24, అక్టోబర్ 2025, శుక్రవారం

డమరుకధ్వనిహేల

 సీ॥

డమరుకధ్వనిహేల ఢక్కానినదమెంచ 

మాహేశ్వరునిసూత్రమమరె నచట 

గీర్వాణవాణికి గీసె హద్దుల నెమ్మి 

వ్యాకరణము పేర నమరి చెలగి 

కదలె కైలాసమ్ము కంపించె కాశ్యపి 

వడకె స్వర్గ మపుడు వాణి కులికె 

నంది బెదరి జూచె నాగులు చెదరెను 

శశిఖండ మల్లాడె స్వశిరమందు 

తే.గీ.

భవుడు తాండవమాడగా శివము గలిగె 

నిట్లు ముల్లోకములకెల్ల ఈతి దొలగె 

నట్లు నర్తించి వర్తిల్లు నభవు నెపుడు 

భక్తి నర్చింతు నను మెచ్చి ముక్తి నొసగ -2

కామెంట్‌లు లేవు: