24, అక్టోబర్ 2025, శుక్రవారం

శివ షడక్షరీ స్తోత్రం

 శివ షడక్షరీ స్తోత్రం

                    (1వ. భాగం)


గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో(ముఖ్యంగా) ఉభయ గోదావరి జిల్లాలలోని శివక్షేత్రాల్ని 

గురించి ముచ్చటించుకున్నాము. ఈ సంవత్సరం అందున్న ఉమా మహేశ్వరుణ్ణి స్తుతించి తరిద్దాం. అందులో భాగంగా 

శివ షడక్షరీ స్తోత్రంతో మొదలు పెడదామని చేసిన చిన్న ప్రయత్నం.



“ నమః శివాయ “అన్నది పంచాక్షరి మహా మంత్రం. దీనికి ముందర ఓంకారం జతచేస్తే అది షడాక్షరి.. “ఓం నమః శివాయ” అవుతుంది.


నమః శివాయ అనగానే నాకు మా చిన్నతనంలో చేసే అక్షరాభ్యాసం గుర్తుకు వస్తుంది.  

 దాన్నే ఓనామాలు దిద్దించడం అనేవాళ్ళు.

(ఓం నమః శివయః…)


ఈ మొత్తం ప్రక్రియలో మనకో అద్భుతమైన విషయం కనిపిస్తుంది.


మొదట పళ్లెంలో బియ్యం. ఆ బియ్యం కూడా క్షతము కానివి (విరగనివి) చక్కగా ఏరి పళ్లెంలోవేయడం. 


అబియ్యంలో అడ్డంగా రెండు గీతలు గీసి, మూడు భాగాలుగా చేసి, పై భాగంలో "ఓం" అని, రెండవ భాగంలో "నమశ్శివాయ" అని, మూడవ భాగంలో "సిద్ధం నమః" అని మూడు పర్యాయములు నాన్నలు పిల్లల చేత రాయిం చడం.


ఓం కారం బీజాక్షరం. బీజాక్షర సమేత మంత్రం ఏదైనా ఉపదేశం ఉండాలన్నది నీమం.

మనకి తెలియకుండా చిన్నప్పుడే మనకి

ఉపదేశం పొందే ఏకైక మంత్రం శివ షడక్షరి.


ఈ అక్షరాభ్యాసం ఒక వైదిక సంస్కారంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.


క్షరము కానిదానిని అభ్యసించడమే 

అక్షరాభ్యాసం. మరి క్షరము కానిది ఏదైనా ఈ ప్రపంచంలో ఉందా?


యదృశ్యం తన్నశ్యం.. అన్నది లోక విదితమే కదా. కనిపించేది ఏదైనా కనుమరుగవక మానదు. అట్టిచో అక్షరమైనది ఏదైనా ఉన్నదా? 


పోతనా మాత్యులు గజేంద్ర మోక్షణం లో చెప్పినట్టు …ఉన్నది.


లోకంబులు లోకేసులు

లోకస్థులు తెగినతుది నలోకంబౌ పెం

జీకటి కవ్వల నెవ్వం

డేకాకృత్తి వెలుంగు నతనిననే సేవింతున్!!


అట్టి అక్షరుడైనట్టి పరమేశ్వరుణ్ణి నిరంతరం ఉపాశించడానికి చేసే సంస్కారమే అక్షరాభ్యాసం. అందుకని” ఓం నమః శివాయ “ అనే మంత్రం అందరూ అక్షరాభ్యాసం 

సశాస్త్రీయంగా నేర్చుకున్న వారు జపించవచ్చు. 


ఈ షడక్షరిపై రెండు స్తోత్రాలు కనిపిస్తున్నాయి. ఈ కార్తీకమాస మొదటి రోజు ఈ స్తోత్రాలు మీతో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఉమామహేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై మెండుగా వర్షించి జీతాలు పండాలని ఆకాంక్షిస్తూ..


మీ

ఆకెళ్ళ శ్రీనివాసరావు.



1.శివ షడక్షరీ స్తోత్రం


॥ఓం ఓం॥

ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః ।

కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ॥ 1 ॥


॥ఓం నం॥

నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం గణాః ।

నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ॥ 2 ॥


॥ఓం మం॥

మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరమ్ ।

మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః ॥ 3 ॥


॥ఓం శిం॥

శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణమ్ ।

మహాపాపహరం తస్మాచ్ఛికారాయ నమోనమః ॥ 4 ॥


॥ఓం వాం॥

వాహనం వృషభోయస్య వాసుకిః కంఠభూషణమ్ ।

వామే శక్తిధరం దేవం వకారాయ నమోనమః ॥ 5 ॥


॥ఓం యం॥

యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభమ్ ।

యం నిత్యం పరమానందం యకారాయ నమోనమః ॥ 6 ॥


షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।

తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యుభయం కుతః ॥


శివశివేతి శివేతి శివేతి వా

భవభవేతి భవేతి భవేతి వా ।

హరహరేతి హరేతి హరేతి వా

భజమనశ్శివమేవ నిరంతరమ్ ॥


ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య

శ్రీమచ్ఛంకరభగవత్పాదపూజ్యకృత శివషడక్షరీస్తోత్రం సంపూర్ణమ్ ।


2.శివషడక్షరీ స్తోత్రమ్


ఓంకారం బిన్దుసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః | 

కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ||౧|| 


నమన్తి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాః | 

నరా నమన్తి దేవేశం నకారాయ నమో నమః ||౨|| 


మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణమ్ | 

మహాపాపహరం దేవం మకారాయ నమో నమః ||౩|| 


శివం శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ | 

శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః ||౪|| 


వాహనం వృషభో యస్య వాసుకిః కణ్ఠభూషణమ్ | 

వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః ||౫|| 


యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః | 

యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః ||౬|| 


షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ | 

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||౭|| 


ఇతి శ్రీరుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే శివషడక్షరస్తోత్రం సంపూర్ణమ్ ||

కామెంట్‌లు లేవు: