసింది, ఆ తర్వాత ఆమె ఆ రాక్షసుడిని ఒక వేదికగా చేసుకుని దానిపై కూర్చుంది



💠 శ్రీ దుర్గా శప్తసతి ఎనిమిదవ అధ్యాయంలో, రక్త బీజ అనే రాక్షసుడిపై దుర్గా తన భయంకరమైన యుద్ధం చేసినప్పుడు ఆమె ధైర్యమైన రూపాన్ని మనం చదువుతాము. 

ఈ రాక్షసుడు అసాధారణమైన వరంతో ఆశీర్వదించబడ్డాడు. 

భూమిపై అతని శరీరం నుండి పడే ప్రతి రక్తపు బొట్టు సమాన శక్తి మరియు సమాన పరాక్రమం కలిగిన రక్త బీజంగా మారుతుంది.

ఫలితంగా లక్షలాది రక్త బీజ రాక్షసులు వచ్చారు.

చివరికి దేవత ఈ రాక్షసుల రక్తం భూమిపై పడనివ్వకూడదని నిర్ణయించుకుంది. 


💠 అందువల్ల, ఆమె మండుతున్న జ్యోతులతో గాయాలను కాల్చివేసింది లేదా పడిపోతున్న రక్తాన్ని ఒక గిన్నెలో సేకరించి త్రాగించింది. 

దేవత కూడా రక్త బీజుడు అనే రాక్షసుడిలా అనేక రూపాలను తీసుకుంది. 

ఆ విధంగా దేవత రక్త బీజుడు అనే రాక్షసుడిని అణచివేసి చంపింది మరియు అందుకే ఆమెకు బీజసన్ అనే పేరు పెట్టారు.


💠 ఇక్కడి స్థానికుల ప్రకారం, సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆలయ ప్రాంతంలో దట్టమైన అడవి ఉండేది.

ఈ అడవికి దూరంగా, బాబా కృపానాథ్ జీ మహారాజ్ అనే సాధువు నివసించాడు. అతను దుర్గాదేవికి పెద్ద అనుచరుడు మరియు ఆమెను చూడాలని కోరుకున్నాడు. అందువల్ల, అతను బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయడం ప్రారంభించాడు.


💠 బాబా కృపానాథ్ సర్వస్వం

త్యాగం చేశాడు. ఆయనకు ఆహారం, నీరు లేదా సమయం గురించి పెద్దగా పట్టింపు లేదు. ఆయన ధ్యానంలో కూర్చుని రాత్రింబవళ్ళు దేవతను ప్రార్థించేవాడు. ఋతువులు గడిచాయి, కానీ ఆయన తన తపస్సును ఎప్పుడూ ఆపలేదు. ఆయన ప్రార్థనలు ఎంత తీవ్రంగా మారాయంటే అడవిలోని అడవి జీవులు కూడా ఆయన వద్దకు వచ్చి ప్రశాంతంగా ఉండేవి.


💠 ఒకరోజు బాబా ధ్యానంలో మునిగి ఉండగా, ఒక ప్రకాశవంతమైన బంగారు కాంతి అడవి అంతా నిండిపోయింది. ఆ ప్రకాశం ఎంత తీవ్రంగా ఉందంటే చుట్టూ ఉన్నదంతా బంగారంలా మెరిసింది.

బాబా కళ్ళు మూసుకుని ఉన్నప్పటికీ , ఆయన దైవిక శక్తిని అనుభవించగలిగారు . 


💠 ఆయన వాటిని తెరిచినప్పుడు, బిజాసన్ మాత ఆయన ముందు నిలబడింది .

ఆమె ప్రకాశవంతంగా, శక్తివంతంగా , ప్రశాంతంగా, దయగల ముఖంతో కనిపించింది . 

ఆమె దైవిక ఆయుధాలను ధరించింది , మరియు ఒక దివ్య కాంతి ఆమెను చుట్టుముట్టింది . 

భక్తితో ఉప్పొంగిపోయిన బాబా ఆమె ముందు నమస్కరించారు .


💠 దేవత నవ్వి,"నా బిడ్డా, నీ ప్రార్థనలతో నేను సంతోషిస్తున్నాను. నీకు నిజాయితీగల భక్తి ఉంది. 

నేను ఈ ప్రదేశాన్ని ఆశీర్వదిస్తున్నాను. ఇక్కడ ఎవరైనా నిష్కళంకమైన హృదయంతో నన్ను ప్రార్థిస్తే వారి కోరికలు తీర్చబడతాయి" అని చెప్పింది.


💠 రాజస్థాన్‌లోని ఇందర్‌గఢ్‌లోని బిజాసన్ మాతా ఆలయంలోని పవిత్ర గుహ లోపల బిజాసన్ మాతా విగ్రహం - ఇది ఒక గౌరవనీయమైన హిందూ పుణ్యక్షేత్రం. 

అందంగా అలంకరించబడిన బిజాసన్ దేవత విగ్రహాన్ని ఈ ప్రశాంతమైన, సహజమైన గుహ ఆలయంలో దైవిక ఆశీర్వాదం, రక్షణ మరియు ఆధ్యాత్మిక శాంతిని కోరుకునే భక్తులు పూజిస్తారు.



💠 ఈ మాటల తరువాత, బిజాసన్ మాత కొండ లోపల ఒక గుహను సృష్టించి , దానిలో తన సొంత విగ్రహాన్ని ప్రతిష్టించింది . 

ఈ గుహ నేటికీ ఉంది మరియు దీనిని బిజాసన్ మాత ఆలయం ఇంద్రగఢ్ అని పిలుస్తారు .


💠 ఈ ఆలయం ఒక గుహలా నిర్మించబడింది . 

ఆలయం లోపల, బిజాసన్ దేవత విగ్రహం ఉంది. ఇది స్వయంభువుగా చెప్పుకోబడుతుంది. ఇక్కడ నవదుర్గ దేవత యొక్క ఏడుగురు సోదరీమణులను పూజిస్తారు. దుర్గాదేవి యొక్క 6 మంది సోదరీమణుల ఆలయం క్రింద నిర్మించబడింది. ఆలయంలో 750 మెట్లు ఉన్నాయి. 


💠 దుర్గాదేవిని ఆమె వివిధ రూపాల్లో పూజించడానికి అంకితం చేయబడిన తొమ్మిది రాత్రుల పండుగ అయిన నవరాత్రి సమయంలో ఈ ఆలయం ఉత్సవాల కేంద్రంగా మారుతుంది . 

ఈ పవిత్ర కాలంలో రాజస్థాన్ , ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్ మరియు గుజరాత్‌తో సహా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు మతపరమైన ఆచారాలలో పాల్గొనడానికి ఆలయానికి వస్తారు. 


💠 బుండి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి రోడ్డు మార్గంలో ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు . 

సమీప రైల్వే స్టేషన్ ఇందర్‌ఘర్ సుమేర్‌గంజ్ మండిలో ఉంది, ఇది దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది, సమీప విమానాశ్రయం ఇంద్రఘర్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో జైపూర్‌లో ఉంది .



రచన

©️ Santosh Kumar

ధర్మోరక్షతిరక్షితః

 *సీసపద్యం*

విద్యకు దూరమ్మె విప్రుని మరణము

  రాజ్యము చేజార రాజు చచ్చు

వ్యాపారదూరంబు వైశ్యుని మృతియౌ

   శ్రమదూరమైనంత శ్రామికుండు

ఎవ్వారి కులవృత్తు లవ్వారి మానమౌ

   మానమ్ము మించేటి మరణమేది?

కులముగొప్పదనము కులవృత్తి రక్షయౌ

   కులవృత్తి చేజార వెలుగు లేదు (వెలగలేవు).

*ఆ.వె.*

మనిషి జీవితంపు మనుగడ కులవృత్తి

వృత్తి వీడి మనిషి వెలుగు లేదు

కుత్సితముల తోడ కులవృత్తి చేజార

మరణమయ్యు నీకు మహిన నరుడ.

*కులవృత్తులను కాపాడుకోవడమే కులధర్మం..ధర్మోరక్షతిరక్షితః*

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

Panchaag



 

శివ షడక్షరీ స్తోత్రం

 శివ షడక్షరీ స్తోత్రం

                    (1వ. భాగం)


గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో(ముఖ్యంగా) ఉభయ గోదావరి జిల్లాలలోని శివక్షేత్రాల్ని 

గురించి ముచ్చటించుకున్నాము. ఈ సంవత్సరం అందున్న ఉమా మహేశ్వరుణ్ణి స్తుతించి తరిద్దాం. అందులో భాగంగా 

శివ షడక్షరీ స్తోత్రంతో మొదలు పెడదామని చేసిన చిన్న ప్రయత్నం.



“ నమః శివాయ “అన్నది పంచాక్షరి మహా మంత్రం. దీనికి ముందర ఓంకారం జతచేస్తే అది షడాక్షరి.. “ఓం నమః శివాయ” అవుతుంది.


నమః శివాయ అనగానే నాకు మా చిన్నతనంలో చేసే అక్షరాభ్యాసం గుర్తుకు వస్తుంది.  

 దాన్నే ఓనామాలు దిద్దించడం అనేవాళ్ళు.

(ఓం నమః శివయః…)


ఈ మొత్తం ప్రక్రియలో మనకో అద్భుతమైన విషయం కనిపిస్తుంది.


మొదట పళ్లెంలో బియ్యం. ఆ బియ్యం కూడా క్షతము కానివి (విరగనివి) చక్కగా ఏరి పళ్లెంలోవేయడం. 


అబియ్యంలో అడ్డంగా రెండు గీతలు గీసి, మూడు భాగాలుగా చేసి, పై భాగంలో "ఓం" అని, రెండవ భాగంలో "నమశ్శివాయ" అని, మూడవ భాగంలో "సిద్ధం నమః" అని మూడు పర్యాయములు నాన్నలు పిల్లల చేత రాయిం చడం.


ఓం కారం బీజాక్షరం. బీజాక్షర సమేత మంత్రం ఏదైనా ఉపదేశం ఉండాలన్నది నీమం.

మనకి తెలియకుండా చిన్నప్పుడే మనకి

ఉపదేశం పొందే ఏకైక మంత్రం శివ షడక్షరి.


ఈ అక్షరాభ్యాసం ఒక వైదిక సంస్కారంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.


క్షరము కానిదానిని అభ్యసించడమే 

అక్షరాభ్యాసం. మరి క్షరము కానిది ఏదైనా ఈ ప్రపంచంలో ఉందా?


యదృశ్యం తన్నశ్యం.. అన్నది లోక విదితమే కదా. కనిపించేది ఏదైనా కనుమరుగవక మానదు. అట్టిచో అక్షరమైనది ఏదైనా ఉన్నదా? 


పోతనా మాత్యులు గజేంద్ర మోక్షణం లో చెప్పినట్టు …ఉన్నది.


లోకంబులు లోకేసులు

లోకస్థులు తెగినతుది నలోకంబౌ పెం

జీకటి కవ్వల నెవ్వం

డేకాకృత్తి వెలుంగు నతనిననే సేవింతున్!!


అట్టి అక్షరుడైనట్టి పరమేశ్వరుణ్ణి నిరంతరం ఉపాశించడానికి చేసే సంస్కారమే అక్షరాభ్యాసం. అందుకని” ఓం నమః శివాయ “ అనే మంత్రం అందరూ అక్షరాభ్యాసం 

సశాస్త్రీయంగా నేర్చుకున్న వారు జపించవచ్చు. 


ఈ షడక్షరిపై రెండు స్తోత్రాలు కనిపిస్తున్నాయి. ఈ కార్తీకమాస మొదటి రోజు ఈ స్తోత్రాలు మీతో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఉమామహేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై మెండుగా వర్షించి జీతాలు పండాలని ఆకాంక్షిస్తూ..


మీ

ఆకెళ్ళ శ్రీనివాసరావు.



1.శివ షడక్షరీ స్తోత్రం


॥ఓం ఓం॥

ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః ।

కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ॥ 1 ॥


॥ఓం నం॥

నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం గణాః ।

నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ॥ 2 ॥


॥ఓం మం॥

మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరమ్ ।

మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః ॥ 3 ॥


॥ఓం శిం॥

శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణమ్ ।

మహాపాపహరం తస్మాచ్ఛికారాయ నమోనమః ॥ 4 ॥


॥ఓం వాం॥

వాహనం వృషభోయస్య వాసుకిః కంఠభూషణమ్ ।

వామే శక్తిధరం దేవం వకారాయ నమోనమః ॥ 5 ॥


॥ఓం యం॥

యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభమ్ ।

యం నిత్యం పరమానందం యకారాయ నమోనమః ॥ 6 ॥


షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।

తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యుభయం కుతః ॥


శివశివేతి శివేతి శివేతి వా

భవభవేతి భవేతి భవేతి వా ।

హరహరేతి హరేతి హరేతి వా

భజమనశ్శివమేవ నిరంతరమ్ ॥


ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య

శ్రీమచ్ఛంకరభగవత్పాదపూజ్యకృత శివషడక్షరీస్తోత్రం సంపూర్ణమ్ ।


2.శివషడక్షరీ స్తోత్రమ్


ఓంకారం బిన్దుసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః | 

కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ||౧|| 


నమన్తి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాః | 

నరా నమన్తి దేవేశం నకారాయ నమో నమః ||౨|| 


మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణమ్ | 

మహాపాపహరం దేవం మకారాయ నమో నమః ||౩|| 


శివం శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ | 

శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః ||౪|| 


వాహనం వృషభో యస్య వాసుకిః కణ్ఠభూషణమ్ | 

వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః ||౫|| 


యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః | 

యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః ||౬|| 


షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ | 

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||౭|| 


ఇతి శ్రీరుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే శివషడక్షరస్తోత్రం సంపూర్ణమ్ ||

తేజోలింగమ్

 ***తేజోలింగమ్*తిరువణ్ణామలై*

(3)తేజోరూపమయాయ జీవసకలాధారాయ వహ్న్యాత్మనే,

ఫాలాగ్నిప్రభవాయ సర్వసుతనుష్వాధారభూతాయ తే|

దుర్వారాగ్నినివారిణే చ మదనం భస్మీకృతే శంభవే,

తస్మై రక్తగిరీశసుందరమహాదేవాయ తుభ్యం నమః||

 భావం=తేజోరూపమయుడైనటువంటి, సకలజీవులకు జీవాధారమైన వహ్నిస్వరూపుడైనటువంటి, ఫాలభాగమునందు అగ్నిప్రభవించుచున్నటువంటి, అందరి అందమైనశరీరములకు ఆధారభూతుడైనటువంటి, నివారింపశక్యముగానిమదనాగ్నిని భస్మముచేసినటువంటి, అరుణాచలసుందరేశ్వరమహాదేవుని కొరకు నమస్కారము.

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


 శ్లో𝕝𝕝 *అలసస్య కుతో విద్యా ! అవిద్యస్య కుతో ధనం !*

           *అధనస్య కుతో మిత్రం ! అమిత్రస్య కుతఃసుఖం !*


*భావం* 𝕝𝕝:- *బద్ధకస్తులకి ఎలా చదువస్తుంది చదువు రాని వాళ్ళకి ధనం ఎలా వస్తుంది ధనం లేని వాళ్ళకి మిత్రులు ఎలా ఉంటారు మిత్రులు లేనివారికి సుఖం ఎక్కడిది....మన ఇంటికి బంధువులు స్నేహితులు రావాలంటే వాళ్లకు ఉపచారాలు చేయడానికి వాళ్లకు భోజనం పెట్టడానికి డబ్బు ఉండాలిగా మరి ఆ డబ్బు లేని వాళ్ళ ఇంటికి మిత్రులు స్నేహితులు ఎలా వస్తారు. కాబట్టి డబ్బు ఉండాలి. *ఏదో ఒక చదువు ఒక స్థాయిలో వస్తే వాడికి ధనం వస్తుంది.*

*కాబట్టి ఆ చదువు రావడానికి ఏముండాలి అంటే జడత్వం ఉండకూడదు అలసత్వం ఉండకూడదు రేపటికి వాయిదా వేసే లక్షణం ఉండకూడదు*. *ఏరోజు చదవు ఆరోజు చదువుకునే పిల్లలకు జీవితం అంతా సంతోషంగా సుఖంగా ఉంటుంది అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం.*

               

 ✍️💐🌹🌸🙏

సుభాషితాలు

 *🙏💐💐💐💐🙏* 

*🙏💐💐👍సుభాషితాలు👌💐💐🙏*

                                *-- ౦ --*

💐💐👍🙏🙏🙏🙏🙏🙏👌💐💐


*"చదువనివాఁ డజ్ఞుం డగు*

*జదివిన సదసద్వివేక చతురత గలుగుం*

*జదువఁగ వలయును జనులకుఁ*

*జదివించెద నార్యులొద్ధఁ* *జదువుము తండ్రీ..!"*


*భావము:- ఒకనాడు హిరణ్యకశిపుడు ముద్దుల కొడుకు ప్రహ్లాదుని పిలిచి..!*

*“బాబూ..! చదువుకోని వాడు అజ్ఞానిగా ఉండిపోతాడు..!* *చదువుకుంటే..! మంచిచెడు తెలుస్తుంది..! వివేకం కలుగుతుంది..! మనిషి అన్నవాడు తప్పకుండా..! చదువుకోవాలి..! కనుక నిన్ను మంచిగురువుల దగ్గర *చదివిస్తాను..! చక్కగా చదువుకో నాయనా..!అన్నాడు..!”*


*!!దాతృత్వ ప్రియ వక్తృత్వం ధీరత్వముచితజ్ఞతా!!* 

*!!అభ్యాసేన న లభ్యంతే చత్వారస్స హజ గుణాః!!*  

 

*అర్థము:-- దానము చేసే గుణము,ప్రియముగా మృదువుగా మాట్లాడుట, ధైర్యగుణము, వుచితజ్ఞత అంటే యిది సరియైనది యిది కాదు అను తెలిసుకోను జ్ఞానము ఈ నాలుగు గుణాలు నేర్చుకుంటే వచ్చేవి కావు అవి సహజంగా పుట్టుకతోనే వస్తాయి..!*


*!!విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం!!* 

*!!విద్యా భోగకరీ యశసుఖకరీ విద్యా గురూణాం గురు:!!*

*!!విద్యా బంధు జనో విదేశ గమనే విద్యా పరం లోచనం!!* 

*!!విద్యా రాజసుపూజ్యతే నహిధనం విద్యా హీనఃపశు:!!*

    *( భర్తృహరి సుభాషితం )*

 

*అర్థము:మానవులకు విద్యయే సౌందర్యము..!* *అదియే గుప్త ధనము;చదువే* 

*కీర్తిని,సుఖమును,భోగమును కలిగించును;* *విద్యయే గురువులకు గురువైనది..!* 

 *విదేశ ములకు పోయినప్పుడు విద్యయే బంధువు:అదియే మరియొక కన్ను వంటిది;*

*రాజ సభలలో పూజార్హత విద్యకే గానీ ధనమునకు* *కాదు;ఇటువంటి విద్య లేని నరుడు* 

  *వింత పశువు గా పిలువా పడుతాడు..!*


     *నీపంచం బడియుండఁగాఁ గలిగిన న్భిక్షాన్నమే చాలు ని*

    *క్షేపంబబ్బిన రాజకీటముల నే సేవింపఁగా నోప నా*

    *శాపాశంబులఁజుట్టి త్రిప్పకుము సంసారార్థమై బంటుగాఁ*

    *జేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా..!*


*👍తాత్పర్యము:-👌* 

*ప్రభో..! శ్రీకాళహస్తీశ్వరా..! నీచెంత నాకు భిక్షాన్నమైనా చాలును. నిధులు కలిగినా సరే నేను రాజాధముల సేవ చేయనోపను. సంసారమను ఆశాపాశాములందు నన్ను బంధింపక నీ బంటుగా చేర్చుకొని రక్షించు ప్రభో..!!*

                             *-- ౦ --*

*🙏💐🙌శ్రీరామరక్షసర్వజగద్రక్ష🙌💐🙏*